• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Congress

ఓటర్లకు స్వేచ్చే బెంగాల్‌ ఎన్నికల అసలు సమస్య !

30 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress, CPI(M), INC, Mamatha Benarjee, Trinamool Congress, West Bengal election

ఎం కోటేశ్వరరావు

దేశంలో ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశలకు సిద్ధం అవుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమబెంగాల్లో నాలుగు దశల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఓటర్లను అనేక చోట్ల అధికార తృణమూల్‌ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిపురలో తొలి దశలో పోలింగ్‌ జరిగిన నియోజకవర్గంలో వందలాది పోలింగ్‌ కేంద్రాలలో సిపిఎం ఏజంట్లను రాకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు, రిగ్గింగుకు పాల్పడ్డారు. రెండవ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారటంతో ఎన్నికల కమిషన్‌ మొత్తం నియోజకవర్గ పోలింగ్‌నే మరొక రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకరి అప్రజాస్వామిక చర్యల గురించి ఒకరు రోజూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బిజెపి, తృణమూల్‌ రెండూ ఒకే విధమైన చర్యలకు పాల్పడుతున్నాయి. దేశంలో బిజెపిని విమర్శించే పార్టీలు త్రిపుర గురించి మాట్లాడలేదు. అలాగే మమతాబెనర్జీని తమతో కలుపుకొని కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలు పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య ఖూనీ గురించి నోరెత్తటం లేదు. గతంలో సిపిఎ పాలనలో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ అంటూ అన్‌సైంటిఫిక్‌ వాదనలు, ప్రచారం చేసిన వారు ఇప్పుడు పల్లెత్తు మాట్లాడటం లేదంటే నాడు పని గట్టుకొని ప్రచారం చేసిన వారు తప్ప నిజమైన ప్రజాస్వామిక వాదులు కాదన్నది స్పష్టం. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రానివ్వలేదన్న విమర్శలు, ఆరోపణలు వామపక్ష ప్రభుత్వ హయాంలో రాలేదు.

పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానం కాదు. అసలు తమ ఓటు తాము వేసుకొనే స్చేచ్చను ఓటర్లకు ఇస్తారా అన్నది అసలు సమస్య. ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు-త ణమూల్‌ కండబలం మధ్య పోటీగా వుంది. మూడు దశల పోలింగ్‌లో వెల్లువెత్తిన ఆరోపణలు మిగిలిన నాలుగు దశల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. అభ్యర్ధులను ప్రచారం చేసుకోనివ్వరు,(స్ధానిక సంస్ధల్లో అయితే అసలు నామినేషన్లనే వేయనివ్వలేదు) అనుమానం వచ్చిన ఓటర్లను బూత్‌లకు రానివ్వరు, వచ్చిన వారు అధికార త ణమూల్‌కు ఓటేయలేదని అనుమానం వస్తే చావచితక కొడతారు అన్న విమర్శలు వచ్చాయి. అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి పడేవిధంగా, జాబితాలో వున్న వారి కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని, ఇలా రకరకాలుగా ఎన్నికల ఓటింగ్‌ యంత్రాల మీద విమర్శలు చేస్తున్న వారు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ పూర్వరంగంలో అక్కడ ఏ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా, ఓటర్లను కదిలించినా, వాస్తవాలను వివరించినా ఫలితం ఏమిటి, అసలు ఎన్నికలను బహిష్కరిస్తే పోలా అనే వారు వుండవచ్చు. అలా వూరందరికీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు మమతాబెనర్జీ అధికారానికి రావటానికి దోహదం చేసిన వారిలో వున్నారంటే వులిక్కిపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వారే వైఖరి తీసుకున్నారో తెలియదు. ఏ పిలుపు ఇచ్చినా పట్టించుకొనే వారు వుండరు.

అత్యవసర పరిస్ధితికి ముందు 1971లో కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేసింది. తాము విజయం సాధిస్తామన్న నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్నిచోట్లా సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడింది. ఆ నాడు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేదు. కమ్యూనిస్టులనే కదా తొక్కేసింది అన్నట్లుగా వున్నాయి. తరువాత అదే కాంగ్రెస్‌ సిపిఎంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల(సిపిఐ ఆ నాడు కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్న కారణంగా దాన్ని మినహా) నేతలందరినీ అత్యవసర పరిస్ధితి పేరుతో జైల్లో పెట్టింది. ఇప్పుడు మమతాబెనర్జీ అకృత్యాలను విమర్శించని పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చుగానీ, ప్రజాస్వామిక ప్రక్రియకు తలపెట్టిన హాని గురించి ఎందుకు పట్టించుకోవు? అవి కూడా తమకు ప్రాబల్యం వున్న ప్రాంతాలలో అలాంటి పనులు చేసిన చరిత్ర కలిగినవే, వర్గ రీత్యా ఒకే తానులో ముక్కలు కనుకే అలా వ్యవహరిస్తున్నాయి.

పైన పేర్కొన్న పరిమితుల పూర్వరంగంలో అక్కడి ఎన్నికల తీరు తెన్నులను చూద్దాం. రాష్ట్రమంతటా అలాంటి పరిస్ధితి వున్నప్పటికీ అనేక చోట్ల తృణమూల్‌ను వ్యతిరేకించే శక్తులు కూడా వున్నాయి. కనుకనే వామపక్షాలు, ఇతరులకు ఆ మేరకైనా ఓట్లు వస్తున్నాయి. దేశమంతటినీ గతంలో ఆకర్షించిన నియోజకవర్గాలలో జాదవ్‌పూర్‌ ఒకటి.లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీని ఓడించి మమతాబెనర్జీ జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ త ణమూల్‌ అభ్యర్ధిగా సినీ నటి మిమి చక్రవర్తి పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున కొల్‌కతా మాజీ మేయర్‌ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, ఇటీవల త ణమూల్‌ నుంచి వుద్వాసనకు గురైన మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్రా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కొల్‌కతా నగరంలో కొంత భాగం, గ్రామీణ ప్రాంతాలతో నిండి వున్న ఈ నియోజకవర్గంలోని జాదవ్‌ పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2011లో మినహా 1967 నుంచి సిపిఎం అభ్యర్దులే ఎన్నిక అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిపిఎం నే సుజన్‌ చక్రవర్తి ఎంఎల్‌ఏగా వున్నారు. త ణమూల్‌-సిపిఎం మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందనే అభిప్రాయం వెల్లడైంది. లాయర్‌ అయిన భట్టాచార్య నియోజకవర్గంలో అనేక కేసులలో ముఖ్యంగా వివిధ చిట్‌ఫండ్‌ మోసాల కేసుల్లో వందలాది మంది తరఫున ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వాదించి వారి సొమ్మును వెనక్కు ఇప్పించిన వుదంతాలు వున్నాయి. పోటీ తీవ్రంగా వున్నప్పటికీ రోజు రోజుకూ సులభం అవుతోందని భట్టాచార్య అంటున్నారు. రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియని సినీనటి మిమి గురించి అనేక మంది పెదవి విరుస్తున్నారు. సిపిఎం అభ్యర్ధి మంచి వాడైనప్పటికీ తగిన సంస్దాగత పట్టులేదని కొందరు అభిప్రాయపడ్డారు. 2011 ఎన్నికల్లో ఓటమి తరువాత సిపిఎంకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మార్పు కోసం ఓటు వేయాలని జనానికి వున్నప్పటికీ త ణమూల్‌ గూండాలు వారిని అనుమతించే అవకాశాలు లేవని ఓటర్లు భయపడుతున్నారని వికాస్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు.

మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కదా అన్న ప్రశ్నలకు బిజెపి అభ్యర్ధి హజ్రా మాట్లాడుతూ టిఎంసి అభ్యర్ధిని మిమి చక్రవర్తి ఎక్కడో జల్పాయిగురికి చెందిన వారు, ఆమెకూడా వెలుపలి వ్యక్తే కదా, అయినా నియోజకవర్గ ఓటర్లు బిజెపితోనే వున్నారు. త ణమూల్‌ నేరగాండ్లు, సంఘవ్యతిరేకశక్తులకు నిలయంగా మారినందునే తాను బిజెపిలో చేరానని, వారు నాపై బురద చల్లుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలోని భంగోర్‌ అసెంబ్లీ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌ మొల్లా ప్రస్తుతం మమతా మంత్రి వర్గ సభ్యుడు. గత రెండు సంవత్సరాలలో కావలసినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడీ మాజీ సిపిఎం నేత. ప్రస్తుతం త ణమూల్‌ అభ్యర్ధి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. చివరి దశలో పోలింగ్‌కు ఇంకా సమయం వుంది కనుక తరువాత రంగంలోకి వచ్చేది లేనిదీ తెలియదు. సింగూరులో పరిశ్రమలకు భూమి సేకరించటాన్ని వ్యతిరేకించిన త ణమూల్‌కు భంగోర్‌లో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే పరిస్ధితి ఎదురైంది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను వ్యతిరేకించిన వారిపై 2017లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్ధానిక త ణమూల్‌ ఎంఎల్‌ఏగా గతంలో పనిచేసిన అరబుల్‌ ఇస్లాం తన అనుచరులతో బెదిరించి భూములు స్వాధీనం చేసుకున్నాడు. త ణమూల్‌ గూండాయిజానికి పేరుమోసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన భారీ మెజారిటీ త ణమూల్‌ గెలుపును నిర్ధేశించింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.

ఒక్క జాదవ్‌పూరే కాదు, ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ల అభీష్టం మేరకు ఓట్లు వేసుకొనే స్వేచ్చాపూరిత వాతావరణం లేదన్నది సర్వత్రా వెల్లడౌతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు త ణమూల్‌ ధన, కండబలాన్ని వుపయోగించి తన స్ధానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పుడేఇపుపడే కింది స్ధాయి క్యాడర్‌, సానుభూతి పరుల్లో భయం వదులుతున్న స్ధితిలో సిపిఎం, మొత్తంగా వామపక్ష సంఘటన తిరిగి తన మద్దతుదార్లను కూడగట్టుకొని పోయిన స్ధానాలను తిరిగి సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పన్నెండు సంవత్సరాల తరువాత నందిగ్రామ్‌లో సిపిఎం తన కార్యాలయాన్ని తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రారంభించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల జనంలో తొలుగుతున్న భ్రమలు, ప్రతిఘటనకు ఇదొక సూచిక అయినప్పటికీ ఇంకా దాని గూండాయిజం ఏమాత్రం తగ్గలేదన్నది నాలుగు దశల ఎన్నికలు నిరూపించాయి. తాము ఇరవైకి పైగా స్ధానాలు సంపాదించగలమనే వూహల్లో బిజెపి నేతలు వున్నారు. గతంలో తాను సాధించిన వాటిని అయినా నిలబెట్టుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. త ణమూల్‌ కాంగ్రెస్‌-బిజెపి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటి మధ్య అంతర్గత ఒప్పందం వుందన్నది వామపక్షాల విమర్శ. త ణమూల్‌, బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలు గెలిచిన సీట్లలో పరస్పరం పోటీ నివారించుకోవాలని, ఆమేరకు కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో తాము పోటీ చేయబోమని, తమ స్ధానాల్లో అదే విధంగా స్పందించాలని సిపిఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్‌ అందుకు అంగీకరించకుండా సిపిఎం గెలిచిన స్ధానాల్లో పోటీకి దిగింది. అయినప్పటికీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్ధానాలలో వామపక్ష సంఘటన పోటీ చేయకుండా 42కుగాను 38 చోట్లకే పరిమితం అయింది.

మాల్డా అంటే కాంగ్రెస్‌ కంచుకోట. ఏబిఏ ఘనీఖాన్‌ చౌదరి పాతికేండ్లకు పైగా ఎంపీగా వున్నారు. తరువాత ఆయన వారసులే ఎన్నిక అవుతున్నారు. 2006లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయనే వేస్తున్నట్లుగా ఓటర్ల వైఖరి వుంటుంది. ఘనీఖాన్‌ చౌదరి సోదరుడు మాల్డా దక్షిణంలో తిరిగి పోటీచేస్తుండగా సిపిఎం తన అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. మాల్డా వుత్తరం నుంచి గెలిచిన ఘనీఖాన్‌ మేనకోడలు జనవరిలో కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌కు ఫిరాయించారు. బిజెపిని ఓడించాలంటే త ణమూల్‌ పార్టీ అవసరమని దానిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఆమెపై ఘనీఖాన్‌ కుటుంబం నుంచే మరొకరు రంగంలో వున్నారు.

ముర్షిదాబాద్‌ జిల్లాలో ముర్షిదాబాద్‌, జాంగీపూర్‌ నియోజకవర్గాలున్నాయి. జాంగీపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండుసార్లు, తరువాత ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ రెండుసార్లు ఎన్నికయ్యారు. గత రెండు ఎన్నికలలో అభిజిత్‌ మెజారిటీ 2012లో 2,536, 2014లో 8,161 మాత్రమే. రెండు సార్లూ సిపిఎం అభ్యర్ధి రెండవ స్ధానంలో వచ్చారు.ఈ సారి కూడా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. ఈ నియోకవర్గంలో సిపిఎం 1977-1999 మధ్య ఏడుసార్లు గెలిచింది. మరోనియోజకవర్గం ముర్షిదాబాద్‌, సిపిఎం సిటింగ్‌ అభ్యర్ధి బద్రుద్దోజా ఖాన్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రముఖుడైన హుమాయున్‌ కబీర్‌ బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధి అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్‌, త ణమూల్‌ పోటీ చేస్తున్నాయి. మరో నియోజకవర్గం బెరహంపూర్‌ ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌కు సిపిఎం మద్దతు ఇస్తున్నది. అధిర్‌ అనుచరుడిగా వున్న అపూర్వ సర్కార్‌ కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌లో చేరి అభ్యర్ధి అయ్యారు.

బిజెపి మతతత్వ రాజకీయాల ప్రయోగ కేంద్రంగా మారిన అసన్‌సోల్‌,దుర్గాపూర్‌, బర్ద్వాన్‌ ప్రాంతంలో బిజెపి అసన్‌సోల్‌ నియోజకవర్గంలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతుల పేర్లతో ప్రదర్శనలు జరిపి బలపడింది. త ణమూల్‌ కాంగ్రెస్‌లోని ముఠాతగాదాల కారణంగా ఒక వర్గం మద్దతు ఇచ్చిన కారణంగానే ఇక్కడ బిజెపి అభ్యర్ధి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న బాబూలాల్‌ సుప్రియో విజయం సాధించారు. ఈసారి రెండు వర్గాల మధ్య రాజీగా సినీ నటి మున్‌మున్‌ సేన్‌ రంగ ప్రవేశం చేశారు. బిజెపి మరో నియోజకవర్గం డార్జిలింగ్‌. ఇక్కడ ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఇక్కడ కూడా మత ప్రాతిపదికన చీల్చేందుకు బిజెపి ప్రయత్నించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 17.02శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పదిశాతానికి పడిపోయింది. అయినప్పటికీ తానే త ణమూల్‌కు ప్రత్యామ్నాయం అని సగం సీట్లు గెలుస్తామని మీడియా ప్రచారదన్నుతో చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం సీట్లు

త ణమూల్‌ కాంగ్రెస్‌ 39.05      34

వామపక్ష సంఘటన 29.71       2

బిజెపి                17.02       2

కాంగ్రెస్‌                9.58       4

2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం, సీట్లు

త ణమూల్‌    44.9          211

సిపిఎం        19.8            26

కాంగ్రెస్‌        12.3           44

బిజెపి         10.2            3

ఫార్వర్డ్‌బ్లాక్‌    2.8             2

సిపిఐ          1.5           1

ఆర్‌ఎస్‌పి      1.7           3

జెఎంఎం       0.5           3

ఇండి ్        0             1

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక వుదంతం !

17 Thursday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, Congress, jds, karnataka developments, karnataka politics, karnataka votes 2018, unexpected twist in karnataka developments

Image result for Karnataka government formation

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఒక తీవ్రమైన అంశాన్ని దేశ అత్యున్నత న్యాయ స్ధానం అర్ధరాత్రి విచారణకు స్వీకరించి తెల్లవారు ఝామున ఒక తాత్కాలిక నిర్ణయాన్ని ప్రకటించి, తదుపరి విచారణ కొనసాగింపునకు నిర్ణయించటం బహుశా ఇదే ప్రధమం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని స్ధితిలో 117 మంది బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌-జెడిఎస్‌ను కాదని 104 స్ధానాలున్న బిజెపిని ఆహ్వానించటం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ఇది అనూహ్యమైన మలుపు. గతంలో కొన్ని కేసులలో వచ్చిన తీర్పులు, సంప్రదాయాల మార్గదర్శనం వున్నప్పటికీ గవర్నర్లు తమ విచక్షణ, వివేచనను వినియోగించిన తీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఎవరెలా వినియోగిస్తారో తెలియని స్ధితిని ముందుకు తెచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారాలకు కూడా నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందువలన ఈ కేసు తీర్పు లేదా నిర్ణయం పర్యవసానాలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ ప్రతినిధులుగా పరిరక్షకులుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్ధ మీద, రాజ్యాంగానికి, గవర్నర్ల విచక్షణకు వున్న పరిమితుల మీద భాష్యం చెప్పి దానిని కాపాడాల్సిన న్యాయవ్యవస్ధ మీద ఎలా పడతాయో చూడాల్సి వుంది. ఏ వ్యవస్ధకూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు గాని అవి పని చేస్తున్న తీరును విమర్శించే అవకాశం వుండటం ప్రజాస్వామ్య వ్యవస్ధ లక్షణం. అందుకు కోర్టు తీర్పులు కూడా మినహాయింపు కాకూడదు.

రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన వుదంతంలో ఈ కేసులో సీనియర్‌ న్యాయమూర్తులను వదలి జూనియర్లతో బెంచ్‌ ఏర్పాటు చేయటం కూడా ఇదే ప్రధమం. గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారికంగా వర్తమానం రాకముందే ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం గురించి బిజెపి సామాజిక మాధ్యమంలో ప్రకటించటం కూడా ఇదే ప్రధమం. ప్రత్యర్ధులు కోర్టుకు వెళుతున్నారని తెలిసి దానికి అవకాశం లేకుండా చేసేందుకు సాధారణంగా కోర్టు సమయం ముగిసిన తరువాత గవర్నరు లేఖ రాయటం, మరుసటి రోజు కోర్టును తెరవక ముందే ప్రమాణ స్వీకారానికి పూనుకోవటం కూడా ఇదే ప్రధమం. ఇదంతా తెరవెనుక ఒక పధకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది.

గవర్నర్‌ నిష్పాక్షితను ఎవరూ ప్రశ్నించకుండా వుండాలంటే రెండు పక్షాలు తమకే బలం వుందని చెబుతున్నపుడు, ఒక పక్షంలోని పేర్లు మరొక పక్షం జాబితాలో కనిపిస్తున్నపుడు గవర్నరు తన ముందు హాజరై సంఖ్యానిరూపణ చేసుకోమని ఎందుకు కోరలేదు. కర్ణాటక వుదంతం దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

తమకు మెజారిటీ మద్దతు వుందని చెప్పుకుంటున్న పార్టీ నేతను బుధవారం మధ్యాహ్నం లోగా జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. బిజెపి నేతగా ఎన్నికైన ఎడ్డియూరప్ప గవర్నర్‌కు ముందు ఇచ్చిన జాబితాలో ఎన్నిపేర్లున్నాయి, బిజెపిగాకుండా ఇతర పార్టీలవి, ఇండిపెండెంట్లవి ఎన్ని వున్నాయన్నది ఆసక్తికర అంశం. ఒక లేఖ కాకుండా రెండు ఇచ్చారా అన్నది కొందరి సందేహం. మరోవైపు కాంగ్రెస్‌ -జెడిఎస్‌ అందచేసిన జాబితాలో 117 పేర్లు వున్నట్లు ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.

ఇరు పక్షాలు ఇచ్చిన లేఖలు, జాబితాలను చూసిన గవర్నర్‌ తన ‘విచక్షణ ‘ అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోంది తప్ప జాబితాల్లో పేర్ల తకరారును నిర్ధారించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తమ మద్దతుదార్లందరినీ స్యయంగా గవర్నరు ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌-జెడిఎస్‌ చెప్పినప్పటికీ గవర్నర్‌ అంగీకరించలేదంటే, ముందే ఒక నిర్ణయానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. ఎడ్డి యూరప్ప తన బల నిరూపణకు వారం రోజులు గడువు ఇమ్మని కోరినట్లు వార్తలు రాగా గవర్నరు పదిహేను రోజులు ఇచ్చారు. బల నిరూపణకు ఎడ్డి యూరప్ప గడువును కోరటం అంటే అధికారాన్ని అప్పగించమని కోరే సమయంలో తమకు పూర్తి మెజారిటీ లేదని అంగీకరిస్తూ, కొందరు మద్దతు ఇస్తామని చెప్పినందున గడువు ఇమ్మని కోరటం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ తరువాత ఏ రాజకీయ పార్టీలోనూ నిబంధనలకు అనుగుణ్యంగా ఎలాంటి చీలికలు లేవు. అలాంటపుడు ఇతర పార్టీల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెబితే గవర్నర్‌ నమ్మటం ఏమిటి? ఎడ్డి యూరప్ప చెప్పారు, ఈ గవర్నర్‌ నమ్మారు అది అంతే అంటారా ?

గవర్నర్‌లు పాలకపార్టీల వారే గనుక వారు ఎక్కడ స్టాంపు వేయమంటే అక్కడ స్టాంపు వేస్తారని గతంలో కాంగ్రెసు, ఇపుడు బిజెపి నియమిత గవర్నర్లు నిరూపించారు. అనూహ్యంగా ఇప్పుడు బంతి కోర్టుకు వచ్చింది. గవర్నరు విచక్షణ అధికారాన్ని తాము ప్రశ్నించలేం, అందువలన దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోం అని కేసును అంతటితో ముగిస్తే కధ వేరుగా వుండేది. గవర్నరు చర్యమీద, ఎడ్డి యూరప్ప ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వకుండా ఫిర్యాదును విచారించేందుకు పూనుకోవటం బహుశా బిజెపి వూహించి వుండదు.

అధికారాన్ని కోరిన రెండు పక్షాలు ఇచ్చిన జాబితాలను తమకు సమర్పించాలని కోర్టు కోరటం అంటే వాటిలోని నిజానిజాలను తేల్చేందుకు పూనుకోవటమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక మిశ్రా తీరుతెన్నులపై సుప్రీం కోర్టు సీనియరు న్యాయమూర్తులే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి ఈ కేసులో జూనియర్లతో బెంచిని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.

గతంలో ఇదే ఎడ్డి యూరప్ప తనకు 110 సీట్లు వచ్చినపడు, కొంత మంది ఇండిపెండెంట్లను తన వైపుకు తిప్పుకోవటం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట వేటు పడకుండా ఇతర పార్టీల సభ్యులను సభకు హాజరు కాకుండా చేసి తన మెజారిటీని నిరూపించుకొని తరువాత వారిచేత రాజీనామా చేయించి తన సర్కారును కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఫిరాయింపుదార్లను ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ వారి మీద పిరాయింపు నిరోధక చట్టవేటు పడలేదు, వారి గురించి స్పీకర్లు ఎటూ తేల్చలేదు. అదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అనుసరించేందుకు బిజెపి పూనుకుందా ? అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి పరిస్ధితికి తేడా వుంది. అక్కడ మెజారిటీ పక్షాలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తమకు అదనపు బలం అవసరం లేకపోయినా ఏదో ఒకసాకుతో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. కర్ణాటకలో పరిస్ధితి భిన్నం. గతంలో మాదిరే ఇతర పార్టీల సభ్యులను కొందరిని లోపాయకారీగా కూడగట్టుకొని గట్టెక్కాలన్నది బిజెపి ఎత్తుగడ. గత అనుభవాల రీత్యా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ముందు చూపుతో తమ జాగ్రత్తలు తాము తీసుకున్నాయి. అయితే సభలో బలనిరూపణ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వ్య తిరేకంగా ఓటు వేసే లేదా వేయకుండా వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందే, బలపరీక్ష జరగక ముందే వివాదం కోర్టుకు వెళ్లింది. సభ ఇంకా ఏర్పడ లేదు, సభ్యులు ప్రమాణ స్వీకారమే చేయలేదు. కోర్టు విచారణ సమయానికి ఏ సభ్యుడూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వకుండా కేసు విచారణ చేస్తామని కోర్టు చెప్పటం అంటే సదరు ప్రమాణ స్వీకారం తమ తీర్పుకు లోబడి వుండాలనటం తప్ప వేరు కాదు.

కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటి? గత తీర్పుల ప్రకారం మెజారిటీ వున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గనుక తీర్పు వస్తే మన కోర్టుల మీద జనంలో మిగిలి వున్న కొద్దో గొప్పో నమ్మకం బలపడుతుంది. ఒక వేళ గవర్నర్‌ విచక్షణ అధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ప్రకటిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్ధను గబ్బు పట్టించటాన్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని వాటి మీద వున్న విశ్వాసాన్ని జనం కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌, విజిలెన్స్‌, సిబిఐ, ఇతర అనేక సంస్ధలు పాలకుల చేతుల్లో సాధనాలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ కేసు న్యాయవ్యవస్ధకు ఒక అగ్నిపరీక్ష వంటిదే ! ఎలాగైనా అధికారానికి అంటి పెట్టుకొని వుండేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులను ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటు వేయమని కోరతానని ఎడ్డియూరప్ప ప్రకటించారు. గతంలో తమ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి పదవి అభ్యర్ధిని ఓడించేందుకు ఇందిరా గాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని పిలుపు నిచ్చి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరతీశారు. ఇప్పుడు అది చెల్లదు, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అలాంటి ఓటింగ్‌ చెల్లదని తెలిసినా ఎడ్డి యూరప్ప ఆ పిలుపు ఇవ్వటం తమకు బలం లేదని అంగీకరించటమే. ఆవు ఎక్కడ కట్టినా తమ దొడ్లో ఈనితే చాలు అనుకున్నట్లుగా ఏ పార్టీ తరఫున గెలిచినా తమకు మద్దతు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న బిజెపి డబ్బు, ఇతర ప్రలోభాలను ఎరచూపి, బెదిరింపులకు పాల్పడి రాజకీయంగా మరింతగా విమర్శల పాలు కావటం ఖాయం. అటు కేంద్రంలో నరేంద్రమోడీపై ఇప్పటికే వున్న మచ్చలకు తోడు ఇది మరొకటి తోడు కావటం తప్ప అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ వుదంతం చివరికి ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఒక వేళ కోర్టు తీర్పు ఎడ్డికి అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్ధను కూడా బిజెపి ప్రభావితం చేసిందని జనం భావించే అవకాశం వుంది. అనూహ్యంగా ఎడ్డికి అవకాశం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇస్తే బిజెపికి అది పెద్ద భంగపాటు. ఏది జరిగినా మరికొద్ది నెలల్లో జరిగే రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నయీం తరువాత గ్యాంగస్టర్ల భవితవ్యం ఏమిటి ?

14 Sunday Aug 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, gangsters, Naeem, tdp, Telangana police, trs

సత్య

   హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలోని షాద్‌ నగర్‌ దగ్గరలో పోలీసులు మట్టు పెట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం గురించి కొన్ని మీడియా సంస్ధలు పేజీల కొద్దీ కథనాలను వండి వడ్డిస్తున్నాయి. వాటిని పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. స్త్రీ వేషధారణలో వున్న నయీం ఫొటోను విడుదల చేసిన పోలీసులు వాటికి మరింత కిక్కు ఎక్కిస్తున్నారు. అంతకు ముందు గ్యాంగస్టర్‌ కధాంశంగా నిర్మించిన రజనీకాంత్‌ సినిమా కబాలీ గురించి కూడా మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాఖ్యానాలు ఇచ్చింది. మనం అమ్మే సరకు ఏదన్నది కాదన్నయా దాని వలన మనకు ఎంత డబ్బు వస్తుందన్నదే ముఖ్యం అన్నట్లుగా పత్రికలు, టీవీ ఛానల్స్‌, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియా వంటివి దేనిని ఆదాయవనరుగా మార్చుకోవచ్చో నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నయీం గురించి వర్ణితమౌతున్న కధనాలు రాంగోపాల్‌ వర్మ తన అభిమాన హీరోయిన్‌ శ్రీదేవికి 53ఏండ్లు నిండిన కారణంగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీయలేకపోయినా వేరే వారితో హాలీవుడ్‌ మాదిరి సీరియల్‌ సినిమాలు తీయటానికి పనికి వస్తాయి. ఎందుకంటే నయీం కధలలో చీమలను, నరికిన వేళ్లను కరకరా నమిలి తినటం వంటి వాటితో సహా లేడీ డాన్‌లు,గోవా బీచ్‌లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది కనుక కల్పిత పాత్రల కోసం చూడనవసరం లేదు.

    ఒక గ్యాంగ్‌స్టర్‌ హతమైన తరువాత అతగాడి బాధితుల గురించి కధనాలు రాసినట్లుగానే, నిజాలను నిర్భయంగా చెబుతాం, రాస్తాం అనే మీడియా రాజకీయ నేతల బాధితుల కధలు ఎందుకు రాయటం లేదు ? పోయినోళ్లందరూ మంచోరే అయితే గ్యాంగస్టర్‌లు కూడా అంతేగా ? పోనీ పోయిన అందరు గ్యాంగ్‌స్టర్ల గురించి మీడియా అలా రాస్తోందా? ఎందుకు రాయటం లేదు? నయీం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్థులను బాధితులకు తిరిగి ఇస్తాం అని చెబుతున్నట్లుగా రాజకీయ నేతలు లేదా ఆ ముసుగులో కబ్జా చేసిన వాటి గురించి ఏమిటి ? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

   ఈ మధ్య కాలంలో అనేక మంది గ్యాంగస్టర్లు, రాజకీయ నేతల బారిన పడిన కథలే కాకుండా మీడియా బారిన పడి ఎలా నష్టపోయిందీ చెబుతున్నారు. నయీం బాధితులకు భరోసా ఇస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా బాధితులకు కూడా అలాంటి హామీ ఇవ్వగలదా ? విక్రమార్కుడి కధలో రాజా నిజం తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి వక్కలౌతుంది అన్నట్లుగా, సమాధానం చెప్పలేకపోతే తల శిరఛ్చేదం అవుతుందనే అపూర్వ చింతామణి కధలు లేదా గులేబకావళికధ సినిమాలో జూదంలో గెలవలేక బందీలుగా మారిపోవటానికి గాని ముందుకు వచ్చే వీరులెవ్వరుంటారు ?

  నయీం వంటి గ్యాంగస్టర్‌లను మట్టుపెట్టినపుడు భవిష్యత్‌లో అలాంటి మరొకరిని ఎదగనీయకూడదని అనేక మంది సామాన్యులు నిజంగానే కోరుకుంటారు. వారి సానుభూతిని కొల్లగొట్టటానికి పాలకులు, అధికార యంత్రాంగం కూడా నిరోధానికి కఠిన చర్యల గురించి భీకర ప్రతిన బూనుతుంది. స్మశాన, ప్రసూతి వైరాగ్యాల మాదిరి రెండవ రోజుకు అవి గుర్తుండవు. అంటే మతి మరపు వైరస్‌ వారిని సోకుతుందా ? ఏమౌతుంది, ఎందుకు అలా జరుగుతుంది.

   భూస్వాములు, దొరలు, దేశముఖ్‌ల హయాంలో వారికి ప్రయివేటు సైన్యాలు వున్న విషయం తెలిసిందే. కావాలంటే పాత సినిమాలు చూడవచ్చు. ఆ ఫ్యూడల్‌ వ్యవస్ధ అంతరించి లేదా అంతరిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారి స్ధానాన్ని గ్యాంగస్టర్లు, తాలిబాన్లు (అన్ని రకాల మతోన్మాదులు) భర్తీ చేస్తున్నారు. అనేక హాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నాయి. ధనిక దేశాలలో మాఫియా, గ్యాంగస్టర్ల ఆధిపత్యం, పట్టు గురించి ఎన్నో పరిశోధనలు, ఎంతో సాహిత్యం వెలువడుతోంది. వారు అనేక చోట్ల సమాంతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాఫియాతో పాటు నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాలలో బూతు ఒకటి. అన్ని రంగాలలో అగ్రస్ధానంలో వున్న అమెరికాలో హాలీవుడ్‌ సినిమాలతో సమంగా బూతు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ పాలక వర్గాలు, వ్యవస్ధ ఎలా అనుమతించింది. ఎలా కొనసాగనిస్తోంది ?

    అందుకే ప్రపంచంలో మనకు ఎక్కడా మంచి భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, మంచివ్యాపారి కనిపించడు. రాజ్యాంగ వ్యవస్ధలు వునికిలోకి వచ్చిన తరువాత వివిధ కాలాలు, దేశాలలో పేరు ఏదైనప్పటికీ పోలీసు, మిలిటరీ అనేది పాలకవర్గాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న అధికారిక యంత్రాంగం. విలువలు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం వంటి వాటి గురించి కబుర్లు చెబుతుంటారు కదా ? అలాంటి వారు పోలీసు వ్యవస్ధద్వారా కొన్ని అక్రమాలు చేయించలేరు. అలాంటి వారు ఏర్పాటు చేసుకొనే అనధికార యంత్రాంగమే గూండాలు. భూస్వామి, దొరలు, దేశ ముఖులు అయితే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను అదుపు చేయటానికి, వారిపై దాడులకు, పెట్టుబడిదారులు అయితే కార్మిక సంఘాలను, వుద్యమాలను దెబ్బతీయటానికి గూండాలతో పాటు మత శక్తులను వుపయోగించుకోవటం, అడ్డదారిలో లాభాల సంపాదనకు వ్యాపారులు స్మగ్లర్లను వినియోగించుకోవటం తెలిసిందే.ఈ శక్తులన్నింటితో సంబంధాలు, వాటాలు వుంటాయి కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పాలకవర్గ రాజకీయనేతలకు వాటిలో వాటా వుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం కూడా పైన పేర్కొన్న అవాంఛనీయ శక్తులు అదుపుతప్పినపుడు అణచివేయటానికి వారిలోని వారినే వినియోగించుకోవటం ప్రారంభమైంది. వుదాహరణకు నక్సల్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం కొంత కాలం సాగింది. అది బూటకం అని జనానికి అర్ధమైన తరువాత శవాల దగ్గర తుపాకులు,ఎర్ర కరపత్రాలు,సాహిత్యం పెట్టటం వంటి పాతబడిన పద్దతుల స్ధానంలో వారిలోకి కోవర్టులను ప్రవేశపెట్టి వారి చేతే మట్టుపెట్టే సరికొత్త ప్రక్రియకు తెరతీశారు. అది ఇప్పటికీ నడుస్తోంది. నిఘా వ్యవస్ధ, సిబ్బంది కంటే ఈ కోవర్టుల ద్వారానే నక్సల్స్‌, గూండా, మాఫియా గ్యాంగుల పక్కా సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలుగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ వ్యవహారం. ఈ క్రమంలోనే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు పోలీసులతో సహా ప్రతివారూ అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఇది ఒక విషవలయం.

    గతం గురించి ఎలాంటి అనుభవాలున్నప్పటికీ ప్రతి తరంలోనూ ఇది పునరావృతం కావటానికి ఇది కూడా లాభసాటి వ్యాపారమే కనుక దానికి నాయకత్వం వహించే వ్యవస్దే దీనిని పెంచి పోషిస్తున్నది. నక్సల్స్‌ ఎందరో భూస్వాములను ఖతం చేశారు, వారి స్ధానంలో కొత్తవారు పుట్టుకు వచ్చారా లేదా, అలాగే సుబ్బరామిరెడ్డి వంటి ఒక పారిశ్రామికవేత్తను హతమార్చారు, అయినంత మాత్రాన ఆ వర్గం అంతమైందా లేదు. ముంబైలో ఎందరో గ్యాంగస్టర్లను అంతమొందించారు, జైళ్లలో పెట్టారు. అయినా అక్కడ కొత్తవారు పుట్టుకు రావటం ఆగిపోలేదే. అమెరికా పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు, ఐఎస్‌ వుగ్రవాదులు, పంజాబ్‌, కాశ్మీర్‌లలో వేర్పాటు వాదులను ఎందరినో హతమార్చారు. అయినా కొత్త వారు తయారు కావటం ఆగిపోలేదే. ఎందుకంటే అమెరికా కొత్తవారిని తయారు చేయటం నిలిపివేయలేదు.

   మీడియా రంగంలో అవాంఛనీయ శక్తులు, ధోరణులు ప్రవేశించటం దేన్ని సూచిస్తున్నది. దిగువ స్ధాయిలో వున్న విలేకర్లు అనేక అక్రమాలను వెలికి తీసి నివేదిస్తే వాటిని ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల సంగతి తెలియనిదెవరికి? దీన్ని చూసిన తరువాత అదే విలేకర్లలో కొందరు సంపాదనకు దగ్గరదారిగా వుందని భావించి అదే పని చేస్తున్నారా లేదా ?అలాంటి యాజమాన్యాల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలియదా ? తెలిసీ ఎందుకు మౌనంగా వుంటున్నారు. కనీస చట్టాలను కూడా అమలు జరిపేందుకు పూనుకోవటం లేదే ? ఇది పత్రికా యాజమాన్యాలు-ప్రభుత్వనేతలు, రాజకీయనేతల కుమ్మక్కు కాదా ?

    అందువలన గూండాగిరి, గ్యాంగస్టర్‌, మాఫియా వంటి పదాలకు సాంప్రదాయ అర్ధాలను నవీకరించి కొత్త తరగతులను జత చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో కొన్ని తరగతుల జనానికి నేరస్థ తెగలనే ముద్రవేసి వారి పునరావాసం పేరుతో కొన్ని కప్పరాలతిప్ప, స్టూవర్టుపురం, సీతానగరం వంటి కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేశారు. చివరికి వారి చేతనే పోలీసు యంత్రాంగం, పలుకుబడిగల పెద్దలు దొంగతనాలు చేయించి వారిని శాశ్వత నేరస్థులుగా చేసిన వుదంతాలు మన కళ్ల ముందే వున్నాయి.

   అనేక ప్రాంతాలలో గూండాలుగా తయారై అర్ధంతరంగా జీవితాలు ముగించిన వారి గురించి తెలుసు. అదొక వారసత్వం మాదిరి వారి వారసులు కూడా తయారై కొనసాగటం మన కళ్ల ముందే కనిపిస్తోంది.వారిని వుపయోగించుకుంటున్న రాజకీయ నేతలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.అందువలన ఒక వీరుడు మరణిస్తే వేయి మంది వుద్బవిస్తారు అన్న మాదిరి ఈ రోజులలో వీరులు వుదయించటం లేదు గాని ఒక గూండా మరణిస్తే పదివేల మంది గూండాలు తయారవుతారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    ఎక్కడైనా ఒక కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద దుకాణంలో ఎవరైనా అంతరించి పోగా మిగిలి వున్న తమ హక్కులను కాపాడు కొనేందుకు కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే వెంటనే వారిపై దాడి. వారి వెనుక ఎవరున్నారని ఆరాలు, ఆ యూనియన్లను అధికారపక్షం స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోతే వారే ఒక యూనియన్‌ పెడతారు. దానిలో అందరూ చేరాలని వత్తిడి చేస్తారు, బెదిరిస్తారు, వేధిస్తారు, దానికి లొంగకుండా అనివార్య స్ధితిలో ఆందోళన చేస్తే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే వారు వెనక్కు పోతారంటూ కఠినంగా అణచివేసేందుకు పూనుకుంటారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ అందరూ ఏకీభావంతో కూడబలుక్కున్నట్లుగా ఒకే విధంగా వ్యవహరిస్తారు. కార్మిక వుద్యమాల గురించి మీడియా కనీస ప్రస్తావన కూడా చేయదు, రాజకీయ ఫిరాయింపులపై చూపిన ఆసక్తి, కేటాయించిన స్ధలం, సమయాలతో పోల్చితే జనం సమస్యలకు ఇచ్చేది నామమాత్రం.అందుకే వెయ్యి మంది నయీంలు తయారు కావటానికి అయినా ఈ వ్యవస్ధ అంగీకరిస్తుంది కానీ ఒక ప్రజా వుద్యమం పురుడు పోసుకొని ఎదగటాన్ని మాత్రం సహించదు. దోపిడీ వ్యవస్ధల మౌలిక లక్షణం అది.

    అందరూ శాకాహారులే మధ్యలో రొయ్యలబుట్ట మాయం, అన్నట్లుగా అందరూ గ్యాంగస్టర్లుగా కఠినంగా వ్యవహరించినవారే గానీ గ్యాంగస్టర్లు తయారవుతూనే వున్నారు, దందాలు చేస్తూనే వున్నారు. నయీం వంటి ఒక సామాన్యుడు గూండాగా మారి వందల మందిని అనుచరులుగా చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నా, నిత్యం అనేక మందిని బెదిరిస్తున్నా, హత్యలు చేసినా, చేయిస్తూ దశాబ్దాల తరబడి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ఇలాంటి పెద్దా, చిన్న గ్యాంగస్టర్లు ఎంత మంది వున్నారు? వారు కూడబెట్టిన ఆస్తులెన్ని, బాధితులెందరు ? వారిని కాపాడిన పోలీసులెవరు? వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన పోలీసులెవరు? వారికి అడ్డుపడిన రాజకీయ నేతలెవరు ? ఎందుకలా చేశారు వంటి అంశాలపై శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు వెల్లడించాలి. ఇవేమీ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కావు, అవాంఛనీయ శక్తుల అసలు రంగు.ప్రభుత్వం అలా చేయకపోతే లేదా తమకు ప్రత్యర్ధులుగా వున్నవారిని మాత్రమే పోలీసు యంత్రాంగం ద్వారా లక్ష్యంగా చేసుకుంటే ఎస్‌సి, ఎస్‌టి కేసుల మాదిరి నయీం ముఠాపై దాఖలైన కేసులు నీరు గారి పోయి, రాబోయే తరాలకు మరింత వుత్సాహమిస్తాయి. ఇప్పటివరకు గ్యాంగస్టర్లపై నమోదు చేసిన కేసులలో వారితో చేతులు కలిపిన వారిని శిక్షించిన దాఖలాలు లేవు. ఒక వేళ అలాంటివి వున్నా ప్రభుత్వం బయట పెట్టి వాస్తవాలను తెలియచేయాలి. అప్పుడే ఎవరైనా ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. రాబోయే రోజుల్లో చిన్న గ్యాంగులు పెద్ద గ్యాంగులుగా మారకుండా చర్యలు తీసుకోవటానికి నిజాయితీగల యంత్రాంగం ముందుకు వస్తుంది.జోక్యం చేసుకొనే పెద్దలు వెనక్కు తగ్గుతారు.

    అలా చేయకపోతే చిత్తశుద్ధిలేని మీడియాలో నయీం గురించి మరికొద్ది రోజులు చదువుకుంటాం. అతగాడి వారసులు రంగంలోకి వచ్చిన తరువాత మీడియాలో వారి గురించి ఒక్క ముక్కా రాదు. ఆ గూండాలు అంతమైన తరువాత అదే మీడియా మరోసారి విజృంభిస్తుంది. కొత్త కథలను వండివారుస్తుంది. యధాప్రకారమే పోలీసు అధికారులు వారిని మేము ఇతర అవసరాలకు వుపయోగించుకున్నాం గానీ, ఇంత ముదురుతారని వూహించలేకపోయాం అంటారు. అతనెవరో కూడా నాకు తెలియదు గానీ అంతమొందించాలని నేను సూచిస్తే పాలకులు అంగీకరించలేదు అని కూడా చెబుతారు. వాటిని నోరు మూసుకొని,చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి. ఎవరైనా కాదంటే పాలకులు, పోలీసులు, గూండాలు కలసి వారి అంతు చూస్తారు.అన్ని దోపిడీ వ్యవస్థలు, ప్రాంతాలలో జరుగుతున్నది ఇదే, ఇక్కడా జరగబోయేది అదే.

    ఇలాంటి వారిని అంతం చేస్తే చాలదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారిని తయారు చేస్తున్న వ్యవస్ధను నాశనం చేసి కొత్త సమాజానికి పునాదులు వేయటమే పరిష్కారం. పేరుదేముంది దానికి ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళ వామపక్షాలకు సవాలు విసిరిన ఓటింగ్‌ సరళి

20 Friday May 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ 2 Comments

Tags

BJP, Congress, CPI(M), INDIAN LEFT, LDF, LEFT FRONT, UDF

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనవాదం ! మనువాదం !! అవకాశవాదం !!!

10 Sunday Apr 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, communist, Congress, CPI(M), K CHANDRA SEKHRA RAO, manuvadam, Narendra Modi, opportunism, pro people, RSS, tdp, trs

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి సమావేశాలలో నరేంద్రమోడీ భజన

21 Monday Mar 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP National executive meet, Congress, Modi, narendra modi namo mantra

సత్య

   న్యూఢిల్లీలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం జాతీయ వాదం, భారత మాతాకీ జై, అభివృద్ధి గురించి జపం చేసిందన్నది మీడియా వార్తల సారాంశం. అభివృద్ధి, అభివృద్ధి, మరింత అభివృద్ధి మీద కేంద్రీకరించాలి తప్ప ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఇతర అంశాల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి వక్కాణించినట్లు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పారు. గత ఇరవై రెండు నెలల బిజెపి కేంద్ర పాలన తీరును చూస్తే అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు బిజెపికి ఏమైనా వుందా ? ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ఐదు చోట్లా బిజెపికి ఎక్కడా అవకాశాలు లేవన్నది స్పష్టం. పార్లమెంట్‌ ఎన్నికలలో అసోంలో అది పొందిన ఓట్లను బట్టి అక్కడ పెద్ద పార్టీగా అవతరించవచ్చని కొంతమంది వూహాగానాలు చేస్తున్నారు, బిజెపి కూడా అదే ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే అక్కడ మోడీని ముందు పెడితే ప్రయోజనం లేదనుకుందో ఏమో ముందుగానే ముఖ్య మంత్రి అభ్యర్ధిని ప్రకటించింది. దీని వలన ఫలితం ఎలా వున్నా ఏ విధంగా అయినా భాష్యం చెప్పుకోవచ్చు. మోడీని ముందు పెడితే ప్రతికూల ఫలితాలు వస్తే మరింత పరువుపోవటం ఖాయం కనుక ఇలా చేశారని చెబుతున్నారు.

  భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ విమర్శలను తాము అంగీకరిస్తామని కానీ స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించేది లేదని రాజనాధ్‌ సింగ్‌ రాజకీయ తీర్మానం గురించి వివరించారు.భారత మాతాకి జై అంటేనే జాతీయ వాదం, దేశ భక్తి అనే విధంగా జాతీయ వాదానికి బిజెపి తాజా వ్యాఖ్యానం చెప్పటం జర్మనీలో హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నది.

   బిజెపి జాతీయ కార్యవర్గంలో నిజంగా ఏం చర్చించారో, ఎవరు ఏం మాట్లాడారో మిగతావారు వినలేదా ? అంటే సమాధానం చెప్పటం కష్టం. రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారు.దాని గురించి మరో మంత్రి ఆరుణ్‌ జైట్లీ విలేకర్లకు వివరించారు. వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారన్న సమాచారం తప్ప ఆయనేం మాట్లాడారనే అంశాన్ని కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అంతకు ముందే వెంకయ్య నాయుడు తన ప్రసంగంలోని అంశాలంటూ మీడియాకు ఇమెయిల్‌ ద్వారా పంపారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఇదే విషయం గురించి హోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను అడగగా వెంకయ్యగారు చెప్పిన వాటితో అంగీకరించటానికి గానీ కాదనటానికి గానీ తానసలు వెంకయ్య వుపన్యాసం వినలేదని భట్టిప్రోలు పంచాయతీ తీర్పు చెప్పారు.

    ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారు? ఆయన మీడియాకు పంపిన ఇమెయిల్‌ ప్రకారం ‘మోడీ దేశానికి ఒక వరం, దేవుడు పంపిన పేదల రక్షకుడు, మోడీ పేరు ప్రతిష్టలు నూతన స్ధాయికి చేరాయి.లండన్‌లోని మాడమే టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోటీ ఎనభైలక్షల మంది ట్విటర్‌ అనుచరులు, మూడు కోట్ల ఇరవైలక్షల మంది ఫేస్‌బుక్‌ లైక్‌లతో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు మోడీ. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రూపాంతరం(మోడి ఫయర్‌) చెందించిన వ్యక్తి. ఇలా సాగింది వెంకయ్య గారి మోడీ స్త్రోత్రం. మోడీ పేదలకు బదులు పెట్టుబడిదారుల రక్షకుడని కాంగ్రెస్‌ ఎత్తి పొడిచింది.

   ఈ పొగడ్తల గురించి మీడియా ముందు జెట్లీ లేదా రాజనాధ్‌ సింగ్‌ చెప్పరని వెంకయ్యకు బాగా తెలుసు.అందుకే తన మీడియా మేనేజ్‌మెంట్‌ పద్దతులలో ప్రసంగ అంశాలను మీడియాకు ముందే పంపారు.ఈ భజన చూస్తే అత్యవసర పరిస్థితి సందర్భంగా ఇందిరే ఇండియా ఇండియా ఇందిర అని కాంగ్రెస్‌ నేత డికె బారువా చేసిన పొగడ్తలు గుర్తుకు వస్తున్నాయి. దాని గురించి ఆ నాడు జనసంఘంగా వున్న నేటి బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నేడు వెంకయ్య పొగడ్తలు అంతకు తక్కువేమీ కాదు.

   మోడీని వ్యతిరేకించే ఎల్‌కె అద్వానీ ప్రియశిష్యుడిగా పేరు పొందిన వెంకయ్య నాయుడు పార్టీలో నరేంద్రమోడీ ప్రాభవం పెరగ్గానే ఇటువైపు ఫిరాయించారు. తన స్వామి భక్తిని నిరూపించుకొనేందుకు మోడీని పదే పదే పొగడటంలో వెంకయ్య పేరు మోశారు. తాజా సమావేశాలలో ఆయన పొగడ్తల గురించి రాజనాధ్‌ సింగ్‌ గాలి తీయటం, దానిని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొని వ్యాఖ్యానాలను రాయటం బహుశా వెంకయ్య నాయుడు వూహించి వుండరు. నరేంద్రమోడీ మోడీని పొగడటంలో కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు.

    ఈ సమావేశాలకు ముందు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో నరేంద్రమోడీ 2026 వరకు ప్రధానిగా పదవిలో కొనసాగుతారని 1555లోనే ఫ్రెంచి జోస్యుడు నోస్ట్రాడామస్‌ చెప్పారని ఒక పోస్టును పెట్టాడు. మోడీ భారత్‌ను స్వర్ణయుగంలో ప్రవేశపెడతారని, అనేక దేశాలకు రక్షణ కల్పించే దేశంగా భారత్‌ ఎదుగుతుందని పేర్కొన్నాడు. ‘ 2014 నుంచి 2026 వరకు మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి భారత్‌కు నాయకత్వం వహిస్తాడని, ఆయనను తొలుత జనం ద్వేషించినా, తరువాత ఎంతగానో ప్రేమిస్తారని దేశ దశ, దిశను ఆయన మారుస్తాడని, ఆయన నాయకత్వంలో భారతదేశమే గాక మొత్తం ప్రపంచం స్వర్ణయుగంలో ప్రవేశించటమే గాక ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందని ‘ జోస్యం చెప్పినట్లు రిజు పేర్కొన్నారు.

   సాధించిన విజయాలేమీ లేనపుడే ఇలాంటి పోసుకోలు కబుర్లతో నాయకత్వాన్ని పొగుడుతూ కాలక్షేపం చేయటం అన్ని పాలకవర్గ పార్టీలలో వున్న ఒక వుమ్మడి లక్షణం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు-పార్టీలపై పర్యవసానాలు

06 Saturday Feb 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, GHMC, HYDERABAD, tdp, trs

ఎంకెఆర్‌

     ఈనెల రెండున జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్ధ ఎన్నికలు అటు ఘన విజయం సాధించిన అధికార పార్టీని, ఇటు ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం-బిజెపి కూటమి, కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచాయంటే అతిశయోక్తి కాదు. మూడు జిల్లాల పరిధిలోని 150 వార్డులకు గాను తెలంగాణా రాష్ట్రసమితి 99,  కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లాలోని నాచారం స్ధానంతో సరిపెట్టుకొని హైదరాబాదు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక అసలైన పరాజయం గౌరవ ప్రద స్ధానంలో వుంటామని కలలు కన్న తెలుగుదేశం-బిజెపి కూటమిది. తెలుగు దేశం పార్టీ రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్టు స్థానాన్ని గెలుచుకొని ఎట్టకేలకు ప్రాతినిధ్యం సాధించింది, బిజెపి నాలుగు స్ధానాలు తెచ్చుకుంది.మజ్లీస్ 44 తెచ్చుకుంది

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధాని స్ధానిక ఎన్నికలలో పాల్గొనటం, ఘోరంగా ఓడిపోవటం మన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో.ఆ ఖ్యాతి ఎన్‌ చంద్రబాబు నాయుడికి దక్కింది. మరొకరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా హెచ్చరికలు చేసింది. హైదరాబాదు ఎన్నికలలో తాము 99 స్ధానాలను గెలుచుకుంటామని అసలు తెలంగణా రాష్ట్ర సమితికే నమ్మకం లేదు.వుంటే ముందు జాగ్రత్త చర్యగా కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేసి ఎంఎల్‌సీల ఓట్లతో గద్దె నెక్కాలని చూసేది కాదు. దానిని కొట్టివేస్తామని కోర్టు సూచన ప్రాయంగా చెప్పటంతో ఎన్నికలు జరిగి-ఫలితాలు వెలువడే మధ్యలో ఒక అసాధారణ ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ తెచ్చి విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌సి దొడ్డిదారితో నిమిత్తం లేకుండానే అప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నారని అది వూహించలేకపోయింది. ఏ మాత్రం పసిగట్టినా అపర ప్రజాస్వామికంగా వుండేది.

    విజయం సాధించింది కనుక చంద్రశేఖరరావు కోర్టు అభిప్రాయాన్ని మన్నించినట్లు ఆ ఆర్డినెన్సుకు కొత్త భాష్యం చెప్పారు. అంత మాత్రాన దానివెనుక వున్న దురాలోచన దాస్తే దాగేది కాదు. ఈ విజయం తెలంగాణా రాష్ట్రసమితిలో కొత్త పరిణామాలకు నాంది పలుకుతుంది. హైదరాబాద్‌ ఎన్నికలను చంద్రశేఖరరావు తనయుడు, మంత్రి కెటిఆర్‌ ఒక్కడే తన బాధ్యతగా ఎదుర్కొన్నారు. అదేదో యాదృచ్పికంగా జరిగిందంటే ఎవరూ నమ్మరు. ఎన్నికల స్క్రిప్టు, డైలాగులు, డైరెక్షన్‌ అంతా కెసిఆర్‌ వారసుడు ఎవరో స్పష్టం చేసేందుకే అన్నది సుస్పష్టం.ఈ విజయంతో తెరాసలో మిగిలిన మంత్రులు, ఇతరులు మరింతగా డమ్మీలుగా మారతారు. అధికారం మరింతగా కుటుంబపరంగా కేంద్రీకృతం అవుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమస్యలకు నాంది పలుకుతుంది. అన్ని పాలక రాజకీయ పార్టీలలో జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేది ఇదే.

    ఒక వూరి మునసబు పక్క వూరికి వెట్టితో సమానం అన్నది ఒక సామెత.దీనిని వినయంతో ఎవరైనా గుర్తిస్తే పరువు నిలబడుతుంది. లేకుంటే చంద్రబాబు నాయుడి మాదిరి శృంగభంగం తప్పదు.కోటి మంది జనాభా వున్న హైదరాబాదు ఎన్నికలకు ప్రాధాన్యత లేదని ఎవరూ అనరు. స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే ప్రచారానికి దిగకుండా ఒక బహిరంగ సభ పెట్టి గౌరవ ప్రదంగా వ్యవహరించారు. ఒక వేళ ఓడిపోతే, తగినన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లినా ఓడిపోయారంటారు. లేకపోతే సిఎం వచ్చి వుంటే విజయం దక్కేది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయం లేదా ఓటమిపై సంశయం కారణంగానే కెసిఆర్‌ ఈ విధంగా ప్రచారానికి దూరంగా వున్నారు. తన కొడుకును దించారు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, గెలిస్తే చెప్పక్కర లేదు. కానీ మిగతావారి పరిస్ధితి అది కాదు.

   పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకంటే తెలుగుదేశంలో పలుకుబడిన నాయకుడిగా చక్రంతిప్పుతున్నారని కొందరంటే, రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కుమారుడు నారా లోకేష్‌, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అంతటి పలుకుబడి కలిగిన మోడీ అంతరంగికులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు వంటి వారు ప్రచారం చేసినా , తమ కూటమి వారిని గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించినా పరాభవమే మిగిలింది. వారు చేసిన ప్రచారం ఓటర్లలో ఎంత వుత్సాహం నింపిందంటే తాము ఓటు వేయకపోయినా సరే తెలుగుదేశం-బిజెపి కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసంతో కాబోలు అసలు ఓటింగ్‌కే రాలేదు. కొన్ని పరిణామాలు మరికొన్నింటిని వేగవంతం చేస్తాయి. ఎక్కడో స్విచ్‌ వేస్తే ఎక్కడో లైటు వెలుగుతుంది.ఎన్నడూ ఓటింగ్‌కు రాని వారు కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో పనిగట్టుకొని వచ్చి హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో తెరాసకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. నగరం మరింతగా విస్తరిస్తోంది. పరిశ్రమలు పెరగటం లేదు,మూతపడుతున్నాయి, కొత్తగా వచ్చే వాటిలో వుపాధి తక్కువగా వుంటోంది. అసమానతలు తీవ్ర మౌతున్నాయి.నగరంలో పారిశుధ్యం, కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్య రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా కానుంది.వాటిని పరిష్కరించకుండా ఎక్కువ కాలం గడపలేరు.

     గతంతో పోలిస్తే తాను మారానని చెబుతూ చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదని ఎన్నికైన తరువాత ప్రతి చర్య ద్వారా జనాలలో గట్టి విశ్వాసం కల్పించేందుకు ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో హైదరాబాడు నగర ఎన్నికలలో తెలుగుదేశం, దానితో జతకట్టిన బిజెపి ఓడిపోవటం పార్టీల కన్నా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా కలిగిన ఘోరపరాభంగానే పరిగణించాలి. తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి. చంద్రబాబు నాయుడు తనను తానే నమ్మడని ప్రతీతి. అందుకని ఇతరులను నమ్మే పరిస్ధితి వుండదు. అలాంటి వ్యక్తి ఎండమావులను కూడా సునామీ వరదలని నమ్మించగల దిట్ట కావటం వలనే ప్రతి తరంలో ఎంతో కొంత మంది అపరచాణుక్యుడని నమ్ముతూ వుంటారు. మాటల ద్వారా మూతులు, డబ్బుతో చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాదులో అదే జరిగింది.

     తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ దుకాణం మూతపడటం గత ఎన్నికల మరుసటి రోజునుంచే ప్రారంభమైంది. అయినా అవకాశం లేని వారు, అనివార్యంగా ప్రతిపక్షంలో వుండాల్సిన వారు లేదా చంద్రబాబు చాణక్యం మీద అతి విశ్వాసం వున్నవారు గానీ మొత్తం మీద పార్టీలో మిగిలారు. ఇప్పుడు మిగిలిన పార్టీ కూడా ఎంత త్వరగా అంతరిస్తుందన్నదే సమస్య. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ ఒకటికి మించి రెండు రాష్ట్రాలలో కొనసాగిన దాఖలా మనకు ఎక్కడా కనపడదు. బీహార్‌, వుత్తర ప్రదేశ్‌లను చీల్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన తరువాత సమాజవాది పార్టీ యుపికి, ఆర్‌జెడి బీహార్‌కు పరిమితం అయ్యాయి తప్ప రెండోచోట లేవు. తెలుగుదేశం పార్టీ అందుకు మినహాయింపు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇంతటి పరాభవం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని వారు అసలు వూహించి వుండరు. ఎందుకంటే చంద్రబాబు మంత్రదండంపై నమ్మకం వున్నవారు ఇంకా గణనీయంగా వున్నారు. వారి సంఖ్యను హైదరాబాద్‌ ఎన్నికలు గణనీయంగా తగ్గిస్తాయి.

    హైదరాబాదు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడికి పోయేదేమీ లేదు, తీరని నష్టం బిజెపికి. మతోన్మాద అజెండా లేకుండా అది మనుగడ సాగించలేదు. ప్రస్తుతం హైదరాబాదులో అటువంటి పరిస్ధితులు లేవు. తెలుగుదేశం వంటి పార్టీతో అది సర్దుబాటు చేసుకోవాలంటే తాత్కాలికంగా అయినా అది మేకతోలు కప్పుకోవాలి. స్వంత ఎజండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది కనుక, ప్రతి ఎన్నికలో అది ఏదో ఒక పార్టీతో లోపాయికారీ వప్పందాలకు వస్తుండటంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. తెరాస స్వంతంగా మెజారిటీ తెచ్చుకున్నది కనుక మజ్లిస్‌ అప్రజాస్వామిక పోకడలను అడ్డుకొని హైదరాబాదు పాతబస్తీలో మార్పులకు శ్రీకారం చుడితే దానిని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా హర్షిస్తారు.లేనట్లయితే మజ్లిస్‌ను చూపి బిజెపి, బిజెపిని చూపి మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తాయి. అది తెరాసకు రాజకీయంగా నష్టదాయకమే గాక, తెలంగాణాకు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.

     కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని అవకాశ వాదానికి అటు వుమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌ జనమూ వ్యతిరేకించారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న చోటా అదే పరిస్ధితి కల్పించారు. వామపక్షాల విషయానికి వస్తే గతంలో వాటికి వున్నదీ లేదు ఇప్పుడు పోగొట్టుకున్నదీ లేదు. తమ నుంచి తమ జనం చేజారి పోయిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి గనుక తిరిగి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనటానికి ఎలాంటి పద్దతులు అనుసరిస్తాయన్నది చూడాల్సి వుంది

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: