మహేంద్ర హిల్స్ సికేంద్రాబాద్ లోని మాతా అమృత నందమై కి సంబంధించిన అమృత విద్యాలయం(సి.బి.యస్.సి)అత్యదిక ఫీజులు వసూలు చేస్తూ, సరియైనబోధకులను పెట్టకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారని విద్య ప్రమాణాలు పాటించడం లేదని సోషల్ అండ్ ఆర్ టి ఐ గ్రూప్స్ కాన్ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ నాగిళ్ళ శ్రీనివాస్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కు పిర్యాదు చేశారు. కాని ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా నాగిళ్ళ శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు పైన ఏమి చర్యలు తీసుకున్నారని సమాచారం కోసం ప్రజా సమాచార అధికారి డిప్యూటి డైరెక్టర్ ఆఫ్స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అడుగగా వారు పిర్యాదు పత్రాన్ని జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి హైదరాబాద్ గారికి దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వమని ఒక్క లేఖపంపిస్తూ నాగిళ్ళ శ్రీనివాస్ గారికి తెలియచేశారు. అయినా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉంటె నాగిళ్ళ శ్రీనివాస్ గారు అప్పుడు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి అప్పీలు చేశారు. అప్పుడు స్పందించిన అధికారి (సి.బి.యస్.సి)విద్యాలయం నా పరిధిలోకి రాదూ ఇది (సి.బి.యస్.సి)డిల్లి కి సంబంధించిన సమాచారం అని మీరు (సి.బి.యస్.సి)డిల్లిగారిని సంప్రదించాలని నాగిళ్ళ శ్రీనివాస్ గారికి లేఖ పంపించారు. దానికి రాష్ట్ర సమాచార కమిషనర్ గారికి రెండవ అప్పీలు చేశారు. అప్పుడు సంబంధిత ప్రజా సమాచారఅధికారి గారిని మరియు డి ఈ ఓ సోమిరెడ్డి హైదరాబాద్ గారిని రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో హజారు కావాలని నోటిసులు జారి చేశారు. గౌరవ రాష్ట్ర సమాచార కమిషనర్ఇంత్యాజ్ అహ్మద్ ఇచ్చిన నోటీసులను లెక్క చేయకుండా కావాలనే ప్రజా సమాచార అధికారి మరియు డి.ఈ.ఓ సోమిరెడ్డి హాజరు కాలేదు. అప్పుడు నాగిళ్ళ శ్రీనివాస్ గారియొక్క పత్రాలను పరిశీలించి సంబంధిత (సి.బి.యస్.సి)విద్యాలయం డి.ఈ.ఓ సోమిరెడ్డి గారి పరిధిలోనే ఉంటుంది కావాలనే దురుద్దేశంతో సమాచారం ఇవ్వటం లేదని ఇద్దరుఅధికారులకు షోకాజ్ నోటిసులు జారి చేస్తూ 10 రోజులలో సమాచారం ఇవ్వమని ఆదేశాలు జారి చేశారు.
ప్రైవేటు పాఠ శాలల యాజమాన్యాలతో కుమ్మక్కు
30 Saturday Jan 2016
Posted Current Affairs, Education, INDIA
in