• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Communists

అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? పశ్చిమ దేశాల యువత సోషలిజం వైపు మొగ్గుతోందా ?

29 Friday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Bolshevik Revolution, Communists, october revolution, Vladimir i Lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


రష్యా నవంబరు విప్లవం గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు అంటూ అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ రాశారు. 1917 నవంబరు ఏడవ తేదీ( పాత కాలెండరు ప్రకారం అక్టోబరు 25)న జారు చక్రవర్తిని కూల్చివేసి కమ్యూనిస్టులు ప్రధమ శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.1991లో దాన్ని కూల్చివేశారు.అయినా ఆ విప్లవం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రమజీవుల పోరాటాలకు ఉత్తేజం కలిగించేదే, గుణపాఠాలు నేర్పేదే. దాని గురించి ఎంత రాసినా, ఎన్నిసార్లు రాసినా తరిగేది కాదు. 2017నవంబరు ఆరవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన విశ్లేషణకు ” వందేండ్ల తరువాత తిరిగి వచ్చిన బోల్షివిజం, మనం ఆందోళన పడాలి ” అని శీర్షిక పెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. దాని ప్రకారం అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? రష్యాలో తిరిగి సోషలిజం వస్తుందా ? అమెరికాలో కుర్రకారు పెట్టుబడిదారీ విధానాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు.చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా, లావోస్‌, కంపూచియా సోషలిస్టు దేశాలుగా నిలిచి కొనసాగుతున్నప్పటికీ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలకు తగిలిన ఎదురు దెబ్బలతో అనేక మంది నిరాశ చెందారు. తరువాత లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు వామపక్ష శక్తులకు ఉత్తేజమిస్తున్నాయి. నవంబరు విప్లవదినం సోషలిస్టు దేశాలకు ఉత్సవ రోజైతే మిగిలిన వారికి దీక్షాదినం. ఒక్కసారి తాజా పరిణామాలను అవలోకిద్దాం.


తమకు నచ్చనివారిని, విబేధించేవారిని దేశద్రోహులు, అర్బన్‌నక్సల్స్‌, తుకడేతుకడే గాంగ్‌, హిందూవ్యతిరేకులని ముద్రవేయటం మన దేశంలో ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం. నిత్యం స్వదేశీ కబుర్లు చెబుతూ విదేశాల నుంచి తెచ్చుకున్న అనుకరణ ఇది. దీన్ని మెకార్ధిజం అంటారు. అమెరికాలో 1947 నుంచి 1957వరకు జోసెఫ్‌ మెకార్ధీ అనే సెనెటర్‌ ఉండేవాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. మీడియాలో అందరూ వామపక్ష భావజాలం ఉన్నవారే కనుక ఇలాంటి వార్తలు ఎక్కడా రావు అంటూ కల్పిత అంశాలను వాట్సాప్‌లో పంపే అబద్దాల కోర్లు మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి ఎల్లవేళలా మెకార్ధీ ఉత్తేజమిస్తుంటాడు. వారి స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడూ, ఇప్పుడు పదవి పోయిన తరువాత మెకార్ధీని అనుసరిస్తున్నాడు. మెకార్ధీ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు, నచ్చని వారికి కమ్యూనిస్టు ముద్రవేసేవాడు.రచయితలు, జర్నలిస్టులు, సినిమాతారలు, వాణిజ్యవేత్తలు ఒకరేమిటి లొంగని ప్రతివారినీ బెదిరించేవాడు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసేది. ఎంతగా వాడి ప్రభావం పెరిగిందంటే ఎన్నికల్లో వాడు సమర్ధించిన వారు గెలిచి, వ్యతిరేకించిన వారు ఓడారు. వాడి ఉపన్యాలకు మీడియా విపరీత ప్రచారమిచ్చేది.చివరికి వాడు చెప్పిన అబద్దాలకు సెనెట్‌ మందలించింది. అబద్దాలు, అవలక్షణాలన్నీ విచారణలో బహిర్గతమయ్యాయి.నలభై ఎనిమిది సంవత్సరాలకే పచ్చి తాగుబోతుగా మారి జబ్బులతో దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు అమెరికాలో మెకార్ధీలు తామరతంపరగా పుట్టుకువచ్చారు. డెమోక్రాట్లు, పురోగామివాదులు, తమను ఆక్షేపించేవారిని సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా ముద్రవేసి గతాన్ని పునరావృతం చేసేందుకు పూనుకున్నారు.అయితే బెర్నీశాండర్స్‌ వంటి ప్రముఖులు అవును మేము సోషలిస్టులమే అని ముందుకు రావటంతో లక్షల మంది యువత తాము కూడా సోషలిస్టులమే,కమ్యూనిస్టులమే అని ప్రకటించుకోవటం పెరుగుతోంది.

నవంబరు విప్లవ సమయంలో సోషలిజం ఒక ఊహ. దానికి వ్యతిరేకంగా సైద్దాంతిక చర్చ జరిగింది. పెట్టుబడిదారులు సవాళ్లు విసిరారు. తరువాత సోవియట్‌ , సోషలిస్టు శిబిరం ఏర్పడింది. వైఫల్యాలు ఎదురయ్యాయి. గత వందేళ్లుగా సోషలిజం వైఫల్యం గురించి ప్రచారం చేశారు, దానికి అమెరికా ప్రధాన కేంద్రం. చిత్రం ఏమంటే ఇప్పుడు అక్కడ సోషలిజం వైఫల్యం బదులు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ జరుగుతోంది. ఇదొక అనూహ్య పరిణామం. పెట్టుబడిదారీ సమర్ధకులు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారు. అక్కడ మీడియా సోషలిజానికి అనుకూలం కాదు, బలమైన కమూనిస్టుపార్టీ లేదు. అయినా అక్కడి విదార్ధులు సోషలిజం మంచిది, ప్రైవేటు ఆస్తిహక్కులు రద్దవుతాయి అని చెబుతున్నారు. ఎంత మాట అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా ఇది, వేదంలా విలువైన మాట అనేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు.కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కులను తీసివేసే వారిని ఎన్నుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని ఒక విలేకరి ఒక విద్యార్ధితో అన్నాడు. దానికి లేదు కేవలం పన్ను ఎగవేతకు మాత్రమే ఆస్తి హక్కులు కాదు అన్నాడు విద్యార్ది. డబ్బు అంటే ఆస్తేకదా అని విలేకరి రెట్టించాడు. పన్ను ఎగవేత ఆస్తి హక్కు అనేట్లైతే కచ్చితంగా దాన్ని రద్దు చేయాల్సిందే అని విద్యార్ధి సమాధానమిచ్చాడు. అమెరికా అంతటా ఇలాంటి ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నా. అసమానతలు, తమ రుణాలు కొండల్లా పెరగటం, తీరే దారి కనిపించకపోవటంతో విద్యార్దులు, యువతలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి.


గత వంద సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పుడు 40శాతం మంది అమెరికన్లలో, 49శాతం మంది యువతలో సోషలిజం పట్ల సానుకూలత ఉంది. అమెరికాలో స్కూలు విద్యాకమిటీలు చురుకుగా పని చేస్తున్నాయి. వాటి సమావేశాలు కమ్యూనిస్టు వ్యతిరేకులకు దడపుట్టిస్తున్నాయి. ఆ సమావేశాల్లో రాజకీయాలను చర్చించకూడదనే వారు కొందరైతే, రద్దు కోరుతున్నారు కొందరు. అది ఎంతగా అంటే ఆ కమిటీల ద్వారా తదుపరి అక్టోబరు విప్లవాన్ని త్వరలో కమ్యూనిస్టులు ప్రారంభించనున్నారని ఒక జర్నలిస్టు తాజాగా తన అక్కసును వెళ్లగక్కాడు. వాస్తవాన్ని చూస్తే దేశమంతటి నుంచి డెమోక్రటిక్‌ సోషలిస్టులు వందమంది ఎన్నికయ్యారని, బెర్లిన్‌ గోడ పతనంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారికి నోరుపడిపోయిందని, తరువాత ఒక మంచి అంశంగా తీవ్రవాద ముస్లిం జీహాద్‌ ప్రచారం వచ్చింది. మార్క్సిస్టు టీచర్లు మీ పిల్లల లింగమార్పిడి చేస్తున్నారని మధ్యతరగతి అమెరికన్లను నమ్మించటం కంటే ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధించామని చెప్పటం కష్టమని, ఎందుకంటే అవమానకర రీతిలో ఉగ్రవాదంపై మన ప్రపంచ పోరు ముగిసిందని వాపోయాడు. అమెరికా కమ్యూనిజం వైపు పయనిస్తోందని జనాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.చివరకు కరోనా కారణంగా క్రిస్మస్‌ సందర్భంగా ఎక్కువ మంది గుమికూడవద్దని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్ద డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ సలహా ఇవ్వటం కూడా కమ్యూనిజం దిశగా ప్రయాణంలో భాగమే అని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ జిమ్‌ జోర్డాన్‌ ఆరోపించాడు. పాఠశాల విద్యాకమిటీలు వామపక్ష అధికార కేంద్రాలుగా ఉన్నాయని, వాటి సమావేశాలకు వెళ్లే వారిని స్ధానిక ఉగ్రవాదులుగా ఎఫ్‌బిఐ పరిగణించాలని సెలవిచ్చాడు.


కమ్యూనిజానికి వ్యతిరేకంగా గూఢచారిగా పని చేసిన ఒక మాజీ అధికారి అమెరికాలో కమ్యూనిస్టుల కార్యక్రమం ఇదీ అంటూ పత్రికల్లో రాశాడు. ఏమిటట,యువతను సెక్స్‌, మాదక ద్రవ్యాలు, వీడియో గేమ్‌లకు బానిసలుగా చేసి వారి ధృడత్వాన్ని దెబ్బతీసి 17-24 ఏండ్ల వయసున్నవారిలో 71శాతం మందిని మిలిటరీకి పనికి రాకుండా చేయటం.ప్రస్తుతం 1,500 దినపత్రికలు, 1,100 వార,పక్ష,మాసపత్రికలు, 1,500 టీవీ ఛానళ్లు, 9,000వేల రేడియో స్టేషన్లు, 2,400 ప్రచురణ సంస్దలుండగా అవన్నీ కేవలం ఆరు కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్నాయి, వీటిన్నింటి ప్రచారం మీద అదుపుసాధించటం, జనాలను శత్రుబృందాలుగా విడదీయటం, తమ నేతల మీద విశ్వాసం లేకుండా చేయటం, ప్రజాస్వామ్యం గురించి ప్రబోధించి నిర్దాక్షిణ్యంగా, అక్రమాలతో వేగంగా అధికార స్వాధీనం,ప్రభుత్వంతో ఇష్టం వచ్చినట్లు వివిధ పధకాలకు ఖర్చు చేయించటం, ప్రజల్లో అశాంతిని ప్రోత్సహించటం, నైతిక విలువలను కుప్పకూల్చటం, మారణాయుధాలను కొనిపించాలి, తరువాత వాటిని తిరిగి తీసుకొని జనాన్ని ఇబ్బందుల్లో పడేయటం. ఈ కార్యక్రమంతో కమ్యూనిస్టులున్నారు గనుక మన దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 2022లో వాటిని తొలగించాలంటూ రాశాడు. ఊరూపేరూ లేకుండా లేదా ఏదో ఒక సంస్ద పేరుతో ముస్లింల అజెండా లేక హిందువుల అజెండా ఇది అని రెచ్చగొడుతూ రాసి పంచే కరపత్రాల గురించి మనకు తెలిసిందే. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి.


అమెరికాలో మాదిరి బ్రిటన్‌ యువతలో కూడా పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు తగ్గుతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేల్లో 80శాతం మంది కుర్రకారు తమ ఇబ్బందులకు పెట్టుబడిదారీ విధానమే కారణమన్నారు. మూడింట రెండువంతుల మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ కావాలన్నారు.పద్దెనిమిదవ శతాబ్దిలో తత్వవేత్త జీన్‌ జాక్విస్‌ రౌసియవు చెప్పిన అంశాలను ఒక విశ్లేషకుడు ఉటంకించారు. ” తినేందుకు జనానికి ఏమీ మిగలనపుడు వారు ధనికులను తింటారు” అన్నాడు. దీనికి సూచికగానే బ్రిటన్‌ సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్న టిక్‌టాక్‌, ఇతర వీడియోలలో యువత ఏదైనా తినే సమయంలో వినియోగించే ఫోర్కులతో కార్లలో ఉన్నవారు, ఫ్రిజ్‌ల దగ్గర ఉన్నవారిని చూపుతూ ఇవి మాకు లేకపోవటానికి మీరే కారకులు అనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ధనికులు నిద్రించేటపుడు ఒకకన్ను తెరవటాన్ని ప్రారంభించాలన్న మాట అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. లండన్‌ కేంద్రంగా పని చేసే ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ జూలైలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో గృహ సంక్షోభానికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని 80శాతం యువత భావిస్తోంది. వాతావరణ అత్యవసర పరిస్ధితి ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని75శాతం మంది చెప్పారు. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు 67శాతం చెప్పారు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులకు ఇది హెచ్చరిక అని సదరు సంస్ధ పేర్కొన్నది. ఈ లెక్కల గురించి కొందరికి చిన్న చూపు ఉండవచ్చు, వీటిని చెప్పింది వామపక్షవాదులు కాదని గమనించాలి.2019లో బర్నార్డో సంస్ధ జరిపిన సర్వేలో పాతికేండ్ల లోపు వారిలో మూడింట రెండువంతుల మంది తమ తలిదండ్రులతో పోలిస్తే తమ జీవితాలు అధ్వాన్నంగా ఉంటాయనే భయాన్ని వ్యక్తం చేశారు.ఆర్ధిక పరిస్ధితులే యువతను వామపక్ష అభిమానులుగా మారుస్తున్నాయని ” జనరేషన్‌ లెఫ్ట్‌ ” అనే పుస్తక రచయిత కెయిర్‌ మిల్‌బరన్‌ అన్నారు.


బ్రిటన్‌లో సుఖవంతమైన జీవితం గడపాలంటే చేతిలో మంచి జీతం తెచ్చే ఒక డిగ్రీ ఉండాలని చెప్పిన రోజులున్నాయి.2020లో జరిపిన సర్వే ప్రకారం డిగ్రీ ఉన్న-లేని వారి వేతన తేడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. మరోవైపు విద్యార్ధుల అప్పులు సగటున ఒకరికి 40,280 పౌండ్లకు చేరాయి.మూడోవంతుకు పైగా డిగ్రీ ఉన్న వారు డిగ్రీతో పనిలేని ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది.దీనికి తోడు మొత్తంగానే వేతనాలు పడిపోతున్నాయి.మన దేశంలో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని పాలకులు చెబుతున్నట్లుగానే బ్రిటన్‌ నేతలు కూడా మీకు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ” స్వయం ఉపాధి పధకంలో చేరండి ” అని చెప్పారు. మూడోవంతు మంది పాతికేండ్ల లోపు కార్మికులు వారానికి ఎంత వేతనం వస్తుందో తెలియని పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నమోదైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లవద్ద కనీసవేతనాలు, వేతనంతో కూడిన సెలవులు లేని పనులు చేస్తున్నారు. స్వేచ్చ దొరికింది గానీ పనికి భద్రత లేమి వారికి బహుమతిగా దక్కింది.యువత సోషలిజం వైపు మొగ్గుతున్నదంటే దాని అర్దం వారంతా విప్లవకారులుగా మారుతున్నారని కాదు. ఎలాంటి సంక్షోభాలు లేని సోషలిస్టు చైనా, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న సరకులను వారు నిత్యం చూస్తున్నారు గనుక అలాంటి విధానం మంచిదనే సానుకూలతవైపు మొగ్గుతున్నారు. అవసరమైతే తరువాత విప్లవకారులుగా మారతారు.యువ రచయిత్రి సాలీ రూనే తాజా నవల ” ఇన్‌ ద బ్యూటిఫుల్‌ వరల్డ్‌ వేర్‌ యు ఆర్‌ ” (అందమైన లోకంలో మీరెక్కడున్నారు)లో ఒక పాత్ర చేత ఇలా పలికించారు. ” తొలుత నేను మార్క్సిజం గురించి మాట్లాడినపుడు జనాలు నన్ను చూసి నవ్వారు, ఇప్పుడు అది అందరి నోటా నానుతోంది” దీని అర్ధం ఏమిటి ప్రచ్చన్న యుద్దంలో తాము విజయం సాధించినట్లు పెట్టుబడిదారులు ప్రకటించుకున్న మూడు దశాబ్దాల తరువాత కుర్రకారు మరింత స్వేచ్చగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి చర్చిస్తున్నారనే కదా ! అందుకే ఆర్ధికవేత్త జేమ్స్‌ మిడ్‌వే ఇటీవల ఒక తన వ్యాసానికి ” జనరేషన్‌ లెఫ్ట్‌ మైట్‌ నాట్‌ బి దట్‌ లెఫ్ట్‌ ఆఫ్టరాల్‌ ” ( ఆ వామపక్ష వాదులా… వారెంత అని ఉపేక్షించిన మాదిరి కాదు కుర్ర వామపక్షవాదులు ” అని శీర్షిక పెట్టారు.


రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడి ప్రభుత్వం పట్ల దూకుడుగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. ఇది ఎవరూ తీర్పు ఇచ్చే అంశం కాదు. ” తాజాగా జరిగిన డ్యూమా(పార్లమెంట్‌) ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు,యువ కమ్యూనిస్టులు, పార్టీతో కలసిన ఇతర వామపక్ష శక్తులు అధ్యక్షుడు పుతిన్‌కు అనూహ్య సవాలు విసురుతున్నారు. పాత తరం అంతరిస్తున్నది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొత్త పటాలం, సామాజిక మాధ్యమంతో పనిచేసే కమ్యూనిస్టులు ఎదుగుతున్నారు. వారు సిద్దాంత ఉపన్యాలు చేయకపోవచ్చు, ఎర్రజెండాలను ఊపకపోవచ్చు, వారు పుతిన్‌ ప్రభుత్వ అవినీతి, దేశంలో దారిద్య్రం గురించి నిరసన తెలుపుతున్నారు ” అని ఒకరు పేర్కొనగా, ” ఇది నిజంగా రష్యన్‌ రాజకీయాలలో శక్తివంతమైన టెక్టోనిక్‌ ప్లేట్ల (భూమి ఖండాలుగా విడిపోయి కోట్ల సంవత్సరాలు గడచినా ఆ ముక్కలు సముద్రంలో ఇంకా కుదురుకోలేదు, వాటి కదలికలు సునామీలు, భూకంపాలకు దారితీస్తున్నాయి. వాటినే శిలావరణం అంటున్నారు-రష్యన్‌ యువ వామపక్ష వాదులు రాజకీయ సునామీలు, భూకంపాలు సృష్టించగలిగిన వారని భావం) వంటివి, మార్పునకు ఇది ప్రారంభం ” అని లండన్‌ విశ్లేషకుడు మార్క్‌ గలియోటి అన్నాడు. సెప్టెంబరు పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించిన వాటి కంటే కమ్యూనిస్టులకు ఎక్కువ, అధికార పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గలియోటి అన్నాడు. ” అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి వెల్లడైన మద్దతు స్ధాయి గురించి రష్యన్‌ కులీనులకు ఎలాంటి భ్రమలు లేవు ” అని ఆర్‌ పోలిటిక్స్‌ అనే రాజకీయ సలహా సంస్ధను ఏర్పాటు చేసిన తాతియానా స్టానోవయా చెప్పింది. రష్యా రాజకీయాలలో కమ్యూలను ఇంకేమాత్రం విస్మరించకూడదని, వారిని అణచివేస్తే అజ్ఞాతవాసానికి వెళతారని కొందరు పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పటికీ స్ధలాభావం వలన మరోసారి చర్చించవచ్చు.


చరిత్ర పునరావృతం అవుతుందని పెద్దలు చెప్పారు, దాని అర్ధం గతం మాదిరే జరుగుతుందని కాదు. ప్రతి తరంలోనూ నిరంకుశ పాలకులు తలెత్తినపుడు వారిని ఎదిరించేవారు కూడా అదేమాదిరి తయారవుతారు. ఒకానొక కాలంలో ప్రత్యక్షంగా తలపడ్డారు, కర్రలు, విల్లంబులు, కత్తులతో తిరుగుబాట్లు జరిపారు. తుపాకులు వచ్చిన తరువాత అలాంటి అవసరం లేదు. పద్దతి మారింది తప్ప తిరుగుబాటు లక్ష్యం ఒక్కటే -అదే అణచివేత, దోపిడీ నిర్మూలన, ఇప్పుడూ అదే జరుగుతోంది. ” ఐరోపాను ఒక భూతం వేటాడుతోంది-అది కమ్యూనిస్టు భూతం. పాత ఐరోపాలోని అధికారశక్తులన్నీ ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు అపవిత్ర కూటమి గట్టాయి. పోప్‌, జార్‌, మెట్రినిచ్‌, గుయిజోట్‌, ఫ్రెంచి విప్లవకారులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు చేతులు కలిపారు.” అనే పదాలతో 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రచురితమైన కమ్యూనిస్టు ప్రణాళిక (మానిఫెస్టో) ప్రారంభ పదాలవి. తరువాత పరిస్దితి మారింది. ఆ కమ్యూనిస్టు భూతం అన్ని ఖండాలకు విస్తరించింది. అందువలన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాన్ని అంతమొందించాలని చూస్తూనే ఉన్నారు. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరొకడు పుట్టుకువచ్చినట్లుగా ఒక విప్లవకారుడిని అంతమొందిస్తే వేయి మంది కొత్తవారు రంగంలోకి వస్తున్నారు. దోపిడీ శక్తులను ప్రతిఘటించే, పీచమణిచే కమ్యూనిస్టులూ అవతరిస్తున్నారు. ఇరు పక్షాల ఎత్తుగడలూ, రూపాలు అన్నీ మారాయి.


ఈ నేపధ్యంలో చూసినపుడు మహత్తర నవంబరు(పాత కాలెండర్‌ ప్రకారం అక్టోబరు) విప్లవం గతం. అది ఒక్క రష్యాలోనే కాదు, దోపిడీ జరిగే ప్రతిచోటా అనివార్యం. దాని అర్ధం నవంబరులోనే జరగాలని, జరుగుతుందనీ కాదు. నవంబరు విప్లవం అంటే నరజాతి చరిత్రలో తొలిసారిగా రష్యా శ్రామికులు జారు చక్రవర్తి రూపంలో ఉన్న దోపిడీ శక్తులను కూల్చివేసి శ్రామిక రాజ్యఏర్పాటుకు నాందిపలికిన ఉదంతం. తరువాత చైనా విప్లవం అక్టోబరులోనే జయప్రదమైంది. రష్యాలో ఇప్పుడు జారు చక్రవర్తి లేడు. వాడి స్ధానంలో ఇప్పుడు ఉన్న శక్తులు వేరే ముసుగులు ధరించి ఉన్నాయి. ఆ లెనిన్‌, స్టాలిన్లు లేరు, నూతన తరం కమ్యూనిస్టులున్నారు. తిరిగి సోషలిజం స్ధాపన అనివార్యం అని నమ్ముతున్నారు. అయితే గతంలో మాదిరే వింటర్‌ పాలెస్‌ ముట్టడిస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ జారు చక్రవర్తి లేడు. అధికార కేంద్రం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు మారింది. అందువలన మరోపద్దతి, మరో రూపం అనుసరించాల్సిందే. విప్లవ కాలంలో రష్యాలో కార్మికులు, రైతులూ, చైనాలో రైతులు ఎక్కువగా కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులు నామమాత్రం. దోపిడీ కొనసాగుతూనే ఉంది, దాన్ని అంతమొందించాల్సిందే. అందువలన అక్కడ విప్లవం రావాలంటే పాత పద్దతులు, ఎత్తుగడలూ పనికి రావు. విప్లవం చుంచెలుక వంటిది. అది నిరంతరం నేలను తవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుందో తెలియదు, విప్లవం కూడా అలాంటిదే నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా బయట పడుతుందో చెప్పలేము.


వలసవాద కాలంలో శత్రువు ప్రత్యక్షంగా కనిపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్ధితులు మారాయి. కార్మికులకు తమ శ్రమను దోచుకుంటున్నవాడు ప్రత్యక్షంగా కనిపించడు, అసలు ఫ్యాక్టరీలే లేకుండా కూడా దోపిడీ సాగుతోంది. అందువలన ఎక్కడికక్కడ స్ధానిక పద్దతులు, ఎత్తుగడలు అనుసరించాల్సిందే. ఒక నమూనా అనేది లేదు, సాధ్యం కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పాటు వ్యతిరేకించేశక్తులూ, సవాళ్లూ పెరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలను వివరించటం సాధ్యం కాదు. అందుకే అమెరికా, బ్రిటన్‌, రష్యాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలనే పరిమితంగా సృజించాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వియత్నాం,ఆఫ్ఘనిస్తాన్‌ – కమ్యూనిస్టులు, కానివారికీ తేడా !!

24 Tuesday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RELIGION, USA, WAR

≈ Leave a comment

Tags

Communists, Taliban, Vietnam and Afghanistan


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పుకోలేని చోటదెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలిబాన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధికారులు పరోక్షంగా అయినా అంగీకరించకతప్పలేదు.అధ్యక్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్ధితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబాన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరువాత స్పష్టత వస్తుందా ? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడియాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతనమైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమెరికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా ? అంతకు మించి ఏమీ లేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో వియత్నాంలో సర్వనాశనమైన నాటి సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరువాత హౌచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జిడిపిలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్దం చేసుకోవచ్చు.

ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయన్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడింటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియత్నాంను 1945లో స్వాతంత్య్ర దేశంగా కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్దంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది.దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్దంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది.

1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం.ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్దాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగించాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్దం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హౌచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరువాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారిపోయింది. అఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు.

సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హౌచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్దంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు , నీరు తాగేందుకు పనికిరాకుండా చేశారు. అమెరికా యుద్ద చరిత్రలో అత్యధికంగా 58వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబాన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబాన్లు వదలివేసే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్దంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.


పరాభవం పాలైన అమెరికా తరువాత కాలం ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్ధికదాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్ధితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడికా చరిత్రకెక్కాడు.


అమెరికా విదేశాంగ , మిలిటరీ విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా ఆప్ఘన్‌ ఉదంతం కూడా నిర్ధారించింది. మూడులక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజాహిదీన్లు, తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది ? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు.1970దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్టటంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్ఘన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్ధిరపడిన తరువాత తమ దేశంపై కూడా దాడి చేయవచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది.

సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరువాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్ధితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబాన్లు పుట్టుకు వచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబాన్లకు శిక్షణ ఇవ్వటమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్దాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్ఘనిస్తాన్‌లోకి పంపింది. అదే విధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్రవాదులు తరువాత ఏకు మేకయ్యారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పెంజేష్వర్‌ లోయలో తాలిబాన్లను ప్రతిఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేV్‌ా వెనుక ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముుఠాలతో రాజీచేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడింది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబాన్లు, ఆల్‌ఖైదాను అంతమొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది.ఆల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని అనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్తాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహిస్తున్న సాలేV్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి ఆఫ్ఘన్‌ గూఢచార వ్యవస్ధ అధిపతిగా ఏర్పాటు చేసింది.తరువాత ఉపాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.


వియత్నాం-ఆఫ్ఘన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆదేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆపని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి దేశాన్ని తిరిగి నిర్మించి నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాము. ఆప్ఘనిస్తాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల,తాలిబాన్ల ప్రభుత్వం, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశాబ్దాలలో పరిస్ధితి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసిన తరువాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్ధిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడింది అమెరికన్‌ కంపెనీలు, ఆఫ్ఘనిస్తాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. ఆఫ్ఘన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ద ప్రభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాలిబాన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు.తాలిబాన్లు దేశాన్ని బాగు చేస్తారా ? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబాన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా పెట్టుబడులు : ఆంక్షలు పెట్టింది కేంద్రం – నింద కమ్యూనిస్టుల మీద !

30 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese investments, Communists, FDI, India FDI, Restrictions imposed by NDA Government


ఎం కోటేశ్వరరావు
చైనా నుంచి ఎఫ్‌డిఐల రాక మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. అసలు వాస్తవం ఏమిటి ? తమ దేశాలలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద జర్మనీ, ఆస్ట్రేలియా,చెక్‌ వంటి దేశాలు నిబంధనలలో కొన్ని మార్పులు చేశాయి. అదే పద్దతులలో మన కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ” భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన సంస్ధలు లేదా పెట్టుబడుల ద్వారా లబ్దిపొందే యజమానులైన పౌరులు అటువంటి దేశాలకు చెందిన వారైనా పెట్టుబడులు పెట్టవచ్చు, అయితే అది ప్రభుత్వ మార్గాల ద్వారానే జరగాలి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రెండు మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అనుమతితో నిమిత్తం లేకుండా నేరుగా వచ్చేవి. ప్రభుత్వ అనుమతితో వచ్చేవి రెండవ తరగతి. మొదటి మార్గంలో వస్తున్న పెట్టుబడులతో మన దేశంలోని సంస్ధలను చైనా కంపెనీలు కబ్జా చేస్తున్నాయన్నది ఒక తీవ్ర ఆరోపణ. ఒక గూండా, పలుకు బడిన రాజకీయ నేత, అధికారో బలహీనులను అదిరించి బెదిరించి స్దలాన్నో పొలాన్నో రాయించుకుంటే అది అక్రమం. ఎవరైనా అలాంటి ఫిర్యాదు చేస్తే కేసు అవుతుంది. ఏ కంపెనీ అయినా తన సంస్ధను లేదా వాటాలను అమ్మకానికి పెట్టినపుడు ఎవరి దగ్గర సత్తా ఉంటే వారే కొనుక్కుంటారు. దానిలో బలవంతం ఏమి ఉంటుంది.1963లో భారతీయులు నెలకొల్పిన విద్యుత్‌ పరికరాల సంస్ధ యాంకర్‌ గురించి తెలియని వారు ఉండరు. ఆ కంపెనీని 2007లో జపాన్‌ కంపెనీ పానాసోనిక్‌ కొనుగోలు చేసింది. అది చట్టబద్దమే, అలాగే అనేక స్వదేశీయుల మధ్యనే చేతులు మారాయి. రుచి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా దివాళా తీసింది. దాన్ని రామ్‌దేవ్‌ బాబా పతంజలి కంపెనీ కొనుగోలు చేసింది. అంకుర సంస్ధల ఏర్పాటులో అనేక మంది చైనాతో సహా పలుదేశాలకు చెందిన సంస్ధలు, వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకొని భాగస్వామ్యం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో చైనా దూసుకుపోతున్నది. ఆర్ధికంగా, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నందున వచ్చిన అవకాశాలను మన వారు వినియోగించుకుంటున్నారు. అలాంటి వెసులు బాటు చైనా కంపెనీలకు ఉన్నది. తమ వ్యాపార విస్తరణ వ్యూహాల్లో భాగంగా అవి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనల్లో ఎక్కడా చైనా అనో మరో దేశం పేరో పేర్కొన లేదు. అయితే మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాలలో పెట్టుబడులు పెట్టగలిగింది ఒక్క చైనాయే గనుక ఆ సవరణ వారిని లక్ష్యంగా చేసుకున్నదే అని మీడియా లేదా వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అది వాస్తవం. భారత ప్రభుత్వ చర్య వివక్షాపూరితం అని చైనా పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ చర్యను భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించినట్లు ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు, ఎవరైనా చూపితే సంతోషం. ” బందీ అయిన వామపక్షం ” కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఎలాంటి వైఖరీ తీసుకోలేరు అంటూ రిపబ్లిక్‌ టీవీ వ్యాఖ్యాత 2020 ఏప్రిల్‌ 19న పేర్కొన్నారు. అయినా కమ్యూనిస్టులు వ్యతిరేకించినవి ఏవి ఆగాయి గనుక ?
చైనాతో సంబంధాలను ప్రోత్సహించి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ లబ్ది పొందిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ రుస రుసలాడుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రవిశంకర ప్రసాద్‌గారు మంత్రిగా ఉన్న మోడీ సర్కార్‌ నిర్వాకం ఏమిటి ? గత పాలకుల వైఖరిని కొనసాగించిందా ? నిరుత్సాహపరచిందా ? రవిశంకర ప్రసాద్‌కు మద్దతుగా బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేస్తూ 2003-04లో 101 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్యం 2013-14 నాటికి 362 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ నిర్వాకమే అనుకుందాం. 2014 నాటికి మన దేశంలో చైనా పెట్టుబడులు 160 బిలియన్‌ డాలర్లు ఉంటే ప్రస్తుతం 2,600 కోట్లు, ఇవిగాక ప్రతిపాదనల్లో మరో 1,500 కోట్ల డాలర్లు, ఇవిగాకుండా సింగపూర్‌, మలేసియా తదితర మూడో దేశాల పేరుతో ఉన్న మరికొన్ని వందల కోట్ల డాలర్ల చైనా పెట్టుబడుల సంగతేమిటో బిజెపి మంత్రులు,నేతలు చెప్పాలి. ఇవన్నీ కమ్యూనిస్టులు చెబితే మన దేశానికి వచ్చాయా ? పోనీ బిజెపి నేతలకు తెలివితేటలు ఎక్కువ కనుక మనకు అవసరమైన పెట్టుబడులు తెచ్చుకొని మన వస్తువులను చైనాకు ఎగుమతి చేశారా అంటే అదీ లేదు. వాణిజ్య లోటు 36బిలియన్‌ డాలర్లు కాస్తా 63 బిలియన్‌ డాలర్లకు పెరిగిన తీరు చూశాము. ఇదిగాక హాంకాంగ్‌, ఇతర దేశాల ద్వారా మన దేశంలో ప్రవేశిస్తున్న చైనా వస్తువులను కూడా కలుపుకుంటే మన వాణిజ్యలోటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ నిర్వాకాన్ని ఏమనాలి ? ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ చర్చను, ఇలాంటి తప్పుడు ప్రచారాలను బిజెపి ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నట్లు ? లడఖ్‌ లడాయి కారణం. చైనా వారు మన భూభాగంలోకి రాలేదు, మన సైనికపోస్టులను ఏమీ చేయలేదు అని ప్రధాని మోడీ చెప్పటంతో పోయిన పరువు నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు బిజెపి ముందుకు తెచ్చిన ప్రచారదాడి. చైనా గురించి అలా చెప్పాలని ఏ కమ్యూనిస్టు పార్టీ లేదా నేతలు ఎవరైనా ప్రధాని నరేంద్రమోడీ గారికి చెప్పారా ? చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని చెప్పింది మోడీ మంత్రులు, మోడీగారేమో అలాంటిదేమీ లేదు అని చెబుతారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో సమన్వయం ఉందా ? దేశ ప్రజలను గందరగోళ పరచటం తప్ప ఒక పద్దతి ఉందా ?
జూలై ఒకటి తరువాత బంగ్లాదేశ్‌ నుంచి ఎగుమతి చేసే 97శాతం వస్తువులపై చైనా దిగుమతి పన్ను రద్దు చేసేందుకు రెండు దేశాల మధ్య కొద్ది రోజుల క్రితం ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో భారత్‌-చైనాల మధ్య లడక్‌ వాస్తవాధీన రేఖ వద్ద వివాదం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఇంకే ముంది భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనేందుకు చైనా ఈ రాయితీలు ప్రకటించిందంటూ మీడియాలో టీకా తాత్పర్యాలు వెలువడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనా అనేక దేశాలతో తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటున్నది. అవి ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం అయితే ప్రభావితమైన ఏదేశమైనా దానికి ఫిర్యాదు చేయవచ్చు, కేసు దాఖలు చేయవచ్చు.
అసలు ఇది ఎంత వరకు నిజం ? మీడియా పండితులకు వాస్తవాలు తెలిసి ఇలాంటి ప్రచారానికి దిగారా లేక తెలియక దిగారా ? తెలిసి చేస్తే జనాన్ని తప్పుదారి పట్టించే యత్నం, తెలియకపోతే తమ విశ్వసనీయతను తామే దెబ్బతీసుకోవటం. ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం(ఆప్టా) కింద ఇప్పటికే 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్నులు లేవు. వాటిని ఇప్పుడు 8,256కు పెంచారు.
ఇంతకీ ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1975లో జరిగిన ఆప్టాలో భారత్‌, బంగ్లాదేశ్‌,దక్షిణ కొరియా, శ్రీలంక, లావోస్‌ మధ్య జరిగిన బ్యాంకాక్‌ ఒప్పందం ఇది. తరువాత 2005లో ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం అని పేరు మార్చారు. 2001లో చైనా, 2013లో మంగోలియా ఒప్పందంలో చేరాయి. సభ్య దేశాల మధ్య దిగుమతులపై పన్నులు తగ్గించుకోవటం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పంద లక్ష్యానికి ఇది విరుద్దమైతే మన ప్రభుత్వమే బహిరంగంగా అభ్యంతరం చెప్పవచ్చు. రెండు దేశాల సంబంధాలను మరింతగా పెంచుకోవాలని షేక్‌ హసీనా-గ్జీ జింపింగ్‌ నిర్ణయించుకున్న నెల రోజుల తరువాత జూన్‌లో జరిగిన పరిణామమిది. ఈ ఒప్పందం ప్రకారం చైనా తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్దం అయితే కేంద్ర ప్రభుత్వమే తన అభ్యంతరాన్ని ఎందుకు చెప్పలేదు ? లేదా ఇలాంటి పనులు చేస్తే తాము ఒప్పందం నుంచి వైదొలుగుతామని అయినా హెచ్చరించాలి కదా ?
భారతదేశంతో తన సరిహద్దులతో కూడిన చిత్రపటానికి చట్టబద్దత కల్పించేందుకు నేపాల్‌ పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. కాళీ నది తూర్పు ప్రాంత భూమి తమది అని అక్కడి నుంచే తమ పశ్చిమ సరిహద్దు ప్రారంభం అవుతుందని నేపాల్‌ చెబుతోంది. కాళీ నది నేపాల్‌ చెబుతున్న ప్రాంతం కంటే బాగా దిగువన ప్రారంభమైనందున ఆ ప్రాంతంతో నేపాల్‌కు సంబంధం లేదని నది ప్రారంభ స్ధానం గురించి నేపాల్‌ చెబుతున్నదానిని అంగీకరించటం లేదని మన దేశం చెబుతున్నది. ఈ వివాదం గురించి నేపాల్‌తో చర్చించవచ్చు, పరిష్కరించవచ్చు. నేపాల్‌ తన దేశ చిత్రపటాన్ని రాజ్యాంగంలో చేర్చటం వెనుక చైనా ఉన్నది అంటూ ఈ సమస్యలో కూడా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన లాభదాయకమా? నష్టమా ? నష్టం అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ఆరు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా సమీక్షించిందా ? నష్టం అని తేలితే గతంలో చేసుకున్న ఒప్పందాలన్నింటి నుంచి వైదొలిగేందుకు తీసుకున్న చర్య లేమిటి ? పది దేశాలతో కూడిన ఆగేయ ఆసియా దేశాల అసోసియేషన్ను ” ఆసియన్‌” అని పిలుస్తున్నాము. వీటితో మరో ఆరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశం 2010జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. మన ఉత్పతులను ఆదేశాల మార్కెట్లలో నింపాలన్నది మన ఆలోచన. కానీ దానికి బదులు వాటి ఉత్పత్తులే మన మార్కెట్లో ఎక్కువగా వచ్చి చివరకు మనకు వాణిజ్యలోటును మిగిల్చాయి. ఆ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతను తెలిపారు. రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి తోట పంటల ఉత్పత్తులు మన మార్కెట్లోకి వస్తే కేరళ రైతాంగానికి నష్టదాయకమని నాడు చెప్పారు. అదే జరిగింది.
2019 సెప్టెంబరు నెలలో బాంకాక్‌లో జరిగిన ఆసియన్‌-భారత్‌ సమావేశంలో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాలని నిర్ణయించారు. అనేక దేశాలు, అసోసియేషన్లతో చేసుకున్న స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు తమకు పెద్దగా ఉపయోగపడటం లేదని, వాటిని సమీక్షించాలని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు గత కొంతకాలంగా ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు.యుపిఏ అయినా ఎన్‌డిఏ అయినా అనుసరిస్తున్నది దివాలా కోరు విధానాలే. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి హానికరం అనుకుంటే వాటిని చేసుకోబోయే ముందు బిజెపి ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ఆసియాలో గరిష్ట సంఖ్యలో అలాంటి వాటిని చేసుకున్నది మనమే అని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 42 ఒప్పందాల మీద అవగాహనకుదిరితే వాటిలో 13 అమల్లో, 16 సంప్రదింపుల్లో , 12 పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద అమలు జరిగిన వాటి సారం ఏమిటంటే అవి లేకపోతే మన వాణిజ్య పరిస్ధితి ఇంకా దిగజారి ఉండేది. దక్షిణాసియా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం( సాఫ్టా) 2006 నుంచి అమల్లో ఉంది. అప్పుడు 680 కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2018-19 నాటికి 2850 కోట్ల డాలర్లకు పెరిగింది. మన వాణిజ్య మిగులు 400 నుంచి 2100 కోట్లడాలర్లకు పెరిగింది. ఆసియన్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం లావాదేవీలు గణనీయంగా పెరగటానికి తోడ్పడింది గానీ మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్యలోటు పెరిగింది. దక్షిణ కొరియాతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తీరు తెన్నులు చూస్తే ఎగుడుదిగుడులు ఉన్నా మన దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఒక్క సాఫ్టా తప్ప మిగిలిన వన్నీ మనకు పెద్దగా ఉపయోగపడలేదు. అందువలన వాటిని సమీక్షించటానికి కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్‌ వారు గానీ ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. అధికారానికి వచ్చినప్పటి నుంచి జనాన్ని మత ప్రాతిపదికన చీల్చి మెజారిటీ ఓటు బ్యాంకును ఎలా పెంచుకోవటమా అన్న యావతప్ప దేశ అభివృద్ధి గురించి పట్టించుకొని ఉంటే నేడు ఈ పరిస్ధితి ఉండేదా అని అందరూ ఆలోచించాలి.
పదమూడు సంవత్సరాల పాటు పారిశ్రామికంగా ముందున్న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున ఆ నమూనాను దేశమంతటా అమలు జరుపుతామని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. గత పాలనా అనుభవం కారణంగా ప్రధానిగా నేరుగా రంగంలోకి దిగుతానని చెప్పిందీ మోడీ గారే. అలాంటి వ్యక్తి పాలనలో ఆరేండ్లు తక్కువేమీ కాదు. దక్షిణాసియాలో అగ్రరాజ్యం మనదే. సాఫ్టా ఒప్పందం కూడా ఉంది. అయినా ఏమి జరిగింది ?
ఆప్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో 2014-18 మధ్య చైనా తన ఎగుమతులను 41 నుంచి 51.7 బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నది. ఇదే సమయంలో తన దిగుమతులను 19.4 నుంచి 8.3 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది.2018లో ఈ దేశాలతో చైనా వాణిజ్యం 55.99 బిలియన్‌ డాలర్లు కాగా మన దేశం 30.95బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. చైనాకు ఒక్క పాకిస్ధాన్‌తో మాత్రమే స్వేచ్చావాణిజ్య ఒప్పందం ఉంది. నేపాల్‌, భూటాన్‌, ఆఫ్‌ఘనిస్తాన్‌తో మన వాణిజ్యం 9.88 బిలియన్‌ డాలర్లు ఉంటే ఈ దేశాలతో చైనా 1.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే. మొత్తం మీద ఈ పరిణామాన్ని మోడీ సర్కార్‌ వైఫల్యం అనాలా లేక చైనా విజయం అనాలా ? మన వైపు నుంచి లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలా వద్దా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టుల సైద్ధాంతిక విబేధాల పరిష్కారం ఎలా ?

06 Wednesday May 2020

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

communist ideological differences, communist ideological differences in India, Communist Party, Communists, CPI, CPI()M

Long live Marxism-Leninism and Mao Zedong thought! | Communist ...

ఎం కోటేశ్వరరావు
కారల్‌ మార్క్స్‌ 202వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఒక పోస్టు దిగువ విధంగా ఉంది. ఒక జర్నలిస్టు తన వాల్‌ మీద షేర్‌ చేస్తే దాని నుంచి నేను తీసుకున్నాను. అభిమాని-కార్యకర్త మధ్య సంభాషణగా దీన్ని రాశారు, రచయిత పేరు తెలియదు. ఏ సందర్భంగా రాసినప్పటికీ దీనిలోని అంశాలు అనేక మందిలో ఉన్నాయనేది ఒక వాస్తవం. ఒక జర్నలిస్టుగా, పరిశీలకుడిగా కొన్ని అభిప్రాయాలను చర్చ కోసం పాఠకుల ముందు ఉంచుతున్నాను. నేను కమ్యూనిస్టు సిద్దాంత పండితుడిని కాదు కనుక పొరపాటు అభిప్రాయాలు వెల్లడిస్తే ఎవరైనా సరిచేయవచ్చు. ఇది సమగ్రం అని కూడా చెప్పలేను, ఒక అభిప్రాయం మాత్రమే.
పురోగామి, కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం నూరు పూవులు పూయనివ్వండి నూరు ఆలోచనలను వికసించనివ్వండి అనే ఆలోచనతో ఏకీభావం ఉన్న వ్యక్తిగా చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. అసలు పోస్టు ఏమిటో తెలియకుండా దాని మీద వ్యాఖ్యలు చేయటం వలన పాఠకులకు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ పోస్టును ముందుగా ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాను. తరువాత అభిమాని ప్రశ్నలను అలాగే ఉంచి లేవనెత్తిన అంశాలకు మరో కార్యకర్త వివరణ రూపంలో నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు గమనించాలని మనవి. బుల్లెట్ల రూపంలో చిట్టి పొట్టి వివరణలు ఇచ్చి సందేహాలను తీరిస్తే మంచిదే కానీ, అన్ని వేళలా అది సాధ్యం కాదు. సాధ్యమై ఉంటే కాపిటల్‌ గ్రంధాన్ని అంత వివరంగా మార్క్స్‌ రాసి ఉండేవారు కాదు. దీన్ని కూడా చదివే ఓపికలేని అభిమానులు, కార్యకర్తల వలన ప్రయోజనం లేదు. కనుక ఓపిక, ఆసక్తి ఉన్నవారు మొత్తం చదవాలని మనవి. లేనట్లయితే ఇక్కడితోనే ముగించి మరింత ఉపయోగకరమైన విషయాలను చదువుకోవచ్చు.
(దిగువ ఉన్నది నేను స్వీకరించిన పోస్టు)
అభిమాని – కార్యకర్త – మధ్యలో మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: పదుల సంఖ్యలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి.
అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: అవి తీవ్రమైనవి కాబట్టి, అంత సులభంగా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వివరించడం అస్సలు సాధ్యం కాదు.
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ మౌలిక రచనలు అంటే ఏమిటి?
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఏంగెల్స్‌ తో కలిసి రాసిన కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో చదివాను. మార్క్స్‌ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని చూశాను, దాని గురించి విన్నాను, పూర్తిగా చదవలేదు. పెట్టుబడి గ్రంథంలోని మూడు వాల్యూమ్స్‌ బహుశా మా నాయకులు కూడా చదివి ఉండరు. మిగిలిన మౌలిక రచనల గురించి పెద్దగా తెలియదు.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: రాముడిని నమ్మేవాళ్ళంతా రామాయణాన్ని చదవలేదు కదా!
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా, మరీ ఆ పోలికేంటి?
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: ఈరోజు మార్క్స్‌ జయంతి సందర్భంగా మా పార్టీ కూడా కొన్ని కార్యక్రమాల్ని రూపొందించింది. అవన్నీ పూర్తయ్యాక, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను.
(పై పోస్టు మీద నా అభిప్రాయాలు దిగువ ఇస్తున్నాను)

అభిమాని – కార్యకర్తల సమన్వయమే మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: ఎక్కడైనా దోపిడీ సమాజాన్ని రూపు మాపాలని చిత్తశుద్దితో పని చేసే వారు, కోరుకొనే వారందరూ వారసులే, వారంతా కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణకు లాటిన్‌ అమెరికా దేశాలు, అమెరికాలో, ఇతర చోట్ల మార్పుకోరుకొనే కమ్యూనిస్టేతర వామపక్ష శక్తులు కూడా వారసులే. మార్క్స్‌ వారసత్వానికి పేటెంట్‌ లెప్ట్‌ తప్ప రైట్‌ లేదు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: ఈ ప్రశ్న గురించి చర్చించే ముందు ఒక ప్రశ్న. మార్క్స్‌ను అభిమానించే వారిలో కొందరే కార్యకర్తలుగా, ఎక్కువ మంది అభిమానులుగా ఎందుకు ఉన్నారో ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలని మనవి. సమాజాన్ని స్ధూలంగా దోపిడీదారులు-దోపిడీకి గురయ్యేవారు అని చూస్తే దోపిడీదారులందరూ ఒకే పార్టీలో ఎందుకు లేరో కూడా ఆలోచించాలి. మార్క్సిజం పిడివాదం కాదు. అది నిరంతరం నవీకరణకు గురయ్యే ఒక శాస్త్రం. అది చెప్పినట్లు దోపిడీ సమాజం అంతం కావటం అనివార్యం తప్ప అది అన్ని చోట్లా ఒకే విధంగా ఒకే సారి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. అలాంటి జోశ్యాలు కొన్ని తప్పాయి. కమ్యూనిస్టు ప్రణాళికను రాయటానికి ముందే జర్మనీలో, ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. అది రాసిన లేదా రాస్తున్న సమయంలోనే జర్మనీతో సహా అనేక ఐరోపా దేశాలలో తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో కమ్యూనిస్టులు పాల్గొన్నారు గానీ నాయకత్వ పాత్రలో లేరు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ రెండు భావాల, సంస్ధల సమ్మిళితంగా ఏర్పడిన పార్టీ. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ చరిత్రా అదే, స్థూలంగా కొన్ని అంశాలతో ఏకీభవించే వారు దగ్గరయ్యారు. విబేధాలు తలెత్తినపుడు విడిపోయారు. 1836 లో లీగ్‌ ఆఫ్‌ జస్ట్‌ పేరుతో పని ఏర్పడిన క్రైస్తవ కమ్యూనిజం, ఊహావాద కమ్యూనిజం భావాలతో ఉన్న జర్మన్‌ కార్మిక నేత కారల్‌ ష్కాప్పర్‌ నాయకత్వంలో దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలనే సత్ససంకల్పంతో పారిస్‌లో ఏర్పడి పని చేసింది. ఈ సంస్ధతో కారల్‌ మార్క్స్‌ మరియు ఎంగెల్స్‌ ప్రధాన పాత్రధారులుగా ఉంటూ బెల్జియంలోని బ్రసెల్స్‌లో పని చేసిన కమ్యూనిస్టు కరస్పాండెన్స్‌ కమిటీ విలీనమై 1847లో కమ్యూనిస్టు లీగ్‌గా మారాయి. హైదరాబాద్‌ ఎలా వెళ్లాలి అని ఎవరినైనా అడిగిత నాలుగు దిక్కుల్లో ఉన్నవారు నాలుగు విధాలుగా చెబుతారు. బస్సుల గురించి తెలిసిన వారు బస్సుద్వారానే వెళ్లాలని చెబుతారు. అలాగే రైళ్లు, విమానాల వారు తమ పద్దతులను చెబుతారు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ ఏర్పడిన తరువాతే కమ్యూనిస్టు ప్రణాళిక రచన జరిగింది. అందువలన భిన్న ఆలోచనలు, భిన్న మార్గాలతో సమసమాజాన్ని స్ధాపించాలని ఐక్యమైన వారిలో ఎలా సాధించాలి అనే అంశంపై భిన్న అభిప్రాయాలు తలెత్తటం సహజం. అనేక పార్టీలు ఏర్పడటానికి ఇదే మూలం. ఈ మౌలిక అంశాన్ని ఎవరూ విస్మరించలేరు. ఎవరి మార్గం సరైనది అన్నది ఎక్కడికక్కడ ఆచరణలో తేలాల్సి ఉంది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఒకే సమయంలో ఉనికిలోకి వచ్చినా అన్ని చోట్లా విప్లవాలు జయప్రదం కాలేదు. అంతెందుకు నిజాం సంస్ధానంలో తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్నాయి. నిజాం దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలుగా ఉన్న ప్రాంతంలోనే సాయుధ పోరాటం ఎందుకు పారంభమైంది. తెలంగాణాలో ఇతర చోట్లకు, మిగిలిన కన్నడ, మరాఠా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదు. వారికి నిజాంపాలనపై ఎందుకు ఆగ్రహం రాలేదు. ఇలాంటి అంశాలన్నీ అధ్యయనం చేయాల్సినవి. పాఠాలు తీసుకోవాల్సినవి. కమ్యూనిస్టు పార్టీలు కానివన్నీ దోపిడీని కోరుకొనేవే. అలాంటపుడు ఇన్ని రకాల పార్టీలుగా వారంతా ఎందుకు ఉన్నారు ? దోపిడీని అంతం చేయటం ఎలా అన్న అంశంపై కమ్యూనిస్టు పార్టీలలో తేడాలు తెస్తే దోపిడీ చేయటం ఎలా అన్న విషయంలో మిగతా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలే అన్ని పార్టీలుగా ఏర్పడటానికి కారణం.

Kisan Long March has given hope to comrades that they can rise ...

అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: వాటిని అర్ధం చేసుకోవటం అంతకష్టమేమీ కాదు, సమాధానం చెప్పలేకపోతే కుత్తుకలను ఉత్తరించే అపూర్వ చింతామణి ప్రశ్న అసలే కాదు. అమెరికాలో ఉన్న కార్మికవర్గానికి- ఆదిలాబాద్‌ అడవుల్లో ఉన్న కార్మికవర్గ స్ధాయి, అవగాహన ఒకే విధంగా ఉండదు. మన నిచ్చెన మెట్ల సమాజంలో దళిత కార్మికుడి ఆలోచన, దళితేతర కార్మికుల ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తూ ఒకే దోపిడీకి గురవుతున్నా, దళితుడికి ప్రత్యేకమైన సామాజిక అణచివేత అదనపు సమస్యగా ఉంటుంది. ఏ దోపిడీని ముందు అంతం చేయాలన్న అంశపై ఏకాభిప్రాయం లేకపోవటమే ఒక సైద్దాంతిక విబేధం.ఇలా అనేక వాస్తవిక అంశాల మీద సమస్యలు తలెత్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌ నిలిచింది. దాని సరసనే బ్రిటన్‌ కూడా పోరాడింది. బ్రిటీష్‌ వారితో విబేధాలున్నా తొలి కార్మిక రాజ్యంతో కలసి పోరాడుతోంది, హిట్లర్‌ ముట్టడి సోవియట్‌ గురైంది కనుక బ్రిటీష్‌ వారికి మద్దతు ఇస్తే అది సోవియట్‌కు బలం చేకూర్చుతుందనే అభిప్రాయంతో క్విట్‌ ఇండియా పిలుపు సమయంలో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. ఇది ఒక సైద్దాంతిక సమస్య విబేధం. తరువాత కాలంలో అలా చేయటం తప్పని పాఠం నేర్చుకున్నారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో కొన్ని తేడాలున్నా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, సోషలిస్టులు మొత్తం మీద ఐక్యంగానే ఉన్నారు. తరువాత దేశంలో ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ కాంగ్రెస్‌ వారే బ్రిటీష్‌ వారి పెట్టుబడులు, కంపెనీలకు రక్షణ కల్పించారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న అంశం మీద కమ్యూనిస్టుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఇవి అర్ధం చేసుకోలేనంతటి తీవ్రమైనవి కాదు. కాస్త పురోగమన భావాలతో అధికారంలో ఉన్నవారికి మరికాస్త ఊపునిస్తే వారే సోషలిజం తెస్తారన్న భ్రమలకు కొందరు లోనై చివరికి వారితోనే కలసిపోయారు. కాదు జనంలో అసంతృప్తి ఉంది, ఒక దగ్గర అంటిస్తే తాటాకు మంట మాదిరి విప్లవం వ్యాపించి అధికారానికి రావచ్చని కొందరు తుపాకి పడితే విప్లవం బదులు పొగ మాత్రమే వచ్చింది. ఈ రెండు ధోరణులతో జనానికి విశ్వాసం తగ్గిపోయింది, రెండు మార్గాలు కాదు మూడో మార్గంలో విప్లవం తేవాలని చెప్పిన వారు ఒక పెద్ద పార్టీగా ప్రత్యామ్నాయం చూపుతున్నా వారి మీద జనంలో విశ్వాసం కలగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అధ్యయనం చేయాలి. ఏనుగు ఎలా ఉందని అడిగితే ఏడుగురు అంధులు తాము తడిమిన ఏనుగు అవయవాలను బట్టి దాన్ని భిన్నంగా వర్ణించారు. వారు చెప్పింది వాస్తవమే అయినా ఏనుగు సమగ్ర రూపం కాదు. వివిధ ప్రాంతాలు, పరిస్ధితుల్లోని విప్లవకారుల అవగాహన కూడా అలాంటిదే. అయితే తాము చెప్పిందే ఏనుగు రూపం అని ఎవరికి వారు భీష్మించుకుంటే సమస్య పరిష్కారం కాదు, కలబోసుకొని అవగాహనకు రావాలి.

US govt report says Indian Maoists are world's sixth largest ...
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ ఎంగెల్స్‌లు తమ కాలంలో పరిస్ధితులను అధ్యయనం చేసి కొన్ని రచనలు చేశారు. వాటిలో ఏవైనా ఇప్పటి పరిస్ధితులకు అన్వయించలేము అనుకుంటే వాటిని పక్కన పెట్టవచ్చు. ఆ రచనల్లో సూచన ప్రాయంగా ప్రస్తావించిన అంశాలు కొన్ని ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారి తరువాత కాలంలో సామ్రాజ్యవాదం మరికొన్ని పాఠాలు నేర్పింది, రష్యా, చైనా విప్లవాలు, మన దేశంలో మూడు చోట్ల కమ్యూ నిస్టుల నాయకత్వంలో ప్రభుత్వాల ఏర్పాటు నుంచి తాజా లాటిన్‌ అమెరికా పరిణామాల వరకు ప్రతిదీ ఒక కొత్త పాఠాన్ని నేర్పేవే. ఒక నాడు హిందూమత దేశంగా ప్రకటించుకున్న నేపాల్‌లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్న చోట అలాంటి పరిణామం జరగలేదు. మన దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన వారిని సమీకరించటం ఎలా, వీటిలో కొన్ని సమాధానాలు ఇస్తుంటే మరికొన్నింటికి వెతకాలి. కావాల్సింది ఓపిక, ఎటిఎం కార్డు పెడితే మిషన్‌ నుంచి డబ్బువచ్చినట్లుగా సమాధానాలు దొరకవు. ఒక మిషన్‌లో ఏ నోట్లు ఎన్ని పెట్టాలో ముందే నిర్ణయం అయి వుంటుంది, నోట్లు కూడా ముందే ముద్రించి పెడతారు. సమస్యలు, వాటికి సమాధానాలు అలాంటివి కాదు. వీటిని కార్యకర్తలే కాదు అభిమానులు కూడా చర్చించవచ్చు, పరిష్కారాలను సూచించవచ్చు. అభిమానులకు ఆ వెసులు బాటు ఇంకా ఎక్కువ.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఒక కార్యకర్తగా అన్ని మౌలిక రచనలను పూర్తిగా చదవటం సాధ్యం గాకపోవచ్చు. మార్క్స్‌ మౌలిక రచనలు చదివితేనే చాలదు. వాటికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో కొన్ని తప్పుదారి పట్టించేవి కూడా ఉంటాయి. మార్క్సిజాన్ని ఒక దేశ పరిస్ధితులకు నిర్దిష్టంగా అన్వయించటం ఒక ఎత్తయితే దాన్ని అమలు జరిపే పార్టీ నిర్మాణం కావాలి. లాటిన్‌ అమెరికాలో మార్క్సిస్టు మేథావులు అలాంటి ఎత్తుగడలను రూపొందించి వామపక్ష శక్తులు అధికారానికి రావటానికి తోడ్పడ్డారు. కానీ ఆ విజయాలను పటిష్ట పరచుకొనేందుకు విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు అవసరమైన పార్టీ నిర్మాణాలు జరగనందున అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. అదొక లోపం. మార్క్సిజానికి సంబంధించి అనేక మౌలిక గ్రంధాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు, అభిమాని వాటిని చదివిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టాలంటే జీవిత కాలాలు చాలవు. ఏది ముందు జరగాలి ? అధ్యయనమా ? కార్యాచరణా ? అని తర్కించుకుంటూ కూర్చునే వారు కుర్చీలకే పరిమితం అవుతారు. రెండూ కలగలిపి జరపాలి. పని చేసే క్రమంలో తలెత్తే సమస్యలకు పరిశీలన, అధ్యయనం చేయాలి. పని మాత్రమే చేసి మౌలిక అంశాలను అధ్యయనం చేయకపోతే విబేధాలు, కొత్త సమస్యలు,సవాళ్లు తలెత్తినపుడు గందరగోళపడి రెండింటికీ దూరమౌతారు.

In Defense of Communism: Kisan March
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: ఇది పడక కుర్చీ వాదులు ముందుకు తెచ్చే వాదన. మార్క్సిస్టులం అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దాని అర్ధం స్దూలంగా దోపిడీని నిర్మూలించాలనే ఆ సిద్దాంతాన్ని అంగీకరిస్తున్నామని. ఏమీ తెలియని ఒక కార్మికుడు, మహిళ పార్టీలోకి రావాలంటే కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ , ఇతర గ్రంధాలను చదవాలనే షరతు పెట్టటం అర్ధం లేని విషయం. నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం ఉన్నా, సాధారణ పుస్తకాలు కూడా చదవలేని వారెందరో ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అనేక మంది నిరక్షరాస్యులు కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు సాయుధ దళాల్లో చేరి తరువాత చదువు నేర్చుకున్న వారు, మరింత పదును పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా అనేక మంది కనీస నిబంధనలను అంగీకరించి సభ్యులుగా చేరిన వారు ఎందరో సైద్దాంతిక అంశాలను అధ్యయనం చేశారు. దేవాలయాలకు వెళ్లే వారందరూ భగవద్దీతను, సమాజు చేసే వారు ఖురాన్‌, చర్చ్‌లకు వెళ్లేవారందరూ బైబిల్‌ను పూర్తిగా చదవటం లేదు.
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: కచ్చితంగా కాదు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి ఆయా ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటం అనర్హత కాదు. ఒకసారి పార్టీ సభ్యుడు అయిన తరువాత మతం, దేవుడు, దేవత విశ్వాసాల గురించి అధ్యయనం చేయించి వారిని హేతువాదులుగా, భౌతికవాదులుగా మార్చాలి, శాస్త్రీయ ఆలోచనతో పని చేసేట్లు చూడాలి. ఎక్కడైనా విఫలమైతే అది ఆయా స్ధాయిలో ఉన్న కార్యకర్తల, నాయకత్వ లోపం తప్ప పార్టీలోపం కాదు.
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: మౌలిక రచనల్లో అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము. అవి సాధారణ సూత్రీకరణలు వాటిని ఆయా దేశాలు, సమాజాలకు అన్వయించుకోవటంలోనే సమస్యలు వస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లు మన దేశంలో కుల వివక్ష, ఇతర సామాజిక అంశాల గురించి మౌలిక సిద్ధాంతాలలో పరిష్కారం దొరకదు. సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉండటం ఒక మంచి లక్షణం. అంతర్గతంగా కొన్ని అంశాల మీద విబేధించినా కాల క్రమంలో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఆచరణలో ఎవరి వైఖరి సరైనదో తేల్చుకుంటారు. అయితే ఒక అంశం మీద విబేధం ఉంది అది పరిష్కారం కాకుండా ముందుకు కదలటానికి వీల్లేదంటే కుదరదు. అది సైద్ధాంతిక సమస్య అయినా, ఎత్తుగడలకు సంబంధించింది అయినా మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అంగీకరించి అమలు జరపాలి. కొన్ని సందర్భాలలో మెజారిటీ కూడా పొరపాటు పడవచ్చు. గుడ్డిగా అనుసరించటం హానికరం. పార్టీలు వేరైనా ఏకీభావం ఉన్న అంశాల మీద కలసి పని చేస్తున్నాం. వాటికి సైద్ధాంతిక సమస్యలను అడ్డంకిగా తేగూడదని భావిస్తున్నాం. ఆ క్రమంలో వాటిని పరిష్కరించుకుంటాం. సైద్ధాంతికంగా విబేధిస్తే వాటిని తర్కం ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ మీరు ద్రోహులు అని ముద్రవేసి ఇతరుల మీద సాయుధదాడులు చేయటం, హతమార్చటం కమ్యూనిస్టుల లక్షణం కాదు. అది వర్గశత్రువుకు ప్రయోజనం, కనుక అలాంటి వారితో చేతులు కలపటం సాధ్యం కాదు.

2011's most memorable images in China - China.org.cn
ఈ రోజు సైద్దాంతిక సమస్యలతో పాటు అసలు మొత్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్నే సవాలు చేసే పరిస్ధితులు మరోసారి వచ్చాయి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఎదురువుతున్న సవాళ్లకు పరిష్కారం మార్క్సిజంలో దొరుకుతుందా అని ఇంతకాలం ఆ వ్య వస్ధ మీద భ్రమలు ఉన్న వారు ఇప్పుడు మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులుపుతున్నారు. అభిమానులుగా బయట ఉండి సలహాలు చెప్పటం మంచిదే. చెరువు గట్టు మీద ఉండి కబుర్లు చెప్పేవారికి దాని లోతు ఎంతో తెలియదు. కనుక చెప్పేది ఎక్కువ అయితే కొందరు బోధకులుగా మారతారు. మీరు కూడా కార్యకర్తగా ఒక్క అడుగు ముందుకు వేయండి, వాస్తవిక సమస్యలు అర్ధం అవుతాయి, విప్లవం మరింత ముందుకు పోతుంది. ఏ పార్టీ మంచిది ఏది సరైన దారి చూపుతుంది అని తేల్చుకొనేందుకు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ముందు కమ్యూనిస్టులు విబేధాలను పరిష్కరించుకురండి అప్పుడు ఆలోచిస్తాం అని కొందరు అభిమానులుగా చెప్పుకొనే వారు అంటారు. అది సానుకూలంగా చెప్పేవారు కొందరైతే ఆ పేరుతో తప్పించుకొనే వారు మరి కొందరున్నారని మాకు తెలుసు. కమ్యూనిస్టులు పోటీ చేసినపుడు అభిమానులం అని చెప్పుకొనే వారు కనీసం ఓటు కూడా వేయని వారిని చూస్తున్నాం. ప్రతికూల పరిస్ధితులు ఎదురైనపుడు తట్టుకొని నిలిచే వాడే కార్యకర్త. అభిమానులు కూడా అలాగే ఉండాలి. పార్టీ మంచి విజయాలు సాధిస్తే ఆహౌ ఓహౌ అనటం, ఎదురు దెబ్బలు తగిలితే మొహం చాటేయటం, నాయకులు ఏదో తప్పు చేశారని అనటం అభిమానుల లక్షణం కాకూడదు. మంచి చెడుల చర్చ ఆరోగ్యకర లక్షణం. అభిమానులు, కార్యకర్తలూ అందరికి అది ఉండాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా ?

15 Wednesday Apr 2020

Posted by raomk in AP, Current Affairs, NATIONAL NEWS, Opinion, STATES NEWS, Telangana, Telugu

≈ Leave a comment

Tags

a telugu journalist spews venom on communists, anti communists, Communists, Journalist attack on communists, venom on communists

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాలిఫోర్నియా ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేత !

14 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti communist, California state, California state assembly, Communists, Oakland Democrat Rob Bonta, The first Red Scare

ఎం కోటేశ్వరరావు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులు పని చేయటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ మేనెల ఎనిమిదవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదుపరి శాసన మండలి ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టులకు ఇది సంతోషకరమైన వార్త అయితే మింగుడుపడని వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహిస్తోందంటూ భయపడిన అమెరికన్‌ పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక, నిషేధ చట్టాలను చేసింది. వుద్యోగం, వుపాధి, కార్మిక, కళా ఇలా ఒకటేమిటి అన్ని జీవన రంగాలలో అనేక లక్షల మందిని కమ్యూనిస్టులు అన్న అనుమానాలతో వెంటాడి వేధించింది. ఇప్పటికీ వేధిస్తోంది, న్యూయార్క్‌ నగరంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అక్కడి విద్యాశాఖ విచారణ చేపట్టిన విషయం, దానిని ఆపాలని కోరితే కోర్టు తిరస్కరించిన వుదంతం ఇదే సమయంలో జరిగింది.

మరోవైపున అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఫ్రీడం ఫెస్టివల్‌ పేరుతో జరిపే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది ‘వందేళ్ల భావజాల పోరులో పెట్టుబడిదారీ విధానమా ? మ్యూనిజమా ఎవరు గెలిచారు?’ అనేపేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఐరోపా, సోవియట్‌లో సోషలిజాన్ని కూల్చివేసిన సమయంలో రాబర్ట్‌ హెయిల్‌బర్టన్‌ అనే అమెరికన్‌ ఆర్ధికవేత్త న్యూయార్కర్‌ అనే పత్రికలో రాసిన వ్యాసంలో ‘పెట్టుబడిదారీ విధానం-సోషలిజం మధ్య యుద్ధం ముగిసింది. సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. దీంతో చరిత్ర ముగసింది ‘ అని రాశాడు. ఆ పెద్దమనిషి 2005లో 85 ఏండ్ల వయస్సులో వృద్ధాప్యంతో మరణించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరు విజయం సాధించారు అనే చర్చకు ఆ పెద్దమనిషి వారసులైన కమ్యూనిస్టు వ్యతిరేకులు తెరతీశారంటే అనుకున్న, ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోందనే అనుమానం వారిలో తలెత్తినట్లే !

కాలిఫోర్నియా అసెంబ్లీలోని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు రోబ్‌ బోంటా గతేడాది డిసెంబరులో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలనే బిల్లును ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్టు అనే ముద్ర పాతదైన పుక్కిటి పురాణ ప్రస్తావన వంటిది. దానిని దుర్వినియోగం చేసే అవకాశం వుంది, నిర్మొగమాటంగా చెప్పాలంటే గతంలో మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో అది జరిగింది, అందువలన సాంకేతికంగా దానిని తీసివేయాల్సి వుంది అని తన బిల్లు వుద్దేశ్యాన్ని వివరించాడు. ఈ సవరణ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అనే పదాన్ని మాత్రమే తొలగిస్తారు. హింసా మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ఏ సంస్ధ సభ్యుల నైనా ప్రభుత్వ వుద్యోగాల నుంచి తొలగించ వచ్చు అనే నిబంధన ఇక ముందు కూడా కొనసాగుతుంది. కమ్యూనిస్టుల నుంచి ఇప్పటికీ ముప్పు వుందని ఆ పదాన్ని తొలగించటం మొత్తం కాలిఫోర్నియన్లను అవమానించటమే అని రెచ్చగొట్టే విధంగా కొందరు రిపబ్లికన్‌ సభ్యులు వ్యాఖ్యానించారు.

ఆండ్రూ మిల్లర్‌ అనే వ్యాఖ్యాత ఒక పత్రికలో ఇలా గగ్గోలు పెట్టాడు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు అమెరికా విశ్వవిద్యాలయాలలో తప్ప ప్రతి చోటా మార్క్సిజం చచ్చిపోయింది అని కొంత మంది జోకు వేశారు. ఇరవైఆరు సంవత్సరాల తరువాత విద్యావేత్తల వలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కాలిఫోర్నియా సెనెట్‌(మన శాసనమండలి మాదిరి)లో ఈ బిల్లు విజయవంతంగా ఆమోదించబడుతుందా లేదా అన్నది తార్కికాంశం. ఒక వాస్తవం ఏమంటే త్వరలో కమ్యూనిస్టులు త్వరలో అధికారానికి వస్తారా అన్నది రాజకీయాలలో గొప్ప ప్రాధాన్యత వున్న అంశం కాదు. ఎన్నికలలో మార్క్సిజాన్ని కూడా సాధ్యమైన అంశంగానే పరిగణిచాలని నమ్మేంత వరకు అమెరికా సంస్కృతి రావటమే భయంగొలుపుతున్న వాస్తవం. 2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం అమెరికన్‌ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లలో మూడు శాతం మంది స్వయంగా తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నారు. హ్యుమానిటీస్‌ ప్రొఫెసర్లలో ఐదుశాతం, సామాజిక శాస్త్రాల వారిలో 18శాతం వున్నారు. మితవాదులతో పోల్చితే ఒక సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ తాను మార్క్సిస్టును అని మూడు రెట్లు ఎక్కువగా స్పష్టంగా చెబుతారని ఈ సర్వేలో తేలింది.2011లో రాస్‌ముసేన్‌ నివేదిక ప్రకారం వర్తమాన అమెరికా రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల కంటే నైతికంగా కమ్యూనిజం వున్నతమైందని అమెరికన్‌ ఓటర్లలో 11శాతం మంది భావించటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు………..అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ)లో 14శాతం మంది అభ్యుదయగామి సభ్యులున్నారని డెమోక్రటిక్‌ సోషలిస్టులు కనుగొన్నారు. మార్క్సిజం మరణించలేదు అనటానికి ఇది పెరుగుతున్న సాక్ష్యం. అది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో సజీవంగా వుంది సమాజంలోని ఇతర చోట్లకు విస్తరిస్తోంది…..1960 దశకపు ‘నూతన వామపక్ష విద్యార్ధి విప్లవకారులు’ ఇప్పుడు ఆధునిక డెమోక్రటిక్‌ పార్టీ నాయకులుగా వున్నారు. కాలిఫోర్నియాలోని అలంకార ప్రాయమైన రాజకీయ నేతల గురించే మనం మాట్లాడటం లేదు. ఈ విప్లవ నాయకులు నూతన సహ్రాబ్ది యువతరాన్ని ఆకర్షించేందుకు తమ పార్టీని మరింతగా వామపక్షం వైపునకు తీసుకుపోతున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా డెమోక్రటిక్‌ మరియు చివరికి సోషలిస్టులవైపు మొగ్గితే ఈ వ్యూహం చివరికి పౌర అశాంతి మరియు హింసాత్మక విప్లవానికి దారితీస్తుంది.’అని మిల్లర్‌ హెచ్చరిక చేశాడు.https://www.thetrumpet.com/15791-california-mulls-communists-in-government

మరో కమ్యూనిస్టు వ్యతిరేకి మార్క్‌ స్కౌసెన్‌ ‘మ్యూనిజం ఎందుకు పని చేయదు, అయినా ఇప్పటికీ ఆకర్షిస్తోంది’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాశాడు. తాను మార్క్సిజం గురించి జీవిత కాలంలో ఎక్కువగా చదివానని చెప్పుకున్న ఆ పెద్దమనిషి తన తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌బిఐ ఏజంట్‌ లియోరీ స్కౌసెన్‌ అని, పినతండ్రి ది నేకెడ్‌ కమ్యూనిస్టు అనే పుస్తకం రాసిన క్లియోన్‌ స్కౌసెన్‌ అని స్వయంగా చెప్పుకున్నాడు కనుక అతనేమిటో చెప్పనవసరం లేదు. అనేక విషయాలను ఏకరువు పెడుతూ అయినప్పటికీ ఇంకా విప్లవకారులు ఆకర్షణీయంగానే వున్నారని అనేక విశ్వవిద్యాలయాలలో &ద్యార్ధులు చే గువేరా టీ షర్టులు ధరించటం, ప్రొఫెసర్లు మార్క్సిజం గురించి చెబుతున్నారని వాపోయాడు. ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి వెళ్లినపుడు ఎదురైన తన స్వంత అనుభవాన్ని ఇలా వివరించాడు. అక్కడి ఒక మార్క్సిస్టు ప్రొఫెసర్‌ను గుర్తించి నేను నీకు 1883 నాటి ఒక వెండి డాలర్‌ ఇస్తాను, అయితే దానిని ముద్రించిన సంవత్సరంలో మరణించిన ఒక ఆర్ధికవేత్త పేరు చెప్పాలి అని షరతు పెట్టాడట. వెంటనే ఓ అదెంతో సులభం, ఆయన కారల్‌ మార్క్స్‌ అని జవాబు వచ్చిందట. సరైనదే, ఎప్పుడూ మరచి పోవద్దు ఆయన మరణించాడు అన్నాడట.దానికి ఠకీమని ఆ ప్రొఫెసర్‌ ఇలా జవాబు చెప్పాడట.’ అవును మీరు చెప్పింది కరేక్టే, ఆయన మరణించాడు కానీ నేను బతికి వున్నాను, మార్క్సిజం లోని శక్తి, ప్రభావం వంటి గురించి మీ విద్యార్దులకు నేను బోధిస్తున్నాను ‘ అన్నాడట. అడిగిన పెద్దమనిషికి ఏమై వుంటుందో చెప్పనవసరం లేదు. వ్యక్తులు మరణించినంత మాత్రాన శాస్త్రీయ భావజాలాలు మరణిస్తాయి, వుద్యమాలు అంతరిస్తాయని భ్రమపడే చరిత్ర జ్ఞానం లేని లేదా తెలిసీ అడ్డంగా వాదించే వారికి ఇంతకంటే జవాబు అనవసరం.

మార్క్‌ స్కౌసెన్‌ ఇంకా ఇలా రాశాడు.’ పిల్లలకు కమ్యూనిజం’ పేరుతో రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇటీవలే మిట్‌ ప్రెస్‌ ముద్రించటాన్ని చూశాను. అది రాసిన ఓ జర్మన్‌ కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధాన లోపాలను మాత్రమే చూశారు, కమ్యూనిజం లోపాల గురించి ఏమీ చెప్పలేదు.అది ఇరవయ్య శతాబద్దంలో పదికోట్ల మందిని చంపింది, ఇప్పటికీ కోట్ల మందికి క్యూబా,వెనెజులా, వుత్తర కొరియాలో జీవితం, స్వేచ్చ,ఆస్ధిని మరియు సంతోషంగా వుండటాన్ని నిరాకరిస్తోంది. ఈ రోజు విద్యార్ధులు మరియు అనేక మంది పౌరులు కమ్యూనిస్టు లేదా సోషలిస్టు తత్వశాస్త్ర ప్రయోజనాలకు ఆకర్షితులౌతున్నారు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు వుచితంగా అందచేయాలనే దానికి ఆకర్షితులౌతున్నారు.’

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పారు, ఎంత ఎత్తు పెరిగితే అంత త్వరగా కూలిపోయే అవకాశం వుంటుంది. బొల్లు బొల్లరా ఎంకన్నా అంటే మా వూళ్లో మిరియాలు తాటికాయలంత వుంటాయి దొరా అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి అతిశయోక్తులతో ఎంతో చెత్తరాశారు. ఇప్పటికీ కిరాయి రచయితలు రాస్తూనే వున్నారు. చైనాలో చర్చిలను కూల్చివేస్తున్నారని, క్రైస్తవుల సమావేశాలను అడ్డుకుంటున్నారని మీడియాలో ప్రతి రోజూ ఒక పధకం ప్రకారం వార్తలు వస్తుంటాయి. గతంలో సోవియట్‌లో చర్చిలన్నింటినీ కూల్చివేశారని చేసిన ప్రచారం తెలిసిందే. నిజానికి ఏ ఒక్క చర్చిని కూడా కూల్చివేయలేదు. యథాతధంగా వున్నాయని ఇప్పుడందరూ చెబుతున్నారు. చైనాలోని హోనాన్‌ రాష్ట్రంలో మావో పుట్టారు. ఆయన పెరిగిన చాంగ్‌షా పరిసరాలన్నీ క్రైస్తవులు ఎక్కువగా వుండేవి. అక్కడే స్కూలులో మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి పట్టణంలో మావో విగ్రహం కంటే ఎత్తైన 260 అడుగుల చర్చి భవనాన్ని నిర్మిస్తున్నారని, దానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా వుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న చోట చర్చికి అనుమతించటం, దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ఏమిటని కొందరు అభ్యంతర పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే మతశక్తులు ఎవరైనా అలాంటి వారిపై చైనా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అంతే తప్ప మత స్వేచ్చను అణచటం లేదు.http://www.gospelherald.com/articles/70424/20170511/massive-church-being-built-city-where-mao-zedong-first-embraced.htm  కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి నూరిపోసిన వారి మాటలకు ఇప్పుడు విశ్వసనీయత సమస్య ఎదురవుతోంది. పెట్టుబడిదారీ దేశాలలో తలెత్తిన తీవ్ర సమస్యలు, సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్దలను తిరిగి రుద్దిన చోట జనం అనుభవిస్తున్న జీవితాన్ని చూసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాలలో అంత ఆకర్షణీయంగా లేదు. అయినా చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే తిరోగమన వాదులు తమ ప్రయత్నాలను మానుకోవటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు కమ్యూనిస్టులు ! నేడు వ్యతిరేకుల బెంబేలు !!

28 Friday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, anti communists, Bernie Sanders, Communists, french communist party, french left party, post communist mafia state, Socialist

Image result for The communists, now anti communists are worrying

ఎం కోటేశ్వరరావు

సోషలిజం, కమ్యూనిజాలకు కాలం చెల్లింది అన్న తీవ్ర ప్రచార దాడికి గురైన అనేక మంది కమ్యూనిస్టులు దానిని తట్టుకోలేక, కోలుకోలేక నిజమే అనుకున్న మాట వాస్తవం. కావమ్మ మొగుడని అందరూ అంటే కామోసని ఇన్నేళ్లూ కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారి నే చూసుకుంటాను అన్న సామెత తెలిసిందే. అలాగే అంతగా సైద్ధాంతిక అవగాహన లేని వారు, కమ్యూనిస్టు అనుకూల పరిణామాలతో వుత్తేజితులై వచ్చిన వారు అనేక మంది దూరమయ్యారు. కొత్తవారిలో వుత్సాహం తగ్గిపోయింది. అయినా అనేక మంది అచంచల విశ్వాసంతో ఎత్తిన జెండా దించకుండా కొనసాగుతున్నవారున్నారు. పాతికేండ్ల తరువాత యువతలో సోషలిస్టు అనుకూల భావాలపై ఆసక్తి పెరగటాన్ని చూసి పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు బెంబేలెత్తుతున్నారు.

ఏప్రిల్‌ 23న ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఇంకేముంది కమ్యూనిస్టు అభ్యర్ధి దూసుకు వస్తున్నాడు బహుపరాక్‌ అని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, వ్యతిరేక శక్తులు ప్రచారం చేశాయి. తుది విడత పోటీకి అర్హత సంపాదిస్తాడనుకున్న కమ్యూనిస్టులు బలపరిచిన వామపక్ష అభ్యర్ధి మెలెంచన్‌ కొద్ధి శాతం ఓట్ల తేడాతో అవకాశాన్ని కోల్పోయాడు. అధికారానికి దగ్గర దారులు లేవు, పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఈ ఫలితాన్ని కమ్యూనిస్టులు సాధారణంగానే స్వీకరించారు. కమ్యూనిజం అంతరించిందన్న ప్రచారాన్ని నిజంగానే నమ్మిన ఫ్రాన్స్‌లోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కొందరికి ఇప్పుడు మనోవ్యాధి పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, అమెరికాలో కూడా తీవ్రంగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలే అందుకు నిదర్శనం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార దాడి సైనికులు, కమాండర్లు ఇప్పుడు కొట్టబోతే కడుపుతో వుంది, తిట్టబోతే అక్క కూతురు అన్న స్ధితిని ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.

తొలి విడత ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఒక ఫ్రెంచి పత్రికలో వచ్చిన వ్యాఖ్యానం ఇలా సాగింది.’ ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌(మితవాద రిపబ్లికన్‌ పార్టీ) దేశాన్ని సంస్కరించేందుకు కట్టుబడి వుంటానని ప్రకటించిన వైఖరి ఎంతో ప్రభావం చూపినప్పటికీ ఆయనకు లభించిన మద్దతు చూసి ఆశాభంగం చెందాను. దానికి నేను చేయగలిగింది లేదు గానీ తుది విడత పోటీలో లీపెన్‌-మెలాంచన్‌ మధ్య పోటీ జరగనందుకు నాకు ఎంతో భారం తీరింది. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ సోషలిస్టు కాదు, ప్రచారంలో చెప్పినదానికంటే పెద్ద స్వేచ్చా మార్కెట్‌ వాది, అయితే తన అధ్యక్ష పదవితో దేశాన్ని మెరుగుపరిచేందుకేమీ చేయలేడు….. ఎన్నికలలో 55శాతం మంది ఓటర్లు తీవ్రవాద భావాలున్న వారికి ఓటు చేసిన దాని గురించి నేను చెప్పాలి…. దాని కంటే ఎక్కువగా మిలియన్ల మంది మరణాలకు కారణమైంది కమ్యూనిస్టు సిద్ధాంతం అనే అబేధ్యమైన ప్రచారాన్ని బద్దలుకొట్టి కమ్యూనిస్టు మెలంచన్‌కు ఫ్రెంచి జనాలు ఓటు వేయటం నా బుర్రను బద్దలు చేస్తున్న అంశం…. ఫిలన్‌ సంపాదించినన్ని ఓట్లు దాదాపు 20శాతానికి దగ్గరగా మెలంచన్‌ సాధించాడు.ఇదొక వెర్రి. హ్యూగో ఛావెజ్‌ ఇతర కమ్యూనిస్టు నియంతలను మెలంచన్‌ తిరుగులేని విధంగా సమర్ధించాడు. అంతకంటే హీనమైనది ఏమంటే ఒక్క ఫ్రాన్సే కాదు -ఫెడల్‌ కాస్ట్రో ఎట్టకేలకు మరణించాడు. జనం ఏమి ఆలోచిస్తున్నారు ? నేను జీవించి వున్నంత వరకు ఫ్రాన్స్‌లో, వెలుపలా కమ్యూనిజం కళంకానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో, 2017లో ఈ సిద్ధాంతం ఎందుకు పెరుగుతోందో నేను ఎన్నడూ అర్ధం చేసుకోలేను.’ అని పోయాడు.http://www.nationalreview.com/corner/446992/france-marine-le-pen-presidential-election-normalization-extremes ఇలాంటి వారెందరో కనిపిస్తున్నారు.

Image result for socialists in Present USA

పాతిక సంవత్సరాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయినందుకు కమ్యూనిస్టులు విచారిస్తే తిరిగి కమ్యూనిజం పట్ల జనం సానుకూలత వ్యక్తం చేయటాన్ని చూసి కమ్యూనిస్టు వ్యతిరేకులలో ఆందోళన ప్రారంభమైందన్నది స్పష్టం. కమ్యూనిస్టు భూతం గురించి ఐరోపాను వెన్నాడుతోందని 1848 నాటి కమ్యూనిస్టు ప్రణాళిక ముందు మాటలోనే మార్క్స్‌-ఎంగెల్స్‌ రాశారు. అంటే అంత కంటే ముందే ఐరోపాలో తత్వవేత్తలు సోషలిజం, కమ్యూనిజాల గురించి చర్చించటం, ఆ భావజాలం తమ దోపిడీ వ్యవస్ధను కూల్చివేస్తుందని పెట్టుబడిదారీ వర్గం అప్పుడే గుర్తించటం, నిరోధించటానికి నాటి నుంచే ప్రయత్నించటం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో జనాన్ని భయపెడుతూనే వున్నారు. ఏదైనా ఒక వ్యవస్ధ సమాజంలోని మెజారిటీ వర్గం ముందుకు పోవటానికి ఆటంకంగా మారినపుడు దానిని కూల్చివేసి నూతన సామాజిక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటమే ప్రపంచ మానవాళి చరిత్ర. దారుణంగా వున్న భూస్వామిక వ్యవస్ధతో పోల్చితే పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైన పెట్టుబడిదారీ వ్యవస్ధ తొలినాళ్లలో జనానికి మెరుగ్గా కనిపించింది.’ అరే ఒరే అన వీల్లేదంటా, వారం వారం బట్వాడంటా ….బస్తీకి పోదాము’ పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. భూస్వామిక వ్యవస్ధ ఆటంకంగా మారింది కనుకే దానికంటే మెరుగైన వ్యవస్ధ కోసం జనం దానిని నాశనం చేసేందుకు పెట్టుబడిదారులకు సహకరించారు. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు గ్రహించగానే పెట్టుబడిదారీ వ్యవస్ధను నాశనం చేయటం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టక ముందే సమసమాజం, సోషలిజం, కమ్యూనిజం గురించి చర్చ ప్రారంభమైందంటే అది ఒక సహజ పరిణామం తప్ప మరొకటి కాదు. వారు గాక పోతే మరొకరు కమ్యూనిస్టు ప్రణాళికను రచించి వుండేవారు.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని దాచటం అసాధ్యం. అత్యంత పకడ్బందీగా దాచే అమెరికా రహస్యాలనే అసాంజే లోకానికి అందించిన విషయం తెలిసినదే. పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించిన అమెరికా విశ్వవిద్యాలయ ముద్రణ సంస్దపై అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు విరుచుకుపడుతున్నారు. మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాదు యూనివర్సిటీల వంటివి బిజెపి సర్కారుకు కంటగింపుగా మారి వాటిని దెబ్బతీయాలని చూస్తున్నట్లే తాజాగా తూర్పు ఐరోపాలోని హంగరీలోని సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ(సిఇయు)ను మూసివేయాలని ప్రజాస్వామ్య ముసుగు వేసుకున్న అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Image result for post communist mafia state

ఆ విశ్వవిద్యాలయం చేసిన తప్పిదం ఏమిటి ? ‘ కమ్యూనిస్టు అనంతర మాఫియా రాజ్యం-హంగరీ వుదంతం ‘( పోస్ట్‌ కమ్యూనిస్టు మాఫియా స్టేట్‌ – ఏ కేస్‌ ఆఫ్‌ హంగరీ) అనే పేరుతో 2016లో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. రచయిత కమ్యూనిస్టు కాదని ముందు తెలుసుకోవాలి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత హంగరీ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలను దాచి పెట్టేందుకు అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఐరోపాకు పదిలక్షల మంది వలస రావటానికి జార్జి సోరెస్‌ ప్రధాన కారణమని, అలాంటి వారి కేంద్రంగా విశ్వవిద్యాలయం వుందంటూ ప్రభుత్వ పత్రిక ద్వారా జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. పైన పేర్కొన్న పుస్తకాన్ని సదరు విశ్వవిద్యాలయం ముద్రించిన కారణంగా దానిని మూసివేయాలనే యత్నాలను 63శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది.మాఫియా శక్తులకు ఆశ్రయమిచ్చిన పాలకుల నిజస్వరూపాన్ని ఆ పుస్తకంలో ఎండగట్టటమే అసలు కారణం. సోషలిస్టు వ్యవస్ధ స్ధానంలో ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన కమ్యూనిస్టు వ్యతిరేకులు గత పాతిక సంవత్సరాల కాలంలో నిరంకుశ పాలనను రుద్దేందుకు అనుసరిస్తున్న నూతన పద్దతులను దానిలో వివరించారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆ పుస్తకాన్నిరాసింది ఒక మాజీ మంత్రి కావటంతో దానికి విశ్వసనీయత పెరిగింది. ప్రజాస్వామ్యం గురించి పంచరంగుల్లో చూపిన వారు దాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టటాన్ని గమనించిన జనం ఎలా ఆలోచించేది చెప్పనవసరం లేదు. సాంప్రదాయక మాఫియా బహిరంగంగా ఎలా సంపదలను బలవంతంగా లూటీ చేస్తుందో తెలిసిందే. అదే కమ్యూనిస్టు పాలన అనంతర రాజకీయ మాఫియా చట్టాలను అడ్డం పెట్టుకొని ఎలా లూటీ చేస్తుందో ఒక్క హంగరీకే గాక ఎక్కడైతే ఇతర కమ్యూనిస్టు అనంతర రాజ్యాలలో నిరకుశపాలకులు వున్నారో ఆ దేశాల వారందరూ తెలుసుకోవాల్సిన అంశాలున్న ఈ పుస్తకం సమయోచితంగా వెలువడిందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పుస్తకం గురించి అడిగితే గూగులమ్మ తల్లి ఎంతో సమాచారాన్ని మన ముందు ప్రత్యక్షం చేస్తోంది. అలాంటపుడు మన కంటే ఎక్కువ చదువుకున్న, సమస్యలను ఎదుర్కొంటున్న ఫ్రెంచి యువతరానికి తమ పొరుగునే వున్న తూర్పు రాజ్యాలలోని ఈ మంచి చెడ్డలన్నీ తెలియకుండా వుంటాయా? ప్రజాస్వామ్యం పేరుతో ఇంతకాలం ఇతర పార్టీల ప్రజావ్యతిరేక పాలన చూసిన తరువాత రెండవ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్‌ వ్యతిరేక పోరాటంలో ఘనమైన గత చరిత్ర వున్న కమ్యూనిస్టులకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన ఫ్రెంచి వారిలో కూడా ఏ మూలన అయినా ప్రారంభమైందేమో ? ఏమీ లేకుండా 20శాతం ఓట్లు ఎలా వస్తాయి?

Image result for socialists in Present USA

అమెరికా అంటే ప్రపంచ దోపిడీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల, యుద్దోన్మాదుల, కమ్యూనిస్టు వ్యతిరేకుల నిలయంగా అందరికీ తెలిసిందే. మరి అలాంటి రాజ్యంలో ‘ సోషలిజం అంత జనరంజకంగా ఎలా తయారైంది ?’ అనే ప్రశ్నతో ఒక విశ్లేషణ చేశారు.https://www.thetrumpet.com/15721-how-did-socialism-become-so-popular-in-america అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేక, తటస్ధ, సానుకూల ఏదో ఒక రూపంలో మీడియాలో ఇటీవలి కాలంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది ఎన్నికల సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.’ ప్రచ్చన్న యుద్ధ సమయంలో కమ్యూనిజం గురించి అమెరికాలో ఎంతో భయం వుండేది. కమ్యూనిజం వ్యాప్తి గురించి అతిశయోక్తులు చెప్పారని ఇప్పుడు ఎక్కువ మంది అమెరికన్లు నమ్ముతున్నారు. ప్రధాన స్రవంతి సోషలిస్టు భావజాలం గురించి నేడు ఎంత విస్తృతంగా ప్రచారంలో వున్నాయో చూడండి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దాదాపు ఒక బహిరంగ సోషలిస్టు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిత్వాన్ని గెలుచుకున్నారు. మూడు పదుల లోపు వయసు వారు మాత్రమే ఓటు వేసి వున్నట్లయితే ఆ వ్యక్తి నేడు అమెరికా అధ్యక్షుడు అయి వుండేవాడు. ప్రభుత్వ అధికారం మరియు పాత్రను ఎంతో పెంచాలన్న ఆయన విప్లవాత్మక పధకాలు ఇప్పటికీ బహుళఆదరణ పొందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్ధిక వ్యవస్ధలోని ప్రధాన రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. మన సమాజం ఆలోచనలో ఇది పెద్ద మార్పు, అది ఎంతో వేగంగా జరుగుతోంది…….ఈ రోజు అమెరికాను కమ్యూనిజం ప్రభావితం చేస్తోంది అన్న రుజువు కోసం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు……..సగటు కాలేజీ ఫ్రొఫెసర్‌ను మీరు సోషలిస్టా లేక మార్క్సిస్టా అని అడిగితే అతడు లేక ఆమె అవును నేను అదే అని చెప్పే అవకాశాలున్నాయి……అమెరికన్లు నేడు మన జాతిపితలు లేదా మన స్వంత తండ్రులు నిర్మించిన దేశంలో నివశించటం లేదు. అనేక మంది గుర్తించిన దానికంటే ఎక్కువ విప్లవ భావాలవైపు మొగ్గుతున్నారు. సోషలిస్టు మరియు కమ్యూనిస్టు ఆలోచనా వివేచనను మనం ఈ క్షణంలో స్వతహాగా గుర్తించటం కాదు. ఒక పధకం ప్రకారం ఆశ్చర్యకరంగా ఈ స్వేచ్చా భూమిని మరియు ధైర్యవంతులకు నిలయమైన దీనిని కూల్చివేసేందుకు విజయవంతంగా అనుసరించిన వ్యూహం ఫలితంగానే ఈ భావ జాలం ఇంతగా జనంలో ప్రచారమైందన్నది వాస్తవం.’ అని జోయెల్‌ హిలికర్‌ అనే రచయిత వాపోయాడు.

చిత్రం ఏమిటంటే సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత కూడా అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ నిధులు అందచేసిందని అలవాటులో భాగంగా చెడరాసి పడేశాడు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ అనేక దేశాలలో కమ్యూనిస్టు వుద్యమాలకు తోడ్పాటు అందించేందుకు అనేక రూపాలలో సాయం చేసింది. భావజాల ప్రచారంలో భాగంగా ఎక్కువ భాగం పుస్తకాల రూపంలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం.ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయటానికి అమెరికన్లు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారో, పెట్టుబడులు పెట్టారో లోకవిదితమే. మొదటిది పధకం అయితే రెండవదీ వ్యూహమే, దానికి అనుగుణ్యంగా పధకమే. భావజాల ప్రచారానికి పధకం వేయటం ద్వారా అమెరికాలో వ్యాప్తి చెందిందన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ, తమ కమ్యూనిస్టు వ్యతిరేక పధకాల, వ్యూహాల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనే కుంటి సాకు తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు భావజాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఇంతకాలం అమెరికన్లు చేయని ప్రయత్నం లేదు. అరచేతిని సూర్యకాంతిని ఆపే విఫలయత్నం చేసినట్లుగానే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికన్లు అసహజ చర్యలకు పాల్పడ్డారు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించారు. దాన్ని సామాన్య జనంపై మోపిన కారణంగానే అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలలో సంక్షోభం తలెత్తింది. ఇండో చైనా దేశాలపై దశాబ్దాల పాటు చేసిన యుద్దం ఒకటైతే ఆప్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభావాన్ని అరికట్టే పేరుతో అమెరికన్లు చేసిన ప్రయోగం అమెరికా సైనికులను ఫణంగా పెట్టటం ఒకటైతే అంతకు మించి ఒక్క కమ్యూనిస్టులకే గాక యావత్‌ స్వయంగా తనతో పాటు యావత్‌ ప్రపంచానికి ముప్పుగా తాలిబాన్లు అనే వుగ్రవాదులను తయారు చేసింది. అక్కడ 16లక్షలకు పైగా తన సైన్యాన్ని మోహరించి కూడా తాలిబాన్లను అణచలేక చేతులెత్తేసింది.

ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనేక సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? 2008లో అన్ని పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన మాంద్యం ఎప్పుడు అంతరిస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా సమాజంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయని, అది మంచిది కాదని పెట్టుబడిదారీ ఆర్ధిక నిపుణుడు పికెటీ చేసిన విశ్లేషణను ఇంతవరకు ఎవరూ సవాలు చేయలేదు. వీటన్నింటి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నపుడు అమెరికా, ఫ్రాన్స్‌ ఇలా ఏ దేశ యువత అయినా మెదళ్లకు పదును పెట్టకుండా, ఎందుకు అని ప్రశ్నించకుండా ఎలా వుంటుంది?

కమ్యూనిస్టు బూచిని ఎంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు, భయపెడతారు రాబోయే కమ్యూనిజంతో వచ్చే ప్రమాదం ఏమిటో తెలియటం లేదుగానీ పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను నాశనం చేస్తోందని పశ్చిమ దేశాల వారు భావిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లు, తూర్పు ఐరోపా దేశాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల సంపదలను లూటీ చేసే వారి చేతులలోకి పోయాయి. ప్రజాస్వామ్యం అంటే నేతి బీరలోని నెయ్యి మాదిరి అని తేలిపోయింది. దాదాపు అన్ని దేశాలలో నిరంకుశ పాలకులదే పెత్తనం. అక్కడ అంతకు ముందులేని దారిద్య్రం, నిరుద్యోగం, సకల అవలక్షణాలు వచ్చాయి. వాటిని చూసిన ప్రపంచంలోని ఇతర దేశాల యువత సోషలిజం గురించి పునరాలోచనలో పడదా ? గత నాలుగు దశాబ్దాలుగా సోషలిస్టు చైనా అప్రతిహత విజయాలు సాధిస్తున్నది. అక్కడ పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించినట్లు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ స్వయంగా అనేక సార్లు స్పష్టం చేశాయి. మరోవైపు ధనిక దేశాలలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు పెరుగుతున్నాయని అవే సంస్ధలు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పటం లేదు.

Image result for bernie sanders i am socialist

అటువంటపుడు అమెరికాలోగాని మరొక ధనిక దేశంలో గాని పేదలు,యువత తమకూ సోషలిస్టు వ్యవస్తే మంచిదేమో అన్న ఆలోచన వైపు మళ్లకుండా ఎలా వుంటారు. పెట్టుబడిదారీ విధాన అమానుష స్వభావం కారణంగా దానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో కొంత మంది బయలు దేరి తోడేలుకు ఆవు వేషం వేసినట్లుగా దానిని మానవతా ముఖంతో వుండే విధంగా మార్చుతామని చెప్పిన వారు ఎక్కడ వున్నారు. మరింత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణల పేరుతో సామాన్య జనం అనుభవిస్తున్న వాటికి కోతపెడుతున్నారు తప్ప పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు ఏమాత్రం తగ్గకపోగా పోటీని ఎదుర్కొనే పేరుతో మరింతగా పెంచుతున్నారు. దానికి దేశ భక్తి, జాతీయవాదం అని ముద్దు పేర్లు పెడుతున్నారు, పెంచుతున్నారు.http://www.theepochtimes.com/n3/2237411-why-a-gospel-of-envy-is-gaining-traction-in-america/  అమెరికాలో సోషలిజం ఎందుకు వ్యాపిస్తున్నది అన్నదే ఈ వ్యాసకర్త ప్రశ్న.

Image result for bernie sanders i am socialist

అమెరికాలోని పెద్ద వారిలో 37శాతం మంది పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అమెరికన్‌ ఫెయిత్‌ అండ్‌ కల్చర్‌ అనే సంస్ధ ఫిబ్రవరిలో జరిపిన ఒక సర్వేలో వెలుగు చూడటమే సదరు వ్యాసకర్తను పురికొల్పింది. ఇది మేలుకొలుపు పిలుపు అని వ్యాఖ్యానించాడు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బెర్నీ శాండర్స్‌ చేసి ప్రచారం ద్వారా సోషలిజం ప్రజాదరణ పొందటం ఆశ్చర్యార్ధకమైంది…..అమెరికాలో ఎందుకు అనేక మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరిని కలిగి వున్నారు.’ అని ప్రశ్నించుకొని వ్యాసకర్త తన అభిప్రాయాలను వెల్లడించాడనుకోండి. వాటితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. అవే ఎత్తుగడలు లేదా కారణాలతో గతంలో అమెరికన్లు సోషలిజం గురించి దురభిప్రాయం ఏర్పరుచుకున్నారని కూడా భాష్యం చెప్పవచ్చు. దీనిని అంగీకరిస్తే రచయిత అభిప్రాయపడినట్లు అవే కారణాలతో అమెరికన్‌ యువత సోషలిజం గురించి ఆసక్తి , పెట్టుబడిదారీ విధానంపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు అన్న తర్కాన్ని కూడా అంగీకరించవచ్చు. ‘కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక యుద్ధ భూములుగా మారటం విచారకరమని’ అంటూ ‘లెనిన్‌ ఏం చెప్పారో విందాం ‘పిల్లలకు బోధించటానికి నాకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఇవ్వండి, ఎన్నటికీ పెకలించలేని విధంగా విత్తనాలు నాటతాను ‘ అని చెప్పారని సదరు వ్యాసకర్త వుక్రోషం వెలిబుచ్చటాన్ని చూస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం ఎందుకు చిన్న పిల్లల విద్యాలయాలను ఏర్పాటు చేస్తోందో అక్కడేమి బోధిస్తున్నారో, జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల గురించి ఎందుకు నానా యాగీ, దాడులు చేస్తున్నారో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. ఇది భావజాల పోరు. ఒకరు విషబీజాలు నాటితో మరొకరు ప్రయోజనకరమైన వాటిని విత్తేందుకు ప్రయత్నం. ఎవరిది పై చేయి అయితే అవే ఫలితాలు వస్తాయి.విద్యా సంస్ధలలో ఒక పద్దతి ప్రకారం సోషలిస్టు భావజాలాన్ని ఎలా అభ్యాసం చేయిస్తున్నారో ‘ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కాలర్స్‌(ఎన్‌ఏఎస్‌) జనవరి నివేదిక వెల్లడించిందని, వున్నత విద్యా సంస్ధలలో ఒక వుద్యమంగా 1960 దశకపు విప్లవాత్మక కార్యక్రమంతతో ఒక పురోగామి రాజకీయ చురుకుదనంతో ‘నూతన పౌర శాస్త్రాన్ని ‘ బోధిస్తున్నారని’ కూడా సదరు రచయిత ఆరోపించారు. మన పిల్లలు ఏమై పోతున్నారో చూడండి అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అంటే రెండు రెళ్లు నాలుగు, భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అసమాన సమాజాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పటం కూడా సోషలిస్టు భావజాల ప్రచారంగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు చూస్తున్నారు. ఈ ఆరోపణ చేసేవారిని ఒక ప్రశ్న అడగాలి. పడకగదుల్లో సైతం ఎప్పుడేం జరుగుతోందో ప్రత్యక్ష ప్రసారం చేయగల నిఘా వ్యవస్ధ వున్న అమెరికా భద్రతా సంస్ధలు ఒక వుద్యమంగా అమెరికా విద్యా సంస్ధలలో జరుగుతున్న ఈ బోధనను చూడకుండా ఎలా వున్నాయి ? ఒక వేళ అదే నిజమైతే అమెరికాకే కాదు ప్రపంచానికే మంచి రోజులు వస్తాయి. యుద్దోన్మాదులు, తాలిబాన్లను సృష్టించే నేతలకు బదులు వాటికి దూరంగా వుండే సమాజాన్ని నెలకొల్పే నేతలు అమెరికాలో అధికారానికి వస్తారు. ఇవన్నీ చూస్తుంటే కమ్యూనిస్టు వ్యతిరేకుల విశ్వాసం సడలుతున్నట్లు, వారు కోరుకున్న విధంగా సమాజం నడవటం లేదని అర్ధం కావటం లేదూ ! ఆలోచించండి !!

పశ్చిమ దేశాలలో అలా వుందేమో గానీ భారత్‌లో తిరిగి కమ్యూనిస్టులు కోలుకోలేరు అని ఎవరైనా అన వచ్చు. ఎవరి నమ్మకం వారిది. ప్రకృతి ధర్మం ప్రకారం ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలలో ఒకేసారి వేసవి, వర్షాలు, ఆకురాల్చి మొగ్గతొడగటం జరగదు. చక్రభ్రమణంలో ఇప్పుడు కింద వున్న వారు కొద్ది సేపటి తరువాత పైకి వస్తారు. కమ్యూనిస్టులూ అంతే. ఒక దగ్గర ప్రారంభమై అన్ని ప్రాంతాలకూ విస్తరించినట్లే తిరిగి కోలుకోవటం కూడా అదే మాదిరి జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

12 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Social Inclusion

≈ 1 Comment

Tags

Ambedkarists, Buddha, caste discrimination, caste system, communist manifesto, Communists, jai lal, jai neel, jyothiba phule, karal marx, sc, scheduled castes, st's

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాస్తిక వాదం గురించి ఆస్థికులు ఆవేదన చెందటం చిత్రమే మరి !

08 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ 3 Comments

Tags

ATHEISM, athists, believers, Communists

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కదులుతున్న రష్యన్‌ కమ్యూనిస్టు యువతరం

02 Monday May 2016

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

Communists, revolution, RUSSIA, Russia's CP, young Communists

ఎంకెఆర్‌

   మానవాళి చరిత్ర సమస్తం పోరాటాల మయం. తన మనుగడ కోసమే మానవుడు కొన్ని లక్షల సంవత్సరాలు పోరాడి ప్రకృతిలోని అనేక అంశాలను తన అదుపు లోకి తెచ్చుకోగలిగాడు. ఈ విజయం వెనుక ఎన్ని ప్రాణాలు బలయ్యాయో, ఎంత రక్తం ఏరులై పారిందో ఎవరు చెప్పగలరు ! చరిత్ర ముందుకు తప్ప వెనక్కు నడవదని తెలిసినా, ప్రత్యక్షంగా కనిపిస్తున్నా వెనక్కు నడిపించాలని చూసే శక్తులు ప్రతి తరంలోనూ వుద్భవిస్తూనే వుంటాయి. పురోగమన వాదులను భౌతికంగా అంతం చేస్తే, వారు నిర్మించిన సమాజాలు, వ్యవస్థలను కూల్చివేస్తే , వారి భావాలు, వ్యవస్థలూ కూడా నాశనం అవుతాయని అలాంటి శక్తులు విశ్వసిస్తాయి. అందుకే దాడులకు పూనుకుంటాయి. భౌతికంగా వారిని సహించినా భావ పోరాటంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి.

   ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం నిరంతరం తమను వ్యతిరేకించే శక్తులను అణచివేసేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో దోపిడీకి గురయ్యే వర్గం తనను తాను విముక్తి చేసుకొనేందుకు నిరంతరం పోరాడుతుంది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన పెట్టుబడిదారీ వర్గం సోషలిజం, కమ్యూనిజాలపై తిరుగులేని అంతిమ విజయం సాధించామని ప్రకటించుకొని పాతిక సంవత్సరాలు దాటింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా వున్నాయి? అక్కడి పరిణామాల గురించి ఎవరేమంటున్నారు ?

   ‘ అధికారం కోసం ప్రయత్నించే సమయం వచ్చిందంటున్న రష్యా యువ కమ్యూనిస్టులు ‘అనే శీర్షికతో ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా నుంచి వెలువుడే ‘క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ ‘ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆర్ధిక సంక్షోభ ప్రభావం, ప్రభుత్వ ఆస్థులన్నింటినీ విక్రయించే పాలక పెద్దల ఆప్తుల ఆధిపత్యాన్ని సహించలేని కమ్యూనిస్టు పార్టీ యువ సభ్యులు పుటినిజానికి తాము ప్రత్యామ్నాయాన్ని చూపుతామని చెబుతున్నారు అని పేర్కొన్నది.ఆ పత్రిక వార్త సారాంశం ఇలా వుంది.’ సోవియట్‌ జీవితం గురించి ఎలాంటి జ్ఞాపకాలు లేని అతి చిన్న వయస్కుడు నికితా పొపొవ్‌. రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్‌, ఇంటర్నెట్‌ న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఇతగాడు తాను పుట్టిన సమయానికి అంతరించి పోయిన కమ్యూనిస్టు వ్యవస్ధ రష్యా భవిష్యత్‌కు కీలకమని భావిస్తున్నాడు. అతనొక్కడే కాదు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు ఏర్పడిన ఆశలన్నీ కుప్పకూలటంతో పెద్ద సంఖ్యలో యువకులు మరియు బాగా చదువుకున్న నూతన కార్యకర్తలు రష్యాలోని కమ్యూనిస్టుపార్టీలోకి తరలుతున్నారు. దాని రూపం, అవకాశాల పునరుద్ధరణను ప్రారంభించారు.కళ్ల ముందున్న సెప్టెంబరు పార్లమెంటరీ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అవకాశాలు పెరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత రెండు ఎన్నికలలో పార్టీ తన ఓటింగ్‌ను 12 నుంచి 20శాతానికి పెంచుకుంది. ఈ సారి కూడా పెద్ద విజయాలు సాధించనుంది.’చరిత్ర, వుమ్మడి స్వభావం రీత్యా రష్యన్లు వామపక్షం వైపు మొగ్గుతారు. జనం నానాటికీ మరింత పేదలు అవుతున్నారు. లాభాలను కొద్ది మందిగా వున్న అధ్యక్షుడి స్నేహితులు పొందుతున్నారు. ప్రతి ఏడాదీ పుతిన్‌ టీవీలలో ప్రసారం చేసే నగర వేదికల మీద అన్ని సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలుకుతారు. అది కేవలం నాటకం మాత్రమే. వాస్తవానికి సామాజిక సంక్షేమానికి కోత పెడుతున్నారు, జనాన్ని దరిద్రులుగా మార్చుతున్నారు.ఇప్పుడో తరువాతో ఏదో బద్దలు కాబోతోంది. నా వరకైతే 1917 తరహా విప్లవానికి సిద్ధంగా వున్నాను.’ అని పొపోవ్‌ చెప్పాడు.

   రష్యాలో కమ్యూనిస్టు పార్టీ రెండవ పెద్ద పార్టీ. వంద మంది ఎంపీలు వున్నారు. పార్టీలోని మొత్తం లక్షా 60వేల సభ్యులలో 40శాతం మంది 35 ఏండ్ల లోపువారేనని యువజన విధాన విభాగపు నేత యరస్లోవ్‌ లిస్టోవ్‌ చెప్పారు. ‘ నేను వాస్తవానికి పశ్చిమ దేశాల సాహిత్యం ఫ్రాయిడ్‌, ఫ్రోమ్‌, మార్కస్‌ వంటి వారి రచనలు చదవటం ద్వారానే కమ్యూనిస్టుపార్టీలోకి వచ్చాను. ఇంకా ఎక్కువగా చదవాలనుకుంటున్నాను. ఈ పార్టీలో వున్న వారు ఈ అంశాల గురించి ఎంతో వుత్సాహంగా వుండటాన్ని నేను కనుగొన్నాను. వీరంతా నా కామ్రేడ్స్‌, మేము సంగీతం, నాటకాలు, సినిమాలు, విప్లవ రాజకీయాలు, ఏం జరుగుతోందో వాటన్నింటి గురించీ మాట్లాడుకుంటాం. మేము భావపరంగా ఒక్కటే, ముందుకు వెళ్లటం గురిచి మార్గం వెతుకుతున్నాం. మా దృష్టిలో విప్లవం అంటే ఒక నేత బదులు మరొక నేత రావటం కాదు, ప్రజల భాగస్వామ్యంలో సామాజిక మార్పు, ఆ క్రమంలో ఎన్నికలలో పాల్గొనటం ఒక అంశం మాత్రమే ‘ అని న్యాయ శాస్త్ర విద్యార్ధి కానస్టాంటిన్‌ కోపెలోవ్‌ చెప్పాడు.

     ‘ ఒక సారి రష్యాను సూపర్‌ పవర్‌ స్ధాయికి తీసుకు వెళ్లిన వంద సంవత్సరాల పార్టీని తేలికగా తోసి పుచ్చటం కష్టం. అన్ని శక్తులూ దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ తిరిగి పుంజుకుంటున్నది.పరిస్థితులు ఎంత దిగజారాయో ఇక్కడ మాస్కోలో తెలుసుకోవటం కష్టం. నేను ఒక గనులున్న ప్రాంతంలోని పట్టణం నుంచి వచ్చాను. అత్యధిక గనులు, ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ప్రస్తుతం అధికారంలో వున్నవారు అవినీతి పరులని, వారు జనాన్ని పట్టించుకోరని ప్రజలకు తెలుసు. బతికి బట్టకట్టటం ఎలా అన్న స్థితిలో అత్యధిక రష్యన్లు వున్నారు. తరువాత జరిగేది రాజకీయ సమీకరణే. కమ్యూనిస్టుపార్టీ వైపుగాక జనం మరోవైపు ఎలా వెళతారు ‘ అని మాస్కో స్టేట్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి గ్రెగరీ అఝోగిన్‌ వ్యాఖ్యానించారు.

    కమ్యూనిస్టు పార్టీ స్ధానంలో తనకు పూర్తి విధేయురాలిగా వుండే ఫెయిర్‌ రష్యా పార్టీని తయారు చేయాలని పది సంవత్సరాల క్రితం రష్యా పాలకవర్గం ప్రయత్నించింది. అయితే అది ఎన్నికలలో విజయం సాధించలేదు. కమ్యూనిస్టుల వైపు జనం మరల కుండా వుండేందుకు కనీస వేతనం, పెన్షన్ల పెంపుదల వంటి చర్యలను తీసుకుంది. ఇతర ఐరోపా కమ్యూనిస్టు పార్టీల మాదిరి రష్యన్‌ కమ్యూనిస్టులు పూర్తిగా పార్లమెంటేరియనిజానికి అంటుకుపోలేదు. సోషలిజానికి తిరిగి రష్యా రావాలంటే సామాజిక విప్లవం అవసరం అని భావిస్తున్నది.ఈ విషయంలో వృద్ధతరం కంటే యువతరం కమ్యూనిస్టులు మరింత గట్టిగా వున్నారు.’ అని క్రిస్టియన్స్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రిక పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: