Tags

,

  • ee738561-e24d-4b01-b862-1598a4455921

 

  • విజయవాడ,  ఈ ఏడాది డిసెంబర్ నెలలో విజయవాడలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) మూడవ రాష్ట్ర సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి శ్రీ నారా  చంద్రబాబు నాయుడును  జర్నలిస్టు సంఘం నేతలు కోరారు. మంగళవారం సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు.ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రథమ సదస్సును కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అక్రిడేషన్ కమిటీలో తమ సంఘానికి ప్రాతినిథ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శులు కోటేశ్వరరావు, శ్రీనివాస్, ట్రెజరర్ శాంతి తదితరులు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.