Tags

, , , , ,

 

ఆఫ్రో అమెరికన్ల పట్ల పెరుగుతున్న సానుకూలత

మారుతున్న ప్రపంచం-5

పీటర్‌ బెయినార్ట్‌

అధికారానికి వచ్చిన తమ వాడు బరాక్‌ ఒబామా (స్వతంత్ర అమెరికా చరిత్రలో ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ అధికారానికి రావటం ఒబామాతోనే ప్రారంభమైంది) తమకు రక్షణ ఇవ్వలేకపోయాడే అన్న ఆవేదనలోంచి పుట్టి ప్రత్యక్ష పోరాటానికి పురికొల్పింది తాజాగా అమెరికాలో జరుగుతున్న నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమం. ఒబామా వైఫల్యాల నుంచి పుట్టిందే ఈ వుద్యమం అని కార్నెల్‌ సామాజికవేత్త ట్రావిస్‌ గోసా అన్నారు. 1992లాస్‌ ఏంజల్స్‌ దహనకాండ తరువాత తెల్లవారిపై దాడిచేసిన నల్లజాతీయుల గురించి ఒకరు ప్రశ్న అడిగినందుకు నాడు అధ్యక్షుడిగా వున్న బిల్‌క్లింటన్‌ ఒక మహిళపై ఆగ్రహంతో విమర్శలు చేశారు.ఆఫ్రికన్‌ అమెరికన్ల నిరసన వృధా అన్నట్లుగా మాట్లాడారు. ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ నాయకులు దానికి భిన్నంగా వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమాన్ని హర్షించినట్లుగానే నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమంపై స్పందిస్తున్నారు. గతేడాది జూలైలో ఫోనిక్స్‌లో జరిగిన నెట్‌ రూట్స్‌ నేషన్‌ సభలో నల్లజాతి జీవిత సమస్య వుద్యమ కార్యకర్త వేదికపైకి ఎక్కి ఆటంకం కలిగించాడు.డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీలో వున్న శాండర్స్‌, మార్టిన్‌ ఓమల్లేని అపహాస్యం చేశాడు. పావుగంటసేపు ఓమల్లేని మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. తరువాత పార్టీలో వుదారవాదులుగా వున్న వారు వుద్యమ కార్యకర్తల పట్ల మరింత సానుభూతి చూపలేదని అభ్యర్ధులపై విమర్శలు చేశారు. ఆ విమర్శలను వారు అంగీకరించటమే కాదు, అదే రోజు ఓమల్లే బహిరంగంగా క్షమాపణ చెప్పాడు, శాండర్స్‌ కూడా అదే పని చేశాడు. తన పత్రికా కార్యదర్శిగా ఓ నల్లజాతీయుడిని నియమించాడు.తన వెబ్‌సైట్‌లో జాతి న్యాయం పేరుతో ఒక విభాగాన్ని ప్రారంభించాడు, ప్రయివేటు జైళ్ళను నిషేధించాలని కోరే బృందంలో చేరటమే కాదు, నల్లజాతీయులను కాల్చి చంపిన పోలీసుల పేర్లను బహిరంగంగా ప్రస్తావించటం ప్రారంభించాడు. 1990 దశకంలో జనాన్ని సామూహికంగా జైళ్లపాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించటంలో తన భర్త బిల్‌క్లింటన్‌, ఇతర డెమోక్రాట్లు కూడా తమ వంతు మద్దతు ఇచ్చారని దానికి స్వస్తిపలకాలని తాను ఇప్పుడు కోరుతున్నానని హిల్లరీ క్లింటన్‌ నల్లజాతీయుల పట్ల సానుభూతి వచనాలు పలికారు. నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమకార్యకర్తలతో రెండు సార్లు సమావేశమైన బిల్‌క్లింటన్‌ జనాన్ని సామూహికంగా జైలు పాలు చేసే కార్యక్రమాన్ని విస్తరించటంలో తన వంతు పాత్ర పట్ల విచారం వ్యక్తం చేశాడు. డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కౌన్సిల్‌ ఈ వుద్యమానికి మద్దతు పలుకుతూ ఒక తీర్మానం చేసింది.ఇది హిల్లరీ క్లింటన్‌ లేదా డెమోక్రటిక్‌ పార్టీ వామపక్షం వైపు మొగ్గటం కాదా? ఆ బాటలో నడిచేందుకు అమెరికా జన సమ్మతి ఇది.

1960 దశకంలో ఆఫ్రికన్‌ అమెరికన్ల ఆందోళన సమయంలో నాడు అధ్యక్షుడిగా వున్న లిండన్‌ బి జాన్సన్‌ పౌర హక్కుల గురించి మరీ దూకుడుగా పోతున్నారని దక్షిణాదేతర రాష్ట్రాల తెల్లజాతీయులు 28శాతం మంది అభిప్రాయం పడ్డారు.తరువాత 1966లో లాస్‌ఏంజల్స్‌, చికాగో, క్లీవ్‌లాండ్‌ వంటి చోట్ల ఘర్షణలు జరిగిన తరువాత అలాంటి వారు 52శాతానికి పెరిగారు. ప్రస్తుతం పరిస్ధితి దానికి భిన్నంగా జరుగుతోంది. పూ పరిశోధనా సంస్ధ 2014జూలైలో ప్రకటించిన ఒక నివేదికలో ‘తెల్లజాతీయులతో సమంగా నల్లజాతీయులకు కూడా హక్కులు ఇచ్చేందుకు మార్పులను కొనసాగించాలన్న అభిప్రాయాన్ని 46 శాతం మంది సమర్ధించినట్లు తెలిపింది, ఫెర్గూసన్‌, బాల్టిమోర్‌లలో ఆందోళనల తరువాత 2015 జూలైలో వారి శాతం 59కి పెరిగింది. నల్లజాతీయుల పట్ల అనుసరిస్తున్న పద్దతుల పట్ల తాము సంతృప్తి చెందుతున్నట్లు ప్రకటించినవారు 2013 వేసవి నుంచి 2015 మధ్య 62 నుంచి 49శాతానికి పడిపోయినట్లు గాలప్‌ పోల్‌ తెలిపింది. పోలీసుల పట్ల గత 22 సంవత్సరాలలో ఇంతగా విశ్వాసం ఇంతగా దిగజారిపోవటం ఇదే ప్రధమం.పోలీసుల చేతుల్లో నల్లజాతీయుల హత్యలు చెదురు మదురు ఘటనలు మాత్రమే అని భావించే తెల్లవారిలో మార్పు వచ్చింది. హమైఖేల్‌ బ్రౌన్‌, ఫ్రెడ్డీ గ్రే వంటి వారి హత్యల తరువాత గతేడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య అలాంటి వారు 20శాతం తగ్గారని యు గౌ పోల్‌ తెలిపింది.నల్ల జాతీయులు కూడా పెరిగేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరే రిపబ్లికన్లు 15శాతం పెరిగారు. అయితే ఇప్పటికీ కొందరు రిపబ్లికన్లు సంస్కరణలు తేవాలని డెమోక్రాట్లతో గొంతు కలుపుతున్నారు. వారిలో పార్లమెంట్‌ స్పీకర్‌ జాన్‌ బోయెనెర్‌ ఒకరు. కొన్ని నేరాలకు శిక్షలు నామమాత్రంగా వుండాలని, తరుణ వయస్కులను నేరస్ధ రికార్డుల నుంచి తొలగించాలని, బాలలను ఒంటరి గదులలో వేయరాదని కొందరు రిపబ్లికన్లు ఒక చట్ట సవరణ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. రిపబ్లికన్‌ పార్టీ నేతలలో వచ్చిన మార్పు అత్యంత ఆసక్తికరంగా వుంది. నెనెటర్‌ మార్కో రుబియో ఆగస్టు నెలలో ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌లో నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమంపై యాంకర్‌ అడిగిన అంశంపై వుద్యమాన్ని ఖండించటానికి బదులు ఆఫ్రికన్‌ అమెరికన్‌ అయిన తన స్నేహితుడికి ఎదురైన ఒక అనుభవాన్ని వివరించాడు. అతనిపై ఎలాంటి చట్టవుల్లంఘనలకు పాల్పడనప్పటికీ గడచిన పద్దెనిమిది నెలల కాలంలో ఎనిమిది తొమ్మిది సార్లు పోలీసులు అటకాయించారని మన దేశం ఎదుర్కోవాల్సిన సమస్య ఇదని చెప్పాడు.ప్రభుత్వం జనాన్ని జైళ్లకు పంపకుండా చూసేందుకు మార్గాలు వెతకాలని సూచించాడు. 1990దశకంలో చివరిక ఒబామా తొలి రోజులలో కూడా మితవాద రిపబ్లికన్లు ఈ మాదిరి మాట్లాడలేదు. 1960 దశకంలో మాదరి జాతి వివక్ష , న్యాయ అంశంపై చర్చ తిరోగమన వాదం వైపు గాక పురోగమనం వైపు వుంది.

దశాబ్దక్రితం స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను బహిరంగంగా సమర్ధించటం అంటే ఆత్మహత్యా సదృశ్యంగా డెమాక్రాట్లు భావించేవారు. ఇప్పుడు ఆ చర్చ పెద్దగా లేదు. అమెరికన్లలో పెద్ద మార్పు వచ్చింది. ఈ కారణంగానే రిపబ్లికన్లు 2016ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్లు ఆడామగా కాని వారి హక్కులను వ్యతిరేకించటంలో పెద్ద ఆసక్తి చూపటం లేదు. వారిని సైన్యంలో చేర్చుకొనేందుకు కూడా రక్షణశాఖ నిర్ణయించింది.

ప్రజాభిప్రాయం సేకరణ ఓటింగ్‌ ప్రకారం అమెరికాలో పాలన జరగదు, సామాన్యుల అభిప్రాయాలు రాజకీయనేతల వరకు చేరేందుకు అనేక ఆటంకాలు వుంటాయి, సాధారణంగా మితవాదులదే అధికారం, అందువలన ఇలాంటి సమస్యల గురించి ఎంత చెప్పుకుంటే ప్రయోజనం ఏమిటి అని ఎవరైనా ప్ర శ్నించవచ్చు. వ్యవస్ధాగతమైన అననుకూలతలు వున్నప్పటికీ తన కంటే ముందు పని చేసిన ఇద్దరు డెమోక్రటిక్‌ అధ్యక్షుల కంటే మరింత పురోగమనదాయకమైన అజెండాను అమలు జరిపాడు. అందువలన అతడు లేక ఆమె ఎవరు ఎన్నికైనప్పటికీ గతం కంటే పురోగామిగా వుంటారని నమ్మేందుకు కారణాలు వున్నాయి. మైక్రోసాప్ట్‌ బెట్టింగ్‌ మార్కెట్‌ ప్రిడిక్ట్‌వైజ్‌ ప్రకారం 2016 ఎన్నికలలో డెమోక్రాట్లు అధికారానికి వచ్చేందుకు 60శాతం అవకాశాలు వున్నాయి. అది హిల్లరీ క్లింటన్‌ కారణంగా కాదు, ఎందుకంటే డెమోక్రటిక్‌ పార్టీలోఆమె అత్యంత బలమైన వారు కనుక చివరికి అభ్యర్ధి కావటం దాదాపు ఖాయం, అలాగే రిపబ్లికన్‌ పార్టీలో అత్యంత బలహీనమైన అభ్యర్ధిని నిలపవచ్చు. ప్రస్తుతం పోటీలో వున్న ఎవరు అభ్యర్ధి అయినా హిల్లరీ క్లింటన్‌ను విజయం వరించటం ఖాయంగా కనిపిస్తోంది.ఆమె విజయం సాధిస్తే దేశీయంగా ఒబామా వదలిపోయిన విధానాలను కొనసాగిస్తారు. వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ, నల్లజాతీయుల జీవిత సమస్య వంటి బలమైన వామపక్ష వుద్యమాలు లేని కారణంగా విదేశాంగ విధానంలో వేరుగా వుంటాయి. ఆమె ఇప్పటికే వామపక్ష దిశగా తన ప్రచారం వుండబోతున్న సూచనలు ఇచ్చారు. హిల్లరీ గెలిస్తే ఒబామా విధానాలు కొనసాగించినట్లుగానే రిపబ్లికన్లు గెలిస్తే జార్జి డబ్ల్యు బుష్‌ వదలి వెళ్లిన విధానాలను కొనసాగిస్తారు. 2000 సంవత్సర ఎన్నికలలో చాలా కొద్ది మంది మాత్రమే మిలీనియం యువతరం ఓట్లు వేయగలగారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఓట్లు వేసే వారిలో మూడోవంతు మంది వుంటారు. పదహారు సంవత్సరాల నాడు ఆఫ్రికన్‌ అమెరికన్లు, హిస్పానిక్స్‌, ఆసియన్లు ఓటర్లలో 20శాతం వుండగా ఇప్పుడు 30శాతం పైగా వున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్ధి గెలవాలంటే శ్వేతజాతీయుల ఓట్లలో 60శాతం తెచ్చుకున్నప్పటికీ మైనారిటీ ఓట్లు 30శాతం తెచ్చుకోవటం అవసరం అని ఆ పార్టీ నియమించిన కన్సల్టెంట్స్‌ చెబుతున్నారు. విజయం సాధించాలంటే వామపక్షం వైపు మొగ్గు చూపుతున్న యువతరం, మైనారిటీల ఓట్లు కీలకం.