• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2022

2024 ఎన్నికలు : పనామాలో కూడా ఎర్రజెండా ఎగురుతుందా ?

30 Saturday Jul 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Latin America’s Right, Latin American left, panama, panama canal, protests in Panama


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్‌ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు.2010దశకం నుంచి పెరుగుతున్న ఎర్ర మంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదానిమీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్‌ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది. ఇప్పుడు గుస్తావ్‌ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్దరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది.


జో బైడెన్‌ శ్రద్దలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, తూర్పు ఐరోపాలనే కాదు, మూర్ఖత్వం, అచేతనం, పట్టించుకోని కారణంగా పెరటి తోటగా ఉన్న లాటిన్‌ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు.రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్‌ ఏలుబడిలో కోల్పోయాము. బ్రెజిల్‌ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాలను చైతన్యవంతులను గావించేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవటాన్ని ప్రపంచంలోని మన స్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేఠీ వేసిన వారందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి. దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్‌ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సదరు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించుకోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేకురాలు రాసినదానికి వాల్‌స్ట్రీట్‌ జనరల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధగోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి.లాటిన్‌ అమెరికాలో రష్యా,ఇరాన్‌, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాటవేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు.


అసలు పనామాలో ఏం జరుగుతోంది ? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలిపే 81కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తర- దక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా. జూలై ఆరవ తేదీన శాంటియాగో డి వెరాగువాస్‌ అనే చిన్న పట్ణణంలో ( ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు,జనం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది. బిల్లు- బెల్లు తప్ప మిగతావాటితో మనకేం పని అని వారు అనుకోలేదు. తరువాత దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరసన పాకింది.బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరువాత రైతులు, విద్యార్ధులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సివచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు, పదిహేడవ తేదీన గాలన్‌(3.78లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. మన ప్రధాని నరేంద్రమోడీ కొంత మేర సెస్‌లను తగ్గించారు.ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్థంభింప చేశారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు. ఇరవయ్యవ తేదీన పనామా కాథలిక్‌ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం-నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు.ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్‌ సబ్సిడీల వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్‌ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు.అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్దం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజకీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా తదుపరి ఏం జరగనుందో చెప్పలేము.


రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపీలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి.ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతుల వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జన ఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ఆపరేషన్‌ చేయాల్సిన చోట బాండ్‌ ఎయిడ్‌ వేసినట్లుగా అరకొర చర్యలు జనాన్ని సంతృప్తి పరచలేదు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది. జనవరి తరువాత చమురు ధరలు 50శాతం పెరిగాయి, నిరుద్యోగం పదిశాతానికి చేరింది.ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకో చూశాడు. దేశం ఆరున్నరశాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేకపోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.


లాటిన్‌ అమెరికాలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జన జీవితాలు మరింతగా దిగజారాయి. అంతకు ముందు 2018లోనే ఇరవై శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉండగా పదిశాతం మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. కరోనాకు ముందు ప్రయివేటు రంగంలో 8,73,750 మంది వేతన జీవులుండగా కరోనాలో 37శాతం మందిని తొలగించారు, 30శాతం మందినే కొనసాగించారు, 33శాతం మంది కాంట్రాక్టు ఒప్పందాలను సస్పెండ్‌ చేశారు, అంటే వారికి కూడా ఉపాధి లేదు.2021లో వారిని తిరిగి తీసుకున్నారు. ప్రభుత్వం పొదుపు పేరుతో పదిశాతం ఖర్చు కోతపెట్టి 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఆర్ధిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019వరకు 46బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్‌ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరువాత జరిగిన అవినీతి.


ఒకవైపు జనజీవితాలు దిగజారుతుంటే ఎంపీల వేతనాలు పెద్ద మొత్తంలో పెంచటమే కాదు, అనేక మందికి లాభాలు పొందే కాంట్రాక్టులను అప్పగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయానికి ఇటీవలి వెలపలి కారణంగా తోడై కార్మికుల్లో అసంతృప్తిని మరింత పెంచినట్లు వామపక్ష నేత, గత ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేసిన సాల్‌ మెండెజ్‌ చెప్పాడు. పాలకులు అవినీతిని సంస్థాగతం గావించారని ప్రముఖ గాయకుడు, రచయిత రేబెన్‌ బేడ్స్‌ విమర్శించారు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నాడు. అవినీతిని అరికట్టాలన్న జనం డిమాండ్‌ను పట్టించుకోకుండా ఎంపీలకు కాంట్రాక్టులు అప్పగించినట్లు పౌరశక్తి సంస్థ నేత చెప్పాడు. సంస్కరణలకు ఒక ప్రణాళికను ప్రకటించాలని ఐదు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. గత మూడు సంవత్సరాలలో సంక్షేమ చర్యలకు చేసిన ఖర్చుతో 16.5బి. డాలర్లు అప్పు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది.


పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ జనవరిలో చెప్పినదాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణ భారం జిడిపిలో 68.5 నుంచి 2021లో 64.2శాతానికి తగ్గింది. సామాజిక భద్రతా పధకాల రుణాలను పక్కన పెడితే అది 57.7శాతానికి తగ్గుతుంది.2020లో 17.9 ప్రతికూల వృద్ది రేటు నుంచి కోలుకొని 2021లో అంచనా వేసిన 12ను అధిగమించి 15శాతం వృద్ది నమోదైంది.2022, 2023లో వరుసగా 7,5శాతాల చొప్పును పెరుగుతుంది. దీర్ఘకాల మందగమనం నుంచి బయటపడుతుంది. పనామా కాలువ టోల్‌ ద్వారా, రాగి ఎగుమతులు ఆర్ధిక వృద్దికి చోదకాలుగా ఉన్నాయి.2021 నవంబరు వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 0.9 బి.డాలర్లుగా ఉన్న రాగి ఎగుమతులు 2.5బి డాలర్లకు పెరిగాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. ఏటా 13-14వేల ఓడలు ప్రయాణించే పనామా కాలువ ద్వారా కూడా గణనీయంగా రాబడి వస్తున్నది.


లాటిన్‌ అమెరికాలో తనకు తైనాతీలుగా ఉన్న వారిని అధికారంలో కూర్చోపెట్టిన గతం, వర్తమానం అమెరికాకు ఉంది. పనామా కూడా అలాంటిదే. పనామా కాలువను తన ఆధీనంలో ఉంచుకున్న అమెరికా అన్ని విధాలుగా లబ్దిపొందింది. కాలువ ప్రాంతంలో తన సైనిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన కొలంబియాలో నేటి పనామా ఒక ప్రాంతం. స్వచ్చందంగానే కొలంబియాలో చేరినప్పటికీ అక్కడ వేర్పాటు భావనలు తలెత్తాయి.పనామా కాలువ ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని అమెరికా తలపెట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. వేర్పాటువాదులను పాలకులుగా గుర్తించి 1903లో వారితో ఒప్పందం చేసుకుంది.2000 నాటికి కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించేందుకు 1979లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత 1984 కుట్రచేసి మిలిటరీ జనరల్‌ నోరిగానూ గద్దెపై కూర్చోపెట్టింది. అదే నోరిగా అటు అమెరికా సిఐఏ నుంచి ఇటు మాదకద్రవ్యాల మాఫియా నుంచి నిధులు పొందుతూ ఏకు మేకై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. దాంతో 1989లో అమెరికా మిలిటరీ దాడి చేసి నోరిగాను గద్దె దించి తనకు అనుకూలమైన శక్తులకు మద్దతు ఇచ్చింది.
పనామా చరిత్రను చూసినపుడు మితవాద, అమెరికా అనుకూల శక్తులదే అక్కడ పెత్తనం.2013లో బ్రాడ్‌ఫ్రంట్‌ పేరుతో నిర్మాణరంగ కార్మికనేత సాల్‌మెండెజ్‌ వామపక్ష పార్టీని ఏర్పాటు చేశాడు.2019 ఎన్నికల్లో అతనికి కేవలం 0.69శాతం, పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రంట్‌కు 1.26శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. వామపక్ష శక్తుల బలం పరిమితంగా ఉన్న పనామాలో 1930దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. బలం పెద్దగా లేకున్నా పనామా కాలువను జాతీయం చేయాలన్న ఆందోళనలో చురుకుగా ఉండటమే గాక తరువాత అధికారానికి వచ్చిన ఉదారవాదులకు మద్దతు ఇచ్చింది. వారు ప్రజానుకూల విధానాలకు తిలోదకాలివ్వటంతో 1984లో వెలుపలికి వచ్చింది, 1991లో పార్టీ గుర్తింపును రద్దు చేశారు.


వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ జూలై నెలలో జరిగిన ప్రజా ఉద్యమాలు ఆశక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందుగానే వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన – కాలు మోపితే ఖబర్దార్‌ అన్న చైనా !

28 Thursday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

China stern warning, Joe Biden, Nancy Pelosi, Nancy Pelosi Taiwan trip, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్‌లో అడుగు పెడతారా ? హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆమె మొండిగా వస్తే చైనా చూస్తూ ఊరుకుంటుందా ? తైవాన్ను నిషేధిత గగనతలంగా ప్రకటించే అవకాశం ఉందా ? ఒక వేళ నాన్సీ పెలోసీ విమానం గనుక తైవాన్‌ ప్రాంతానికి వస్తే చైనా విమానం లేదా విమానాలు దాన్ని వెంబడిస్తాయని, తైవాన్‌ గడ్డపై దిగకుండా చూస్తాయని అనధికార వార్తలు. ఒక వేళ అమెరికా విమానవాహక యుద్ద నౌకలు గనుక తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోంది ? ఉక్రెయిన్‌ వివాదంలో ఆశించినట్లుగా రష్యాను దెబ్బతీయలేకపోతున్నందున ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పధకం వేసిందా ? పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో గెలుపుకోసం బైడెన్‌ పడుతున్న పాట్లా ? లేక నిజంగానే చైనాతో లడాయి పెట్టుకొనేందుకు బైడెన్‌ యంత్రాంగం సిద్దపడుతోందా ? అమెరికాకు అంత సత్తా ఉందా ? చైనాను రెచ్చగొట్టి దాని స్పందన చూడండి అంటూ ప్రచారదాడిలో భాగంగా అమెరికా పథకం వేసిందా ? చివరికి టీ కప్పులో తుపానులా ముగుస్తుందా? ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతోంది.పెలోసీ పర్యటన నేపధ్యం లేదా తైవాన్‌ వేర్పాటు వాదులకు హెచ్చరికలో భాగం కావచ్చు తైవాన్‌ జలాల్లోకి ప్రవేశించే అమెరికా విమానవాహక నౌకలను లక్ష్యంగా చేసుకొని ఆధునిక క్షిపణులతో విన్యాసాలు నిర్వహించాలని మిలిటరీని చైనా ఆదేశించింది.


ప్రధాన భూభాగానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్‌ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం అన్న సంగతి తెలిసిందే.1949 నుంచి అది వివిధ కారణాలతో విడిగా ఉంది. 1971 వరకు చైనా అంటే ఐరాస, భద్రతా మండలిలో దాన్నే గుర్తించారు, వీటో అధికారం కూడా ఉంది. 1971 నవంబరు 15 నుంచి చైనా అంటే తైవానుతో సహా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోని ప్రభుత్వమే అసలైన ప్రతినిధిగా ఉంది. తరువాత అమెరికా కూడా విధిలేక తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించింది. అయినప్పటికీ తైవాన్‌ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ అమెరికా, దాని అనుకూల దేశాలు తైవాన్‌లోని విలీనవ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి ఆయుధాలు అందిస్తున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలు చేయిస్తున్నాయి. దీనిలో భాగంగానే నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన. అమెరికా అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ ఉంటారు.ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనల మేరకు చైనా అనుమతి లేకుండా వీరిలో ఎవరు తైవాన్‌లో అడుగుపెట్టినా అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుంది.నిబంధనలను పాటించాలని ఇతర దేశాలకు ఉద్బోధించే అమెరికాకు అది వర్తించదా !


చైనా తీవ్ర హెచ్చరికల నేపధ్యంలో అమెరికాలో ఇప్పుడు పెద్ద నాటకం నడుస్తోంది. ప్రభుత్వ సహకారం లేకుండా నాన్సీ పెలోసి పర్యటన జరగదు. ఆమె నిజంగా పరó్యటిస్తారో లేదో అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ పర్యవసానాల గురించి బహిరంగ చర్చ జరుగుతోంది. తైవాన్‌ వెళితే తలెత్తే ముప్పు గురించి పెలోసికి నచ్చ చెప్పేందుకు బైడెన్‌ యంత్రాంగం తెరవెనుక మంతనాలు జరుపుతోందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. ఏమైనా సరే వెళ్లాల్సిందేనని డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీల్లోని చైనా వ్యతిరేకులు రెచ్చగొడుతున్నారు. జపాన్‌, ఇతర ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌ కూడా ఆగస్టు తొలివారంలో వెళ్ల వచ్చని అనధికార వార్తలు. ఆమె పర్యటనను రద్దు చేయాలని చైనా జాతీయ రక్షణ శాఖ బహిరంగంగా ప్రకటించింది.తమ సార్వభౌత్వాన్ని రక్షించుకొనేందుకు గట్టి కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ముందుకుపోతే మిలిటరీ చేతులు ముడుచుకు కూర్చోదని పేర్కొన్నది.


పెలోసీ పర్యటనను మిలిటరీ వ్యతిరేకించినట్లు గతవారంలో జోబైడెన్‌ స్వయంగా చెప్పాడు. బైడెన్‌ చెప్పిందానికి అర్ధం ఏమిటో తనకు తెలియదని బహుశా తాను ప్రయాణించే విమానాన్ని కూల్చివేయటం లేదా అలాంటిదే ఏమైనా జరగవచ్చునని మిలిటరీ భయపడుతోందేమో నాకు తెలియదని పెలోసీ కూడా గతవారంలో విలేకర్లతో అన్నారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. స్పీకర్‌కు మేం చెప్పాల్సింది చెప్పాం, ఒకే చైనా అన్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని,వెళ్ల దలచుకుంటే ప్రభుత్వం నివారించలేదని ఒక అధికారి చెప్పాడు.” నాన్సీ నేను మీతో వస్తాను, నామీద చైనాలో నిషేధం ఉండవచ్చుగానీ స్వేచ్చను కోరుకొనే తైవాన్‌లో లేదు కదా, అక్కడ మిమ్మల్ని చూస్తాను ” అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో రెచ్చగొట్టాడు. పెలోసి గనుక వెళ్లకపోతే చైనా వత్తిడికి అమెరికా లొంగినట్లే అని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన రిపబ్లికన్లు, మితవాదులు రెచ్చగొడుతున్నారు.


అక్టోబరులో జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలో మరోసారి పార్టీ, అధికార పగ్గాలు చేపడతారని భావిస్తున్న చైనా అధినేత షీ జింపింగ్‌ నాయకత్వాన్ని అవమానించటం, రెచ్చగొట్టటం కూడా అమెరికా ఎత్తుగడలో భాగం అని చెబుతున్నారు. తైవాన్ను నిషేధిత గగన తలంగా ప్రకటించి పెలోసి విమానాన్ని చైనా గనుక వెంబడిస్తే అది ఆమె పర్యటన నిరోధం కంటే ఆ ప్రాంతం తమదే అని ప్రపంచానికి మరోసారి స్పష్టం చేయటం, అమెరికాకు పెద్ద హెచ్చరిక దాని వెనుక దాగుందని భావిస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి అమెరికా చేతిలో ఉందని చెబుతున్నారు. పెలోసి గనుక సంయమనం పాటించి వెనక్కు తగ్గకపోతే తరువాత పర్యవసానాలను ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీ ఎదుర్కోవలసి ఉంటుంది. గతంలో తైవాన్‌ తిరుగుబాటు నేత లీ టెంగ్‌ హుయి 1996లో అమెరికా పర్యటన జరిపినపుడు తైవాన్‌ దీవి చుట్టూ చైనా క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పుడు పెలోసీ రాక దానికంటే తీవ్రమైనది కనుక తీవ్రంగా పరిగణిస్తున్నది.


నాలుగు దశాబ్దాల ద్రవ్యోల్బణ రికార్డు, ధరల పెరుగుదల ఒక వైపు, రష్యాతో వివాదంలో సాధించిందేమీ లేకపోవటంతో తైవాన్‌ సమస్య పేరుతో చైనాను రెచ్చగొట్టి హడావుడి చేసి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు పొందటం లేదా ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు ఇస్తున్న మద్దతు నుంచి వెనక్కు మరల్చే ఎత్తుగడతో అమెరికా ఉందని, ఈ రెండూ జరిగేవి కాదని పరిశీలకులు చెబుతున్నారు. వీలైనంత వరకు లబ్ది పొందేందుకు పెలోసీని తురుపుముక్కగా బైడెన్‌ ప్రయోగిస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. పెలోసీ పర్యటనతో నిమిత్తం లేకుండానే ఇటీవలి కాలంలో రెండు దేశాల సంబంధాలు దిగజారుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పిచ్చిపనుల గురించి తెలిసినా వెనక్కు తగ్గితే చులకన అవుతామన్న భయం, తగ్గకపోతే నష్టపోతామన్న ఆందోళన బైడెన్‌కు ఉంది. చైనా వస్తువులపై ట్రంప్‌ విధించిన దిగుమతి పన్ను విలువ 32బిలియన్‌ డాలర్లు అమెరికన్లపైనే భారంగా పడింది. ఇప్పటికీ కొనసాగుతున్న పన్నులను తగ్గిస్తే ఒక శాతం ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా. చైనాతో అంతం లేని వివాదం మంచిది కాదని విదేశాంగశాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ కూడా బైడెన్‌కు సలహా చెప్పాడు. ఇలా అనేక వత్తిళ్ల కారణంగా షీ జింపింగ్‌తో చర్చలు జరుపుతానని బైడెన్‌ చెప్పాల్సి వచ్చింది.


ఒక వేళ నాన్సీ పెలోసి మొండిగా ప్రవేశిస్తే 2001లో చైనాలోని హైనాన్‌ దీవిలో జరిగిన అమెరికా-చైనా విమానాల ఢ కంటే తీవ్రపరిణామాలు జరగవచ్చని కొందరు గుర్తు చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని పార్సెల్‌ దీవులు తమవేనని చైనా వాదిస్తున్నది. అమెరికా దాన్ని అంగీకరించటం లేదు. అంతర్జాతీయ జలాల్లో తిరిగే స్వేచ్చ తమకు ఉందంటూ జపాన్‌లోని తమ సైనిక కేంద్రం నుంచి నిఘా విమానాలు, ఓడలను తిప్పుతున్నది. దానిలో భాగంగా 2001 ఏప్రిల్‌ ఒకటవ తేదీన ఒక నిఘా విమానం చైనా సైనిక స్థావరం ఉన్న హైనాన్‌ దీవులకు దగ్గరగా వచ్చింది. దాన్ని అడ్డుకొనేందుకు చైనా మిలిటరీ విమానం కూడా ఎగిరింది. రెండూ దీవుల వద్ద ఢకొీన్నాయి. ఈ ఘటనలో చైనా పైలట్‌ మరణించగా దెబ్బతిన్న అమెరికా విమానం హైనాన్‌ దీవిలో దిగింది. దాని సిబ్బంది 24 మందిని చైనా అరెస్టు చేసి, విమానాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే అనూహ్య పరిణామంతో దిక్కుతోచని సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కంప్యూటర్లపై కాఫీ, నీళ్లను పోశారు. తరువాత అమెరికా ప్రభుత్వం చైనాకు క్షమాపణలు చెబుతూ లేఖలు రాసి ఖర్చులను చెల్లించి తమ సిబ్బంది, విమానాన్ని విడిపించుకుంది. తరువాత జరిగిందానికి చింతిస్తున్నట్లు, విచారపడుతున్నట్లు లేఖల్లో పేర్కొన్నాం తప్ప క్షమాపణ కాదని అమెరికా చెప్పింది. హైనాన్‌ దీవుల్లో ప్రస్తుతం చైనా జలాంతర్గాముల కేంద్రం ఉంది. అక్కడి నుంచి జలాంతర్గాముల ద్వారా ఖండాంతర అణుక్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే తరువాత కూడా చీటికి మాటికి దాని సమీపంలోకి అమెరికా నిఘావిమానాలు, ఓడలను పంపుతున్నారు. చైనా కూడా దానికి ధీటుగా విమానాలతో సమాధానం చెబుతున్నది. రెండు మూడు సార్లు రెండు దేశాల విమానాలు సమీపానికి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే చైనా మిలిటరీ సామర్ధ్యం ఎంతో పెరిగిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలంలో తైవాన్‌ వేర్పాటు వాదులు అమెరికా సాయంతో స్వాతంత్య్రం సంపాదించుకుంటామని పదే పదే చెప్పటం, చైనా గనుక విలీనానికి బలాన్ని వినియోగిస్తే తాము మిలిటరీ జోక్యం చేసుకుంటామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


నూటయాభై ఆరు సంవత్సరాల పాటు బ్రిటీష్‌ పాలనలో ఉన్న హాంకాంగ్‌ 1997 జూలై ఒకటిన చైనాలో విలీనమైంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉన్నందున తమ ప్రత్యేకపాలన ప్రాంతంగా పరిగణించి 50 సంవత్సరాల పాటు అక్కడి వ్యవస్థలను కొనసాగిస్తామని చైనా సర్కార్‌ అంగీకరించింది. అదేవిధంగా పోర్చుగీసు ఏలుబడిలో అంతర్జాతీయ జూద కేంద్రంగా మార్చిన మకావూ దీవులను కూడా అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నది. ఆ గడువు 2048 వరకు ఉంది. విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన హామీల మాదిరే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడులకూ అదే వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. తైవాన్నుంచి పెట్టుబడులే కాదు, ఎవరైనా వచ్చి ఉపాధికూడా పొందవచ్చని అవకాశం ఇచ్చింది. అందువలన తైవాన్‌న్ను కూడా అప్పటి వరకు వాటి మాదిరిగానే కొనసాగనిస్తుందని, తరువాత పూర్తిగా విలీనం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఆగడువు దగ్గర పడుతున్నకొద్దీ విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు చైనా చూస్తుండగా ప్రజాస్వామ్యం, స్వేచ్చ,స్వాతంత్య్రం పేరుతో చిచ్చుపెట్టేందుకు అమెరికా,జపాన్‌ తదితర దేశాలు చూస్తున్నాయి.


తైవాన్‌, హాంకాంగ్‌,టిబెట్‌, షింజియాంగ్‌ రాష్ట్రంలో మానవహక్కుల గురించి అమెరికా సంధిస్తున్న అస్త్రాలేవీ పని చేసేవి కాదు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ ప్రయోజనాలకు హానికలిగే వాటిని వేటినీ సహించేది లేదని చైనా పదే పదే స్పష్టం చేస్తోంది. హాంకాంగ్‌, మకావు దీవుల విలీన సమయంలో 50 సంవత్సరాలపాటు(2048 వరకు) అక్కడి యధాతధ స్థితిని కొనసాగనిస్తామని ఒకే దేశం-రెండు వ్యవస్థలన్న తన వైఖరిని చైనా ఎప్పుడో స్పష్టం చేసింది. వాటి మాదిరే అదుపులో ఉన్నంత వరకు తైవాన్‌ అంశంలో కూడా చైనా అప్పటి వరకు తొందరపడే ధోరణిలో లేదు. ఈ లోగా అమెరికా కూటమి దేశాలు దుస్సాహసానికి పాల్పడి తెగేదాకా లాగితే పరిణామాలు వేరుగా ఉంటాయి.విచక్షణను ఉపయోగించి వెనక్కు తగ్గితే పెలోసీ పర్యటన వివాదం టీకప్పులో తుపానులా ముగుస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దుమ్మెత్తి పోసుకుంటున్న టోరీ నేతలు రిషి సునాక్‌ – లిజ్‌ ట్రస్‌ : ఇలాగైతే లేబర్‌ పార్టీకి అవకాశమంటూ పెద్దల గగ్గోలు !

27 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, Liz Truss, Rishi Sunak, Tory leadership contest, UK Conservative party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెనెజులాతో అమెరికా కాళ్ల బేరానికి వచ్చిందా – మితవాదుల ఆగ్రహం !

25 Monday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Politics, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Joe Biden, Latin American left, Lifting some Sanctions On Venezuela, Nicolás Maduro, US imperialism


ఎం కోటేశ్వరరావు


అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్‌ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని ఆసరా చేసుకొని ఎన్ని కట్టుకథలు, ఎన్ని దెప్పి పొడుపులో ! ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏమిటి ?


2022 జూలై పన్నెండవ తేదీన బిబిసి ముండో( స్పానిష్‌ భాష) అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ మాజీ ముఖ్యకార్యదర్శి కారీ ఫిలిపెట్టీతో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విదేశాంగశాఖలో వెనెజులా, క్యూబా వ్యవహారాలను ఆమె చూశారు.అమెరికా అధికారులు ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో సంప్రదిస్తున్నారని ప్రతిపక్షంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన మదురో బదులు తాము మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేత జువాన్‌ గుయిడోనే విజేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌, తరువాత ఇటీవలి వరకు జో బైడెన్‌ సర్కార్‌ ఆ వైఖరినే కొనసాగించింది. మదురోను పదవి నుంచి తొలగించాలని అక్కడి మితవాద శక్తులకు అమెరికా చెప్పింది. అన్ని రకాలుగా తోడ్పడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో తలెత్తిన ఇంథన సంక్షోభం ప్రారంభం వరకు అమెరికా చదరంగంలో గుయిడోనే పావుగా ఉన్నాడు. ఒక ఎత్తుగడగా లేదా అవసరం కొద్దీ గుర్తించను గుర్తించను అన్న అమెరికా ఇప్పుడు తన మాటలను తానే దిగమింగి అధికారికంగా మదురో సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.


వెనెజులా పౌరులు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన, ఇప్పటికీ పడుతున్న కష్టాలు, ఇబ్బందులకు అమెరికా కారణం అన్న మౌలిక అంశాన్ని మీడియా కావాలనే విస్మరించి, కట్టుకథలు, పిట్టకతలు చెప్పింది, వాటిని గుడ్డిగా నమ్మి అనేక మంది రకరకాలుగా చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడి జనాలకు వాస్తవాలు తెలుసుగనుక ఎన్ని ఇబ్బందులున్నా వామపక్ష మదురోవైపే మొగ్గుచూపుతున్నారు. మానవహక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్దపాలన పరిరక్షణ పేరుతో అనేక దేశాలపై అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల ప్రతికూల పర్యవసానాలను నివేదించేందుకు ఐరాస ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదన అధికారిణి ప్రొఫెసర్‌ అలేనా దౌహాన్‌ ఇటీవల చెప్పిన ప్రకారం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు 98శాతం అవి చెప్పిన సుభాషితాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. జింబాబ్వే సందర్శనలో ఆమెతో కొందరు విద్యార్ధులు మాట్లాడుతూ తమ దేశంపై ఆంక్షల కారణంగా టూరిస్టులుగా కొన్ని చోట్లకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చిందని, పరీక్షలకు వెళ్లి రోడ్ల మీద నిద్రించాల్సి వచ్చిందని చెప్పారు. వెనెజులాపై ఆంక్షల కారణంగా 2017 నుంచి 2018వరకు అక్కడ శిశుమరణాల రేటు 31శాతం పెరిగిందని,ఆరోగ్య హక్కుకు భంగం కలిగిందని అలేనా చెప్పారు. వాక్సిన్ల కొనుగోలును అడ్డగించిన కారణంగా 26లక్షల మంది వెనెజులా పిల్లలకు మెనెంజటిస్‌, రోటావైరస్‌, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్‌, ఎల్లో ఫీవర్‌ ముప్పు తలెత్తిందన్నారు.


ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా వెనెజులా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చావులను గణనీయంగా అరికట్టింది.ప్రతి లక్ష మందికి 20.1శాతం మంది మరణిస్తే అదే అమెరికాలో 304.18శాతం చావులు నమోదయ్యాయి. వెనెజులా మీద 2017 నుంచి 600 రకాల ఆర్ధిక ఆంక్షలను అమెరికా అమలు జరిపింది. ఒక దశలో వీటి కారణంగా 99శాతం రాబడిని కోల్పోయింది. మరోవైపు మితవాద శక్తులను రాజకీయంగా ఉసిగొల్పింది. వీటన్నింటినీ మదురో సర్కార్‌, అధికార సోషలిస్టు పార్టీ ఎదుర్కొన్నది. 2021 డిసెంబరులో జరిగిన ప్రాంతీయ, మున్సిపల్‌ ఎన్నికల్లో 23 గవర్నర్‌ పదవులకు గాను 21, 213 మేయర్‌ పదవుల్లో 120 గెలుచుకుంది.
అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల ఆంక్షల, ఇతర కొన్ని అంశాల కారణంగా గత పది సంవత్సరాల్లో వెనెజులా ఆర్ధికంగా 70శాతం దిగజారింది. అనేక తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఈ ఏడాది ప్రధమార్ధం నుంచి జిడిపి కోలుకోవటం ప్రారంభమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని, జనం కొనుగోలు ఖర్చు పెరిగిందని తాజా వార్తలు. వెనెజులియన్‌ ఫైనాన్స్‌ అబ్సర్వరేటరీ సంస్థ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ద్రవ్యోల్బణం 53.8శాతం, ఇది గతేడాదితో పోలిస్తే ఆరోవంతు. కరెన్సీ బొలివర్‌ విలువ డాలర్‌తో గతేడాది 50శాతం పతనమైతే ఈ ఏడాది 17శాతం. అనేక నియంత్రణ చర్యలు, ఇతర అంశాలు దీనికి దోహదం చేశాయి.ఈ ఏడాది ఆఖరుకు రోజుకు 20లక్షల పీపాల చమురు ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుండగా ప్రస్తుతం 7.75లక్షల పీపాలు జరుగుతున్నది. కోటి మంది కార్మికులు, ఇతరులకు లబ్ది కలిగించే వేతనాలు, కనీసవేతనాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. లాటిన్‌ అమెరికా-కరీబియన్‌ ఎకనమిక్‌ కమిషన్‌ అంచనా ప్రకారం 2014 తరువాత ఈ ఏడాది వృద్ధి రేటు ఐదుశాతం ఉంటుందని, అది అన్ని లాటిన్‌ అమెరికా దేశాల కంటే ఎక్కువ అని పేర్కొన్నది. 2022 జనవరి నుంచి మార్చి నెలవరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చమురు ఉత్పత్తి రోజుకు 5,33,000 పీపాల నుంచి 7,56,000 పీపాలకు పెరిగింది. ఏడాది పొడవునా ఆరులక్షల పీపాలు ఉంటే జిడిపి వృద్ది రేటు 8శాతం ఉంటుందని మరొక అంచనా. ఐదు సంవత్సరాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలను అమెరికా కొద్దిగా మే 17 నుంచి సడలించింది. వెనెజులా ప్రభుత్వ రంగ చమురు కంపెనీతో లావాదేవీలు జరపవచ్చని అమెరికా, ఐరోపా చమురు కంపెనీలకు సూచించింది.


అమెరికా ఆంక్షలకు గురైన దేశాలలో ఇరాన్‌ కూడా ఒకటి. వెనెజులాాఇరాన్‌ మధ్య వివిధ రంగాలలో 20 సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరుదేశాల నేతలు జూన్‌ 11న సంతకాలు చేశారు. చమురు రంగంలో ఇరాన్‌, ఆహార, ఉత్పత్తి ఎగుమతిలో వెనెజులా సహకరించుకుంటాయి. ఎనిమిది లక్షల పీపాల చమురును రవానా చేసే ఓడలను ఇరాన్‌ అందిస్తుంది. రెండు దేశాలూ అమెరికా సామ్రాజ్యవాద బాధితులే, వ్యతిరేకులే. ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో తలెత్తిన పరిస్థితి పర్యవసానాలను అంచనా గట్టటంలో ఒక విధంగా అమెరికా విఫలమైందనే చెప్పాలి. అమెరికాలో అసాధారణ రీతిలో చమురు ధరల పెరుగుదల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీని దెబ్బతీయవచ్చనే అంచనాలున్నాయి. అసాధారణ రీతిలో పెరిగిన ద్రవ్యోల్బణ దేశ జిడిపి వృద్ది రేటును కూడా దెబ్బతీస్తుంది. వచ్చే ఏడాది మాంద్యంలోకి జారవచ్చన్న హెచ్చరికలూ ఉన్నాయి. చమురు ధరలు తగ్గాలంటే సరఫరాను పెంచాలన్న వినతులను సౌదీ ఇతర దేశాలు అంగీకరించలేదు. రష్యా చమురు ఎంత ఎక్కువగా మార్కెట్‌కు వస్తే అంత అధికంగా దానికి రాబడి వస్తుందని తేలింది. అందువలన వెనెజులాపై గతంలో విధించిన ఆంక్షలను చూసీచూడనట్లు నటిస్తూ అక్కడ చమురు ఉత్పత్తి పెంపుదలకు అమెరికా చొరవ చూపింది.తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అమెరికాకూ మేలే గనుక ఇది దాని అవసరం కోసం తప్ప వెనెజులా మీద మనసు మారి కాదు. తిరిగి ఎప్పుడైనా పంజా విసరవచ్చు. దొరికిన ఈ వెసులుబాటును వెనెజులా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గతంలో చమురు ధరల పతనం కూడా దాని ఆర్ధిక ఇబ్బందులకు ఒక కారణం ఇప్పుడు వందడాలర్లకు పైగా ఉన్నందున రష్యా మాదిరి కొన్ని దేశాలకు రాయితీ ఇచ్చినా దానికి రాబడి పెరుగుతుంది. ఇదే తరుణంలో అమెరికాను పక్కాగా ప్రతిఘటించే ఇరాన్‌తో ఒప్పందం కూడా సానుకూల అంశమే. ప్రతిపక్ష నేత గుయిడోను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, దాని బాటలో నడిచిన ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే అమెరికా మదురో యంత్రాంగంతో చర్చలకు రావటం అమెరికాకు ప్రపంచంలో పరువు తక్కువ వ్యవహారమే దాన్ని నమ్ముకొని దానికి తాన తందాన అన్న దేశాలకూ పరాభవమే. ఇది మదురోకు పెద్ద నైతిక విజయం.చమురు ఎగుమతుల మీదనే ఆధారపడితే అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఎప్పుడైనా ముప్పురావచ్చు.అందుకే సమతుల విస్తరణ, దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోవటం వంటి విధానాలవైపు వెనెజులా మళ్లుతున్నది.


ప్రతిపక్ష నేతను దేశాధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా 2019లో వెనెజులాలోని తన రాయబార కార్యాలయాన్ని పక్కనే ఉన్న కొలంబియాకు తరలించింది. అక్కడ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షం అధికారంలోకి రానున్నదని గతేడాదే వివిధ సర్వేలు వెల్లడించాయి, అదే జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడనున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తధ్యమని ముందుగానే అమెరికాకు తెలుసు గనుకనే అంటరాని వాడిగా పరిగణించిన మదురోతో చర్చలకుగాను మార్చి నెలలోనే బైడెన్‌ సర్కార్‌ వెనెజులాకు ఒక అధికారిక బృందాన్ని పంపింది. అక్కడ బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల సంప్రదింపులకు తప్ప మరొకటి కాదని బుకాయించింది. తరువాత ఆంక్షలను సడలిస్తామని ప్రకటించింది.చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవచ్చని తమ కార్పొరేట్‌ సంస్థ చెవరాన్‌కు అనుమతి ఇచ్చింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దీనివలన అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలవగలమనే ధైర్యం బాధిత దేశాలకు వస్తుందని మితవాద, వామపక్ష వ్యతిరేకశక్తులు గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా ప్రభావం పశ్చిమార్ధగోళంలో పెరుగుతుందని వాపోతున్నాయి.


ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు వెనెజులా రాజధాని కారకాస్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్మీ గేమ్స్‌ జరుగుతున్నాయి.రష్యా ప్రారంభించిన ఈ క్రీడలను తొలిసారిగా పశ్చిమార్ధగోళంలోని వెనెజులా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 37 దేశాల నుంచి 275 టీములు, 36 విభాగాల్లో పోటీ పడేందుకు వస్తున్నట్లు సమాచారం. జరుగుతున్నది క్రీడలే కావచ్చుగానీ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటికే తొమ్మిది దేశాల్లో అమెరికా వ్యతిరేక, వామపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో పనామా కూడా వీటి సరసన చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసినపుడు అమెరికా బయట-తన పెరటి తోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలోనూ ఒంటరి అవుతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు : బిజెపిలో పెరుగుతున్న వారసులు – తాజాగా ఎడియూరప్ప కుమారుడు !

23 Saturday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

B. S. Yediyurappa, BJP, BJP Dynasty Politics, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో వారసత్వ రాజకీయాలకు తావు లేదని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నవారి మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు, అన్నింటికీ మించి వారితో దెబ్బలాటకు అసలు దిగకూడదు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో వారిని కంగన రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 పోరులో పాల్గొన్న సమరయోధులుగా సన్మానించినా, పెన్షన్‌ ఇచ్చినా తప్పు లేదు. షా నవాజ్‌ హుసేన్‌ అనే బిజెపి నేత శ్రీనగర్‌లో కూర్చుని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. పేరెత్త కుండానే తాత, తండ్రి, మనవడు ముఖ్యమంత్రులయ్యే రోజులు గతించాయి. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు పాల్పడిన వారు గతంలో చేసిన వ్యాపారం, హౌటళ్లు ఏదో ఒకటి చూసుకోవాల్సిందే అన్నారు. సరిగ్గా అదే సమయంలో నాలుగు సార్లు సిఎం, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న బిఎస్‌ ఎడియూరప్ప కర్ణాటకలోని షిమోగా సభలో తన రెండవ కుమారుడు విజయేంద్రకు తన నియోజకవర్గం షికారపుర రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటించారు.2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తన బదులు కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించేశారు. తన తండ్రి వారసత్వాన్ని అంగీకరిస్తూ కుటుంబ పేరు ప్రతిష్టలను కాపాడతానని తనయుడు చెప్పారు. తనకు తండ్రి-పార్టీ రెండు కళ్లు అని ఏ ఒక్కటి లేకున్నా చేసేదేమీ ఉండదని కూడా అన్నారు.ఎడియూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం షిమోగా ఎంపీగా ఉన్నారు. అయినా సరే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని అనకపోతే పరువు దక్కదు మరి. పేద కుటుంబంలో పుట్టిన ఎడియూరప్ప చిన్నతనంలో నిమ్మకాయలు అమ్మితే తప్ప కుటుంబం గడవని స్థితి. తరువాత కార్మికుడిగా కూడా పని చేశారు. ఒక రైస్‌ మిల్లులో గుమస్తాగా చేరి సినిమాల్లో మాదిరి యజమాని కూతుర్నే వివాహం చేసుకున్నారు. తండ్రీ కొడుకులు వారసత్వ రాజకీయాలను వదలి పూర్వపు వ్యాపారం చేసుకోవాలని షా నవాజ్‌ హుస్సేన్‌ ఇప్పటికైనా తమ పార్టీ నేతలకు చెప్పి మర్యాద దక్కించుకుంటారా ?


ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఏ, ఒకసారి ఎంపీగా గెలిచిన బూకనకరె సిద్దలింగప్ప ఎడియూరప్పను 75 ఏండ్లు దాటిన వారికి ముఖ్యమైన పదవులను అప్పగించేది లేదన్న బిజెపి తాను చెప్పిన సుభాషితాన్ని తానే దిగమింగి నాలుగోసారి సిఎం గద్దెమీద కూర్చోపెట్టింది. పదవీ కాలం పూర్తిగాక ముందే రాజీనామా చేయించి బసవరాజు బొమ్మైకి అప్పగించింది. జీవితం తనకు అగ్నిపరీక్షగా ఉందని పదే పదే చెప్పిన ఎడియూరప్ప విధిలేక పదవికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొనేది లేదని తన పాత్రను పోషిస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పారు. విలువల వలువలతో పని చేస్తామని చెప్పే ఈ బిజెపి నేత నాలుగవసారి సిఎంగా గద్దె నెక్కేందుకు పడరాని పాట్లు పడ్డారు. హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆరుసార్లు విఫలయత్నం చేసి ఏడవ సారి ఎవరేమనుకుంటే నాకేమి అన్నట్లుగా 76 ఏండ్ల వయస్సులో నాలుగోసారి గద్దెనెక్కారు. అంతకు ముందు మూడోసారి పెద్ద పార్టీ నేతగా ప్రభుత్వాన్ని ఏర్పరచి కేవలం 55 గంటలు మాత్రమే పదవిలో ఉండి అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. తొలిసారి 2007లో జెడి(ఎస్‌)తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. రెండవ సారి 38 నెలలు, నాలుగవసారి రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నారు. అవినీతి కేసులో ఒకసారి జైలుకూ వెళ్లారు, ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న ఎడియూరప్ప పదవి కోసం బిజెపి మీద తిరుగుబాటు చేసి గతంలో స్వంత కుంపటి పెట్టుకున్నారు. తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిఏ ఎడియూరప్ప – ఎడియూరప్పే బిజెపిగా ఉన్నారు. అలాంటి నేతను ఇటీవల పక్కన పెట్టారు. పార్టీకి ఇతర నేతలు ఉన్నారని రుజువు చేసుకొనేందుకు అధిష్టానం పూనుకున్నది. వారసత్వాన్ని ప్రకటించటం బిజెపి చెప్పే సుభాషితాలకు వ్యతిరేకం. ఎన్నికల ముందు ఎడియూరప్పతో వైరం పెట్టుకుంటుందా ? కుమారుడి కోసం ఏం చేస్తారో చూడాలి.


ఇంకా ఎన్నికలకు ఎంతో వ్యవధి ఉండగా ఇప్పుడెందుకు ఆకస్మికంగా వారసత్వ ప్రకటన చేశారన్నది ప్రశ్న. దాని గురించి విజయేంద్ర మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాను వరుణ లేదా చామరాజనగర్‌లో పోటీ చేయనున్నట్లు మీడియాలో ఊహాగానాలు వెలువడినందున ఒక స్పష్టత ఇవ్వాలని స్థానిక నేతలు తన తండ్రిపై వత్తిడి తెచ్చిన కారణంగా ఈ ప్రకటన చేశారని చెప్పారు. షికారిపురాలో పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తానని కొన్ని నెలల క్రితం ఎడియూరప్ప చెప్పినందున పార్టీనేతలు ఆశాభంగం చెందారని, అక్కడ ఎడియూరప్ప లేదా విజయేంద్ర మాత్రమే పోటీ చేయాలని వత్తిడి చేస్తున్నారని, అందువలన తప్పనిసరై ప్రకటించాల్సి వచ్చిందన్నారు. నాటి ప్రకటనల గురించి తాను ఇప్పుడు చెబుతున్నానని అంటూ అప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్‌ల నుంచి అనేక మంది బిజెపిలో చేరేందుకు వచ్చారని దాంతో తనను పక్కన పెడుతున్నారేమోనని విచారంతో పాటు ఆశాభంగం చెందానని, అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నానని అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీలో పని చేస్తున్నాను తప్ప ఎడియూరప్ప కుమారుడిగా కానందున వారసత్వ వాదన తనకు వర్తించదన్నారు. ఈ సారి ఎలాగైనా పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు వత్తిడి చేసినందున తన తండ్రి ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తమకు సీట్లు కావాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదన్నారు. 2018లో వరుణా నియోజకవర్గం నుంచి పోటీకి పక్షం రోజులు ప్రచారం చేసుకున్న తరువాత, తాజాగా ఎంఎల్‌సీ అవకాశం ఇచ్చేందుకు విజయేంద్రకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎడియూరప్పకు పార్టీ మీద పట్టును తగ్గించేందుకు ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. దానిలో భాగంగానే బొమ్మై మంత్రివర్గంలో తన మద్దతుదారులైన మంత్రుల ఎంపికను నిరాకరించారు.కుమారుడికి మంత్రి పదవీ ఇవ్వలేదు. పదవి కోసం ఎంతకైనా తెగించే చరిత్ర ఉన్న ఎడియురప్ప తన కుమారుడిని రాజకీయ నిరుద్యోగిగా చూసి భరించగలరా !


బిజెపి లబ్ది పొందిన అంశాల్లో ప్రత్యర్ధి పార్టీల కుటుంబ వారసత్వంపై దాడి ఒకటి. విధానాలను పక్కన పెట్టి జనం దృష్టిని ఆకర్షించే ఎత్తుగడ అది. ఇప్పుడు ఆ జబ్బుదానికి కూడా అంటుకుంది.రోజు రోజుకూ పెరుగుతోంది. మాధవరావు సింధియా కాంగ్రెస్‌ నేత. అతని మరణం తరువాత కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా పదవిలోకి రావటంతో బిజెపి వారసత్వ రాజకీయమని చెప్పింది. అదే పెద్దమనిషి బిజెపిలో చేరిన తరువాత ఎంపీ పదవితో పాటు మంత్రిపదవి ఇచ్చారు. జ్యోతిరాదిత్య మేనత్త వసుంధరరాజే. ఆమె రాజస్తాన్‌ సిఎంగా చేశారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఆమె స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. వసుంధరరాజే తల్లి విజయరాజే సింధియా తొలుత కాంగ్రెస్‌, తరువాత స్వతంత్ర పార్టీ, అక్కడి నుంచి జనసంఘం, తరువాత బిజెపి నేతగా ఉన్నారు.ఎంపీ, ఎంఎల్‌ఏగా చేశారు. గోవాలో మాజీ సిఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు బిజెపి తిరస్కరించింది. కానీ అదే పార్టీ అనేక మంది నేతల వారసులకు సీట్లు ఇచ్చింది.జెన్నిఫర్‌ మాన్సరటా మంత్రి, ఆమె భర్త అటానాసియో ఇద్దరికీ సీట్లు ఇచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి, అతని భార్యకు సీట్లు ఇచ్చారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 మందికి గాను వివిధ పార్టీల నుంచి 114 మంది కుటుంబవారసుల నుంచే వచ్చారు. తరువాత 2019లో వారి సంఖ్య 162కు పెరిగింది, ఇది తొమ్మిది శాతం. చిత్రం ఏమిటంటే సగటు కంటే బిజెపి వారసులు ఆ పార్టీకి ఉన్న 388 మందిలో 45 అంటే పదకొండుశాతం ఉన్నారు.2009లో బిజెపి, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో వారసులు పదకొండు, పన్నెండుశాతాల చొప్పున ఉంటే 2014కు వచ్చేసరికి అవి 20-8 శాతాలుగా మారాయి. ఈ కారణంగానే నరేంద్రమోడీ వారసత్వ రాజకీయాల గురించి కొత్త పల్లవి అందుకున్నారు. 2021 నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రాజకీయ పదవుల్లోకి వస్తే తప్పులేదంటూ ఒక కుటుంబమే తరతరాలుగా పార్టీని నడపటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని సూత్రీకరించారు. కుటుంబాల కోసం పార్టీలు, కుటుంబాలే పార్టీలను నడిపితే ప్రజాస్వామిక లక్షణం ఉండదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమని మరో సందర్భంగా చెప్పారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

22 Friday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China’s dominance, European Union, FTA, India-EU ties, Narendra Modi Failures, RSS, Trade talks


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక్కులు ఒక సాకు-వంచన !

20 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

Human Rights, Joe Biden, Oil politics, Ukraine-Russia crisis, US imperialism, west pretence and hypocrisy


ఎం కోటేశ్వరరావు


ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగని వారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్‌ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సిఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్‌ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీశాండర్స్‌ మాట్లాడుతూ ” చూడండి, వందబిలియన్‌ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది.తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.” అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్‌ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసమే.


అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి.ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్‌ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్‌ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ చెప్పాడు. బైడెన్‌ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్‌ ఇరాన్‌ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ ” జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్‌ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా” అని ఎదురు ప్రశ్నించాడు.


అమెరికా పధకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది.ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నిహయన్‌ పారిస్‌ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు.ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్‌ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్‌ ఉంది.


తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలహమ్‌ అలియెవుతో ఐరోపా సమాఖ్య(ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్‌ లెయన్‌, ఇంథన కమిషనర్‌ కద్రి సిమ్సన్‌ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్‌ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్ధించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్‌బైజాన్‌ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు.ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్ధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్‌ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్‌ ఛాన్సలర్‌ షఉల్జ్‌ చెప్పాడు.


ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్‌ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.


ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్‌ మూసివేత ఒకటి. కజకస్తాన్‌ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్‌ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్‌ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్‌ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30 రోజులపాటు కజకస్తాన్‌ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్‌ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్‌, ఎక్సాన్‌ మోబిల్‌, షెల్‌, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్‌ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి.ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్‌ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశాలూ దీనిలో తక్కువేమీ కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ఫొటోలతో జర జాగ్రత్త – ఉద్యోగాలు పోతాయి, ఊచలు లెక్కించాలి !

18 Monday Jul 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, PM.CM photos in trash, UP CM, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసి పారిపోక ముందు మే పదవ తేదీన ఒక ఉదంతం జరిగింది. మహింద వీర విధేయుడైన అభిమాని ఒకడు కొలంబో వీధుల్లో మద్దతు ప్రకటించాడు. అప్పటికే మద్దతుదార్లను జనం మీదకు ఉసిగొల్పిన మహింద సంగతి తేల్చాలని నివాసం వైపు నిరసనకారులు వెళుతుండగా ఈ ఉదంతం జరిగింది. ఆగ్రహించిన జనం అతన్ని చితక్కొట్టి దారిన వస్తున్న ఒక చెత్తబండిలో కూర్చోపెట్టి తరిమికొట్టారు. ఆ వీడియో వైరలైంది. దెబ్బలు తిన్న అతను సింహళీయుడే చితక బాదిన వారు కూడా ఆ సామాజిక తరగతికి చెందిన వారే. ఆదివారం నాడు (జూలై 17)న ఉత్తర ప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ఒక కాంట్రాక్టు పారిశుధ్యకార్మికుడు తన బండిలో చెత్తతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, సిఎం యోగి ఆదిత్యనాధ్‌ ఫొటోలను తరలిస్తున్న వీడియో వైరల్‌ కావటం, దాన్ని చూసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సదరు కార్మికుడిని విధుల నుంచి తొలగించటం సంచలనాత్మక ఘటనగా మారింది. దేశ అదృష్టం కొద్దీ ఉపాధి పోగొట్టుకున్న కార్మికుడూ హిందువే, చెత్తబండి నుంచి మోడీ, యోగి, అబ్దుల్‌ కలామ్‌ చిత్రాలను రక్షించిన వారూ హిందువులే.


ఈ ఉదంత వివరాల్లోకి వెళితే మున్సిపల్‌ కార్మికుడు బాబీ బండిలో మోడీ, యోగి ఫొటోలు ఉండటాన్ని రాజస్తాన్‌లోని ఆళ్ల్వారు నుంచి మధుర వచ్చిన ఇద్దరు భక్తులు గమనించారు. సదరు బండిని వీడియో తీశారు. అంతటితో ఆగలేదు. కార్మికుడిని నిలిపి ఆ ఫొటోలను ఎందుకు చెత్తబండిలో వేశావని అడిగారు. వాటితో తనకేమీ సంబంధం లేదని చెత్తకుప్పలో ఉన్నవాటిని తీసి బండిలో వేసి తీసుకుపోతున్నట్లు చెప్పాడు. ఆళ్వారు భక్తులు మోడీ,యోగి చిత్రాలను బండిలో నుంచి తీస్తుండగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రం కూడా కనిపించిందట. ఆ ఫొటోలను తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేసి తమతో ఆళ్వారు తీసుకు వెళతామని, మోడీగారు,యోగి గారు ఈ దేశ ఆత్మలని వారు అన్నారు.


ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమంలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి చిత్రాలను అందరూ గౌరవించాలి. వారి చిత్రాలను చెత్తబండిలో తీసుకుపోవటం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమే కనుక శిక్షించాలని కొందరు అన్నారు. కార్మికుడిపై వేటును కొందరు ప్రశ్నించారు. ఫొటోలు పాతబడి, చిరిగినపుడు అవి ఎవరివైనా ఒకటే. అధికారంలో ఉన్నవారి పాత పొటోలను ఏం చేయాలి, ఎలా తొలగించాలి అనేందుకు ఏదైనా పద్దతి ఉందా అని కొందరు ప్రశ్నించారు. చెత్తకుప్పలో ఉన్న వాటిని బండిలో వేసిన కార్మికుడిది విధి నిర్వహణ తప్ప తప్పెలా అవుతుంది, అతన్ని ఎందుకు శిక్షించాలి అని కొందరు ప్రశ్నించారు. కార్మికుడు తన బండిలో ఆ ఫొటోలను తెలియకుండానే ఉంచాడు. అతని నిర్లక్ష్యానికి గాను అతన్ని వెంటనే పని నుంచి తొలగించినట్లు మధుర-బృందావన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సత్యేంద్ర కుమార్‌ తివారీ ప్రకటించారు. సదరు కార్మికుడు వాటిని బండిలో వేసేటపుడు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు.


ప్రముఖులు, ప్రజాప్రతినిధుల చిత్రాలు చెత్తలో కనిపించినపుడు ఏమి చేయాలో కార్మికులకు ఎందుకు వివరించలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ శానిటరీ ఇనస్పెక్టర్‌, సూపర్‌వైజర్లకు కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించింది.తనను పనిలోంచి తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మికుడు బాబీ ఒక దరఖాస్తులో ప్రార్ధించాడు. చెత్తసేకరణ కేంద్రంలో ఉన్నదాన్నే తన బండిలో వేశానని, తనకు చదువురాదని, ఫొటోలను గుర్తించలేకపోయానని, జరిగిందానికి మన్నించాలని కోరాడు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు తెలియదంటే కుదరదని, వాటిని సులభంగా గుర్తించవచ్చని ఒక అధికారి అన్నారు. ఈ ఉదంతం గురించి నిజనిర్దారణకు ఒక కమిటీని వేసి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అనునయ ఝా చెప్పారు.


వారం రోజుల ముందు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ పట్టణంలో జూలై పదిన నరేంద్రమోడీని విమర్శిస్తూ రెండు చోట్ల హౌర్డింగులు పెట్టినందుకు గాను పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాటిలో ధరల పెరుగుదల, రైతుల నిరసన, నిరుద్యోగం వంటి అంశాల కార్టూను, బై బై మోడీ అనే హాస్టాగ్‌ ఉన్నాయి. జాతీయ సమగ్రతకు భంగం కలిగించటం, వివిధ తరగతుల మధ్య విద్వేషం, శత్రుత్వం, తప్పుడు ఆలోచనలు కలిగించటం వంటి సెక్షన్లతో కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాని పేరుకు మచ్చ తెచ్చేందుకు వాటిని ఉద్దేశించారని ఆరోపించారు. వాటిని తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌కు చెందిన శాయి అనే అతని కోరిక మేరకు పెట్టారని పోలీసులు చెప్పారు. అనికేత్‌ కేశర్వాని, అభయకుమార్‌ సింగ్‌, రాజేష్‌ కేశర్వాని, శివ, ధర్మేంద్ర కుమార్‌ అనే వారిని అరెస్టు చేశారు.వారిలో ఫ్లెక్సీని ముద్రించిన ఒకరిని, ఒక కార్యక్రమాల నిర్వహణ కంపెనీ ప్రతినిధి ఉన్నారు. హౌర్డింగ్‌లు పెట్టినందుకు శాయి అనే అతను తమకు పదివేల రూపాయలు ఆన్‌లైన్లో చెల్లించినట్లు అనికేత్‌ కేశర్వానీ చెప్పాడు.

ఈ రెండు ఉదంతాలను చూసినపుడు జనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల పాలు కావచ్చు, ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు, ఊచలు లెక్కించవచ్చు. మనోభావాలను దెబ్బతీశారంటూ కేసులు ఎక్కడ నుంచైనా, ఎవరిమీదనైనా పెట్టవచ్చు, అందుకే జర జాగ్రత్త. అసలు చెత్తబండిలో ఫొటోల వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఆ ఫొటోలను చెత్తకుప్పలో వేసింది ఎవరన్నది తేల్చేందుకు యోగి సర్కార్‌ సిబిఐ, ఎన్‌ఐఏలతో దర్యాప్తు జరిపిస్తుందేమో చూడాలి. మరోసారి చెత్తబండ్ల పాలు కాకుండా వీధికి ఒక ఫొటో రక్షకుడిని ఏర్పాటు చేసి ఎవరు చిత్రాలను చెత్తలో వేస్తున్నదీ నిఘాపెట్టిస్తుందో చెప్పలేము. దోషులు తేలితే వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయించినా ఆశ్చర్యం లేదు. ఈ ఉదంతం తరువాత రాష్ట్రాల్లోని మున్సిపల్‌ కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖుల ఫొటోలు చిరిగినా, దుమ్ముపట్టినా, చీడపట్టినా, చెదపురుగులు తిన్నట్లు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలి లేదా వారికి అప్పగించాలి. లేనట్లయి అనవసర వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. సిఎం యోగి మెప్పు పొందేందుకు మధుర అధికారుల మాదిరి ఎక్కడైనా ఉన్నతాధికారులు అదే చేయవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిత్రాలు చేయరో శివుడో శివుడా : ఎస్కలేటర్‌ మీద డాలర్‌ – వెంటిలేటర్‌ మీద రూపాయి

17 Sunday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, RSS, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


మన కరెన్సీ రూపాయి ఏ రోజు ఎంత పతనం అవుతుందో తెలియని స్థితిలో ఉన్నాము. వచ్చే వారం (జూలై 18-24)లో రు.80.50కి పతనం కావచ్చని కొందరి అంచనా. అంతేనా లేక బలపడుతుందా, ఇంకా దిగజారుతుందా అంటే నోరు విప్పి ప్రధాని నరేంద్రమోడీ గారే చెప్పాలి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పుకుందాం. పురాతన చరిత్ర కలిగిన కరెన్సీలలో మన రూపాయి కూడా ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దిలోనే నాణాన్ని విడుదల చేసినట్లు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 340-290 కాలంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో ప్రధాన మంత్రిగా ఉన్న చాణుక్యుడు రాసిన అర్ధశాస్త్రంలో స్వర్ణ రూప, సీస రూప, తామ్ర రూప నాణాలతో పాటు రూపయ రూప అంటూ వెండినాణెం గురించి కూడా ప్రస్తావన ఉంది. తరువాత కాలంలో ఉన్న కరెన్సీ లేదా ద్రవ్య వ్యవస్థల గురించి అంత స్పష్టంగా లేదు. షేర్‌ షా సూరి పాలన 1540-45లో 178 గ్రెయిన్స్‌( తేలికైన గింజలు) లేదా 11.53 గ్రాముల బరువుతో వెండి నాణాలను ప్రమాణికంగా తయారు చేయించి దానికి రుపియా అని కూడా పేరు పెట్టారు. ఇప్పుడు ఒక డాలరుకు ఇన్ని రూపాయలు అన్నట్లుగా బాబరు కాలంలో 50 ఇత్తడి నాణాలకు రెండు వెండి నాణాలు సమంగా ఉండేవి.బ్రిటీష్‌ వారు అధికారానికి వచ్చే వరకు ఇవి కొనసాగాయి. బ్రిటీషు వారి ఏలుబడిలో మన రూపాయి పతనం తొలిసారిగా 1873లో జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా, అమెరికాలో తీవ్ర ఆర్ధిక మాంద్యం సంభవించింది.ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. అమెరికా, అనేక ఐరోపా వలస దేశాలలో వెండి నిల్వలను కనుగొనటం కూడా దీని కారణాలలో ఒకటి. విస్తారంగా దొరుకుతున్న కారణంగా దీని విలువ తగ్గి బంగారానికి గిరాకీ ఏర్పడింది.దాంతో అప్పటి నుంచి బంగారం ప్రామాణికంగా విదేశీ లావాదేవీలు నడిచాయి.


ఇక వర్తమానానికి వస్తే 1947ఆగస్టు 15న మన రూపాయి ఒక డాలరుకు సమంగా ఉన్నట్లు సమాచారం, ఏడాది సగటు రు.3.50 గా, 4.16గా ఉందని రెండు రకాల సమాచారం. కొనుగోలు, అమ్మకం ధరల్లో తేడా కూడా ఈ గందరగోళానికి కారణం కావచ్చు. ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. అప్పటి నుంచి మధ్యలో తగ్గినా, పెరిగినా మొత్తం మీద ఈ నెలలో రు.79.99కి పడిపోయింది. ఇక రూపాయి పతనం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం,హాస్య భరితమైన రచనలు, ట్విటరైట్ల జోకుల తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూడండి. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నా ఈ పరిస్థితికి కారణం మనం(జనం) కాదు గనుక విషాదంలో వినోదం మాదిరిగా చూద్దాం.
” ఎస్కలేటర్‌ మీద డాలర్‌ , వెంటిలేటర్‌ మీద రూపాయి, ఐసియులో దేశం.. దేవుడు రక్షించుగాక ”
” రూపాయి పడుతున్నదంటున్నారు ఎక్కడో చెప్పండి నేను వెతికి తెచ్చుకుంటా ”
” హమ్మయ్య ఎట్టకేలకు జరిగింది….. దశాబ్దాల తరువాత పెట్రోలు కంటే ఇప్పుడు బీరు చౌక. ఇంక మనం కొత్త నినాదం ఇవ్వవచ్చు జస్ట్‌ డ్రింక్‌ డోంట్‌ డ్రైవ్‌ ( తాగండి తప్ప బండి నడపొద్దు) ”
” రూపాయి-డాలరు బంధం పటిష్టత గురించి డాలరుతో చర్చలకు భారత్‌ సిద్దం ”
” రూపాయి పని తీరు ఎంత దారుణంగా ఉందో చైనా వారు గనుక తెలుసుకుంటే వారు అరుణాచల్‌ ప్రదేశ్‌ జోలికి రారని అనుకుంటున్నా ”
” భగవంతుడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే డాలర్‌, యూరో మాదిరి లోదుస్తుల బ్రాండ్‌గా రూపాయి లేదు. ఒక వేళ ఉంటే అది జారిపోతున్నపుడు యావత్‌ దేశ రూపం కనిపించేది ”
” డిస్నీలాండ్‌ కొత్త రైడ్‌ను ప్రారంభిస్తోంది. దానిలో ఎంతో ఎత్తు నుంచి కొద్ది సెకండ్లలోనే మీరు కిందికి జారిపోవచ్చు. దానికి వారు భారత రూపాయి అనే పేరు పెట్టబోతున్నారు ”
” రూపాయి సీనియర్‌ సిటిజన్‌గా మారినందుకు అభినందనలు ”
” రూపాయి పైకి వెళ్లేది ఒకే ఒక్కసారి అది టాస్‌ వేసినపుడు ”
” రూపాయిని రక్షించాలంటే ఒకే మార్గం ఉంది, డాలరుకు రాఖీ కట్టి రక్షించమని అడగాలి ”
” మీరు గనుక జీవితంలో ఓడినట్లు విచారపడుతుంటే ఒక్కసారి రూపాయిని చూడండి ”
” న్యూటన్‌ గనుక ఇప్పుడు బతికి ఉంటే గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి రూపాయి పతన ప్రాతిపదిక మీద కొత్తగా చెప్పి ఉండేవాడు. ఆపిల్‌ పండ్లు మెల్లగా పడి ఉండేవి ”


వాషింగ్టన్‌ పోస్ట్‌ డాట్‌కామ్‌ నివేదిక ప్రకారం ” రూపాయి చిహ్నం ప్రారంభం ఒక అశుభ దినాన జరిగిందని దేశంలోని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. చిహ్నంలోని అడ్డగీత రూపాయి నాలుక చీరేస్తా అన్నట్లుగా కనిపిస్తోంది ” అన్నారు.ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్‌ దారువాలా రూపాయి చిహ్న రూపకల్పనలో లోపం ఉందనటాన్ని అంగీకరించలేదు.” నవంబరు నుంచి గురుడి స్థితిని బట్టి అదృష్టం, అంతులేని సంపదల యోగం బలంగా ఉంది. డాలరు మీద రూపాయి బలపడుతుంది, షేర్‌ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది, ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను ఎంతగానో అభిమానించే ప్రధాన మంత్రి శని ప్రభావంలో ఉన్నారు. శని అంటే వృద్ది నెమ్మదిగా ఉంటుంది, ఆలశ్యం అవుతుంది, కుంభకోణాలు బయటికి వస్తున్నాయి. రోజుకు రోజుకు డాలరుతో రూపాయి బలహీనపడుతుంది. నవంబరు నుంచి ప్రధాని తారాబలం కూడా మెరుగుపడుతుంది.” రూపాయి చిహ్నాన్ని రూపొందించిన ధర్మలింగం ఉదయకుమార్‌ విమర్శల నుంచి పట్టించుకోలేదు.” నేను రూపాయి చిహ్నాన్ని రూపొందించినపుడు పరిస్థితులు వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆర్ధిక వ్యవహారాల గురించి వ్యాఖ్యానించేందుకు తగిన వాడిని కాదు.చిహ్న రూపకల్పన గురించి అడిగితే చెబుతా ” అన్నారు.


భారత క్రికెట్‌ కంట్రోలు బోర్డు ఆధిపతిగా ఉన్న ఎన్‌ శ్రీనివాసన్‌ తన జ్యోతిష్కుడి సమక్షంలో ప్రపంచ నేతలను సవాలు చేశారు.” వచ్చే వారం నాటికి రూపాయి స్థిరపడని పక్షంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం కాకుండా చూసేందుకు ఒక ఏడాది పాటు భారత టీము అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బిసిసిఐ నిరోధిస్తుంది.ఐతే మేము ఐపిఎల్‌లో ఆడతాము, హిందీ వ్యాఖ్యానంతో వాటిని కేవలం దూరదర్శన్‌ మాత్రమే ప్రసారం చేయాలి. విదేశాలు తమ దేశాల్లో ఐపిఎల్‌ను ప్రసారం చేయాలంటే ఇప్పుడు మేము చెల్లిస్తున్నదానికి పది రెట్లు మాకు చెల్లించాలి. స్వదేశంలో కూడా క్రికెట్‌ ఆడవద్దని మేము శ్రీలంకను కూడా కోరతాము. ఐపిఎల్‌తో సహా ఏ రకమైన క్రికెట్‌ ఆడవద్దని మన మంచి దోస్తులైన దక్షిణాఫ్రికాను కూడా కోరతాము. మన ఆర్ధిక వ్యవస్థ స్థిరపడేవరకు ప్రపంచమంతటి నుంచి క్రెకెటర్లు భారత్‌ రావాల్సిందే, ఎక్కడా ఏ విధమైన ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకూడదు.” అని శ్రీనివాసన్‌ అన్నారు.


బిసిసిఐ అభిజ్ఞవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం రూపాయి పతనం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ బాటింగ్‌ సగటును దాటే అవకాశం ఉందనే భయం కూడా ఉంది.రూపాయి వేగాన్ని సచిన్‌ టెండూల్కర్‌ కూడా అధిగమించలేదు. ఒక నాడు తన కెరీర్‌ను కాపాడుకొనేందుకు రాహుల్‌ ద్రావిడ్‌ వికెట్‌ కీపింగ్‌ చేపట్టాడు. రూపాయిలో మార్పులు రావాలని కూడా ద్రావిడ్‌ చెప్పాడు. బహుశా నోట్లు గుండ్రంగాను, నాణాలను చతురస్రంగా మార్చాలని కావచ్చునని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. రూపాయికి ఒక విలువను నిర్ణయించలేమని శ్రీశాంత్‌ ట్వీటాడు. బిసిసిఐ సాంకేతిక కమిటీ సభ్యుడు రవిశాస్త్రి వివరణ ఇస్తూ మరొక ఐపిఎల్‌ నిర్వహణ లేదా కేవలం భారత్‌లోనే క్రికెటర్లు ఆడేవిధంగా చూడాలి. తద్వారా విదేశీ పెట్టుబడిదార్లను దేశానికి ఆకర్షించాలి. ఇది గిరాకీ-సరఫరా ఆట, మనం గిరాకీని సృష్టించాలి.”
రాయల్‌ ఛాలెంజర్స్‌ అధిపతి డాక్టర్‌ విజయ మాల్య నిలిపివేసిన కింగ్‌ఫిషర్‌ జెట్‌ ఒకదానిలో కూర్చొని శ్రీనివాసన్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ను కూడా ఆదుకోవాలని బిసిసిని కోరాడు. ఆర్‌సిబి మరియు సిఎస్‌కె మామూలుగా అయితే ప్రత్యర్దులు, కానీ చూస్తే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రీనివాసన్‌ ఆ భేటీ తరువాత విలేకర్లతో చెప్పింది వేరేగా ఉంది. మా ఇద్దరికీ పనికిరాని కొడుకులున్నారు, కాబట్టి మాకు చక్కగా కుదిరిందన్నాడు. రూపాయి తిరిగి బలపడుతుందా అని తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది కనుక ప్రముఖ రాజకీయనేతలు, క్రికెటర్లు, ప్రపంచ నేతలతో తన న్యూస్‌ అవర్‌ కార్యక్రమంలో చర్చించేందుకు ఆర్నాబ్‌ గోస్వామి ఏర్పాట్లు చేసుకున్నాడు.


భక్తోం, మిత్రో ఆగ్రహించకండి, విశ్వగురువుగా ప్రపంచంలో నీరాజనాలు అందుకుంటున్న మన ప్రధాని ఎంతైనా నరేంద్రమోడీ, పాలన గురించి ఇలా జోకులేస్తారా, వాటిని మీరు మా ముందు పెడతారా అని కోప్పడకండి. పైన పేర్కొన్న జోకులన్నీ 2013లో యుపిఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ మీద వేసినవిగా గమనించాలి. ఇప్పుడు జోక్స్‌ వేయాలన్నా, షేర్‌ చేయాలన్నా ఎక్కడ కేసులు నమోదై ఇబ్బందులు పడతామో అన్న భయం వలన కావచ్చు అంతగా రావటం లేదు. పూర్వం రాజు గారు నవ్వితే నవ్వాలి లేదా తనను నవ్వించమని అడిగితే నవ్వించాలి తప్ప ఏదీ మనంతట మనం చేయకూడదు. రాజు గారు నవ్వేంత వరకు ఎదురు చూడాల్సిందే మరి. తొమ్మిదేండ్ల క్రితం రూపాయి మాదిరి ఇప్పుడూ ఉంది. కరోనాలో చూసిన పాతసినిమాలే చూసినట్లు ఇప్పుడు పాత జోకులతోనే సరిపెట్టుకుందాం.రోజులు బాగుంటే కొత్త జోకులు వస్తాయి.


”యుపిఏ ఏర్పడినపుడు రూపాయి-డాలరు నిష్పత్తి రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా ఉంది, ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గరగా ఉంది, మన్మోహన్‌ సింగ్‌ వయస్సును తాకుతుందేమో అన్నది మా అనుమానం” అని బిజెపి నేత రవిశంకర ప్రసాద్‌ ప్రసాద్‌ 2014కు ముందు జోక్‌ చేశారు. కాలం కలసి రాక ఇప్పుడు ఆ పెద్ద మనిషి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. లాయరు గనుక తిరిగి కోర్టులకు వెళుతున్నారో లేదో తెలియదు. చైనాతో వంద బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరపాలని మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చటంలో మన ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించారు.తొమ్మిదేండ్ల క్రితం రవిశంకర ప్రసాద్‌ చెప్పినట్లు సోనియా గాంధీ వయస్సు 67(ఇప్పుడు 75)ను దాటించారు. ఊపు చూస్తుంటే మన్మోహన్‌ సింగ్‌ వయస్సు80(ఇప్పుడు 89)కు చేరారు. తరువాత తన రాజకీయ గురువైన ఎల్‌కె అద్వానీ 85(ఇప్పుడు 94) గారికి దక్షిణ సమర్పించినా ఆశ్చర్యం లేదు. ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచిన నరేంద్రమోడీ : తన స్థానానికి ఎసరు వస్తుందేమోనని గోబెల్స్‌ ఆందోళన !

15 Friday Jul 2022

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Gender parity India-2022, Gobbles, Narendra Modi Failures, Propaganda War, RSS, WEF rankings


ఎం కోటేశ్వరరావు


” నరేంద్ర మోడీ ఎనిమిదేండ్ల పాలన కారణంగా విదేశాల్లో ఉన్న భారత సంతతి దేశానికి మరింత దగ్గరైంది, ప్రపంచ వేదిక మీద భారత ప్రతిష్ట ఎన్నడూ లేని విధంగా ఉన్నత స్థాయిలో ఉంది ” 2022 జూన్‌ 14వ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో శివప్రకాష్‌ అనే బిజెపి జాతీయ సంయుక్త కార్యదర్శి రాసిన ఆణిముత్యాలలో చెప్పిన అంశమిది. సరిగ్గా నెల రోజులకు ప్రపంచ ఆర్ధిక వేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ సమానత్వ నివేదిక మన దేశం గురించి చెప్పిందేమిటో ఒక్కసారి చూద్దాం.


ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రపంచ లింగ సామ్య లేదా పోలిక నివేదిక 2022ను తాజాగా విడుదల చేసింది.లెక్కలు కట్టే పద్దతి సరిగా లేదు లేకుంటేనా అన్నట్లుగా వివిధ ప్రపంచ సూచికల్లో మన స్థానం గురించి అధికారంలో ఉన్నవారు మాట్లాడతారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ మాటలు వినీ వినీ చిరాకు పుడుతోంది. లెక్కించే పద్దతి తప్పైతే, అది మన దేశ స్థానాలను సరిగా ప్రతిబింబించటం లేదు అనుకుంటే ఆ సర్వేల నుంచి మనం తప్పు కోవచ్చు లేదా వాటితో సంబంధం లేదని ప్రకటించవచ్చు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఎలా ! ప్రపంచంలో 195 దేశాలున్నాయి, వాటిలో 193 ఐరాస సభ్యదేశాలు. పాలస్తీనా, వాటికన్‌ సిటీలకు పరిశీలక హౌదా కల్పించారు. ప్రపంచ సూచికల్లో ఈ దేశాలన్నీ ఉండవు. కనుక మనం కూడా తప్పుకోవచ్చు, పరువును మరింతగా పెంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు.


2022 లింగ పోలిక నివేదికలో 146 దేశాలను చేర్చారు. దానిలో మనది 135వ స్ధానం, 2021నివేదికలో 156కు గాను మనది 140వ స్థానం చూశారా గతేడాది కంటే ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాం అన్నట్లుగా చూపుతున్నారు. దేశాల సంఖ్య తగ్గింది. మన మెరుగుదల తరుగుదల మనం సాధించిన పాయింట్లను బట్టి చూడాలి. 2021లో వచ్చింది 0.629 కాగా 2022లో 0.625 గా నమోదు. పాయింట్లు పెరిగితే మన స్థానం మెరుగుపడి సూచికలో ఎగువకు పోతాం. కనుక ఇది మెరుగుదల అంటే చూసి నవ్వాలా ఏడవాలా ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. 2020లో 112లో ఉన్నాము. 2022లోప్రధమ స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌కు 0.908 రాగా రెండవ స్ధానంలో నిలిచిన ఫిన్లాండ్‌కు 0.860 వచ్చాయి. ఆడా మగా తేడా లేదు అంతాసమానం అని చెప్పుకొనే అమెరికా 0.769 స్కోరుతో 27వ స్ధానంలో, 25వ స్ధానంలో ఉన్న కెనడాకు 0.772 వచ్చాయి. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ 71, నేపాల్‌ 96, శ్రీలంక 110, మాల్దీవులు 117, భూటాన్‌ 126, భారత్‌ 135, పాకిస్తాన్‌ 145, ఆప్ఘనిస్తాన్‌ 146వ స్థానంలో ఉంది. వీటిని చూపి మనం చివరి రెండు దేశాల కంటే మెరుగ్గా ఉన్నామని ఎవరైనా చెప్పుకుంటే నిజంగా సిగ్గు చేటు.


ప్రపంచంలో ఇప్పుడున్న స్థితిగతులను బట్టి లింగ సమానత్వాన్ని సాధించాలంటే మరో 132 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు మాత్రమే. ప్రాంతాల వారీగా ఉత్తర అమెరికా 59, ఐరోపా 60, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల్లో 67,ఆఫ్రికాలోని సబ్‌ సహారా ప్రాంతంలో 98, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 115, మధ్య ఆసియా 152, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో 168, దక్షిణాసియాలో 197 సంవత్సరాలు పడుతుందని అంచనా. 2021 నివేదికలో ఇది 195.4 సంవత్సరాలుగా ఉంది. ఈ లోపల కరోనా వంటి మహమ్మారులు, ఇతర కల్లోలాలు వస్తే మరింత ఆలశ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. కరోనాకు ముందు లింగసమానత్వ సాధనకు పట్టే సగటు కాలాన్ని వంద సంవత్సరాలుగా అంచనా వేశారని గమనించాలి. కరోనాతో మరో 32 సంవత్సరాలు వెనక్కు వెళ్లింది. కల్లోలాలు వచ్చినపుడు ముందుగా దెబ్బతినేది మహిళలే. గతేడాదితో పోలిస్తే నాలుగు సంవత్సరాలు తగ్గింది.


వివిధ ప్రపంచ సూచికల్లో మనం ఎక్కడున్నాం అన్నది వాటిని ప్రకటించినపుడల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు. కొన్ని సూచికల్లో మన స్థానాలేమిటో చూద్దాం.
ప్రపంచ పోటీ తత్వం 2022 – 37
ప్రజాస్వామ్య సూచిక 2021-46
నవకల్పన 2021-46
సులభతర వాణిజ్యం 2021- 63
డిజిటల్‌ నైపుణ్యం 2022 – 63
ఆరోగ్య భద్రత 2021 – 66
ప్రపంచ నైపుణ్యం 2022 – 68
ఆహార భద్రత 2021 – 71
చట్టబద్ద పాలన 2021 – 79
లంచాల ముప్పు 2021 – 82
అవినీతి సూచిక 2021- 85
ఆకలి సూచిక 2021 – 101
మానవ స్వేచ్చ 2020 – 111
పిల్లల హక్కులు 2021-113
ఇంటర్నెట్‌ వేగం 2022 – 115
ఆర్ధిక స్వేచ్చ 2021-121
యువజన అభివృద్ధి 2021- 122
అసమానతల తగ్గింపు కట్టుబాటు 2021-129
మానవ అభివృద్ది 2020 – 131
ప్రపంచ శాంతి 2021-135
సంతోష సూచిక 2021 -136
ప్రపంచ పత్రికా స్వేచ్చ 2022 -150
పర్యావరణ పనితీరు 2022-180


బేటీ బచావో బేటీ పఢావో అంటూ 2015 జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ప్రచారం తరువాత లింగ సమానత్వంలో దేశం మరింత దిగజారింది. ఆర్ధిక రంగంలో భాగస్వామ్యం-అవకాశాలు, విద్య,ఆరోగ్యం-ప్రాణ రక్షణ, రాజకీయ సాధికారత అంశాల ప్రాతిపదికన లింగ సమానత్వ సూచికను ఖరారు చేస్తారు. తాము అధికారానికి వస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఉభయ సభల్లో మెజారిటీ ఉన్నా దాని గురించి మాట్లాడరు. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఏలుబడిలో మహిళలకు రాజకీయ సాధికారతకు ఒక సూచికగా పరిగణించే అంశంలో దిగజారటం తప్ప మార్కులు పెరగటం లేదు. 2019లో 23.1శాతంగా ఉన్న మహిళా మంత్రులు 2021 నాటికి 9.1శాతానికి తగ్గారు. చట్టసభల్లో, సీనియర్‌ అధికారులు, మేనేజర్లుగా ఉన్న మహిళలు 2022 నివేదిక ప్రకారం 17.6 శాతం మందే.


ఇన్ని వివరాలు చూసిన తరువాత నిజంగా కలికాలం లేదా కలి మహత్యం కాకపోతే ప్రపంచంలో దేశ ప్రతిష్టను నరేంద్రమోడీ పెంచారని ఎనిమిదేండ్ల తరువాత కూడా పాడిందే పాడరా అన్నట్లుగా ఇంకా చెప్పుకోవటం ఏమిటి ? జనం చెవుల్లో పూలు పెట్టటం అంటే ఇదే. బిజెపి నేతలకు, నరేంద్రమోడీ భక్తులకు నిజంగా ఈ వివరాలేవీ తెలియవా లేక తెలవనట్లు నటిస్తున్నారా ? ఇలాంటి తప్పుడు తప్పుడు ప్రచారాలకు విశ్వగురువు జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్‌. మన దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చూసి ఇప్పటి వరకు గోబెల్స్‌ ప్రచారం అనే బదులు ఇక ముందు బిజెపి లేదా మోడీ ప్రచారం అని పిలుస్తారేమోనని స్వర్గంలో ఉన్న గోబెల్స్‌ ( ఇలాంటి వారిని నరకం భరించలేదు ) ఇటీవల భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మన ప్రధాని నరేంద్రమోడీ మానస మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కుహనా వార్తలు, ప్రచారాన్ని తట్టుకోలేక 2017 నవంబరు 27న ఫేక్‌ న్యూస్‌ అవార్డు, దానికి గాను ఫేక్‌ న్యూస్‌ ట్రోఫీ ఇస్తే బాగుండునని ఒకట్వీట్‌లో ప్రతిపాదించాడు. మోడీ గారు ఇంకా అధికారంలో ఉండటమే కాదు, 2024లో కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నారు గనుక జనాన్ని చైతన్య పరిచేందుకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పర్యవేక్షణలో ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: