• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: fake news

కల్పిత వార్తలతో జనాలకు కహానీలు చెబుతున్న మీడియా !

03 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#media lies on China, fake news, fake stories in media, media lies, Trump lies

ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.


మే, జూన్‌ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.


అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.


రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్‌ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్‌ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్‌ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.


ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్‌ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్‌ టీవీ అవమానించింది.
టైమ్స్‌ నౌ ఛానల్‌ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్‌ జియాంగ్‌ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్‌ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్‌ వెబ్‌ సైట్‌ వెల్లడించింది.


ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్‌ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్‌ న్యూస్‌ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్‌ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.


మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్‌ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్‌ న్యూస్‌) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.


జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్‌ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. గాల్వన్‌ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్‌ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్‌ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్‌ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్‌ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్‌ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్‌ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్‌ చల్‌ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్‌ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్‌ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్‌ వెబ్‌సైట్‌ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.


ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్‌ పత్రిక ట్రంప్‌ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్‌ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్‌ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్‌, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.


ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్‌ న్యూస్‌ అనే ఒక వెబ్‌సైట్‌ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్‌ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్‌ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్‌, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్‌ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్‌ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్‌ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్‌ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.


డోనాల్ట్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?


ఈ నేపధ్యంలో చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

27 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chinese global times survey, fake news, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫేక్‌ న్యూస్‌ బాధితులు సీత-రాముడు- లక్ష్మణుడు !

04 Saturday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Conspiracy theory, Coronavirus fake news, fake news

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కల్పిత వార్తల సంవత్సరంగా ముగిసిన 2016 !

31 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

2016 year of fake news, fake news, fake news stories, Misinformer, whatsapp

సత్య

    నిజం నాలుగు వేసే లోగా అవాస్తవం అరవైై అంగల దూరం ప్రయాణిస్తున్న కాలమిది. ప్రపంచవ్యాపితంగా కల్పిత, నకిలీ వార్తలు ప్రచారం, వేగం రోజు రోజుకూ పుంజుకుంటోంది. అలాంటి వాటిని సృష్టించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా రంగంలోకి వస్తున్నాయన్నది నమ్మలేని నిజం. ఒక వస్తువు చివరి వినియోగదారుడికి చేరక ముందే దాని నకిలీ తిష్టవేస్తున్నట్లుగానే నిజమైన వార్తలతో పాటు కల్పిత వార్తలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవటం వర్తమాన వ్యాపారాలలో ఒకటిగా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నిలకు ముందు నుంచీ మన దేశంలో ఈ వ్యాపారం తామరతంపరగా పెరిగింది. ఒక సాంస్కృతిక సంస్ధ ముసుగులో పని చేస్తున్న వారు ఒక పెద్ద కల్పిత, నకిలీ, పుకార్ల కర్మాగారాన్నే పెట్టారు. దానికి అనుబంధంగా అనేక చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పారు. వందల మందిని నియమించి కోట్లాది రూపాయల వేతనాలతో నడుపుతున్నారు. తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు, తమ పట్ల విమర్శనాత్మక వైఖరిని కలిగి వున్న జర్నలిస్టులు, మేథావులు, ఇతరులను అన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలతో, ఇతర విధాలుగా దెబ్బతీయటం నిత్య కార్యక్రమం. వీటి బండారాన్ని జనం తెలుసుకొనే సమయానికి అవి చేయాల్సిన పని, ప్రయోజనం, హాని చేస్తాయి. ఒక వార్త నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొనే అవకాశం, తీరిక అందరికీ వుండదనే బలహీనతను వాటి సృష్టి కర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. తాము నమ్మిన వార్త అవాస్తవమని తెలుసుకున్నవారు నిజమైన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మరు. ప్రతిదానినీ అనుమానిస్తూ వుంటారు. స్వార్ధశక్తులకు కావాల్సింది కూడా అదే. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, సారా, కులం, మతం, మీడియాలో డబ్బిచ్చి వార్తలు రాయించుకోవటం వంటి ప్రలోభాలతో పాటు కల్పిత వార్తలు కూడా ఒకటిగా చేరాయని 2016 మరింతగా నిరూపించింది. అందుకే ఒక సంస్థ ముగిసిన ఏటిని అబద్దాల సంవత్సరంగా ప్రకటించింది.

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచంలో కల్పిత వార్తలకు మన దేశం ఒక ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. దేశంలో 16కోట్ల వాట్సాప్‌లుంటే నెలకు వంద కోట్ల సార్లు వినియోగిస్తున్నారని అంచనా. ఫేస్‌ బుక్‌ ఖాతాలున్నవారు 15 కోట్లు, ట్విటర్‌లో 2.2కోట్ల మంది వున్నారని చెబుతున్నారు. వీటి ప్రభావం ఎంతగా వుందంటే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారు కూడా తామెక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో సోషల్‌ మీడియాలో ప్రచారంలో పెడుతున్న చెత్తను స్వీకరించి పాఠకులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం. గతేడాది జనాన్ని బురిడీ కొట్టించిన అనేక వార్తలలో కొన్నింటిని చూద్దాం.

    ‘నరేంద్రమోడీని ప్రపంచ వుత్తమ ప్రధానిగా యునెస్కో ప్రకటించింది’ ఇదొక కల్పిత వార్త.జూన్‌ నెలలో వాట్సాప్‌ గ్రూపులలో ప్రారంభమై ఇతర సోషల్‌ మీడియాలో చెలరేగింది. ఐక్యరాజ్యసమితి గానీ, దాని ఆధ్వర్యంలో నడిచే యునెస్కో వంటి సంస్ధలుగా గానీ అలాంటి అవార్డులు ఇవ్వవు, అయినా సరే అది ఇంకా తిరుగుతూనే వుంది. అలాగే జనగణమనను కూడా వుత్తమ జాతీయ గీతంగా అదే సంస్ధ ప్రకటించిందన్న తప్పుడు వార్త గురించి కూడా తెలిసిందే. ఇది 2008 నుంచి తిరుగుతోంది. ఒకసారి అందుకున్నవారికి అనేక సార్లు వచ్చి వుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులకు తోడు రెండువేల రూపాయల నోటు వచ్చి చిల్లర సమస్యను జత చేసి మరింత చికాకు కల్పించటాన్ని అందరం చూశాము. సరిగ్గా ఈ సమయంలోనే మన రెండు వేల రూపాయల నోటు ప్రపంచంలో అత్యంత వుత్తమ కరెన్సీ అని యునెస్కో కితాబు ఇచ్చిందనే సమాచారం వాట్సాప్‌ జనాలను వూపేసింది. ఇప్పటికింకా మీకు రాకపోతే త్వరలో వస్తుంది. ఇలాంటి వాటిని నిజమని నమ్మి ఇతరులకు చేరవేసే మన వాట్సాప్‌ గ్రూపు వినియోగదారుల తెలివితక్కువ తనం గురించి బిబిసి ప్రపంచానికంతటికీ తెలియచేసింది.

   ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను పెంచేందుకు రంగంలోకి దించిన మరొక వార్త రెండువేల రూపాయల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారన్నది. న్యూఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్ధులు దేశ వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారంటూ సృష్టించిన కల్పిత వీడియోలను పదే పదే ప్రచారం చేసిన జీ న్యూస్‌లోని బిజెపి భక్తుడైన సీనియర్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరి రెండువేల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారనే తప్పుడు కధనాన్ని కూడా జీ న్యూస్‌లో ప్రసారం, ప్రచారం చేశాడు. ఆ నోటును వుపగ్రహాలు కనుగొంటాయని, 120మీటర్ల లోతున భూ గర్బంలో దాచినా సిగ్నల్స్‌ ద్వారా పట్టుకోవచ్చునని ఇదంతా నరేంద్రమోడీ ఘనత అనే అర్ధం వచ్చేట్లుగా కట్టుకధలు చెప్పాడు. దాంతో మిగతా ఛానల్స్‌ కూడా దానిని కాపీ చేశాయి, కొత్త అంశాలను కలిపి చెప్పాయి. 15 ప్రోటాన్స్‌, 17 న్యూట్రాన్స్‌ వున్న రేడియో యాక్టివ్‌ ఐసోటోప్‌లు కొత్త నోట్లలో వున్నాయని కూడా ప్రచారం చేశారు. నిజమే అని వాట్సాప్‌ వీరులు ఎలా వ్యాపింప చేసిందీ చూశాము. నరేంద్రమోడీ, బిజెపి భక్తులు దానిని పెద్ద ఎత్తున వ్యాపింప చేశారు. చివరికది అవాస్తవమని తేలింది. మోడీ సర్కార్‌ నుంచి ప్రశంసలు లేదా ప్రతిఫలం పొందేందుకు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ కూడా కల్పిత వార్తలను తయారు చేసి దేశం మీదకు వదిలింది. తన వుద్యోగి ఒకడిని సామాన్యుడి మాదిరి ఒక టీస్టాల్లో నిలబెట్టి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పించింది. సామాజిక మీడియాలో కొంత మంది అతనిని గుర్తు పట్టి బండారాన్ని బయటపెట్టటంతో ఆ వార్తా సంస్ధ పరువు మురికి గంగలో కలిసింది.

    వాట్సాప్‌లోని ఫొటోలను ఐస్‌ వుగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం వున్నందున వెంటనే వాటిని తొలగించాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ పేరుతో ప్రచారం జరిగింది. ఒక 20-25 రోజుల పాటు ఫొటోలు పెట్ట వద్దని ఈ లోగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ సిఇఓ చెప్పినట్లుగా దాని కొనసాగింపుగా మరో పుకారు షికారు చేసింది. పది రూపాయల నాణాన్ని రిజర్వు బ్యాంకు రద్దు చేసిందన్న ప్రచారం కూడా ఈ కాలంలోనే వాట్సాప్‌లో తిరిగింది. అనేక చోట్ల దుకాణదారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరించారు. నిరాకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది.

   తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత కుమార్తె అని, అమెరికాలో రహస్యంగా జీవిస్తోందంటూ ఒక ఫొటో వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో తిరిగింది. అయితే అది అవాస్తవమని, ఆ యువతి ఆస్ట్రేలియాలో వుంటోందని, జయలలితకు సంబంధం లేదని తరువాత తేలింది. జయలలిత మరణించిన తరువాత దీనిని సృష్టించారు.

    మన దేశానికి దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల సముద్రతీరం, పుష్కలంగా వుప్పు తయారీకి అవకాశం వున్నప్పటికీ దేశంలో వుప్పు కొరత ఏర్పడిందన్న వాట్సాప్‌ మెసేజ్‌ రాగానే నిజమనుకొని జనం ఎగబడి కిలో వుప్పును మూడు, నాలుగు వందల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయటాన్ని చూశాము. కాన్పూరులో వుప్పుకోసం ఒక దుకాణాన్ని లూటీ చేసేందుకు ఎగబడిన జనాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఒక మహిళ మరణించింది. తన నోట్ల రద్దు చర్యతో దెబ్బతిన్నవారే ఈ పుకార్లు పుట్టించారని నరేంద్రమోడీ ఆరోపించారు.

    ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలుపుతూ భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక వటవృక్షంలా తయారై దేశాన్ని, జనాన్ని ఎదగనివ్వలేదంటూ మన దేశంలో బిబిసి విలేకరిగా పనిచేసిన మార్క్‌తులీ వ్యాఖ్యానించారంటూ ఒక నకిలీ వార్తను పుట్టించారు. తానలాంటి వ్యాఖ్య చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

    అంతర్జాతీయ విషయాలకు వస్తే డిసెంబరు నెలలో వచ్చిన ఒక వార్త పాకిస్ధాన్‌ మంత్రి ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేయటానికి దారి తీసింది. ఏదో ఒక సాకుతో పాకిస్తాన్‌ గనుక సిరియాకు సైన్యాన్ని పంపితే తాము పాక్‌పై అణుదాడి చేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి బెదిరించినట్లు ఒక వార్త వచ్చింది. అది ఎంత వరకు నిజమో తేల్చుకోకుండానే పాక్‌ మంత్రి ఆసిఫ్‌ ట్విటర్‌ ద్వారా ఒక ప్రకటన చేస్తూ తమ దేశం కూడా అణ్వస్త్ర దేశమే అని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు. తరువాత ఇజ్రాయెల్‌ మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని వెల్లడైంది. నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కల్పిత వార్తల తయారీ కేంద్రాలు, కార్మికులు ఓవర్‌టైమ్‌ పని చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే పొలైటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ 2016ను అబద్దాల సంవత్సరంగా వర్ణించింది. కల్పిత వార్తలను తామరతంపరగా తయారు చేయటమే కాదు, వాటిని జనం నమ్మటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అమెరికా ఎన్నికలకు మూడునెలల ముందు కాలంలో ఓ ఇరవై కల్పిత వార్తలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. వాటిపై వ్యాఖ్యలు, ఇష్టపడిన(లైక్‌), పంచుకున్న (షేర్‌) వారి సంఖ్య 8.71 మిలియన్లని తేలింది. ఇదే సమయంలో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికలుగా పరిగణనలో వున్న వాటిలో వచ్చిన 20 ముఖ్య వార్తలపై స్పందించిన వారు 7.36 మిలియన్ల మంది మాత్రమే వున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో కల్పిత వార్తలు ఎంతగా ప్రాచుర్యంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

     అమెరికా అధ్యక్షుడిగా పచ్చిమితవాది డోనాల్డ్‌ ట్రంప్‌ గెలవటంలో కల్పిత వార్తలు కూడా ముఖ్య పాత్ర వహించాయంటే అతిశయోక్తి కాదు. దీనిని గుర్తించే వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న ఎన్నికలలో ఓటర్లు కల్పిత వార్తల బారిన పడకుండా చూసేందుకు కల్పిత వార్తల నుంచి రక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ కేంద్రం అలాంటి వార్తల గురించి ఓటర్లను విద్యావంతులను గావిస్తుందట. ముఖ్యంగా రష్యన్‌, టర్కిష్‌ భాష మాట్లాడే జర్మన్‌ పౌరులు ఈ కల్పిత వార్తల బారిన ఎక్కువగా పడే అవకాశం వుందని భావిస్తున్నారు. కల్పిత వార్తలుగా తేలిన వాటిని తమ వేదికలపై నుంచి తొలగించని సామాజిక మీడియా సంస్ధలకు జరిమానా విధించాలని జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యులు ఇప్పటికే డిమాండ్‌ చేశారు. ఫ్రాన్స్‌లో కూడా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కల్పిత వార్తల ధాటి పెరగవచ్చని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.

     మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి కల్పిత వార్తలను తయారు చేస్తున్నారు. వలస వచ్చిన శరణార్ధి బెర్లిన్‌ నగరంలో 13 సంవత్సరాల రష్యన్‌ జాతికి చెందిన ఒక బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఇంకేముంది రష్యాలోని ముస్లిం వ్యతిరేక మితవాద శక్తులు చెలరేగిపోయి అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ దెబ్బకు తట్టుకోలేని రష్యన్‌ ప్రభుత్వం ఈ వుదంతాన్ని మూసిపెట్టేందుకు జర్మన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించేవరకు వెళ్లింది.

    అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణ సెల్లార్‌లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ అనుచరులు బాలలతో ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక వార్తను వదిలారు. అది నిజమే అని నమ్మిన ఒక వ్యక్తి అక్కడి బాలలను రక్షించేందుకు వచ్చి పీజా కేంద్రంలో కాల్పులు జరిపాడు. అయితే ఎవరూ గాయపడలేదు. తీరా అక్కడ సెల్లార్‌ లేదు, వ్యభిచార కేంద్రం లేదని తెలుసుకొని పోలీసులకు లొంగి పోయాడు. హిల్లరీ క్లింటన్‌ ఐఎస్‌ తీవ్రవాదులకు నిధులు అందచేసినట్లు, డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ బలపరిచినట్లు , షరియా చట్టాన్ని ఫ్లోరిడా రాష్ట్రంలో అమలు జరపాలని డెమోక్రటిక్‌ పార్టీ కోరినట్లు కల్పిత వార్తలు వచ్చాయి. ఇవన్నీ రిపబ్లికన్‌ పార్టీ వారు డబ్బిచ్చి ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు చేసిన అవాంఛనీయ వ్యవహారాలని వేరే చెప్పనవసరం లేదు.

     కల్పిత వార్తల తయారీకి వాటితో లబ్ది పొందే వారి నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు వాటిని చదివే, చూసే పాఠకులను ఆకర్షించేందుకు ఆ వార్తలలో పెట్టే ప్రకటనల ద్వారా కూడా తయారీదారులు, వాటిని జనానికి పంచే 180 కోట్ల వినియోగదారులున్న ఫేస్‌బుక్‌, తదితర వెబ్‌సైట్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది.అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ శివార్లలో కల్పిత వార్తల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జెస్టిన్‌ కోలెర్‌ తాను ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా నెలకు పది నుంచి 30వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు అంగీకరించాడు. అమెరికా ఎన్నికలలో కల్పిత వార్తలతో డబ్బు సంపాదిస్తున్నవారిని గమనించిన తరువాత పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లలో ఒకటైన జార్జియాకు చెందిన ఒక కంప్యూటర్‌ విద్యార్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా కల్పిత వార్తలు తయారు చేస్తే బాగా గిట్టుబాటు అవుతోందని గ్రహించి ఆమేరకు అందుకు పూనుకోగా ఒక నెలలో తనకు గరిష్టంగా ఆరువేల డాలర్లు వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. కల్పిత వార్తల వేదికగా మారినట్లు తీవ్ర విమర్శలు రావటంతో గూగుల్‌, ఫేస్‌బుక్‌ యాజమాన్యం వాటి నివారణకు తాము కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

     సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియా తీరుతెన్నులను పరిశీలిస్తున్నవారు 2017లో కూడా ప్రజలపై కల్పిత వార్తల దాడి ఎక్కువగానే వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో వాటి నిరోధం, జనానికి చైతన్యం కలిగించే చర్యలపై కూడా దృష్టి సారించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కల్పిత వార్తలు- కట్టు కధలతో హిల్లరీకి దెబ్బ- మోడీకి లబ్ది

11 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News

 

Image result for  Hillary Clinton ,pizzagate

సత్య

    ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్‌, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.

   మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్‌ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !

    మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్‌ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్‌ పాంగ్‌ రెస్టారెంట్‌లోని సెల్లార్‌లో చిన్న పిల్లలతో సెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్‌ జాన్‌ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్‌ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్‌ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్‌ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్‌ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్‌ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్‌ మేనేజర్‌ మధ్య జరిగిన ఇమెయిల్‌ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్‌సైట్‌ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్‌ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్‌ మేనేజర్‌ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.

    చిత్రం ఏమిటంటే పీజాగేట్‌ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్‌బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్‌ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.

    మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్‌ మాడిసన్‌ వాల్చ్‌ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్‌ రాకెట్‌ నడిచిందన్న సెల్లార్‌ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్‌ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్‌లో గనుక సెల్లార్‌ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్‌ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.

     ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.

Image result for narendra modi fake news, fake photos

ఈ ఫొటో గురించి ఫేస్‌బుక్‌ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్‌ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జర్నలిస్టుల ముసుగులో పోలీసులు- మీడియాలో కట్టు కథలు !

27 Tuesday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.

ఎం కోటేశ్వరరావు

     జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.

   దర్యాప్తు సమాయాలలో ఎఫ్‌బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్‌ జనరల్‌ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !

    రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్‌ మోకింగ్‌ బర్డ్‌ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్‌బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్‌బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.

    2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్‌ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్‌ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్‌ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్‌ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్‌ ప్రెస్‌ (మన పిటిఐ, యుఎన్‌ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్‌ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్‌ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్‌సైట్‌ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఎఫ్‌బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్‌బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్‌బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.

   దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్‌ ఎఫ్‌బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ప్రీడమ్‌ ఆఫ్‌ ద ప్రెస్‌ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్‌బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్‌బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.

     ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమినీ జీటుంగ్‌ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్‌ జర్నలిస్టు డాక్టర్‌ యుడో అల్‌ కొటే రష్యాకు చెందిన ఆర్‌టి న్యూస్‌ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్‌, అమెరికన్‌ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్‌ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్‌ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్‌ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్‌ జర్నలిస్టు వెల్లడించారు.

   కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్‌ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్‌ లేయాన్‌ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్‌, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్‌ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్‌ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్‌ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.

    కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్‌ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్‌లో ఒక కొటేషన్‌, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్‌ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్‌కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్‌ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్‌ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.

     మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్‌లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.

     అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్‌లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్‌ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.

    మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్‌, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్‌సైట్‌ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.

    మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.

    అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?

    మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్‌ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్‌ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్‌ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.

గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: