• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: communist

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల వ్యవహారం కాదు

24 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, communist parties, may day, Trade Union Movement in India

ఎం కోటేశ్వరరావు

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ వునికిలోకి వచ్చింది. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూ నిస్టులు కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో తొలి జాతీయ కార్మిక సంఘాన్ని(ఏఐటియుసి) ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాయి.

ఎప్పుడైతే వస్తూత్పత్తి ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టారో అప్పుడే వాటిపై పని చేసే పారిశ్రామిక కార్మికులు కూడా తయారయ్యారు. ఇది పారిశ్రామిక విప్లవ తొలి పర్యవసానం. దోపిడీ, అసమానతల వంటివి సరేసరి. మన వేదాల్లో అంతులేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాగుందని కాషాయ తాలిబాన్లు చెప్పగా వినటం తప్ప మనకు కనపడదు. నిజంగా అదే నిజమైతే పారిశ్రామిక విప్లవం భారత వుపఖండానికి బదులు ఐరోపాలో ఎందుకు ప్రారంభమైంది, పోనీ ఇప్పటికైనా వేద సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీసి మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా ఎందుకు వుత్పత్తి చేయరు, దిగుమతులను ఎందుకు ఆపరు అన్నది ఒక మౌలిక ప్రశ్న. దాని గురించి వేరే సందర్భంగా చర్చించుకుందాం. పారిశ్రామిక విప్లవం ఐరోపాలోనే జరిగినప్పటికీ దానితో ప్రభావితం గాని దేశం లేదు. మన దేశంలో సంభవించిన పర్యవసానాల గురించి 1853లో న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో కారల్‌ మార్క్స్‌రాసిన విశ్లేషణలో ఇలా వుంది.’ భారత చేనేత రంగంలో ప్రవేశించిన బ్రిటీష్‌ చొరబాటుదారుడు నేత ప్రక్రియనే నాశనం చేశాడు. ఐరోపా మార్కెట్లనుంచి భారత వస్త్రాలను బయటకు నెట్టటంతో ప్రారంభించి చివరకు హిందూస్తాన్‌లో తానే చేయితిప్పటాన్ని ప్రారంభించింది ఇంగ్లండు.నేత వస్త్రాలకు నిలయమైన దేశాన్ని తన వస్త్రాలతో ముంచివేసింది.1818-36 మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి ఇండియాకు ఎగుమతులు 1:5,200 దామాషాలో పెరిగాయి.1824లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు కేవలం పది లక్షల గజాలలోపే ఎగుమతి జరగ్గా 1837నాటికి 6.40 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఢాకా పట్టణ జనాభా లక్షా 50వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది.ఒక నాడు తమ వస్త్రాలతో పండుగ చేసుకున్న మాదిరి కళకళలాడిన పట్టణాలు దిగజారటం దీని పర్యవసానమే. బ్రిటీష్‌ వారి ఆవిరిశక్తి, సైన్సు హిందూస్దాన్‌ అంతటా వ్యవసాయం-వుత్పాదక పరిశ్రమ మధ్య వున్న సంబంధాన్ని కూకటి వేళ్లతో పెకలించాయి.’

పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు జరిపారు. పారిశ్రామికీకరణతో వుపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. యజమానుల చర్యలు మార్కెట్లకోసం యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. కార్మికుల బతుకుపోరు మేడే, సోషలిజం, కమ్యూనిజం వంటి దోపిడీలేని నూతన సమాజాల అన్వేషణకు పురికొల్పాయి. ప్రతి ఏడాది మే ఒకటవ తేదీ, దీన్నే అంతర్జాతీయ కార్మిక దినం అని కొన్ని చోట్ల కార్మికదినం అని పిలుస్తారు. కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరపాలన్నది వారి చైతన్యానికి గీటురాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చెమటలు కక్కుతూ శారీరక శ్రమను, అధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే.

మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికులు అగ్రగాములలో ముఖ్యులు. దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బగ్గు, పత్తి,జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన జాతీయవాదులు, వుదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం. దీని ప్రభావం కార్మికవర్గ అవగాహనమీద కూడా పడింది. కొంత మంది కార్మిక సమస్యల కంటే వారిని సామ్రాజ్యవాద వ్యతిరేకులుగా మార్చటంపైనే కేంద్రీకరించారు. బ్రిటీష్‌ యజమానులు, భారత యజమానుల ఫ్యాక్టరీల పట్ల తేడా వుండాలని చెప్పారు. కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీలు పోటీని తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881,91లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.

తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది.1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో వుత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) కూడా ఏర్పడింది. ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర వుద్య మాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటు. ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.

బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని వుల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. 1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. భారత కార్మికోద్యమ చరిత్రలో తొలి నేతగా సుఖరామ్‌ నమోదయ్యాడు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం, ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి’ అని రాశారు. మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బగ్గు కంపెనీ, 1854లో బంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికులు సంఖ్య మూడులక్షలు మాత్రమే.

రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా వుదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. కొంత మంది వీటిని వూట సిద్ధాంతంగా వర్ణించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా వున్న చట్టాలను అమలు జరపకుండా వుపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.

ే మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే వుంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

28 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ 1 Comment

Tags

communist, communist manifesto, karal marx, Karl Marx and Friedrich Engels, Raoul Peck, The Young Karl Marx

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లాస్‌ ఏంజల్స్‌ కార్మిక సంఘాలలో కమ్యూనిస్టుల అనర్హత ఎత్తివేత !

30 Saturday Dec 2017

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

communist, communist exclusion, Los Angeles County Federation of Labor, US communist party

ఎం కోటేశ్వరరావు

కాలిఫోర్నియాలోనే కాదు, మొత్తం అమెరికాలోనే లాస్‌ ఏంజల్స్‌ కౌంటీ లేబర్‌ ఫెడరేషన్ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అలాంటి ఫెడరేషన్‌ వెలి యుగానికి మంగళం,స్వాగతానికి నాంది పలికే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేదు అనే నిబంధన తొలగిస్తూ డిసెంబరు 18న నిబంధనావళిని సవరించింది. ఇది నిజంగా ప్రపంచ కమ్యూనిస్టులకు ఎంతో వుత్సాహాన్నిచ్చే అంశం. కమ్యూనిస్టులంటే ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తుల కంటే ఎక్కువగా దూరంగా పెట్టే విధంగా ప్రచారం చేసిన అమెరికాలోని ఒక ప్రముఖ రాష్ట్రంలో ఇలాంటి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవటం చిన్న విషయమేమీ కాదు. అక్కడి పరిస్ధితిలో మార్పు ప్రారంభానికి అదొక సూచిక. దీనికి ఒక మహిళ ఆద్యురాలు కావటం మరొక విశేషం.

కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు 1798నాటి పరాయి శత్రు మరియు దేశద్రోహ చట్టాలకు 1917,18లో దుమ్ము దులిపింది.కమ్యూనిజంపై ప్రచ్చన్న యుద్ధానికి నాందిగా 1947లో టాఫ్ట్‌-హార్టలే చట్టాన్ని చేసింది. వీటిని ప్రయోగించి కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేకుండా చేసేందుకు కార్మిక సంఘాల నాయకత్వాలపై బెదిరింపులకు పాల్పడి వత్తిడి తెచ్చింది. దాంతో అనేక సంఘాలు ఆమేరకు తమ నిబంధనావళులను సవరించాయి. కమ్యూనిస్టులుగా తెలిసిన వారెవరినీ అనుమతించకుండా అడ్డుకున్నాయి. అప్పటికే కమ్యూనిస్టులని తెలిసివారిని బహిష్కరించాయి. కార్మిక సంఘాలపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించే పేరుతో కార్మిక నాయకులుగా వున్న అనేక మంది నాయకులు సిఐఏ, విదేశాంగశాఖతో కుమ్మక్కయి విదేశాలలో కమ్యూనిస్టు ప్రభావితమైన వనే పేరుతో కార్మిక యూనియన్లను విచ్చిన్నం చేసేందుకు కొమ్ముకాశారు.

లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌లో ఇలాంటి పురోగామి మార్పుకు కారణం మరియా ఎలెనా డురాజో అనే ఒక మహిళ చొరవ అంటే అతిశయోక్తి కాదు. ఆరులక్షల మంది సభ్యులున్న ఆ కార్మిక సంఘానికి తొలిసారిగా నాయకత్వం వహించిన అతివగా కూడా ఆమె చరిత్రకెక్కింది.2006 నుంచి 14 వరకు కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యత నిర్వహించిన ఆమె అమెరికా జాతీయ కార్మిక సంఘంలో బాధ్యతలకు ఎన్నికై లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వం నుంచి తప్పుకున్నారు. 2018లో జరగనున్న కాలిఫోర్నియా సెనెట్‌ ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లాస్‌ ఏంజల్స్‌ రాజకీయాలలో ఏకైక శక్తివంతమైన మహిళ అని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

అమెరికాలోని రెండు రాజకీయపక్షాలలో తక్కువ ప్రమాదకారిని ఎంచుకోవాలనే రాజకీయం నడుస్తోంది. ఇటీవలి కాలంలో దాన్నుంచి బయటపడాలనే మధనం అనేక తరగతులలో ప్రారంభమైంది. తక్కువ ప్రమాదకారి రాజకీయాలకు స్వస్ధి పలకాలని అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ మరియు కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ) అక్టోబరు చివరి వారంలో జరిగిన సమావేశం ఆమోదించిన ప్రధాన రాజకీయ తీర్మానంలో పేర్కొనటం అమెరికా కార్మికోద్యమం, రాజకీయాలలో ఒక ముఖ్యపరిణామం. రెండింటిలో ఏది తక్కువ ప్రమాదకారి అని చూడటానికే మనం పరిమితం కావటంలోనే ఎంతో సమయం గడచిపోయిందని తీర్మానం పేర్కొన్నది. అయితే స్పష్టమైన ప్రత్యామ్నాయం ఎలా వుండాలనే అంశపై చర్చలో భిన్న అభిప్రాయాలు వెలువడినప్పటికీ ఒక ప్రత్యామ్నాయం కావాలనే అంశంపై మొత్తం మీద ఏకీభావం వెల్లడి కావటం విశేషం. సమాఖ్య రాజకీయ కమిటీ, మరియు ,అఖిల అమెరికా మున్సిపల్‌ వుద్యోగుల సంఘాధ్యక్షుడు లీ సాండర్స్‌, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ అధ్యక్షుడు రాండీ వెయిన్‌ గార్టన్‌ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో ఈ రెండు అతి పెద్ద వుద్యోగ సంఘాలు. మొత్తం మీద సభ నిర్వాహకులు పేరు పెట్టకపోయినా ఒక కార్మికపార్టీ పెట్టాలని అందరితో అనిపించారు. కార్పొరేట్స్‌, ధనికులకు అనుకూలంగా పనిచేస్తున్న రాజకీయ వ్యవస్ధ కార్మికవర్గానికి స్ధంభాలుగా వుంటూ మంచి వుద్యోగాలు, భద్రతకు మద్దతు ఇచ్చేవాటిని ఒకదాని తరువాత మరొకదానిని హరించిందని, రాజకీయ వ్యవస్ధ కార్మికులను దశాబ్దాలుగా విఫలులను చేసిందని వెయిన్‌ గార్టన్‌ పేర్కొన్నారు.

డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండూ కార్పొరేట్ల ఆధిపత్యంలో వున్నాయని కార్మికవర్గ పార్టీని ఏర్పాటు చేయాలని కోరిన ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను గట్టిగా ముందుకు తెచ్చిన తపాలా కార్మిక సంఘాధ్యక్షుడు మార్క్‌ డైమండ్‌స్టెయిన్‌ మాట్లాడుతూ 1993లో నాఫ్టాను ఆమోదించిన నాటి నుంచి తానీ ప్రతిపాదనను ముందుకు తెస్తూనే వున్నానని పేర్కొన్నారు.2008 ఎన్నికలలో అమెరికా పార్లమెంట్‌ వుభయ సభలలో మెజారిటీతో పాటు అధ్యక్ష పదవిని చేపట్టినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కార్మికవర్గానికి ప్రాధాన్యత, కార్మిక సంస్కరణలకు పూనుకోకుండా పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వంటి వాటిని ముందుకు తెచ్చిందని డైమండ్‌స్టెయిన్‌ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. రిపబ్లికన్లు యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు. డెమోక్రటిక్‌ అధ్య క్షుడు బిల్‌క్లింటన్‌ వాల్‌స్ట్రీట్‌(కార్పొరేట్లు)పై నియంత్రణలను ఎత్తివేశారు. ఒక కార్మికవర్గపార్టీ నిర్మాణం అన్నది దీర్ఘకాలిక పధకంగా వుండాలి, దానికి కార్మికవర్గంతో పాటు ఇతర సమాజ మద్దతు కూడా కావాలి.రెండు పార్టీల వ్యవస్ధకు పరిమితమై వుండాలని చెప్పటం ఎంత తప్పవుతుందో కార్మికవర్గ పార్టీకే మన వుద్యమం పరిమితం కావాలనం కూడా అంతే తప్పువుతుందని డైమండ్‌ స్టెయిన్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు వ్యవసాయ కార్మిక సంఘనేత బాల్డ్‌మర్‌ వెల్‌స్క్వెజ్‌,ఇతరులు మద్దతు ఇచ్చారు. కార్మికపార్టీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్న డడ్జిక్‌ మాట్లాడుతూ కార్మికవర్గ పార్టీ నిర్మాణానికి ఒక దృక్కోణం వుండాలి, ఇసుక గూళ్లను కడితే లాభం లేదని కింది నుంచి కార్మికోద్యమ నిర్మాణం జరగాలని అన్నారు. ఇపుడున్న విధానంతోనే కొనసాగుతూ భిన్నమైన ఫలితాలు రావాలని ఆశించటం పరిష్కారం కాదని ఒక ప్రతినిధి స్పష్టం చేశారు. కార్మికవర్గం వెనుక పట్టుపట్టిన వర్తమాన స్ధితిలో కార్మికవర్గ పార్టీ నిర్మాణం చేయలేమని కొందరు వాదించారు. ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గ్రెగ్‌ జునేమన్‌ మాట్లాడుతూ నడవబోయే ముందు మన దోగాడాలి, పరుగెత్తబోయే ముందు నడవాలి, దౌడు తీయబోయే ముందు పరుగెత్తాలి అన్నారు. కార్మికవర్గ పార్టీని పెట్టటానికి సుముఖంగా వున్నవారు ముందు స్ధానిక, రాష్ట్ర ఎన్నికలలో పాల్గనాలి, డెమోక్రటిక్‌ పార్టీ వారు మనకెలాంటి వుపకారం చేయటం లేదు, చేయబోరు అని వ్యవసాయ కార్మిక సంఘనేత చేసి వ్యాఖ్యను అందరూ అంగీకరించారు. మన విప్లవానికి అనుకూలమైన కార్మివర్గం అనే అంశంపై జరిగిన ఒక చర్చలో ఏడు జాతీయ సంఘాల ప్రతినిధులు పాల్గన్నారు. గతేడాది డెమొక్రటిక్‌ పార్టీ ప్రాధమిక శాఖల సమావేశాలలో బెర్నీ శాండర్స్‌ సవాలుతో తలెత్తిన వుద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశ నిర్ణయంతో వెంటనే అమెరికాలో కార్మికవర్గ దృక్పధంతో పనిచేసే కొత్త పార్టీ ఏర్పడనుందనే భ్రమలకు లోనుకావాల్సిన అవసరం లేదు. రెండు ప్రధాన పార్టీలను (నిజానికి అనేక పార్టీలున్నా ఎన్నికలలో ప్రధానంగా పోటీ పడే రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో అక్కడ నిజంగా రెండు పార్టీలే వున్నాయని జనం అనుకుంటారు) ముందుకు తీసుకు వచ్చి అవే ఒకదానికొకటి ప్రత్యామ్నాయం అని నమ్మించటంలో అమెరికాతో సహా అనేక ధనిక దేశాలలో పాలకవర్గం జయప్రదమైంది. మరొక ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించని ఏది తక్కువ ప్రమాదకారి అయితే దాన్ని ఎంచుకోవటానికి జనం కూడా అలవాటు పడ్డారు. అయితే ధనిక దేశాలలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు,కార్మికవర్గం సాధించుకున్న విజయాలు ఒక్కొక్కటి వమ్ముకావటం ప్రారంభమైన తరువాత రెండు పార్టీలు ఒకటే అనే నిర్ధారణకు జనం రావటం ప్రారంభమైంది. పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఈ ఆలోచనను మరింతగా పెంచి ఒక మధనానికి దారితీసింది. సాంప్రదాయ పార్టీలను జనం నమ్మటం లేదని గ్రహించటంతో వారి అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు పచ్చిమితవాద శక్తులు ముందుగా రంగంలోకి దిగాయి.ఇది కూడా వర్గ సమీకరణలను వేగవంతం చేసేందుకు పురికొల్పే పరిణామమే. వర్గదృక్పధం గల శక్తులు ఏ రూపంలో ముందుకు వస్తాయనేది చూడాల్సి వుంది.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య చేసిన తీర్మానం డెమోక్రటిక్‌ పార్టీకి ఒక తీవ్ర హెచ్చరిక వంటిది. తక్కువ హానికరం చేసేదనే పేరుతో మితవాద రిపబ్లికన్‌ పార్టీకి బదులు తమకు ఓట్లు వేయటం తప్ప కార్మికులకు మరొక మార్గం లేదని ఆ పార్టీ ఇంకేమాత్రం భ్రమలో వుండకూడదని వేసిన తొలి కేక ఇది. సమాఖ్య సమావేశంలో తక్కువ హాని చేసే పార్టీని ఎంచుకోవాలనే వైఖరికి స్వస్తి పలకాలనే తీర్మానాన్ని ముందుకు తెచ్చిన నేతలిద్దరూ రాజకీయంగా డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సభ్యులే. అందువలన తమ తీర్మానం స్వయంగా తమ పార్టీకే వ్యతిరేకమని వారికి తెలియనిది కాదు. పార్టీలతో నిమిత్తం లేకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో కార్మికఅనుకూల అజెండాను ముందుకు తేవాలని కూడా పై తీర్మానం పిలుపునిచ్చింది. ఈ అజెండా, తీర్మానాన్ని కార్మికవర్గంలోని అన్ని తరగతుల వారికి వివరించేందుకు అవసరమైన సమాచార వ్యవస్ధను కూడా కార్మిక సమాఖ్య నిర్ణయించింది.

కార్మికవర్గంలో తొలుగుతున్న భమ్రలు, జరుగుతున్న మధనానికి ప్రతిబింబమే కార్మిక సమాఖ్య తీర్మానం.దీనికి గతేడాది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించి బరిలోకి దిగటం, పెద్ద ఎత్తున యువత నీరాజనం పట్టటం కూడా అనుకోకుండా జరిగింది కాదు. నవంబరు 11-12 తేదీలలో అమెరికా కమ్యూనిస్టుపార్టీ నిర్మాణ మహాసభ జరిగింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక అవటం, అతగాడి విధానాలు కమ్యూనిస్టుపార్టీ నిర్మాణానికి నూతన పరిస్ధితిని కల్పించిందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఏడాదిలో వెయ్యి మంది కొత్త సభ్యులు చేరారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పార్టీ సభ్యత్వ కార్డు బమ్మను పోస్టు చేయగానే వందల మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది వ్యక్తిగతంగా చేరగా మరికొందరు బృందాలుగా సభ్యత్వం కోసం వచ్చారు. ఓహియో విశ్వవిద్యాలయంలో ఒక సభలో కమ్యూనిస్టుపార్టీ నేత చేసిన వుపన్యాసం తరువాత అక్కడికక్కడే పన్నెండు మంది సభ్యత్వం కావాలని అడిగారు. ఇలా అనేక నగరాలలో యువత ముందుకు వస్తోందని నివేదికలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన క్లబ్బుల ద్వారా ముందుగా జనాన్ని పిటీషన్లపై సంతకాలు చేయమని, తరువాత ప్రదర్శనలకు హాజరు కమ్మని అడుగుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అలా వచ్చిన వారిని మీరు కమ్యూనిస్టుపార్టీలో ఎందుకు చేరకూడదని చర్చ పెడుతున్నారు. అలాంటి పద్దతుల్లో చేరిన వారు కూడా ఎందరో వున్నారు. ఈ అనుభవాన్ని చూసిన తరువాత అనేక చోట్ల కమ్యూనిస్టు పార్టీ క్లబ్బులను ఏర్పాటు చేసి జనాన్ని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో పార్టీ ఫేస్‌బుక్‌, వెబ్‌సైట్లను సందర్శి ంచే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పార్టీ పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమే. అయితే ఇది అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించటం సాధ్యం కానప్పటికీ పార్టీలో చేరుతున్న తీరుతెన్నులను ఇటీవలి కాలంలో చూడలేదని నివేదిక పేర్కొన్నది. లోపాల గురించి వివరిస్తూ పెరుగుదల సంతోషకరమే అయినప్పటికీ అతిగా చెప్పనవసరం లేదు, అనేక చోట్ల సభ్యుల, నాయకుల వయస్సుపైబడిన తీరు కనిపిస్తోంది.కొందరు సమావేశ ం కావటం లేదు, రోజువారీ పోరాటాలలో పాల్గనటం లేదు, కొందరు వెబ్‌సైట్లకే పరిమితం అవుతున్నారు. సభ్యులతో సంబంధాలు, ఇతర అంశాలకు సంబంధించి అనేక అంశాలను ఈ సభలోచర్చించి అవసరాలకు అనుగుణ్యంగా కార్యకలాపాలను పెంచి ప్రజాబాహుళ్య పార్టీగా పెంపొందించాలని నిర్ణయించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నూటఅరవై కోట్ల మందిని బలితీసుకున్న పెట్టుబడిదారీ విధానం !

07 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, CAPITALISM, communist, mass murdering evil of capitalism, Nazism, revolution

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాన్ని వదలని కమ్యూనిస్టు బూచి !

23 Saturday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist manifesto, Indonesian Communist Party (PKI)., specter of communism, Suharto’s Purge

ఎంకెఆర్‌

‘ఒక భూతం ఐరోపాను తరుముతోంది, అదే కమ్యూనిస్టు భూతం’ అంటూ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు 1848 ఫిబ్రవరిలో వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అంటే కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కమ్యూనిజం గురించి ఐరోపా పాలకవర్గం భయపడటం ప్రారంభమైతే ఇప్పుడు అది ప్రపంచం వ్యాపితంగా పాలకవర్గాలను వణికిస్తోంది. కమ్యూనిజాన్ని భూస్తాపితం చేశాం, అదింక పైకి లేవదు అని పాతికేండ్ల క్రితం ప్రగల్బాలు పలికిన వారే తమ నీడను చూసి తామే భయపడుతున్నారు. సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకొని బరిలోకి దిగామని జబ్బలు చరుచుకుంటున్న అమెరికాలోనే మూల మూలల నుంచి అవును నేను సోషలిస్టును అని సగర్వంగా రొమ్ము విరుచుకుంటూ ముందుకు వస్తున్న వారిని చూసి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. సోషలిజం, కమ్యూనిజం మంచిదే కానీ వాటిని అమలు జరిపే కమ్యూనిస్టులు ఈ రోజుల్లో లేరు అనే వారు ఎందరో అయితే అమెరికన్ల ప్రచార ప్రభావంతో ప్రపంచానికి కమ్యూనిజం పనికిరాదు అని చెప్పేవారు కూడా వున్నారు.

సెప్టెంబరు 18వ తేదీన జకర్తాలోని ఒక భవనంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీని పునరుద్ధరించేందుకు సభ జరుపుతున్నారంటూ వందలాది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు గుమికూడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఇంతకూ ఏమిటా సమావేశం ? ఐదు దశాబ్దాల క్రితం ఇండోనేషియా మిలిటరీ లక్షలాది మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను, అనుమానం వచ్చిన వారిని హత్య చేసింది. వారి కుటుంబవారసులు, మానవ హక్కుల కార్యకర్తలు నాటి హత్యాకాండ గురించి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, నేరస్థులను శిక్షించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి బాధిత కుటుంబాలకు న్యాయ సలహాలను అందచేసేందుకు జరుగుతున్న సమావేశమది. దాన్ని పాలకపార్టీ, మిలిటరీ కనుసన్నలలో పనిచేసే ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో వున్న శక్తులు కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సభగా చిత్రించి దాడికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వుత్తుత్తి కేసులతో జరిపే ఒక తతంగం తప్ప వేరు కాదు.

కమ్యూనిస్టులను వూచకోత కోసి, పార్టీని సిషేధించి నామ రూపాలు లేకుండా చేసి ఐదు దశాబ్దాలు గడిచినా ఇండోనేషియా పాలకవర్గాన్ని కమ్యూనిస్టు బూచి వదలటం లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనిస్టులు తిరిగి రంగంలోకి వస్తారో అన్న భయం వారిని నిదురపోనివ్వటం లేదు. అక్కడ పేరుకు పౌర పాలన అయినప్పటికీ పెత్తనమంతా వుక్కు పాదాలదే. అడుగడుగునా వారి పాద ముద్రలు కనిపిస్తుంటాయి. వీధుల్లో ఎవరైనా ఎర్రరంగు చొక్కా ధరించి కనిపిస్తే మ్యూనిస్టుకిందే లెక్క. మిలిటరీ పోలీసులు నిర్ధారించుకొని కానీ వదలరు. ‘కమ్యూనిస్టుల విద్రోహం’ పేరుతో నిర్మించిన ప్రచార సినిమా ప్రదర్శనలు ఈనెల 30న దేశమంతటా జరిగేట్లు చూడాలని మిలిటరీ ఆదేశాలిచ్చిందంటే అక్కడ వున్నది ఏ తరహా పాలనో అర్ధం చేసుకోవచ్చు. భారీ ఖర్చుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చాలా కాలం క్రితం నిర్మించిన ఆ సినిమాను ప్రతి ఏటా 30వ తేదీన టీవీలో ప్రసారం చేస్తారు. కమ్యూనిస్టులను హతమార్చేందుకు అమెరికా సిఐఏ భాగస్వామ్యంతో ఇండోనేషియా మిలిటరీ జరిపిన కుట్రలో భాగంగా 1965 సెప్టెంబరు 30న కొంతమంది మిలిటరీ అధికారులను హత్య చేసి వారిని తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులు చంపివేశారని ప్రచారం చేశారు. దాన్ని సాకుగా చూపి లక్షలాది మంది కమ్యూనిస్టులు, అభిమానులు, కమ్యూనిస్టులనే పేరుతో అనేక మంది చైనా జాతీయులను వూచకోత కోశారు.

వర్తమాన తరాలకు సరైన చరిత్రను తెలిపేందుకు ఆ సినిమాను విధిగా ప్రదర్శించేట్లు చూడాలని కోరిన మాట నిజమే అని సైనికాధికారులు నిర్ధారించారు. దానిలో కమ్యూనిస్టులు దేవుడిపై విశ్వాసం లేని దుష్టులని, అందుకే వారు సైనికాధికారులను చంపివేశారని, కనుక వారి మీద నిషేధం విధించటం సరైనదేనని చెప్పేందుకు ఆ చిత్రాన్ని నిర్మించారు.

నాటి హత్యా కాండ గురించి బహిరంగంగా చర్చించటాన్ని అధికారికంగా నిషేధించారు. సోమవారం నాటి సమావేశంలో బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం అందచేసే అంశం గురించి చర్చించారు. అక్కడి నిబంధనంల ప్రకారం మూడు వందలు అంతకు మించి ఎక్కువ మంది గుమి కూడా సమావేశాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. ఈ సమావేశానికి 50 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. అయినపప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ జరపతలపెట్టిన ఒక సమావేశాన్ని కూడా అంతకు ముందు జరగనివ్వలేదు. ప్రభత్వం ఎంతగా అణచివేతలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడ వున్నది పౌర ప్రభుత్వం కనుక విధిలేని పరిస్ధితులలో పరిమితంగా అయినా కొంత చర్చకు అవకాశం కల్పించక తప్పటం లేదు. 2012,14 సంవత్సరాలలో హత్యాకాండపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు, 2016లో ప్రభుత్వమే బాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలను వినేందుకు రెండు రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్న ప్రాంతాలలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కంటితుడుపు చర్యగానే మిగిలి పోయింది. తాజా పరిణాలను చూసినపుడు దేశంలో భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం లేదని, నియంత సుహార్తో రోజులను గుర్తుకు తెస్తున్నారని ఇండోనేషియన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ ప్రతినిధి అరిఫ్‌ బంబానీ వ్యాఖ్యానించారు. గతేడాది కాలంలో జర్నలిస్టులపై దాడులు రెట్టింపయ్యాయని చెప్పారు.

మలేషియా ప్రచురణ సంస్ధ తకుల్‌ సెటాక్‌ జకర్తాలో గతేడాది అక్టోబరులో నిర్వహించిన ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం వుండటంపై మిలిటరీ, పోలీసు అధికారులు ఏడు గంటల పాటు నిర్వాహకులను ప్రశ్నించారు. మ్యూనిస్టు సాహిత్యం విక్రయించటాన్ని ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని ప్రచారం చేయటంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత సోషలిస్టు, కమ్యూనిస్టు చిహ్నాలను కూడా జన జీవితం నుంచి తొలగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా తిరిగి పునరుద్ధరించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నకొద్దీ దాని నుంచి దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక దాడితో పాటు, గత చిహ్నాలను కూడా అంతర్ధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వూహించని పరిణామం కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా తూర్పు ఐరోపాలోని అల్బేనియాను తొలుత ఇటాలియన్‌ ఫాసిస్టులు, తరువాత నాజీలు అక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు నడుం కట్టిన కమ్యూనిస్టుపార్టీ ఇతర జాతీయవాదులను కూడా ప్రతిఘటనలో భాగస్వాములను చేసేందుకు 1942 సెప్టెంబరు 16న ఒక సమావేశాన్ని పెజా అనే గ్రామంలోని మైస్లిం పెజా అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. చరిత్రలో దానిని పెజా సమావేశం అని పిలిచారు.అల్బేనియా విముక్తిలో అదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోజున జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలు ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం గురించి విన్న ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నేత లుజిమ్‌ భాషా గత కమ్యూనిస్టు ప్రభుత్వ చిహ్నాలన్నింటినీ నిషేధించాలని అందుకు గాను జర్మనీ, ఇతర దేశాలలో మాదిరి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. దేశంలో కొంత మంది ఇప్పటికీ ఎన్వెర్‌ హోక్సా, కమ్యూనిస్టు పాలన గురించి బెంగతో వున్నారని, ఈ జబ్బు నయం చేయటానికి పైపూతలు చాలవని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిధులతో కమ్యూనిస్టుల హయాంలో జరిగిన నేరాల పరిశోధన పేరుతో ఏర్పాటు చేసిన సంస్ధ కమ్యూనిస్టుల పాలనలో నిర్మించిన సినిమాల ప్రదర్శన నిషేధం గురించి ఒక ముసాయిదా బిల్లు తయారు చేసే పనిలో వుంది. ఒక్కసారిగా అన్నింటిపై నిషేధం అంటే ఎదురుతన్నే అవకాశం వుందని అందువలన సినిమాకు ముందు దాని గురించి చెబుతూ పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడాలని సంస్ధ నిర్వాహకుడు చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనలు బహిర్గతం కాగానే కమ్యూనిజంతో విబేధించే వారు కూడా గత చరిత్రను తుడిచి వేయటాన్ని అంగీకరించబోమని కొందరు పేర్కొన్నారు. గతేడాది జరిపిన ఒక సర్వేలో 42శాతం మంది కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా గురించి సానుకూలంగా స్పందించారు.

పూర్వపు సోషలిస్టు దేశాలలో కమ్యూనిస్టుచిహ్నాలను పూర్తిగా చెరిపివేయాలన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆ పని చేస్తే ప్రస్తుతం అధికారంలో వున్న పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేకలక్షణాన్ని స్వయంగా బయట పెట్టుకున్నట్లు అవుతుందని తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తే యువతరంలో కమ్యూనిజం గురించి ఆసక్తి పెరిగే ప్రమాదం వుందన్న కోణం నుంచి పూర్తిగా చెరిపి వేయాలనటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. తూర్పు ఐరోపా దేశాలన్నీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినవే. కమ్యూనిస్టుపార్టీ చిహ్నాలను లేకుండా చేయటం అంటే ఆ ఘనచరిత్రను తుడిచి వేయటమే. వుక్రెయిన్‌లో 2015లో చేసిన రెండు చట్టాల ప్రకారం కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించటమే గాక, ఎవరైనా కమ్యూనిస్టు పాలకులు చేసిన పనులను నేరాలుగా ఎలా చెబుతారని ప్రశ్నించటాన్ని కూడా నేరంగా ఆ చట్టంలో పొందుపరిచారు. హంగరీలో 2000 సంవత్సరంలో కమ్యూనిస్టు, ఫాసిస్టు చిహ్నాలను నిషేధించటంపై కోర్టులలో అనేక సార్లు సవాలు చేసిన వుదంతాలున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అయితే పాండవులు-కౌరవులనేమనాలి ?

04 Monday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, anti-communist fiesta, communist, Hitler, Joseph Stalin, Nazism, totalitarian regimes

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు సమాజ చరిత్ర మొత్తం వర్గపోరాటాల మయమే అని కారల్‌ మార్క్స్‌ భాష్యం చెప్పారు. దాన్నే మహాకవి శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మరింత సుబోధకంగా జనం ముందు పెట్టారు. విజేతలే ఎప్పుడూ చరిత్రను రాశారు. రెండు సంస్కృతులు సంఘర్షించినపుడు పరాజితులు రూపుమాసిపోతారు. విజేతలు తమ గొప్పతనాన్ని పెద్దదిగా చూపుతూ చరిత్ర పుస్తకాలు రాస్తారు, ఓడిపోయిన శత్రువు గురించి వాటిలో అగౌరవంగా చిత్రిస్తారు అని డాన్‌ బ్రౌన్‌ అనే పెద్దమనిషి చెప్పాడు.

ప్రపంచంలో దోపిడీ వ్యవస్ధ సంక్షోభానికి గురైనపుడల్లా మితవాద శక్తులు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా నాజీలైనా కమ్యూనిస్టులైనా ఒకటే ప్రాణాలు తీస్తారు, అలాంటపుడు నాజీలే మెరుగు అని జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. దోపిడీ శక్తుల సమాచార యుద్ధంలో ఇదొక ప్రధాన ఆస్త్రం. నమ్మకం లేదా ప్రచారంలో వున్నదాని ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు మహాభారత యుద్దం జరిగింది. దానిలో కౌరవులు, పాండవులూ కత్తులు దూశారు. యుధిష్టిరుడు నష్టాల గురించి ధృతరాష్ట్రుడికి చెప్పినదాని ప్రకారం ఇరువైపులా 166 కోట్ల 20వేల మంది మరణించగా, 2,45,165 మంది మాత్రమే మిగిలారు. ఇంత మందిని బలి తీసుకున్నప్పటికీ మన సమాజం ఆ యుద్ధంలో పాండవుల పాత్రను హర్షిస్తూ, కౌరవులను విమర్శిస్తున్నది. చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తున్నది. పెద్ద సంఖ్యలో జనం మరణించారు గనుక పాండవులు, కౌరవులు ఇద్దరిదీ తప్పే, ఇరు పక్షాలూ దుర్మార్గమైనవే అనటం లేదు. పాండవులు-కౌరవులను ఒకే గాటన కట్టకూడదన్నపుడు కమ్యూనిస్టులు-నాజీలను ఒకే గాటన ఎలా కడతారు.

1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళికతో దోపిడీ వర్గానికి సరికొత్త ప్రతిఘటన ప్రారంభమైంది. అది ఒక రాజుపై మరొక రాజు, ఒక అధికార(పాలకవర్గ) పార్టీపై మరొక పార్టీ మధ్య జరిగే పోరు, ప్రతిఘటన కాదిది. కనుకనే అప్పటి నుంచి చరిత్రను దోపిడీ వర్గమే కాదు, దోపిడీకి గురయ్యే వర్గం కూడా తన దృక్పధంతో సమాజం ముందుంచుతోంది. మార్క్స్‌కు ముందు, తరువాత చరిత్ర రచనలో వచ్చిన మౌలిక మార్పు ఇది. ప్రస్తుతం మన దేశంలో అధికార వ్యవస్ధలో పైచేయి సాధించిన కాషాయ దళాలు ఇప్పటి వరకు మన ముందుంచిన చరిత్రను నిరాకరిస్తూ తిరగరాసేందుకు, వాస్తవాల ప్రాతిపదికన కాకుండా మతం, విశ్వాసాల ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది వాస్తవానికి దగ్గరగా వుందన్నదే జనం తేల్చుకోవాల్సింది.

ఐరోపాను ఒక దయ్యం వణికిస్తోంది, అదే కమ్యూనిజం అని మార్క్స్‌-ఎంగెల్స్‌ 168 సంవత్సరాల క్రితం చెప్పారు. సోషలిజం-కమ్యూనిజాలపై విజయం సాధించాం, అదింక కోలుకోలేదు అని పాతిక సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీవర్గం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా కమ్యూనిస్టు భావజాలంపై దాడి, మ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ కమ్యూనిస్టు వ్యతరేక సమావేశాలు ఎందుకు జరుపుతున్నట్ల్లు ?

రెండవ ప్రపంచ యుద్ధం ముగస్తున్న దశలో ఐరోపా భవిత్యం గురించి 1945 ఫిబ్రవరి 4-11 తేదీలలో జరిగిన యాల్టా సమావేశంలో పొల్గొన్న చర్చిల్‌-రూజ్‌వెల్ట్‌- స్టాలిన్‌. నాజీజం-కమ్యూనిజం ఒకటే అయితే దానికి జర్మనీ నాజీ ప్రతినిధులను ఎందుకు పిలవలేదు ?

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన నాజీజం, హిట్లర్‌ పీచమణిచి ఆ ముప్పు తప్పించిన శక్తులకు నాయకత్వం వహించింది స్టాలిన్‌. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా నాటి సోవియట్‌ యూనియన్‌-హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ మధ్య 1939 ఆగస్టు 23న నిర్యుద్ధ సంధి జరిగింది.అది సోవియట్‌-జర్మనీ మధ్య ఆ ప్రాంత ఐరోపా దేశాలను విభజించుకొనేందుకు జరిగిన ఒక చీకటి ఒప్పందం, దాని వలన కోట్లాది మంది జనం ప్రాణాలు కోల్పోయారంటూ సోషలిజం-నాజీశక్తులను ఒకే గాటన కడుతున్నారు. దానిలో భాగంగానే ఆ సంధి వలన ప్రాణాలు కోల్పోయినవారు, బాధితులను స్మరించుకొనే పేరుతో 2009 ఏప్రిల్‌ రెండున ఐరోపా పార్లమెంట్‌ చేసిన నిరంకుశపాలన వ్యతిరేక తీర్మానం మేరకు ని ప్రతి ఏడాది ఆగస్టు 23న ఐరోపాలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఎస్తోనియా రాజధాని తాలిన్‌లో కమ్యూనిస్టు పాలకుల నేరాల పేరుతో ఐరోపా దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం జరిపారు. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వున్నందున ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రీస్‌ మంత్రి ప్రకటించారు. ఐరోపా చారిత్రాత్మక జ్ఞాపకాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదని ఐరోపా వామపక్ష పార్టీ పేర్కొన్నది. పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌ అయిన ఎస్తోనియాను అటువంటి సమావేశానికి వేదికగా చేసుకోవటం సైద్ధాంతిక లక్ష్యం కోసమే అని పేర్కొన్నది. గ్రీకు మంత్రి బహిష్కరణ నిర్ణయాన్ని ఎస్తోనియా పార్లమెంట్‌ సభ్యురాలు వుడెక్కి లూనే సమర్ధిస్తూ ఒక లేఖ రాశారు. ఆ సమావేశాన్ని నిర్వహించటమంటే ప్రస్తుత ఎస్తోనియా రాజకీయాలు నాజీజాన్ని పరోక్షంగా సమర్ధించటమే అని పేర్కొన్నారు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయాన్ని మేతొమ్మిదవ తేదీన జరపాలన్న తన నిర్ణయంపై అనేక మంది జర్నలిస్టులు, రాజకీయవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అదే సమయంలో మద్దతు కూడా లభించిందని లూనే పేర్కొన్నారు.

ఎస్తోనియా అధ్యక్షతన రెండవ సారి జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక సమావేశాన్ని సిపిఎం, సిపిఐతో సహా 83కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు ఒక ప్రకటనలో ఖండించాయి. ఫాసిజాన్ని కమ్యూనిజంతో సమంచేసి చెప్పటం రెచ్చగొట్టటం, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ద గర్బంలో జన్మించిన ఫాసిజాన్ని నిర్దోషిగా ప్రకటించటం తప్ప మరొకటి కాదని, ఈ కారణంగానే కమ్యూనిస్టులను ఖండించటం, హింసించటం, అనేక ఐరోపా దేశాలలో పార్టీలపై నిషేధం విధిస్తున్నారని అదే సమయంలో నాజీలతో కుమ్మక్కైన వారు, వారి రాజకీయ వారసులకు పెన్షన్లు ఇస్తున్నారని కమ్యూనిస్టుపార్టీల ప్రకటన పేర్కొన్నది. కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాలు పెరగటం అంటే ప్రజావ్యతిరేక చర్యలను తీవ్రతరం చేయటం, కార్మికుల హక్కులను పరిమితం చేయటం, సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాలకు తెరతీయటమే అని హెచ్చరించింది. మహత్తర అక్టోబరు విప్లవానికి వందేండ్లు నిండిన సందర్భంగా నిజాలు వెలుగులోకి వస్తాయని, టన్నుల కొద్దీ మట్టి చల్లి సోషలిస్టు వ్యవస్ధ గొప్పతనాన్ని మూసిపెట్టటం సాధ్యం కాదని, సంపదలను సౄష్టించే కార్మికులు దానిని తమ పరం చేసే సమాజం కోసం పోరాటాలు జరిపి సోషలిజం నుంచి కమ్యూనిజానికి పయనిస్తారని పేర్కొన్నది.

హిట్లర్‌ తమ పార్లమెంట్‌ భవనాన్నే తగుల బెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశాడు. ప్రజల హక్కులను హరించటంతో పాటు కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1933లోనే ఆ దుర్మార్గానికి పాల్పడిన హిట్లర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకత లోకవిదితం. తొలుత పక్కనే వున్న కమ్యూనిస్టు రష్యాను దెబ్బతీస్తే మిగతా ప్రపంచాన్ని చాపలా చుట్టి తన కింద వుంచుకోవచ్చని భావించిన హిట్లర్‌ అందుకు సన్నాహాలు చేసి సాకు, సమయం కోసం ఎదురుచూశాడు. ఆ తరుణంలో స్టాలిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ బలాబలాలను మదింపు వేసి, తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు, నాటి సామ్రాజ్యవాదుల మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొనేందుకు ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో స్టాలిన్‌ నిర్యుద్ధ సంధి చేసుకుంది తప్ప ఐరోపాను పంచుకొనేందుకు కాదు. అదే హిట్లర్‌ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సంధిని వుల్లంఘించి గురించి సోవియట్‌పై దాడికి దిగటం, ఆ దాడిలోనే పరాజయం, ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.అలాంటి హిట్లర్‌ – స్టాలిన్‌ను ఒకే గాటన కట్టటం దుర్మార్గం. ఐరోపాలోని బ్రిటన్‌, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఒకవైపు జర్మన్‌ సామ్రాజ్యవాదంతో వివాద పడుతూనే కమ్యూనిస్టు రష్యాను కూల్చివేసేందుకు హిట్లర్‌కు ఏ విధంగా మద్దతు ఇచ్చిందీ తెలిసిందే. చివరకు తమకే ముప్పు రావటంతో చేతులు కలిపారు తప్ప కమ్యూనిస్టులపై ప్రేమతో కాదు. హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు,ఫాసిస్టులు తలెత్తటానికిి, బలపడటానికి అనుసరించిన విధానాల బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. స్టాలిన్‌-హిట్లరూ ఇద్దరూ ఒకటే అయితే స్టాలిన్‌తో ఎందుకు చేతులు కలిపినట్లు? తొలుత జర్మనీలో, తరువాత హిట్లర్‌ ఆక్రమించుకున్న పోలాండ్‌ తదితర దేశాలలోనే యూదుల మారణకాండ జరిగింది తప్ప కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వచ్చిన ప్రాంతాలలో అలాంటి వూచకోతలు జరగలేదు, దేశాలను ఆక్రమించుకోలేదు. అలాంటపుడు నాజీజం-సోషలిజం ఒకటే ఎలా అవుతాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలను నియంతృత్వశక్తుల చేతుల్లోకి నెట్టారన్నది ఇంకొక ఆరోపణ. కమ్యూనిస్టులను నియంతలుగా చిత్రించటం అంతకు ముందు జరిగిందీ తరువాత కొనసాగిస్తున్న పాత చింతకాయ పచ్చడి ప్రచారం తప్ప వాస్తవం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అసాధ్యం కావటంతో తన పెరటితోట వంటి దక్షిణ(లాటిన్‌) అమెరికాలోని ప్రతి దేశంలో, ఆసియాలో తన కనుసన్నలలో వున్న దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ వంటి చోట్ల మిలిటరీ నియంతలను నిలబెట్టి వాటిని దోచుకున్న అమెరికా చరిత్ర దాస్తే దాగుతుందా? ఆఫ్రికాలో అమెరికా మద్దతు లేని నియంత ఎవడైనా వున్నాడా ? గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా లేదా ఇప్పుడు చైనాగాని ఏ ఒక్క సైనిక నియంతకైనా మద్దతు ఇస్తున్న వుదంతం వుందా? అమెరికా, ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలలో నయానాజీ శక్తులు తలెత్తుతున్నాయి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి.

ఆగస్టు నెలలో అనేక అమెరికా నగరాలలో నయా నాజీ, ఫాసిస్టు శక్తులు రెచ్చిపోయి భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో జాత్యహంకారం, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులు కూడా వాటి ప్రచారం, ప్రదర్శనలకు పోటీగా వీధులలోకి వస్తున్నాయి. చార్లెటిసవిలేలో జరిగిన దానికి ఇరు వర్గాలూ బాధ్యులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించి నయానాజీలను వెనకేసుకు వచ్చాడు. స్వేచ్చాభిప్రాయ వెల్లడికి అవాకాశం ఇవ్వాలని కోరుతూ బర్కిలీలో జాత్యహంకారులు చేసిన ఒక ప్రదర్శన సందర్బంగా జాత్యంహంకారులు కొందరిని వామపక్ష ప్రదర్శకులు కొట్టారని, చూడండి వామపక్ష మద్దతుదారులు ఎలా దాడులకు పాల్పడుతున్నారో అంటూ వాషింగ్టన్‌ పోస్టు వంటి పత్రిలు గోరంతను కొండంతగా చిత్రించాయి.ముందే చెప్పుకున్నట్లు ప్రచార యుద్దంలో ఇదొక భాగం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాదం ఎందుకు ?

28 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Bernie Sanders, communist, Indonesian Communist Party (PKI).

ఎం కోటేశ్వరరావు

అమెరికాతో సహా అనేక దేశాలలో మరోసారి ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు గాను గతంలో చెప్పిన వాటికి భిన్నమైన కారణాలను చూపుతున్నప్పటికీ పూసల్లో దారంలా వున్న ఏకైక అంశం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటమే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో తొలి శ్రామిక రాజ్య ఆవిర్భావం, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ను కమ్యూనిస్టులు మట్టి కరిపించటం, వలసరాజ్యాలకు జాతీయోద్యమాలు మంగళం పాడటం, చైనాతో సహా సోషలిస్టు శిబిర విస్తరణ వంటి పరిణామాలు అమెరికా నాయకత్వాన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాయి. స్వయంకృత వైఫల్యాలు కొన్ని వున్నప్పటికీ పాతికేండ్ల క్రితం తొలి సోషలిస్టు రాజ్యం, దాని అండతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను సామ్రాజ్యవాదులు పతనం కావించారు. సోషలిజం, కమ్యూనిజం వెనుక పట్టు పట్టిందనే వాతావరణం ఎల్లెడలా ఏర్పడింది. తాము విజయం సాధించామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకున్నారు. అయినా సరే ప్రస్తుతం ప్రపంచంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఎందుకు ?

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ కమ్యూనిస్టులు ప్రభుత్వ వుద్యోగాలలో చేరటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది ఎగువ సభ ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుందని వచ్చిన వార్తలపై రాసిన ఒక విశ్లేషణను మీరు చదివారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడిపై వచ్చిన తీవ్ర వత్తిడి కారణంగా ఎగువ సభ ఆమోదానికి పెట్టకుండానే దానిని వుపసంహరించుకున్నాడు.1950 దశకంలో ఒక అసెంబ్లీలో అలాంటి నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనూహ్యం, అలాంటిది 2017లో ఒక ప్రముఖ రాష్ట్రంలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన రోబ్‌ బంటా ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టటం తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య అది ఆమోదం పొందటమే ఆశ్చర్యం. విజయం కమ్యూనిస్టు శక్తులకు వుత్తేజం కలిగించినప్పటికీ దాంతో అంతా అయిపోయిందని, కమ్యూనిస్టు వ్యతిరేకత అంతరించిందని ఎవరూ భావించలేదు, కనుకనే బిల్లు వుపసంహరణ నిరుత్సాహకారణం కాలేదు.

తీర్మానం పెట్టినందుకు నన్ను కమ్యూనిస్టు అన్నారు, చైనా వెళ్లమన్నారు, హత్య చేస్తామని బెదిరించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేదని భావించి నేను ఇప్పటికీ భావిస్తున్నప్పటికీ ఈ సమస్య లేవనెత్తిన మనోభావాల కారణంగా ఆ ప్రతిపాదనతో ముందుకు పోరాదని నిర్ణయించుకున్నానని రోబ్‌ చెప్పాడు. నిజానికి అవి ప్రధాన కారణాలుగా కనిపించటం లేదు. గతేడాది ఎన్నికలలో తాను సోషలిస్టును అని బహిరంగంగా చెప్పుకున్న బెర్నీశాండర్స్‌కు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపటం, అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందని, కొంత మంది రష్యాతో కుమ్మక్కయ్యారంటూ రోజూ వస్తున్న వార్తా కథనాలు, అక్కడ కూడా పెట్టుబడిదారీవిధానమే వున్నప్పటికీ ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మనోభావాలు ఇంకా అమెరికన్లలో బలంగానే వున్న కారణంగా రోబ్‌పై వత్తిడి అధికమైందని చెప్పవచ్చు.

నిజానికి కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇదే మొదటిది కాదు. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాలను చేశాయి. అయితే సుప్రీం కోర్టు అలాంటివి చెల్లవు అని చెప్పటంతో అమలు చేయకుండా అలాగే వుంచేశారు. అరిజోనా రాష్ట్రంలో వున్న చట్టాన్ని 2003లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడను కాను అని ప్రమాణం చేయటానికి బదులు ఏ వుగ్రవాద సంస్ధలోనూ సభ్యుడను కాను అని సవరించారు. కొన్ని చోట్ల విధేయత ప్రమాణాన్ని స్వచ్చందం చేశారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2008లో అలాంటి తీర్మానం లేదా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్‌గా వున్న సినీ నటుడు ష్కావర్జ్‌నెగ్గర్‌ దానిని వీటో చేశాడు. ‘చట్టాన్ని మార్చాల్సినంత తప్పనిసరి కారణం నాకు కనిపించటం లేదు, అమెరికా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కమ్యూనిస్టు కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్న చట్టాన్ని కొనసాగించాల్సి వుంది ‘ అని కారణం చెప్పాడు. 2012 నుంచి ఇప్పటికి మూడు సార్లు జో ఇట్జ్‌గిబ్బన్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి అలాంటి చట్టాన్ని సవరించాలని వాషింగ్టన్‌లో ప్రయత్నించి రిపబ్లికన్ల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాడు. అయితే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వుంటానని, రిపబ్లికన్లు తమ వైఖరిని మార్చుకోవాలని, వారి రష్యన్‌ స్నేహితులతో సంప్రదింపులు జరుపుకోవచ్చని జో చెప్పాడు.

అమెరికా ఇలా జరుగుతోంటే దాని కుట్రలో భాగంగా కమ్యూనిస్టులను వూచకోత కోసిన ఇండోనేషియాలో అక్కడి పాలకవర్గం తన నీడను తానే నమ్మలేనంతగా అదిగో కమ్యూనిస్టుల పునరుజ్జీవనం, ఇదిగో కమ్యూనిస్టు చిహ్నం అంటూ వులికి పడుతోంది. ఇండోనేషియాలో కమ్యూనిజ పునరుద్ధరణ గురించి భయపడాల్సిందేమీ లేదంటూనే ఈ సమస్యను అధిగమించాల్సి వుందని ఇండోనేషియా మంత్రి లుహుట్‌ పాండ్‌ జైతాన్‌ తన గోల్కార్‌ పార్టీ జాతీయ నాయకుల సమావేశంలో చెప్పారు.’ సిద్దాంతాన్ని మనం పాతి పెట్టలేము, అది వునికిలోనే వుంటుంది, అయితే దేశ సిద్ధాంతమైన పంచశీలను మార్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే వారిని మనం ఎదుర్కోవాలి, ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్కార్‌ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి, కమ్యూనిజం పెరగటానికి వీలు లేకుండా చూడాలి అని లుహుట్‌ చెప్పాడు. సుత్తీ, కొడవలి చిహ్నాలున్న టీ షర్టులు అమ్మేవారిని, వేసుకొనే వారిని కమ్యూనిస్టులుగా అనుమానించి అరెస్టులు చేస్తోంది. అక్కడి పాలకవర్గం ఎంతగా వులిక్కి పడుతోందంటే ఇండోనేషియా రిజర్వుబ్యాంకు నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా కాపీ చేయటానికి వీల్లేకుండా కొత్తగా ముద్రించిన నోట్లలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన లోగో కమ్యూనిస్టు చిహ్నాలను పోలి వుందంటూ అక్కడి ముస్లింమతోన్మాద శక్తులు నానా యాగీ చేశాయి. దాంతో అదేమీ లేదని బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు ఇవి కాదోయ్‌ చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . తర తరాలుగా దోపిడీదార్లపై జరిగిన ప్రజా ప్రతిఘటనలో ధీరోదాత్తుల కథలు వుత్తేజాన్ని కలిగిస్తాయి. చారిత్రాత్మక తెలంగాణా ప్రజాప్రతిఘటనలో విసునూరు దేశముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ, నైజాం నవాబు రాజ్యం ఎలా ధ్వంసమైందీ ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే విధంగా జనం చెప్పుకుంటారు. కానీ ఆ దేశముఖ్‌, నిజాం వారసులు ఇప్పుడు వచ్చి కమ్యూనిస్టుల చేతిలో తమ కుటుంబాలు బాధపడిన చరిత్రను నమోదు చేయాలని, తమ ప్రతిఘటనను వీరోచితంగా చిత్రించాలని కోరితే ఎలా వుంటుంది? తూర్పు ఐరోపాలో అదే జరుగుతోంది. సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తూర్పు ఐరోపా దేశాలలో జనాన్ని సంతృప్తి పరచటంలో విఫలమైన పాలకవర్గం రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతను సజీవంగా వుంచేందుకు నానా గడ్డీ కరుస్తోంది. సోషలిస్టు వ్యవస్ధ ఏర్పాటు సమయంలో తిరుగుబాటు చేసిన భూస్వామిక, పెట్టుబడిదారీ, వాణిజ్యవేత్తల కుటుంబాలకు చెందిన వారి కథలతో దోపిడీ వర్గ చరిత్రను సమాజంపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాల ఏర్పాటు, అణచివేతకు గురైన వారి పేరుతో స్మారక కేంద్రాల నిర్మాణాలు చేస్తున్నారు.

ఇలాంటి చరిత్రకు గతంలో స్ధానం ఇవ్వలేదు, భవిష్యత్‌లో వుండదన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడ సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం వ్యాపించినా అమెరికాలో అందుకు స్ధానం లేదన్నది అనేక మంది భావన. ఎవరి నమ్మకం వారిది, వారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా భావ స్వాతంత్య్రంలో భాగంగా గౌరవిద్దాం. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి. అంతా అయిపోయింది, ఇక భవిష్యత్‌ లేదు అని మెజారిటీ అనుకుంటున్న సమయంలో కమ్యూనిజం గురించి భయపడేవారు వున్నారనే విషయం కూడా ఆ మెజారిటీకి తెలియటం అవసరం. అమెరికాలోని పాలకవర్గ డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ అనే ఒక ఎంపీ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధిగా ఎన్నుకోవాలని పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమెరికాలోని క్రిస్టియన్‌ లీగల్‌ సొసైటీ అనే ఒక సంస్ధ సిఇఓ డేవిడ్‌ నమో అనే పెద్దమనిషి నేషనల్‌ రివ్యూ అనే పత్రిక మార్చినెల సంచికలో ఒక వ్యాసం రాసి అమెరికా భవిష్యత్‌కు సోషలిస్టు భావజాలం ముప్పు తెస్తున్నది గమనించండి అంటూ మొర పెట్టుకున్నాడు. ఓ సర్వే ప్రకారం పది మందిలో నలుగురు పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్త్నుట్లు తేలిందని హెచ్చరించాడు. బెర్నీ శాండర్సు పలుకుబడి వలన ఈ వుద్యమం ఆదరణ పొందిందని భావించటం గాక అసలు వుద్యమానికి అదొక సూచికగా పరిగణించాలని పేర్కొన్నాడు. అంటే శాండర్స్‌ గాక పోతే మరొకరిని ఆ వుద్యమం ముందుకు తెచ్చేది. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నది అందుకే.అనేక అనుభవాల తరువాత దోపిడీ వర్గంతో పాటు దానిని వ్యతిరేకించే వారు కూడా తమ ఎత్తుగడలు, భాషకు నగిషీ పెడుతున్నారు. దోపిడీ వర్గం తన అధికారాన్ని కాపాడుకొనేందుకు సాయుధ శక్తులను నిరంతరం పెంచిపోషిస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ దోపిడీ వర్గాల ప్రతినిధిగా పని చేయటం తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క వుదంతంలో కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన వుదంతం మనకు కనపడదు. దోపిడీ, దోపిడీ శక్తులను ఎదుర్కోవటానికి కార్మికవర్గం శాంతియుత మార్గాన్నే ఎంచుకుంటుంది, అనివార్యమైతేనే ఆయుధాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.ఈ విషయాన్ని కమ్యూనిస్టులు ఎన్నడూ దాచుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే ఆధికారం తప్ప ఇతర పద్దతులలో రాదంటూ కొందరు హింసాత్మక పద్దతులతో సోషలిజాన్ని సాధిస్తామని పిలుపులు ఇవ్వటం, శ్రామికవర్గ నియంతృత్వాన్ని అమలు చేస్తామనే పదజాలాన్ని వినియోగించటం, అన్ని దేశాలలో దోపిడీ శక్తుల నిర్మూలనకు ఆయుధాలు పట్టిన వుదంతాలను చూపి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేయని తప్పుడు ప్రచారం లేదు.

నైజాం నవాబు, అతగాడికి వెన్నుదన్నుగా వున్న దేశముఖులు, జాగీర్దార్లు కోరిన వెంటనే వెట్టి చాకిరీ రద్దు, భూములను దున్నేవారికే అప్పగించి వుంటే తెలంగాణా రైతాంగం ఆయుధాలను పట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. నిర్బంధం పెరిగిన కొద్దీ వడిసెలలతో ప్రారంభించిన దళాలు తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోరిన వెంటనే బ్రిటీషు వారు స్వాతంత్య్రం ఇచ్చి వుంటే భగత్‌ సింగుకు బాంబులతో, సుభాష్‌ చంద్రబోస్‌కు విముక్తి దళాల నిర్మాణం అవసరమయ్యేది కాదు. వినతి పత్రాలతో ప్రారంభమైన స్వాతంత్య్ర వుద్యమం అల్లూరి సీతారామరాజు కాలం నాటికి విల్లంబులు, తుపాకులు పట్టాల్సి వచ్చింది. స్వపరిపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలను క్రమంగా ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రారంభంలో విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని మాత్రమే కోరింది.

ప్రస్తుతం అమెరికాలో సోషలిస్టులుగా సగర్వంగా చెప్పుకుంటున్న బెర్నీ శాండర్స్‌ వంటి వారు ప్రజాస్వామిక సోషలిజం గురించి మాట్లాడుతున్నారు తప్ప అమెరికా దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనో, సాయుధపోరాటం చేస్తామనో చెప్పటం లేదు. ఆర్ధిక సంక్షోభం, అసమానతలు, దారిద్య్రం, సంక్షేమ పధకాలకు కోత వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు కూడా తుపాకి గొట్టం ద్వారానే అధికారం వంటి నినాదాలు ఇచ్చి వుంటే అణచివేత సులభమై వుండేది. తాము కోరుతున్న ప్రజాస్వామిక సోషలిజాన్ని, సంక్షేమ చర్యలను అమలు జరిపేందుకు నిరాకరించినపుడు ఏం చేయాలో అమెరికన్లే నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్న అంశమిదే.అందుకే మొగ్గలోనే సోషలిజం కోరుకొనే వారిని తుంచి వేయాలని కోరటంలో అంతరార్ధమిదే. అమెరికాలో కమ్యూ నిస్టు పార్టీ వున్నప్పటికీ ప్రజాస్వామిక సోషలిస్టు పార్టీ(డిఎస్‌ఏ) కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నామ మాత్రంగా వుంది. అలాంటి పార్టీలో గతేడాది ఎన్నికల నాటికి 8,500 సభ్యత్వం వుంటే మే నాటికి 21వేలకు చేరిందని అఫింగ్టన్‌ పోస్టు పత్రిక తాజాగా రాసింది. దశాబ్దాలుగా సోషలిజం అనే పదం గిట్టనివారు నేడు దాన్ని వదిలించుకుంటున్నారన్నది స్పష్టం. ఎందుకు ?

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో యువత విద్యకోసం తీసుకున్న అప్పులపాలై వున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో మరింత యాంత్రీకరణ కారణంగా అమెరికాలో ప్రభుత్వ వుద్యోగాలతో సహా మొత్తం యాభై శాతం వుద్యోగాలు రద్దవుతాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తమ తలిదండ్రుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవించే తొలి తరంగా యువత జీవనం గడపబోతున్నది. పర్యావరణ ముప్పు సరేసరి. ఇంతకాలం తాము బలపరిచిన పెట్టుబడిదారీ విధానం ఇంతకంటే తమకు మెరుగైన జీవితాన్ని ఇవ్వదనే విషయాన్ని యువత క్రమంగా గ్రహిస్తున్నది. అందుకే దాని బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.

గతంలో సోషలిజం ఆకర్షణీయంగా వుండటం కారణమైతే, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో పడటం, అనేక భ్రమలతో సోషలిజాన్ని వదులుకున్న దేశాలు పెట్టుబడిదారీ విధానం గురించి పునరాలోచించటం, అంతకు మించి సోషలిస్టు విధానంలో వున్న వాటి కంటే పరిస్ధితులు దిగజారటం గురించి జనంలో చర్చ జరగటం, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం చైనా తదితర సోషలిస్టు దేశాలను అంతగా ప్రభావితం చేయకపోవటం వంటి కారణాలు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, జనం ఆ వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని వక్రీకరించవచ్చు తప్ప వాస్తవ సమాచారాన్ని కోరుకొనే వారిని నిరోధించటం సాధ్యం కాదు. సోషలిజం, కమ్యూనిజం గురించి గతంలో మాదిరి కట్టుకధలు చెబితే యువత బుర్ర ఆడించే పరిస్ధితి లేదు. ఆస్ట్రేలియాలో ఒక హైస్కూలు విద్యార్ధిని ఆ స్కూలు నిరంకుశ యాజమాన్యం రెచ్చగొట్టి దేనికి పురికొల్పిందో చూడండి.

స్వేచ్చా ప్రపంచంగా వర్ణితమయ్యే దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మేనెల ఏడవ తేదీన సిడ్నీ నగరంలో జరిగిన ఒక మేడే ప్రదర్శనకు జస్సీ అనే 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్ధి హాజరయ్యాడు. అది అతనికి తొలి మేడే ప్రదర్శన. అదే రోజు అతని స్కూలు స్ధాపకుడి సంస్మరణార్దం నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా జెస్సీ మేడే ప్రదర్శనకు వెళ్లాడు. అందుకు గాను శనివారం నిర్బంధ శిక్ష విధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. తలిదండ్రులకు పంపిన లేఖలో స్కూలు కార్యక్రమానికి బదులు మేడే ప్రదర్శనకు వెళ్లినట్లు, శనివారపు శిక్షలు ఎక్కువగా వుంటే స్కూలు నుంచి బయటకు పంపే విషయాన్ని ఆలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు.

గతేడాది స్కూలు స్ధాపకుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లిన తనకు అక్కడి తంతు విసుగు పుట్టించిందని జెస్సీ చెప్పాడు. మరి మేడే ప్రదర్శనకు ఎందుకు వెళ్లావు అనిఅడిగితే మేడే గురించి ట్విటర్‌లో అమెరికన్ల మరియు ప్రపంచమంతటి నుంచీ జరిగిన రచ్చ గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. హాజరైతే ఎలా వుంటుందో తెలుసుకోవాలనే వుబలాటంతో వెళితే నిజంగానే ఎంతో వుద్వేగం కలిగింది అని చెప్పాడు. శనివారం నాడు విధించిన శిక్షా సమయంలో మౌనంగా వుండకుండా స్కూలు చర్యను నిరసిస్తూ అణచివేత గురించి తాను రాసుకు వచ్చిన మార్క్సిజం విశ్లేషణను చదివాడు. వచ్చే ఏడాది మేడే ప్రదర్శనకు హాజరయ్యేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తాను. ఒక వేళ ఇవ్వకపోతే ఎలాగైనా సరే మేడే ప్రదర్శనకు వెళతా. స్కూలు విధించే శిక్ష నన్ను నిరసన తెలపకుండా ఆపలేదు అని చెప్పాడు. అంతే కాదు ఆరోజు స్కూలు ప్రారంభానికి ముందు వుదయం, స్కూలు తరువాత సాయంత్రం రెండు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెస్సీ. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత తెలిసిందే. అమెరికా, ఇతర దాని వుపగ్రహ దేశాల పాలకవర్గ కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా చివరికి దానికే దారి తీస్తుందా ? అవును అని చెప్పటానికి సందేహించనవసరం లేదు, చరిత్ర చెప్పిన సత్యమది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: