• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CPI(M)

బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !

04 Saturday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Filims, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Budget-2023-24, Farmers, Fertilizers subsidies, Food Subsidy, india debt, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?

26 Thursday Jan 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

“India: The Modi Question”, block out on BBC documentary, Defiant Indian students, DYFI, Explosive BBC documentary, Jamia Millia Islamia, Prime Minister Narendra Modi, sfi


ఎం కోటేశ్వరరావు


పట్టించుకోవాల్సినంత గొప్పది కాదు , వదిలేయండి అంటూనే మోడీపై బిబిసి డాక్యుమెంటరీలను దేశమంతటా ప్రదర్శించే విధంగా, చూసేట్లు విద్యార్థులను, ఇతరులను కేంద్ర ప్రభుత్వం పురికొల్పిందా ? సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్య వికటించిందా ? కుర్రకారును రెచ్చగొట్టిందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలాగే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనానికి అండుబాటులో ఉంచకూడదని మన ప్రజాస్వామిక సర్కార్‌ భావిస్తే అనేక దేశాల్లో జరిగిన మాదిరి ఏ రూపంలో బహిరంగ ప్రదర్శనలు చేసినా నిషేధం విధించటం తప్ప మరొక మార్గం లేదు, చివరికి అంతపనీ చేస్తుందా ? అనేక ప్రశ్నలు, సందేహాలు. బిబిసి డాక్యుమెంటరీలో నరేంద్రమోడీ పాత్ర గురించి చిత్రించిన తీరును తాను అంగీకరించటం లేదని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించటం తప్ప రెండవ భాగ ప్రసార నిలిపివేతకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపున తమకసలు అలాంటి డాక్యుమెంటరీ ఒకటి ఉందని తెలియదంటూ అమెరికా చేతులు దులుపుకుంది. అనేక దేశాల్లో ప్రతికూల స్పందన వెల్లడైంది. నరేంద్రమోడీని విశ్వనేతగా పరిగణిస్తున్న ఏ ఇతర దేశమూ దీని గురించి స్పందించినట్లు వార్తలు లేవు.మొత్తం మీద గాలికి పోతున్నదాన్ని పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నట్లయింది.


గుజరాత్‌ మారణకాండపై ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షికతో బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్‌, ట్విటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని ఖాతరు చేయకుండా రెండవ, చివరి భాగాన్ని మంగళవారం రాత్రి బిబిసి ప్రసారం చేసింది. ఈ భాగంలో 2019లో నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల గురించి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిదాని నిబంధనలే దీనికి వర్తిస్తాయి గనుక సామాజిక మాధ్యమంలో చూడలేము. ఇతర మార్గాల్లో సంపాదించి దేశమంతటా ప్రదర్శిస్తామని విద్యార్థులు ప్రకటించటం, మొదటి భాగం అనుభవం చూసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుగా బృందాలలో ప్రదర్శనలను నిషేధిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ నిషేధించినా వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో చూడవచ్చు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం ఉన్నందున ఆలోగా నిషేధానికి పూనుకుంటే ప్రపంచమంతటా అది మరింతగా ప్రచారం పొందుతుంది, కనుక తరువాత చేస్తారా ? అసలే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, జరిగిన రచ్చ చాలు, ఇంతటితో ముగిద్దామని అనుకుంటారా ?


చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నది సైన్సు చెప్పిన అంశం. అది ఏ విధంగా ఉంటుందన్నది వేరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యకు ప్రతిగా సదరు డాక్యుమెంటరీలో ఏముందో చూడాల్సిందే అంటూ దేశమంతటా విద్యార్థులు పూనుకున్నారు. ఆ మేరకు అనేక చోట్ల పూనుకున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. చూశాము అంటే ఏదో ఒక వైఖరిని వెల్లడించాలి గనుక తప్పించుకొనేందుకు ” అవునా, మా భాగస్వామి, గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ మీద బిబిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిందా, మాకు తెలియదే ” అన్నట్లుగా అమెరికా పెద్ద అమాయకురాలి ఫోజు పెట్టింది. రష్యా,చైనాతో ఉన్న వైరంలో వాటిని దెబ్బతీసేందుకు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని చూస్తున్న అమెరికా ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్దంగా లేదు. అందుకే విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను విలేకర్లు బిబిసి డాక్యుమెంటరీ గురించి అడగ్గా మీరు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు గానీ అమెరికా-భారత్‌ రెండూ సచేతన ప్రజాస్వామ్యాలు, సంబంధాలు వృద్ది పొందటానికి పరస్పరం పంచుకొనే విలువల గురించి మాత్రం బాగా తెలుసు అన్నాడు. భారత్‌తో అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం సడలకుండా చూసుకోవటంలో రాజకీయ,ఆర్థిక,ప్రత్యేకించి వ్యక్తిగతమైన సంబంధాలు కూడా కీలకమని పేర్కొన్నాడు. ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా బిబిసి పేర్కొన్నదానిని ఖండించటం గానీ, నరేంద్రమోడీకి మద్దతుగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది పుండుమీద కారం చల్లటం వంటిదే. చూసిన తరువాత చెబుతామంటే ఒకతీరు. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగిన అమెరికాకు భారత్‌లో సంచలనం కలిగించిన మోడీ డాక్యుమెంటరీ వివాదం గురించి తెలియదంటే ఎవరూ నమ్మరు. మోడీ నిలదీసే స్థితిలో లేరు గనుక నటించి అమెరికా ప్రతినిధి తప్పుకున్నాడు. ఏదో ఒక రూపంలో దొంగచాటుగా నైనా చూసేందుకు మోడీ మద్దతుదారులను కూడా పురికొల్పిన ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందని ప్రధాని సలహాదారులు, వ్యూహకర్తలు ఊహించని పరిణామం ఇది.


” మోడీ డాక్యుమెంటరీని అడ్డుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తుండగా దాన్ని చూసేందుకు పోరాడుతున్న విద్యార్థులు ” అనే శీర్షికతో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది. ” మోడీ మీద బిబిసి డాక్యుమెంటరీని మరింతగా ప్రదర్శించేందుకు పూనుకున్న తిరుగుబాటు విద్యార్థులు ” అనే శీర్షికతో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఇచ్చిన వార్త ప్రపంచమంతటా అందుబాటులోకి వచ్చింది. ఇంత జరిగినా ఇంటా బయటా కూడా మా ఇంట్లో వారు మోడీకి వ్యతిరేకంగా ఏది చూపినా చూడొద్దన్నారు గనుక చూడం, రాసేవాటిని చదవటం తప్పన్నారు గనుక మేం చదవం అనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారు తప్ప ఇతరులు చూడకుండా ఉంటారా ? ఇంత జరిగాక కూడా అమెరికా వారు కళ్లు మూసుకుంటారా ? అసలేమీ మాట్లాడరా ? ఒక వేళ తప్పు పడితే అమెరికా ప్రవచించే ప్రజాస్వామిక, భావప్రకటనా స్వేచ్చ గురించి కొత్త చర్చ మొదలౌతుంది. ఆ తలనొప్పిని వారు ఎందుకు తెచ్చుకుంటారు ! కేంద్ర ప్రభుత్వం తనకున్న ఎమర్జన్సీ అధికారాలతో సదరు డాక్యుమెంటరీని అందుబాటులోకి తెచ్చే సామాజిక మాధ్యమాల ఇంటర్నెట్‌ లింకులను తెంపింది తప్ప ప్రదర్శించటాన్ని, చూడటాన్ని నిషేధించలేదు.


నిషేధించకున్నా ఢిల్లీలోని జెఎన్‌యు అధికారులు నరేంద్రమోడీ మెప్పు పొందేందుకుగాను కుంటిసాకులు చూపి విద్యార్ధి సంఘం హాలులో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. మంగళవారం రాత్రి గేట్లు మూసివేసి ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ప్రదర్శన జరగకుండా అడ్డుకొనేందుకు చూశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపలేరు అన్నట్లుగా విద్యార్థులు ప్రాంగణంలోని ఒక కెఫ్టేరియాలో గుమికూడి తమ సెల్‌ఫోన్లు,లాప్‌టాప్‌లలో చూసి పంతం నెగ్గించుకున్నారు. అలా చూస్తున్నవారి మీద చీకటిలో పక్కనే ఉన్న పొదలమాటు నుంచి రాళ్లతో దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొన్నారు, వారు ఎబివిపికి చెందినవారిగా గుర్తించారు. అంతకు ముందు అధికారుల తీరుకు నిరసన తెలిపారు. రాళ్ల దాడి తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన వారి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు, విద్యార్థి సంఘ అధ్యక్షురాలు అయిషి ఘోష్‌ చెప్పారు. అధికారులు ఒక ప్రదర్శనను అడ్డుకోవచ్చు, మేం వందల ప్రదర్శనలకు పూనుకుంటాం అన్నారు. కాశ్మీరీ ఫైల్స్‌ వంటి సినిమాలను ప్రదర్శించినపుడు వద్దనే సలహాలు అధికారుల నుంచి రాలేదని,తొలిసారిగా ఇప్పుడు వచ్చినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందురోజు ప్రదర్శనకు ముందుగా అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఏ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలో చెప్పాలంటూ విద్యార్ధి సంఘం ప్రశ్నించింది. వైస్‌ ఛాన్సలర్‌ శాంతిశ్రీ పండిట్‌, రెక్టర్‌ సతీష్‌ చంద్రగానీ అందుబాటులోకి రాలేదని, తనకు మాట్లాడే అధికారం లేదని డిప్యూటీ రిజిస్ట్రార్‌ రవి కాంత్‌ సిన్హా అన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. కాంపస్‌లో మూడో వంతు ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వైఫల్యం తప్ప కావాలని నిలిపివేసింది కాదని విసి, రిజిస్ట్రార్‌ తమకు నివేదించారని విద్యామంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.


ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ అధికారులు కూడా ప్రదర్శనను అనుమతించేది లేదని మంగళవారం నాడు ప్రకటించారు. పోలీసులను రంగంలోకి దించి ఎవరూ గుమికూడ కుండా అడ్డుకున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఎలాగైనా చూడాలనే ఆసక్తిని పెంచుతున్నారని, ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. బుధవారం నాడు అనేక మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలతో సహా 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పిటిఐ పేర్కొన్నది. ప్రాంగణమంతటా సాయుధ బలగాలను మోహరించారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన గురించి ఫిర్యాదు చేసినట్లు ఏబివిపి ప్రకటించింది.


దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌ వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అసమ్మతి గళాన్ని ఎవరూ నిరోధించలేరని చెప్పారు. కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపు మేరకు అనేక కాలేజీలు, వెలుపల మంగళవారం నాడు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. రాష్ట్రంలో ఈ చిత్ర ప్రదర్శనకు కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు, సంస్థలు పోటా పోటీగా పిలుపునిచ్చాయి. దీన్ని నిరసిస్తూ బిజెపి మద్దతుదార్లు ప్రదర్శనలు చేశారు.చిత్ర ప్రదర్శన దేశద్రోహమని వర్ణించి నిరోధించేందుకు సిఎం పూనుకోవాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రతలకు భంగకరమని రాష్ట్ర బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఈమేరకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు, ఆరోపణలు మరింత పెరిగితే డాక్యుమెంటరీని చూడటం దేశభక్తిగా భావించే అవకాశం ఉంది. బిజెపితో తనకు తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ చిత్ర ప్రదర్శనకు అంగీకరించటంలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ ప్రకటించటం గమనించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎంతగా మూసిపెట్టాలనుకుంటే అంతగా బహిరంగంగా ప్రదర్శిస్తామని, ఒక్క కేరళలోనే గాక దేశమంతటా ఆపని చేస్తామని రాష్ట్ర డివైఎఫ్‌ఐ నేత వికె సనోజ్‌ విలేకర్లతో చెప్పారు. దీనిలో దేశ వ్యతిరేకత ఏమీ లేదని, ఉద్రిక్తతలను సృష్టించేందుకు కాదని అన్నారు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రదర్శిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రకటించింది. మొత్తం మీద దేశమంతటా ఇదొక ప్రధాన అంశంగా మారేతీరు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌ ఓటమి ఎవరిది ! ముస్లిం విద్వేషం రెచ్చగొడితేనే బిజెపికి ఓట్లా ?

11 Sunday Dec 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Gujarat verdict 2022, Himachal verdict 2022, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

07 Wednesday Dec 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adani Group, BJP, Kerala LDF, Latin Catholic archdiocese, Pinarayi Vijayan, RSS, Vizhinjam project


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేట్రేగుతున్న కేరళ గవర్నర్‌ : 15న రాజభవన్‌ వద్ద ధర్నా , ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ !

29 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Arif Mohammed Khan, BJP, Kerala LDF, Narendra Modi, Pinarai Vijayan, RSS, Subramanya swamy


ఎం కోటేశ్వరరావు


కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తనకు పదవి ఇచ్చిన కేంద్ర పెద్దలను సంతుష్టీకరించేందుకుగాను నానా పాట్లు పడుతున్నారు. దానిలో భాగంగానే ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా పేట్రేగుతూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నారు. పచ్చి అవాస్తవాలు కూడా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి కేంద్ర నేత సుబ్రమణ్య స్వామి మరింతగా రెచ్చిపోయారు. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వెంట్రుకను ముట్టుకున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఒక ట్వీట్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.” రాజ్యాంగం ప్రకారం కేరళ గవర్నర్‌ అంటే భారత రాష్ట్రపతి ప్రతినిధి అని కేరళలోని వెర్రి కమ్యూనిస్టులు తెలుసుకొనేట్లు చేయండి. ఒక వేళ గవర్నర్‌ వెంట్రుకను ముట్టుకున్నా మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సిద్దం కావాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని ఒక ట్వీట్‌ చేశారు. తాజా వివాదానికి వస్తే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో యుజిసి నిబంధనలను పాటించని కారణంగా వారంతా రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆదేశించారు. దీని గురించి పరోక్షంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ చేసిన సాధారణ విమర్శ తన గురించే అని ఊహించుకొని ఏకంగా మంత్రిని తొలగించాలని లేఖ రాశారు.


కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో బాలగోపాల్‌ మాట్లాడుతూ ” ఉత్తర ప్రదేశ్‌ వంటి చోట్ల ఉన్న పరిస్థితులకు అలవాటు పడి అక్కడి నుంచి వచ్చిన కొందరికి కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామికంగా పని చేస్తున్న తీరును అర్ధం చేసుకోవటం కష్టం. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ భద్రతా సిబ్బంది ఐదుగురు విద్యార్దుల మీద కాల్పులు జరిపారు. నేను అప్పుడు ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్‌ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారు.అక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అది.” అన్నారు. గవర్నర్‌ ఖాన్‌ పేరు ప్రస్తావించినట్లుగా ఏ పత్రిక కూడా వార్తలు ఇవ్వలేదు. కానీ ఆమాటలను తనకు వర్తింప చేసుకొని, మంత్రిగా బాలగోపాల్‌ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున తాను ఇచ్చిన సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నానని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అక్టోబరు 25న ఒక లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. దాన్ని విజయన్‌ తిరస్కరించుతూ, గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, బాలగోపాల్‌ మంత్రిగా కొనసాగటానికి గవర్నర్‌ అనుమతి అవసరం లేదు కనుక ఎలాంటి చర్య అవసరం లేదని అన్నారు. తొలగించాలన్న పదాన్ని గవర్నర్‌ పేర్కొనకపోయినా మంత్రిని తొలగించాలన్నదే దాని తార్కిక ముగింపు.


ముఖ్యమంత్రి గనుక మంత్రిని తొలగించకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారని శుక్రవారం నాడు ఢిల్లీలో గవర్నర్‌ ఖాన్‌ ది ప్రింట్‌ పత్రిక ప్రతినిధితో చెప్పారు. ఆర్ధిక మంత్రి బాలగోపాల్‌ను తొలగించాలని తాను కోరలేదని, తన సమ్మతి లేకుండా పదవిలో కానసాగే అవకాశం లేదని రాజ్యాంగం చెప్పిన దానిని కేవలం వివరించానని గవర్నర్‌ వివరించారు. తన లేఖ మీద నిర్ణయం ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిందని, అయితే ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రమాణం చేయించాల్సింది గవర్నర్‌,నేనాపని చేశాను. దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతానని అతను ప్రమాణం చేశాడు. అతను( బాలగోపాల్‌ ) దాన్ని ఉల్లంఘించారు. విద్యావ్యవస్థను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తే అది ఉల్లంఘన కాదా ! అతనికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని కూడా తెలియదు, అంతేకాదు దాని వైస్‌ ఛాన్సలర్లను ఉత్తరాది నుంచి గాక దక్షిణాది నుంచి నియమిస్తారు అని గవర్నర్‌ చెప్పారు.( ఆ విశ్వవిద్యాలయ ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ సుధీర్‌ కె జైన్‌.2000 సంవత్సరంలో తెలుగువాడైన విసి సింహాద్రి, 2003లో పచ్చా రామచంద్రరావు పనిచేశారు. వారికి ముందు 1952 వరకు-తరువాత జాబితాను చూస్తే ఉత్తరాది, ఇతర ప్రాంతాల వారు, ఒకరిద్దరు తప్ప దక్షిణాది వారు కనిపించరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు ఈ అంశాలు తెలియవనుకోవాలా ? లేక బుకాయించారా. జాబితాను ఎవరైనా చూడవచ్చు. ) తనకు కేరళలోని ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని గవర్నర్‌ చెప్పుకున్నారు.


వైస్‌ ఛాన్సలర్లు రాజీనామాలు సమర్పించాలని తాను సూచించానే తప్ప ఉత్తరువులు ఇవ్వలేదని, తన సూచనలను నిర్ణీత గడువులో ఖాతరు చేయనందున సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశానని గవర్నర్‌ చెప్పారు. తన మార్గదర్శకాలను కోర్టు పక్కన పెట్టిందని చెప్పటం తప్పని గవర్నర్‌ అన్నారు. కేసు విచారణ రోజున విసిలకు పదకొండు గంటల వరకు గడువు ఇచ్చానని ఎలాంటి స్పందన లేకపోవటంతో 11.30 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే రోజు కోర్టు సాయంత్రం నాలుగు గంటలకు విచారించిందని అప్పటికే నోటీసులు జారీ చేశానని అన్నారు. సమాధానం చెప్పేందుకు వారికి నవంబరు మూడవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు చెప్పారు.


గవర్నర్‌ చేస్తున్న పనులన్నీ సంఘపరివార్‌ అజెండా మేరకే ఉన్నాయని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నందున నవంబరు 15న రాజభవన్‌ ఎదుట, జిల్లా కేంద్రాలలో ఎల్‌డిఎఫ్‌ నిరసన తెలుపుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ప్రకటించారు. రాజభవన్‌ వద్ద సిఎం కూడా పాల్గొంటారని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని, విసిలను తరచూ బెదిరిస్తున్నారని అన్నారు. ఏదో విధంగా సెనెట్‌, సిండికేట్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని దూర్చేందుకు చూస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని అన్నారు. నవంబరు రెండవ తేదీన భావ సారూప్యత కలిగిన వారితో పెద్ద సభ నిర్వహిస్తామని, పదవ తేదీలోగా జిల్లాల్లో సభలు, పన్నెండవ తేదీన కాలేజీల్లో జరుగుతాయని చెప్పారు.


గవర్నర్‌ విధుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదని, అంతకు మించి ఇతర అధికారపరిధిలోకి ఒక్క అంగుళం మేర ప్రవేశం గురించి కూడా ఊహించుకోవద్దని, తలదూర్చుదామనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హితవు చెప్పారు.వ్యక్తిగత హౌదాతో పని చేసేందుకు గవర్నర్లకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. వైస్‌ ఛాన్సలర్ల రాజీనామా కోరటం లేని అధికారాన్ని చెలాయించ చూడటమే అన్నారు. కెటియు వైస్‌ ఛాన్సలర్‌ నియామకాన్ని కోర్టు కొట్టివేయటాన్ని అవకాశంగా తీసుకొని తొమ్మిది మంది విసీలను తప్పు కోమని కోరుతున్నారని, ఒక వేళ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగితే నియమించే అధికారర ఉన్న గవర్నర్‌దే దానికి దానికి ప్రాధమిక బాధ్యత అవుతుందని అన్నారు. కెటియు విసి ఉదంతంలో అకడమిక్‌ అర్హతలు లేవని సుప్రీం కోర్టు చెప్పలేదని, అనుసరించిన పద్దతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ఈ వివాదం హైకోర్టులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటీషన్‌ వేసే అవకాశం ఉందని, ఈ లోగా దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్‌ రాష్ట్రం మొత్తంలో యంత్రాంగాన్ని అస్థిరపచేందుకు చూస్తున్నారని సిఎం చెప్పారు. సుప్రీం తీర్పు ఒక్క కెటియుకే పరిమితమని అన్నారు.


వైస్‌ ఛాన్సలర్లను తొలగించేందుకు రెండు కారణాలుండాలని వాటిలో నిధుల దుర్వినియోగం, చెడునడతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వాటి మీద హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి విచారణ జరిపి నిర్దారిస్తేనే తొలగించాలి తప్ప ఛాన్సలర్లకు తొలగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గవర్నర్‌ తీరు ప్రజల తీర్పునే అవమానించేదిగా ఉంది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం, రాజ్యాంగమిచ్చిన అధికారాల మేరకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లను సకాలంలో ఆమోదించకపోవటంతో పదకొండింటికి గడువు ముగిసింది.2019లో గవర్నర్‌గా వచ్చిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదాన్ని గవర్నర్‌ ముందుకు తెస్తున్నారు. మంత్రి వర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదివేందుకు తిరస్కరించి తన స్వంత ప్రసంగం చేశారు. తాను కోరిన అధికారిని విధుల నుంచి మార్చకపోతే గవర్నర్‌ ప్రసంగ ప్రతిపై సంతకాలు చేసేది లేని భీష్మించారు. మంత్రుల నియామకం, తొలగింపులో గవర్నర్లకు విచక్షణ అధికారాలు లేవు. గవర్నర్‌ ఖాన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రారంభించి, సెనెట్‌, సిండికేట్‌ మెంబర్స్‌, చివరికి విసీలను కూడా రచ్చ చేస్తున్నారు. పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంఘపరివార్‌ శక్తులు అడుగుపెట్టిన జెఎన్‌యు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిందేమిటో తెలిసిందే, కేరళ సంస్థలను కూడా అలాంటి వారితో నింపేందుకు చూస్తున్నారని ఎల్‌డిఎఫ్‌ విమర్శిస్తోంది.


గవర్నర్‌ తీరుతెన్నులను కాంగ్రెస్‌ కూడా విమర్శించింది. ప్రశ్నించటానికి వీల్లేని దేవుడేమీ కాదు అంటూ ప్రతిపక్ష నేత విడి సతీషన్‌ చెప్పారు. మంత్రిని తొలగించాలనే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రి తొలగింపు కోరుతూ గవర్నర్‌ రాసిన లేఖకు పూచికపుల్లకున్న విలువ కూడా లేదని మాజీ మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ అన్నారు. ఈ వివాదం చివరకు ఏమౌతుంది, ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వద్దకు కేరళ గవర్నర్‌ : పదవి గౌరవాన్ని మంటకలిపిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ! అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !!

21 Wednesday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Kerala BJP, Kerala Governor Arif Mohammed Khan, Kerala LDF, Pinarai Vijayan, RSS



ఎం కోటేశ్వరరావు


తన ఆహ్వానాన్ని మన్నించి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి రాలేదని, తనను కలవటం లేదని, ప్రోటోకాల్‌ మర్యాదలను మంట గలుపుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళశై వాపోవటం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి, ఆమె రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చారనే విమర్శలకు గురైన అంశం తెలిసినదే. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మరొక అడుగు ముందుకు వేసి స్వయంగా ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను 2022 సెప్టెంబరు 17న ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. అంతే కాదు, మరీ ఎక్కువ మాట్లాడితో మరోసారి వెళ్లి కలుస్తా, నా ఇష్టం అంటూ చిందులు వేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే త్రిసూర్‌లో పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గవర్నర్‌ కలిసినట్లు అధికారులు చెప్పారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. తరువాత గవర్నర్‌ విలేకర్లతో మాట్లాడుతూ 2019లో కన్నూరులో తనపై దాడికి యత్నించినవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని గవర్నర్‌ ఆరోపించారు.


రాజభవన్‌ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్‌ రాజభవన్లో నాటి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను కలిశారు. వేరే చోట కలిసిన కేరళ గవర్నర్‌ సోమవారం నాడు(19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకోవటమే కాదు, మోహన్‌ భగవత్‌ రాష్ట్రానికి వస్తే మరోసారి వెళ్లి కలుస్తా అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్‌ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్‌ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారు అనేక రాజభవన్ల పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురుదాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు. సిపిఎం హింసాత్మక భావజాలంతో పని చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గవర్నర్‌ చెప్పుకున్నారు. వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర కూడా ఉందని విలేకర్లు చెప్పగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ అధికారంలో లేదు, ప్రభుత్వం అలాంటి హింసాకాండను అదుపులో పెట్టాలి అన్నారు.


ఈ పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని కూడా వద్దంటారు : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై పినరయి విజయన్‌


కమ్యూనిజం విదేశీ సిద్దాంతమంటున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్‌ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిపరుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీ, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు గవర్నర్‌ విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.దాన్ని ప్రస్తావించిన విజయన్‌ ఇటలీలోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం, క్రైస్తవం, ముస్లిం వ్యతిరేకతను హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ రోజు కమ్యూనిజం విదేశీ అంటున్న గవర్నర్‌ రేపు ప్రజాస్వామ్యం కూడా అలాంటిదే వద్దంటారని ధ్వజమెత్తారు.


గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసన ప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది.చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ(సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్రనిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్‌ వాదులాటకు దిగారు.ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్‌ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్‌ విలేకర్లకు అందచేశారు.


ఆ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రాగేష్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం,భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు.ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్‌ రవీంద్రన్‌ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్‌ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్‌ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్‌ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్‌ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయరోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్‌ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్‌ హబీబ్‌ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు.అయితే దాన్ని చూసినపుడు గవర్నర్‌ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది.మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్‌ హబీబ్‌ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్‌ ఆరోపణలు పసలేని, కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ఆ సభలో సంబంధం లేని అంశాలను గవర్నర్‌ మాట్లాడతారని ఎవరికైనా ముందుగా ఎలా తెలుస్తుంది. ఈ పత్రికా గోష్టిలోనే గవర్నర్‌ కమ్యూనిజం మీద, పాలకపార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.


వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్‌ అదే చేశారు.అసెంబ్లీ ఆమోదించిన పదకొండింటికి గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్‌ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.


కాంగ్రెస్‌ జోడో యాత్రలో సావర్కర్‌ చిత్రం !
తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి లొంగి వారి సేవ చేసుకుంటానంటూ లేఖలు రాసి జైలు నుంచి బయపడిన వివాదాస్పద హిందూత్వ నేత విడిసావర్కర్‌ చిత్రాన్ని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల సరసన బానర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ నిర్వాకం కేరళలో జరిగింది.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం నాడు ఎర్నాకుళం జిల్లా ఆలువలో ప్రవేశించినపుడు ఏర్పాటు చేసిన బానర్లలో ఇది ఒకటి. ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌ నేతలు సావర్కర్‌ బొమ్మ మీద మహాత్మా గాంధీ చిత్రాన్ని అంటించారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగింది. దీనికి చెంగన్మాడ్‌ నియోజకవర్గ ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సురేష్‌ కారకుడంటూ అతడిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌కు లేదా జోడో యాత్ర నిర్వాహకులకు సంబంధం లేదని, స్థానిక కార్యకర్తలు చేసినపని అని కాంగ్రెస్‌ సంజాయి షి చెప్పుకుంది.


అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !
ఆదివాసి గోత్ర మహాసభ నేతగా కేరళలో ప్రాచుర్యం పొందిన సికె జాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బిజెపి కూటమిలోకి వచ్చేందుకు గాను లంచం ఇచ్చిన కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అడ్డంగా దొరికారు. జనాధిపత్య రాష్ట్రీయ సభ పేరుతో 2016లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ పేరుతో బిజెపితో కలసి పోటీ చేసింది.ఎన్‌డిఏ నుంచి విడిపోతున్నట్లు 2018లో ప్రకటించింది. తిరిగి 2021 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేయాలని కోరిన బిజెపి ఆమెకు డబ్బు ఇచ్చింది. మంతన్‌వాడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తొలి విడతగా పది లక్షలు ఇచ్చారు. ఫోన్లో మాట్లాడారు. మరో పాతిక లక్షలు ఇస్తానని చెప్పారు. ఈ అంశాన్ని జాను సహచరిగా ఉన్న ప్రసీత చెప్పటమే గాక ఆధారంగా ఫోన్‌ సంభాషణ రికార్డులను వెల్లడించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సురేంద్రన్‌, ఇతరుల గళాలను రికార్డు చేసి ఫోరెన్‌సిక్‌ లాబ్‌ పరీక్షకు పంపారు. బుధవారం నాడు వెలువడిన పరీక్ష నివేదికలో ప్రసీత విడుదల చేసిన రికార్డుల్లో ఉన్న గళం సురేంద్రన్‌ గళం ఒక్కటే అని నిర్ధారణైంది. ఇప్పుడు పోలీసులు చార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉంది. సురేంద్రన్‌పై మరొక అవినీతి కేసు ఉంది. 2016 ఎన్నికల్లో మంజేశ్వరమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిఎస్‌పి తరఫున కె సుంద్ర పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఒకే విధంగా ఉండటంతో తనకు పడాల్సిన ఓట్లు సుంద్రకు పడి తాను ఓడినట్లు బిజెపి నేత భావించారు.తిరిగి 2021 ఎన్నికల్లో కె సుంద్ర పోటీకి దిగారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటే కొంత డబ్బుతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇల్లు, ఒక వైన్‌ షాపు ఇప్పిస్తానని బిజెపి నేత ప్రలోభపెట్టారు. ఆ ఎన్నికల్లో 1,143 ఓట్ల తేడాతో ఓడారు. తనకు కేవలం రెండున్నర లక్షల నగదు, పదిహేను వేల విలువ గల సెల్‌ ఫోన్‌ మాత్రమే ఇచ్చారని, వాగ్దానం మేరకు ఇతరంగా ఏమీ ఇవ్వలేదని కె సుంద్ర వెల్లడించాయి .దాంతో పోలీసులు అవినీతితో పాటు ఎస్‌సి,ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మానవాభివృద్ధిలో కేరళ కంటే గుజరాత్‌ ఎందుకు వెనుకబడి ఉందో నరేంద్రమోడీ గారు చెప్పగలరా ?

10 Saturday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, HDI India Report, Human Development, India HDI, Kerala HDI, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది.(దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సగటు జీవితకాలం, పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు, స్థూల జాతీయ ఆదాయ(జిడిపి కాదు-జిఎన్‌ఐ) సంబంధిత అంశాలను బట్టి మార్కులు వేస్తారు.2030నాటికి నిరంతర అభివృద్ధి,పర్యావరణంపై పారిస్‌ ఒప్పందం కుదిరిన తరువాత తొలిసారిగా వరుసగా రెండు సంవత్సరాలు ప్రపంచ మానవ వృద్ధి సూచిక తగ్గింది.తొంభైశాతం దేశాలు 2020 లేదా 2021లో ఏదో ఒక సంవత్సరం విలువను కోల్పోయాయి. 2020లో పరిగణనలోకి తీసుకున్న 189 దేశాల్లో భారత్‌131వ స్థానంలో ఉంది. దేశాలను 800 పాయింట్లు అంతకు మించి వచ్చిన వాటిని అత్యధిక వృద్ధి,700-800 మధ్య వచ్చిన వాటిని అధిక వృద్ధి, 550 నుంచి 700వరకు వచ్చిన వాటిని మధ్య రకం, అంతకు లోపు వచ్చిన వాటిని తక్కువ వృద్ధి చెందిన తరగతులుగా విభజించారు. మనకు 2020లో 0.645 రాగా 2021కి 0.633కు తగ్గాయి. సగటు జీవిత కాలం 69.7 నుంచి 67.2కు తగ్గింది. చైనాలో 78.5 సంవత్సరాలుంది.( చెవులప్పగించేవారుంటే మనది ప్రజాస్వామ్యం గనుక స్వేచ్చగా చావనిస్తారు, చైనాలో కమ్యూనిస్టు పాలన గనుక బలవంతంగా బతికిస్తారు అని చెప్పే ప్రబుద్దులు కూడా తారసపడవచ్చు) పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు 12.2 నుంచి 11.9కి, పాఠశాలకు వెళ్లే సగటు సంవత్సరాలు 6.7నుంచి6.5కు తగ్గాయి. ఇక మన ఇరుగు పొరుగు దేశాలను చూస్తే మన కంటే ఎగువన శ్రీలంక 73, చైనా 79, భూటాన్‌ 127, బంగ్లాదేశ్‌ 129 స్థానాల్లో ఉండగా మన కంటే దిగువన నేపాల్‌ 143, మయన్మార్‌ 149, పాకిస్తాన్‌ 161లో ఉన్నాయి. జిడిపిలో మనం వెనక్కు నెట్టేసిన బ్రిటన్‌ 18, జపాన్‌ 19, అమెరికా 20వ స్థానంలో ఉంది.


ఈ వివరాలను చూసిన తరువాత కరోనా రాకపోతేనా మా నరేంద్రమోడీ గారు…. అని గొప్పలు చెప్పేవారు మనకు తారసపడతారు. వారికి ఒక్కటే ప్రశ్న అంతకు ముందు ఉన్న సూచికకు ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది? అంతకు ముందు అంత అధ్వాన్నంగా ఎందుకున్నది అన్నది ప్రశ్న. 2014కు ముందు గుజరాత్‌ తరహా అభివృద్ధి అని బిజెపి పెద్దలు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.1990 నుంచి ఇప్పటి వరకు అక్కడ బిజెపి భాగస్వామిగా లేదా పూర్తిగా అధికారంలో ఉంది.2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ ఒక కొత్త రికార్డును సృష్టించారు. సందర్భం గనుక మానవ అభివృద్ది సూచికల్లో గుజరాత్‌ను బిజెపి-మోడీ ఎక్కడ ఉంచారు అన్న ప్రశ్నకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిందే. మోడీని అడిగే వారు లేరు, అడగకుండా తనంతట తాను నోరు విప్పరు. అడగ్గలిగే విలేకర్లున్నా వారితో సమావేశం పెట్టరు గనుక అది జరిగేది కాదు. 2019 సంవత్సరంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల మానవాభివృద్ది సూచికలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దేశ సగటు మార్కులు 0.646 కాగా ఏడు వందల పాయింట్లకు పైగా తెచ్చుకొని అధిక వృద్ధి జాబితాలో ఉన్న పధ్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 0.782తో కేరళ ప్రధమ స్థానంలో తరువాత వరుసగా చండీఘర్‌,గోవా, లక్షద్వీప్‌, ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి, హిమచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, డామన్‌ డయ్యు, హర్యానా, మిజోరాం ఉన్నాయి. తరువాత మధ్య తరహా వృద్ధి చెందిన మిగతా వాటిలో 0.697తో మహారాష్ట్ర, తరువాత వరుసగా మణిపూర్‌, జమ్ము-కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, గుజరాత్‌, తెలంగాణా, దాద్రా నాగర్‌హవేలీ,అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, అసోం, చత్తీస్‌ఘర్‌,ఒడిషా, మధ్య ప్రదేశ్‌, ఝార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహారు ఉన్నాయి.


మానవాభివృద్ధిలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు తేడా ఉంది, కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కొన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌,అసోంలకు బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాది మంది శరణార్ధులుగా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సమస్యలు లేని రాష్ట్రాలు కూడా పురోగమించలేదు. కానీ గుజరాత్‌ తరహా అభివృద్ది నమూనా పేరుతో జరిగిన పెద్ద ప్రచారం వెనుక ఉన్న లక్ష్యం నరేంద్రమోడీని గొప్ప నేతగా చిత్రీకరించేందుకే అన్నది స్పష్టం. అందుకే దాని అభివృద్ధి బండారాన్ని గురించి చర్చ, మోడీ గొప్పతనం గురించి ప్రశ్నించటం. గతంలో కాంగ్రెస్‌, వామపక్షాలు లేదా వివిధ ప్రాంతీయ పార్టీలు తమ పాలనలో సాధించిన ప్రగతి గురించి మిగతా రాష్ట్రాలతో పోల్చి చెప్పుకున్నాయి తప్ప తమ రాష్ట్రం దేశానికి ఒక అభివృద్ధి నమూనాగా చెప్పుకోలేదు. అలా చెప్పుకోవటం జనాలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. కొన్ని రాష్ట్రాలు కొన్ని రంగాల్లో ముందున్నంత మాత్రాన దాన్నే నమూనాగా చెప్పలేము.


పోనీ నరేంద్రమోడీ దగ్గర మంత్రదండం ఉంది గనుక గుజరాత్‌ను అలా రూపొందించారని అనుకుందాం. రాజకీయంగా మోడీ పుట్టక ముందే గుజరాత్‌ పారిశ్రామికంగా, వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో మోడీ అధికారానికి వచ్చాక విదేశాల్లో విశ్వసనీయత పెరిగిందని చెప్పారు, విదేశీ పెట్టుబడులకోసమే విమానాల్లో లోకం చుట్టిన వీరుడిగా చెప్పారు. అంగీకరిద్దాం, గుజరాత్‌ మాదిరి దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మాట మాట్లాడితే ఒట్టు. మోడీ పలుకుబడితోనే విదేశీ పెట్టుబడులు వస్తున్నట్లు అంగీకరిస్తూ ఆ ఘనతను కూడా ప్రధాని ఖాతాలోనే వేద్దాం. గుజరాత్‌ నమూనా గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే ఆర్‌బిఐ లేదా కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2021 మార్చి నెల వరకు వివిధ రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) మొత్తంలో గుజరాత్‌కు 30, మహారాష్ట్రకు 28, కర్ణాటకకు 14, ఢిల్లీకి 11 శాతం అంటే 83శాతం ఈ నాలుగు రాష్ట్రాలకే వెళ్లింది. విదేశీ పెట్టుబడులతో దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు, వారిని సమర్ధిస్తున్నవారు గానీ దీన్ని ఎలా సమర్ధిస్తారు ? దేశమంటే ఈ నాలుగు రాష్ట్రాలేనా ? విశ్వగురువుగా పిలిపించుకుంటున్నవారికి ఇది తగినదేనా ? దేశం సంగతి వదలివేద్దాం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు తెచ్చింది కేవలం ఒకశాతమే. దీనికి మోడీ లేదా సిఎం ఆదిత్య నాధ్‌ ఏ భాష్యం చెబుతారు. లోగుట్టు ఏమంటే లాభాల కోసం పెట్టుబడులు పెట్టేవారు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ పెడతారు తప్ప ప్రధాని లేదా సిఎంల గొప్పచూసి పెట్టరు. డబుల్‌ ఇంజన్లు ఉంటే (కేంద్రం – రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) అభివృద్ది పరుగుపెట్టిస్తాం అన్నారుగా, మరి దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు ఎఫ్‌డిఐలు ఎందుకు రావటం లేదు ? బిజెపి అధికారంలోని రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్ల గురించి ఆ పార్టీ నేతలు చెప్పే మాటలను నమ్మటం ఎలా ? డబుల్‌ ఇంజన్లు ఉన్న రాష్ట్రాలు మానవాభివృద్ది సూచికల్లో అట్టడుగున ఎందుకున్నట్లు ? కేరళ, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల స్థాయికి గుజరాత్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారు.


రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, దేశం మొత్తం మానవాభివృద్ది సూచికలో వెనుక బడిందంటే రాష్ట్రాలు కారణం తప్ప నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా ! నరేంద్రమోడీని ఎలా తప్పు పడతాం !! మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పదిహేను సంవత్సరాలు, అంతకు మించి ఆ పార్టీ అధికారంలో ఉంది. అవన్నీ మానవాభివృద్దిలో ముందు వరుసలో ఉండి ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉంటే మోడీని, బిజెపిని తప్పుపట్టలేము, కానీ దానికి విరుద్దంగా ఉన్నపుడు ఎవరిని తప్పు పట్టాలి? రాష్ట్రాల్లో అధికారం కోసం పడుతున్న తిప్పలు రాష్ట్రాల అభివృద్ధి మీద చూపి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా ? కేంద్రం-రాష్ట్రాలు ఎవరు ఖర్చు చేసినా అది మానవాభివృద్ధి సూచికల్లో మన దేశ స్థానాన్ని సూచించేదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2002 నుంచి 2018 వరకు కొన్ని దేశాలు వెచ్చిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. పిపిపి పద్దతిలో అమెరికన్‌ డాలర్లలో విలువలు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2019లో వివిధ దేశాలు చేసిన ఖర్చు విలువ డాలర్లలో ఉంది.
దేశం పేరు ××× 2002××2010 ××2018×× ప్రపంచ బాంకు
భారత్‌ ××× 102 ×× 145 ×× 275 ×× 63.75
చైనా ××× 152 ×× 381 ×× 935 ×× 535.13
శ్రీలంక ××× 228 ×× 322 ×× 517 ×× 160.70
బంగ్లాదేశ్‌ ××× 33 ×× 66 ×× 110 ×× 45.86
పాకిస్తాన్‌ ××× 86 ×× 104 ×× 178 ×× 39.50
క్యూబా ×××711 ××2,042 ×× 2,519 ×× 1,032
వియత్‌నాం ×××108 ×× 259 ×× 440 ×× 180.72
బ్రిటన్‌ ×××2,338 ××3,645 ×× 4,620 ××4,312.89


పిండి కొద్దీ రొట్టె, తిండి కొద్దీ పిల్లలు అన్నట్లుగా మానవాభివృద్ధికి అవసరమైన రంగాలకు తగినన్ని నిధులు కేటాయించకుండా, ప్రపంచ కుబేరుల్లో మనకూ స్థానం వచ్చిందని సంబరపడ్డా, ఫలానా దేశాన్ని వెనక్కు నెట్టి జిడిపిలో ముందుకు పోయినట్లు ఛాతీని ఉప్పొంగించినా, మన జబ్బలు మనమే చరుచుకుంటే చాలదు.సరైన పారిశుధ్య పరిస్థితులు లేని కారణంగా మన దేశ జిడిపిలో 6.4శాతం (2006లో 53.8 బిలియన్‌ డాలర్లు లేదా రు.2.4లక్షల కోట్లు నష్టపోతున్నట్లు ప్రపంచబాంకు చెప్పింది.ఈ మొత్తం 2016 నాటికి జిడిపిలో 5.2 శాతం, డాలర్లలో 106.7 బి.డాలర్లుగా అంచనా. గాలి కాలుష్యం కారణంగా జిడిపికి 7శాతం లేదా 14లక్షల కోట్ల రూపాయల నష్టం. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా 2012-2030 మధ్య మన దేశం 6.2 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోతామని 2015లో హెల్త్‌కేర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ఆరోగ్య భారత్‌ అనే నివేదికలో పేర్కొన్నది. అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రజారోగ్య ఖర్చు జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా ఉండటం మినహా మించటం లేదు. 2004లో నాటి సర్కార్‌ ఐదు సంవత్సరాల కాలంలో జిడిపిలో కనీసం 2-3శాతానికి ఖర్చు పెంచుతామని చెప్పింది. ఆ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించిన నేటి పాలకులు 2017లో జాతీయ ఆరోగ్య విధాన ప్రకటన చేస్తూ 2025 నాటికి జిడిపిలో ఖర్చును 2.5శాతానికి పెంచుతామని చెప్పారు. వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరేమీ కనిపించటం లేదు. దేశంలో మానవాభివృద్ధి మెరుగ్గా లేదని నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడే తెలుసు. అన్ని రాష్ట్రాలను మెరుగుపరిచేందుకు ఒక జాతీయ విధానాన్ని ఎనిమిదేండ్లవుతున్నా ఎందుకు తీసుకురాలేదు. కాంగ్రెస్‌ ఐదు సంవత్సరాల్లో చేయలేని వాటిని తొలి ఐదేండ్లలోనే తాము చేశామని మోడీ గణం చెప్పుకుంది. అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎలా విస్మరించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తీర్చేదెవరు ? విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెడితే అప్పులు తీసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తాం అని రాష్ట్రాలకు చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానవాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రోత్సాహకాలిస్తాం అని చెప్పలేదేం ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుప్రీం మాజీ జస్టిస్‌ ఇందు మల్హోత్రా నోట వాస్తవాల వక్రీకరణ, కమ్యూనిస్టు వ్యతిరేకత !

02 Friday Sep 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti communist, BJP, CPI(M), LDF, Pinarai Vijayan, RSS, Sabarimala Entry Case, SC Justice Indu Malhotra, Sree Padmanabhaswamy Temple Case


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా మాదిరిగా ఉన్న ఒక మహిళ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో వైరల్‌గా మారిందంటూ దాని గురించి మీడియాలో ప్రముఖంగా 2022 ఆగస్టు చివరి వారంలో వార్తలు వచ్చాయి. దాని గురించి వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలు కోరగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ మహిళను ఇందు మల్హోత్రాగానే భావించిన కేరళ ప్రభుత్వం ఆమె మాట్లాడిన తీరును తప్పు పట్టింది. ఇందు మల్హోత్రాను కొందరు తప్పుదారి పట్టించి ఉంటారు, వాస్తవాలను సరి చూసుకొని ఆమె మాట్లాడి ఉండాల్సిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్‌ అన్నారు. ఆమె మాట్లాడిందాన్లో తప్పు లేదని బిజెపి, దాని అభిమానులు సమర్ధించారు. ఆమె తీరు ఆందోళన కలిగిస్తోందని అనేక మంది సామాజిక మాధ్యమంలో స్పందించారు. భక్తులతో మాట్లాడినపుడు ఇందు మల్హోత్రా మాస్క్‌ ధరించి ఉన్నారు, వీడియో అధికారికమైనది కాదు, ఆమె వివరణ తీసుకొనేందుకు ఫోన్‌, వర్తమానం, మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా ఫలించలేదని ” ద ఫెడరల్‌ ” న్యూస్‌ పోర్టల్‌, వివరణ రాలేదని టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది.

ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేమిటి ?2022 ఆగస్టు 28న ఆమె తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా భక్తులలో ఒకరు ఆలయం వెలుపల ఆమెతో మాట్లాడుతూ పద్మనాభస్వామి ఆలయ కేసులో మంచి తీర్పు ఇచ్చారని ప్రశంసించినపుడు స్పందించిన ఇందు మల్హోత్రా వారితో మాట్లాడుతూ ” ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలతో జరుగుతున్నది అదే. కేవలం దేవాలయాలకు వస్తున్న ఆదాయం కారణంగానే వారు దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అన్ని చోట్లా వారు స్వాధీనం చేసుకున్నారు….. అన్ని చోట్లా, కేవలం హిందూ దేవాలయాలనే. కాబట్టే జస్టిస్‌ (యుయు) లలిత్‌ నేను కుదరదని చెప్పాం, మేము దాన్ని అనుమతించం. మేం అడ్డుకోకుండా ఉండి ఉంటే ఇంకా కొనసాగేవి ” అని మాట్లాడినట్లుగా వీడియోలో ఉంది.మీ గురించి మేము ఎంతో గర్విస్తున్నాం, మీరు అలాంటి అద్భుతమైన పని చేశారు అన్న కొందరి మాటలు కూడా సదరు వీడియోలో ఉన్నాయి. పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేవాలయం తమ నిర్వహణలోనే కొనసాగాలన్న పూర్వపు రాజవంశీకుల అప్పీలుపై 2020 జూలై 13న జస్టిస్‌లు యుయు లలిత్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.2021 మార్చి 13న ఇందు మల్హోత్రా పదవీ విరమణ చేయగా జస్టిస్‌ లలిత్‌ ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే.


నిజంగా కేరళ ప్రభుత్వం దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నదా ?2007లో ఆనంద పద్మనాభన్‌ అనే ఒక లాయరు రాజకుటుంబ వారసత్వ హక్కులను సవాలు చేస్తూ తిరువనంతపురం కోర్టులో ఒక కేసును దాఖలు చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు కొత్త ట్రస్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయం, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శతాబ్దాలుగా ఉన్న తమహక్కును రద్దు చేసేందుకు లేదంటూ రాజకుటుంబం హైకోర్టుకు అప్పీలు చేసింది. 1950నాటి చట్టంలోని ఒక సెక్షన్‌ ప్రకారం సంస్థాన విలీన ఒప్పందంలో గుర్తించిన చివరి రాజు 1991లో మరణించిన తరువాత వారసులు స్వతసిద్దంగా ఆలయ నిర్వహణ హక్కులను పొందలేరని అందువలన ప్రభుత్వం వెంటనే ఆలయ స్వాధీనానికి ఒక కొత్త ట్రస్టును లేదా చట్టపరమైన అధారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద రాజు, నాటి ఆలయ అధికారి సుప్రీం కోర్టులో విడిగా అప్పీలు చేశారు. పద్మనాభ స్వామి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకొనే ఆలోచన తమకు లేదని, ప్రస్తుత యాజమాన్యం గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవని ప్రభుత్వం (ముఖ్యమంత్రి విఎస్‌ ఆచ్యుతానందన్‌) తిరువనంతపురం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.(2010 మార్చి 16, హిందూ పత్రిక). 1949లో కేంద్ర ప్రభుత్వం-తిరువాన్కూర్‌-కొచ్చిన్‌ సంస్థానం చేసుకున్న విలీన ఒప్పందంలో రాజు వారసులు దేవాలయ యాజమాన్యంలో కొనసాగవచ్చనే నిబంధన ఉంది. సుప్రీం కోర్టు దాన్ని గుర్తించి ఆ మేరకు తీర్పు ఇచ్చింది.1950 చట్టం ప్రకారం కేరళలోని దేవాలయాలన్నీ దేవస్థానాల బోర్డుల అజమాయిషీల కిందకు వచ్చినప్పటికీ సంస్థాల విలీన ఒప్పందం ప్రకారం పద్మనాభ స్వామి ఆలయం మాత్రం రాజు వారసుల నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు.కార్యనిర్వహణ అధికారిని, ముగ్గురు సలహాదారులను కూడా నియమించే అధికారం ఉంది.1965లో రాజు మేనేజింగ్‌ ట్రస్టీగా, నలుగురు సభ్యులతో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టును ఏర్పాటు చేశారు.


హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం కోర్టు రాజకుటుంబం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముగ్గురితో ఒక సలహా కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్షత వహించేందుకు ఒక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి, రాజు నియమించిన ఒక ప్రముఖ వ్యక్తి, రాజుతో సంప్రదించి అధ్యక్షుడు నియమించే ఒక చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ ఉండాలి. ఆలయపాలనకు ఐదుగురితో ఒక కమిటీ, దానిలో రాజు వారసుల అదుపు, పర్యవేక్షణకు లోబడి పని చేసే విధంగా జిల్లా జడ్జి, రాజు ప్రతినిధి, ప్రధాన పూజారి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పును సవాలు చేయరాదని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ గల వజ్రాలు, కిరీటాలు, సింహాసనాలు, బంగారు నగలు,నాణాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు 2011లో వెల్లడైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అమికస్‌ క్యూరీ గోపాల సుబ్రమణియం, కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయి వాటిని తనిఖీ చేసి ఒక నివేదికను సమర్పించారు. మరో నేలమాళిగను తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని రాజకుటుంబం, భక్తుల పేరుతో కొందరు వాదించారు. 1990 తరువాత అనేక సార్లు దాన్ని తెరిచారని ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదని కోట్లాది విలువైన వస్తువులు మాయమైనట్లు వినోద్‌ రాయి తన నివేదికలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు దాన్ని తెరవటం గురించి ఆలయ యాజమాన్యకమిటీ నిర్ణయానికే వదలి వేసింది.


హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వం దోచుకుంటున్నదని చేస్తున్న ప్రచారం అబద్దమని అనేకసార్లు గతంలో వెల్లడైంది. అక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు సిపిఎం ఉన్న చరిత్ర తెలిసిందే.తొలిసారిగా వరుసగా రెండవ సారి గతేడాది సిపిఎం అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించింది. 2014 ఏప్రిల్‌ 22న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ విటి బలరాం బిజెపి నేత ఎఎన్‌ రాధాకృష్ణన్‌కు సమాధానమిస్తూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం మలబార్‌ దేవస్థానం బోర్డుకు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం వేతనాల కోసం రు.22 కోట్లు చెల్లించింది. పద్మనాభ స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 1970 నుంచి ఏటా రు.ఇరవైలక్షలు చెల్లిస్తున్నది.2011 నుంచి 2014వరకు శబరిమల ఆలయం రు. 60కోట్లు పొందింది.2015 డిసెంబరు ఏడున కేరళ అసెంబ్లీకి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.” శబరిమలతో వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం ఖజానాకు జమ చేస్తున్నారన్నది ఆధారం లేని ఆరోపణ. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌, మలబార్‌, గురువాయుర్‌ దేవస్థానం బోర్టుల పరిధిలోని ఆలయాల ఆదాయం నేరుగా వాటి బాంకు ఖాతాలకే జమ అవుతుంది. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌ బోర్డుల లావాదేవీలను హైకోర్టు నేరుగా నియమించే ఆడిటర్లే తనిఖీ చేస్తారు, ఇతర వాటిని లోకల్‌ ఫండ్‌ డిపార్ట్‌మెంట్లు తనిఖీ చేస్తాయి. ఆ నివేదికలను ఎవరైనా చూడవచ్చు.2011 నుంచి 2015వరకు ప్రభుత్వ నిధుల నుంచి వివిధ ఆలయాలకు రు.231 కోట్లు ఖర్చు చేసింది.”

ఆగస్టు 29(2022) అసెంబ్లీలో చర్చకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఇతర అంశాల గురించి ప్రభత్వం వివరాలను ఇచ్చింది. దేవస్థానాల మంత్రి కె రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాచారం మేరకు కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వివిధ దేవాలయాలకు రు.165 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది జూలై 31వరకు తిరువాన్కూర్‌ బోర్డుకు 20 కోట్లు , మలబార్‌ బోర్డుకు రు.44 లక్షలు ఇచ్చింది.” మితవాద హిందూత్వ శక్తులు పదే పదే చేసిన ప్రచారం రిటైర్డ్‌ న్యాయమూర్తిని ప్రభావితం చేసి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోలేదు.2018 నుంచి 2022 వరకు ఐదేండ్లలో వివిధ బోర్డులకు కరోనా, వరదలపుడు ఆదుకొనేందుకు రు.449 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని,30 కోట్లతో శబరిమల మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూనుకున్నదని, రిటైర్డ్‌ న్యాయమూర్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాధాకృష్ణన్‌ మీడియాకు చెప్పారు. మాజీ ఆర్ధిక మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ స్పందిస్తూ కేరళ ప్రభుత్వ నిధుల గురించి జస్టిస్‌ ఇందు మల్హోత్రాకు తెలియదని, ఆమెకు కమ్యూనిస్టుల గురించి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లున్నదని అన్నారు.


కరోనా పేరుతో ఆలయాలను మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసిన శక్తులే తరువాత రాబడి కోసం తెరిచారని, కానుకలు ఇవ్వవద్దని పిలుపులు ఇచ్చాయి. పూజారులుగా కేవలం బ్రాహ్మలు మాత్రమే ఉంటూ, దళితులను అసలు ఆలయ దరి చేరనివ్వని రోజుల సంగతి తెలిసిందే. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళలో జరిగిన ఉద్యమాలకు ఏకె గోపాలన్‌ వంటి కమ్యూనిస్టు నేతలు సారధ్యం వహించారు.2017లో పినరయి విజయన్‌ ప్రభుత్వం తిరువాన్కూర్‌ దేవస్థానం బోర్డులోని ఆలయాల్లో ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతర పూజారులను నియమించిన సంగతి తెలిసిందే.రుతు క్రమం జరిగే వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కూడదని దాఖలైన పిటీషన్లను కొట్టి వేస్తూ ఎవరైనా దర్శించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి తెలిసిందే. ఆ కేసును విచారించిన ఐదుగురు ధర్మాసనంలో ఒకరుగా ఉన్న ఇందు మల్హోత్రా నలుగురి మెజారిటీ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ తన అసమ్మతిని తెలపటమే గాక రుతు క్రమ వయస్సులో ఉన్న మహిళలు ఆలయంలో ప్రవేశించరాదన్న వాదనను సమర్ధించారు. ఇప్పుడు ఆ తీర్పు మీద కొందరు పునర్విచారణకు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దానితో పాటు బోహ్రా ముస్లింలలో మహిళలకు అంగచ్ఛేదము, ముస్లిం మహిళలకు మసీదుల ప్రవేశనిషిద్దం, వేరే మతం వారిని చేసుకున్న పార్సీ మహిళలకు వారి మత దేవాలయ ప్రవేశ నిషిద్దం వంటి పెద్ద అంశాలన్నింటినీ కలిపి విచారించాలని సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదింకా తేలలేదు.


జస్టిస్‌ ఇందు మల్హోత్రా వీడియో వైరల్‌ కాగానే బిజెపి నేతలు మరోసారి దాడికి దిగారు.కేరళ బిజెపి నేత కెస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ మార్క్సిస్టు నేతలు ఆలయ నిధులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇందు మల్హోత్రా చెప్పిందాన్లో తప్పేమీ లేదన్నారు. జర్మన్‌ నాజీ ప్రచార మంత్రి గోబెల్స్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తూ కాషాయదళాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి జస్టిస్‌ ఇందు మల్హోత్రా మాట్లాడినట్లుంది తప్ప కేసు పూర్వపరాలను లోతుగా పరిశీలించినట్లు లేదు. ఇది నిజంగా విచారకరం, అంతకు మించి ఆందోళనకరం. తీర్పుల మీద తప్పుడు ప్రచారాల ప్రభావం ఉంటుందని జనాలు భావించేందుకు ఆస్కారం ఉంది. పద్మనాభస్వామి ఆలయ కేసులో తాను ఇచ్చిన తీర్పులో ఏమి చెప్పారో కూడా కూడా ఇందు మల్హోత్రా మరిచిపోవటం పరిహాసమని లైవ్‌ లా వెబ్‌సైట్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మను సెబాస్టియన్‌ ఒక ట్వీట్‌లో విమర్శించారు.ఆలయానికి ప్రభుత్వం చేసిన ఖర్చుకు గాను పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ రు.11.70 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నది. తమ ముందుకు వచ్చిన ఒక కేసులో దిగువ కోర్టుల్లో దాఖలైన అఫిడవిట్లలో ఏమున్నదో కూడా చూడకుండా ఉన్నత కోర్టులు తీర్పు ఇస్తాయా ?ఒక న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికైన తొలి మహిళగా ఇందూ మల్హోత్రా చరిత్రకెక్కారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా పదవి విరమణ చేసిన న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పుల గురించి బహిరంగంగా చర్చించటం, వాటిలోనూ మతాన్ని గురించి వక్కాణించటం, ఒక భావజాలంపై విద్వేషాన్ని వెల్లడించటం తగనిపని. ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది ? బహుశా ఇలాంటి ఉదంతం మన దేశంలో ఇదే ప్రధమమేమో !


.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !

09 Tuesday Aug 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Politics, BJP, JDU vs BJP, Narendra Modi, Narendra Modi Failures, Nitish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో మరో ఏకనాధ్‌ షిండేను సృష్టించాలన్న బిజెపి మంత్రాంగం బెడిసి కొట్టింది. అక్కడ అధికారంలో ఉన్నది ఎత్తుగడలలో తలపండిన జెడియు నితీష్‌ కుమార్‌ను తక్కువ అంచనా వేసినట్లు కనిపిస్తోంది.గత కొద్ది రోజులుగా బీహార్‌లో జరుగుతున్న బిజెపి-జెడియు కూటమి కుమ్ములాటలు మంగళవారం నాడు కేవలం ఆరుగంటల్లోనే అధికారాన్ని మార్చివేశాయి. బిజెపితో తెగతెంపులు చేసుకున్న నితీష్‌ కుమార్‌ మహాకూటమి మద్దతుతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏడు పార్టీలు, కొందరు స్వతంత్రులతో సహా 164 మంది మద్దతు ఉన్న తాను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసేందుకు వచ్చినట్లు నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. మంగళవారం నాటి పరిణామాల క్రమం ఇలా ఉంది.


ఉదయం పదకొండు గంటలకు జెడియు ఎంఎల్‌ఏలు, ఎంపీలతో నితీష్‌ కుమార్‌ సమావేశం.11.15కు వేరే చోట ఆర్‌జెడి ఎంఎల్‌ఏల భేటీ, ఒంటి గంట మాజీ సిఎం రబ్రీదేవి ఇంట్లో ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన మహాకూటమి భేటీ.నితీష్‌ కుమార్‌కు మద్దతుగా లేఖపై సంతకాలు. నాలుగు గంటలకు నితీష్‌ కుమార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ, పదవికి రాజీనామా, 4.45కు రబ్రీదేవి ఇంటికి వచ్చిన నితీష్‌ కుమార్‌. 5.20కి తిరిగి గవర్నర్‌ను కలసి కొత్త కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేస్తానంటూ ఎంఎల్‌ఏల సంతకాలతో కూడిన లేఖ అందచేత. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా ఆర్‌జెడి 79, బిజెపి 77, జెడియు 45, కాంగ్రెస్‌ 19, సిపిఐ(ఎంఎల్‌ లిబరేషన్‌) 12,హెచ్‌ఎంఎం 4, సిపిఎం, సిపిఐలకు ఇద్దరేసి, మజ్లిస్‌ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకరు ఉన్నారు. అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 కావాల్సి ఉంది. ఆర్‌జెడి-జెడియు రెండు పార్టీలకే 124తో సంపూర్ణ మెజారిటీ ఉంది..


2020 నవంబరు నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి బిజెపి-జెడియు కూటమిలో ఎవరి ఎత్తుగడలతో వారు కొనసాగుతున్నారు.ఆగస్టు ఆరవ తేదీన రాజీనామా చేసిన జెడియు నేత ఆర్‌సిపి సింగ్‌ను బీహార్‌ ఏకనాధ్‌గా మార్చేందుకు బిజెపి పూనుకుందని చెబుతున్నారు. సింగ్‌కు రాజ్యసభ్యత్వాన్ని కొనసాగించేందుకు నితీష్‌ కుమార్‌ నిరాకరించినపుడే తెరవెనుక జరుగుతున్నదానిని పసిగట్టారన్నది స్పష్టం. జెడియు మునిగిపోతున్న పడవ అని ఆర్‌సిపి సింగ్‌ పార్టీ నుంచి రాజీనామా తరువాత ప్రకటించాడు. ఆర్‌సిపి సింగ్‌ శరీరం జెడియులో ఆత్మ బిజెపిలో ఉందని జెడియు అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ అన్నారు.


2005 నుంచి ఇప్పటి వరకు 2014లోక్‌సభ ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌ గెలిచిన కూటమిలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో బిజెపి పెద్ద పార్టీగా అవతరించింది. దానికి ఆర్‌జెడి మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. అంతకు ముందే పంజాబ్‌లో అకాలీదళ్‌, మహారాష్ట్రలో శివసేనతో బెడిసి కొట్టింది. అదే పరిణామం బీహార్‌లో పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరై బిజెపి లొంగి ఉంది తప్ప మరొకటి కాదు. తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే బీహార్‌లో అధికారం రాదు. బిజెపి తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్న స్థితిలో అలాంటిదేమీ ఉండదు చూడండి బీహార్‌ను అని ఇంతకాలం చెప్పుకున్నారు. అదే సమయంలో తమ పార్టీని బలపరుచుకొనేందుకు పావులు కదిపారు. ఏకనాధ్‌ షిండే రూపంలో మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీశారు. తప్పనిసరై తామే పెద్ద పక్షంగా ఉన్నప్పటికీ ఏకనాధ్‌ను సిఎంను మాజీ సిఎం ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసి తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారు. నితీష్‌ కుమార్‌ కీలుబొమ్మగా పని చేసే రకం కాదు గనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తంగా బీహార్‌ను తమ దారికి తెచ్చుకొనేందుకు ముందునుంచే ఎసరు పెట్టారు. మూడవ పక్ష స్థాయికి తగ్గినా అక్కడున్న లెక్కల్లో ఏదో ఒక పక్షానికి నితీష్‌ అవసరం. అందుకే అందలం ఎక్కిస్తున్నారు.


గత మూడు దశాబ్దాల ఎన్నికలను చూసినపుడు బీహార్‌లో లాలూ, నితీష్‌, బిజెపి ప్రధాన శక్తులుగా ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో లాలూ-నితీష్‌ విడిగా పోటీ పడిన కారణంగా బిజెపి గెలిచింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో లాలూ-నితీష్‌ కలయికతో బిజెపి చతికిల పడింది. కొంత మందికి ఇష్టం లేకున్నా నితీష్‌తో సర్దుబాటుకు దిగక తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌-బిజెపి బంధంతో ఆ కూటమి స్వల్ప మెజారిటీతో గెలిచింది. నితీష్‌ పార్టీని ఓడించేందుకే బిజెపి పని చేసిందని, దానిలో భాగంగా అనేక మంది తన నేతలను పాశ్వాన్‌ పార్టీ ఆర్‌ఎల్‌జెపి గుర్తు మీద పోటీకి దింపిందని, కొన్ని చోట్ల జెడియును పని గట్టుకు ఓడించినట్లు విమర్శలు వచ్చాయి. అది కూడా ఇప్పుడు ఆ కూటమి పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మహారాష్ట్ర పరిణామాలను చూసిన తరువాత బిజెపి లోబరచుకున్న తమ నేత ఆర్‌సిపి సింగ్‌ మరొక ఏకనాధ్‌ షిండే కాకున్నప్పటికీ మరో పద్దతిలో తనను ఎంతో కాలం సిఎంగా కొనసాగనివ్వదనే అంచనాకు నితీష్‌ వచ్చినట్లు చెబుతున్నారు. సిఎం నితీష్‌ అధికారాలను అడ్డుకోవటం, తాము చెప్పిన పద్దతిలో నడవాలని నిర్దేశించేందుకు పూనుకున్నదని వార్తలు. బిజెపి కారణంగా తన పునాదులు కదులుతున్నట్లు నితీష్‌ గ్రహించారు. గత కొద్ది రోజులుగా రెండు పార్టీలు పైకి ఏమి మాట్లాడినప్పటికీ అంతర్గతంగా ఎవరి పావులు వారు కదుపుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం గురించి అమిత్‌ షా జూలై 17న ఏర్పాటు చేసిన సమావేశానికి నితీష్‌ డుమ్మా కొట్టారు.ఈ నెల ఏడవ తేదీన నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్‌ సమావేశానికీ రాలేదు. జూలై 22న దిగిపోనున్న రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ వీడ్కోలు విందుకు, తరువాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికీ వెళ్లలేదు. కరోనా గురించి ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యం అని చెప్పి రాలేదు.


బిజెపికి చెందిన స్పీకర్‌ విజయ కుమార్‌ సిన్హాను తొలగించాలని నితీష్‌ చేసిన యత్నాలను బిజెపి అడ్డుకుంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా స్పీకర్‌ చేసిన విమర్శలను బిజెపి అనుమతించింది. స్పీకర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు నితీష్‌ కుమార్‌ విమర్శించారు.2019 లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తమకు రెండు మంత్రి పదవులు కావాలని నితీష్‌ అడిగితే ఒకటి కంటే ఇచ్చేది లేదని మోడీ తిరస్కరించటంతో తమకసలు పదవులే వద్దని నితీష్‌ చెప్పారు. అయితే జెడియు నేతగా ఉంటూ అప్పటికే బిజెపి ప్రభావంలో ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అనుమతి, నితీష్‌ కుమార్‌తో నిమిత్తం లేకుండా నేరుగా బిజెపి కేంద్ర మంత్రిగా చేసింది. తనకు పదవి గురించి అమిత్‌ షాతో నితీష్‌ కుమార్‌ చర్చించినట్లు ఆర్‌సిపి సింగ్‌ ప్రకటించారు. తాజాగా సింగ్‌కు జెడియు సీటు నిరాకరించటంతో మంత్రి పదవి పోయింది. ఆ ఉక్రోషంతో తాజాగా రాజీనామా చేసి పార్టీ మునికిపోతున్న పడవ అంటూ ధ్వజమెత్తారు.ఏడు జన్మలెత్తినా నితీష్‌ ప్రధాని కాలేరని అన్నారు. రామవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తారు. నిత్యం బిజెపి సంబంధాలలో ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో ఉంటూనే జెడియు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే తన అభ్యర్ధులను నిలిపి ఓట్లను చీల్చారు. దీన్ని చిరాగ్‌ మోడల్‌ అని పిలిచారు. ఇప్పుడు ఆర్‌సిపి సింగ్‌ ద్వారా పార్టీని చీల్చేందుకు బిజెపి పూనుకున్నట్లు చెబుతున్నారు. దాన్ని గమనించిన నితీష్‌ కుమార్‌ ఆర్‌సిపి సింగ్‌, అతని కుటుంబం పొందిన 24 ఎకరాల భూమి గురించి సంజాయిషి ఇవ్వాలని పార్టీ ద్వారా నోటీసు పంపించారు.తరువాతే సింగ్‌ రాజీనామా చోటు చేసుకుంది. అంతకు ముందు సింగ్‌తో సంబంధాలు ఉన్న పార్టీ వారి మీద చర్యలు తీసుకున్నారు. ఇటీవలి అగ్నిపధ్‌ ఆందోళనల్లో బీహార్‌లో బిజెపి నేతల ఇండ్ల మీద దాడులు జరిగాయి. వాటిని జెడియు ప్రోత్సహించినట్లు బిజెపి ఆరోపణ. దుండగులకు స్వేచ్చ నిచ్చారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ జైస్వాల్‌ ధ్వజమెత్తారు. నిరసనకారులతో కేంద్రం చర్చించాలని జెడియు కోరింది. తాజా పరిణామాలు దేశంలోని వివిధ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !

20 Friday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Haj quota, Kerala CPI(M), Kerala LDF, Narendra Modi, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు హజ్‌ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ నుంచి హాజ్‌ యాత్రకు భారత్‌ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్‌ హాజ్‌ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్‌ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్‌ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్‌ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్‌ సభలో హజ్‌ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్‌ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.


అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్‌ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్‌ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్‌ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్‌ సంజాయిషి ఇచ్చుకున్నారు.


మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌
కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్‌ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్‌ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్‌ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్‌ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్‌ అహంకారంతో మాట్లాడారు.


ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమా థామస్‌, మాజీ సిఎం ఊమెన్‌ చాందీ తదితర కాంగ్రెస్‌ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్‌ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్‌ జోసెఫ్‌ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.


పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్‌ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్‌, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.


సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్‌ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్‌ షెజిన్‌, జోస్నా మేరీ జోసెఫ్‌ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్‌ జీహాద్‌ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్‌ కన్నోత్‌ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్‌,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్‌ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్‌ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్‌ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్‌ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్‌ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: