• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ABVP

జెఎన్‌యు మూత సలహా ఇతర ‘వర్సిటీలు, సంఘపరివార్‌కూ వర్తింప చేస్తారా ?

15 Wednesday Jan 2020

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Closer of JNU, India R&D expenditure, JNU, JNU ROW, Patents, RSS

Image result for jnu,

ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యు గురించి వివరాలు తెలుసుకుందాం. రఘునాథ రామారావు గారి ఆంగ్ల లేఖకు తెలుగు అనువాదం మరి కొంత నా సేకరణ. మదన్‌ గుప్త పేరుతో ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దీన్ని చదివి కొంత మంది దానిలోని అంశాలు నిజమే కదా అని నిజంగానే ఆందోళన పడుతున్నారు. కొందరు దీన్ని పూర్వపక్షం చేస్తూ వాస్తవాలు బయటపెడితే బాగుండు అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ గురించి తెలిసిన వారికి కాషాయ తాలిబాన్లు విసిరిన మరొక బాణం ఇది అని ఇట్టే పసిగట్టగలరు. దీనిలో జెఎన్‌యు గురించి కొత్తగా తెలిపిందేమీ లేదు, చదివిన వారు తెలుసుకొనేదీ ఏమీ లేదు.
ముందుగా అడగాల్సింది అసలు ఆ రామారావు ఎవరు, ఆయనెందుకు ఆంగ్లంలో లేఖ రాశారు, ఆపెద్ద మనిషి కవిత్వానికి మదన్‌ గుప్త తనపైత్యాన్ని జోడించటమెందుకు ? ఈ పోస్టు ఎవరిపేరుతో అయితే ఉందో వారి విశ్వసనీయత, అసలు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారో కల్పిత వ్యక్తులో తెలియదు. వారు పేర్కొన్న అంశాలకు ఆధారాలేమిటో అసలే తెలియదు కనుక దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జెఎన్‌యు మీద దాడిలో ఇదో కొత్త కోణం. దీపికా పదుకోన్‌ ఆ విశ ్వవిద్యాలయాన్ని సందర్శించి ముసుగు గూండాల దాడిలో గాయపడిన వారికి మద్దతు తెలిపిన అంశం గురించి ‘కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక ‘ అనే శీర్షికతో రాసిన నా విశ్లేషణపై కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరెగిరి పడ్డారు. జెఎన్‌యు కమ్యూనిస్టుల కిస్‌ కల్చర్‌ (ముద్దుల సంస్కృతి) కేంద్రం అని నోరుపారవేసుకున్నారు. ఆ కేంద్రంలోనే బిజెపి నేతలు నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ వంటి వారు విద్యాభ్యాసం చేశారు. వారెంత మందికి ముద్దులిచ్చారు, ఎంత మందినుంచి ముద్దులు తీసుకొని ఉంటారో చెప్పగలరా అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఎబివిపికి చెందిన ఆమ్మాయిలు, అబ్బాయిలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి సంస్కృతి అక్కడ ఉందనుకుంటే దానిలో కొనసాగటం ఎందుకు, చదువు మానుకొని బయటకు రావచ్చు, వేద పాఠశాలలు, సంస్ధలలో చేరవచ్చు !
అందువలన ఎవరికిి తెలిసిన భాషలో చెబితేనే వారికి సులభంగా అర్ధం అవుతాయి. ఈ పోస్టుకూడా ఇంచు మించు అలాంటిదే కనుక కొన్ని అంశాలను చూద్దాం. మామిడి చెట్టు నాటితే మామిడి కాయలే కాస్తాయి, జాంకాయలు ఎందుకు కాయటం లేదనే కుతర్కం, బుర్రతక్కువ జనాలకు ఏం చెప్పాలి. జెఎన్‌యు సాంకేతిక విద్యా సంస్ధ కాదు. ప్రధానంగా సామాజికాంశాలతో పాటు సైన్సు కోర్సులు కూడా బోధించే సాధారణ విశ్వవిద్యాలయం. అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. డాక్టరేట్స్‌ను ఇస్తున్నారు. ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక అంశాల అధ్యయనం, పరిశోధనలకు ఐఐటిలు, ఇతర పరిశోధనా సంస్దలు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలను, వీటినీ రెండింటినీ ఒకే గాటన కట్టటం వక్రీకరణ.
ఈ పోస్టులో లాభనష్టాల గురించి చర్చ చేశారు. విద్యా సంస్ధలు చేసేది వాణిజ్యం కాదు కనుక లాభనష్టాల ప్రమాణాలు వర్తింప చేయటం అనుచితం. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మాదిరి బోధన, పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. కనుక వాటితో పోల్చి చూపితే ఆ పోస్టుపెట్టిన వారి బండారం ఏమిటో తెలిసి ఉండేది. ఆ చిత్తశుద్ది పోస్టులో లేదు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలకు ఆధారాలేమిటో తెలియదు. జెఎన్‌యులో చదివిన వారు ఎందరు ఉపాధి పొందారో తెలియదు అన్నారు. ఆ పరిశోధకుడు, పరిశీలకుడు కలసి ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు పొందిన వారు ఎందరు ఉపాధి పొందారో ఏమి చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా ? లేదా నరేంద్రమోడీ గారు సెలవిచ్చినట్లు పకోడీ బండ్లు ఎందరు పెట్టారో తెలుపగలరా ?

Image result for jnu attack
చెడిపోయిన ప్రజాస్వామ్యానికి జెఎన్‌యు ఓ గొప్ప ఉదాహరణ అట. సరే అంగీకరిద్దాం, బాగున్న ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా ఉన్న విశ్వవిద్యాలయం పేరేమిటో చెప్పి ఉంటే వివేక వంతులు పోల్చి చూసుకొనే వారు. ఇప్పటికైనా చెప్పండి, సవాలు కాదు సవినయంగా అడుగుతున్నాం. అక్కడి విద్యార్ధులకు ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి కొత్త సమస్యలు సృష్టించటంపైన, మైండు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అడ్డమైన భావజాలంతో నింపేస్తారట, అన్నీ ఉచితంగా అందుతూ ఉంటే ముసలి వారైనా అక్కడే వారి జీవితాన్ని గడిపేస్తారుట. సాంఘిక సంస్కరణల ఊసులేదట, ఇలా సాగిన, రాసిన చెత్తకంతకూ సమాధానం చెప్పటం వాణిజ్య భాషలో దండగ, కనుక ఆపని చేయటం లేదు. ఇలాంటి పోస్టులు ఏ మాత్రం విమర్శనాత్మక వైఖరిలేని వారి బుర్రలను ఖరాబు చేస్తాయి. వాటి లక్ష్యమే అది. రెండు రెళ్లు నాలుగే ఎందుకు కావాలి, మూడు ఎందుకు కాకూడదు అని ఎవరైనా వాదించే వారిని సంతృప్తి పరచ చూడటం వృధా ప్రయాస. ఒక సినిమాలో నువ్వు ఎవరు అనే ప్రశ్నతో ఉన్న దృశ్యాలను వారికి చూపటం తప్ప మరొక మార్గం లేదు. దేశంలో పేటెంట్‌లు, పరిశోధనలు తక్కువగా ఉండటానికి కారణం జెఎన్‌యు అన్నట్లుగా చిత్రించిన పెద్దలు ఈ దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, వాటితో సమానమైన సంస్ధలు, ఎన్ని లక్షల మంది వాటిలో చదువుతూ, పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకుంటే జెఎన్‌యులోని ఎనిమిదివేల సంఖ్య ఎంత తక్కువో తెలుస్తుంది. జెఎన్‌యును మూసివేయాలని వాదించేందుకు తెగ ఆయాసపడిపోవటం గాకుండా అసలు మొత్తంగా పరిశోధనలు, పేటెంట్ల నమోదులో దేశం ఎందుకు వెనుకబడి పోయిందో, దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పి ఉంటే వారి శ్రమ ఫలించేది.

Image result for jnu attack
పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించే వాతావరణం, అందుకు అవసరమైన పెట్టుబడి వంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఆరునెలల క్రితం చేసిన సిఫార్సులో దేశంలో పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలకు 2022నాటికి జిడిపిలో కనీసం రెండు శాతం ఖర్చు చేయాలని కోరింది. గత రెండు ద శాబ్దాలుగా చేస్తున్న ఖర్చు 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉంది. అలాంటిది మరో రెండు సంవత్సరాల్లో రెండుశాతానికి పెరుగుతుందని ఆశించే పరిస్ధితి ప్రస్తుతం ఉందా.


ప్రపంచ నవకల్పన సూచికలో మన దేశ స్ధానం గురించి చెప్పుకోబోయే ముందు పరిశోధనకు వివిధ దేశాలు జిడిపిలో చేస్తున్న ఖర్చును చూస్తే ఇజ్రాయెల్‌ 4.3, దక్షిణ కొరియా 4.2, జపాన్‌ 3.2, అమెరికా 2.8, చైనా 2.1 శాతం ఖర్చు (2017) చేస్తున్నాయి. ఈ మధ్య మన కాషాయ పరివారం ప్రతిదానికి పాకిస్ధాన్‌తో పోల్చుకోవటాన్ని ఎక్కువ చేసింది. దాని ఖర్చు 0.5శాతంగా ఉంది కనుక, మన దేశాన్ని మోడీ సర్కార్‌ దాని కంటే కొన్ని మెట్లు ఎగువ నిలిపిందని గొప్పలు చెప్పుకోవచ్చు.
దేశంలో నేడున్న పరిస్ధితి ఏమిటి? ఆపరేషన్లకు ఎలాంటి విఘ్నం కలగ కూడదని వైద్యులు గణపతికి మొక్కుతారు. పోలేరమ్మలకు సద్ది నైవేద్యాలు పెడతారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుడిని, సుళ్లూరు పేట గ్రామ దేవతలను వేడుకుంటారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు తామరతంపరగా పెరిగిపోతున్నారు. లక్షల సంవత్సరాల నాడే మన పూర్వీకులు ఎలాంటి ఇంధనం లేకుండా పలు ఖండాలకు ఎటు కావాలంటే అటు తిరిగే, ఎందరు ఎక్కినా మరొకరికి సీటు దొరిక విమానాలు నడిపారని, కృత్రిమ గర్భధారణ పద్దతుల్లో నూరుగురు కౌరవులను పుట్టించారని, ప్లాస్టిక్‌ సర్జరీ తెలిసిన కారణంగానే వినాయకుడికి ఏనుగు తలను అతికించారని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయని, వాటి మీద పరిశోధనలు చేయండని చెప్పేందుకు ప్రధాని నుంచి కింది స్ధాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వరకు పోటీ పడుతుండటాన్ని చూస్తున్నాము. మూఢనమ్మకాలతో రోజు ప్రారంభమై ముగుస్తున్న సమాజంలో , నరికిన వినాయకుడి తలనే తిరిగి అతికించకుండా ఏనుగు తలను ఎందుకు అతికించారు అనే ప్రశ్ననే అడగకుండా నీకు తెలియదులో నోరు మూసుకో చెప్పింది విను అని మొగ్గలోనే చిదిమేస్తున్నకుటుంబవాతావరణంలో, రాయి రప్పలు, చెట్లు పుట్టలకు మొక్కితే పోయేదేముందిలే అనే తరాలు పెరుగుతున్న తరుణంలో లక్షలు ఎలా సంపాదించాలి, అమెరికా,ఆస్ట్రేలియా ఎలా వెళ్లాలి అనే యావతప్ప శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధనల పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది, పరిశోధనల్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి, అయినా ముందుకు పోవాలంటే ఆసక్తి కలిగిన వారికి ఆర్ధిక భరోసా కలిగించకపోతే, సాధించిన విజయాలకు ప్రోత్సాహం లేకపోతే యువతరానికి ఆ రంగంలో కొనసాగాలనే ఆసక్తి ఎలా ఉంటుంది ?
నవకల్పనల విషయంలో మన దేశ స్ధానం ఎక్కడ అన్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్రమోడీ కొత్త విషయాలు చెబుతున్నారు. ఐదేండ్ల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అని ఊదరగొట్టారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. అంటే వాటన్నింటినీ సాధించారని మనం అనుకోవాలి. రెండో సారి ఎన్నికైన తరువాత 70ఏండ్లలో సాధించలేని వాటిని అన్నింటినీ సాధించామని చెప్పుకుంటున్నారు.మారు మాట్లాడకుండా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని భజన చేయాలి. లేకపోతే దే శద్రోహులం అవుతాం, రాబోయే ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలలో మన పేర్లను పక్కన పెట్టి జాతీయతను నిరూపించుకొనే ఆధారాలు సమర్పించమంటారు.
2014లో ప్రపంచ నవకల్పనల సూచికలో 143 దేశాల జాబితాలో మన దేశం 33.7శాతం మార్కులతో 76వ స్ధానంలో ఉంది. మన ఒక పొరుగుదేశం మోడీ అండ్‌కో నిత్యం కలవరించే పాకిస్ధాన్‌ 24 మార్కులతో 134వ స్ధానంలో, చైనా 46.57 శాతం మార్కులతో 29వ స్ధానంలో ఉంది.( ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌కు వచ్చిన మార్కులు 64.78శాతం). ఐదేండ్ల తరువాత 129 దేశాలలో మోడీ పాలనలో మన మార్కులు 36.58శాతంతో 52 స్ధానాన్ని పొందాము. ఇదే సమయంలో పాకిస్ధాన్‌ 31.62 మార్కులతో 113 స్ధానాన్ని, చైనా 54.82 మార్కులతో 14వ స్ధానానికి చేరింది.ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌ మార్కులు 67.24. దీన్ని బట్టి ఎక్కడ ఎలాంటి ప్రోత్సాహం, పోటీ ఉందో ఎవరికి వారే అర్ధం చేసుకోవచ్చు. అన్ని విజయాలు సాధించిన నరేంద్రమోడీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు ? చైనా ఐదేండ్లలో తన మార్కులను 8.25, పాకిస్ధాన్‌ 7.62 పెంచుకోగా మనం 2.88కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాం ?
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేయకుండా ముందుకు పోజాలదు. మన ప్రధాని దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా మార్చుతామని చెప్పటం తప్ప అందుకు అవసరమైన కనీస చర్యలు కూడా చేపట్టలేదు. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు గుండ్రాయిలా తయారు కావాలంటే కుదురుతుందా? పరిశోధనా ఖర్చును ఎందుకు పెంచలేదో ఎవరైనా చెప్పగలరా ? గతేడాది అక్టోబరు ఆరవ తేదీన ఎకనమిక్స్‌ టైమ్స్‌లో జి సీతారామన్‌ రాసిన ఒక విశ్లేషణ వచ్చింది. దాని సారాంశం, వివరాలు ఇలా ఉన్నాయి. ” ప్రపంచ మేథోసంపత్తి సంస్ధ వివరాల మేరకు 2017లో కొన్ని దేశాలలో దాఖలైన పేటెంట్ల దరఖాస్తులు, మంజూరైన పేటెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం         దరఖాస్తులు         పేటెంట్ల మంజూరు
చైనా         13,81,594             4,20,144
అమెరికా      6.06,956              3,18,481
జపాన్‌         3,18,481              1,99,577
ఐరోపా         1,66,585              1.05,645
భారత్‌            46,582                12,387
ప్రతి పదిలక్షల మందికి జపాన్‌లో 2,053, అమెరికాలో 904, చైనాలో 899, జర్మనీలో 887 మంది పేటెంట్లకు దరఖాస్తు చేయగా మన దేశంలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. పరిశోధకుల విషయానికి వస్తే యునెస్కో సమాచారం 2015 ప్రకారం ప్రతి పదిలక్షల మందికి గాను జపాన్‌లో 5,210, అమెరికాలో 4,313,ఐరోపాయూనియన్‌లో 3,749, చైనాలో 1,206 మంది ఉండగా మన దేశంలో 216 మాత్రమే ఉన్నారు.
దేశంలోని ఐఐటీల్లో 2018-19లో బొంబాయి ఐఐటి 98 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. మిగతా అన్ని ఐఐటిలు దాఖలు చేసిన వాటిలో ఇవి ఆరోవంతు. ఇదే ఏడాది బొంబాయి ఐఐటి పరిశోధన ఖర్చు 335 కోట్ల రూపాయలు కాగా దానిలో 80శాతం ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం ప్రయివేటు రంగం నుంచి వచ్చింది.”

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌ దేశాల్లో గణనీయ మొత్తాలను ప్రయివేటు కార్పొరేట్లు కూడా ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో పరిశోధనల ఖర్చు పేరుతో రాయితీలు పొందటం తప్ప వాస్తవ ఖర్చు పరిమితం. ఇక వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అపార సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పేవారు వాటిని వెలికి తీసి పేటెంట్‌ దరఖాస్తులను ఎందుకు దాఖలు చేయలేదు ? ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? వారిని అడ్డుకున్నదెవరు ? చైనా, పాకిస్ధాన్ల గురించి సొల్లు కబుర్లతో కాషాయ దళాలు పోసుకోలు కబుర్లు చెప్పటాన్ని పక్కన పెట్టి వేద విజ్ఞానాన్ని ఎందుకు వెలికి తీయించలేకపోయారు? జెఎన్‌యు గురించి ప్రశ్నిస్తున్నవారు సంఘపరివార్‌ నడిపే సరస్వతి శిశుమందిర్‌లు, ఇతర విద్యా సంస్ధలలో శిక్షణ పొందిన వారిలో ఎందరు పేటెంట్‌లు పొందారో, పరిశోధనలు చేసి ఏమి సాధించారో చెబుతారా ?

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
విద్యా సంస్ధలలో లెక్చరర్లు, విద్యార్ధులతో కూడి దేశంలో అతి పెద్ద విద్యార్ధి సంఘం అని చెప్పుకొనే ఎబివిపి ఎప్పటి నుంచో దేశభక్తిని నూరిపోస్తున్నట్లు చెప్పుకుంటుంది. అలాంటి సంస్ధ తన సభ్యులతో ముసుగులు వేసి దాడులు చేయించటాలు, విద్యా సంస్ధల్లో గణేష్‌ పూజలు, తిరోగామి భావాలను ప్రోత్సహించటం వంటి వాటిని పక్కనపెట్టి పరిశోధనల వంటి అంశాలపై తన సభ్యులను పురికొల్పి ఉంటే ఈ పాటికి చైనాతో సహా ఎన్నడో ఇతర అన్ని దేశాలను అధిగమించే వారం కదా ? ఎన్నో పేటెంట్‌లు వచ్చి ఉండేవి కదా ? నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధికంగా ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు, ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కల నెరవేరేది. పరిశోధనలు లేవు, పేటెంట్లను సాధించని కారణంగా జెఎన్‌యును మూసివేయాలని సలహా ఇస్తున్న పెద్దలు ఎబివిపికి లేదా దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు , ఇతర యూనివర్సిటీల గురించి ఏమి సలహా యిస్తారు ? విద్యా సంస్దలను, సంఘపరివార్‌ సంస్ధలను మూసుకొమ్మంటారా, లేకపోతే ఇప్పటి మాదిరే పైవిధంగా ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తారా ? పనికి రానివి, ప్రయోజనం లేనివి ప్రభుత్వ సంస్దలైతేనేం, ప్రయివేటువైతేనేమి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అబ్బ ! అపర ‘దేశ భక్తుల’కు దిమ్మ తిరిగే భలే తీర్పు చెప్పారు కదా !!

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

   రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్‌ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?

     మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్‌ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్‌ నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.

    భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్‌ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్‌ ఛాన్సలర్‌ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్‌ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్‌ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.

    ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్‌ షైకత్‌ ఘోష్‌ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్‌ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్‌ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.

    ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్‌ స్షెషల్‌ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.

      చివరగా ఒక్క మాట ! ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్‌  మాటలివి.

     అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్‌ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్‌ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్‌ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్‌ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !

    నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లాయర్లా ! ఫాసిస్టు శక్తులా !!

18 Thursday Feb 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, JNU, JNU ROW, RSS

 

ఎం కోటేశ్వరరావు

      జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ? అని నేను రాసిన అంశంపై వచ్చిన విమర్శల సారాంశం ఏమంటే ఒకటి పూర్తిగా ‘ఎడమవైపు’నుంచే రాశారు, మావోయిజాన్ని విశ్వసించే డిఎస్‌యు అనే విద్యార్ధి సంస్ధ కాశ్మీరీ వేర్పాటు వాదులకు సానుభూతిగా సభ ఏర్పాటు చేయటం నిజమే కదా , అక్కడ జాతి వ్యతిరేక నినాదాలు చేశారు కదా అంటే దానర్ధం వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అలాంటపుడు వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటి అన్నది ఒక సమర్ధన. ఇవే కాదు, ఇంకా ఎవరైనా చేసే విమర్శలకు ఆహ్వానం. మన దేశంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తర్క శాస్త్రాన్ని (వాద విద్య) అభివృద్ధి చేసిన వారిలో గౌతముడు ఒకరు.ఈ గౌతముడు పురాణాలలో కనిపించే సప్త రుషులలో ఒకరు గానీ, గౌతమ బుద్దుడు గానీ కాదని గమనించాలి. వేదాలు, వుపనిషత్తులు మొదలైన వాటిని చార్వాకులు, లోకాయతుల వంటి ఆది భౌతికవాదులు ప్రశ్నించటం ప్రారంభించినపుడు వాటికి సమర్ధనగా రూపొందించినదే తర్కశాస్త్రమని ఒక అభిప్రాయం. దానితో ఎవరైనా విబేధించవచ్చు అది వేరే విషయం. శంకరాచార్యుడి చివరి దినాలలో తమకేదైనా వుపదేశం చెయ్యమని శిష్యులు అడిగినపుడు చెప్పిన అనేక అంశాలలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి రంధ్రాన్వేషణ చేయకుండా తర్కబద్దమైన సమాధానం చెప్పాలని వుపదేశించినట్లుగా రాశారు. అందువలన అటువంటి చర్చలు ఎన్నయినా జరపవచ్చు. ఇందుకు ‘కుడి,ఎడమ’లు ఎవరికీ మినహాయింపు కాదు. ఇది మా విశ్వాసం, తర్కానికి, న్యాయశాస్త్రానికి అతీతం అందువలన దీనిపై తర్కించేదేమీ లేదు, మేము చెప్పింది వినాలి తప్ప మరొకటి కాదు, మరీ కాదంటే తంతాం, చంపుతాం అంటే కుదురుతుందా ? సహించాలా ?

     దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ను బుధవారం నాడు పాటియాల కోర్టుకు హాజరు పరిచే సమయంలో అతనిపై లాయర్ల ముసుగులో వున్న వ్యక్తులు గూండాల మాదిరి దాడి చేయటం లోకమంతా చూసింది. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు అది తోపులాటలా కనిపించింది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయటం అవసరం. వారు లాయర్లా లేక నల్లకోట్లు వేసుకొని వచ్చిన సంఘపరివార్‌ కార్యకర్తలా లేక లాయర్లలో వున్న దేశభక్తులైన సంఘపరివార్‌ కార్యకర్తలా అన్నది దాచినా దాగదు. వారు ప్రవర్తించిన తీరు గురించి ప్రత్యక్షంగా చూసిన మరొక లాయర్‌ చెప్పిన కధనాన్ని ఫిబ్రవరి 18వ తేదీ పత్రికలో హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. అదేమీ కమ్యూనిస్టుల లేదా అభ్యుదయ వాదుల పత్రిక కాదు. ఆ లాయర్‌ పేరు రాస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని పేరు రాయలేదు. దీన్ని ఎవరైనా కట్టుకధ అంటే చేసేదేమీ లేదు. ఫాసిస్టుశక్తులు, ఫాసిజం లక్షణాలు తప్ప ఇవి మరొకటి కాదు.

    ‘ బుధవారం నాడు వృత్తి చేస్తున్న ఒక లాయర్‌గా నా ప్రస్తానంలో అత్యంత ఆందోళనకరమైన వుదంతాన్ని చూశాను.అది సాయంత్రం ఒంటి గంట సమయం. పాటియాలా కోర్టుల ప్రాంగణంలో కన్నయ్య కుమార్‌ను చూసేందుకు రెండవ నంబరు గేటు దగ్గర వందలాది మంది లాయర్లు గుమికూడారు.పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోర్టు లోపలికి అనుమతించనున్నట్లు ఒక పోలీసు ప్రకటన చేశాడు.అప్పుడు అంతా ప్రారంభమైంది. అందరు జర్నలిస్టులు మరియు జెఎన్‌యు విద్యార్ధులను బయటకు పంపాలని లాయర్లు డిమాండ్‌ చేయటానికి ఆ ప్రకటన ఒక సంకేతమైంది. కొంతమంది లాయర్ల బృందం బాల్కనీలో గుమికూడి వుంది. ఎవరైనా వీడియో తీస్తున్నారా అని వారు చూస్తున్నారు. ఆ తరువాత దేశభక్తి చర్యగా బాల్కనీ నుంచి ఒక లాయర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చాడు. అతని పక్కనే వున్న మరొక లాయర్‌ కన్నయ్యను తీసుకురానివ్వండి వాడిని సజీవ దహనం చేస్తాము అని అరిచాడు. పోలీసుల పక్కనే వున్న కొంత మంది లాయర్లు దానితో వుత్సాహపడ్డారు. వారిలోని ఒక లాయర్‌ సెల్‌ఫోన్‌ తీసి నువ్వు కూడా రా ఒకరిద్దరు జెఎన్‌యు విద్యార్ధులను బాదవచ్చు అని చెప్పాడు.

      అది రెండున్నర గంటల సమయం. కన్నయ్య కుమార్‌ కోర్టు వద్దకు చేరాడు. అతనిని మరొక మార్గం ద్వారా లోపలికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసిన లాయర్లు వెంటనే ఆ గేటువైపు వెళ్లి కన్నయ్యపై దాడి చేశారు. ఆ తరువాత గర్వంతో తిరిగి వస్తున్న లాయర్లను నేను చూశాను. వారిలో ఒకరు నేను రెండుసార్లు తన్నాను, ముఖంపై కొట్టాను అని చెప్పాడు. మా నల్లకోట్లు మేము ఒక విద్యావంతులైన తరగతికి చెందిన వారమని వెల్లడించేందుకు వుద్దేశించినవి, కానీ కొంత మంది లాయర్లు బార్‌ ప్రతిష్టకు మచ్చతెచ్చారు.’ అని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కావాలంటే అలాంటి వారు నల్ల కోట్లు తీసి వేసి కాషాయ దుస్తులతోనే గూండాయిజం చేయవచ్చు. అప్పుడు సమాజమే వారి సంగతి తేల్చుకుంటుంది. అలాగాక వారు కోర్టులో కన్నయ్యకు వ్యతిరేకంగా తమ వాద విద్య పటిమను ప్రదర్శించి వుంటే దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వారు నల్లకోట్లు వేసుకొని శంకరాచార్యుడి వుపదేశాలకు విరుద్ధంగా గూండాయిజానికి పాల్పడ్డారు.ఇలాంటి ‘కుడి’ వారి గురించి ఏమని చెప్పాలి?

    మావోయిజాన్ని నమ్మే డిఎస్‌యు కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, దేశద్రోహులతో కలసి సభ జరపటాన్ని ఎలా సమర్ధిస్తారన్నది. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిజం అంటే దేశ వ్యతిరేకం కాదు. మార్క్స్‌-ఎంగెల్స్‌ రూపొందించిన దానిని మార్క్సిజం అని పిలిచారు. తరువాత దానిని రష్యాకు అనువర్తింపచేసి విప్లవాన్ని ముందుకు నడిపించిన లెనిన్‌ అనుభవాలను జోడించి తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అన్నారు. ఈ రెండింటినీ మేళవించి ఆసియాలో భిన్నమైన పరిస్ధితులున్న చైనాలో దోపిడీ వ్యవస్ధను కూలదోసేందుకు అక్కడి కమ్యూనిస్టుపార్టీ మావో నాయకత్వంలో అభివృద్ధి చేసిన విధానాన్ని మావోయిజం అన్నారు. అన్నింటినీ కలిపి మార్క్సిజం-లెనినిజం- మావోయిజాల అనుభవాలన్నింటినీ తీసుకొని ఆ తరువాత కాలంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు తమకు అనువైన విధానాలు, ఎత్తుగడలు రూపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో భారత్‌లో కొందరు కమ్యూనిస్టులు స్వతంత్ర కార్యాచరణ, ఎత్తుగడలను విస్మరించి తాము చైనా పంధాలో విప్లవాన్ని తీసుకువస్తామని చెప్పేందుకు తమది మావోయిస్టు పంధా అని చెప్పటమే కాక మావోయే మా చైర్మన్‌ అన్నంత దుందుడుకు వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఐదు దశాబ్దాల నాటి చరిత్ర. ఆ వైఖరి విఫలం కావటమే కాక మావోయిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు చీలికలు పీలికలై పోయారు. ప్రతి ఆందోళనను విప్లవ మార్గంవైపు మార్చాలనే మావో సూత్రీకరణకు తప్పుడు భాష్యం చెప్పి కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్ధించేవరకు వారు పయనించారు. దానితో సిపిఎం, సిపిఐ ఏకీభవించటం లేదు. అలాంటి వారిని సమర్ధించిన వుదంతం చరిత్రలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. మరైతే సమస్య ఎక్కడ ?

    జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకవాదం నుంచి అన్ని రకాల భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేవారు వున్న ఒక విద్యా సంస్ధ. ఎవరికి వారు తమ భావజాలాన్ని విద్యార్ధులలో ప్రచారం చేసుకోవటానికి సభలు, సమావేశాలు పెట్టుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకు అధికార యంత్రాంగం కూడా అనుమతిస్తోంది. కాశ్మీర్‌ సమస్య విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అక్కడ సమస్యను మరింత క్లిష్టతరం గావించాయన్నది తిరుగులేని వాస్తవం. దానిమీద అనేక తరగతులలో భిన్న అభిప్రాయాలు వున్నాయి. వాటిని చర్చించేందుకు వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈనెల తొమ్మిదిన డిఎస్‌యు ఒక సభను ఏర్పాటు చేసింది. అదేమీ రహస్య సమావేశం కాదు, అధికార యంత్రాంగం కూడా అనుమతించింది. తీరా సభ జరగబోయే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ అఖిల భారత విద్యార్ధి పరిషత్‌(ఎబివిపి) రంగంలోకి దిగి సభకు అనుమతివ్వటంపై అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వత్తిడికి వారు లొంగారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో అలాంటి సభలు జరపటానికి లేని అభ్యంతరం ఇప్పుడు పెడుతున్నారని ఈ విషయంలో సభ జరుపుకొనేందుకు తమకు మద్దతు తెలపాలని డిఎస్‌యు అక్కడ వున్న విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ వంటి సంఘాలను కోరారు తప్ప తమ భావజాలానికి మద్దతు ఇవ్వాలని వారు అడగలేదు. దాంతో అధికారులు సభ జరిగే ప్రాంతానికి కొంత మంది భద్రతా సిబ్బందిని పంపటంతో పాటు, మైకులు లేకుండా నిర్వహించుకోవాలని షరతు విధించారు. దానికి కూడా నిర్వాహకులు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన ఎబివిపి ఎలాగైనా సరే ఆ సభను జరగనివ్వకూడదని తన మద్దతుదార్లను సమీకరించింది.ఆ సమయంలో కన్నయ్యతో సహా అనేక విద్యార్ధి సంఘాలకు చెందిన వారూ , ఏ సంఘాలకూ చెందని వారూ, డిఎస్‌యు లేదా వారితో ఏకీభవించే ఇతర సంఘాలకు చెందిన వారు వున్నారు. వారిలో వుగ్రవాద సంస్ధలతో సంబంధం వున్న వారు కూడా వున్నారని ఆ వుదంతం తరువాత వెల్లడైంది. సభ నిర్వాహకులు, దానికి హాజరయ్యేందుకు బయటి నుంచి వచ్చిన వారిలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే తప్ప కన్నయ్య లేదా ఎఎఫ్‌ఐ ఇతర సంఘాలకు చెందిన వారు కాశ్మీర్‌ వేర్పాటు వాద లేక పాక్‌అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయలేదు. కొందరు చేసిన నినాదాలను సాకుగా తీసుకొని అక్కడి వామపక్ష విద్యార్ధి కార్యకర్తలను వేధించటానికి, విశ్వవిద్యాలయంలో వున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నది స్పష్టం.

      బయటి వ్యక్తులు లేదా అక్కడి కొంత మంది భారత వ్యతిరేక నినాదాలు చేసిన సమయంలో విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య మరికొందరు వున్న వీడియోలు తప్ప వ్యతిరేక నినాదాలు చేశారన్న సాక్ష్యాలు లేవు. తాము అ సమయంలో అక్కడ ఎందుకున్నదీ వారు స్పష్టం చెబుతున్నారు, లేరని బుకాయించటం లేదు. ఏబివిపి వత్తిడి, అభ్యంతరం పెట్టింది కనుక అధికారులు డిఎస్‌యు సభను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు డిఎస్‌యు సభను అడ్డుకున్న వారు రేపు తమ సభను మాత్రం అడ్డుకోరన్న గ్యారంటీ ఏముంది? అందువలన ఆ సంగతేదో ఇక్కడే,ఇప్పుడే తేల్చుకోవాలని ఇతర సంఘాల వారు కూడా అక్కడే వున్నారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎబిబివి ఆరోపణలను ఖండిస్తూ దేశభక్తి గురించి తాము ఎబివిపి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కన్నయ్య చేసిన వుపన్యాసంలో కూడా విమర్శ తప్ప అభ్యంతరకర భాష, పదజాలం లేదు. అందువలన ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేదా నిరసన, ఆందోళనలకు కారకులు ‘కుడి పక్షం’ తప్ప మరొకరు కాదు. అందుకే చివరికి ఎబివిపిలో కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తున్నవారు కూడా దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని తప్పుపడుతూనే చేయనివారి పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా ముగ్గురు ఎబివిపి కమిటీ నుంచి తప్పు కున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించిన వైఖరితో తాము విబేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే వారు కూడా దేశద్రోహులను సమర్ధించినట్లా ?

     కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఢిల్లీ పోలీసు నడుస్తున్నదనటానికి జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధుల గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారో గురువారం నాటి పత్రికల్లో వచ్చింది. విద్యార్ధులు బీఫ్‌ పెట్టాలని కోరారని, కొందరు మహిషాసుర వర్ధంతి జరిపారని నివేదికలో ఆరోపించారంటే హిందూత్వ ఎలా తలకెక్కిందో అర్ధం అవుతోంది.అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏం చేసిందో దేశమంతా చూసింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్‌ చూపిన కారణాలలో రాజభవన్‌ ఎదుట గోవధ చేశారని కూడాపేర్కొన్నారు. ప్రతిదానికీ ఆవు కధకు లంకె పెడుతున్నారు. అంటే ఎవరు ఏమి తినాలో ఎవరిని అభిమానించాలో,పూజించాలో కూడా మనువాదులు చెప్పినట్లు జరగాలా ? కేంద్రంలోని బిజెపి సర్కార్‌, వారిని నిత్యం సమీక్షించి, మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి వివాదాస్పద, ఏకపక్షంగా తమ మతభావజాలాన్ని రుద్దే క్రమంలో తెగేదాగా లాగేందుకే నిర్ణయించుకున్నట్లు అనేక పరిణామాల సందర్బంగా అనుసరిస్తున్న వైఖరి వెల్లడిస్తోంది. అందుకే గతంలో పేర్కొన్నదే అయినప్పటికీ మరోసారి హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని నేటి పరిస్ధితులకు మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

చెన్నయ్‌ ఐఐటిలో,పూనా ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలుబుర్గి, గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల వుదంతాలలో ప్రజాస్వామిక వాదులు, భావప్రకటన స్వేచ్చను కోరుకొనే వారు, లౌకిక వాదులు తగినంతగా స్పందించి వుంటే ఇప్పుడు జెఎన్‌యు పరిణామాలు జరిగి వుండేవి కాదు. ఇప్పటి కైనా మేల్కొనకపోతే అన్ని జీవన రంగాలకు ఈ ధోరణి విస్తరిస్తుందని గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Editors Guild Condemns ABVP Threats to The Wire‘s Founding Editor

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, communalism, RSS

12628388_945979525487243_1572144722424597240_o (1)

New Delhi: In a statement issued on Saturday, the Editors Guild of India strongly condemned “the blatant acts of intimidation and threats to Siddharth Varadarajan, Editor of The Wire, by student members of the ABVP in Allahabad University that forced the police to intervene to escort him to safety.”

Varadarajan had been invited to deliver a public lecture on ‘Loktantra, media aur abhivyakti ki svatantrata’ (Democracy, the Media and Freedom of Expression)” by the president of the Allahabad University Students’ Union and the event was scheduled to be held at the university’s Senate Hall on January 20, 2016.The Editors Guild statement notes that after students belonging to the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) – the student wing of the Bharatiya Janata Party – threatened violence, the university’s vice-chancellor withdrew permission for the programme and got the district administration to prohibit it from being held anywhere else on campus. As a result, “Varadarajan was forced to deliver the lecture at a hall near the campus.”After the lecture, when The Wire’s founding editor went to meet the V-C in his office along with the students’ union president, Richa Singh, the ABVP – which declared that Varadarajan was “anti-national” and would not be allowed to set foot inside the university campus – surrounded the exit.

The university security warned Varadarajan that they could not guarantee his safety, and it was only after the police arrived that he was escorted to safety.

“For a senior journalist to be threatened in such a manner at a leading university is deplorable. It is a brazen attack on freedom of expression, and the Editors Guild of India finds this mob mentality to silence those with divergent views unacceptable”, the Editors Guild statement said.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లాయర్‌ కాదు లయర్‌ !

22 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, Hinduthwa, Rohith Vemula, RSS, Vemula Rohit

షరియత్‌ను అంటే తాలిబాన్లు, మరి హిందూత్వను రుద్దే వారు జీహాదీలు కాదా ?

ఎం కోటేశ్వరరావు

పవిత్ర మత యుద్ధం జరపాలనే వారందరూ వున్మాదులే, వుగ్రవాదులే ఎవరికి నచ్చిన పేరు పెట్టుకోండి.మన దేశానికి వస్తే అకుపచ్చ తాలిబాన్లు మైనారిటీ, కాషాయ తాలిబాన్లు మెజారిటీ. ఎవరు చెప్పినా మతాన్ని రక్షించాలి, మతం చెప్పినదాన్ని పాటించాలి లేకుంటే అంతు చూస్తాం, ఇదేగా జరుగుతోంది. స్వతంత్ర పార్టీ మితవాద శక్తులు ప్రారంభించిన స్వరాజ్య పత్రికను ఇప్పుడు చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా స్వరాజ్య నినాదం, వుద్యమాలతో సంబంధం లేని, మతవాదులు దానిని స్వాధీనం చేసుకొని భారత దేశ మితవాద అభిప్రాయాలు చదవండనే తోక తగిలించుకొని మరీ దానిని ప్రచురిస్తున్నారు.పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

రోహిత్‌ వేముల కారల్‌ సగాన్‌ అనే శాస్త్రవేత్త అంతటి వాడు కావాలనుకున్నాడు, కానీ కారల్‌ మార్క్స్‌ నాశనం చేశాడు అనే పేరుతో ఆ పత్రికలో తేజస్వి సూర్య అనే కర్ణాటక బిజెపి లాయర్‌ ఒక వ్యాసం రాశాడు. భారతీయ విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టు-జీహాదిస్టులు వుమ్మడిగా ఎక్కించిన దానికి ఒక దళిత విద్యార్ధి ఎలా బలయ్యాడో చూడండనే ఆర్గ్యుమెంట్‌ను సదరు లాయరు వినిపించాడు. వామపక్ష-దళిత విద్యార్ధి రాజకీయాలకు వేముల రోహిత్‌ బలయ్యాడని ఆరోపించారు. ఒక బిజెపి నేత అంతకంటే భిన్నంగా చెబుతాడని ఎవరైనా ఎలా వూహిస్తారు. అతని ఆత్మహత్యకు నేటి రాజకీయ వ్యవహారాలు,దేశంలో విద్యార్ధి రాజకీయాలు నడుస్తున్న తీరు, మన విద్యావిషయాల స్ధితితో పాటు దేశంలో దళితుల కార్యాచరణ అవినీతి గురించి మర్చిపోవద్దంటారు.

ఇంతకీ ఈ పెద్ద మనిషి కడుపు మంట ఏమిటంటే దేశంలో నేడు అత్యధిక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ‘కమ్యూనిస్టు లేదా మార్క్సిస్టు బ్రాండ్‌లైన దళిత-ఇస్లామిక్‌ రాజకీయాలకు కేంద్రాలుగా మారాయట, ప్రేమ ముద్దుల ప్రచారం, శిక్షపడిన వుగ్రవాది యూకూబ్‌ మెమెన్‌ సంస్మరణ సభలూ, మహిషాసుర దినాలను పాటించటం, గొడ్డు మాంస విందుల వంటి వాటన్నింటినీ వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో, మైనారిటీ, ఇతర వుప హక్కుల పేరుతో వామపక్ష-జీహాదీ కుమ్మక్కు విశ్వవిద్యాలయాలలో నడుస్తోందట.

కాలం చెల్లిన కమ్యూనిజంతో యువత బుర్రలను పాడు చేయటంతో పాటు హిందూ అంటేనే దేన్నయినా వ్యతిరేకించటం నేర్పాయట, ఇది వందలాది దారుణమైన దాడులకు ముఖ్యంగా కేరళ, బెంగాల్‌, తెలంగాణాలో వారికి వ్యతిరేకమైన సిద్ధాంతాలున్నవారిపై జరిగేందుకు దోహదం చేశాయట. ఇలా సాగిన ఆ వ్యాసం చివరికి ఎటు తిప్పి వుంటారో ఊహించటం కష్టం కాదు. కేవలం తోటి విద్యార్ధి ఎబివిపికి చెందిన వాడైన కారణంగానే అతని మీద దారుణమైన దాడికి రోహిత్‌ పాల్పడ్డాడట.

ఈ లాయర్‌ తప్పుడు కేసులు వాదిస్తాడనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.ఈ కట్టుకధను గుడ్డిగా నమ్మే కేంద్ర మంత్రులు విశ్వవిద్యాలయంపై వత్తిడి తెచ్చి రోహిత్‌ మరణానికి కారకులయ్యారన్నది దాస్తే దాగని సత్యం. ఎబివిపి విద్యార్ధిని రోహిత్‌, ఇతరులు కొట్టినట్లు, గాయాలైనట్లు ఎక్కడా లేదు, గాయాల కోసం ఆసుపత్రిలో చేరలేదని అపెండిసైటిస్‌ కారణంగా చేరినట్లు పోలీసులు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి సదరు లాయర్‌ కేరళ,బెంగాల్లో జరిగాయని చెబుతున్న దాడులలో నిజం ఎంతుందో అర్దం చేసుకోవచ్చు. సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ఎంత సాధు పుంగవులో అనేక ప్రాంతాలలో జరిగిన మత కొట్లాటలలో పాల్గొన్న తీరు లోకం చూసింది. గుజరాత్‌ మారణకాండకు పాల్పడిన వారందరూ సాధుపలవలు అని ఈ లాయర్‌ నమ్మబలుకుతున్నారా ? కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల చేతిలో ఎందరు అమాయకులు బలయ్యారో లోకానికి తెలియదా ? కుమారుడిపై జరిగిన దాడే అవాస్తవమని పోలీసులు చెబుతుంటే తనపై కూడా దాడికి ప్రయత్నించారని ఎబివిపి విద్యార్ధి తల్లి కొత్త కథను చెప్పారు. తల్లులందు పుణ్యతల్లులు వేరయా అంటే ఇదేనేమో.

ఇక ఆ లాయర్‌ మనువాది సావర్కర్‌, దానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన అంబేద్కర్‌ శత్రువులు కాదని దళిత విద్యార్ధులు తెలుసుకోవాలట. ఎంత చక్కని వ్యాఖ్యానం ! అంటే అంబేద్కర్‌ కూడా మనువాదే అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పటమే.అంతే కాదు కమ్యూనిజం, ఇస్లాంకు వ్యతిరేకంగా అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాడారని ఈ విషయాలను దళితుల్లో ఎబివిపి సైద్ధాంతికంగా ప్రచారం చేయాలని బోధనొకటి.ఇంతటి పచ్చి అసత్యాలను చెప్పిన ఆ పెద్దమనిషి లాయర్‌ కాదు లయర్‌ !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అయితే ఏమిటట !

20 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

ABVP, BJP, Central University of Hyderabad, Dalit, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడు కాదు బిసి: ఎబివిపి

అయితే ఏమిటట !

     వారు చెబుతున్నదాని ప్రకారం దళితుడు కాదు, వెనుకబడిన తరగతికి చెందిన యువకుడు. కావచ్చు, కాకపోవచ్చు, లేదు బిసి కాకపోతే ఓసి, ఓసీలోకూడా హిందూత్వను వ్యతిరేకించే గట్టి కార్యకర్త అనుకోండి…. అంతమాత్రాన అందుకు కారకులుగా విమర్శలను ఎదుర్కొంటున్నవారిని నిలదీయ కూడదా ? ఎంతో భవిష్యత్‌ వున్న ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్ధితుల గురించి ప్రశ్నించకూడదా ? నేరగాళ్లను వదలి వేయాలా? శిక్షించాలా ? ఎబివిపి వారికి వచ్చిన సమస్య ఏమిటి ?

దొరల పాలనా భావజాలం నుంచి బయటకురాని రాజకీయ నేతలే బీసి బంధువైన దత్తాత్రేయపై కుతంత్రాలకు పాల్పడుతున్నారు : బిజెపి ఓబిసి మోర్చా

అయితే ఏమిటట !

     ఒక విమర్శ రాగానే మోర్చావారికి మూర్ఛ రావాలా ? మోర్చా, ఎబివిపి రెండూ సంఘపరివార్‌ సంస్ధలే ఒకే నోటితో, అదీ నరం వున్న నాలుక నోటితో కదా మాట్లాడాల్సింది. విశ్వవిద్యాలయానికి దత్తాత్రేయ వుత్తరాల మీద వుత్తరాలు రాసి తోటి మంత్రి స్మృతి ఇరానీతో రాయించి ప్రతిభావంతుడైన ఒక బీసి విద్యార్ధి జీవితంతో అడుకుంటే అయన బీసి బంధువా ? బలి తీసుకొనే వ్యక్తా ? ఎన్ని నోళ్లు వున్నాయి ? వున్న నోటికి నరం వుందా ?

     ఇక్కడ వీరి బాధ రోహిత్‌ ఎవరన్నది కాదు, దేశానికి విషంగా మారిన కాషాయ హిందూత్వ, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను గట్టిగా వ్యతిరేకించటమే అసలు సమస్య. దీర్ఘకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌క్‌గా వున్న దత్తాత్రేయ, వారి బాటలో నడుస్తున్న మరో మంత్రి స్మృతి ఇరానీ, విద్యార్ధులు చెబుతున్నదాని ప్రకారం దళితులు, బిసిల పొడగిట్టని విసి పొదిలి అప్పారావు అత్యుత్సాహం మ్తొత్తంగా హిందూత్వ వున్మాదం, దానికి లొంగిపోవటమే రోహిత్‌ను బలి తీసుకున్నాయన్నది స్పష్టం.

ముంబై పేలుళ్ల వుగ్రవాది యాకుబ్‌ మెమెన్‌ను వురితీస్తే దాన్ని ఖండిస్తూ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో రోహిత్‌ పాల్గొన్నాడు: సోషల్‌ మీడియా, కాషాయ మీడియా సేవకులు

అయితే ఏమిటట !

     శవాల కోసం గగన విహారం చేయటమే రాబందుల పని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ఎక్కడ సంఘపరివార్‌ సంస్ధలు, వ్యక్తులకు ఇబ్బంది వస్తుందా అని అక్కడ వాలి పోదామా అని రాబందుల మాదిరి హిందూత్వ ప్రచార సేవకులు వెంటనే సామాజిక మీడియాలో తమ పనిలోకి దిగి పోతారు. మెమెన్‌ వంటి ఒక జాతి వ్యతిరేక శక్తి మరణిస్తే అంతగా స్పందించిన రోహిత్‌ ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా స్పందించాలా అన్నట్లు వ్యంగ్యోక్తులతో ప్రచారానికి దిగారు.

     వుగ్రవాదులు విదేశాలలో కుట్ర చేసి దాడులకు పాల్పడ్డారా, స్వదేశంలోనే కుట్రలు చేశారా అన్నది సమస్య కాదు. ఎక్కడ చేసినా కుట్ర కుట్రే ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఎవరూ సమర్ధించరు. అనేక మంది హిందూ వుగ్రవాదులు జైళ్లలో వున్నారా లేదా ? స్వామి అసిమానంద ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అజ్మీర్‌ షరీఫ్‌, మక్కామసీదు, మాలెగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయా కాదా ? తన నేరాలను మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడా లేదా ? దర్యాప్తు సంస్ధలు తనపై వత్తిడి తెచ్చాని బుకాయించాడు. అందులో ఆశ్చర్యం లేదు.అలా బుకాయించిన తరువాత కారవాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వుగ్రదాడులకు ఆర్‌ఎసెస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్‌ భగవత్‌ అంగీకరించాడని చెప్పాడు. తరువాత తానలా అనలేదన్నాడు. అయితే కారవాన్‌ పత్రిక ఆడియో టేపులను విడుదల చేసి అసిమానంద్‌ నిజస్వరూపాన్ని బయట పెట్టింది.యూకూబ్‌ మెమెన్‌ తనంతట తానుగా లొంగిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజం. పేలుళ్ల కుట్రకు సంబంóంచి అనేక విషయాలు వెల్లడించాడు. వాటితో తనకు ఎలా సంబంధం లేదో చెప్పటానికే లొంగిపోయాడన్నది ఒక కధనం. దీన్ని కొంత మంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యూకూబ్‌ మెమెన్‌ వురితీయాల్సిన వ్యక్తి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ కాబినెట్‌ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగానూ, పరిశోధన మరియు విశ్లేషణ( రా) పాకిస్థాన్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన బి రామన్‌ ఒక వ్యాసంలో రాశారు. ఇదేమీ రహస్యం కాదు. అలా రాసినంత మాత్రాన ఆయన దేశవ్యతిరేక శక్తా ? వురి శిక్షలను మొత్తంగా వ్యతిరేకించే సిపిఎం మెమెన్‌ వురిని వ్యతిరేకించింది. యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరింది. ఇతర అనేక మంది ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని కొందరు విద్యార్ధులు కూడా ఆ కారణంగానే సంతాపసభకు హాజరై వుండవచ్చు, వారిలో రోహిత్‌ ఒకరు కావచ్చు. తప్పేముంది ? ముంబైలో వేలాది మంది మెమెన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత మాత్రాన వారంతా జాతి వ్యతిరేక శక్తులా ?

     జాతిపిత మహాత్మా గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ గాడ్సేకు గుడి కట్టేందుకు, వాడి వర్ధంతి,జయంతులను పాటింటే వారు, వారికి మద్దతు పలికే హిందూత్వ శక్తులు దేశ భక్తులుగా చలా మణి అవుతుండగా వాటి గురించి ఏమిటని ఏ చర్యలు తీసుకున్నారని లేఖలు రాయటంలో సిద్ధ హస్తుడైన దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేఖలు రాయటం లేదు? అంతెందుకు మజీతియా వేజ్‌ బోర్టు సిఫార్సులను మీడియా సంస్ధలు అమలు జరపటం లేదన్నది బహిరంగ రహస్యం. జర్నలిస్టులు స్వయంగా అయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు, ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు కేంద్ర కార్మికశాఖా మంత్రిగా రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిన బాధ్యత ఆయనదే . ఎన్ని రాష్ట్రాలకు,ఎన్నిసార్లు రాశారు?్ల సమాధానం రాకపోతే గుర్తు చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు లేఖలు రాశారో చెప్పగలరా ? పత్రికలకు వివరాలు విడుదల చేయగలరా ? ఒక ఎంపీ, కేంద్ర మంత్రి దేశంలో ఏం జరిగినా పట్టించుకోవాలి కదా ?

హిందుత్వను, కాషాయాన్ని తానెంతగా వ్యతిరేకిస్తున్నాడో రోహిత్‌ చెప్పే వీడియోను కమలం గ్రూపు పేరుతో వున్నవారు సామాజిక మీడియాలో తిప్పుతున్నారు. అతని నిజస్వరూపం ఇది, అందుకు సాక్ష్యం అది అంటున్నారు.

అయితే ఏమిటట !

     వీడియోలో రోహిత్‌ చెప్పినదానిలో దానిలో తప్పేముంది? హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం లేదా దాన్ని గోడల నిండా చెడరాయటం లేదా ? ఆవును చంపిన వారిని కొట్టి చంపమని వేదాలు చెప్పాయని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్యలో వినయకృష్ణ చతుర్వేది రాయలేదా. రోహిత్‌ అంతకంటే దారుణంగా ఏమీ చెప్పలేదే. హిందూత్వ, దానికి విద్యార్ధులలో ప్రతినిధులుగా వున్న ఎబివిపి కనపడితే ఎదిరించమని తన సంస్ధ చెప్పిందన్నాడు .దళితులకు ఇంకేం నేర్పించిందంటే హిందూత్వగానీ, హిందువులుగానీ హిందూ పేరు చెప్పుకొని మైనారిటీలపైకి వచ్చే వాళ్లనిగానీ, దళితుల గురించి గానీ మాట్లాడే వారుగానీ కనపడితే ఎదిరించమని చెప్పింది అని చెప్పాడు. అంతే తప్ప కొట్టమనో, చంపమనో చెప్పింది అనలేదుగా !

     ఇక్కడ దళితుల గురించి మాట్లాడటం అంటే వారి కులం పేరు చెప్పి తిట్టటం, వర్ణవ్యవస్ధ పేరుతో ఎక్కడుండాల్సినోళ్లు అ్కడుండాలని అంటరానితనం పాటించటం వంటి హిందూయిజం కనపడితే ఎదిరించటమని అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పాడు. . ఎబివిపి హిందుత్వ గురించి చెప్పినట్లుగానే అదే అంబేద్కర్‌ విద్యార్ధి సంఘమూ చెబుతోంది.తరతరాలుగా మానవత్వానికే మచ్చ తెచ్చిన హిందూత్వ గురించి ఘనంగా చెప్పుకుంటున్నవారు వుండగా లేనిది అందుకు తరతరాలుగా బలై అవమానాలు పొందిన వారు దానిని ఎదిరించమని చెప్పటం ఎలా తప్పవుతుంది. దోపిడీ వ్యవస్ధను కూల్చివేయమని కమ్యూనిస్టులు బహిరంగంగా చెప్పటం లేదా? ప్రత్యర్ధి పార్టీని ఓడించటమని పిలుపివ్వని, కార్యకర్తలకు చెప్పని పార్టీ ఏదో చెప్పమనండి.

     గుజరాత్‌ మారణకాండ సందర్బంగా మూడు రోజుల పాటు ఏం చేయదలచుకుంటే అది చేయండని 2002లో ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ చెప్పారని నాడు భజరంగ దళ్‌ జాతీయ సమన్వయ కర్తగా వున్న హరేష్‌ భట్‌ చెప్పిన అంశాలు కూడా వీడియోలో వచ్చాయి. అంబేద్కర్‌ సంఘం లేదా సంఘపరివార్‌ను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర సంస్ధలు అలా చెప్పినట్లు వీడియోలు లేవే . సామాజిక మీడియాలో రోహిత్‌ వీడియోను తిప్పుతున్నవారు గుజరాత్‌ వీడియోను ఎందుకు చేయరు? అలాంటి వీడియోలను చూసిన తరువాత ఎవరైనా కాషాయ ముసుగులో జరిపే దారుణాలను వ్యతిరేకించనందుకు, అసహ్యించుకోనందుకు సిగ్గుపడాలి. వీడియో కనుక నిజమైనదైతే బ్యానర్లను చించి వుండవచ్చు, ప్రాణాలను తీయలేదే, గుజరాత్‌ మాదిరి మారణకాండకు రోహిత్‌ పాల్పడలేదే, ప్రోత్సహించలేదే ! వేలాది మంది ప్రాణాలు తీసిన గుజరాత్‌ మారణకాండలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికీ వురి శిక్ష పడలేదేం ? శిక్షలు పడిన వారికి ఇంటి కంటే జైలు పదిలం అన్నట్లు సకల సౌకర్యాలు కల్పించటం సోషల్‌ మీడియాలోని కొంత మందికి కనిపించటం లేదా ? వారి బాధ ఏమిటి ?

విద్యార్ధులపై చర్యకు వత్తిడి చేయలేదు:బిజెపి నేతలు

    అరచేతిని చూసుకొనేందుకు అద్దం కావాలా? వరుసగా తెరిపి లేకుండా రాసిన లేఖల తేదీలు చూస్తే వత్తిడి చేసిందీ లేనిదీ తేటతెల్లమైంది. నిజంగా ఒక ఎంపీ, ఒక మంత్రి లేఖ రాస్తే ఒక చిన్న విషయం మీద ప్రభుత్వ శాఖలు అంతగా వెంటపడటం ఆశ్చర్యమే. ఎన్నికలలో లోక్‌పాల్‌, నల్లధనం వెలికితీత గురించి తాను లేఖ రాస్తే కనీసం ప్రధాని కార్యాలయం స్పందించి తిరుగు జవాబు కూడా రాయలేదని 18 నెలల తరువాత అన్నా హజారే అంతటి పెద్ద మనిషి వాపోయిన విషయం తెలియదా ? అగస్టు నుంచి లేఖల మీద లేఖలు రెండు మంత్రిత్వశాఖలు రాయటం వత్తిడి కాదా ? వైస్‌ ఛాన్సలర్‌ కొత్తగా వచ్చి విద్యార్ధుల బహిష్కరణ మీద చూపిన శ్రద్ధ, ఆసక్తి అంతకు ముందు విశ్వవిద్యాలయంలో కమిటీలు చేసిన సిపార్సులపై లేదెందుకు?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

HU VC Responsible for Student’s suicide, book him:CPI(M)

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

ABVP, Central University of Hyderabad, CPI(M), RSS, Vemula Rohit, Vice Chancellor

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the
following statement:

The Polit Bureau of the CPI(M) expresses its deep anguish at the suicide of
a dalit student, Vemula Rohit, in the Central University of Hyderabad.

The four dalit students were on indefinite hunger strike protesting against
the newly-appointed Vice Chancellor’s decision to rusticate them from the
hostels of the University.

Following an alleged altercation between the RSS student wing – ABVP – and
the Ambedkar Students Union, an enquiry was conducted by the University and
the incident appeared to have been settled.

The newly-appointed Vice Chancellor, allegedly, under pressure from the
Minister of the Union Cabinet belonging to Hyderabad and the consequent
direction by the Human Resources Development Ministry, had taken this action
of suspension from the hostels.  The hunger strike was a protest against
this action by the Vice Chancellor.

Under these circumstances, the Polit Bureau of the CPI(M) condemns the Vice
Chancellor’s motivated decision that led to this suicide  and demands that
the Vice Chancellor be booked under the SC Prevention of Atrocities Act
immediately.

The Central government must conduct a thorough enquiry into this incident in
this prestigious Central University that was established by law by the
Parliament of India.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: