• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: June 2016

ఏమి సెపితిరి ! ఏమి సెపితిరి !! చిన్న మౌన ముని నరేంద్రమోడీ !!!

29 Wednesday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Arnab Goswami, BJP, Modi, Modi’s Interview, Modi’s silence, Prime Minister Narendra Modi, Times Now

ఎం కోటేశ్వరరావు

      పది సంవత్సరాలు అధికారంలో వున్న మన్మోహన్‌ సింగ్‌ పెద్ద మౌన మునిగా బిజెపి తదితరులతో పిలిపించుకున్నారు. కొద్ది వారాల క్రితమే రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చిన్న మౌన ముని నరేంద్రమోడీ తొలిసారిగా ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌తో సంభాషించారు. తాము పూజించే లేదా అభిమానించే బాబాలు, మునులు ఎప్పుడు నోరు తెరుస్తారా మధుర భాషణం ఎప్పుడు విందామా అని ఎదురు చూసే భక్తులు, అభిమానులు ఆ క్షణంలో ఎంత తన్మయులౌతారో మోడీ భక్తుల పరిస్థితి కూడా అలాగే వుండి వుండాలి.

    నరేంద్రమోడీ నోరు తెరవటం ప్రపంచంలోని ఏడు వింతలలో చేరితే ఆయనను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్‌ నౌ సంపాదకుడు ఆర్నాబ్‌ గోస్వామి పిల్లిలా మాట్లాడటం కూడా మరొకటిగా చేరటం మరొక విశేషం. మోడీ ఇంటర్వ్యూ చూసిన లేదా పత్రికలలో చదివిన వారు విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మోడీ అభిమానులు వారిని సహించరని వేరే చెప్పనవసరం లేదు. అయితే అంతర్గతంగా ఎలాగూ మాట్లాడటం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు, ఇంతకంటే పోయేదేముంది మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారని తలపట్టుకోవచ్చు. ఇంటర్య్యూలోని మచ్చుకు కొన్ని అంశాలు ఎలా వున్నాయో చూడబోయే ముందు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూడటం అవసరం.

     ఆర్నాబ్‌ గోస్వామి గురించి సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ కొన్ని వ్యంగ్యోక్తులు సంధించారు. అత్యాచారానికి గురైన మహిళ స్ధితి గురించి సల్మాన్‌ ఖాన్‌ నోరు పారవేసుకోవటం, మీడియా, సామాజిక మీడియా, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించటం, దాని మీద సలీంఖాన్‌ క్షమాపణ చెప్పటం ఇవన్నీ తెలిసిందే. అయినా రేటింగ్‌ల కోసం మీడియాలో గోస్వామి వంటి వారు సల్మాన్‌ ఖాన్‌ గురించి చేసిన హడావుడి నష్టనివారణకు దోహదం చేయలేదు. నరేంద్రమోడీ ఇంటర్వ్యూను టీవీలో చూసిన సలీమ్‌ ఖాన్‌ మోడీ మాటల కంటే ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించే తీరునే గమనించినట్లున్నారు. అందుకే పెద్ద ఖాన్‌ చేసిన ట్వీట్స్‌లోని అంశాలు ఇలా వున్నాయి.

       ‘ ఏమిటీ ? మీరు ఇప్పుడు టమ్స్‌ నౌ(ఛానల్‌) మాత్రమే చూడండి, అది కూడా ఆర్నాబ్‌ కోసం, సల్మాన్‌ ఖాన్‌ మీద అతని అవ్యాజ ప్రేమానురాగాలను చూడటానికి కాదు, వైద్య కారణాలతో దానిని చూడటం అంటే ఎంతో వున్నత గౌరవం వుంది. వైద్య కారణాలు ఏమిటంటారా ? అవును, ఎందుకంటే నేను రెండు చెవులూ నలభై శాతం వినికిడి లోపంతో వున్నాను. ప్రతి మాటనూ ఆ ఛానల్‌లో మాత్రమే వినగలను. కానీ గత రాత్రి ప్రధాన మంత్రిని ఆర్నాబ్‌ ఇంటర్వ్యూ చెయ్యటాన్ని చూడటానికి గరిష్ట స్థాయిలో శ్రుతిని(సౌండ్‌) పెంచినా నాకు ఒక్క మాటా వినిపించలేదు. ఆర్నాబ్‌ అంత మృదువుగా వ్యవహరించటాన్ని నేను చూడలేదు. ప్రధాని సమాధానాల కోసం ఎలా ప్రశ్నించారో వూహించుకోవచ్చు. అతను రంకెలు మాత్రమే వేస్తాడు లేదా ఎవరికీ భయపడడు అని చెప్పే నాలి ముచ్చులు ఎక్కడ ?’

      అర్నాబ్‌ గోస్వామి టీవీలో చర్చలు నిర్వహించటాన్ని తొలిసారి ఎవరైనా వీక్షిస్తే పాల్గొన్నవారి మీద వేసే రంకెలు, హావభావాలను చూసి మీదపడి కొడతారా ఏమిటి అన్నట్లుగా వుంటాయి. ప్రధానితో చేసిన ఇంటర్యూ చూసి ఆయన అభిమానులు ఆశాభంగం చెంది వుంటారు, ఇతర నేతలతో చేసిన ఇంటర్వ్యూలను పోల్చి మోడీతో ఒక పరిణితి చెందిన టీవీ జర్నలిస్టు మాదిరి గాక ఒక టీచర్‌-విద్యార్ధి సంభాషణగా వుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని తొలిసారి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినపుడు ఆ సంభాషణ ద్వారా కొత్త విషయాలు రాబట్టే ప్రయత్నం, తీరు కనపడలేదని, చూసేవారికి కొత్తేదేముంది అన్నట్లుగా వుంది. ఆ కార్యక్రమం మోడీ ప్రదర్శన కాదు, మోడీని ఒక మూలకు నెట్టే మల్లయోధుడి పిడిగుద్దుల మాదిరి గాక పిల్లలు తాతయ్యలను చిరుకోపంతో ముట్టుకునే మాదిరి సాగింది, ఏ మల్లయోధుడైనా ఎదుటి వారిని ముష్టిఘాతాలతో ఆడుకోవటానికి గాక వర్తులం చుట్టూ వూరికే తిరుగుతారా అని ఎద్దేవా చేశారు.

     తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయిన ఆర్నాబ్‌ తన కార్యక్రమాల గురించి చర్చించటం తప్ప మరొక పనిలేని గుంపు ఒకటి వుంది. వారు ఎంతో విధేయతతో వుత్సాహంతో వాటిని చూస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై వుంటాను అని వుక్రోషంతో సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూ సమయంలో అసాధారణరీతిలో మీరు మౌనంగా వున్నారు ఎందువలన అని ఒక జర్నలిస్టు ఆర్నాబ్‌ను అడిగినపుడు ఇలా చెప్పాడు.’ కొంతమంది ఇంటర్వ్యూను చూస్తున్నారనుకోండి వారికి వార్తా విశేషాలు ఎంతో ముఖ్యం.పాకిస్థాన్‌లో మిలిటరీ-పౌర విభజన ఏర్పడే అవకాశం గురించి ప్రధాని సూచన ప్రాయంగా చెప్పారు. ఎన్‌ఎస్‌జి గురించి స్పందన వార్తాంశం ముఖ్యం అని నేను ఆలోచించాను. రఘురాం రాజన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన(మోడీ) సమాధానమిచ్చిన తీరు సూటిగా వున్న వార్తాంశమని నేను అనుకున్నాను. ఈ వార్తాంశాలతో నా విధేయులైన వీక్షక బృందాన్ని, మీడియాను కూడా నిరాశపరిచాను’

    ఇంటర్వ్యూలో వున్న ఆ గొప్ప వార్తాంశమేమిటా అని అనేక మంది జర్నలిస్టులు చూశారు.తన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకపోతే ఆర్నాబ్‌ ఎలా రెచ్చిపోతారో చూసినవారికే అర్ధం అవుతుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ గురించి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధానికి లేఖ రాశారు, బహిరంగంగా ఎంత రచ్చ చేసిందీ తెలిసిందే. రాజన్‌ గురించి ఆర్నాబ్‌ అడిగిన దానికి మోడీ చెప్పిన సమాధానం ఎంత సూటిగా వుందో చూడండి.’ ఎవరైనా, మా పార్టీ వారు కావచ్చు కాకపోవచ్చు, అటువంటి పనులు తగవు. అలాంటి ప్రచారం జిమ్మిక్కులతో దేశం బాగుపడదు. అటువంటి పనులు చేసే వారు మరింత బాధ్యతాయుతంగా వుండాలి. వ్యవస్థకంటే తాము పెద్ద వారమని ఎవరైనా భావిస్తే అది తప్పు’ అని మాత్రమే అన్నారు.ఇలాంటి సమాధానాలు ఇతరులు చెప్పి వుంటే ఆర్నాబ్‌ వారిని చీల్చి చెండాడి పేరు చెప్పేంతవరకు వదలి పెట్టరు.

    ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, ప్రధాని సమాధానం చెప్పిన తీరు మీద కూడా అనేక స్పందనలు వచ్చాయి. విషయం ఏమీ చెప్పకుండానే , సూటిగా మాట్లాడ కుండా ఎలా సమాధానాలు ఇవ్వవచ్చో నేర్పే విధంగా వున్నాయన్నది వాటిలో ఒకటి. పిల్లలు ఆవు, చెట్ల వలన వుపయోగాల గురించి రాసే వ్యాసాల మాదిరి వున్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక అంశాలపై నరేంద్ర మోడీ మౌనం పాటిస్తారనే విమర్శ వుంది. దీంతో అది మరింత స్పష్టమైంది. ముఖ్య అంశాలపై మాట్లాడినప్పటికీ సూటిగా సమాధానాలు లేవు. అన్నింటికీ మించి విలేకర్ల గోష్టి కాకుండా తనకు మద్దతునిచ్చే ఒక ఛానల్‌తో మాట్లాడటాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందరు భావించారు. మీడియాను ఎదుర్కొనే స్ధితిలో ప్రధాని లేరనేది స్పష్టమైందన్న అభిప్రాయమూ వుంది.

     ప్రధాన మంత్రి తరచూ విదేశీ ప్రయాణాలు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారన్న విమర్శలు వచ్చినపుడు అనేక మంది మంత్రులు, బిజెపి నేతలు విదేశీ పెట్టుబడుల కోసం జరుపుతున్నట్లు చెప్పారు. కానీ మోడీ సమాధానం అందుకు భిన్నంగా వుంది.’ ప్రపంచానికి నా గురించి తెలియదు. ఒక దేశానికి ఎవరు సారధిగా వున్నారు అని తెలుసుకోవాలని ప్రపంచం అనుకుంటుంది. ఎవరైనా మీడియా ద్వారా మోడీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి వారు అసలైన మోడీ ఎవరు అని తికమక పడే అవకాశం వుంది. అది జరిగితే దేశానికి నష్టం. భారత్‌పై విశ్వాసం కలగటానికి మోడీ వ్యక్తిత్వం ఆటంకం కాకూడదు, అందువలన నేను అందరు నాయకులను కలుసుకోవాలి, ముఖాముఖీ మాట్లాడాలి, నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే వారికి భారత సారధి గురించి తెలియదు. అందువలన ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఇంతకు ముందు ప్రపంచ నాయకులను కలుసుకొనే అవకాశం రాలేదు.’

    నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్న ప్రశ్నకు ‘ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్య అది, వారికి మాట్లాడటానికి ఏదో ఒక సమస్య వుండాలి కదా ‘ అన్నారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ గత ప్రభుత్వ హయాంలో ధరలు వేగంగా పెరగటాన్ని మీరు చూడవచ్చు, నేడు వేగం బాగా తగ్గింది. మీరు అంకెలను చూడవచ్చు.రెండవది వరుసగా రెండు సంవత్సరాలు కరవు వుంది.కూరగాయలు, ఆహారం, పప్పుల ధరలపై కరవు ప్రభావం ప్రత్యక్షంగా వుంటుంది, ఎందుకంటే అవన్నీ భూమిలో పండుతాయి. అంత పెద్ద కరవు వున్నపుడు ఎవరి చేతుల్లో ఏమీ వుండదు. ఇటువంటి పరిస్థితులలో దిగుమతులు చేసుకోవటం రెండవ అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. మూడవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంయుక్త బాధ్యత అది.’

     కొందరు కేంద్ర మంత్రులు మతవుద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనల చేయటం గురించి అడిగిన ప్రశ్నకు ‘ అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని వాటి ద్వారా హీరోలుగా మార్చవద్దని నేను చెప్పదలచుకున్నాను.వారిని హీరోలను చేయకండి, వారే మానుకుంటారు.’ అన్నారు. ఇక వుపాధి గురించి చిరంజీవి సినిమాను గుర్తుకు తెచ్చేలా చెప్పారు. ‘ మొదటి విషయం మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు 80కోట్ల మంది వున్నారు. వుద్యోగాల కోసం పెద్ద డిమాండ్‌ వున్న విషయాన్ని మనం అంగీకరించాలి.కానీ వారెక్కడ వుపాధి పొందుతారు ? పెట్టుబడులు రావాలి. వాటిని మౌలిక సదుపాయాలు, వుత్పాదక, సేవా రంగాలలో వుపయోగించాలి. ఇప్పుడు మనం చొరవ తీసుకున్నాము, ముద్రా యోజన ప్రారంభించాము. రజకులు, క్షురకులు,పాలవారు, వార్తాపత్రికలు అమ్మేవారు, బండ్ల మీద అమ్మేవారందరూ కలసి దేశంలో మూడు కోట్ల మంది వున్నారు. వారి పనిని విస్తరించేందుకు ఎలాంటి హామీతో పనిలేకుండా దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చాము. ఒకరు ప్రస్తుతం ఒకరికి పని కల్పిస్తున్నారనుకుందాం, దానిని విస్తరిస్తే అతనికి ఇద్దరు కావాలి. అదే ఇద్దరు వుంటే ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూడు కోట్ల మంది ఈ చిన్న వ్యాపారులకు రుణం అందుబాటులోకి వచ్చిందనుకోండి వారు తమ పనిని విస్తరించక తప్పదు. మేం మరొక చిన్న నిర్ణయాన్ని తీసుకున్నాం. దేశంలో పెద్ద దుకాణాలు 365 రోజులూ నడుస్తాయి, కానీ చిన్న దుకాణాలను సెలవు రోజుల్లో మూసివేయాలి.చిన్న దుకాణాలను కూడా పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులు తెరవ వచ్చని మేము బడ్జెట్‌లో ప్రకటించాము. పెద్ద దుకాణాలకు లేని ఆంక్షలు చిన్న దుకాణాల వారికి ఎందుకు వర్తింపచేయాలి? కాబట్టి పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులూ తెరిచేందుకు అవకాశం వుంది కనుక గతంలో ఒకరిని వుద్యోగానికి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరిని పెట్టుకోవాలి, దీని వలన వుపాధి పెరగదా ? 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలని చెబుతున్నాము.ఈ రంగం ఎంతో మందికి వుపాధి కల్పిస్తుంది.’

    కొంత మంది మంత్రులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గురించి ప్రస్తావించి మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు కదా, వారిని అదుపు చేయాల్సిన అవసరం లేదా అని ఆర్నాబ్‌ ప్రశ్నించారు.’ మొదటిది, అభివృద్ధి వైపు జాతి పురోగమించాలని గట్టిగా విశ్వాసం వున్న వాడిని, అది అవసరం కూడా, అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని హీరోలుగా చేయవద్దని నేను మీడియాను కోరుతున్నాను.’

      కానీ వారు వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు కదా ?’ వారిని హీరోలను చేయవద్దు వారే ఆగిపోతారు.’

    మేం వారిని హీరోలను చేయలేదు, విలన్లుగా చేశాము ‘ కానీ మీరు వారిని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేయటాన్ని నేను టీవీలలో చూశాను, వారి ముఖాలు కూడా నేను చూడలేదు, చివరికి వారు టీవీలో అధికార ప్రతినిధులుగా మారుతున్నారు.’

  తమకు తామే ప్రతినిధులుగా ప్రదర్శించుకుంటున్నారు ‘ అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు ‘

    మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలివి. ఒక ప్రధాని స్ధాయిలో వున్న వ్యక్తి అనేక ముఖ్యాంశాల గురించి మాట్లాడిన తీరుతో అనేక మంది విస్తుపోతున్నారు. అభిమానులు ఎలాగూ వేరే అర్ధాలు తీస్తారన్నది తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎన్‌ఎస్‌జి వైఫల్యం ఎవరి ఖాతాకు ? ప్రధాన మంత్రా ! నరేంద్రమోడీనా !

28 Tuesday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Narendra Modi, npt, nsg, NSG china, NSG Failure, NSG INDIA

  అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్‌ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.

ఎం కోటేశ్వరరావు

     ఎత్తుగడ, వ్యూహం ఏదైనా వుందా, లేక కొందరు అంటున్నట్లు దుర్బుద్ధి లేకపోవచ్చు, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పధకాల పేర్లన్నింటికీ ముందు ‘ప్రధాని’ అని తగిలిస్తున్నారు. ఆ పధకం సఫలమైనా, విఫలమైనా ప్రధానికే ఆ పేరు దక్కుతుంది. ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అన్న సులభ తర్కం సామాన్యులకు కూడా తెలుసనుకున్నారేమో వ్యూహకర్తలు. ఇప్పుడు అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందటంలో భారత్‌ ఘోరవైఫల్యం చెందింది అన్న తీవ్ర విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అవి ప్రతిపక్షం నుంచేగాక స్వపక్షం, ఏ పక్షానికి చెందినవారి నుంచి కూడా వున్నాయి. ఈ లెక్కన ఈ వైఫల్యాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? ప్రధాన మంత్రా, నరేంద్రమోడీనా ?

     నరేంద్రమోడీ గద్దె నెక్కిన రెండు సంవత్సరాల తరువాత ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా అంతకు ముందుతో పోలిస్తే ప్రపంచంలో భారత్‌ స్ధానంలో మార్పు స్పష్టంగా చూడవచ్చని బిజెపి ప్రతినిధి నలిన్‌ కోహ్లి ప్రకటించారు. ఒక్క విదేశాంగ విధానంలోనే కాదు అన్ని రంగాలలో స్పష్టమైన మార్పుంన్నారు.ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు ఎప్పుడు సభ్యత్వం వస్తుందనేదే మౌలిక సమస్య అని కూడా ఆయన చెప్పారు. పుణ్యం చేసిన వారికి మాత్రమే రాజుగారు వేసుకున్న దేవతా వస్త్రాలు కనిపిస్తాయి మిగతావారికి మరేవో కనిపిస్తాయన్న కధ మాదిరి వుందని ఎవరైనా భావిస్తే అది వేరే విషయం. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యం గురించి బిజెపి నేత, వాజ్‌పేయి మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత సిన్హా చేసిన విమర్శలను కోహ్లీ తోసి పుచ్చారు. అణుసరఫరా బృందంలో సభ్యత్వం ఇవ్వాలనే దరఖాస్తుతో మనం వారి దగ్గరకు వెళ్ల కూడదని, మనకు ఇస్తామన్నది ద్వితీయ శ్రేణి ప్రాతినిధ్యం అంటూ అసలు దానిని మనం అంగీకరించకూడదంటూ ఇప్పటికే భారత్‌ పొందాల్సిందేదో పొందిందని యశ్వంత సిన్హా చెప్పారు. పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదని, మన దౌత్య గుడ్లన్నింటినీ అమెరికా బుట్టలో పెట్టకూడదని కూడా సిన్హా వ్యాఖ్యానించటం విశేషం.

   ఎన్‌ఎస్‌జి సభ్యత్వ విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మెరుగ్గా సంప్రదింపులు జరిపి వుండాల్సిందని అణుశక్తి సంస్ధ మాజీ అధ్యక్షుడు ఎంఆర్‌ శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. ఆ సంస్ధలో వ్యతిరేకతను వ్యక్తం చేసే వారి బహిరంగ వైఖరి తెలిసిందేనని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసిన వారికే సభ్యత్వం ఇవ్వాలన్న చైనాతో పాటు అసలు అణుశక్తిపై ఏమాత్రం ఆధారపడనివి కూడా ఆ సంస్ధలో సభ్యులుగా వున్నాయని చెప్పారు. ఈ బృందంలో ఒక్క చైనా తప్ప మిగతా దేశాలన్నీ సానుకూలంగా వున్నందున చైనా దిగిరాక తప్పదని ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లున్నదని శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. పేకాటలో మన తురుపు ముక్కలను ఎదుటివారికి చూపి చెత్త ఆట ఆడినట్లుగా వుందన్నారు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధం విషయంలో మన ఎగుమతుల అదుపు, అణు రక్షణ చర్యలు తిరుగులేనివి అయినప్పటికీ సభ్య దేశాలను ఎంతో ముందుగానే ఒప్పించి వుండాల్సిందని, సభ్యత్వం లేకపోతే సమీప భవిష్యత్‌లో మన పౌర అణుశక్తి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది వుండదంటూ, 2008లో ఒక దఫాకు పొందిన మినహాయింపుల కారణంగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌,కజకస్తాన్‌, ఆస్ట్రేలియా వంటి అణు సరఫరా దేశాలతో విజయవంతంగా ఒప్పందాలు చేసుకున్నామని శ్రీనివాసన్‌ చెప్పారు.

    అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్‌ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.

     1974 మే 18వ తేదీన రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద మన దేశం తొలి అణుపరీక్ష జరిపింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా వులిక్కి పడింది. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్పుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో జపాన్‌ లొంగిపోయి చేతులెత్తేసిన స్ధితిలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్లు అణు బాంబులను వేసి ప్రపంచాన్ని బెదిరించారు. దాంతో అనేక దేశాలు తాము కూడా అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో 1958లో ఐర్లండ్‌ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ప్రతిపాదించింది. పది సంవత్సరాల తరువాత 1968లో దానిని అంగీకరించిన దేశాలు సంతకాలు చేయటం ప్రారంభించాయి. వాటిలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా, బ్రిటన్‌, అసలు అణుకార్యక్రమంలేని అనేక దేశాలు వున్నాయి. చైనా, ఫ్రాన్స్‌ 1992లో మాత్రమే సంతకాలు చేశాయి. అణుకార్యక్రమం కలిగి వుండి అణ్వాయుధ పరీక్షలు చేసిన దేశాలు ఇవి. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసే సమయానికి అనేక దేశాలు అణుకార్యక్రమాన్ని కలిగి వున్నాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం వద్ద అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన పరిజ్ఞానం వుంటుందన్నది ఒక గట్టి నమ్మకం. అణుపరీక్షలు జరిపి ఈ ఒప్పందంలో చేరని దేశాలు పాకిస్థాన్‌, భారత్‌ మాత్రమే. వుత్తర కొరియా పరీక్షలు జరిపింది, ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే అమెరికా తమతో చేసుకున్న ఒప్పందాన్ని సక్రమంగా అమలు జరపలేదనే కారణంతో అది ఒప్పందం నుంచి వైదొలగింది. ఇజ్రాయెల్‌ వద్ద కూడా అణుపరిజ్ఞానం వుంది, దీనితో పాటు దక్షిణ సూడాన్‌ ఎన్‌పిటిపై సంతకాలు చేయలేదు.

     1974లో మన దేశం జరిపిన అణుపరీక్షతో అణు సరఫరాలపై ఆంక్షలు విధించాలనే ఆలోచన తలెత్తింది. దాంతో 1975 నవంబరులో లండన్‌ కేంద్రంగా పలు దేశాలు చర్చలు ప్రారంభించి 1978నాటికి ఒప్పందానికి వచ్చాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలకు అణు సరఫరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయరాదన్నది దానిలోని కీలక షరతు. అయితే ఎన్‌పిటి వునికిలోకి రాకముందే మన దేశానికి కెనడా, అమెరికా అణుసరఫరాలు చేశాయి. 1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశంలో అణుకార్యక్రమం ముమ్మరమైంది. 1968,69 సంవత్సరాలలో మన శాస్త్రవేత్తలు సోవియట్‌ యూనియన్‌లోని అణు కేంద్రాలను సందర్శించి వచ్చారు. తరువాత 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం,బంగ్లాదేశ్‌ విముక్తికి పూర్తి తోడ్పాటు ఇచ్చిన కారణంగా మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా తన నౌకా దళంలోని యుఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే యుద్ధ నౌకను బంగాళాఖాతంలోకి పంపింది. దాంతో మన దేశం సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని అమెరికా బెదిరింపులను అడ్డుకుంది. అదే సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అణ్వస్త్ర పరీక్ష జరపాలని మన శాస్త్రవేత్తలను ఆదేశించారు. దాని ఫలితమే 1974లో తొలి పరీక్ష. మన పరీక్షలో వుపయోగించిన ప్లుటోనియం అంతకు ముందు మనకు కెనడా అందచేసిన సైరస్‌ రియాక్టర్‌లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న భార జలాన్ని వుపయోగించి తయారు చేసింది. దాంతో ఆ రెండు దేశాలు మన పరీక్ష పట్ల వ్యతిరేకంగా స్పందించాయి. మనలను అభినందిస్తూ ప్రాన్స్‌ తొలుత టెలిగ్రాం పంపి తరువాత వుపసంహరించుకుంది. మనదేశం జరిపిన పరీక్షను అణు బ్లాక్‌మెయిల్‌గా పాకిస్థాన్‌ పరిగణించి తరువాత తన కార్యక్రమాన్ని ముమ్మరం చేసి చివరకు పరీక్ష చేసింది. మన పరీక్ష తరువాత తారాపూర్‌ అణువిద్యుత్‌ కేంద్రానికి భార జలసరఫరాలో ఇబ్బందులు పెట్టటం, రెండవసారి వాజ్‌పేయి ప్రధానిగా వుండగా మనం రెండవ పరీక్ష జరిపినపుడు అమెరికా మనపై ఆంక్షలు విధించటం వంటి విషయాలన్నీ తెలిసినవే.

    సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత క్రమంగా మన దేశ విదేశాంగ విధానంలో చోటు చేసుకున్న మార్పులతో అమెరికాకు జూనియర్‌ భాగస్వాములుగా చేరి లబ్దిపొందాలని మన పాలకవర్గం నిర్ణయించింది. దాని ఫలితమే అమెరికన్లు మనపై ఆంక్షల ఎత్తివేత, యుపిఏ ప్రభుత్వం అమెరికాతో మనకు హానికరమైన ఒప్పందం కుదుర్చుకోవటం, దానిని వ్యతిరేకించిన వామపక్షాలు యుపిఏకు మద్దతు వుపసంహరించుకున్నాయి. వ్యతిరేకించిన బిజెపి ఒప్పంద ఆమోదానికి సహకరించటమే కాదు, ఇప్పుడు అది మరింత గట్టిగా అమలు జరిపేందుకు పూనుకుంది, అనేక రంగాలలో మరింత దగ్గరైంది. గతంలో మనపై ఆంక్షలు విధిస్తూ అమెరికన్‌ పార్లమెంట్‌ తీర్మానించింది. మన ప్రభుత్వం అమెరికాకు లబ్ది కలిగించే అణు ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధం కావటంతో 2006 దానిని సవరించింది.అంతటితో ఆగలేదు, భారత్‌కు ఒకసారికి అణు సరఫరాలకు మినహాయింపు ఇవ్వాలని స్వయంగా మిగతా దేశాలతో లాబీయింగ్‌ జరిపి 2008లో ఆమేరకు ఎన్‌ఎస్‌జిలో ఆమోదముద్ర వేయించింది. తరువాత ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం రాబోయే రోజులలో కూడా అణుసరఫరాలు జరపవచ్చు. మన దేశం మరికొన్ని దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. ఆ దేశాలన్నీ ఎన్‌ఎస్‌జిలో భారత్‌ సభ్యత్వానికి మద్దతు ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఒకసారి భారత్‌ సభ్యురాలైన తరువాత ఆ మినహాయింపులను రద్దు చేయటానికి అవకాశం వుండదు. వుదాహరణకు 2010లోనే బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనలో మద్దతు గురించి చెప్పారు. అదే ఏడాదిఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ కూడా అదే చెప్పాడు. రష్యా కూడా కొన్ని షరతులతో మద్దతు ప్రకటించింది.నరేంద్రమోడీ ప్రధాని అనే అంశం వూహా మాత్రంగా లేనపుడే ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో మా మోడీయే ఇదంతా చేశారని భక్తులు ఎవరైనా చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మెయ్యబోతే ఎద్దుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లు కాకుండా సభ్యత్వానికి రంగం సిద్ధం చేశారని గొప్పలు చెప్పుకోవటమే కాదు, వైఫల్యానికి కూడా బాధ్యత వహించాలి. శ్రీనివాసన్‌ చెప్పినట్లు చైనా, మరికొన్ని దేశాల వైఖరి మోడీ కంటే ముందే ప్రపంచానికి సువిదతం. మనకు సభ్యత్వం రాకుండా అడ్డుకుందని ఆరోపణలకు గురైన చైనా ఎన్‌ఎస్‌జిలో చేరింది 2004లోనే, అంతకు ముందు మనకు ఎందుకు సభ్యత్వం తెచ్చుకోలేకపోయాం అని కూడా ఆలోచించాలి. ఓడలో వున్నంత వరకు ఓడ మల్లయ్య దిగిన తరువాత బోడి మల్లయ్య అన్నట్లు 2008లో తనకు అవసరం గనుక మనకు మినహాయింపులు రావటానికి అమెరికా తన శక్తి మొత్తాన్ని వినియోగించింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం దానివైపు నుంచి రాలేదు, మేం సిద్దం మిగతా అందరి మద్దతు మీరే కూడగట్టుకోండి, మేం ఓటింగ్‌ సమయంలో మాత్రమే వస్తాం అన్నట్లుగా వుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా ఒక వేళ చైనా, ఇతర దేశాలు అంగీకరిస్తే అది తమ ఘనతే అని చెప్పుకొనేందుకు లేకపోతే వారే కారణం అంటూ మనలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ఈ అవకాశాన్ని అమెరికా వినియోగించుకుంది.తమ ప్రధాని భారత్‌కు సభ్యత్వం ఇవ్వరాదని 17దేశాలకు లేఖలు రాసిన కారణంగానే రాలేదని పాక్‌ ప్రధాని సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు.చైనాతో పాటు అభ్యంతరం తెలిపిన వాటిలో బ్రెజిల్‌, టర్కీ, దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్‌, మెక్సికో కూడా వున్నాయి. ఇవేమీ చిన్నా చితకా దేశాలు కాదు, మనతో శతృత్వం వున్నవీ కాదు.

   పోనీ నరేంద్రమోడీ అంతా రంగం సిద్దం చేస్తే చివరి క్షణంలో చైనా, మరికొన్ని దేశాలు అడ్డుపడ్డాయనుకుందాం. వాటిని ఒప్పించేందుకు మోడీ ఎందుకు ప్రయత్నించలేదు, ప్రయత్నిస్తే ఈ భంగపాటు ఎందుకు కలిగేది, లేదా ముందే తెలిసి వుంటే దాదాపు సభ్యత్వం వచ్చినట్లే అనే హంగామా ఎందుకు సృష్టించారు.లేదా యశ్వంత సిన్హా చెప్పినట్లు సలహాదారులు తప్పుదారి పట్టించారా? దేశానికి మోడీ లేదా ఆయన మద్దతుదార్లు వివరించాలి.

    సియోల్‌ సమావేశంలో చైనా అడ్డుకుంది గనుక కొద్దిలో తప్పిందిగానీ తదుపరి మనకు రావటం ఖాయం అన్న పద్దతుల్లో మన ప్రభుత్వం ఇప్పుడు వుంది. నిజానికి ఆ సమావేశంలో అసలు మన సభ్యత్వం అజెండాలోనే లేదు. భారత దరఖాస్తు గురించి చర్చించరాదని చైనా అభ్యంతర పెట్టింది, మరో ఏడు దేశాలు పాకిస్తాన్‌ కూడా దరఖాస్తు చేసుకుంది దానిపట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలి,ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాల పట్ల అనుసరించాల్సిన వైఖరి ఏమిటనే మౌలిక సమస్యలను లేవనెత్తాయి. దీంతో చివరకు ఎలాంటి నిర్ణయం జరగకూడదనే షరతుతో భారత దరఖాస్తును అజెండాలో చేర్చేందుకు చైనా, మిగతా దేశాలు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది జరిగింది కనుక తదుపరి సభ్యత్వం రావటమే తరువాయి అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

    నాలుక నాది కాదు కనుక తాటి పట్టెతో గీసుకోమన్నట్లుగా చైనా వైఖరి తెలిసి వుండి కూడా మన దేశాన్ని అమెరికా ముందుకు నెట్టిందా ? అంతర్జాతీయ రాజకీయాలు అందునా ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వున్నపుడు ఎలా వ్యవహరించాలో, ఎన్‌పిటిపై సంతకం చేయని దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదనే నిబంధన అమలులో వుండగా మన దేశానికి లేదా పాకిస్థాన్‌కు రెండు దేశాలకు ఇవ్వటంలో వున్న సంక్లిష్టతలను మన విధాన నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోలేదా ? లేదా అమెరికా వంటి దేశాలు మద్దతు ఇచ్చిన తరువాత నల్లేరు మీద బండి మాదిరి అందరూ దారిలోకి వస్తారనే ధీమాతో వున్నారా ?

     చైనా పట్ల ఇటీవలి కాలంలో ముఖ్య ంగా గత రెండు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరు తెన్నుల గురించి మన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు ఎంకె.భద్ర కుమార్‌ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఏడాది కాలంగా ఏ మాత్రం పట్టించుకొని నరేంద్రమోడీ చివరి నిమిషంలో చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ను కలుసుకొనేందుకు తాష్కెంట్‌ ఎందుకు వెళ్లారన్నదానికి ఎలాంటి వివరణ లేదు. చైనా పట్ల సౌత్‌ బ్లాక్‌(ప్రధాని, విదేశాంగ శాఖ, రక్షణ వంటి ముఖ్యశాఖలున్న భవనం) అసహ్యకర విధానాలు అనుసరించిందని భద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. కొన్ని వుదాహరణలను ఆయన పేర్కొన్నారు. శ్రీలంకలో అధికార మార్పిడి, మోడీ-బరాక్‌ ఒబామా సంయుక్తంగా ఆసియా పసిఫిక్‌ సంయుక్త ప్రకటన, జపాన్‌ ప్రధాని షింజేతో మోడీ సయ్యాటలు, వియత్నాంకు ఆయుధాలు, మలబార్‌ తీరంలో జపాన్‌తో కలసి సైనిక విన్యాసాల విస్తరణ, విదేశాంగ మంత్రుల స్ధాయిలో అమెరికా-భారత్‌-జపాన్‌ త్రిపక్ష చర్చలు, చైనాలోని అఘిర్‌ ఇస్లామిక్‌ వేర్పాటువాదులకు వీసాలు ఇవ్వటం, దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో భారత నౌకాదళాన్ని కొనసాగించటం, వియత్నాంకు బ్రహ్మూెస్‌ క్షిపణులు అందచేస్తామని బెదిరించటం వంటి చైనాకు ఇష్టం లేని చర్యలకు గత ఏడాదిన్నరకాలంగా అనుసరించారని భద్రకుమార్‌ పేర్కొన్నారు. చైనా కీలకమైన ప్రయోజనాలపై దాడి చేయటం ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా చైనా వైఖరి కఠినతరమైందని, తాష్కెంట్‌లో మోడీ ప్రత్యక్షంగా దానిని రుచి చూశారన్నారు. అమెరికాతో కలసి 21వ శతాబ్దంలోనిర్ణయాత్మక భాగస్వామ్య సమావేశాలకు హాజరవుతున్నంత కాలం దేవుడు తన స్వర్గంలోనే వున్నాడని, అంతా మంచే జరుగుతుందనే ప్రగాఢ భావనలోకి భారత్‌ వెళ్లిపోయిందని, ఏక ధృవ ప్రపంచ భావన నుంచి విడగొట్టుకోవటానికి రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ప్రధాని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవటమే గాక తానే దానికి బలయ్యారు.మోడీ విశ్వసించిన ఆయన సిబ్బంది ద్వారా అమెరికన్లు భారత విదేశాంగ విధానాలను నిర్ణయిస్తున్నారంటే అది అమెరికన్ల తప్పుకాదు, అలా జరగటానికి ఆయనే అవకాశం ఇచ్చారు.అమెరికన్ల బలం గురించి వున్న విశ్వాసం మనల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం గురించి ముందుగా ప్రతిపాదించి మనలను 2010 ముందుకు నెట్టిన అమెరికా ఇప్పుడు దానిని భారత-చైనా వివాదంగా మార్చటంలో జయప్రదమైంది, హిమాలయాన్ని అధిరోహించేందుకు ఏర్పాట్లు చేసే బాధ్యతను భారత్‌పైనే పెట్టింది అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనేక మంది చేసిన విమర్శలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణ్యంగా మన ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఇరుగు, పొరుగు , ఇతర అన్ని దేశాలతో సఖ్యతగా వ్యవహరించినపడే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పుతాయి. తన ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేసే అమెరికా దౌత్యపరంగా అనేక ఎదురు దెబ్బలు తింటున్నది. దాని వెనుక నడిస్తే మనకూ తప్పవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రిటన్‌పై ఐరోపా ధనిక దేశాల ఆగ్రహం

26 Sunday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

brexit, EU, European Union, Europeans angry

ఎం కోటేశ్వరరావు

    కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్‌ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ మార్క్‌ రాల్ట్‌ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్‌ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్‌ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.

    అయితే తిరిగి ఓటింగ్‌ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్‌ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్‌ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్‌ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్‌ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్‌ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్‌ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్‌ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్‌ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.

    1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్‌ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్‌ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్‌ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్‌ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఇటలీ, లక్బెంబర్గ్‌ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.

     వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్‌ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్‌ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్‌, వేల్స్‌లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్‌, స్కాట్లండ్‌, వుత్తర ఐర్లండ్‌ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్‌ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్‌సైట్‌ కుప్పకూలింది.

   బ్రిటన్‌ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్‌ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.

   విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్‌ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్‌ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్‌ విలీనం అవుతుంది. బ్రిటన్‌ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్‌ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్‌ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్‌ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్‌ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్‌ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్‌ చేస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.

    బ్రిటన్‌ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్‌ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Telangana should intensify ‘ease of doing business’ to attract investors in large nos.: ASSOCHAM  

24 Friday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

ASSOCHAM, investment, investors, Telangana

 

Investment projects attracted by state in transport services sector facing time & cost overruns

The state of Telangana needs to intensify focus on ease of doing business thereby adhering to the principle of ‘minimum government, maximum governance,’ to become top investment hub thereby promoting more efficient and effective business practices across the state, apex industry body ASSOCHAM said today.

“Telangana should make efforts to ease the process of doing business for all categories of industries with special focus on small and medium enterprises that hold potential to create more employment,” said Mr D.S. Rawat, secretary general of The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) while releasing a study titled ‘Analysis of infrastructure investment in India,’ along with chamber’s Telangana Development Council chairman, Mr Srikanth Badiga at a press conference held in Hyderabad.

States across India had attracted total investments worth over Rs 53 lakh crore in different categories of infrastructure sector – transport services (71 per cent share), miscellaneous services like storage & distribution, health, education, recreational services and others (13 per cent), communication services (5 per cent), wholesale and retail trading (5 per cent), information technology (4 per cent), hotels and tourism (2 per cent).

Public sector accounted for highest share of 59 per cent in the total investments attracted by infrastructure sector, this is worrisome as India needs to look for more private sector participation in perking up infrastructure across the country, but it is seen that over the years reliance on public sources have increased.

“So far public investments have been the dominant form of infrastructure financing in India, but this is expected to change as large deficits and other commitments together with social obligations will constrain government’s financial flexibility, thus there will be a greater need to mobilise private sector capital that can be invested into infrastructure,” noted the study.

At the state level, public sector investment shows that in 2015 public sources had highest share of over 95 per cent in investments attracted by Chhattisgarh followed by Bihar (92 per cent), Uttarakhand (87 per cent), Himachal Pradesh (80 per cent) and Madhya Pradesh (77 per cent) amid top five states in terms of public investments.

While on an average, public sector sources accounted for over 59 per cent share in terms of investments attracted by infrastructure sector across India. Though in West Bengal (59 per cent), Tamil Nadu (58 per cent), Odisha (50 per cent), Uttar Pradesh (47 per cent), Gujarat (27 per cent) and Haryana (10 per cent) public investments’ share was below that of the country’s average share thereby implying that these six states would be leading in terms of private sector’s contribution to infrastructure sector.

While the total investments attracted by infrastructure sector across India have increased at a compounded annual growth rate (CAGR) of over 10 per cent between 2010-2015 thereby increasing from over Rs 32 lakh crore to over Rs 53 lakh crore.

Investments attracted by transport services sector have increased at maximum growth of over 13 per cent followed  by miscellaneous services (6.5 per cent), communication (5 per cent), wholesale and retail (two per cent), hotels and tourism (two per cent) and IT (one per cent).

Infrastructure investment attracted by transport services sector:

“Transport services have garnered highest share of over 71 per cent in terms of investments worth over Rs 53 lakh crore attracted by infrastructure sector across the country as of 2015 followed by miscellaneous services (13 per cent), communication (five per cent), wholesale and retail trading (five per cent), information technology (four per cent) and hotels & tourism (two per cent),” highlighted the study.

However, investments attracted by the transport services sector have registered steep cost escalation of 47 per cent thereby exceeding the actual cost of projects by a whopping Rs five lakh crore, besides these projects are also facing an average delay of over 44 months.

Investment projects attracted by Telangana in transport services sector have registered highest cost escalation rate of about 89 per cent and are facing delay of over 51 months as of 2015, noted the study prepared by The ASSOCHAM Economic Research Bureau (AERB).

“It is highly imperative for the government of Telangana to perk up transportation, communication, water and energy networks across the state to promote accessibility, quality of infrastructure and attract domestic firms and global investors,” said Mr Rawat.

Punjab (65 per cent), Jharkhand (59 per cent), West Bengal (58 per cent) and Gujarat (56 per cent) are other among top five states to have recorded high cost escalation rate in delayed transport services investment projects.

Infrastructure investments’ scenario in Telangana:

Telangana has recorded a meagre two per cent share in investments attracted by infrastructure sector from both public and private sources across India as of 2015 and there has been literally no change in its share in 2010.

It also registered 10.2 per cent CAGR in investments attracted by infrastructure sector during the course of past five years which is similar to the national average growth rate in this regard.

Telangana recorded third highest growth rate of over 36 per cent after Chhattisgarh (44 per cent) and Himachal Pradesh (38 per cent) in investments made by the public sources in infrastructure sector across India.

“While in terms of investments made by the private sector in infrastructure sector in India, Telangana had seen a negative growth of about five per cent, as such the state needs to mobilise private sector capital that can be invested into infrastructure,” suggested the ASSOCHAM study.

Besides, the state recorded under implementation rate of about 83 per cent which is way ahead than national under implementation rate of 58 per cent, this implies that most of the infrastructure projects in Telangana and across India are still in the process and are yet to be completed.

“This does not augur well for both the state and the country as actual benefits of an investment are only derived upon completion,” the study asserted.

Suggestions:

In its study, ASSOCHAM has suggested various measures like reducing delay in creating businesses, obtaining approvals, enforcing contracts; providing sufficient legal protection for investors; ensuring more transparent and predictable government decision making thereby minimising political and regulatory risks.

Co-ordination between government agencies together with a single window clearance system should be implemented with specific guidelines for time bound approvals. Besides, land acquisition and environment clearances continue to remain critical concerns for infrastructure developers as such these issues should be addressed proactively to balance the interests of all stakeholders.

There is also an urgent need to fill-up the skills related gap in handling infrastructure projects and the government should create a skill ecosystem in partnership with private players with a view to formalise professional training for project managers, suggested ASSOCHAM.

It also added that there is a need to improve depth and liquidity of corporate bond market to provide additional source of funding for infrastructure companies.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జౌళి పరిశ్రమల ప్రోత్సాహకాల మాటున కార్మిక వ్యతిరేక చర్యలు

24 Friday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Anti labour measures, Employee Provident Fund Scheme Reforms, NDA, PMRPY, textile package

ఎం కోటేశ్వరరావు

    ఎదుటి వారు తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ? బుద్ధిలేని తనం అంటారు పెద్దలు ! కొన్ని దేశాలు పెట్టుబడిదారీ విధానం, కొన్ని దేశాలు సోషలిస్టు విధానాన్ని ఎంచుకుంటే మనం మిశ్రమ ఆర్ధిక విధానం ఎంచుకున్నాం. మధ్యేమార్గం అన్నారు ఎందరో ! ప్రపంచ దేశాలన్నీ మనలను చూసి నేర్చుకుంటున్నాయని, మనకు విదేశీ సిద్ధాంతాలు వద్దు, విధానాలు వద్దు అని కొందరు చెబుతున్నారే, వారే వాటికి తూనా బొడ్డు చెప్పి (స్వస్థి) అనుకరిస్తే భారతీయత మట్టి కరిచిపోదా ? సంస్కరణలు అమలు జరిపినంత మాత్రాన చైనా సోషలిస్టు విధానాన్ని వదలి వేసిందా ? అమెరికా, జపాన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలలో సైతం కొన్ని మార్పులు తప్ప వారు నమ్మిన పెట్టుబడిదారీ విధానాన్ని వదులుకోలేదే ? మరి మనం ఎందుకు మన మిశ్రమ ఆర్ధిక విధానం నుంచి దారి తప్పుతున్నాం ?( దానిని కూడా విమర్శించే వారు వున్నారు) ఇక మన దేశ ప్రత్యేకత ఏముంది? ఇది భారతీయతా ? జనానికి మేలు చేయని సంస్కరణలు ఎవరికోసం ? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.

    వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి వుపాధి కల్పిస్తున్న జౌళి రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందని తెలిసిందే. అలాగే ఎప్పటి కప్పుడు సంస్కరించుకోకపోతే ఏదీ పనికిరాదు. కానీ ఎలా సంస్కరించుకోవాలనేదే సమస్య? దీని గురించి పెద్దగా ఎక్కడా చర్చలు జరపలేదు, పర్యటనకు వచ్చిన ప్రతిసారీ పత్రికా గోష్టి జరిపి గలగలా మాట్లాడేవెంకయ్య నాయుడి వంటి వారు కూడా కనీసం ఆఫ్‌ ది రికార్డుగా కూడా వుప్పందించలేదే ? శత సహస్ర లేఖా రచయిత అవార్డుకు ఏకైక అర్హుడైన బండారు దత్తాత్రేయ కనీసం కార్మికులకు దీని గురించి ఒక్క లేఖయినా రాసినట్లు వినలేదు. మేము భారత మితవాదులం అని సగర్వంగా చెప్పుకొనే స్వరాజ్య పత్రికలో బ్రిజ్‌ మోహనలాల్‌ ముంజాల్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి శ్రేయాస్‌ భరద్వాజ ఒక వ్యాఖ్యానం రాశాడు. అతను యువ మితవాది అని, తోటి విద్యార్ధులలో మితవాద భావాలను వ్యాపింపచేస్తున్నాడని ఆ పత్రిక అతని గురించి సగర్వంగా పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 22న ఒక జౌళి పాకేజిని ఆమోదించిందని, దానిలో సబ్సిడీల భాగం అంత ముఖ్యమైనదేమీ కాదు గాని దానిలో కార్మిక సంస్కరణల గురించి ఒక్క ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తప్ప మీడియా వాటిని పట్టించుకోలేదు అని అతను వ్యాఖ్యానించాడు.

   అదేమీ నరేంద్రమోడీ విజయగాధ కాదు కనుక, ఆ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తే తమ యజమానులు, వారికి ప్రకటనల ద్వారా అండదండలిచ్చే కార్పొరేట్‌ సంస్ధల యజమానులు, మాకు లేని పోని తలనొప్పి తెచ్చారు అని విమర్శించే పాలకపార్టీ నేతలతో తలనొప్పి ఎందుకు ? రాయకపోతే ఎవరు అడగొచ్చారు అని మీడియా కావాలనే వదలివేసిందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకూ ఏమిటా సంస్కరణలు. మేకను బలి ఇవ్వబోయే ముందు దానికి తిన్నంత తిండి పెడతారు, కడుగుతారు, అలంకరిస్తారని తెలిసిందే. అది మేక కనుక అమాయకంగా తింటుంది. కానీ కార్మికులు అలా కాదు కదా అందుకని వారి నోరు మూయించాలంటే వారిని ఆకర్షించాలి. అందుకుగాను కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేమంటే,

     నెలకు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న దుస్తుల పరిశ్రమల కొత్త కార్మికులకు మొదటి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వమే ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకం కింద యజమానుల తరఫున 12శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందట. ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ ప్రస్థాన్‌ యోజన(పిఎంఆర్‌పివై) పధకం నుంచి ఇప్పటికే చెల్లిస్తున్న 8.33 శాతానికి అదనంగా 3.67శాతాన్ని జౌళి మంత్రిత్వశాఖ ఖాతా నుంచి చెల్లిస్తారట. ఎంత వుదారత్వం ! ఈ మొత్తం రానున్న మూడు సంవత్సరాలలో రు.1170 కోట్లు వుంటుందని అంచనా. పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకంలో చేరాలా లేదా అనే ‘స్వేచ్ఛ’ ఇస్తారట. దీని వలన కార్మికుల చేతిలో మరింత డబ్బు వుండటంతో పాటు సంఘటిత రంగంలో వుపాధిని పెంచటానికి తోడ్పడుతుందట. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) విధానం ప్రకారం వారానికి ఎనిమిది గంటలకు మించి ఓవర్‌టైమ్‌ దాట కూడదు, కొత్త విధానం వలన ఆ గంటలు బాగా పెరుగుతాయి.ఈ పరిశ్రమ స్వభావాన్ని బట్టి దుస్తుల తయారీ రంగంలో నిర్ణీత వ్యవధి వుపాధి విధానాన్ని ప్రవేశపెడతారు, ఆ కార్మికులను ఇతర పర్మనెంటు కార్మికులతో సమంగా చూస్తారు, అంటే పని గంటలు, వేతనాలు, అలవెన్సులు, ఇతర చట్టబద్దంగా వర్తించేవన్నీ వారికి వర్తింప చేస్తారట. సంవత్సరానికి ఆరువేల కోట్ల రూపాయల చొప్పున కేంద్రం కేటాయించే ఈ రాయితీల వలన ప్రస్తుతం 17బిలియన్‌ డాలర్లుగా వున్న మన వస్త్ర ఎగుమతులు మూడు సంవత్సరాలు తిరిగే సరికి 43 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయనీ, ప్రత్యక్ష, పరోక్ష వుపాధితో కోటి మంది లబ్ది పొందుతారని కేంద్ర ప్రభుత్వం ఒక రంగుల కలను మన ముందుంచింది.

   మన ఎగుమతులన్నీ వరుసగా గత ఏడాదిన్నర కాలంగా పడిపోయినట్లు ఒకవైపు అధికారికంగా చెబుతున్నారు. అయినా ఇంత ధైర్యంగా కేంద్రం చెబుతున్నదంటే నరేంద్రమోడీకి ఏ విదేశీ పర్యటనలోనో మన దేశం నుంచి ఎప్పుడో తరలి పోయిన గొప్ప మంత్రదండం లేదా మన పురాణాల్లోని అక్షయపాత్రలు దొరకటమో, ఇతర అద్బుతశక్తులు అయినా ఆవహించి వుండాలి లేదా మన సంస్కృత పండితులు వేదాలు, పురాణాల్లో నిక్షిప్తంగా వున్న వాటిని ఎట్టకేలకు వెలికి తీసి వుండాలి. ఏదో జరగక పోతే ఇలా చెబుతారా ?కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కార్మిక సంస్కరణలంటూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను వూరిస్తున్నది.

    శ్రేయాస్‌ భరద్వాజ తన వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పాడు. యజమానుల చిత్తం వచ్చినట్లు కార్మికులను తొలగించటానికి, పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చే, రాత్రి పూట కూడా మహిళలను పనిచేయటానికి అనుమతించటం, 24 గంటలూ దుకాణాలు తెరిచి వుంచటం వంటి సంస్కరణలను పార్లమెంట్‌లో ప్రతిపాదించాలని కేంద్రానికి వుత్సాహం వున్నప్పటికీ ‘ వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలు, రాజ్యసభలో తగిన మెజారిటీ లేకపోవటం వలన సంస్కరణలకు బ్రేక్‌ వేయాలని మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న అరుణ్‌ జెట్లీ కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారని, అయితే పరోక్ష మార్గంలో లక్షిత రంగాలలో సబ్సిడీ పాకేజీలతో కలిపి ప్రవేశ పెడుతున్నారని ‘ యువ మితవాద భరద్వాజ వ్యాఖ్యానించాడు. నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తుగడను చక్కగా ప్రతిబింబించాడు.

   భారత మాతాకీ జై మార్కు దేశ భక్తులు, ఇతరులూ తరచూ లేవనెత్తే ప్రశ్నల గురించి కూడా చెప్పుకోవాలి. గత ఏడు దశాబ్దాల విధానాలు మన దేశాన్ని ముందుకు తీసుకుపోనపుడు మనం సంస్కరణలు అమలు జరపనవసరం లేదా ? కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను సమర్ధిస్తారు, అదే భారత్‌లో వ్యతిరేకిస్తారెందుకు మోడీపై గుడ్డి వ్యతిరేకత కాదా ? ఇంకా అటూ ఇటూ తిప్పి ఇంకా ఇలాంటివే అనేక మంది లేవనెత్తుతున్నారు.ప్రారంభంలోనే కొన్ని అంశాలను ప్రస్తావించాను.

     సంస్కరణలు అంటే ఏమిటి ? పదునైన కత్తితో మగవారు గడ్డం గీసుకోవచ్చు, స్త్రీ,పురుషులు కూరగాయలు తరగవచ్చు, మామిడి కాయలు కోసుకోవచ్చు, గూండాలు ప్రాణాలు తీయవచ్చు, అసహాయులు ఆత్మరక్షణకు వుపయోగించుకోవచ్చు. సంస్కరణలు కూడా అలాంటివే. ఎవరు అమలు చేస్తున్నారనేదానిని బట్టి వాటి ప్రయోజనం, ఫలాలు, పర్యవసానాలు వుంటాయి. అణు పరిజ్ఞానాన్ని బాంబుల తయారీకి వినియోగించి వాటిని జపాన్‌పై ప్రయోగించి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. అణుబాంబులను మరోసారి ప్రయోగించం అని చెప్పటానికి అమెరికా ఇప్పటికీ నిరాకరిస్తోంది. అదే అణుశక్తిని ప్రాన్స్‌ వంటి దేశాలు బాంబుల తయారీతో పాటు విద్యుత్‌ తయారీకి కూడా వినియోగిస్తున్నాయి. అణు సంస్కరణలలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అనేక దేశాలు సంతకాలు చేశాయి, భారత్‌ తిరస్కరించింది. ఈ సంస్కరణ లేదా ఒప్పందం తనకు నష్టదాయకం కనుకనే భారత్‌ తిరస్కరించింది. అణురంగంలో ఎంతో ముందున్న దేశాలు ఇతర దేశాలు ఆ పరిజ్ఞానాన్ని సముపార్జించకుండా చేసేందుకే ఎన్‌పిటి అస్త్రాన్ని వాడుతున్నాయి. సంస్కరణలు కూడా ఇలాంటివే. వాటి వలన లబ్ది పొందే శక్తులు అమలు జరపాలని కోరతాయి, నష్టపోయే శక్తులు వ్యతిరేకిస్తాయి. దుస్తుల తయారీ కంపెనీల వారు కారు చౌకగా తయారు చేసి విదేశాలకు చౌకగా ఎగుమతి చేసి లాభాలు పోగు చేసుకోవాలని చూస్తారు. అమెరికా, ఐరోపా దేశాల వారు దారిద్య్రం తాండవించే బంగ్లాదేశ్‌లో తమ ఫ్యాక్టరీలను పెట్టి చౌకగా దుస్తులు తయారు చేయించి వారే దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే వాటిపై పన్నులు మినహాయింపు ఇచ్చారు. తాజాగా వస్తున్న వార్తలను బట్టి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకోవాలని భారత పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ రాయితీల ప్రకటనతో పాటు కార్మిక సంస్కరణలనూ జమిలిగా అమలు జరిపేందుకు నిర్ణయించింది.

      పిల్లి నల్లదయినా ఎలుకలను పడితే ఎవరికీ ఇబ్బంది లేదు. అమలులో వున్న కార్మిక చట్టాలనే యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు, అమలు జరిపే యంత్రాంగమే లేదు. ఈ స్ధితిలో వున్నవాటిని ఇంకా నీరుగారిస్తే చీకటి రోజుల్లోకి కార్మికులు నెట్టబడతారు. అందుకే ఇక్కడ కార్మికులు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు.అది కాంగ్రెస్‌ పార్టీ అయినా బిజెపి అయినా తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నా డిఎంకె ఏదైనా కావచ్చు. ఎవరు అధికారంలో వుంటే వారిని వ్యతిరేకిస్తారు. అందువలన నరేంద్రమోడీ కనుక వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, ఎదురుదాడి మాత్రమే. కార్మికులు లేదా వారికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు సంస్కరణలను వ్యతిరేకించటం లేదు. ప్రజా వ్యతిరేక అంశాలనే ప్రతిఘటిస్తున్నాయి. అది తగినంత లేని కారణంగా ఫలితాలు కనిపించటం లేదు, పాలకులు మరిన్ని దారుణమైన చట్టాలను రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ రేటు విషయంలో వామపక్షాలు, కార్మిక సంఘాలతో నిమిత్తం లేకుండానే ఎక్కడిక్కడ కార్మికుల్లో తలెత్తిన నిరసనకు భయపడే ఎన్‌డిఏ సర్కార్‌ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అంతెందుకు రాజకీయంగా బిజెపిని సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌ కార్మిక సంస్కరణలను, అనేక ప్రభుత్వ నిర్ణయాలను మాట మాత్రంగా అయినా వ్యతిరేకించకపోతే మనుగడ సాగించలేని స్ధితికి నెట్టబడిందా లేదా ? అంటే వ్యతిరేకించే వారిది గుడ్డి వ్యతిరేకత కాదన్నది స్పష్టం. అది గోబెల్స్‌ ప్రచారమే. కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను ఆమోదించి, ఇక్కడ వ్యతిరేకిస్తారెందుకు ? దీనికి సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. మరొక వ్యాసంలో దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బిజెపి ప్రతిపాదిస్తున్న లేదా అమలు జరుపుతున్న సంస్కరణలను ఇతర విభాగాలైన బిఎంఎస్‌,స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఒక కుటుంబంలోని కొంత మంది సభ్యులే వ్యతిరేకిస్తున్నపుడు బయటివారి వ్యతిరేకత గురించి వేలెత్తి చూపే హక్కు వుందా ? చైనాలో సంస్కరణల గురించి చెప్పేవారు వాటితో పాటు అక్కడ కార్మికులకు ఇచ్చిన హక్కులు, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడరేమి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Most important demand is that of the CG employees is the minimum wage and fitment formula 

23 Thursday Jun 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners, Prices

≈ Leave a comment

Tags

7th CPC, 7th pay commission, CG employees, GOVERNMENT OF INDIA, minimum wage

 

“The formal announcement by the of the 7th CPC acceptance is likely to be made by the Government just before the 11th July strike by the CG employees indicating the actual minimum wage and fitment formula.”

7th CPC latest

Comrades,

The empowered committee of Secretaries headed by the Cabinet Secretary had discussion from past five months on the charter of demands raised by the staff side, The finance ministry is working out the financial implications arising out of the improved recommendations of the 7th CPC especially on the minimum wage and fitment formula being improved, granting two increment on promotion and having annual increment on 1st Jan and 1st July instead of just on 1st July. This will benefit a lot of persons on promotion. The other aspect is considering grant of advances, which the 7th CPC has recommended for abolition.

The formal announcement by the of the 7th CPC acceptance is likely to be made by the Government just before the 11th July strike by the CG employees indicating the actual minimum wage and fitment formula.

The cabinet Secretary will present the view of the empowered committee of Secretaries before the Union Cabinet meeting based upon the principle adopted in actual calculation of the minimum wage and fitment formula. The 7th CPC had adopted the Dr Aykroyd formula minimum wage is calculated on the basis of the 15th ILC norms. But erred in many aspects for example the average of prices of last 12 months was taken, The housing weight age , education weight age etc . The prices of essential items are rising from past many years, even in last six months the retail inflation is rising above 5.4%.

Secondly the prices quoted by the GOVERNMENT OF INDIA MINISTRY OF LABOUR & EMPLOYMENT LABOUR BUREAU CLEREMONV, SHIMLAHttp://Labourbureaunew.Gov.In/ , the Director of Economic & statics , Ministry of Agriculture and Farmers Welfare, Government of India, New Delhi & the retail market prices are varying .

If we calculate the minimum wage based upon the LABOUR & EMPLOYMENT LABOUR BUREAU taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 21,000 / and fitment formula works to 3.00. This will result in 34% wage hike without allowances.

If we calculate the minimum wage based upon the Director of Economic & statics , Ministry of Agriculture and Farmers Welfare, Government of India, New Delhi taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 23,000 / and fitment formula works to 3.30. This will result in 50% wage hike without allowances.

If we calculate the minimum wage based upon the retail market taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 28,000 / and fitment formula works to 4.00. This will result in 70% wage hike without allowances.

The most important demand is that of the CG employees is the minimum wage and fitment formula.

The Staff side had demand of minimum wage of Rs 26000/- & fitment formula of 3.71. Against this the 7th CPC had recommended minimum wage of Rs 18000/- & fitment formula of 2.57. The 7th CPC recommendations has provided only at 14% wage hike at Group “C” level it is only ranging from Rs 2240/- to Rs 3500/- increase per month, and at Group “B” level ranging from Rs 4000/- to Rs 6500/- increase per month. After deductions & income tax the net increase will be just from Rs 500/- to Rs 3000/- only.

This increase is lowest by any pay commission, hence vast changes are required as the prices of essential commodities have gone up and also the inflation rate has gone up.

Comrades it is the time to struggle, we should educate the members and prepare for struggle, so that we should get at least 50 % wage hike without allowances, as allowances are not taken into pension benefit.

Only struggle will get us benefit. Please don’t believe on rumours. Now it is now or never.

Comradely yours

(P.S.Prasad)
General Secretary

COC Karnataka

Source: www.karnatakacoc.blogspot.in

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మన పత్తి విధానాన్ని సొమ్ము చేసుకుంటున్న విదేశీ సంస్థలు

21 Tuesday Jun 2016

Posted by raomk in AP, AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

china cotton policy, cotton policy, INDIA COTTON, MNCs

ఎం కోటేశ్వరరావు

    ధరలు పతనమయ్యాయని రైతులు పత్తిని అమ్ముకోకుండా నిలుపుకోగలరా ? రైతు పత్తిని అమ్మలేదు కనుక తమకు ఇవ్వాల్సిన వేతనాలు వాయిదా వేసినా ఫరవాలేదని వ్యవసాయ కార్మికులు తాపీగా వుండగలరా ? కానీ పత్తి ధరలు పెరిగాయి కనుక వారానికి రెండు రోజులు మిల్లులు మూసివేయాలని తెలంగాణా నూలు, వస్త్ర మిల్లుల యజమానులు నిర్ణయించారు. బహుళజాతి గుత్త సంస్థలు అక్రమంగా పత్తి నిల్వలు పెట్టి ధరలు పెంచారని వాపోయారే తప్ప అక్రమ నిల్వలలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరలేదు. దానికి బదులు తమకు వుదారంగా రుణాలు ఇవ్వాలని, వడ్డీ తగ్గించాలని, రుణ వ్యవధిని మూడు నుంచి తొమ్మిది నెలలకు పెంచాలని, ఎగుమతులు చేసిన వారికి మూడుగా వున్న ఎగుమతుల ప్రోత్సాహకాన్ని ఏడున్నరశాతానికి పెంచటం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ధరలను అదుపు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా వారు సూచించారు. రెండు రోజులు మూత పెట్టినందువలన మిల్లు యంత్రాలు తుప్పుపట్టిపోవు, కార్మికులకు వేతనాలు మాత్రం వుండవు. చేసిన పనికే తగిన వేతనాలు ఇవ్వని వారు అసలు చేయని పనికి ఇస్తారా ?

   ఈ పరిస్థితికి వారు చెబుతున్న కారణాలు ఏమిటి ? బహుళజాతి గుత్త సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసి అక్రమ నిల్వలు పెట్టటం. ఆ కంపెనీలకు కారుచౌక వడ్డీకి రుణాలు దొరుకుతుండగా తమకు 14శాతం వరకు పడటం. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులకు ఐరోపా, అమెరికా వంటి చోట్ల పన్నులు తక్కువ లేదా అసలే లేకపోవటం వంటి కారణాలతో తాము నష్టపోతున్నామని యజమానులు చెబుతున్నారు.

   పత్తి గిట్టుబాటు కావటం లేదు కనుక దాని బదులు మరొక పంటలు వేయాలని తెలంగాణా ప్రభుత్వం రైతాంగానికి సలహా ఇచ్చినప్పటికీ రైతులు ఈ ఏడాది కూడా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నట్లు విత్తనాల కొనుగోలు తీరుతెన్నులు వెల్లడిస్తున్నాయి. రెండవది వాణిజ్య పంటలు రైతాంగానికి జూదంగా మారిపోయిన తరువాత ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు రు.5,800 వరకు వుండటం కూడా వారిని ఆకర్షిస్తుంది. తీరా పసిపిల్లల మాదిరి పంటను సాకి పత్తిని తీసుకొని మార్కెట్లోకి వెళితే 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పిన కేంద్రం విదిల్చిన ముష్టి రు.60లతో కలుపుకొని క్వింటాలు రు.4,160కి లోపుగా తప్ప సిసిఐతో సహా ఏ ఒక్క వ్యాపారీ కొనుగోలు చేయడు. మార్కెట్‌ సీజన్‌లో ధరలను అదుపు చేయటానికి సిసిఐ తన వంతు ‘కృషి ‘చేస్తోంది. మోడీ సర్కార్‌ కృషి కల్యాణ్‌ పేరుతో వసూలు చేస్తున్న అరశాతం సేవాపన్ను రైతులు కూడా చెల్లిస్తారు. కనీసం వారు చెల్లించిన మొత్తమైనా ఏదో ఒక రూపంలో వారి కల్యాణానికి అందుతుందా? అన్నట్లు మరిచాను కెసిఆర్‌ ప్రభుత్వ కల్యాణ లక్ష్మి పధకం వుంది కదా కనీసం దానినైనా రైతాంగ బిడ్డలకు వర్తింప చేస్తారా ?

     ఇటు తెలంగాణా అటు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం భారత రైతాంగాన్ని, అటు మిల్లు యజమానులను, వాటిలో పని చేసే కార్మికులను అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న వుమ్మడి కారణం ఏమిటి ? రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తాను రెండవసారి పదవి కొనసాగింపు కోరుకోవటం లేదు అని ప్రకటించిన 48 గంటలలోనే కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడులకు భారత గడీ తలుపులను మరింతగా తెరిచింది. ఇంతకాలం ఈ పనిచేయకపోవటానికి ఆయనే కారణం అని చెప్పకనే చెప్పినట్లు అవటంతో పాటు రాజన్‌ ప్రకటన ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారిన చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ కూడా కనిపిస్తోంది. పత్తి వ్యాపారంలో బహుళజాతి గుత్త సంస్థలను, విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు మిల్లు యజమానులే చెప్పారు. విదేశీ పెట్టుబడులు వస్తే మన రైతాంగానికి, వినియోగదారులు, అన్ని వర్గాల వారికి స్వర్ణయుగం వస్తుందన్నట్లుగా గతంలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఇప్పుడు అంతకంటే మరింత గట్టిగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారంతా చెబుతున్నారు కదా ? మరి పత్తి విషయంలో జరిగిందేమిటి ?

     పత్తి విత్తనాలు మొత్తం మోన్‌శాంటో వంటి బహుళజాతి గుత్త సంస్థల చేతుల్లోకి పోయాయి. పత్తి వేసిన తరువాత వచ్చే కలుపు తీయాలన్నా, క్రిమికీటకాలను చంపాలన్నా మోన్‌శాంటో లేకుండా గడవదు. ఒక్క యూరియా తప్ప మిగతా అన్ని రకాల ఎరువుల ధరలపై కేంద్రం కంట్రోలు ఎత్తివేసింది. వాటిని దిగుమతి చేసుకోవాలన్నా, దేశీయంగా ప్రయివేటురంగంలో తయారు చేయాలన్నా మోన్‌శాంటో లేదా దాని వంటి ఇతర కంపెనీల అనుబంధ సంస్ధలు, భాగస్వాములు తప్ప మరొకరు లేరు. మరి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు మనకు వుపయోగపడిందెక్కడ ? గతంలో బ్రిటీష్‌ పాలనలో మన దేశం మగ్గిన సమయంలో మన దేశాన్ని ముడిసరకులు ఎగుమతి చేసే దేశంగా, పారిశ్రామిక సరకుల కొనుగోలు దేశంగా మార్చి మన సంపదలను కొల్లగొడుతున్నారనేగా మన గాంధీ తాత వంటి వారి నాయకత్వాన పోరాడి వారిని తరిమివేసింది. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మోడీ అంకుల్‌ అంతకంటే ఎక్కువగా మన జీవితాల్లోకి విదేశీ పెట్టుబడులు, కంపెనీలను తీసుకువస్తా అంటూ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడుపుతున్నారు కదా ? అవే కంపెనీలు మరింతగా మన దగ్గర నుంచి సంపదను తరలిస్తున్నాయా లేదా ? మన రూపాయి విలువను తగ్గించి మన ప్రభుత్వాలు మన సరకులను విదేశాలకు చౌకగా విక్రయిస్తున్నాయా లేదా ? ఎగుమతులకు ప్రోత్సాహం ఇస్తున్నాయా లేదా ? ఇంకా ఎక్కువ కావాలనే కదా మన తెలంగాణా మిల్లు యజమానులు కోరుతున్నది. ఇక్కడ ఎందరో స్త్రీ,పురుషులు ఏకవస్త్రాలతో కాలం గడుపుతున్న చేదు నిజం, సిగ్గుపడాల్సిన విషయం అందరికీ తెలుసు. విదేశాల వారికి ఇచ్చే రాయితీని మనవారికి ఎందుకు ఇవ్వరు ? గతంలో తెల్లవారు ప్రపంచంలో ఎక్కడ వ్యవసాయం చేస్తే అక్కడికి మన దేశం నుంచి ఆ పొలాల్లో పనిచేసేందుకు రైతులు, వ్యవసాయ కూలీలను తీసుకుపోయారని చరిత్రలో చదువుకున్నాం. అక్కడ పనిచేసే వారు లేకనా ? కానే కాదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తోంది, చౌకగా పని చేయటానికి సిద్ధ పడ్డారు కనుక. ఇప్పుడు వ్యవసాయ కూలీల బదులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు అలాంటి చౌక కూలీలుగా ధనిక దేశాలకు వెళుతున్నారా లేదా ?

     సంస్కరణల పేరుతో మనం అనుసరిస్తున్న విధానాలు అంతిమంగా ఏ ఫలితాలు ఇస్తాయన్నది గీటు రాయిగా వుండాలి. చైనా కూడా సంస్కరణలు అమలు జరుపుతున్నది.మనకంటే వెనుకగా స్వాతంత్య్రం పొందింది. మన పెద్దలు కొందరు చెప్పినట్లు వారు నల్లమందు భాయిలుగా వున్నపుడు మనం ఎంతో తెలివితేటలతో వున్నాం. ఇప్పుటి పరిస్ధితి ఏమిటి? జపాన్‌ను పక్కకు తోసి అమెరికాతో ఒకటవ నంబర్‌ స్థానానికి నువ్వా నేనా అని పోటీ బడుతున్నారు వారు. మన వారు నల్ల మందులేకుండానే మత్తులో జోగుతున్నారా ? పత్తి విషయాన్నే తీసుకుందాం. చైనా విధానం ప్రకారం దేశీయంగా పండిన పత్తితో పాటు దిగుమతులను కూడా ప్రభుత్వ సంస్ధలే చేపడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న ధరల కంటే ఎక్కువే అక్కడి రైతులకు చెల్లిస్తున్నారన్నది చైనా అంటే ఇష్టం లేనివారు కూడా అంగీకరిస్తున్న సత్యం. అదే ప్రభుత్వం పత్తిని సేకరించి మిల్లులకు కూడా విక్రయిస్తున్నది. దానితో వస్త్రాలు,దుస్తులు తయారు చేసిన కంపెనీలు ఇతర దేశాలకంటే చౌకగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు విక్రయిస్తున్నాయని మన వారే గగ్గోలు పెడుతున్నారు కదా ? మన కంటే రైతులకు రెట్టింపు మద్దతు ధర ఇచ్చి మిల్లులకు సరసమైన ధరలకు పత్తిని విక్రయించటం అక్కడ ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు.

     గతేడాది నుంచి చైనా ప్రభుత్వం పత్తి దిగుమతులను నిలిపివేసింది, తన వద్ద వున్న నిల్వలలో కొంత భాగాన్ని వేలం పద్దతిలో ప్రతినెలా విక్రయిస్తోంది. దాంతో ప్రపంచ వ్యాపితంగా పత్తి ధరలు పడిపోయాయి.అయినా రైతాంగానికి ఎలాంటి నష్టమూ రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం పత్తి ధరలు ప్రపంచ మార్కెట్లో పౌను ధర 140-150 సెంట్ల వరకు పలికింది. గతేడాది న్యూయార్క్‌ మార్కెట్‌లో ధరు 66-70 సెంట్ల మధ్యనే కదలాడింది. అయినప్పటికీ చైనా రైతులు అంతకు మించి 85 సెంట్లకు పైగా పొందారు. ఏ ఒక్క పత్తి రైతూ నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నవార్తలు మనం వినలేదు. పత్తి ధరలు ప్రపంచ మార్కెట్‌ కంటే ఎక్కువగా వుండి మిల్లులు మూసి వేసిన యజమానులూ లేరు ? అందరికీ ప్రయోజనం కలిగించే విధానాన్ని, సంస్కరణలను మన ప్రభుత్వాలు ఎందుకు అనుసరించవు ? వాటికి ఎవరు అడ్డం పడ్డారు, మనది ప్రజాస్వామ్యం కదా హాని కలిగించే విధానాల గురించి ఎందుకు మనం చర్చ జరపటం లేదు?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పప్పుల కోసం నరేంద్రమోడీ విదేశీ యాత్రలా ?

20 Monday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Availability of Pulses, Modi, pulse prices, Pulses

పప్పులో నీళ్లు కలిపి తినమంటున్న రామ్‌దేవ్‌

ఎం కోటేశ్వరరావు

     ఈ శీర్షికను చూసి ప్రధాని నరేంద్రమోడీ వీర భక్తులు, కాషాయ దేశభక్తులు కోపం తెచ్చుకోవద్దని మనవి.అంధుల రాజ్యంలో ఒంటి కన్నువాడు మహారాజు అని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏ చిత్తంతో అన్నారో గానీ మోడీగారి పాలన రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సలహాలు ఇచ్చేవారు కూడా అపూర్వ మేథాసంపన్నులుగా వున్నట్లున్నారు. పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న ఈ రోజుల్లో మా కాలంలోనే పప్పులతో ముఖం కడుక్కొని పప్పులతో స్నానం చేసి పప్పులలోనే నిద్రపోయే వారం అని పిల్లలకు రాత్రి పూట పిట్ట కధలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ఏమో ! ‘పప్పుల ధరల అదుపుకు మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన’ ఇది ఒక ఆంగ్ల వార్త శీర్షిక.http://indiatoday.intoday.in/story/modi-to-visit-african-countries-to-check-racing-pulse-prices/1/695912.html

       మేకిండియా పిలుపును అమలు చేసేందుకే మా ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తున్నారని భజన బృందం చెబుతుంటే కామోసనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడుల కోసమే కాదు, పప్పుల కోసం వెళుతున్నారని మనం చెవులప్పగించి వినాలి కాబోలు.కోరి తలమీద పెట్టుకున్నాం కనుక తప్పదేమో మరి ! పట్టణాలలో కొన్ని పప్పుల ధరలు గరిష్టంగా 180 నుంచి 200 రూపాయల వరకు వున్నాయి.గ్రామాలలో అందునా మారు మూల గ్రామాలలో ఇంకా ఎక్కువ వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. మంచి రోజులు రానున్నాయని చెప్పటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు తప్ప పప్పులుడికేందుకు చర్యలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ జూలై తొలి వారంలో ఆఫ్రికా దేశాల పర్యటన జరుపుతున్నారు.ఆయనతో పాటు సీనియర్‌ అధికారుల బృందం వెళ్లి ఆఫ్రికా ఖండ దేశాలలో ప్రయివేటు వారితో కాంట్రాక్టు సాగు పద్దతిలో పప్పులు పండించేందుకు, పప్పులను దిగుమతి చేసుకొనేందుకు గల అవకాశాలను పరిశీలించి వస్తారని అధికారులే చెప్పినట్లు వార్తలు. పెట్టుబడుల కోసం మోడీయే విదేశాలు తిరిగి, పప్పుల కోసమూ ఆయనే వెళ్లాల్సి రావటం అంటే అధికారులు మోడీ మెప్పు పొందేందుకు, ఆయనను మెప్పించేందుకు ఇలా చేస్తున్నారా లేక సంబంధిత మంత్రులు వుత్సవిగ్రహాలా ?

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు తామరతంపరగా పుట్టుకు వస్తున్నారు, వారిపై నిఘావేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి), ఐబి, రెవెన్యూ ఇంటెలిజన్సు విభాగాలకు సిబ్బంది చాలని పరిస్థితులో పప్పులపై ఒక కన్నేసి వుంచమని కూడా ప్రభుత్వం చెప్పిందట. మన దేశంలో ఏటా పదిలక్షల టన్నుల పప్పుల వినియోగం పెరుగుతున్నదని అంచనా, ప్రస్తుతం ఏటా 24మిలియన్‌ టన్నులు అవసరం కాగా నాలుగు లక్షల టన్నుల వరకు దిగుమతులు చేసుకుంటున్నాం.

   ప్రపంచ పప్పుల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మన వినియోగదారులకు పప్పుల షాక్‌ కూడా ఈ సంవత్సరమే తగలటం విశేషం. పప్పుల వినియోగం, కొరత గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏం చేసిందన్నది ఒక ప్రశ్న. (వుత్పత్తి, దిగుమతి మిలియన్‌ టన్నులలో, ఖర్చు కోట్ల రూపాయలలో, వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా )

సంవత్సరం    వుత్పత్తి       దిగుమతి       దిగుమతి ఖర్చు

2012-13       18.34          4.02             13,357

2013-14        19.27         3.18             11,038

2014-15        17.15         4.00             14,396

2015-16        17.33         5.50             24,198

     పై అంకెలను చూసినపుడు ఏటేటా పెరుగుతున్న వినియోగం, తగ్గుతున్న వుత్పత్తికి అనుగుణంగా దిగుమతులు లేవన్నది స్పష్టం. 2015-16 సంవత్సరానికి సంబంధించి వుత్పత్తి అంకెలు అంచనా మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాభావం, కరవు కారణంగా వుత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మనకు కనిపిస్తున్నా ప్రభుత్వం గొప్పకోసం వుత్పత్తి పెరుగుదల అంచనా చూపింది. రెండవది 2012-13 సంవత్సరాలలో టన్ను రు 33వేల చొప్పున దిగుమతి చేసుకుంటే గతేడాది 43వేలకు పెరిగింది. మన పప్పుల వుత్పత్తి తగ్గిపోయిన విషయం గమనంలో వున్న కేంద్రం లేదా రాష్ట్రాలు గానీ అవసరమైన దిగుమతులను చేసుకోని కారణంగానే, అనేక చోట్ల నిల్వలన్నీ అయిపోవటాన్ని అవకాశం తీసుకున్న వాణిజ్యశక్తులు ధరలను అనూహ్యంగా పెంచివేశాయి. వారిని అదుపు చేసేందుకు, దొంగ నిల్వలను పట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ కనపడదు.

    ఆఫ్రికా ఖండంలో పప్పులను పండించి దిగుమతి చేసుకొని ధరలను తగ్గిస్తామని కేంద్రం చెబుతుంటే దానికి గట్టి మద్దతుదారుగా స్వయం ప్రకటిత బాబా రామదేవ్‌ ఏ చిట్కా చెప్పారో తెలుసా. న్యూఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో యోగా శిక్షణలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ పప్పుల ధరల పెరుగులకు నరేంద్రమోడీని విమర్శించకూడదని సెలవిచ్చారు. పోనీ అంతటితో ఆగితే ఫరవాలేదు, ఈ సమస్యను అధిగమించటానికి పప్పులో నీళ్లెక్కువ పోసుకొని తింటే పొదుపు చేసి ఖర్చుకు ఖర్చు, పెంచుకున్న ఒళ్లు తగ్గి ఆరోగ్యానికి ఆరోగ్యమూ అని కూడా వుద్భోదించారు. అంటే కోడిగుడ్డంత బంగారం లేనివారెవరూ ఈదేశంలో లేరన్నట్లుగా పప్పులు ఎక్కువగా తిని జనమంతా వూబకాయాలను పెంచుకున్నారని గౌరవనీయులైన రామదేవ్‌ బాబా అనుకుంటున్నారా ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80గ్రాముల పప్పులు తినాల్సి వుంది. మనదేశంలో సగటు లభ్యతే 40 గ్రాముల లోపు వుంది. అసలు పప్పుల ముఖం చూడనివారు కూడా వున్నారంటే ఆశ్చర్యం లేదు.

     రామ్‌దేవ్‌ ఇలా సెలవిస్తే మన కేంద్ర ఆహార మంత్రి మాననీయ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గారు ధరల పెరుగుదల గురించి ఆశ్చర్యపోతున్నారట. పప్పులను పండించేందుకు లేదా దీర్ఘకాలిక దిగుమతులు చేసుకొనేందుకు గాను మయన్మార్‌,మొజాంబిక్‌ దేశాలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు.ఇదెలా వుందంటే దాహంతో చస్తున్నామయ్యా అంటే దేశంలో అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పినట్లు వుంది.పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నపుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం, వారిని నడిపించాల్సిన మంత్రులు ఇంతకాలంగా ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? దేశంలో టమోటాలు, బంగాళాదుంపలు, వుల్లిపాయల వుత్పత్తి గణనీయంగా పెరిగింది, వినియోగంలో మార్పు లేదు అయినా ధరలు పెరిగాయంటే దీనికి పుకార్లే కారణం అని కూడా పాశ్వాన్‌ సెలవిచ్చారు. పుకార్లను తొలగించటానికి ప్రభుత్వ యంత్రాంగం నమో భజనలో వందోవంతైనా ప్రచారంలో స్ధానంలో కల్పించలేదేం?

     మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మంత్రి మరొక మహత్తర సలహా ఇచ్చారు. పప్పుల కంటే కోడి మాంసం ధర తక్కువగా వుంది కనుక దాన్ని తినండన్నారు. అక్కడ కిలో పప్పులు రు.260 వుంటే కోడి మాంసం రు.200లకే దొరుకుతోందట. ఇవేమి ధరలయ్యా బాబూ అని అక్కడి ప్రతిపక్షాల వారు అడిగితే ఈ సలహా ఇచ్చారు.

     మన దేశంలో ఎకరానికి 750కిలోల పప్పుల దిగుబడి వుంటే అభివృద్ధి చెందిన దేశాలలో 1200 నుంచి 1800 కిలోల వరకు వుంది. దీనికి తోడు గత రెండు సంవత్సరాలలో రూపాయి విలువను దిగజార్చిన ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి చేసుకొనే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రులతో కుమ్మక్కయిన వ్యాపారుల సిండికేట్లు ఆఫ్రికా నుంచి కిలో 55 రూపాయలకు పప్పులను దిగుమతి చేసుకొని మన దేశంలో 175 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకొన్నట్లు, దానిలో మోడీకి ఎల్లవేళలా అండదండలుగా వుండే అదానీ వంటి వారు వున్నట్లు వచ్చిన వార్తలను ఇంతవరకు ప్రభుత్వం ఖంచించినట్లు మనకు తెలియదు.పప్పుల దిగుమతికి అదానీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.http://www.indiasamvad.co.in/investigation/inside-story-how-rs-55-per-kilo-african-dal-was-sold-in-india-for-rs-175-7853 అదానీ రేవులలో దిగుమతి చేసుకున్న పప్పులను నిలవ చేసి దాచివేశారని కూడా ఆరోపణలు వున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుబ్రమణ్యస్వామి పర్యవేక్షణలో ఆర్ బి ఐ గవర్నర్‌గా బిజెపి కార్యకర్త ?

19 Sunday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP activist, mody, Raghu ram rajan, RBI, RBI governor, Subramanya swamy

ఎం కోటేశ్వరరావు

     జపాన్‌-ఇండియా, అక్కడ ధరలను ఎలా పెంచాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే, ఇక్కడ ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఇక్కడ వడ్డీరేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ బ్యాంకులో ఎవరైనా డబ్బు దాచుకుంటే వారే 0.10 శాతం ఎదురు చెల్లించాలి. వడ్డీ రేటు ఎక్కువ వుంటే ఆర్ధికాభివృద్ధి వుండదా ? ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో 34.45 శాతం (మే 2016) వుంది. అక్కడ వృద్ధి రేటు గతేడాది 2.1శాతం. పక్కనే వున్న అమెరికాలో వడ్డీ రేటు 0.50 శాతమే అక్కడా వృద్ధి రేటు రెండు శాతం వరకు వుంది. స్వీడన్‌, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌లలో ఎవరైనా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వారే 0.5,0.65,0.75శాతం చొప్పున బ్యాంకులకు ఎదురు వడ్డీ చెల్లించాలి. మరి అక్కడ అభివృద్ధి లేదా ? అంతెందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌లో వడ్డీ రేటు 5.5శాతం కాగా వృద్ధి రేటు 4.8శాతం వుంది. ఇంకా ఇలాంటి వివరాలను పేర్కొంటే బుర్ర బద్దలు అవుతుంది. ఈ దేశాలన్నీ పెట్టుదారీ విధానాన్ని అనుసరిస్తున్నవే. మరి ఈ వడ్డీ రేట్లేమిటి ? కొన్ని దేశాలలో బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చి జనం డబ్బు ఎందుకు దాచుకుంటున్నారు? వారికి పెట్టుబడి అవకాశాలు లేవా ? అభివృద్ధి రేటులో ఇంత వ్యత్యాసం ఏమిటి ? ఎందుకీ ప్రయాస అంటారా ?

     వడ్డీ రేటు తగ్గింపు, తదితర విధానాలపై విబేధాలు, ఆరోపణలు, అవమానాల కారణంగానే రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అసాధారణరీతిలో తాను పొడిగింపును కోరుకోవటం లేదని, తనపని తాను చూసుకుంటానని బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.చరిత్రలో అనేక మంది గవర్నర్లు వచ్చారు, పోయారు. బహుశా ఇలాంటి పరిస్ధితి ఎవరి విషయంలోనూ తలెత్తి వుండదు. కొద్ది వారాల ముందు రాజన్‌ ఈ ప్రకటన చేసి వుంటే నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల జాబితాలో దీనిని కూడా చేర్చి వుండేది లేదా సుబ్రమణ్యస్వామి వంటివారి చేత ప్రకటనలు చేయించి వుండేదేమో ? వడ్డీ రేటుకు, అభివృద్ధి రేటుకూ సంబంధం లేదని చెప్పేందుకే పైన అన్ని వివరాలను పేర్కొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నరేంద్రమోడీ చెప్పినట్లుగా గుజరాత్‌ మోడల్‌ లేదూ, అభివృద్దీ లేదు దాన్ని అంగీకరించటానికి పాలక కూటమికి ధైర్యమూ లేదు, ఈ రోజు కాకున్నా రేపయినా జనం అడుగుతారు. ఇదిగో రఘురామ్‌ రాజన్‌ కారణంగానే ఇదంతా జరిగింది, దాన్ని సరిదిద్దటానికి మూడు సంవత్సరాలు పట్టింది, మరోసారి మాకు అవకాశం ఇస్తే మాజిక్‌ చూపిస్తాం అని 2019ఎన్నికలలో సాకు చెప్పేందుకే ఇంతా చేశారా ? ఏమో గత 24 సంవత్సరాలలో ప్రతి గవర్నర్‌కూ రెండవ సారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రాజన్‌ పట్లనే ఇలా ఎందుకు వ్యవహరించింది? దీని వలన ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాధానం లేకపోగా మంచిది కొత్త గవర్నర్‌ను చూస్తాం అని ఆర్ధిక మంత్రి జైట్లీ తాపీగా చెప్పారు.

    ఒకటి మాత్రం స్పష్టం. వచ్చే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ తమకు తాన తందానా పలకాలన్న సందేశాన్ని మోడీ సర్కార్‌ స్పష్టంగా పలికింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ తన పార్టీ కార్యకర్తలతో నింపుతోంది. టీవీ సీరియల్స్‌లో గుడ్డి పాత్రల వంటి చిన్నా చితకా అనుభవ తప్ప పెద్ద అనుభవం లేని గజేంద్ర చౌహాన్‌ను ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో మరో చౌహాన్‌ రంగం మీదకు వచ్చారు. ఈయనకు ఆ పరిమిత అనుభం కూడా లేదు. తాజాగా జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్ధ అధిపతిగా 68 సంవత్సరాల మాజీ క్రికెటర్‌ చేతన చౌహాన్‌ను నియమించింది. ఈ సంస్థ అధిపతులుగా సుప్రసిద్ద విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతికవేత్త, ప్రొఫెషనల్‌ను నియమించాలని చట్టంలో స్పష్టంగా వుంది.దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్తను అందలమెక్కించారు.దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ చర్యను పరిహసిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో అధిపతిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను వేస్తారేమో అన్నది వాటిలో ఒకటి. ఇవన్నీ చూస్తే రేపు ఏ బిజెపి కార్యకర్తనో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆర్ధికవేత్త సుబ్రమణ్య స్వామి ఎలాగూ మార్గదర్శనం చేసేందుకు వున్నారు కదా !

    ప్రతి దేశ రిజర్వు బ్యాంకు నెలా లేదా రెండు నెలలు, లేదో ఒక నిర్ణీత వ్యవధిలో తన విధాన సమీక్ష చేసుకొని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు వస్తువులు, సేవల ధరల పెరుగుదల తీరుతెన్నులను ప్రతిబింబిస్తుంది. సాధారణ సూత్రం ప్రకారం వడ్డీరేటు తక్కువ వుంటే ఎక్కువ మంది అప్పుచేస్తారు, ఆ సొమ్ముతో వస్తువులను కొంటారు, అది ఆర్ధికవ్యవస్ధ పురోగతికి దారితీస్తుంది.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాయిదాల మీద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనే వారికి వడ్దీ రాయితీ గురించి వల విసిరే వారు. ఇప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువుల కొనుగోలుకు అప్పులిస్తున్నారు. అంటే కంపెనీలే వస్తువు ధరలో వడ్డీని కూడా కలుపుతాయి అది వేరే విషయం. వడ్డీ రేట్లు పెరిగితే జనం తమ సొమ్మును పొదుపు చేసుకోవటం ఎక్కువ చేసి వస్తు కొనుగోలు తగ్గిస్తారు.అది ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే కాదు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అందువలన వడ్డీరేటు తగ్గింపు, పెంపుదల అనేది ఆర్ధిక వ్యవస్థను సమతూకంలో వుంచే సాము గరిడీ వంటిది.

    టీవీ సీరియల్స్‌లో బ్రేక్‌ మాదిరి ఇక్కడొక చిన్న పిట్ట కధ చెప్పాలి. ఒక పెద్దమనిషి కారణాలేమైనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడట. పెద్ద భార్య జుట్టు నెరిసింది, భర్త జుట్టులో నలుపు తెలుపూ రెండూ వున్నాయి. అందుకని ఆమె నల్ల వెంట్రుకలను పీకివేసేదట. చిన్న భార్య తన జుట్టు నలుపు కనుక తన భర్త జుట్టులో వున్న తెల్ల వెంట్రుకలను నిర్ధాక్షిణ్యంగా తీసివేసేదట. చివరికి ఏమైందో చెప్పక్కర లేదు. ఆర్ధిక వ్యవస్థలో కూడా విరుద్ధ శక్తులు విధానాన్ని తమవైపు వుండేట్లు చూసుకుంటాయి. కరెన్సీ విలువనే చూడండి. విలువ ఎక్కువగా వుంటే దిగుమతి చేసుకొనే వస్తువులు చౌకగా వస్తాయి.తక్కువగా వుంటే మన వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణితో తక్కువగా వుండి ఎగుమతులు పెరుగుతాయి. అందువలన ఒకరు మన రూపాయి విలువ తగ్గించాలని కోరితే, మరొకరు పెంచాలని కోరతారు. వడ్డీ రేటు కూడా ఇంతే.

   ఇక రఘురామ రాజన్‌ విషయానికి వస్తే ఆయన పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు తప్ప వ్యతిరేకించే ఆర్ధికవేత్త కాదు. అందువలన ఆయన కొనసాగితే సామాన్య జనానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు, జరగాల్సిన కీడు ఇప్పటికే జరిగింది కనుక జనానికి పెద్దగా నొప్పి కూడా వుండదు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో దేశం వెలిగిపోతోంది అని ప్రచారం చేసుకుంది. నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ ప్రధాని కనుక పాలన చేపట్టిన మరుసటి రోజు నుంచే వెలిగి పోతోందని ప్రచారం ప్రారంభించారు. మన రిజర్వుబ్యాంకు గవర్నర్లలో రాజన్‌ పిన్న వయస్కుడు. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం వుందని చెబుతారు. అమెరికాలో వుండి వచ్చారు కనుక అక్కడి మాదిరి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు అనుకున్నారేమో. నరేంద్రమోడీ సర్కార్‌ అతిశయోక్తులను భరించలేక అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అని పరోక్షంగా చురక అంటించారని అంటున్నారు.దాని మీద ఎవరు ఎలా విరుచుకుపడిందీ దేశం చూసింది. అప్పుడే రాజన్‌కు మరొక అవకాశం రాదని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాతే శిఖండి మాదిరి నోటి తుత్తర సుబ్రమణ్య స్వామిని రంగంలోకి దించారు. ఇదంతా పొమ్మనకుండా పొగబెట్టటం అని తెలియనంత అమాయకంగా రాజన్‌ లేరు కనుక ఆయన కూడా అసాధారణ రీతిలో పదవీ విరమణకు 80 రోజుల ముందుగానే ఒక బహిరంగ లేఖ రాసి తానేమిటో ప్రదర్శించుకున్నారు. ఇదంతా లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా రాజన్‌ తప్పుకునే అవకాశాన్ని మోడీ సర్కార్‌ సృష్టించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అలా జరిగితే సలహాదారులకు పనేముంటుంది?

    ఇప్పుడు ప్రభుత్వ పరిస్ధితి ఒకరకంగా ఇరకాటంలో పడింది.ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన ఇప్పడప్పుడే పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ స్ధితిలో మోడీ జనంలో ఎన్నో ఆశలు కల్పించారు. దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ రోజులు గడిపి తానేదో అద్బుతదీపాన్ని తెస్తున్నట్లు హడావుడి చేశారు. రాబోయే రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌ ప్రతి చర్యను రాజన్‌ హయాంతో పోల్చుతారు. రాజన్‌ అయినా మరొకరైనా మన జీవనాడులను చేజిక్కించుకున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గీచిన పరిధులలో మాత్రమే పనిచేయాల్సి వుంటుంది. దానికి భిన్నంగా వెళ్లే అవకాశం లేదు.

     ప్రపంచీకరణలో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు తెరిచారు. ఫోర్టుపోలియో పెట్టుబడులు అంటే వడ్డీ వ్యాపారుల వంటి వారు. మన ప్రభుత్వం తీసుకొనే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా వుంటే మన రుణపత్రాలు(బాండ్లు) కొంటారు. లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడకు వెళ్లిపోతారు. మనకు ఆ రూపంలో విదేశీ మారక ద్రవ్యం రాకపోతే మన విదేశీ చెల్లింపులు ప్రమాదంలో పడతాయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన రోజులు వస్తాయి. అందువలన రిజర్వు బ్యాంకు గవర్నరు లేదా వడ్డీ రేటు విధానం గురించి మోడీ సర్కార్‌ ఎంతగా వివాదం లేదా ప్రచారం చేస్తే అంతగా జనం దృష్టి వాటిమీద పడుతుంది. పర్యవసానాలపై స్పందన కూడా ఎక్కువగానే వుంటుంది.

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు గత రెండు సంవత్సరాల కాలంలో పెరిగారు, అలాంటివారిపై చర్యలకు వాణిజ్యబ్యాంకులను రాజన్‌ కదిలించారని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే కావూరి సాంబశివరావు వంటి ఎందరో బిజెపిలో చేరిన రుణ ఎగవేతదారుల వత్తిడి కూడా నరేంద్రమోడీ మీద వుందా ? రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలన్నీ అజెండాలోకి వస్తాయి. పశ్చిమ దేశాల పరిణామాలను చూస్తే ఆర్ధిక సంక్షోభ భారాలను సామాన్య జనం మీద నెట్టటం కనిపిస్తోంది. దానికి అయా దేశాలలో వున్న రిజర్వుబ్యాంకులు సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందువలన మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మరింతగా కట్టబెట్టాలన్నా, జనంపై భారాలు మోపాలన్నా రిజర్వుబ్యాంకు విధానాలు ముఖ్యం. అందువలన కొత్త గవర్నర్‌గా ఎవరిని తెస్తారు ? ఇప్పటి కంటే మౌలిక మార్పులు ఏం చేస్తారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: