• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: February 2018

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

28 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ 1 Comment

Tags

communist, communist manifesto, karal marx, Karl Marx and Friedrich Engels, Raoul Peck, The Young Karl Marx

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నేపాల్‌ కమ్యూనిస్టు వుద్యమంలో నూతన అధ్యాయం !

21 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Nepal, nepal communist movement, Nepal communist party, Nepal communists

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమానికి వుత్తేజం కలిగించే మరో పుట చరిత్రకు తోడైంది. ఇటీవలి పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో ఐక్యంగా పోటీచేసిన నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ(యుఎంఎల్‌), నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు సెంటర్‌)లను ఒకే పార్టీగా విలీనమైంది. ఈ మేరకు లాంఛనంగా రెండు పార్టీల నేతలు ఏడు అంశాల ఒప్పందంపై సోమవారం నాడు సంతకాలు చేశారు. దీని ప్రకారం కొత్త పార్టీకి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సిపిఎన్‌) నామకరణం చేశారు. మార్క్సిజం-లెనిజం వేగుచుక్కగా పార్టీ పని చేస్తుంది. యుఎంఎల్‌ అధ్య క్షుడు, ప్రధాని అయిన కెపి శర్మ ఓలి, ఝాలా నాధ్‌ ఖనాల్‌, మాధవ కుమార్‌ నేపాల్‌, వామ్‌దేవ్‌ గౌతమ్‌, ఈశ్వర్‌ పోఖరెల్‌, మావోయిస్టు సెంటర్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు పుష్పకమల్‌ దహాల్‌( ప్రచండ) నారాయణ్‌ కాజీ శ్రేష్ట, రామ్‌ బహదూర్‌ థాపా సంతకాలు చేశారు. ఐక్యపార్టీ మహాసభ జరిగే వరకు పార్టీకి కెపి శర్మ ఓలీ, ప్రచండ ఇద్దరూ అధ్యక్షులు వుంటారు, ఇద్దరూ అధికారంలో పాలుపంచుకుంటారు. దిగువ స్ధాయిలో కూడా రెండు పార్టీల కమిటీలు విలీనం అవుతాయి. అంగీకరించిన ఏడు అంశాలు ఇలా వున్నాయి.1.పార్టీపేరు నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ.2.పార్టీ సిద్ధాంతాలను అంతిమంగా పార్టీ మహాసభ నిర్ణయిస్తుంది.3. అప్పటి వరకు మార్క్సిజం-లెనినిజం వుమ్మడి పార్టీ సిద్ధాంత అంశంగా వుంటుంది.4. వుమ్మడి పార్టీ స్టాండింగ్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలు చిన్నవిగా వుంటాయి.5. ప్రధానిగా కెపిశర్మ ఓలి, ప్రపండ రెండు సమానవంతుల వారీ పని చేస్తారు.6. పార్లమెంట్‌ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌గా యుఎంఎల్‌, స్పీకర్‌, వుపాధ్యక్షులుగా మావోయిస్టు సెంటర్‌ ప్రతినిధులు వుంటారు.7.మంత్రుల సంఖ్యను తరువాత ఖరారు చేస్తారు.(15 మందితో కాబినెట్‌ వుండాలని సమన్వయ కమిటీ సిఫార్సు చేసింది). మార్చినెల అయిదవ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశ కొత్త దేశాధ్యక్షుడు, వుపాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది.

పదిరోజుల క్రితం ప్రధానిగా కెపి శర్మ ఓలి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసినదే.మార్చి ఐదవ తేదీన పార్లమెంట్‌ తొలి సమావేశం జరుగుతుంది. వుభయ సభలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సభ్యులను కలిగి వుంది. చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తి కావాల్సి వున్నందున విలీన ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో నెల రోజులు పట్టవచ్చు.ఈ లోగా రెండు పార్టీల కేంద్రకమిటీలు సమావేశమై విలీన తీర్మానాలను అమోదించాల్సి వుంది. విభిన్న నేపధ్యాలు కలిగిన ఈ రెండు పార్టీల విలీనం అనేక మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. రెండువందల నలభయి సంవత్సరాల హిందూరాజ్య పాలన సాగిన నేపాల్‌లో గత రెండు దశాబ్దాలుగా రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులు అక్కడి రాజకీయాలలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్‌ కలిసి రాచరిక వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కాగా మావోయిస్టు సెంటర్‌ పార్టీ సాయుధపోరు బాటను అనుసరించింది.2006లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం మావోయిస్టులు ఆయుధాలను విసర్జించారు. ఆ పార్టీ నేత ప్రచండ ప్రధాని అయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గిపోయింది. తాజా ఎన్నికలలో సంఖ్యరీత్యా అది మూడో స్ధానానికి పరిమితమైంది. నేపాల్‌ మావోయిస్టు పోరాటాన్ని ‘ ద బుల్లెట్‌ అండ్‌ బాలట్‌ బాక్సు’ పేరుతో గ్రంధస్తం చేసిన ఆదిత్య అధికారి విలీనం అసాధారణమైనదని వర్ణించారు. వారు ఐక్యతకు కట్టుబడి వుంటే అది నేపాల్‌ రాజకీయ భవితవ్యాన్నే మార్చివేస్తుందని, అయితే అధికారాన్ని పంచుకోవటంలో వుమ్మడి పార్టీలో కూడా వారు రెండు పక్షాలుగా వ్యవహరించే అవకాశం వుందని అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో తొమ్మిది సంకీర్ణాలను చూసి విసుగెత్తిన నేపాలీ ఓటర్లు తాజా ఎన్నికలలో కమ్యూనిస్టులకు పార్లమెంట్‌ వుభయ సభలు, రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీని కట్టబెట్టి అస్ధిరతకు తెరదించారు. అందువలన వుమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి వుంది. తాము అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నామని, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలకు మాత్రమే పరిమితమైతే కుదరదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఎగువ సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. ఎగువ సభను కలిగి వుండటం నేపాల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభ్యులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్ధానిక సంస్ధల అధ్యక్షులు, వుపాధ్యక్షులతో కూడిన ఎలక్ట్రొరల్‌ కాలేజీ 59 సభ్యులుండే ఎగువ సభలో 56 మందిని ఎన్నుకుంటుంది. ముగ్గురిని దేశాధ్యక్షుడు నియమిస్తారు. ఏడు రాష్ట్రాలు సమాన ప్రాతిపదికన ఒక్కొక్క చోట నుంచి ఎనిమిది మందిని ఎన్నుకోవాల్సి వుంది. వీరిలో ముగ్గురు మహిళలు, ఒకరు దళితులు, ఒకరు వికలాంగుల ప్రతినిధి వుండాలి. ఈ మేరకు సోమవారం నాడు అధ్యక్షుడు విద్యాదేవి భండారి ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురిని నియమించారు. ఒకరు జాతీయ ప్రణాళికా సంఘ మాజీ వుపాధ్యక్షుడు, మరొకరు ప్రణాళికా సంఘమాజీ సభ్యుడు కాగా మరొకరు న్యాయవాది. ఎగువ సభలో అధికార పక్షానికి చెందిన యుఎంఎల్‌కు 27, మావోయిస్టు సెంటర్‌కు 12, ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌కు 13, రాష్ట్రీయ జనతా పార్టీ, ఫెడరల్‌ సోషలిస్టు పార్టీ రెండేసి స్ధానాల చొప్పున కలిగి వున్నాయి.

నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం వుభయ సభలలో 33శాతం మహిళలు సభ్యులుగా వుండాలి. దిగువ సభలోని 275 స్ధానాలకు గాను 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ నుంచి అయినా రెండు తరగతులలో ఎన్నికైన వారు 33శాతం విధిగా వుండాలి. ప్రత్యక్ష ఎన్నికలలో కేవలం ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో ముగ్గురు మావోయిస్టు సెంటర్‌, ఇద్దరు యుఎంఎల్‌, మరొకరు మరొకపార్టీ నుంచి ఎన్నికయ్యారు. దాంతో 33శాతం వుండే విధంగా పార్టీలు దామాషా నియోజకవర్గాల జాబితాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు యుఎంఎల్‌ పార్టీకి దామాషా కోటాలో వచ్చిన 41 స్ధానాలలో మహిళలు 37, నేపాలీ కాంగ్రెస్‌కు వచ్చిన 40లో 20, మావోయిస్టు సెంటర్‌ 17లో పదహారు మంది మొత్తం 84 మంది మహిళలు ఎన్నికయ్యారు. మొత్తంగా చూసినపుడు అన్ని పార్టీల తరఫున దిగువ సభలో 90 మంది, ఎగువ సభలో 21 మంది ఎన్నికయ్యారు. దామాషా పద్దతిలో కొన్ని సీట్లు వుండటం, రెండింటిలో కలిపి 33శాతం విధిగా ఎన్నిక అవాలన్న నిబంధన కారణంగానే ఇంత మంది మహిళలకు అవకాశం వచ్చింది. ఒక వేళ దామాషా పద్దతిలో ఆశాతం పూర్తి కానట్లయితే ఆమేరకు ప్రత్యక్ష ఎన్నికలో వచ్చిన సీట్లు పార్టీ కోల్పోవాల్సి వుంటుంది. దిగువ సభ ఎన్నికలలో కనీసం మూడుశాతం ఓట్లు వచ్చిన పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. కేవలం ఐదు పార్టీలు మాత్రమే ఆ మేరకు ఓట్లు పొందాయి, 44 విఫలమయ్యాయి. చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల గురించి మన దేశంలో ప్రధాన పార్టీలు కబుర్లు చెప్పటం తప్ప ఆచరణలో అడుగు ముందుకు వేయటం లేదు. పక్కనే వున్న నేపాల్‌లో అది కార్యరూపం దాల్చటానికి కమ్యూనిస్టులు ప్రధాన పాత్రధారులుగా వుండటమే కారణం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దక్షిణాఫ్రికా త్రిపక్ష కూటమిలో సయోధ్య కొనసాగేనా !

21 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

ANC, COSATU, Cyril Ramaphosa, Jacob Zuma, SACP

 

 ఎం. కోటేశ్వరరావు

అవినీతి ఆరోపణల పూర్వరంగంలో వెల్లడైన తీవ్ర వత్తిడి మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా తొలుత మొరాయించినా చివరకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. గత గురువారం నాడు జుమా రాజీనామా వెంటనే ఉపాధ్యక్షుడిగా వున్న సిరిల్‌ రమఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఏఎన్‌సీ) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని మరోదారి లేక అమలు జరిపిన తొలి అధ్యక్షుడు తాబో ఎంబెకీ కాగా, రెండవ అధ్యక్షుడిగా జాకబ్‌ జుమా చరిత్రకెక్కారు. 1994లో జాత్యహంకార పాలన అంతమైన 24ఏండ్లలో తొలి అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా అన్న విషయం తెలిసిందే. మరొకరు ఒక ఏడాదిపాటు తాత్కాలిక అధ్య క్ష బాధ్యతలలో వున్నారు. మండేలా తరువాత దీర్ఘకాలం పదవిలో వున్న ఎంబెకీ, జుమా రాజీనామాలతో ఇంటిదారి పట్టటం ఏఎన్‌సీ బలహీనతలు, బలాన్ని సూచిస్తున్నది.
జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసీపీ) గత కొద్ది డిమాండ్‌ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఏఎన్‌సీ కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఏఎన్‌సీ అనేక పరాజయాలు చవిచూసింది. ఏఎన్‌సీ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్‌ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. డిసెంబరులో ఏఎన్‌సీ పార్టీ అధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్‌ రాంఫొసా ఎన్నికైన తరువాత ఏఎన్‌సీ కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాద పూర్వకంగా తప్పుకోవాలని కోరింది. దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.

Image result for Cyril Ramaphosa as president

సిరిల్‌ రాంఫొసా
జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జుమా అనేకమంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఏఎన్‌సీ ఉపాధ్యక్షుడిగా, 1999లో దేశ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధమున్నట్టు ఆరోపణలొచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారు నిందితుడిగా తేలాడు. జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్‌సీ నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయన్స్‌ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదన కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జనవరిలో ఒక కమిషన్‌ ఏర్పడింది. ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది. భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్‌ రాంఫొసాను ఎన్నుకున్నారు.

Image result for anc
ఏఎన్‌సీ జాత్యహంకార పాలన అంతం కోసం ఏర్పడిన ఒక బూర్జువా వేదిక. సోషలిస్టు సమాజ స్ధాపనలక్ష్యంగా ఏర్పడింది దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ (ఎస్‌ఏసీపీ). ఈ రెండు శక్తులు పని చేస్తున్న కార్మిక సంఘాలతో ఏర్పడిన సమాఖ్య (కొసాటు). దశాబ్దాల తరబడి ఒకే లక్ష్యంతో పనిచేసిన ఈ శక్తులు ఏఎన్‌సీలో భాగస్వాములు. 1994లో శ్వేతజాతి పాలన అంతమైన తరువాత ఏఎన్‌సీ పతాకం, గుర్తుపైనే వారందరూ ఎన్నికలలో పోటీ చేసి పాలనలో భాగస్వాములయ్యారు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు అధ్యక్షులను అర్ధంతరంగా తొలగించటం ఏఎన్‌సీ బలహీనత. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైనప్పటికీ జనంలో ఇంకా విశ్వాసం ఉన్నకారణంగానే రాజీనామా చేసిన అధ్యక్షులు తోక ముడవటం దాని బలానికి చిహ్నం. గత 24ఏండ్లుగా ఏఎన్‌సీ అనుసరించినవి స్ధూలంగా నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. జాత్యహంకార పాలన అంతమైన తరువాత జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని(ఎన్‌డీఆర్‌) సాధించాలన్నది త్రిపక్ష కూటమి అంగీకరించిన కార్యక్రమం. 1995లో కూటమి అంగీకరించిన ‘స్వేచ్ఛా ప్రణాళిక”లో దీనిని చేర్చారు.
అయితే ఆచరణలో దీనికి భాష్యాలు భిన్నంగా ఉన్నాయి. నల్లజాతి సాధికారత అంటే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేసి గుత్తాధిపతులుగా వున్న శ్వేతజాతి పెట్టుబడిదారులతో సమంగా అవకాశాలు కల్పించటం అన్నది ఏఎన్‌సీ అవగాహనగా కనిపిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేకించి నల్లజాతీయులను, ఆఫ్రికన్లందరినీ తొలుత విముక్తి చేయాలని, జాతివివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేసి సోషలిస్టు వ్యవస్థ స్థాపనకు దారి తీసే విధంగా ముందు దశగా ఎన్‌డీఆర్‌ను అమలు జరపాలన్నది కమ్యూనిస్టుపార్టీ అవగాహన. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ఒకనాటి కార్మికనేత సిరిల్‌ రమఫోసా 1994 తరువాత వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అలాంటి వారు ఏఎన్‌సీలో ఎందరో ఉన్నారు. రాజీనామా చేసిన జుమా భారతీయ సంతతికి చెందిన గుప్తా సోదరులకు అండదండలిచ్చి అవినీతికి పాల్పడిన విషయం తెలిసినదే. స్థానిక నల్లజాతి, శ్వేతజాతి వ్యాపారులు తమ పోటీదార్లకు మద్దతు ఇవ్వటాన్ని సహించలేక జుమాపై వత్తిడి తేవటంలో వారు కూడా తమవంతు పాత్ర పోషించారనే అభిప్రాయాలున్నాయి. పన్నెండేండ్ల క్రితం జాతీయ ప్రజాస్వామిక విప్లవం గురించి సమీక్షించిన కమ్యూనిస్టుపార్టీ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడనవసరం లేదని అయితే మొగ్గు పెట్టుబడిదారీ వ్యవస్ధను పటిష్టపరిచే వైపే ఉందని అభిప్రాయపడింది. అప్పటి నుంచి అక్కడి పరిణామాలలో పెద్ద మార్పులేమీ లేవు. జాత్యహంకార వ్యవస్థ రద్దయిన తరువాత నల్లజాతీయులలో విద్యావ్యాప్తి, గృహవసతి, తదితర సంక్షేమ చర్యలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించినమాట వాస్తవం. ఒక అంచనా ప్రకారం 45శాతం కుటుంబాలు సామాజిక భద్రతా పధకాల కింద ఆర్థిక సాయం పొందుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇవి పేదలకు ఉపశమనం కలిగించేవి తప్ప మరొకటి కాదు.
ఇప్పటికీ 95శాతం సంపదలు పదిశాతంగా వున్న శ్వేతజాతీయుల చేతుల్లో ఉన్నాయి. సారవంతమైన భూములు కూడా వారికిందే ఉన్నాయి. 14శాతం భూములు ప్రభుత్వానికి చెందినవి కాగా, 79శాతం వివిధ ట్రస్టులు, ఇతర రూపాలలో శ్వేతజాతీయుల ఆధిపత్యంలోనే వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకొనేందుకు ఇంతవరకు సరైన చట్టాలను రూపొందించలేదు. వాటికి పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలా లేక ఇవ్వకుండా తీసుకోవాలా అనే చర్చ ఇంకా ఏఎన్‌సీలో నడుస్తూనే వుంది. అంటే సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే ఆచరణలో నీరుగార్చటం తప్ప మరొకటి కాదు.
1994 నుంచి గతేడాది జనవరి వరకు ప్రభుత్వం 49లక్షల హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకుంది. దీనిలో 34లక్షల హెక్టార్లను పంపిణీ చేసింది. ఇదిగాక మరొక పథకం ప్రకారం స్వాధీనం చేసుకున్న భూమిలో సగానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి దానిని సమభాగస్వామ్య పద్ధతిలో నల్లజాతీయులు- శ్వేతజాతీయులతో సాగు చేయించటం కూడా చేస్తున్నది. ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికీ మొత్తం మీద భూకేంద్రీకరణ దెబ్బతీసి మెజారిటీ ప్రజలకు అప్పగించి వారి ఆదాయాల పెంపుదలకు విప్లవాత్మక చర్యలేవీ తీసుకోలేదు. ఇలాంటి తీరుతెన్నుల కారణంగానే సమాజంలోని మెజారిటీ తరగతులలో అసంతృప్తి పెరుగుతోంది. అది పాలక కూటమిలో రాజకీయ సమస్యలకు దారితీస్తున్నది. దక్షిణాఫ్రికాలో అవినీతి ఒక పెద్ద సమస్యగా తయారైంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వస్తూత్పత్తితో పాటు అవినీతి ఒక ఉప ఉత్పత్తిగా వుంటుంది. అందువలన అధ్యక్షులు మారినప్పటికీ అవినీతి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంటుంది. పైకి ఏమి చెప్పినప్పటికీ నయా ఉదారవాద విధానాలనే అమలు జరుపుతున్నందున రానున్న రోజులలో ఏఎన్‌సీలో అంతర్గత వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం.

Image result for sacp
జాకబ్‌ జుమా రాజీనామాతో ఒక ఘట్టం ముగిసింది తప్ప అవినీతి సమస్య పరిష్కారం కాలేదు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంది. నాటకీయ పరిణామాల మధ్య జుమా స్ధానంలో రమాఫోసా వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రమాఫోసా ఇంతవరకు మంత్రివర్గాన్ని ప్రకటించలేదు. మంత్రుల శాఖలు, సంఖ్యను కూడా తగ్గిస్తానని అధ్యక్షుడిగా పార్లమెంట్‌ తొలి ఉపన్యాసంలో చెప్పారు. ఏఎన్‌సీ ప్రతిష్ట పెంచాలంటే కొంతమంది మంత్రుల పేర్లను ఉటంకిస్తూ వారిని తిరిగి చేర్చుకోరాదని కొసాటు డిమాండ్‌ చేసింది. రమాఫోసా పాత వ్యవస్థతోనే ప్రయాణించాలని చూడటాన్ని మెజారిటీ జనం అంగీకరించరని, అది ఆయనను ఎక్కువ దూరం ప్రయాణించనివ్వదని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మంత్రివర్గానికి కాయకల్ప చికిత్స చేయాలని, మంత్రిత్వశాఖలను పునర్విభజించాలని కూడా కోరింది.
రానున్న రోజులలో జాతీయ ప్రజాస్వామ్య విప్లవ కార్యాచరణ గురించి త్రిపక్ష కూటమిలో అంతర్గత పోరు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ముదిరితే రాజకీయ పునరేకీకరణకు దారితీసినా ఆశ్చర్యం లేదు. అనివార్యమైన ఈ పరిణామం ఎప్పుడన్నదే సమస్య. అంగీకృత కార్యక్రమం నుంచి వైదొలుగుతున్న తీరు కనిపించినా ఏఎన్‌సీలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఇంతకాలం కొనసాగటమే ఆశ్చర్యం. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది. ఏఎన్‌సీ నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచన దానిలో ప్రారంభమైంది. డిసెంబరులో జరిగిన ఏఎన్‌సీ సభలో కమ్యూనిస్టు పార్టీ నేత జిమాండే జాతీయ కార్యవర్గానికి ఎన్నిక కాలేదు. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఏఎన్‌సీ గుర్తుమీదే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చ అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసే దిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు. ఏఎన్‌సీ పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిదేండ్ల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్‌ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విభేదిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంథాలో పయనిస్తుందా అన్నది ఆసక్తి కలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఏఎన్‌సీ మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టు చైనా – కాథలిక్‌ మతం !

19 Monday Feb 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

catholic religion, china communist party, pope, Pope Francis

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొద్ది గంటల్లో మాజీ కానున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా !

14 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANC, Cyril Ramaphosa, Jacob Zuma, SACP

ఎం కోటేశ్వరరావు

దక్షిణా ఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మరికొద్ది గంటల్లోనే పదవీచ్యుతుడు కానున్నారు. పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగక ముందే గౌరవ ప్రదంగా రాజీనామా చేసే అవకాశాన్ని వినియోగించుకుంటారా ? ఓటింగ్‌ ద్వారా మెడపట్టి బయటకు గెంటించుకుంటారా అన్నదే ఇప్పుడు మిగిలి వుంది. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎఎన్‌సి) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా తిరస్కరించటంతో అక్కడ తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సోమవారం రాత్రి ఆయనకు రెండురోజుల గడువు ఇస్తూ ఎన్‌ఎన్‌సి చేసిన తీర్మానాన్ని స్వయంగా పార్టీనేతలు అందచేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తప్పుకోమని కోరాము తప్ప గడువు విధించలేదని ఎఎన్‌సి ప్రధాన కార్యదర్శి ఏస్‌ మగాషులే మంగళవారం నాడు చెప్పారు. తాను రాజీనామా చేసేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని జుమా ఎఎన్‌సి నేతలకు చెప్పినట్లు తాజా వార్తలు తెలిపాయి. జుమా బింకాలు పోతున్నాడా లేక నిజంగానే రాజీనామా చేయకుండా తొలగింపువరకు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి వుంది. ఒక వేళ రాజీనామా చేస్తే వుపాధ్యక్షుడిగా వున్న ఎఎన్‌సి అధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా వెంటనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తరువాత ఆయనను లేదా మరొకరిని పాలకపక్షం అధ్యక్షుడిగా ఎన్నికుంటుంది. ప్రతిపక్ష ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ పార్టీ జుమాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం స్పీకర్‌ పరిశీలనలో వుంది. జుమా బుధవారం నాడు రాజీనామా చేస్తారని నిర్ధారణ కాని వార్తలు పేర్కొన్నాయి. ఆ తీర్మానాన్ని తాము బలపరుస్తామని ఎఎన్‌సి ప్రకటించింది. వెంటనే స్పీకర్‌ ఒక ప్రకటన చేస్తూ ఈ నెల 22న చేపట్టాల్సిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం నాడే చర్చకు అనుమతించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అవిశ్వాస తీర్మానాన్ని వుపసంహరించుకోవాలని ఎఎన్‌సి చేసిన వినతిని ఫ్రీడమ్‌ పార్టీ తిరస్కరించింది. దాంతో తమ సవరణ తీర్మానం ద్వారా దాన్ని బలపరచాలని ఎఎన్‌సి నిర్ణయించింది.

బుధవారం నాడు జుమాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలైన గుప్తా సోదరుల ఇండ్లపై పోలీసుదాడులు జరిగాయి. గతంలో దాఖలైన కేసుల కొనసాగింపే అని చెప్పినప్పటికీ జుమా వుద్వాసన ఖాయం అని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. మరోవైపు జుమా టీవీలో మాట్లాడుతూ తనను రాజీనామా చేయమనటం అన్యాయమని, తానేమీ తప్పు చేయలేదన్నారు. తనను వేధించినందుకు ఎఎన్‌సి సభ్యులు విచారిస్తారని వ్యాఖ్యానించాడు. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే అదే రోజు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. జాకబ్‌ జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి) గత కొద్ది నెలలుగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఎఎన్‌సి కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే శుక్రవారం నాడు సిరిల్‌ రాంఫొసా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే రోజు బడ్జెట్‌ సందర్భంగా దేశాన్ని వుద్ధేశించి ప్రసంగిస్తారని, 21వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెడతారని వార్తలు వచ్చాయి.

గత రెండు దశాబ్దాలలో ఎఎన్‌సి ఇద్దరు అధ్యక్షులను రాజీనామా చేయాలని కోరింది.2008లో తాబో ఎంబెకీ పార్టీ ఆదేశాన్ని శిరసావహించి రాజీనామా చేశారు. ఆయన స్ధానంలో 2009లో జాకబ్‌ జుమా అధ్యక్షుడయ్యారు. ఈ ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలుగా ప్రారంభించి ఎఎన్‌సి నేతలుగా ఎదిగారు. చివరకు పార్టీ చర్యలకు గురయ్యారు.జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఎఎన్‌సి అనేక పరాజయాలు చవి చూసింది.ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్‌ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జాకబ్‌ జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. వత్తిడికి తట్టుకోలేని జుమా తాను రాజీనామా చేస్తానని అయితే అది మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తనకు ఇష్టమైనపుడు మాత్రమే చేస్తానంటూ మొరాయిస్తూ వచ్చాడు. అయితే డిసెంబరులో ఎఎన్‌సి పార్టీఅధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్‌ రాంఫొసా ఎన్నికైన తరువాత ఎఎన్‌సి కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని కోరింది.దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.

జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జాకబ్‌ జుమా అనేక మంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఎఎన్‌సి వుపాధ్యక్షుడిగా, 1999లో దేశ వుపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధం వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారుగా వున్న వ్యక్తి నిందితుడిగా తేలాడు.జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్‌సి నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయన్స్‌ దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదనను కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆమేరకు జనవరిలో ఒక కమిషన్‌ ఏర్పడింది.ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది.భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను వుపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్‌ రాంఫొసాను ఎన్నుకున్నారు. వుద్వాసనకు గురికానట్లయితే మరొక పద్నాలుగు నెలలపాటు జుమా అధికారంలో వుండవచ్చు. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఒకరు రెండువిడతలు మాత్రమే పదవికి అర్హత కలిగివుంటారు.

1994లో స్వేతజాతి పాలన అంతమైన తరువాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అనుసరించినవి స్ధూలంగా నయా వుదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఎఎన్‌సి కూటమి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక విశాల వేదిక మాత్రమే. జాత్యంహకార పాలనను అంతం చేసి జాతీయప్రజాస్వామిక విప్లవ సాధన దిశగా ఎఎన్‌సిలో కమ్యూనిస్టులు , కాని వారు ఐక్యంగా పోరాడారు. 1994 తరువాత ఎఎన్‌సిలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు కొనసాగటమే కొత్త పరిణామం.పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించాలనే ఎఎన్‌సి నాయకత్వం కుడివైపు, మిగతా రెండు పక్షాలు ఎడమవైపు లాగినప్పటికీ అంతిమంగా మొగ్గు కుడివైపే వుంది. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తికారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది.ఎఎన్‌సి నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచనదానిలో ప్రారంభమైంది. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఎఎన్‌సి గుర్తుమీదనే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చను అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసేదిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు.ఎఎన్‌సి పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్‌ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విబేధిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంధాలో పయనిస్తుందా అన్నది ఆసక్తికలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఎఎన్‌సి మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సూక్ష్మంలో నరేంద్రమోడీ మోక్షం: పకోడీలతో స్వయం వుపాధి !

09 Friday Feb 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India budget, Narendra Modi, pakoda, pakoda budget, pakoda self employment, self employment

ఎం కోటేశ్వరరావు

ఎట్టకేలకు నరేంద్రమోడీ నాలుగేండ్ల తరువాత తాము వుపాధి కల్పించలేకపోతున్నట్లు పరోక్షంగా అయినా అంగీకరించినందుకు అభినందించకుండా ఎలా వుంటాం ! పెట్టలేని వారు పెట్టే దారన్నా చూపాలి అన్నట్లు పకోడీలు అమ్మి స్వయం వుపాధి కల్పించుకోవాలని మంచి సలహా కూడా ఇచ్చినందుకు ఆయన మేథోశక్తికి నీరాజనాలు పలకాల్సిందే. బాబొస్తే జాబొచ్చినట్లే అన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు చేయలేని ధైర్యం, తెగువను నరేంద్రమోడీ చూపారు. పకోడీ వ్యాఖ్యానం తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో యావత్‌ దేశాన్నీ ఆకర్షించేందుకు మోడీ మరో విన్యాసం చేశారు. వుద్యోగులకు ఏడాదికి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పదిహేనువేలు, నెలకు 16వందల ప్రయాణ అలవెన్సు వెరసి ఏడాదికి 34,200కు ఇప్పుడు పన్ను మినహాయింపు వుంది. ఈ రెండింటి బదులు గుండుగుత్తగా 40వేల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించారు. దీని వలన వుద్యోగులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు మిగిలితే, ఖజానాకు అంతే మొత్తం నష్టం అని చెప్పారు. ఈ వుదారత్వానికి వుద్యోగులు ఎలా పండుగ చేసుకుంటారన్నది వారికే వదలివేద్దాం.

‘కోటీ 89లక్షల మంది వేతన జీవులు ఒక్కొక్కరు 2016ా17లో చెల్లించిన సగటు పన్ను రు.76,306 కాగా వ్యక్తిగతంగా వ్యాపారులు, వైద్యులు, లాయర్ల వంటి వృత్తిదారులు 1.88 కోట్ల మంది సగటున చెల్లించింది రు.25,753 మాత్రమే. ఇవి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి హష్‌ముఖ్‌ అధియా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వెల్లడించిన వివరాలు. నిజాయితీగా పన్ను చెల్లించే తమకు భారం తగ్గించి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైనదారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. మరోవైపు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఇతరుల పన్ను ఎగవేత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇదీ స్థూలంగా బడ్జెట్‌ సందర్భంగా వేతన జీవులలో వెల్లడవుతున్న అసంతృప్తి. దిగువనున్న ఇతరులతో పోల్చుకుంటే వుద్యోగుల పరిస్ధితి మెరుగే అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, అవసరాలు, గౌరవ ప్రదమైన జీవనం గడపాలంటే ప్రస్తుత వేతనాలను ఇంకా పెంచాల్సిన అవసరం వుంది. ప్రతి బడ్జెట్‌లో భారాలు మోపటం సర్వసాధారణ రివాజుగా మారింది కనుక సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా మంగళగిరి పానకాల రాయుడి మాదిరి ఇంకా కావాలనే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, న్యాయమైన రాయితీల కోసం ఎదురు చూసే వేతన జీవులలోనే బడ్జెట్‌ పట్ల ఆసక్తి వుంటుంది. వ్యాపారులు, వృత్తిదారులు పన్నుల విధింపు సమాచారం గురించి కుతూహలం చూపుతారు. ఏ భారం మోపినా చివరకు దాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి వినియోగదారులు, సేవలు పొందే జనం మీదనే మోపుతారు కనుక బడ్జెట్‌లో ఏం చేసినా వారికేమీ చింత వుండదు.

ఎక్కువ మంది వుద్యోగులు బడ్జెట్‌లో తమకేమి రాయితీలు ప్రకటించారు అనే విషయం మీదనే ప్రధానంగా కేంద్రీకరించటం సహజం. నిజానికి పౌరులుగా, చదువుకున్న వారికి అంతకంటే ఎక్కువ ఆసక్తి, విమర్శనాత్మక వైఖరితో ఈ ప్రక్రియను చూడటం అవసరం. అందుకే అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి ? ప్రజారంజక, ప్రజా సంక్షేమ బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని చెప్పని పార్టీ ఏముంది? అదే నిజమైతే 2017లో దేశంలో వృద్ధి అయిన సంపదల మొత్తంలో ఒక శాతంగా వున్న ధనికులు 73శాతం దక్కించుకున్నారని ఆక్స్‌పామ్‌ అనే స్వచ్చంద సంస్ధ ఎందుకు చెప్పింది. వివిధ సంస్ధల, లెక్క విధానాలు, అంచనాలలో హెచ్చు తగ్గులుండవచ్చుగానీ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నదనేది వాస్తవమే కదా ?

ఆదాయాన్ని ఖర్చుల నిమిత్తం చేసే పంపిణీ ప్రక్రియే బడ్జెట్‌. దీనిలో సామాన్యులుగా వున్న 99శాతానికి, ఒకశాతం ధనికులకు దామాషా ప్రకారం పంపిణీ చేస్తే సమస్య లేదు. లేకపోతేనే తేడాలు వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రతిపక్షంలో వుండగా ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి అధికారం రాగానే కార్పొరేట్లకు కామధేనువులుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సామాన్యులకు మంచిరోజులు( అచ్చేదిన్‌) వచ్చాయని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం 2017లో దేశంలోని బిలియనీర్ల ్లబ్బులో కొత్తగా పదిహేడు మంది చేరారు. మోడీ నిజంగా రాబిన్‌హుడ్‌ అవతారం అయితే బిలియనీర్ల సంపద తగ్గాలి కదా ! గత నాలుగు సంవత్సరాలుగా తాను ఎన్నో విజయాలు సాధించానని ప్రతి నెలా మన్‌కీబాత్‌ పేరుతో (మనసులోని మాట) ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ జన్‌కీ బాత్‌(జనం మాట) వేరేగా వుంది. మొత్తంగా చూసుకున్నపుడు వుత్పత్తి, ఎగుమతులు పడిపోయాయి. అనేక చోట్ల గిట్టుబాటు ధరలు రాక రైతాంగం ఆందోళనలకు దిగింది, ఆత్మహత్యలు ఆగలేదు. అయినా మరోవైపు కార్పొరేట్ల లాభాలు తగ్గలేదు, స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డులను తిరగరాశాయి. పర్యవసానంగా శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, అప్పటికే ఆ జాబితాలో వున్నవారి ఆస్ధులు ఇంకా పెరిగాయని వేరే చెప్పనవసరం లేదు. అంటే మోడీ గారు చెప్పిన మంచి రోజులు ఎవరికి వచ్చినట్లు ? ఒక చాయ్‌ వాలా పాలనలో ఎంత మంది ఫ్లాస్కుల నుంచి టీ స్టాల్స్‌, హోటల్స్‌ పెట్టే స్ధాయికి ఎదిగారు ? తాజాగా మోడీతో పాటు, అమిత్‌షా గారు కూడా చెప్పినట్లు పకోడీలు అమ్మేవారు ఎంత మంది లక్షాధికార్లు అయ్యారు అని ప్రశ్నించుకోవాలి.

ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్న మోడీ సర్కార్‌కు ఇది చివరి, ఎన్నికల బడ్జెట్‌ కనుక సహజంగానే జనంలో ఆసక్తి కలిగించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం ఆదాయం 24లక్షల కోట్ల 42 వేల 213 కోట్లు. దీనిలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం రు.17,25,738 కోట్లు. అప్పుల ద్వారా సమకూర్చుకొనేది 6,24,276 కోట్లు మిగతాది ఇతర వనరుల ద్వారా వస్తుంది. దీనిలో వడ్డీ చెల్లింపులకు కేటాయింపు 5,75,795 కోట్లు. నరేంద్రమోడీ పాలనలో మన రూపాయి రాకపోకల తీరు తెన్నులు ఎలా మారాయో చూద్దాం. 2015-16 బడ్జెట్‌లో 21పైసలు అప్పుల ద్వారా సమకూర్చుకుంటే 2018-19కి అది 19కి తగ్గిపోయింది. కార్పొరేట్‌ పన్ను 20 నుంచి 19కి తగ్గింది, ఆదాయపన్ను 14 నుంచి 16కు పెరిగింది. తాజా బడ్జెట్‌ రూపాయి రాకలో నూరు పైసలకు గాను జిఎస్‌టి నుంచి 23, కార్పొరేట్‌ పన్ను నుంచి 19,అప్పుల ద్వారా 19, ఆదాయ పన్ను నుంచి 16, ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ నుంచి 12, ఇతరంగా 11పైసల వంతున వస్తోంది. ఇక పోక విషయానికి వస్తే పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా 24, వడ్డీ చెల్లింపులు 18, రక్షణ, కేంద్ర పధకాలు, సబ్సిడీలకు 9చొప్పున, ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలకు 8, ఇతర ఖర్చులకు 13పైసలు పోతోంది.

గతేడాది నోట్ల రద్దు వలన సాధారణ పెరుగుదల కంటే అదనంగా 18లక్షల మంది కొత్తగా పన్నులు చెల్లించేవారు పెరిగారని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మంచిదే, రెండు కోట్ల ఎనభైలక్షల మంది పన్ను చెల్లింపుదార్లుండగా మరో 18లక్షల మంది కోసం పెద్ద నోట్లు రద్దు చేయాలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టిన ప్రబుద్ధులను ఈ చర్య గుర్తుకు తేవటం లేదూ? ఈ పద్దెనిమిది లక్షల మంది అదనంగా చెల్లించే పన్నెంతో, నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, జనం పడిన ఇబ్బందుల గురించి అధికారంలో వున్న వారు నోరు విప్పారా ? పోనీ ఆ కారణంగా ఆదాయపన్ను రాబడి రూపాయి రాకలో రెండుశాతం పెరిగిందని అనుకుందాం. కార్పొరేట్‌ పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గటానికి కారణం ఏమిటి? లోపాలను సరిచేస్తే వసూలు పెరగాలి కదా ! చెప్పే మాటలకు, చేతలకు పొత్తు కుదరటం లేదు. ఇంతకు ముందు 50 కోట్ల లావాదేవీలు వున్న కంపెనీలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను వుంటే ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు అంటే 250 కోట్లకు పెంచటం వంటి వెసులుబాటు కాదా? పోనీ ఇలాంటి మినహాయింపులతో కంపెనీలు పొందిన లబ్దిని తిరిగి పెట్టుబడులుగా పెట్టిన దాఖలాలేమీ లేవు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా మహాశయులు వుద్యోగాలు లేకపోతే పకోడీలు అమ్మాలని సెలవిచ్చారు. 2015-16 వుపాధి, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో పని చేస్తున్న వారిలో 46.6శాతం మంది స్వయం వుపాధి అంటే మోడీ గారి భాషలో పకోడీ వుద్యోగాలు చేస్తున్నవారే. వారి వార్షిక ఆదాయం అరవైవేల రూపాయలు. వారందరూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటే కొత్తగా వుద్యోగాల కోసం చూస్తున్నవారికి నాలుగేండ్ల తరువాత మోడీ ఈ సలహా ఇచ్చారు.

యుపిఏ , ఎన్‌డిఏ రెండూ సంస్కరణలు అమలు జరిపాయి. అవి ఎవరికి లబ్ది చేకూర్చాయి? గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో ఏ రంగం నుంచి ఎంత వచ్చిందో బడ్జెట్‌ పత్రాలలో వివరించారు. దాని ప్రకారం 2009-10లో మొత్తం పన్ను రాబడి 6,24,528 కోట్లకు గాను కార్పొరేట్‌, ఆదాయ పన్ను వాటాలు 39,19.6 శాతం చొప్పున వున్నాయి. అదే 2018-19 బడ్జెట్‌లో 27.3,23.2 శాతాలుగా వున్నాయి. అంటే పదేండ్లలో కార్పొరేట్లకు పన్నెండుశాతం వరకు లబ్ది చేకూరితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదార్లపై 3.6శాతం భారం పెరిగింది. ఆదాయ అసమానతలు పెరగటానికి శతకోటీశ్వరులు వృద్ధి చెందటానికి ఇది కారణం కాదా ? వుద్యోగులకు మొత్తం ఆదాయం మీద పన్ను విధిస్తుండగా కార్పొరేట్‌లు, వ్యాపారులు, ఇతర వృత్తిదారులకు ఖర్చులు పోను నిఖర ఆదాయం మీదనే పన్ను వేస్తున్నారు. ఇదొక అన్యాయం. వుద్యోగులకు కుటుంబ ఖర్చులను లెక్కవేసే వేతనాలు నిర్ణయిస్తున్నారు తప్ప ప్రతి ఏటా వారికి ఇంత మిగులు వుండాలనే ప్రాతిపదికేమీ వుండదు. హష్‌ముఖ్‌ చెప్పినదాని ప్రకారం ఏడు లక్షల నమోదైన కంపెనీలలో సగం సమర్పించిన ఆదాయ వివరాల ప్రకారం సున్నా మిగులు లేదా నష్టాలను చూపారు. వుద్యోగులకు ఇటువంటి అవకాశం లేదు. నిజానికి వారు వినియోగదారులుగా ఇతర పన్నులతో పాటు అదనంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. ‘బ్రిటీరాజ్యం నుంచి బిలియనీర్‌ రాజ్యం వరకు ‘ అనే శీర్షికతో ప్రముఖ ఆర్ధికవేత్తలు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి ఆదాయ పన్ను చట్టం చేసిన 1922 నుంచి 2014 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధలో అసమానతల గురించి ఒక అధ్యయన పత్రాన్ని తయారు చేశారు. దాని ప్రకారం 2014లో పదిశాతం ధనికులు వార్షికాదాయంలో 56శాతాన్ని పోగేసుకున్నారు.1930 దశకంలో ఒకశాతం ధనికులు మొత్తం ఆదాయంలో 21శాతం లోపు కలిగి వుండగా అది 1980దశకం ప్రారంభానికి ఆరుశాతానికి పడిపోయి 2014నాటికి 22శాతానికి పెరిగింది. గతేడాది ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్రకారం ప్రపంచ ధనికులలో ఒక శాతం మంది 50శాతం సంపదను కలిగి వుండగా మన దేశంలో అది 58శాతంగా వుంది. 2017 వివరాల ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 20.9లక్షల కోట్లకు అంటే కేంద్ర బడ్జెట్‌కు సమంగా చేరుకుంది. మన దేశంలోని ఒక ప్రముఖ వస్త్రకంపెనీ సిఇఓ ఒక ఏడాది ఆదాయాన్ని పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు 941 సంవత్సరాలు పనిచేయాల్సి వుంటుంది. మరో విధంగా లెక్క వేస్తే గ్రామీణ కార్మికుడు జీవితాంతం(50 సంవత్సరాలు) పని చేస్తే సంపాదించే మొత్తాన్ని అదే సిఇఓ కేవలం 17.5 రోజుల్లో సంపాదిస్తాడట. అదే అమెరికాలో ఒక కార్మికుడు ఏడాది మొత్తంలో పొందిన వేతనాన్ని ఒక కంపెనీ సిఇవో ఒక రోజులో పొందుతాడని ఆక్స్‌ఫామ్‌ పేర్కొన్నది.

కారిపోతున్న ‘సంపద బక్కెట్‌ ‘ కన్నాలు పూడ్చాలని కార్పొరేట్లకు పన్ను రాయితీలు రద్దు చేయాలని, పన్ను నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరింది. గతేడాదినాటికి మన దేశంలోని బిలియనీర్ల సంపద 20.7లక్షల కోట్లకు పెరిగితే దానిలో గతేడాదే 4.89లక్షల కోట్లు చేరింది. ఈ మొత్తంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాజక్టులకు ధారాళంగా నిధులు కేటాయించవచ్చు. బాహుబలి సినిమా వసూలు చేసిన మొత్తమంత కూడా తమకు కేటాయించలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వుండదు.

ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోని మరికొన్ని విషయాలను చూద్దాం. ఆర్ధిక సర్వే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంకెలన్నీ ఒకచోటనే తయారు చేసి స్వల్ప మార్పులతో ఎవరికి వారు ప్రకటించుకున్నట్లుగా వుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల రేటు 6.75శాతం వుంటుందని అంచనా వేస్తే కేంద్ర గణాంకశాఖ 6.5శాతంగానూ, ఐఎంఎఫ్‌ 6.7గా చెప్పింది, వచ్చేఏడాది పెరుగుదల రేట్లను 7.5,7.4శాతాలుగా పేర్కొన్నాయి. పెరుగుదల రేట్లు అచ్చేదిన్‌ అంచనాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో లేని ప్రపంచ చమురు మార్కెట్‌ రేట్ల మీద ఇవి ఆధారపడి వుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు మంచి కాక మీద వుంది కనుక లాభాలు దండిగా సంపాదించుకొనేందుకు విదేశీ కంపెనీలు డాలర్లను కుమ్మరించి వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆ మొత్తాలను మన విదేశీ మారక నిల్వలుగా చూపుతున్నాం, వాటితో చమురు కొనుగోలు చేస్తున్నాం. స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా, చమురు ధరలు పూర్వపు స్ధాయికి పెరిగినా మన పరిస్ధితి ఢమాల్‌. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ బుడగ మరికొంత కాలం కొనసాగిందనుకుందాం. అది వుండగానే మన పారిశ్రామిక వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి. అందువలన ఈ పరిస్ధితి కొనసాగదన్న గ్యారంటీ ఏముంది? ముదిమది తప్పిన మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కాలుదువ్వుతున్న పూర్వరంగంలో ఇప్పటికే పీపా చమురు 70 డాలర్లకు చేరింది. తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. అందుకే మనకు రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా సర్కార్‌ మన ఐటి ఎగుమతులను దెబ్బతీసే విధంగా, మన ఇంజనీర్లకు వీసాలు నిరాకరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. అది కూడా మనకు నష్టం చేకూర్చే పరిస్థితే. ప్రపంచ ధనిక దేశాలలో పరిస్ధితులు చక్కబడితే తప్ప మన ఎగుమతులు పెరగవు అని తేలిపోయింది. వాటి పరిస్ధితి కూడా అంత ఆశావహంగా కనిపించటం లేదు. అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటి ప్రభావం మన మీద పడింది కనుకనే మన ప్రధాని దవోస్‌ సమావేశ వేదికపై వుగ్రవాదం ఎంత చెడ్డదో రక్షణ చర్యలు కూడా అంతే అని చెప్పాల్సి వచ్చింది.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అంతర్గత మార్కెట్‌ను పెంచుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అది జరగాలంటే జనంలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎగుమతుల కోసం లేదా కార్పొరేట్‌ సంస్ధలకు ఇస్తున్న ఇతర రాయితీల మొత్తాన్ని వేతన పెరుగుదల లేదా జనం కొనుగోలు శక్తి పెంపుదలకు మళ్లిస్తే పారిశ్రామిక వుత్పత్తి పెరగటంతో పాటు వుపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌ విషయానికి వస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఒక పెద్ద వాగ్దానం. అయితే దానికి తోడ్పడే చర్యలేమీ లేవు. రానున్న ఎన్నికలకు రైతులకు విసిరిన ఎర. ప్రత్యక్ష పన్నుల వాటా 51.6 నుంచి 50.6శాతానికి తగ్గనున్నట్లు చెప్పటమంటే కార్పొరేట్లకు రాయితీ ఇవ్వటమే. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు వీలుగా పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా. పాత పధకాలన్నీ కలిపి కొత్తగా చెప్పిన అంకె. జన ఆరోగ్యం కంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న బీమా కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టచెప్పే ఎత్తుగడ దీని వెనుక వుందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటు రంగం పెట్టుబడులు పెద్దగా రావటం లేదు. వచ్చినవి కూడా వుపాధి రహిత వృద్ధికే దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తగ్గుతున్నాయి. అనేక పధకాలకు కేటాయింపులు తగ్గించారు. డబ్బు మొత్తాలు స్వల్పంగా పెరగవచ్చుగానీ జిడిపితో పోల్చితే శాతాలన్నీ తగ్గిపోయాయి. పోనీ పేర్కొన్నవాటిని కూడా పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ యువతను పకోడీలమ్మించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శీతాకాల ఒలింపిక్స్‌లో ‘కొరియా’ రాజకీయ వేడి !

09 Friday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Sports, USA

≈ Leave a comment

Tags

Kim Jung-un, Pyongyang., The Pyeongchang 2018 Winter Olympics, winter olympics

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి ఎనిమిదిన దక్షిణ కారియా నగరమైన పయోంగ్‌ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌పోటీలు ప్రారంభంగాక ముందే కొరియా ద్వీపకల్పం, దానితో ముడివడిన దేశాల మధ్య రాజకీయ క్రీడలతో వేడి మొదలైంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా నాయకత్వంలోని కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల కూటమి క్రీడలలో కూడా రాజకీయాలను జొప్పించిన విషయం విదితమే. ఈ ఒలింపిక్స్‌కూడా దానికి మినహాయింపు కాదని అవి మరోసారి నిరూపించాయి. ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి మన రాష్ట్రపతి వంటి స్ధాయి కలిగిన వుత్తర కొరియా పార్లమెంటు అధ్యక్షుడు కిమ్‌ యోంగ్‌ నామ్‌ నాయకత్వంలో శుక్రవారం నాడు వచ్చిన ప్రతినిధివర్గంలో వుత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా వున్నారు. 1950 దశకంలో కొరియా యుద్దం తరువాత దక్షిణ ప్రాంతాన్ని సందర్శించిన తొలి వున్నత స్ధాయి ప్రతినిధి వర్గం ఇదే.

పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఈ పోటీల్లో ఒకేపతాకం నీడలో ఒకే గీతం పాడుతూ కదం తొక్కుదామని, వుమ్మడిగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇద్దామని, వీలైతే కొన్ని పోటీలలో వుమ్మడి జట్లను బరిలోకి దింపుదామని వుత్తర కారియా చేసిన ప్రతిపాదనలకు దక్షిణ కొరియా కూడా ముందుకు వచ్చింది. అయితే పొమ్మనకుండానే పొగబెట్టినట్లు పాలకవర్గదన్ను వున్న దక్షిణ కొరియా మీడియా అవమానించేవిధంగా రాతలు రాసిన కారణంగా తాము వెనక్కు తగ్గుతున్నట్లు వుత్తర కారియా ప్రకటించింది. ఒలింపిక్స్‌ జరిగే సమయంలోనే అమెరికా దాడులకు దిగనుందనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ఈ పోటీలకు ఐదువందల మందితో కూడిన వుత్తర కొరియా ప్రతినిధి బృందం పయోంగ్‌ చాంగ్‌ చేరుకుంది. పోటీలు జరిగే ఈ నగరం వుత్తర కొరియా సరిహద్దుకు కేవలం 80కిలోమీటర్ల దూరంలోనే వుంది.

తాము శాంతి ప్రయత్నాలు చేస్తున్నా వుత్తర కొరియా అణు పరీక్షలను కొనసాగిస్తూనే వుందని ప్రపంచం ముందు కనిపించేందుకు గతేడాది మేనెలలో ఎన్నికైన అధ్యక్షుడు మూన్‌ ప్రయత్నిస్తున్నాడు. శాంతి ఒలింపిక్స్‌ అని తమ దేశంలో జరుగుతున్న పోటీలను అభివర్ణించాడు. అణు పరీక్షలు జరిపిందనే పేరుతో మూన్‌కు ముందున్న అధ్యక్షుడు పార్క్‌గున్‌ హై 2016జనవరి తరువాత వుత్తర కొరియాకు సాయాన్ని నిలిపివేశాడు. ఇప్పుడున్న స్ధితిలో సాయం వద్దని జపాన్‌ ప్రధాని షింజో అబే వ్యక్తిగతంగా కోరినప్పటికీ మూన్‌ నాలుగునెలల క్రితం ఎనిమిది మిలియన్‌డాలర్ల సాయాన్ని పునరుద్దరించాడని పరిశీలకులు వ్యాఖ్యానించారు. నిజానికి అది ప్రచార ఎత్తుగడని వేరే చెప్పనవసరం లేదు. ఈ సాయాన్ని వుత్తర కొరియా మిలిటరీకి వుపయోగిస్తున్నదని అమెరికా, జపాన్‌ ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రయోజనాలకోసం వుత్తర కొరియాను రెచ్చగొడుతున్నారని, ఒక వేళ యుద్ధమే వస్తే నష్టపోయేది తాము తప్ప ఆ దేశాలు కాదని దక్షిణ కొరియా పౌరులు ఆందోళన చెందుతూ సోదర కొరియాతో శాంతికోసం ప్రయత్నించాలని పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్న కారణంగానే మూన్‌ శాంతి ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు కేవలం 35కిలోమీటర్ల దూరంలో వున్న సరిహద్దులో వుత్తర కొరియా తన భారీ ఫిరంగి దళాన్ని మోహరించింది.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణకు గురైన కొరియాను విముక్తి చేసే క్రమంలో వుత్తర ప్రాంతంలో సోవియట్‌ సేనలు, దక్షిణ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలోని సేనలు జపాన్‌ మిలిటరీని ఓడించాయి. దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టుల నాయకత్వంలో వుత్తర ప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వానికి సోవియట్‌ మద్దతు ప్రకటించగా దానికి పోటీగా అమెరికాలో వున్న కమ్యూనిస్టు వ్యతిరేకి, మాజీ కొరియా నియంత సింగమాన్‌ రీని అమెరికా నుంచి రప్పించి అమెరికన్లు దక్షిణ ప్రాంతంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాపై తమదే ఆధిపత్యం అని ప్రకటించుకున్నాయి. పరిస్ధితులు చక్కపడిన తరువాత ఐక్య కొరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంగీకారం కుదిరింది. తరువాత దక్షిణ కొరియాలోని నియంత ప్రభుత్వం అమెరికా దన్నుతో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు దాడి చేసింది. దానిని సోవియట్‌, చైనా మద్దతుతో వుత్తర కొరియా కమ్యూనిస్టు ప్రభుత్వం తిప్పి కొట్టింది. వుభయుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి విలీనం గురించి వుత్తర కొరియా ప్రయత్నిండగా తగిన పరిస్ధితులు ఏర్పడలేదనే పేరుతో 1953 నుంచీ దక్షిణ కొరియా అడ్డుకొంటోంది. దీనికి అమెరికా, జపాన్‌ మద్దతు ఇస్తున్నాయి. వుత్తర కొరియాకు రద్దయ్యే వరకు సోవియట్‌, తరువాత చైనా, వియత్నాం వెన్నుదన్నుగా వున్నాయి.

వుత్తర కొరియాతో సఖ్యత, ఐక్యతకు సిద్దమంటూనే మూన్‌ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం ఒలింపిక్‌ క్రీడల సమయంలోనే అవసరమైతే వుత్తర కారియాపై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఆంగ్లంలో బ్లడీనోస్‌ అని పిలుస్తున్నారు. (ముక్కు బద్దలు కొట్టి భయ పెట్టటం వంటిది). ఎవరు అవునన్నా కాదన్నా అణ్వస్త్ర దేశాలలో వుత్తర కొరియా ఒకటి. అమెరికా దగ్గర వెయ్యి వుంటే దాని దగ్గర ఒకటే వుండవచ్చు. వాటిని ప్రయోగిస్తే జరిగే నష్టం ఒకటైనా, వెయ్యి అయినా ఒకటే. అందువలన తక్షణమే వాటిని వుపయోగించకపోయినా మారణకాండ జరిపే ఆయుధాలు అమెరికా దగ్గర గుట్టలుగా వున్నాయి. అమెరికా గనుక యుద్దానికి పూనుకుంటే దక్షిణ కొరియాలో వున్న రెండులక్షల 30వేల మంది అమెరికన్‌ సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా కొత్తగా నియమితుడైన విక్టర్‌ చా హెచ్చరించాడు.అందుకుగాను ట్రంప్‌ ఆ నియామకాన్ని రద్దు చేశాడు. గత ఏడాది కాలంలో అనేక సార్లు ట్రంప్‌ వుత్తర కొరియా నాయకత్వాన్ని తూలనాడటం, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం తెలిసినదే. గతవారంలో వుత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారితో సమావేశమై గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దాడులు తప్ప మరొక మార్గం లేదని నోరుపారవేసుకున్నాడు. ఒలింపిక్స్‌కు బయలుదేరి అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మధ్యలో అలాస్కాలోని క్షిపణి వ్యతిరేక కేంద్రాన్ని సందర్శించటంతో పాటు జపాన్‌తో చర్చలు జరపాలని నిర్ణయించాడు. నిజానికి ఇతగాడి పర్యటన వుత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచార దాడి లక్ష్యం తప్ప తలెత్తిన వుద్రిక్తతలను వుపశమింపచేసేదిగా లేదు. క్రీడల తరువాత గతేడాది మాదిరే వుత్తర కొరియా సమీపంలో ఆధునిక ఆయుధాలతో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కొరియా ద్వీపకల్పంపై దాడికి వీలుగా గువామ్‌ సైనిక కేంద్రంలో అణ్వాయుధాలను తీసుకుపోవగల బి-52, బి2 రకాల విమానాలను మోహరించారు.

వుత్తర కొరియాపై దాడులు చేసేందుకు అమెరికా అవకాశం కోసం చూస్తున్నది. దానిలో భాగంగానే జనవరి 13వ తేదీన హవాయి దీవుల వైపు ఖండాంతర క్షిపణి వస్తున్నదని, ఇది డ్రిల్లు కాదు, వెంటనే రక్షణ తీసుకోండనే తప్పుడు సమాచారాన్ని జనంలో ప్రచారంలో పెట్టారు. దాంతో వీధుల్లోని జనం కార్లను వదలి పరుగులు తీసిన వుదంతం తెలిసిందే. ముఫ్నై ఎనిమిది నిమిషాలపాటు జనం కకావికలయ్యారు. అది వాస్తవం కాదని విన్యాసమని కూడా సమాచారంలో వుందని తరువాత అధికారులు చెబుతున్నప్పటికీ చివరలో డ్రిల్లు కాదని కూడా పేర్కొన్నందున జనం నిజమని భావించారు. అబద్దాలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటంలో అమెరికా గూడచార, మీడియా సంస్ధలు పేరు మోశాయి. జపాన్‌పై అణుబాంబును ప్రయోగించేందుకు సాకుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్‌ హార్బర్‌పై దాడి చేసిందనే పెద్ద అబద్దాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వియత్నాంపై దాడి చేసేందుకు 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తమ యుద్ధ నౌకపై దాడి జరిపిందనే సాకుతో దాడులకు దిగిన విషయం దాస్తే దాగేది కాదు నిన్నగాక మొన్న ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో సద్ధాం హుస్సేన్‌పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. వుగ్రవాదంపై పోరు పోరు పేరుతో ఇప్పుడు దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను సృష్టించిందీ అమెరికాయే అన్న విషయం తెలిసిందే.

ఒకవైపు శీతాకాల ఒలింపిక్స్‌ వుత్సవాలకు ప్రతినిధి బృందాలను పంపిన వుత్తర కొరియా నాయకత్వం మరోవైపు ఏప్రిల్‌ 25న జరగాల్సి కొరియా ప్రజాసైన్య 70వ వార్షికోత్సవాన్ని ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి ఒక రోజు ముందే జరిపేందుకు పూనుకున్నదని, తన దగ్గర వున్న దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రదర్శన ద్వారా అమెరికాను బెదిరించేందుకు పూనుకుందని, అందువలన శాంతి కావాలనే ఎత్తుగడతో దక్షిణ కొరియా, దాని మిత్రపక్షాల మధ్య అంతరం పెంచేందుకు వుద్దేశించిన దాని ప్రచారాన్ని నమ్మవద్దని జపాన్‌, పశ్చిమ దేశాల మీడియా గగ్గోలు పెడుతోంది. తను అణుకార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన వ్యవధి తీసుకొనేందుకు అది శాంతి గురించి మాట్లాడుతున్నదని ఆరోపణలు చేస్తున్నది.

గత ఏడు దశాబ్దాల పరిణామాలను గమనించినపుడు వుభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాల కూటమి అన్నది స్పష్టం.1950 దశకంలో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు అమెరికా మద్దతుతో దక్షిణకొరియా ప్రయత్నించింది తప్ప ఇంతవరకు ఏ నాడూ దక్షిణ కొరియాపై సోషలిస్టు వుత్తర కొరియా దాడిచేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ విలీనానికి ఇంకా అనుమానాలు తొలగలేదనే పాచిపాటనే పశ్చిమ దేశాలు పాడుతున్నాయి. శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంగా చేస్తున్న ప్రచారదాడి దానిలో భాగమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అవకాశవాద సంకీర్ణాలు-ఆగ్రహంతో జర్మన్‌ కార్మికవర్గం !

07 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

austerity, cdu, Germany, Germany’s Grand Coalition, spd

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరే పార్టీలు, చట్ట సభలకు ఎన్నికైన వారు అర్రులు చాచటం కనిపిస్తోంది. అధికార ప్రలోభానికి అర్రులు చాస్తే వున్న జన మద్దతు కూడా పోయేట్లుందని ఐరోపాలో అనేక పార్టీలు భయపడే స్ధితికి చేరుకున్నాయి. ఐరోపాకు గుండెకాయ వంటి జర్మనీలో అదే స్ధితి. గతేడాది సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగినా ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. గత నెల రోజులుగా జరుగుతున్న చర్చలను నాలుగో గడువు ఆదివారం నాటితో ముగించాలని అనుకున్నప్పటికీ అది కూడా ముగిసి పోయింది. ఒకవైపు కార్మికవర్గ సమ్మె సైరన్లు మోగుతుంటే మరోవైపు ఇతర దేశాలతో పాటు జర్మన్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా కుప్పకూలింది. వెంటనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పడాల్సిన అత్యవసరాన్ని స్టాక్‌ మార్కెట్‌ పరిణామాలు పెంచాయని అందరం ఇబ్బందుల్లో వున్నామని ఆపద్ధర్మ ప్రభుత్వ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. తమ మాదిరే ఇతర పార్టీలు కూడా చర్చలు ముగించి బాధాకరమైన రాజీకి రావాలని ఆమె కోరారు. కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా జర్మనీలో పరిస్ధితి వుంది. జర్మన్‌ రాజకీయాలలో సోషల్‌ డెమోక్రటిక్‌పార్టీ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఖాయమని కార్మికులు భావిస్తారు. ప్రపంచ మార్కెట్లో నిలబడే పేరుతో కార్మిక సంక్షేమ చర్యలు, హక్కులకు మరింత కోత పెట్టాలని కార్పొరేట్‌ శక్తులు పట్టుపడుతుంటే వాటిని నిలుపుకొనేందుకు అవసరమైతే మరిన్ని సమ్మెలకు దిగుతామని మూడు రోజుల హెచ్చరిక సమ్మెలతో కార్మికవర్గం స్పష్టం చేసింది.

క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు) నాయకత్వంలో అధికార భాగస్వామిగా వున్న సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) తాజా ఎన్నికలలో దిమ్మదిరిగే పరాజయాన్ని చవి చూసింది. దాంతో అటు సూర్యుడు ఇటు పొడిచినా, సప్త సముద్రాలు ఇంకిపోయినా తాము తిరిగి సంకీర్ణ కూటమి సర్కార్‌లో చేరేది లేదని ప్రకటించిన ఎస్‌పిడి మరోసారిసిడియుతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు దారులు వెతుకుతోంది. సంకీర్ణ ప్రభుత్వంపై ఎస్‌పిడి యువ నాయకత్వంలో తలెత్తిన వ్యతిరేకతను బుజ్జగించేందుకు పూనుకున్నారు. ఇదే సమయంలో జర్మన్‌ కార్మికవర్గం 2003 తరువాత తొలిసారిగా తమ డిమాండ్లపై సమ్మెకు దిగింది. పార్లమెంటు రద్దు కాకుండా చూసేందుకు, ఎన్నికలను నివారించేందుకు జర్మన్‌ పెట్టుబడిదారులు వివిధ పార్టీలపై వత్తిడి తెస్తున్నారు. ఇది రాసే సమాయానికి ప్రయత్నాల గురించి వార్తలు తప్ప నిర్ధిష్ట రూపం తీసుకోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలలో ప్రస్తుత ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియు దాని మిత్రపక్షానికి 246, ప్రధాన ప్రతిపక్షమైన ఎస్‌డిపికి 153, జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి)కి 94, ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీకి 80, వామపక్షం(పూర్వపు కమ్యూనిస్టు పార్టీ) 69, గ్రీన్‌ పార్టీకి 67 వచ్చాయి. గతంలో అవి చేసిన ప్రకటనలు, వాటి విధానాల ప్రకారం ఈ పార్టీలలో ఏ రెండూ భావసారూప్యత కలిగినవి కావు. అయినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్య పరిణామం జరిగితే తప్ప సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిడియు మరియు ఎస్‌పిడి సిద్ధం అవుతున్నాయి. అయితే ఆ సంకీర్ణం ఎంతకాలం మనగలుగుతుందనేది ప్రశ్నార్దకం. తిరిగి ప్రభుత్వంలో చేరాలా వద్దా అని చర్చించేందుకు డిసెంబరు ఆరున ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పిడి ప్రతినిధులు సంకీర్ణ కూటమి చర్చలకు అంగీకారం తెలిపారు. అయితే సమావేశం హాలు వెలుపల పార్టీ యువజన విభాగం నిరసన ప్రదర్శనలు చేసింది. జనవరి పన్నెండున తాము ప్రతిష్ఠంభనను అధిగమించి ఒక అంగీకారానికి వచ్చామని రెండు పార్టీలు ప్రకటించాయి. జనవరి 21న ఎస్‌పిడి అసాధారణ పార్టీ సమావేశం జరపగా 642 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దానిలో సంకీర్ణ ప్రభుత్వంలో చేరేందుకు 362 అనుకూలంగా 279 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. జనవరి 26న అంతిమంగా రెండు పార్టీలు లాంఛనంగా చర్చలు ప్రారంభించాయి.

Related image

రాజకీయ రంగంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్న సమయంలోనే జర్మన్‌ కార్మికులు అనేక పరిశ్రమలలో వాటితో నిమిత్తం లేకుండా ఆందోళనల సన్నాహాలు జరిపి గత కొద్ది వారాలుగా హెచ్చరిస్తున్న విధంగానే సమ్మెకు దిగారు. కార్మికుల్లో తలెత్తిన ఆందోళన ఎస్‌పిడిలో విబేధాలకు తెరతీసిందని చెప్పవచ్చు. జనవరి 31, ఫిబ్రవరి 1,2 తేదీలలో జర్మనీ అంతటా ఆటోమోటివ్‌, ఎలక్ట్రికల్‌ పరిశ్రమలలో మూడు రోజుల పాటు 24 గంటల చొప్పున సమ్మె చేశారు. ఇతర పరిశ్రమలకు ఈ ఆందోళన వ్యాపించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఎనిమిదిశాతం వేతనాలు పెంచాలని, వారానికి పని గంటలను 28కి తగ్గించాలన్నవి వారి ప్రధాన డిమాండ్లు. లోహపరిశ్రమలలో కూడా సమ్మె బ్యాలట్‌ నిర్వహించగా 95నుంచి 100శాతం వరకు కార్మికులు మద్దతు తెలిపారు. నూతన సంకీర్ణ ప్రభుత్వం సామాజిక సంక్షేమంపై దాడులతో పాటు మిలిటరిజం, రాజ్య అణచివేత యంత్రాంగాన్ని పటిష్ట పరచనున్నదనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలోనే కార్మికులు వాటికి వ్యతిరేకంగా సమ్మె సన్నాహాలు చేస్తున్నారు. జర్మన్‌ కార్మికవర్గానికి సంస్కరణవాద శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. వారి పోరాట పటిమను నీరు గార్చేందుకు గతంలో అవి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ కారణంగానే ఈ శక్తులకు నిలయంగా వున్న ఎస్‌పిడి దాని చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ ఓట్లు తెచ్చుకొని జనం నుంచి ఎంతగా వేరు పడిపోయిందీ నిరూపించుకుంది. ఆ కారణంగానే మరోసారి ప్రభుత్వంలో చేరకూడదని గంభీరంగా ప్రకటనలు చేసినా దాని స్వభావం కారణంగా మరోసారి చేతులు కలిపేందుకు పూనుకుంది.

అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీ, బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీలో కూడా ఇలాంటి ధోరణులే ప్రబలంగా వుండగా వాటికి వ్యతిరేకంగా బెర్నీశాండర్స్‌, జెర్మీ కార్బిన్‌ మాదిరి కొంత మేరకు ప్రతిఘటించేశక్తులు ముందుకు వస్తున్నట్లు ఎస్‌పిడిలో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే వాటికి ఎన్నోపరిమితులున్నాయి. ఆ పార్టీ 28ఏండ్ల యువనేత కెవిన్‌ కుహనెట్‌ నాయకత్వంలోని యువజన విభాగం సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును పార్టీ నాయకత్వం విఫలం చేసింది.అనేక మంది యువకులు పార్టీ వామపక్ష బాట పట్టాలని వత్తిడి తెస్తున్నారు. మరోవైపు జర్మనీలో పచ్చిమితవాద ధోరణులను కూడా ప్రోత్సహించటం, తాజా ఎన్నికలలో అలాంటి శక్తులు గణనీయమైన సీట్లు సాధించటాన్ని కూడా చూడవచ్చు. గతంలో ఎస్‌పిడి అధ్యక్షుడిగా పని చేసి ఆ పార్టీ నుంచి విబేధించి విడిపోయి వామపక్ష పార్టీని ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన ఆస్కార్‌ లాఫోంటెయిన్‌ తాజా పరిణామాల గురించి మాట్లాడుతూ ఒక నూతన వామపక్ష వుద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. దానిలో వామపక్ష పార్టీ, గ్రీన్స్‌, ఎస్‌పిడిలోని కొన్నిశక్తులు దగ్గర కావచ్చునని,ఆ వుద్యమంలో సాంప్రదాయ పార్టీలే కాకుండా కార్మికోద్యమనేతలు, సామాజిక సంస్ధలు, శాస్త్రవేత్తలు, సాంస్కృతిక కార్యకర్తలు ఇతరులు కూడా తోడు కావాలని ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పారు. వామపక్ష పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, లాఫోంటెయిన్‌ సతీమణి అయిన సారా వాజెన్‌చెట్‌ ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతూ ఆ వుద్యమంలో ప్రముఖులు చేరితేనే ప్రయోజనం వుంటుందని, రాజకీయంగా తమ దారిలో ఒక కదలిక వున్నదన్న భరోసా, ఆశను జనంలో రేకెత్తిస్తుందని అన్నారు. అయితే కొత్త నిర్మాణాలేమీ అవసరం లేదు బలమైన వామపక్ష పార్టీ వుంటే చాలనేవారు కూడా లేకపోలేదు. దీనిలో డెమోక్రటిక్‌ సోషలిజంగా పేరు మార్చుకున్న తూర్పు జర్మనీలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు, ఎస్‌పిడి నుంచి విడిపోయిన వామపక్ష శక్తులు, ఇతర వామపక్ష శక్తులు, వ్యక్తులతో వామపక్ష పార్టీ ఏర్పడింది. ఎస్‌పిడి, గ్రీన్స్‌, వామపక్ష పార్టీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచి కార్మికవర్గ హక్కులను పరిరక్షించవచ్చనే ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే పార్లమెంటులో బలాబలాలు ఆవిధంగా లేవు, గతంలో ఎస్‌పిడి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినపుడు కార్మికులకు నష్టదాయకమైన చర్యలు తీసుకున్న కారణంగానే లాఫోంటెయిన్‌ వంటి వారు ఎస్‌పిడి నుంచి బయటకు వచ్చారు.

ఇటీవలి కాలంలో జర్మనీతో సహా అనేక ధనిక దేశాలలో వెలువడుతున్న ధోరణుల గురించి జాగ్రత్తగా పరిశీలించాల్సి వుంది. నయా వుదారవాదం, ఆర్ధిక, సామాజిక అసమానతలను వ్యతిరేకించే శక్తులు పచ్చిమితవాద, నయా నాజీశక్తులతో కొన్ని విషయాల్లో పోటీపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వలసలను అనుమతించటం ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా వుంది. చౌకశ్రమ శక్తిని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ రంగం వలస కార్మికులను అనుమతించాలని పాలకపార్టీలపై వత్తిడి తెస్తోంది.పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన అసంతృప్తిని సంఘటిత వుద్యమాలవైపు మరల కుండా నయా వుదారవాద విధానాలను గట్టిగా సమర్ధించే నయా నాజీలు, మితవాదులు వలస కార్మికులను వ్యతిరేకిస్తూ అసంతృప్తిని దురహంకారంవైపు మళ్లించేందుకు పూనుకున్నారు. నయా వుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు కూడా వలసలను వ్యతిరేకిస్తూ జాతీయవాద భావాలను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇవి రెండూ బమ్మ బరుసు వంటివే.ఈ ధోరణులు వామపక్ష వుద్యమాల అభివృద్ధికి ఆటంకం కలిగించేవే. వుదాహరణకు ప్రత్యామ్నాయ జర్మనీ అనే మితవాద పార్టీ వలసలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. మరోవైపు ‘జర్మనీలో జీవించాలని కోరుకొనే ప్రతి ఒక్కరికీ మనం అవకాశం ఇవ్వలేము’ అని వామపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. వలసవచ్చిన వారితో తక్కువ వేతనాల రంగంలో పోటీ పెరుగుతుందని, ఇండ్ల అద్దెల పెరుగుదలతో పాటు పాఠశాలల్లో ఇబ్బందులు పెరుగుతాయని వామపక్ష పార్టీ నేత లాఫాంటెయిన్‌ పేర్కొన్నారు. ప్రపంచం ధనిక దేశాలను చుట్టుముట్టిన 2008నాటి అర్ధిక సంక్షోభం అటు పెట్టుబడిదారులతో పాటు ఇటు దాన్ని వ్యతిరేకించే వివిధ శక్తులలో కూడా ఒక మధనం ప్రారంభానికి దోహదం చేసింది.

ధనిక దేశాలలో సంక్షేమ చర్యలకు కోతతో పాటు, కార్మికవర్గ హక్కులపై నానాటికీ దాడి తీవ్రం అవుతోంది. 2008లో ప్రారంభమయిన సంక్షోభంలో ధనిక దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిస్టులుగా, వామపక్ష శక్తులుగా చెలామణి అయిన శక్తుల ఆచరణ మిగతావారికంటే భిన్నంగా లేదనే అంశం గత పది సంవత్సరాలలో తేటతెల్లమైంది. అందువల్లనే వాటికి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పూర్వరంగంలో నిజమైన కార్మికవర్గ పార్టీల గురించి మరోసారి కార్మికవర్గంలో పునరాలోచన ప్రారంభమైంది. సోవియట్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఇదొక ఆశాజనక పరిణామం. వెంటనే ఏవో పెను మార్పులు సంభవిస్తాయని చెప్పలేము గాని తిరిగి వామపక్ష శక్తుల పెరుగుదలకు ఇది నాంది అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: