డాక్టర్ కొల్లా రాజమోహన్
”సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల కంటే సైనిక రక్షణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న దేశం ఆధ్యాత్మిక మరణానికి చేరుకుంటుంది” – మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.
నవంబరు 6 న చుషుల్ లో జరిగిన 8 వ విడత కోర్ కమాండర్ స్ధాయి చర్చలలో, సరిహద్దులోని ఉద్రిక్తతలను తొలగించి, సైనిక ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు భారత-చైనా దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మరొక పక్క రెండో దఫా మలబార్ సైనిక విన్యాసాలు నవంబరు 17 నుండి జరుగుతున్నాయి. అమెరికా నాయకత్వాన జరుగుతున్న ఈ విన్యాసాలలో భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్నాయి. జపాన్ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా, మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అమెరికా అనుంగు దేశంగా మలబార్ సైనిక విన్యాసాలలో పాల్గొంటున్నది.
చైనాను చుట్టుముట్టాల
మాన్యుఫాక్చరింగ్ రంగంలో చైనా కొత్త దారులను తొక్కి అమెరికా తో సహా ప్రపంచప్రజలందరికీ కావలసిన వినియోగ వస్తవులను, ఎలక్ట్రానిక్ సామానులనుతయారుచేసి తక్కువ ధరలకు అందిస్తున్నది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా రవాణాసౌకర్యాలను అభివ ధి చేసి ఆఫ్రికా, యూరప్ లతో తన వాణిజ్య వ్యాపారాలలో పైచేయిసాధింటానికి అమెరికా తో పోటీపడుతోంది. ప్రత్యర్ధి ఆర్ధిక శక్తిగానే కాక సైద్దాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తున్నది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనికంగా దిగ్బంధించాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకు మన దేశాన్ని క్రమేపీ సైనిక కూటమిలో చేర్చుకోవటానికి కుట్ర పన్న్నుతోంది. సైనిక విన్యాసాలని, వాతావరణ, ప్రదేశిక సమాచారాన్ని పంచుకు నే ” బెకా ”అని రకరకాల ఒప్పందాలలో ఇరికించే ప్రయత్నాలలో వుంది.
1998 లో భారత దేశం అణుపరీక్షలు నిర్వహించటం , అమెరికాకు కోపం తెప్పించింది, ఆర్ధిక ఆంక్షలను విధించింది. సంవత్సరాల చర్చలు, సర్దుబాట్లు, ఒప్పందాలు, లొంగుబాట్ల వలన 2005 సం,లోఆంక్షలను క్రమంగా సడలించారు. పది సంవత్సరాల రక్షణ వ్యవహార సంబంధాల వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను భారత-అమెరికాలు ఏర్పరచుకొని 2013 లో రక్షణ వ్యవహారాల సహకారం పై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. . 2015 లో రక్షణ వ్యవహారాల వ్యూహ ఫ్రేమ్ వర్క్ ను మరో పదేళ్ళు పొడిగించారు.
2000 సం లో 20 బిలియన్ డాలర్లున్న భారత- అమెరికా వాణిజ్యం 2018 నాటికి 140 బిలియన్లకు చేరుకుంది .2005 సం . వరకు రక్షణ పరికరాలు 400 మిలియన్ డాలర్ల నుండి 18 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
సోవియట్ పతనంతో అంతరిస్తున్నఅలీన విధానం ,
భారత ప్రభుత్వం 1947 నుండి 1991 వరకు అలీన విధానం కొనసాగించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల విముక్తిపోరాటాలకు అలీన ఉద్యమం సహాయాన్నందించింది.పంచవర్ష ప్రణాళికలకు సోవియట్ సహాయం అందించింది.భారీ పరిశ్రమలైన ఉక్కు ఫ్యాక్చరీలకు, భారత మందుల పరిశ్ఱమలకు నిస్వార్ధంగా సహాయాన్నిందించింది. 1971 లో ఇందిరా గాంధీ తోశాంతి, స్నేహం, సహకార ఒప్పందం చేసుకుని సోవియట్‌కు దగ్గరయింది. అలీన ఉద్యమం బలహీన పడటం, అలీనోద్యమ నాయకులైన నెహ్రూ, నాజర్, టిటో, కాస్ట్రో, సిరిమావో లు అంతరించటం అమెరికా అనుకూల భావజాలానికి అడ్డు తొలగింది. సోవియట్ రష్యాను విచ్చిన్నం చేయటంలో అమెరికా సఫలమయ్యింది. సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న అమెరికా సైనిక బలంలోనూ తన అధిపత్యాన్ని నిరూపిస్తూ ఏకధ వ ప్రపంచానికి నాయకత్వం వహించింది. కార్పోరేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆర్ధిక సంక్షోభాలను నివారించలేకపోయింది.అమెరికా దేశం అప్పులలో మునుగుతూంది. 906 బిలియన్ డాలర్ల అమెరికన్ ట్రెజరీ సెక్యూరిటీలు చైనా చేతిలో వున్నాయి., జపాన్ 877, ఆయిల్ ఎగుమతిదారులు213 బిలియన్ డాలర్ల ట్రెజరీ సెక్యూరిటీలనుస్వంతం చేసుకున్నారు.
సోషలిజం, కమ్యూనిజం చర్చలోకివచ్చింది
అమెరికాలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటంతో సోషలిజం, కమ్యూనిజం . సోషల్ డెమోక్రసీ చర్చలోకివచ్చింది.ఆర్ధిక సంక్షోభాల సుడిగుండాలనుండి బయటపడటానికి మార్కెట్ల కోసం వెతుకులాటలో వుంది. అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఘోరంగా విఫలమయింది. ఇరాక్, ఆఫ్గనిస్ధాన్ లలో ఎదురైన పరాజయంతో ప్రత్యక్షయుద్ధానికి వెనుకాడుతోంది. జనవరి3, 2020 న ద్రోన్ ద్వారా ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సొలేమాన్‌ని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దొంగదెబ్బతీసి హతమార్చింది. భారతలాంటి దేశాలను తన వైపు చేర్చుకోవటానికి చైనాతో సరిహద్దు తగాదాను ఒక మంచి అవకాశంగా మలుచుకుంటున్నది. బిగుసుకుంటున్న బంధం ధ్రుతరాష్ట్ర కౌగిలి ని గుర్తుచేస్తున్నది. ప్రేమ నటిస్తూ దగ్గరకు తీసుకుంటూ ప్రాణాలుతీసే ప్రయత్నాన్ని ధ్రుతరాష్ట్ర కౌగిలి అంటారు.
ఇండో-పసిఫిక్ పాలసీ
ఇండో-పసిఫిక్ పాలసీ ని ముందుకు తెచ్చింది ట్రంప్ కాదు. ఒబామా , బిడెన్ అధికారంలో వుండగానే ఈ విధానాలకు శ్రీకారం చుట్టారు. చైనా ప్రభావాన్ని ఆసియా దేశాలపై నివారించటానికి 2015 లో ఢిల్లీలో ఒబామా భారత-అమెరికా ల విజన్ స్టేట్ మెంట్ పై సంతకం చేశారు. అదే విధానాలను ట్రంప్ కొనసాగించాడు.
నాటో సైనిక కూటమి మాదిరి క్వాడ్ సైనిక కూటమి
దక్షిణచైనా సముద్రాన్ని మరొక సైనిక కూటమికి కేంద్రంగా చేయాలని 1992 నుంచి కొనసాగుతున్న అమెరికా వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఆమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటే ఆయుధాలను అమ్ముకోవాలి. మలబార్ సైనిక విన్యాసాలు తొలిదశలో భారత-అమెరికా నౌకాదళాల శిక్షణాకార్యక్రమాలకు మాత్రమే పరిమితమని ప్రచారంచేశారు. 2015లో జపాన్ చేరింది. కొత్తగా ఆస్ట్రేలియాను భయపెట్టి, బతిమిలాడి చతుష్టయ కూటమిలోకి చేర్చుకొన్నారు. 2015 సం.లో జరిగిన మలబార్ విన్యాసాలకు భారత్ నౌకాదళం రెండు యుద్దనౌకలను మాత్రమే పంపింది, ఇపుడు 2020 లో విమానవాహక యుద్ద నౌక, సబ్ మెరైన్ లను కూడా పంపింది. బంగాళాఖాతంలో నవంబర్ 3న మలబార్ -2020 పేరున సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.అరేబియా సముద్రంలో 17 వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా ను చుట్టుముట్టి నిలవరించాలనే పధకం 2007లో నే మొదలయింది.అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ పధకాన్ని ఆమోదించి ”చతుష్టయాన్ని” ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హౌవర్డ్, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని ఆమోదించారు.
ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు
చైనా ను నివారించ్చాలన్న అమెరికా ప్రయత్నాలకు మనం ఎందుకుసహకరించాలన్నదే ముఖ్యమైన అసలుప్రశ్న. చైనాలో ఆర్ధిక అభివ ద్ధి జరిగిన స్థాయి లో ఆ దేశ సైనిక ,భౌగోళిక, రాజకీయ శక్తీ పెరగలేదు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికా దే పైచేయి. సైనిక బడ్జెట్, సైన్యం, అణ్వస్త్రాలు, విదేశాల్లో సైనికస్తావరాలు మొదలైన వాటిలో ఏ దేశమూ అమెరికా దరిదాపుల్లోకూడా లేదు. చైనా బలమైనఆర్ధిక శక్తిగా ఎదగడం, ఇరుగు పొరుగు దేశాలలో పలుకుబడి పెరగటంవలన ఆసియా-పసిఫిక్ లో అమెరికా అధిపత్యానికి భంగం కలిగింది.అమెరికా భధ్రతకు ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది. దక్షిణచైనా సముద్రంలో అమెరికాకు ఉపయోగపడే నిఘాకు భారతదేశం అంగీకరించింది. సైనిక వ్యూహంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులను కీలక మిలిటరీ కేంద్రంగా చేస్తున్నారు. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్ దీవులు సమీపంలో వున్నాయి. చైనా వ్యతిరేక సైనిక వ్యూహంలోఅండమాన్ దీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు చేయటానికి మనదేశం అంగీకరించినందువలన సైనిక కూటములలో ప్రత్యక్షభాగస్వాములౌతున్నాము.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఉన్నత రాజకీయ , దౌత్య స్ధాయిలో చైనా తో భారత ప్రభుత్వ చర్చలు కొనసాగించటం వలన దాదాపు 40 సంవత్సరాలు భారత-చైనా దేశాలు తమ అభివ ద్ధిపై కేంద్రీకరించగలిగాయి.భారత-చైనా దేశ ప్రజల విశాల ప్రయోజనాల ద ష్ట్యా ఇరు దేశాల నాయకులు ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి. బయటి వారెవరూ సైన్యాన్ని మనకు సహాయంగా పంపరు. ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆయుధపోటీని పెంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హౌవర్ చెప్పినట్లుగా అమెరికాను మిలిటరీ – ఇండిస్టియల్ కాంప్లెక్స్ పరిపాలిస్తున్నది. అమెరికా లాగా మనం సైనిక-రక్షణ రంగ పరిశ్రమల (మిలిటరీ -ఇండిస్టియల్ కాంప్లెక్స్) పరిపాలనలోకి వెళ్ళరాదు. మిలిటరీ-ఇండిస్టియల్ కాంప్లెక్స వలన పెరుగుతున్నప్రమాదాల గురించి హెచ్చరించాడు.కానీ ఆయుధ రేసు ను నివారించలేకపోయాడు.
” తయారైన ప్రతి తుపాకీ, ప్రతి యుద్ధ నౌక, ప్రయోగించిన ప్రతి రాకెట్ -ఆకలి బాధతో ఉన్నవారినుండి దొంగిలించినవే. ధరించటానికి దుస్తులు లేనివారుండగా ఆయుధాలకు డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.” అని ఐసెన్ హౌవర్ చెప్పాడు.
ఈ యుధాలు ఎవరికోసం ?
రక్షణ పరిశ్రమలు నడవటంకోసం యుద్ధాలుకావాలి. ఆధునిక ఆయుధాలను తయారు చేయటానికి ప్రపంచంలోని మేధావులను , సైంటిస్టులను అమెరికా ఆహ్వానించి ఆధునిక సౌకర్యాలను, అవకాశాలను, పని చెసే వాతావరణాన్ని స ష్టిస్తున్నది. కొత్తకొత్త ఆయుధాలను తయారుచేసి ఇరుపక్షాలకు ఆయుధాలను అమ్ముకుంటున్నది. సోవియట్ పతనం తరువాత అమెరికా కు కొత్త శత్రువు అవసరం వచ్చింది. ఆ వెతుకులాటలో ఇరాన్, ఇరాక్,లిబియా, సిరియా, ఆఫెనిస్ధాన్ లు కొంత పని కల్పించాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని తమ తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకుని పావులు కదుపుతున్నారు.
అమెరికాతో సైనిక ఒప్పందాలు
భారత్ దేశాన్ని అమెరికాకు రక్షణ భాగస్వామి గా చేసుకోవటం వలన భారత సైనిక స్ధావరాలను అమెరికా యుద్దవిమానాలు, యుద్దóనౌకలు వినియోగించుకోవచ్చు. అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి నుండి భారత్ నేరుగా ఆయుధాలు కొనవచ్చు. అమెరికా తన రక్షణ భాగస్వాములతో నాలుగు ”ప్రాధమిక ” ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు ”భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి అమెరికా ఉపయోగించే సాధారణ సాధనాలు” అని పెంటగాన్ అంటుంది. మనం ప్రాధమిక స్ధాయి ఒప్పందాలన్నీ చేసుకున్నాము.
ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్ ఎక్సేóంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ , 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి వీలు కలుగుతుంది.
మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్ ఇంటర్ ఆపరబిలిటీ అండ్ సెక్యూరిటీ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ చైనా మరియు పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, అమెరికా మిలిటరీ పరికరాలను కొనటానికి, టెక్నాలజీని ఇవ్వటానికి , ఆయుధాలను భారతదేశానికి అమ్మటానికి ద్వైపాక్షిక సదస్సులో సంతకాలు చేసారు.
నాల్గవ ఒప్పందం బేసిక్ ఎక్సేóంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీకా). ఇది జియోస్పేషియల్ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్, నాటికల్, ఏరోనాటికల్ డేటా, యుఎస్ నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది.
లండన్లోని కింగ్స్ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు: ”ఇండో-పసిఫిక్ లో శక్తి సామర్ధ్యాల సమతుల్యతకు అమెరికాకు భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం.” ఈ ఒప్పందాలన్నిటిలో భారత్ చేరింది. ఐరోపా లోని భాగస్వామ్యదేశాలన్నీ ఈ విధంగా సంతకాలు చేసి నాటో సైనిక కూటమి లో చేరి ఇరుక్కు పోయి తీవ్రంగా నష్టపోయాయని గ్రహించాలి.
చైనానుండి, చైనా కమ్యూనిస్టుపార్టీ దోపిడీ, అవినీతి నుండి దేశాల ప్రజల రక్షణ కోసం క్వాడ్ ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ,టోక్యో లో బాహాటంగా ప్రకటించాడు. అమెరికా లో కమ్యూనిస్టువ్యతిరేకతను రెచ్చగొట్టిన ఘనత రిపబ్లికన పార్టీ సెనేటర్ మెకార్ధీకే దక్కుతుంది. ప్రభుత్వం లోవున్నప్రజాస్వామికవాదులందరినీ కమ్యూనిస్టులన్నాడు. సోవియట్ ఏజెంట్లు అంటూ వారందరిపై పై దాడి చేశాడు.వారిని పదవులనుండి తొలగించేదాకా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశాడు. అమెరికన్ ప్రజలలో కమ్యూనిస్టలంటే భయాన్ని, వ్యతిరేకతలు స ష్టించాడు. అతను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాలను చూపించటంలేదని అందరికూ తెలుసు. అయినా అతని అబద్ద ప్రచారాన్ని ఆపడానికి ఐసెన్ హౌవర్ లాంటి వారు కూడా భయపడ్డారు.” నేను ఆ వ్యక్తితో గొడవపడను” అని వెనక్కితగ్గాడు. 1950 లో ప్రారంభమయిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే వుంది. కమ్యూనిజాన్నినివారించాలనే పేరుతో కొరియా, వియత్నాం యుధాలనుండి ఇండో-పసిఫిక్ క్వాడ్ కూటమి వరకూ సైనిక కూటములను ఏర్పరుస్తున్నారు.
స్నేహంతో జీవించవలసిన ఇరుగు పొరుగు దేశాలమధ్య చిచ్చు పెట్టి ఇద్దరికీ ఆయుధాలను, ఫైటర్ విమానాలను, సబ్ మెరైన్లను అమ్ముకోవటమేకాకుండా ప్రపంచ ప్రజలనందరినీ పేదరికం లోకి నెట్టి అసమాన అభివ ద్ధిని స ష్టిస్తోంది. అమెరికా దేశం సంవత్సరానికి 732 బిలియన్ డాలర్లను , చైనా 261 బిలియన్ డాలర్లను, ఇండియా 71 బిలియన్ డాలర్లను మిలిటరీకి, ఆయుధాలకు ఖర్చు పెడుతున్నాయి.
చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము.
చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో ఆయుధాలను ప్రయోగించి ,అత్యంత శక్తివంతమైన అమెరికా ఏదేశంలోనూ విజయం సాధించలేదు. 2001 సెప్టెంబరు 11 న ప్రపంచవాణిజ్యసంస్ధపై దాడి జరిగినప్పడినుండీ 20 సంవత్సరాలుగా , ఆసియాలో ప్రతీకారయుధాలను అమెరికా సాగిస్తుంది. ఈ యుధాలకు 6.4 లక్షల కోట్ల డాలర్లు ( 475 లక్షల కోట్ల రూపాయలు ) ఖర్చయిందని అంచనా. గత 20 సంవత్సరాలుగా అమెరికా సాగించిన యుధాలలో చనిపోయిన వారి సంఖ్య 8,01,000. అందులో 3,35,000 మంది నిరాయుధ పౌరులన్నది మరింత బాధాకరం. కొరియా, వియత్నాం లలో చావు దెబ్బతిన్న అమెరికా పాఠాలు నేర్చుకోకుండా మిలిటరీ -ఇండిస్టియల్ కాంప్లెక్స్ అడ్డుపడింది. ప్రత్యక్షంగా సైనికులను ఆకాశంనుండి క్యూబా లో దించి అవమానాల పాలయ్యింది.ఇరాక్ లో సద్దామ్ హుస్సేన్, చిలీ లో అలెండీ, లిబియాలో కల్నల్ గద్దాఫీ, ఇరాన్ జనరల్ క్వాసిమ్ సొలేమాన్ లను దారుణంగా హత్య చేసింది. క్యూబా అధినేత ఫిడేల్ కాస్ట్రోను చంపటానికి 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అటువంటి చరిత్ర కలిగిన అమెరికా ను నమ్ముకుని యుద్ధ కూటములలో చేరితే మన దేశం ఆర్ధికంగా నష్టపోయి అరబ్ దేశాలు, లాటిన్ అమెరికా, ఆసియా.ఆఫ్రికా దేశాలలోలాగా అభాసుపాలవుతాము. కుక్క తోక పట్ట్టుకుని గోదావరి ఈదటం సాధ్యంకాదు.
రాబోయే కాలానికి భారత-చైనా దేశాలే సాంకేతిక అభివ ధికి చిహ్నంగా వుంటాయని నిరూపించుకుంటున్నారు. అటువంటి సమయంలో సరిహద్దు ఘర్షణలు జరగటం అవాంఛనీయం. వలసరాజ్యాలువదిలి వెళ్ళిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకోలేకపోవటం భారత – చైనాదేశాల రాజకీయ వైఫల్యం. భారత చైనాలు చిరకాలం శత్రుత్వంతో వుండలేవు. వేలాది సంవత్సరాల మైత్రిలో తగాదాపడిన కాలం చాలా తక్కువ. పరిష్కరించుకోలేని సమస్యలు లేవు. అతి పెద్ద దేశాలైన భారత- చైనా లతోనే ప్రపంచ ప్రజల సుస్ధిర శాంతి సౌభాగ్యాలు ముడిపడివున్నాయి. సైనిక కూటములలో చేరవలసిన అవసరం వున్నదా లేదా అని మనం ఆలోచించాలి. సైనిక కూటములలోచేరి చితికిపోయిన దేశాల చరిత్రను మరువరాదు. ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర?యాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.
వ్యాస రచయిత డాక్టర్ కొల్లా రాజమోహన్, భారత-చైనా మిత్రమండలి, ఆంధ్రప్రదేశ్, మాజీ అధ్యక్షుడు. (1982-1997)