ఆంధ్రప్రదేశ్ సమాచార,ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి గారి సమీక్షపై గురువారం నాడు అధికారికంగా విడుదల చేసి పత్రికా సమాచార ప్రకటన వివరాలు చూస్తే వుద్యోగాల కల్పన ఎంత సులభమో తెలిసి పోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, తెలుగుదేశం నేత లోకేష్ విదేశీ పర్యటనల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ఐటి కంపెనీలు క్యూలు కడుతున్నాయని మంత్రి ఒక సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలుగు దేశం పార్టీ అధికారానికి దూరంగా వున్న కారణంగా ఏపిలో ఐటి పరిశ్రమలు వృద్ది కాలేదని, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని కూడా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఐటిఐర్ ఏర్పాటు గుతాను కేంద్రమంత్రిలేఖ రాశానని, ముఖ్యమంత్రి కూడా రాస్తారని అది వస్తే 10,350 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వాటితో 3.7లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14.7లక్షల మందికి పరోక్షంగా వుద్యోగాలు వస్తాయని మంత్రి చెప్పినట్లు ఆ ప్రకటనలో వుంది.
ఐటిఐఆర్ గురించి ఇంత వరకు ఆలూ లేదు చూలూ లేదు, అయినా అప్పుడే పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు వుద్యోగాలు ఎన్ని వస్తాయో లెక్కలు చెబుతున్నారంటే బాబొస్తే జాబులంటే ఇవేనా !