Tags
ఎం కోటేశ్వరరావు
మన దేశంలో ఏటే రైతాంగానికి సబ్సిడీలు తగ్గుతుండగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఏటేటా సబ్సిడీలు పెరుగుతున్నాయి. రైతాంగానికి సబ్సిడీలను తగ్గించాలని, ఇతరులకు ఇంకా పెంచాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనవంటి దేశాలపై వత్తిడి తెస్తోంది. గత పదమూడు సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న ఎరువుల సబ్సిడీల తీరుతెన్నులు ఇలా వున్నాయి.
ఏడాది వుత్పత్తి సబ్సిడీ (రు.కోట్లలో )
2002-2003దేశీయ యూరియా 7790
2002-2003 దిగుమతి యూరియా 1.16
2002-2003 దేశీయ కాంప్లెక్స్ 2487.94
2002-2003 దిగుమతి కాంప్లెక్స్ 736.58
11,015.68
2003-2004దేశీయ యూరియా 8521
2003-2004దిగుమతి యూరియా 0.82
2003-2004 దేశీయ కాంప్లెక్స్ 2606
2003-2004 దిగుమతి కాంప్లెక్స్ 720
11,847.82
2004-2005 దేశీయ యూరియా 10243.15
2004-2005 దిగుమతి యూరియా 742.37
2004-2005 దేశీయ కాంప్లెక్స్ 3977
2004-2005 దిగుమతి కాంప్లెక్స్ 1165.18
16127.70
2005-2006 దేశీయ యూరియా 10652.57
2005-2006దిగుమతి యూరియా 2140.88
2005-2006దేశీయ కాంప్లెక్స్ 4499.2
2005-2006దిగుమతి కాంప్లెక్స్ 2096.99
19,389.61
2006-2007దేశీయ యూరియా 12650.37
2006-2007 దిగుమతి యూరియా 5071.06
2006-2007 దేశీయ కాంప్లెక్స్ 6648.17
2006-2007 దిగుమతి కాంప్లెక్స్ 3649.95
28,019.55
2007-2008 దేశీయ యూరియా 16450.37
2007-2008 దిగుమతి యూరియా 9934.99
2007-2008 దేశీయ కాంప్లెక్స్ 10333.8
2007-2008 దిగుమతి కాంప్లెక్స్ 6600
43,319.16
2008-2009 దేశీయ యూరియా 20968.74
2008-2009 దిగుమతి యూరియా 12971.18
2008-2009 దేశీయ కాంప్లెక్స్ 32957.1
2008-2009దిగుమతి కాంప్లెక్స్ 32597.69
99,494.71
2009-2010 దేశీయ యూరియా 17580.25
2009-2010 దిగుమతి యూరియా 6999.98
2009-2010 దేశీయ కాంప్లెక్స్ 16000
2009-2010దిగుమతి కాంప్లెక్స్ 23452.06
64,032.29
2010-2011 దేశీయ యూరియా 15080.73
2010-2011 దిగుమతి యూరియా 9255.95
2010-2011దేశీయ కాంప్లెక్స్ 20650
2010-2011 దిగుమతి కాంప్లెక్స్ 20850
65,836.68
2011-2012 దేశీయ యూరియా 20285.46
2011-2012దిగుమతి యూరియా 17475
2011-2012 దేశీయ కాంప్లెక్స్ 20237.49
2011-2012దిగుమతి కాంప్లెక్స్ 16571.92
74,569.87
2012-2013 దేశీయ యూరియా 20000
2012-2013దిగుమతి యూరియా 20016
2012-2013దేశీయ కాంప్లెక్స్ 16000
2012-2013దిగుమతి కాంప్లెక్స్ 14576.1
80,592.1
2013-2014 దేశీయ యూరియా 26500
2013-2014 దిగుమతి యూరియా 15324.36
2013-2014 దేశీయ కాంప్లెక్స్ 15500
2013-2014 దిగుమతి కాంప్లెక్స్ 13926.86
71,251.22
2014-2015దేశీయ యూరియా 38200.01
2014-2015దిగుమతి యూరియా 16200
2014-2015దేశీయ కాంప్లెక్స్ 12000
2014-2015దిగుమతి కాంప్లెక్స్ 8667.3
75,067.31
ఈ వివరాలను గమనించినపుడు గత 13 సంవత్సరాలలో అన్ని రకాల ఎరువుల సబ్సిడీ కనిష్టంగా 11వేల కోట్ల నుంచి 2008-09 సంవత్సరంలో గరిష్టంగా 99వేల కోట్లకు చేరింది. 2014-15లో 75వేల కోట్లకు పడిపోయింది. మరొక ముఖ్య విషయం ఏమంటే 2002-03లో దేశీయ ఎరువుల సబ్సిడీ 10,277.94 కోట్లు కాగా విదేశీ దిగుమతుల సబ్సిడీ 737.74 కోట్లు మాత్రమే. గరిష్టంగా వున్న ఏడాదిలో స్వదేశీ సబ్సిడీ రు.53.565.84 విదేశీ సబ్సిడీ రు.36,423 కోట్లు. అదే 2014-15 నాటికి దేశీయ సబ్సిడీ 50,200 కోట్లు కాగా విదేశీ సబ్సిడీ 24,867 కోట్లకు తగ్గిపోయింది. పదమూడు సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం 6,60,563.7కోట్లు అంటే సగటున ఏడాదికి 50,812 కోట్లు మాత్రమే. దేశంలో పది నుంచి పన్నెండు కోట్ల మంది రైతులున్నారని అంచనా. ఈ లెక్కన ఒకొక్కరికి ఏడాదికి 4,234 నుంచి 5,081 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పవచ్చు.అదే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు వివిధ పథకాల పేరుతో ఇచ్చిన పన్ను, ఇతర రాయితీల మొత్తం 2013-14లో ఐదులక్షల యాభైవేల కోట్ల రూపాయలు కాగా 2014-15లో 5.89లక్షల కోట్ల వరకు వుండవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో రైతులకు ఇస్తున్న సబ్సిడీ తగ్గిపోతోంది. వ్యవసాయం గిట్టుబాటుగాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తుంటాయి. జనం సొమ్ము, జనానికి దక్కాల్సిన సొమ్ము నుంచి రాయితీలు పొందుతున్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు గిట్టుబాటుగాక వారికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు దివాలా తీస్తున్నాయి లేదా నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ఎక్కడా వినపడదు.