• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Coronavirus outbreak

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాపై నిర్లక్ష్యం : నరేంద్ర మోడీ-ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరూ ఇద్దరే !

07 Tuesday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Coronavirus in India, Coronavirus in Pakistan, Coronavirus outbreak, Narendra Modi, PRIME MINISTER Imran Khan

How Narendra Modi should read Imran Khan

ఎం కోటేశ్వరరావు
అడుగడుగునా నిర్లక్ష్యం, ఎవరైనా ఎత్తి చూపితే ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలేమిటని ఎదురు దాడి చేస్తారు. ఎవరూ ఏమీ చెప్పకపోతే, సద్విమర్శలు కూడా చేయకపోతే అధికార యంత్రాంగానికి, దాని మీద ఆధారపడిన పాలకులకు తెలిసేది ఎలా ? నిర్లక్ష్యంలో వారు వీరను తేడా లేదు, పాకిస్ధాన్‌తో తబ్లిగీ జమాత్‌ సమావేశాలను రద్దు చేయాలని చెప్పినా వినకుండా అక్కడ నిర్వహించారు. ఇక్కడ అలాంటి ఆదేశాలే ఇవ్వలేదు. రెండు చోట్లా జరిగిన సమావేశాలకు హాజరైన విదేశీయులు కరోనా వైరస్‌ను ఎలా అంటించి రెండు దేశాలను ఎలా ఇబ్బందుల పాలు చేశారో చూస్తున్నాము. మరి పాలకుల తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ?
మార్చి 22న జనతా కర్ఫ్యూను పాటిస్తూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒకేసారి కరోనా మీద పోరు సల్పుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల వారు చేస్తున్న సేవలకు చప్పట్లు,గంటలను మోగించి అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్‌ జాతి స్పందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో వైరస్‌ అంటకుండా ధరించాల్సిన దుస్తులు, ఇతర రక్షణ పరికరాలతో కూడిన పిపిఇ కిట్ల తయారీకి మార్చి 24వ తేదీ వరకు మార్గదర్శక సూత్రాలనే ఖరారు చేయకుండా ఉన్నట్లు తెలుసా ?
పాకిస్ధాన్‌ మన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర జనాభాకు సమానంగా జనసంఖ్య కలిగి ఉంది. అలాంటి చోట 4,004 కరోనా కేసులు,55మరణాలతో అక్కడి పరిస్ధితి ఉంది. మన దేశంలో 135 కోట్ల జనాభాలో 4,911కేసులు,137మరణాలు సంభవించాయి, దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించాము. ప్రపంచం జిడిపిలో మన పాలకులు దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయారు, పాకిస్ధాన్‌ విషయానికి వస్తే అది 42వ స్ధానంలో ఉంది. కరోనా పరీక్షల విషయానికి వస్తే అక్కడ ప్రతి పదిలక్షల మందికి 177 పరీక్షలు(ఏప్రిల్‌ 7నాటికి) చేస్తే అదే రోజుకు మన దేశంలో 102 చేశాము. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో 176కేసులే ఉన్నా 152 మందికి, నేపాల్లో తొమ్మిది కేసులే ఉన్నా 52 మందికి పరీక్షలు చేశారు. మన దగ్గర డబ్బు లేక కాదు, జనాన్ని చావకుండా కాపాడాలనే శ్రద్ద ఏమేరకు ఉందో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. ఎవరు ఏమిటన్నది కష్టకాలం వచ్చినపుడే తెలుస్తుంది. అందువలన మన జిడిపి అంత ఇంతా అంటూ గొప్పలు చెప్పుకోవటం తగ్గిస్తే మంచిదేమో? ఇది ఎవరినో విమర్శించటానికి కాదు, అణకువగా ఉండాలని చెప్పేందుకే.

Coronavirus
ఇక కరోనా నిరోధ విషయానికి వస్తే పాకిస్ధాన్‌లోని ఆప్ఘన్‌ సరిహద్దు రాష్ట్రమైన బెలుచిస్తాన్‌లో 202 కేసులు మాత్రమే ఉన్నాయి. అయినా అక్కడి వైద్యులు, సిబ్బంది కరోనా చికిత్సలో అవసరమైన రక్షణ దుస్తులు, పరికరాలను సరఫరా చేయటం లేదంటూ సోమవారం నాడు రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలో వారు వీధులకు ఎక్కాల్సి వచ్చింది. వారిలో పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారని, అందరు పోలీసుల మాదిరే లాఠీలకు పని చెప్పారని వార్తలు. సమీపంలోని అసెంబ్లీ సభ్యులు వచ్చి జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. పోలీసు చర్యకు నిరసనగా తాము ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు బహిష్కరిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. డజన్ల మందిని అరెస్టు చేశాము తప్ప లాఠీ చార్చి చేయలేదని పోలీసులు సమర్ధించుకున్నారు. వీడియోలు అబద్దం చెప్పవు కదా ! ఇంతకూ వైద్యులు రోడ్డెందుకు ఎక్కారూ అంటే క్వెట్టా ఆసుపత్రిలో పదమూడు మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌ అని నివేదికలు వచ్చాయి, కారణం వారికి తగిన రక్షణ(పిపిఇ) పరికరాలను సమకూర్చకపోవటమే.ఆ నివేదికలు రాకముందు తమకు రక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ ఆందోళనకు పిలుపు నిచ్చిన వైద్యులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సముదాయించటంతో మూడు రోజుల పాటు ఆందోళనను వాయిదా వేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సోమవారం నాడు వీధులకు ఎక్కి లాఠీ దెబ్బలను రుచిచూశారు.
పాకిస్దాన్‌లో వైరస్‌ వ్యాపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. చైనా నుంచి నివారణ చర్యలు గ్రహించామని చెప్పటం తప్ప ఆచరణ లేదు. అక్కడ అనేక పట్టణాలను లాక్‌డౌన్‌ చేసిన విషయం తెలిసినా ప్రయాణ ఆంక్షలు కూడా విధించలేదు. అంతర్జాతీయ విమానాలను అనుమతించారు. ప్రయాణీకులను పరీక్షించలేదు, క్వారంటైన్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. తబ్లిగీ జమాత్‌ సభలకు ఇరాన్‌ సరిహద్దులో ఉన్న బెలూచీస్ధాన్‌ రాష్ట్ర పట్టణమైన టఫ్ట్‌న్‌ నుంచి ఇరాన్‌ వ్యాధి గ్రస్తులు వస్తున్నా నివారించలేకపోవటానికి ఇదే కారణం. అక్కడి క్వారంటైన్‌లో వైద్య సౌకర్యాలు లేవు, అక్కడి నుంచి వచ్చిన వారితోనే వ్యాధి వ్యాపించిందని సింధు అధికారులకు పూర్తిగా తెలుసు.తోటి ఇస్లామిక్‌ దేశాలైన టర్కీ, ఇరాన్‌ మసీదుల్లో సామూహిక ప్రార్ధనలను నిషేధించినా ఇమ్రాన్‌ ఖాన్‌కు పట్టలేదు. ఇటలీలో ఒక మత కార్యక్రమం, ఇతరంగా పెద్ద ఎత్తున జనం గుమికూడిన కార్యక్రమాల కారణంగానే అక్కడ వైరస్‌ ప్రబలిందని తెలిసినా పట్టించుకోలేదు. నిషేధం గురించి ఆలోచించకపోగా మసీదుల మూసివేత ఉండదని పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి ఉలేమాలకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్ధాన్‌లోని నాలుగువేల కేసులలో సగం పంజాబ్‌లోనే ఉన్నాయి. షియా మత పెద్దలైతే తాము మత కూటములను కొనసాగిస్తామని, అక్కడ ప్రార్దనలు జరిపి వైరస్‌ను నివారిస్తామని, తమకు వైరస్‌ అంటదని మొండిగా వాదించినా పట్టించుకోలేదు. మార్చినెల 21న ఆల్‌ పాకిస్ధానీ సున్నీ మహాసభ లాహౌర్‌ సమావేశంలో సంస్ధ నేత మహమ్మద్‌ అష్రాఫ్‌ మాట్లాడుతూ దేవుడు తలచుకుంటే తప్ప ఎవరికీ వైరస్‌ సోకదని చెప్పాడు. అంతే కాదు తమ సంస్ద కారణంగా ఎవరికైనా వైరస్‌ సోకితే ప్రభుత్వం తనను ఉరి తీయవచ్చు అని చెప్పాడు.
అక్కడి మంత్రుల తీరు ఎంతటి ప్రహసన ప్రాయంగా ఉందంటే ఒక వైపు బహిరంగ సభలను నిషేధించామంటూనే అలాంటి ఒక సభలో పాక్‌ రక్షణ మంత్రి పెర్వెజ్‌ ఖట్టక్‌ మాట్లాడుతూ వైరస్‌ అదుపులోనే ఉందని చెప్పటం విశేషం. తలిదండ్రుల తప్పిదాల కారణంగా శిక్షగా దేవుడు వారికి వికలాంగులైన పిల్లలను ఇస్తున్నట్లుగానే దేవుడి శిక్షకు గురయ్యే వారికే వైరస్‌ సోకుతుందని పంజాబ్‌ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఫయ్యాజుల్‌ హసన్‌ సెలవిచ్చాడు. ఖురాన్‌లో సామాజిక దూరం గురించి చెప్పలేదని, సామాజిక జీవితం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటం అని చెప్పిన మతపెద్దలు లేకపోలేదు.
మన దేశంలోని కొందరు పెద్దలు పాక్‌ నేతలకేమీ తీసిపోలేదు. ఆవు పేడ, మూత్రంతో కరోనా నివారణ అవుతుందని అసోం బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు అసెంబ్లీలోనే చెప్పారు. న్యూఢిల్లీలో హిందూ మహాసభ పెద్దలు ఏర్పాటు చేసిన గోమూత్ర పార్టీకి రెండు వందల మంది హాజరై మూత్రం తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ” నాసా పరిశోధనల ప్రకారం ఉష్ణ వాతావరణంలో కరోనా వైరస్‌ బతకదు. నూటముఫ్పై దీపాలను వెలిగిస్తే తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐఐటి ప్రొఫెసర్‌ చెప్పారు. కాబట్టి కరోనా ఆదివారం రాత్రి 9.09కి కరోనా వైరస్‌ మరణిస్తుంది. ఇది మోడీ తిరుగులేని ఎత్తుగడ ” అనే పోస్టును బిజెపి ఐటి సెల్‌ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో వ్యాపింప చేసింది. కరోనా వైరస్‌ అయినా మరొకటి అయినా అయోధ్యలో రామనవమి ఉత్సవాలను ఆపటానికి వీల్లేదని రామ మందిరం ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస చెప్పారు. ఆపితే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రాముడు విముక్తి పొందిన తరువాత వచ్చిన తొలి నవమి కనుక ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, భక్తులకు ఎలాంటి హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని, స్వాములందరూ సురక్షితంగా కార్యక్రమం జరిగేందుకు యజ్ఞం చేస్తారని చెప్పారు.(తరువాత కార్యక్రమాన్ని రద్దు చేశారు అది వేరే విషయం) పాక్‌ మతవాదులు- మన దేశ మతవాదులు సేమ్‌ టు సేమ్‌ తేడా ఏమంటే మతాలే వేరు. మూర్ఖత్వం ఒకటే !
పాకిస్ధాన్‌లో వైద్యులు వీధుల్లోకి ఎక్కారు. సోమవారం నాడు అరెస్టయి పోలీసుల లాకప్పులకు చేరిన వారు తమకు రక్షణ పరికరాలను అందచేస్తే తప్ప లాకప్పుల నుంచి బయటకు పోయేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అక్కడి పరిస్దితికి అదొక మచ్చుతునక కాగా మన దేశంలో పరిస్ధితి ఏమిటి ? వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ గురించి తాము చేసిన ప్రతిపాదన మీద ఐదు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిపిఇ తయారీదార్ల అసోసియేషన్‌ విమర్శించింది. ఈ వ్యవహారం గురించి ‘ది క్వింట్‌’ వెబ్‌ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది. దానిలో వివరాల సారాంశం ఇలా ఉంది. వైద్యులు రెయిన్‌ కోట్లు, హెల్మెట్లు, ఇతర ప్రత్యామ్నాయాలను ధరిస్తున్నారని గతవారంలో అనేక వార్తలు వచ్చాయి. ఈ సంక్షోభ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి. కేంద్రం నుంచి స్పందన సకాలంలో రాని కారణంగా మనం ఐదు వారాల విలువైన సమయాన్ని కోల్పోయామని పిపిఇ తయారీదార్ల సంఘం నేత సంజీవ్‌ చెప్పారు. పిబ్రవరిలోనే తాము కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించి పిపిఇ కిట్లను నిల్వచేసుకోవటం గురించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తమకు మార్చి 21వరకు వర్తమానం రాలేదని ఫిబ్రవరి 21నాటికి గనుక కిట్ల గురించి స్పష్ట ఇచ్చి ఉంటే అవసరమైన మేరకు తయారు చేసి ఉంచేవారం అన్నారు. ఇవి మిగతా కిట్ల వంటివి కాదని, ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు ఎలా, ఎన్నికావాలో ప్రభుత్వాలు చెబితే తప్ప తాము తయారు చేసేందుకు వీలు ఉండదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉంటే పిబ్రవరి 15న నాటికి వచ్చి ఉండేదని అన్నారు. మార్చి 24న తమకు మార్గదర్శక సూత్రాలు అందాయని, అయితే అంతకు ముందే డిమాండ్‌ పెరిగిపోయిందని చెప్పారు. మార్చి ఐదు-ఎనిమిది తేదీలలో రాష్ట్ర ప్రభుత్వాలు, సైనిక, రైల్వే ఆసుపత్రుల నుంచి టెండర్లు వెలువడ్డాయని వెల్లడించారు.
జనవరి 31న అన్ని రకాల వైద్య రక్షణ పరికరాల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే వారం రోజుల తరువాత ఫిబ్రవరి ఎనిమిదిన సర్జికల్‌ మాస్క్‌లు, ఎన్‌బిఆర్‌ గ్లోవ్‌లు తప్ప మిగిలిన అన్ని గ్లోవ్స్‌ ఎగుమతికి అనుమతి ఇస్తూ ఉత్తరువులు జారీ చేశారు. ఫిబ్రవరి 27న ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తూ ప్రపంచంలో పిపిఇ కిట్లకు కొరత ఉందని ముఖ్యంగా మాస్కులు, గౌన్లు, గాగుల్స్‌, రెస్పిరేటర్ల కొరత ఉందని పేర్కొన్నది. మార్చి 18న కేంద్ర జౌళి శాఖ సమీక్షలో అన్ని రకాల పరికరాలకు కొరత ఉన్నట్లు మినిట్స్‌లో నమోదు చేసినట్లు రాయిటర్స్‌ వార్త తెలిపింది. ఆ మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్యపరికరాలు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్దాల ఎగుమతులపై నిషేధం విధించింది. వైద్య పరికరాలు అవసరాలను బట్టే తయారు చేస్తారు లేదా ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు అంచనాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది. మార్చి 24వ తేదీన పరికరాల తయారీ మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో పిపిఇ కిట్ల తయారీదారులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం కోరిన విధంగా కొత్తవి తయారు చేయలేరు, తయారీదార్ల వద్ద ఉన్నవి ప్రమాణాలకు అనుగుణంగా లేవని కొనుగోలు చేయలేదు.
లాక్‌ డౌన్‌ లేనట్లయితే రోజుకు 25వేల పిపిఇ కిట్ల తయారీ సామర్ధ్యం ఉంది. పది రోజుల తరువాత కొద్ది మంది పనివారు కంపెనీలకు హాజరవుతున్నారు, కార్మికుల సమస్య ఉంది. ఒక కిట్‌ తయారు కావాలంటే దానికి జిప్‌లు, ఎలాస్టిక్‌ వంటి అనేక విడిభాగాలు అవసరం, వాటిని సరఫరా చేసే వారికి సైతం ఇబ్బంది ఉంది. వారికి అనుమతులు చాలా కష్టంగా ఉంది. ఎవరూ ఎవరిదీ వినిపించుకోని స్ధితి.
పశ్చిమబెంగాల్లో తమకు రెయిన్‌కోట్లు ఇచ్చారని వైద్యులు తెలిపారు. పాట్నామెడికల్‌ కాలేజీ వైద్యులు కూడా అదే చెప్పారు. హర్యానాలోని ఒక ఇఎస్‌ఐ ఆసుపత్రిలో హెల్మెట్‌ వాడుతున్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వైద్యపరికరాల తయారీదార్ల అసోసియేషన్‌లో 20 సంస్ధలున్నాయి. నెలకు ఐదులక్షల చొప్పున ఏడాదికి 62.5లక్షల తయారీ సామర్ధ్యం ఉంది, ప్రస్తుత అవసరాలకు అవి చాలా తక్కువ అని మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం ముందు నమూనా కిట్‌ తయారు చేయాలి, దాన్ని ఆరోగ్యశాఖ ఆమోదించి అనుమతించిన తరువాతే తయారీ ప్రారంభించాలి. అంటే అప్పటి వరకు తయారీదార్లు ఎలాంటి ముడి సరకు లేదా విడి భాగాలను కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎన్ని అవసరమో స్పష్టత లేదు.
మార్చినెల మూడవ తేదీన మూడులక్షల పిపిఇ కిట్స్‌ అవసరమని అంచనా, అది 18వ తేదీకి 7.25లక్షలకు, 24వ తేదీకి 10లక్షలకు పెరిగింది. వీటిని తయారు చేసేవి చిన్న చిన్న సంస్దలు, సకాలంలో ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పెరిగిన ఖర్చులకు అనుగుణ్యంగా ధరలు పెంచితే డిమాండ్‌కు తగిన విధంగా ఇప్పటికీ తయారు చేసి ఇవ్వగలమని వారు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు.

PM Narendra Modi writes to Imran Khan, underlines good relations ...
ఒక వైపు దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతిని మార్చి 19 నుంచి నిషేధించినా 31 మన దేశం నుంచి 90 టన్నుల వైద్య రక్షణ ఉత్పత్తులు సెర్బియాకు ఎలా పంపారు అన్నది ప్రశ్న. దీని గురించి తనకు తెలియదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పటం విశేషం. తొంభై టన్నుల రెండవ కార్గోవిమానం ఆదివారం నాడు భారత్‌ నుంచి బెల్‌గ్రేడ్‌(సెర్బియా)లో దిగినట్లు యుఎన్‌డిపి ట్వీట్‌ చేసింది. దీని గురించి అడిగిన వివరణకు ఆరోగ్యశాఖ నుంచి వివరణ కోరినట్లు క్వింట్‌ పత్రిక తెలిపింది.
ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ఏవైనా లోపాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలదే తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ మీద విమర్శలు చేయటం ఏమిటని బిజెపి మరుగుజ్జులు గంతులు వేస్తున్నారు. వారే మరో వైపు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఏర్పడిన అంతర్జాతీయ కమిటీకి మోడీని సారధ్యం వహించాలని ప్రపంచ నేతలు కోరినట్లు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలను సమన్వయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిది అనే విషయాన్ని దాచి రాష్ట్రాలపై నెపం మోపేందుకు ప్రయత్నించటం దారుణం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వైరస్‌-నిజాముద్దీన్‌ మర్కజ్‌- తిలాపాపం తలా పిడికెడు !

02 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arvind Kejriwal, Coronavirus outbreak, Naredra Modi, Nizamuddin Markaz, Tablighi Jamaat, Yogi Adityanath

Find the liar: Read what Narendra Modi and Arvind Kejriwal have ...

ఎం కోటేశ్వరరావు
మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఉన్మాదం తలకెక్కిన మాదిరి కొందరు యాంకర్ల అరుపులు కేకలలో వినిపిస్తున్న పదాలు నిజాముద్దీన్‌ మర్కజ్‌, తబ్లిగీ జమాత్‌ గురించి చెప్పనవసరం లేదు. వార్తలను వార్తలుగా ఇవ్వటంలో తప్పులేదు. యాంకర్లు మరొకరు ఎవరైనా సమస్యను సమస్యగా చర్చించటం, ఎలాంటి మొహమాటాల్లేకుండా మాట్లాడటం వేరు. ఆ పరిధులను మించటమే సమస్య. కరోనా బాధితుల సంఖ్య పదిలక్షలను ఏక్షణంలో అయినా దాటి పోనుంది. రాస్తున్న సమయానికి వున్న సంఖ్య పాఠకులు చదివే సమయానికి మారిపోతోంది. మన దేశంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా అదుపులోనే ఉన్నాయి గానీ, పరిస్ధితి ఇలాగే ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న.
అసలేం జరిగింది, నిజాముద్దీన్‌ కార్యక్రమం ఏమిటి ? 1857లో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామం, దాన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తాము. అది జరిగి దాన్ని అణచివేసిన పది సంవత్సరాల తరువాత బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా హిందూ-ముస్లింలు ఐక్యంగా పోరాడాలంటూ కొంత మంది ఇస్లాం పండితులు నిర్ణయించారు. దీనిలో రెండు భావాలకు ప్రాతినిధ్యం వహించే వారు ఉన్నారు. ఆంగ్లేయుల పాలన ముస్లిం సమాజాన్ని దిగజార్చేదిగా ఉంది, మత సాంప్రదాయాలు మట్టికొట్టుకుపోగూడదు కనుక ఆ పాలనను వ్యతిరేకించి వాటిని పునరుద్దరించాలనే వారు ఒక తెగ. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యతకోసం పని చేయాలనే వారు రెండవ తెగ. ఈ రెండు భావజాలాల వారూ కలసి 1867లో దారుల్‌ ఉలుమ్‌ దేవ్‌బంద్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. ఆ ఉద్యమంలో భాగమైన కొందరు రాజకీయాల్లో పాల్గొనకుండా లక్ష్యా లను సాధించలేమని భావించి జమాతే ఉలేమా హింద్‌ అనే పార్టీని 1919లో ఏర్పాటు చేసి దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించారు. కొందరు దాన్నుంచి బయటకు వచ్చి విభజనకు అనుకూలంగా మారిపోయారు. ఇస్లామ్‌ను పునరుద్దరించాలని భావించే వారు 1927లో తబిలిగీ జమాత్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, రష్యాలో విప్లవం జయప్రదమై తొలి సోషలిస్టు దేశం ఏర్పడిన తరువాత ప్రపంచంలో అనేక చోట్ల అవాంఛనీయ ధోరణులు ప్రబలిన కాలం. మితవాద, ఫాసిస్టు ధోరణులు, మత పునరుద్దరణ, శుద్ధి, ఇతర మతాలకు చెందిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చాలనే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ వంటి మతశక్తులు తలెత్తటానికి అనువైన కాలం అది. ఆ పరంపరలోదే తబ్లిగీ జమాత్‌. ఇస్లామ్‌పు పరిరక్షించేందుకు ఆరు సూత్రాలను ముందుకు తెచ్చిన తబిలిగీ జమాత్‌ వాటిని ప్రచారం చేసేందుకు ప్రచారకులకు శిక్షణ, పాటించే వారికి బోధన నిమిత్తం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేది. ఆ సంస్ధ క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. సమావేశాలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్వరూపాన్ని సంతరించుకున్నాయి. దానిలో భాగంగానే మార్చి 13-15 తేదీలలో నిజాముద్దీన్‌ సమావేశాలు జరిగాయి. వేలాది మంది వాటిలో పాల్గొన్నారు.
కరోనా వైరస్‌ అనేక రకాలుగా వ్యాపిస్తోంది. లక్షల మందికి వ్యాపించటానికి దారితీసిన వాటిలో ఏ కారణంతో ఎన్ని అని విశ్లేషించటం ఇప్పుడు సాధ్యం కాదు, దాని కంటే ముందు వ్యాప్తిని అరికట్టి విలువైన ప్రాణాలను ఎలా కాపాడటం అన్నదే ముఖ్యం. అయితే అందరూ అదే కర్తవ్య నిర్వహణలో ఉంటే పేచీ లేదు, కానీ ఇప్పుడు కూడా కొందరు అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. మత విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైనది. దాన్ని అదుపు చేయటం సాధ్యమే అని ఎక్కడైతో పుట్టిందో ఆ చైనాలో నిరూపించారు. మిగతా వైరస్‌ల మాదిరే కొంత కాలం తరువాత కరోనా కూడా ప్రభావాన్ని కోల్పోతుంది, కానీ ఈ సందర్భంగా వ్యాపింప చేసే జాతి, మత విద్వేష కరోనా అనేక మందిలో శాశ్వతంగా తిష్టవేస్తుంది. అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే మెజారిటీ-మైనారిటీ మత విద్వేషం తాండవం చేస్తోంది. కరోనాతో అది విలయతాండవంగా మారాలని కొందరు కోరుకుంటున్నారు. ఇది మన దేశం, సమాజానికి ఏమాత్రం మంచిది కాదు.
అనేక దేశాలలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న పూర్వరంగంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో జనం గుమి కూడటాన్ని అనేక చోట్ల నిషేధించారు. ఈ నేపధ్యంలో నిజాముద్దీన్‌ సమావేశం ఎలా జరిగింది? ఎందుకు అనుమతించారు ? ఎవరు దీనికి బాధ్యులు ? కరోనా గురించి తెలిసిన తరువాత ఇలాంటి సమావేశాలను నిర్వాహకులు ఎలా ఏర్పాటు చేశారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నివారించలేకపోయాయి, అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా అన్నది చర్చ. మార్చినెల 22న జనతా కర్ఫ్యూ, వెంటనే మరుసటి రోజు నుంచి గృహబందీ పిలుపులతో నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉండిపోయిన వందలాది మంది గురించి అక్కడ దాక్కున్నారని కొందరు ప్రచారం చేస్తే, బయటకు పోయే వీల్లేక, ప్రయాణ సాధనాలు లేక అక్కడే ఉండిపోయారని ఆ సంస్ధ చెబుతోంది. అంతే కాదు, తాము ప్రతిపాదించిన మేరకు వాహనాలకు అనుమతి ఇస్తే వారందరినీ స్వస్ధలాలకు తరలిస్తామని ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఈ విషయాలన్నింటినీ అధికార యంత్రాంగం నివేదించని కారణంగానే ముఖ్య మంత్రి కేజరీవాల్‌ అవాంఛనీయ చర్యలకు ఆదేశించారని సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది. ఎట్టకేలకు నిజాముద్దీన్‌లో గుమికూడి జనబందీ కారణంగా చిక్కుకు పోయిన వారిని అక్కడి నుంచి తరలించారు. ఈ సమావేశాల్లో పొల్గొని స్వస్ధలాలకు వెళ్లిన చోటల్లా అనేక కరోనా కేసులు వారి నుంచి వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆ సమావేశాలతో నిమిత్తం లేని వారిలో కూడా కేసులు బయటపడుతున్నాయి.
మతపరమైన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున జనం గుమికూడటం, కొన్ని చోట్ల ప్రార్ధనా స్ధలాలకు ప్రతి రోజూ వేల సంఖ్యలో రావటం మన దేశంలో సర్వసాధారణం. దీనికి ఏ మతమూ,సంస్ధా మినహాయింపు కాదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ అంటే అంతర్జాతీయ సంస్ధ తబ్లిగీ జమాత్‌ ప్రధాన కేంద్రం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గన్నవారి ద్వారా కరోనా వైరస్‌ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ కావటంతో ఆ సంస్ధ నిర్వాకాన్ని విమర్శించటం, చట్టం అనుమతిస్తే నిర్వాహకులపై కేసులు పెట్టటం కూడా నూటికి నూరుపాళ్లూ సమర్దనీయమే. 1992లో బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నవారు, అందుకు ప్రేరేపించిన వారిమీద కేసులు పెట్టారు, వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఉదంతం ఎందరి ప్రాణాలు తీసిందో తెలిసిందే. అలాగే కరోనా విషయాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే జమాత్‌ సంస్ద నిర్వాహకుల మీద కూడా కేసులు పెట్టవచ్చు. వారేమీ అతీతులు కాదు. అలాంటి కేసులు పెడితే జమాత్‌ను అనుసరించే,అభిమానించే వారు బాధపడటం లేదా నిరసన తెలపాల్సిన అవసరం లేదు. మిగతా మతాల వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించటం లేదా అని సమర్ధించుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. ఎవరో తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ?
బాబరీ మసీదు లేదా రామజన్మభూమి పేరుతో సాగించిన కార్యక్రమాలకు, అవాంఛనీయ, నేరపూరిత ఘటనలకు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి సంస్ధలు వాటి మాతృక సంఘపరివార్‌ తప్ప యావత్‌ హిందూ సమాజం లేదా హిందువులు కాదు. అలాగే జమాత్‌ సంస్ధ చేసిన పనికి యావత్‌ ముస్లిం సామాజిక తరగతిని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం తగని పని, గర్హనీయం. మన దేశంలో అనేక మతపరమైన కార్య క్రమాల సందర్భంగా తొక్కిసలాటలు,ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున మరణాలు సంభవించటం, అంటు వ్యాధులు రావటం కొత్తదేమీ కాదు.కానీ వాటిని ఆయా మతాలకు లేదా మతాలను అనుసరించే యావత్‌ ప్రజానీకానికి ఆపాదించలేదు. ఇప్పుడు కూడా తప్పు ఎక్కడ జరిగిందో చూడాలి, తప్పు పట్టాలి. కరోనా సందర్భంగా సామాజిక దూరం పాటించినట్లే జనం మత విద్వేష భావనలకు కూడా దూరంగా ఉండాలి.

Markaz Nizamuddin Ke Maujooda Halaat Or Media Ki Haqiqat - YouTube
నిజాముద్దీన్‌ పరిణామాలను రెండుగా చూడాలి. జనతా కర్ఫ్యూ-గృహబందీ(లాక్‌డౌన్‌), జమాత్‌ సమావేశాలకు ముందు, గృహబందీ తరువాత ఏం జరిగిందో పరిశీలించాల్సి ఉంది. ‘ ది వైర్‌ ‘ వెబ్‌ పోర్టల్‌ వ్యవస్ధాపక సంపాదకుల్లో ఒకరైన సిద్దార్ద వరదరాజన్‌ చేసిన ట్వీట్లు రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినవని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు తాజాగా కేసు చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ రెండవ తేదీ వరకు అయోధ్యలో రామనవమి ఉత్సవాలు ముందు అనుకున్న విధంగానే యథావిధిగా జరపాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ నిర్దేశించినట్లు, కరోనా వైరస్‌ నుంచి భక్తులను శ్రీరాముడు కాపాడతాడని చెప్పినట్లుగా ఆయన చేసిన ట్వీట్లు అభ్యంతరంగా ఉన్నాయన్నది ఆరోపణ. ఈ కేసు రాజకీయ కోణంలో బనాయించారని వరదరాజన్‌ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్‌ భయం ఉన్నప్పటికీ ఆయోధ్య శ్రీరామనవమి ఉత్సవాలను యథావిధిగా జరపనున్నట్లు డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక మార్చి17న ఒక వార్తను ప్రచురించింది. (తరువాత రెండు రోజులకు ప్రభుత్వం రద్దు చేసింది) రెండు సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు ఉత్సవాలను జరిపేందుకే ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నది ఆ వార్త ప్రారంభంలోనే ఉంది. దానిలో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పేరు పెట్టలేదు తప్ప అంతటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం గురించి ముఖ్యమంత్రితో చెప్పకుండా అధికార యంత్రాంగం ముందుకు పోతుందని ఎవరైనా ఊహిచగలరా ? అంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడే సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందును ఉత్సవాన్ని రద్దు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రభుత్వాన్ని కోరారు. అంతపెద్ద సంఖ్యలో వచ్చే వారిని పరీక్షించే అవకాశం లేదని కూడా అధికారి ఘనశ్యామ్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ వార్తలో ఉటంకించారు. అయితే రామాలయ ట్రస్టు అధిపతి మహంత్‌ పరమహంస మేళాను ఆపటం కుదరదని, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడతాయని రాముడు స్వేచ్చ పొందిన తొలి సంవత్సరంలో ఉత్సవాలు జరపటం ఎంతో ముఖ్యమని, భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని కూడా చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. ఇదే విషయాన్ని సిద్దార్ద వరదరాజన్‌ కూడా చెప్పారు. అయితే ఆయన ట్వీట్లలో భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని యోగి అయోధ్య నాధ్‌ చెప్పినట్లుగా ఉందని ఆ మాటలు చెప్పింది మహంత పరమహంస అని వరదరాజన్‌ తన ట్వీట్‌ను సవరించుకున్నారు. మేళాను ఉపసంహరించకున్న తరువాత, గృహబందీ అమలు జరుగుతున్న సమయంలో మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించి మార్చి 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్‌ రామనవమి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటాన్ని వరదరాజన్‌ తప్పు పట్టారు. దానిలో ఎంత మంది పాల్గొన్నారన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ముఖ్య మంత్రి ఒక కార్యక్రమంలో పొల్గొన్నారంటే కనీసం ఎంత మంది ఉంటారో అందరికీ తెలిసిందే.
నిజాముద్దీన్‌ మర్కజ్‌ సభలు జరుగుతున్న సమయంలో దేశంలోని దేవాలయం లేదా చర్చి. మసీదుల్లో ఎక్కడా భక్తులు గుమికూడటం గురించి ఎలాంటి ఆంక్షలు లేవు.అభ్యంతరాలు పెట్టిన వారు లేరు. అంతకు ముందే హౌలీ వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ఒంటి మిట్ట రామాలయంలో రామనవమి ఉత్సవాలను రద్దు చేసిన ప్రకటన వెలువడిన తరువాత కొందరు స్వాములు దానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతూ ఎలాంటి ప్రసంగాలు చేశారో సామాజిక మాధ్యమంలో వీడియోలను లక్షలాది మంది తిలకించారు. ఒక మత పెద్దల్లో ఓట్ల రాజకీయం లేదా ఉన్మాదం, మూఢనమ్మకాలు ఇలా ఉన్న తరుణంలో మరోమతం తక్కువ తింటుందని ఎవరైనా అనుకుంటారా ? రాముడు రక్షిస్తాడని ఒక మత పెద్ద చెబితే మా అల్లా మాత్రం తక్కువ తిన్నాడా, రక్షించకుండా వదలి వేస్తాడా అని మరో మతం వారు గుమికూడారని అనుకోవాల్సి వస్తోంది. భక్తి తారా స్ధాయికి ఎక్కిన తరువాత ఏ మతంవారికైనా ఇతరులు చెప్పేది, చుట్టుపక్కల జరిగేది ఏమీ పట్టదు. దానికి వెనుకబాటుతనం, మూర్ఖత్వం ఏ పేరైనా పెట్టవచ్చు.
ఇక తబ్లిగీ జమాత్‌ విషయానికి వస్తే ఇదొక వివాదాస్పద మత సంస్ధ. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం లేదా ఉగ్రవాదులు దీని ముసుగులో పని చేస్తున్నారనే అభిప్రాయాలు, సమాచారం ఎప్పటి నుంచో ఉంది.గతంలో జరిగిన దీని కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం గుమికూడిన ఉదంతాలు కేంద్రానికి, రాష్ట్రానికి తెలియనిదేమీ కాదు. దాని ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉందని, వివిధ దేశాల నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలకు వస్తుంటారన్నది కూడా బహిరంగ రహస్యమే. వచ్చే వారు యాత్రీకుల వీసాలతో రావటం కూడా కొత్త విషయం కాదు. ఈ కార్యక్రమాల కోసమే అని వీసా తీసుకుంటే దానికే పరిమితమై వెనుదిరిగి పోవాల్సి వస్తుంది కనుక యాత్రీకుల పేరుతో తీసుకొని ముందు వెనుక ఇతర ప్రాంతాలను కూడా సందర్శించి వెళ్లటం సర్వసాధారణం. అందువలన ఈ సమావేశాలకు వచ్చిన వారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని చెప్పటం బాధ్యత నుంచి తప్పుకొనే వ్యవహారమే. వచ్చిన వారిలో కరోనా వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉన్నారు గనుక సరిపోయింది, అదే ఉగ్రవాదులు యాత్రీకుల పేరుతో వచ్చి అవాంఛనీయ ఘటనలకు పాల్పడి ఉంటే ఇలాంటి సమర్ధనకే పూనుకొనే వారా ? మరి తబ్లిగీ జమాత్‌కు బాధ్యత లేదా ?
మలేసియాలో ఇదే సంస్ధ ఫిబ్రవరి 27 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు కౌలాలంపూర్‌ పట్టణంలో నిర్వహించిన కార్య క్రమాలకు విదేశీ, స్వదేశీ జనం పదహారు వేల మంది హాజరయ్యారు. అయితే ఆ వచ్చిన వారికి వైరస్‌ సోకినట్లు మార్చినెల మొదటి వారంలోనే వెల్లడైంది. దీంతో తగ్లిబీ జమాత్‌కు హాజరైన ఐదువేల మందికి వ్యాధి సోకినట్లుగా ఒక అంచనాకు వచ్చి వారిని వెతికి పరీక్షలు చేయటం పదకొండవ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ విషయాలన్నీ మలేసియా మీడియాలో వచ్చాయి. ఇవన్నీ మలేసియాలో మన రాయబార కార్యా లయం లేదా అక్కడి పరిణామాలను పర్యవేక్షించే విభాగానికి తెలియకుండా పోతాయని అనుకోలేము. తెలియలేదు అంటే అవి తమపని తాము చేయటం లేదని చెప్పాల్సి ఉంటుంది. లేదా తెలిస్తే వెంటనే కేంద్రాన్ని అప్రమత్తం చేసి ఢిల్లీ తబ్లిగీ కార్య క్రమాన్ని నిలిపివేయించటం లేదా దానికి హాజరయ్యే మలేసియా, ఇతర దేశాలకు చెందిన వారిని అయినా నిలిపివేయకపోవటానికి లేదా పరీక్షించకపోవటానికి బాధ్యత ఎవరిది ? అప్పటికే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారిని అనుమానంతో పరీక్షలు చేయటం ప్రారంభమైంది, కొన్ని కేసులు బయటపడినపుడు ఈ కనీస చర్యను జమాత్‌ సభకు హాజరైన వారి విషయంలో ఎందుకు తీసుకోలేదు. మీడియా ఈ విషయాలన్నీ విస్మరించి మన దేశంలో వైరస్‌ను వ్యాపింప చేసేందుకు ముస్లింలు కుట్ర పన్నారనే సిద్దాంతాన్ని బలపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం, కార్య క్రమాలను నిర్వహించటం ఏమిటి ? సోషల్‌ మీడియాలో సరేసరి, ముస్లింలు, క్రైస్తవులు కరోనా వ్యాప్తికి కారకులు అనే ప్రచారాలతో రెచ్చిపోతున్నారు.
నిజాముద్దీన్‌ మర్కజ్‌లో బోధనా, శిక్షణాకార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మూడు రోజుల నుంచి 40రోజలు, మూడు నెలలు, కొందరు ఏడాది పాటు మకాం వేస్తుంటారు. ఇవిగాక ఏడాది కొకసారి మూడు రోజుల పాటు వార్షిక సభలు జరుగుతుంటాయి. అలాంటిదే మార్చినెల 13-15 తేదీలలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గన్నవారు సమీప లేదా ఇతర రాష్ట్రాల్లోని మసీదులను సందర్శించి వారు కూడా బోధనలు చేసి పోతుంటారు. తెలంగాణాలోని కరీం నగర్‌ జిల్లాకు వచ్చిన ఇండోనేషియన్లు, గృహబందీ కారణంగా ఇతర రాష్ట్రాలోని కొన్ని మసీదుల్లో ఉండిపోయిన వారు అలాంటి వారే.
ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడాల్సి ఉంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు వందలకు మించి జనం ఎక్కడా గుమికూడదని మార్చి 13న ఆదేశాలు జారీ చేసింది. దాన్ని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఎందుకు పట్టించుకోలేదు? అప్పటికే జనం రావటం ప్రారంభమైది అంటే మరుసటి రోజు నుంచి అయినా రద్దు చేయవచ్చు, కానీ ఆపని చేయలేదు. పోనీ తాను జారీ చేసిన ఉత్తరువును అమలు జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు ? మార్చి16న కేజరీవాల్‌ సర్కార్‌ మరొక ఆదేశం జారీ చేస్తూ 50 మందికి మించి గుమికూడటాన్ని నిషేధించింది. పోనీ దాన్ని అమలు జరిపినా మర్కజ్‌లో అన్ని వందల మంది ఉండేందుకు ఆస్కారం ఉండేది కాదు దాన్నెందుకు అమలు జరపలేదు? జమాత్‌ సమావేశాలకు వచ్చిన విదేశీయుల గురించి కేంద్ర హౌంశాఖ మార్చి21న తెలియచేసింది. అది కూడా కరీంనగర్‌లో ఇండోనేషియన్ల గురించి బయటపడిన తరువాత అని చెబుతున్నారు. అంటే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
మీడియా విషయానికి వస్తే నిజాముద్దీన్‌ వ్యవహారంలో ఆ సంస్ధ మార్చి 31న జారీ చేసిన మీడియా ప్రకటనను ఎందరు పరిగణలోకి తీసుకున్నారు. దానిలోని అంశాలతో ఏకీభవించాలా లేదా అనేది వేరే విషయం వారి వాదనను కూడా పాఠకులు, వీక్షకుల ముందు ఉంచాలా లేదా ? చైనాలో తొలి కరోనా కేసులు బయటపడిన తరువాత మన దేశంలో దాదాపు నెలన్నర పాటు ఎలాంటి నిర్ధిష్ట చర్యలనూ తీసుకోలేదనే అంశాన్ని మీడియా పట్టించుకుందా ? దేశంలో ఒక నిర్లక్ష్యపూరిత వాతావరణం ఉన్నది వాస్తవం కాదా ? కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్య మీద ఆంధ్రప్రదేశ్‌ పాలకపార్టీ, ప్రభుత్వం చేసిన యాగీ దేనికి నిదర్శనం ? పారాసిటమాల్‌ వేసుకుంటే, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అని ముఖ్య మంత్రులే చెప్పిన తరువాత జనం తీవ్రఅంశంగా ఎలా పరిగణిస్తారు ? గృహబందీని తప్పించుకొని అరాచకంగా జనం వీధుల్లోకి వస్తున్నారని మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆకస్మికంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా ప్రకటించిన ఈ చర్య ఒక్కసారిగా జనంలో క్రమశిక్షణ ఎలా తీసుకువస్తుంది? గోమూత్రం తాగితే కరోనా అంటదు,ఆవు పేడ పూసుకుంటే, ఇది తింటే సోకదు అని అనేక మంది ముందుకు తెచ్చిన ప్రచారాలను ఎండగట్టి శాస్త్రీయ అంశాలను జనం ముందుకు తెచ్చిన మీడియా సంస్దలెన్ని ! ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలకు తమదైన ముద్రవేసుకొని ప్రచారం చేయటం తప్ప వాటి మీద ఉన్న రెండో కోణాన్ని వివరించే వారికి అవకాశం కల్పించిన వారెందరు ?
కుట్ర సిద్ధాంతం గురించి ప్రచారం చేసే వారికి, వాటిని నమ్మేవారికి వివేచన, తర్కం ఉండనవసరం లేదా ? ఇదే మీడియా పెద్దలు గతంలో చైనా గురించి చేసిన ప్రచారాలేమిటి ? అక్కడి క్రైస్తవుల చర్చీలను ప్రభుత్వం కూల్చివేసిందని, ప్రార్ధనలను చేసుకోనివ్వటం లేదని, ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్జిన్‌జియాంగ్‌ స్వయం పాలిత రాష్ట్రంలోని ముస్లింలందరినీ నిర్బంధ శిబిరాల్లో పెట్టారని చెడరాసి, ఆధారాల్లేని చిత్రాలను చూపిందే చూపారు కదా ! అది నిజమని ముస్లిం లేదా క్రైస్తవ జీహాదీలు నమ్మితే చైనాకు వ్యతిరేకంగా పని చేయాలి కదా ! ఇప్పుడు కరోనా వ్యాప్తి చెంది మరణాలు సంభవించి అతలాకుతలం అవుతున్న దేశాలన్నీ క్రైస్తవులు, ముస్లింలతో కూడిన అమెరికా, ఐరోపా, ఇరాన్‌, టర్కీలే కదా ? ఆ చైనాలో పుట్టిన వైరస్‌ను అంటించుకొని ప్రపంచానికంతటికీ వ్యాపింపచేస్తే వారికొచ్చేదేమిటి ? జీహాదీలు అదే కార్యక్రమంలో ఉంటే తోటి అరబ్బు ముస్లింలను ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు పెడుతున్న హింసలు, దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో ముందుగా వ్యాపింప చేయాలి. లేదా తొత్తులుగా మారిన కొన్ని మినహా యావత్‌ ఇస్లామిక్‌ దేశాలు శ త్రువుగా భావిస్తున్న అమెరికాలో ఆ పని చేయాలి. పాకిస్ధాన్‌ తరఫున మన దేశంలో ఆపని చేస్తున్నారంటే నివారించటంలో వైఫల్యం ఎవరిది ?

Delhi Police video shows cops urged Nizamuddin markaz members to ...
కుట్ర సిద్ధాంతాలను తలకెత్తుకొని ప్రచారం చేసే వారికి విచక్షణ ఉండదు. లేదూ జీహాదీలు మన దేశాన్ని దెబ్బతీసేందుకు కరోనాను ఆయుధంగా చేసుకున్నారని కొద్దిసేపు కొందరి మానసిక తృప్తికోసం అంగీకరిద్దాం. నిత్యం లేస్తే జీహాదీల గురించి ప్రచారం చేస్తున్నది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌. దాని నేతలే కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఆ జీహాదీలన దెబ్బతీసేందుకే కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేశామని, ఆర్టికల్‌ 370 ఎత్తివేశామని చెబుతున్నారు. తబ్లిగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల్లో చైనా వారు ఉన్నారని ఎవరూ చెప్పటం లేదు. మిగతా దేశాల వారు కరోనా ఎక్కడ ఎవరి నుంచి అంటించుకొని మన దేశంలో వ్యాపింప చేసేందుకు వచ్చినట్లు ? ఒక వేళ వస్తే కేంద్రం, మన గూఢచార సంస్ధలు, పర్యవేక్షణ ఏజన్సీలు ఏమి చేస్తున్నట్లు ? ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పదలచుకున్నారా ? ఒక వేళ అదే నిజమైతే మన కేంద్ర పాలకుల దౌత్యం ఘోరంగా విఫలమైనట్లే కదా ? పాకిస్ధాన్‌ను ఒంటరి చేయటంలో జయప్రదం అయ్యా మని చెప్పటం మన జనాన్ని మోసం చేయటమేనా ? దానికి మద్దతుగా ఇతర ఇస్లామిక్‌ దేశాలను ఆవైపు నెట్టారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వైరస్‌ : కాసుల లాభనష్టాల బేరీజులో కార్పొరేట్‌ లోకం !

09 Sunday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వైరస్‌ కట్టడిలో చైనా-కట్ట్టు కథల వ్యాప్తిలో మీడియా !

05 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan, wuhan hospital construction

Image result for while china trying to control the coronavirus,media spreading misinformation"

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ తాజాగా ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. ఇది చైనా నుంచి అనేక దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు. భయంకరమైన అంటు వ్యాధులు వ్యాపించటం పెద్ద సంఖ్యలో జనం, ఇతర జీవజాలం మరణించటం మనకు చరిత్ర తెలియనప్పటి నుంచీ వుంది. గతంలో వ్యాధుల గురించి తెలియనపుడు, నివారణ చర్యలను వెంటనే ఒకరికి ఒకరు తెలియచేసుకొనే సాధనాలు లేనపుడు అనేక వైరస్‌లు, బాక్టీరియాలు పెద్ద సంఖ్యలో నష్టం కలిగించాయి. క్షణాల్లో సమాచారం ప్రపంచానికంతటికీ తెలుస్తున్న ఈ రోజుల్లో జనానికి అవసరమైన దాని బదులు భయాన్ని పెంచేది, తప్పుడు సమాచారం ముందుగా జనానికి చేరుతోంది. దాన్ని అంటు వ్యాధితో పోల్చటాన్ని బట్టి ఎంత ప్రమాదకారిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమం ఈ విషయంలో అగ్రస్ధానంలో ఉంటే ఎక్కడ వెనుకబడిపోతామో అన్నట్లు సాంప్రదాయక మాధ్యమం కూడా పోటీపడుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ఊహాన్‌, ఇతర ప్రాంతాల పౌరులను ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. చివరికి దీన్ని తప్పు పడుతూ, వక్రీకరిస్తూ పశ్చిమదేశాల మీడియా కథనాలు రాస్తోంది. తాజా సమాచారం ప్రకారం వ్యాధి సోకిన దగ్గర నుంచి అంటే గత పదిహేను రోజుల్లో మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. వారిని దహనం చేయటంతో కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరమంతటా దట్టంగా పొగలు వ్యాపించాయని అతిశయోక్తులు రాశారు.
ఒక వైపు వ్యాధి లక్షణాలు నిర్దారణ కాగానే నివారణకు చైనా, ఇతర దేశాలు తీసుకున్న చర్యలను పొగడకపోయినా జనానికి తెలియ చెప్పటం కనీస ధర్మం. దానికి బదులు వ్యాధి గురించి తప్పుడు ప్రచారం చేసే వారు పొందే లబ్ది ఏమిటో తెలియదు. చైనాలో కోట్లాది మందికి వ్యాధి సోకిందని వీధుల్లో వేలాది మంది కుప్పకూలిపోతున్నారని, ఆరున్నర కోట్ల మంది వరకు మరణించే అవకాశం ఉందని బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ అంచనా వేస్తోందని, మీ చేతిలో కనుక ఒరెగానో ఆయిల్‌ గనుక ఉంటే వారిలో మీరు ఒకరు కాకుండా ఉంటారని సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నట్లు లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది. మన దేశంలో కూడా అదే స్ధాయిలో ప్రచారం ఉంది, భయాన్ని సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు ఐదు రూపాయల విలువ చేసే మాస్క్‌లను ఎంతకు అమ్మారో,మనం కొన్నామో గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. చైనాలో కరోనా వైరస్‌ను ఎక్కువ భాగం అదుపు చేశారని, అయినా వ్యాపిస్తున్నదని, చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులుతీసుకున్న చర్యల కారణంగా వ్యాప్తి వేగం తగ్గిందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

Image result for wuhan hospital construction"
ఒక తీవ్రమైన అంటు వ్యాధి వ్యాప్తిని అరికట్టటానికి చైనాలో మాదిరి రోజూ ఇరవైనాలుగు గంటల పాటు ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా పడకలున్న ఆసుపత్రి నిర్మాణం ఏ దేశంలో అయినా జరిగిందా ? జన చైనా ప్రజాసైన్య నిర్వహణలో సోమవారం నుంచి అక్కడ రోగులను చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. 33,900 చదరపు మీటర్ల ప్రాంతంలో ఏడువందల మంది ఇంజనీర్ల స్దాయి నిపుణులు, నాలుగువేల మంది కార్మికులు ఈ మహత్తర నిర్మాణంలో పాలు పంచుకున్నారు.ఆసుపత్రి ప్లాన్‌ జనవరి 24కు సిద్ధం అయింది, అదే రోజు వందకు పైగా నేలను తవ్వే, చదును చేసే యంత్రాలను దించారు. 25వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగానే సిద్దం చేసిన పెట్టెల వంటి మూడు వందల గదులను 29న ఏర్పాటు చేశారు. శనివారం నాటికి వైద్య పరికరాలను అమర్చారు. ఆదివారం నాటికి ఆసుపత్రి పూర్తి కావటాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా ఎనిమిది కోట్ల మంది ఇంటర్నెట్‌లో వీక్షించారు. టీవీల్లో సరేసరి. గతంలో సారస్‌ వైరస్‌ వ్యాప్తి సమయంలో బీజింగ్‌ శివార్లలో ఏడు రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మరింతగా మెరుగుపరిచి ఉపయోగించారు. కరోనా వ్యాపించిన ఉహాన్‌, ఇతర నగరాల్లో కూడా ఇలాంటి త్వరితగతి ఆసుపత్రులను ఇంకా నిర్మిస్తున్నారు.
గతంలో చైనా, ఇరుగు పొరుగుదేశాలలో సారస్‌ వ్యాప్తి చెందినపుడు వ్యాధి సోకిన వారిలో పదిశాతం మంది మరణించగా ప్రస్తుతం కరోనా విషయంలో అది 2.09 మాత్రమేనని అందువలన అంతగా భయపడాల్సిన అవసరం లేదని అనేక మంది చెబుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్నవారేనని, అంత మాత్రాన వైరస్‌ తీవ్రతను తగ్గించినట్లుగా భావించరాదని హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యుహెచ్‌ఓ) ప్రపంచ అత్యవసర పరిస్ధితిని ప్రకటించిందంటే దాని అర్ధం చైనా మీద విశ్వాసం లేదని కాదు. ఆరోగ్య వ్యవస్ధలు బలహీనంగా ఉన్న దేశాలలో వ్యాప్తి చెందకుండా చూడాలన్నదే ఉద్దేశ్యం. వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉహాన్‌ పట్టణం, పరిసరాల్లో దాదాపు ఐదు కోట్ల మంది జనాన్ని అటూ ఇటూ ప్రయాణించకుండా ఇండ్లకే పరిమితం చేస్తూ కట్టడి చేశారు, వారికి కావలసినవన్నీ అందిస్తున్నారు. దక్షిణ కొరియా లేదా ఒక ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మందికి ఏర్పాట్లు చేయటం ఇంతవరకు మరొక దేశంలో ఎక్కడా జరగలేదు. వైరస్‌ గుర్తింపు తదితర చర్యలు తరువాత, ముందు వ్యాప్తిని అరికట్టటం ముఖ్యమనే వైఖరితో ఈ చర్యలు తీసుకున్నారు. చైనా జనాభా మొత్తానికి ముఖాలకు అవసరమైన వ్యాధి నిరోధక మాస్కుల తయారీని చేపట్టారు. వైరస్‌ను గుర్తించిన పది రోజుల్లోనే దాని డిఎన్‌ఏను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు ఆ వివరాలను ప్రపంచానికంతటికీ అందించారు. వైరస్‌ ప్రబలుతున్న సమయంలోనే ఇంత తక్కువ సమయంలో సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచటం గతంలో ఎన్నడూ జరగలేదు, దాన్ని ఎవరైనా అధ్యయనం చేయవచ్చు, టీకాల వంటి వాటిని తయారు చేయవచ్చు.
ఇలాంటి విపత్తులు వచ్చినపుడు నలుగురూ నాలుగు చేతులు వేసి పరస్పరం సాయం చేయాల్సి వుండగా రాజకీయాలు చేయటం నీచాతి నీచం. ఇలాంటివి జరిగినపుడు బలహీనులను బలిపశువులుగా చేసిన దురహం కారం, దుర్మార్గాన్ని చరిత్ర నమోదు చేసింది. చైనా జాతీయుల కారణంగానే కరోనా వ్యాపిస్తోందని ఆరోపిస్తూ వారిని దేశంలో ప్రవేశించకుండా నిషేధించాలని దక్షిణ కొరియా సియోల్‌ నగరంలో కొందరు ప్రదర్శన చేశారు. కొన్ని చోట్ల అసలు ఆసియా వాసులెవరినీ రానివ్వ వద్దనే వరకు పరిస్ధితి పోయింది. ఎంతగా విద్వేషాన్ని,భయాన్ని రెచ్చగొట్టారో తెలుసుకొనేందుకు ఒక ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చైనా టౌన్‌ రెస్టారెంట్‌ వెలుపల 60 ఏండ్ల ఒక చైనా జాతీయుడు గుండెపోటుతో పడిపోయాడు. అలాంటి వారి గురించి తెలియగానే కృత్రిమ శ్వాస అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే అతను కరోనా వైరస్‌ కారణంగానే పడిపోయాడని అలాంటి చికిత్సను అందించేందుకు తిరస్కరించారు.( కరోనా వైరస్‌ వార్త పేరుతో చైనాలోని ఒక రోడ్డుపై ఆకస్మికంగా పడిపోయిన వ్యక్తి దృశ్యాన్ని మన దేశంలో కూడా మీడియా చూపింది. నిజంగా అతనెందుకు అలా పడిపోయాడో తెలియదు. కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలలో అదొకటని ఎవరూ చెప్పలేదు)
ఇప్పుడు చైనాలో జనాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి కట్టడి చేసిన మాదిరి గతంలో కలరా సోకినపుడు చేయలేదు. వారిని నౌకల్లో అనుమతించిన కారణంగా అది ప్రపంచ వ్యాప్తమైంది.1832లో వలస వచ్చిన ఐరిష్‌ జాతీయులు కలరాను వ్యాప్తి చేస్తున్నారని అనుమానించి వారిని విడిగా ఉంచారు, తరువాత రహస్యంగా చంపిన దుర్మార్గం తరువాత బయటపడింది. తొలి రోజుల్లో ఎయిడ్స్‌ కారకులు హైతీయన్లు అంటూ వారి మీద దాడులు చేసి వేధించారు. 2003 చైనాలో సారస్‌ ప్రబలినపుడు కెనడాలోని చైనా జాతీయుల మీద దాడులు చేసి వారి ఇండ్లు, దుకాణాల నుంచి తరిమివేసిన దారుణాలు జరిగాయి. మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చే జనం కుష్టువ్యాధి, మసూచిని తీసుకు వచ్చి అమెరికాను కలుషితం చేస్తున్నారంటూ 2018లో అమెరికాలోని ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత నోరు పారవేసుకున్నాడు. నిజానికి మసూచిని 1980లోనే ప్రపంచం నుంచి తరిమివేశారు.
కరోనా వైరస్‌తో చైనీయులు జీవ ఆయుధాలు తయారు చేస్తుండగా తప్పించుకొని బయటకు వచ్చిందని, ఆ వైరస్‌ను వారు కెనడా ప్రయోగశాల నుంచి అపహరించారనే కట్టుకధలు అనేకం ప్రచారంలోకి వచ్చాయి. వెనక్కు వెళితే అనేక అంటు వ్యాధులు జనాన్ని సామూహికంగా హతమార్చాయి. వాటికి కారకులు ఎవరు ? 1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా 50 కోట్ల మందికి స్పానిష్‌ ఫ్లూ సోకింది, ఆర్కిటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రదీవుల వరకు ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆరోజు నేటి మాదిరి విమానాలు లేవు, ప్రయాణాలు లేవు. కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది వరకు మరణించినట్లు అంచనా. (అంటే నాటి ప్రపంచ జనాభాలో ప్రతి వందమందిలో ముగ్గురి నుంచి ఐదు మంది వరకు) ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో అనేక అంటు వ్యాధులు ఎంతగా ప్రబలాయంటే అమెరికాలో సగటు జీవిత కాలం పన్నెండు సంవత్సరాలు తగ్గిపోయింది. ఫ్లూ పిల్లలను, ముసలి వారినీ ఎక్కువగా కబళిస్తుంది, కానీ అమెరికాలో యువత ఎక్కువ మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అనేక దేశాలు వాస్తవాలను బయట పెట్టకుండా తొక్కిపెట్టాయి. అలాంటి పశ్చిమ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి చైనా మీద అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఫ్లూ కారణంగా స్పెయిన్‌లో రాజు పదమూడవ ఆల్ఫోన్సోతో సహా అనేక మంది సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. దాంతో అక్కడి నుంచే అది ప్రబలిందని అందువలన దానికి స్పెయిన్‌ ఫ్లూ అని పేరు పెట్టారు.

Image result for wuhan hospital construction"
గత మూడువందల సంవత్సరాలలో తొమ్మిది సార్లు ప్రమాదకరంగా ఫ్లూ వ్యాపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి దేశంలోనూ సగటున మూడు సార్లు ఫ్లూ వచ్చినట్లు తేలింది. అలాంటి భయంకరమైన వాటిలో 2009లో వచ్చిన ఫ్లూ ఒకటి.దీన్నే స్వైన్‌ ఫ్లూ అని పిలిచారు. మన దేశాన్ని కూడా ఎలా వణికించిందో తెలిసిందే. ఇది తొలుత అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో బయట పడింది. ప్రపంచమంతటా పాకి జనాభాలో పదకొండు నుంచి 21శాతం మందికి సోకినట్లు, 1,51,700 నుంచి 5,75,400 మంది వరకు మరణించినట్లు తేలింది. ఎంతో అభివృద్ది చెందింది, వైద్య పరంగా ముందున్నదని చెప్పుకొనే అమెరికాలో స్వైన్‌ ఫ్లూ 2009-10లో నాలుగు కోట్ల 30లక్షల మంది నుంచి 8.9 కోట్ల మందికి సోకిందని అంచనా. వారిలో లక్షా 95వేల నుంచి నాలుగు లక్షల మూడువేల మంది వరకు ఆసుపత్రి పాలయ్యారని, 8,870 నుంచి 18,300 మంది వరకు మరణించారని అంచనా. మరొక సమాచారం ప్రకారం ప్రతి ఏటా అమెరికాలో సగటున ఫ్లూ కారణంగా కొన్ని సంవత్సరాల సగటు 25వేలు ఉండగా మరికొన్ని సంవత్సరాలలో 36వేల మంది మరణించారని తేలింది. ఒక ఏడాది తక్కువ, మరొక ఏడాది ఎక్కువ ఉండవచ్చు ఇది సగటు అని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పత్రిక వెల్లడించింది. కరోనాకు చైనా కారణం అని చెప్పేవారు అమెరికాలో జరిగే వాటికి కారకులు ఎవరని చెబుతారు ?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా ఎలాంటి సాయం చేయకపోగా అతిగా స్పందిస్తున్నదని దానిలో భాగంగానే ఏ దేశమూ చేయని విధంగా ఉహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు తీసుకొన్నదని చైనా విమర్శించింది. ఇది అనైతికం అయినా అమెరికా, దాన్ని సమర్ధించే మీడియా చర్యలు ఆశ్చర్యం కలిగించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: