Tags
BJP, BJP’s trolling army, cow masks, Hindu Fundamentalism, Hindu supremacy, Hinduthwa, Indian women wearing cow masks, Narendra Modi, trolling army
గీతా పాండే బిబిసి న్యూస్, ఢిల్లీ
భారత దేశంలో పశువుల కంటే మహిళలు తక్కువ ప్రాధాన్యత కలిగిన వారా అనే తుపాకి మందులా పేలే ప్రశ్న వేస్తూ ఆవు ముసుగులు ధరించిన మహిళల ఫొటోలు దేశంలో వైరస్ మాదిరి వ్యాపించాయి. వాటిని తీసిన 23 సంవత్సరాల ఫొటో గ్రాఫర్ హిందూ జాతీయవాద మరుగుజ్జు యోధుల(ట్రోల్స్) ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు.
‘ఒక మహిళకంటే ఆవులను ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించటాన్ని చూసి నేను విహ్వలనయ్యాను. అనేక మంది హిందువులు పవిత్రమైనదిగా భావించే ఆవు కంటే అత్యాచారం లేదా దాడికి గురైన ఒక మహిళకు న్యాయం జరగటానికి ఎక్కువ కాలం పడుతోంది.’ అని ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫర్ సుజాత్రో ఘోష్ బిబిసితో చెప్పారు. మహిళలపై నేరాల విషయంలో భారతదేశం తరచూ వార్తలకు ఎక్కుతోంది.ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది.
‘నిందితులకు శిక్ష పడటానికి ముందు కోర్టులలో ఈ కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి. అదే ఒక ఆవును వధిస్తే హిందూ వుగ్రవాద బృందాలు తక్షణమే వెళ్లి ఆవును వధించినట్లు అనుమానించిన వారిని చంపటమో కొట్టటమో చేస్తున్నాయి.’ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ 2014 వేసవిలో అధికారానికి వచ్చిన తరువాత ధైర్యం తెచ్చుకున్న గో రక్షక బృందాల ప్రభావం పెరిగిపోవటంపై తాను తీసిన ఫొటోల కార్యక్రమం ‘తనకు తోచిన పద్దతిలో నిరసన’ అని అతడు చెప్పాడు.
‘విచారణ చేయకుండా చంపిన దాద్రీ వుదంతం( గొడ్డు మాంసాన్ని తిని, నిలవ చేశాడనే పుకార్లతో ఒక హిందూ గుంపు ఒక ముస్లింను హత్య చేసినవుదంతం) ఇంకా అలాంటివే ముస్లింలపై గోరక్షకులు చేసిన ఇతర మతపరమైన దాడులతో ఆందోళన చెందా’ అన్నాడు ఘోష్.
ఇటీవలి నెలల్లో భారత్‌లో సమీకరణలకు ఆవు అత్యంత ముఖ్యమైన జంతువుగా మారింది.ఆ జంతువు పవిత్రమైనదని, దానిని రక్షించాలని బిజెపి నిర్దేశిస్తోంది. అనేక రాష్ట్రాలలో గోవధను నిషేధించాయి, నేరం చేసిన కఠిన శిక్షలను ప్రవేశపెట్టాయి మరియు ఆ నేరం చేసినందుకు మరణశిక్షను విధించేందుకు వీలుగా ఒక బిల్లు పెట్టటం గురించి పార్లమెంట్ పరిశీలిస్తోంది.
అయితే ముస్లింలు, క్రైస్తవులు మరియు కోట్లాది మంది తక్కువ కుల దళితులకు( గతంలో అంటరానివారు) గొడ్డు మాంసం ముఖ్యమైనది. గో రక్షణ గుంపులు చేస్తున్న దుష్కార్యాలకు వారే గురి అవుతున్నారు. ఆవు పేరుతో గత రెండు సంవత్సరాలలో దాదాపు డజను మంది హత్యకు గురయ్యారు.తరచుగా నిరాధారమైన పుకార్ల ప్రాతిపదికన లక్ష్యాలను నిర్ణయిస్తున్నారు అంతే కాదు పాలకోసం ఆవులను తరలిస్తున్నపుడు కూడా ముస్లింలపై దాడులు చేశారు.
ఘోష్ తూర్పు ప్రాంత పట్టణమైన కొల్‌కతాకు( గతంలో కలకత్తా) చెందిన వారు.’కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చిన తరువాతే ‘ ప్రమాదకరమైన మతం మరియు రాజకీయాల కలగలుపు గురించి ‘ తెలిసిందన్నారు.’ఈ ఫొటోల కార్యక్రమం మౌనంగా జరిపే ఒక నిరసన రూపం, అది తగిన ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నా’ అన్నారు. ఈనెల ప్రారంభంలో న్యూయార్క్ సందర్శన సందర్భంగా ఒక దుకాణంలో ఆవు ముసుగును కొనుగోలు చేశారు. తిరిగి వచ్చిన తరువాత సందర్శకులు సంచరించే ముఖ్యకేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, వీధులు, ఇళ్లు, పడవలు, రైళ్లలో ఆవు ముసుగులు ధరించిన మహిళలతో ఫొటోలు తీశారు. ఎందుకంటే ప్రతి చోటా మహిళలు దాడికి అనువుగా వుంటారు.
‘ సమాజంలోని అన్ని భాగాల నుంచి మహిళల ఫొటోలు తీశాను. రాజకీయాలు, మతం ఎక్కువ చర్చలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి రాజధాని నగరం కేంద్రం కనుక ఈ కార్యక్రమాన్ని నేను ఢిల్లీ నుంచి ప్రారంభించాను. భారత్‌లో ఎక్కువ మంది సందర్శించే స్ధలాలో ఒకటైన సరూపమైన ఇండియా గేట్ దగ్గర తొలి చిత్రం తీశాను. తరువాత రాష్ట్రపతి భవనం ఎదుట ఒక మోడల్‌తో తీశాను.మరొకటి కొలకతాలోని హుగ్లీ నదిలో పడవపై హౌరా వంతెన నేపధ్యంలో తీశాను.’ అన్నాడు. అతడు ఎంచుకున్న మోడల్స్ ఇంత వరకు అందరూ స్నేహితులు, బాగా తెలిసిన వారే ఎందుకంటే ‘ ఇది ఒక సున్నితమైన అంశం, దీనికి కొత్త వారిని సంప్రదించటం కష్టం అవుతుంది’ అన్నాడు.
రెండు వారాల క్రితం ఇనస్టాగ్రామ్‌లో అతను ప్రారంభించిన ఫొటోల కార్యక్రమానికి ‘అంతా సానుకూల ‘ స్పందనే వచ్చింది. తొలి వారంలో అది వైరస్ మాదిరి వ్యాపించింది. నా శ్రేయోభిలాషులు, చివరికి నాకు తెలియని వారు కూడా నన్ను అభినందించారు.’ అయితే భారతీయ మీడియా వాటిని ప్రచురించి ఫేస్‌బుక్, ట్విటర్‌లో వాటి కధనాలను పెట్టిన తరువాత ప్రతి క్రియ ప్రారంభమైంది.’ కొంత మంది నన్ను బెదిరిస్తూ వ్యాఖ్యలు రాశారు.ట్విటర్ మీద నన్ను వెంటాడటం ప్రారంభించారు. నన్ను, నా మోడల్స్‌ను ఢిల్లీ జమా మసీదుకు తీసుకువెళ్లి వధిస్తామని, మా మాంసాన్ని ఒక మహిళా జర్నలిస్టు, రచయిత్రికి తినిపిస్తామంటూ జాతీయ వాదులు తమ ఏహ్య భావాన్ని వెల్లడించారు. నా శవాన్ని చూసి నా తల్లి ఏడవటాన్ని చూడాలని వుందని వారు చెప్పారు.’ కొందరు ఢిల్లీ పోలీసులను కూడా సంప్రదించారు.నేను కొట్లాటలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నానని అరెస్టు చేయాలని కోరారు.’
తీవ్ర వ్యాఖ్యలు వెలువడటంపై ఘోష్ ఆశ్చర్యపడలేదు,తీవ్ర వ్యంగ్యంతో కూడిన తన ఫొటోలు పరోక్షంగా బిజెపిపై చేసిన వ్యాఖ్య అని ఘోష్ అంగీకరించారు.నేను రాజకీయ ప్రకటన చేస్తున్నాను, ఎందుకంటే అది రాజకీయ అంశం కనుక, అయితే మనం విషయాలలోకి లోతుగా వెళితే అక్కడ మనకు ఎల్ల వేళలా హిందూ ఆధిపత్యం కనిపిస్తుంది. గత రెండు సంవత్సరాలలో ఈ ప్రభుత్వంతో అది బహిర్గతమైంది.’ బెదిరింపులు అతనిని భయపెట్టలేదు.’ నేను భయపడలేదు, ఎందుకంటే ఒక మంచి కోసం నేను పని చేస్తున్నాను’ అన్నాడు.
ఈ ఫొటోల కార్యక్రమం తరువాత ఒక సానుకూల అంశమేమంటే ప్రపంచమంతటి నుంచి అనేక మంది మహిళలు తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని సందేశాలు పంపారు. అందువలన ఆవు ప్రయాణిస్తూనే వుంటుంది అన్నాడతడు.