సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని దేవాయాలను అభివృద్ది బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవాలయాలకు సంబందించిన అన్నీ సమస్యలను తీర్చేందుకు టోల్ ఫ్రీ నెంబరును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. టోల్ ఫ్రీ నెం 18004256656 కు ఫోన్ చేసి భక్తులు తమ సమస్యలను తీర్చుకోవచ్చని తెలిపారు. బయోమెట్రిక్ ద్వారా,ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు దేవాలయాల వివరాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
దేవాలయాల్లో విద్యుత్ సౌకర్యాలను సోలార్ సిస్టమ్ ద్వార మెరుగు పరచెందుకు 10 మెగావాట్ల సౌకర్యంతో విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు తొందరలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే తక్కువ ధరకోడ్ చేసి టెండర్లు తక్కించు కొంటారో వారికే భాధ్యతలు అప్పచెబుతామని ఆయన వివరించారు.
ఉగాది నుంచి దేవాదాయ శాఖకు సంబందించి అన్నీ దేవాలయాల్లో భూముల వివరాల పట్టికను ప్రదర్శిస్తామని అందులో కోర్టు వ్యవహారాలకు సంబందించిన భూములు, ఆక్రమిత భూములు, కోర్టు వ్యవహారాలకు సంబందించిన భూముల వివరాలు ఉంటాయని మంత్రి తెలిపారు.
భక్తుని చెంతకే భగవంతుని ఆశీస్సుల పేరుతో ఏడు కార్యక్రమాలకు నాంది పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా బిడ్డ జన్మిస్తే వారి ఇంటి వద్దకు పూజా సామాగ్రితో ఆశీర్వాదనల ఏర్పాటు, నామకరనం,అన్న ప్రాసన, వివాహ అనంతరం జంటలను ఆశీర్వదించే కార్యక్రం,శీమంతం కార్యక్రమంలో అమ్మవారి కుంకుమ,గాజులు, వస్త్రాలు అందించడం,,అక్షరాభ్యాసం పేరుతో పలక,బలపంఅందిచడం,మరణ అనంతరం చేసే కార్యక్రమం తదితర విషయాల్లో సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణా పుష్కరాలను ఘనంగా చేపట్టేందుకు కృష్ణా , గుంటూరు,కర్నూల్ జిల్లాలలో 326 దేవాలయాలను గుర్తించి నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ దేవాలయాల వద్ద ఘాట్లన నిర్మించేందుకు రూ. 27 కోట్ల బడ్జెట్ కేటాయించి నట్లు తెలిపారు. కొత్తగా 172 ఘాట్లను కూడా గుర్తించి నట్లు పేర్కొన్నారు.ఆగఘ్ట 12 నుంచి 23 వరకు పుష్కరాల కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలోదేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్వీ ప్రసాదు,కమీషనర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.