• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !

05 Sunday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, Chang Chung Ling, Gudami International, HINDENBURG RESEARCH, Narendra Modi, Narendra Modi Failures, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్నాడు గురజాడ గిరీశం. అంటే నిష్ప్రయోజకులు అని అర్ధం. శాస్త్రంలో ఉన్న ప్రతిదానికీ మినహాయింపులుంటాయని మన పండితులెప్పుడో సెలవిచ్చారు గనుక గిరీశం చెప్పినదానికి మినహాయింపు ఏమిటంటే అది అందరికీ వర్తించదు. వాట్సాప్‌ ” విజ్ఞానాన్ని ” గుడ్డిగా నమ్మే అజ్ఞానులకు మాత్రమే అని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మీద విదేశీ బిబిసి చెప్పిందాన్ని మనం నమ్మాలా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, దేశభక్తుడు అదానీ కంపెనీల గురించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ ఇచ్చిన నివేదికను విశ్వసించాలా అని 56 అంగుళాఛాతీ విరుచుకొని ప్రశ్నిస్తున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. నిజమే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదు. వాళ్లే ఇంకా ఏమంటారంటే మన దేశంలో నరేంద్రమోడీని విమర్శించే దేశద్రోహులకు మోడీ గురించి విదేశాల వారు చెప్పే ప్రశంసలు కనిపించవా అని తర్కానికి దిగుతారు. పాకిస్తాన్‌ వాళ్లు ఏమంటున్నారో చూడండి అంటూ మనకు వీడియోలు పంపుతారు. వాటిని మనం చూడాలి, తరించాలి. బిబిసి డాక్యుమెంటరీ చూడకుండా లింకులను నిషేధిస్తారు. మోడీని ప్రశంసించిన తమవారి వీడియో లింక్‌లను పాక్‌ ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు ? సదరు వీడియో మోడీ భక్తుల కల్పితం అనుకోవాలా లేక పాక్‌లో భావ ప్రకటన స్వేచ్చ ఉందనుకోవాలా ?


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని సుమతీ శతకకారుడు చెప్పాడు. ఆ రోజుల్లో గిరీశం, వాట్సాప్‌ ఉండి ఆ మాటలు బద్దెన గారి చెవినపడి లేదా చేరి ఉంటే తప్పించుకు తిరుగువారు వాట్సాప్‌ పండితులు సుమతీ అని కచ్చితంగా రాసి ఉండేవాడు. స్వదేశీయులు విమర్శించినపుడు మీకు పొగిడే విదేశీయులు కనిపించరా అంటారు. అదే విదేశీయులు విమర్శిస్తే, దాని సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే శత్రువులను భుజాన వేసుకుంటారా అని మాటలమారులు దెబ్బలాడతారు. వారి నాలికలకు నరం ఉండదు. ఇదే గాంగు వాట్సాప్‌లలో తిప్పుతున్న ఒక అంశాన్ని చాలా మంది చదివే ఉంటారు. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ జోసెఫ్‌ హౌప్‌ రాసిన సంపాదకీయం అంటూ నరేంద్రమోడీ గొప్పతనం గురించి అనేక అంశాలను పేర్కొన్నారు.బిబిసి విమర్శిస్తే దురుద్దేశం ఉంది అన్నారు. మరి ఈ సంపాదకీయం మోడీని బుట్టలో వేసుకొనేందుకు మునగ చెట్టు ఎక్కించినట్లా ? ఇక జోసెఫ్‌ సంపాదకీయంలో చెప్పిందేమిటో కొన్ని ఆణిముత్యాలను చూద్దాం. లేకపోతే మోడీ భక్తుల మనోభావాలు గాయపడితే ప్రమాదం.


” నరేంద్రమోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు( నిజమే పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపని తెలిసిందే).ఆయన చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు.( ఇదేమీ వర్ణన రాబాబూ, ఏ దేశభక్తుడినైనా ఇలా వర్ణించటం చూశారా, అసలు నరేంద్రమోడీలో ఎవరైనా చిరునవ్వును చూశారా). పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు అమెరికాతో సంబంధాలను తెగ్గొట్డాడు.ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాడు.యుద్దం చేయకుండానే పాకిస్తాన్ను సర్వనాశనం చేశాడు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని నిరూపించాడు.రష్యా,జపాన్‌లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.” ఇలాంటి అనేక అంశాలను చెప్పి ఇంతవరకు ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు అని జోసెఫ్‌ హౌప్‌ రాసినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమంటే బిబిసి, హిండెన్‌బర్గ్‌ వాస్తవం.జోసెఫ్‌ హౌప్‌ అనే జీవి అసలు ఉనికిలో లేడు, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అసలు అలాంటి సంపాదకీయం రాయలేదు.ఇది ఫేక్‌ న్యూస్‌ అని అనేక సంస్థలు దాని బండారాన్ని చెప్పాయి. పోనీ ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించిందా అంటే అదెక్కడా కనపడదు. నమో భారతీయం వంటి పేర్లతో ఆంగ్లంలో ప్రచారం చేసినదానిని తెలుగులో పాక్షికంగా అనువందించి వాట్సాప్‌లో తిప్పుతున్నారు.


ఇక వాట్సాప్‌లో చాడా శాస్త్రి పేరుతో ఒక తేడా పోస్టును తిప్పుతున్నారు.జోసెఫ్‌ హౌప్‌ మాదిరి సదరు శాస్త్రి నకిలీ పాత్రో ఉనికిలో ఉన్నదీ తెలీదు. ఏదైనా కావచ్చు, దీన్లో కూడా ఎన్నో అతిశయోక్తులు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ” అసలు మన దేశంపై చైనా గుర్రుకు కారణం ఏమిటి ? ఆ దేశ సంస్థలకి పోటీగా మన దేశ వ్యాపార సంస్థలు ఎదిగి ప్రపంచంలో వారి వ్యాపారానికి పోటీకి రావటం, చైనాకు రావాల్సిన వ్యాపారాలను భారత సంస్థలు తన్నుకుపోవటం ” పగటి కలలు కనటం అంటే ఇదే. రికార్డులను బద్దలు కొడుతూ మనం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అన్నది తెలిసే ఇలా రాస్తున్నారా ? మన సంస్థలు తన్నుకుపోతే మన దిగుమతులు తప్ప ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు. అమెరికా మన దేశంపై ఎందుకు గుర్రుగా ఉందంటూ రాసిన అంశం ఆసక్తికరం. రష్యా నుంచి రోజుకు 17లక్షల పీపాల చమురును 47 డాలర్ల వంతున దిగుమతి చేసుకొనటంతో 70బిలియన్‌ డాలర్ల ఎగుమతి ఆదాయం మన దేశానికి వచ్చిందని చెప్పారు. దానికి చేసిన ఖర్చు కూడా ఎంతో చెప్పలేదు. దాన్ని శుద్ధి చేసి రోజుకు ఆరులక్షల పీపాల డీజిల్‌ కొరత ఉన్న ఐరోపా దేశాలకు దానిలో 60శాతం మనం ఎగుమతి చేస్తున్నాం అన్నారు.దీని వలన వచ్చే లాభం అంబానీ, మరొక ప్రైవేటు కంపెనీకే కదా ! మన జనానికి కలిగే మేలు ఏమిటి ? ఒక్క లీటరైనా తక్కువ ధరకు మన జనానికి అమ్మారా ? దీనితో ప్రపంచ ఇంథన ఆర్థిక ఆటలో మనం ప్రధాన ఆటగాడిగా ఎదుగుతున్నాం అన్నారు. జనం చెవుల్లో పూలు దూర్చటం అంటే ఇదే.ఉక్రెయిన్‌పై దాడికి దిగిందంటూ రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసింది ఐరోపా. తటస్థంగా ఉన్నామని చెబుతున్న మనం ఐరోపా కోసం రష్యా నుంచి కొనుగోలుకు మన విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని అంబానీ, నయారా కంపెనీలకు ఇస్తూ మనకు ఆదాయం వస్తుందని జనానికి కబుర్లు చెబుతారా ? ఇదొక గొప్ప రాజకీయమా, తటస్థం పేరుతో ఎవరికి ఉపయోగపడుతున్నట్లు ?


వారం రోజుల తరువాత స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ మేలుకున్నది.గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టటం అంటే ఇదే.హిండెన్‌బర్గ్‌ నిర్వాహకుడు అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయలీ. ప్రపంచంలో కంపెనీల వాటాలను షార్ట్‌ సెల్లింగ్‌ చేసే సంస్థ హిండెన్‌బర్గ్‌ ఒక్కటే కాదు. దానికి నిధులు ఇవ్వటం ఎందుకు ? స్వయంగా చైనా అలాంటి కంపెనీని పెట్టవచ్చు. ప్రపంచంలో డాలర్‌ నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అది. ఒక్క అదానీని మాత్రమే ఎందుకు అన్ని పారిశ్రామిక సంస్థలను అదే విధంగా చేయవచ్చు కదా ? చైనా గనుక హిండెన్‌బర్గ్‌కు నిధులు ఇస్తే మన జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ను పంపి బయట పెట్టించవచ్చు. ఎవరన్నా అడ్డుపడ్డారా ? కాసేపు నిజంగానే చైనా నిధులు ఇచ్చి ఆపని చేసిందని అనుకుందాం. పార్లమెంటును కుదిపివేస్తున్న ఈ ఉదంతం మీద మాట్లాడి దాని బండారాన్ని వెల్లడించవచ్చు.ఇదేమీ దేశ రహస్యం కాదు. ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? ఆడలేక మద్దెల ఓడంటే కుదరదు.


హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆసరా చేసుకొని చైనా మీద ప్రచారదాడి మొదలు పెట్టటం వెనుక అసలు అంశాన్ని పక్కదారి పట్టించి అదానీ కంపెనీలను రక్షించే ఎత్తుగడ ఉంది.హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో అదానీకి చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్‌ ఇచ్చాడని, అతనితో ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిగ్గదీసింది. ప్రపంచంలో ఉన్న చైనా జాతీయులందరూ చైనా పౌరులు కానట్లే ఇతగాడూ కాదు. తైవాన్‌కు చెందిన వాడు. (ఎగువున చాంగ్‌ – అదానీ కలసి ఉన్న చిత్రం కూడా తైవాన్‌ మీడియా ప్రచురించినదే.) హిండెన్‌బర్గ్‌ 129 పేజీల నివేదికలో లేవనెత్తిన ప్రశ్నలకు గాను అదానీ ఇచ్చిన 413 పేజీల వివరణలో కీలకమైన వాటిని విస్మరించారు. చాంగ్‌ గురించి హిండెన్‌బర్గ్‌ నివేదికలో నాలుగు చోట్ల ప్రస్తావన ఉంది. ఒక్కదానికీ అదానీ సమాధానం ఇవ్వలేదు. నిజానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే అంతా ఉత్తిదే అని ఒక ట్వీట్‌ చేసి ఊరుకునేదానికి అంత వివరణ ఎందుకు ఇవ్వాలి.


హిండెన్‌బర్గ్‌ నివేదికలో ” గుడామీ ఇంటర్నేషనల్‌ ” అనే సంస్థ గురించి పేర్కొన్నారు.దానిలో చాంగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అది తమకు సంబంధించినదే అని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2002 కంపెనీ వివరాల్లో పేర్కొన్నది. ఈ గుడామీ ఇంటర్నేషనల్‌ 2018 వార్తల్లో ఉంది. కాంగ్రెస్‌ నేతలు, మిలిటరీ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చిన అగస్టా వెస్ట్‌ లాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో అనుమానిత మూడు సింగపూర్‌ సంస్థలలో ఇదొకటి. మాంటెరోసా ఇన్వెస్ట్‌మెంట్‌ హౌల్డింగ్స్‌ అనే సంస్థ అదానీ కంపెనీల్లో 450 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది.ఈ కంపెనీలో గుడామీ పెట్టుబడులు పెట్టింది.చాంగ్‌ అనేక అదానీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంటే మన దేశానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌(డిఆర్‌ఐ) ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరువులో, సంస్థ రికార్డుల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తన అడ్రస్‌గా చాంగ్‌ ఇచ్చినట్లు ఉంది.


ఇదిగాక హిండెన్‌బర్గ్‌ మరొక ఉదంతాన్ని పేర్కొన్నది. గ్రోమోర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ 2011లో 42.3 కోట్ల డాలర్ల లాభంతో అదానీ పవర్‌లో విలీనమైంది.దీనికీ చుంగ్‌కు సంబంధం ఉంది.భారత చట్టాల ప్రకారమే దాన్ని విలీనం చేసుకున్నాం తప్ప అక్రమాలేమీ జరగలేదని అదానీ తన సమాధానంలో పేర్కొన్నది.హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88ప్రశ్నల్లో మూడు పిఎంసి ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు చెందినవి. దీనికి అదానీ కంపెనీలు చెల్లింపులు జరిపినట్లు డిఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ కంపెనీ అదానీ బినామీనా కాదా చెప్పాలని కోరింది. ఇది చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ కుమారుడిదని, తైవాన్‌లో అదానీ కంపెనీ ప్రతినిధి అని పేర్కొంటూ వారంతా కలసి ఉన్న చిత్రాన్ని కూడా జత చేసి వారి సంబంధాలపై అనుమానాలున్నట్లు పేర్కొన్నది. పిఎంసితో తమకెలాంటి సంబంధాలు లేవని అదానీ తన వివరణలో పేర్కొన్నారు. తాము అడిగిన దానికి సూటిగా చెప్పకుండా కలగాపులగం చేసి చెప్పారని హిండెన్‌బర్గ్‌ పేర్కొన్నది.


ప్రస్తుత ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు దాని అవసరం లేదని, మన ప్రధాని మోడీ చక్రం తిప్పుతున్నట్లు ఒకవైపు ప్రచారం. అమెరికా మనకు జిగినీ దోస్తుగా ఉంది, మన ప్రధాని మోడీ దాని అధ్యక్షులతో భుజాల మీద చేతులు వేసి తిరిగే చనువు ఉంది. నిజంగా దానికి మన అవసరం ఉంటే హిండెన్‌బర్గ్‌ గురించి ఇంతవరకు జో బైడెన్‌ నోరువిప్పడేం. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరవుతుంటే నరేంద్రమోడీ ఫోన్‌ చేసి మాట్లాడరేం ! హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా ఉందని మన వాట్సాప్‌ మరుగుజ్జులకు తెలిసిన పరమ రహస్యం మోడీ సర్కార్‌కు తెలియని దుస్థితిలో ఉందా ? తెలిస్తే హెచ్చరిక ఎందుకు చేయరు ? దేశం, మదుపర్ల కంటే మౌనమే ప్రధానమా ? ఇంతటి సంచలనం చెలరేగితే ఏ దేశాధినేతైనా మౌనంగా ఉంటారా ? జనాలకు భరోసా ఇవ్వాల్సిన రాజధర్మం తెలియదా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలేమిటి అని ఆలోచించకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్కులో మోడీ, అదానీ, తదితరుల గురించి ప్రచారం చేసే అతియోక్తుల మీద స్వంత బుర్రలను ఉపయోగించకుండా వాటిని ఇతరులకు పంచే, ప్రచారం చేసే, సమర్దించే పెద్దమనుషులను గిరిశం చెప్పినట్లుగా వర్ణిస్తే తప్పా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !

02 Thursday Feb 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Prices, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Agriculture, Fertilizers, Fertilizers subcidies, world agriculture challenge 2023


ఎం కోటేశ్వరరావు


సమస్యలను ఎదుర్కొనే అంశంలో తప్ప ప్రపంచమంతటా రైతాంగం ఒకే విధంగా లేదు. పురాతన పద్దతుల్లో విత్తనాలు చల్లి పండిన మేరకు పంట తీసుకొనే రైతుల మొదలు ఆధునిక పద్దతుల్లో మొత్తం యంత్రాలతో సాగు చేసే వారు ఉన్నారు. కడుపు నింపుకొనేందుకు మాత్రమే పండించుకొనే వారు ఎందరో ఉంటే అమ్ముకొని లాభాలు పోగేసుకొనేందుకు చూసే వారు కొందరు. అందువలన సమస్యలు కూడా ఒకే విధంగా లేవు. మనుషులందరూ ఒకటే గానీ కొందరికి ఆకలి జబ్బు మరికొందరికి తిన్నది అరగని జబ్బు మాదిరి ఎవరి సమస్య వారిది. రైతులు అంటే కేవలం పంటలు పండించేవారే కాదు, అనుబంధ రంగాలలో పని చేసేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో రైతాంగం తీరు తెన్నులు, వారి ముందున్న కొన్ని సవాళ్లు-సమస్యల గురించి చూద్దాం.


ఏ రైతుకైనా కావాల్సిన వాటిలో ఎరువు ఒకటి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ – రష్యా వివాదం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల రైతాంగాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నది.2022లో ఎరువుల ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. అనేక దేశాల్లో మాంద్యం రానుందనే హెచ్చరికల నేపధ్యంలో రైతులు, ఆహార సరఫరా మీద 2023లో మరింత వత్తిడి పెరగనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాతావరణ అనుకూల ప్రతికూలతలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నది రైతులే. ఉదాహరణకు ఉక్రెయిన్‌ సంక్షోభం, చమురు, గాస్‌ ధరల పెరుగుదుల, రవాణా అంశాల కారణంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి సాగు ఖర్చు ఇబ్బడి ముబ్బడై అనేక దేశాల రైతాంగం ఇబ్బంది పడింది.2022 రెండవ అర్ధకాలంలో పొటాష్‌, ఫాస్పేట్‌ వినియోగం పది నుంచి 40శాతం తగ్గింది, దాంతో ధరలూ తగ్గాయి.చైనా ఎగుమతులు నిలిపివేసిన తరువాత ప్రపంచమార్కెట్లో 2022 ఏప్రిల్‌లో టన్ను డిఏపి ధర వెయ్యి డాలర్లు ఉండగా తరువాత 713కు తగ్గింది. ఈ ఏడాది 550 డాలర్లకు తగ్గుతుందని ఒక అంచనా. మన దేశంలో ఏడాది పాటు సాగిన రైతాంగ ఆందోళన, వివిధ రాష్ట్రాలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఎరువుల ధరలు ప్రభావం చూపకుండా చూసేందుకు సబ్సిడీలను పెంచి రైతుల మీద భారం పడకుండా చూసింది. అనేక దేశాలలో రైతులే వాటిని భరించారు. సబ్సిడీ ఎరువులు మినహా, ఇతర పెట్రోలు,డీజిలు, రవాణా ఖర్చులు, పురుగుమందుల ధరల పెరుగుదల వంటి భారాలను మన రైతులే భరించారు. 2022 జూలైలో ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తుల దిగ్బంధననాన్ని రష్యా ముగించటంతో ఎగుమతులు పెరిగి ధరల తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల ఎగుమతులు తగ్గిన మేరకు రైతులకు నష్టం జరిగింది. అందువల ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము, దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎలా ఉండేదీ అనూహ్యమే.

ప్రపంచంలో ఫాస్పేట్‌ను ఎక్కువగా 2021లో చైనా 85మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేయగా రష్యా 14మి.టన్నులతో నాలుగవ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ ఫర్టిలైజర్స్‌ సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ భూముల్లో 85శాతం నత్రజని కొరత, 73శాతానికి ఫాస్పేట్‌, 55శాతానికి పొటాష్‌ కొరత ఉంది. ధరల పెరుగుదల కారణంగా అనేక మంది రైతులు వీటి వాడకాన్ని తగ్గించారు. అది పంటల ఆరోగ్యం, దిగుబడుల మీద ప్రతికూల ప్రభావం చూపింది.పొటాష్‌ ఉత్పత్తిలో 14మి.టన్నులతో కెనడా ప్రధమ స్థానంలో ఉండగా రష్యా,బెలారస్‌ కలసి 17 మి.టన్నులు ఉత్పత్తి చేశాయి.2022కు ముందు ప్రపంచంలో 40శాతం ఉత్పత్తి వీటిదే. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంఓపి టన్ను ధర 221 డాలర్లుండగా తరువాత 562 డాలర్లకు చేరింది. 2009 తరువాత ఇదే అధికం.పొటాష్‌కు డిమాండ్‌ తగ్గింది. 2022లో ఆంక్షల కారణంగా రష్యా,బెలారస్‌ నుంచి ఎగుమతులు ఆగాయి. దీన్ని కెనడా సొమ్ము చేసుకొని విపరీత లాభాలు పొందింది. ఈ విధంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రైతాంగాన్ని, సాగును దెబ్బతీశాయి.


వివిధ దేశాలలో మన దేశంలో మాదిరి కనీస మద్దతు ధరలు లేవు. ఉన్నవాటిని కూడా ఒకదానితో మరొకదానిని పోల్చలేము. చైనా వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ముందే చెప్పుకున్నట్లు ఎక్కడ ఎంత ఉన్నా అక్కడి సాగు ఖర్చులతో పోలిస్తే సాగు గిట్టుబాటు కావటం లేదన్నది స్పష్టం. అందుకే అనేక ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి.లేని చోట రైతాంగం నష్టపోతున్నది. ఎగుమతులకు సైతం సబ్సిడీలు ఇచ్చే అమెరికా వంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే. వివిధ దేశాలలో ఉన్న పంటల దిగుబడి కూడా రైతాంగ రాబడిని ప్రభావితం చేస్తుంది. దిగవన కొన్ని దేశాల వివరాలను చూద్దాం. వాతావరణాన్ని బట్టి అంచనాలు మారుతూ ఉంటాయి. ఒక హెక్టారుకు దిగుబడి అంచనాలు కిలోల్లో ఇలా ఉన్నాయి.2023 జనవరి అంచనాలని గమనించాలి. ఆఫ్రికా ఖండానికి సూచికగా ఈజిప్టును తీసుకున్నప్పటికీ పంటల దిగుబడి మిగతా దేశాలలో దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నదని గమనించాలి.


దేశం ××× గోధుమ ××వరి×× ముతక ధాన్యం×× పత్తి ×× చమురు గింజలు××మొక్కజొన్న
ప్రపంచం×× 3,550 ×××4,590××× 4,290 ××× 787 ××× 2,330 ××× 5,740
అమెరికా×× 3,130 ×××8,280××× 10,130×××1,062 ××× 3,150 ×××10,880
ఐరోపా××× 5,500 ××× 6,060××× 4,980××× నిని ××× 2,640 ××× 6,010
బ్రిటన్‌ ××× 8,610 ××××××××××× 6,320××× ×× ××× 3,400 ××× ×××××××
చైనా ××× 5,860 ××× 7,080××× 6,270××× 2,032××× 2,560 ××× 6,440
భారత్‌ ××× 3,370 ×××4,120××× 2,030××× 444 ××× 1,030 ×××3,200
బ్రెజిల్‌ ××× 3,060 ×××7,000××× 5,330××× 1,777××× 3,490 ××× 5,510
ఈజిప్టు ××× 6,410 ×××8,700××× 7,130××× 703 ××× 1,040 ×××8,000


పైన పేర్కొన్న వివరాల అంచనాల్లో స్వల్ప మార్పులు తప్ప దిగుబడుల ధోరణులను వెల్లడిస్తాయి. మన దేశంలో పత్తి కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదని తెలిసిందే. చైనాలో కూడా అంతే ఇచ్చినప్పటికీ అక్కడ దిగుబడులు ఎక్కువ కారణంగా రైతాంగానికి నష్టం ఉండదు. పత్తి పండే దేశాల్లో అనేక ఆఫ్రికా దేశాలకు దగ్గరగా తక్కువ దిగుబడి ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశంలో కనీస మద్దతు ధరలు ఇవ్వటాన్ని సబ్సిడీ ఇవ్వటంగా చిత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిగుబడులు ఎక్కువగా ఉండటం, సబ్సిడీలు ఇచ్చి తక్కువ ధరలకే ఎగుమతులు చేస్తూ మన వంటి దేశాలను అమెరికా,ఇతర ధనిక దేశాలు దెబ్బతీస్తున్నాయి.

ప్రపంచమంతటా 2022లో పెరిగిన సాగు ఖర్చులు, రైతులను ఎలా ప్రభావితం చేసిందీ ఇంకా సమగ్రమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ప్రతి డాలరును పట్టి పట్టి చూస్తారు గనుక మిగతా దేశాలతో పోలిస్తే ఆ లెక్కలు కూడా వేగంగా రూపొందుతాయి. భూమి,యంత్రపరికరాలు, ఇంథనం, ఎరువులు, పురుగుమందుల ధరలు బాగా పెరిగినందున ఉత్పత్తి ఖర్చు పెరుగుదల తీరు గురించి కొంత విశ్లేషణ అందుబాటులోకి వచ్చింది. సాగు పద్దతులు, మెట్ట, తరి వంటి తేడాలు, దిగుబడులు కూడా సాగు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నెబరస్కా లో వివిధ పంటలకు పెరిగిన ఖర్చు ఇలా ఉంది. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటు దిగుబడి బుషెల్స్‌ (25.4 కిలోలకు సమానం)లో, ఒక్కో బుషెల్‌కు ఖర్చు డాలర్లలో అని గమనించాలి.
పంట××××××× సగటు దిగుబడి××× 2021 ×××2022
మెట్ట మొక్కజొన్న×× 150 ××× 2.34 ××× 2.87
తరి మొక్కజొన్న×× 239 ××× 2.28 ××× 2.83
మెట్ట గోధుమ ×× 62 ××× 3.36 ××× 4.55
తరి గోధుమ ×× 98 ××× 3.11 ××× 4.20
మెట్ట సోయా ×× 47 ××× 5.53 ××× 6.46
తరి సోయా ×× 73 ××× 4.64 ××× 5.55
యంత్రాల వినియోగాన్ని బట్టి అమెరికాలో శ్రమశక్తి-కార్మికుడి ఖర్చును లెక్కిస్తారు. అది సగటున గంటకు 25డాలర్లు ఉంది.ఇతర అంశాల్లో తప్ప ఈ ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. ఎరువుల ఖర్చు 30 నుంచి 70శాతం వరకు పురుగుమందుల ఖర్చు 16 నుంచి 60శాతం పెరిగింది. అది ఎలా పెరిగిందో చూద్దాం.( డాలర్లలో)
పంట, ఏడాది×× ఎరువు ××పురుగుమందు ××మెటీరియల్‌×× నిర్వహణ×× భూమి
మెట్ట మొక్కజొన్న×× —- ××× — ××× —- ××××× —×××——
2020 ×× 49 ××× 60 ××× 226 ×××××× 66 ××× 132
2021 ×× 42 ××× 62 ××× 221 ×××××× 75 ××× 135
2022 ×× 84 ××× 69 ××× 280 ×××××× 78 ××× 144
తరి మొక్కజొన్న×× — ××× — ××× — ××××× —××× —-
2020 ×× 95 ××× 70 ××× 344 ×××××× 144 ××× 260
2021 ×× 82 ××× 59 ××× 320 ×××××× 152 ××× 259
2022 ×× 167 ××× 86 ××× 489 ×××××× 152 ××× 281
ఇదే విధంగా మిగతా పంటల పెట్టుబడి ఖర్చుల్లో కూడా పెరుగుదల ఉంది.


పది ప్రధాన దేశాల వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.1చైనా : ప్రపంచంలో పదిశాతం సాగుభూమి ఉన్న చైనా నాలుగో వంతు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది.గోధుమ, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. ప్రపంచ కూరగాయల్లో సగం సరఫరా చేస్తూ 50 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది.2019లో అమెరికా, ఐరోపా సమాఖ్యలను వెనక్కు నెట్టి అగ్రశ్రేణి వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది.2.అమెరికా: మొక్కజొన్న, సోయా, పత్తి ప్రధాన పంటలు. ఆధునిక సాగు పద్దతుల్లో అగ్రస్థానంలో ఉంది. 3.బ్రెజిల్‌ : ప్రపంచంలో కర్రపెండలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాక కాఫీ, చెరకు, సోయా ప్రధాన పంటలు. ప్రపంచంలో కాఫీ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. జిడిపిలో 25శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది.4.భారత్‌ : పాలు, జనపనార, పప్పుదినుసుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దది.వరిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం 58శాతం మందికి జీవనాధారంగా ఉంది.జీడిపిలో 19.9శాతం(2020-21) కలిగి ఉంది.పాల ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. 5.రష్యా: గోధుమ, బార్లీ, ఓట్స్‌ ప్రధాన పంటలు.ఐదోవంతు భూమిలో గోధుమ సాగు చేస్తారు. పదహారు శాతం మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.6. ఫ్రాన్స్‌ : గోధుమ, తృణ ధాన్యాలు, బంగాళాదుంపల వంటి పంటలతో ఫ్రాన్స్‌ ఐరోపాలో ముందుంది. ప్రపంచంలో ద్రాక్షతో ఉత్పత్తి చేసే వైన్‌లో ప్రధమ స్థానంలో ఉంది.ఏడుశాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. 7.మెక్సికో : పండ్లు, మొక్కజొన్న ప్రధాన పంటలు. చెరకు, కాఫీ వాణిజ్య పంటలు.పశుపోషణ ఎక్కువ.8.జపాన్‌ : ప్రధాన పంట వరి. జిడిపిలో రెండుశాతం వాటా ఉంది, పదిశాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.సగటు కమతం విస్తీర్ణం మూడు ఎకరాలు మాత్రమే. 9.జర్మనీ : ప్రపంచంలో బీట్‌రూట్‌ ద్వారా పంచదార ఉత్పత్తి చేసే దేశాల్లో నాలుగో స్ధానంలో ఉంది. తరువాత ప్రధాన పంటగా బార్లీ, గోధుమలు ఉన్నాయి. సాగు రంగంలో ఐరోపాలో నాలుగవదిగా ఉంది. 10.టర్కీ : గోధుమ, బీట్‌రూట్‌ ప్రధాన పంటలు. హాజల్‌నట్స్‌, చెస్ట్‌నట్స్‌,అప్రికోట్స్‌, చెరీస్‌ వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. ఇరవై ఐదుశాతం మందికి ఉపాధి కల్పిస్తూ జిడిపికి ఎనిమిది శాతం అందిస్తున్నది.


వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక మిత్ర వైరుధ్యంగా చెప్పవచ్చు. తమకు గిట్టుబాటు కావాలంటే యంత్రాలు తప్పవని రైతులు, వాటితో తమ ఉపాధి పోతుందని కూలీలు. రైతులకు గిట్టుబాటు కాకపోవటానికి కూలీల వేతనం కానే కాదు. అదేగనుక వాస్తవమైతే అమెరికాలో కూలీల్లేకుండా చేస్తున్న సాగుదార్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు ? ఐరాస ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2022 నివేదికలో యాంత్రీకరణ గురించి చెప్పిన అంశాల సారాన్ని చూద్దాం. దారిద్య్రం, ఆకలిని పోగొట్టాలంటే యాంత్రీకరణ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.అది చిన్న రైతులకు అందుబాటులోకి రాకుంటే అసమానతలను పెంచుతుంది. డిజిటల్‌ విప్లవం, యాంత్రీకరణలో దేశాల మధ్య, దేశంలోనే ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ పరికరాలు ఉండాలి.యాంత్రీకరణ ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వేతనాలు పెరుగుతున్నపుడు, కూలీల కొరత ఉన్నపుడు అది రైతులు, కార్మికులకు లాభసాటి, నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ కూలీలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉన్నపుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. సబ్సిడీలు ఎంత ఎక్కువ ఇస్తే అంతగా, వేగంగా యాంత్రీకరణ చేయవచ్చు.కూలీలు అగ్గవగా ఉన్నపుడు విధాననిర్ణేతలు సబ్సీడీలు ఇవ్వకూడదు.అంతగా ఇవ్వాలనుకున్నపుడు సంధికాలంలో పని కోల్పోతున్న వారికి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశం, ఇతర అనేక దేశాల అనుభవం చూసినపుడు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవు.


పేదరికం, ఆకలి తాండవించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి.ప్రపంచంలో 2030నాటికి ఆకలితో ఉండేవారు ఉండకూడదన్నది లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలలో ఆఫ్రికాలో తీవ్రమైన కరవులు 300 సంభవించాయంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2021లో ఆ ఖండంలో 30 కోట్ల మంది అన్నార్తులున్నారు. అక్కడి ఆహార ఉత్పత్తిలో 70శాతం చిన్న రైతులే చేస్తున్నారు. నిరంతర సాగు వృద్ది, దిగుబడుల పెంపు,ఉపాధి అక్కడి ప్రధాన సవాళ్లు. ఆహార ఉత్పత్తిలో 40శాతం మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికా సాగు వృద్దికి గాను 2030 నాటికి 600 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం. అందుకనే ధనిక దేశాలు అక్కడ పెట్టుబడి పెడితే అంటూ పెట్టుబడి-లాభాలు-నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.


అడవిని కొట్టి కొంత కాలం సాగు చేసి ఆ భూమిని వదలి మరోచోట సాగు చేసే పోడు పద్దతిని అనుసరించే అడవి బిడ్డల నుంచి ఆకాశం నుంచి డ్రోన్లు, విమానాల ద్వారా మందులు చల్లే ఆధునిక సాగుదార్లు ఉన్న ప్రపంచంలో దవోస్‌లో జనవరిలో కొలువు దీరిన ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డిజిటల్‌ సాగు గురించి సలహాలు ఇచ్చారు. మూడు సాగు చట్టాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తీసుకువచ్చిన అంశాలవే. ఇంటర్నెట్‌లో రైతులు తమ వద్ద ఉన్న పంట గురించి వివరాలు పెడితే, మార్కెట్లో కొనుగోలు చేసే వారు, అప్పులు ఇచ్చేవారు ముందుకు వచ్చి అంతా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతారు, రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని దవోస్‌లో చెప్పారు. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు అని చెపితే సెల్‌ఫోన్లకు ఇంటర్నెట్‌ సంకేతాల కోసం చెట్లు ఎక్కిన పిల్లల మాదిరి మారుమూల రైతులు పొలాలను వదలి చెట్లెక్కాల్సి ఉంటుంది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు 86శాతం మంది ఉన్నారు. ప్రపంచ జిడిపి నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లలో నాలుగుశాతం వాటా, నాలుగోవంతు మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం గురించి ప్రపంచ కార్పొరేట్లు పట్టించుకోవటం వెనుక అసంఘటితంగా ఉన్న రైతుల నుంచి ఎలాంటి పెట్టుబడి, రిస్కు తీసుకోకుండా ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసి లాభాలు పోగేసుకోవాలన్న ఎత్తుగడ తప్ప ఉద్దరించేందుకు కాదు. ప్రపంచంలో మూడో వంతు ఆహారాన్ని 60.8కోట్ల మందిగా ఉన్న చిన్న రైతులు పండిస్తున్నారు. వారికి నిరంతర జీవనం గురించి ఎలాంటి హామీ లేదు.


కార్పొరేట్‌ శక్తుల ధనదాహం, విచక్షణ రహితంగా రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్న రసాయనాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల కారణంగా ఏటా కోటీ 20లక్షల హెక్టార్ల భూమి సాగుకు పనికి రాకుండా పోతున్నది. దాన్ని అరికట్టి జనాలకు ఉపాధి చూపటం ఒక పద్దతి. దానికి బదులు కృత్రిమ సాగు గురించి కార్పొరేట్‌ సంస్థలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. వాటిని ఎందుకు తెచ్చినప్పటికీ వీటిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వారు కడుపునిండా తినేందుకు అవసరమైన మొత్తంలో ఆహారం కావాలంటే 70శాతం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అంచనా. ఇతర అవసరాలకోసం చేసే పరిశోధనలు అనేక సందర్భాలలో ఇతర రంగాలలో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించాయి. అంతరిక్ష పరిశోధనలే అందుకు ఉదాహరణ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహణకు చేసిన వార్షిక ఖర్చుతో పోల్చితే అది చేసిన పరిశోధనల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు రెట్లు ఆర్థిక లబ్ది కలుగుతోంది.హరికేన్ల గురించి హెచ్చరించటం మొదలు రోబోటిక్స్‌ వరకు ఆరోగ్యం నుంచి ఆహార నిల్వ పద్దతుల వరకు అనేక రూపాల్లో అది ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో సాగు గురించి పరిశోధిస్తున్నారు. అంతరిక్ష నౌకలలో వెళ్లి పరిశోధనలు చేసే వారి మీద అంతరిక్ష వెలుగు ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాలతో ఇండ్లలో ఎల్‌ఇడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియతో మొక్కలను పెంచవచ్చని చేసి చూపారు. దీంతో కొన్ని దేశాల్లో సాగుభూమి కొరతను అధిగమించేందుకు అనేక అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో ఆహారానికి అవసరమైన ఆకుకూరల వంటి వాటిని పండిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో ఒక ఎకరం విస్తీర్ణం అందుబాటులోకి వచ్చి అక్కడ పండించే పంటల మొత్తం భూమి మీద నాలుగు-ఆరు ఎకరాలలో పండేదానికి సమానంగా ఉంటున్నది. ఈ భవనాల్లో ఏడాది అంతటా సాగు చేయవచ్చు. వాటికి భారీ యంత్రాల వంటి పరికరాలు అవసరం ఉండదు, ఇతర ఖర్చులూ తక్కువే. ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాలు మరింతగా అవసరం. అదే విధంగా ఆస్ట్రోనాట్లకు నిల్వవుండే ఆహార పదార్దాలను ఎలా అందచేయాలన్న పరిశోధన వెలుపల ఆహార నిల్వ ప్రక్రియకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలు నూతన వంగడాల మొదలు ఆవిష్కరించిన అనేక నూతన ప్రక్రియలను రైతాంగానికి తక్కువ ధరలతో అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్‌ సంస్థలకు లాభాల కోసం అప్పగిస్తున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యవసాయ సబ్సిడీలు, వాణిజ్యం మీద దోహా దఫా చర్చలు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా కనుచూపు మేరలో ఒప్పందం కుదిరే అవకాశం కనిపించటం లేదు. ఇంతకాలం చర్చలు చేసి సాధించిందేమిటంటే ఇప్పుడున్న స్థితిని మరింతగా అస్థిరపరచవద్దనే ఏకాభిప్రాయానికి తాజా (2022 జూన్‌) జెనీవా సమావేశం వచ్చింది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత అని చెప్పారు తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం అంటూ సాకులతో కాలం గడుపుతున్నారు. ఒప్పందం కుదిరితే ధనిక దేశాలకు నష్టం గనుక అవి ముందుకు సాగనివ్వటం లేదు. ప్రపంచీకరణకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజన్‌ మొరాయించలేదు గాని వాహనాన్ని ముందుకు లాగలేకపోతోంది అన్నట్లుగా దాని పరిస్థితి ఉంది. సర్వేజనా సుఖినోభవంతు దానికి ప్రతిదేశం సంపద్వంతం కావాలన్నది ప్రపంచీకరణ సుభాషితం. అందుకు గాను స్వేచ్చామార్కెట్‌ ఉండాలని చెప్పింది. మార్కెట్‌ అంటేనే లాభాలు, కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లు అవి మార్కెట్లో పట్టున్నవారికే వస్తాయి. ఇప్పుడు ఆ పట్టుకోసం కుమ్ములాట, ధనికదేశాలు తాము చెప్పిన పద్దతిల్లో ఆట నిబంధనలు ఉండాలని చెబుతున్నాయి.వాటిలో కూడా విబేధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి ముందు ఉన్న పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) గానీ మీరు పప్పులు తీసుకు రండి మేము పొట్టు తీసుకువస్తాం రెండింటినీ కలిపి ఊదిన తరువాత మిగిలిన వాటిని పంచుకుందాం అన్నట్లుగా పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్నవే. దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకోవటం కుదరదు గనుక మార్కెట్లను ఆక్రమించే ఎత్తుగడదానిలో ఉంది. అది పారలేదు గనుక కొత్త దారులు వెతుకుతున్నాయి. భారత్‌, చైనా వంటివి కొరకరాని కొయ్యలుగా మారాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?

26 Thursday Jan 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

“India: The Modi Question”, block out on BBC documentary, Defiant Indian students, DYFI, Explosive BBC documentary, Jamia Millia Islamia, Prime Minister Narendra Modi, sfi


ఎం కోటేశ్వరరావు


పట్టించుకోవాల్సినంత గొప్పది కాదు , వదిలేయండి అంటూనే మోడీపై బిబిసి డాక్యుమెంటరీలను దేశమంతటా ప్రదర్శించే విధంగా, చూసేట్లు విద్యార్థులను, ఇతరులను కేంద్ర ప్రభుత్వం పురికొల్పిందా ? సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్య వికటించిందా ? కుర్రకారును రెచ్చగొట్టిందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలాగే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనానికి అండుబాటులో ఉంచకూడదని మన ప్రజాస్వామిక సర్కార్‌ భావిస్తే అనేక దేశాల్లో జరిగిన మాదిరి ఏ రూపంలో బహిరంగ ప్రదర్శనలు చేసినా నిషేధం విధించటం తప్ప మరొక మార్గం లేదు, చివరికి అంతపనీ చేస్తుందా ? అనేక ప్రశ్నలు, సందేహాలు. బిబిసి డాక్యుమెంటరీలో నరేంద్రమోడీ పాత్ర గురించి చిత్రించిన తీరును తాను అంగీకరించటం లేదని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించటం తప్ప రెండవ భాగ ప్రసార నిలిపివేతకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపున తమకసలు అలాంటి డాక్యుమెంటరీ ఒకటి ఉందని తెలియదంటూ అమెరికా చేతులు దులుపుకుంది. అనేక దేశాల్లో ప్రతికూల స్పందన వెల్లడైంది. నరేంద్రమోడీని విశ్వనేతగా పరిగణిస్తున్న ఏ ఇతర దేశమూ దీని గురించి స్పందించినట్లు వార్తలు లేవు.మొత్తం మీద గాలికి పోతున్నదాన్ని పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నట్లయింది.


గుజరాత్‌ మారణకాండపై ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షికతో బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్‌, ట్విటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని ఖాతరు చేయకుండా రెండవ, చివరి భాగాన్ని మంగళవారం రాత్రి బిబిసి ప్రసారం చేసింది. ఈ భాగంలో 2019లో నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల గురించి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిదాని నిబంధనలే దీనికి వర్తిస్తాయి గనుక సామాజిక మాధ్యమంలో చూడలేము. ఇతర మార్గాల్లో సంపాదించి దేశమంతటా ప్రదర్శిస్తామని విద్యార్థులు ప్రకటించటం, మొదటి భాగం అనుభవం చూసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుగా బృందాలలో ప్రదర్శనలను నిషేధిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ నిషేధించినా వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో చూడవచ్చు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం ఉన్నందున ఆలోగా నిషేధానికి పూనుకుంటే ప్రపంచమంతటా అది మరింతగా ప్రచారం పొందుతుంది, కనుక తరువాత చేస్తారా ? అసలే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, జరిగిన రచ్చ చాలు, ఇంతటితో ముగిద్దామని అనుకుంటారా ?


చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నది సైన్సు చెప్పిన అంశం. అది ఏ విధంగా ఉంటుందన్నది వేరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యకు ప్రతిగా సదరు డాక్యుమెంటరీలో ఏముందో చూడాల్సిందే అంటూ దేశమంతటా విద్యార్థులు పూనుకున్నారు. ఆ మేరకు అనేక చోట్ల పూనుకున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. చూశాము అంటే ఏదో ఒక వైఖరిని వెల్లడించాలి గనుక తప్పించుకొనేందుకు ” అవునా, మా భాగస్వామి, గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ మీద బిబిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిందా, మాకు తెలియదే ” అన్నట్లుగా అమెరికా పెద్ద అమాయకురాలి ఫోజు పెట్టింది. రష్యా,చైనాతో ఉన్న వైరంలో వాటిని దెబ్బతీసేందుకు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని చూస్తున్న అమెరికా ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్దంగా లేదు. అందుకే విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను విలేకర్లు బిబిసి డాక్యుమెంటరీ గురించి అడగ్గా మీరు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు గానీ అమెరికా-భారత్‌ రెండూ సచేతన ప్రజాస్వామ్యాలు, సంబంధాలు వృద్ది పొందటానికి పరస్పరం పంచుకొనే విలువల గురించి మాత్రం బాగా తెలుసు అన్నాడు. భారత్‌తో అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం సడలకుండా చూసుకోవటంలో రాజకీయ,ఆర్థిక,ప్రత్యేకించి వ్యక్తిగతమైన సంబంధాలు కూడా కీలకమని పేర్కొన్నాడు. ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా బిబిసి పేర్కొన్నదానిని ఖండించటం గానీ, నరేంద్రమోడీకి మద్దతుగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది పుండుమీద కారం చల్లటం వంటిదే. చూసిన తరువాత చెబుతామంటే ఒకతీరు. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగిన అమెరికాకు భారత్‌లో సంచలనం కలిగించిన మోడీ డాక్యుమెంటరీ వివాదం గురించి తెలియదంటే ఎవరూ నమ్మరు. మోడీ నిలదీసే స్థితిలో లేరు గనుక నటించి అమెరికా ప్రతినిధి తప్పుకున్నాడు. ఏదో ఒక రూపంలో దొంగచాటుగా నైనా చూసేందుకు మోడీ మద్దతుదారులను కూడా పురికొల్పిన ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందని ప్రధాని సలహాదారులు, వ్యూహకర్తలు ఊహించని పరిణామం ఇది.


” మోడీ డాక్యుమెంటరీని అడ్డుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తుండగా దాన్ని చూసేందుకు పోరాడుతున్న విద్యార్థులు ” అనే శీర్షికతో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది. ” మోడీ మీద బిబిసి డాక్యుమెంటరీని మరింతగా ప్రదర్శించేందుకు పూనుకున్న తిరుగుబాటు విద్యార్థులు ” అనే శీర్షికతో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఇచ్చిన వార్త ప్రపంచమంతటా అందుబాటులోకి వచ్చింది. ఇంత జరిగినా ఇంటా బయటా కూడా మా ఇంట్లో వారు మోడీకి వ్యతిరేకంగా ఏది చూపినా చూడొద్దన్నారు గనుక చూడం, రాసేవాటిని చదవటం తప్పన్నారు గనుక మేం చదవం అనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారు తప్ప ఇతరులు చూడకుండా ఉంటారా ? ఇంత జరిగాక కూడా అమెరికా వారు కళ్లు మూసుకుంటారా ? అసలేమీ మాట్లాడరా ? ఒక వేళ తప్పు పడితే అమెరికా ప్రవచించే ప్రజాస్వామిక, భావప్రకటనా స్వేచ్చ గురించి కొత్త చర్చ మొదలౌతుంది. ఆ తలనొప్పిని వారు ఎందుకు తెచ్చుకుంటారు ! కేంద్ర ప్రభుత్వం తనకున్న ఎమర్జన్సీ అధికారాలతో సదరు డాక్యుమెంటరీని అందుబాటులోకి తెచ్చే సామాజిక మాధ్యమాల ఇంటర్నెట్‌ లింకులను తెంపింది తప్ప ప్రదర్శించటాన్ని, చూడటాన్ని నిషేధించలేదు.


నిషేధించకున్నా ఢిల్లీలోని జెఎన్‌యు అధికారులు నరేంద్రమోడీ మెప్పు పొందేందుకుగాను కుంటిసాకులు చూపి విద్యార్ధి సంఘం హాలులో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. మంగళవారం రాత్రి గేట్లు మూసివేసి ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ప్రదర్శన జరగకుండా అడ్డుకొనేందుకు చూశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపలేరు అన్నట్లుగా విద్యార్థులు ప్రాంగణంలోని ఒక కెఫ్టేరియాలో గుమికూడి తమ సెల్‌ఫోన్లు,లాప్‌టాప్‌లలో చూసి పంతం నెగ్గించుకున్నారు. అలా చూస్తున్నవారి మీద చీకటిలో పక్కనే ఉన్న పొదలమాటు నుంచి రాళ్లతో దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొన్నారు, వారు ఎబివిపికి చెందినవారిగా గుర్తించారు. అంతకు ముందు అధికారుల తీరుకు నిరసన తెలిపారు. రాళ్ల దాడి తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన వారి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు, విద్యార్థి సంఘ అధ్యక్షురాలు అయిషి ఘోష్‌ చెప్పారు. అధికారులు ఒక ప్రదర్శనను అడ్డుకోవచ్చు, మేం వందల ప్రదర్శనలకు పూనుకుంటాం అన్నారు. కాశ్మీరీ ఫైల్స్‌ వంటి సినిమాలను ప్రదర్శించినపుడు వద్దనే సలహాలు అధికారుల నుంచి రాలేదని,తొలిసారిగా ఇప్పుడు వచ్చినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందురోజు ప్రదర్శనకు ముందుగా అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఏ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలో చెప్పాలంటూ విద్యార్ధి సంఘం ప్రశ్నించింది. వైస్‌ ఛాన్సలర్‌ శాంతిశ్రీ పండిట్‌, రెక్టర్‌ సతీష్‌ చంద్రగానీ అందుబాటులోకి రాలేదని, తనకు మాట్లాడే అధికారం లేదని డిప్యూటీ రిజిస్ట్రార్‌ రవి కాంత్‌ సిన్హా అన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. కాంపస్‌లో మూడో వంతు ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వైఫల్యం తప్ప కావాలని నిలిపివేసింది కాదని విసి, రిజిస్ట్రార్‌ తమకు నివేదించారని విద్యామంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.


ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ అధికారులు కూడా ప్రదర్శనను అనుమతించేది లేదని మంగళవారం నాడు ప్రకటించారు. పోలీసులను రంగంలోకి దించి ఎవరూ గుమికూడ కుండా అడ్డుకున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఎలాగైనా చూడాలనే ఆసక్తిని పెంచుతున్నారని, ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. బుధవారం నాడు అనేక మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలతో సహా 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పిటిఐ పేర్కొన్నది. ప్రాంగణమంతటా సాయుధ బలగాలను మోహరించారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన గురించి ఫిర్యాదు చేసినట్లు ఏబివిపి ప్రకటించింది.


దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌ వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అసమ్మతి గళాన్ని ఎవరూ నిరోధించలేరని చెప్పారు. కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపు మేరకు అనేక కాలేజీలు, వెలుపల మంగళవారం నాడు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. రాష్ట్రంలో ఈ చిత్ర ప్రదర్శనకు కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు, సంస్థలు పోటా పోటీగా పిలుపునిచ్చాయి. దీన్ని నిరసిస్తూ బిజెపి మద్దతుదార్లు ప్రదర్శనలు చేశారు.చిత్ర ప్రదర్శన దేశద్రోహమని వర్ణించి నిరోధించేందుకు సిఎం పూనుకోవాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రతలకు భంగకరమని రాష్ట్ర బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఈమేరకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు, ఆరోపణలు మరింత పెరిగితే డాక్యుమెంటరీని చూడటం దేశభక్తిగా భావించే అవకాశం ఉంది. బిజెపితో తనకు తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ చిత్ర ప్రదర్శనకు అంగీకరించటంలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ ప్రకటించటం గమనించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎంతగా మూసిపెట్టాలనుకుంటే అంతగా బహిరంగంగా ప్రదర్శిస్తామని, ఒక్క కేరళలోనే గాక దేశమంతటా ఆపని చేస్తామని రాష్ట్ర డివైఎఫ్‌ఐ నేత వికె సనోజ్‌ విలేకర్లతో చెప్పారు. దీనిలో దేశ వ్యతిరేకత ఏమీ లేదని, ఉద్రిక్తతలను సృష్టించేందుకు కాదని అన్నారు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రదర్శిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రకటించింది. మొత్తం మీద దేశమంతటా ఇదొక ప్రధాన అంశంగా మారేతీరు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

25 Wednesday Jan 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

Hijab, Iran protests, Iran Women, Islamic Revolutionary Guards Corps, Mahsa Amini, People’s Mojahedin Organization of Iran, Supreme Leader Ali Khamenei, US imperialism


ఎం కోటేశ్వరరావు


గతేడాది సెప్టెంబరు నెలలో ఇరాన్‌లో నిర్భంధ హిజాబ్‌ వద్దంటూ మహిళలతో మొదలైన ఆందోళన ఇప్పుడు కొత్త స్వభావాన్ని సంతరించుకొంటోంది. కొత్త రూపాలు, పద్దతుల్లో వందలాది పట్టణాలకు పాకింది. ప్రతి శుక్రవారం ప్రార్ధనల తరువాత నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని టెహరాన్‌తో సహా రాత్రుళ్లు సమావేశాలను ఏర్పాటు చేసి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి ప్రతిరూపంగా ఉన్న చిహ్నాలు, స్థలాల మీద దాడులు చేస్తున్నారు. దేశంలోని 282 పట్టణాలకు ఇవి పాకినట్లు వార్తలు. సెప్టెంబరు నుంచి వివిధ సందర్భాలలో భద్రతా దళాలు 750 మందిని చంపినట్లు, 30వేల మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. దేశ అధినేత అలీ ఖమేనీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జిసి), పారామిలిటరీ ”బాస్‌జీ” వీరుగాక పోలీసు ఏజంట్లు, గూఢచారులకు జనం నిరసన తెలుపుతున్నారు. ఇస్లామిక్‌ విప్లవం పేరుతో సాగిన ఆందోళనతో 1979లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. 1989లో అయాతుల్లా మరణం తరువాత అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టి అధికారంలో కొనసాగుతున్నాడు.
మహిళల ప్రతిఘటనతో హిజబ్‌ ధారణ గురించి పునరాలోచిస్తామని ప్రకటించి ఆందోళనను నీరుగార్చేందుకు చూసిన పాలకులు ఇప్పుడు కొత్త పద్దతులను ముందుకు తెస్తున్నారు. హిజబ్‌లను ధరించకుండా పనిచేసేందుకు మహిళలను అనుమతించారనే పేరుతో క్వాజ్‌విన్‌ అనే పట్టణంలో ఐదు దుకాణాలను అధికారులు మూసివేశారని వార్తలు. పార్లమెంటులోని ” సాంస్కృతిక ” కమిటీ సభ్యుడు హుసేన్‌ జలాలీ ఒక ప్రకటన చేస్తూ హిజబ్‌ ధరించని వారిని ముందుగా గుర్తించి ఎస్‌ఎంఎస్‌ పంపుతామని, తరువాత హెచ్చరించి, అప్పటికీ వినకపోతే అలాంటి వారి బాంకు ఖాతాలను మూసివేస్తామని చెప్పాడు. మరింత ఆధునిక చట్రంలో హిజబ్‌ను అమలు చేస్తామని మరొకడు,జనవరి ఒకటి నుంచి బహిరంగ స్థలాల్లో అమలు చేస్తామని పోలీసు అధికారి ఒకడు ప్రకటించాడు.


పశ్చిమాసియాలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులను వ్యతిరేకించటంలో తిరుగులేని వైఖరితో ఉన్నప్పటికీ అంతర్గతంగా మతఛాందసాన్ని మరింత పెంచేందుకు, విమర్శకులను అణచివేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు ఆర్థికంగా జనజీవితాలు ప్రభావితం కావటంతో వ్యతిరేకత పెరుగుతోంది. దానికి ఒక రూపమే డైనమెట్‌ మాదిరి పేలిన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళన. భద్రతా దళాలు హతమార్చింది వీరినే అంటూ 637 మంది పేర్లను పీపుల్స్‌ మొజాహిదిన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇరాన్‌ పార్టీ ప్రచురించింది. దేశంలో తాజా నిరసనలు ప్రారంభమై ఆదివారం నాటికి 129 రోజులు, ఆ రాత్రి, శనివారం రాత్రి కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. ” సయద్‌ అలీ (ఖమేనీ)ని గద్దె దింపే సంవత్సరమిదే, నియంతకు ఉరి, ఉరితీతల పాలనకు అంతం పలకాలి, హంతక ఐఆర్‌జిసిని శిక్షించాలి, ముల్లాల అధికారమింకేమాత్రమూ వద్దు ” వంటి నినాదాలు చేస్తున్నారు.

ఐఆర్‌జిసి మింగిన తమ సొమ్మును తిరిగి ఇచ్చివేయాలంటూ టెహరాన్‌లోని న్యాయఅధికారుల భవనం ముందు క్రిప్టోలాండ్‌ ఆన్‌లైన్‌ ఎక్సేంజ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆదివారం నాడు ప్రదర్శన జరిపారు. దాదాపు మూడులక్షల మంది దాచుకున్న పొదుపు మొత్తాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధితుల్లో పెన్షనర్లు, రిటైరైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో దిగజారుతున్న కరెన్సీ రియాల్‌ విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టటం కూడా వీరిని ఆందోళనకు పురికొల్పుతోంది. దేశ సామాజిక భద్రతా నిధి పెట్టుబడి కంపెనీ ఒక వైపు ప్రతి ఏటా లాభాలు పొందుతుండగా వాటిని పెన్షనర్లకు బదలాయించకపోవటం, పెంపుదల గురించి చేసిన వాగ్దానాలను విస్మరించటం, గత బకాయిలు చెల్లించకపోవటం కూడా అసంతృప్తికి దోహదం చేస్తోంది. తప్పుడు కేసులతో ఉరిశిక్షలు వేసిన తమ వారి విడుదల కోరుతూ రాజధాని టెహరాన్‌లో జనవరి నెలలో మూడుసార్లు కుటుంబాలు, బంధుమిత్రులు ప్రదర్శనలు జరిపారు. తమ దండ్రులను ఉరితీయ వద్దంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా పలుచోట్ల ప్రదర్శనలు జరిపి తమ ప్రభుత్వం మీద వత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇరాన్‌ రాజుగా ఉన్న రెజా షా పహ్లవీ కాలంలో ఇరాన్‌లోని చమురు సంపదను అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్ల పరం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సింహాసనాన్ని వదిలిన తరువాత అతని కుమారుడు మహమ్మద్‌ రెజా షా అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1952 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా అధికారానికి వచ్చిన మహమ్మద్‌ మొసాదిక్‌ భూ సంస్కరణలు, చమురు కంపెనీలను జాతీయం చేయటంతో అమెరికా,బ్రిటన్‌ కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొసాదిక్‌ను గృహనిర్భంధంలో ఉంచటంతో ఏడాదిలోనే అధికారం కోల్పోయాడు. రాజు షా ఎంతగా కసి పెంచుకున్నాడంటే 1967లో మరణించిన మొసాదిక్‌ను ఇంట్లోనే ఖననం చేయించాడు. తరువాత కాలంలో షాను వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించినా 1979లో మతశక్తులు అధికారాన్ని కైవశం చేసుకున్నాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలను నిషేధించాయి. పౌరహక్కులను కాలరాశాయి. షా వ్యతిరేక ఉద్యమంలో పాల్గ్గొన్నవారిలో ఒకరైన మరియం రజావీ (69) ప్రతిపక్షాల తరఫున అధ్యక్షురాలిగా ప్రకటించుకొని ఫ్రాన్స్‌లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమె, ఇతర మద్దతుదార్లను ఉగ్రవాదులుగా చిత్రించి అరెస్టుచేసిన ఫ్రెంచి పాలకులు తరువాత వదలిపెట్టారు. ముల్లాల పాలనకు చరమగీతం పాడాలన్న తమ పౌరుల డిమాండ్‌ను పశ్చిమ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తాజాగా పునరుద్ఘాటించారు.


కుర్దిస్తాన్‌ ప్రాంతం నుంచి తన కుటుంబ సభ్యులతో కలసి టెహరాన్‌ వచ్చిన మాషా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ గతేడాది సెప్టెంబరు 13న ” ఉపదేశ దళాలు ” పట్టుకొని ”నైతిక పోలీసులకు” అప్పగించాయి. వారు ఆమెను దారుణంగా కొట్టటంతో పదహారవ తేదీన మరణించింది. ఈ వార్తను విన్న మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్‌ను వదలివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కార్మికులు, ఇతరులు కూడా తమ డిమాండ్లతో వారితో కలిశారు. వందలాది మందిని భద్రతాదళాలు చంపినట్లు చెబుతున్న అంకెలను ప్రభుత్వం అంగీకరించటం లేదు. అధికారిక మీడియా రెండువందల మంది మరణించినట్లు వార్తలు ఇచ్చింది. తాజా ఆందోళన ఇరాన్‌ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర వైరుధ్యాలను వెల్లడిస్తున్నది. మొత్తంగా మత ఛాందసపాలన, పాలకులు పోవాలని కోరుకుంటున్నారు. ఇది మరొక విప్లవ పోరాటం అని కొందరు వర్ణిస్తున్నారు.


వర్తమాన ఆందోళన జిన్‌(మహిళలు), జియాన్‌(జీవితం), ఆజాదీ( స్వేచ్చ) అనే భావనలతో నడుస్తున్నది. ప్రపంచ గాస్‌లో 15శాతం, చమురు సంపదలో పదిశాతం ఇరాన్‌లో ఉంది. ఇప్పటి వరకు తోడింది పోను 2020లో వెలికి తీసిన మాదిరే తరువాత కూడా కొనసాగిస్తే మరో 145 సంవత్సరాల పాటు తోడుకోవచ్చు. ఇంత సంపద ఉండి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారంటే అంతర్గత విధానాలతో పాటు అవినీతి,అవకతవకలు, 2018 నుంచి పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.2021నాటికి జిడిపిలో అప్పు 48, నిరుద్యోగం 12, ద్రవ్యోల్బణం 30శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబరు తరువాత కరెన్సీ విలువ 20శాతం పతనమైంది. ఇలాంటి కారణాలతో 60 నుంచి 70శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. వారిలో 18.4శాతం మంది దుర్భరదారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 60శాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉంది. చట్టాలు అమలు జరిగే స్థితి లేదు, అసమానతలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం ఏడాదికి 6,700 డాలర్లు కనీసవేతనంగా ఉంది. జనాల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. నెలల తరబడి వేతనాలు ఇవ్వని స్థితి. సంఘం పెట్టుకొనే వీల్లేదు. ఇస్లామిక్‌ రిపబ్లిక్కుగా ప్రకటించిన గత 43 సంవత్సరాలుగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేవంటే నమ్మలేని నిజం. ఆర్థికంగా దిగజారుతూ వత్తిడి తట్టుకోలేక ఇటీవల అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనాతో నిమిత్తం లేకుండా పరిస్థితి దిగజారటంతో 2017, 2019 సంవత్సరాల్లో నిరసనలకు దిగిన జనాన్ని అణచివేశారు. మరోసారి ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ఇరాన్‌లోని ఇస్లామిక్‌ గార్డులు ప్రజావ్యతిరేకులు, జనాన్ని అణచివేస్తూ సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న మతోన్మాదులు అన్నది నిజం. వారు 1979 నుంచీ చేస్తున్నది అదే, కానీ ఐరోపా పార్లమెంటు ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీర్మానించటం జనం మీద ప్రేమ కంటే ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటమే అన్నది స్పష్టం. గార్డుల సంగతి జనం చూసుకుంటారు. విదేశాల జోక్యం తగనిపని. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసులు ఉన్నప్పటికీ, అదనపు సృష్టి ఇరాన్‌ గార్డులు. ఆ సంస్థకు గతంలో కమాండర్‌గా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబఫ్‌ తీర్మానానికే పరిమితమైతే సరే, అంతకు మించి ముందుకు పోతే ప్రతికూలంగా స్పందిస్తామని అన్నాడు. నవాబియాన్‌ అనే ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి సమర్ధించిన వారిని, ఆసియాలో తమను వ్యతిరేకించే వారిని కూడా ఉగ్రవాదేశాలుగా ప్రకటించి తమ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించాడు. వారి కంపెనీలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామన్నాడు. ఐరోపా దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవాలని, అమెరికాకు తోకలుగా మారవద్దని ఇరాన్‌ అధికారపక్ష పత్రిక హెచ్చరించింది.1988లో ఇరాన్‌లోని వేలాది మంది అసమ్మతి ఖైదీల ఉరితీతకు కారకుడనే పేరుతో స్వీడన్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన ఉదంతాన్ని పేర్కొంటూ స్వీడన్‌ అధికారులను తమ వారు బంధించి తీసుకువచ్చి ఇరాన్‌లో విచారణ జరుపుతామని మరొక మరొక పత్రిక సంపాదకుడు హెచ్చరించాడు. ఇటీవల కొంత మంది టెహరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రెంచి రాయబార కార్యాలయాలపై దాడి చేశారు.


గతేడాది అక్టోబరులో క్యూబా రాజధాని హవానాలో జరిగిన ప్రపంచ దేశాల, కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల మహాసభలో పాల్గొన్న సిపిఐ(ఎం), సిపిఐతో సహా 62దేశాల పార్టీలు ఒక ప్రకటనలో ఇరాన్‌ ఆందోళన కారులు, ఇరాన్‌ కమ్యూనిస్టులకు మద్దతు ప్రకటించాయి. పాలకుల అణచివేతను తీవ్రంగా ఖండించాయి. ” దేవుడిని వ్యతిరేకించారని, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇస్లామిక్‌ రాజ్యానికి, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు ” వంటి అభియోగాలను మోపి వేలాది మందిని కోర్టులలో విచారణ తతంగం జరుపుతున్నారని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇరాన్‌లో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండాలన్నది ఇరానీయులకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ పశ్చిమ దేశాలూ, మధ్య ప్రాచ్యంలోని మితవాద ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నాయి. ఇరాన్‌లో చరిత్ర పునరావృతం అవుతోందా అంటే అవకాశం ఉందని చెప్పవచ్చు. గతంలో రాజు షాను ఉరితీయాలని నినదించిన వారే నేడు సుప్రీం లీడర్‌ అలీ ఖమేని ఉరికోసం డిమాండ్‌చేస్తున్నారు. మతాధికారులు గతంలో అమెరికా,బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు మద్దతు పలికిన చరిత్ర ఉంది. ఒక వేళ వర్తమాన ఆందోళన వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తే వారు స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుంటారా ? జనాన్ని అణిచివేసేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతారా అన్నది ప్రస్తుతానికి ఊహాజనిమే కావచ్చు గానీ, జరిగినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడినోమిక్స్‌ 2023 : దేశానికి కావాల్సిందేమిటి ? బిజెపి నేతలు ఇస్తామంటున్నదేమిటి ?

13 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

10 trillion dollar economy, Amith shah, BJP, China, India Exports, India GDP, India imports from China, love jihad, Narendra Modi Failures, Ram Mandir, RSS, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


2019లో నరేంద్రమోడీ ఒక పిలుపునిచ్చారు. 2024 మార్చి నాటికి(లోక్‌సభ ఎన్నికల తరుణం) దేశ జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు దాన్నే ఊరిస్తూ జనంలో చర్చ జరగాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. అనుకోని పరిణామాలు ఎదురు కావటంతో మిగతా కబుర్ల మాదిరే ఇప్పుడు మోడీ కూడా దీని గురించి కూడా మాట్లాడటం లేదు. కొత్త ” కతలు ” తప్ప ఒకసారి చెప్పినదానిని మరోసారి చెప్పి బోరు కొట్టించే అలవాటు లేదు కదా ! ఆ తరువాత మోడీ మౌనం, ఆర్థిక సలహాదారులు 2027కి సాధిస్తాం అన్నారు, ఐఎంఎఫ్‌ 2029 అని చెప్పి కాదు కాదు లెక్క తప్పింది 2027కే అని చెప్పింది. పొలిటీషిియన్‌ అన్నతరువాత ఒపీనియన్స్‌ మారుస్తుండాలని గిరీశం చెప్పినట్లుగానే ఆ సంస్థ కూడా పరిస్థితిని బట్టి మా అంచనా తప్పిందంటూ మరోసారి మార్చదని చెప్పలేము. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి. తాజాగా ఐదు లక్షల డాలర్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పాత పాట పాడితే బోరు కొడుతుంది కనుక కొత్త పల్లవి అందుకున్నారు.


ఈ మధ్య దేశ జిడిపి గురించి కొత్త గీతాలు వినిపిస్తున్నారు. మిత్రోం అంటూ శ్రావ్యమైన గళం నుంచి జిడిపి గానం ఎక్కడా వినపడటం లేదు, కనపడటం లేదు. పది లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పెరుగుతున్న భారత్‌ అంటూ సిఇబిఆర్‌ అనే సంస్థ తాజాగా ఒక విశ్లేషణ చేసింది. దాని ప్రకారం 2035 నాటికి పది లక్షల డాలర్లకు చేరుతుందని చెప్పింది. ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు పడితే తదుపరి ఒక లక్ష డాలర్లను జత చేసేందుకు ఏడు సంవత్సరాలు, ఆ తరువాత మూడవ లక్షకు ఐదు సంవత్సరాలు (2019) పట్టిందని, ప్రస్తుతం 3.1లక్షల కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొన్నది. ప్రస్తుత వేగాన్ని చూస్తే రానున్న 14-15 సంవత్సరాల్లో ప్రతి రెండేళ్లకు ఒక లక్ష కోట్ల డాలర్ల వంతున జిడిపి పెరుగుతుందని అంచనా వేసింది.


తెలుగు నాట అంత్య కంటే ఆది నిషఉ్ఠరమే మేలని భావించేవారు ఏదైనా చెప్పే ముందు అంటే అన్నారని తెగ గింజుకుంటారు గానీ అని ప్రారంభిస్తారు. పట్టణాల్లో పదిశాతం, దేశ సగటు 8.3శాతం నిరుద్యోగం ఉందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 2022 డిసెంబరులో 40.48 శాతం పెరిగిందని సిఎంఐఇ పేర్కొన్నది. దేశ జిడిపి ఎంత పెరిగింది, ఎన్ని పెట్టుబడులను ఆకర్షించారు అన్నది ఒక అంశమైతే దాని వలన జనాలకు ఒరిగిందేమిటి అన్నది ప్రశ్న. సంపద పెరిగి కొందరి చేతుల్లో పోగుపడితే ఫలితం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల(పిఎల్‌ఐ) పధకాన్ని అమలు జరుపుతున్నది. కరోనా కాలంలో ఫార్మా రంగంలోకి పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరగలేదు. లక్ష్యాన్ని మించి 107శాతం పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరిగింది 13శాతమే. ఇక మన దేశం నుంచి సెల్‌ఫోన్ల ఎగుమతులు పెద్దగా పెరిగినట్లు అది తమ ఘనతగా చెప్పుకుంటున్న చోట అనుకున్నదానిలో వచ్చిన పెట్టుబడి 38శాతం కాగా ఉపాధి పెరిగింది కేవలం నాలుగు శాతమే. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పెట్టుబడులు 4.89శాతం కాగా పెరిగిన ఉపాధి 0.39శాతమే. (ఇండియా కేబుల్‌ విశ్లేషణ 2022 నవంబరు 14) అందుకే పెట్టుబడులు వచ్చి ఉపాధి రహిత వృద్ధి జరిగితే జిడిపి పెరిగినా జనానికి వచ్చేదేమీ ఉండదు.


అందుకే ఈ అంశాల గురించి జుమ్లా కబుర్లు చెబితే జనం నమ్మరు గనుక బిజెపి నేతలు కొత్త కబుర్లు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి గురించి కొత్త రికార్డులు నమోదౌతున్నా, వీటిని గురించి పట్టించుకోకుండా ఇతర అంశాల గురించి మాట్లాడేవారిని ఏమనాలి ? 2024 జనవరి ఒకటి నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం సిద్దం అవుతుందని ఆ రోజునే దర్శనం చేసుకొనేందుకు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా చెబుతారు. గతంలో కాశీని చూసేందుకు ఏడాదికి కోటి మంది వచ్చే వారని, కాశీ విశ్వనాధ్‌ ధామ్‌ అభివృద్ధి తరువాత ఒక్క గత శ్రావణమాసంలోనే కోటి మంది వచ్చారని, అదే మాదిరి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైన తరువాత పది రెట్లు పెరుగుతారని, ఆధ్యాత్మిక టూరిజాన్ని వృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ సిఎం ఆదిత్య నాధ్‌ ఊరిస్తున్నారు. లక్షల కొలది ఉద్యోగాలను సృష్టిస్తామని, అందుకు గాను ఫలానా పధకాలు ఫలానా తేదీలోగా ఉనికిలోకి వస్తాయని చెప్పాల్సిన వారు పూజలు పునస్కారాలు, దేవుళ్ల సందర్శనకు వసతులు కల్పిస్తామంటున్నారు. రోడ్లు, మురుగు కాలవల వంటి అల్ప అంశాలను వదలి లవ్‌ జీహాద్‌ మీద కేంద్రీకరించాలని కర్ణాటకలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ నిరంజన్‌ సెలవిస్తారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే పండ్లు కాస్తాయి. వీరంతా దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌ కబుర్లు ఎక్కడా వినిపించటం లేదిప్పుడు, ఎందుకంటారు ? ఆధ్యాత్మిక టూరిజం గురించి ఒక వైపు కబుర్లు చెబుతూ మరోవైపు ఝార్కండ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఆధ్యాత్మిక టూరిజాన్ని సంఘపరివార్‌ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి సర్కార్‌ లేదు. ఇరవై నాలుగుమంది జైన తీర్ధంకరులలో ఒకరైన( 23వ) పార్శ్వనాధ్‌ గిర్ధ్‌ జిల్లాలోని షిఖర్జీ పర్వతంపై మోక్షం పొందినట్లు చెబుతారు. జైనులకు అదొక పుణ్యస్థలం. ఆ ప్రాంతంలో టూరిజం వద్దని జైనులు అంటున్నారు, దానికి బిజెపి మద్దతు ఇస్తున్నది.అయోధ్యలో వారే అమలు చేస్తారు, మరొక చోట వద్దంటారు. రాజకీయంగాకపోతే ఏమిటి ?


రానున్న ఏడు సంవత్సరాల్లో 7లక్షల కోట్లకు చేరనున్న జిడిపి అంటూ మరొక వార్త. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పిన అంశాల ఆధారంగా వచ్చింది. 2023 మార్చి ఆఖరుకు మన జిడిపి 3.5లక్షల డాలర్లు ఉంటుందని, వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఇది అసాధ్యం కాదని మర్చంట్స్‌ ఛాంబర్‌ (ఎంసిసిఐ) సమావేశంలో నాగేశ్వరన్‌ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. అందువలన ఎంత పెరిగితే ఏమి లాభం ! దేశంలోని పది మంది ధనికుల చేతుల్లో దేశ జిడిపిలో 11శాతం విలువగల సంపద ఉంది. ఫిన్‌బోల్డ్‌ అనే సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం ప్రకారం 2022 డిసెంబరు నాటికి పది మంది సంపద 387 బిలియన్‌ డాలర్లు లేదా రు.31.64లక్షల కోట్లు. దేశ జిడిపి అక్టోబరు నాటికి 3.47 లక్షల కోట్ల డాలర్లని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది, దీనిలో 11.16శాతం పది మంది చేతిలో ఉంది. తొలి ఐదు స్థానాల్లో ఉన్నవారి వివరాలు దిగువన చూడవచ్చు.
ధనికుడి పేరు ×××× సంపద బి.డాలర్లు
గౌతమ్‌ అదానీ ××× 132.79
ముఖేష్‌ అంబానీ ×× 96.5
సైరస్‌ పూనావాలా×× 24.88
శివ నాడార్‌ ××××× 22.58
దమాని(డి మార్ట్‌) ×× 21.25
సంపదలు ఇలా కొద్ది మంది వద్ద పోగుపడుతూ ఉంటే దేశ ఆర్థిక, సామాజిక వృద్ధి కుంటుపడుతుందని, అనేక అనర్ధాలకు దారితీస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నా సంపదలు పోగుపడటాన్ని మన పాలకులు అనుమతిస్తున్నారు.ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంపదల అంతరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. సంపదలు ఇలా పెరగటానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. సంపద పెరిగిన కొద్దీ పన్నులు పెంచాల్సి ఉండగా తగ్గించటం వాటిలో ఒకటి. ఉపాధి లేకపోవటం, ఉన్నవారికి కూడా వేతనాలు తక్కువగా ఉండటం, సామాజిక భద్రత లేకపోవటం, విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించటం వంటి అంశాలన్నీ సంపదల అసమానతలను పెంచుతున్నాయి. వాటిని తగ్గించేందుకు చేసిందేమీ లేదు.


వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అనే కితాబుకు భారత్‌ దూరం అన్నది మరొక వార్త. దేశంలో డిమాండ్‌ తగ్గిన కారణంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7శాతానికి తగ్గుతుందని ప్రభుత్వమే పేర్కొన్నది. ఈ కారణంగా వేగంగా వృద్ది చెందున్న భారత్‌ అనే పేరుకు దూరం కానుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే తక్కువగా ఆర్‌బిఐ 6.8శాతమే ఉంటుందని చెప్పింది. గతేడాది 8.7శాతం ఉంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో 7.6 శాతం ఉంటుదని అంచనా వేస్తున్నందున అది మొదటి స్థానంలో ఉంటుంది.ద్రవ్యోల్బణం కారణంగా వర్తమాన సంవత్సరంలో నిజవేతనాల్లో పెరుగుదల లేకపోవటం లేదా కొన్ని నెలల్లో తిరోగమనంలో కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు బిజెపి నేతలెవరూ ఏం చేసేదీ చెప్పరు.


ఆర్థికవేత్తలు లేదా వారు పని చేస్తున్న సంస్థలు వేసే అంచనాలు, చెప్పే జోశ్యాల తీరు తెన్నులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అమెరికాలోని కార్నెగీ సంస్థ 2009లో ఒక అంచనాను ప్రపంచం ముందుంచింది. దాని ప్రకారం 2009లో 1.1లక్షల కోట్లడాలర్లుగా ఉన్న భారత జిడిపి 2050 నాటికి 17.8 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అదే కాలంలో చైనా జిడిపి 3.3 నుంచి 45.6లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండవ స్థానంలో ఉండే అమెరికాలో 39లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. పైన పేర్కొన్న సిఇబిఆర్‌ సంస్థ అంచనా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక లక్ష కోట్ల డాలర్ల జిడిపి పెరుగుతుందనుకుంటే ఆ ప్రకారం చూసినా 2035 తరువాత పదిహేను సంవత్సరాలో ఏడులక్షల కోట్లు పెరిగితే దీని అంచనా ప్రకారం కూడా 17-18లక్షల కోట్లకు పరిమితం అవుతుంది. ఇక ముకేష్‌ అంబానీ పండిట్‌ దీన దయాళ్‌ ఇంథన విశ్వవిద్యాలయ సభలో చెప్పినదాని ప్రకారం 2047 నాటికి( నూరేళ్ల స్వాతంత్య్రం) ఇప్పుడున్న 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40లక్షల కోట్లకు పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆసియా ధనికుడు గౌతమ్‌ అదానీ 2050 నాటికి 30లక్షల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పన్నెండు – పద్దెనిమిది నెలలకు ఒక లక్ష కోట్ల వంతున పెరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ప్రముఖులు ఇంత తేడాగా ఎలా చెబుతారు ?


ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రదేశంగా ఎదుగుతుందని, చైనా జనాభా ఇప్పుడున్న 140 కోట్ల నుంచి 130 కోట్లకు తగ్గుతుందని చెబుతున్నారు.( ఈ ఏడాదే చైనాను వెనక్కు నెట్టి మన దేశం పెద్ద దేశంగా మారనుంది) పని చేసే శక్తి కలిగిన జనాభా భారత్‌లో పెరుగుతున్నందున ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా తెగతెంపులు చేసుకోనున్నాయని, తరువాత సరఫరా గొలుసులో చైనా లేకపోతే భారత్‌ లబ్దిపొందుతుందని చెబుతున్నారు. ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారు చేయటాన్ని దానికి రుజువుగా చూపుతున్నారు. నరేంద్రమోడీ జి20 బాధ్యతలు చేపట్టినందున అమెరికా, చైనా, భారత్‌ మూడు ధృవాల ప్రపంచ వ్యవస్థకు ఈ ఏడాది నాంది అవుతుందని కొందరు చెప్పటం ప్రారంభించారు.(2024లోక్‌సభ ఎన్నికలకు జి20 సారధ్యాన్ని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చేస్తున్న యత్నాలను చూసి మెప్పు పొందేందుకు కూడా అలా చెప్పవచ్చు.)


మన ఎగుమతులు తగ్గటం, దిగుమతులు పెరగటంతో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్న అంశం పాలకులకు పట్టినట్లు లేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2022లో మన వస్తు దిగుమతులు 54.7శాతం పెరిగి 610 బి.డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో 494 బి.డాలర్లు కాగా అదే కాలంతో గతేడాది 381బి.డాలర్లు మాత్రమే. ఇక వాణిజ్యలోటు ఏప్రిల్‌-నవంబరు మధ్య 115.39 నుంచి 198.35 బి.డాలర్లకు చేరింది. ఈ ఏడాది 700బి.డాలర్లు దాటవచ్చని అంచనా.దాన్ని బట్టి లోటు ఎంత ఉండేది అప్పుడే చెప్పలేము. స్వయం సమృద్ధి – ఆత్మనిర్భరత, ఎగుమతి- దిగుమతులు ఉపాధి కల్పన ఫలితాల గురించి చెప్పకుండా జనాలకు రామాలయం గురించి అమిత్‌ షా చెబుతున్నారు.

చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. లావాదేవీల్లో సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు పాటించాలి తప్ప, మన దేశానికి చైనాకు ఎగుమతులు-దిగుమతుల కోటా గురించి ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలేమీ లేవు. చైనాకు ధీటుగా ఐఫోన్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెబుతున్న వారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర వస్తువులను నిలిపివేసి ఇక్కడే ఎందుకు తయారు చేయటం లేదు ? విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు ? స్వదేశీ జాగరణ మంచ్‌ ఇటీవల ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు. చైనా నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ ఏటా తన రికార్డులను తానే బద్దలు కొడుతుంటే ఏమి చేస్తున్నట్లు ? చైనా యాప్‌ల రద్దు హడావుడి చేస్తే సరిపోతుందా ? మన ఉపాధిని ఫణంగా పెట్టే దిగుమతి లాబీకి ఎందుకు లొంగిపోతున్నట్లు ? 2021-22లో తొలి ఎనిమిది నెలల్లో అక్కడి నుంచి 59.17 బి.డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 67.92 బి.డాలర్లకు పెంచారు . చైనా వస్తువులు నాసిరకం అని ప్రచారం చేస్తారు, అదే నిజమైతే అలాంటి వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసి మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చైనాకు ఎందుకు కట్టబెడుతున్నట్లు ? మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులకు పదో ఏడు వస్తున్నది. వాటి అమలుకు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడలేదే ! వాటి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ కనికట్టు గుజరాత్‌ వైఫల్యాలను దాచగలదా !

25 Sunday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, Narendra Modi, Narendra Modi Failures, RSS, Rural daily wages


ఎం కోటేశ్వరరావు


మన జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడికి అసలు సిసలు వారసులం, శీలవంతులం అని చెప్పుకుంటున్న వారు కూడా అదే విధంగా ఉన్నారా ? 2022 డిసెంబరు 20న రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచికలను విడుదల చేశారు.మౌలిక మానవ అవసరాల ప్రాతిపదికన పోటీ తత్వం, సామాజిక ప్రగతి అవసరం గురించి అధ్యయనం చేసిన ఒక సంస్థ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి సూచికలను అందచేసింది. దాన్ని మండలి అధó్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ దేవరాయి అధికారికంగా విడుదల చేశారు. ఉచితాలు-అనుచితాల గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల మీద అనుచిత దాడి చేస్తూనే మరోవైపు ఉచితాలను చూపి 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి సిద్దం అవుతోంది.దానిలో భాగంగానే మరో ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేరే చెప్పనవసరం లేదు.


ఈ పధకం గురించి గతంలో బిజెపి ఏమి చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది ? 2013లో నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బిజెపి ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బిజెపి నేత మురళీ మనోహర జోషి ఆ బిల్లు ఆహారం కాదు, కాంగ్రెస్‌ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బిజెపి మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద 2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ” జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బిజెపి వ్యతిరేకించిందని చెప్పిన మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్‌ ”, కావాలంటే విదేశీ గూగుల్‌ దేవతను అడిగితే మన స్వదేశీ సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే వేదాల్లో అన్నీ ఉన్నప్పటికీ మనకు అలాంటి దేవత లేదు మరి. అదే బిజెపి నేతలు ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న వాటి గురించి ఇప్పుడు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నదీ తెలిసిందే. కరోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పధకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. జనాలకు తాము ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల విలువగల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని మరో రెండులక్షల కోట్లు వచ్చే ఏడాది ఖర్చు చేస్తామనే ప్రచారాన్ని బిజెపి ఊదరగొట్టనుంది.


శాంత కుమార్‌ (88) బిజెపిలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బిజెపి వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్ధించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు 67శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే ఆ మొత్తంతో అవసరమైన కాలరీల వక్తిని ఎలా సమకూర్చుకోగలరని ప్రశ్నిస్తూ ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత మూడోసారి లోక్‌ సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు. బిజెపి నేత మురళీ మనోహర జోషి బిల్లుకు ప్రతిపాదించిన సవరణల్లో ఆహార ధాన్యాలతో పాటు పప్పులు, నూనె కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సదరు జోషి ఇప్పుడు బిజెపి మార్గదర్శక మండలి సభ్యుడిగా ఉన్నారు.తన ప్రతిపాదన గురించి మోడీకి చెప్పారో లేదో లేక చెప్పినా ఊడగొట్టిన నాగటి దుంపలతో మనకు పనేమిటని, ఎన్నికలకు ముందు అనేకం చెబుతాం అన్నింటినీ అమలు జరుపుతామా అని మోడీ పట్టించుకోలేదో మనకు తెలియదు.


ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బిజెపి రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియుూష్‌ గోయల్‌ గారు తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పధకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేండ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు దారిద్య్రరేఖకు ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది. కొన్ని అంచనాల ప్రకారం 22శాతం మంది అంటున్నారు. ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలంటే ఈ లెక్కన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 58శాతంగా చెప్పాలి. మోడీ సర్కార్‌ తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా దీన్ని చెప్పుకుంటారా ? లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా ? సమాధానం చెప్పేవారెవరు ? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్‌లో అలాంటి పధకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది నిజమేనా ?


వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఉచితాల మంచి చెడ్డల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉచితాలు వస్తు, ధన, సేవలు ఏ రూపంలో ఉన్నా వాటిని పొందిన వారు ఆమేరకు వాటికోసం ఖర్చు చేయాల్సిన మొత్తాలను ఇతర వాటికి వినియోగదారుల రూపంలో వెచ్చిస్తే ఆ మేరకు మార్కెట్‌ పెరిగి అది దేశాభివృద్దికే తోడ్పడుతుందన్నది ఒక వాదన, కనిపించే వాస్తవం. కానీ పరిశ్రమలను పెట్టక ముందే ఏటా లక్షల కోట్ల మేరకు రాయితీల రూపంలో లబ్ది చేకూర్చుతున్న కార్పొరేట్లకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం మరికొన్ని రాయితీలను ఇస్తున్నది. లబ్ది పొందిన కంపెనీలు ఆ మేరకు పెట్టుబడులు పెట్టి ఉంటే మన పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి ఎందుకు పెరగటం లేదు ?


ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22 కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి ? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి ? మెజారిటీ రాష్ట్రాల్లో రెండింజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1శాతానికి పెరిగారు. పిల్లలే కాదు,స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్‌లో 39.8 శాతమే.(2022 మే 23 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ). దీనికి ఏమంటారు ?జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు.


సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సిఎన్‌ఎన్‌ఎస్‌ ) 2016-18 ఆధారంగా 2022 ఏప్రిల్‌లో రక్తహీనత ముక్త భారత్‌ సంస్థ విడుదల చేసిన వాస్తవాల పత్రం ప్రకారం దేశంలో ఉన్న పరిస్థితితో కేరళను పోల్చితే పరిస్థితి ఇలా ఉంది. (అంకెలు శాతాల్లో )
వయసు సంవత్సరాలు ××× దేశ సగటు ××× కేరళ
1 నుంచి 4 బాలికలు ××× 40.5 ×××××× 13.1
1 నుంచి 4 బాలురు ××× 40.6 ×××××× 12
5 నుంచి 9 బాలికలు ××× 24.7 ×××××× 2.8
5 నుంచి 9 బాలురు ××× 22.3 ×××××× 3.3
10 నుంచి19 బాలికలు××× 39.6 ×××××× 13.7
10నుంచి 19 బాలురు ××× 17.6 ×××××× 4.1
రెండింజన్ల బిజెపి పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పధకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.


ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బిజెపి రెండింజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బిజెపి ఏలుబడిలోని అసోం 34, మధ్య ప్రదేశ్‌ 33, ఉత్తర ప్రదేశ్‌ 31, గుజరాత్‌ 22, హర్యానా 21, వైసిపి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణా 26వ స్థానంలో ఉంది.తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి.తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి,లక్ష ద్వీప్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి.


ఉచితాల గురించి ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులున్నట్లు పేర్కొన్నది.తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం రు,217.8, 220.3 చొప్పున ఉండగా కేరళలో రు.726.8 ఉంది. నిర్మాణ రంగంలో రు.837.7 కాగా గుజరాత్‌లో రు.373 ఇస్తున్నారు. దేశ కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలో వ్యవసాయెతర పనులకు 2020-21లో సగటు వేతనం రు.315.3 కాగా ఆంధ్రప్రదేశ్‌లో రు.305.3 ఉండగా కేరళలలో అది రు.677.6 ఉంది. అందుకే అంటారు, జనాలకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికిందనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రు.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రు.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పని లేదు, ఉచితాలు ఇచ్చిన చోట, ఇవ్వని చోటా మానవాభివృద్ది లేదు. దేశమంటే అదానీ, అంబానీలు కాదు, మనుషులు అన్నపుడు గుజరాత్‌లో మనుషులెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా ? కనికట్టుతో గుజరాత్‌లో అంతా బాగుంది అంతా బాగుంది అని నరేంద్రమోడీ గారడీ చేస్తే కుదరదు, తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో జోడీ కట్టాలా ! విడగొట్టుకోవాలా ! తైవాన్‌ చిప్స్‌ పరిశ్రమ ధ్వంసం అమెరికా బెదరింపు !

21 Wednesday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Decouple from China, Narendra Modi, Narendra Modi Failures, RSS, Taiwan Matters, TRADE WAR, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

08 Thursday Dec 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Prices, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

America’s green subsidies, Inflation Reduction Act, subsidy war with America, Trade Protectionism, TRADE WAR, US-EU Trade war


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాలస్తీనాను అడ్డుకుంటున్న అమెరికా – నేడు సంఘీభావ దినం !

28 Monday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Israel, Jerusalem, Palestine Solidarity Day, Palestinian People, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఏడున్నర దశాబ్దాలుగా మాతృదేశంలోనే బందీలుగా, కొలువులు నెలవులు తప్పిన వారిగా, ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్ధుల శిబిరాల్లోనే పుట్టి పెరిగి, మరణించిన వారెవరైనా వర్తమాన ప్రపంచంలో ఉన్నారంటే వారే పాలస్తీనా అరబ్బులు. ఐరాస చరిత్రలో ఘోర వైఫల్యాల్లో తాను చేసిన పాలస్తీనా తీర్మానాన్ని అమలు జరపలేని అసమర్ధత. జోర్డాన్‌, లెబనాన్‌, సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్‌లలో లక్షలాది మంది పాలస్తీనియన్లు శరణార్ధులుగా ఉన్నారు.1947 నవంబరు 29న ఐక్య రాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 181వ తీర్మానం ప్రకారం పాలస్తీనాను రెండుగా చీల్చి ఒక ముక్కను ఇజ్రాయల్‌గా ప్రకటించారు. చారిత్రాత్మక జెరూసలెం పట్టణం, పరిసరాలను ఎవరికీ చెందకుండా వాటికన్‌ మాదిరి ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అరబ్బులు తిరస్కరించారు.1948 మే 14 అధికారికంగా ఇజ్రాయల్‌ ఏర్పాటు ప్రకటన జరగ్గానే అరబ్బులు తిరుగుబాటు చేశారు అప్పటికే బ్రిటన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి ఇతర దేశాల్లోని యూదులను రప్పించటమే గాక విభజిత ప్రాంతంలో వారికి ఆయుధాలు, డబ్బు అందచేసి సిద్దంగా ఉంచారు. ఎప్పుడైతే అరబ్బులు తిరుగుబాటు చేశారో దాన్ని సాకుగా తీసుకొని . యూదు సాయుధ మూకలు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నాయి.ఆ క్రమంలో ఇజ్రాయల్‌ దురాక్రమణను నివారించేందుకు ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. తరువాత జరిగిన అనేక పరిణామాల్లో అమెరికా రంగ ప్రవేశం చేసి పాలస్తీనాకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నది. దాని అండ చూసుకొని ఇరుగుపొరుగు దేశాలపై ఇజ్రాయల్‌ దాడులకు దిగి కొన్ని ప్రాంతాలను తన ఆక్రమణలోకి తెచ్చుకుంది. పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇతర చోట్ల నుంచి యూదులను రప్పించి అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసి అరబ్బులను మైనారిటీలుగా మార్చివేసి అవి కూడా తనవే అనే అడ్డగోలు వాదనకు దిగింది. జరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించి అది కూడా తనదే అని ప్రకటించుకుంది. తన రక్షణకు హామీగా మరికొన్ని ప్రాంతాలను తనకు అప్పగించాలని విపరీత కోర్కెలను ముందుకు తెస్తున్నది.


మధ్య యుగాల్లో జరిగిన మత యుద్దాలలో యూదులను పాత ఇజ్రాయల్‌, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్దరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దానివెనుక ఉంది. తమకు విశ్వాసపాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా అరబ్బులు తిరస్కరించారు. ఒక పరిష్కారాన్ని కనుగొనే పేరుతో ఐరాస కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. పాలస్తీనాను మూడు ముక్కలుగా చేసి వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయల్‌కు కేటాయించింది. జెరూసలెం నగరం పాలస్తీనా మధ్యలో ఉంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇజ్రాయల్‌ అనుమతి అవసరం. 1948 దాడులలో యూదులు జెరూసలెంను ముట్టడించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జోర్డాన్‌ పాలకులు జోర్డాన్‌ నదికి పశ్చిమాన ఉన్న (దాన్నే పశ్చిమ గట్టు ప్రాంతం అంటారు) పాలస్తీనా ప్రాంతాలు, తూర్పు జెరూసలెంను అదుపులోకి తీసుకొని తరువాత వాటిని విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తరువాత వాటి మీద తమ హక్కును వదులుకున్నట్లు ప్రకటించింది.


అంతకు ముందు పశ్చిమ జెరూసలెం పట్టణాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ తరువాత అసలు మొత్తం నగరాన్ని స్వంతం చేసుకుంది. రాజధానిగా టెల్‌అవీవ్‌ ఉన్నప్పటికీ ఐరాస తీర్మానం,అరబ్బుల అభిప్రాయాలకు విరుద్దంగా పార్లమెంటుతో సహా ప్రభుత్వశాఖలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసింది. దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు, సుప్రీం కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయల్‌ రాజధానిగా గుర్తిస్తూ టెల్‌ అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రాంతంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇటీవలనే శాశ్వత భవనానికి స్థలం కేటాయించినట్లు అక్కడి మేయర్‌ ప్రకటించాడు. ఈ విధంగా ఐరాస తీర్మానాన్ని అమెరికా కూడ ఉల్లంఘించింది. పశ్చిమ గట్టు ప్రాంతం పాలస్తీనాది కాగా అక్కడ 167 అరబ్బుల నివాస ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇజ్రాయల్‌ తన పౌరులతో నింపేందుకు నిర్మించిన 200 నివాస ప్రాంతాలు దాని ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మిలిటరీ,యూదు దురహంకార శక్తులు నిత్యం అరబ్బులతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుంటాయి, వారు ప్రతిఘటిస్తే దాడులు జరుపుతాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనా విముక్తి కోసం పోరాడే హమస్‌ సంస్థ అధికారంలోకి వచ్చిన తరువాత 2007 నుంచి ఆప్రాంత మొత్తాన్ని ఇజ్రాయల్‌ దిగ్బంధనం గావించింది. గతంలో దాడులు కూడా చేసింది.


పాలస్తీనా ప్రాంతాలన్నింటితో కూడిన ప్రభుత్వాన్ని 1948 సెప్టెంబరు 22న అరబ్‌లీగ్‌ నాడు ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దాన్ని ఒక్క జోర్డాన్‌ తప్ప అన్ని అరబ్‌ దేశాలూ గుర్తించాయి. 1988లో పాలస్తీనా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అల్జీర్స్‌లో పిఎల్‌ఏ నేత యాసర్‌ అరాఫత్‌ ప్రకటించాడు.1993లో ఓస్లో ఒప్పందాల తరువాత పశ్చిమ గట్టు, గాజా ప్రాంతాల్లో పరిమిత అధికారాలు గల ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలస్తీనాను ఐరాసలోని 193కు గాను 138 దేశాలు గుర్తించాయి.2012లో ఐరాస ఆమోదించిన తీర్మానం ప్రకారం సభ్యురాలు గాని పరిశీలక దేశ హౌదాను కల్పించారు. ప్రస్తుతం అరబ్‌లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సంస్థ, జి77, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ,యునెస్కో, అంక్టాడ్‌, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ప్రతినిధిగా ఉంది. పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181 తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటుంది. జరూసలెం సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుంది. అది జరగుకుండా అమెరికా తన వీటో హక్కుతో అడ్డుపడుతున్నది. అందువలన ఇజ్రాయల్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న అసలైన నేరస్థురాలు అమెరికా, మద్దతు ఇస్తున్న దేశాల వైఖరిని నిరసిస్తూ నవంబరు 29న ప్రపంచమంతటా పాలస్తీనాకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్నది.మన దేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈ మేరకు పిలుపునిచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

23 Wednesday Nov 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Kim Jong-un, North Korea’s missile tests, Pyongyang, US imperialism, yankees


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: