Tags

, ,

 

సత్య

ఒక శాస్త్రీయ సిద్ధాంతం ఆధారంగా వునికిలోకి వచ్చిన సోషలిజం, కమ్యూనిజం భావనలకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. అయినంత మాత్రాన ఆ సిద్ధాంతాలు అవనిక నుంచి అంతర్ధానమౌతాయా ? అవుతాయని వాటి వ్యతిరేకులు ఊరూవాడా నానాయాగీ చేసి గతంలో ప్రచారం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. మీరు మాకు 90 మైళ్ల దూరంలోనే వున్నారు, ఒక్క బాంబుతో మీ దేశాన్ని లేపివేస్తే ఎక్కుండుంటారో తెలుసా అని ఏనుగంత అమెరికా చీమంత క్యూబాను గతంలో బెదిరించింది. అయితే మాకు మీరెంత దూరమో మీరు కూడా మాకంత దూరంలోనే వున్నారని తెలుసుకోండి అంటూ క్యూబా తాపీగా సమాధానమిచ్చింది.

పూర్వపు సోషలిస్టు దేశాలలో తిరిగి వుద్యమాలకు వున్న అవకాశాలేమిటి ? ఈ అంశాలపై ఇక్కడ చర్చించే అంశాలు సమాచారాన్ని అందించేందుకు, భిన్న ఆలోచనలు, భావాలను పాఠకుల ముందుకు వుంచేందుకు చేస్తున్న ప్రయత్నమిది. వీటిపై ఎంతో లోతైన అధ్యయనం ,చర్చల మధనం జరగాలి. అంతిమ నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, అది తొందరపాటు అవుతుంది. ఈ పరిమితులను గమనంలో వుంచుకోవాలని మనవి.

 

ఈ దమ్ము, ధైర్యం క్యూబాకు ఎక్కడి నుంచి వచ్చింది. సోవియట్‌ యూనియన్‌, అది కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలుగా క్యూబన్లకు కొనసాగుతున్న చైనా అండదండలే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఒక దేశంలో, ఒక ప్రాంతంలో సోషలిస్టు విప్లవం వచ్చినపుడు దానిని మింగివేసే శక్తులు బలంగా వున్నపుడు ఎదురయ్యే సమస్యలు ఏమిటో సోవియట్‌, తూర్పు ఐరోపా పరిణామాలు వెల్లడించాయి. ఒకసారి వ్యవస్ధ కూలిపోయి పరిస్ధితి అగమ్య గోచరంగా మారినప్పటికీ 26 సంవత్సరాల తరువాత కూడా చెక్‌(చెకో స్లోవేకియా నుంచి విడిపోయిన దేశం) కమ్యూనిస్టులపై గణనీయమైన భాగ జన విశ్వాసం కొనసాగుతూనే వుంది. మరోవేపు పూర్వపు సోషలిస్టు దేశాలలోని జనం సోషలిస్టు వ్యవస్ధల గురించి బెంగ పెట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వారు తక్కువ మందే వుండవచ్చు గానీ రానున్న తరాలపై దాని ప్రభావం పడకుండా ఆపగలరా ? పూర్వపు సోషలిస్టు దేశాలలో తిరిగి వుద్యమాలకు వున్న అవకాశాలేమిటి ? ఈ అంశాలపై ఇక్కడ చర్చించే అంశాలు సమాచారాన్ని అందించేందుకు, భిన్న ఆలోచనలు, భావాలను పాఠకుల ముందుకు వుంచేందుకు చేస్తున్న ప్రయత్నమిది. వీటిపై ఎంతో లోతైన అధ్యయనం ,చర్చల మధనం జరగాలి. అంతిమ నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, అది తొందరపాటు అవుతుంది. ఈ పరిమితులను గమనంలో వుంచుకోవాలని మనవి.

ఇరవై ఆరు సంవత్సరాల క్రితం చెకోస్లోవేకియాలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన సమయంలో దానికి నాయకత్వం వహించిన వారు తాము గొప్ప ప్రజాస్వామిక వాదులుగా జనం ముందుకు వచ్చారు. అలాంటి వారు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధిస్తే నియంతలౌతారు. నాడున్న పరిస్ధితులలో ఎలాగూ కమ్యూనిస్టులు కొద్ది రోజుల్లోనే అంతర్ధానమౌతారు, ఆ మాత్రం దానికి వారిని నిషేధించటం ఎందుకు అనుకున్నారు. నాటి చెకోస్లోవేకియా చెక్‌, స్లోవేనియా రెండు దేశాలుగా చీలిపోయింది. పూర్వపు కమ్యూనిస్టు పార్టీ వారసురాలిగా జనం ముందుకు వచ్చిన చెక్‌ బొహీమియా మరియు మొరేవియా కమ్యూనిస్టు పార్టీ స్ధిరంగా వుండటమేగాక రాజకీయ రంగంలో ప్రభావం చూపగలదని వారు వూహించలేకపోయారు. ఇప్పుడు అరే ఎంత పెద్ద తప్పిదం చేశాము అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం 50 వేల మంది సభ్యులతో చెక్‌ కమ్యూనిస్టు పార్టీ పని చేస్తున్నది. పద్నాలుగు ప్రాంతీయ ప్రభుత్వాలలో పది చోట్ల సంకీర్ణ కూటమి భాగస్వామిగా వుంది. రెండువందల స్ధానాలున్న పార్లమెంట్‌లో 33 సీట్లు ఆ పార్టీకి వున్నాయి. ఐరోపా పార్లమెంట్‌కు చెక్‌ నుంచి 21 స్ధానాలుండగా ఈ పార్టీకి ముగ్గురు సభ్యులు వున్నారు. గతంలో దాని యువజన విభాగాన్ని నిషేధించి పార్టీని దెబ్బతీసేందుకు పాలకులు చేసిన యత్నం విఫలమైంది. చివరకు నిషేధం ఎత్తివేయాల్సి వచ్చింది. సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయిన తరువాత కమ్యూనిస్టు పార్టీ పేరును కొనసాగించిన రెండు పార్టీలలో ఒకటి చెక్‌ రెండవది మాల్డోవా పార్టీ మాత్రమే.

26 సంవత్సరాల తరువాత కూడా చెక్‌ పార్టీ సజీవంగా వుండటమే గాక దేశ రాజకీయ రంగంపై ప్రభావం చూపగలదని ఎవరూ వూహించి వుండరు. తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఎర్రపూల వనం తిరిగి చిగిరిస్తుందని తాము ప్రారంభం నుంచి విశ్వాసంతో వున్నట్లు చెక్‌ రేడియా ఇంటర్వ్యూలో కమ్యూనిస్టు నేతలు చెప్పారు. సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసిన తరువాత అంతకు ముందు కమ్యూనిస్టుపార్టీకి వేసిన పెద్ద పీటను రద్దు చేశారు. అనేక కొత్త రాజకీయపార్టీలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు నేతలు నాటి పరిస్ధితుల గురించి అనేక విషయాలు చెప్పారు. వాటి ముఖ్యాంశాల సారంశం ఇలా వుంది.

ప్రాగ్‌ నగర కమ్యూనిస్టు నేత జోసెఫ్‌ కాలా మాట్లాడుతూ ‘మా సంగతి మాకు ముఖ్యమనుకుంటూ 1989,90లలో చాలా మంది పార్టీని వదలి వెళ్లారు.అనేక మంది అసంతృప్తి చెందారు.అయితే ఇది చరిత్రకు అంతం కాదు అని భావించిన వారు కూడా వున్నారు.చరిత్రలో ఇలాంటి సమయంలో అందరూ నిలవరని వారికి తెలుసు , ఇదొక పెద్ద మార్పు, అది పెద్ద సంక్షోభానికి దారి తీయటం అనివార్యమని చెప్పాము, నా అభిప్రాయాలు వాస్తవ రూపం దాల్చినందుకు ఇప్పుడు నాకెంతో గర్వంగా వుంది ‘ అన్నారు.

కమ్యూనిస్టుపార్టీ పార్లమెంట్‌ సభ్యుడిగా వున్న జాన్‌ క్లాన్‌ బొహీమియా ప్రాంతనేత. నాటి జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకున్నారు.’ మార్పు ఎంతో కనిపించింది, మేము మా టీచర్లను కామ్రేడ్స్‌ అని పిలవటం మానుకున్నాము.1989 నవంబరులో అధ్యక్షుడు మారిపోగానే తరగతి గదుల్లో అధ్యక్షుడి ఫొటోలను మార్చివేశారు.1990 తొలి సంవత్సరాలను గుర్తుకు తెచ్చుకుంటే నా తల్లి స్ధానిక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి. అందరూ పార్టీని వదలి పోగా ఆమె ఒక్కతే మిగిలారు. కొన్ని పరిస్ధితులు బాగాలేవని నేను గుర్తించాను. వుదాహరణకు జనం మా ఇంటి ముందు చెత్త పోసేవారు. 1989లో పదిహేను లక్షల మంది సభ్యులున్నారు.వెల్వెట్‌ విప్లవం సందర్భంగా సామూహికంగా వెళ్లిపోయారు. 2004లో లక్ష మంది వున్నారు. అప్పటి నుంచి మరో సగం తగ్గిపోయారు. 1990 దశకంలో పార్టీపై నిషేధం విధిస్తారనే భయం వుండేది, కొన్ని తరగతుల వారిని ఏ వుద్యోగానికి అర్హుత లేకుండా చేయాలని ప్రయత్నించిన వారు వున్నారు. అయితే 2000 దశకంలో మేము జాతీయంగా, ఐరోపా ఎన్నికలలో జయప్రదం అయ్యాము, 2004 ఎన్నికలలో 20శాతం ఓట్లు తెచ్చుకున్నాము. తరాల మార్పు కారణంగా కమ్యూనిస్టు పార్టీ అదృశ్యమౌతుందని నేడు చెక్‌ అధ్యక్షుడిగా వున్న మిలోస్‌ జెమిన్‌ అంచనా వేశాడు.ఆయన పొరపాటు పడ్డాడు, మేము సజీవంగా వున్నాము, ముందుకు పోతున్నాము.

పోలాండ్‌, స్లోవేకియా, హంగరీలలో మాదిరి కొత్త రూపం ఇవ్వకుండా పార్టీ పేరును అలాగే వుంచటం మంచి ఆలోచనే అంటారా ?

నేను నిజాలు చెప్పాలి. 1992 పార్టీ అంతర్గత అభిప్రాయ సేకరణలో నేను వేరే పేరును సూచించాను, ఎందుకంటే ఆ సమయంలో కొన్ని వత్తిళ్లను అది దూరం చేస్తుందని భావించాను. కానీ నేడు పరిస్ధితి భిన్నం, మా పార్టీ పేరు మార్చుకుంటే అది మాకు తోడ్పడుతుందని ఈ రోజు నేను గ్యారంటీగా చెప్పలేను. అంతేకాదు, మీరు ప్రస్తావించిన దేశాలలోని పార్టీలన్నీ అంతర్ధానమయ్యాయి.ప్రజలు వాటి గురించి పెద్ద ఆశలు పెట్టుకున్నారు, ఆశాభంగం చెందారు.ఈ విషయంలో వారు నష్టపోయారు తప్ప మేము కాదు. మేము సోషలిజంలోనే భవిష్యత్‌ , సామాజిక న్యాయం వుంటుందని భావిస్తున్నాము. పెట్టుబడిదారీ విధానం సరిగా పనిచేయటం లేదని 2008లో ప్రారంభమైన సంక్షోభం వెల్లడించింది. అందువలన దాని బదులు వేరే వ్యవస్ధ కోసం శోధిస్తున్నాము, ప్రపంచంలో పౌర అశాంతిని, తీవ్రమైన అసమానతలను తొలగించేదిగా అది వుండాలి. అది జరగపోతే 2008 సంక్షోభం కంటే తీవ్రమైన దానిని ఎదుర్కోవలసి వస్తుంది.

నాజీ, కమ్యూనిస్టు పాలనా కాలంలోని పత్రాలపై పరిశోధన జరుపుతున్న ఒక సంస్ధ అధిపతిగా పనిచేసిన పావెల్‌ అసెక్‌ ఇలా అన్నారు.’ 1990 నుంచి నేటి వరకు వామపక్ష సంకీర్ణం ఏర్పడటానికి అవకాశం దొరకలేదు. కాబట్టి దానిని కేవలం ఒక రాజకీయ పార్టీ అంశంగా చూడరాదు, అది మొత్తం రాజకీయ వ్యవస్ధ సమస్య.’ పావెల్‌ అసెక్‌ను 2010లో సంస్ధ పదవి నుంచి తొలగించటం పెద్ద వివాదాన్ని రేపింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిస్టు గతాన్ని ఎలా చూడాలి అన్న ప్రశ ్నకు పావెల్‌ ఇలా అన్నారు.’ అది ఒక పెద్ద సమస్య లక్షణం. కమ్యూనిజం గతం ఏమిటి అని పునర్‌నిర్వచనం చేసేందుకు ప్రజలు రాజకీయ మరియు నైతిక కోణం నుంచి చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. 1989కి ముందు చెక్‌ వ్యవస్ధకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో అది కలసి వుంది. మన గతంలోని కొంత భాగం తిరిగి వస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఇది కేవలం తాత్కాలికమే అనుకుంటున్నాను, కానీ ఈ విషయాలను వివరించేటపుడు మనం చురుకుగా వుండాలి, ముఖ్యంగా యువతరం నేటి చెక్‌ రిపబ్లిక్‌ వ్యవస్ధను వ్యతిరేకిస్తున్నవారిలో కాలానుగుణ్య శక్తిగా వున్నారు.’ అన్నారు.

చెక్‌ కమ్యూనిస్టుపార్టీ అంతర్జాతీయ విభాగపు నేత, ఐరోపా యూనియన్‌ ఎంపీ అయిన మిలోస్లావ్‌ రాండ్‌ ఫోర్ఫ్‌ మాట్లాడుతూ ‘ రష్యాలో అనేక దుర్మార్గపూరిత వైఖరులు గల పెట్టుబడిదారీ పాలకవర్గం వుంది. అయితే దానిని భూతంగా చిత్రించటం తెలివితక్కువ తనం అవుతుంది. అమెరికా మంచిదికాదు రష్యా చెడ్డది కాదు.రష్యాకు వ్యతిరేకంగా ఐరోపా యూనియన్‌, అమెరికా కలసి ఆంక్షలు విధించటం సహేతుకం కాదు, దాని వలన అమెరికా కంటే ఐరోపాయే ఎక్కువ నష్ట పోతుంది.’ అన్నారు.

గ్రీస్‌ సిరిజా, స్పెయిన్‌ పొడెమాస్‌ మాదిరి భవిష్యత్‌ వుంటుందా అన్న ప్రశ్నకు జోసెఫ్‌ కాలా స్పందిస్తూ ‘ కమ్యూనిస్టుల తరుణం ఇంకా రావాల్సి వుంది, అధిక వుత్పత్తి మరియు పెట్టుబడి సంక్షోభం శాశ ్వత స్ధితికి మారుతోంది. దీనిని మీరు అనేక సమస్యలలో చూడవచ్చు-గ్రీసు సంక్షోభం, వుక్రెయిన్‌ సంక్షోభం, వలసల ప్రవాహాలు లేదా టిటిఐపి కధ , ఇది ఐరోపాకు పెద్ద ప్రమాదం, మరొకటి తమ రుణ సమస్యను పరిష్కరించుకొనేందుకు అమెరికా చేస్తున్న తెగింపు యత్నం. కాబట్టి తీవ్ర సంక్షోభ కాలం రానున్నది మరియు అన్ని కీలకాంశాలు అజెండాగా మారనున్నాయి.సమస్య మనం దీనిని సహించగలమా మరియు తీవ్ర సంక్షోభంతో పాటు సంభవించే పరిణామాలను మనం అనుసరించగలమా, లేదా ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు నూతన ప్రయత్నం వుంటుందా, నూతన దృశ్యం ఆవిష్కరణ అవుతుందా అన్నది ప్రశ్న.ఇది లోతుగా జరగాల్సిన తాత్విక చర్చ అంశం అని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. దీని గురించి మార్క్సిజంలో చాలా అంశాలున్నాయి.’

చెక్‌ కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ నిలవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చారెల్స్‌ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రాల అధిపతి మైఖేల్‌ పెరోట్టినో మాట్లాడుతూ ‘ ఒక గతం వున్న పార్టీ ఇది, ఈ పార్టీ ఇంకా ఎందుకు వున్నది అన్నది అర్ధం చేసుకోవాలంటే గతంలోకి వెళ్లాలి.మధ్య ఐరోపాలో నిజమైన కమ్యూనిస్టుపార్టీలలో ఇది ఒకటి. 1945లో సోవియట్‌ ఏర్పాటు చేసింది కాదు. ఈ విధంగా చూసినపుడు దానికి సమాజంలో ఒక పునాది వుంది.1990లో సంధి కాలంలో అది రాజకీయంగా అయినా దెబ్బతిన్న పార్టీ. అది ఇప్పుడు ఎందుకు ఆకర్షిస్తున్నదంటే నూతన పరిస్ధితులకు అనుగుణ్యంగా నూతన మార్గాన్ని ఎంచుకుంది. అది ఇప్పుడు అధికారంలో లేదు, వారిపుడు అవినీతి వంటి సమస్యల గురించి విమర్శలు చేయవచ్చు, తాము అవినీతి రహితులమని, ప్రస్తుత వ్యవస్ధకు ప్రత్యామ్నాయమని చెప్పుకోగలరు.ప్రస్తుతం వారు తాము మాత్రమే చెక్‌ రిపబ్లిక్‌లో ఏకైక వామపక్ష పార్టీ అని చెబుతారు, సోషల్‌ డెమాక్రాట్లు మధ్యేవాదులని అంటారు. ప్రస్తుతం చెక్‌ సమాజంలో గ్రీసు, స్పెయిన్‌ మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధకు వ్యతిరేకంగా నూతన వుద్యమాలను అంగీకరించే స్ధితి లేదు. నా ఆలోచన ప్రకారం

ఇక్కడ తీవ్ర మితవాద ఎన్‌ఓ 2011 గ్రూప్‌ మాదిరి భావనలు వున్నాయి. ప్రస్తుతం చెక్‌ కమ్యూనిస్టులు ప్రాంతీయ(మన రాష్ట్రం మాదిరి) ప్రభుత్వాలలో మాత్రమే వున్నారు. వారు జాతీయ స్ధాయిలో ప్రభుత్వంలో చేరేందుకు 1995 నాటి నిబంధన ఆటంకంగా వుంది, సోషల్‌డెమోక్రాట్లు జాతీయ స్ధాయిలో సహకరించే విధంగా లేరు. కమ్యూనిస్టులు జాతీయ స్ధాయిలో ప్రభుత్వంలో వుండాలని కోరుకుంటారని నేను అనుకోవటం లేదు. ప్రతిపక్షంగా వుండటమే మరింత ఆచరణాత్మకంగా వుంటుంది.వారు ప్రభుత్వంలో చేరితే అదృశ్యమౌతారు.