Tags
Cold War, communism, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, Soeharto, Sukarno, Western Bloc
అదిస్టి సుకుమా సావిత్రి, జకర్తా పోస్టు కాలమిస్టు
కమ్యూనిస్టు ఇతివృత్తం వున్న సాంస్కృతిక కార్యక్రమాలపై దేశంలో(ఇండోనేషియా) వరుసగా అనేక నిషేధాలు విధించటాన్ని చూస్తుంటే కొంత మందికి ప్రచ్చన్న యుద్ధం అంతమైనట్లుగా కనిపించటం లేదని మనకు గుర్తు చేస్తున్నవి. పశ్చిమ దేశాల కూటమికి చెందిన పాత వ్యక్తులు వుత్సాహవంతులైన తమ మద్దతుదార్లను చూస్తే ఆశ్చర్య పడవచ్చు. వారు ఇస్లాం డిఫెండర్స్ ఫ్రంట్(ఎఫ్‌పిఐ) తప్ప మరొకరు కాదు, అదే బృందం జకర్తాలోని ఇండోనేషియా హోటల్ ట్రాఫిక్ సర్కిల్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బ్యానర్‌తో ఒకసారి ప్రదర్శన చేసింది. బహుత్వ వాదం పట్ల ఏమాత్రం గౌరవం లేకపోవటంలో పేరు మోసిన ఈ బృందపు నిరసనలను ‘కమ్యూనిజం, లెనినిజం, మరియు మార్క్సిజం’ లను నిషేధిస్తూ తమ చర్యలను సమర్ధించుకొనేందుకు ప్రజా సంప్రదింపుల కమిటీ జారీ చేసిన 1966 నాటి ఆదేశాలను ఇప్పటికీ వుపయోగిస్తున్న పోలీసులు సహించారు.
ఒకవైపు ఐఎస్ ప్రపంచానికి ఒక ముప్పుగా పరిణమించటం కనిపిస్తుంటే వామపక్షంగా ఏది కనిపించినా దాని పట్ల శత్రువైఖరిని ప్రదర్శించే ప్రచ్చన్న యుద్ధ బెంగతోనే పోలీసులు వున్నట్లు కనిపిస్తోంది. 1965విషాద వుదంతం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఒకసాకుగా వుండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యుగపు వారసత్వంగా వచ్చిన కమ్యూనిస్టు వ్యతిరేక భావనలను తొలగించుకొనేందుకు ప్రభుత్వం గతకొద్ది సంవత్సరాలుగా అనేక పురోగామి చర్యలు తీసుకున్న పూర్వరంగంలో పోలీసుల వైఖరి అసంగతంగా కనిపిస్తోంది.సుశిలో బాంబాంగ్ యుధ్యోనో ప్రభుత్వం కమ్యూనిజం పుస్తకాలపై నిషేధం తొలగించింది.1965నాటి మిలిటరీ కుట్ర మరియు ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీని అందుకు బాధ్యురాలని నెపం మోపేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఆధారాలను అందచేసిన జూలీ సౌత్ వుడ్ మరియు పాట్రిక్ ఫ్లాంగన్ పుస్తకాలైన ‘చట్టం,ప్రచారం, భయం ‘ వంటి వాటి ఇండోనేషియా అనువాదాలపై నిషేధం ఎత్తివేశారు. వామపక్ష భావజాల ఆలోచన మరియు దేశంలో కమ్యూనిస్టు గతం గురించి తెలియచేసే పుస్తక ప్రచురణలపై ఆసక్తి చూపే వారికి ఆన్లైన్లో (ఇంటర్నెట్లో) నేడు అందుబాటులో వున్నాయి. 1965లో సైనిక జనరల్స్ హత్యలతో నిషేధిత పార్టీ, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా తలెత్తిన భయం మరియు ఆగ్రహం, వాటిపై ప్రభుత్వం ఏమి చెబుతోందో తెలిపే ప్రచార సినిమాలైన పెంగ్‌ఖైనాతన్, ట్రెచరీ వంటి వాటిని సుహార్తో పతనమైన నాటి నుంచి విధిగా చూడనవసరం లేదు. కమ్యూనిజం ఓడించబడింది, మరియు దాని వునికి ఒకవైపున పెట్టుబడిదారీ చక్రాలపై ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న చైనా రాజకీయ వ్యవస్ధకు మాత్రమే సంగతం కావచ్చు.
సమాచార యుగానికి ప్రతి ఘటన వృధా ప్రయాస అని వేరేచెప్పనవసరం లేదు. అటువంటి కార్యకలాపాలను విఫలం చేయాల్సిన అవసరం పోలీసులకు వుందా, ఇంటర్నెట్ మరియు ప్రయివేటు చర్చలద్వారా జనం తమంతట తామే విద్యావంతులు కాగలరు. దేశ చరిత్రలో చీకటి మయమైన భాగాలలో ఒకటైన 1965నాటి సమస్యతో వ్యవహరించటం అంత సులభం కాకపోవచ్చు. తన రాజకీయ పలుకుబడి పడిపోతున్న సమయంలో ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీపై ఆధారపడిన జాతీయ వాది అయిన సుకర్నోను తొలగించాలని కోరుకున్న సుహార్తో ఆ సమయంలో పార్టీ నిషేధానికి ఒక సాకుకోసం సైనిక అధికారులను హత్య చేయించాడు. అధ్యక్షుడు జోకో ‘జోకోవి’ యంత్రాంగం నాటి సామూహిక హత్యాకాండ గురించి సరిదిద్దుకొనే చర్యలు తీసుకుంది, కానీ ఇంతవరకు క్షమాపణకు ముందుకు రాలేదు. జాతీయ మానవ హక్కుల సంస్ధకు ప్రభుత్వం అధికారిక పత్రాలను అందచేసినప్పటికీ సరిగా నమోదు చేయని కారణంగా 1965లో, ఆ తరువాత ఏం జరిగిందనేది సంక్లిష్టమైందని అధికారులు చెప్పారు.ఆ సమయంలో తరుణ ప్రాయంలో వున్న దేశానికి రాజధానిలో తలెత్తిన అల్లకల్లోలం భరింపరానిదిగా వుంది, విబేధాలు దిగువకు విస్తరించిన సమయంలో కమ్యూనిస్టులు అనుకున్నవారిని అంతం చేయటానికి సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ మాత్రమే కాదు, పౌర బృందాలు కూడా భాగస్వాములయ్యాయి.
ప్రముఖ మత పెద్ద, దేశంలో అతి పెద్ద ఇస్లామిక్ సంస్ధ అయిన నహదల్‌తుల్ వుల్మా సంస్ధ(ఎన్యు) మాజీ అధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడైన అబ్దుర్ రహమాన్ ‘గుస్ దుర్’ వాహెద్ కమ్యూనిస్టుల వూచకోతలో తమ సంస్ధ యువకులు పాల్గొన్నందుకు క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో కొత్తగా వుద్బవించిన పాలకులైన న్యూ ఆర్డర్‌కు చెందిన ప్రభుత్వం ఐరోపాలో నాజీ జర్మనీ మాదిరి మారణకాండ జరిపేంత సామర్ధ్యం వున్న బలమైనది కాదు.లేదా రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలపై పూర్తి అదుపు కలిగి రెండవ ప్రపంచ యుద్ధ ఛాంపియన్ల వంటి అగ్రగామిశక్తీ కాదు. ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రవాహంతో పాటు ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఒక చిన్న పడవ కెప్టెన్ వంటిది.
అయినప్పటికీ అటు పశ్చిమ మరియు తూర్పు దేశాలకు ఒక ప్రధాన వర్ధమాన ఆర్ధిక వ్యవస్థ కేంద్రంగా వున్నందున పూర్తిగా అలసిపోయిన ఒక భావజాలానికి భయపడి లొంగిపోయే విధంగా చేయటం గాక తమ పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు మరియు వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకొనేందుకు జనాన్ని ప్రోత్సహించటం ప్రభుత్వానికి మంచిది. 1965 నాటి పరిణామాలపై జనంలో వున్న కుతూహలాన్ని అడ్డుకోకుండా గత న్యూ ఆర్డర్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరితో సమంగా వూచకోతకు సంబంధించి సమగ్రమైన చారిత్రక పరిశోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దేశ గతం గురించి యువతరం తెలుసుకొనే అవకాశం కలిగించేందుకు యుక్తా యుక్త విచక్షణతో కూడిన చరిత్ర తోడ్పడుతుంది. నేరం చేసిన వారిపై తీసుకొనే చట్టబద్దమైన చర్య కంటే ఇది తక్కువ హాని కలిగిస్తుంది. చర్య వివాదాలను దీర్ఘకాలం కొనసాగించటమే గాక జాతి గాయపడటానికి, చిందరవందర కావటానికి కూడా దారితీయ వచ్చు. కమ్యూనిజంతో సహా ఏ భావజాలాన్ని అధ్యయన కేంద్రాలలో నిషేధించకూడదు, ఎందుకంటే నిషేధించటం ద్వారా భయ వారసత్వాన్ని కొనసాగించటమే గాక ప్రభుత్వం సమాజం ప్రగతిని, నిష్కాపట్యాన్ని అడ్డుకుంటున్నది అవుతుంది.పూర్తి గ్రహణశక్తి లేనట్లయితే ఏం జరుగుతుందో తెలియని సమాజం అంతగా తెలియని దానికి కూడా వూరికే భయపడుతుంది, నవప్రవర్తక ఆలోచనలతో ముందుకు పోకుండా ఎల్లవేళలా అనుచరిగా వుండిపోతుంది. అటువంటి సమాజం అది పశ్చిమ దేశాల లేదా అరబ్బుల లేదా చివరికి ఐఎస్ పాటలకు సైతం దేనికైనా నాట్యం చేస్తుంది.