Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక ఒక్క ఏడాదిలోనే ఏకంగా 16 పాయింట్లు పెరిగిందని బిజెపి బాకా లొట్టలు వేసుకుంటూ చెప్పటం విన్నాను. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ బాకాలుగా మన ఆకాశవాణి, దూరదర్శన్‌లు పని చేస్తాయి గనుక బిజెపి బాకా అన్నందుకు ఆ పార్టీ వారు అన్యధా భావించవద్దు. ఎవరైనా అభ్యంతరం అంటే గతంలో కాంగ్రెస్‌ బాకాలని తమ పార్టీ నేతలు చేసిన విమర్శలను ముందుగా వుపసంహరించుకోమని కోరాలి. నీకిది నాకది అంటూ వాటాలు వేసుకొని పంచుకొనే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్ధలు మరింతగా మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు, పూర్తిగా దిగువ స్ధాయికి విస్తరించి లాభాలు పెంచుకొనేందుకు, మన జనజీవితాలను మరింతగా అవి కట్టడి చేసేందుకు వీలుగా గత రెండున్నర సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పడుతున్న కష్టం లేదా శ్రమకు ఇది గుర్తింపు అనటం నిస్సందేహం. సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వర్ణించినట్లు ఏదేశంలో అయినా పేపర్‌వాలా లేదా ఒక చాయ్‌వాలా అయినా అపర కోటీశ్వరుడయినా పెట్టుబడిదారీ దేశంలో అధికారానికి వస్తే ఇలాగే జరిగింది. అదేమిటో కాంగ్రెస్‌-బిజెపి, తెలుగుదేశం మరొక పార్టీ ఏది అధికారంలో వున్నా అందరినీ కోటీశ్వరులను చేయాలనే మహత్తర యావలో ముందుగా అప్పటికే వున్న కోటీశ్వరులను మరింతగా ఎంత ఎత్తుకు పెంచవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పార్టీలన్నీ ఒకతానులో ముక్కలే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు ఏ పార్టీ అధికారంలో వుంటే దానిలోనే చేరిపోతారు. ఎవరి ఇంట్లో చూసినా ఎప్పుడూ అన్ని పార్టీల కండువాలూ,జండాలూ, కర్రలూ సిద్దంగా వుంటాయి.

    మధ్యలో కొన్నేండ్ల జనతా పార్టీ, నేషనల్‌ ఫ్రంట్‌ ,బిజెపి పాలన పదేండ్లు మినహా 1947 నుంచి 2014వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ మన దేశంలో అధిక సంపదలు గల వ్యక్తులుగా 2013 నాటికి 1,56,000 మందిని తయారు చేసింది.http://www.ndtv.com/india-news/india-home-to-1-98-lakh-millionaires-world-wealth-report-2015-1217902. చాయ్‌ వాలా నరేంద్రమోడీ ప్రారంభమే జెట్‌ వేగంతో వూపందుకు కుంది కనుక 2014 నాటికే వారి సంఖ్య 1,98,000 వేలకు పెరిగింది. ధనికులలో దారిద్య్రరేఖ నుంచి ఎగువకు ఒక్క ఏడాదిలో నలభై రెండువేల మందిని చేర్చారు.ఈ స్పీడున 2017 నాటికి మొత్తం 3,43,000 మంది ఆ స్థాయికి చేరుకోవచ్చట.http://www.rediff.com/business/slide-show/slide-show-1-117-lakh-ultra-high-networth-individuals-in-india/20140724.htm#1 అరవై సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని ఐదు సంవత్సరాలలో చేసి చూపుతామని, మంచి రోజులను తెస్తామని బిజెపి, వారికి మద్దతుగా అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెప్పిన మాటలకు, చేసిన బాసలకు అర్ధం ఇదన్న మాట. ఇంతకీ అధిక సంపద అంటే ఎంతయ్యా అంటే వ్యక్తిగతంగా పాతిక కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన కలిమి కలిగిన వారు. అంతకంటే తక్కువ వున్న వారు ధనికులలో దారిద్య్రరేఖకు దిగువ వున్నట్లు లెక్క. గతంలో వాజ్‌పేయి అధికారం చివరి రోజుల్లో భారత్‌ వెలిగిపోతోందని ప్రచారం చేసి ఎన్నికలలో పాల్గొన్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు వాజ్‌పేయి కంటే నరేంద్రమోడీ తెలివిగల వారు కనుక ప్రారంభం నుంచి భారత్‌ వెలిగిపోతోంది అన్న ప్రచారం చేయటంలో కిటుకు ఇదే. తొలి ఆరునెలల్లోనే ప్రధాని మోడీ నాయకత్వంలో ‘చారిత్రాత్మక, అసాధారణ’ విజయాలను సాధించారని స్వయంగా ఆయన ఆత్మ అమిత్‌ షా సుష్పష్టంగా చెప్పారు.http://www.financialexpress.com/economy/shades-of-india-shining-amit-shah-says-extraordinary-modi-govt-has-made-common-mans-life-easier/13416/

     బాకాలెప్పుడూ విజయగానాలే చేస్తుంటాయి. అప్రియాలను వినపడ, కనపడనివ్వవు. పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక పైకి గంతు వేసిన వార్తతో పాటు దేశంలో నిరుద్యోగిత ఐదు సంవత్సరాల రికార్డుకు చేరింది. మొదటి సంతోష వార్తను ప్రపంచ కుబేరులు ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ఆరి&ధక వేదిక అనే ఒక ప్రభుత్వేతర సంస&ధ చెబితే రెండవ దుర్వార్తను స్వయంగా మన కార్మిక మంత్రిత్వశాఖే వెల్లడించింది. పై వార్తతో ఆనంద పడిన వారు అదెంత వరకు వాస్తవమో ఎలాంటి సందేహాలు వెలిబుచ్చలేదు గాని రెండో వార్తను చూసి ఇదంతా తొండి, లెక్కలు సరిగ్గా వేయలేదు, సర్వే పరిమితంగా వుంది, రాష్ట్రాలలో జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నరేంద్రమోడీని బదనాం చేయటానికి కొత్తగా కార్మిక శాఖేమీ కొత్త పద్దతిని ప్రవేశపెట్టులేదు, గతం నుంచీ అనుసరిస్తున్నదే అది. కార్మికశాఖ వివరాల ప్రకారం 2011-12లో నిరుద్యోగిత 3.8శాతం వుంటే 2015-16లో 5శాతానికి చేరింది. ఇదే కాలంలో మహిళలలో నిరుద్యోగిత రేటు 6.9 నుంచి 8.7కు పెరిగింది. దీన్ని కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ‘చారిత్రాత్మక, అసాధారణ ‘ విజయమే మరి. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వైపు కొద్ది తేడాలతో వృద్ధి రేటు కొనసాగుతుండగా వుపాధి పడిపోవటాకి కారణాలు ఏమిటో మన పెద్దలు చెప్పాలి. మన జిడిపి వృద్ధి రేటు గురించి చెప్పుకోవాలంటే సామాన్యులకు అదొక అంతుబట్టని ఆల్జీబ్రా. ప్రభుత్వం లెక్కించే తీరులో, ప్రాతిపదిక సంవత్సరాలలో మార్పు కారణంగా అంకెలు మారిపోతుంటాయి. అందువలన ఒక మార్పు జరిగిన తరువాత పూర్వపు అంకెలతో పోల్చుకుంటే మనకు సరైన అర్ధం దొరకదు. వుదాహరణకు 2011 ప్రాతిపదిక లెక్కల ప్రకారం అంకెలన్నీ మారిపోయాయి. 2011-12 ధరల ప్రకారం జిడిపి 2012-13 నుంచి 2015-16 సంవత్సరాల మధ్య 5.2,5.6,7.2,7.6గా నమోదెంది. అదే సంవత్సరాలలో వర్తమాన ధరల ప్రకారం 13.9, 13.3, 10.8, 8.7గా వుంది. ఒక సూచిక పెరుగుదలను, మరొకటి తగ్గుదలను చూపుతున్నది.http://statisticstimes.com/economy/gdp-growth-of-india.php దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా రాజకీయ నాయకులు జనం దగ్గరకు వచ్చేసరికి తమకు వాటంగా వున్న అంకెలను గుమ్మరిస్తారు. జిడిపి రేటును ఎటుతిప్పి ఎలా తిప్పినా నిరుద్యోగం వంటి విషయాలకు వచ్చే సరికి అలాంటి గారడీ కుదరదు. అందుకే అవి నిజాలను వెల్లడిస్తాయి.

    ఈ మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది పోగా మిగిలిన పత్తి పంట చేతికి వస్తే మంచి ధర వస్తుందేమో అని రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వార్త చదివితే ఆశపడాలో ఆగ్రహించాలో ఆలోచించుకోవటం మంచిది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తిని శ్రీలంక రాజధాని కొలంబో రేవులో నిల్వ చేసుకొనే వీలు గురించి చర్చించటానికి దక్షిణభారత మిల్లుల యజమానుల సంఘ ప్రతినిధులు ఏడుగురితో కూడిన ప్రతినిధి వర్గం అక్టోబరు మొదటి వారంలో కొలంబో వెళ్ల నుంది.http://www.thehindu.com/business/Industry/cotton-mills-explore-colombo-storage-facility/article9154812.ece సెప్టెంబరుతో ముగిసే పత్తి సంవత్సరంలో మన దేశం 20 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకున్నదని, వచ్చే ఏడాది దిగుమతి మొత్తం ఇంకా పెరగనుందని మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌ చెప్పారు. భారత్‌, ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ వ్యాపారులు మలేషియాలో పత్తి నిల్వలు చేశారని, దిగుమతి వ్యవధి, ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా తూత్తుకుడి రేవులో నిల్వ చేసుకొనేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామని, ఈ లోగా కొలంబో రేవులో నిల్వ చేసుకొనే అవకాశాల గురించి చర్చించేందుకు వారి ఆహ్వానంపై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ రెండు లక్షల బేళ్లను నెల రోజుల పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా నిల్వ వుంచవచ్చునని చెప్పారు. మన దేశ అవసరాలకు మించి పత్తి వుత్పత్తి చేస్తున్న మన రైతాంగానికి విదేశీ దిగుమతులు వెన్ను విరిచేవే తప్ప మరొకటి కాదు. పత్తి దిగుమతి అంటే ఇక్కడ దొరికే రేటు కంటే తక్కువ అయితేనే మిల్లుల వారు మొగ్గు చూపుతారు. అంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మితేనే ఇక్కడ కొనుగోలు చేస్తారు.అదే జరిగితే ఇక్కడి రైతులేం కావాలి మరి !