• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: History

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు !

28 Sunday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

History, Joseph v Stalin, Russia's Communist Party, statues of Stalin, Thomas Jefferson


ఎం కోటేశ్వరరావు

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు అనే శీర్షికతో అమెరికాలోని అగ్రపత్రికల్లో ఒకటైన లాస్‌ ఏంజల్స్‌టైమ్స్‌ నవంబరు 20న ఒక విశ్లేషణను ప్రచురించింది. ఇదే సమయంలో ఒక స్మారక చిహ్నానికి ఉన్న చట్టబద్దతను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటీషన్‌పై రష్యా సుప్రీం కోర్టు విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. పూర్వపు సోవియట్‌లో జరిగినట్లు చెప్పే మానవహక్కుల ఉల్లంఘనకు బలైన వారి పేరుతో స్టాలిన్‌, కమ్యూనిస్టు పార్టీ మీద బురద చల్లేందుకు ఏర్పాటు చేసినదే సదరు స్మారక చిహ్నం. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల మీద ప్రేమ పుట్టుకువచ్చి ఈ కేసు దాఖలు చేశారా ?
చరిత్ర నిర్మాతలు జనం, వారికి మద్దతుగా నిలిచిన నేతలు అన్నది తిరుగులేని సత్యం.బ్రిటన్‌ మాజీ ప్రధాని వినస్టన్‌ చర్చిల్‌ చరిత్రను రాసేది విజేతలు అని చెప్పారు. అంతకు ముందు కారల్‌ మార్క్స్‌ చరిత్ర గురించి చెబుతూ చరిత్ర పునరావృతం అవుతుంది, తొలుత అది విషాదకరంగా తరువాత ప్రహసనంగా అన్నారు. చర్చిల్‌ చెప్పినట్లు దేశంలో పూర్తి అధికారాన్ని సాధించిన విజేతగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) తనకు అనుకూలంగా చరిత్రను తిరగరాసేందుకు పూనుకుంది.కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు అది విషాదకరమే, రెండవది ఆ పరివారంతో ప్రభావితమై దేశానికి 1947వచ్చింది భిక్ష తప్ప నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ చెప్పటం ప్రహసన ప్రాయమే.( కారల్‌ మార్క్స్‌ ఏ సందర్భంలో,ఏ అంశాల ప్రాతిపదికన అలా చెప్పారని విశ్లేషకులు తలలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు)


అనేక దేశాల్లో చరిత్ర గురించి చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.అమెరికాలో కూడా అదే జరుగుతోంది. లాస్‌ఏంజల్స్‌టైమ్స్‌ విశ్లేషణ రచయిత నికోలస్‌ గోల్డ్‌బెర్గ్‌ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను రాశారు. మరోసారి అమెరికన్లు చరిత్ర గురించి పోట్లాడుకుంటున్నారు అనే వాక్యంతో ప్రారంభించారు. తాజమహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్లే అమెరికా నిర్మాతలెవరు, ఏ పునాదులమీద నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యాన్ని ప్రస్తావిస్తూ అమెరికా నిర్మాతగా పరిగణించే థామస్‌ జఫర్సన్‌ – నాజీల పీచమణచిన కమ్యూనిస్టు నేత స్టాలిన్ల గురించి రాశారు. స్టాలిన్ను నియంతగా వర్ణిస్తూ మే నెలలో జరిగిన సర్వేలో 56శాతం మంది రష్యన్లు స్టాలిన్ను గొప్పనేతగా పరిగణించటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ తన రాజకీయ అవసరాల కోసం స్టాలిన్‌కు పునరావాసం కల్పిస్తున్నారని, గత తరాలు ధ్వంసం చేసిన విగ్రహాల స్ధానంలో కొన్ని పట్టణాలలో తిరిగి ప్రతిష్ఠిస్తున్నారని రచయిత వాపోయాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ప్రధాన రచయిత ధామస్‌ జఫర్సన్‌ ఆరువందల మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తి విగ్రహం తమ సిటీ హాల్‌లో ఉండటం అవమానకరమంటూ దాన్ని తొలగించాలని న్యూయార్క్‌ నగరపాలక సంస్ధ ఏకగ్రీవంగా తీర్మానించటం గురించి గగ్గోలు పెట్టాడు. అందుకే జఫర్సన్‌ విగ్రహాలను తొలగిస్తుంటే స్టాలిన్‌ విగ్రహాలను కొత్తగా పెడుతున్నారంటూ విశ్లేషణ చేశాడు.


సోవియట్‌ను కూల్చిన తొలి రోజుల్లోనే స్టాలిన్‌ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు.2016లో దాన్ని విదేశీ ఏజంట్‌గా ప్రకటించారు.దాని ప్రకారం మానవహక్కుల సంస్దల పేరుతో దాన్ని నిర్వహిస్తున్నవారి మీద చర్య తీసుకోవచ్చు. రాజకీయంగా తమను అణచివేసేందుకే పుతిన్‌ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసేందుకు పూనుకుందని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా స్టాలిన్‌ మీద జనంలో పెరుగుతున్న సదభిప్రాయం కారణంగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు పుతిన్‌ కూడా ఎత్తులు వేస్తున్నాడన్నది స్పష్టం. రష్యాకోర్టులో తమ కేసు వీగిపోతే ఐరోపా కోర్టుకు వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ ఏజంట్లనే ముద్రవేసి పుతిన్‌ తన రాజకీయ ప్రత్యర్దులను దెబ్బతీస్తున్నాడు. కమ్యూనిస్టు ఎంపీ మీద కూడా తప్పుడు కేసు పెట్టించాడు.


2010లో స్టాలిన్‌ విగ్రహాలకు మద్దతు ఇచ్చిన వారు 25శాతం, వద్దన్నవారు 36శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో అవి 48 – 20శాతాలుగా ఉన్నట్లు లెవడా కేంద్రం సర్వే వెల్లడించింది.2005-21 మధ్యకాలంలో 18-24 ఏండ్ల వయసులో ఉన్న వారిలో స్టాలిన్‌ పట్ల అభిమానం ఐదు రెట్లు పెరిగింది. స్టాలిన్‌ గొప్పనేత అని చెప్పిన వారు ఈ ఏడాది మేనెల సర్వేలో 56శాతం మంది ఉన్నట్లు, 2016తో పోల్చితే రెట్టింపు అని లెవడా తెలిపింది. ద్వితీయ ప్రపంచ యుద్దంలో సోవియట్ల చర్యలను నాజీలతో పోల్చటాన్ని నిషేధిసూపార్లమెంట్‌ చేసిన తీర్మానానికి ఈ ఏడాది జూలైలో పుతిన్‌ ఆమోద ముద్రవేశాడు.యుద్దంలో పౌరుల నిర్ణయాత్మక పాత్రను తోసిపుచ్చటాన్ని కూడా నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ పతనంలో స్టాలిన్‌ పాత్ర చెరిపితే చెరిగేది కాదు. స్టాలిన్‌ మరణం తరువాత నాటి పార్టీనేతలు చేయని తప్పుడు ప్రచారం లేదు, మసోలియం నుంచి భౌతిక కాయాన్ని తొలగించి క్రెమ్లిన్‌లో సమాధి చేశారు. సోవియట్‌ పతనం ముందు తరువాత కూడా తప్పుడు ప్రచారం సాగినా ఇటీవలి కాలంలో స్టాలిన్‌ పట్ల రోజు రోజుకూ జనంలో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్‌ గురించి ఇతర దేశాల్లో సాగించిన తప్పుడు ప్రచార నేపధ్యంలో అనేక మందికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు గానీ రష్యన్లు ఆ విధంగా భావించటం లేదు. తమ దేశ ఔన్నత్యం నిలిపిన నేతగా పరిగణిస్తున్నారు.


స్టాలిన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా నాజీలు ఆకస్మికంగా దాడి చేసినపుడు ఎర్రసైన్యం పసిగట్టలేకపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా 2005 సర్వేలో స్టాలిన్‌ తగిన సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం 40శాతం కలిగి ఉండగా 2021లో 17శాతానికి తగ్గింది. స్టాలిన్‌ గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలిపేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మాస్కోకు 450 కిలోమీటర్ల దూరంలోని నోవోగోర్డ్‌ కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధినేత జుగనోవ్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని కుప్పకూల్చి జన సంపదలను దోచుకున్న వారు ఎల్సిన్‌ పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినపుడు స్టాలిన్‌ పేరుతో ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదని జుగనోవ్‌ సహాయకుడు అలెగ్జాండర్‌ యుషి చెంకో అన్నారు. గతంలో ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదని, సోవియట్‌ పతనం తరువాత పుట్టిన, పెరిగిన యువతరం ఇప్పుడు సానుకూల వైఖరితో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.


వివిధ సర్వేలలో స్టాలిన్‌ పట్ల సానుకూల వైఖరి వెల్లడి కావటం అంటే నూతన తరంలో సోషలిజం, కమ్యూనిజం పట్ల ఆసక్తి పెరగటం, కూల్చివేసిన సోషలిస్టు సమాజంతో ప్రస్తుత పరిస్ధితులను పోల్చుకోవటం సహజంగానే జరుగుతుంది. అది ఇప్పుడున్న పుతిన్‌ లేదా ఇతర అధికార బూర్జువా పార్టీలకు అంగీకారం కాదు. రెండవది రోజు రోజుకూ పుతిన్ను సమర్ధించేవారు తగ్గుతున్నారు. సర్వేల ఫలితాలు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో సర్వేలు రష్యా సమాజాన్ని ప్రతిబింబించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.కొందరైతే సర్వేల్లో అసలు స్టాలిన్‌ గురించి అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రష్యన్‌ చరిత్రలో స్టాలిన్‌ పాత్ర గురించి జనం 70శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నపుడు పండితులు దాన్ని ఎలా కాదో చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు, లెవడా సర్వేలు అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి, స్టాలిన్‌ యుద్ధ విజేత, తెలివిగల నేత అని భావిస్తున్నారు. స్టాలిన్ను అభిమానించే వారు పెరగటం అంటే పాలకపార్టీ పట్ల అసంతృప్తి పెరగటంగా భావించవచ్చని కొందరు సూత్రీకరిస్తున్నారు. గతంలో స్టాలిన్ను ఒక నియంత, బూచిగా ఒక పధకం ప్రకారం చూపారు, చరిత్రను చూస్తే మహత్తర పోరాటం సాగించిన స్టాలిన్‌ మీద ఎల్లకాలం బురదచల్లటం కొనసాగించలేని స్ధితిలో జనాలు నిజాలు తెలుసుకుంటున్నారు. వాటిని పుతిన్‌ సహిస్తాడా ? చరిత్రలో వ్యక్తుల పాత్ర తక్కువేమీ కాదు. కానీ చరిత్ర అంటే వ్యక్తులు కాదు. వ్యక్తి ఆరాధనలకు పురోగామి వాదులు, కమ్యూనిస్టులు వ్యతిరేకం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

యండమూరి చరిత్రకారుడు కాదు, వెనిజులా గురించి రాసింది చరిత్రా కాదు !

12 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Historian, History, populist schemes, Venezuela, Yandamuri, Yandamuri Veerendranath

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు.ఈ సందర్భంగా రాస్తున్న దిగువ అంశాలు యండమూరి వంటి వారిని మార్చేందుకో లేక వారికి తెలియచేసేందుకో కాదు, ఏడు పదులు నిండిన వారు నేర్చుకొనేదేమి వుంటుంది. ఆ పేరుతో రాసింది నిజం అని గుడ్డిగా నమ్మేవారిని భిన్న కోణంలో ఆలోచించమని కోరేందుకే ఇది. ఆసక్తి వున్నవారే ముందుకు పోండి. లేని వారు సమయం వృధా చేసుకోవద్దని మనవి.

వెనిజులా గురించి కానీ మరొకదాని గురించి గానీ రాసే హక్కు యండమూరికి వుంది. అది కాపీ చేసిందా, లేక వక్రీకరణలను గుడ్డిగా అనుసరించిందా అని చర్చ చేసే హక్కు దాన్ని చదివిన వారందరికీ వుంది. అలాగే ఒక రచన, ఒక కళారూప ప్రయోజనం ఏమిటన్నది అవి వెలువడిన నాటి నుంచీ చర్చ జరుగుతూనే వుంది. యండమూరి రచనలనూ అలాగే పరిశీలించాలి. అవి కాపీ కొట్టినవా లేక మిగిలిపోయిన ఇడ్లీలను పొడి చేసి ఘమఘమ లాడే తాలింపుతో తయారు చేసిన వుప్మా వంటివా అన్నది వేరే విషయం. మీడియాలో వచ్చిన వార్తల మేరకు ఆయన వయస్సులో వుండగా ఒక యువకుడు, ఒక యువతి ఆయన రచనలను చదివి ‘వుత్తేజం’ పొంది ఆత్మహత్య చేసుకున్నారని 1980దశకం పత్రికల్లో వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆ రచనలను విమర్శించినందుకుగాను తన పరువు పోయింది, దాని వెల 20వేల రూపాయలంటూ యండమూరి ఒక లాయర్‌ ద్వారా నోటీసు ఇప్పిస్తే దానికి ఆమె తగిన సమాధానం ఇచ్చిందనుకోండి. బహిరంగంగా ఒక రచన చేసినా, చరిత్ర అంటూ చెత్తను కుమ్మరించినా వాటి మీద వచ్చే విమర్శలను హుందాగా స్వీకరించాలి. ఆసక్తి వుంటే అర్దవంతమైన చర్చ జరపాలి.

2019 ఫిబ్రవరి 19వ తేదీన జాన్‌ పిల్గర్‌ అనే జర్నలిస్టు గ్లోబల్‌ రిసర్చ్‌ అనే పత్రికలో ‘అబద్దాల ప్రాతిపదికగా వెనిజులా మీద యుద్ధం'(ది వార్‌ ఆన్‌ వెనిజులా బిల్ట్‌ ఆన్‌ లైస్‌) అందువలన అంతర్జాతీయంగా సాగుతున్న ప్రచారానికి (బహుశా వాట్సాప్‌ పరిజ్ఞానం అయివుండవచ్చు) యండమూరి ప్రభావితులై నేను సైతం అన్నట్లుగా ఒక అబద్దాన్ని వండి వడ్డించారనుకోవాలి.

‘ ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో …. ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికి, బీద కుటుంబాలకూ నెలనెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. ‘ ఈ మాటలకు ముందు ‘తీరాల్లో సమృద్ధిగా ఆయిల్‌ వుంది, 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాసిన యండమూరి అలాంటి దేశంలో ఖాళీగా ఇంట్లో కూర్చొనే వారు, బీద కుటుంబాలు ఎందుకున్నాయో, దానికి కారకులు ఎవరో,అలాంటి బీదలకు సాయం చేస్తే తప్పేమిటో, ఆ దేశ సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోయిందో, అదెలా సమర్ధనీయమో చెబుతారా ? చరిత్ర అంటూ చెప్పేటపుడు దానికి వున్న అన్ని కోణాలను చెప్పకపోతే చెప్పేది చరిత్ర కాదు, చెత్త అవుతుంది. యండమూరి రాత చదివిన వారు అదేమిటో నిర్ణయించుకోవచ్చు.

‘దేశ ఐశ్యర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, వుద్యోస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. సింగిల్‌ పేరెంట్స్‌ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు ‘ అని యండమూరి తన అక్కసును వెళ్లగక్కారు. దేశ సంపదను అందరికీ గాక అద్వానీ, అంబానీల మాదిరి కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకే అప్పగించాలా? విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా సంపదలను విదేశాలకు తరలించి విదేశీ పెట్టుబడుల రూపంలో వాటినే తిరిగి తీసుకు వచ్చి లాభాల మీద లాభాలు ఆర్జిస్తున్నారు. వెనిజులా కార్మికులు, వుద్యోగులకు వేతనాలు పెంచితే అవి తిరిగి వెనిజులా ఆర్దిక వ్యవస్దలోకే తిరిగి వస్తాయి, వారేమీ డాలర్లుగా మార్చివిదేశాల్లో పెట్టుబడులుగా పెట్టేవారు కాదు. ఈ మాత్రం కూడా తెలియని మేథావి యండమూరి అనుకోలేము. ఇక సింగిల్‌ పేరెంట్స్‌ మహిళలకు అనూహ్యంగా కానుకలిచ్చాడట అంటూ తన అక్కసుసు వెళ్లగక్కారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా భర్తలు లేని ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కసారి పెన్షన్‌ కార్యాలయం దగ్గరకు వెళ్లి మీకెందుకు ఇవ్వాలని వారిని ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తుందో, ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటే మంచిది, చేయి తిరిగిన రచయిత కదా, కొత్త ఇతివృత్తం దొరుకుతుంది.

వెనిజులా గురించి పక్షపాతం అంటే తెలియని మీడియా సంస్ధగా కొందరు చెప్పే బిబిసి పదేండ్ల కాలంలో ఇచ్చిన 304 వార్తల గురించి వెస్ట్‌ ఇంగ్లండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చిందేమంటే వాటిలో మూడంటే మూడే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సానుకూల వార్తలు వున్నాయట. అక్కడి మానవహక్కుల చట్టం, ఆహార, ఆరోగ్య, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధన, మిలియన్ల మంది ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతుగా చేసిన ప్రదర్శన కనిపించలేదు. ఏమ్మా మదురో వ్యతిరేక ప్రతిపక్ష ప్రదర్శన వార్తను మాత్రమే ఇచ్చావేమిటి అని బిబిసి రిపోర్టర్‌ ఓర్లా గుయెరిన్‌ను అడిగితే ఒకే రోజు రెండు ప్రదర్శనల వార్తలను ఇవ్వటం ఎంతో కష్టం అని సమాధానమిచ్చింది.

ఏ వాస్తవం ఆధారంగా వెనెజులా మీద యుద్ధం ప్రకటించారో వార్త ఇవ్వటం కూడా ఎంతో కష్టం. ప్రధానంగా వాల్‌స్ట్రీట్‌ నేరపూరితమైన యంత్రాంగం కారణంగా 2014 నుంచి చమురు ధరలు కుప్పకూలటం గురించి నివేదించటం కూడా కష్టమే, అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త ఇవ్వటం కూడా చాలా కష్టం, రెండు బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతి చేసుకున్న ఔషధాలతో సహా 2017 నుంచి వాషింగ్టన్‌ ఆంక్షలు, వాటి వలన కనీసంగా ఆరు బిలియన్‌ డాలర్లు వెనిజులా నష్టపోయిందని వార్త రాయటం ఎంతో కష్టం, వెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. వాటిని కాదనే ధైర్యం యండమూరితో సహా ఎవరికైనా వుందా, ఇది చరిత్రలో భాగం కాదా అని సవినయంగా అడగాలి.

‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఛావెజ్‌ గురించి యండమూరికి ఏబిసిడిలు కూడా తెలియవు లేదా ముందే చెప్పినట్లు వాట్సాప్‌ పరిజ్ఞానంతో రాశారనుకోవాలి. 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధ(మన దగ్గర నక్సల్స్‌)ను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. తన అజెండాను అమలు జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, రాజ్యాంగ సవరణలు చేసిన ప్రజాస్వామిక వాదిగా ఆయన చరిత్రకెక్కారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. అక్కడ పదవీ కాలం ఆరేండ్లు, దాని మేరకు తరువాత ఎండమూరి చెప్పినట్లు 2008లో అసలు ఎన్నికలు జరగలేదు, 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. 2008లో బ్లాక్‌మార్కెటీర్లు ధరలను విపరీతంగా పెంచేసిన పూర్వరంగంలో ‘ యండమూరి చరిత్ర ‘లోని రొట్టెల మీదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నింటి మీద నియంత్రణలో భాగంగా ఆంక్షలు విధించాడు.నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

ఇక యండమూరి చరిత్ర పేరుతో రాసిన చెత్త అంతటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెద్దమనిషికి నేరాల రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలిసినట్లు లేదు. వెనిజులాలో ప్రతి లక్షమంది జనాభాకు ప్రతి ఏటా 20వేల మంది హత్యలకు గురి అవుతున్నారట. ఇంతకంటే అతి శయోక్తి లేదు ప్రపంచంలో అత్యధికంగా హత్యల రేటు వున్న దేశాల వరుసలో ముందున్న ఎల్‌సాల్వెడార్‌లో లక్షమందికి 82.84 మంది హతులవుతుండగా వెనిజులాలో 56.33 వుంది. లాటిన్‌ అమెరికా దేశాలన్నింటా, అనేక ఆఫ్రికా దేశాలలో ఇలాంటి పరిస్ధితికి కారణం నియంతలు, వారిని బలపరిచిన అమెరికా, సిఐఏ అన్నది జగమెరిగిన సత్యం. వెనిజులా రాజధాని కారకాస్‌ అంటే జంతుకళేబరం అని సెలవిచ్చారు. అక్కడ హత్యల రేటు 111.19 వుంది. ప్రధమ స్ధానంలో వున్న మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ జంటనగరాల్లో అది 111.33 వుంది. లాస్‌ కాబోస్‌ అంటే సురక్షితమైన రేవు అని అర్ధం. మరి అక్కడెందుకు జరుగుతున్నట్లు, అక్కడేమీ ఛావెజ్‌ లేదా వామపక్ష పాలన లేదే. అంతెందుకు సెయింట్‌ లూయీస్‌ పేరుతో వున్న అమెరికా నగరంలో హత్యల రేటు 65.83తో అమెరికాలో ప్రధమ స్ధానంలో వుంది. మరి పవిత్రమైన పేరు పెట్టుకున్న అక్కడెందుకు అన్ని హత్యలు జరుగుతున్నట్లు ? అందుకే చరిత్ర తెలియకపోతే చౌకబారు వ్యాఖ్యానాలు వస్తాయంటారు.

ఇక ఒళ్లమ్ముకొనే బాలికలనీ, సగం తాగిన సిగిరెట్ల కోసం వెంపర్లాడే పెద్దలనీ ఇలా ఏవేవో అతిశయోక్తులు రాశారు. వెనిజులా ఆర్ధిక ఇబ్బందులతో వున్న మాట నిజం, తనకు లంగలేదన్న కారణం, చమురు సంపదలను జాతీయం చేసిందన్న వుక్రోషం వంటి అనేక అంశాల కారణంగా అమెరికా కక్ష తీర్చుకుంటున్న దేశాలలో వెనిజులా మొదటి స్ధానంలో వుంది. అవి కొన్ని సామాజిక సమస్యలను సృష్టిస్తాయి. భూతల స్వర్గం అమెరికాలో ఒళ్లు అమ్ముకుంటున్నవారు, అడుక్కొనే వారు కూడా సూటూ బూటూ వేసుకొని అడుక్కొనే వారెందుకు వున్నట్లు, ధాయ్‌లాండ్‌ మంచి దేశమే కదా రాజధాని బ్యాంకాక్‌, ఇతర నగరాల్లో ఒళ్లమ్ముకొనే బాలికల కోసం ఎగబడి పోతున్న జనం గురించి యండమూరికి తెలియదా?

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.

సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. అలాంటి వారిలో యండమూరి ఒకరు. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం. చరిత్ర పేరుతో కుమ్మరించిన చెత్త విషయాలలో పేర్కొన్న అంశాలు అనేక దేశాలలో అంతెందుకు మన దేశంలో ఏ పట్టణంలో లేవు. రూపాయి కోసం హత్యలు చేసే వారు, కడుపు ఆకలి తీర్చితే మానం పోగొట్టుకొనేందుకు సిద్దపడే అభాగినులు ఇక్కడెందుకు వున్నట్లు ? సమసమాజం మంచిదే అంటూ జనానికి కాస్త వుపశమనం కలిగించే చర్యలను కూడా వ్యతిరేకించే వారు నిజంగా దాన్ని కోరుకుంటారంటే నమ్మేదెవరు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆరు పదాలపై ‘ ఆంక్షలు ‘ రవీంద్రుని మానవత్వంపై ‘అసహనం’

13 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amarthya sen, attack on journalists, Attack on media, ‘Argumentative Indian’, cbfc, cow politics, History, Intolerance, NCERT, Ravindranath Tagore, RSS, six words censor

సత్య

దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.

మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్‌, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆత్మకధ వుండకూడదు, మొఘల్‌ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్‌ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.

సుమన్‌ ఘోష్‌,                                 అమర్త్యసేన్‌                       పహ్లజ్‌ నిహ్లానీ

ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్‌ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ గురించి సుమన్‌ ఘోష్‌ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్‌ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్‌ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్‌ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్‌ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్‌ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్‌ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.

సెన్సార్‌ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.

ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్‌ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్‌ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్‌ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.

ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్‌ న్యాస్‌ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్‌ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.

మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్‌ జాతీయకార్యదర్శి అతుల్‌ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనిసకేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన కెజి సురేష్‌ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్‌ నోటీసు పంపుతామని న్యాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అందచేసినట్లు న్యాస్‌ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్‌ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్‌ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్‌ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.

తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్‌ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్‌ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్‌ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్‌ పేర్కొన్నది.

” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్‌ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్‌ సంస్ధ న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.

పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్‌ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్‌ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్‌ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్‌ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్‌ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్‌ వంటి వారు చివరికి బ్రిటీష్‌ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్‌ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్‌ న్యాస్‌ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్‌. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్‌ బాత్రా న్యాస్‌ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సరకార్యవాహక్‌ శ్రీ మోహన్‌ భగవత్‌ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్‌ నూతన అధిపతిగా అతుల్‌ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్‌ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్‌ జవదేకర్‌ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్‌ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్‌ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్‌ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్‌ అని దాడి చేస్తున్నారు)

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ న్యాస్‌ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్‌ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్‌ రాసిన ది హిందూస్‌ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్‌ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్‌ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.

పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం

1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్‌ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్‌ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్‌ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్‌) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.

తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్‌ ఛాన్సలర్‌,వర్కర్‌, మార్జిన్‌, బిజినెస్‌,బాక్‌బోన్‌, స్టాంజా, రాయల్‌ అకాడమీ, వుర్దు లేదా అరబిక్‌ భాషలోని బేటార్‌టిబ్‌, పోషక్‌, తాకత్‌, ఇలాకా, అక్సర్‌, ఇమాన్‌, జోకిహిమ్‌,మెహమాన్‌-నవాజీ, చమర్‌, సారే ఆమ్‌, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్‌, బద్మాష్‌, లుచ్చే-లఫంగే, బహంగియోన్‌ వున్నాయి.

తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్‌ దినకర్‌ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్‌ వాదించింది.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్‌ ఏ కుల్‌ విధానాన్ని అక్బర్‌ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్‌ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్‌ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్‌ పేర్కొన్నది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చంద్రబాబు : చరిత్రకు విరుద్దమైన సమాచారం

22 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Facts, History

ఎం కోటేశ్వరరావు

ఈనెల 20వ తేదీన విజయవాడలో ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు రచించిన’అమరావతి ప్రభువు -వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ అనే గ్రంధాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల గురించి ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డల గురించి చూద్దాం.

1.’గతంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఐటిలో అభివృద్ధి చేయగా నవ్యాంధ్రప్రదేశ్‌లో పోర్టుల(రేవుల) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఓడ రేవుల ఆధార ఆర్ధిక వ్యవస్ధగా రూపొందితే భవిష్మత్‌ వుజ్వల రీతిలో వుంటుందని వివరించారు.’

   కొంత మంది అంగీకరించినా అంగీకరించకపోయినా, అతిశయోక్తులు చెబుతారని అన్నా చంద్రబాబు నాయుడు అంటే ఐటి రంగ అభివృద్దికి మారుపేరుగా కీర్తి కండూతి దక్కింది. అంతకంటే ఎక్కువగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాయి కనుక విమర్శకులు అంగీకరించరు. దానివలన నష్టం లేదు వదిలేద్దాం. ఇప్పుడేం చేయాలన్నదే అసలు సమస్య. ఇజాలేమీ లేవు ఒక్క టూరిజం తప్ప అని ఒకసారి, ఐటి తప్ప చరిత్ర పాఠాలు చదవనవసరం లేదు అని ఒకసారి ఇలా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అధికార ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాలను ప్రవచించారు. గతంలో గ్రామాలలో హరికధలు, బుర్ర కధల వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేవారు భుక్తి కోసం ఏ వూరు వెళితే ఆ వూరును మీ వూరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతు గడ్డ అని చెప్పేవారు. కొంత మంది నిజమే కదా అనుకొనే వారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగం అభివృద్ధి పట్ల ఆ దిగ్గజాలకు ఆసక్తి లేదని ఆపిల్‌ సిఇవో టిమ్‌ కుక్‌ హైదరాబాదు పర్యటనలో చేసిన హడావుడి స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీ సిఇఓ వచ్చినా చంద్రబాబును కూడా తోటి సిఇఓగా పరిగణించి కలవకుండా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకనే ఐటి గురించి గాక రేవుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెబుతున్నారా ? ఇదే నిజమైతే ఇంజనీరింగ్‌ కళాశాలల పెట్టుబడిదారులు, ఏటా లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్న వారి పరిశ్రమలు ఏం కావాలి ?

  చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని చెప్పటానికి గతంలోనూ, ఇపుడు మరొకసారి రూపొందించిన విజన్‌ పత్రాలు సజీవ సాక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కలలు ఏమిటి అని ఎవరైనా భవిష్యత్‌లో పరిశోధన చేస్తే వారికి మంచి సమాచారంగా అవి వుపయోగపడతాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా వుంది. పరిశ్రమలు, సేవారంగం వంటివి అభివృద్ధి చెందకుండా యువతరానికి వుపాధి దొరకదు. ఇప్పటికే వున్న ఓడ రేవుల ద్వారా జరిగే అభివృద్ధి ఏదో జరిగింది. మన తూర్పు, పశ్చిమ తీరాలలో మన కంటే పెద్ద ఓడరేవులు ఇప్పటికే వున్నాయి. సింగపూర్‌ మాదిరి తయారు చేయటానికి మన భౌగోళిక పరిస్థితులు అనువుగా లేవు.

   పరిశ్రమలు పెట్టటానికి, వారికి పదేళ్ల పాటు పలు రాయితీలు ఇవ్వటానికి ఏపికి ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని తేలిపోయింది. అందువలన వారు మరొకదారి చూసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కుమ్మరించటానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, లోటుతో వున్నట్లు చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. అది ఇప్పట్లో పూడేది కాదన్నది వాస్తవం. పరిశ్రమలు లేకుండా రేవులను అభివృద్ధి చేసి ఏమి ఎగుమతి చేస్తారు. బొగ్గు దిగుమతులు చేసుకోవటానికి ఇప్పటికే కృష్ణపట్నం వంటివి వున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచీ చెబుతున్న భావనపాడు, నిజాంపట్నం చేపల రేవులు ఏమయ్యాయో తెలియదు. ఈ స్ధితిలో ఓడరేవుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి వున్న అవకాశాలేమిటో నిపుణులు చెప్పాలి.

2. తాను జపాన్‌లో పర్యటించినపుడు జపాన్‌లో బౌద్దాన్ని ఆచరించేవారు బుద్ధిజం అమరావతి నుంచే వచ్చిందని తమకు చెప్పారని, నాగార్జునుడి పేరు విన్నామని తెలిపారని చంద్రబాబు తెలిపారు.

3.లండన్‌లో పర్యటించినపుడు లండన్‌ మ్యూజియాన్ని సందర్శించానని అక్కడ రెండే రెండు గ్యాలరీలు వున్నాయని ఒకటి గ్రీసు గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ అని మ్యూజియం అధికారులు వివరించారని చెప్పారు. అమరావతి గ్యాలరీ అని ఎందుకు నామకరణం చేశారని తాను ప్రశ్నించానని, ప్రపంచంలో అమరావతి వుత్కృష్టమైనదిగా వారు తనకు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

    ఈ రెండూ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఈ మధ్య సౌదీ అరేబియాలో అక్కడి యువతులు భారత మాతాకీ జై అని నినాదాలు చేస్తున్న వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో కొందరు పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేశారు. వారు మాత భక్తులని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఆయనకు పలికిన ఆహ్వానంలో అదొక భాగం. దీన్ని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా విదేశీ అతిధులు వచ్చినపుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారి మనసెరిగి ఇష్టమైన కార్యక్రమాలు రూపొందించటం, వంటకాలు వడ్డించటం అంతర్జాతీయ దౌత్యం మొదలైప్పటి నుంచి జరుగుతున్నదే. దానిలో భాగంగానే మోడీని వబ్బేయటానికి భారత మాతాకు జై అనిపించారు సౌదీవారు. అక్కడి ముస్లింలే జై అంటే ఇక్కడి వారు ఎందుకు అనరనే వాదనలో భాగంగా ఆ వీడియోను హిందుత్వ భక్తులు వినియోగించుకున్నారు.

    జపాన్‌, లండన్‌ పర్యటనలో చంద్రబాబు నాయుడికి కూడా అదే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడి పుణ్యమా అంటూ ఇప్పుడు చరిత్ర పాఠాలు చదివేవారు లేకుండా పోయారు. ఒక వేళ హైస్కూలు స్ధాయిలో కాస్తో కూస్తో చదివినా అదెవరికీ గుర్తుండటం లేదు. అయినా చరిత్ర చరిత్రే. దాన్నెవరూ చెరిపి వేయలేరు.

   జపాన్‌కు అమరావతి నుంచి బుద్ధిజం వెళ్లిందని ఏ చరిత్ర చెప్పలేదు. చైనీయుల నుంచి కొరియా అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.జపనీయులు అలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న.

   రెండవది లండన్‌ మ్యూజియంలో వున్న గ్యాలరీల గురించి ఇంటర్నెట్‌లో ఎన్నిసార్లు వెతికినా అమరావతి, గ్రీసు గ్యాలరీల పేరే మనకు కనపడదు, మిగతా గ్యాలరీల గురించి మాత్రమే మనకు దొరుకుతోంది. అక్కడి అధికారులు కూడా చంద్రబాబును తప్పుదారి పట్టించారా ?

   రాజకీయ నేతలు అనేక అంశాలను చెబుతుంటారు, వాటిని అధికారిక ప్రకటనలలో చేర్చినపుడు అధికారయంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడి వంటి వారు ఇబ్బందులలో పడతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం తొమ్మిదవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు.

మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిజం గురించి ఫేస్‌బుక్‌లో ఇంత వివరణ అవసరమా అని ప్రశ్నించిన వారు కొందరు, వెనుక పట్టు పట్టింది కనుకనే సంజాయిషీలా వుందని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమైనా అనుకోవటానికి వారికి వున్న స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. చరిత్రను సంజాయిషీగా సమాజం భావించలేదు కనుకనే మనకు తరతరాల చరిత్ర లభ్యమౌతోంది. చరిత్ర లేకపోతే భవిష్యత్తే వుండదు. ఎన్నో రాజరికాలు వచ్చాయి, పోయాయి. రాజులు వచ్చారు పోయారు, ఎన్నో పార్టీలు పుట్టాయి గిట్టాయి. అనేక దేశాలలో ఆయా దశలలో ప్రముఖ పాత్ర పోషించి దీర్ఘకాలం పాటు అధికారంలో వున్న పార్టీలు నేడు మన దేశంలో కాంగ్రెస్‌ మాదిరి దిగజారి పోయి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి.
సారవంతమైన భూమిని సరిగా దున్ని నిర్వహించకపోతే బిజెపి వంటి మెజారిటీ, మజ్లిస్‌ వంటి మైనారిటీ పిచ్చి మొక్కలు పుట్టి పెరిగి పెద్దవౌతాయి.వేల సంవత్సరాల మానవ జాతి నాగరిక చరిత్రలో జరిగిన ప్రతి పెద్ద మార్పూ సమాజం మరింత ముందుకు పోయేందుకే తోడ్పడిరది . చరిత్రను, పరిణామాలను వెనక్కు మళ్లించాలని విఫలయత్నం చేసిన శక్తులు తాత్కాలికంగా కొంతకాలం తమ ప్రాభవాన్ని కొనసాగించవచ్చు తప్ప చివరకు చెత్తబుట్టలోకి నెట్టిన చరిత్రే మనకు కనిపిస్తుంది. అందువలన సమాజం ముందుకు పోయేందుకు మన కృషి మనం చేస్తున్నామా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ బ్రిటీష్‌ వారి అణచివేతల మధ్యే పుట్టి పెరిగింది.అందుకే ముందుగా చెప్పుకున్నట్లు 1920 నాటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ నగరంలో కేవలం ఏడుగురితోనే ఏర్పడిరది. దాని మొదటి కార్యదర్శి మహమ్మద్‌ షఫీక్‌. కమ్యూనిస్టులు ప్రవాసంలో, మన దేశంలో మారు పేర్లతో వేరే పార్టీలలో పని చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పేరుతో బహిరంగంగా పనిచేసే అవకాశం లేదు. వివిధ గ్రూపులుగా, సంస్థలుగా పని చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు వుద్యమంలోని ధోరణులతో కొన్ని సార్లు, మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు. ఒక విజయం వెనుక ఎన్నో ఎగుడుదిగుడులు వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. విమానాన్ని కనిపెట్టింది ఎవరంటే వెంటనే చెప్పే సమాధానం రైట్‌ బ్రదర్స్‌ అని తెలిసిందే. వారికంటే ముందే ఎందరో చేసిన ప్రయోగాలు చివరికి వారికి అంతిమ విజయ దక్కేలా చేశాయి.ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ ఆద్యుడిగా బ్రిటన్‌కు చెందిన జార్జి కేలేను పేర్కొంటారు. ఆయన 1773లో పుట్టి 1799 నాటికే ప్రాధమిక విమానానికి రూపకల్పన చేశాడు. అంతకు ముందు, ఆ తరువాత కూడా ఎందరో ఎన్నింటినో అభివృద్ది చేశారు. అంతిమంగా రైట్‌ బ్రదర్శ్‌ 1903లో అంతకు ముందే ఎందరి కృషి ఫలితంగానో రూపొందిన విమానం ఎగరటానికి కీలకమైన ఏరోడైనమిక్‌ కంట్రోల్‌ను తాము కనుగొన్నట్లు వారు పేటెంట్‌ పొందారు. అది విమాన చరిత్రలో పెనుమార్పు తెచ్చింది. అందుకే వారికి విమానాన్ని కనుగొన్నారన్న ఖ్యాతి దక్కింది.
అలాగే మార్క్సిజం`లెనినిజం అనే ఒక శాస్త్రీయ తత్వశాస్త్రాన్ని విజయవంతంగా ఆయా దేశాలకు వర్తింపచేసి అమలు జరపటానికి అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రయోగం అంటేనే విజయాలు`అపజయాలు కలగలసి వుంటాయి.యుద్ధంలో అంతిమ విజయం సాధించామంటే అర్ధం అసలు యుద్ద రంగంలో అపజయాలు లేవని కాదు. భారత కమ్యూనిస్టు వుద్యమాన్ని కూడా అలాగే చూడాలి. కమ్యూనిస్టులు తప్పు చేసినా జనం వారి చిత్త శుద్ధిని శంకించకపోవటానికి అవి వ్యక్తిగతమైనవి కాదు, అవగాహన లోపాలు మాత్రమే.
ఒక సమగ్ర పార్టీగా రూపొందకుండా బ్రిటీష్‌ పాలకులు అడుగడుగునా అడ్డుకోవటం, ఎదురైన సమస్యలపై అభిప్రాయ బేధాలు, వాటిపై ఏకాభిప్రాయం, కొత్త సమస్యలు, కొత్త విబేధాలు ఇలా సాగిన ప్రస్తానంలో పార్టీ ప్రాధమిక రూపం ఏర్పడిన 23 సంవత్సరాల తరువాత గానీ 1943లో ప్రధమ మహాసభ జరుపుకోలేక పోయింది.ఆ సమయంలో పార్టీ సభ్యుల సంఖ్య కేవలం 15,563 మాత్రమే. అంతకు ముందు పెషావర్‌, కాన్పూరు, మీరట్‌ కుట్ర కేసులు కమ్యూనిస్టులను రాటుదేల్చాయి. మొదటి మహాసభ తరువాత రెండవ ప్రపంచ యుద్దం, కొత్త సమస్యలు. తొలి దశలో బ్రిటీష్‌ వారిని వ్యతిరేకించినప్పటికీ ఎపుడైతే సోవియట్‌ యూనియన్‌ హిట్లర్‌తో తలపడిరదో సోవియట్‌ను కాపాడుకోవటం ప్రపంచ కమ్యూనిస్టుల కర్తవ్యంగా భావించిన భారత కమూనిస్టులు దానిని ప్రజాయుద్దంగా పరిగణించారు, దానిలో బ్రిటన్‌ ప్రభుత్వం సోవియట్‌కు బాసటగా వుంది కనుక క్విట్‌ ఇండియా వుద్యమాన్ని వ్యతిరేకించారు. ఆ వైఖరి తప్పని తరువాత పార్టీయే స్వయంగా అంగీకరించింది.
ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎన్నిసార్లు బ్రిటీష్‌ వారితో రాజీపడలేదు, ఎన్నిసార్లు ప్రజావుద్యమాన్ని నీరు గార్చిందో చరిత్రలో నమోదయ్యే వుంది. కానీ ఆ నాయకత్వం తన తప్పిదాలను అంగీకరించిన నిజాయితీ మనకు కనపడదు. మన శతృవుకు శతృవు మనకు మిత్రుడనే అవగాహనతో మన స్వాతంత్య్రం కోసం సుభాస్‌ చంద్రబోస్‌ ప్రపంచ ప్రజల శతృవైన జర్మనీ సాయం కోరిన విషయం కూడా చరిత్రలో వుంది.ఆ చర్యను కమ్యూనిస్టులు విమర్శించారు తప్ప ఆయన చిత్తశుద్దిని శంకించలేదు. అలాగే కమ్యూనిస్టు క్విట్‌ ఇండియా వుద్యమం పట్ల పొరపాటు వైఖరి తీసుకున్నప్పటికీ అనేక చోట్ల సాగించిన పోరాటాలు కూడా ఆ కాలంలోనే జరిగాయి. అందుకే జనం కూడా కమ్యూనిస్టుల చిత్తశుద్దిని శంకించలేదు. వారి పిలుపు మేరకు లక్షలాది మంది కదలి వచ్చారు. అసమాన త్యాగాలు చేశారు. అందుకే తొలి పార్లమెంట్‌లో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికయ్యారు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఎనిమిదవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం.

లాటిన్‌ అమెరికాలోని ఎల్ సాల్వడార్ లో 2009 నుంచి అధికారంలో వున్న కమ్యూనిస్టులతో కూడిన వామపక్ష ఫరబిందో మార్టి నేషనల్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎంఎల్‌ఎన్‌) ఏర్పడిన 35 సంవత్సరాల తరువాత తొలిసారిగా జాతీయ మహాసభను ఈ నెలాఖరులో జరుపుకోనుంది. కమ్యూనిస్టుల పయనం ఎలాంటి ఆటంకాలు లేని రహదారి మీద లేదా నల్లేరు మీద బండిలా సాగదని చెప్పేందుకే ఈ వుదాహరణ. కమ్యూనిజానికి దగ్గరదారులు లేవు. వుంటే ఈ పాటికి ఎప్పుడో అన్ని దేశాలలో వచ్చి వుండేది. జనాన్ని మోసం చేయటానికి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లుగా కేవలం అధికారం కోసమే జనాకర్షక నినాదాలు ఇవ్వటం కమ్యూనిస్టుల విధానం కాదు. కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం. తొలి దశ పెట్టుబడిదారీ విధాన ఎత్తుగడలు, రూపానికి, వర్తమాన ఎత్తుగడలు, రూపానికి ఎంతో తేడా వుంది. కమ్యూస్టులలో కూడా అందుకు అనుగుణంగా మార్పు రాకుండా దాన్ని నాశనం చేయటం ఎలా సాధ్యం ?

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్‌సాల్వెడార్‌లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్‌సాల్వెడార్‌ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు.

ఈ పూర్వరంగంలోనే భారత్‌లోని వివిధ వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు నవీకరణ చెందటం అవసరం. ఎవరికి వారు తమ వైఖరే సరైనదనే పట్టుదలకు పోయినట్లయితే ఎల్ సాల్వడార్ వంటి చోట్ల అపూర్వ ఐక్యత సాధ్యమయ్యేది కాదు, ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు ? లాటిన్‌ అమెరికాలో విప్లవ సాధనపై అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఆ కారణంగానే ఎవరికి వారు తమ పద్దతుల్లో కార్యకలాపాలు సాగించారు. అనేక అనుభవాల తరువాత ఎల్‌సాల్వెడార్‌లో వున్న పరిస్ధితులలో 1980లో ఐదు విప్లవ పార్టీలు ఎవరి రాజకీయ అవగాహనకు వారు కట్టుబడి వుంటూనే వుమ్మడి శత్రువును దెబ్బతీసేందుకు ఒకే నాయకత్వం, ఒకే గెరిల్లా వ్యూహం, ఒకే దళంగా వుండాలన్న స్ధూల ఏకాభిప్రాయానికి వచ్చారు. అ క్రమంలో ఆ సంస్ధలు ఐక్య కార్యక్రమానికి కట్టుబడి వుంటూనే తమ సంస్ధల భిన్న రాజకీయ విధానాలను కూడా సమీక్షించుకున్నాయి. పదమూడు సంవత్సరాల గెరిల్లా పోరాటం తరువాత 1992లో అక్కడి ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలకు వచ్చారు. ఆ తరువాత బహిరంగంగా పనిచేసే ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ఎన్నికలలో పాల్గొన్నది. చివరకు 2009లో వామపక్ష అభిమాని అయిన ఒక జర్నలిస్టును అధ్యక్షపదవికి నిలిపి విజయం సాధించింది. ఐదు సంవత్సరాల తరువాత గతేడాది జరిగిన ఎన్నికలలో స్వయంగా తన అభ్యర్ధిని నిలిపి విజయం సాధించింది. ఒక వామపక్ష పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు జాతీయ సభను జరపకుండా ఐక్యతను కొనసాగించటం కమ్యూనిస్టులందరూ తీసుకోవలసిన పాఠం. దోపిడీ నుంచి సాల్వెడారియన్లును విముక్తి చేయాలన్న మహత్తర లక్ష్యమే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారిని ఐక్యంగా వుంచింది. మొత్తంగా ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో ఆ ఐక్యత మరింత పరిణితి చెందిందనటానికిది ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి.
భారత కమ్యూనిస్టు వుద్యమంలో చీలికలు ఎందుకు అని ఆవేదన చెందే వారు ఎల్‌సాల్వెడార్‌ వంటి దేశాల అనుభవాలను తీసుకోవాల్సి వుంది. అంతే తప్ప కమ్యూనిస్టులు చీలిపోయారు కనుక భవిష్యత్‌ లేదని నిరాశకు లోనుకావాల్సిన అవసరం లేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో జర్మనీ, జపాన్‌ సామ్రాజ్యవాదులకు తగిలిన ఎదురు దెబ్బలు సామాన్యమైనవా ?అయినా ఆ దేశాలు అస్త్రసన్యాసం చేశాయా ? లేదే , తమకు పోటీగా వచ్చిన అమెరికాను ఎదుర్కొనేందుకు తమదైన పద్దతుల్లో ప్రయత్నిస్తున్నాయా లేదా ? కమ్యూనిస్టులు మాత్రం అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు ?ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్‌సాల్వెడార్‌లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్‌సాల్వెడార్‌ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు. కాల క్రమంలో ఐక్యపార్టీగా అవతరించవచ్చు. ఐక్యతకు తొందర పడే వారు నేపాల్‌ పరిణామాలను విస్మరించకూడదు. కమ్యూనిస్టుల మధ్య ఐక్యత అనేది ఒక కార్యక్రమ ప్రాతిపదికగా మాత్రమే సాధ్యమౌతుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సమయంలోనే దేశాన్ని బ్రిటీష్‌ వారి నుంచి ఎలా విముక్తి చేయాలనే అంశంలో నాయకుల మధ్య భిన్న అభిప్రాయాలు వున్నాయి. ఆ మాటకు వస్తే అది ఒక్క కమ్యూనిస్టులకే పరిమితం కాలేదు. కాంగ్రెస్‌లోనూ తలెత్తాయి. సుభాష్‌ చంద్రబోస్‌ తీసుకున్న భిన్నవైఖరి, మార్గం గురించి వేరే చెప్పనవసరం లేదు. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన కాషాయ దళ పెద్దల గురించి చెప్పుకోనవసరం లేదు. అందుకే నేటి బిజెపి లేదా అంతకంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ులో గానీ జాతీయ వుద్యమంలో పాల్గొన్నవారెవరూ మనకు కనిపించరు. కమ్యూనిస్టులు తమకు ప్రమాదకారులుగా కనిపించారు గనుక ఆంగ్లేయులు వారిని మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారని ఇంతకు ముందే చెప్పుకున్నాము. వాస్తవానికి 1920 దశకంలో కమ్యూనిస్టుల కార్యకలాపాల కంటే వారి గురించి బ్రిటీష్‌ పాలకులు పడిన భయమే అధికారిక నివేదికల్లో ఎక్కువగా వుందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌ నాయకుడు బిపిన్‌ చంద్రపాల్‌ ‘వైష్ణవులు బృందావనానికి పోయివచ్చినట్లే బోల్షివిక్‌ు ఇండియాకు వస్తున్నారని’ రాశారంటే నాటి పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. తొలి మూడు కేసులలో ఎక్కువ సంఖ్యలో అరెస్టు, శిక్షలువేశారు. మరో రెండు కేసులను పరిమితంగా ఒకరిద్దరిపై బనాయించారు. మొత్తం ఐదు పెషావర్‌ కుట్ర కేసులు 1927 వరకూ నడిచాయి. నిజానికి వారిపై ఎలాంటి కుట్ర రుజువు కాలేదు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఏడవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

 

దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్‌ వాది మౌలానా హజరత్‌ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్‌ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?

ఎవరు దేని గురించైనా ఎవరినైనా ప్రశ్నించటంలో తప్పు లేదు. అసలు దేన్నయినా ప్రశ్నించే లక్షణం అలవరుచుకోవాలి.ఎవరు ,ఏమిటి, ఎందుకు,ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు మానవజాతి పరిణామాలను మలుపు తిప్పుతున్నాయి. వాటిలోంచి పుట్టిందే కమ్యూనిస్టు తత్వశాస్త్రం.ప్రశ్నించేవారు రెండు రకాలు. ఒకటి ఆసక్తితో సానుకూల దృక్పధంతో, రెండవది అడ్డుసవాళ్లకోసం వ్యతిరేక వైఖరితో వుంటారు. అందువలన ఈ దేశానికి కమ్యూనిస్టులు చేసిందేమిటని కొందరు ప్రశ్నించటాన్ని ఆహ్వానించాలి.
తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తరువాత కమ్యూనిస్టు మిలిటరీ పాఠ శాల ఏర్పాటు చేసినట్లు రాశారేమిటని కొందరు మితృలు అడిగారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక వలస దేశాలో సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్య్ర, స్వరాజ్య భావాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు పురుడు పోసుకున్నాయి. అనేక మంది విప్లవకారులు, దేశ భక్తులు తిరుగుబాటు,ప్రవాసాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, సైనిక శిక్షణ తీసుకున్నారు. గదర్‌ పార్టీ అలాంటి వాటిలో ఒకటి. ఈ పూర్వరంగంలో ఆ నాడు రాజకీయ శిక్షణ అంటే మిలిటరీ అంశాలు కూడా కొన్ని సందర్బాలులో కలగలసి వుండేవి.ఈ పూర్వరంగంలోనే బ్రిటీష్‌ సర్కార్‌ భారత్‌లో విప్లవకారుల పట్ల మరింత కఠిన వైఖరి అనుసరించింది. అదే సమయంలో తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు వేరే విధంగా వుంటాయని భయపడింది. ప్రపంచ యుద్దం పూర్తిగా ముగియక ముందే మన దేశ వైస్రాయ్‌గా వున్న చెమ్స్‌ఫర్డ్‌ కొన్ని సంస్కరణలు తప్పని సరి అని నివేదిక పంపాడు. దాని పర్యవసానమే భారత్‌లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ, ఇఎస్‌ మాంటేగ్‌ను భారత ప్రభుత్వ కార్యదర్శిగా బ్రిటీష్‌ సర్కార్‌ నియమించి కొన్ని చర్యలను ప్రకటించింది. వాటినే మాంటేగ్‌_`చెమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలని పిలిచారు. ఇవి పరిమితమే అయినప్పటికీ విప్లవకారులవైపు జనం మొగ్గకుండా చూసే ఎత్తుగడ కూడా అంతర్గతంగా వుంది. నాటి విప్లవకారులే అనేక మంది తరువాత కాలంలో కమ్యూనిస్టులుగా మారారు కనుక పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్టు సాధించిన ఒక విజయం అని ఎందుకు చెప్పుకోకూడదు ?
పాలనా సంస్కరణలతో కొందరు మంత్రుల వంటి పదవులు పొందితే కమ్యూనిస్టులు మాత్రం జైలు పాలయ్యారు. ఈ సంస్కరణలతో పాటు బ్రిటీష్‌ సర్కార్‌ తన న్యాయమూర్తి రౌలట్‌ ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించింది. విప్లవోద్యమంతో సంబంధాలున్న నేరపూరిత కుట్ర స్వభావాన్ని విస్తృత పరచేందుకూ, విప్లవోద్యమాన్ని అణచేందుకు అవసరమైన చర్యలను కూడా సూచించాలని రౌలట్‌ కమిటీకి అప్పగించారు. ఆ మేరకు రౌలట్‌ చట్టం 1919 మార్చి 18 అమలులోకి వచ్చింది. దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. దానికి తలెత్తిన నిరసన అణచివేతలో భాగంగానే 1919 ఏప్రిల్‌ 13 నాటి జలియన్‌ వాలా బాగ్‌ వూచకోత.
మన స్వాతంత్య్ర వుద్యమంలో లాల్‌, బాల్‌, పాల్‌ త్రయంగా పిలిచే వారిలో ఒకరైన బిపిన్‌ చంద్రపాల్‌ 1920 మార్చి 6న చేసిన ఒక ప్రసంగం గురించి బ్రిటీష్‌ పోలీసు నివేదిక ఇలా వర్ణించింది.‘ఆయన ప్రసంగం మొత్తం పెద్దగా దాపరికం లేని బోల్షివిజం(కమ్యూనిజం) అని వర్ణించవచ్చు’ అని పేర్కొన్నది. భారత జాతీయ కాంగ్రెస్‌ 36వ మహాసభ 1921లో అహమ్మదాబాదులో జరిగింది. భారత కమ్యూనిస్టుల తరఫున ఎంఎన్‌ రాయ్‌, అబనీ ముఖర్జీ సంతకాలు చేసిన ఒక ప్రణాళికను ప్రతినిధులకు పంపిణీ చేశారు. బ్రిటీష్‌ వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని కాంగ్రెస్‌ నూతన కార్యాచరణ మార్గం చేపట్టాలని అందులో కోరారు.దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్‌ వాది మౌలానా హజరత్‌ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్‌ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?

ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు

ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ పాలకులు మన దేశంలో 1920 దశకంలోనే నూతన భావాలు,పరిణామాలను ప్రతిబింబించిన పత్రికలను కొన్నింటిని నిషేధించారు. దాంతో అనేక కొత్త పేర్లతో కమ్యూనిస్టులు వాటిని ప్రచురించి తమ భావాలను ప్రచారం చేశారు.
ఈ పూర్వరంగంలోనే మూడు పెషావర్‌ కుట్ర కేసులను బనాయించారు. ఇవి తొలి కమ్యూనిస్టు కుట్ర కేసులు. మాస్కో, తాష్కెంట్‌ల నుంచి 1921 జూన్‌ మూడున పెషావర్‌ చేరిన తొలి మొహజిర్‌ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అలా 1922,23 సంవత్సరాలలో మరో రెండు కేసులు బనాయించి విప్లవకారులకు శిక్షలు వేశారు. ఎంఎన్‌రాయ్‌,బోల్షివిక్‌లు ఆమోదించిన కమ్యూనిజానికి దూతలుగా పని చేసినందుకే శిక్షించబడ్డారని విచారణ తతంగం జరిపిన సెషన్స్‌ జడ్జి వ్యాఖ్యానించారు. తొలి రోజుల్లోనే ఇంతటి త్యాగాలు చేసిన వారిని భారత కమ్యూనిస్టులు నిజమైన వారు కాదని అనటానికి కొందరికి నోరెలా వస్తుంది? అలాంటి వారు తప్పుదారి పట్టిన వారా లేక కమ్యూనిస్టు వ్యతిరేకులా ?
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఆరవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ 3 Comments

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్‌ నుంచి

ఆ  పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.

కొంత మంది కమ్యూనిజం భారత దేశానికి సంబంధించింది కాదు, విదేశీ సిద్దాంతం, ఇక్కడి అసలు సమస్యలను అది పట్టించుకోదు, కమ్యూనిజం మంచిదే కానీ, భారత కమ్యూనిస్టులు మంచి వారు కాదు ఇలాంటి ఆరోపణలతో ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఏకకణ జీవి నుంచి వానరుడు నరుడుగా మారిన పరిణామ క్రమంలో అనేక జీవులు వివిధ దశలలో స్ధిరపడిపోయాయి. ఇక అంతకు మించి ఎదగవు. వాటికి భిన్నంగా మానవుడిలోనే మెదడు అభివృద్ది చెంది వున్నత జీవిగా పరిణామం చెందాడని, ఆమెదడు నిరంతరం మరింత పదును తేలుతుందోని తెలిసిందే. కమ్యూనిస్టు వ్యతిరేకులు బుర్రలు కూడా కొన్ని జీవుల మాదిరి ఒకే దగ్గర ఆగిపోయినట్లుగా వుంది.
వుష్ట్ర పక్షి తనకు ముప్పు వచ్చిందనుకున్నపుడు తలను వాల్చి ఇతర జంతువులను మభ్యపెట్టి తప్పించుకుంటుంది(భూమిలో తలదూరుస్తుంది అని కొంత మంది చెప్పారు). అంటే ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోదు. అలాగే కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్‌ నుంచి ఆ పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.

బ్రిటీష్‌, ఫ్రెంచి, పోర్చుగీస్‌, డచ్‌ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్‌ు, టెలిఫోన్‌ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్‌లెస్‌ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్‌, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్‌ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.

యూరోపియన్లకు బట్టలు కట్టుకోవటం కూడా తెలియని రోజుల్లో మన ఎంతో నాగరికులుం అని చెప్పుకుంటాం. పోలిక ఎందుకు ? అలాగే మన నుంచి మిగతా ప్రపంచం నాగరికత, విజ్ఞానం నేర్చుకుంది అని గర్వం ప్రదర్శిస్తాం. అంటే మన దాన్ని ఇతర దేశీయులు కాపీ కొట్టటం లేదా అనుకరించినట్లే కదా ! ఎందుకంటే మనది అంత గొప్ప అని రొమ్ము విరుచుకుంటాం.అలాంటపుడు మనం ఇతరుల నుంచి స్వీకరిస్తే తప్పేముంది? ప్రపంచ చరిత్రలో ఎన్ని అలా జరగలేదు ?
భావప్రకటనా స్వేచ్ఛ వుంది కాబట్టి కొంత మంది అన్నీ వేదాల్లోనే వున్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకుంటారు. అలా చెప్పి మా మనోభావాలను దెబ్బతీశారని హేతువాదులు దాడులు చేయనవసరం లేదు. వేద విజ్ఞానవేత్తలుగా చెప్పుకుంటున్నవారు చెప్పే దానిని వాదన కోసం అంగీకరించినా ఐరోపాలో పారిశ్రామిక విప్లవం సంభవిస్తున్నా మన వారు వేదాల గుట్టు విప్పి ఇక్కడ ఆధునిక టెక్నాలజీని ప్రవేశ పెట్ట లేదు. సముద్రగుప్తుడు, మౌర్యుల కాలంలోనే మన వారు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి వ్యాపారం చేశారని చంకలు చరుచుకుంటాం. అదే సమయంలో సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లిన వారు ప్రాయచిత్తం లేకుండా గుంపులో కలవటానికి వీల్లేదని ఆంక్షలు విధించుకుంటాం. ఇప్పటికీ ఆంక్షలు అలానే వున్నాయి. అవకాశవాదం, ఆత్మవంచనతో అవసరాల కొద్దీ వాటికి మినహాయింపు ఇస్తున్నారు తప్ప వారు నమ్మినదానిని కూడా వారు పాటించటం లేదు. వాటి పర్యవసానంగానే కొంబస్‌లు, మార్కోపోలోలు వునికిలోకి వచ్చారు. బ్రిటీష్‌, ఫ్రెంచి, పోర్చుగీస్‌, డచ్‌ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్‌ు, టెలిఫోన్‌ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్‌లెస్‌ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్‌, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్‌ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.
ఆర్ధిక రంగంలో విదేశీ పెట్టుబడులు, పరిజ్ఞానం కావాలి, విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకొమ్మంటూ ప్రత్యేక విమానాలు వేసుకు తిరిగే ముఖ్యమంత్రు, ప్రధాని గురించి తెలిసిందే. చివరకు నిత్యం స్వదేశీ గురించి జపం చేసే నరేంద్ర మోడీ స్వదేశంలో తక్కువ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారనే విమర్శ గురించి చెప్పనవసరం లేదు. మన ఆర్‌బిఐ గవర్నర్‌ రాజన్‌, సలహదారులందరూ విదేశాలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లలో శిక్షణ పొంది వచ్చేవారే. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు ఆత్మవంచన తప్ప వాటికి లేని విదేశీ , పరాయి అభ్యంతరం ఒక్క కమ్యూనిస్టు సిద్ధాంతానికే ఎందుకు ? మనం పెట్టుబడిదారీ విధానాన్ని విదేశాల నుంచి కాపీ చేయవచ్చు, దాని దోపిడీని వ్యతిరేకిస్తూ ముందుకు వచ్చిన కమ్యూనిస్టు సిద్దాంతం మాత్రం వద్దని చెప్పటం ఎవరి ప్రయోజనాల కోసం ? సామాన్యుల కోసమైతే కాదు కదా !
కమ్యూనిస్టు సిద్దాంతం మంచిదే కాని ఇక్కడి కమ్యూనిస్టులే సరైన వారు కాదు అని ఒక ముక్తాయింపు.అలా చెప్పేవారు ముందుకు వచ్చి మంచిగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎందుకు అమలు జరపరు ? కమ్యూనిస్టులలో వున్న మంచి, చెడులను చర్చించండి, చెడు వుంటే సరిదిద్దేందుకు, కాకపోతే తప్పని సరి అయితే బయటకు పంపేందుకు ప్రయత్నించండి.
కమ్యూనిస్టుపార్టీలో తప్పులు, పొరపాట్లు, పార్టీని వుపయోగించుకొని తప్పుడు పనులు చేయని వారు లేరు అని ఎవరూ చెప్పరు. వివిధ ప్రభావాలతో వచ్చిన వారిలో బలహీనతలు చోటుచేసుకోవచ్చు. వాటిని కమ్యూనిస్టు పార్టీ బలపరిస్తే తప్పు. వుద్యమంలో వుండి అలాంటి వారిని పక్కన పెట్టేందుకు ప్రయత్నించకుండా బయట వుండి ఎక్కడో ఒకరో అరా తప్పు చేసిన కమ్యూనిస్టులను చూపి అందరూ ఇంతే అని రాళ్లు వేయటం కమ్యూనిజాన్ని కోరుకుంటున్న వారు చేయాల్సిన పని కాదు. కమ్యూనిస్టులు కులాలను వదిలించుకోలేదు అని అడ్డు సవాళ్లు విసురుతారు. పోనీ వదిలించుకున్నవారిని గుర్తించి వారి మార్గాన నడుస్తున్నారా అంటే అలాంటి వాళ్లంతా సవాళ్లకే పరిమితం. ఇది చివరకు పిచ్చి కుదిరితేనే పెళ్లి కాదు పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది అనే స్ధాయికి పోయి ఆగిపోతుంది. అసలు అలా ప్రశ్నించేవారు ఎంత మంది ముందు కులం నుంచి బయటపడ్డారు? పోగొట్టుకోవాల్సిన అంశాలు ఒక్క కమ్యూనిస్టులకేనా, ఇతర జనాలకు లేవా ? చాలా వున్నాయి. అవన్నీ త్లెలువారేసరికి వచ్చినవి కాదు. త్లెవారేసరికి పోయేవి కాదు. క్రమంగా అంతరించాల్సినవి. ఈ మాట అంటే కొందరు ఎంతకాలం అని ప్రశ్నిస్తారు.కుల నిర్మూలన అజెండాకే పరిమితమై పని చేస్తున్న అనేక సంఘాలు వున్నాయి. వారు సరైంది అనుకున్నది వారు చేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి.అలాగాక ఎంత కాలంలో మీరు కుల నిర్మూలన చేస్తారో చెప్పండి, ఎంత మందిని కులం లేని వారుగా మార్చారో రుజువు చూపండి అంటే ఎలా వుంటుంది.వివక్ష, దోపిడీలను వ్యతిరేకించేవారి దాయి వేరు కావచ్చు. ఏది ముందు ఏది వెనుక అని దెబ్బలాడుకోనవసరం లేదు.ఎవరి ఎజండాను వారు వుంచుకొని పరస్పరం సహకరించుకొని పని చేయవచ్చు. పిల్లి న్లల్లదా త్లెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ప్రధానం.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఐదవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

రెండువేల సంవత్సరాల నాడు చార్వాకుల గ్రంధాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు నాటి పాలకులు వాటిని నాశనం చేయగలిగారు గాని నేడు కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకులు అలా నాశనం చేయగలరా ?చేయలేరు గనుకనే వక్రీకరించి భవిష్యత్‌ తరాల మెదళ్లను చెడగొట్టాలని చూస్తున్నారు.నేటి యువతరం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని, మంచి చెడ్డలను సులభంగానే గ్రహించగలరని వారు ఊహించలేరు.

కమ్యూనిజం తగ్గిపోతున్నది కనుక ఫేస్‌బుక్‌లో దానిని గురించి పోస్టులు(రాయవద్దని) పెట్టవద్దని ఒకరు సలహా ఇచ్చారు. కానీ అదే పెద్ద మనిషి అల్లుడికి బుద్ది చెప్పి మామ అదేపని చేశాడన్నట్లుగా కమ్యూనిజానికి వ్యతిరేకంగా అమెరికా సిఐఏ ప్రచారంలో పెట్టిన అభూత కల్పనలు, అవాస్తవాలతో కూడిన ఒక పుస్తక ముఖచిత్రాన్ని పోస్టు చేశారు.
పెట్టుబడిదారీ విధానంలో ఎన్నో సంక్షోభాలు, వాటిని అధిగమించేందుకు ఆ విధాన సమర్ధకులు దోపిడీని కొనసాగించేందుకు, తమ లాభాలను తగ్గకుండా చూసుకొనేందుకు ఎన్నో కొత్త పద్దతులు, ఆయుధాలను కనిపెట్టారు కనుకనే ఆ విధానం ఇంకా బతికి బట్టకట్ట గలుగుతోంది.వారితో పోల్చుకుంటే దాని స్ధానంలో దోపిడీ, అసమానతలు లేని సమాజాన్ని స్ధాపించాలన్న మహత్తర లక్ష్యంతో పని చేస్తున్న కమ్యూనిస్టులు తమకు తగిలిన ఎదురు దెబ్బను కాచుకొని ముందుకు పోవటానికి నూతన పద్దతులు, ఎత్తుగడలు వేయకుండా ఎలా వుండగలరు.
రెండున్నరవేల సంవత్సరాల క్రితమే వేద ప్రమాణాలు, క్రతువులు, పూర్వజన్మ, మానవ జన్మాంతర అం శాలను వ్యతిరేకించి హేతు,భౌతిక వాదాలను ముందుకు తెచ్చిన చార్వాకులు, లోకాయతుల రచనలను నాశనం చేసి వారిని అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. వారిని నిందిస్తూ వ్యతిరేకులు తమ రచనల్లో పేర్కొన్న అంశాలు మాత్రమే ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. అయినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా వారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్న వారసులు వున్నపుడు కమ్యూనిజానికి తగిలిన ఎదురుదెబ్బనుంచి బయట పడటం అసాధ్యం ఎలా అవుతుంది. రెండువేల సంవత్సరాల నాడు చార్వాకుల గ్రంధాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు నాటి పాలకులు వాటిని నాశనం చేయగలిగారు గాని నేడు కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకులు అలా నాశనం చేయగలరా ?చేయలేరు గనుకనే వక్రీకరించి భవిష్యత్‌ తరాల మెదళ్లను చెడగొట్టాలని చూస్తున్నారు.నేటి యువతరం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని, మంచి చెడ్డలను సులభంగానే గ్రహించగలరని వారు ఊహించలేరు.
తూర్పు ఐరోపాలో, సోవియట్లో పాతికేళ్ల క్రితం సోషలిస్టు వ్యవస్ధలను కూలదోసిన తరువాత అక్కడి జనంలో ఇదేమిటి అనుకున్నదొకటి, అయింది ఒకటి అన్న పునరాలోచన ప్రారంభం కావటంతో అక్కడి పాలకులు కంగారు పడుతున్నారు.కమ్యూనిస్టు వ్యతిరేకతను మరింతగా రెచ్చగొట్టి జనంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

ఏటికి ఎదురీదాలంటే ఎన్నో ఆటంకాలు, వాలునబడి పోయే వారికి ఎంతో సులభం. ప్రారంభం నుంచీ భారత కమ్యూనిస్టులకు అదే పరిస్ధితి. 1964లో తరువాత భారత కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన చీలికకు నాయకుల మధ్య వున్న వ్యక్తిగత తగాదాలే కారణమని కమ్యూనిస్టు వ్యతిరేకులు వక్రీకరించి అభాండాలు వేశారు. పూర్వ చరిత్ర తెలియని అనేక మంది అది నిజమేనని నమ్మినవారు లేకపోలేదు

భారత కమ్యూనిస్టు వుద్యమ విషయానికి వస్తే తాష్కెంట్‌ నగరంలో కేవలం ఏడుగురితో ప్రారంభమైన పార్టీని పురిట్లోనే వడ్లగింజవేసి నలిపివేయ చూసినట్లుగా బ్రిటీష్‌ పాలకులు అణచివేతకు పాల్పడ్డారు.అప్పటికే అనేక భావాలు కలిగిన విప్లవకారులు, విప్లవ సంస్థల కార్యకలాపాలతో సతమతం అవుతున్న బ్రిటీష్‌ పాలకులకు సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటంతో కమ్యూనిస్టు అన్న అనుమానం వచ్చిన ప్రతివారినీ అడ్డుకోవటం, అణచివేయటం ప్రారంభించారు.దాన్ని అధిగమించటానికి కమ్యూనిస్టులు విదేశాల నుంచే పని చేయటం ప్రారంభించారు. కొంత మంది రహస్యంగా భారత్‌కు తిరిగి రావటం ప్రారంభించారు.1920 ప్రాంతంలో కమ్యూనిస్టుగా ఎంఎన్‌ రాయ్‌, అబనీ ముఖర్జీ వంటి వారు కమ్యూనిస్టు అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ పుస్తకాలు, కరపత్రాలు రాసి విదేశాల నుంచి మన దేశానికి పంపించారు. 1921 అహమ్మదాబాద్‌,1922 గయ కాంగ్రెస్‌ మహాసభలలో వాటిని పంపిణీ చేసి చర్చకు పెట్టారు.1921 ఏప్రిల్‌లో సహాయ నిరాకరణ వుద్యమం సందర్బంగా అప్పుడే కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై, జర్నలిస్టుగా వున్న ఎస్‌ఏ డాంగే గాంధీ వర్సెస్‌ లెనిన్‌ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.
తాష్కెంట్‌లో సిపిఐ ఏర్పాటు తరువాత కమ్యూనిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక మిలిటరీ పాఠ శాలను ఏర్పాటు చే శారు. మొదటి బ్యాచ్‌గా భారత్‌ నుంచి మొహజిర్లు వచ్చారు.వారిని తరువాత మాస్కోలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ పాఠశాలకు బదిలీ చేశారు.అ లాంటి వారు 21 మంది వున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. వారిలో కొందరు భారత్‌కు తిరిగి రాగానే అరెస్టు చేసి పెషావర్‌ కుట్రకేసు పేరుతో విచారణ తతంగం జరిపి శిక్షలు వేశారు. తరువాత కాన్పూరు, మీరట్‌ కుట్ర కేసులను బనాయించారు. అవన్నీ కమ్యూనిస్టులపై పెట్టినవే. మీరట్‌ కేసు ఖైదీలను విడుదల చేసిన తరువాత అంటే 1933లో భారత కమ్యూనిస్టు పార్టీ ఒక సమగ్ర పార్టీగా సభను జరుపుకుంది. అంటే పదమూడు సంవత్సరాల పాటు ఎన్ని ఆటుపోట్లు, సమస్యలను ఎదుర్కొన్నదో చూస్తే మన దేశంలో ఏరాజకీయ పార్టీకి కూడా అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదన్నది స్పష్టం. ఈ కాలంలో కమ్యూనిస్టులు వివిధ పేర్లతో పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీల్లో చేరి తమ భావజాలాన్ని విస్తరింపచేశారు.
ఏటికి ఎదురీదాలంటే ఎన్నో ఆటంకాలు, వాలునబడి పోయే వారికి ఎంతో సులభం. ప్రారంభం నుంచీ భారత కమ్యూనిస్టులకు అదే పరిస్ధితి. 1964లో తరువాత భారత కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన చీలికకు నాయకుల మధ్య వున్న వ్యక్తిగత తగాదాలే కారణమని కమ్యూనిస్టు వ్యతిరేకులు వక్రీకరించి అభాండాలు వేశారు. పూర్వ చరిత్ర తెలియని అనేక మంది అది నిజమేనని నమ్మినవారు లేకపోలేదు. ప్రపంచంలో, భారత్‌లో వున్న సంక్లిష్ట పరిస్ధితులలో ఒక విధానాన్ని నిర్ణయించుకోవటంలో తలెత్తిన అంశాలే విభేదాలకు మూలం. పార్టీ ప్రారంభకులలో ఒకరైన ఎంఎన్‌రాయ్‌ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తిరస్కరించిన కారణంగానే తొలి రోజుల్లోనే పార్టీకి దూరమయ్యాడు. స్వాతంత్య్రానంతరం దేశంలో విప్లవాన్ని ఎలా సాధించాలనే అంశంపై తలెత్తిన విభేదాలే వుద్యమంలో చీలికలు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను దేశం నుంచి ఎలా వెళ్లగొట్టాలనే అంశంపైనే జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులు, మితవాదులుగా చీలి పోయారు తప్ప వ్యక్తిగత కారణాలు కాదు.కానీ చరిత్రకాయి కొందరు వాటిని వ్యక్తులకు ఆపాదించి వక్రీకరించారు.అయితే వర్తమానంలో అధికారాన్ని పంచుకొనే విషయంలో పార్టీలో అంతర్గత ముఠా తగాదాలు, విబేధాలు తలెత్తి ఏర్పడిన పార్టీలు అనేక రాష్ట్రాలలో కుటుంబ పార్టీలుగా తయారు కావటాన్ని చూసి కమ్యూనిస్టు వుద్యమ చీలికలు కూడా అలాంటివే అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. పీడిత ప్రజల విముక్తి కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన కమ్యూనిస్టులు, అధికారం, డబ్బు సంపాదనకోసమే పార్టీలను పెట్టేవారికి , చీల్చేవారికి నక్కకూ నాగలోకానికి వున్నంత తేడా వుంది.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం నాలుగవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

కారల్‌ మార్క్సు తన వ్యాసం ప్రారంభంలోనే బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ద్వంద్వ స్వభావాన్ని తేటత్లెల్లం చేశారు. 1857 సెప్టెంబరు 4వ తేదీ న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో ‘భారత్‌ తిరుగుబాటు’ శీర్షికతో ఆయన వ్యాసం అచ్చయింది.

అనేక మంది చరిత్రకారులు సిపాయి తిరుగుబాటుగా వర్ణించిన 1857 వుదంతాన్ని భారత ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంగా కారల్‌మార్క్సు వర్ణించారన్న విషయం చాలా మందికి తెలియదు. పత్రికల పరిమిత సమాచారం ఆధారంగానే ఆయన ఆ నిర్ధారణకు వచ్చారని గమనించాలి. ఆ తిరుగుబాటును బ్రిటీష్‌ వారు అణచివేసినప్పటికీ గుణపాఠాలు తీసుకొని తరువాత కాలంలో కొనసాగింపుగా ఎందుకు వుద్యమాలు నడవలేదన్నది అధ్యయనం చేయాల్సిన అంశం. అదే కొనసాగి వుంటే అన్న ప్రశ్న వేసుకుంటే మన దేశంలో పరిణామాలు నిస్సందేహంగా వేరుగా వుండేవి. దీని అర్ధం అసలే వుద్యమాలు జరగలేదని కాదు. అయితే అవి సంఘటితమైనవి కాదు. పెట్టుబడిదారీ విధానం పరిశ్రమలతో పాటు తనను నాశనం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుంది. అలాంటి సైనికులే 1877లో నాగపూర్‌లో జౌళి మ్లిులులో తొలి సమ్మె చేశారు. కారల్‌ మార్క్సు తన వ్యాసం ప్రారంభంలోనే బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ద్వంద్వ స్వభావాన్ని తేటత్లెల్లం చేశారు. 1857 సెప్టెంబరు 4వ తేదీ న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో ‘భారత్‌ తిరుగుబాటు’ శీర్షికతో ఆయన వ్యాసం అచ్చయింది.
‘భారత్‌లో తిరుగుబాటు చేసిన సిపాయిల తెగువ, సాహసం నిజంగా అసమానము, ఆశ్చర్యకరం,అనిర్వచనీయమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే దురాక్రమణలు, జాతులు, తెగలు, అన్నింటికి మించి మతాలకు అతీతంగా జరిగే యుద్ధాలకు సిద్దమైనపుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఫ్రాన్స్‌లో వెండీ తిరుగుబాటును, ఫ్రెంచివారిపై స్పానిష్‌ గెరిల్లా తిరుగుబాటు, జర్మన్‌,హంగేరియన్లపై సెర్పియన్లు చేసిన తిరుగుబాటు, వియన్నీస్‌పై క్రోట్స్‌, ఫ్రెంచి కార్మికుల తిరుగుబాట్లను హర్షించిన గౌరవనీయమైన ఇంగ్లండ్‌ భారత్‌లో సిపాయి తిరుగుబాటును అప్రతిష్టాకర పద్దతులో కేంద్రీకరించి అణచివేసింది.’ అని పేర్కొన్నారు.

రష్యా, అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలో ప్రవాసంలోని భారత విప్లవకారులు పాల్గొని చేసిన ప్రసంగాలు, తీసుకున్న వైఖరులతో స్వదేశీ డిమాండ్‌ నుంచి స్వరాజ్య డిమాండ్‌కు కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. మన దేశంలో కమ్యూనిస్టు విప్లవకారులు సాధించిన తొలి విజయం ఇది.

ఐరోపా, అమెరికా ఖండంలో జరిగిన పరిణామాలు, ఐరోపా సందర్శనకు వెళ్లిన అనేక మంది భారతీయులను ప్రభావితం చేశాయి. భారత్‌లో బ్రిటీష్‌ పాలకుల అణచివేతను వ్యతిరేకించిన అనేక మంది విప్లవకారులు తొలుత 1905లో లండన్‌లో తరువాత పారిస్‌లో 1907లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో రష్యాలో జరిగిన పరిణామాలతో అనేక మంది అక్కడి సోషల్‌ డెమోక్రాట్ల(కమ్యూనిస్టు)తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. భారతజాతీయ కాంగ్రెస్‌ తొలుత కేవలం స్వపరిపాలన డిమాండ్లకే పరిమితమైంది. రష్యా, అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలో ప్రవాసంలోని భారత విప్లవకారులు పాల్గొని చేసిన ప్రసంగాలు, తీసుకున్న వైఖరులతో స్వదేశీ డిమాండ్‌ నుంచి స్వరాజ్య డిమాండ్‌కు కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. మన దేశంలో కమ్యూనిస్టు విప్లవకారులు సాధించిన తొలి విజయం ఇది. అప్పటి వరకు స్వాతంత్య్ర వుద్యమానికి దూరంగా వున్న వివిధ వర్గాల వారు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనటం ప్రారంభమైంది. దీంతో బ్రిటీష్‌ పాలకులు కార్మికులు, రైతుల తిరుగుబాట్లు, ఆందోళనలను తీవ్రంగా అణచివేయటంతో వుద్యమాలు కొంత వెనుకపట్టు పట్టాయి.దీంతో మరోసారి ప్రవాసంలో విప్లవ సంస్థలను ఏర్పాటు చేశారు. 1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవం జయప్రదం కావటంతో ప్రవాస భారతీయ విప్లవకారులు మరింతగా కమ్యూనిస్టులతో సంబంధాలు పెట్టుకున్నారు. భారత్‌ నుంచి అనేక మంది రష్యాలో ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటిదో ప్రత్యక్షంగా తొసుకొనేందుకు అక్కడికి వెళ్లారు.

ఖిలాఫత్‌ వుద్యమంలో పాల్గొన్న ముస్లిం యువత 20వేల మంది టర్కీలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశం వదలి వెళ్లింది. వారిని ముజహిర్లు అని పిలిచారు. అలాంటివారిలో అనేక మంది కమ్యూనిస్టులుగా మారారు.

ఇదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంతో నిజానికి మన దేశానికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ బ్రిటీష్‌ పాలకులు మనను కూడా దానిలోకి లాగి అనేక భారాలను మన పౌరులపై మోపారు. అది మరింత వ్యతిరేకతను పెంచింది.దానికి 1918 ఏప్రిల్‌ 13 జలియన్‌ వాలాబాగ్‌ వూచకోత ఆజ్యం పోసింది. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్‌ వుద్యమంలో పాల్గొన్న ముస్లిం యువత 20వేల మంది టర్కీలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశం వదలి వెళ్లింది. వారిని ముజహిర్లు అని పిలిచారు. అలాంటివారిలో అనేక మంది కమ్యూనిస్టులుగా మారారు. అనేక ప్రాంతాల నుంచి ప్రవాసం వెళ్లిన విప్లవకారులు 1920 అక్టోబరు పదిహేడున నాటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.దానిపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. అది ఒక సమగ్రపార్టీ కానప్పటికీ చరిత్రలో అదే ప్రారంభంగా నమోదైంది.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: