• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Aandhra Pradesh three Capitals

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

 వేతన వాయిదా సరే, ఏపి మూడు రాజధానులు, తెలంగాణా కొత్త సచివాలయం సంగతేమిటి !

31 Tuesday Mar 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, employees, History, NATIONAL NEWS, Opinion, Pensioners, Telangana

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, AP CM YS Jagan, Government Employees wage deferment, KCR, Telangana CM

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి రాజధాని ‘తర్కం’ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వర్తించదా ?

06 Thursday Feb 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, Amaravati capital controversy, ap special status, BJP's capital logic, CM YS Jagan

Image result for why not bjp's  capital logic apply to ap special status too
ఎం కోటేశ్వరరావు
మూడు రాజధానుల రాజకీయం మరో మలుపు తిరిగింది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనంలో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీని గురించి ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. నిజానికి ఇది రాజధాని మార్పును ఆమోదించటమూ కాదు, తిరస్కరించటమూ కాదు. ప్రస్తుతం ఉన్న స్ధితిని తెలియచేయటమే అన్నది ఒక అభిప్రాయం. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పటం వెనుక రాజకీయం లేకపోలేదు.
కేంద్ర బడ్జెట్‌ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఒకవైపు చెబుతారు, మరోవైపు మంచి బడ్జెట్‌ అని కితాబు, ప్రత్యేక హౌదా గురించి మరచిపొమ్మని మరోసారి పార్లమెంట్‌లో చెప్పిన తరువాత దాన్ని పరిశీలించాలని లేఖ రాయటం నక్కపోయిన తరువాత బక్క కొట్టుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. రాజధాని రాజకీయంలో జనసేన-బిజెపి ఏమి చేయనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్న. జనానికి కూడా అర్ధం కావటం లేదు. తాము ఇచ్చిన నిధుల ప్రకారం వాటిని నిర్మించిందీ లేనిదీ నిర్ధారించాలని, ఏ దశలో ఉన్నాయో తెలపాలని గానీ కేంద్రం ఇంతవరకు రాష్ట్రాన్ని కోరినట్లు జనానికి తెలియదు. చంద్రబాబు కొన్ని భవనాలను నిర్మించి వాటిలో తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాని ప్రకారం వాటిలో కార్యాలయాలు తాత్కాలికం తప్ప భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు జనానికి చెప్పటమే తప్ప కేంద్రానికి అధికారికంగా ఇంతవరకు తెలియచేయలేదు. అందుకే వాటి గురించి మీడియాలో మాత్రమే చూశామని కేంద్రం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొని చర్యలను ప్రతిపాదించింది తప్ప రాజధానుల ఏర్పాటుగా వాటిని పేర్కొనలేదు. విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీస్‌ కమిషన్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తరలించకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తన కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే సచివాలయాన్ని, హైకోర్టును తరలిస్తామని జగన్‌ ప్రభుత్వం చెబుతున్నది. న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. అందుకే బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో పెద్ద తెలివితేటలేమీ లేవు.
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. కేంద్ర వైఖరి గురించి ఆయనకు ఉన్న సాధికారత ఏమిటి ? లేకపోతే బిజెపి-వైసిపి మధ్య కుదిరిన తెరవెనుక ఒప్పందానికి సూచికా, ఎలా అర్ధం చేసుకోవాలి. మొత్తం మీద రాజకీయ దోబూచులాట నడుస్తోంది.

బిజెపి నేతలను ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. జివిఎల్‌ తర్కం ఒక్క అమరావతికేనా దేనికైనా వర్తిస్తుందా ? ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ముగిసిన అనేక అధ్యాయాలను తిరిగి తెరుస్తున్నది బిజెపి, జరిగిన తప్పిదాలను సరిచేస్తామని చెబుతున్నది ఆ పార్టీ, అలాంటపుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేతులు రావటం లేదా ? ప్రత్యేక హోదా కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందనే సరికొత్త వాదనను బిజెపి నేత ముందుకు తెచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయల మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలోనే కేంద్రం ఎలా కట్టబెట్టగలిగింది? తాజా బడ్జెట్‌లో డివిడెండ్‌ పన్ను చెల్లింపు పన్నుతో సహా అనేక రాయితీలను తాజా బడ్జెట్‌లో ఎలా ప్రకటించారు. వాటికి లేని ఆర్ధిక ఇబ్బందులు ఆంధ్రప్రదే శ్‌ ప్రత్యేక హోదాకే వస్తాయా ? ప్రత్యేక హోదా డిమాండ్‌ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే పదేపదే ఈ డిమాండ్‌ లేవనెత్తితే జగన్‌ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జివిఎల్‌ అనటం బెదిరింపా మరోసారి అడగవద్దని హెచ్చరించటమా ?

చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తేడా ఏమిటంటే చంద్రబాబు విదేశీ బూట్లు వేసుకుంటే జగన్‌ స్వదేశీ తగిలించుకున్నారు. చంద్రబాబు కార్పొరేట్‌ పరిభాషలో గతంలో తనను సిఇఓగా వర్ణించుకుంటే జగన్‌ ఫ్యూడల్‌ పద్దతిలో రాష్ట్రానికి తండ్రినని చెప్పుకున్నారు. విజయవాడ గేట్‌వే హౌటల్‌లో నిర్వహించిన హిందూ పత్రిక కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివ అద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఆరువందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చెన్నై ఒక రేవు పట్టణంగా ఎదిగింది, దానిని 1639లో బ్రిటీష్‌ వారు తీసుకున్నట్లు చరిత్ర, అదే విధంగా బెంగలూరు నగరం 1535లో, హైదరాబాద్‌ 1591లో ప్రారంభమైంది. స్వాతంత్య్రం రాకముందే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి. తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి అనేక సంస్ధలను నెలకొల్పారు. వాటి అభివృద్ధిలో అవి పధాన పాత్ర పోషించాయి. అమరావతిలో మౌలిక సదుపాయలకే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవుతుందని, అంతసొమ్ము తాము అక్కడ వెచ్చించలేమని చెబుతున్న జగన్‌ దానిలో పదోవంతు పదివేల కోట్లతో విశాఖలో సచివాలయం నెలకొల్పితే ఆ మూడు నగరాలతో పోటీబడి అభివృద్ధి చెందుతుందని చెప్పటం అంటే భ్రమలు కొల్పటం గాక మరేమిటి ? ప్రభుత్వ రంగంలో కేంద్రం, లేదా రాష్ట్రం పెట్టుబడులు పెట్టటాన్ని ఎప్పుడో నిలిపివేశాయి. ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు పోతాయి తప్ప మూడు రాజధానులు పెడితే పదమూడు జిల్లాలకు ఎలా చేరతాయి. ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయకుండానే, రాజధానిగాక ముందే విశాఖలో ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు కారణంగా, దానికి ఉన్న రేవు, ఇతర కారణాలతో అభివృద్ధి అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు విశాఖను తామే అభివృద్ధి చేశామని చెప్పుకొనే ఎత్తుగడ తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. ఒక సైబర్‌టవర్‌ నిర్మించి మొత్తం సైబరాబాద్‌ను, ఐటి పరిశ్రమను తానే తెచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకోవటంలో ఆయనతో జగన్‌ పోటీ పడదలచుకున్నారా ?

కేంద్ర బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిాజగన్‌ అభినందనలా ?
” ఏపీని ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అసంత అప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని” సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దఅష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హౌదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్‌ మీద జనం అసంతృప్తి సరే ముఖ్యమంత్రి జగన్‌ సంగతేమిటి?
”ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వఅద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.” అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు రాష్ట్రానికి తండ్రినని చెప్పుకుంటారు. మరో వైపు మీ చర్యల కారణంగా మా పిల్లలు అసంతృప్తి చెందారు గానీ నేనైతే అభినందనలు చెబుతున్నా అన్నట్లు లేఖ ఉంది. పిల్లలకు జరిగిన అన్యాయానికి కనీసం నిరసన కూడా తెలపకుండా వేరే విషయాలకు అభినందనలు తెలిపే తండ్రిని ఏమనుకోవాలి? మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే ఉందే అని వెనకటికి ఎవరో అన్నట్లుగా లేదూ !
2020ా-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హౌదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని జగన్‌ కోరారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హౌదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హౌదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర అసంత అప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కనీసం నిరసన తెలపరు, ఆర్ధిక సంఘం పరిధిలో ప్రత్యేక హోదా అంశం లేదని ముందే తెలిసి కూడా బడ్జెట్‌కు హారతులు పడుతూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరటం భలే ఉందిలే ! ఇప్పటికే బిజెపి జనం చెవుల్లో పూలు పెట్టింది, ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ కూడా అంతకు మించి మరొకటి కాదు. మోడీగారికి పంపేందుకు పోస్టల్‌ ఖర్చు దండగ తప్ప లేఖలతో రాష్ట్రానికి ఒరిగేదేముంది ?
రాజధాని అమరావతి విషయమై జనసేన-బిజెపి ప్రకటించిన విజయవాడ లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేశాం అంటారు. మూడు రాజధానులకు పార్టీగా వ్యతిరేకం తప్ప తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుకూలం అంటుంది బిజెపి, ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేసేందుకు ఈ ద్వంద్వ మాటలు ? జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కేంద్రం తోలు వలుస్తారా ? తాట తీస్తారా? పార్టీ నిర్వహణ నిధుల కోసమనే పేరుతో హీరోయిన్లతో తైతక్కలాడుతూ సినిమాలు తీస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనం సొమ్ము పొదుపు- వైఎస్‌ జగన్‌ ఆత్మవంచన, పరవంచన !

24 Friday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravati capital controversy, CM YS Jagan

Image result for ys jagan hypocrisy on people's money
ఎం కోటేశ్వరరావు
శాసన మండలిలో అనూహ్యంగా తగిలిన ఎదురు దెబ్బతో అధికార వైసిపి నాయకత్వం ఒక విధంగా చెప్పాలంటే కకావికలైంది. మూడు రాజధానులు, సిఆర్‌డిఏ రద్దు బిల్లులను సెలెక్టు కమిటికీ పంపే ప్రకటనకు దారి తీసిన చర్చలను శాసనమండలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటే జనానికి అనేక విషయాలు తెలిసి ఉండేవి. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందుకు పోవటం, మైకులు విరగ్గొట్టటం వంటి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయటం తెలిసిందే. కానీ శాసనమండలిలో ఏకంగా కొందరు మంత్రులే కుర్చీలు, బల్లలు ఎక్కి శాసనమండలి అధ్యక్షుడికి నిరసన తెలపటం బహుశా ఎక్కడా జరిగి ఉండదు. శాసనమండలి పరిణామాలతో గురువారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను చూస్తే ఆత్మవంచన, పరవంచన గుర్తుకు వస్తోంది.
” శాసనమండలి చైర్మన్‌.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. అక్కడ డైరెక్షన్‌ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం. ”
చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సభా కార్యక్రమాలకే తప్ప గ్యాలరీల్లో కూర్చున్న వారిని చూపించటానికి కాదు. అయినా చంద్రబాబు కూర్చోవటాన్ని అందరం చూశాం అని సిఎం చెబుతున్నారు. అసలు మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే లేనపుడు అదెలా సాధ్యం . అయినా చట్ట సభల లాబీలు, గ్యాలరీల్లో అనుమతి ఉన్నవారెవరైనా కూర్చోవచ్చు, తిరగవచ్చు. చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి తరువాత వరసలో ఉండే వైసిపి నాయకత్వం కూడా గ్యాలరీలో కూర్చున్నది. లాబీల్లో పచార్లు చేసింది. సభలో కనుసైగలు, ఇతర పద్దతుల ద్వారా స్పీకర్‌, మండలి అధ్యక్షులకు సూచనలు, ఇతర అంశాలను పంపటం ముఖ్యమంత్రులు, అధికారపక్షం చేస్తున్నది బహిరంగ రహస్యం. గ్యాలరీలో కూర్చొని కూడా మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వారు ఆరోపించటం వైపరీత్యం తప్ప మరొకటి కాదు. అదే సాధ్యమైతే మంత్రులను పోడియం వద్దకు వెళ్లమని, కుర్చీలు, బల్లలు ఎక్కాలని, మండలి చైర్మన్‌ ముందు నిరసన తెలపాలని లేదా ఆల్లరి చేయాలని గ్యాలరీల్లో ఉన్నవైసిపి నాయకులు ఆదేశాలు జారీ చేశారని అనుకోవాలా ?

” దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి.”
ముందుగా ఆలోచించాల్సింది, ఇంత పేద రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అవసరమా అన్నది. ఒక వైపు ఎలాంటి ఖర్చు లేకుండా హైదరాబాదులో పది సంవత్సరాల పాటు రాజధానిగా పాలన సాగించే అవకాశాన్ని వదులు కున్నారని తెలుగుదేశం మీద విమర్శలు చేస్తారు. అమరావతిని ఖరారు చేశాక అక్కడ నిర్మించిన భవనాల్లోనే సచివాలయం, ఉభయ సభలు, హైకోర్టు పని చేస్తున్నది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, సిబ్బందికి అవసరమైన నివాసాలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ అర్ధంతరంగా వదలి వేసి విశాఖకు సచివాలయం, కర్నూలుకు హైకోర్టును తరలించాలనటం పొదుపు చర్య అవుతుందా ? దుబారానా ? ప్రజల సొమ్ముకు జవాబుదారీ వహించాల్సిన వారు చేయాల్సిన పనేనా ఇది.
శాసనమండళ్లు అవసరం లేదని, డబ్బు దండగ, అవి రాజకీయ నిరుద్యోగులు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారికి నిలయాలుగా మారాయన్నది సాధారణ విమర్శ. ఆ విషయం జగన్‌మోహనరెడ్డి గారికి ఆకస్మికంగా గుర్తుకు రావటమే చర్చనీయాంశం. ఆకస్మికంగా జ్ఞానోదయం అయిందా ? నిజంగా పేద రాష్ట్రం, ఖర్చు అనవసరం అనుకుంటే తాము గెలిస్తే మండలిని రద్దు చేస్తామని మానిఫెస్టోలోనే పెట్టవచ్చు. అలాంటిదేమీ లేదు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తన రాజకీయ అజెండాకు ఎదురు దెబ్బతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు తప్ప గతంలో కనీసం చర్చ జరగాలని కూడా చెప్పిన దాఖలాలు లేవు.
ఇక్కడ మరొక అంశం, కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండలి అన్నవారికి దేశంలో అసలు ఎక్కడా లేని, ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన మూడు రాజధానులు ఎలా బుర్రలోకి వచ్చినట్లు ? అది అదనపు ఖర్చు కాదా ? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వారానికి ఒకసారి కేసుల విచారణకు హైదరాబాదు రావటానికి కొన్ని లక్షల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రికి మూడు రాజధానులకు తిరగటానికి తనకు తన పరివారానికి రోజూ అయ్యే అదనపు ఖర్చు గురించి ఆలోచన రాలేదా ? ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మంచినీటి సీసాల విషయంలో పాటించిన పొదుపు గురించి ఎంతగానో ప్రచారం చేస్తే జనమంతా నిజమే అనుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి గుడివాడ వెళ్లటానికి హెలికాప్టర్‌ ప్రయాణం పొదుపు చర్య అవుతుందా ?
” రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్‌ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ”
పూర్వం కొందరు రాజులు విలాసాలకు అలవాటు పడి రాజనర్తకి, ఇతర రంగసానుల దగ్గర చేరి ఆస్ధానాలకు రాకుండా పాలన సాగించినట్లు చెప్పే కథలు మనకు తెలిసిందే. సచివాలయానికి రాకుండా తన నివాసం లేదా వ్యవసాయ క్షేత్రం నుంచి పాలన సాగిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నుంచి స్పూర్తి పొంది ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటపుడు రాజధానికి 30వేల ఎకరాలు కావాలని(ప్రభుత్వ భూములు కావాలని అన్నారని ఇప్పుడు వైసిపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు), అమరావతిలో పెట్టాలని 2014లో అసెంబ్లీలో చెప్పినపుడు జగన్‌గారికి ఈ విషయాలు తెలియవా ? అసలు రాజధానే అవసరం లేదని చెప్పే వారు మూడు రాజధానులు కావాలని ఇంత రచ్చ, గందరగోళం సృష్టించటం ఎందుకు ? రాజధానితో నిమిత్తం లేకుండా పాలన సాగించగలిగిన వారికి పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయటం ఒక లెక్కా ! ఆ మాత్రం దానికి ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టటం, ప్రాంతాల మధ్య పోటీ పెట్టటం ఎందుకు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగన్‌ అభివృద్ధి ప్రణాళిక గుట్టు విప్పాలి-చేసేదేమిటో చెప్పాలి !

23 Thursday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Aandhra Pradesh three Capitals, YS jagan, ys jagan development plan

Image result for now ys jagan should reveal his development plan

ఎం కోటేశ్వరరావు
నీతులు ఉన్నదెందుకు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే అన్నట్లుగా ఆంధ్రపదేశ్‌ రాజకీయాలు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో జరిగిన పరిణామాలను చూస్తే ఇలా జరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం లేదా ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడామస్‌ లేదా తామే చెప్పామనో బతికున్న జ్యోతిష్కులు ఎవరైనా చెబుతారేమో చూడాలి. అధికారపక్షానికి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియంలోకి దూసుకువస్తే తప్పు పట్టిన వారు, తాము మైనారిటీగా ఉన్న శాసనమండలిలో సభ్యులుగాని మంత్రులే ఏకంగా మండలి అధ్యక్షుడి పోడియంను, అధ్యక్షుడినే చుట్టుముట్టారు. ఇదొక వైపరీత్యం. అసెంబ్లీలో ప్రతిపక్షచర్యలను జనానికి చూపేందుకు టీవీల్లో ప్రసారం చే శారు. అదే తమ చర్యలను జనం చూడకుండా చేసేందుకు సాంకేతిక కారణాల పేరుతో మండలి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. అక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్పీకర్లు ఎలా అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నారో విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించుతున్నారో గత అసెంబ్లీలోనూ, ఇప్పుడూ చూస్తున్నాము. ఇప్పుడు మండలి చైర్మన్‌ కూడా అదే విచక్షణ అధికారంతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. అందువలన విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించి నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. దేశ రాజ్యాంగ వ్యవస్ధలను నీరుగార్చుతున్న నేపధ్యంలో ఈ పరిణామాలను చూడాల్సి ఉంది.
మూడు రాజధానుల రాజకీయం ఎటు తిరుగుతుందో, ఎవరి దగ్గర ఎలాంటి తురుపు ముక్కలున్నాయో, వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారో ఊహించి చెప్పలేము. సామాన్య జనం కోసం, ప్రాంతీయ మనోభావాలను రేకెత్తించటానికి మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ చట్టపరంగా అది పాలనా వికేంద్రీకరణ పేరుతో జరుగుతోంది. వాణిజ్య కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్ధల నమోదు(రిజిస్టర్డ్‌) కార్యాలయాలు ఒక చోట, కార్యకలాపాల నిర్వహణ పలు చోట్ల ఉండటం తెలిసిందే. రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు పరిమితమే. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దానిని అలాగే కొనసాగిస్తూ కార్యకలాపాలను పరిమితం చేస్తూ సచివాలయాన్ని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలని పాలకపార్టీ తలపెట్టింది. అందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అనూహ్యంగా శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బలు తగిలితే వాటి తీవ్రతను బట్టి విరామం ఉంటుంది తప్ప ప్రయాణం ఆగదు. తమ మూడు రాజధానుల అజెండా కూడా అలాంటిదే అని అధికారపార్టీ చెబుతోంది. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆలస్యం కావించేందుకు తెలుగుదేశం పార్టీ తాను చేయగలిగిందంతా చేస్తోంది.
పాలన వికేంద్రీకరణను ఒక విధానంగా జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ముందుకు తెస్తోంది గనుక కోర్టులు అభ్యంతర పెట్టే అవకాశాలు పరిమితం అని చెప్పవచ్చు. రాజ్యాంగానికి అనుగుణ్యంగా ఉన్న విధానాలను అభ్యంతర పెట్టే అధికారం కోర్టులకు లేదు. కేంద్రం కూడా అడ్డుకొనే అవకాశాలు అంతంత మాత్రమే. సమస్య హైకోర్టు తరలింపు దగ్గరే ఎదురు కానుంది.అన్ని పార్టీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అది మాత్రమే చాలదు. రాజధాని ఖరారు సమయంలోనే కర్నూలులోనో మరొక చోటో హైకోర్టును ప్రతిపాదించి కేంద్రానికి పంపి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. దేశ విభజన తరువాత తలెత్తిన పరిస్ధితులలో ఏర్పడిన తూర్పు పంజాబ్‌ హైకోర్టు, తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నూతన హైకోర్టులు లేదా ఉన్న బెంచ్‌లను హైకోర్టులుగా మార్చటం తప్ప ఒక రాష్ట్రంలో ఒకసారి ఖరారు అయిన హైకోర్టును మరొక చోటికి తరలించిన ఉదంతం మన దేశంలో ఇంతవరకు లేదు. రాష్ట్ర పునర్వ్యస్దీకరణ చట్టం, ఇతర విధి, విధానాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం సాధ్యం కాదని కొందరు నిపుణుల తాత్పర్యం. చట్టంలో ఏ అడ్డంకులు ఉన్నా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అనుమతి ఇస్తే మరొక నోటిఫికేషన్‌ ద్వారా తరలించవచ్చన్నది మరొక భాష్యం. తరలింపును వ్యతిరేకిస్తున్నదీ, కోరుకుంటున్న వారిలో న్యాయవాదులు సహజంగానే ముందున్నారు కనుక రెండు వైపులా ఉద్దండులనే న్యాయపోరాటంలో రంగంలోకి దించుతారు.
హైకోర్టు విషయంలో న్యాయ పోరాటం అవసరం లేకపోతే సమస్యే లేదు, రణం తప్పనిసరైతే అదెలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో చూద్దాం. దానిలో జగన్‌ సర్కార్‌ గెలిస్తే హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. ఓడిపోతే అమరావతిలోనే ఉండిపోతుంది. పర్యవసానాలకు జగన్‌మోహనరెడ్డి ఇప్పటి నుంచే సిద్దం కావాల్సి ఉంటుంది. వెలువడుతున్న అభిప్రాయాల మేరకు సెలెక్టు కమిటీ పేరుతో గరిష్టంగా ఆరునెలల పాటు అడ్డుకోవటం తప్ప మండలి చేసేదేమీ లేదు. ఆమోదించినా ఆమోదించకపోయినా అసెంబ్లీ తీర్మానం ఖరారు అవుతుంది. ఆ తరువాతే హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం. దానికి కేంద్రం నుంచి అనుమతి ఎంతకాలానికి వస్తుందో, అసలు రాదో కూడా తెలియదు. హైకోర్టు తరలింపు తక్షణమే జరగదని తెలిసినా దానితో నిమిత్తం లేకుండానే విశాఖకు సచివాలయాన్ని తరలించాలని మౌఖింగా ఆదేశాలు, ఏర్పాట్ల గురించి సూచనలు వెళ్లాయి గనుక హైకోర్టు విషయం తేలేవరకు బండి గుర్రం కళ్ల ముందు గడ్డి ఉంచి పరుగెత్తించినట్లుగా రాయలసీమ వాసులకు కేంద్రాన్ని చూపుతూ కాలక్షేపం చేయవచ్చు. అది ఆలస్యమయ్యే కొద్దీ అధికారపక్షానికి సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తరలింపు సాధ్యం కాదని తేలితే రాయలసీమలో వైసిపి భవిష్యత్‌ ఏమిటి? రాయలసీమ జనాన్ని సంతృప్తి పరచటం ఎలా అనే సమస్య తిరిగి ముందుకు వస్తుంది. అధికారపక్షానికి అది ఇరకాటమే.
మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైతే అసలు మండలినే రద్దు చేస్తామనే సూచనలు అధికారపక్షం నుంచి వెలువడ్డాయి. అవి బెదిరింపులా, ప్రలోభాలా మరొకటా అన్నది అన్నది ఎవరికి వారే భాష్యం చెప్పుకోవచ్చు. తరువాత అలాంటిదేమీ లేదని వైసిపి నేతలు చెబుతున్నప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరించి రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే రద్దవుతుందా ? కేంద్రంలోని అధికారపార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఒకే రాజధాని అని చెబుతోంది కనుక ఆ సిఫార్సును వెంటనే ఆమోదించటానికి ఎందుకు చర్య తీసుకుంటుంది? ఆమోదించాలని కోరే పార్టీ వైసిపి తప్ప మరొకటి ఉండదు. రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ ప్రకారం రాజ్యసభ సీట్లకోసం బిజెపి నాయకత్వం ఒక వేళ రాజీపడి శాసన మండలిని వెంటనే రద్దు చేస్తే నష్టపోయే వాటిలో వైసిపి కూడా ఉంటుంది. తక్షణమే మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి ఉద్యోగాలు ఊడతాయి. తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం ముగియగానే తలెత్తే ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వైసిపి రాజకీయ నిరుద్యోగుల ఆశలకు నీళ్లొదులు కోవాల్సిందే. వారిని సంతృప్తిపరచేందుకు పాలకపార్టీ ఆయాసపడాల్సిందే. రెండవది ఇప్పటికే రివర్సు(తిరగదోడే) సర్కార్‌ అని తెలుగుదేశం చేస్తున్న రాజకీయ దాడికి మరొక అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. రాజశేఖరరెడ్డి కార్యక్రమాలన్నింటినీ సమర్ధవంతంగా అమలు జరుపుతామన్న వైసిపి ఆయన హయాంలో పునరుద్దరణ జరిగిన మండలిని రద్దు చేశారనే సెంటిమెంటును కూడా తెలుగుదేశం ముందుకు తెస్తుంది.
మూడు రాజధానుల ప్రక్రియతో పాటు స్ధానిక సంస్ధలకు ఎన్నికలకు కూడా వైసిపి సిద్దపడింది. రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు ఎక్కిన కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పుడు బిల్లు సెలక్టు కమిటీకి వెళ్లటంతో దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తారా? వేయకపోతే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలు కూడా జరగవచ్చు, సహజంగానే కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా ఎక్కువ చోట్ల లబ్ది పొందవచ్చన్న అంచనాతోనే వైసిపి ముందుకు పోవచ్చు. పెద్ద మెజారిటీతో అనుకూల ఫలితాలు వస్తే వాటిని చూపి మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఒక వేళ ప్రతిపక్షాలకు తగినన్ని స్ధానాలు వస్తే ఒకే రాజధాని గురించి సమీకరణలు మరింతగా పెరుగుతాయి.
అధికార వికేంద్రీకరణ ఎత్తుగడతో సచివాలయ తరలింపును సాంకేతికంగా అడ్డుకొనే అవకాశాలు లేవు గనుకనే బిజెపి రాజకీయ పార్టీగా వ్యతిరేకతకు పరిమితమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతోంది. లేదా అడ్డుకొనేందుకు ఉన్న నిబంధనా పరమైన అంశాల పరిశీలన, అధ్యయనం కోసం సమయం తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వైసిపి అజెండాను జయప్రదంగా అమలు జరిగేందుకు సహకరిస్తే లోపాయికారిగా ప్రయోజనాలు పొందవచ్చేమోగానీ రాజకీయంగా బిజెపి దానితో ముడివేసుకున్న జనసేన పని ముగిసినట్లే. అన్ని చోట్లా తన దుకాణామే ఉండాలి, మిగిలిన పార్టీల దుకాణాలు మూతపడాలని కోరుకుంటున్న, అందుకోసం దేనికైనా తెగించే బిజెపి అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన చర్యలకు పాల్పడుతుందా ? ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో దాని మెజారిటికి ఢోకా లేదు. స్వయంగా దానికే సంపూర్ణ మెజారిటీ వుండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన రాజకీయ కోణంలోనే బిజెపి ఆలోచించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బిజెపి-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను తామే దిగమింగుకోవటం కష్టం.
అనుకోని ఇబ్బందుల్లో పడిన వైసిపి ఇప్పుడేం చేస్తోంది? అసలేం చేయాలి? ఆస్ద్ధులన్నీ కరిగి పోయినా ఫర్వాలేదు, కేసు గెలవటం ముఖ్యం అని ఫ్యూడల్‌ ప్రభువులు వ్యవహరించినట్లుగా తాను తలపెట్టినదాన్ని నెగ్గించుకొనేందుకు ఎంతదాకా అయినా పోతాను అన్నట్లుగా వుంది ప్రభుత్వ తీరు. ఎందరో ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ అమరావతి కేసుల్లో వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజుతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహతగిని నియమించుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే అలాంటి వారిని మరికొందరిని నియమించుకున్నా ఆశ్చర్యం లేదు, జనం సొమ్ము కదా ! మండలిని పూర్వపక్షం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెస్తారా, దానికి గవర్నర్‌ రబ్బరు స్టాంపు వేస్తారా ? వంటి అనేక అంశాలు ఉన్నాయి.
సెలక్టు కమిటీ, ఇతర ఆటంకాల పర్యవసానాలు ఎలా ఉన్నా వైసిపి సర్కార్‌ రోజువారీ పాలన సాగించక తప్పదు. ఎన్నికలకు ముందే ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలను అమలు జరపాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షకోట్ల రూపాయలను దాని ఒక్కదానికే ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పింది కనుక ఇప్పుడు ఆ సొమ్మును, ఇతర అభివృద్ధి పధకాల సొమ్ముతో కలిపి పదమూడు జిల్లాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేయనుందో ప్రణాళికను వెల్లడించాలి. నవరత్నాలను ఎలా అమలు జరుపుతామో వివరంగా చెప్పిన వారికి రాష్ట్ర అభివృద్ది పధకాలు రూపొందించటం ఒక లెక్క కాదు. సెలక్టు కమిటీ తీసుకొనే వ్యవధిని ప్రభుత్వం దీనికి ఉపయోగించుకొని మూడు రాజధానులు అయితే, ఒక వేళ కాకున్నా పదమూడు జిల్లాల అభివృద్ధి సూచికలు ఎంతెంత ఉన్నాయో, రానున్న నాలుగు సంవత్సరాలలో వాటిని ఎంత మేరకు, ఎలా పెంచుతారో జనానికి వెల్లడిస్తూ శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రభుత్వం తానుగా అభివృద్ధికి పెట్టుబడుల సంగతి తేల్చాలి. మూడు రాజధానులతో నిమిత్తం లేకుండానే ఇప్పటికే అమలు జరుపుతున్న అభివృద్ధి పధకాలు ఎలాగూ కొనసాగుతాయి గనుక నిమిత్తం వాటితో లేకుండా వాటిని ప్రత్యేకంగా చేసే అభివృద్ధి ఏమిటో వెల్లడించాలి. అప్పుడే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ పేదలు తమ వలసలను విరమించుకొని ఇక్కడే ఉపాధి పొందేందుకు పూనుకుంటారు. అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జిఎన్‌ రావు కమిటీ, లేదా బోస్టన్‌ కన్సల్టెన్సీ బృందం సమర్పించిన నివేదికలను మధించిన మంత్రుల ఉన్నత సా ్ధయి కమిటీ చేసిన సూచనలేమిటో, పూర్తి నివేదిక ఏమిటో జనానికి అందుబాటులో ఉంచాలి. ఇదేమీ రహస్యం కాదు, పారదర్శకతకు పక్కా నిదర్శనం అవుతుంది. అలాగాక మూడు రాజధానుల అంశం తేలిన తరువాతే మా గుప్పెట తెరుస్తాము లేదా మనసులో ఉన్నది చెబుతాము అంటే అందులో ఏమీ లేదనే అనుకోవాల్సి వస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒక భ్రమరావతి మూడు కానుందా-చంద్రబాబు చెప్పుల్లో జగన్‌ దూరుతున్నారా?

12 Sunday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Chandra Babu, CM YS Jagan

Image result for jagan three capitals

ఎం కోటేశ్వరరావు
తాను అనుకున్న పద్దతుల్లోనే రాజధాని రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా స్వయంగా కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారా, అవే చివరకు గుది బండలుగా మారతాయా? రాజకీయంగా పతనానికి నాంది పలుకుతాయా ? జగన్‌ తలకెత్తుకున్న మూడు రాజధానుల రాజకీయం నల్లేరు మీద నడకంత సులభంగా సాగుతుందా, అసలు అనుకున్న గమ్యస్ధానం చేరుతుందా ? గతంలో ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమకు హైకోర్టు బెంచ్‌లు కావాలని చేసిన తీర్మానాలన్నీ ప్రస్తుతం చెత్తబుట్టలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉన్న హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం, అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేయాలని జగన్‌ కోరగానే అమలు జరపటానికి సిద్దంగా ఉన్నదెవరు ? ఉత్తర ప్రదేశ్‌ 22 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రం తమ అవసరాలకు ఐదు హైకోర్టు బెంచ్‌లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కంటే ప్రధాని నరేంద్రమోడీ దగ్గర జగన్‌కు పలుకుబడి ఎక్కువ ఉందా లేదా తన పలుకుబడి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? నిజానికి అంత ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను ఎందుకు సాధించలేకపోయార? దాన్ని సాధించి ఉంటే కేంద్రం ఇచ్చే రాయితీలతో, పరి శమలకు ఇచ్చే మినహాయింపులతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలూ అభివృద్ది చెందుతాయి కదా ? జగన్‌ అజెండాను, రాజకీయాన్ని కేంద్రంలోని బిజెపి అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీని, దాన్ని నమ్ముకున్న వారి పరిస్ధితి ఏమిటి? ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్లుగా జగన్‌ తీరు కనిపిస్తోంది. కులాల కళ్లద్దాలతో చూస్తే సదరు కులానికి ఉన్న బలమైన లాబీ కంటే కేంద్రంలో జగన్‌కు పలుకుబడి ఎక్కువా ? తీరా ఏదీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతారా ? అసలు అభివృద్ది అజెండాను పక్కన పెట్టి ఆ పేరుతో మూడు రాజధానుల రాజకీయ చదరంగాన్ని ప్రారంభించి తప్పుటడుగు వేశారా ? ఎవరు ఎవరిని కట్టడి చేస్తారు, ఎవరు ఎవరిని హతమారుస్తారు. ఇదే కదా చదరంగం !
రాజకీయాల్లో ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరించే కుమ్ములాటల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ! జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని భావిస్తున్నట్లు కనిపించటం లేదు. ఓదార్పు యాత్రల బ్రాండ్‌ అంబాసిడర్‌ లేదా ఓదార్పుకు మారు పేరుగా ఖ్యాతి పొందిన వ్యక్తికి ఆందోళన చెందుతున్న వారి భయాలను పోగొట్టాలనే బాధ్యత ఉందనే స్పృహ ఉన్నట్లు లేదు. గత ఐదు సంవత్సరాలలో ఏదో ఒక పేరుతో జనానికి దగ్గరైన వ్యక్తి అనుకున్న అధికారాన్ని సాధించగానే జనానికి దూరమై ప్రతిపక్ష నేతలు ఓదార్పు యాత్రలను ప్రారంభించేందుకు తొలి ఆరునెలల్లోనే నాంది పలికారా ?
ఓట్లు, సీట్లతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యల మీద గళమెత్తే వామపక్ష పార్టీలు పోలీసుల దెబ్బలు తింటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ నిరంతరం తమ కార్యక్రమాలను చేస్తాయన్నది తెలిసిందే. అలాగాక కేవలం అధికారం, దానితో రెండు చేతులా ఎలా సంపాదించుకోవాలా అని తప్ప మరొకటి పట్టని, రాజకీయంగా దెబ్బతిన్న తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీలకు ముఖ్యమంత్రి రాజకీయ ఉపాధి కల్పిస్తున్నారు. అసమ్మతి తెలిపిన వారికి పోలీసు దెబ్బలను రుచి చూపుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నపుడు ఒక విధంగా లేనపుడు మరోతీరునా ప్రవర్తించే తీరు తెన్నులను తెలుగుదేశం నేత చంద్రబాబులో, కొంత మేరకు పవన్‌ కల్యాణ్‌లో జనం చూశారు. గతంలో జగన్‌ ప్రతిపక్ష రూపాన్ని జనం చూ శారు. ఇప్పుడు తన రెండో రూపాన్ని జనానికి స్వయంగా చూపుతున్నారు.

Image result for ap capital news
తాము కన్న కలలను కల్లలుగా చేస్తున్నారనే భావనతో రాజధాని ప్రాంత గ్రామాల జనం ప్రారంభించిన శాంతియుత ఆందోళనను పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేయించటం ఆందోళనకరం, గర్హనీయం. గతంలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నపుడు రాజధాని భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్ధల వారు తమ అభిప్రాయాలను జనానికి చెప్పేందుకు ఆ గ్రామాలకు వెళ్లినపుడు వారిని అక్కడి జనం పట్టించుకోలేదు, చెప్పేది వినిపించుకొనేందుకు సైతం సిద్దపడలేదు. కొన్ని చోట్ల మరింత రెచ్చిపోయి గ్రామాల వారు, వారికి మద్దతుగా అధికార పార్టీ పెద్దలు, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించారో, అసలు గ్రామాల్లోకే రానివ్వని రోజులను చూశాము. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కూడా పోలీసులతో అదే పని చేయిస్తున్నది. అప్పుడు పూలింగ్‌ పద్దతుల్లో నష్టపోతారు, పాలకపార్టీలు కల్పించే భ్రమలను నమ్మవద్దని చెప్పిన వారిని రైతులు పట్టించుకోలేదు, అధికారపార్టీ, ప్రభుత్వం వ్యతిరేకించింది. రాజధాని అంశాన్ని తిరగదోడిన జగన్‌ సర్కార్‌ ఇప్పుడు అదే చేస్తున్నది. భూములిచ్చిన రైతులకు న్యాయం కలిగించాలని కోరుతున్నవారిని అధికార పార్టీ వ్యతిరేకిస్తున్నది, ప్రభుత్వం అడ్డుకుంటున్నది, మహిళలు అనే విచక్షణ కూడా పాటించకుండా లాఠీలతో కొట్టిస్తున్నది, కేసులు బనాయిస్తున్నది. రైతులను నిస్సహాయులను చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
రాజధానిని మార్చాలని అనుకుంటే దాన్ని సూటిగానే చెప్పవచ్చు. అది మంచిదా చెడ్డదా,ఏమి చేయాలో జనం నిర్ణయించుకుంటారు. ఒక పెద్ద మనిషి అమరావతిని ఎడారి అన్నారు, మరొకరు శ్మశానం అన్నారు. ఇలా నోరు పారవేసుకున్న వారు ఆ ఎడారి లేదా శ్మశానంలోనే రోజూ రాకపోకలు సాగిస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఇక వైసిపి నామినేటెడ్‌ పదవులు పొందిన సినీనటుడు పృద్ధ్వి,కొందరు నేతల నోళ్లు ఏం మాట్లాడుతున్నాయో అదుపులేని స్ధితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిని కల్పించిన వారికి సహజంగానే భయం పట్టుకున్నట్లుంది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని జనానికి బేడీలు వేసి ఇండ్లలో నిర్బంధించలేరు. అందువలన రోడ్లపై ప్రయాణించే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకరు, ఇతర నోటితుత్తర నేతలకు ఏమి జరుగుతుందో తెలియదు. దాంతో పోలీసులు రాజధాని గ్రామాల్లోని రోడ్డు పక్క ఇండ్ల నుంచి రాళ్లు , ఇతర వస్తువులను విసిరినా తగలకుండా చూసేందుకు తెరలతో కాపలాలు కాస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చిత్రాలతో సహా దర్శనమిచ్చాయి.(అవి ఇక్కడివా మరొక చోటివా అన్నది నిర్ధారించుకోవాలి) ఒక వేళ అవేగనుక నిజమైతే ఒక ప్రభుత్వానికి అంతకంటే అవమానకరం లేదు, లేదా పోలీసులే అలా చిత్రించి మంత్రులకు రక్షణ లేదు అని చెప్పటానికైనా కావచ్చు.
రాజధానికి భూములిచ్చిన రైతులను స్వార్ధపరులుగా వైసిపి నేతలు చిత్రిస్తున్నారు. అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలన్న స్వార్ధ పరులు అంటున్నారు, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ఎదురుదాడి చేస్తున్నారు. వారందరూ భూస్వాములు, వారి పిల్లలందరూ విదేశాల్లో, లేదా దేశంలోని ఇతర పెద్ద పట్టణాల్లో ఉంటారు, వ్యవసాయం చేయరు, ఒకే కులానికి చెందిన వారంటూ ముద్రవేస్తున్నారు. రాయలసీమ వారందరూ రౌడీలు, ఫాక్షనిస్టులని కొందరు ఎలా నిందిస్తారో ఇది కూడా అలాంటిదే. రాజధానికి స్వచ్చందంగా లేదా బలవంతంగా, ప్రలోభాలకు గురి చేసిగానీ సేకరించిన భూమి 33వేల ఎకరాలు, యజమానులు 29వేల మంది. ఎక్కడైనా వూరికి ఐదు పది మంది చొప్పున ఐదు పది ఎకరాలు కోల్పోయిన వారు ఉంటే ఉండవచ్చుగానీ వారందరూ చిన్న, సన్నకారు రైతులు. ఎక్కడైనా పట్టణాలలో ఒకే కులానికి చెందిన లేదా మతాలకు చెందిన వారి అపార్ట్‌మెంట్లు ఉన్నాయోమో గానీ, ఒకే కులానికి చెందిన గ్రామాలు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల కొన్ని కులాల వారు అత్యధికంగా వుంటే ఉండవచ్చు. రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండ నియోజకవర్గం షెడ్యూలు కులాలవారికి రిజర్వు చేసినది. అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఆ కులాలకు చెందిన వారు గణనీయంగా ఉన్నారనేది నిర్ధారణ. ఒక వేళ ఒకే కులం, ఒకే పార్టీకి చెందిన వారు 29 గ్రామాల్లో ఉంటే వారి ఓట్లన్నీ ఒకే పార్టీకి గుండుగుత్తగా పడి ఉంటే అక్కడ వైసిపి గెలిచే అవకాశాలే లేవు. భూములిచ్చిన వారిలో అన్ని పార్టీలకు చెందిన, కులాల వారు ఉన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికి భూములిచ్చిన వారి ఆందోళన ప్రత్యేకమైనది. ఇతర ప్రాంతాలలో ప్రాజెక్టులు లేదా పారిశ్రామిక ప్రాంతాలు లేదా ఇతర అవసరాలకు ప్రభుత్వాలు భూములు సేకరించి వారికి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాయి. అది ఎక్కువా తక్కువా, సమంజసమా అంటే అవునని ఎవరూ చెప్పరు. వాస్తవ ధరకంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకే పరిహారం వుంటుంది. ఒకసారి సొమ్ము తీసుకున్న తరువాత భూములతో వారికి పని ఉండదు. అటు బొందితో స్వర్గానికి పోలేక ఇటు భూమి మీదకు తిరిగి రాలేక మధ్యలో విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలో తలకిందులుగా వేలాడిన త్రిశంకుడి మాదిరి అమరావతి ప్రాంత రైతుల పరిస్ధితి తయారైంది. దీనికి ఎవరిది బాధ్యత ?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రియలెస్టేట్‌ ద్వారా డబ్బులు సంపాదించి రాజధానితో పాటు నవనగరాలను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు భ్రమరావతికి తెరలేపారు. ఆ మైకంలో పడిన రైతాంగం తమ భూములన్నింటినీ సమర్పించుకుంది. రియలెస్టేట్‌ ఎండమావులను చూసి వర్షించే మేఘాలని భ్రమపడింది. పది సంవత్సరాల పాటు వారిచ్చిన భూములకు కౌలు చెల్లిస్తామని, పద్దెనిమిది నెలల్లో భూముల్లో కొన్ని ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన. ఆ మేరకు కౌలు చెల్లిస్తున్నారు తప్ప ప్లాట్లను అభివృద్ధి చూసి ఇంకా పూర్తిగా అప్పగించలేదు. కొత్త ప్రభుత్వం ఆపని చేస్తుందని ఆ శలు పెట్టుకున్న రైతాంగం అసలుకే మోసం తలపెట్టిన సర్కార్‌ తీరును చూసి హతాశులయ్యారు. జగన్‌ అసెంబ్లీలో చెప్పినట్లుగా, కమిటీలు సూచించినట్లుగా, రాబోయే హైపవర్‌ కమిటీ సూచించబోయేవాటి ప్రకారం అమరావతిని ఏడాదికి పది లేదా పదిహేను రోజుల పాటు జరిపే అసెంబ్లీ సమావేశాలకు(నెల రోజుల పాటు జరిగే వేసవి లేదా బడ్జెట్‌ సమావేశాలను విశాఖలో జరపాలనే సిఫార్సును అమలు చేస్తే) పరిమితం చేసి సచివాలయం, హైకోర్టు ఇతర కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలిస్తే జరిగేదేమిటి? గడువు ముగిసిన తరువాత కౌలు మొత్తాన్ని నిలిపివేస్తారు, కేటాయించిన ప్లాట్లకు డిమాండు పడిపోతే లేదా కొనుగోలు చేసే వారు లేకపోతే తమ పరిస్ధితి ఏమిటి అన్నది ఆ ప్రాంత రైతుల ఆవేదన.
అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాలంటూ ఒక్క ఆర్ధిక, సామాజికవేత్త కూడా లేకుండా పట్టణ ప్రణాళికల నిపుణులతో మాజీ అయ్యేయెస్‌ అధికారి జిఎన్‌రావు కన్వీనర్‌గా ఒక కమిటిీని వేశారు. అది తన నివేదికలో ఏమి సిఫార్సు చేస్తుందో తెలియక ముందే కడుపులో ఉన్నదానిని దాచుకోలేక గానీ లేదా సదరు నివేదికలో ఏమి రాయాలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చిగానీ మూడు రాజధానులు, ఎక్కడ ఏమివస్తాయో కూడా సూచన ప్రాయంగా అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత కమిటీ ఏమి ఇవ్వనున్నదో ముందే తెలిసిపోయింది. రాజధానుల గురించి చెప్పిన ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నామో, దానికింద ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పి ఉంటే అదొక తీరు. కమిటీ సిఫార్సులు, వాటికి ఉన్న చట్టబద్దత లేక ఆచరణ సాధ్యమా అన్న అంశాలు ఒక ఎత్తు. ఆ కమిటీతో పాటు బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు సలహా అంటూ మరొకదాన్ని ముందుకు తెచ్చారు. లెక్కలేనంత మంది సలహాదారులు జగన్‌ చుట్టూ కొలువు తీరి ఉన్నారు. జనం సొమ్ము నుంచి ప్రతినెలా లక్షల రూపాయల ప్రతిఫలం, ఇతర సౌకర్యాలు పొందుతూ వారేమి సలహాలు ఇస్తున్నారో పాలకులేమి తీసుకుంటున్నారో మనకు తెలియదు. గతంలో చంద్రబాబు సలహాదారులు కూడా ఏమి చెప్పారో తెలియదు.(వారిచ్చిన సలహాలే తెలుగుదేశం పార్టీకి ఘోరపరాజయాన్ని చేకూర్చాయనే వారి అభిప్రాయాలను కాదనలేము. అదే బాటలో జగన్‌ సలహాదారులు కూడా ఉన్నారన్నది ఏడు నెలల పాలన చెబుతున్నది)
జిఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ సలహాలన్నింటినీ కలగలిపి సిఫార్సులు చేయాలంటూ పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో ఉన్నతాధికార కమిటీ అంటూ మరొకటి వేశారు. వీరేమి చేయబోతున్నారనేందుకు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. జిఎన్‌రావు రాష్ట్రాన్ని నాలుగు అభివృద్ధి మండలాలుగా చేయాలంటే, బోస్టన్‌ ఆరు అని చెప్పింది. పదహారు మంది కమిటీ రెండింటినీ కలిపి పది అని చెప్పవచ్చు లేదా పదిని రెండుగా చేసి ఐదు అనవచ్చు, ఇలాంటి కమిటీల నుంచి అంతిమంగా ముఖ్యమంత్రులు ఏది చెబితే అదే బయటకు వస్తుందన్నది గత అనుభవం. మీరేది చెబితే అదే కరెక్టు అనే మంత్రులు, అధికారులే తాజా కమిటీలో కూడా ఉన్నారు.
మూడు రాజధానుల గురించి వైసిపి నేతలు తాము తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకించాలి అని కొందరు, రాజ్యాంగంలో ఒక్క చోటే రాజధాని ఉండాలని ఉందా అని మరి కొందరు, మూడు చోట్ల అభివృద్ధి అవసరం లేదా అంటూ మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అంటే సమాధానం లేదు. అభివృద్ది అవసరం లేదని ఎవరు అన్నారు, మూడు రాజధానులతో అభివృద్ది ఎలా చేస్తారో చెప్పమంటే కంటి చూపులే తప్ప నోటమాటలు లేవు, తరువాత వెల్లడిస్తామంటారు.
మూడు చోట్ల కాదు కొత్త రాజధాని ఎక్కడ అనే చర్చ సమయంలో ముప్ఫయి చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతి పాదించి ఆమోదం పొందితే ఎవరికీ అభ్యంతరం లేదు.జగన్‌ మోహనరెడ్డి నాడు అసెంబ్లీలో భూ సేకరణ గురించి భిన్నాభి ప్రాయం వ్యక్తం చేయటం తప్ప అమరావతిని రాజధానిగా అంగీకరించారు. ముప్పయివేల ఎకరాలు కావాలన్నారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల గురించిన ప్రస్తావన అప్పుడే కాదు, తరువాత గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ రాజధాని గురించి లేదా బహుళరాజధానుల గురించి చర్చ లేదు, కోరినవారూ లేరు. అధికారానికి వచ్చిన తరువాతే వైసిపి నాయకత్వంలో పునరాలోచన, కొత్త ఆలోచనలు పుట్టుకు వచ్చాయి. మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు, పదమూడు జిల్లాల్లో లేదా లోక్‌సభ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన అంటున్నారు కనుక 25 చోట్ల కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ తేలాల్సింది ఎవడబ్బ సొమ్మని రామ చంద్రా అని భక్త రామదాసు అడిగినట్లుగా ఎవరి జేబుల్లో సొమ్ముతో అన్ని రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే అసలు సమస్య.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రం. అది మూడు రాష్ట్రాల్లో నాలుగు ముక్కలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో యానామ్‌, తమిళనాడులో పుదుచ్చేరి, కరైకాల్‌, కేరళలో మాహే ప్రాంతాలు ఉన్నాయి. దానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తుంది. రాజధానులతోనే అభివృద్ది జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ముక్కను ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ ఎందుకు కోరటం లేదు. దక్షిణాదిన సుప్రీం కోర్టు బెంచ్‌ పెట్టాలన్న డిమాండును వైసిపి ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలిసిందే. దాని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. దానికి ముడిఇనుప గనులను కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర పట్టించుకోవటం లేదు. అది చేయకపోగా దాన్ని విదేశీ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకుంటే దాని గురించి మాట్లాడని జగన్‌ సర్కార్‌ విశాఖ అభివృద్ది గురించి కాకమ్మ కబుర్లు చెబుతోంది.
చంద్రబాబు నాయుడు అమరావతి గురించి అతిగా మాట్లాడి, ప్రచారం చేసి దాన్నొక రియలెస్టేట్‌ ప్రాజెక్టుగా మార్చేందుకు చూశారు. ఒక్క రైతాంగాన్నే కాదు, అనేక మందిలో భ్రమలు కల్పించి చేతులు కాల్చుకొనేట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రచారాన్నే అస్త్రంగా చేసుకొని వైసిపి రాజధాని రాజకీయానికి తెరలేపింది. గందరగోళాన్ని సృష్టించింది. అక్కడే లక్ష కోట్లు తగలేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేమిటని ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొడుతోంది. ఎవరు కట్టమన్నారు, తాత్కాలిక ఏర్పాట్లలోనే పాలన సాగించవచ్చు, అసంపూర్ణంగా ఉన్నవాటిని పూర్తి చేసి మిగతా అవసరాలను తరువాత చూసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా పాలకులుగా కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా ప్రజాకర్షక పధకాలతో జనాన్ని ఆవైపు మళ్లించాయి తప్ప అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాయి. ప్రభుత్వాలు ప్రయివేటు వారికి వేల కోట్ల రూపాయలు లేదా వేల ఎకరాలను రాయితీలు, మరొక రూపంలో అప్పనంగా కట్టబెట్టటం తప్ప తాముగా పరిశ్రమలను నెలకొల్పాలనే విధానాల నుంచి వైదొలిగాయి.
వైసిపి నేతలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతరులు పసలేని వాదనలను ముందుకు తెస్తున్నారు. హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతం అయిన అనుభవాన్ని తీసుకోనవసరం లేదా అని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. వారే మరోవైపు హైదరాబాదు తరువాత కాస్త అభివృద్ది చెందిన విశాఖలో పెట్టాలని అంటారు. నూతన ఆర్ధిక విధానాలకు తెరలేపిన తరువాత హైదరాబాదులో గానీ మరొక రాష్ట్ర రాజధాని లేదా ఇతర పట్టణాలలో గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదు. హైదరాబాదు, విశాఖ వంటి చోట్ల గతంలో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి గనుకనే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమలు ప్రయివేటు రంగంలో అభివృద్ధి చెందాయి. అందువలన ఉపాధి అవకా శాలు, రియలెస్టేట్‌ పెరిగింది. ఇలాంటి నగరాలలో మూతపడిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి, అవి పునరుద్దరణకు నోచుకోలేదు.
ఇక ప్రయివేటు పెట్టుబడుల విషయానికి వస్తే ప్రధాని, ముఖ్యమంత్రుల లావు, ఎత్తూ చూసి రావని తేలిపోయింది.గుజరాత్‌ మోడల్‌ అని, మేకిన్‌ ఇండియా పేరుతో హడావుడి చేసిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆర్ధికాభివృద్ది ఎనిమిది నుంచి నాలుగున్నర లేదా ఐదు శాతానికి పడిపోయింది. కొందరు ఆర్ధికవేత్తల అంచనా ప్రకారం రెండున్నర శాతమే వాస్తవమైనది. ఆంధ్రప్రదే శ్‌లో చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్‌ కూడా పెద్ద హడావుడి చేసి పెట్టుబడుల గురించి లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు ఊదరగొట్టారు. ఆచరణలో అంతసీన్‌ లేదు కనుక ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు మూడు ప్రాంతాలలో రాజధానులతో అభివృద్ధి అంటున్నది వైసిపి నాయకత్వం.
జగన్‌ నాయకత్వంలోని వైసిపి వద్ద నవరత్నాలనే సంక్షేమ పధకాలలో జనానికి ఎంత అందచేస్తారనే నిర్దిష్టత తప్ప ఆర్ధిక వృద్ధికి అసలు ప్రతిపాదనలు లేదా అజెండాయే లేదు. వచ్చే రోజుల్లో నవరత్నాలకు ఎంత మేరకు కోతపెడతారనే ప్రశ్నలకు ఎలాగూ కొద్ది వారాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ది అంటే కొన్ని కార్యాలయాలను నెలకొల్పితే ఆక్కడ రియలేస్టేట్‌ ధరలు పెరగటం అనేనా లేక ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను పెడతారా ? సందేహాలు తీర్చేవారు లేరు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ప్రయివేటు రంగంలోని బడా పరిశ్రమలెన్ని,కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం ఉన్నంత మాత్రాన ప్రయివేటు పెట్టుబడులు ఎలా వస్తాయి? జిఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ చెప్పిన ప్రాంతాల వారీ కమిషనరేట్స్‌తో అభివృద్ది జరగదని కర్ణాటక అనుభవం చెబుతోంది. నయా వుదారవాద విధానాల కాలంలో పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా, విస్తరణకు అవకా శాలుంటే అక్కడికే వెళతాయి తప్ప వెనుక బడిన ప్రాంతాలకు రాలేదన్నది కర్ణాకటలో తేలిపోయింది. అలాంటి లాభ అవకా శాలుంటే పెట్టుబడులు ఎవరూ ప్రయత్నించకుండానే వస్తాయి.

Image result for jagan three capitals
రాజకీయంగా చూస్తే కేంద్రంలో మోడీ సర్కార్‌ తెస్తున్న అన్ని ప్రతిపాదనలనూ బలపరచటంలో తెలుగుదేశం-వైసిపి రెండూ పోటీ పడుతున్నాయి. ఎక్కడ కడితేనేం మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి నేతలను బిజెపి ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. అలాంటపుడు మూడు రాజధానులు, మూడు హైకోర్టులంటూ, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలంటూ వైసిపి ముందుకు తెచ్చిన అజెండాను ఆమోదించి అమలు జరిపితే వస్తే గిస్తే ఆ ఖ్యాతి జగన్‌కు దక్కుతుంది తప్ప బిజెపికి వచ్చేది ఏముంటుంది. సాంకేతికంగా రాజధానిని మార్చకుండా కార్యనిర్వాహక రాజధాని అనో మరొక పేరో తగిలించి కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలిస్తే, అసెంబ్లీ సమావేశాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కానీ హైకోర్టును తరలించటం, మరో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేయటం జరిగేనా ? అది చేయకుండా జగన్‌ విశాఖలో కాపురం పెట్టి నెగ్గుకు రాగలరా ? రాజధానిని మూడు చోట్ల పెట్టిన తరువాత రిజర్వుబ్యాంకు వంటివి లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలు ఎక్కడ పెట్టాలనే విషయంలో ప్రతిదానికీ పంచాయతీలు తలెత్తటం, ఆలస్యం కావటం లేదా వేరేచోట్లకు తరలి పోవటం అనివార్యం. కృష్ణా జలాల బోర్డును హైదరాబాదు నుంచి విజయవాడకు తరలింపు అంశాన్ని రాజధాని ఎక్కడో తేలిన తరువాతే నిర్ణయించాలని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో ఐటిని తానే అభివృద్ది చేసినట్లు చంద్రబాబు స్వంత డబ్బా కొట్టుకుంటారు. ఐటి రాజధానిగా పరిగణించే బెంగళూరు, చెన్నరు, పూనా వంటివి చంద్రబాబు వంటి వారు లేకుండానే అభివృద్ధి చెందాయా లేదా ? చంద్రబాబు పాలన ముగిసిన తరువాత హైదరాబాదులో కంపెనీల విస్తరణ పెరిగింది తప్ప ఆయన లేరనే కారణంగా ఆగిపోలేదు కదా ? చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపి అక్కడి జనాన్ని హతాశులను చేశారు. రాజధాని ప్రాంతం పరిసరాల్లో ఒక్క సీటులో కూడా నెగ్గలేక ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు జగన్‌మోహనరెడ్డి ఆ అనుభవాన్ని విస్మరించి మూడు రాజధానులు-అభివృద్ధి పేరుతో రాజకీయానికి తెరలేపి మరో రెండు భ్రమరావతులకు తెరలేపారు.కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల సమయంలోనే తెలుస్తందన్నది ఒక సామెత, ప్రస్తుతం జగన్‌మోహనరెడ్డి పాలన గురించి మద్దతుదారులతో సహా అనేక మందిలో అదే అనుమానం ప్రారంభమైంది. తెలుగుదేశం అనుభవం వచ్చే ఎన్నికల్లో వైసిపికి పునరావృతం అవుతుందా ? లేక అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలతో జగన్‌ చరిత్రను తిరగరాస్తారా ? తానే సృష్టించిన గందరగోళాన్ని తానే ఏదో ఒక పేరుతో సరి చేసుకొని పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మూడు రాజధానులతో అభివృద్ది-మూడు ఎండమావులు !

19 Thursday Dec 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, ANDHRA PRADESH Capital Politics, Andhrapradesh new Capitol

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 925 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: