• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: June 2022

రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !

30 Thursday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Kanhaiya Lal’s killers, Narendra Modi Failures, nupur sharma fringe comments, RSS, Udaipur shopkeeper murder


ఎం కోటేశ్వరరావు


నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు – పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్‌లోని ఉదయపూర్‌ పట్టణంలో దుండగులు కనయలాల్‌ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే, నిరసించాల్సిందే. మరొక మాట ఉండకూడదు. కాంగ్రెస్‌ నేతలు, కేరళ సిఎం పినరయి విజయన్‌, అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు ఖండించారు. బిజెపి సరేసరి. ఇలాంటివి పునరావృతం కాకూడదని అందరం కోరుకుందాం. కోరుకుంటే చాలదు, అంతటితోనే ఆగకూడని పరిస్థితిని దేశంలోని మెజారిటీ – మైనారిటీ మతోన్మాదులు కల్పించారు గనుక ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో ఎలా నివారించాలో ఆలోచించాల్సిన అవసరం లేదా ! ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! గతంలో కొన్ని పార్టీలు మైనారిటీల సంతుష్ట రాజకీయాలు చేసినట్లు ఆరోపించిన వారు ఇప్పుడు మెజారిటీ సంతుష్టీకరణలో పీకల్లోతులో మునిగి ఉన్నారు. ఈ దారుణంలో ఎవరి వాటాాపాత్ర ఎంత ?


కనయలాల్‌ను చంపిన వారు తమ గురించి సచిత్రంగా, స్వయంగా ప్రకటించుకున్నారు. వారు చేసిన దారుణంతో మరోసారి యావత్‌ ముస్లిం సమాజం మీద ధ్వజం-విద్వేషాన్ని వెదజల్లేందుకు అవకాశం ఇచ్చారు. దర్జీ లేదా టైలర్‌ హత్య అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన మీడియా మీద మతశక్తులు ధ్వజమెత్తుతున్నాయి. వాటికి ఆగ్రహం ఎందుకు ? ఒక హిందువును హతమార్చిన ముస్లింలు అని పెద్దక్షరాల్లో పతాక శీర్షికలు పెడితే తప్ప వారు శాంతించేట్లు లేరు. రేటింగులు, వాటితో వచ్చే లాభాల కోసం కొన్ని సంస్థలు మినహా మొత్తంగా మీడియా ఇప్పటికే విలువల వలువలను తొలగించుకుంది. గోచిపాతలతో ఉంది. హిజబ్‌ను వద్దంటున్న మతశక్తులు వాటిని కూడా సహించేట్లు లేవు. వారు కోరుకున్న విధంగా శీర్షికలు పెట్టే రోజులు దగ్గరపడుతున్నట్లుగా ఉంది. చూద్దాం, కానున్నది కాక మానదు, రానున్నది రాకమానదు కదా !


కనయలాల్‌ ఒక మామూలు దర్జీ. కరోనా మాదిరి కాషాయ వైరస్‌ సోకిన వారిలో ఒకడు, కనుకనే ఆ ప్రభావంతో నోటి దూల నూపుర్‌ శర్మను అనుసరించి సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు, షేర్‌ చేశాడు. నూపుర్‌ శర్మ నోటి దూలను చర్చ నిర్వహించిన టీవీ ఛానల్‌ నివారించలేదు, రేటింగ్‌ల కోసం కొనసాగించి ఉండాలి. ఆమె మాటలను బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా దూల మాటలని ఖండించటమే కాదు, తాత్కాలికంగా పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఆమె కూడా తన మాటలను వెనక్కు తీసుకున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంత జరిగాక కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లుగా కనయలాల్‌ వంటి వారు ఎందుకు గోక్కుంటున్నట్లు ? మతశక్తులు విద్వేషాన్ని సామాన్యుల్లో ఎక్కించిన ఫలితం కాదా ? నూపుర్‌ శర్మ నోటి దూల మాటలను సామాజిక మాధ్యమంలో సమర్ధించినందుకు(షేర్‌ చేసినందుకు) అతని మీద కేసు నమోదైంది. అరెస్టు చేశారు.

చిత్రం ఏమిటంటే అసలు సూత్రధారి, పాత్రధారి నూపుర్‌ శర్మ మీద కేసులు నమోదైనా అమిత్‌ షా గారి శిష్యురాలు గనుక అరెస్టులు లేవు, పోలీసు కాపలాతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు. మత మనోభావాలను కించపరిచినందుకు గాను కనయలాల్‌ జూన్‌ పదిన అరెస్టుకాగా మరుసటి రోజే కోర్టు బెయిలు మంజూరు చేసింది. అలాంటి పనులు చేసి దర్జాగా తిరగటం ఎంత సులభమో కదా ! తరువాత తనను చంపేస్తామంటూ బెదరింపులు వస్తున్నట్లు, రక్షణ కావాలని పదిహేనవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారి రెండు సామాజిక తరగతులకు చెందిన వారిని పిలిపించి కూర్చో పెట్టి చర్చించిన తరువాత ఎవరి మీద చర్యతీసుకోనవసరం లేదని కనయలాల్‌ రాసి ఇచ్చినందున బెదిరింపుల గురించి పోలీసులు అంతటితో వదలివేశారు. అనుమానితుల జాబితాలో హంతకులు ఉన్నట్లు పోలీసులకు చెప్పలేదు. హత్యకు ముందు తన దుకాణానికి వచ్చిన దుండగుల గురించి హతుడికి ఎలాంటి అనుమానం లేనందున అందరి మాదిరి కొలతలు తీసుకొనేందుకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నది. నిజంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే అతను కొద్ది రోజులు దుకాణాన్ని కూడా మూతపెట్టి ఉండేవాడు. లేదా నూపుర్‌ శర్మ పార్టీ బిజెపి నేతలను సంప్రదించి ఉండేవాడు. ఏది ఏమైనా జరిగింది దారుణం. పర్యవసానాలను ఊహించి ఉంటే తన ప్రాణం మీదకు తెచ్చుకొనేవాడే కాదు. కనుక విద్వేషాన్ని రెచ్చగొట్టే వాట్సప్‌ సందేశాలను, సోషల్‌ మీడియా పోస్టులను పది మందికి పంచే ఘనమైన పనులకు స్వస్థి పలకటం మంచిదని ఈ ఉదంతం కొందరికైనా కనువిప్పు కలిగిస్తుందా !


దర్జీ దారుణ హత్య ఉదంతం గురించి, అంతకు ముందు నూపుర్‌ శర్మ మాటల గురించి కొన్ని టీవీ ఛానళ్లు చర్చలు నిర్వహించాయి. వాటిలో పాల్గొన్న సంఘపరివార్‌కు చెందిన బిజెపి, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థల ప్రతినిధులెవరూ నూపుర్‌ శర్మ నోటి దూలను ఖండించకపోగా పరోక్షంగా సమర్ధించారు. మహమ్మద్‌ ప్రవక్త మీద కొందరు ముస్లింలే గతంలో మాట్లాడారని, నూపుర్‌ శర్మ వాటిని తిరిగి చెప్పారు తప్ప వేరు కాదని వాదించటమే కాదు, వాటి గురించి ముస్లిం పెద్దలు ఎందుకు నోరు విప్పటం లేదంటూ అడ్డుసవాళ్లు విసురుతున్నారు. అలాంటి చర్చలను చూసిన తరువాత కనయలాల్‌ వంటి వారికి అందునా బిజెపి బలంగా ఉన్న రాజస్తాన్‌లో మరింత ప్రోత్సాహం కలగదా ?


కనయలాల్‌ హత్య మొత్తం హిందువుల మీదనే జరిగిన దారుణంగా కొందరు చిత్రిస్తున్నారు. అదే ప్రమాణాన్ని వర్తింప చేస్తే నూపుర్‌ శర్మ నోటి దూల తమందరికీ ఉన్నట్లు హిందువులు అంగీకరిస్తారా ? కర్ణాటకలో సాహితీవేత్త కులుబుర్గి, జర్నలిస్టు గౌరీలంకేష్‌, మహారాష్ట్రలో గోవిందపన్సారే, నరేంద్ర దబోల్కర్‌ను హత్యచేశారు. వారంతా పుట్టుకతో హిందువులే , వారిని హతమార్చిందెవరు ? హంతకులకు వారితో ఎలాంటి పాతకక్షలు లేవు. విమర్శనాత్మక, భిన్నాభిప్రాయాన్ని సహించలేని కాషాయతాలిబాన్ల పనే కదా ! కనయలాల్‌ హంతకులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అనేక ఉదంతాలలో క్షణిక ఆవేశంలో బాధితుల కుటుంబాలు అలాంటి డిమాండ్లు చేస్తుండవచ్చు. అది చట్టబద్దం కాదు. ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక చోట్ల బూటకపు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లను ముందుకు తెస్తున్న నేపధ్యం ఇలాంటి చట్టబద్దంగాని డిమాండ్లను ముందుకు తేవటంలో ఆశ్చర్యం లేదు. మరి పై నలుగురి కేసుల్లో , ఇతర సామూహిక దాడుల కేసుల్లో హంతకుల మీద కొన్ని సంస్థలు అలాంటి డిమాండ్‌ను ముందుకు తేలేదేం ?
ఉదయపూర్‌ దారుణానికి పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. నిజాల నిగ్గుతేల్చటానికి ఎవరు వద్దన్నారు.వారు నరేంద్రమోడీని చంపివేస్తామంటే వారినెవరన్నా సమర్ధించారా ? గత గుజరాత్‌ ఎన్నికలపుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని ఏకంగా నరేంద్రమోడీ చెప్పారు. తరువాత అదేమైంది, వాస్తవమా కాదా, ఎన్నికల్లో ఓట్ల కోసం అలా చెప్పారా? ఏం జరిగిందో చెప్పేవారు లేరు. కనయలాల్‌కు రక్షణ కల్పించటంలో రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు బిజెపి చెబుతోంది. దుండగులు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారని చెబుతున్నారు గనుక కేంద్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి ?


కనయలాల్‌ హత్యను సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టటం జనాలను భయపెట్టేందుకే అన్నది స్పష్టం. ప్రపంచమంతటా ఉగ్రవాదులు చేస్తున్నపనే అది. మధ్య ప్రదేశ్‌లో భవర్‌లాల్‌ జైన్‌ అనే 65 ఏండ్ల మతి స్థిమితం సరిగా లేని వృద్దుడు ఒక వివాహానికి వెళ్లి వస్తూ దారి తప్పాడు. మూడు రోజుల తరువాత అతను శవమై కనిపించాడు. తరువాత సామాజిక మాధ్యమంలో ఒక వీడియో వైరలైంది. దానిలో దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త ఆ వృద్ధుడిని కొడుతూ నీ పేరేమిటి, మహమ్మదేనా, ఆధార్‌కార్డుందా అని ప్రశ్నించినట్లుంది. భవర్‌లాల్‌ జైన్‌ది ప్రాణం కాదా? దాన్ని తీసిన వారి గురించి కాషాయ దళాలు మాట్లాడలేదేం ? ఎన్‌కౌంటర్‌కు డిమాండ్‌ లేదు.


బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే దుండగులు రెచ్చిపోతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పాలన, లక్షలాది మంది మిలిటరీ, పారామిలిటరీ ఉన్న జమ్మూ-కాశ్మీరులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అక్కడ స్థానిక, కేంద్ర నిఘా సంస్థలు అడుగడుగునా ఉంటాయి. బతకటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను, కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు హతమారుస్తున్నారు.దీనికి బిజెపి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లా ? ఉగ్రవాదులను ఎందుకు కనుగొనలేకపోతున్నారు, దాడులను ఎందుకు పసిగట్టలేకపోతున్నారు ? ఉదయపూర్‌ దారుణానికి నూపుర్‌ శర్మ మాటలకు సంబంధం లేదని, ఉగ్రవాదుల కుట్రలు నిరంతరం జరుగుతున్నాయంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి ఉగ్రదాడులు ఇప్పుడు జరుగుతున్నది నరేంద్రమోడీ ఏలుబడిలోని కాశ్మీరులో మాత్రమే. కనయలాల్‌ వలస కార్మికుడు లేదా కాశ్మీరీ పండిట్‌ కాదు, కాశ్మీరు నివాసీ కాదు. ఉగ్రవాదులు అతన్నే ఎందుకు బలితీసుకున్నట్లు ?


దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే, గర్హనీయమే, తీవ్రంగా ఖండించాల్సిందే. రాయిటర్స్‌ వార్తా సంస్థ, వికీపీడియా క్రోడీకరించిన సమాచార విశ్లేషణ ప్రకారం గోరక్షణ దళాల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారు 49 మందిని చంపివేశారు, 156 మంది గాయపడ్డారు. దాడులలో మూడు మినహా మిగిలినవన్నీ పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 నుంచి జరిగినవే. మరి ఈ దారుణాల సంగతేమిటి ? గోరక్షణ దళాల్లో ఎనభై శాతం నకిలీ అని నరేంద్రమోడీ చెప్పారు. వారిలో ఎందరిని శిక్షించారు ? దేశంలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఇవన్నీ నిదర్శనం. ఇక విద్వేష ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. ముస్లింలను చంపమని, మహిళల మాన మర్యాదలను మంటకలపాలని బహిరంగంగా పిలుపులు ఇచ్చిన వారు స్వేచ్చగా తిరుగుతున్నారు. వారి వీడియోలు అందరికీ అందుబాటలో ఉన్నాయి. ఉదయపూర్‌ ఉదంతానికి వీటన్నింటితో పరోక్ష సంబంధం లేదా ? కనయలాల్‌ హంతకులు మహమ్మద్‌ రియాజ్‌, గౌస్‌ మహమ్మద్‌. వారి వెనుక ఉన్నది విదేశీ ఉగ్రవాదహస్తం, పథకమూ కావచ్చు. కానీ దానికి అవకాశం ఇచ్చింది బిజెపి నేత నూపుర్‌ శర్మ నోటి దూల కాదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

25 Saturday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adani Coal, Ambani and Adani, Ambani’s Reliance, BJP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఎవ్విరిబడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్‌ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్‌ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.


ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ కంపెనీ సిఇవో బెజోస్‌ భారత్‌ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్‌ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్‌ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్‌ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్‌ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్‌ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్‌ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం ముకేష్‌ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్‌, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.


రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్‌ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్‌, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్‌ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్‌ 7.8, టర్కీ 6.7, పోలాండ్‌ 4.4, ఫ్రాన్స్‌ 4.3, భారత్‌ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్‌ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్‌ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.


ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్‌ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.


కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్‌ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్‌ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !

21 Tuesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Colombian presidential election 2022, first left-wing president in Colombia, Gustavo Petro, Latin American left


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటు కానుంది. కొలంబియాలో ఏడు దశాబ్దాల క్రితం 1948 ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జార్జి ఎలిసెర్‌ గైటెన్‌న్ను హత్య చేశారు. అప్పటి నుంచి అక్కడ జరిగిన అనేక పరిణామాల్లో వామపక్ష శక్తులను అణచివేశారు.తాజాగా ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి తుది విడత ఎన్నికలలో వామపక్ష, పురోగామి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధి గుస్తావ్‌ పెట్రో విజయం సాధించారు. పెట్రోకు 50.5శాతం ఓట్లు రావటంతో విజేతగా ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. తొలి విడత రెండు వారాల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. ఇప్పుడు రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 47.3శాతం వచ్చాయి.


ఎన్నికల్లో పెట్రో విజయం లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష పాలిత దేశాలు, ఇతర చోట్ల ఆనందాతిరేకాల వెల్లడి, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఏ విధంగానైనా సరే పెట్రోను ఓడించాలని చూసిన అమెరికా, మితవాద శక్తులకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్ల రీత్యాపెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తాన్ని 33 విభాగాలుగా చేసి జనాభాను బట్టి 168కి గాను 162 స్థానాలకు ఎన్నికలు జరిపారు. దామాషా ప్రాతిపదికన వచ్చిన ఓట్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. మార్చి ఎన్నికల్లో దిగువ సభలో వామపక్ష కూటమికి 16.78శాతం ఓట్లు 27 సీట్లు రాగా సోషల్‌డెమోక్రటిక్‌ శక్తిగా వర్ణితమైన లిబరల్‌ పార్టీకి 14.27 శాతం ఓట్లు 32 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నింటిని మితవాదులు, ఇతరులు గెలుచుకున్నారు. ఎగువ సభలోని 100 స్థానాలకు గాను వామపక్ష కూటమి 20 సీట్లు తెచ్చుకుంది. పార్లమెంటులోని ఈ పొందిక రానున్న నాలుగు సంవత్సరాల్లో వామపక్ష ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలను ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. గుస్తావ్‌ పెట్రోను అభినందిస్తూ వామపక్షాలకు చెందిన అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, చిలీ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌, పెరూ అధ్యక్షుడు పెరో కాజిలో, బొలీవియా అధినేత లూయిస్‌ ఆర్సీ, మెక్సికో అధినేత లోపెజ్‌ ఒబ్రాడోర్‌, వెనెజులా నేత నికొలస్‌ మదురో సందేశాలను పంపారు.


అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో మాదిరే కొలంబియాలో కూడా ఉదారవాద విధానాలతో లబ్దిపొందిన శక్తుల పలుకుబడి తక్కువేమీ కాదు. గుస్తావ్‌ పెట్రో గెలిచినప్పటికీ ఓట్లశాతం సగమే అన్నది గమనించాలి. అందుకే ఈ మార్పును కూడా కొందరు విప్లవంగా పిలుస్తున్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇలాంటి పరిణామంతో చరిత్రను తిరగరాశామని అనేక మంది భావిస్తున్నారు. తొలిసారిగా దేశ చరిత్రలో ఆఫ్రికన్‌ సంతతికి చెందిన (ఆఫ్రో-కొలంబియన్‌) ఫ్రాన్సిమార్క్వెజ్‌ తొలిసారిగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మానవహక్కుల, పర్యావరణ హక్కుల ఉధ్యమకారిణిగా ఉన్నారు. గుస్తావ్‌ పెట్రో ఎం 19 గెరిల్లాగా 1980దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజధాని బగోటా మేయర్‌గా పనిచేసి ప్రజల మన్ననలందుకున్నారు. మంచి ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్మికవర్గం, ఇతర సామాజిక తరగతులు పెట్రో మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొలంబియా మితవాద శక్తులు దుర్మార్గాలకు మారుపేరు, వారికి అమెరికా, ఇతర దేశాల మితవాదుల అండదండలు, కార్పొరేట్ల మద్దతు పూర్తిగా ఉంది. ప్రస్తుతానికి విధిలేక పెట్రో గెలుపును అభినందించినప్పటికీ ఎలాంటి కుట్రలకు పాల్పడతారో చెప్పలేము. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో అలాంటి పరిణామాలు జరినందున వామపక్ష శక్తులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. 2016లో ఎఫ్‌ఏఆర్‌సి అనే గెరిల్లా సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొని ఐదు దశాబ్దాల అంతర్యుద్ధానికి స్వస్తి పలికినప్పటికీ ఒప్పంద అంశాలను సరిగా అమలు జరపలేదనే విమర్శలున్నాయి.రెండు లక్షల 60వేల మంది ప్రాణాలు కోల్పోగా 70లక్షల మంది అంతర్యుద్ధంలో కొలువులు, నెలవులు తప్పారు. అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా ఇప్పటి వరకు ఉన్న పాలకులు పక్కనే ఉన్న వెనెజులాతో శత్రుపూరితంగా ఉన్నారు.తాను అధికారానికి వస్తే సంబంధాలు నెలకొల్పుకుంటానని పెట్రో ప్రకటించారు. ఆర్ధిక రంగానికి వస్తే చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని చేసిన ప్రకటన ఇప్పటికే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళన కలిగిస్తున్నది.


ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఫ్రాన్సియా 1981లో ఒక కష్టజీవుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గని కార్మికుడు, తల్లి మంత్రసాని. ఫ్రాన్సియా కూడా బాలకార్మికురాలిగా బంగారు గనిలో పని చేశారు.తరువాత ఇంటిపని కార్మికురాలిగా ఉంది. పదహారేండ్లకే తల్లయింది. ఇద్దరు బిడ్డల తరువాత ఆమె శాంటియాగో విశ్వవిద్యాలయంలో చేరి లాయర్‌గా పట్టా పుచ్చుకుంది. బాల్యం నుంచీ గనుల వాతావరణంలో పెరగటం, గనుల కంపెనీలకు అప్పగించేందుకు అడవుల నుంచి సమీప గ్రామాల నుంచి వేలాది మందిని తొలగించటం, అడవుల నరికివేతను చూసి ఉద్యమకారిణిగా మారింది. గనుల వలన కాలుష్యంగా మారిన ఒక నదిని పరిరక్షించాలని సాగించిన ఆందోళనలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పర్యావరణ నోబెల్‌ బహుమతిగా ప్రసిద్ది చెందిన గోల్డ్‌మన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ బహుమతిని పొందారు. స్థానిక తెగల ఆమోదం లేకుండా అక్రమంగా అనుమతించిన గనుల రద్దు కోరుతూ ఆమె ముందుకు రావటంతో గనుల యజమానుల అండతో ఏర్పడిన సాయుధ ముఠాలు ఆమెను బెదిరించాయి. దాంతో ఆమె 2014లో తన నివాసాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తనతో పాటు బలవంతంగా గెంటివేసిన ఆఫ్రో-కొలంబియన్లను సమీకరించి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని బగోటాకు వచ్చారు. అక్రమ గనుల నుంచి తమ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపాలని డిమాండ్‌ చేశారు. గెరిల్లా సంస్థతో శాంతి చర్చలకు ప్రభుత్వం పూనుకున్నపుడు నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాంతో మరొకసారి ఆమెను సాయుధ ముఠాలు బెదిరించటమే కాదు హత్యా ప్రయత్నం కూడా చేశాయి. ఆమె మంచి వక్త కూడా. పోరుబిడ్డగా గణుతికెక్కటం, విస్మరణకు గురైన ప్రతినిధిగా గుర్తింపు, ఆమె సామాజిక తరగతి వంటి అనేక అంశాలు వామపక్ష కూటమిలో ఉపాధ్యక్షపదవికి ఆమెను ముందుకు తెచ్చాయి.


ఎన్నికల ప్రచారంలో ఆమె అర్హత గురించి ప్రత్యర్ధులు ప్రశ్నించారు, ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం ఎంత, గుస్తావ్‌ పెట్రోతో కలసి దేశాన్ని పాలించేందుకు ఉన్న అర్హత ఏమిటి వంటి ప్రశ్నలను తాను అనేక మంది నుంచి ఎదుర్కొన్నానని ఫ్రాన్సియా చెప్పారు. తమను గౌరవ ప్రదంగా బ్రతకనిచ్చేందుకు తనను ప్రశ్నించిన వారు ఎందుకు అనుమతించలేదు, ఎనభై లక్షల మందిమీద దశాబ్దాల తరబడి హింసకొనసాగేందుకు వారి అనుభవాన్ని ఎందుకు వినియోగించినట్లు , దేశ ప్రజలందరూ శాంతితో బతికేందుకు వారి అనుభవం ఎందుకు పనికిరాలేదని తనలో తాను ప్రశ్నించుకునేదాన్నని ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్పారు. ఎన్నికల్లో విజయం ఖరారైన తరువాత అభిమానులనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో తన విజయాన్ని సామాజిక, మైనారిటీ తరగతుల పోరాటానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.


ఒకవైపు మితవాద – పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్‌ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్‌ డ్యూక్‌ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది.


వామపక్ష విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు కొందరు చూస్తున్నారు. లాటిన్‌ అమెరికాలో వామపక్షాల గెలుపు వాటి భావజాలం మీద ఉన్న అభిమానం కంటే అవి ముందుకు తెచ్చిన ప్రజాకర్షక విధానాల వల్లనే జనం వాటివైపు మొగ్గుతున్నట్లు సూత్రీకరిస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌, అమెరికా ఆదేశించిన విధానాలను అమలు జరిపిన పాలకులు కార్పొరేట్లకు పెద్ద పీటవేసి జనాన్ని విస్మరించిన కారణంగా అక్కడ తలెత్తిన నిరసన, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. అందుకోసం అనేక దేశాల్లో నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా తలెత్తిన సాయుధ తిరుగుబాట్లకు వామపక్ష శక్తులు నాయకత్వం వహించాయి. ఈ ప్రాంత దేశాల్లో ఎంతగా అణచివేతకు పూనుకుంటే అంతగా తిరుగుబాట్లు ఉండటంతో పాలకవర్గాలు మిలిటరీ నియంతలకు బదులు పచ్చిమితవాద శక్తులను, వారికి అండగా కిరాయి మూకలను రంగంలోకి దింపాయి.ప్రహసన ప్రాయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మార్చినప్పటికీ ఎన్నికలకు అవకాశం ఉండటంతో వామపక్ష శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని అధికారాన్ని పొందుతున్నాయి. దశాబ్దాల తరబడి అణచివేత, దోపిడీకి గురైన సామాన్యులకు కావాల్సింది తక్షణ ఉపశమనం. లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులంటే ఆ తరగతికి కిందికి వచ్చేవన్నీ కమూ ్యనిస్టు పార్టీలు కాదు. సంస్కరణలతో దోపిడీ నుంచి విముక్తి కలిగించవచ్చని నమ్మేశక్తులు, అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే వారు, అణచివేత, దోపిడీ వ్యతిరేక పోరాటంలో వామపక్ష శక్తులకు దగ్గరైన ప్రజాతంత్ర శక్తులూ వాటిలో ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఏకీభావం ఉన్న ఏకైక అంశం ప్రజాస్వామ్యం, కష్టజీవులకు తక్షణ ఉపశమనమే. అందువలన ప్రస్తుతం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేసేవి కాదు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఆ విధానాలకు ఉన్న పరిమితులు అర్ధం అవుతున్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే దోపిడీ శక్తులు తమ మౌలిక పునాదులకు ముప్పులేదని భావిస్తున్న కారణంగానే పరిమితంగానైనా సంక్షేమ చర్యలను ఆమోదిస్తున్నాయి. వాటిని కూడా సహించలేని దశ వస్తే లాటిన్‌ అమెరికా పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

20 Monday Jun 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

Agnipath, Agnipath stir, BJP, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


అగ్నిపథ్‌ పధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం.మనది పాకిస్థాన్‌, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పధకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పధకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు. ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్‌ సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు.


ఈ పధకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారని వార్తలు. ఈ పధకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తరువాతనే జూన్‌ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా ! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి ? ఈ పధకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హౌంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి.తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.


ఈ పధకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్దం అవుతున్నవారు పిలుపుఇచ్చినట్లు వార్తలు.దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. ఝార్కండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈనెల 24న నిరసన తెలుపున్నట్లు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ ప్రకటించారు. సోమవారం నాడు బంద్‌ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం.అగ్నిపథ్‌ పధకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పధకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం,క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పధకం గురించి విమర్శల వెనుక టూల్‌కిట్‌ గాంగ్‌ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఆరోపించారు. మరి ఆ గాంగ్‌ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒక వేళ అలాంటి గాంగ్‌ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్‌కిట్లకు టూల్స్‌ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించేవారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడేవారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్‌ కిట్‌ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.


తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్‌ విజయవర్గీయ. ఆ పెద్దమనిషి ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఏ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయ ఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చు గాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నాకంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్‌ నగరంలో ఒక పాతభవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్‌ హాకీ బాట్‌తో కొట్టటాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్‌ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది !


దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దపడి మిలిటరీలో చేరేందుకు సిద్దపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్‌కిట్‌ గాంగ్‌ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్‌ ఇలా మాట్లాడారు.” నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్‌ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు.దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం ” అని కైలాష్‌ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు.” అగ్ని పథ్‌ పధకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తైన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్‌ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు. ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం.రాష్ట్ర వీరులు-ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్‌కిట్‌ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు.” అన్నారు.నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా ?


దేశ యువతను అవమానించవద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పనిచేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్‌ మాటలద్వారా బోధపడిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చమత్కరించారు.బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా విమర్శించారు. మిలటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధికోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.” అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు.” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.


2018 ఏప్రిల్‌ 22న ఢిల్లీలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన హితవచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్‌ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధిలేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్‌ పధకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చెప్పిందేమిటి? ” మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేథావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు. ” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.


భారత్‌ బంద్‌ పిలుపుకు సైతం దారి తీసిన అగ్నిపథ్‌ పధకాన్ని నరేంద్రమోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ది పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాలవైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ది ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్‌ పధకంపై తలెత్తిన నిరసన. ఆ పధకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే-కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !

19 Sunday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Agneepath scheme, Agneepath scheme protest, BJP, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


పెట్రోలు, డీజిలు మీద వందల రెట్లు పన్నులు పెంచి ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకే అని చెబితే నిజమే కదా అనుకొని మాట్లాడకుండా అంగీకరించారు వారు. నరేంద్రమోడీ మీద ఏర్పడిన నమ్మకం అది.
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా చూస్తున్నామని చెబితే నోట్ల మార్పిడి కోసం పనులు మానుకొని బాంకుల ముందు వరుసల్లో నిలుచోవటం దేశభక్తి అని భావించారు. ఇదేమిటన్న వారిని ఎంతో అనుభవం ఉన్న నరేంద్రమోడీ అంత తెలివితక్కువ పని చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు.
రైతుల కోసం తెచ్చామని చెప్పిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఉద్యమించినపుడు మనం కర్షకులం కాదు కదా అని వారు ప్రేక్షక పాత్ర వహించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ సర్కార్‌ మోసం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారంలో ఉండగా వారు చేసిందీ అదే కదా ఎవరైనా అంతే అని పెదవి విరిచారు. మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నైపుణ్య అభివృద్ది పధకంతో మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలోనే ఉత్తమ నిపుణులుగా తయారవుతామని డాలర్‌ కలలు కన్నారు. ఎక్కడా అలాంటి జాడలు లేవు.
నాలుగుదశాబ్దాలల్లో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగులు పెరిగారన్న వార్తలు రాగానే అబ్బెఅబ్బె లెక్కలన్నీ తప్పు, సరిగా వేయలేదు, పకోడీల బండి పెట్టుకున్నవారికి కూడా ఉపాధికల్పించినట్లే కదా అని నరేంద్రమోడీ అన్నపుడు ఇదేదో తేడా కొడుతోంది అనుకున్నారు తప్ప మరొక రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు మూడేండ్ల నాటి కంటే నిరుద్యోగం ఇంకా పెరిగింది.
అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంటు చేయాలని వారు రోడ్ల మీదకు వస్తే మనకేమిటి సంబంధం, అసలు పనే లేదు కదా, మనవంతు వచ్చినపుడు చూసుకుందాంలే అని పక్కన నిలబడి చూశారు వారు. ఇప్పుడు మిలిటరీలో కూడా వాటికి తెరలేపారు.
ఎన్‌పిఎస్‌(నూతన పెన్షన్‌ ) కాదు ఓపిఎస్‌(పాత పెన్షన్‌ ) కావాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే వారికి ఏదో ఒక పెన్షన్‌ ఉంది. మాకసలు ఏ ఉద్యోగమూ లేదు కదా అని పట్టించుకోలేదు వారు. ఇప్పుడు మిలిటరీలో చేరినా మూడో వంతు మందికి ఉద్యోగమూ ఉండదు, నాలుగేండ్ల సర్వీసుకు పెన్షనూ ఉండదు.
ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంటే, తెగనమ్ముతుంటే మనకు పోతున్నదేమీ లేదు, నష్టాలు వచ్చే వాటిని అమ్మితే మంచిదే కదా అనుకున్నారు. ఇలా దేశంలో ఏం జరుగుతున్నా స్పందించకుండా పాలకుల మీద ఆశ, భ్రమలతో తమ కెరీరే ముఖ్యంగా బతుకుతున్న వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఎత్తివేసే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేస్తామని నమ్మబలుకుతున్నారు.


దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఇంట్లో పరువు పోతోంది, బతుకుతెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం అని చూస్తే ఎక్కడా పర్మనెంటులేదు, దొరికిన పనికి సరైన వేతనమూ లేదు. గొర్రెతోక బెత్తెడు. జుమాటో, స్విగ్గీ వంటి గిగ్‌ ఉపాధే గతి,ఐనా ఆత్మగౌరవం కోసం తప్పుదనుకున్నారు. అప్రెంటిస్‌ పేరుతో ఏండ్ల తరబడి పర్మనెంటు పని చేయిస్తున్నా కలిసి రాలేదు లేదా మన ఖర్మ అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నింపరు, వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే, దగా దగా కుడి ఎడమల దగా అన్న నిరాశలో కూరుకుపోయారు తప్ప రోడ్లెక్కలేదు. సరిగ్గా అటువంటి స్థితిలో కరోనా వచ్చింది. ఎవరూ ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకున్నారు. రెండు సంవత్సరాలుగా మిలిటరీ రిక్రూట్‌మెంట్లు లేవు. అర్హత పరీక్షలు కొన్ని పూర్తి చేసుకొని చివరి పరీక్ష, నియామకాల కోసం ఎన్నో ఆశలతో ఈ ఏడాది వాటికి సిద్దమౌతున్న స్థితిలో…….. అగ్నిపథ్‌ పేరుతో చివరికి మిలిటరీలో కూడా తాత్కాలిక ఉద్యోగాలకు తెరలేపటం అగ్గిమీద గుగ్గిలం వేసినట్లయింది. ఏటా లక్షల మందిని మిలిటరీలో చేర్చుకోరు. పరిమితమే కావచ్చుగానీ ఎన్నో ఆశలతో ఉన్నవారికి ఇది ఆశనిపాతంగా మారటంతో ఒక్కసారిగా కడుపు మండి వీధుల్లోకి వచ్చి అగ్గివీరులుగా మారారు.మిలిటరీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం కావటమే, అలాంటి తమను కాంటాక్టు సైనికులుగా మారుస్తామనే సరికి రక్తం సలసలా కాగింది.


మరిగే నీరు వంద డిగ్రీల వేడెక్కిన తరువాతే ఆవిరిగా కొత్త రూపం సంతరించుకుంటుంది. అంటే దాని అర్ధం అప్పటివరకు నీటిలో మార్పేమీ జరగలేదని కాదు. వెలుపలికి కనిపించదు. గుణాత్మక మార్పుల తరువాత పరిణామాత్మక మార్పు సంభవిస్తుంది. మంచి రోజులు తెస్తామన్న పాలకుల మాటలు నమ్మి అవి జుమ్లా అని అర్ధం అవుతున్నా దేశంలో సంవత్సరాల తరబడి అసంతృప్తి పేరుకు పోయిన యువతలో అలాంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని చెప్పవచ్చు. 2022 జూన్‌ 14న అగ్నిపథ్‌ పధకానికి రక్షణ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిసింది. ఆ మరుసటి రోజున జెడి(యు) – బిజెపి పాలిత బీహారులో ప్రారంభమైన ఆందోళన దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. అనేక చోట్ల ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శుక్రవారం నాడు సికిందరాబాదులో కాల్పులకు దారితీసి ఒకరిని బలిగొన్నది. శనివారం నాడు బీహార్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న ఆందోళనను నీరుగార్చేందుకు గత రెండు సంవత్సరాలుగా ఎంపికలు లేవు గనుక ఈ ఒక్క ఏడాదికి గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సిఆర్‌పిఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని శనివారం నాడు మరొక ప్రకటన చేశారు. అసలు ఈ పధకమే వద్దు అంటుంటే ఈ బుజ్జగింపులతో జోకొట్టాలని చూస్తున్నారు. ఈ రెండు బిస్కెట్లు కాకుండా ఇంకా ఏమైనా వేస్తారేమో చెప్పలేము.


ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిన పదిలక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసేందుకు పూనుకున్నట్లు ప్రకటన వెలువరించటం, తరువాత అగ్నిపథ్‌ స్కీమును ప్రకటించటం ఒక ఎత్తుగడతో చేసిందే అన్నది స్పష్టం. చేదు మాత్రను మింగించటానికి పంచదార పూత పూసినట్లుగా పదిలక్షల ఖాళీల భర్తీ ప్రకటనగా భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పోస్టుల భర్తీ ఎంత ప్రహసనంగా ఉందో మిగతా చోట్ల దానికి భిన్నంగా ఉంటుందని అనుకోలేము. అందుకే పదిలక్షల పోస్టుల ప్రకటన నిరుద్యోగుల్లో పెద్ద స్పందన కలిగించలేదన్నది స్పష్టం. అది ఎంతకాలానికి నెరవేరుతుందో ఈ లోగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ అవుతాయో చెప్పలేము.
ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. దాని వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు, కమిషన్‌ ఏజంట్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేసినట్లుగానే అగ్నిపథ పధకాన్ని వ్యతిరేకిస్తున్న వారి వెనుక ప్రతిపక్షాలున్నట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలకే పరిమితం కాగా ఇది దేశమంతటా తలెత్తింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ వ్యవస్థలో అడితీదార్లు లేదా కమిషన్‌ ఏజంట్లను ఏ పార్టీ కూడా సమర్ధించలేదు. రైతులు ఢిల్లీలో ఏడాదిపాటు తిష్టవేస్తే దానివెనుక వారి పాత్ర ఉందంటూ బిజెపి, గోడీ మీడియాతో సహా దాని మద్దతుదార్లు పెద్ద చర్చ పేరుతో రచ్చ చేశారు. విధిలేక క్షమాపణలు చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నారు మంచిదే, మరి సదరు ఏజంట్లను ఇంకా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎందుకు కొనసాగిస్తున్నట్లు ? వారిని తొలగించవద్దని ఏ రైతు సంఘమూ కోరలేదే ! సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు. రైతుల మాదిరి మోసపోయేందుకు కుర్రకారు రైతులు కాదని ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. నిప్పుతో చెలగాటాలాడని నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడుతోందా ?


ఈ పధకాన్ని ఎందుకు తెచ్చారన్నది ప్రశ్న. తక్కువ వేతనాలతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసేందుకు టీచర్లు దొరుకుతున్నపుడు ఎక్కువ వేతనాలిచ్చి ప్రభుత్వం ఎందుకు నియమించాలన్న ప్రపంచబాంకును సంతృప్తి పరచేందుకు స్కూళ్లలో విద్యావలంటీర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రైల్వేల వంటి చోట్ల పాక్షిక ప్రయివేటీకరణ, రిటైరైన సిబ్బంది నియామకాలు, వివిధ శాఖల్లో పొరుగుసేవలు, కాంట్రాక్టు సిబ్బంది, అప్రెంటిస్‌ వంటివన్నీ ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల ఫలితమే. వేతనాలు, అలవెన్సులు, సామాజిక భద్రతా పధకాల ఖర్చు లేకుండా చేసేందుకే ఇదంతా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు సైతం వర్తింపచేసి సైనికుల పెన్షన్‌ బిల్లును తగ్గించుకొనేందుకు నాలుగేండ్ల పాటు పని చేసే నియామకాలకు శ్రీకారం చుట్టింది.


2014 లోక్‌సభ ఎన్నికల తరుణంలో మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న వారి కుటుంబాల ఓట్లు పొందేందుకు ఒకే రాంకు-ఒకే పెన్షన్‌ వంటి వాగ్దానాల సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగేండ్ల సర్వీసుతో అలాంటి రాంకులు ఉండవు-అసలు పెన్షనే ఉండదు. ఈ పధకంలో చేరిన వారిలో 25శాతం మందిని ప్రతిభ ఆధారంగా పర్మనెంటు చేస్తారట. అంటే శిక్షణ ముగిసిన దగ్గర నుంచి తన తోటివారిని ఎలా వెనక్కు నెట్టి తాను పర్మనెంటు ఎలా కావాలా అన్న తపన తప్ప వారిలో మరొకటి ఉంటుందా ? బుట్టలో తవుడు పోసి కుక్కలను ఉసికొల్పినట్లుగా ఉండదా ! ఇప్పటికే సివిల్‌ సిబ్బందిలో ప్రమోషన్లు, మంచి పోస్టులు, స్థలాల కోసం ఎలాంటి అవాంఛనీయపోటీ, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిందే. రేపటి నుంచి అదే మిలిటరీలో పునరావృతం కాదనే హామీ ఏముంటుంది.


నాలుగేండ్ల సర్వీసులో చేరి వెలుపలికి వచ్చిన వారికి సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీలో చేరేందుకు తిరిగి ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టి చేర్చుకుంటారని నమ్మబలుకుతున్నారు. ఈ బిస్కెట్లన్నీ ఎందుకు ? కొనసాగింపుగా వారిని తరువాత పారామిలిటరీ, ఇతర భద్రతా సంస్థల్లో, ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రాల సాయుధ బలగాల్లో చేరుస్తామని చెబితే గొడవే ఉండదు. రాష్ట్రాలకు శిక్షణా భారం తప్పుతుంది. వెంటనే విధుల్లోకి వచ్చే సిబ్బంది దొరుకుతారు కదా ! ఆ విధంగా వివిధ విభాగాల్లో పర్మనెంటుగా నియమిస్తామని, వారి పెన్షన్‌కు ఢోకా ఉండదని ముందుగానే హామీ ఇస్తే ఇంత జరిగేది కాదు కదా ? ఆర్మీలో ఒకసారి చేరిన తరువాత నిరంతరం ఫిట్‌నెస్‌ ఉండేందుకు చూస్తారు, తిరిగి పారామిలిటరీకి పరీక్ష ఎందుకు ? అందుకే ఇవన్నీ తప్పుదారి పట్టించే వాదనలు. దీనికి ఎలాంటి ప్రతిఘటన లేకపోతే తరువాత వంతు సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీ, ఇతర దళాలకు దీన్ని పొడిగిస్తారు. అదే బాటలో రాష్ట్రాలు ఇప్పుడున్న హౌంగార్డులకు తోడు నాలుగేండ్ల పోలీసులను ప్రవేశపెట్టవనే హామీ ఏముంది? విదేశాల్లో ఇలాంటి పద్దతి ఉంది అని చెబుతున్నారు. ఉంటే ఉండవచ్చు, విదేశాల నుంచి అన్ని అంశాలను తీసుకుంటూ దీన్ని కూడా తీసుకుంటే అదొక దారి అలా లేదే. అమెరికాలో ఇలాంటి సైనికులతో పాటు అక్కడ నిరుద్యోగులకు ఉన్న భృతి, సామాజిక భద్రతా పధకాలను ఇక్కడ కూడా ముందు ప్రవేశపెట్టి యువతకు భరోసా కల్పించిన తరువాత ఇలాంటి వాటిని ప్రవేశపెడితే అదొక తీరు, మోడీ సర్కార్‌ అలాలేదే !


రెగ్యులర్‌ ఆర్మీకి వంద మందిని ఎంపిక చేయాలంటే 1000 మందిని పిలిచి ఫిల్టర్‌ చేస్తారట. ప్రతిభావంతులైన యువకులు మిలిటరీలోకి వస్తారట. ఇప్పుడు తీసుకుంటున్నవారికి కూడా అన్ని పరీక్షలు పెట్టే తీసుకుంటున్నారు కదా ! ఆరుపదులు దాటిన వారినేమీ తీసుకోవటం లేదు కదా !యువత మరీ అంత అమాయకంగా ఉందని భావిస్తున్నారా ? ఫిల్టర్‌లో కొత్తేముంది, ప్రతి ఉద్యోగానికి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సీట్లకు జరుగుతున్నది అదే కదా ! కానీ అగ్నిపథ్‌లో వంద మందికి గాను ఐదు వందల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారిలో వంద మందిని పర్మనెంటు చేసి మిగతా నాలుగువందల మందికి నాలుగేండ్ల తరువాత పన్నెండు లక్షలు ఇచ్చి ఇంటికి పంపుతారని, ఇతర రంగాల్లో సర్దుబాటు చేస్తారని, నాలుగేండ్లు ఇంటి దగ్గర ఉన్నవారు ఇంత సంపాదించగలరా అంటున్నారు. దేశంలోని యువత అందరికీ ఇలాగే మిలిటరీగాక పోతే ఎవరికి తగిన రంగంలో వారికి శిక్షణ ఇచ్చి అందరికీ నాలుగేండ్ల ఉపాధి, పన్నెండు లక్షలు ఇచ్చే పధకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. స్వచ్చందంగా ఎవరికి నచ్చిన దానిలో వారు చేరతారు. ఎలాంటి ఆందోళనలు ఉండవు. దేశానికి నిపుణులైన పనివారు దొరుకుతారు కదా !


ఉట్టికెగరలేని వారు స్వర్గానికి ఎగరగలరా ! కరోనాలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన రైలు ఛార్జీలు ఎవరు భరించాలి అన్న చర్చకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వ పెద్దల నిర్వాకం చూసిన తరువాత ఇంతటి మహత్తర లబ్ది కల్పిస్తారని చెబితే నమ్మేదెవరు ? పకోడీల బండి ద్వారా పొందే ఉపాధి కూడా ప్రభుత్వం కల్పించినదానిలో భాగంగానే లెక్కించాలని ప్రధాని నరేంద్రమోడీ గారు సెలవిచ్చిన సంగతి మరచిపోగలమా ? కార్పొరేట్లకోసం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతుల కోసం అని నమ్మించేందుకు చూశారు, వీలుగాక క్షమాపణ చెప్పి మరీ వాటిని రద్దు చేశారు.అదే సందర్భంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా దాని ఊసులేదు. ఇలాంటి వారి మాటలు నమ్మాలని వాట్సాప్‌ పండితులు బోధలు చేస్తున్నారు. జైకిసాన్‌ అంటూనే వారికి వెన్నుపోటు పొడిచేందుకు చూసిన వారు ఇప్పుడు జై జవాన్లకు పెన్షన్‌ లేకుండా చేసేందుకు పూనుకున్నారు.


ఆందోళనలు చేస్తున్నవారు హింసాకాండకు పాల్పడటాన్ని ఎవరూ సమర్ధించరు,హర్షించరు. అలాంటి చర్యలకు పాల్పడటానికి ప్రత్యేక శిక్షణ ఎలా ఉంటుందో కళ్ల ముందే కరసేవ పేరుతో బాబరీ మసీదును కూల్చివేసిన తీరు వెల్లడించింది. భక్తులుగా వచ్చిన వారు గునపాలు, పెద్ద సుత్తులు ఎందుకు తెచ్చారు, ఎలా తెచ్చారు అని అడిగి తెలుసుకొని ఉంటే, ఈ రోజు రైళ్లు తగులబెడుతున్న వారికి అవి ఎలా దొరుకుతాయో తెలిసి ఉండేది. దేశం కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దపడి సైనిక ఎంపికలకు సిద్దం అవుతున్నవారు కడుపుమండితే ఎంతకైనా తెగిస్తారు. ఇలా చెప్పటమంటే వారిని సమర్ధిస్తున్నట్లు కాదు. బాబరీ మసీదును కూడా కడుపు మండినవారు కూల్చారుతప్ప మాకేమీ సంబంధం లేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అప్పుడు చెప్పారు కదా ! వాట్సప్‌ గ్రూపుల ఏర్పాటు వాటి ద్వారా సందేశాలు, కుట్రల గురించి చెబుతున్నారు. నిజమే అనుకుందాం కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు ? నివారణ చర్యలేమి తీసుకున్నట్లు ?


. 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు. దాన్ని ముందుగా చర్చిస్తే నల్లధనం ఉన్నవారు జాగ్రత్తపడతారని చెప్పకుండా చేశారనుకుందాం. కానీ దాని గురించి కూడా ఆశ్రితులకు ముందుగానే ఉప్పందించారన్న విమర్శలు తెలిసిందే. అందుకే నల్లధనం ఒక్కపైసా కూడా దొరకలేదు. ఒకేదేశం-ఒకే పన్ను పేరుతో తగిన సన్నాహం లేకుండా తెచ్చిన జిఎస్‌టి ఎలాంటి పర్యవసానాలకు దారి తీసిందో చూశాము. జమ్ము కాశ్మీరు అసెంబ్లీ తీర్మానం, చర్చతో నిమిత్తం లేకుండా ఆర్టికల్‌ 370,ఏకంగా ఆ రాష్ట్రాన్నే రద్దు చేసిన తీరు తెలిసిందే. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయం గురించి మూడు సాగు చట్టాలను ఎంత హడావుడిగా ప్రహసన ప్రాయంగా చేసిందీ చూశాము. వాటి అనుభవం నుంచి పాఠాలేమీ నేర్చుకున్నట్లు లేదు. మిలిటరీ రిక్రూట్‌మెంటులో సమూల మార్పులను తలపెట్టి అగ్నిపథ్‌ పధకాన్ని తీసుకువచ్చే ముందు దానిలోని అంశాలను ముసాయిదా రూపంలో చర్చకు పెట్టకుండా మూసిపెట్టి ఆకస్మికంగా అమల్లోకి తీసుకురావటం ఏ రకపు ప్రజాస్వామ్యం ? అదేమీ గుట్టుగా ఉంచాల్సింది కాదు కదా !

యువతలో ఉన్న అసంతృప్తి బిజెపి-జెడియు ఏలుబడిలో ఉన్న బీహార్‌లో ఈ ఏడాది జనవరిలోనే వెల్లడైంది. రైల్వే ఉద్యోగార్దులు నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కేంద్ర పెద్దలు తమకు పార్లమెంటులో మంద మెజారిటీ ఉంది కదా అని నిరంకుశంగా ఏది బడితే అది చేసి ఆమోదం పొందాలనే ఒక అప్రజాస్వామిక వైఖరితో ముందుకు పోతున్నారు. అది కుదరదని అగ్నిపథ్‌పై స్పందన వెల్లడించింది. దీన్నుంచైనా గుణపాఠం తీసుకొని లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికవర్గంపై తలపెట్టిన దాడిని వెనక్కు తీసుకుంటారా ? ఇప్పుడు అగ్నిపథ్‌ గురించి చర్చించేందుకు సిద్దం అని కేంద్ర మంత్రి అంటున్నారు. ఎవరితో చర్చిస్తారు, ఆ పని ముందే ఎందుకు జరగలేదు. ప్రతి ఆందోళనకూ ఉన్నట్లే ఇప్పుడు తలెత్తిన ఆందోళనకు పరిమితులు ఉంటాయి. మిలటరీలో చేరాలనుకొనే వారికి భ్రమలు తొలుగుతున్నాయి. మిగతా వారు వారి మాదిరి స్పందించకపోవచ్చు. రేపు తమ ఉద్యోగాలకూ, ఉపాధికి ఇదే గతి అన్న ఆలోచనకు తాజా ఆందోళన నాంది పలుకుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ మీద పెట్టుకున్న – పెంచుకున్న భ్రమలను పటాపంచలు చేస్తుంది. ప్రతి మహానదీ ప్రారంభంలో చిన్న వాగు-వంక మాదిరే ప్రారంభం అవుతుంది. ఇదీ అంతే !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

15 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Alberto Fernández, Joe Biden, Latin America, Latin American left, Mexican Lopez Obrador, Organization of American States (OAS), Summit of the Americas 2022, The People’s Summit for Democracy


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురులేదని ప్రపంచం ముందు కనిపించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల తగులుతున్న ఎదురుదెబ్బలు అంతరంగంలో అమెరికా పాలకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తున్నాయి. 2022 జూన్‌ ఆరు నుంచి పదవ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ(లాటిన్‌) అమెరికా తన వెనుకే ఉందని చెప్పుకునేందుకు చూసిన బైడెన్‌ యంత్రాంగానికి చివరికి భంగపాటే మిగిలింది. శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ చేసిన ప్రకటన అమెరికా ఒక చెంపను వాయిస్తే సమావేశానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు మరో చెంప వాయించినట్లు మాట్లాడాడు.” కచ్చితంగా భిన్నమైన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశం జరగాలని మనం కోరుకుంటాం.హాజరుగాని వారి మౌనం మనల్ని సవాలు చేస్తున్నది. కాబట్టి మరోసారి ఇలా జరగకూడదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో జరిగే సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చే దేశాలకు మన ఖండంలోని సభ్య దేశాల హాజరుపై ఆంక్షలు విధించేే అధికారాన్ని ఇవ్వకూడదు.” అని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాల సంస్థ(సిఇఎల్‌ఏసి) ప్రోటెమ్‌ అధ్యక్షుడిగా కూడా ఫెర్నాండెజ్‌ పని చేస్తున్నాడు.లోపెజ్‌ బాటలో బొలీవియా, హొండురాస్‌, గౌతమాలా, సెంట్‌ విన్సెంట్‌, గ్రెనడా దేశాధినేతలు నడిచారు.ఎల్‌ సాల్వడార్‌, ఉరుగ్వే నేతలు కూడా ఇతర కారణాలతో పాల్గొనలేదు.


ఇదంతా లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వదేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా నిర్ణయానికి నిరసనే. ఈ సమావేశం ద్వారా అమెరికా సాధించదలచుకున్న లక్ష్యం ఏదైనప్పటికీ సమావేశ వేదిక మీద, వెలుపలా జరిగిన పరిణామాలు మరోసారి అమెరికా నలుగురి నోళ్లలో నానింది. ప్రత్యేకించి అమెరికా ఖండ దేశాలలో పెద్ద చర్చకు దోహదం చేసింది. దాని ద్వంద్వనీతిని బయట పెట్టింది. ఇంకేమాత్రం తమ మీద అమెరికా ఆధిపత్యం చెల్లదని లాటిన్‌ అమెరికా దేశాలు చెప్పకనే చెప్పటమే. అమెరికా పలుకుబడి బండారం ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌, నేటి ఉక్రెయిన్‌ సంక్షోభం అమెరికా బలహీనతలను, దాన్ని నమ్ముకుంటే నట్టేట మునగటమే అన్న పాఠం నేర్పింది.1994లో అమెరికాలోనే జరిగిన ఈ సంస్థ సమావేశాలతో పోల్చుకుంటే తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద మార్పును సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) పని తీరు తీవ్ర విమర్శలకు గురువుతోంది. అది పశ్చిమార్ధగోళంలో కేవలం అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక పని ముట్టుగా మారిందన్నది స్పష్టం. అమెరికాతో పాటు ఈ సమావేశాల్లో ఓఎఎస్‌ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. బొలీవియాలో ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటునేత జెనీనె ఆనెజ్‌ను అధ్యక్షురాలిగా చేశారు.(ఇప్పుడు ఆమె నేరంపై విచారణ జరుగుతున్నది) దానికి ఆమెరికా దేశాల సంస్థ (ఓఎఎస్‌) మద్దతు ప్రకటించింది. ఈ దుర్మార్గానికి అండగా నిలవటంతో పాటు బొలీవియాలోని సంకేత, సకాబా ప్రాంతాల్లో ఆనెజ్‌ ఏలుబడిలో జరిగిన మారణకాండ గురించి మౌనం దాల్చిన సంస్థ ప్రధాన కార్యదర్శి లూయిస్‌ అలమగ్రో పదవిలో కొనసాగటం ఏమిటని కొందరు ప్రతినిధులు లేవనెత్తినపుడు అతగాడికి కంటిచూపు తప్ప నోట మాట లేదు. మూడు దేశాలను ప్రజాస్వామ్యం పేరుతో మినహాయించి హైతీలో మాజీ అధ్యక్షుడు జువనెల్‌ మోషే హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న ఏరియల్‌ హెన్రీ, కొలంబియాలో ప్రతిపక్షాలను ఊచకోత కోయిస్తున్న ఇవాన్‌ డూక్‌ను మానవహక్కుల పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న అమెరికా ఎలా ఆహ్వానించిందని కొందరు ప్రశ్నించారు. క్యూబా, వెనెజులా, నికరాగువా దేశాల ప్రభుత్వ నేతలను మినహాయించిన అమెరికా ఆ దేశాల ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన వారిని, అమెరికా ఇచ్చిన నిధులతో వివిధ సంస్థల పేరుతో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల మీద ధ్వజమెత్తే వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించింది. మరొక సభ్య దేశం గురించి తీర్పులు చెప్పే అధికారం ఏ దేశానికైనా ఎవరిచ్చారని అనేక దేశాల ప్రతినిధులు ప్రశ్నించారు. మూడు దేశాలను మినహాయించటాన్ని ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా దేశాల సంస్థను సంస్కరించాలని కోరారు. అనేక మంది కరీబియన్‌ దేశాధినేతలతో పాటు బెల్జి, అర్జెంటీనా, చిలీ అధినేతలు కూడా ఇదే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు.


మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్‌ 19ని సాకుగా చూపారు. ప్రపంచ అర్ధగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్‌లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదన్నది దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని 42దేశాల్లో నివసించే మూడోవంతు జనాభాపై చట్టవిరుద్దమైన ఆంక్షలను అమలు జరుపుతున్న అపర ప్రజాస్వామిక వాది. తనకు నచ్చని ప్రభుత్వాలను ఆ దేశాల పౌరులతోనే కూల్చివేయించే ఎత్తుగడ దీని వెనుక ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వెనెజులా మీద, తాజాగా రష్యా మీద ఆంక్షలను మరింతగా పెంచటం దానిలో భాగమే. దశాబ్దాల తరబడి క్యూబాను దిగ్బంధనానికి గురిచేసినా,వెనెజులా, నికరాగువా వంటి చోట్ల ప్రతిరోజూ కుట్రలు చేసినా దాని ఎత్తుగడలు ఎక్కడా పారలేదన్నది కూడా వాస్తవం. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వెనెజులా, ఇప్పుడు రష్యాలకు చెందిన విదేశాల్లోని ఆస్తులు, బంగారం వంటి వాటిని స్వాధీనం లేదా స్థంభింప చేసిన తరువాత అమెరికా ఆంక్షలకు గురైన దేశాలన్నీ అమెరికా డాలరుతో సంబంధం లేని లావాదేవీల కోసం చూడటం పెరుగుతోంది తప్ప అమెరికాకు లొంగటం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనే పేరుతో ఐరాస మానవహక్కుల సంస్థలో రష్యాకు స్థానం కల్పించకూడదనే అమెరికా తీర్మానానికి అనుకూలంగా 92 ఓట్లు వస్తే తటస్థం లేదా వ్యతిరేకంగా 13 అమెరికా దేశాలతో సహా 82 దేశాలున్నాయి. జనాభా రీత్యా చూస్తే అత్యధికులు ఈ దేశాల్లోనే ఉన్నారు.
లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత లోపెజ్‌ అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడించింది. లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాల్లో ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. గత మొరటు పద్దతులతోనే తన పెత్తనాన్ని సాగించాలని విఫలయత్నం చేస్తున్నది. వెనెజులాలో తన కుట్రలు విఫలమైన తరువాత ప్రతిపక్షనేత జువాన్‌ గుయిడో ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వాన్ని గుర్తించిన ట్రంప్‌ అవసరమైతే దాడులకు సైతం తెగబడతానన్న ప్రేలాపనలతో ఊగిపోయాడు. ప్రస్తుత బైడెన్‌ అలా నోరుపారవేసుకోకపోయినా అదేబాటలో నడుస్తున్నాడు. మదురోను తిరస్కరించినా గుర్తించిన జువాన్‌ గుయిడోను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు.


వామపక్ష శక్తులు అనేక చోట్ల అధికారానికి వస్తుండటం, తాము బలపరిచిన మితవాద శక్తులను జనాలు తిరస్కరిస్తుండటాన్ని గమనించిన తరువాత అక్కడి పరిణామాలు అమెరికన్లకు మింగుడుపడటం లేదు,వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్‌ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినపుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. అమెరికాకు మెక్సికో, గౌతమాలా, ఎల్‌సాల్వడార్‌, హొండురాస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తారు. ఈ దేశాలనేతలెవరూ లేకుండానే సమావేశాలు ముగిశాయి.


అమెరికా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు, వైఖరిని నిరసిస్తూ లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి పోటీగా అదే తేదీల్లో అదే నగరంలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు, ఉద్యమాల ప్రతినిధులతో పోటీగా ” ప్రజాస్వామ్యం కోసం ప్రజాశిఖరాగ్ర సమావేశాలు ” జరిగాయి. వివిధ అంశాలను చర్చించటంతో పాటు అమెరికా వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కూడా చేశారు. జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు మెక్సికోలోని తిజువానాలో కార్మికుల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కూడా వివిధ దేశాలకు చెందిన వారితో పాటు అమెరికా వీసాలు నిరాకరించిన క్యూబా, వెనెజులా, నికరాగువా తదితర దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గన్నారు. రెండు సమావేశాల్లో అమెరికా నిరంకుశ పోకడలతో పాటు వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఎలా సమీకరించాలో కూడా చర్చించారు. అమెరికా ఖండాల ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాస్‌ ఏంజల్స్‌ సమావేశాల్లో భౌతికంగా, ఆన్‌లైన్‌లో 250 సంస్థలకు చెందిన వారు భాగస్వాములైనారు. ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అధికారిక సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ కంచెవేసి నిరసనకారులను అడ్డుకున్నారు. నగరంలోని ఒక కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై ప్రజాసంస్థలు చర్చలు జరిపాయి. అమెరికా పెత్తందారీ పోకడలకు గురవుతున్న దేశాలకు బాసటగా నిలుస్తామని దీక్ష పూనాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

13 Monday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, WAR

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Narendra Modi Failures, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

10 Friday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Fringe elements, Narendra Modi, Narendra Modi Failures, Nupur Sharma, Qatar, RSS

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: