మారుతున్న ప్రపంచం-3
పీటర్ బెయినార్ట్
అమెరికా ఎందుకు వామపక్షం వైపు పయనిస్తోంది అనే శీర్షికతో అమెరికాలోని అట్లాంటిక్ పత్రికలో పీటర్ బెయినార్ట్ రాసిన విశ్లేషణ గురించి గత భాగంలో కొన్ని అంశాలు చెప్పుకున్నాం. పాఠకులకు మరిన్ని వివరాలు, పూర్వరంగాన్ని తెలియచేసేందుకు సుదీర్ఘమైన ఆ వ్యాసాన్ని సంక్షిప్తీకరించి ముఖ్యాంశాలను ఇవ్వటం అవసరమన్న సూచనల మేరకు ఇక్కడ ఇస్తున్నాను.అందువలన ఇంతకు ముందు భాగంలో పేర్కొన్న అంశాలు పునశ్చరణ చేయటం లేదు. దీనిలోని అంశాలన్నీ మూల రచయిత అభిప్రాయాలే.: ఎంకెఆర్
రిపబ్లిక్లన్లు పార్లమెంట్ మరియు దేశంలోని ప్రభుత్వకార్యాలయాలను తాళాలతో కట్టడి చేయవచ్చు, అధ్యక్ష ఎన్నికలో మంచి విజయం సాధించగలరేమో కానీ బరాక్ ఒబామా హయాంలో ప్రవేశ పెట్టబడిన వుదారవాద యుగం ప్రారంభం మాత్రమే. గత పద్దెనిమిది నెలలుగా సంభవించిన దిగువ ఘటనలు దేశాన్ని నిశ్చేష్టితురాలిని చేశాయి. 2014 జూలైలో చట్టవిరుద్దంగా సిగిరెట్లు అమ్ముతున్నాడనే పేరుతో ఆఫ్రికన్ అమెరికన్ యుకుడు ఎరిక్ గార్నర్‌ను న్యూయార్క్ పోలీసులు వూపిరి ఆడకుండా చేసి చంపివేశారు. అదే ఏడాది ఆగస్టులో డారెన్ విల్సన్ అనే శ్వేతజాతి పోలీసు అధికారి మైకేల్ బ్రౌన్ అనే ఆఫ్రికన్ అమెరికన్ కుర్రవాడిని ఫెర్గూసన్ పట్టణంలో కాల్చి చంపాడు.దీంతో తలెత్తిన రెండు వారాల నిరసనల కారణంగా పట్టణం యుద్ధ ప్రాంతం మాదిరి కనిపించిందని మిసౌరీ రాష్ట్ర గవర్నర్ స్వయంగా వ్యాఖ్యానించాడు. అదే ఏడాది డిసెంబరులో గార్నర్, బ్రౌన్‌ల మరణానికి ప్రతీకారంగా నేర చరిత్ర వున్న ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఇద్దరు న్యూయార్క్ నగర పోలీసులను మట్టుపెట్టాడు.వారి అంత్యక్రియలకు హాజరైన నగర మేయర్ వుదారవాద మేయర్ బిల్ డి బ్లాసియోకు వెన్ను చూపి పోలీసులు నిరసన తెలిపారు.
గతేడాది ఏప్రిల్‌లో మరొక ఆఫ్రికన్ అమెరికన్ యువకుడు ఫ్రెడ్డీ గ్రే పోలీసు కస్టడీలో మరణించాడు.దాంతో తలెత్తిన నిరసనలలో బాల్టిమోర్‌లో 200 వాణిజ్య సంస్ధలు నాశనమయ్యాయి, 113 మంది పోలీసులు గాయపడ్డారు, 486 మంది పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో నల్లజాతి వుద్యమ కార్యకర్తలు ఇద్దరు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధుల వుపన్యాసాలను అడ్డుకోవటం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఒక వేళనేను పోలీసు కస్టడీలో మరణిస్తే దానికి ప్రతీకారంగా ఏ పద్దతిలో అయినా మరొకరిని మట్టుపెట్టండి, ప్రతిదాన్నీ తగుల పెట్టండి అంటూ నల్లజాతి వుద్యమ కార్యకర్తలు నినదించారు. దాంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి మార్టిన్ ఓ మల్లీ మాట్లాడుతూ నల్లజాతీయులవైనా తెల్లజాతీయులవైనా ప్రాణాలు ప్రాణాలే అని మాట్లాడి నిరసనలను ఎదుర్కొని తరువాత క్షమాపణలు చెప్పాడు.
రోనాల్డ్ రీగన్ దేశాన్ని మితవాదం వైపు ఎలా నడిపాడో నేను చూశాను, బిల్ క్లింటన్ దానిని కొనసాగిస్తూ తమ పార్టీ నేరాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుందని శ్వేతజాతి అమెరికన్లకు హామీ ఇచ్చారు.నల్లజాతీయుల జీవిత సమస్య గురించి ఈ ఏడాది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు నలిగిపోవటాన్ని, వాటిని వామపక్ష అంశాలుగా హిల్లరీ క్లింటన్ సైద్దాంతిక హెచ్చరిక ముద్రవేయటం చూసిన తరువాత తీవ్రమైన మితవాద ప్రతిస్పందనకు దేశం సిద్దం కావాల్సి వుంటుందని నేను వూహించాను. కానీ నేను వూహించింది తప్పు. ఒబామా వుదారవాదానికి వెల్లడైన వ్యతిరేకత బలం కంటే గొంతు పెద్దదిగా వుంది. దేశం మితవాదం వైపు కంటే మొత్తంగా చూస్తే వామపక్షం వైపు తిరుగుతోంది.
1960 దశకం చివరిలో 70 దశకం మధ్యలో మిలిటెంట్ వామపక్షం మరియు జాతి పరమైన జగడాల మధ్య వుదారవాద యుగం అంతమైంది.ఈ రోజు మిలిటెంట్ వామపక్షం మరియు జాతి పరమైన జగడాల మధ్య వుదారవాద యుగం కేవలం ప్రారంభమైంది. డెమోక్రటిక్ పార్టీ మరియు ముఖ్యంగా దేశం మొత్తం మీద మరింత వుదారంగా ఎందుకు తయారవుతోందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది. డెమోక్రటిక్ పార్టీ వామపక్ష దిశగా ప్రయాణ కధలో రెండు ఆధ్యాయాలు వున్నాయి. మొదటిది జార్జి డబ్ల్యు బుష్ అధ్యక్షత గురించి. బుష్‌కు ముందు డెమోక్రటిక్ పార్టీలో బలమైన మధ్యేవాద విభాగం వుంది.అది రోనాల్డ్ రీగన్ మిలిటరీ చర్యలను ఎక్కువగా సమర్ధించింది. స్వలింగ సంపర్కులకు మిలిటరీలో అవకాశం కల్పించాలన్న బిల్‌క్లింటన్ ప్రయత్నాలను పడకుండా చేసింది. కనీసవేతన పెంపుదలను వ్యతిరేకించింది. ఆదాయ పన్ను రేటును 70నుంచి 50శాతానికి తగ్గించటం, ప్రభుత్వ నియంత్రణలను మరింత సడలించిన రీగన్ నిర్ణయాల కారణంగా ఆర్ధిక అభివృద్ధి జరిగిందని 1980దశకం చివరిలో 1990దశకంలో ఈ విభాగం వాదించింది. పన్నురేటును బుష్ 2001లో 35శాతానికి తగ్గించటం, నియంత్రణలను బలహీన పరచారు, అయినప్పటికీ అసమానత, లోటు బడ్జెట్ మరింత పెరిగింది, ఆర్ధిక వ్యవస్ధ పురోగమించింది లేదు ఆ తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. డెమోక్రాట్ మధ్యేవాదులు 1980ల చివరిలో 1990దశకంలో మరికొన్ని వాదనలు కూడా చేశారు. రక్షణ ఖర్చును పెంచి,ఆఫ్ఘన్ ముజాహిదీన్‌లకు సాయం చేసి సోవియట్‌ను కూల్చివేసేందుకు రీగన్ నిర్ణయాలు సాయం చేశాయని చెప్పారు. కానీ 2003లో బుష్ ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధం ప్రకటించి వియత్నాం యుద్ధం(దురాక్రమణ) తరువాత అత్యంత పెద్ద విదేశాంగ విధాన విపత్తుకు కారకుడయ్యాడు.
వాల్‌స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం ఆరిపోయి వుండవచ్చుగానీ అది అమెరికన్ రాజకీయ చర్చలో ఆర్ధిక అసమానత అంశాన్ని చొప్పించిందని అసోసియేటెడ్ ప్రెస్ వ్యాఖ్యానించింది. రీగన్ విధానాల కొనసాగింపు మాదిరే జరుగుతుందని డెమోక్రటిక్ మధ్యేవాదులు భావించిన కారణంగా 2001లో బుష్ పన్నుల తగ్గింపు ప్రతిపాదనను సెనెట్‌లో 12మంది, ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధ ప్రతిపాదనను 29 మంది డెమోక్రాట్ల మద్దతుతో నెగ్గించకున్నాడు. దీని పర్యవసానాలతో మధ్యేవాదులపై తిరుగుబాటు కారణంగా పార్టీలో అది నాశనమైంది. దానికి నాయకత్వం వహించిన వారిలో ఒకడైన వెర్‌మాంట్ గవర్నర్ హోవార్డ్ డీన్ డెమోక్రటిక్ నాయకత్వం ఏకపక్ష దురాక్రమణ యుద్దాన్ని ఎందుకు సమర్ధించిందో, పన్నుల తగ్గింపునకు ఎందుకు మద్దతు పలికిందో తెలుసుకోవాలనుకుంటున్నానని 2003 ఫిబ్రవరిలో ధ్వజమెత్తాడు. అదే ఏడాది చివరిలో యుద్ధాన్ని సమర్ధించిన వాషింగ్టన్ డెమోక్రాట్లకు వ్యతిరేకంగా పార్టీలో అధ్యక్ష పదవి అభ్యర్దిగా అదే ఏడాది చివరిలో డీన్ ముందుకు వచ్చాడు.
ఆయన ప్రచారం డెమోక్రటిక్ పార్టీలో అంతర్గతంగా మేథోపరమైన తిరుగుబాటుకు దారితీసింది. అతని తిరుగుబాటు వుదారవాదుల వెన్ను బలపడేందుకు డెయిలీ కోస్(ఇంటర్నెట్ పత్రిక) అంకితమయ్యేందుకు కారణమైంది, పార్టీలో ముందుకు పదండి అనే పురోగామి కార్యకర్తల బృందానికి శక్తినిచ్చింది. ఇదే సమయంలో అమెరికాలో అత్యంత పలుకుబడి కలిగిన వుదారవాద పత్రికా రచయితగా పాల్ క్రగ్మన్,టీవీ వ్యాఖ్యాతగా జాన్ స్టీవార్ట్ ముందుకు వచ్చారు.ఇదే విధంగా 2003లో ఎంఎస్‌ఎన్‌బిసి మీడియా సంస్ధ కెయిత్ ఒల్బర్‌మన్‌ను నియమించటమేగాక వుదారవాద నెట్‌వర్క్‌గా మారిపోయింది. ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధాన్ని సమర్ధించినందుకు న్యూ రిపబ్లిక్ పత్రిక 2004లో క్షమాపణలు చెప్పింది. డ్రడ్జ్ రిపోర్టుకు వుదారవాద ప్రత్యామ్నాయంగా 2005లో అఫింగ్టన్ పోస్టు పత్రిక అవతరించింది. డెమోక్రటిక్ పార్టీలో నోటి దురద వ్యక్తిగా పేరుమోసిన జో లిబర్‌మన్ సెనెట్ అభ్యర్ధిత్వ పోటీలో ఓడిపోయాడు,2011నాటికి గతంలో పార్టీపై పెత్తనం చేసిన డెమోక్రటిక్ లీడర్‌షిప్ కౌన్సిల్ పూర్తిగా తన పలుకుబడిని కోల్పోయి మూదపడింది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఎన్నికలలో ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధాన్ని సమర్ధించిన కారణంగా హిల్లరీ క్లింటన్‌ను బరాక్ ఒబామా ఓడించాడు, పార్టీలో అంతర్గత ధోరణిలో మౌలికంగానే మార్పు వచ్చింది.అందుకు నిదర్శనంగా ఒకప్పుడు వుదారవాదులను విమర్శించాలని కోరిన వారు నేడు వారిని గట్టిగా సమర్ధించనందుకు విమర్శిస్తున్నారు. ఎలాంటి క్షమాపణలు చెప్పే పనిలేకుండా డెమోక్రాట్లను వుదారవాదులుగా జార్జి డబ్ల్యు బుష్ ప్రభుత్వం మారిస్తే బరాక్ ఒబామా ప్రభుత్వం అత్యంత వాస్తవిక ఫలితాన్ని ఇచ్చింది. కానీ ఇది కధలో సగం మాత్రమే. ఎందుకంటే జార్జి డబ్ల్యు బుష్ ప్రభుత్వ వైఫల్యాలు డెమోక్రటిక్ పార్టీని వామపక్షం వైపు నెట్టాయి, బరాక్ ఒబామా సర్కార్ మరింతగా నెట్టింది. బుష్ వుదారవాద ప్రాధమిక వ్యవస్ధ రూపకల్పనకు కారణం అనుకుంటే అది ఒబామా ఎన్నికయ్యేందుకు దోహదం చేసింది. ఒబామా అజాగ్రత్త ఒకటి వాల్‌స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం మరియు నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమాలు ముందుకు వచ్చేందుకు కారణమైంది.