• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Telugu

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

12 Saturday Mar 2022

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Telugu

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2022-23, AP debt, YS jagan



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆసక్తి గొలుపుతున్న తెలంగాణా రాజకీయాలు – ఈ సారీ ముందస్తు ఎన్నికలేనా !

20 Monday Sep 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Telugu, Uncategorized

≈ Leave a comment

Tags

Bandi Sanjay, BJP, KCR, Revanth Reddy, Telangana Left, Telangana politics, trs

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా ?

15 Wednesday Apr 2020

Posted by raomk in AP, Current Affairs, NATIONAL NEWS, Opinion, STATES NEWS, Telangana, Telugu

≈ Leave a comment

Tags

a telugu journalist spews venom on communists, anti communists, Communists, Journalist attack on communists, venom on communists

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలుగుదేశం మీద బిజెపి మెరుపుదాడి: నలుగురు ఎంపీల పట్టివేత !

21 Friday Jun 2019

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana, Telugu

≈ Leave a comment

Tags

BJP, bjp surgical strike on tdp, CHANDRABABU, Defections from TDP, tdp

Image result for bjp surgical strike on tdp four mps captured

ఎం కోటేశ్వరరావు

బాలకోట్‌ మీద రాత్రిపూట జరిపిన మెరుపుదాడిలో ఎందరు వుగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేరు గానీ, పట్టపగలు అందరి ఎదుటే గురువారం సాయంత్రం తెలుగుదేశం మీద జరిపిన మెరుపుదాడిలో బిజెపి నలుగురు రాజ్యసభ సభ్యులను చేజిక్కించుకుంది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు విలీనాన్ని ఆమోదించటం, బిజెపి తన సభ్యుల జాబితాలో నలుగురు సభ్యులైన వై సుజనా చౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, గరికపాటి మోహనరావు పేర్లను చేర్చటం జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి దాడులకే సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాల్లో వూహకు అందని రీతిలో పనికానిచ్చి తమ తీరే వేరని బిజెపి నిరూపించుకుంది. వీరితో పాటు మరి కొందరు ఎంపీలు, ఎంఎల్‌ఏల కోసం కూడా బిజెపి మాటువేసిందని వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ మరీ ఇంత త్వరలో పని పూర్తి చేస్తారని వూహించి వుండరు. ఒక నిర్ణయం జరిగిన తరువాత నలుగురి నోళ్లలో నానటం ఎందుకు వచ్చే చెడ్డపేరు ఎలాగూ వస్తుంది, ఈ మాత్రం దానికి సిగ్గు ఎందుకు అన్నట్లుగా జరిపించేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాల అక్రమాలకు, అత్యవసర పరిస్ధితి వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి మూడు దశాబ్దాలు పడితే పూవు పుట్టగానే పరిమళించినట్లుగా వాటిలో ఒకటైన ఫిరాయింపుల ప్రోత్సాహం, కేంద్ర దర్యాప్తు సంస్ధలను వుపయోగించుకొని బెదిరించటానికి రెండవసారి సంపూర్ణ మెజారిటీతో అధికారానికి వచ్చిన నాటి నుంచి బిజెపి ప్రారంభించి తమది భిన్నమైన పార్టీ అని నిజంగానే నిరూపించుకుంది.

తమ నేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లటాన్ని చూసి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారని తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో మనోభావాన్ని రెచ్చగొట్టేందుకు, ఒక సాకును చొప్పించేందుకు ప్రయత్నించారు. ఫిరాయించే వారు అధినేత వుంటే కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకొని సకల లాంఛనాలతో పోతారా ? అదే ప్రమాణం అనుకుంటే వైస్రాయ్‌ వుదంతాలలో ఎన్‌టిఆర్‌కు తెలుగు తమ్ముళ్లు ఇచ్చిన గౌరవం ఏమిటో యావత్‌ దేశం సచిత్రంగా చూసింది. ఎవరూ ఎన్‌టిఆర్‌ ఆశీస్సులు తీసుకోలేదు, ఆయన వుండగానే తిరుగుబాటు చేశారు కదా ! పార్టీ ఎంపీలు, మరికొందరు నేతలు ఏక్షణంలో అయినా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారని వార్తలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోవటానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. తమ సభ్యుల పట్ల మితిమీరిన విశ్వాసమా ?

ఒకటి స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఇడి అనే వేట సంస్ధల వేటు నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులందరూ కేంద్రంలో, రాష్ట్రాలలో వారికి మిత్రపక్షాలుగా ఎవరు అధికారంలో వుంటే వారితో సయోధ్యగా వుండటమో లేక జతకట్టటమో చేస్తుంటారు. అది గత ఎన్నికల్లోనే వైసిపి ఎంపీల విషయంలో రుజువైంది. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొనేందుకు అసమర్ధ కాంగ్రెస్‌కు ఐదు దశాబ్దాలు పడితే సమర్ధ బిజెపి కేవలం ఐదు సంవత్సరాలలోనే ఆ విజయాన్ని సాధించింది. సమావేశం లేదు, తీర్మానాలు లేవు, సుజనా చౌదరి బహిరంగంగా చెప్పినట్లు నలుగురూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదు కూడా. ఫిరాయించిన ఎంపీలు అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీని విలీనం చేసినట్లు అవసరమైన పత్రాలను తయారు చేయటం, దాన్ని ఏకంగా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందచేయటం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. రాజకీయ నీతులు చెప్పే వెంకయ్య నాయుడు వారి పత్రాన్ని స్వీకరిస్తూ ఫొటోలకు ఇచ్చిన ఫోజును చూసి ఏమనుకోవాలో జనానికే వదలివేద్దాం. రానున్న రోజుల్లో మిగిలిన తెలుగుదేశం ఎంపీల్లో ఎందరు మిగులుతారనేది శేష ప్రశ్న. ఎంపీల ఫిరాయింపు తెలుగుదేశం ఎంఎల్‌ఏల ఫిరాయింపులను వేగవంతం చేసిందనే వార్తలు వచ్చాయి. తమ నేత విదేశాల నుంచి వచ్చేంతవరకు ఆగుతారా లేక వచ్చిన తరువాతే తాము ఫిరాయిస్తే ఏం చేస్తారో చూస్తాం అంటూ వేచి చూస్తారా అన్నది చూడాలి. జరగనున్నది జరగక మానదు, ముందుగా నిర్ణయించుకున్న యాత్ర పూర్తి చేసి కనీసం కుటుంబసభ్యులనైనా సంతోష పెడితే మంచిదేమో చంద్రబాబు ఆలోచించుకోవాలి.అదే నేను ఇక్కడ వుంటేనా అని చెప్పుకొనేందుకైనా అక్కడే వుండి అంతా పూర్తయిన తరువాత తిరిగి వస్తే కాస్త పరువు దక్కుతుంది. ఫేక్‌ ప్రచారాలను చేయించటంలో తెలుగుదేశంతో సహా ఏ ఒక్క పార్టీ తక్కువ తినలేదు. ఇప్పుడు స్వయంగా తెలుగుదేశం నేత, వారి రాజగురువు రామోజీరావు, ఇతర కుల పెద్దలే ఎంపీలను బిజెపిలోకి పంపారనే సామాజిక మాధ్య ప్రచారానికి వారే సమాధానం చెప్పుకోవాలి.

బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు, గో సంరక్షణ పేరుతో దాడులు చేసే వారు, ఇతర అవాంఛనీయ శక్తులు పుష్కలంగా వున్నాయి. ఇతర పార్టీల నుంచి అవినీతి, అక్రమాల ముద్రపడిన వారు, పార్టీకి పెట్టుబడులు పెట్టగలిగిన వారు కొన్ని రాష్ట్రాలలో దానికి కొరతగా వున్నందున దాన్ని పూడ్చుకొనేందుకు ఎంతగా ఆత్రత పడుతోందో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాము అవినీతి ఆరోపణలు చేసిన వారు, తమపై రాజకీయంగా దాడి చేసిన వారిని ఇప్పుడు బిజెపి చేర్చుకుంది. గతంలో సిబిఐ, ఇడి దాడులకు, బిజెపి ఆరోపణలకు గురైన వారిని తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ఇదే అదే పార్టీ వారు ఎంపీలు స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని చెబుతున్నారు, వారివి నాలికలా మరొకటా అన్న అనుమానం వస్తోంది. బిజెపి నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆయారామ్‌ గయారామ్‌ టిజి వెంకటేష్‌ ఏ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారో అదే ప్రయోజనం కోసం బిజెపి పంచన చేరారు. మిగిలిన ముగ్గురిదీ అదే దారి.

Image result for bjp surgical strike on tdp four mps captured

కేసులు, ఆరోపణలు వున్నంత మాత్రాన నిర్ధారణ అయ్యేంత వరకు ఎంపీలు నేరం చేసినట్లు కాదని అందువలన తెలుగుదేశం ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవటం తప్పుకాదని బిజెపి నేతలు కుంటిసాకు చెబుతున్నారు. గతంలో డేరాబాబా, ఆశారాంబాపు వంటి నేరగాండ్ల గురించి కూడా బిజెపి నేతలు ఇదే వాదనలు చేసి వారితో అంటకాగిన విషయం తెలిసిందే. బిజెపి ఇలాంటి నేర చరిత్ర, కేసులు వున్నవారిని ఇదే వాదనలతో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులుగా నిలిపి మద్దతు పలికింది, తర తమ స్ధాయిలో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టాయి. గతంలో పార్టీల నేతలు తాము ఎంత పరిశుద్ధమో చెప్పుకొనేందుకు తమ రక్తాల గురించి చెప్పేవారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా వాటి రక్తాలన్నీ లుషితమే. జన్యువుల్లోనే మార్పులు జరిగాయి. కనుకనే ఏ పార్టీ నుంచి ఎవరు చేరినా వారిని తమలో ఇముడ్చుకోవటానికి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఎన్నికల ముందు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా ఫిరాయింపుదార్లను చేర్చుకుంటున్నపుడు వారు ఎన్నికలైన తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వేరే పార్టీ వైపు చూస్తే, ఫిరాయిస్తే తప్పు పట్టాల్సిన పనేముంది? నీవు నేర్పిన విద్యయే కదా ! అసలు తప్పు ఎవరిది అని చెప్పాల్సి వస్తే అలాంటి వారిని గుడ్డిగా ఎన్నుకుంటున్న జనానిదే అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలను బిజెపిలో చేర్చుకోవటం అంటే త్వరలోనే వైసిపి మీద రాజకీయ దాడికి నాందిపలకటమే అన్నది ఒక అభిప్రాయం.అదే జరిగితే జగన్‌, ఇతరుల మీద వున్న కేసులను, తెలుగుదేశం నుంచి కాషాయ తీర్ధం పుచ్చుకున్న నేతల దాడిని వైసిపి ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఆసక్తికరం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణాలో తెరాస మాదిరి ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు తెలుగుదేశం ఫిరాయింపుదార్ల పట్ల, బిజెపినేతల పట్ల వైసిపి వ్యవహరిస్తే కేంద్రం తన వద్ద వున్న పెద్ద కత్తిని వైసిపి మెడమీద ప్రయోగించటానికి వెనుకాడదు. ఇదొక ప్రత్యేక పరిస్ధితి అనవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 1: జగన్‌ సర్కార్‌ విస్మరించిందేమిటి? చేయాల్సిందేమిటి?

16 Sunday Jun 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telugu

≈ Leave a comment

Tags

AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu

https://s3.ap-south-1.amazonaws.com/hansindia-bucket/2975_YS-jagan-Mohan-Reddy.jpg

ఎం కోటేశ్వరరావు

ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్‌15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.

గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్‌ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్‌ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.

రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్‌ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్‌ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?

శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్‌ 14 రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్‌ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్‌ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.

2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్‌ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.

ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్‌ గవర్నర్‌ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.

Image result for YS Jagan

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్‌ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్‌ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.

సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్‌ చెబుతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.

భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్‌, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్‌ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.

Image result for YS Jagan

వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్‌ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్‌ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్‌ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్‌ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్‌ నవరత్నాలలో గానీ, గవర్నర్‌ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వుగాది చారు తాగుతావా ! వుగాది పచ్చడి తింటావా నాయనా !

06 Saturday Apr 2019

Posted by raomk in AP, Current Affairs, Literature., Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

Sri Vikari Nama, Ugadi, ugadi panchanga sravanam

Image result for ugadi panchanga sravanam

సత్య

స్వయంగా బిరుదులు తగిలించుకొని జనాన్ని మోసం చేస్తున్న జ్యోతిష పండితులు వీధివీధికీ విస్తరించిన నేపధ్యంలో పేరుమోసిన ప్రముఖ సంస్ధలు, వ్యక్తుల నుంచి మాత్రమే ఎలాంటి రుసుములు చెల్లించకుండా అయిష్టంగా బిరుదులు స్వీకరించిన పండితుడు శ్రీశ్రీశ్రీ స్వామి శర్మ శాస్త్రి రెడ్డి రాయల్‌ నాయుడు గారి నోటి వెంట వికారినామ సంవత్సర రాజకీయ పంచాంగం ఎలా వుంటుందో విందాం. ముందుగా వారి గురించి కొద్ది మాటలు.

శ్రీవారు పూరాశ్రమంలో విధి రీత్యా పుట్టిన కులాన్ని పూర్వ నామం, భవ బంధాలను కూడా తెంచుకొని సర్వజన జ్యోతిష్యం కోసం గురువుల నుంచి స్వీకరించిన నూతన నామంతో సేవ చేస్తున్నారు. జ్యోతిష ఉపాసకులు, జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ, జ్యోతిష కేసరి, జ్యోతిష పంచకల్యాణి వంటి పలు ఉగాదుల స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత. ఎం.ఏ జ్యోతిషం – పి.హెచ్‌.డి”గోల్డ్‌ మెడల్‌” , ఎం.ఏ తెలుగు (ఏల్‌) , ఎం. ఏ సంస్క తం , ఎం.ఏ యోగా , ,ఎం.మెక్‌ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్‌ మెడికల్‌ ఆస్ట్రాలజి (జ్యోతిర్‌ వైద్యం) , పి.జి.డిప్లమా ఇన్‌ జ్యోతిషం, వాస్తు , జ్యోతిష పాలిటిక్స్‌, జ్యోతిష అర్ధశాస్త్రం, జ్యోతిష బయాలజీ,జ్యోతిష జువాలజీ, జ్యోతిష కెమిస్త్రీ, జ్యోతిష ఫిజిక్స్‌, జ్యోతిష బయోటెక్నాలజీ, జ్యోతిష ఇంజనీరింగ్‌ ఇలా వారు పొందని జ్యోతిష మరియు రత్న శాస్త్ర పట్టాలు లేవు. అన్నీ అయిపోయిన తరువాత డాలరు యువతీ, యువకుల కోసం చివరికి అమెరికాలో ఎంఎస్‌ చేసిన నిపుణులు. వారితో ఇంటర్య్వూ చేద్దాం.

నమస్కారం గురువు గారూ

నమస్కారం శ్రీ వికారినామ విజయోస్తు, సర్వజన శుభం, సుఖం ప్రాప్తిరస్తు. అష్టపదుల తెలుగు సంవత్సరాదుల వరుసలో వికారి 33వది, మూడు మూళ్లు తొమ్మిది కావచ్చు, మూడూ మూడూ కలిస్తే ఆరు కావచ్చు, మూడు లోంచి మూడు తీసి వేస్తే సున్నా అవుతుంది. ఎటు చూసినా మూడే కనిపిస్తుంది, అన్నింటికీ మించి దానికి ముందూ వెనుకా రెండూ బేసి సంఖ్యలే వున్నాయి, చూశారా ఎంతటి మహత్తర సంవత్సరమో !

సంతోషం గురువు గారూ ఈ ఏడాది వుగాది ప్రత్యేకత ఏమంటే వెంటనే ఎన్నికల దశ తొలిదశ ప్రారంభం అవుతుంది, ఎవరి భవిష్యత్‌ ఎలా వుండబోతోందో కాస్త వివరిస్తారా ?

నాయనా గతంలో అధికారానికి వచ్చిన వారు వరుణ దేవుడిని తమ వైపు లాక్కుని అనావృష్టి దేవుడిని మరొకవైపు నెట్టారు. అన్న దమ్ముల మధ్య వివాదం వస్తే భూమిని పాడు బెడతారు. ఈ వివాదం తేలే వరకు మనం మాత్రం ఎందుకు పని చేయాలి అంటూ ఆ ఇద్దరు మొత్తం మీద సగం సగం పనులు గత కొద్ది సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అంతే మా సంగతి తెలియదు మేము అధికారానికి వస్తే వరుణదేవుడిని తెస్తాం, మమ్మల్ని ఎన్నుకోకపోతే అనావృష్టి దేవుడిని పంపుతాం అంటున్నాయి అన్ని పార్టీలునూ . అందువలన జనం భవిష్యత్తే అగమ్య గోచరంగా వుంది. మిగతా గ్రహాలు, దేవతలు కూడా ఏ పక్షమో తేల్చుకోలేకుండా అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మనకు జనం కదా నాయనా ముఖ్యం.

అది నిజమే అనుకోండి తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో మొదలెడదాం వారి భవిష్యత్‌ ఏలా వుండబోతోంది గురువు గారూ !

యూ సీ ఫస్ట్‌ యు హావ్‌ టు అండర్‌స్టాండ్‌ వరల్డ్‌ స్విట్యుయేషన్‌, అదే ముందుగా మీరు ప్రపంచ పరిస్ధితి గురించి తెలుసుకోవాలి. పర్యావరణానికి ముప్పు తలపెట్టిన కారణంగా ఇటీవలి కాలంలో గ్రహాలు కూడా వాటి స్ధానాల్లో అవి వుండలేక కాలుష్యం లేని ప్రాంతాలకు తరలిపోతున్నాయి. మన దేశంలోనూ అదే జరుగుతోంది. ముక్కోటి దేవతలకూ రిసార్టులను సర్దు బాటు చేయలేక హోటల్స్‌ వారు ఇబ్బంది పడుతున్నారు. అందువలన ఏ రాజకీయ నాయకుడి లేదా పార్టీకి చెందిన గ్రహాలు, వాటిని ఆశ్రయించిన తిధులు, నక్షత్రాలు కూడా వాటి వెంటే తరలి పోతున్నాయి. తమ వారిని అవి పర్యవేక్షించే స్ధితి సరిగా వుండటం లేదు. ఎన్నికలకు ముందు ఎవరు ఏ పార్టీలో వుంటారో తరువాత ఎటు వుంటారో తెలియని స్ధితి ఏర్పడటానికి, జనానికి పిచ్చి ఎక్కించటానికి కారణమిదే. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఈ పరిమితులను గమనంలో వుంచుకోవాలి.

ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే రాజకీయ నేతల కంటే జనానికి ఏలినాటి శని పట్టిన స్దితి కనిపిస్తోంది. ఎందుకంటే మూడు ప్రధాన పార్టీల నేతలు చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురినీ ఏలినాటి శని ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వదిలేట్లు కనిపించటం లేదు. అందువలన ఆ పార్టీల నేతలు అటూ ఇటూ డొల్లు పుచ్చకాయల మాదిరి ఎక్కడ వాటంగా వుంటే అటు దొర్లు తుంటారు 2014లో పార్టీ పరిస్దితి బాగున్నా జగన్‌ జాతకంలో సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శని ప్రవేశించి దెబ్బతీసింది. అధికారం రాలేదు, గెలిచిన ఎంఎల్‌ఏలు, ఎంపీలు కొందరు ఫిరాయించారు, చివరకు అసెంబ్లీలో అడుగుపెట్టటాన్ని కూడా శని, బుధుడు, కుజుడు, అంగారకుడు వంటి గ్రహాలన్నీ అడ్డుకొని చెడ్డపేరు తెచ్చాయి.

ఇక చంద్రబాబు నాయుడి విషయానికి వస్తే తొలి రోజుల్లో కాంగ్రెస్‌ రక్తం కొద్దిగా వుంది, తరువాత తెలుగుదేశం రక్తం ప్రవేశించింది. ఆ తరువాత ఒక్క కమ్యూనిస్టుల ఎర్ర రక్తం తప్ప మిగతా పార్టీల రంగుల రక్తాలన్నీ కలసి పోయాయి. పార్టీ కూడా అలాగే తయారైంది. గత ఎన్నికల్లో చంద్రబాబు మీద అంతకు ముందు పదేండ్ల పాటు వదలని శని బలంగానే వున్నప్పటికీ గ్రహాలు అనుకూలించిన మోడీ, పవన్‌ కల్యాణ్‌ మీద లక్ష్మీ దేవి ప్రభావం కారణంగా ఓట్లలో పెద్దగా తేడా లేకున్నా సీట్లు మెజారిటీ తెచ్చుకొనేందుకు చివరి క్షణంలో శని తలొగ్గింది.

ఇక పవన్‌ కల్యాణ్‌ విషయానికి వస్తే గ్రహాలు అనుకూలంగా లేక పోటీ చేయకుండా వెనక్కు లాగి తెలుగుదేశం, బిజెపి పార్టీలను బలపరిచే విధంగా ముందుకు నెట్టాయి. ఈ సారి అవే గ్రహాలు వై డోంట్‌ యు ట్రై మీరే అధికారం కోసం ఎందుకు ప్రయత్నించకూడదని మరింత ముందుకు తోశాయి. పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుడిలా వుంది పరిస్ధితి.

మరి ఇప్పుడేం జరుగుతుంటారు ?

నాయనా ప్రపంచం నిరంతరం మారుతూ వుంటుంది, అలాంటపుడు గ్రహాలు ఎలా స్దిరంగా వుంటాయి చెప్పు. యాంటీ బయటిక్స్‌ను కూడా తిని హరాయించుకొని తెగబలిసే వైరస్‌, బాక్టీరియా మాదిరి ప్రతి పార్టీలో రాహువు, కేతువులు బలంగా తయారయ్యాయి. ఒకదానిని ఒకటి మింగేసే విధంగా సాగుతున్న ఎన్నికల ప్రచారాన్ని చూస్తే తెలియటంలా ఎందుకంటావు. వాటి ప్రభావమే.

కొంచెం వివరంగా చెబుతారా గురువు గారూ

తెలంగాణాను చూడు నాయనా టిఆర్‌ఎస్‌ సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి నవగ్రహాలన్నీ అనుకూలించాయి. అయినా టిఆర్‌ఎస్‌ నేత కేసి ఆర్‌ మీద బాహుబలి ప్రభావం పడి కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులందరినీ ఆకర్షిస్తున్నారు. అది ఆయనకు స్వతహాగా వున్నది కాదు, గ్రహాల ప్రభావం. భగవద్గీత ఏం చేప్పిందీ, చంపేది నేనే చచ్చేదీ నేనే అన్నట్లుగా పాలక పార్టీనేనే, ప్రతిపక్షమూ నాదే అన్నట్లు వ్యవహరించక తప్పటం లేదు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందనేది చెప్పటానికి ఇప్పుడు ఏ &గ్రహమూ అందుబాటులో లేదంటే నమ్మక తప్పదు. ఎవరు ఏమి చెప్పినా అంతా ఆ సర్వేశ్వరుడిి లీల.

అంటే సర్వేలు చెప్పినట్లు జరుగుతాయంటారా ?

లేదు లేదు నాయనా నేను చెబుతున్నది మీడియా సర్వేల గురించి కాదు, భగవంతుడు, భగవంతుడు. మీ సర్వేల దేముంది నాయనా లైక్‌ పెయిడ్‌ న్యూస్‌ పెయిడ్‌ సర్వేసూ…

కాస్త అర్దమయ్యేట్లు చెబుతారా

నేను చెప్పటం కాదు, వుపాసకులను గ్రహాలు పలికిస్తాయి. జోత్యిష్యంలో వున్నది వెలికి తీస్తున్నా, నిమిత్ర మాత్రుడిని. ప్రతి పార్టీ ఎంఎల్‌ఏ, ఎంపీ బలమైన ముహూర్తాలు, గ్రహాల గతిని చూసే నామినేషన్లు వేశారు. అందరూ గెలుస్తారా లేదే ఒక్కరే గదా అలాగే ఎవరెన్ని జోశ్యాలైనా చెప్పవచ్చు, పంచాంగాలు అయినా విప్పవచ్చు. అంతా జగన్నాటక సూత్రధారి విధి, వినోద క్రీడ. చూసి తరించాలి, విని ఊరుకోవాలి తప్ప ప్రతిస్పందించరాదు. మనలో మాట ఆఫ్‌ ది రికార్డు. గెలిచిన ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయిస్తారని మాలో ఒక్కడైనా చెప్పాడా, మాకు తెలిసినా ఎన్నికలను ప్రభావితం చేయకూడదనే సెల్ప్‌ రూల్స్‌, అదే మీ మీడియా విధించుకున్న స్వయం నియంత్రణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది. మా జ్యోతిష్కులతో పాటు, మాకు పోటీగా దుకాణం తెరిచిన లగడపాటి రాజగోపాల్‌ జోస్యంతో జనం వందల కోట్ల పై పందాలు కట్టారు, ఏమైందో తెలుసు కదా ! కోట్లకు కోట్లు వెచ్చించి పార్టీల సీట్లు తెచ్చుకున్నారన్నది భగవంతుడు చూస్తూనే వున్నాడు.అందరూ అదే పని చేస్తున్నపుడు ఎందరిని వారించగలడు. తోటకూర నాడే జోక్యం చేసుకోని ఆ భగవానుడు తరువాత వేలు పెడతాడా ? కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఆ వచ్చిన వారు ఎవరి మీద దాడులు చేయిస్తారో తెలియదు, అందువలన ఎవరు ఏ పార్టీలో గెలిచినా కేంద్రంలో వచ్చే పాలకులను బట్టి ఎటు చేరాలో నిర్ణయించుకుంటారని చెప్పాలని కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రహాల సమావేశం నిర్ణయించింది. ఒకదానిని నష్టజాతకమని, మరొకదానిని అదృష్టమని జనం అనుకోవచ్చు తప్ప మనలో మనకు అందరం సమానమే అని తీర్మానించాయి. అందువలన ఫలానా పార్టీయే గెలుస్తుందని, గెలిచిన వారంతా దానితోనే వుంటారని ఎవరూచెప్పలేరు. ఓడిపోయిన పార్టీలో వుంటే నష్టజాతకులు, గెలిచిన పార్టీలోకి ఫిరాయిస్తే అదృష్టజాతకులు అంటారు. అసలు పార్టీలను మొత్తంగా టోకుగా కొనే రోజులు వస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ వుంది గనుక పేర్లు చెప్పకూడదు నాయనా ! కోడ్‌ను రాజకీయ పార్టీలు వుల్లంఘిస్తే ఎన్నికల సంఘం ఏమి పీకుతోంది అని మీ వంటి వారు అనవచ్చు, అది దారి తప్పిందని మేమూ తప్పాలని లేదు కదా నాయనా !

మొత్తం మీద ఫలితాలు, పర్యవసానాలు ఎలా వుంటాయంటారు.

యూ సీ ఆల్‌ ఆర్‌ ఫేసింగ్‌ క్రెడిబిలిటీ ప్రాబ్లమ్స్‌ కనుక గ్రహాలు కూడా విస్వసనీయత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒకటి మరొకదాని మాట వినటం లేదు. విన్నా కట్టుబడి వుంటాయని నమ్మటం లేదు. ఒక్కొక్క జోతిష్కుడికి ఒక్కొక్క గ్రహం మీద అభిమానం, నమ్మకం వుంటాయి. అందువలన అందరూ చెప్పేది వినండి, దేనీని అంతిమంగా తీసుకోవద్దు. నైవేద్యం గురించి పూజారులకు మాత్రమే తెలుసు, వుగాది జ్యోతిష్యం కూడా అలాంటిదే. ఇంకొక విషయం. మా వరకు వస్తే ప్రతి నాయకుడు, ప్రతిపార్టీ సరిగ్గా పుట్టిన సమయం తేదీ కచ్చితంగా తెలిస్తేనే సరిగ్గా చెప్పగలం. ఎవరి జాతకంలోనూ అలాంటి నిక్కచ్చి సమాచారం లేదు, ఫర్‌ ఎగ్జాంపుల్‌ నూతన పాత్రధారి పవన్‌ కల్యాణ్‌ పుట్టిన సంవత్సరాలు ఏవంటే మూడు చెబుతున్నారు. మూడింటిని బట్టి లెక్కిస్తే మూడు విధాలుగా వస్తున్నాయి. మిగతావారికీ ఇలాంటివే వున్నాయి మరి.

ఆఖరి ప్రశ్న వికారినామ సంవత్సరం గురించి చెప్పండి.

నాయనా వికారి అంటే వికారమైనది, ఎవరికైనా వికారం తలెత్తితే ఆ క్షణంలో ఏమి జరుగుతుందో ఇంత వరకు ఏ ప్రపంచ జ్యోతిష పండితుడూ చెప్పలేదు, జ్యోతిష శాస్త్రం దాని గురించి ప్రస్తావించలేదు, తర్కించలేదని గుర్తించాలి. ఇప్పటి వరకు గంటల పంచాగాలే తప్ప నిమిషాలు,క్షణాల పంచాంగాలు ఇంకా రూపుదిద్దు కోలేదు. వాటికి వాటికి గ్రహాల అనుమతి కూడా అనుమానమే. ఎవరికైనా వికారం కలిగితే తన మీద తానే వాంతి చేసుకోవచ్చు, ఎదుటి వారి మీదా చేయవచ్చు. అది ఎదుటి వారి ప్రారబ్దాన్ని బట్టి వుంటుంది. ఆ సమయంలో వికారం కలిగిన వారి గ్రహాలు కూడా గతులు తప్పుతాయి. అందువలన వారి ప్రవర్తన కూడా అలాగే వుంటుంది. అన్నట్లు నాయనా ఈ రోజు వుగాది కనుక ఇంకా కాఫీ, టీ గట్రా సిద్ధం కాలేదు, కాస్త వుగాది చారు తాగుతావా, పచ్చడి తింటావా !

ఫర్లేదు గురువు గారూ వంటల కార్యక్రమంలో మా యాంకర్లు ఏమి వండినా తినక తప్పదు అలాగే కొంచె వుగాదిచారు, కొంచెం వుగాది పచ్చడి పెట్టండి.

తెలివిగల వాడివి నాయనా నీవు నియోగి వంటి వాడివి, ఎలా అయినా వినియోగపడే వాడే నియోగి అని తెనాలి రామకృష్ణుడు చెప్పాడు కదా . శుభం నాయనా జాగ్రత్తగా వుండు, పొద్దుటి నుంచీ మీ మీడియా వారు అడిగే అర్ధం పర్ధం లేని, మీకు కావాల్సింది చెప్పాలనే సతాయింపు ప్రశ్నలతో నా కెందుకో వికారం కలిగినట్లుగా వుంది అలా వెళొస్తా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అసహనానికి పెరుగుతున్న ప్రతిఘటన – కాషాయ సేన ఎదురు దాడి

01 Sunday Nov 2015

Posted by raomk in Current Affairs, Politics, Religious Intolarence, Telugu

≈ Leave a comment

Tags

మతోన్మాదులు, హిందూ తాలిబాన్లు, Hindu Fundamentalism, Religious Intolarence, RSS

అసహనానికి పెరుగుతున్న ప్రతిఘటన – కాషాయ సేన ఎదురు దాడి

రాంచీలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ కార్యవర్గ సమావేశం సందర్బంగా ఆ సంస్ధ నాయకులు దత్తాత్రేయ హోసబలే, మన్మోహన్‌ వైద్య విలేకర్ల సమావేశంలో మాట్లాడిన అం శాలు మన దేశ మేధావులకు నిజంగా ఒక సవాల్‌ . తమ అసహన, పర మత ద్వేషాన్ని వ్యతిరేకించే శక్తులతో తలపడేందుకే సంఘపరివార్‌ పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. నిరసన తెలుపుతున్న మేధావులు ప్రచార గారడీలు చేస్తున్నారని, వారిని కొంత కాలంగా జనం పట్టించుకోవటం లేదని, దేశం వారి అభిప్రాయాలను తీసుకోవటం లేదని, ప్రస్తుత అధికార వ్యవస్ధలో ఇమిడే అవకాశం లేకపోవటంతో నిస్పృహతో ఈ పని చేస్తున్నారని వారు నిందించారు. దేశంలో అసహన పరిస్ధితుల ముప్పు లేనప్పటికీ కుహనా లౌకిక, వుదారవాదులు ఒక ప్రయోజనం కోసమే చర్చను ప్రారంభించారని, సహనాన్ని కాపాడే పేరుతో విమర్శి స్తున్నవారే మేధావులు కాదని వారిని విమర్శించిన విద్యాబాలన్‌,అ నుపమఖేర్‌, శ్యాం బెనెగల్‌ కూడా మేధావులేనని హోసబలే కితాబునిచ్చారు. ఈ తీరును చూస్తుంటే ప్రపంచ ఆర్ధిక విశ్లేష, రేటింగ్‌ సంస్ధలో ఒకటైన ‘మూడీస్‌’ను, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ రఘరాం రాజన్‌, ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ నారాయణ మూర్తిని కూడా కాషాయ తాలిబాన్లు సెక్యుర్‌ లేదా కమ్యూనిస్టు శ క్తులో చేర్చుతారా?

సంఘపరివార్‌ తలచింది ఒకటైతే జరుగుతున్నది ఒకటి. అయినా సరే సమాజాన్ని,దేశాన్ని వెనక్కు నడపాలనే దాని అజెండా నుంచి వెనక్కు తగ్గేందుకు సిద్దంగా లేదని, మరింత అసహనాన్ని రెచ్చగొడుతూ రాంచీ సమావేశంలో జనాభా విధానంపై తీర్మానం ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం జనాభాను నియంత్రించాలని డిమాండ్‌ చేసింది.

రెచ్చగొడుతున్న అసహన, పరమత వ్యతిరేక ధోరణులకు ఎదురౌతున్న అనూహ్య ప్రతిఘటనతో దిమ్మతిరిగిన వారి మానసిక స్ధితి గురించి ఎవరేం చెప్పగలరు? ఏ రేటింగ్‌ ఇవ్వగలరు. సమాజంలో పెరిగి పోతున్న అసహన ధోరణుల పర్యవసానాలను దేశం యావత్తూ చూస్తోంది.కాంగ్రెస్‌ నాయకత్వంలోని పదేళ్ల యుపిఏ పాలనలో అవినీతి అక్రమాలకు పెద్ద పీట వేసి అభివృద్దిని వెనుక పట్టు పట్టించారనే ఆగ్రహంతో అనేక మంది బిజెపి మతోన్మాద ధోరణులను కూడా చూడకుండా ఓటు వేశారు. గుజరాత్‌ను అభివృద్దిలో ముందు పీఠీన వుంచారనే భ్రమతో దేశమంతటినీ అలాగే మార్చే అల్లా వుద్దీన్‌ అద్బుతదీపం నరేంద్రమోడీ దగ్గర వుందని కలలు కన్నారు. ఏదాది గడిచి రెండో ఏడులో ప్రవేశించగానే అనేక మంది ఇదేమిట ?ి ఇలా జరుగుతోందేమిటి అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిగా వుందేమిటి ? అని విస్తుపోతున్నారు. ఒక దాని గురించి తేరు కోక ముందే మరో కొత్త ఘటన లేదా వివాదం పుట్టుకు వస్తోంది. పోనీ అవి ఏమైనా దేశ పురోగతికి తోడ్పడేవా అంటే కాదని కానే కాదని అందరికీ తెలుసు.
RSS Akhil Bharatiya Pratinidhi Parishad 2012

పశుమాంసం, ఇతర అంశాలుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి సభ్యులను నియంత్రించాలని, ఇవి ఎక్కువైతే విశ్వసనీయత కోల్పోయే అవకాశం వుందని మూడీస్‌ సంస్ధ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇవి పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సంస్కరణల విషయంలో మోడీ సర్కార్‌ వాగ్దానాలను నిబెట్టుకోక పోవటంతో నమ్మకాలు సన్నగ్లిల్లుతున్నాయని, భారత పురోగతిపై అంతర్జాతీయ మదుపుదార్లలో విశ్వాసం ఏర్పడలేదని కూడా చెప్పింది. నేను రాజకీయవేత్తను కాదు, రాజకీయాలంటే ఆసక్తి కూడా లేదు, కానీ ఈ దేశంలోని మైనారిటీలు, వలస వచ్చిన ఇతరులలో కూడా బాగా భయం వున్నట్లు గ్రహించాను, ఇది దేశాభివృద్దికి మంచిది కాదు, ప్రపంచంలో మతపరమైన అసహనం వున్న ఏదేశం కూడా సరిగా లేదు అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌ తలచింది ఒకటైతే జరుగుతున్నది ఒకటి. అయినా సరే సమాజాన్ని,దేశాన్ని వెనక్కు నడపాలనే దాని అజెండా నుంచి వెనక్కు తగ్గేందుకు సిద్దంగా లేదని, మరింత అసహనాన్ని రెచ్చగొడుతూ రాంచీ సమావేశంలో జనాభా విధానంపై తీర్మానం ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం జనాభాను నియంత్రించాలని డిమాండ్‌ చేసింది. ప్రశ్నించటం, చర్చించటం భారత సంప్రదాయంలో విడదీయరాని భాగమని , ఆర్ధికాభివృద్ధికి ఈ సంప్రదాయం ఎంతో అవసరమని అదే సమయంలో న్యూఢిల్లీిలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘరాం రాజన్‌ చెప్పారు. ఏకపక్ష అధికారాన్ని సవాల్‌ చేసే ధోరణిని ప్రోత్సహించాలని అప్పుడు అధికారం అండతో ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్నో, సిద్ధాంతాన్నో ఇతరుల మీద రుద్దే పరిస్ధితి వుండదని రాజన్‌ చెప్పారు. మహాత్మా గాంధీ మాటలను వుటంకిస్తూ పరస్పర సహనమే పరమ ఔషధం. మన మందరం ఒకే విధంగా ఆలోచించం సత్యాన్ని వివిధ కోణాల్లో చూస్తాం అని రాజన్‌ అన్నారు. రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నుంచి ఈ వ్యాఖ్యలను కలో కూడా వూహించని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి రాజన్‌ ఆర్‌బిఐలో తన పని చూసుకోవాలి గాని తాతయ్య మాదిరి మాట్లాడవద్దని అపహాస్యం చేశాడు. రాజన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధానికి సలహా ఇచ్చారు. ఆర్ధిక అభివృద్ధి గురించి అరచేతిలో వైకుంఠం చూపిన బిజెపి ఈ విషయంలో అది అంత తేలిక కాదని ఏడాది కాలంలోనే అర్ధం కాగానే దీన్ని పక్కదారి పట్టించేందుకు తమ మతోన్మాద ఎజండాను ముందుకు తెచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.

మేధావుల స్పందన తీరు తెన్నులను చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్దం ముందునాటి జర్మనీ, నాజీ పాలకుల పట్ల అక్కడి మేధావివర్గం అనుసరించిన వుపేక్ష లేదా మద్దతు ఇచ్చిన తీరును గుర్తుకు తెస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ పోలికను చూసి అదిరిపడే వారు, మరీ ఎక్కువగా వుందను కొనే వారు దీనితో ఏకీభవించకపోవచ్చు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో నరేంద్రమోడీని గుడ్డిగా అభిమానించిన వారిలో కొందరైనా ఇప్పుడు ఎందుకు బహిరంగంగా గళం ఎత్తుతున్నారో వారు ఆలోచించటం ప్రారంభించాలి.

ఈ పరిణామాలు ఎంత ఆందోళన కలిగిస్తున్నాయో వాటిపై స్పందించాల్సిన మేధావి వర్గ మౌనం అంతకంటే ఎక్కువ కలవరం పుట్టిస్తోంది. దీని అర్ధం అందరూ మౌనంగా వున్నారని కాదు. గత కొద్ది వారాలుగా వివిధ రంగాలకు చెందిన మేధావులు వందల మంది బహిరంగంగా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వ్లెల్లడిస్తున్నారు. దాని పర్యవసానమే కులుబుర్గి హత్య జరిగిన నెలా 24 రోజుల తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ ఆ దుర్మార్గాన్ని ఖండిరచక తప్పలేదు. సకాలంలో స్పందించని కారణంగా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లయింది. తన పధకానికి ఇటువంటి ఎదురు దెబ్బ తగులుతుందని కాషాయ పరివార్‌ వూహించి వుండదు. అందుకే ఒకవైపు ఎదురుదాడులు చేస్తూనే మరోవైపు నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టింది. దానిలో భాగమే ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా అకాడమీ ప్రకటన.
మేధావుల స్పందన తీరు తెన్నులను చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్దం ముందునాటి జర్మనీ, నాజీ పాలకుల పట్ల అక్కడి మేధావివర్గం అనుసరించిన వుపేక్ష లేదా మద్దతు ఇచ్చిన తీరును గుర్తుకు తెస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ పోలికను చూసి అదిరిపడే వారు, మరీ ఎక్కువగా వుందను కొనే వారు దీనితో ఏకీభవించకపోవచ్చు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో నరేంద్రమోడీని గుడ్డిగా అభిమానించిన వారిలో కొందరైనా ఇప్పుడు ఎందుకు బహిరంగంగా గళం ఎత్తుతున్నారో వారు ఆలోచించటం ప్రారంభించాలి. మరింత మంది మరింత స్పష్టంగా ముందుకు రావాలి. నరేంద్రమోడీ చెప్పిన మేకిన్‌ ఇండియా , న్లల్లధనం వెలికి తీయటం , చాయ్‌పే చర్చ, ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయో తెలియదు. వాటి మంచీ చెడు గురించి చర్చ జరిగితే అదొక తీరు. దానికి బదులు వేరే అంశాలు అజండాకు వస్తున్నాయి. దేశాన్ని మరింత ముందుకు, అంతర్జాతీయంగా ప్రతిష్టను మరింతగా మూటగడతామని కబుర్లు చెప్పిన వారు వెనక్కు నడిపించేందుకు పూనుకున్నారు, ప్రపంచంలో నగుబాట్ల పాలుచేసే పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ బిజెపి నేతగా వున్న మాజీ కేంద్ర మంత్రి, ఆ పార్టీ మేధావులలో ఒకరైన మాజీ జర్నలిస్టు అరుణ్‌ శౌరి కాంగ్రెస్‌ విధానాలకు అదనంగా ఆవును చేర్చటం తప్ప మార్పేమీ లేదని నరేంద్రమోడీ సర్కార్‌ను బహిరంగంగా విమర్శ చేసినా ఆయనపై చర్య తీసుకోలేని స్దితిలో బిజెపి వుంది.
ఒకవైపు డిజిటల్‌ ఇండియా అంటూ ఆధునిక పరిజ్ఞానం గురించి మాట్లాడుతూ మరోవైపు మూఢనమ్మకంతో ఆవుకు పవిత్రతను ఆపాదించి దాని సంరక్షణ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టిన పర్యవసానమే దాద్రి సంఘటన. వూరూ పేరూ లేని ఒక వ్యక్తి చేసిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా న్యూఢిల్లీిలో నరేంద్రమోడీ పోలీసులు (ఢిల్లీి పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటారు) అవు మాంసం పెడుతున్నారంటూ కేరళ భవన్‌పై దాడి చేయటం, దాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమర్ధించటం దేన్ని సూచిస్తోంది. రేపు మన ఇళ్లపై దాడి చేసి సోదాలు చేసినా ఆశ్చర్యం లేదు. లేకపోతే ఒక ముస్లిం కుటుంబం ఆవు మాంసం తిన్నదనే పుకార్లు, ఆరోపణలతో వున్మాదులైన వారు మూకుమ్మడి దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం ఏమిటి? దాన్ని బిజెపి నేతలు సమర్ధించటం ఏమిటి ?ఈ వుదంతం ఆటవిక, మధ్యయుగాలలో జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ దుర్మార్గాన్ని స్దానిక బిజెపి నాయకులు వెనకేసుకురావటాన్ని గల్లీ కుళ్లు రాజకీయం అనుకోవచ్చు. సాక్షాత్తూ ప్రధాని ఈ ఘోరం గురించి పది హేను రోజుల పాటు మౌనం దాల్చటం, నోరు తెరిచిన తరువాత కూడా నిర్ద్వంద్వంగా ఖండిరచకపోవటం, ఆ వుదంతంతో కేంద్రానికి సంబంధం ఏమిటని అడగటమే గాక , ప్రతిపక్షాలపై ఎదురుదాడికి పూనుకున్నారు. పోనీ ఏదో విధంగా కనీసం నోరు విప్పారు అనుకుంటే ఆయన ఆస్ధానంలోని నోటి దురద బృందం రోజురోజుకూ పెరిగి పోతోంది. ప్రధాని ప్రకటన తరువాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ మాట్లాడుతూ ముస్లి లుఈ దేశంలో వుండాలనుకుంటే బీఫ్‌ తినటం మానుకోవాలని నోరు పారవేసుకున్నాడు. ఢిల్లీి పక్కనే వున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇలా వ్యాఖ్యానించిన తరువాత దేశంలో అసహనపరిస్దితి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్మబలుకుతోంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన గత 18నెలలుగా ఇలాంటి నోటి దురద వ్యాఖ్యలు వివిధ అం శాలపై పుంఖాను పుంఖాలుగా వెలువడుతూనే వున్నాయి. బిజెపి నేతల నోటి గురించి కొంతమేరకు తెలిసినా మోడీ అభివృద్ధి మోజులో చౌకబారు రాజకీయాలు లెమ్మని పెద్దగా జనం పట్టించుకోవటంలేదు. కానీ ఇటీవలి కులుబుర్గి, దాద్రి తదనంతర వుదంతాల తరువాత మేధావివర్గం పరిమితంగా అయినా తొలిసారిగా నోరు విప్పక తప్పలేదు. 2013లో మహారాష్ట్ర హేతువాది డాక్టర్‌ నరేంద్ర దబోల్కర్ను మతోన్మాదులు హత్య చేసినప్పటికీ అది ఒక పధకం ప్రకారం జరిపినదిగా భావించలేదు. తరువాత అదే రాష్ట్రంలో రచయిత, న్యాయవాది అయిన గోవింద పన్సారేను హత్య చేశారు. ఆయన ఒక కమ్యూనిస్టు గనుక హత్య చేశారు లెమ్మని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది కన్నడ విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ ఛాన్సలర్‌, రచయిత కులుబుర్గి హత్య, అలాంటి మరి కొందరికి బెదిరింపులు రావటం అసహనం, ఒక పధకం ప్రకారం జరుగుతున్నాయన్న అభిప్రాయం కలగటానికి నాంది పలికింది. కులుబుర్గి రచనలు, భావాలను సహించలేని హిందూ తాలిబాన్లు ఆగస్టు 30వ తేదీ వుదయం ఆయనను ఇంటి వద్ద కాల్చిచంపారు. గతంలో ఆయనకు అవార్డును ప్రదానం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ ఈ హత్యను కనీసం ఖండిరచలేదు.దానికి నిరసనగా తొలి రచయితగా వుదయ ప్రకాష్‌ సెప్టెంబరు నాలుగున తన సాహిత్య అవార్డును వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించి నిరసన తెలిపాడు. అప్పటి నుంచి అక్టోబరు 19వరకు 40 మంది వరకు రచయితలు, రచయిత్రులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఆరు దశాబ్దాల చరిత్రలో ఇటువంటి నిరసన తెలియచేయటం ఇదే ప్రధమం. కులుబుర్గి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కావటం, హత్యను ఖండిరచటానికి సాహిత్య అకాడమీ ముందుకు రాకపోవటంతో కవులు తమ నిరసన గళాన్ని విప్పారు. అకాడమీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. దీంతో బిజెపి పెద్దలు కవుల నోరు మూయించేందుకు సాహిత్య అకాడమీ చేత ఒక ప్రకటన చేయించారు. అయితే ఈ లోగా మిగతా రంగాలలోని మేధావులు కూడా ముందుకు వచ్చారు.

అనుపమ ఖేర్‌ తప్ప ఇంత వరకు పేరున్న ఏ ఒక్క ఇతర కళాకారుడు లేదా మేధావిగానీ కాషాయ తాలిబాన్ల చర్యను సమర్దించేందుకు ముందుకు రాకపోవటం విశేషం. మేధావులు తామెటో తేల్చుకోవాల్సిన అవసరాన్ని వర్తమాన పరిణామాలు వేగవంతం చేస్తున్నాయి. ఇందుకు మాత్రం పరివార్‌ను అభినందించక తప్పదు.

అనూహ్యమైన ఈ నిరసనలతో పాలకపార్టీలోని నోటిదురద వ్యక్తులు మరింత రెచ్చిపోతున్నారు.రచయితలను విమర్శించే కర్తవ్యాన్ని పుచ్చుకున్న సినీ నటుడు అనుపమ ఖేర్‌ ఒక్కడే గతంలో అనేక దారుణాలు జరిగినపుడు తమ అవార్డులను తిరిగి ఇవ్వని వారు ఇప్పుడు ఇలా చేయటం రాజకీయ దురుద్ధేశ్యాలతోనే అని ఆ పెద్దమనిషి డైలాగు వదిలాడు. తన భార్య చండీఘర్‌ బిజెపి ఎంపీ అయినప్పటికీ తాను స్వంత అభిప్రాయాలు వ్లెల్లడిస్తున్నట్లు ఖేర్‌ నమ్మబలికాడు. డర్టీ పిక్చర్‌ విద్యాబాలన్‌ లేదా శ్యామ్‌ బెనెగల్‌ అవార్డు తిరిగి ఇవ్వటాన్ని తప్పు పట్టారు తప్ప నిరసగురించి వాఖ్యానించకుండా మౌనం దాల్చారు. రచయిత చేతన్‌ భగత్‌ మరో రూపంలో బిజెపికి మద్దతు పలికాడు. నిరసన తెలిపిన రచయితలను అపహాస్యం చేశాడు. ఓ నేనుకూడా అవార్డును వెనక్కి ఇవ్వాలి కదూ, అయితే నాకింకా రాలేదని వ్యాఖ్యానించాడు. అలా చేయటం అకాడమీని, న్యాయమూర్తులకు అవమానం అన్నాడు. అనుపమ ఖేర్‌ తప్ప ఇంత వరకు పేరున్న ఏ ఒక్క ఇతర కళాకారుడు లేదా మేధావిగానీ కాషాయ తాలిబాన్ల చర్యను సమర్దించేందుకు ముందుకు రాకపోవటం విశేషం. మేధావులు తామెటో తేల్చుకోవాల్సిన అవసరాన్ని వర్తమాన పరిణామాలు వేగవంతం చేస్తున్నాయి. ఇందుకు మాత్రం పరివార్‌ను అభినందించక తప్పదు. తాము అటూ ఇటూ కాదు మధ్యేవాదులం అని అనేక మంది చెబుతుంటారు. గోడమీది పిల్లివాటం, నిజానికి అదొక మసుగు మాత్రమే. ఒక పరీక్షా సమయంలో కూడా తమ వైఖరిని వ్లెడిరచకపోవటం అంటే వారు పరోక్షంగా మతశక్తులను వుపేక్షించటమే అవుతుంది. జర్మనీలో కూడా అనేక మంది ఇదే విధంగా హిట్లర్‌ హయాంలో తమ వైఖరిని వ్లెడిరచకుండా మౌనంగా వుండటంతో నాజీ శక్తులు అది తమకు మద్దతుగా భావించి రెచ్చిపోయాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అదే జరగబోతోందా ?
సంఘపరివార్‌ మద్దతు దారులు తాము ఎంతో తెలివిగా ఎదురుదాడి చేస్తున్నామని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి అది ఎంతో పేలవంగా వుంది. వారిని సమర్ధించేవారిని కూడా ఇబ్బందులలోకి నెడుతోందంటే అతిశయోక్తి కాదు. అసహనం, మైనారిటీ మతాలు, శక్తులపై ద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని తప్పు పట్టేవారిది కృత్రిమ నిరసగా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ ఆరోపించారు. ఇప్పుడు నిరసన తెలుపుతున్న వారు యుపిఏ హయాంలో జరిగిన పరిణామాలపై ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. అదే పెద్ద మనిషి విదేశాలలో దాద్రి ఘటనపై మరో విధంగా మాట్లాడాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదని అనుకుంటుందన్నట్లుగా పరివార్‌ నేతలు మాట్లాడుతున్నారు. ఒకవైపు దేశంలో అసహన పరిస్ధితులు లేవు, అంతా సజావుగానే వుందంటారు. మరోవైపు ఇప్పుడు నిరసన తెలుపుతున్నవారు గతంలో జరిగిన పరిణామా పట్ల మౌనం ఎందుకు వహించారని అతి తెలివి అడ్డు సవాళ్లు వదుతున్నారు. గతంలో జరిగిన వాటిపై అనుపమ ఖేర్‌, శ్యామబెనెగల్‌, విద్యాబాతెలన్‌ వంటి పరివార్‌ మేధావులు ఎందుకు నోరు మెదపలేదో చెప్పగరా ? అత్యవసర పరిస్ధితి, సిక్కుల ఊచకోత, యుపిఏ అవినీతి వంటి కొన్ని ఎంపిక చేసిన ఘటనలను మాత్రమే కాషాయ సేనలు ముందుకు తెస్తున్నాయి. బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ మారణకాండ వంటి వాటిని ఎందుకు ప్రస్తావించటం లేదు ? నిజమే ఏ దుర్మార్గం జరిగినా దానికి స్పందించాల్సిందేననటంలో పంచాయతీ లేదు. ఈ వాదను ముందుకు తెచ్చిన వారికి గతంలో జరిగిన అన్ని ఘోరాలపై స్పందించిన చరిత్ర లేదు. కనుక ఇప్పుడు నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించే నైతిక హక్కు లేదు.
నిజానికి ఇవన్నీ చరిత్ర చెత్తబుట్టలోని వాదనలు. మీ తాత, తండ్రీ ప్రశ్నించని కుల వివక్షను నువ్వెందుకు ముందుకు తెస్తున్నావని గ్రామాలలో భూస్వాములు ముందుకు తెచ్చిన వాదనలివి. అ మాటకు వస్తే అసలు స్వాతంత్య్ర డిమాండ్లు, భూములు పంచమని, రిజర్వేషన్లు ,స్త్రీ,పురుష సమానత్వం వంటి అంశాలను కూడా ఇప్పుడెవరూ డిమాండ్‌ చేయకూడదు. ఎందుకంటే మన ముత్తాతలు, వారి ముందు తరాల వారు అడగలేదు కదా?
చేసిన డిమాండ్‌ లేదా విమర్శ సరైనదో కాదో చెప్పలేక గతంలో ఎందుకు చేయలేదు, చెందలేదు అంటే కుదరదు. కొందరు రచయితులు, రచయితల నిరసనకే తల దిమ్మెక్కిన కాషాయ సేనకు చెందిన వారు అక్టోబరు 18న యుపిలో అఖిల భారత హిందూ మహాసభ పేరుతో అవార్డులు ఇచ్చివేస్తున్న రచయితల బుద్ధినిశుద్ది చేయాలంటూ ఒక యజ్ఞం నిర్వహించారు. రచయితలు దేశ ద్రోహులని నిర్వాహకులు నిందించారు. ‘అసహనం, హింసాత్మక, నేరస్ధ బుద్దులతో నిండి వున్న తమ ఇళ్లను ముందు శుద్ది చేసుకోవాలని తొలుత అవార్డును వెనక్కు ఇచ్చిన హిందీ రచయిత వుదయ ప్రకాష్‌ వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీిలో రామలీలా వుత్సవం జరుగుతుండగా లైట్లు ఆరిపోగానే రెండున్నర సంవత్సరాల వయస్సుగల బాలికను అపహరించి అత్యాచారం చేశారని, అందువలన ముందు హిందూశక్తులు తమతో వున్నటు వంటి శక్తుల బుద్దిని శుద్ధి చేసుకోవాని ఆయన సలహా ఇచ్చారు.
ఇక అధికారంలోని పెద్దలు రచయితలకు రాజకీయాల రంగు పూసి బెదిరించేందుకు పూనుకున్నారు. అందుకుగాను తొలుత వారు జవహర్‌లాల్‌ నెహ్రూ మేనకోడలైన నయనతారా సెహగల్‌పై దాడి చేశారు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో అవార్డులు పొందినవారు వాటిని తిరిగి ఇచ్చివేస్తున్నట్లు కాంగ్రెస్‌ రంగు పులిమేందుకుపూనుకున్నారు. అది కూడా వెలిసి పోయింది. గతంలో ఏబి వాజ్‌పేయి ప్రధానిగా వుండగా అవార్డులు పొందిన వారితో పాటు స్వయంగా నరేంద్రమోడీ ప్రభుత్వ మొదటి ఏడాదిలో అవార్డు పొందిన పంజాబీ రచయిత్రి కూడా వున్నారు.వారు తెలిపిన నిరసన సరైనదా కాదా అన్నదానిని పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడటం నియంతపాలన తీరుతెన్నులను గుర్తుకు తెస్తోంది. కాషాయ పరివారం చేస్తున్న వాదనలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కవులు, కళాకారులు అవార్డులు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే అవార్డును తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన వారు అసలు అవార్డులకు అర్హులా కాదా అన్నది వేరే విషయం అంటూ వచ్చిన అవార్డులను తిరిగి ఇవ్వకండని శ్యామ్‌బెనెగల్‌ వ్యాఖ్యానించారు. అంటే బిజెపి సర్కార్‌ హయాంలో ఇచ్చే అవార్డును తిరస్కరించటమంటే బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు, తీసుకుంటే బిజెపికి భజన చేసినందుకు అవార్డు వచ్చినట్లు జనం అనుకొనే ప్రమాదం వుంది.
దాద్రి గ్రామంలో బక్రీద్‌ సందర్బంగా ఒక ముస్లిం కుటుంబం ఆవును వధించి తిన్నదని ప్రచారం చేసి కుటుంబ యజమానిని బలిగొన్నారు. తీరా వారు తిన్నది ఆవు మాంసం కాదని తేలింది.ఈ దుర్మార్గాన్ని ఖండిరచాలని అనేక వర్గాల నుంచి వచ్చిన డిమాండ్‌ను ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. వత్తిడి పెరగటంతో విచారకరం అన్నారు. అది కూడా ప్రతిపక్షాల మతతత్వం కారణంగానే జరిగిందని ఎదురుదాడి చేశారు. దాద్రిలో అమాయకులను అరెస్టు చేశారని బిజెపి వారు ఖండిరచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గొడ్డు మాంసం తినాలనుకుంటే ముస్లిరలు ఈ దేశంలో వుండకూడదని వ్యాఖ్యానించిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ తరువాత తన వ్యాఖ్యను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ దానిలో నిజాయితీ లేదు. సాక్షి మహరాజ్‌ అనే పెద్ద మనిషి ఆవును వధించిన వారికి వురివేయాలన్నాడు. ఇలాంటి వారందరికీ స్ఫూర్తినిచ్చే సంఘపరివార్‌ పత్రిక పాంచజన్యంలో గోహత్యకు పాల్పడిన వారిని చంపివేయాలని వేదాలు ఆదేశించాయని, ఇది మనకు జీవన్మరణ సమస్యగా వుందని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ధోరణి చూసిన తరువాత తమకు రాజకీయంగా నష్టదాయకం అని భయపడిన పంజాబ్‌ అకాలీదళ్‌ దాద్రి వుదంతం జాతికే సిగ్గుచేటని ప్రకటించింది. మోడీని సమర్దించే పత్రికా వ్యాఖ్యాతలు కొందరు ఈ దేశాన్ని పరిపాలిస్తోంది వేదాలా లేక రాజ్యాంగమా అని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన తరువాత బీహార్‌ ఎన్నికలతో పాటు మోడీ ప్రతిష్టకు ముప్పుతెచ్చేవిగా వున్నట్లు గ్రహించిన బిజెపి పెద్దలు అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పిలిపించి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ద్వారా మందలింప చేయించిందని, నరేంద్రమోడీకి కూడా ఆగ్రహం వచ్చిందని మీడియాలో కధలు రాయించారు. పాంచజన్య, ఆర్గనైజర్‌ పత్రికల్లో రాసినదానితో తమకు సంబంధం లేదని అవి తమ అధికారిక వ్యాఖ్యాతలు కావని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఇదంతా జరిగిన నష్టాన్ని పరిమితం చేసేందుకు చేస్తున్న యత్నం తప్ప మరొకటి కాదు. గతంలో అనేక వుదంతాలలో ప్రతికూల ప్రతిస్పందనలు రాగానే వాటితో తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించుకుంది.వాటిలో చివరకు ఎంఎస్‌ గోల్వ్కార్‌ 1939లో రాసిన ‘వుయ్‌ ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ’ అనే పుస్తకంలోని వ్యాఖ్యలు పరిణితి చెందిన గూరూజీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహించేవి కావని తొలిసారిగా 2006లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఇంత జరిగాక ఇప్పుడు రాంచీ సమావేశం సందర్బంగా దాని నాయకులు మాట్లాడిన తీరు చూస్తే ఎదురుదాడికే సిద్దం అవుతున్నారని భావించాలి.
జర్మన్‌ జాతీయవాదం పేరుతో హిట్లర్‌ నాయకత్వంలోని నాజీ పార్టీ ముందుకు తెచ్చిన ప్రమాదకర భావాలను ఖండిరచటంలో నాటి జర్మనీ మేధావివర్గం తగిన విధంగా స్పందించలేదు. అనేక మంది హిట్లర్‌ను ఏదో ఒకసాకుతో సమర్దించారు.అటు వంటి ధోరణులు మన దేశంలో కనిపిస్తున్నాయి.అయితే గతంలో నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చిన వారంతా ఆయనతో శాశ ్వతంగా ముడివేసుకుతిరుగుతారని చెప్పలేము. అనేక మందిలో ప్రస్తుతానికి అది పరిమితమే అయినప్పటికీ పునరాలోచన ప్రారంభమైంది. అలాంటి ఒక మేధావి నరేంద్రమోడీకి రాసిన ఒక లేఖలోని అంశాలు ఎంతో ఆలోచనాత్మకంగా వున్నాయి.

ఒక మాజీ మద్దతుదారు భవానీ మెహరోత్రా నుంచి నరేంద్రమోడీకి లేఖ

అక్టోబరు 16,2015
ప్రియమైన మోడీ గారికి,
వ్యక్తిగతంగా పశ్చాత్తాపరహితము మరియు పరిమితం అయినప్పటికీ విచారణ లేకుండా వధించిన దాద్రీ ఘటన దురదృష్టకరము, అవాంఛనీయం అని బీహార్‌ రాష్ట్ర ససారామ్‌లో ఎన్నికల సభ సందర్బంగా మతసామరస్యాన్ని సొమ్ము చేసుకొనేందుకు అయినప్పటికీ మీరు మాట్లాడినందుకు నాకు సంతోషంగా వుంది. రాష్ట్రపతి సుటంకిస్తూ ఇంతకు ముందు ఒకసారి నవడాలో భాష్యం మాత్రమే చెప్పినప్పటికీ (మీరు పరిమితమైన క్లుప్త పదాలు మరియు శుభాకాంక్షలను వుటంకించటం మాకు తెలుసు) కొంత మేరకు సమ్మతించినందుకు ఇప్పటికీ నేను సంతోషిస్తున్నాను. అయినప్పటికీ ఒక విషయాన్ని సంబాళించటలో ఘోరంగా విఫలమయ్యారు.(నత్తనడక నడుస్తున్న ఆర్ధిక వ్యవస్ధ మరియు దాన్నుంచి వుద్భవించే సంబంధ విషయాలను వదిలేద్దాం) అవేమంటే బిజెపి కుటుంబ దళాన్ని అంటి పెట్టుకొని వుండే జలతారు అంచుల వంటి శక్తులు ముందుకు తెచ్చినవి. విచారకరంగా మీ ‘సుపరిపాలన’కింద తామే ప్రధాన స్రవంతిగా అవి స్వయంగా నిర్దారించుకుంటున్నాయి.అంతకంటే విచారకరమైనదేమంటే ‘మీ ఆధ్వర్యంలో’ కూడా అవే ప్రధానంగా వున్నాయి. మీ స్వంత ఎంపీలు, మంత్రులే కేకు మీది ఐస్‌క్రీమ్‌ మాదిరిగా వున్నారు. తొలుత వారికి నోటి తుత్తర(తీట) వ్యాధి అనుకున్నాను, తీరా చూస్తే ఒక పెద్ద పధకంలో భాగంగానే వారి వంతు వ్యాఖ్యల సందేశాలని రుజువు అవుతోంది. ప్రతి ఒక్క సందేశం ఒక నిర్దిష్ట ప్రేక్షకులకు వుద్దేశించిందని, వారికి తగిన భాష,గ్రామ్యోక్తులు, జాతీయాలు అని అర్ధం అవుతోంది.వారంతా ప్రమాదకరమైన అక్కరకు రాని కాషాయ జబ్బుతో వున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఐఎస్‌ఐస్‌కు జన్మనిచ్చిన తాలిబాన్లు మరియు అలాంటి వారికి పట్టుకున్నది. హిందువులు తమంతట తాము సంఘటితం కావాలని పిలుపునిచ్చిన యోగి అవైధ్యనాధ్‌ వ్యాఖ్య లేదా సాధ్వి నిరంజన్‌ జ్యోతి వర్ణించిన రంజాదా(రామ సంతానం) మరియు హరాంజాదా(అక్రమ సంతానం) ఎవరు కావాలో త్చేుకోమన్న అసమాన పోలిక లేదా ప్రభుత్వం ఒక రామభక్తుడిదని నితిన్‌ గడ్కరీ గుర్తు చేయటంగానీ అన్నింటినీ చూస్తే అత్యంత హాస్యాస్పదమైన వాటి మీద పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.
భారత్‌ కాదు హిందూత్వ ముందు అని మీ అర్ధమా ? పెద్ద మొత్తం డబ్బుతో మీరు నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో నేనెంతో అబ్బురపడినందుకు నేను విచార పడుతున్నాను( మీరు ఎంతో అద్బుతంగా నిర్వహించిన వాటిలో ఒకటి ఇది) దాని గురించి కొద్దిగా కూడా చదవలేదు. అది నా వైఫల్యం తప్ప మీది కాదు. నేను వివేకంతో ఓటు వేసి వుంటే ఈ రోజు మహమ్మద్‌ అఖ్లక్‌ మరణం సంభవించి వుండేది కాదు. మొదటి పద పరికరమే రెండవదని, రెండు పదాలకు తేడా తెలుసు కోకుండా ‘కనిష్ట ప్రభుత్వం మరియు గరిష్ట పాలన’ అని ప్రతి ధ్వనించిన నినాదంతో నేను మోసపోయాను. ఒక పరికరాన్ని ఎలా వుపయోగిస్తారో చెప్పకుండా వుండటంలో మీరు ఎంతో ప్రతిభావంతులని తెలియక నేను పడిపోయాను. ఎన్నికల ప్రణాళికలో మీరు ‘జవాబుదారీ ప్రభుత్వం’ గురించి ప్రస్తావించినపుడు నేను దానిని అర్ధం చేసుకోలేకపోయాను. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకే ప్రభుత్వం జవాబుదారీ అన్నది అసలైన అర్ధమని మీరు భావిస్తున్నారా ? స్వచ్ఛ భారత్‌ అన్నా కూడా బహిరంగ ప్రకటనలకు స్వేచ్ఛ లేకపోవటమని, నర్మగర్బంగా మీడియా నోరు నొక్కటం, అన్ని రకాల మైనారిటీ గళాన్ని లేకుండా చేయటం అన్న అర్ధం గలదని కూడా నేను ఎన్నడూ ఆలోచించలేదు. అదే వున్నతమైనదని మీ అర్ధం అని కూడా నాకు తెలియదు.
మార్పు కోసమే ఓటు వేశానని నేను ఆలోచించాను. ఆ మార్పు చెడును మరింత దిగజారుస్తుందని నాకు తెలియదు. మీ శాఖలు తప్పుడు సమాచారాన్ని ఆధారం చేసుకొని మత వుద్రిక్తతలను రెచ్చగొట్టగలవని వాటిని నిరోధించేందుకు మీరేమీ చేయలేదని నాకు తెలియదు. మీకు, మీ తైనాతీలకు భారత్‌లో బీఫ్‌ (గొడ్డు మాంసం) అంటే ఆవు ఒక్కటే కాదు దానితో దున్నలు(గేదెలు కూడా) కూడా వుంటాయని తెలియదు.మీరు ఎన్నడూ దీనిని వెలుగులోకి తేలేదు. గోప్యంగా వుంచారు.అంతే కాదు మీ స్వంత రాష్ట్రం గుజరాత్‌ మీరు ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న సమయంలో కబేళాలు ఎక్కువగా వున్న అగ్రశ్రేణి పది రాష్ట్రాలలో ఒకటని (ఫిక్కి సమాచారం) తెలిసి కూడా తెలియనట్లుగా వున్నారు.
దురదృష్టం కొద్దీ దీనికి మొత్తంగా మీరే బాధ్యులని నేను విమర్శించలేను. మీ ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర నాకు ఎ్లలవేళలా తెలుసు. నాకు బాబరీ మసీదు, నాకు గోద్రా గురించి కూడా తెలుసు.నేను వాటి గురించి అవసరమైన మేరకు చదివాను.
మీరు అధికారంలోకి వస్తే నవరాత్రి సందర్బంగా ఆవు పంచకం నా మీద చ్లలుతారని వుపజాగ్రదావస్తలో కూడా నాకు తెలుసు. అయితే మిలియన్ల జనం మాదిరి నేను కూడా మీ అభివృద్ది తీరు చూసి అన్ని విధాలుగా మురిసిపోయా మరియు అందుకు చెల్లించిన మూల్యాన్ని విస్మరించాను. మీ మత అంతర్గత గుణాన్ని గుర్తించకుండా నేపాల్‌లోని పశుపతినాధ్‌ ఆయానికి మీ రెండున్నరవేల కిలోల గంధపు చెక్క, 25కోట్ల రూపాయలు విరాళం, అయోధ్యలో రాముడి మ్యూజియం గురించి నేనూ ఓలలాడాను. దాద్రీ వుదంతం జరిగేంత వరకు అంతా మంచిగానే వుంది. మీరు కపటంతో నన్ను వశం చేసుకున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను.మోడీ గారూ మీ జిత్తులకు మిమ్మల్ని తప్పు పట్టాలి, అయితే వాటి గురించి నమ్మబలికి నందుకు నేను కూడా అపరాధినే.
విధేయతతో
మీ కుహనా వాక్పటిమకు లొంగిపోయి హానిచేసిన ఒక పౌరుడు
భవానీ మెహరోత్రా
(ఈ రచయిత న్యూఢిల్లీిలో రాజకీయ మరియు విధానపర అంశాల పరిశోధకుడు)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దళితులు చెవుల్లో పూలు పెట్టుకున్నారని భావిస్తున్నారా?

31 Saturday Oct 2015

Posted by raomk in Current Affairs, Social Inclusion, Telugu

≈ Leave a comment

Tags

Ambedkar, దళితులు, scheduled castes

Young Ambedkar
అంబేద్కర్‌ తన అభివృద్ధికి తోడ్పడిన ఒక బ్రాహ్మణుడిని శాశ ్వతంగా గుర్తుంచుకొనేందుకు తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్పతనం అనితర సాధ్యం. ఈ విషయంగానీ, ఆయన బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకున్నారన్న విషయంగానీ కొత్తవి కావు, వాటిని కనుగొనాల్సినంత రహస్యమూ కాదు. గోవును చంపిన వారిని హతమార్చాలని వేదాలు చెబుతున్నాయని పరివార్‌ పత్రిక పాంచజన్యరాసింది. తాను లేత గోమాంసం ఇష్టంగా తింటానని చెప్పిన యాజ్ఞవల్క్యుడి కంటే పాంచజన్య వ్యాసకర్తకు వేదాల గురించి ఎక్కువగా తెలుసని అనుకోలేము. నిజంగా వేదాలు అలా చెబితే యాజ్ఞవల్క్యుడిని ఆనాడే చంపివేసి వుండాలి. మనకు ఆయన స్మృతి వుండేది కాదు. అంబేద్కర్‌ తన జీవితాంతం మనువాదం, దానిని కాపాడుతూ వస్తున్న బ్రాహ్మణిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు, రూపు మాపాలని కోరుకున్నారు తప్ప బ్రాహ్మణులను కాదు. అలాంటి సంస్కారం పరివార్‌ నేతలకు వుందా ? అంబేద్కర్‌ కాలంలోనే ఎందరో బ్రాహ్మణులు మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేవాలయాల ప్రవేశ వుద్యమాలకు నాయకత్వం వహించారు. అందరూ మనువాదులే అయి వుంటే అంబేద్కర్‌ను ఒక బ్రాహ్మణుడు దగ్గరకు తీసి వుండకూడదు. సమాజాన్ని ఎదిరించటానికి కూడా సిద్దపడే ఆ మహానుభావుడు ఆ పని చేసి వుంటాడు.
అంబేద్కర్‌ తండ్రి శాఖాహారి అయితే ఏమిటట? ఆయన ఒక సైనికుడు అయినందున ఇది అనుమానమే. ఆ మాటకు వస్తే 70 శాతం మంది మన దేశ ప్రజలు మాంసాహారులుగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తూర్పు, వుత్తర భారతంలో మాంసాహారం తినే వున్న బ్రాహ్మణుల గురించి ఎందుకు చెప్పరు, బ్రాహ్మణేతరులులో గణనీయ సంఖ్యలో శాఖాహారులు వున్నారు. ఎవరిష్టం వారిది, ఎవరికి ఇష్టం వచ్చిన మాంసం వారు తినటాన్ని, తినకపోవటాన్ని ఎందుకు అంగీకరించరు.

Basor Dalit caste

సంస్కృతం ప్రస్తుతం ప్రపంచ మృత భాషలో ఒకటి. అలాంటి ఏ భాషనైనా బ్రతికించమని కోరటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ దానిని పని గట్టుకొని అధికార భాషగా చేయాలన్న ప్రచారం వెనుక అది మనువాదానికి ప్రతీక. అందువ్లలనే సంస్కృతాన్ని బలవంతంగా రుద్దటానికి అంగీకరించరు. గతంలో హిందీని రుద్ది వ్యతిరేకత కొని తెచ్చుకున్న పాఠాలను వారు నేర్చుకోలేదన్నది స్పష్టం. అందువలన సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనుకుంటే చేయండి. చరిత్రలో పిచ్చితుగ్లక్‌ మాదిరి మిగిలి పోవాలన్న సరదా వుంటే తీర్చుకోండి, మీ అజెండాలో ఒక్కొక్కదానిని అడ్డగోలుగా అమలు జరుపుతున్నపుడు అది ఒక లెక్కా ?దానికి అంబేద్కర్‌ ముద్ర ఎందుకు? మతం మారిన దళితులను శుద్ది చేయాలని అంబేద్కర్‌ చెప్పాడటనటం మరో బుద్ది తక్కువ ప్రచారం. అలాంటి పెద్ద మనిషి బౌద్దంలోకి ఎందుకు మారారంటే అది భారతీయ మతమట. పిల్లి న్లల్లదా త్లెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. అది భారతీయ మతమా విదేశీయా అన్నది కాదు భారత సమాజం మొత్తానికి మాయని మచ్చగా వున్న కుల వ్యవస్ధను సమర్ధిస్తుందా, రూపుమాపాలని కోరుతుందా లేదా అన్నది గీటు రాయి. ఆ విధంగా చూసినపుడు బౌద్ద మతం అలా కోరుకుంది. అందుకే అంబేద్కర్‌ మారారు.
సంఘ పరివార్‌ లేదా హిందూ మత పరిరక్షకులమని బోర్డులు కట్టుకొని తిరేగే వారు చాతుర్వర్ణ వ్యవస్ధను సమర్ధించే మను స్మృతి, వేదాలు, ఇతర గ్రంధాలను బహిరంగంగా తగుల పెట్ట నక్కర లేదు(ఎందుకంటే తిరిగి ముద్రించుకోవచ్చు), తిరస్కరించమనండి, దేవాలయాల ప్రవే శాలపై వున్న ఆంక్షలను ఎత్తివేయమనండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: