Tags

, , , ,

సత్య

స్వేచ్చా మార్కెట్‌ పేరుతో అమెరికా చెబుతున్న పెట్టుబడిదారీ విధానంతో అందరూ సమ్మతించటం లేదని డచ్‌ ఫొటోగ్రాఫర్‌ జాన్‌ బానింగ్స్‌ అంటున్నారు. ఒక కళాకారుడు, చరిత్రకారుడు కూడా అయిన బానింగ్స్‌ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన తరువాత ప్రపంచంలో ఇంకా ఎవరైనా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా? వుంటే వారేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. అదే తడవుగా ప్రపంచ యాత్ర ప్రారంభించాడు. పోర్చుగల్‌, నేపాల్‌, ఇటలీ వెళ్లి కొందరి ఇళ్ల తలుపు తట్టాడు. సోవియట్‌ యూనియన్‌లో అంతా అంతరించి పోయిన తరువాత ఇప్పటికీ మీరు కమ్యూనిస్టునే అని ఎలా చెప్పగలుగుతున్నారనే ప్రశ్న వారికి వేశాడు. సోషలిస్టు, కమ్యూనిస్టు కల ఇంకా బలంగానే వుందని బానింగ్‌ కనుగొన్నాడని టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. తాను ఎన్నడూ కమ్యూనిస్టు విలువల గురించి ఏనాడూ ఆతృత చూపలేదని అయినప్పటికీ తన వామపక్ష సానుకూల రాజకీయ ధోరణుల కారణంగా ఆ కల గురించి సానుభూతి వుందని బానింగ్స్‌ అంటున్నాడు. గతంలో ఇతర పనుల నిమిత్తం ప్రపంచమంతటా తిరిగాడు.’ తాము నమ్మిన ఆశయం కోసం ఆకలి, చిత్రహింసలను భరిస్తూ నేను కలుసుకున్న కమ్యూనిస్టులు కొందరు ఏండ్ల తరబడి జైళ్లలో వున్నారు. సామాజిక న్యాయం కోసం అటుంవంటి వాటిని భరించటానికి వారు సిద్దంగా వుండటం నాకు అద్భుతంగా కనిపించింది.’ అన్నాడు. ఈ వూహా ప్రపంచవాదులెవరు? పాతకాలపు నైతిక దృష్టితో చూసే వయసు మీరిన వారు కాదు నేపాల్‌, ఇటలీలలో కమ్యూనిజం పట్ల విశ్వాసం కలిగిన అనేక మంది యువకులను చూసి బానింగ్స్‌ ఆశ్చర్యానికి లోనయ్యాడట. తాను చూసిన కమ్యూనిస్టు పార్టీలలో భిన్నమైన వైఖరులు, వాతావరణాలు, పద్దతులు వున్నాయంటూ నిరాశకు తావులేకుండా వారిలో ఎక్కువ మంది తమ సిద్ధాంతాల గురించి ఎలాంటి దాపరికం లేకుండా చెప్పారని అన్నాడు. తాను వచ్చే ఏడాది ఇటలీ దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, చిలీ తదితర దేశాలు పర్యటిస్తానని తన అనుభవాలను చిత్రాలు, ఇతర రూపాలలో అధ్యయనాన్ని వెల్లడిస్తానని చెప్పాడు.

పెంటగన్‌, సిఐఏ బెర్నీ శాండర్స్‌ను అధ్యక్షుడిగా అనుమతిస్తాయా ?

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు బెర్నీ శాండర్స్‌ ప్రయత్నించటం ప్రయత్నించటం వృధా ప్రయాస అని అనేక మంది పెదవి విరుస్తున్నారు. తాను సోషలిస్టును అని ప్రకటించుకున్న శాండర్స్‌ను జాతీయ భద్రతా కారణాలను చూపి యంత్రాంగా అనుమతించే సమస్య లేదని అంటున్నారు. చిలీలో తాను కమ్యూనిస్టును అని ప్రకటించుకున్న చిలీ అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీని పెంటగన్‌(అమెరికా రక్షణ శాఖ కార్యాలయం) సిఐఏ అనుమతించకుండా కుట్ర పూని ఆయనను పదవి నుంచి కూలద్రోసి హత్య చేసి మిలిటరీ నియంత పినోచెట్‌ను అధికారంలో కూర్చో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పశ్చిమార్ధగోళంలో ఒక మ్యూనిస్టు అధికారంలో వుండటం అమెరికా జాతీయ భద్రతకు హాని అవి తలంచటమే అలెండీ హత్యకు కారణం. క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను కూల్చివేసేందుకు, హత్య చేసేందుకు చేయని ప్రయత్నం లేదన్న విషయం తెలిసిందే. చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చివేయటాన్ని శాండర్స్‌ బహిరంగంగా విమర్శించాడు. ఒక దేశ ప్రజల బాధ్యతా రాహిత్యం కారణంగా ఒక దేశం కమ్యూనిస్టుగా మారుతుంటే మనం కళ్లప్పగించి చూస్తూ ఎందుకుండాలి అని మాజీ రక్షణ మంత్రి హెన్రీ కిసింజర్‌ ప్రశ్నించాడు. అలెండీని దింపివేసేందుకు ఒక పధకం ప్రకారం అధికార యంత్రాంగానికి లంచాలు ఇవ్వటం, అక్కడి పత్రికల్లో ప్రచారం, ఆర్ధిక ఇబ్బందులు కలిగించటం చివరకు ఒక సైనికాధికారిని హత్య చేయించటంలో పెంటగన్‌, సిఐఏ పాల్గొన్నాయి.ఇదంతా నాటి అధ్యక్షుడు, వాటర్‌గేట్‌ కుంభకోణంతో పదవి కోల్పోయిన నిక్సన్‌ ఆదేశాల మేరకే జరిగింది.అయితే విదేశాలలో అలాంటి దుర్మార్గానికి పాల్పడతారు గానీ స్వదేశంలో చేస్తారా అని కొందరిలో శంక వుంది. చిలీలో అలెండీ అధికారానికి రావటం చిలీ భద్రతకు ముప్పు అని నాటి జాతీయ భద్రతా యంత్రాంగం కూడా భావించటంతో అమెరికన్ల కుట్ర సులభమైంది.మిలటరీ తిరుగుబాట్లను చిలీ రాజ్యాంగం నిషేధించినప్పటికి దేశ భద్రత ముసుగులో ఏం చేసినా తప్పులేని నాడు భావించారు. ఒక వేళ శాండర్స్‌ ఎన్నికైనా అదే పునరావృతం అవుతుందన్నది అనేక మంది మాట. అలెండీకి మద్దతుగా వున్న ఇద్దరు అమెరికన్‌ యువకులను హత్య చేయించటంలో అమెరికా సంస్ధల హస్తం వుంది. తరువాత వారు గద్దెనెక్కించిన పినోచెట్‌ దాదాపు 30వేల మంది కమ్యూనిస్టులను హత్య చేయించాడు. అలా హత్యకు గురైన వారిలో ప్రఖ్యాత కవి పాబ్లో నెరూడా కూడా ఒకరని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.

తిట్టే నోరు, తిరిగే కాలు, అమెరికా కుట్రలు

ఆగవు, కొనసాగుతూనే వుంటాయి. క్యూబాతో ఐదు దశాబ్దాల తరువాత దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న అమెరికన్లు కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే వున్నారు. ఏ దేశంలో అయినా ఎవరైనా అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం, పేల్చివేస్తాం అన్నవారిని స్వేచ్ఛ పేరుతో వారినా పనిచేయనిస్తాయా ? అలాంటివేమీ లేకుండానే వివిధ కారణాలను సాకుగా చూపి తన జనాన్ని జైళ్లలో కుక్కుతున్న అమెరికా ఇతర దేశాల విషయంలో మానవ హక్కుల గురించి గొంతెత్తి మాట్లాడుతుంది.ప్రపంచంలో ప్రతిలక్ష మందికి 698 మందిని జైళ్లలో కుక్కిన అపర స్వేచ్ఛా దేశమది. గురివింద గింజ తన కింది నలుపెరగదన్నట్లుగా అమెరికా మీడియా ఇతర దేశాల గురించి వేలెత్తి చూపుతుంది. ప్రపంచ మానవ హక్కుల దినం రోజునే క్యూబా ప్రభుత్వం అరెస్టులు కొంత మందిని అరెస్టు చేసిందట. ఒకవైపు సిరియా, తదితర దేశాల నుంచి బ్రతకు జీవుడా అంటూ వలస వచ్చిన వారిని ఆదుకొనేందుకు నిరాకరిస్తున్న అమెరికా, ఇతర ధనిక దేశాలు క్యూబా నుంచి కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారికి ద్వారాలు బార్లా తెరవటాన్ని బట్టే వాటి నిజస్వరూపం వెల్లడి అవుతోంది.

క్యూబా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అక్కడి నుంచి వచ్చే కమ్యూనిస్టు వ్యతిరేకులకు కోస్టారికా ప్రభుత్వం అక్రమంగా చట్టపరమైన వీసాలు మంజూరు చేస్తోంది. అలాంటి వారిని కమ్యూనిస్టు నాయకుడు డేనియల్‌ ఓర్టేగా అధికారంలో వున్న నికరాగువా ప్రభుత్వం ఈ కుట్రలను గమనించి అలాంటివారిని తన దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది.దాన్ని అమెరికా ఒక సమస్యగా మార్చుతోంది. తమ రాజకీయ వ్యతిరేకులకు ఆశ్రయం ఇచ్చి తమపై దాడి చేయించే పనులను మానుకోవాలని క్యూబా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.