Tags

, , , , ,

హెరాల్డ్‌ మేయర్స్‌న్‌

    అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సోషలిజం ఎందుకు లేదు అనే శీర్షికతో 1906లో జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోంబార్ట్‌ ఒక వ్యాసం రాశారు. పెద్ద పారిశ్రామిక దేశాలలో అమెరికాలోనే ఎందుకు పెద్ద సోషలిస్టు వుద్యమాలు అభివృద్ధి కాలేదు అనే అంశాన్ని వివరించేందుకు ప్రయత్నించారు. ఈరోజు మనం భిన్నమైన ప్రశ్నను వేయాల్సి వుంది. అదేమంటే అమెరికాలో సోషలిస్టులు ఎలా వచ్చారు ? ఈ దేశంలో చాలా కాలం నుంచి సోషలిజం పిలుపుకు ప్రతిఘటన వుంది.ఈ రోజు ఆకస్మికంగా తమను తాము సోషలిస్టులుగా ప్రకటించుకుంటున్న వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ? వారి దృష్టిలో సోషలిజం అంటే ఏమిటి ?

    స్వయంగా తాను డెమోక్రటిక్‌ సోషలిస్టును అని ప్రకటించుకున్న ఒక అభ్యర్ధికి అనేక మంది డెమోక్రాట్లు ఓట్లు వేసేందుకు సిద్దపడటాన్ని బెర్నీ శాండర్స్‌ అధ్యక్ష అభ్యర్ది ప్రచారం స్పష్టం చేసింది. కానీ అంతకంటే ఎక్కువగా నాటకీయంగా మరియు పర్యవసానాల కారణంగా ఇంకా ఎక్కువ మంది తాము సోషలిస్టులమని స్వయంగా చెబుతున్నారు. లోవా రాష్ట్ర సమావేశాల సందర్బంగా జరిగిన ఒక సర్వేలో దానికి హాజరు కావాలని నిర్ణయించుకున్న డెమోక్రాట్స్‌లో 40శాతం మంది తాము సోషలిస్టుల మని చెప్పారు. న్యూ హాంప్‌షైర్‌ ప్రాధమిక సమావేశాల సందర్భంగా బోస్టన్‌ గ్లోబ్‌ సర్వేలో 31శాతం మంది న్యూహాంప్‌షైర్‌ డెమోక్రాట్‌ ఓటర్లు తాము సోషలిస్టులమని, ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఓటర్లలో సగానికిపైగా చెప్పారు. ఫిబ్రవరి చివరలో సౌత్‌ కరోలినా సమావేశాల సందర్బంగా తాము సోషలిస్టులమని 39శాతం మంది డెమోక్రాట్స్‌ చెప్పారు.

   సోషలిజానికి అనుకూలమైన అభిప్రాయాలు శాండర్స్‌ మద్దతుదార్లకే పరిమితం కాలేదు. సౌత్‌ కరోలినా రాష్ట్రంలో అయనకు వాస్తవంగా ఓటు వేసిన వారికంటే 13శాతం ఎక్కువగా సోషలిస్టులమని చెప్పారు. నవంబరులో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చేసిన సర్వేలో 52శాతం మంది హిల్లరీ క్లింటన్‌ అభిమానులతో సహా 56శాతం డెమోక్రాట్స్‌ సోషలిజానికి అనుకూలం అని వెల్లడించారు. శాండర్స్‌ అభ్యర్ధిత్వమే వారిని సోషలిజం వైపుకు లాగలేదు. 2011లోనే ప్యూ సర్వే 30 సంవత్సరాల లోపు అమెరికన్లు (కేవలం డెమోక్రాట్లే కాదు) 49శాతం మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరితో, కేవలం 47శాతం మందే పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా వున్నట్లు వెల్లడించింది. బెర్నీ శాండర్స్‌ యువతరాన్ని సోషలిజం వైపు నెట్టలేదు, అప్పటికే అక్కడ వున్నారు.

    నిజానికి సర్వేలలో కనిపిస్తున్న వర్తమాన సోషలిజంవైపు మొగ్గు తొంభైతొమ్మిది శాతాన్ని ఫణంగా పెట్టి ఒక శాతం మంది లబ్దిపొందుతున్నారనే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం సందేశంలోనే ఎక్కువ మంది అమెరికన్లు ఆవైపు వున్నట్లు ముందే చెప్పింది. ఇరవై ఒకటవ శతాబ్దంలో పెట్టుబడి అనే థామస్‌ పికెట్టీ గ్రంధం అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలోకి ఎదగటం, కనీస వేతనం 15 డాలర్లు (గంటకు) వుండాలనే పోరాటం నగరాలు, రాష్ట్రాలను కదిలించటంలో విజయవంతం కావటంలోనే అది కనిపించింది.

    నూతన అమెరికన్‌ సోషలిజం సారాంశం ఏమిటి ? తమను తాము సోషలిస్టులుగా వర్ణించుకున్న కొత్తగా పొదిగిన ఈ పిల్లలను దాని అర్ధం ఏమిటని ఏ ఒక్క సర్వే అడగలేని నాకు తెలుసు, అయితే మనం జ్ఞాన సంబంధంగా కొన్నింటిని వూహించుకోవచ్చు. తొలుత వారు సోషలిజాన్ని తీవ్ర వుదారవాదానికి పోటీగా ముందుకు తేలేదు. ఎవరైతే సోషలిస్టులుగా గుర్తింపును చెప్పుకొనే వారు సంఖ్యా పరంగా పెరిగారో అదే సమయంలో తమను వుదారవాదులుగా చెప్పుకొనే వారు కూడా పెరిగారు. పూ సర్వేలో 2000 సంవత్సరంలో కేవలం 27శాతం మంది డెమోక్రాట్లు మాత్రమే తాము వుదారవాదులమని చెప్పారు, అది 2015 నాటికి 42 శాతానికి పెరిగింది. నూతన తరంలో 2004లో 37శాతం మంది వుంటే నేటికి 49శాతానికి పెరిగారు.దక్షిణ కరోలినా బ్లూమ్‌బెర్గ్‌ సర్వేలో 39శాతం తాము సోషలిస్టుల మని చెప్పుకోగా, 74శాతం మంది తాము పురోగమన వాదులమని, 68శాతం మంది వుదారవాదులమని చెప్పుకున్నారు. ఏదో ఒకదానిని ఎంచుకోవాలనే షరతు ఆ సర్వేలో పెట్టలేదు.

   నిజానికి అమెరికన్లు సోషలిజాన్ని అంగీకరించటంలో ఒక కీలకం ఏమంటే వామపక్షమా-మధ్యేవాదమా ఏదో ఒక రాజకీయ గుర్తింపును తేల్చుకోమని వారిని అడగలేదు. మూడవ ప్రత్యామ్నాయ అభ్యర్దిగా గాక ఒక డెమోక్రాట్‌గా శాండర్స్‌ పోటీ చేయటం ద్వారా నిజమైన అమెరికన్‌ (లేదా కనీసం డెమోక్రటిక్‌)రాజకీయాలలో తమ సామర్ద్యాన్ని కోల్పోకుండానే అభ్యుదయ వాదులు తమను తాము సోషలిస్టులుగా పిలిపించుకొనటాన్ని సాధ్యం చేశాడు.

    నేడు శాండర్స్‌ స్వంత కార్యక్రమాన్ని ఆయన మద్దతుదార్లు కాని ఎక్కువ మంది వుదారవాదులు బలపరచటం లేదు. కేవలం నలుగురు పార్లమెంట్‌ సభ్యులు మాత్రమే ఆయనను బలపరిచారు. అందరికీ ఒకే సంస్ధ చెల్లించే ఆరోగ్యబీమా పధకానికి మాత్రం 60 మంది మద్దతు పలికారు అయితే అది శాండర్స్‌ ముద్ర వున్న ప్రతిపాదన అనుకోండి. గతంలో తమను వుదారవాదులుగా పిలవాలని కోరుకున్నవారిలో మిలియన్ల మంది అమెరికన్లు ఇప్పుడు సోషలిస్టు ముద్రతో ఎందుకు గుర్తింపును కోరుతున్నారు? ఒకటి శాండర్స్‌ ప్రచారం, కొందరిలో సోషలిజం గురించి వున్న అపవాదును తుడిపివేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. సోవియట్‌ కమ్యూనిజం కుప్పకూలటం పశ్చిమ ఐరోపాలోని సోషల్‌ డెమోక్రటిక్‌ దేశాల సోషలిజంతో తమ గుర్తింపును పొందటానికి అమెరికన్‌ యువతను అనుమతించింది. అమెరికాతో పోల్చితే వాటన్నింటిలో ఆర్ధిక అసమానత మరియు దానిని అనుసరించి వుండే కష్టనష్టాలు తక్కువగా వున్నాయి.

    అయితే మిలియన్ల మంది అమెరికన్లు సోషలిస్టు వరుసలో నిలబడటానికి వర్తమాన అమెరికన్‌ పెట్టుబడిదారీ విధానం దాదాపు పూర్తిగా పనిచేయక పోవటమే ప్రధానంగా వారిని కదిలించింది. ఒకసారి క్రమబద్దీకరించబడిన, యూనియన్లలో సంఘటితమైన, 20వ శతాబ్దపు మధ్య కాలంలో పాక్షిక సామాజికమైన పెట్టుబడిదారీ విధానం ప్రతిస్పందించే మధ్య తరగతి మెజారిటీని సృష్టించింది. గత మూడున్నర దశాబ్దాల క్రమబద్దీకరణ ఎత్తివేసిన, యూనియన్లలో సంఘటితం కాని, ద్రవ్య పెట్టుబడిదారీ విధానం రికార్డు స్ధాయిలో అసమానతను పెంచటం, మధ్య తరగతి తగ్గిపోవటం, యువతకు ఆర్ధిక అవకాశాలు(వాటితో పాటు రికార్డు స్ధాయిలో ఆర్ధిక భారాలు పెరగటం) తగ్గిపోయాయి.

     ఆమెరికా ఆకస్మికంగా మిలియన్ల మంది సోషలిస్టులకు నిలయం కావచ్చు, కానీ ఇప్పటికీ దానికి సోషలిస్టు వుద్యమం లేదు, బెర్నీ శాండర్స్‌ ఎన్నికల ప్రచారం అయిపోయిన తరువాత శాండరిస్టులు వుద్యమ నిర్మాణం చేయాల్సి వుంది. బెర్న్‌ భావిస్తున్నట్లుగా దీనిని వ్యక్తులకు మరియు కొన్ని సంస్ధలకే పరిమితం చేస్తే అది స్వయం ఓటమి అవుతుంది.వుదాహరణకు ఈ ఏడాది పోటీలో హిల్లరీ క్లింటన్‌ను బలపరిచిన పురోగామి యూనియన్లు అంతర్గతంగా డెమోక్రటిక్‌ పార్టీలోనే ప్రస్తుతం తీవ్రంగా ఆవిర్బవిస్తున్న సోషల్‌ డెమోక్రటిక్‌ సంస్ధ లేదా సంస్ధలకు మద్దతు పలకటం సంభావ్యంగా కనిపిస్తోంది.

   గొడ్డు మాంస వేపుడు, ఆపిల్‌ వంటకాలతో అమెరికాలో సోషలిస్టు ఊహ కూలిపోయింది అని 1906లో వెర్నర్‌ సాంబార్ట్‌ వ్యాఖ్యానించాడు. పారిశ్రామిక కార్మికులుగా అమెరికాకు వలస వచ్చిన వారికి తాము వదలి వచ్చిన ప్రాంతాలతో పోల్చితే అక్కడి జీవన ప్రమాణాలు ఎంతో ఎక్కువగా వుండటంతో వారికి సోషలిజం అనవసరమైందిగా కనిపించిందని ఆయన చెప్పాడు.సాంబార్ట్‌ చెప్పినదాని ప్రకారం వాస్తవంగా మరియు ఆర్ధిక పరిస్తితులు మెరుగు పడి కష్టానికి తగిన ప్రతిఫలం కీలకంగా వున్న దేశంలో సోషలిజం అవసరం వుండదు.అలాగాక వాస్తవంగా మరియు ఆర్ధిక పరిస్తితులు దిగజారుతూ కేవలం ధనికులకు మాత్రమే ప్రతిఫలం ఇచ్చే దేశం సోషలిజానికి లేదా మరింత సూటిగా చెప్పాలంటే సోషలిస్టులు ఆకస్మికంగా వునికిలోకి రావటం కీలకం అవుతుంది.అందుకే 2016లో అమెరికాలో సోషలిస్టులు మిలియన్ల మంది వున్నారు.

ఈ వ్యాసం తొలుత బ్రిటన్‌ గార్డియన్‌ పత్రికలో ప్రచురితమైంది