Tags

, , ,

Dada Amir Haider Khan

Dada Amir Haider Khan

భారత్‌లో కమ్యూనిజం గురించి ఫేస్‌బుక్‌లో కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నవారు కొందరైతే సవాళ్లు విసురుతున్నవారు మరికొందరు. వీరికి సమాధానం చెప్పలేని దుస్ధితిలో కమ్యూనిస్టులు లేరు. సమస్య ప్రతి విషయాన్నీ కుల కళ్లద్దాలతో చూసే వారిని, కమ్యూనిస్టు వ్యతిరేక రాతలను తలకు ఎక్కించుకున్నవారికి ఏం సమాధానం చెప్పినా అది చిన్నదైనా పెద్దదైనా అంత తేలికగా ఎక్కదు. నిజంగా కమ్యూనిస్టులు ఈ దేశానికి అంటే సామాన్య జనానికి ఏమి చేశారన్నది చరిత్రలో నమోదై వుంది. దాన్ని గురించి తెలుసుకోవాంటే వేదిక ఫేస్‌బుక్‌ కాదు. బుల్లెట్స్‌ రూపంలో చెపితే అర్ధం చేసుకోవటం కష్టం, వాటి గురించి లోతుగా తెలుసుకోవా లన్నా, అనేక పుస్తకా లు వున్నాయి. వాటిని చదివి ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానా లు వారికే దొరుకుతాయి. ఓపిక వున్నవారు చదువుకోవచ్చు, ఓపిక, ఆసక్తి లేని వారి గురించి చెప్పాల్సిందేమీ లేదు.
ఏ సిద్ధాంతమైనా (తత్వశాస్త్రం) ఎక్కడో ఒక చోట అభివృద్ధి చెందుతుంది. అది సర్వవ్యాప్తమౌతుంది. జనం తమ జీవితా లకు దగ్గరగా వుందని భావిస్తే ఆదరిస్తారు. చుంచు ఎ లుక లక్షణం భూమిని తవ్వటం, అది నిరంతరం తవ్వుతూనే వుంటుంది, ఎప్పుడు ఎక్కడ భూమి మీదకు వస్తుందో తెలియదు. అలాగే కమ్యూనిజం కూడా అలాంటిదే. సమాజంలో దోపిడీ వున్నంత కాలం దానికి గురి అయ్యేవారు నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రతిఘటిస్తూనే వుంటారు.

దక్షిణ భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్ధాపన చేసింది నేటి పాకిస్దాన్‌లో పుట్టి పెరిగిన అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. పుచ్చపల్లి సుందరయ్యను కమ్యూనిస్టు పార్టీలోకి ఆకర్షించింది ఆయనే. తరువాత సుందరయ్య నంబూద్రిపాద్‌తో సహా అనేక మందిని పార్టీలోకి తీసుకువచ్చారు.

మతాలకు మూలం తత్వశాస్త్రాలు. ప్రతి మతం, ప్రతి తత్వవేత్త సమాజంలో ప్రతివారూ సుఖపడా లనే కోరుకున్నారు. కమ్యూనిస్టు తత్వవేత్త ల ప్రత్యేకత ఏమంటే ఆ మార్పు ఎలా రావాలో అందుకు ఏం చేయాలో చెప్పటమే. మత తత్వవేత్త లు చెప్పిన దానిని నమ్మటానికే జనం వేల సంవత్సరాలు తీసుకున్నారు తప్ప వెంటనే నమ్మలేదు. యూదు మతంపై తిరుగుబాటుతో క్రైస్తవం అవతరించింది. దానిలో కాథలిక్కు లు, ప్రొటెస్టుంటు లు ఇలా ఎన్నో భావజాలా లు. క్రైస్తవంపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. దానిలో ఎన్నో శాఖ లు. మన దేశానికి సంబంధించి ఎన్నో మతా లు వాటన్నింటికీ కొన్ని సారూప్యత లు వున్న కారణంగా సింధునది ప్రాంతంలో (సింధు ను హిందూగా పిలిచిన విషయం తెలిసినదే) విస్తరించిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా కొందరు వర్ణిస్తున్నారు.నిజానికి ఒకే మతం అయితే భిన్న వ్యాఖ్యానాలు చెప్పిన ఆచార్యులు వుండేవారు కాదు. శైవం, వైష్ణవం ఇలా ఎన్నో వున్నాయి. వీటన్నింటిపై తిరుగుబాటు కారణంగానే బౌద్దం వునికిలోకి వచ్చింది. మెజారిటీ ప్రజ ల ఆశ లను ఒక మతం లేదా సిద్దాంతం నెరవేర్చకపోతే లేదా ప్రాతినిధ్యం వహించకపోతేనే ఆ మతంపై తిరుగుబాట్లు జరుగుతాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆ బౌద్దం ఎన్నో ముక్కలైంది. అన్నింటికీ మించి అవతరించిన మన దేశంలో ఒక మైనారిటీ మతంగా , ఇరుగు పొరుగు దేశాలలో ఒక మెజారిటీ మతంగా అవతరించింది.
ఐరోపాలో పారిశ్రామిక విప్లవం తెచ్చిన అసమానతలు,దోపిడీ కారణంగా దానికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన తత్వ శాస్త్రమే కమ్యూనిజం. ప్రపంచ చరిత్రను కాసి వడపోసిన తత్వవేత్త లు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, మరెందరో దోపిడీ సమాజం పోవాలని కోరుకున్నంత మాత్రాన పోదని దాన్ని కూకటి వేళ్లతో పెకలించి దాని పునాదు లపై కొత్త వ్యవస్ధను నిర్మించాలని చెప్పారు. అది శ్రామికులే చేయాలి అన్నారు.
నిజానికి ఇది కూడా మత ప్రాతిపదికే అయితే కొందరు కొత్త దేవుళ్లు,దేవదూతలను , మహత్యాలను రంగంలోకి తెచ్చి వుండేది. దీని ప్రత్యేకత ఏమంటే మతా తత్వశాస్త్రా లు లేదా బోధను ఒక ప్రాంతం లేదా కొన్ని ప్రాంతా లపై మాత్రమే ప్రభావం చూపించాయి. కమ్యూనిజం తత్వ శాస్త్ర ప్రత్యేకత ఏమంటే అది మతాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా విశ్వవ్యాపితంగా ప్రభావితం చేసింది.
మత భాషలో చెప్పాంటే జర్మనీకి చెందిన క్రైస్తవులైన మార్క్సు, ఎంగెల్స్‌ అభివృద్ధి చేసిన కమ్యూనిజాన్ని ఆర్ధడాక్‌ చర్చి మతాన్ని అవ లంభించే రష్యాలోని లెనిన్‌ తమ దేశంలో తొలి కమ్యూనిస్టు రాజ్య స్దాపనకు పునాది వేశారు. దాని ప్రభావానికి గురి కాని వారు లేరు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన హిందువు ఎంఎన్‌రాయ్‌, ముస్లింలైన ఎందరో ప్రముఖులు ఆకర్షితులై మన దేశానికి తీసుచ్చారు. దక్షిణ భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్ధాపన చేసింది నేటి పాకిస్దాన్‌లో పుట్టి పెరిగిన అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. పుచ్చపల్లి సుందరయ్యను కమ్యూనిస్టు పార్టీలోకి ఆకర్షించింది ఆయనే. తరువాత సుందరయ్య నంబూద్రిపాద్‌తో సహా అనేక మందిని పార్టీలోకి తీసుకువచ్చారు.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Advertisements