Tags

, , ,

అసమానతలు లేని సమాజాన్ని కోరుకోవటమే కాదు ఆటంకం కలిగించే వ్యవస్తను కూకటివేళ్లతో కూల్చివేసి నూతన సమాజాన్ని నిర్మించాలంటూ 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టోను ఆవిష్కరించారు. పదివేల సంవత్సరాలం నాగరిక మానవజాతి చరిత్రను ఈ ప్రతిపాదన, సిద్దాంతం ఒక అనూహ్యమలుపు తిప్పింది. అదే కమ్యూనిస్టుల ప్రత్యేకత. సాధించిన ఒక గొప్ప విజయం.

కొత్త రాతియుగంతో పది వేల సంవత్సరాల క్రితం నాగరికత ప్రారంభమైంది. చరిత్రలో అనేక మలుపులు, మూలములుపులు సంభవించాయి.అవి అనేక పర్యవసానాలకు దారితీశాయన్నది ఏ చరిత్ర చూసినా అర్ధం అవుతుంది. ప్రతి నూతనాంశం వెనుక ఒక పెద్ద పరిణామం వుంటుంది. వర్తమాన చరిత్ర విషయానికి వస్తే కొంబస్‌ భారత్‌కు కొత్త దారిని ఏర్పాటు చేసేందుకు బయలుదేరి అమెరికా ఖండానికి చేరి చరిత్రను పెద్ద మలుపు తిప్పాడు. అసలు కొలంబస్‌ భారత్‌కు ఎందుకు బయలు దేరాడు ?
తురుష్కులు కానస్టాంట్‌ నోపుల్‌ను ఓడిరచి స్వాధీనం చేసుకోవటంతో 1500 సంవత్సరాల రోమన్‌ సామ్రాజ్య పతనం జరిగింది. అప్పటివరకు ఐరోపా వ్యాపారులకు ఆసియాకు వున్న రోడ్డు మార్గం మూసుకుపోయింది.దాంతో ఆఫ్రికాలోని గుడ్‌ హోప్‌ ఆగ్రం నుంచి ఆసియాకు చుట్టి రావటం లాభదాయకం కాదు. అందువలన భారత్‌కు సముద్ర మార్గం కనుగొనేందుకు అంతకు ముందు నుంచే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న ఐరోపా పాకవర్గాులు కాన్‌స్టాంట్‌ నోపుల్‌ పతనంతో తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆక్రమంలో కొలంబస్‌ యాత్ర జరిగింది. దానితో ప్రధానంగా ల బ్ది పొందింది స్పెయిన్‌. దానిని చూసిన తరువాత ఇతర ఐరోపా దేశాలు పోటీ పడ్డాయి. ఆ పోటీ పర్యవసానాలు వ్యాపారం నుంచి పారిశ్రామిక విప్లవం, దానికి ఆటంకంగా వున్న ఐరోపా ప్యూడల్‌ సమాజాన్ని అంతం చేయటం వరుసగా జరిగాయి. ప్యూడల్‌ సమాజాన్ని దెబ్బతీసేందుకు పెట్టుబడిదారులు ఆకర్షణీయమైన నినాదా లు ఇచ్చారు. స్వాతంత్య్రం, సాభ్రాత్వత్వం , ప్రజాస్వామ్యం పేరుతో జనాన్ని సమీకరించారు. ఫ్రెంచి విప్లవ సారాంశమిదే. పారిశ్రామిక విప్లవంతో ఐరోపాలో పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి దోపిడీ మరింత తీవ్రమైంది, అసమానతలు పెరిగాయి. వంద సంవత్సరాల అనుభవాలనుంచి అవిర్బవించిందే మార్క్సిజం.

భారత్‌కు సముద్ర మార్గం కనుగొనేందుకు అంతకు ముందు నుంచే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న ఐరోపా పాల కవర్గాలు కాన్‌స్టాంట్‌ నోపుల్‌ పతనంతో తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆక్రమంలో కొలంబస్‌ యాత్ర జరిగింది. దానితో ప్రధానంగా ల బ్ది పొందింది స్పెయిన్‌. దానిని చూసిన తరువాత ఇతర ఐరోపా దేశాలు పోటీ పడ్డాయి. ఆ పోటీ పర్యవసానాలు వ్యాపారం నుంచి పారిశ్రామిక విప్లవం, దానికి ఆటంకంగా వున్న ఐరోపా ప్యూడల్‌ సమాజాన్ని అంతం చేయటం వరుసగా జరిగాయి.

ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానంలోని లోపాలను గమనించిన అనేక మంది తత్వవేత్తలు సామాజిక దృష్టితో అనేక అధ్యయనాలు సాగించారు. వాటిని కాచి వడపోసిన కారల్‌మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ అసమానతలు లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నమ్మారు. మానవజాతి చరిత్ర సమస్త వర్గపోరాటాల పర్యవసాలే అని చెప్పారు. ఎందరో తత్వవేత్తలు ఈ సమాజాన్ని మార్చాలని కోరినప్పటికీ అది సంభవించలేదు. అసమానతలు లేని సమాజాన్ని కోరుకోవటమే కాదు ఆటంకం కలిగించే వ్యవస్తను కూకటివేళ్లతో కూల్చివేసి నూతన సమాజాన్ని నిర్మించాలంటూ 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టోను ఆవిష్కరించారు. పదివేల సంవత్సరాలం నాగరిక మానవజాతి చరిత్రను ఈ ప్రతిపాదన, సిద్దాంతం ఒక అనూహ్యమలుపు తిప్పింది. అదే కమ్యూనిస్టుల ప్రత్యేకత. సాధించిన ఒక గొప్ప విజయం.
తమకు పొంచివున్న ముప్పును గమనించటంలో ప్రతి దశలోనూ దోపిడీ దారులే ముందున్నారనేందుకు చరిత్రలో అనేక దృష్టాంతాలు వున్నాయి. ఏసుక్రీస్తు, బుద్దుడు తమ కాలాల్లో పాలకవర్గాల నుంచి ప్రతికూలతను ఎదుర్కొనటానికి కారణం అదే. వారి బోధనలు తమ దోపిడీ మూలాలను దెబ్బతీస్తాయని నాటి పాలకులు ముందే గుర్తించారు. నాటి నుంచి నేటి కమ్యూనిస్టుమానిఫెస్టో వరకు అదే జరుగుతోంది. నిజానికి కమ్యూనిజం పనికిరానిది, దాని వలన తమకు ముప్పు లేదని పాలకవర్గాలు, ప్రపంచాన్ని తమ చెప్పుచేతలో వుంచుకోవాలని చూస్తున్న అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, వారిని అనుసరించే భారత పాలకవర్గ పార్టీలు వంటివి భావించి వుంటే ఇంతటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టవు.

మబ్బులను చూసి ముంతలోని నీళ్లు బాగాలేవు అని ఎవరైనా పారపోసుకుంటారా ? వర్షం పడి నీరు కుంటలు, చెరువులు, నదుల్లో చేరే వరకు ముంతలోని నీరే ఆధారం. అవి బాగాలేవనుకుంటే వాటిని శుద్ది చేసుకోవాలి, వడగట్టాలి. ప్రస్తుతానికి కమ్యూనిజం కూడా అలాంటిదే. అంతకంటే మంచి సిద్దాంతం, ఆచరణ వచ్చే వరకు వున్న దానిని వుపయోగించుకోవాలా వద్దా?

సోషలిస్టు వ్యవస్ధను ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై ఆయా దేశాలలో వున్న పరిస్ధితును బట్టి కమ్యూనిస్టుల మధ్య తేడాలు వుండవచ్చుగాని అసలు లక్ష్యంపై లేదు. దోపిడీ, అసమానతలు పోయి మన పూర్వీకులు, అనేక మంది తత్వవేత్తలు కోరుకున్న సంక్షేమ రాజ్యం, వసుధైక కుటుంబం ఏర్పడాలా వద్దా? దానికి మార్క్సిజం`లెనినిజం మార్గమని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు.కమ్యూనిజం పనికిరాదు, ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేవారు ఏ ఆధారాలతో చెబుతున్నారు? కొన్ని ఆటుపోట్లు ఎదురైనంత మాత్రాన పనికి రాకుండా పోతుందా పోనీ వారి వాదన ప్రకారం నిజంగా సమతా సమాజాన్ని కోరుకొనే వారు అది పనికి రాకపోతే మరొక ఇజం లేదా మార్గం ఏమిటో ప్రతిపాదించాలి.
మబ్బులను చూసి ముంతలోని నీళ్లు బాగాలేవు అని ఎవరైనా పారపోసుకుంటారా ? వర్షం పడి నీరు కుంటలు, చెరువులు, నదుల్లో చేరే వరకు ముంతలోని నీరే ఆధారం. అవి బాగాలేవనుకుంటే వాటిని శుద్ది చేసుకోవాలి, వడగట్టాలి. ప్రస్తుతానికి కమ్యూనిజం కూడా అలాంటిదే. అంతకంటే మంచి సిద్దాంతం, ఆచరణ వచ్చే వరకు వున్న దానిని వుపయోగించుకోవాలా వద్దా? కొందరు అసలు సమానత్వానికే వ్యతిరేకం, కనుక వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు. దానిపై బురద జల్లేందుకు, పీడితులు దానివైపు ఆకర్షితులు కాకుండా చూసేందుకు దానిని వక్రీకరించి ప్రచారం చేస్తారు. మేకతోలు కప్పుకున్న పు మాదిరి తామూ సమసమజానికి అనుకూలమే కాని కమ్యూనిజానికి వ్యతిరేకం అంటారు. అలాంటి వారిని ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని వారి వాదనను నమ్మేవారు నిలదీయాలా వద్దా ? కమ్యూనిస్టు మద్దతుదారులుగా వుండాల్సిన కొంత మంది మితృులు అంబేద్కర్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకించారని చెబుతూ తాము కూడా అదే అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భారత దేశంలో కమ్యూనిజం గురించి కొందరు లేవనెత్తిన అంశాలపై చర్చ సందర్భంగా దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా సందర్బవశాత్తూ ప్రస్తావించాల్సి వస్తోందని గమనించ మనవి. ముందు ముందు కమ్యూనిస్టు వుద్యమం గురించి చెప్పుకుందాం.
బిఆర్‌ ఆంబేద్కర్‌ కమ్యూనిస్టులతో ఏ అంశంపై విబేధించారు? ఆయన అవగాహన ఏమిటి ?దాని మంచి చెడ్డలను వచ్చే భాగంలో చర్చిద్దాం .

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)