• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: cbi

మత తటస్థ దేశంలో విద్వేష వాతావరణం ఉందన్న సుప్రీం కోర్టునూ తప్పు పడతారా !

22 Saturday Oct 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, cbi, Hate crime, Hate-Speech, Narendra Modi, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా ? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా ! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి ? ఎవరు పాటించాలి ? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూమత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు ? ఏం చెబుతున్నారు ? ఆచరణలో ఏం చేస్తున్నారు ?


ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా ? మన పత్రికలను చదవరా,టీవీలను చూడరా ? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన అక్రోశ్‌ నిరసన సభలో బిజెపి ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయపక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది.దాని మీద సిబల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా ? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ అద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా ? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా ? ఎవరు సమాధానం చెబుతారు ! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్ష పడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందిన వారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అతడిని విడుదల చేయ కూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్‌ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపువేగంతో కదిలింది. గుజరాత్‌ సర్కార్‌ 2022 జూన్‌ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈకేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది.నవంబరు 29న కేసు విచారణకు రానుంది.


చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు. ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొకపేరుతో నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విజయ మాల్య ‘ మనో భావాలు ‘ దెబ్బతిన్నాయా ?

13 Sunday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

banks, cbi, Kingfisher Airlines, Sunday Guardian, vijay mallya

ఎం కోటేశ్వరరావు

    ఏమో ? తాను దేశం విడిచి పారిపోలేదని, తనకు భారతీయ న్యాయ వ్యవస్థపై ఎంతో విశ్వాసం వుందని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పిన కొన్ని గంటలలోనే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తగిన సమయం ఆసన్నమైనపుడే తిరిగి వస్తానని, తాను ఎక్కడ వున్నదీ వెల్లడించనని చెబుతున్నాడు. ఈనెల పదవ తేదీన ఒక చెక్కు చెల్లని కేసులో హైదరాబాదు కోర్టులో హాజరు కావాల్సిన మాల్య రాకపోవటంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.మాల్యపై తమ మౌన బాబా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు తీసుకొనే అద్బుతం జరగబోతోందని అప్పుడు మోడీ మహిమలను పొగిడేందుకు సిద్ధంగా వుండాలని మోడీ భక్తులు ఇప్పటికీ చెబుతున్నారు. గార్డియన్‌ పత్రిక వెల్లడించిన తాజా అంశాల ప్రకారం ఈనెల 18న ఇడి ముందు మాల్య హాజరు కావటం లేదని తేలిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి వుంది. లండన్‌ నుంచి వెలువడే సండే గార్డియన్‌ పత్రిక ఇమెయిల్‌ ద్వారా మాల్యతో చేసిన ఇంటర్వ్యూను ప్రచురించింది. దానిలోని అంశాలు ఇలా వున్నాయి.

ప్రశ్న: మీరు మార్చి రెండవ తేదీన ఎందుకోసం దేశం విడిచి వెళ్లారు? బ్యాంకు రుణాలు చెల్లించటంలో వైఫల్యానికి దానికీ సంబంధం వుందా ? మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు?

జవాబు: నేను వ్యక్తిగత పనుల మీద ఒక ఫ్రండ్‌తో కలసి ఢిల్లీ వదలి వెళ్లాను, ఇది వ్యాపార సంబంధమైనది కాదు,చాలా మంది నేను ఏడు పెద్ద సంచులతో సామాన్లు మోసుకొని వెళ్లినట్లు రాశారు.నేను అలా చేశానా లేదా అన్నది వేరే కధ.అయితే ఇద్దరు మనుషులకు అవేమీ ఎక్కువ అనుకోవటం లేదు. నేను భారీగానే వెళ్లాను. గతేడాది నాపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయింది.కానీ నేను తప్పించుకోలేదు.ఇప్పుడు నన్ను క్రిమినల్‌ అని ఎందుకు చిత్రించాలి? రుణాల చెల్లింపులో వైఫల్యం అన్నది వాణిజ్య వ్యవహారం.బ్యాంకులు రుణాలు ఇచ్చేటపుడు వచ్చే రిస్కులను కూడా అవి వుంటాయని వారు తెలుసుకోవాలి. నిర్ణయించుకోవాల్సింది వారు మేము కాదు.గతంలో వర్ధిల్లు తున్న మా స్వంత వ్యాపారం ఆకస్మికంగా దిగజారింది. నన్ను ఒక విలన్‌గా చేయవద్దు. నాకు వున్నతమైన ఆలోచనలు వున్నాయి. నేను శాంతంగా వున్నాను, నా వ్యాఖ్యలను ఇతరుల మాదిరి వక్రీకరిస్తారేమోనని భయపడుతున్నాను.

ప్రశ్న: బ్యాంకులు కోర్టుకు వెళ్లటానికి ముందు మీరు దేశం విడిచారు, ఎవరైనా మీకు వుప్పందించారా ?

జవాబు: అది భాష్యానికి సంబంధించిన అంశం. దేశం వదలి వెళ్లటం ఇదే ప్రధమం కాదు, నేను ఏ తప్పు చేయలేదు. దేని గురించీ ఎవరూ నాకు వుప్పందించనవసరం లేదు. పెద్ద మీడియాలోని ఎక్కువ సంస్ధలు నాగురించి అనేక అబద్దాలు చెబుతున్నాయి. పత్రికల్లో ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. నాకు ముందస్తు సమాచారం వున్నట్లు తమకున్న సంబంధాల ద్వారా తెలిసినట్లు టీవీ చానల్స్‌ పేర్కొంటున్నాయి.నాకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు ముందుకు నెడుతున్న పెద్ద అజెండా ఇది.నన్ను బలి చేసేందుకు చూస్తున్నారు.బ్యాంకు వుద్యోగుల విస్వసనీయతను అనుమానించేవారు నన్నెందుకు వేలెత్తి చూపుతున్నారు.నేను నా దురదృష్టాని ఎల్లవేళలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. నేను ఎంతో గొప్పగా జీవించాను, అనేక మందికి సాయం చేశాను. నా జీవితంలో నేను దేన్నీ దాచుకోలేదు. బహిరంగంగా జీవించే వారిలో నేను ఒకడిని.అజ్ఞాతంలోకి వెళ్లే విధంగా నన్ను నెట్టారు, అది నాకు విచారం కలిగించింది.

ప్రశ్న: మీరు భారత్‌కు రావటానికి ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారా అవును అయితే ఎప్పుడు ?

జవాబు: నేను మౌలికంగా భారతీయుడిని. నేను తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకు న్యాయమైన అవకాశం దొరుకుతుందని నమ్మకం లేదు. నేను నేరస్తుడినని ఇప్పటికే ముద్ర వేశారు. ఇది సరైన సమయం అనుకోవటం లేదు.ఆగ్రహం ఎక్కువగా వుంది, జనం హేతుబద్దంగా ఆలోచించాలి. బిజినెస్‌ అన్నతరువాత అది చిన్నదైనా పెద్దదైనా రిస్కులు వుంటాయని అర్ధం చేసుకోవాలి.ఈ విషయాల్లో నేను వున్నతిని, అగాధాలను చూశాను.అయితే నేను ఒక రోజు తిరిగి వస్తానని ఆశతో వున్నాను.భారత్‌ నాకు అన్నీ ఇచ్చింది. నన్ను విజయ్‌ మాల్యగా చేసింది.

ప్రశ్న: ప్రస్తుతం మీరు ఎక్కడ జీవిస్తున్నారు? లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో మీ ఆస్తిదగ్గర మిమ్మల్ని చూసినట్లు జనం చెబుతున్నారు.

జవాబు: నేను ఎక్కడ వున్నదీ చెప్పటం తెలివిగల పని అనుకోవటం లేదు, అధికారులు నన్ను వేటాడటానికి నేనేమీ పేరు మోసిన నేరగాడిని కాదు,ప్రస్తుతానికి నేను సురక్షితంగా వుండాలని భావిస్తున్నాను.

    ఈ అంశాలను చూసిన తరువాత మాల్య ముందస్తు పధకంతోనే దేశం విడిచి వెళ్లాడన్నది స్పష్టం.తనను వేధిస్తున్నారని కధ వినిపించటం కూడా ఆశ్చర్యం కలిగించదు. మాల్య అక్రమాల గురించి ఆయన వుద్యోగులు, బ్యాంకు యూనియన్లు ఎప్పటి కప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్న విషయాలను తొక్కి పెట్టిన టీవీ ఛానల్స్‌ ఇప్పుడు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు మాల్యను వినియోగించుకుంటున్నాయి. పత్రికలు కూడా తక్కువేమీ తినలేదు.

    శంషాబాద్‌ విమానాశ్రయానికి కింగ్‌ పిషర్‌ చెల్లించాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలకు గాను పదకొండు కేసులను దాఖలు చేశారు. ఒక కేసులో 50లక్షల రూపాయల చెక్కు చెల్లలేదు.దీనిపై శనివారం నాడు విచారణ జరిగినపుడు మాల్య హాజరు కావటానికి మరింత సమయం కావాలని మాల్య న్యాయవాది కోరాడు.తిరస్కరించిన కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విలాసాలకు మాల్యను విదేశాలకు ! సామాన్య రైతును పరలోకానికి !!

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

bankers, cbi, farmer, luxuries, nare, Narendra Modi, Narendra Modi Failures, non-payment of dues, vijay mallya

ఎం కోటేశ్వరరావు

   తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యను విలాసాలకోసం సగౌరవంగా విదేశాలకు పంపిన బ్యాంకర్లు, అధికారయంత్రాంగం సామాన్య రైతును మాత్రం పరలోకానికి పంపింది. తమిళనాడులోని ఒక రైతు లక్షా 30వేలు చెల్లించలేకపోయినందుకు పోలీసులు, రికవరీ ఏజంట్లు కలిసి చితకబాదటాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వుదంతం వెలుగులోకి వచ్చింది. అరయలూరు జిల్లాకు చెందిన బాలన్‌ ఒక ట్రాక్టరు కొనుగోలుకు రు.3.4లక్షల రుణం తీసుకున్న ఆ రైతు వడ్డీతో సహా రు.4.1లక్ష చెల్లించాడు. ఇంకా 1.3లక్షల బకాయి వుంది. పంటలు దెబ్బతిన్న కారణంగా దానిని చెల్లించలేకపోయాడు తప్ప పని గట్టుకొని ఎగవేసిన వ్యక్తి కాదు.బాలన్‌ను కొట్టిన దృశ్యాలు వీడియో చిత్రీకరించినట్లు కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.మాల్య మంచి వాడంటూ కొందరు రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రకటించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు యావత్‌ జాతి నిజంగా సిగ్గు పడాల్సి వుంది.

   సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) మన దేశంలో వున్నత దర్యాప్తు సంస్ధ. ప్రతిష్టతో పాటు అప్రతిష్టను కూడా సమపాళ్లలో మూట కట్టుకుంది. తాజాగా విజయ్‌ మాల్యా వుదంతంలో అది వ్యవహరించిన తీరుపై దానిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ చేసిన డిమాండ్‌పై మామూలు ప్రకారం మోడీ నోరు విప్పుతారని ఎవరూ అనుకోవటం లేదు నిజంగా నోరు విప్పితే అది మేకిండియా తొలి వుత్పత్తే అవుతుంది.

    విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన పది రోజుల తరువాత సిబిఐ తన అధికారి తప్పు చేసినట్లు చెప్పిందంటే యధా ప్రధాని తధా సిబిఐ అని చెప్పుకోవాల్సి వుంది. గతేడాది అక్టోబరులో తొలి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినపుడు తమ అధికారి తప్పు చేశాడని ఇప్పుడు సిబిఐ చెప్పటం నష్ట నివారణ చర్యలలో భాగంగా కట్టుకధ అంటే తప్పేముంది? ఆ తప్పు చేసింది ఒక గుమస్తా కాదు, ఎస్‌పి స్ధాయి అధికారి.ఒక వేళ నిజంగా పొరపాటే అయి వుంటే వెంటనే గుర్తించి వుండాలి, అదే జరిగి వుంటే మాల్య పరారీ వార్తలు వచ్చిన మరుక్షణమే అది వాస్తవం కాదని ప్రకటించాలి అదేమీ జరగలేదే ? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల్య తమకు అందుబాటులో వుండి సహకరించారని చెప్పిన సిబిఐ లుక్‌అవుట్‌ నోటీస్‌ ఎందుకు జారీ చేశారంటే ఇప్పుడే చెబుతోంది?

   ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయల చెల్లింపులో విఫలమైన మాల్య గురించి అది చేసిన ఫిర్యాదుతో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత అక్టోబరు పదిన జరిపిన సోదాల సందర్భంగా మాల్య ఆచూకీ తెలియలేదు. దాంతో ప్రశ్నించేందుకు అందుబాటులో వుంచేందుకు అతనిని పట్టుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు రాసినట్లు సిబిఐ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారంట్‌ లేని వ్యక్తులను అడ్డగించటం కుదరదని ఆ విషయం తెలియక ఒక అధికారి నోటీసు జారీ చేశారని, తరువాత దానిని గుర్తించి మరుసటి నెలలో అతని గురించి తెలియచేస్తే చాలని మరోనోటీసు జారీ చేసినట్లు ఇప్పుడు చెబుతోంది. ఆ విధంగా చూసినపుడు మాల్య లండన్‌ వెళ్లటం గురించి తమకు తెలుసునని , వెళ్లటంలో తప్పులేదని వెంటనే సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈనెల 18వ తేదీన హాజరు కావాలని జారీ చేసిన నోటీసుపై ఇంతవరకు మాల్య స్పందన వెల్లడి కాలేదు. ఇదిలా వుండగా మాల్య కర్ణాటక బిడ్డ అని అనేక విమాన సంస్ధలు నష్టాలపాలైనట్లే అనేక కింగ్‌ ఫిషర్‌ కూడా నష్టపోయిందని అలాంటి వారిని అనేక మందిని వదలి కేవలం మాల్యనే ఎందుకు వెంటాడుతున్నారని నిద్రలేచిన మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం నాడు ప్రశ్నించారు. బ్యాంకులకు చెల్లించటంలో విఫలమైన వారు 60 మంది వరకు వున్నారని, మాల్య రాజ్యసభ సభ్యుడు గనుకనే ఇలా చేస్తున్నారని గౌడ ఆరోపించారు. మాల్య పెద్దమనిషి అని ఆయన భారత్‌కు తిరిగి వస్తారని జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సినీదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ ద్వారా మాల్యాకు ఒక సలహా ఇచ్చారు. మాల్య వెంట తిరిగే బికినీ భామలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాంకుకు పంపి రుణం తీర్చుకోవచ్చన్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించవేమోగాని బ్యాంకర్లు సిద్దపడతారని పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు విదేశీ కత్రోచి స్వదేశానికి ! నేడు స్వదేశీ మాల్యా విదేశాలకు !!

11 Friday Mar 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, cbi, defaulter, ottavio quattrocchi, vijay mallya

 

సత్య

అబ్బ దేశభక్త అరుణ్‌ జెట్లీ బలే చెప్పిండు కదా ! జనం సొమ్ము ప్రతి పైసాకు జవాబుదారీగా వుంటా, అవినీతి పరుల భరతం పడతా, చీల్చి చెండాడుతా అని వీర, శూర ప్రతిజ్ఞలు చేసిన నరేంద్రమోడీ గత రెండు సంవత్సరాలుగా తమ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా అవినీతిని చూపమని సవాలు చేస్తున్నారు. అవినీతి అంటే ఫలానా రూపు రేఖలు వుండేదే అని ఎక్కడా నిర్దిష్టంగా నిర్వచించలేదు. ప్రధాన మంత్రి ఇంకే మాత్రం తమది శుద్ధమైన పాలన అని చెప్పుకోవటానికి లేదు. ఇంతవరకు ఒక్క అవినీతి పరుడిని, నల్లధనం దాచుకున్న వారిని శిక్షించిన లేదా అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు.అన్నింటికీ మించి తొమ్మిదివేల కోట్ల రూపాయల సొమ్ము ఎగవేసిన విజయ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఇవ్వటాన్ని అవినీతి అని గాక దేశభక్తి అని చెబుతారా ?

మాల్యా అంటే దేశద్రోహ నిందలు మోపి కేసులు బనాయించిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధులు దేశం విడిచి తప్పించుకోకుండా కనిపిస్తే నిర్బంధించమని జారీ చేసిన నోటీసుల(అవుట్‌లుక్‌) విషయం గుర్తుకు వచ్చింది ! వారి కోసం పోలీసులు జెఎన్‌యు గేట్ల ముందు పడిగాపులు కాశారు. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ మాల్యా అనే పైలా పచ్చీసు దేశం విడిచి వెళ్లే కేంద్రాలలో కనిపిస్తే నిర్బంధించండని తొలుత నోటీసులు జారీ చేసిన సిబిఐ కొద్ది రోజుల్లోనే ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని సవరించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు ? 2015 అక్టోబరు 16, నవంబరు మాసాలలో, అదీ మోడీ పాలనలోనే ! దీని భావమేమి తిరుమలేశా !

ప్రభుత్వాన్ని ఇరకాటం నుంచి తప్పించేందుకు విజయ్‌ మాల్య విదేశీ పర్యటన గురించి తమకు తెలుసునని, గతంలో కూడా వెళ్లాడని, తిరిగి రాకపోతే ఏం చేయాలో కూడా తెలుసునని సిబిఐ అనధికారికంగా మీడియాకు చెప్పింది. ఇక్కడే చిన్న తిరకాసు వుంది. లలిత్‌ మోడీ అనే పెద్ద మనిషి కూడా పారిపోతే ఏం చేశారో చెబితే బాగుండేది. పార్లమెంట్‌ సభ్యులెవరైనా పది రోజుల పాటు సమావేశాలకు హాజరు కాలేని పరిస్ధితులలో సభాధ్య్ష స్ధానం నుంచి అనుమతి తీసుకోవాలి. మాల్య మార్చి ఒకటవ తేదీన రాజ్యసభకు హాజరయ్యాడు.ఈనెల 16న సమావేశాలు వాయిదా పడతాయి. అంటే సరిగ్గా పదిరోజులు జరుగుతాయి. అయినా ఎలాంటి అనుమతి తీసుకోకుండా లండన్‌ వెళ్లాడు. అంతే కాదు ఎంపీలు ఎవరైనా విదేశీ పర్యటనలు జరపదలచుకుంటే ఆ విషయాన్ని విదేశాంగశాఖకు తెలియచేయాలని కూడా సలహా వుంది. ఇవేవీ పాటించలేదు, తాను విదేశాలకు వెళుతున్నట్లు అటు రాజ్యసభ అధ్యక్ష స్ధానానికి, విదేశాంగశాఖకు, నోటీసు జారీ చేసిన సిబిఐకి కూడా చెప్పలేదు. తీరా అది వివాదం అయిన తరువాత గతంలో చాలాసార్లు వెళ్లాడు, తిరిగి వచ్చాడు, పిలిచినపుడు వచ్చి మాకు సహకరించాడు, అతను వాణిజ్యవేత్త కనుక ప్రతి ఏడాది కనీసం 183 రోజులకు పైగా విదేశాలలో వుంటారు అనే కాకమ్మ కబుర్లు చెబుతోంది సిబిఐ.

మొత్తం మీద జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే సదరు మాల్యా దేశం విడిచి పోవటానికి నవంబరులోనే మోడీ సర్కార్‌ దోవ చూపిందన్నమాట. తనకు రావాల్సిన బకాయి వసూలుకు గాను మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని బెంగలూరులో ఎస్‌బిఐ పిటీషన్‌ దాఖలు చేసిన రోజే , మార్చినెల రెండవ తేదీనే సరిగ్గా మాల్యా కూడా దేశం నుంచి తప్పించుకున్నాడు. అంటే ముందే వుప్పందకుండా అది ఎలా సాధ్యం? ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో వారు మాల్యా విమానాశ్రయానికి రాగానే వెంటనే సిబిఐకి తెలియచేసినప్పటికీ అయితే ఓకే అన్నట్లుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు. ఎప్పుడూ నలుగురైదుగురు రంగీలాలను వెంట వేసుకు తిరిగే మాల్యా లండన్‌ వెళుతూ తన వెంట ఒక యువతితో సహా ఏడు పెద్ద సూట్‌కేసులు తీసుకు వెళ్లాడని వెల్లడైంది. ఇది వాణిజ్యం కోసం వెళ్లినదిగా లేదని అనేక మంది చెబుతున్నారు.

ఈ విషయాలేవీ తెలియనట్లు, అపర దేశభక్తుడైన మన ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అరే మాల్యా దేశం విడిచి వెళ్లాడా? ఎప్పుడు ? అని ఆశ్చర్యం నటించి వెంటనే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగి మీ హయాంలో బోఫోర్సు కుంభకోణంలో నిందితుడు కత్రోచీ దేశం విడిచి తప్పించుకుపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, అయినా మాల్యాకు కాంగ్రెస్‌ హయాంలోనే కదా రుణాలు ఇచ్చారు అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆ పెద్దమనిషి రెండవ సారి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినపుడు బిజెపి ఓట్లతోనే విజయం సాధించాడు. ఏ బంధంతో బిజెపి ఓట్లు వేసింది. కింగ్‌ ఫిషర్‌ విమానాల కంపెనీ బండారం 2012లోనే బయట పడింది. మరుసటి ఏడాది మూత పడే సమయానికి దాని మొత్తం నష్టం 16వేల కోట్ల రూపాయలు దాటిందన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కంపెనీకి అన్నివేల కోట్ల రూపాయల అప్పులిచ్చారు? ఎలా వసూలు చేస్తారని ప్రతిపక్షంగా బిజెపి ఇతర అనేక సందర్బాలలో చీటికి మాటికి ఆందోళన చేసిన పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్‌ను స్ధంభింప చేసిందా? ఎందుకు చేయలేదు?మాల్యా తమకు సాయం చేసే దేశభక్తుడనా ? బోఫోర్సు కుంభకోణంలో లబ్దిదారులు కాంగ్రెస్‌ వారు కనుక విదేశీ కత్రోచీని స్వదేశానికి పంపినదానికి బదులు తీర్చుకొనేందుకు మీరు స్వదేశీ మాల్యాను విదేశాలకు పంపినట్లా ? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా ?

కేంద్ర దర్యాప్తు సంస్ధ సిబిఐ మాల్య కనిపిస్తే నిలిపివేయండని తొలుత ఇచ్చిన నోటీసును ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని ఎందుకు సవరించినట్లు ? సవరించింది పో, మార్చి రెండవ తేదీన మాల్యా లండన్‌ వెళ్లే విమానం ఎక్కినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలియ చేసిన తరువాత మాల్యా విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆ విషయం తమకు తెలుసని సిబిఐ ఎందుకు ప్రకటించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా ఇంత ముఖ్యవిషయం మంత్రులకు కూడా వెంటనే తెలపలేదా ? లేక తెలిసి కూడా కావాలనే దాచి పెట్టారా ? పార్లమెంట్‌లో ఈ విషయాలను ఎందుకు ప్రకటించలేదు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగితే కుదరదు.

పరారీ గురించి దేశంలో, పార్లమెంటులో గగ్గోలు చెలరేగిన తరువాత శుక్రవారం నాడు తాను దేశం విడిచి పారిపోలేదని మాల్య ట్విటర్‌ ద్వారా తెలిపాడు, ఎక్కడున్నదీ వెల్లడించలేదు. మీడియా తనను వేధిస్తున్నదని, తన నుంచి సాయం పొందిన ఛానల్స్‌ యజమానులు దానిని మరిచిపోవద్దని, ఛానల్స్‌ రేటింగ్‌ను పెంచుకొనేందుకు అవాస్తవాలు చెబుతున్నారని, వారికేం చేసిందీ తన దగ్గర రికార్డులు వున్నాయని మాల్యా పేర్కొన్నాడు. తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కూడా ధ్వజమెత్తాడు.

మాల్యా తనపై వచ్చిన వార్తలను వక్రీకరణలని ఆరోపించటమే కాదు, తాను పారిపోవటం లేదని ఇంతకు ముందు కూడా వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో తాను లండన్‌లో తన పిల్లల దగ్గర ఎక్కువ సమయం గడిపేందుకు వెళుతున్నానని చెప్పినదానిని లండన్‌లో స్ధిరపడేందుకు అన్నట్లుగా రాశారని, క్రమంగా వ్యాపారాన్ని తగ్గించుకోవటం తన వుద్ధేశ్యమన్నాడు.డియాజియో సంస్ధకు తన లిక్కర్‌ కంపెనీని పూర్తిగా అమ్మివేసి తనకు రావాల్సిన సొమ్మును కూడా తీసుకున్నాడు.

బ్యాంకులు తన ఆస్తులను వెల్లడించమని కోరుతున్నాయని, తనకేమి వున్నాయో తెలియకుండా వున్నాయా అంటూ తనకున్న ఆస్తులేమిటో తాను రాజ్యసభకు రెండు సార్లు ఇచ్చానని కావాలంటే చూసుకోవచ్చని చెప్పాడు. వాటి ప్రకారం మాల్యాకు ఆస్తులు, అప్పులు లేవు. అంటే స్వాధీనం చేసుకొనేందుకూ కూడా ఏమీ లేకుండా ముందే జాగ్రత్త పడినట్లే.

మరోవైపు మాల్యా తీసుకున్న అప్పుల కంటే ఎక్కువ ఆస్తులున్నాయని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహతగి సుప్రీం కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టుతో సహా దేశానికి తిరిగి రావాలని నోటీసు జారీ చేయాలని సోమవారం నాడు సుప్రీ ం కోర్టు వుత్తరువు జారీ చేసింది.అయితే ఆ నోటీసు ఎప్పుడిస్తారో తెలియదు. మొత్తం మీద సరళీకరణ విధానాలతో ప్రభుత్వ బ్యాంకులను ఎలా వాడు కోవచ్చో, కొల్లగొట్టవచ్చో విజయమాల్య వుదంతం వెల్లడించింది. ఇవే కాదు, నిరర్ధక ఆస్తుల పేరుతో బ్యాంకులు చెబుతున్న లక్షల కోట్ల పారుబకాయిలన్నీ ఇలా ముంచినవే. ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందంటారు. మరోవైపు బ్యాంకులను ముంచని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టని బడా ప్రయివేటు సంస్ధ ఒక్కదానిని కూడా మనం చూడలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: