Tags

, , , ,

– జీవీకే ప్రసాద్
నేరాలకు పాల్పడుతున్న బాలలలో పేదరికం, నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకున్న వారే ఎక్కువని ఇటీవల వెల్లడైన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) 2014 గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే నేరం ప్రవృత్తిగా మారి, పదే పదే నేరాలు చేసే బాలల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఒక ఊరట! 2014లో వేర్వేరు నేరాలలో అరెస్టయిన 48,230 బాలలలో వేలం 2,609 మంది మాత్రమే పాత నేరస్థులు. 2013లో వీరిది 9.2 శాతం కాగా, 2014లో 5.4 శాతానికి తగ్గింది. తాజా గణాంకాల నేపథ్యంలో రేప్, హత్య వంటి క్రూర నేరాలకు పాల్పడే బాలల వయస్సు పరిమితిని తగ్గించే ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకం కానున్నది. ‘పదే పదే నేరాలు చేసే బాలల సంఖ్యలో తగ్గుదల ఉందని చూపుతున్న ఈ గణాంకాలు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదిస్తున్న చట్ట సవరణ అనవసరమనే చాటి చెబుతున్నాయి’ అని బాలల హక్కుల కోసం పని చేసే హెచ్ఎూ్య అనే సంస్థకు చెందిన భారతీ అలీ అన్నారు.
అయితే, నిరుపేద కుటుంబాల బాలలు నేరాల బాట పడుతుండడం అన్నింటికన్నా బాధాకరమైన అంశం. మొత్తం బాల నేరస్థుల్లో 55.6 శాతం రూ. 25,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం గల కుటుంబాలకు చెందిన వారే. అంటే సగటున నలుగురు సభ్యులున్న ఈ కుటుంబాలు రోజుకు రూ. 70 కన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడ్చేవన్న మాట! 2014లో పట్టుబడ్డ బాల నేరస్థుల్లో 53 శాతం 5వ తరగతి లేదా అంతకన్నా తక్కువ చదువుకున్న వారే. వీరిలో సగం మంది ఐదవ తరగతి లోకి అడుగిడకుండానే స్కూలు మానేశారు. 36.6 శాతం బాలలు ప్రైమరీ కన్నా ఎక్కువ, పదవ తరగతి లోపు చదువుకున్న వారు. వీరెవరూ మోడీ ప్రభుత్వం చెబుతున్న ‘స్కిల్ ఇండియా’ శ్రేణిలోకి కూడా రారు. ఎందుకంటే ఈ పథకంలో కనీస విద్యార్హత పదవ తరగతి. పేదరికం, నిరక్షరాస్యతలు బాలలను నేరాల వైపు నెట్టివేస్తున్నాయనడానికి ఈ గణాంకాలకు మించిన సాక్షం మరొకటి అక్కర లేదు. వీటిపై దృష్టి ంద్రీకరించడానికి బదులు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాల నేరాల చట్టంలో సవరణ తేవడం ద్వారా జరిగేది బాలల హక్కుల హననమేనని విశ్లేషకుల అభిప్రాయం.
బాలన్యాయ చట్టంలో మార్పు నేపథ్యం
2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత బాల నేరస్థులకు సంబంధించిన చట్టాలపై చర్చ మొదలైంది. ఈ దారుణ సంఘటనలో నిందితులుగా ఉన్న వారిలో ఒక వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలకన్నా కొద్ది నెలలు తక్కువ. దీనితో అతనిపై బాల న్యాయస్థానంలో విచారణ చేపట్టారు. అతడిపై వయోజనులను విచారించే కోర్టులో విచారణ జరపాలని కోరుతూ, బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి 2013 జులైలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సుప్రీంకోర్టు దీనికి స్పందిస్తూ, తీర్పును ఆపాలని జువెనైల్ కోర్టు (బాల నేరస్థుల్ని విచారించే కోర్టు)ను కోరింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతిపై కోర్టు అతడికి సంస్కరణ గృహంలో 3 ఏళ్ల శిక్ష విధించింది. దీని పట్ల బాధితురాలి తల్లి తీవ్ర నిరసన తెలిపారు. అతడికి తగిన శిక్ష విధించకపోవడం ద్వారా టీనేజర్లకు ఇలాంటి నేరాలు చేసేలా ప్రోత్సహించినట్టే అయ్యిందని ఆమె ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ పూనికతో 2014 జులైలో ఒక బిల్లు తయారైంది. 16-18 ఏళ్ల మధ్య వయసు గల బాలలు రేప్, హత్య వంటి ూర నేరాలకు పాల్పడినట్టయితే, వారిని వయోజనుల్ని విచారించే న్యాయస్థానాల్లో విచారించే విధంగా 2000 నాటి ప్రస్తుత బాల నేరస్థుల చట్టంలో సవరణ చేయడం కోసం ఈ బిల్లు రూపొందింది.
సవరణల సారం
క్రూరమైన నేరం జరిగితే, ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తి వయసు 16-18 ఏళ్ల మధ్య ఉంటే, ఆ వ్యక్తి ‘బాలుడా’ లేక ‘వయోజనుడా’ అని పరిశీలించేందుకు బాల న్యాయ మండలి ఉంటుంది. ఈ మండలిలో మనస్తత్వవేత్తలు, సామాజిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. నేరం చేసింది ‘బాలుడా’ లేక ‘వయోజనుడా’ అనే దాని ఆధారంగానే ఏ కోర్టులో విచారణ జరిపించాలో వారు నిర్ణయిస్తారు. ఇలా రెండు దశల్లో నిర్ధారణ, విచారణ ప్రక్రియను చేపట్టడం ద్వారా బాలల హక్కులను పరిరక్షించగలుగుతామని మహిళా, శిశు అభివృద్ధి శాఖ అభిప్రాయపడింది. అట్లాగే, మహిళలపై క్రూర నేరాలకు పాల్పడకుండా నిరోధించడం వీలవుతుందని ప్రభుత్వం అభిప్రాయం. ఇంకా ఈ బిల్లులో పిల్లలను దత్తత తీసుకోవడానికి సంబంధించిన పలు సవరణలు కూడా ఉన్నాయి.
లోక్‌సభ ఆమోదం
ప్రభుత్వం ఈ బిల్లును 2014 అగస్టలోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత, బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించారు. స్టాండింగ్ కమిటీ చట్టపరంగా బాలల వయసు పరిమితిని 18 సంవత్సరాలుగానే ఉంచాలని సిఫారసు చేసింది. కానీ కమిటీ అభిప్రాయాన్ని పక్కన పెడుతూ ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ూర నేరాలకు పాల్పడే 16-18 సంవత్సరాల వయస్సు గ్రూపు వారు, 21 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత పట్టుబడితే వారిపై వయోజనుల కోర్టులోనే విచారణ జరిపిస్తారు. ఈ బిల్లుకు మే 7న లోక్సభ ఆమోదం లభించింది. జువైనల్ చట్ట సవరణల బిల్లుకు రాజ్యసభలో 22న ఆమోదం లభించింది.. బాల న్యాయం (పిల్లల సంరక్షణ, రక్షణ) బిల్లు, 2014గా పిలుస్తున్న ఈ చట్టంలో స్వల్ప, తీవ్ర, క్రూర నేరాలకు స్పష్టమైన నిర్వచనాలిస్తూ, వాటిని వర్గీకరించారు. అట్లాగే వేర్వేరు నేరాల శ్రేణులలో అనుసరించే ప్రక్రియలలో తేడాలను కూడా నిర్వచించారు.
గోరంతలు కొండంతలుగా…
ఇందులో నేరం చేసిన వారిని సంస్కరణ, పునరావాసం ద్వారా మార్చాలనే విధానానికి బదులు వారిపై ప్రతీకారం తీర్చుకొనే భావన ప్రబలంగా ఉందని విమర్శకులు అంటున్నారు. 2012 ఢిల్లీ గ్యాంగ్రేప్ దరిమిలా వెల్లువెత్తిన ‘గుంపు’ (మూక) మనస్తత్వపు ఉదారరహిత ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ బిల్లు రూపొందింది. 16-18 ఏళ్ల వయసు బాలలు రేప్ వంటి క్రూర నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారనేది మరో బలమైన అభిప్రాయం కూడా దీనికి నేపథ్యంగా పని చేసింది. కానీ, 16-18 ఏళ్ల బాల నేరస్థులలో 3.4 శాతం మందిపై మాత్రమే రేప్ కేసులున్నాయని ఎన్సిఆర్బి గణాంకాలు చెబుతున్నాయి. నమోదైన ఎఫ్ఐఆర్లే ఈ గణాంకాలకు ఆధారం అనేది గమనార్హం. ప్రేమ వ్యవహారాల్లో టీనేజర్లు అమ్మాయిలతో పారిపోయిన సందర్భాల్లో కూడా రేప్, కిడ్నాప్ వంటి సుేలు నమోదు చేస్తారని తెలిసిందే. కాబట్టి టీనేజర్లు అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నారనే అవగాహనలో అపోహ పాలే ఎక్కువ. ఇక, మరో అంశం పరిపక్వతకు సంబంధించినది. క్రూర నేరాలకు పాల్పడ్డారంటేనే మానసికంగా వారు వయోజన నేరస్థుల స్థాయిలో ఉన్నారని, క్రూరమైన నేరమే వారి పరిపక్వతకు నిదర్శనమని ఈ బిల్లు సమర్థకులు వాదిస్తున్నారు. కానీ కిషోరప్రాయంలో ఎంతకైనా తెగించగల మనస్తత్వం ఎక్కువ ఉంటుందని ఇటీవల టిఐఎస్ఎస్ చేసిన మెదడు సంబంధిత అధ్యయనంలో వెల్లడైంది. పథకరచన, తర్కబద్ధత, ఆవేశాన్ని నియంత్రించుకోవడం వంటి కార్యకలాపాలకు మూలమైన మెదడులోని ముందు భాగం 25 ఏళ్ల తర్వాతే వృద్ధి చెందుతుందని న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు.
బాలల హక్కుల హననం
ఈ బిల్లు 18 ఏళ్ల లోపు పిల్లలందరినీ సమంగా చూడాలని చెప్పే బాలల హక్కుల యుఎన్ సదస్సు తీర్మానాలకు ఉల్లంఘన అవుతుంది. సమానత్వ హక్కుకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు కూడా ఇది ఆ మేరకు ఉల్లంఘనే అవుతుంది. అంతకన్నా ముఖ్యమైనది, నేరం చేసిన వ్యక్తి 21 ఏళ్ల తర్వాత పట్టు బడినప్పుడే సమాన నేరానికి హెచ్చు శిక్ష విధించాలని చెప్పే ఆర్టికల్ 20(1)కు కూడా ఇది భిన్నమే అవుతుంది. ఇంకా కొన్ని సాంతిేకపరమైన ఇబ్బందులు కూడా ఇందులో ఇమిడి వున్నాయి. క్రూరమైన నేరం చేయడానికి కొందరు బాలలలో మానసిక పరిపక్వత నిజంగానే ఉండొచ్చు. కానీ దానిని నిరూపించే మనస్తత్వశాస్త్ర పరీక్షలు పూర్తిగా ఏకపక్షంగా, నిర్హేతుకంగా ఉంటాయి. కొందరు తెలివైన బాల నేరగాళ్లు ఈ పరీక్షల్లో అమాయకులుగా రుజువు కావచ్చు. కొందరు అమాయకులు పొరపాటుగా పరిపక్వత గలవారిగా రుజువు కావచ్చు. ఈ చట్టం వల్ల నేరాలు తగ్గుతాయనేది ప్రభుత్వం చేసే మరో వాదన. నిజానికి ఇది అమెరికాకు కార్బన్ కాపీనే. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇది ప్రభావయుతమైన నేర నిరోధకంగా పని చేయలేదని రుజువైంది. అక్కడ జైళ్లను మూసేసి బాల ఖైదీలకు సముదాయ ఆధారిత చికిత్స అందించే కార్యక్రమాల వైపు ఆలోచిస్తున్నారు. అన్నింటికన్నా కీలకమైంది, ప్రారంభంలోనే చెప్పినట్టుగా బాలలను నేరమయం చేస్తున్న పరిస్థితులను మార్చడం. కానీ మోడీ ప్రభుత్వం బాలల సంక్షేమం కోసం కేటాయించింది వేలం రూ. 633 కోట్లు. ఇది మొత్తం కేటాయింపులో 0.8 శాతం మాత్రమే!