• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2017

షింజో అబే మాదిరి ముందస్తుకు పోతే నరేంద్రమోడీకి మిగిలేది నిరాశే !

31 Tuesday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Japanese general election 2017, jcp, LDP, Narendra Modi, shinzo abe

ఎం కోటేశ్వరరావు

ఏమో, అధికారమే పరమావధిగా భావించే వారు దేనికైనా పాల్పడవచ్చు. నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించే వ్యక్తి కాదని గతంలో ఎన్నోసార్లు రుజువైంది కనుక ఏమైనా చేయవచ్చు. నిబంధనలు ఏమి వున్నప్పటికీ ఒకే రోజు లెక్కింపు జరిపే సందర్భాలలో ఎన్నికలు జరిగే వ్యవధి ఎక్కువగా వున్నప్పటికీ వివిధ రాష్ట్రాలు, నియోజకవర్గాలకు ఒకే సారి షెడ్యూలు ప్రకటించటం ఆనవాయితీ. దానికి విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం హిమచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలైంది. కేంద్ర అధికారపక్షం , ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి మేరకే ఇది జరిగిందన్నది జనవాక్యం. మోడీది ఒక పద్దతి అయితే ఆయన చెట్టపట్టాలు వేసుకొని భాయి భాయి అన్నట్లుగా వున్న జపాన్‌ ప్రధాని షింజో అబె మరొక తీరుతో వ్యవహరించారు. అన్నీ ముందే సిద్ధం చేసుకొని ప్రతిపక్షాలకు ,ఓటర్లకు తగిన వ్యవధి ఇవ్వకుండా ఆకస్మిక ఎన్నికలను రుద్ధారు. పద్నాలుగు నెలల గడువున్నప్పటికీ జపాన్‌ ప్రధాని అక్టోబరు 22న మధ్యంతర ఎన్నికలు జరపాలని నిర్ణయించి జరిపించేశారు.అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పార్లమెంట్‌ను రద్దు చేసిన 40 రోజులలోగా ఎన్నికలు జరపాల్సి వుంది. అయితే 26 రోజులకే పూర్తి చేశారు.

జపాన్‌ పార్లమెంట్‌ ‘డైట్‌ ‘ వ్యవధి నాలుగు సంవత్సరాలు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1946 నుంచి ఇప్పటి వరకు 27 ఎన్నికలు జరిగాయి. సగటున ప్రతి 31నెలలకు ఒక ఎన్నికను జనం మీద రుద్దారు. ఇది జపాన్‌లో ప్రజాస్వామ్యం పరిహాసంపాలైన తీరు, అక్కడి ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధల సంక్షోభాన్ని వెల్లడిస్తున్నది. ఇక ఫలితాల విషయానికి వస్తే మన తెలుగు మీడియాతో సహా కార్పొరేట్‌ మీడియా అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మూడింట రెండువంతుల మెజారిటీ సాధించినట్లు వూదర గొట్టింది. నిజానికి పాలక కూటమి విజయానికి ఎలాంటి ఢోకా లేదని ముందుగానే అక్కడి మీడియా, విశ్లేషకులు చెప్పేశారు. అయితే రద్దయిన సభలో వున్న స్ధానాల కంటే తక్కువ వచ్చాయి. ప్రతిపక్షాల చీలిక కారణంగా పాలక కూటమి ఏక సభ్య నియోజకవర్గాలలో ఓట్లకంటే సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన చోట్ల అధికారానికి వచ్చిన ఎల్‌డిపికి వచ్చిన ఓట్లు 33శాతమే, వాటిని మొత్తంలో లెక్కించి చూస్తే 17.3శాతమే. జపాన్‌ ఎన్నికల చరిత్రలో అతి తక్కువ ఓట్లు పోలు కావటం ఇది రెండవసారి. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో 53.69 శాతం పోలు కాగా కనిష్ట రికార్డు గత ఎన్నికలలో 52.66గా నమోదైంది. ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదన్నది స్పష్టం.

డైట్‌లోని దిగువ సభ 475 స్ధానాలలో 295 సీట్లకు నియోజకవర్గాల వారీ ప్రత్యక్ష పద్దతి, 180 సీట్లకు పదకొండు బ్లాకుల వారీ దామాషా పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 242 స్ధానాలకు గాను 146 మంది సభ్యులను 47 ఒకటి అంతకంటే ఎక్కువ స్ధానాలున్న నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల పద్దతిలో 96 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభ పరిమితి నాలుగు సంవత్సరాలు కాగా ఎగువ సభ ఆరు సంవత్సరాలు, ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.1982 నుంచి ఎన్నికల సంస్కరణలలో భాగంగా పరిమితమైన దామాషా విధానాన్ని ప్రవేశ పెట్టారు.జపాన్‌ ఎన్నికలలో సామాన్యులు పాల్గొనే అవకాశం లేదు. ఒక్కొక్క అభ్యర్ధి డిపాజిట్‌గా చెల్లించే 6లక్షల ఎన్‌లలో (మన రూపాయలలో 3లక్షల 42వేలు) తెచ్చుకున్న ఓట్లను బట్టి పదిశాతంపైన తెచ్చుకున్న వారికి వచ్చిన ఓట్లను బట్టి కొంత డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అందువలన డబ్బున్నవారే, వారినే పాలక పార్టీలు రంగంలోకి దించుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు కనుక జనం ఆలోచించుకొనే లోపే పాలకపార్టీ అతి తక్కువ వ్యవధిలో ఆకస్మిక ఎన్నికలను ప్రకటించటం సర్వసాధారణం.

తాజా ఎన్నికల ఫలితాలకు వస్తే ఎన్నికలు జరిగిన 465 స్ధానాలకు గాను పాలక ఎల్‌డిపికి రద్దయిన సభలో 291 స్ధానాలుండగా తాజాగా 284కు తగ్గాయి, దాని మిత్రపక్షమైన కోమీ పార్టీ బలం 35 నుంచి 29కి పడిపోయింది. వాటి బలం 313, ప్రతిపక్షాల విషయానికి వస్తే రెండు కూటములుగా పోటీ చేశాయి. యుద్ధ, అణ్యాయుధాల వ్యతిరేక, అహింసా విధానాలను ఆమోదించే రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ, కమ్యూనిస్టుపార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పౌర కూటమిగా పోటీ చేశాయి. వరుసగా ఈ పార్టీలకు 55,12,2 చొప్పున 69 వచ్చాయి. రెండవది కోయికీ కూటమి, ఇది ఎల్‌డిపి నుంచి విడిపోయిన టోకియో గవర్నర్‌ యురికో కోయికి నాయకత్వంలో సెప్టెంబరు 25న ఏర్పడిన కిబోనోటో(ఆశాజీవి), నిప్పన్‌ ఇషిన్‌ కయ్‌ పేరుతో వున్న ఒక చిన్న పార్టీ కలసి పోటీ చేశాయి. వాటికి 50,11 చొప్పున 61 వచ్చాయి. పాలక పార్టీ నుంచి బయటకు పంపిన వారు, వచ్చిన వారితో కిబోనోటో పార్టీ ఏర్పడింది. జపాన్‌ రాజకీయాలలో ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీ దీనిలో విలీనమైంది. రెండవ కూటమిలోని రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత అక్టోబరు 2న కొత్తగా ఏర్పడింది. ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత కూడా కొత్త పార్టీల నమోదు, పోటీకి అక్కడ అవకాశం వుంది. ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప ప్రతి ఎన్నిక సమయంలో జపాన్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలలోని ముఠాలు కొత్త పార్టీలను ఏర్పాటు చేయటం ఎన్నికలలో కొన్ని సీట్లు సంపాదించటం మామూలు విషయం. ఈ ముఠాలు, వ్యక్తులు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాయో తెలియదు. సరిగ్గా అలాంటి పరిస్ధితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పడటం చూస్తున్నాము. ఇలాంటి అవకాశవాదానికి కార్పొరేట్ల, వ్యక్తుల వ్యాపారలావాదేవీల ప్రయోజనాలు, లాభాలే అసలైన కారణాలుగా వున్నాయి. రద్దయిన సభలో 20 స్ధానాలున్న కమ్యూనిస్టుల బలం ఈసారి 12కు పడిపోయింది. ఏడు అంగీకృత అంశాలపై ఐక్యంగా పోటీ చేసిన మూడు పార్టీల పౌర కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించటమే వూరట కలిగించే అంశం.

రద్దయిన సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వున్న ఎల్‌డిపిలో ఎలాంటి చీలిక లేకపోయినప్పటికీ ప్రధాని షింజే అబే ముందస్తు ఎన్నికలకు పోయిన కారణాలను చూస్తే మన దేశంలో నరేంద్రమోడీ కూడా అదే పని చేస్తారా అని అనుమానించకతప్పదు. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని నెరవేర్చుకొనేందుకు షింజో అబే ఆకస్మిక ఎన్నికలు జరిపారని విశ్లేషకుల అభిప్రాయం. గత రెండున్నర దశాబ్దాలుగా జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఒక దీర్ఘకాల పక్షపాత రోగి మాదిరి వుంది. అమెరికా తరువాత వున్న రెండవ స్ధానాన్ని చైనా ఆక్రమించటంతో మూడో స్ధానానికి దిగజారింది. ప్రస్తుతం వున్న స్ధితి నుంచి తమ దేశ కార్పొరేట్‌ సంస్ధలకు మరింతగా మార్కెట్‌ను కల్పించాలంటే అహింసా విధానం నుంచి తప్పుకొని మిలిటరీ పునరుద్ధరణ, ఇతర దేశాలలో జోక్యానికి వీలుగా తన స్వదేశీ, విదేశీ విధానాన్ని మార్చాలని గత కొంత కాలంగా అక్కడి పాలకవర్గం ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ సమీక్ష పేరుతో దాన్ని అమలు జరపాలని చూస్తున్నారు. చైనా, వుత్తర కొరియాల నుంచి ముప్పు, వాటి ఆయుధ పరీక్షలను సాకుగా చూపుతున్నారు. తాజా ఎన్నికలకు ఆర్ధిక వ్యవస్ధలో మార్పుల గురించి చెప్పినప్పటికీ అంతర్గతంగా పైన చెప్పిన అజండా వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌ రక్షణ బాధ్యతను అమెరికా, జర్మనీ బాధ్యతను అమెరికా నాయకత్వంలోని నాటో కూటమికి అప్పగించి ఆ రెండు దేశాలకు మిలిటరీ లేకుండా చేశారు. మరోసారి మిలిటరీతో యుద్ధాలకు దిగకుండా ఆమేరకు ఆ దేశాలు రాజ్యాంగాలను రాసుకున్నాయి. అయితే దానిని వుల్లంఘించేందుకు అడ్డదారిలో 1954లో ఆత్మరక్షణ బలగాల పేరుతో పరిమిత మిలిటరీని జపాన్‌ ఏర్పాటు చేసింది. తొలి రోజుల్లో మిలిటరీకి చేసే ఖర్చును పరిశోధన, అభివృద్ధి వైపు మళ్లించి యుద్ధ నష్టాలనుంచి కోలుకోవటంతో పాటు అమెరికాతో వస్తు ఎగుమతుల్లో పోటీ పడేంతగా బలపడింది. అయితే క్రమంగా ఆత్మరక్షణ సైన్యానికి ఖర్చు పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక మిలిటరీ బడ్జెట్‌లున్న దేశాలలో జపాన్‌ ఎనిమిదవ స్ధానంలో వుంది. ఈ ఖర్చు పెరుగుదలతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్ధలో వుండే అంతర్గత దౌర్బల్యం కారణంగా పరిమితులు ఏర్పడి అభివృద్ది గిడసబారి పోయింది. దాన్నుంచి బయటపడాలంటే మార్కెట్‌ వాటా పెంచుకోవాలని, అందుకు గాను వివాదాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగ సవరణ చేసి 2020 నాటికి మిలిటరీని తిరిగి రంగంలోకి తేవాలని జపాన్‌ పాలకవర్గం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. అయితే దానికి అనేక ఆటంకాలు కూడా వున్నాయి. అమెరికన్లు ఒక పట్టాన ఒక స్వతంత్రశక్తిగా పూర్వపు స్ధాయికి జపాన్‌ లేదా జర్మనీలను ఎదగనిచ్చేందుకు సుతరామూ అంగీకరించరు. తాజా ఎన్నికల తీర్పు ప్రకారం మధ్యలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తకపోతే షింజో అబే సర్కార్‌ 2021వరకు అధికారంలో వుంటుంది.

గత కొద్ది నెలలుగా షింజో అబే ప్రతిష్ట మసకబారుతోంది. అనేక ఎన్నికలలో పాలకపార్టీ మట్టి కరిచింది. ఏకంగా అబే భార్య, ఎంపీలు, మంత్రులు కొందరు అవినీతి కుంభకోణాలలో చిక్కుకు పోయారు,రక్షణ మంత్రితో సహా కొందరిని పదవుల నుంచి ఆగస్టులో తొలగించాల్సి వచ్చింది.టోకియో గవర్నర్‌ యురికో కొయికే తిరుగుబాటు జెండా ఎగురవేసి కొత్త పార్టీని పెట్టారు. జూలైలో జరిగిన స్ధానిక ఎన్నికలలో ఆమె గ్రూపు మెరుగైన ఫలితాలు సాధించింది. అందువలన సాధారణ ఎన్నికల నాటికి మరింత బలపడకుండా ఆకస్మిక ఎన్నికలు జరిపి ఆమెను ఓడించాలనే ఆలోచన కూడా అక్టోబరు ఎన్నికలకు పురికొల్పిందని భావన.ఆగస్టు ఒకటిన ఒక సర్వేలో 60శాతం మంది అబే పనితీరును వ్యతిరేకించగా 32శాతమే ఆమోదం తెలిపారు. వుత్తర కొరియాతో సంబంధాలు కలిగి వున్న కారణంగా ఆ దేశంతో సమస్యలు రాకుండా చక్రం తిప్పుతారనే విశ్వాసంతో వున్న ప్రజలు జపాన్‌ మీదుగా వుత్తర కొరియా క్షిపణి ప్రయోగం జరపటంతో నివ్వెర పోయారు.

మన దేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి, నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. మన దేశంలో వసూలు చేస్తున్న పన్నులు మరీ తక్కువగా వున్నాయని వాటిని పెంచాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ చాలా కాలం నుంచి వత్తిడి తెస్తున్నాయి.పన్ను సంస్కరణల ముసుగులో దాన్ని అమలు జరపటానికి పూనుకున్న మోడీ జిఎస్‌టిని పెద్ద విజయంగా వర్ణించుకున్న విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా పన్ను పెంచాలన్నది అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల వత్తిడి. 2012లో అధికారంలో వున్న డెమోక్రటిక్‌ పార్టీ వినియోగ పన్ను(జిఎస్‌టికి మరోపేరు) మొత్తాన్ని 8 నుంచి 10శాతానికి పెంచాలని నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ అప్పుతీర్చేందుకు కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే ప్రతిపక్షంలో వున్న షింజే అబే నాయకత్వంలోని ఎల్‌డిపి దానిని వ్యతిరేకించి అదే ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చింది. పెంచిన పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పు తీర్చటానికి బదులు సంక్షేమ చర్యలైన అల్పాదాయ కాలేజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మూడు-ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లల సంక్షేమం వంటి వాటికి ఖర్చు చేయాలని చెబుతూ దానిని అబోనోమిక్స్‌గా ప్రచారం చేసింది. 2014లో పన్ను పెంచాలనే తరుణంలో జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయింది. సంక్షేమ చర్యలు నిలిచిపోయాయి. దాంతో మరోసారి ప్రజల అనుమతి పేరుతో మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చి షింజో అబే విజయం సాధించాడు. ఇప్పుడు ఆ పన్నును జనం మీద రుద్ధేందుకు తమకు జనం అనుమతిచ్చారని చెప్పేందుకు ఈ విజయాన్ని వినియోగించుకోనున్నారు.

అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో వున్న పార్టీలలో జపాన్‌ కమ్యూనిస్టు పార్టీయే పెద్దది. గత రెండు దశాబ్దాల ఎన్నికల చరిత్రను పరిశీలించినపుడు సగటున తొమ్మిదిశాతం ఓట్లు తెచ్చుకుంది. తాజా ఎన్నికలలో దామాషా బ్లాక్‌ నియోజకవర్గాలలో ఓట్లు 11.37 నుంచి 7.91శాతానికి పడిపోయాయి, సీట్లు 20 నుంచి 11కు తగ్గాయి. ఏక సభ్య ప్రత్యక్ష ఎన్నికల నియోజకవర్గాలలో ఓకినావా ఒకటవ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తిరిగి ఎన్నికయ్యారు.దీనితో మొత్తం పన్నెండు. ఏకసభ్యనియోజకవర్గాలలో గతెన్నికలలో 292చోట్ల పోటీ చేయగా ఈ సారి 206కు పరిమితమైంది. 67 స్ధానాలలో మిత్రపక్షాలకు మద్దతుగా అభ్యర్దులను వుపసంహరించుకుంది. ఈ చర్య పౌర కూటమి మెరుగైన ఫలితాలు సాధించటానికి తోడ్పడింది. ఈ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బల గురించి తిరిగి కోలుకుంటామని కమ్యూనిస్టుపార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అందుకు గాను పార్టీ కార్యక్రమాన్ని జనం అర్ధం చేసుకొనేందుకు, వర్తమాన సంక్లిష్ట రాజకీయ పరిస్ధితులలో కూడా మద్దతు ఇచ్చి ఓటు చేసేందుకు ముందుకు వచ్చే విధంగా కార్యకలాపాలను మరింత పెంచాలని, పార్టీ సభ్యత్వాన్ని , పార్టీ దినపత్రిక అకహటా పాఠకులను పెంచుకోవటంతో పాటు సభ్యులందరినీ పూర్తిగా పనిలోకి దింపాలని ప్రకటనలో పేర్కొన్నది. తాజా ఎన్నికలలో గతంతో పోలిస్తే పాల్గొన్న సభ్యులు, పత్రిక సర్క్యులేషన్‌ తగ్గిపోయారని తెలిపింది.

జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికల రికార్డు చూసినపుడు ఓట్లు, సీట్లలో హెచ్చుతగ్గులు ఒక ధోరణిగా వున్నాయి. గత మూడు సంవత్సరాలలో స్ధానిక సంస్ధలు, రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో గతం కంటే వున్న బలాన్ని పెంచుకోవటంతో పాటు కొత్త ప్రాంతాల విస్తరించటాన్ని కూడా చూడవచ్చు.మచ్చుకు జూలైలో జరిగిన టోకియో రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ 127 స్దానాలలో 19 చోట్ల విజయం సాధించింది. గతేడాది పార్లమెంటు ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో కూడా బలాన్ని పెంచుకొని 242 సీట్లకు గాను 14 స్ధానాలకు పెంచుకుంది. ప్రపంచ మంతటా ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో కమ్యూనిస్టుపార్టీలకు ఎదురు గాలి వీస్తున్న సమయంలో జపాన్‌లో సాధిస్తున్న ఓట్లు, సీట్లకు ఎంతో ప్రాధాన్యత వుంది. అహింసా రాజ్యాంగాన్ని సవరించి తిరిగి మిలిటరీని పునరుద్దరించేందుకు పాలకవర్గ పార్టీలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయో అంతే తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీ జపాన్‌ శాంతియుత రాజ్యాంగాన్ని కాపాడాలని, యుద్ధాలకు దూరంగా వుండాలని కలసి వచ్చే శక్తులతో పని చేయటం అనేక మంది అభిమానానికి పాత్రమైంది. రానున్న రోజులలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆ పార్టీ తీర్మానాలు చెబుతున్నాయి.

జపాన్‌ రాజకీయంగా మితవాదం దిశగా పయనిస్తుండవచ్చుగాని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కొంత ప్రభావం చూపగలుగుతున్నదని ‘ఫోర్బ్స్‌’ పత్రిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కమ్యూనిస్టు పార్టీ నేత విశ్వాసం వెలిబుచ్చారు, అయితే కమ్యూనిస్టులు జపాన్‌లో పూర్తిగా అంతరించలేదు. జపాన్‌ రాజకీయాలలో అనేక యుద్ధాలలో ఆరితేరిన భీష్ముడి వంటి లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కంటే ఆరుసీట్లు మాత్రమే తక్కువగా ఇటీవలి టోకియో రాష్ట్ర ఎన్నికలలో సీట్లు తెచ్చుకుంది. ఎలాంటి వుగ్రవాద చర్యలకు పాల్పడకపోయినప్పటికీ ఇప్పటికీ జపాన్‌ పోలీసులు కమ్యూనిస్టు పార్టీని ఒక తీవ్రవాద పక్షంగానే పరిగణిస్తారు. వారిపై నిరంతర నిఘా, వేధింపులకు గురవుతుంటారు. అయినా వారి పలుకుబడి తగ్గలేదు. పార్టీ పత్రిక అకహటా 11.2లక్షల సర్క్యులేషన్‌ కలిగి వుంది. సమీప భవిష్యత్‌లో జపాన్‌ తీవ్ర మితవాద పత్రిక శంకై షింబున్‌ను అధిగమించనుందని ఒక వార పత్రిక జోస్యం చెప్పింది. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మరియు దాని ఒడిలో కూర్చొనే కోమీ పార్టీ, చీలికలతో వుండే ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకొనే అవకాశం అనేక సంవత్సరాలుగా జపాన్‌ ఓటర్లకు ఏర్పడింది. రెండింటి మీద తీవ్ర అసంతృప్తి చెందిన ఓటర్లు కమ్యూనిస్టుపార్టీకి ఓటు చేస్తారు. కమ్యూనిస్టు రాజ్యమైన వుత్తర కొరియా చర్యలు కమ్యూనిస్టు అనే పదం పట్ల సాధారణ జనంలో విముఖత కలిగించి వుండవచ్చు. అయితే ఎన్నికలలో ఎదురు దెబ్బ తగలటానికి అతి పెద్ద కారణం టోకియో గవర్నర్‌ యురికో కోకీ అనుసరించిన వైఖరి ప్రతిపక్ష ఐక్యతకు అడ్డం పడింది. అహింసా పూరితమైన రాజ్యాంగ కలిగి వుండాలనే వైఖరితో కేవలం వారం రోజుల్లోనే రూపుదిద్దుకున్న రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ (సిడిపి) ప్రధాన ప్రతిక్షంగా ఎన్నికలలో అవతరించింది. పచ్చి మితవాద ఆశాజీవి పార్టీ, ఎల్‌డిపి, కొమిటోను కూడా ఓడించటానికి కమ్యూనిస్టు పార్టీ సిడిపికి మద్దతు ఇవ్వటం ద్వారా కమ్యూనిస్టు పార్టీ తనను తాను నష్టపరుచుకొని వుండవచ్చు. ఎల్‌డిపి-బుద్ధిస్టు కొమిటో పార్టీలకు కంచుకోట వంటి కాంటో నియోజకవర్గంలో సిడిపి-కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తొలిసారిగా గెలిచారు. సిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నిక కావటానికి కమ్యూనిస్టుపార్టీ దోహదం చేసిందని ఎన్నికల విజయోత్సవ సభలో అక్కడ విజయం సాధించిన ఎడనో బహిరంగంగా చెప్పారు. తమ రెండు పార్టీలు మంచి విజయాలు సాధిస్తాయని కమ్యూనిస్టు నేత కాజూ షి ఆశాభావం వెలిబుచ్చారు గాని సిడిపి మాత్రమే లబ్దిపొందింది, కమ్యూనిస్టుపార్టీ తన పునాదిని కోల్పోయింది అని ఫోర్బ్స్‌ విశ్లేషకుడు పేర్కొన్నారు.

డబ్బు రాజకీయాలు, పార్టీల ఫిరాయింపులు, అవినీతి అక్రమాలకు పాల్పడటం, కార్పొరేట్ల కొమ్ము కాయటంలో మన దేశానికి జపాన్‌కు ఎన్నో సామ్యాలున్నాయి.ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత దాన్ని నిలుపుకొనేందుకు తొక్కని అడ్డదారులు వుండవు. ఈ పూర్వరంగంలో జపాన్‌లో అబెనోమిక్స్‌ మాదిరే మోడినోమిక్స్‌ కూడా ఎదురుతన్నుతోంది. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇప్పటికే మోడీని వుక్కిరిబిక్కిరి, నోటమాట రాకుండా చేస్తున్నాయి. వైఫల్యాలు, తప్పుడు విధానాల పర్యవసానాల నుంచి బయట పడేందుకు తప్ప మోడీ నాయకత్వానికి ఇప్పుడు మరొక పని లేదు. దేశమంతటా గుజరాత్‌ అభివృద్ధి నమూనా అమలు జరుపుతామని వూదరగొట్టిన పెద్దలు ఇప్పుడు చేసిందేమిటో చూశాము. మిగతా రాష్ట్రాలలో మాదిరి ఎన్నికల తాయిలాలను గుజరాత్‌లో ప్రకటించటానికే కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వత్తిడి తెచ్చి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించకుండా వాయిదా వేయించారన్నది స్పష్టం. ఇలాంటి అధికార దుర్వినియోగం బహుశా ఇదే ప్రధమం. అయితే జపాన్‌ వేరు, భారత్‌ వేరు. షింజో అబే మాదిరి తిరిగి గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు తెచ్చుకోగలమని నరేంద్రమోడీ దురాశపడితే నిరాశే మిగులుతుందని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వివాదాస్పద విదేశీ ఆర్ధికవేత్త విఫల స్వదేశీ నరేంద్రమోడీని గట్టెక్కిస్తారా ?

20 Friday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

behavioural economics, Consumer Affairs, economist richard thaler, Narendra Modi, Nobel economics prize, swadesi

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా కనుసన్నలలో ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత !

19 Thursday Oct 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

Anti-Communist Massacre, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, Sukarno, US hand in 1960s Indonesia Anti-Communist Massacre

ఎం కోటేశ్వరరావు

పీడకుల నుంచి పీడితులను కాపాడి సమసమాజాన్ని స్ధాపించే మహత్తర కృషిలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు అభిమానులు ప్రపంచంలోని అనేక దేశాలలో చిందించిన రక్తం, చేసిన ప్రాణత్యాగాలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఇండోనేషియా కమ్యూనిస్టులకరు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగి కమ్యూనిస్టులు ఆయుధాలు చేపట్టి పీడకులపై పోరు సల్పినపుడు వారిని చంపివేశామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకుంటే దాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.ఎలాంటి తిరుగుబాటు, పోరు లేకుండానే యాభై రెండు సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వారి కుటుంబసభ్యులు, సానుభూతిపరులని అనుమానం వున్న వారిని అక్కడి సైన్యం వూచకోత కోసింది. సైన్యానికి మహమ్మదీయ పేరుతో వున్న ఒక సంస్ధను కూడా తోడు చేసి వారికి ఆయుధాలిచ్చి హత్యాకాండకు కమ్యూనిస్టులను గుర్తించటం, హత్య చేయటానికి వుపయోగించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మానవహక్కుల పరిరక్షకులమని చెప్పుకొనే అమెరికన్లకు ఈ దారుణ మారణకాండ వారి ఎరుకలోనే జరిగిందని, హత్యాకాండ పట్ల హర్హం వ్యక్తం చేస్తూ నివేదికలు పంపిన విషయాన్ని మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన పత్రాలు తెలిపాయి. ఆ వూచకోతలో అమెరికా, దాని మద్దతుదారుగా వున్న బ్రిటన్‌ వూచకోతను సాగించేందుకు ఇచ్చిన తోడ్పాటును ఈ పత్రాలు నిర్ధారించాయి. ఇవి అమెరికాకు ఇబ్బందిలేని రీతిలో జాగ్రత్తగా ఎంపిక చేసి బహిర్గతపరచినవని గమనించాలి. పూర్తి సమాచారం తెలియాలంటే సిఐఏతో సహా మిగిలిన అన్ని పత్రాలను విడుదల చేయాల్సి వుంది. ఆ సమయంలో కమ్యూనిస్టుల తిరుగుబాటు, అధ్యక్షుడిగా వున్న ఇండోనేషియా జాతీయవాది సుకర్ణో ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు జరిపిన తప్పుడు ప్రచార బండారాన్ని ఇవి బయట పెట్టాయి. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పధకంలో భాగంగా అమెరికా కనుసన్నలలో జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌ సుహార్తో నాయకత్వంలో సుకర్ణోను బందీని చేసి ఆయన పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

1965ా66 సంవత్సరాలలో జరిపిన ఈ వూచకోతకు సంబంధించి జకర్తాలోని అమెరికా రాయబారకార్యాలయంలో వున్న 39 రహస్య పత్రాలను విడుదల చేశారు. ఇండోనేషియా వూచకోత వాస్తవాలను వెల్లడించాలని అక్కడి పౌరహక్కుల సంస్దలు, చరిత్రకారులు గతకొద్ది సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు ఇవి కొంత మేరకు వుపయోగపడతాయి. అసలైన నిందితులను బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఎంతో చేయాల్సి వుంటుంది. తన ప్రయోజనాలకు హానిలేవు అనుకున్న పత్రాలను మాత్రమే అమెరికా విడుదల చేస్తుంది అనే విషయాన్ని సదా గమనంలో వుంచుకోవాలి. నేషనల్‌ సెక్యూరిటీ అర్కైవ్స్‌ పేరుతో వున్న ఒక సంస్ధ ద్వారా ఇలాంటి పత్రాలను విడుదల చేస్తారు.

‘1965ా66లో ఇండోనేషియాలో జరిగిన సామూహిక హత్యల గురించి అమెరికా అధికారులకు వివరంగా తెలుసునని కొత్తగా విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ ఇది 20శతాబ్దంలో జరిగిన ఒక దారుణమైన కిరాతకాన్ని చరిత్రగా నమోదు చేయటానికే కాదు, ఎప్పుడో జరగాల్సిన బాధితుల బాధానివారణ దిశగా కూడా అన్ని పత్రాలను విడుదల చేయాలని’ నేషనల్‌ సెక్యూరిటీ సంస్ధ ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌ ఫెలిమ్‌ కినే వ్యాఖ్యానించారు. 1965 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలకు సంబందించి దాదాపు 30వేల పేజీలున్న 39 పత్రాలను విడుదల చేశారు. వాటిలో టెలిగ్రాములు, లేఖలు, రహస్య వర్తమానాలు, పరిస్ధితి గురించి మదింపు నివేదికల వంటివి వున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా నియంత సుహార్తో మరణించిన తరువాత అక్కడ పౌర ప్రభుత్వాలు ఏర్పడి నప్పటి నుంచి కమ్యూనిస్టులపై జరిపిన మారణకాండ వివరాలను బయటపెట్టాలని ఏదో ఒక రూపంలో అక్కడ ఆందోళన కొనసాగుతున్నది. అదే సమయంలో ఆవివరాలను ఏమైనా సరే బయటపెట్టకూడదని మిలిటరీ తీవ్ర వత్తిడి తెస్తున్నది. సుహార్తో మరణానంతరం పౌరపాలకులే అధికారంలో వున్నప్పటికీ తెరవెనుక మిలిటరీదే అధికారం. నిషేధిత కమ్యూనిస్టు పార్టీని తిరిగి పునరుద్దరించే యత్నాలు జరుపుతున్నారనే పేరుతో మిలిటరీ ప్రోద్బలంతో గతం నుంచి మిలిటరీతో సంబంధాలున్న మహమ్మదీయ సంస్ధ వారసులు కొత్త పేరుతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎర్రరంగు టీ షర్టు వేసుకున్నా కమ్యూనిస్టు అనే అనుమానంతో పోలీసులు పట్టుకొని విచారణ జరుపుతున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం అమ్మేవారిని కూడా పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. నాటి వూచకోతకు సంబంధించి బంధువులకు న్యాయ సహాయం అందించేందుకు ఒక హాలులో ఏర్పాటు చేసిన సమావేశం కమ్యూనిస్టుల మీటింగ్‌ అంటూ ముస్లిం మతోన్మాదులతో దానిపై దాడి చేయించారు. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీని పునరుద్దరించకూడదనే పేరుతో తలపెట్టిన ప్రదర్శనలో జనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పాతికవేల మంది వరకు పోలీసులు రక్షణగా పాల్గన్నారు. యువతరానికి చరిత్రను తెలియ చెప్పాలనే పేరుతో కమ్యూనిస్టులను హత్యచేయటాన్ని సమర్ధిస్తూ మిలిటరీ తరఫున తీసిన చిత్రాన్ని ప్రతిఏటా సెప్టెంబరు 30 టీవీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవిధంగా మిలిటరీ చర్యలు తీసుకొంటోంది. వాస్తవాలను చెప్పే డాక్యుమెంటరీల ప్రదర్శనలను అడ్డుకుంటోంది. ఈ పూర్వరంగంలో పరిమితమైన సమాచారాన్నే వెల్లడించినప్పటికీ ఈ పత్రాల విడుదల హక్కుల వుద్యమానికి మరింత వూపు తెస్తాయి. ఇప్పటికీ కమ్యూనిస్టులను హతమార్చటాన్ని అధికారికంగా సమర్ధిస్తూనే వున్నారు. మరణించిన వారు కనీసంగా ఐదు నుంచి పదిలక్షల మంది వరకు వుంటారని అంచనా. ఇంతకాలం గడిచినా తమవారి అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులకు రక్షణ లేదు.ఇండోనేషియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తిరుగుబాటులో భాగంగా 1965 సెప్టెంబరు 30న ఆరుగురు మిలిటరీ జనరల్స్‌ను కమ్యూనిస్టులు హత్య చేశారనే ఆరోపణతో మిలిటరీ మారణకాండకు పాల్పడింది. నిజానికి ఆ జనరల్స్‌ను కుట్రలో భాగంగా సుహార్తోయే చంపించారన్నది బహిరంగ రహస్యం. వారు కమ్యూనిస్టు అనుకూల మిలిటరీ అధికారులనే అభిప్రాయం కూడా వుంది.

సిఐఏ ద్వారా పధకాన్ని రూపొందించటం ఐదువేల మంది ప్రముఖ కమ్యూనిస్టుల వివరాలు, మిలిటరీకి ఆయుధాలు,ముస్లింమతోన్మాదులకు శిక్షణ, నిధులు అందచేసిన అమెరికా ప్రభుత్వ పాత్ర వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. 1990లో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన అమెరికా రాయబారకార్యాలయం ఒక అధికారి తనంతటతానే ఒక జాబితాను రూపొందించి ఇచ్చినట్లు అంగీకరించింది. సామూహిక మారణకాండ గురించి నాటి అమెరికా అధికారులు ఎంత సంతోషంగా వర్తమానం పంపారో మచ్చుకు చూడవచ్చు.’ రెండున్నర వారాలలో లక్షమందిని నమ్మశక్యంగాని రీతిలో ఆమీట వూచకోత కోసింది’ అని జకర్తాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రధమ కార్యదర్శి మారీ వాన్స్‌ ట్రెంట్‌ పంపిన వర్తమానంలో వుంది. 1966లో సిఐఏ అధికారి ఎడ్వర్డ్‌ మాస్టర్స్‌ ఒక వర్తమానంలో ‘బందీలుగా పట్టుకున్న కమ్యూనిస్టుల’ సమస్య గురించి చర్చించారు. ‘ కమ్యూనిస్టు ఖైదీలను వురితీయటం లేదా పట్టుకోక ముందే వారిని చంపివేయటం ద్వారా అనేక ప్రాంతాలు ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాయి. దానిలో ముస్లిం యువజన బృందాల కర్తవ్యం ఏమంటే వారికి సహాయం అందచేయటం’ అని పేర్కొన్నాడు. నిజానికి ఈ పత్రాలను 2001లోనే సిద్ధం చేశారు గాని, 16 సంవత్సరాల తరువాత మంగళవారం నాడు విడుదల చేశారు. ‘ మాకు నిజంగా తెలియదు వాస్తవ సంఖ్య లక్షో పదిలక్షలో తెలియదని పేర్కొన్న 1966 ఏప్రిల్‌ నాటి ఒక వర్తమానం విడుదల చేసిన వాటిలో వుంది. సుకర్ణోను గద్దె దించితే ఇండోనేషియాకు అమెరికా సాయం అందచేస్తుంది అనే ఒక వర్తమాన పత్రం కూడా వీటిలో వుంది. మిలిటరీ నియంత సుహార్తో తన అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారని నిర్ధారించుకున్న తరువాత 1966 మార్చి నెల నుంచి అమెరికా సాయం ప్రారంభమైంది.

ఈ పత్రాలను విడుదల చేయాలంటూ 2015లో అమెరికా సెనెట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించిన టామ్‌ వుడాల్‌ పత్రాల విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ ‘ దారుణమైన నేరాలకు పాల్పడిన సమయంలో ఇండోనేషియా ప్రభుత్వానికి తోడ్పడిన తీరును కూడా ఎంతగానో ఇవి వెల్లడిస్తాయి. ఇండోనేషియాలో ఈ హత్యల వెనుక వున్న వారు అనేక మంది ఎలాంటి శిక్షలు లేకుండా ఇప్పటికీ జీవించి వున్నారు. బాధితులు, వారి వారసులను వెనక్కు నెట్టారు, గుర్తింపు లేకుండా పోయింది.దీనిలో అమెరికా తన పాత్ర గురించి ఘర్షణ పడాలి, దాన్ని అంగీకరించటం ద్వారానే భవిష్యత్‌ మానవహక్కుల రక్షణ గురించి గట్టిగా మాట్లాడగలం ‘ అన్నారు. మహమ్మదీయ సంస్ధ పేరుతో వ్యవహరించిన మతోన్మాదులు మిలిటరీతో చేతులు కలిసి మసీదులలో ప్రార్ధనల సందర్భంగా కమ్యూనిస్టులు దైవ ద్రోహులని వారిని ఎక్కడ బడితే అక్కడ కోడి మెడ కోసినట్లు కోసి చంపాలని పిలుపు ఇచ్చారంటూ అమెరికన్లు పంపిన వర్తమానాలలో వున్నాయి. ‘ మాకు ఈ విషయాల గురించి బాధితుల మౌఖిక సంభాషణల ద్వారా సాధారణంగా తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసిన సమాచారం మంచి చెడ్డలన్నింటినీ వెల్లడించటం గొప్ప విషయం అని బ్రిటీష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ రోజా వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్‌ వలస రాజ్యంగా వున్న ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సుకర్ణో ఒకరు. ఆయన జాతీయవాదులు, కమ్యూనిస్టుల అనుకూల వైఖరిని కలిగి వుండేవారు.1945లో ఏర్పడిన స్వతంత్ర ఇండోనేషియాకు ఆయన తొలి అధ్యక్షుడు. అలీనోద్యమ నేతల్లో ఒకరు. తొలిరోజుల్లో జాతీయవాదిగా వున్నప్పటికీ 1960 దశకం నాటికి ఆయన కమ్యూనిస్టుల పట్ల మరింత సానుకూల వైఖరిని తీసుకున్నారు. ఇది అమెరికాకు కంటగింపు అయింది. అప్పటికే అమెరికన్లు వియత్నాంపై దాడులు చేస్తూ మారణకాండ సాగిస్తున్నారు. ఇండోనేషియాలో అతి పెద్ద కమ్యూనిస్టుపార్టీ వుంది. ఇస్లామిక్‌ దేశాలలో పెద్దదైన ఇండోనేషియా ఏ క్షణంలో అయినా కమ్యూనిస్టు దేశంగా మారిపోయే అవకాశం వుందని అమెరికా భయపడింది. అదే అక్కడి కుట్రలకు నాంది. దానిలో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టేందుకు తెరలేపారు. దీనితో పాటు ఇతర విద్రోహ చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల వ్యవస్ధను కూడా తయారు చేసేందుకు పూనుకున్న తరుణంలో సిఐఏ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులసామూహిక హత్యాకాండకు పధకరచన సాగిందని, దాని గురించి సూచాయగా తెలిసినప్పటికీ అధ్యక్షుడు సుకర్ణో మద్దతు వున్నందున కమ్యూనిస్టులు తీవ్రతను వూహించలేక, తగిన సన్నద్దులు కాలేకపోయారని,కుట్రను తిప్పికొట్టలేకపోయారని కూడా ఒక అభిప్రాయం వుంది. సుకర్ణోకు కమ్యూనిస్టుల నుంచి ముప్పు ఏర్పడిందనే పేరుతో ఆయనను గృహనిర్బంధం చేసి మిలిటరీ జనరల్‌ సుహార్తో అధ్యడిగా ప్రకటించుకొని హత్యాకాండను సాగించాడు. 1970లో సుకర్ణో కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ప్రకటించారు.

అమెరికా వెల్లడించిన పత్రాలలో సమాచారం వూచకోత దోషులను వెల్లడించకపోయినప్పటికీ అనేక విషయాలను అధికారికంగా నిర్ధారించింది. ఇండోనేషియా సామాజిక, రాజకీయ వ్యవస్ధలో సంభవించబోయే మార్పులను ఇవి ఎంతో కొంత మేరకు ప్రభావితం చేస్తాయి. మిలిటరీ, సామ్రాజ్యవాదుల పాత్ర గురించి వాస్తవాలను తెలుసుకొనే ఆసక్తిని కలుగచేస్తాయి. ప్రజాస్వామిక, ఇప్పటికీ రహస్యంగానే వున్న వామపక్ష శక్తులు మరింత చురుకుగా పని చేస్తాయనటం నిస్సందేహం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా – 2

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

మహాత్మాగాంధీ హత్యలో మరోవ్యక్తి వున్నాడంటూ విచారణ జరపాలని కోరటం వెనుక గాడ్సే, తద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్ర నుంచి అధికారికంగా తుడిచివేయాలనే ప్రయత్నం కనపడుతోంది.తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకొనేందుకు మితవాద హిందూశక్తులు ప్రయత్నిస్తున్నాయని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం, గందరగోళపరచేందు ప్రయత్నించటం ఇదే మొదటిసారి కాదు. ఇది గాంధీ హంతకుల నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందిన హిందూ మితవాదుల పెద్ద పధకంలో భాగం. హత్య గురించి అనుమానాలను పెంచేందుకు మరొక స్ధాయికి తీసుకుపోయారు.ఇటువంటి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించకపోవటం ఆశ్చర్యపరిచింది. అదృష్టం కొద్దీ గతేడాది ముంబై హైకోర్టు వినతిని తిరస్కరించింది. పిటీషన్‌ వేసిన వ్యక్తి తాను వీర సావర్కర్‌ భక్తుడిని అని స్వయంగా అంగీకరించాడు. సావర్కర్‌పేరును కేసు నుంచి తొలగించాలని కోరాడు. జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ 1969లో సమర్పించిన నివేదికలో గాంధీ హత్యకు వున్న సంబంధాన్ని నిరూపించటమేగాక హత్యకుట్రలో సావర్కర్‌ పాత్ర, ప్రమేయం వున్నట్లు కూడా తెలిపింది. అంతకు ముందే కేసు నుంచి సావర్కర్‌ విముక్తి చేసినప్పటికీ ఈ కమిషన్‌ తన నివేదికలో అతని ప్రమేయం గురించి పేర్కొన్నది. అప్పటి నుంచి సంఘపరివార్‌ మరియు సావర్కర్‌ వాదులకు ఈ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని ఫడ్నిస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించింది. వర్తమాన చరిత్రను కించపరుస్తూ దాని స్ధానంలో తమ వూహలనే చరిత్రగా చొప్పించాలని చూసే ఈ పధకంలో బంబే హైకోర్టు తిరస్కరించటం, సుప్రీం కోర్టు అనుమతించటం కొన్ని అడుగులు.

పిటీషన్‌దారు ఆరోపించిన దాని ప్రకారం 1948 జనవరి 30న రెండవ అజ్ఞాత వ్యక్తి జరిపిన నాలుగవ రౌండ్‌ కాల్పులకే గాంధీ మరణించారు. రెండున్నర అడుగుల దూరం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన గాడ్సే తూటాల కారణంగా ఆయన మరణించలేదు. రెండవ వ్యక్తి రహస్యంగా జరిపిన కాల్పులను ఎవరూ వినలేదు, అతను వున్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు.ఆ సమయంలో అక్కడదాదాపు వెయ్యి మందికి పైగా వున్నారు. గాంధీ మరణం తరువాత అంత్యక్రియలకు ముందు చేయించే పార్ధివ దేహానికి స్నానం చేయించి,శుద్ధి చేసే సమయంలో దేహంపై కప్పిన షాల్‌ మడతలలో ఒక బుల్లెట్‌ కనిపించిందని మనుబెన్‌ అనే వ్యక్తి చెప్పాడని పిటీషనర్‌ పేర్కొన్నాడు. దాన్నే నాలుగవ బుల్లెట్‌గా చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మూడుసార్లు కాల్పులు జరిగినట్లు మూడు గాయాలున్నట్లు రెండు బుల్లెట్లు వెనుకవైపుకు దూసుకుపోయాయని, మూడింటిలో ఒక బుల్లెట్‌ గాంధీ వెనుక పది అడుగుల దూరంలో పడి వుండగా తరువాత కనుగొన్నారు. ఒకటి బాపు శరీరంలోనే వుండిపోయి చితిలో తరువాత కరిగిపోయి కనిపించింది. మూడవ బుల్లెట్టే షాల్‌లో దొరికిందని, నాలుగవది అసలు లేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

గాంధీ హత్యకు వుపయోగించిన 9ఎంఎం బెరెట్టా తుపాకి గాడ్సే చేతికి ఎలా వచ్చిందన్న అంశం గురించి తుషార్‌ గాంధీ తన విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. పిటీషన్‌దారు రెండు బెరెట్టా తుపాకులున్నాయని పేర్కొన్నారు. అవును నిజమే.ఒకే 606824 నంబరు గల రెండు తుపాకులున్నాయి.ఒకటి అసలైనది, రెండవది సందర్శకుల కోసం రూపొందించిన దాని నమూనా రాజఘాట్‌లోని జాతీయ గాంధీ మ్యూజియంలో వున్నాయి.ఈ తుపాకీ గాడ్సే చేతిలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం. హత్యకు రెండు రోజుల ముందు వరకు అంటే జనవరి 28వరకు గాడ్సే-ఆప్టే ముఠాకు విస్వసనీయమైన ఆయుధం దొరకలేదు. ఇరవయ్యవ తేదీన వారు మూడు తుపాకులు కలిగి వున్నప్పటికీ హత్యాయత్నం విఫలమైంది. మరుసటి రోజునుంచి మరో ఆయుధం కోసం అన్ని వనరులనూ సంప్రదించారు. ఆ రోజుల్లో అక్రమ తుపాకుల విక్రయ కేంద్రంగా గ్వాలియర్‌ వుండేది. అక్కడ దత్తాత్రేయ పర్చూరే అనే డాక్టరున్నాడు. అతను సావర్కర్‌ వీర భక్తుడు, హిందూమహాసభ సభ్యుడిగా నాధూరామ్‌, ఆప్టేలకు తెలుసు. డాక్టరు దగ్గర మంచి తుపాకీ వుందని తెలిసి అది కావాలని అడిగారు. తిరస్కరించిన దత్తాత్రేయ వారికి ఒకదానిని సమకూర్చేందుకు అంగీకరించాడు.గంగాధర్‌ దండావతే అనే తన కింద పనిచేసే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాడు. జనవరి 28 సాయంత్రానికి అతను ఐదువందల రూపాయలకు ఒక తుపాకీని తెచ్చాడు.దానితో గాడ్సే-ఆప్టేలకు కాల్చటం రాకపోతే ఆ డాక్టరు తన ప్రాంగణంలో కాల్చిచూపించాడు.

సమీపం నుంచి హత్యలు చేయటానికి ఆ రోజుల్లో బెరెట్టా సెమీ ఆటోమాటిక్‌ తుపాకిని ఎక్కువగా వుపయోగించేవారు. ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ సైన్యాధికారులు వుపయోగించేందుకు బెరెట్టా కంపెనీ పరిమితంగా వాటిని తయారుచేసేది. ఇప్పటికీ దాన్ని ఫాసిస్టు స్పెషల్‌ అని పిలుస్తారు. వుత్తర ఆఫ్రికాలోని అబిసీనియాను ఆక్రమించేందుకు ముస్సోలినీ సేనలు ప్రయత్నించినపుడు మిత్రపక్షాల సేనలు వాటిని ఓడించాయి. ఆ యుద్ధంలో బ్రిటీష్‌ సైన్యంలోని నాలుగ గ్వాలియర్‌ ఇన్‌ఫాంట్రిలో కమాండింగ్‌ అధికారిగా పనిచేసిన లెప్టినెంట్‌ కల్నల్‌ వి.వి జోషి ముస్సోలినీ సేనల లంగుబాటుకు చిహ్నంగా ఒక అధికారి నుంచి బెరెట్టా తుపాకిని స్వీకరించాడు. అది యుద్ద ట్రోఫిగా మారింది. తరువాత జోషిని నాటి గ్వాలియర్‌ రాజు జియాజీరావు సింధియా సంస్ధాన కోర్టులో అధికారిగా నియమించాడు. జోషి దగ్గర వున్న బెరెట్టా తుపాకి దొంగ తుపాకులు అమ్మేవారి దగ్గరకు అక్కడి నుంచి హంతకుల దగ్గరకు ఎలా చేరిందన్న విషయాన్ని ఎవరూ దర్యాప్తు చేయలేదు. గాంధీ హత్యలో డాక్టరు దత్తాత్రేయ సహనిందితుడు. అతడిని పంజాబు హైకోర్టు కేసు నుంచి విడుదల చేసింది. ఎందుకంటే అతడు సాంకేతికంగా అప్పటికి బ్రిటీష్‌ పౌరుడు. స్వయంగా తన నేరాన్ని అంగీకరించినప్పటికీ బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం నిందితుడిగా మార్పిడి జరగలేదనే సాకుతో విడుదల చేశారు. గాంధీ హంతకులకు సంబంధించి నకిలీలకు ఇవన్నీ ఇబ్బంది కలిగించే వాస్తవాలు. వారు ఇప్పుడు తమకు నిజాలను తారు మారు చేయగల, చరిత్రను తమకు అనుకూలంగా తిరిగి రాయగల సామర్ధ్యం, అధికారం వచ్చాయని భావిస్తున్నారు. ఇప్పటికే పురాతన చరిత్రను దిగజార్చటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు వర్తమాన చరిత్రను తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకొనేందుకు పూనుకున్నారు. అని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

చరిత్ర రెండు రకాలు, ఒకటి హీనమైనది, రెండవది ఘనమైనది. మొదటి చరిత్ర కలవారు రెండోవారిని కించపరిచేందుకు, తమకు లేని చరిత్రను కృత్రిమంగా తయారు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మన దేశంలో గాంధీ మహాత్ముడిని హత్యచేసిన వారు మతోన్మాదులు అన్నది తిరుగులేని సత్యం. ఒకవైపు హంతకుడు,కుట్ర చేసిన వారిని అనధికారికంగా కీర్తిస్తూ మరోవైపు వారితో తమపై ఏర్పడ్డ మచ్చను చెరిపివేసుకొనేందుకు కాషాయశక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. నాధూరామ్‌ గాడ్సే మావాడు కాదు అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనదానిలో మొదటిది. అయితే హత్యానంతరం కమిషన్‌ విచారణలో వారికి వున్న సంబంధాన్ని నిర్ధారించటంతో పాటు గాడ్సే సోదరుడు స్వయంగా నాధూరామ్‌ గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన జనసంఘ్‌పై గాంధీ హత్య మరక చాలా పెద్దదిగా కనిపించేది, ఎందుకంటే గాడ్సేను సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ వారు, హిందూమహాసభకు చెందిన వారందరూ ఆ పార్టీలో కనిపించేవారు. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితిని ప్రకటించటం ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కూడా జైళ్లలో వేయటంతో వారు ప్రజాస్వామ్యం పరిరక్షణలో జైలుపాలైన వారిగా ఫోజు పెట్టి తమపై వున్న మచ్చను కాస్త మసకపారేట్లు చేసుకున్నారు. జనతా పార్టీలో మత ముద్రను చెరిపివేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌-జనతా పార్టీలలో ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా వుండాలన్న అంశం తెరమీదకు వచ్చినపుడు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే లౌకిక ముద్ర కంటే మతముద్రే లాభమని లెక్కలు వేసుకొని బిజెపి రూపమెత్తారు. తరువాత బాబ్రీ మసీదు కూల్చివేత- అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అజెండాను ముందుకు తీసుకువచ్చినా విజయం సాధించలేకపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. గత ఎన్నికలలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా మూడోవంతు కూడా ఓట్లు రాలేదు. ఆ వచ్చినవి కూడా నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ది చేసిన ప్రగతివాదిగా చిత్రించటం, అన్నింటి కంటే కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, అసంతృప్తి కారణంగా ఆమేరకైనా ఓట్లు వచ్చాయి. ఆ ఓటింగ్‌ నిలవదని బిజెపి, సంఘపరివార్‌ నాయకత్వానికి తెలుసు. అందువలననే తమపై వున్న తిరోగామి ముద్రలను తుడిచివేసుకొనేందుకు పూనుకుంది. దానిలో తొలి అడుగు స్వచ్చభారత్‌ పిలుపును మహాత్మాగాంధీకి జతచేసి తాము ఆయనను గౌరవిస్తున్నామనే సందేశం పంపేందుకు ప్రయత్నించారు. దాని వలన ఆయనను హత్యచేసిన మచ్చపోయే అవకాశం లేదు. గతంలో ఏ సందర్భంలోనూ ప్రస్తావించని అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ నివేదిక పేరుతో ఒక కధనాన్ని ప్రచారంలో పెట్టారు. ఆ పధకంలో భాగమే బ్రిటీష్‌ గూఢచార విభాగానికి చెందిన గుర్తుతెలియని మూడో వ్యక్తి, అసలు లేని నాలుగో బుల్లెట్‌ కధ. మహాత్మాగాంధీని నిజంగా వదిలించుకోవాలని బ్రిటీష్‌ పాలకులు నిర్ణయించుకొని వుంటే ఆయనేం ఖర్మ యావత్తు స్వాతంత్య్రపోరాట నాయకత్వాన్నే అంతం చేసి వుండేది. అందునా స్వాతంత్య్రం ప్రకటించి, మన దేశం నుంచి వెళ్లిపోయిన తరువాత మహాత్ము డిని హత్యచేయాల్సిన అవసరం బ్రిటీష్‌ వారికి ఏమాత్రం లేదు. ఎందుకంటే వారు వెళ్లిపోయినా బ్రిటీష్‌ కార్పొరేట్ల పెట్టుబడులు అలాగే వున్నాయి. మహాత్ము డిని హత్య చేయించి వాటిని కాపాడుకోగలమనే పిచ్చి ఆలోచన వారికి కలిగే అవకాశం లేదు.

అయినా బ్రిటీష్‌ గూఢచారి కధ చెబుతున్నారంటే రాబోయే రోజుల్లో దాన్ని బలపరిచేందుకు వీలుగా అమెరికాలో కొత్త స్క్రిప్టు,దర్శ కత్వం, సినేరియో వంటి వన్నీ తయారువుతున్నాయని భావించాల్సి వుంది. మన మార్కెట్‌, మన మిలిటరీతో సంబంధాల విషయంలో అమెరికా పట్టు సాధించిన కారణంగా దానికి అనుగుణంగా వ్యవహరించే శక్తులకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అనేకదేశాలలో ఇది రుజువైంది.మన దేశంలో కూడా అదే పునరావృతం అవనుందా ?

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా-1

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

ఆయేషా మీరా, అరుషి కేసులలో నిందితులు నిర్దోషులు, వారు హత్య చేయలేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఎవరూ వారిని చంపకపోతే వారెలా హత్యకు గురయ్యారు? జాతిపిత మహాత్మాగాంధీ హత్యకేసులో కూడా, నిందితులు, వారి వెనుక కుట్ర చేశాయన్న సంస్ధలు పరిశుద్ధులని నిర్ధారించేందుకు ప్రయత్నం జరుగుతోందా ? మన న్యాయవ్యవస్ధకు ఎలాంటి దురుద్ధేశ్యాలను అపాదించకుండానే జరుగుతున్నవాటిని చూసి ఏమైనా జరగవచ్చని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కొందరు వూహిస్తున్నట్లుగా ఒక వేళ ఆయేషా, అరుషి కేసుల తీర్పులే మహాత్మాగాంధీ విషయంలో పునరావృతం అయితే జాతిపితను చంపింది ఎవరు అన్న ప్రశ్న భవిష్యత్‌ తరాల ముందు వుంటుంది. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ వూహించి వుండరు కదా !

మహాత్మాగాంధీ జన్మించి 148 సంవత్సరాలు గడిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాధూరామ్‌ గాడ్సే, మరొకడు కలిసి ఆయనను హత్యచేసి 69 సంవత్సరాలవుతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత హత్యలో మూడోవాడు,వాడు పేల్చిన నాలుగో బుల్లెట్టే ప్రాణం తీసింది దాని గురించి విచారణ జరపండి అని సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ముంబైకి చెందిన డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ అనే వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించే సంస్ధగా పరిగణించబడే అభినవ్‌ భారత్‌ ట్రస్టీ. నాధూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలో పాటు మహాత్మాగాంధీ హత్య సమయంలో మరో విదేశీ అజ్ఞాత వ్యక్తి వున్నాడని, నాలుగవ బుల్లెట్‌ పేలిందని దాని గురించి విచారణ జరపాలని గతేడాది దాఖలు చేసిన పిటీషన్ను బంబాయి హైకోర్టు కొట్టివేసింది. అదే వ్యక్తి సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమెరికా సిఐఏ నుంచి తనకు కొంత విలువైన సమాచారం త్వరలో అందనుందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని కూడా అతను వాదించాడు. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ తదుపరి వాదనలను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ ఈ కేసును విచారణకు చేపట్టవచ్చో లేదో తమకు సలహా ఇవ్వాలని అమరేందర్‌ శరణ్‌ అనే సీనియర్‌ న్యాయవాదిని నిర్ణయించింది. ఆ కేసు తదుపరి ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి సహజంగానే రేకెత్తింది. అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఒక వైపు మహాత్మాగాంధీని పొగుడుతూనే మరోవైపు ఆయనను కించపరిచే ద్వంద్వ వైఖరిని మనం ప్రస్తుత అధికారపక్షంలో చూస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది వారాల క్రితం గాంధీని చతురుడైన కోమటి అని వర్ణించిన విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన ‘గాడ్సేను దేవుడే పంపాడు, అసలు గాంధీనే వురి తీసి వుండాల్సింది, గాంధీని చంపటానికి గాడ్సేకు వుండే కారణాలు గాడ్సేకున్నాయి, అవును నేను గాడ్సేకు పెద్ద అభిమానిని, అయితే ఏమిటి’ అని ఆరాధించే అనేక మంది ప్రధాని నరేంద్రమోడీ భక్తులైతే అందుకు ప్రతిగా ట్విటర్‌ ద్వారా మోడీ వారిని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరో వూరూ పేరు లేని వారైతే పట్టించుకోనవసరం లేదు బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌లో ‘గాంధీని హత్యచేయటానికి గాడ్సేకు వుండే కారణాలు ఆయనుకున్నాయి, న్యాయబద్దమైన సమాజం వాటిని కూడా వినాలి’ అని వ్యాఖ్యానించాడు. వారందరికీ ఆరాధ్యదైవంగా పరిగణించబడే నరేంద్రమోడీ మరోవైపు ‘ గాంధీ జయంతి సందర్బంగా బాపూకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన మహత్తర ఆశయాలు ప్రపంచవ్యాపితంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేస్తారు.

సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించిన సుభాస్‌ చంద్రబోసే గాంధీని జాతిపితగా వర్ణించారు. మన రాజ్యాంగంలో జాతిపితగా గుర్తించే అవకాశం లేదు. అయినా మహాత్ముడి వ్యక్తిత్వం కారణంగా ఆయనను జాతిపితగా వర్ణిస్తున్నాము. కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించటం అంటే అంతటి స్ధాయిని కల్పించటమే. బిజెపి, దానిని వెనుక నుంచి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆయనను జాతిపితగా గుర్తించలేదు, పిలవలేదు.అలాంటి వ్యక్తిని గాడ్సే గాంగ్‌ ఎందుకు చంపింది. అనేది అవలోకించాల్సి వుంది. ప్రస్తుతం దేశంలో హిందూమతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయి. గాంధీని చంపటం ఒక పెద్ద ఘనతగా, అలాంటిదానిని తమకు దక్కకుండా చేసేందుకు పూనుకున్నారని హిందూమహాసభ పేరుతో వున్న వారు ప్రకటించారు.

మహాత్మాగాంధీని చంపింది హిందూమహసభకు చెందిన నాధూరామ్‌ గాడ్సే అనే తమ వారసత్వ ఆస్థి లేదా వుత్తరదాయిత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని హిందూమహాసభ ఆగ్రహం వెలిబుచ్చింది.మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ పేరుతో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ నియామకం జరుపుతున్నట్లు ప్రకటించగానే హిందూమహాసభ జాతీయ వుపాధ్యక్షుడు అశోక్‌ శర్మ ఒక ప్రకటన చేశారు. హిందూ మహాసభ నుంచి పుట్టిన భావజాలమే బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వునికి కారణం. ఆ రెండు సంస్ధలు ఈరోజు ధరించిన ముసుగులను బహిరంగపరచగలిగేది తమ సంస్ధ మాత్రమే అని వాటికి తెలుసు, హిందూమహసభ గుర్తింపును నాధూరామ్‌ గాడ్సే నుంచి విడదీయలేరు, గాంధీ హత్యలో గాడ్సేకు ఖ్యాతి దక్కకుండా చేసేందుకు అతని పాత్రపై అనుమానాలను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గాడ్సే లేకపోతే హిందూమహాసభ పూర్తిగా వునికి కోల్పోతుందని వారికి తెలుసు.ఇదందా బిజెపి ద్విముఖ వ్యూహంలో భాగం. గాడ్సేను పొగడలేదు కనుక గాంధీ పట్ల సానుకూల వైఖరిని అనుసరించేందుకు ఒక వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ ప్రమాణాల గురించి బహిరంగంగా మాట్లాడగలిగేది హిందూ మహాసభే కనుక దానిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి పూర్తిగా సంఘ్‌ తరఫున పని చేస్తున్నాడు.’ అని అశోక్‌ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి మతోన్మాద, హంతక శక్తులకు అంతటి బరితెగింపు ఎలా వచ్చింది? వారిని రక్షించే శక్తులది పైచేయి అయిందా, జనం విచక్షణ కోల్పోతున్నారా ? దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలపై గాంధీ తీసుకున్న వైఖరి మతోన్మాదులకు నచ్చనందునే ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మతాల గురించి గాంధీ చెప్పిందేమిటి? గాంధీ ధర్మం ప్రకారం సహనానికి మించి అన్ని మతాల పట్ట చిత్తశుద్దితో కూడిన గౌరవం వుంది.ఆమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.మతోన్మాదానికి ఏ మాత్రం అవకాశం లేదు. వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన, రాసిన మాటలు ఇలా వున్నాయి. ‘ నావరకు విభిన్న మతాలు ఒకే తోటలోని అందమైన పూలవంటివి లేదా దివ్యమైన చెట్టు యొక్క వివిధ కొమ్మలు. మానవ పరిణామక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి మతం తనదైన అంశభాగాన్ని అందచేసింది. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఒకే చెట్టులోని అనేక శాఖలు, మిగతావాటితో పోల్చితే దేనికది ప్రత్యేకతలు కలిగి వున్నప్పటికీ వాటికి వనరు ఒక్కటే.’ వివిధ మతాలు ఒకే చెట్టుమీది ఆకుల వంటివి. ఏ రెండు ఆకులూ ఒకే విధంగా వుండవు. ఒకే చెట్టుమీద పెరిగిన కొమ్ములు లేదా ఆకుల మధ్య వైరం వుండదు. ప్రపంచంలోని అన్ని గొప్పమతాలలోని నిజాల విశ్వాసిని, కేవలం సహనమే కాదు ఇతర మతాల విశ్వాసాలు కూడా మన వంటివే అనే గౌరవం లేకపోతే భూమ్మీద శాంతి నెలకొనదు. నేను ప్రబోధించే విశ్వాసం దాన్ని అమలు చేయటానికి మాత్రమే నన్ను అనుమతించదు, ఏ వనరునుంచి వచ్చినప్పటికీ మంచిని గ్రహించే విధి నిర్వహణ అనివార్యం చేస్తుంది. దీర్ఘ పఠనం, అనుభవం తరువాత నేను కొన్ని నిర్ధారణలకు వచ్చాను. అన్ని మతాలు నిజమైనవే,అన్ని మతాలలోనూ కొన్ని తప్పులున్నాయి, నా స్వంత హిందూమతం మాదిరి నాకు అన్ని మతాలూ ప్రియమైనవే, అదే విధంగా మానవులందరూ వారి స్వంత బంధువుల మాదిరి ప్రియంగా వుండాలి. ‘ ఒక క్రైస్తవ మిత్రుడు ఒకసారి గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. మీ మతం అన్ని మతాల సంయోగం అని మీరు చెబుతారా ? అంటే ఆ సంయోగాన్ని నేను హిందూయిజం అని పిలుస్తాను, మరియు మీ విషయానికి వస్తే క్రైస్తవమే సంయోగం అవుతుంది అని గాంధీ చెప్పాడు.

ఇటువంటి భావాలున్న వ్యక్తి దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలకు నిరసనగా దీక్ష చేపట్టటాన్ని అవకాశంగా తీసుకొని హిందూమతోన్మాదశక్తులు తమ కసి తీర్చుకున్నాయి.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ వంటి సంస్దలకు నాయకత్వం వహించిన వారి కార్యకలాపాలు రచనలు, వుపన్యాసాలను గమనించితే వారికి ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ, జర్మన్‌ హిట్లర్‌ నాజీలు స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు. భారత్‌ను జర్మనీగా భావించి అక్కడ యూదులను దేశద్రోహులుగా ఎలా చిత్రించారో ఇక్కడ ముస్లింలను అలా పరిగణించాలని భావించారు. ఐరోపా మతరాజ్యాల మాదిరి భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా చూడాలని అనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తాము గెలవాలని కోరుకున్న ముస్సోలినీ, హిట్లర్‌ మట్టి కరవటం, యూదులను వూచకోత కోయటాన్ని సభ్యసమాజం వ్యతిరేకించటం, జర్మనీ, ఇటలీలు ఓడిపోవటం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవటం వంటి అంశాలతో తాము వూహించుకున్నది ఒకటి జరిగింది ఒకటనే ఆశాభంగానికి గురైన శక్తులు గాంధీ కారణంగానే హిందువులు చేతగాని విధంగా తయారయ్యారనే తప్పుడు నిర్దారణలకు వచ్చి ఆయనను హతమారిస్తే తప్ప హిందూమతం పటిష్టం కాదనే అంచనాతో హత్యకు పాల్పడివుంటారని చెప్పవచ్చు. వారి వారసులు ఇప్పుడు గాంధీ హత్యను మరోవిధంగా వ్యాఖ్యానించటానికి, వుపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే సుప్రీం కోర్టులో మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ కథ.

గత లోక్‌సభ ఎన్నికలలో మూడింట రెండువంతుల సీట్లు బిజెపికి వచ్చాయి గానీ వచ్చిన ఓట్లు 31శాతమే. బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఓట్ల చీలిక దానికి సీట్ల పంట పండించింది. గరిష్ట మతరాజకీయాల అనంతరం పరిస్ధితి ఇది. వుత్తర ప్రదే శ్‌ ఎన్నికలలో కూడా బిజెపికి ఎన్నడూ లేని సంఖ్యలో సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల లెక్కలో లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. అత్యవసర పరిస్దితి అనంతర ఓట్లవివరాలను చూస్తే తమకు వున్న పరిమితులేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వానికి అవగతం అయ్యాయి. అందువలన అధికారంలో కొనసాగాలన్నా, మరో రూపంలో మతోన్మాద అజెండాను అమలు జరపాలన్నా విశ్వసనీయతను సృష్టించుకోవటం అవసరంగా భావించినట్లు కనిపిస్తోంది.

నాటి నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలందరూ హిందుత్వ గురించి, దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని కోరుతూ, హిందూ ధర్మానికి ముప్పు కలుగుతోందని చెబుతున్నవారే. అది వారికి ఆక్సిజన్‌ వంటిది. అదిలేకపోతే దానికింక మనుగడే వుండదు. ఎందుకంటే మిగతా అంశాలన్నీ అన్నీ పార్టీలు చెప్పేవే. గాంధీ హత్యకు కుట్రచేసిన గాడ్సే, ఇతరులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలలో సభ్యులుగా వున్న హిందుత్వశక్తులే. గతంలో జనసంఘం, ప్రస్తుతం బిజెపిగా వ్యవహరిస్తున్న పార్టీకి అది ఒక మాయని మచ్చ. దానిని తొలగించుకోవాలని ఎప్పటి నుంచో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. గాంధీని హతమార్చిన విషయాన్ని కాదనలేరు కనుక ఆయనను చంపింది రాజకీయ కారణాలతో తప్ప మతఅంశాలు కాదని చెప్పటానికి అనేక మంది బిజెపి ప్రముఖులు గతంలో ప్రయత్నించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన వారు గాంధీని హత్యచేసిన ఘనత తమఖాతాలో వేసుకొనేందుకు ఇంకా మోజుపడుతున్నారు.అది బహిరంగంగా చెప్పుకోలేరు. అదే సమయంలో అధికారం కావాలంటే అదొక ఆటంకంగా వుంది కనుక అధికారికంగా ఏదో విధంగా మత ముద్ర బదులు రాజకీయ ముద్రవేయాలని చూస్తున్నారన్నది ఒక విమర్శ. గాడ్సే గతాన్ని తుడిచి వేసుకొనేందుకు అతడసలు ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ప్రకటిస్తారు.హత్య సమయంలో అతను సంఘపరివార్‌లో లేడంటారు. అయితే గాడ్సే తమ్ముడు గోపాల్‌ గాడ్సే అసలు విషయాలు చెప్పాడు.’ నాధూరామ్‌, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులందరం ఆర్‌ఎస్‌ఎస్‌లో వున్నాం. మా ఇండ్లలో కంటే మేం ఆర్‌ఎస్‌ఎస్‌లోనే పెరిగామని నేను చెప్పగలను, అది మాకు ఒక కుటుంబం వంటిది.ఆర్‌ఎస్‌ఎస్‌లో నాధూరామ్‌ ఒక మేధోపరమైన కార్యకర్తగా ఎదిగాడు, తన ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు చెప్పాడు, ఎందుకంటే గాంధీ హత్య తరువాత గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో ఇబ్బందుల్లో వుంది కనుక అలా చెప్పాడు. అతను ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలి పెట్టలేదు. వెళ్లు, గాంధీని హత్యచేయమని ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానించలేదని చెప్పుకోవచ్చు తప్ప అతనితో మాకేమీ సంబంధం లేదని చెప్పకూడదు.ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తూనే 1944 నుంచి హిందూ మహాసభలో కూడా నాధూరామ్‌ పని చేయటం ప్రారంభించాడు.’ అని పేర్కొన్నాడు. గోపాల్‌ గాడ్సే చెప్పింది వాస్తవమే అనటానికి నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వుత్తర ప్రత్యుత్తరాల్లోని అంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆరవ వాల్యూమ్‌ పేజి 56లో ‘సావర్కర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసిన మతోన్మాద విభాగం హిందూమహాసభ కుట్ర చేసి అమలు చేయించింది’ అని పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టు ఏజి నూరాని తన పుస్తకంలో వివరించాడు.

దేశ రాజకీయ చిత్రపటం నుంచి గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్య్రం పోరాటనాయకులను తొలగించాలని బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హత్యకేసు విచారణ సమయంలో గాడ్సే చెప్పిన అంశాల కొనసాగింపే ఇది. జిన్నాకు గాంధీ తదితరులు లంగిపోయారని గాడ్సే ఆరోపించాడు. చెవులప్పగించిన వారికిది వినసొంపుగానే వుంటోంది. ఎందుకంటే గత 70సంవత్సరాలుగా మధ్యలో కొంత కాలం మినహా గాంధీ, నెహ్రూల వారుసులుగా చెప్పుకొనే వారే అధికారంలో కొనసాగారు. అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా సమాజంలోని వివిధ తరగతులలో అసంతృప్తి నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకోవాలంటే ఒక దగ్గర మార్గం సకల అనర్ధాలకు గాంధీ, నెహ్రూవారసులే కారణం అంటే చాలు. సరిగ్గా జర్మనీలో హిట్లర్‌ కూడా అదే చేశాడు. ఐరోపా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని పంచుకొనే పోటీలో జర్మన్‌ సామ్రాజ్యవాదులు వెనుకబడ్డారు. అందువలన మొదటి ప్రపంచయుద్ధంలో విజేతలు జర్మనీని దెబ్బతీసేందుకు అవమానకరమైన షరతులతో సంధిని రుద్ధారు. దాన్ని చూపి జనాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రాజకీయంగా ఎదిగాడు. ఇప్పుడు బిజెపి చేస్తోంది అదే. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో ఎలాంటి మార్పు లేదు. అవే దివాలా కోరు విధానాలను అమలు జరుపుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనం ప్రారంభమైన సమయంలో అంకెల గారడీ చేసి నరేంద్రమోడీ సర్కార్‌ లేని అభివృద్ధిని చూపింది. దేన్నయినా మూసిపెడితే పాచి పోతుంది. మూడు సంవత్సరాల కాలంలో అదే జరిగింది. తప్పుడు సలహాలు విని తాత్కాలికంగా అయినా కొన్ని మెరుపులు మెరిపించి మరోసారి ఓట్లను కొల్లగొడదామనే ఎత్తుగడుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన జీవిత కాలమంతా వ్యతిరేకించిన జిఎస్‌టిని ముందు వెనుకలు ఆలోచించకుండా బలవంతంగా అమలు జరిపించారు. ఆర్ధికాభివృద్ధి వెనుకపట్టు పట్టటం తాత్కాలికమే అని కొత్త పల్లవి అందుకున్నారు. దాని మంచి చెడ్డల గురించి మరోసారి చూద్దాం.

అసలు మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలేమిటి? అవి ఇప్పుడెలా వున్నాయో, వర్తమాన మేథావులు వాటిని ఎలా చూస్తున్నారో చూద్దాం. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నీతి నాయర్‌ గాంధీ జయంతి సందర్భంగా ఒక విశ్లేషణ చేశారు. దానితో ఎకీభవించాలా లేదా మరో కోణం నుంచి చూడాలా అనేది వేరే విషయం. అమె విశ్లేషణ సారం ఇలా వుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించటాన్ని కోట్లాది మంది చూశారు. గాంధీకి ఇష్టమైన ప్రార్ధనలను రేడియో వినిపించి, నలుపు, తెలుపుల డాక్యుమెంటరీలను టీవీలలో ప్రసారం చేశారు. అయితే ఈ తీపి మాటలు, విధిలో భాగంగా వెల్లడించే శ్రద్ధాంజలులు, జాతిపితకు సంబంధించిన వాస్తవాలను మూసిపెట్టేందుకే. అధికార భారత్‌లో వాస్తవానికి గాంధీ గతించారు.

మహాత్మాగాంధీ సంప్రదింపుల శక్తిని విశ్వసించారు. కాశ్మీరులో పరిస్ధితి నెత్తుటి మరకలా వుంది. సంప్రదింపులు లేవు,క్లుప్తంగా చెప్పాలంటే అధికారం పశుబలాన్ని ప్రయోగించింది. నిరాయుధనిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన పిల్లెట్లతో వందలాది మంది అంధులయ్యారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎన్ని సత్యాగ్రహాలు చేసి వుండేవారు? భిన్న సామాజిక తరగతులను ఐక్యం చేసేందుకు తన ప్రార్ధనా సమావేశాలలో గాంధీజీ బైబిల్‌, ఖురాన్‌, గీతలోని అంశాలను ప్రస్తావించేవారు, ఇప్పుడు హిందూ చిహ్నలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఏ పధకమైనా పేదలకు లబ్ది చేకూర్చిందా లేదా అన్నదే దాని విజయానికి గీటురాయిగా తీసుకోవాలన్నది గాంధీ వైఖరి. మోడీ తన పుట్టిన రోజు కానుకగా జాతికి అంకితం చేసిన సర్దార్‌ సరోవర్‌ డామ్‌ నీటిని నాలుగు రాష్ట్రాలలో రువు ప్రాంతాలకు వుద్దేశించగా దానికి భిన్నంగా దామాషాకు వ్యతిరేకంగా కోకాకోలా, టాటానానో కారు వంటి కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ల అవసరాలకు అనుగుణ్యంగా నీటిని మళ్లిస్తున్నారు. అత్యంత పేదలైన గిరిజనుల నివాసాలు మునిగిపోయాయి, దశాబ్దాలు గడిచినా, పాకేజీలు ప్రకటించినా నిర్వాసిత గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. ప్రజాస్వామ్యంలో మీడియా పోషించాల్సన విమర్శనాత్మక పాత్రను గాంధీజి విశ్వసించారు. నేడు దేశంలో ప్రభుత్వ విమర్శకులను భయపెట్టే పద్ధతులను నిరంతరం అనుసరిస్తున్నారు. జర్నలిస్టులను హత్యచేయటం నుంచి స్వతంత్రంగా వ్యవహరించే సంపాదకులను రాజీనామా చేయించటం వరకు అవి వున్నాయి.

గాంధీ గోవధను వ్యతిరేకించినప్పటికీ హిందువేతరులపై ఒక మతాన్ని రుద్దటాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. హిందువులు బీఫ్‌ తింటారని, ఆవు చర్మాలతో వ్యాపారం చేస్తారని ఆయనకు బాగా తెలుసు. భిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలున్న ముస్లిం, పార్సీ, క్రైస్తవులు తదితర బహుళ సామాజిక తరగతుల గురించి గాంధీజి పదే పదే చెప్పారు. కానీ నేడు ఆయన ప్రాతినిధ్యం వహించినదానికి విరుద్దంగా గో రక్షకులు రాత్రి పగలూ వీధులలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. చీపుర్లు పట్టి మోడీ మంత్రులు ఫొటోలు తీయించుకోవటంలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్య నియమాలను పాటించటంలో లేదు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌ నుంచి రాట్నం వడుకుతున్న గాంధీ పొటోను తొలగించి నరేంద్రమోడీది చేర్చటం ఖాదీతో గాంధీ అనుబంధాన్ని కనిపించకుండా చేయటమే. గోరక్షకుల దాడులకు బలైన బాధిత కుటుంబాల ఇండ్లకు శాంతియుతంగా వెళ్లిన కార్యకర్తల కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబరు రెండున దేశవ్యాపితంగా మౌనంగా అయినప్పటికీ శక్తివంతంగా జరిపిన జర్నలిస్టుల నిరసనల్లో గాంధీ వున్నారు. ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక శాంతియుత నిరసనల్లో గాంధీ భావజాలం పని చేసింది.

గాంధీకి అధికారికంగా ఏర్పాటు చేసిన రాజఘాట్‌ స్మారక చిహాన్ని చూపేందుకు బస్సుల్లో స్కూలు పిల్లల్ని తీసుకు వెళ్లేవారు ఒక పధకం ప్రకారం మితవాద మతోన్మాది నాధూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన బిర్లా భవనాన్ని ఎందుకు చూపరు అని గాంధియన్‌ విద్యావేత్త కృష్ణకుమార్‌ 2007ఒక రచనలో ఆశ ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాడ్సే పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ, విదేశీ అతిధులు కూడా బిర్లా భవనాన్ని ఎవరూ సందర్శించరు. గాంధీ హత్యవెనుక వున్న కారణాలేమిటని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేసేందుకు హత్యజరిగిన నాటి నుంచి ఒక ‘నిశబ్ద ఒప్పందం’ జరగటమే దీనికి కారణం అయివుండాలని కృష్ణ కుమార్‌ నిర్ధారణకు వచ్చారు. గాంధీ హత్య జరిగిన తరువాత హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులు చేసి కార్యకర్తలను అరెస్టుచేసి వారి రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత రికార్డులను నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం తొలగింపు, కార్యకర్తల విడుదల తరువాత వారు రహస్యంగా హిందూ సామాజిక తరగతిని పటిష్టపరిచేందుకు పనిచేస్తున్నారు. విరాళాలు వసూలు చేసేటపుడు రాతపూర్వక రికార్డులు నిర్వహించకూడదని నిర్ణయించారు. గాడ్సేకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తులలో ఒకరైన జి.డి ఖోస్లా కొన్ని సంవత్సరాల తరువాత ‘ ఆరోజు కోర్టులో ప్రేక్షకులుగా వున్నవారు ఒక జూరీని ఏర్పాటు చేసి గాడ్సే అప్పీలు మీద విచారణ జరపమని దానికి అప్పగించి వుంటే గాడ్సే తప్పుచేయలేదని అత్యధిక మెజారిటీతో తీర్పు చెప్పి వుండేవారు’ అని పేర్కొన్నారు.

సంవత్సరాలు గడిచిన కొద్దీ అనేక రోడ్లకు మహాత్మాగాంధీ పేరు పెట్టారు, దేశమంతటా అనేక విగ్రహాలు నెలకొల్పారు తప్ప ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేశారు. లౌకికవాదులుగా పిలుచుకొనే పార్టీలు 1977-79 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ధానం దొరికింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనతా పార్టీ రెండింటిలో ద్వంద్వ సభ్యత్వం కలిగి వుండటమనే సమస్యకారణంగా దేశంలోని తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది.( ఇప్పుడు బిజెపిగా ఏర్పడిన వారు తాము ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకొనేది లేదని జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు) రాజకీయాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో సాగుతున్న రాజకీయ బేరసారాలలో దేశంలో గాడ్సే స్ధానం గురించి పరిశీలించటానికి ఏమాత్రం చోటులేదు. భగత్‌ సింగ్‌, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి గాంధీ సమకాలిక పెద్దలు వున్నప్పటికీ భిన్న తరగతుల మధ్యó మహాత్ముడి స్ధానంలో గాంధీ కొనసాగుతూనే వుంటారు.ఆయన అనుసరించిన, ఆచరించిన పద్దతులు వర్తమాన భారతంలో ఎన్నడూ లేనివిధంగా మరింతగా ప్రతిబింబించాలి.’ నీతి నాయర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించినా, విబేధించినా అవి ఆలోచనాత్మకంగా వున్నాయని చెప్పవచ్చు. మూసిపెట్టటానికి ప్రయత్నించకుండా మరిన్ని కోణాల నుంచి ఈ అంశాలను చర్చించవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిజంపై ఓ అమెరికా సైనికుడి ఆత్మవిశ్వాసం !

04 Wednesday Oct 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communism will win, pro-communist statements, spenser rapone, West Point cadet

ఎం కోటేశ్వరరావు

‘కమ్యూనిజం విజయం సాధిస్తుంది ‘ ‘ నిన్ను ఏదైనా సందేహం తొలుస్తూ వుంటే విజయం సాధించే వరకూ ముందుకు సాగిపో ‘ సెప్టెంబరు 24,25 తేదీలలో ఒక అమెరికన్‌ సైనికుడు చేసిన ట్వీట్లివి. అతడే సెకెండ్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ స్పెన్సర్‌ రపోనే. మొదటిది రపోనే ఆత్మవిశ్వాసం, రెండవది ప్రముఖ విప్లవకారుడు చే గువేరా సుప్రసిద్ద నినాదం. రపానే అల్లరిచిల్లరి యువకుడు కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మిలిటరీ శిక్షణా కేంద్రం వెస్ట్‌పాయింట్‌లో గతేడాది అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అక్కడ ప్రవేశం దొరకాలంటే ఎంతో ప్రతిభవుంటే తప్ప అసాధ్యం.

అమెరికాలో ఎవరినైనా వేధించాలనుకుంటే కమ్యూనిస్టు అని ముద్ర వేయటం పరిపాటి. ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఆ ముద్రపడిన వారిని దగ్గరకు రానివ్వరు. అంతగా అక్కడి పాలకులు కమ్యూనిజం, కమ్యూనిస్టుల గురించి వ్యతిరేకత నూరి పోశారు. అలాంటి అప్రజాస్వామిక, దుర్మార్గపు దేశంలో స్పెన్సర్‌ రపోనే చే గువేరా అభిమానినని, కమ్యూనిజం విజయం సాధిస్తుందని ప్రకటించటం అమెరికా యువతలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలంపై పెరుగుతున్న ఆసక్తి, అవును నేను సోషలిస్టును, కమ్యూనిస్టునే ఏం చేస్తారో చేసుకోండి అనే తెగింపు ధోరణికి ఒక చిహ్నంగా చెప్పవచ్చు. దీనర్ధం తెల్లవారేసరికి అక్కడేతో పెద్ద మార్పు జరుగుతోందని కాదు. ప్రతి సంఘటన పెను మార్పులకు దారితీయదు, అదే విధంగా సంభవించిన ప్రతి పెనుమార్పు చిన్న ఘటనగానే ప్రారంభం అవుతుందని చెప్పటమే ఇక్కడ వుద్దేశ్యం.

మొదటి ప్రపంచయుద్ధానికి ముందు జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోమ్‌బార్ట్‌ రాసిన ఒక వ్యాసానికి అమెరికాలో సోషలిస్టులు ఎందుకు లేరు అని శీర్షిక పెట్టారని, ఇప్పుడు దాన్నే మరోవిధంగా అమెరికాలో సోషలిస్టులు ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని హరాల్డ్‌ మేయర్సన్‌ అనే ఒక జర్నలిస్టు గతేడాది రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యమా లేక ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా సోషలిజం పట్ల జనంలో వున్న సానుకూల దృక్పధానికి చిహ్నమా ? యువతరం ఆలోచించాలి. ఏదైనా ఒక వ్యవస్ధ విఫలమై ఆటంకంగా మారితేనే దానికంటే మెరుగైన ప్రత్యామ్నాయం గురించి జనం ఆలోచిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

బెర్నీ శాండర్స్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు స్వయంగా తాను సోషలిస్టును అని ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రకటనపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా వంటి చోట్ల ఎవరైనా అలా ప్రకటించుకుంటే అనుమానించటం సహజమే. అయితే శాండర్స్‌ రాజకీయ ప్రస్తానాన్ని చూసినపుడు మిగతా డెమోక్రాట్ల కంటే భిన్నంగా కనిపిస్తాడు. ఎవరి నిజాయితీ అయినా ఆచరణే గీటురాయి. అలా చూసుకున్నపుడు కమ్యూనిస్టులు, సోషలిస్టులు అంటే కత్తులు విసిరే చోట ఎంపీ స్ధాయిలో వున్న వ్యక్తి అమెరికాలో అలా ప్రకటించుకొని బావుకునేదేమీ వుండదు. మన దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థలను పాలకులు ఎలా వాడుకుంటున్నదీ చూస్తున్నాము. అమెరికాలో అంతకంటే ఎక్కువగానే వేధిస్తారు. అలాంటపుడు శాండర్స్‌ తాను సోషలిస్టును అని చెప్పుకోవటం ఏమిటి? అతనికి మద్దతుగా డెమోక్రటిక్‌ పార్టీ ప్రచారంలో లక్షలాది మంది యువతీ యువకులు మేమూ సోషలిస్టులమే అంటూ మద్దతు ఇవ్వటానికి ముందుకు రావటాన్ని గతేడాది అధ్యక్ష ఎన్నికల సందర్బంగా చూశాము. అమెరికాలో ఇలాంటి మార్పును ఎవరైనా వూహించారా ? వారెలాంటి సోషలిజాన్ని కోరుకుంటున్నారు అనేది తరువాత, ఒక సోషలిస్టును అభ్యర్ధిగా నిలపాలంటూ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావటమే గొప్ప మార్పు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే ఎందరో సోషలిజం గురించి కలలు కన్నారు, ఆ దిశగా పనిచేశారు. దాన్ని ఆచరణలో పెట్టేందుకు కమ్యూనిస్టు ప్రణాళికతో నిర్ధిష్ట కార్యాచరణకు పూనుకున్నారు. నేడు అనేక సోషలిస్టు భావనలు, మార్గాలు ప్రచారంలో వున్నందున తమకు ఏది సరైనదో అమెరికన్లు నిర్ణయించుకుంటారు.

న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక 2015 నవంబరులో నిర్వహించిన ఒక పోల్‌లో 56శాతం మంది డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్లు సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.ప్యూ సంస్ధ 2011లో జరిపిన సర్వేలో 30 ఏండ్లలోపు వయస్సున్న 49శాతం మంది యువత సోషలిజం పట్ల సానుకూలత, 47శాతం పెట్టుబడిదారీ విధానం పట్ల మొగ్గు చూపినట్లు ప్రకటించారు. ఈ సర్వేలన్నీ ఎవరు కోరుకుంటే చేశారు? చేసిన వారెవరూ సోషలిజం మీద అభిమానం వున్నవారు కాదు. అంత మంది యువతీ యువకులను సోషలిజంవైపునకు ఎవరు నెట్టారు. అమెరికా సమాజంలో పెరుగుతున్న అసమానతలపై వ్యక్తమైన నిరసనే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, తరువాత ప్రఖ్యాత ఫ్రెంచి ఆర్ధికవేత్త పికెటీ వెలువరించిన అసమానతల తీరు తెన్నులు, కనీసవేతనంగా గంటకు పదిహేను డాలర్ల వేతనం కోసం దేశవ్యాపితంగా జరుగుతున్న వుద్యమాలన్నీ అమెరికా సమాజంలో జరుగుతున్న మధనానికి సూచికలు. అనేక పరిమితులున్నప్పటికీ అమెరికన్ల ఆలోచనలో వస్తున్న మార్పులను అక్కడి సర్వేలు ప్రతిబింబిస్తున్నాయి. పూ సంస్ధ సర్వే ప్రకారం 2000 సంవత్సరంలో తాము వుదారవాదులమని చెప్పుకున్న డెమోక్రాట్లు 27శాతం వుండగా 2015నాటికి యువతరంలో 42శాతానికి పెరిగింది. తాము సోషలిస్టులం అని చెప్పుకున్నవారు 2004లో 37శాతం వుండగా 2015 నాటికి 49శాతం అయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌ పోల్‌ ప్రకారం దక్షిణ కరోలినా డెమోక్రాట్లలో 39 మంది సోషలిస్టులమని,74శాతం పురోగామివాదులమని, 68శాతం వుదారవాదులమని తమను తాము వర్ణించుకున్నారు. అమెరికా అంతటా ఇదే విధంగా వుందని చెప్పలేము. కొన్ని చోట్ల అయినా వచ్చిన మార్పునకు ఇది సూచిక. దీనికి ప్రధాన కారణం అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ పనిచేయకపోవటాన్ని గతంలో ఎన్నటి కంటే ఎక్కువగా అమెరికన్లు గుర్తించటమే. పై సర్వేలు జరిగిన తరువాత జరిగిన పరిణామాలు అలాంటి ధోరణులు మరింతగా పెరిగేందుకు తోడ్పడేవే తప్ప వెనక్కు పోయేవి కాదు.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికాలో సోషలిస్టులు లేకపోవటానికి గల కారణాలను జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోంబార్ట్‌ వివరించారు.అమెరికాకు వలస వచ్చిన కార్మికులకు తమ దేశాలలో తాము అనుభవించినదానికంటే అమెరికాలో పరిస్ధితులు మెరుగ్గా వున్నందున సోషలిస్టులుగా మారాల్సిన అవసరం నాడు లేదనుకున్నారు. ఇతర ఐరోపా దేశాలలో కంటే తమ పని పరిస్థితులు దారుణంగా వున్నందున అమెరికా కార్మికవర్గం, యువతలో నేడు సోషలిస్టు ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవటానికి, నిపుణులైన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్లకు వలస పోకుండా నిరోధించేందుకు ఐరోపా పాలకవర్గం కొన్ని సంక్షేమ చర్యలను అమలు జరిపింది. ఇప్పుడు తమ దేశంలో కూడా అలాంటి వాటిని అమలు జరపాలని అమెరికా యువత కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే ఐరోపాలో ఆ సంక్షేమ చర్యలకు తిలోదకాలివ్వటాన్ని అక్కడి కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది. అమెరికా కార్మికవర్గం ఈ అనుభవాలను గమనంలోకి తీసుకొని తన స్వంత మార్గాన్ని నిర్ణయించుకోవటం అనివార్యం.

అమెరికాలో జరుగుతున్న సైద్ధాంతిక, కార్యాచరణ మధనానికిి ప్రతిబింబమే స్పెన్సర్‌ రపోనే స్పందన. అతనిప్పుడు అక్కడి మీడియాలో ఒక సంచలన వార్తగా మారాడు. సోషలిజం, కమ్యూనిజం ఎంతో ఆకర్షణీయంగా వున్నపుడు యువత వుత్జేజితులు కావటంలో విశేషమేమీ లేదు. దానికి అనేక ఎదురు దెబ్బలు తగిలి, శత్రుదాడి తీవ్రంగా వుందిపుడు. హరినామ స్మరణం కూడా వినిపించటానికి వీల్లేదన్నచోట ఓ ప్రహ్లాదుడు పుట్టినట్లుగా ఆమెరికాలో ఒక సైనికుడు బహిరంగంగా కమ్యూనిజం పట్ల విశ్వాస ప్రకటన చేయటం నిజంగా విశేషమే. దేనికైనా సిద్దపడిన వాడే సైనికుడు. అతడు కమ్యూనిస్టు యోధుడు కావచ్చు, మరొకరు కావచ్చు.

న్యూయార్క్‌ నగరానికి 80కిలోమీటర్ల దూరంలోని వెస్ట్‌పాయింట్‌ అనే ప్రాంతంలో వున్న ప్రతిష్ఠాత్మక అమెరికా మిలిటరీ అకాడమీలో నాలుగేళ్ల డిగ్రీకోర్సును గతేడాది పూర్తి చేసిన పాతికేండ్ల యువకుడు స్పెన్సర్‌ రపోనే. డెమోక్రటిక్‌ సోషలిస్ట్సు ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) పార్టీలో సభ్యుడినని స్వయంగా చెప్పుకున్నాడు. గతేడాది డెమోక్రటిక్‌ పార్టీలో దేశాధ్యక్షపదవికి పార్టీ అభ్యర్ధిగా నిలిచేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడిన బెర్నీశాండర్స్‌కు మద్దతు తెలిపిన లక్షలాది మంది యువతీ యువకులు తాము ఆ పార్టీకి చెందిన వారమేనని, సోషలిస్టుల మని బహిరంగంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

ఒక యువకుడిగా ప్రపంచంలో ఒక పెద్ద భావజాలంగా వున్న కమ్యూనిజం గురించి, దానితో వుత్తేజితుడైన చే గువేరా గురించి సానుకూలంగా స్పందించటం తప్ప రపోనే చేసిన తప్పేమీ లేదు. అయితే ఇది అమెరికా విలువలు, లక్షణాలకు వ్యతిరేకమని కొందరు గగ్గోలు పెడుతున్నారు. తమ సంస్ధ లేదా అమెరికా మిలిటరీ విలువలకు అతని వ్యాఖ్యలకు ఎలాంటి సంబధమూ లేదని వెస్ట్‌పాయింట్‌ సంస్ధ వివరణ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో రపోనే ట్రంప్‌ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ ప్రసంగంతో అతనొక ఫాసిస్టు అనే ఒక నీచమైన అనుమానాన్ని ట్రంప్‌ నివృత్తి చేశాడు.’ అని గత జూలైలో పేర్కొన్నాడు.

గత నెలలో కొందరు ఫుట్‌బాల్‌ క్రీడాకారులు అమెరికా జాతీయ గీతాలపన సందర్బంగా తమ మోకాళ్ల మీద నిలబడి అమెరికాలో వున్న జాతివివక్ష, అమెరికా పోలీసులలో వున్న హింసా ప్రవృత్తిని నిరసన తెలిపారు. దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవటాన్ని విమర్శించారు. కొన్ని జట్లకు చెందిన వారు జాతీయ గీతాలాపన సమయానికి అసలు మైదానానికే రాలేదు. క్రీడాకారులు మోకాళ్ల మీద నిలబడటం జాతీయ గీతాన్ని అవమానించటం కాదని అనేక మంది క్రీడాకారుల చర్యను సమర్ధించారు. ఈ సందర్భంలోనే లెప్టినెంట్‌ కల్నల్‌ రపోనే తన ట్వీట్లను చేశాడు.

రపోనేపై మిలిటరీ ఎలాంటి చర్య తీసుకుంటుందో తెలియదు గానీ వెస్ట్‌పాయింట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రషీద్‌ హుస్సేన్‌ను సంస్ధ యాజమాన్యం సెలవుపై పంపింది. అతను రపోనే చదువు సంధ్యల మార్గదర్శకుడిగా వ్యవహరించారు.తాను రపోనేతో ఎంతో సన్నిహితంగా వున్న మాట నిజమే అని రషీద్‌ నిర్ధారించారు. గతేడాది రపోనే డిగ్రీ తీసుకున్న సమయంలో తీసిన 56 ఫొటోలను అతని సోదరి తన ఫేస్‌బుక్‌ ఆల్బంలో పోస్టు చేసింది. వాటిలో రపోనే తన టోపీ లోపలి భాగంలో కమ్యూనిజం విజయం సాధిస్తుంది అనే నినాదాన్ని చూపుతూ బిగించిన పిడికిలి చూపిన, అదే విధంగా తన యూనిఫారం కింద వేసుకున్న చే గువేరా బమ్మ వున్న టీ షర్టును చూపుతున్న చిత్రాలున్నాయి. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమం, మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రొఫెసర్‌ రషీద్‌తో కలసి అధ్యయనంలో భాగంగా ‘స్టాఫ్‌ రైడ్‌ ‘ అనే కార్యక్రమంలో పాల్గనేందుకు 2014లో మన దేశ సందర్శన సందర్భంగా దిగిన ఫొటోలు కూడా వున్నాయి. రషీద్‌తో ఒక విద్యార్ధిగా రపోనే సాన్నిహిత్యంలో ముస్లిం, కమ్యూనిస్టు అనుకూల, అమెరికా ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంపొంది వుంటాయని కొంత మంది కోడి గుడ్డు మీద ఈకలను వెతికే మాదిరి వ్యాఖ్యలు చేస్తున్నారు. మిలిటరీ శిక్షణలో వుండగానే అమెరికా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత కలిగి వున్న రపోనే అభిప్రాయాలను గమనించిన అకాడమీ అధికారులు అతనికి లాంఛనంగా హితవు చెప్పారు తప్ప అకాడమీ నుంచి తొలగించలేదని మీడియాలో కధనం వచ్చింది. రపోనే వెల్లడించిన అనేక అభిప్రాయాలను సహాధ్యాయులు అనేక మంది పట్టించుకోకపోవటమో లేదా కొందరు సమర్ధించటమో చేసినట్లు ఇప్పుడు కొందరు చెబుతున్నారు. రపోనే అమెరికా వుపాధ్యక్షుడు, రక్షణ మంత్రిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా తాజా ట్వీట్లకు జత చేస్తున్నారు. విశేషం ఏమంటే వ్యక్తిగతంగా వారిపై చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధాంతపరంగా కమ్యూనిజం, చేగువేరాలను సమర్ధించటం అమెరికా అధికార యంత్రాంగానికి తీవ్రమైన తప్పిదంగా కనిపిస్తోంది. అంటే అమెరికా పెట్టుబడిదారీ విధానం, దాని కమ్యూనిస్టు వ్యతిరేకత, యుద్ధకాంక్షలను విమర్శించటాన్ని మాత్రం సహించదని స్పష్టం అవుతున్నది.’ స్పెన్సర్‌ నా కుమారుడు, అతనిని నేను ఎంతగానో ప్రేమిస్తాను, అయినప్పటికీ అతని అభిప్రాయాలు, ప్రవర్తనను అభిమానించటం లేదా ఖండించటంగానీ చేయను, ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లి వచ్చినప్పటి నుంచి అతని రాజకీయ అభిప్రాయాలలో గమనించదగిన మార్పు కనిపిస్తోంది’ అని తండ్రి రిచర్డ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే తరువాత వాటిని తొలగించాడు.గతంలో బ్రాడ్లే మానింగ్‌గా మిలిటరీలో పని చేస్తూ వికీలీక్స్‌కు సమాచారం అందించాడనే ఆరోపణపై జైలు శిక్షకు గురైన వ్యక్తి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా క్షమాభిక్షతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతడు లింగమార్పిడి చేయించుకొని చాలేసియా మానింగ్‌గా మారింది. గతంలో స్పెన్సర్‌ రపోనే న్యూయార్క్‌లో ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌గా పని చేసినపుడు ఒక పోస్టులో ఇలా రాశాడు.’ ఒక కమ్యూనిస్టుగా ఈ సంస్ధలో పనిచేస్తూ ప్రతి రోజూ వైరుధ్యాల గురించి ఆలోచిస్తాను. ఇలాంటి సంస్ధలలో దీర్ఘకాలం కొనసాగటానికి ఆమె(చాలేసియా మానింగ్‌) ధైర్యం,పట్టుదల నాకు ఎంతో శక్తినిస్తున్నాయి.’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో మరో పోస్టులో చేగువేరా గెరిల్లా యుద్దతంత్రం గురించి చదివానని, గెరిల్లా పోరాటం గురించి మావో చెప్పింది కూడా చదవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. తన అభిప్రాయాలను ఇంత సూటిగా వెల్లడించిన స్పెన్సర్‌పై చర్య తీసుకొనేందుకు తొందర పడవద్దని కొందరు పత్రికా వ్యాఖ్యతలు మిలిటరీకి హితవు పలికారు. పట్టించుకుంటుందా, మొరటుగా ముందుకు పోతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: