• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Indian economy

నరేంద్రమోడీ ఘోర వైఫల్యం : ఆరేండ్ల నాటి పెద్ద నోట్ల రద్దుకు నేడు అడ్డగోలు సమర్ధనలా !

26 Wednesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Ashima Goyal, BJP, Demonetisation, Indian economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ నోట రెండోసారి పలికేందుకు ఇబ్బంది పడిన పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ రిజర్వుబాంకు ద్రవ్యవిధాన పర్యవేక్షక కమిటీ సభ్యురాలుద, ఆర్ధికవేత్త అషిమా గోయల్‌ ఇటీవల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడకల, పాలకులకు ఘోర వైఫల్యం. దీని గురించి ఆరు సంవత్సరాల తరువాత ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం కోర్డు డివిజన్‌ బెంచ్‌ పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా అన్న అంశాన్ని విచారించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష మీద తమకు ఉన్న లక్ష్మణ రేఖ గురించి తెలుసునని కూడా కోర్టు పేర్కొన్నది. అందువలన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం గురించి ఊహాగానాలు అవసరం లేదు. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి, పాలకుల మాటలను, నాటి పరిస్థితి, ప్రహసనాలను జనాలకు మరోసారి గుర్తుకు తెస్తాయి.


పెద్ద నోట్ల రద్దు బడా వైఫల్యమని తెలిసినప్పటికీ పన్ను వసూళ్ల ప్లవనశక్తి వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఉన్నదని అషిమా గోయల్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా, ఆ వైఖరితో అందరూ ఏకీభవించాలా? అఫ్‌ కోర్సు ఇదే తర్కం ఆర్ధికవేత్తలందరికీ వర్తిస్తుంది కదా అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఎవరేం చెప్పినా వారు చెప్పినదానికి ప్రాతిపదికలే విశ్వసనీయతను వెల్లడిస్తాయి. ఇదే అషిమాకూ వర్తిస్తుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు- తరువాత పన్ను వసూళ్ల అంకెలు ఏమి చెబుతున్నాయి ? ఇలా అనేక అంశాలను చూడాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లలో ఏమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశమే. అషిమా గోస్వామి చెప్పిన అంశాల ప్రాతిపదిక, వాదనే వాటిలో ఉంటుందా ? చూద్దాం.


పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహశక్తులకు నిధులు అందకుండా చూస్తామని,సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్రమోడీ 2016నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. ” ప్రభుత్వ అధికారుల పరుపుల కింద కరెన్సీ కట్టలు లేదా గోనె సంచుల్లో నగదు దొరికింది అనే వార్తలతో నిజాయితీపరులైన పౌరులు బాధపడకూడదనే ” పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్‌) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా ? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇండ్లలో అధికారికంగా ప్రకటించిన రు.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు ? ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిది. ఆ పెద్దమనిషి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు గనుక, మమతాబెనర్జీకి కూడా వాటా వుండి చూసీ చూడనట్లు ఉన్నారనుకుందాం, మరి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు ? నిజానికి చిత్తశుద్దితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సినపని లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నట్లు అషిమా చెప్పారు. ఫలాలంటే ఏమిటి ? ఆర్ధిక వ్యవస్థ క్రమబద్దీకరణ జరిగింది, డిజిటైజేషన్ను పెంచింది, పన్నుల ఎగవేతను నిరోధించింది అని ఆమె చెప్పారు. గత ఏడాదితో పోల్చితే వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను చెల్లింపు 24శాతం పెరిగి రు.8.98లక్షల కోట్లకు, జిఎస్‌టి గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది 26శాతం చేరినట్లు అక్టోబరు 9న పన్నుల శాఖ చెప్పిన అంశాన్ని ఆమె తన వాదనకు రుజువుగా పేర్కొన్నారు.


పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నరలక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా ఉన్న సౌమ్యకాంతి ఘోష్‌ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్‌ స్టాండర్డ్‌ అనే పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు.( అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ది చేకూరినట్లే) అంతే కాదు ఇప్పటికే ఉన్న ఢిల్లీ పొగను మరింత పెంచేవిధంగా అంత మొత్తాన్ని తగుల పెట్టబోరనే చతురోక్తిని కూడా విసిరారు. అషిమా అభిప్రాయం కూడా అలాంటిదేనా ? ఇద్దరూ ఆర్ధికవేత్తలే కదా ! చివరికి ఏమైంది, ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లు తగలబెట్టలేదు, పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా భలే ఉందే అన్న సామెతను గుర్తుకు తెచ్చారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరోసాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.

2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు.


పెద్ద నోట్ల రద్దు గురించి దివంగత ఆరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి ? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30వరకు రెండు నుంచి 80లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రు.5.03 లక్షలు, 80లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రు.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రు.80లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రు.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రు.4.89 లక్షల కోట్లు.ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99శాతంపైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రు.15.44లక్షల కోట్లు. మూడోవంతు(31శాతం) సొమ్ము రు.4.89 లక్షల కోట్లు 80లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ది పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?


పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్‌, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్రమోడీ గారే చెప్పారు.” పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవినీతి స్థాయితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అవినీతి పద్దతుల్లో నగదు సమీకరణతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. పేదలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు స్వయంగా అనుభవించి ఉంటారు. భూమి లేదా ఇంటినో కొనుగోలు చేసినపుడు చెక్కు ద్వారా చెల్లించేదానితో పాటు పెద్ద మొత్తంలో నగదును డిమాండ్‌ చేస్తారు. ఒక నిజాయితీ పరుడు ఆస్తిని కొనుగోలు చేసినపుడు సమస్యలను సృష్టిస్తుంది. నగదును దుర్వినియోగం చేస్తే వస్తువుల ధరలు, సేవలైన ఇండ్లు, భూమి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ ఇంకా ఎన్నింటి ధరలో కృత్రిమంగా పెరుగుతాయి.” ఇవన్నీ చెప్పింది మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారే. నోట్ల రద్దు జరిగి ఆరేండ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే. నిజాయితీపరులైన వారు చెక్కుల ద్వారా ఇండ్లు కొనుక్కున్న ఉదంతం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా ? ఆత్మవంచన చేసుకోకుండా ఎవరికి వారు అవలోకించుకోవాలి.


పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015 -16లో నగదు చెలామణి జిడిపిలో 12.1శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్‌ ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.


పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జూలైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది.మరుసటి ఏడాది కరోనాతో 7.3శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు అషిమా గోయల్‌ ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు ? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు.యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016ఏప్రిల్‌ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు.2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు. ఈ లావాదేవీల పెరుగుదలకు వాటి మీద అవగాహన పెరగటం, ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ జనాలకు అందుబాటులోకి రావటం, వేగం పెరగటమే కారణంగా చెప్పవచ్చు. దీన్ని ఆర్ధిక రంగ క్రమబద్దీకరణ అని చెప్పగలమా ?


ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు ఏ భాష్యం చెబుతారు ? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి.2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు సగటున 47.73 కోట్లు కాగా 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమలావాదేవీలు ఇంతేనా ? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆకలి సూచికలో మరింత దిగజారుడు : పొట్టకూటి పాములోళ్ల బొమ్మ అవమానమైతే….. మరి రాజకీయ ఆవులోళ్ల చిత్రాల సంగతేమిటి ?

16 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK

≈ Leave a comment

Tags

BJP, Congress party, cow politics, Cow pooja, Indian economy, La Vanguardia, Narendra Modi Failures, RSS, snake charmer


ఎం కోటేశ్వరరావు


మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్‌ సింగ్‌ పాలనలో మన దేశపరువు ప్రతిష్టలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్రమోడీ వాటిని తిరిగి ప్రతిష్టించారని, లోకమంతా మనవైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్‌ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్‌ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా ? మన ఆర్ధిక రంగ వృద్ది తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా ?ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా ! దాన్ని మేము ఏల చూడవలె !! హతవిదీ,ó అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు. మయసభలో ధుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. ఆక్టోబరు తొమ్మిదవ తేదీన ” భారత ఆర్ధిక వేళ ” అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర,శనివారాల్లో మన దేశంలోని అనేక టీవీలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు.మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్‌ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్రమోడీకి గౌరవ ప్రదమా ? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా ? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా ?


ఆ స్పానిష్‌ భాష పత్రికలో మన ఆర్ధిక రంగం మీద చేసిన విశ్లేషణ సారం ఏమిటో అనువాదం కోసం వెతికినా దొరకలేదు. ఏదైనా కావచ్చు, మన ప్రధాని నేతృత్వంలో ఆర్ధికంగా దేశం ఎలా గంతులు వేస్తూ ముందుకు పోతున్నదో రాసి ఉండవచ్చు లేదా ఎలా దిగజారుతున్నదో కూడా చెప్పి ఉండవచ్చు. ఏది రాసినా అసలు అభ్యంతరం అది కాదు. దానికి పాములనాడించే వ్యక్తి చిత్రాన్ని జోడించి ప్రచురించటమే. జనాన్ని కాటువేసే ద్రవ్యోల్బణమనే నాగుపాము బుసలు ప్రపంచమంతటితో పాటు మన దేశంలో కూడా ఉన్నందున దాన్ని బుజ్జగించి బుట్టలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ ఊదుతున్న నాగస్వరానికి చిహ్నంగా ఆ చిత్రాన్ని చూపారా ? అసలు ఆ బొమ్మ వేస్తే తప్పేంటి, పత్రికల్లో అనేక బొమ్మలు వేస్తున్నారు, దాన్ని సానుకూల వైఖరితో ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. ఆర్ధికరంగం మాంద్యంలోకి జారకుండా, మన గానానికి అనుగుణ్యంగా నృత్యం చేయిస్తూ ఉన్నతి వైపు తీసుకువెళ్లే ప్రయత్నానికి ప్రతిబింబంగా దాన్ని ఎందుకు పరిగణించకూడదు, ఆత్మన్యూన్యతకు ఎందుకు గురికావాలి ? చిన్న వ్యంగ్యాన్ని సహించలేని స్థితికి ” ఎదిగామా ” అన్నది వారి ప్రశ్న. నూరు పూవులను పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి.


పాములను ఆడించే వ్యక్తి చిత్రాన్ని మన దేశానికి ప్రతీకగా చూపటం అవమానించటమే అని కొందరు పేర్కొన్నారు.” బలమైన భారత ఆర్ధిక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా పాములోళ్ల బొమ్మలతో మనల్ని చూపటం బుద్దిలేని తనం. వారిని వలసవాద భావన నుంచి మరల్చటం సంక్లిష్టమైనది ” అని స్పెయిన్‌ వారపత్రిక కథనం గురించి బెంగలూరు సెంట్రల్‌ బిజెపి ఎంపీ పిసి మోహన్‌ అన్నారు. నిజమే, వారిని మార్చటం అంత తేలిక కాదు, విదేశీయులు మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన దేశంలో పాములోళ్ల కాలం నాటి నుంచి ఉన్న, అంధ, మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ అంశాలను జనాల మెదళ్లకు ఒక పధకం ప్రకారం ఇప్పటికీ సరికొత్త పాకింగ్‌లు, రంగులది ఎక్కిస్తున్న మీడియా, రాజకీయ నేతల సంగతేమిటి అన్నది ప్రశ్న.


మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలుచేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జన్లు ఉండి ఉండాలని మోడీగారే చెప్పారు. ఇక ఇంథనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి,క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢవిశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా ! పాములనాడించేవారు పొట్ట కూటికోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్‌ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ది ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశారు. కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్‌ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి ? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే ? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ గారే గోమాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగామాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్‌ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచేవా ? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రు.500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు. అంతే కాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కాన్సర్‌ను మాయంచేసినట్లు బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్‌ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే.


పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్టను తెచ్చేదిగా ఉందా ? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్రమోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించేవారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్దితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు ?2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్‌ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు.ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చ కూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం.


2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్‌ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్‌, బంగ్లాదేశ్‌ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81,మయన్మార్‌ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి ? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్టలను పెంచేదా ? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడిచమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్రమోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా ? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్దాంతం అవసరమా ?


జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి ? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ జనాభాకంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒక నాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి ? ఐరోపా వారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు. నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు ? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో , ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయ పడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు ? దేశంలో ఆవు-దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్‌ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు-దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్‌, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు ? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తున్నాయా !

26 Sunday Jul 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, India economy slowdown, Indian economy, Indian GDP paradox, Narendra Modi government credibility


ఎం కోటేశ్వరరావు


” రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో ” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరీ అంత పచ్చిగా నిజం మాట్లాడతావా, అవి మా నేతను ఉద్దేశించే కదా అంటూ దాడులకు దిగేవారు ఒక వైపు. మరోవైపు రెండు రెళ్లు ఎంతో తెలుసుకొనేందుకు కాలుక్యులేటర్‌ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్న తరుణమిది.
ఇలాంటి స్ధితిలో దేశ ఆర్ధిక విషయాల గురించి నిజాలు మాట్లాడితే మోడీ అభిమానులు లేదా భక్తులు భరిస్తారా ? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దెబ్బలాటలకు రారా ? మరోవైపు ఏమి జరుగుతోందో తెలియక జనం అర్ధం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాలుక్యులేటర్లు రెండు రెళ్లు నాలుగు, మూడు మూళ్లు తొమ్మిది అని చూపగలవు తప్ప వివరణ ఇవ్వలేవు. రాజకీయ నాయకులు మసి పూసి మారేడు కాయలను చేయగలరు తప్ప వాస్తవాలను కనపడనివ్వరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. శంకుస్ధాపనకు ఎంచుకున్న సమయం అశుభ గడియ అని, సరైన సమయం కాదని శంకరాచార్య స్వరూపానంద అభ్యంతరం చెప్పారు.చాలా చోట్ల అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తే తమిళియన్లు ఆరోజును పరమ పవిత్రమైనదిగా చూస్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సమస్యలు గనుక అవునని, కాదని చెప్పేవారు ఉంటారు.
కానీ దేశ ఆర్ధిక విషయాలకు సంబంధించి చెప్పాల్సిన వారు నోరు విప్పరు. అంకెలు ఒకటే అయినా కొందరు భిన్నమైన టీకా తాత్పర్యాలు, భాష్యాలతో మన మెదళ్లను తినేస్తున్నార్రా బాబూ అని అనేక మంది భావిస్తున్నారు. తమ సిబ్బంది సేకరించిన గణాంకాలు తప్పని ఏకంగా పాలకులే నిరుద్యోగంపై నివేదిక గురించి చెప్పిన విషయం తెలిసిందే. పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధికిందకే వస్తుంది, అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదని సాక్షాత్తూ మోడీ మహాశయుడే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎవరైనా పకోడి బండి పెట్టినా డబ్బుల్లేక ఆ వైపు వెళ్లేందుకు కొందరు విముఖత చూపుతుంటే, కరోనాను కావిలించుకోవటం ఎందుకురా బాబూ అని మరికొందరు వెళ్లటం లేదు. అంతిమంగా పకోడి బండ్లు చాలా మూతపడ్డాయి. ఎప్పుడు పూర్వపు స్ధాయికి వస్తాయో తెలియదు.
దేశ ఆర్ధిక స్ధితి గురించి జనానికి నిజం తెలియటం లేదు. కరోనా కారణంగా వివరాలను సేకరించే సిబ్బందే ఆ ఛాయలకు పోలేదని తెలిసిందే. బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆల్జీబ్రా మాదిరి గుండెను గాబరా పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా, వినియోగదారులను వీర బాదుడు బాది వసూలు చేస్తున్న మొత్తం మంగళగిరి పానకాల స్వామికి పోసే పానకం మాదిరి ఎటుపోతోందో తెలియటం లేదు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు !
ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయాలు, వ్యయాల గురించి ఏమి చెప్పారో తెలియదు గానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే లోటు రెట్టింపుకు పైగా పెరిగి 7.6శాతం ఉంటుందని అంచనా. ఇది తొలి రెండు నెలల తీరుతెన్నులను చూసి చెప్పిన జోశ్యం కనుక వాస్తవంగా ఎంత ఉంటుందో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లోటు 7.6శాతం అయితే దానికి రాష్ట్రాలు 4.5శాతం జోడిస్తే వెరసి 12.1శాతం అవుతుందని అంచనా. ఈ లోటును పూడ్చుకొనేందుకు జనం కోసమే కదా అర్ధం చేసుకోరూ అంటూ కేంద్రం, రాష్ట్రాలూ పెట్రోలు, డీజిలు వంటి వాటి ధరలను మరింతగా పెంచినా ఆశ్చర్యం లేదు.
లోటు పెరగటం అంటే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గటం, దానికి కారణం జనం వస్తువులు, సేవలను కొనుగోలు తగ్గించటం, అందుకు వారికి తగిన ఉపాధి, ఆదాయం లేకపోవటం, దాని పర్యవసానం వస్తువినియోగం తగ్గించటం, దాంతో పరిశ్రమలు, వ్యాపారాల మూత, ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల ఇలా ఒకదానికి ఒకటి తోడై ఏం జరగనుందో తెలియని స్ధితి.
కరోనాకు ముందే పరిస్దితి దిగజారింది, తరువాత పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ గారు చప్పట్లు, దీపాలతో జనాల చేత సంకల్పం చెప్పించారు. ఇరవై ఒక్క లక్షల కోట్ల ఉద్దీపన పధకం అంటూ ఆర్భాటంగా ప్రకటింపచేశారు. అదేమిటో జనానికి తెలియని బ్రహ్మపదార్ధంగా మారింది. ఎవరూ దాని గురించి పెద్దగా చర్చించటం లేదంటే అది మూసినా-తెరిచినా ప్రయోజనం లేని గుడ్డికన్ను వంటిది అని అర్ధం అయినట్లుగా భావించాలి.
ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్లుగా ప్రభుత్వాల ద్రవ్యలోటు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా లబ్ది పొందేది కార్పొరేట్లు, ధనికులే అన్నది సామాన్యులకు అర్ధంగాని అంశం.లోటు తక్కువగా ఉంటే ఏదో ఒక పేరుతో ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు పొందేది వారే. లోటు ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా లేనపుడు పెట్టుబడిదారులు ఎవరూ కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రారు. తమ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వానికి బాండ్ల పేరుతో వడ్డీకి ఇచ్చి లబ్ది పొందుతారు.లోటు పూడ్చే పేరుతో విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు లేదా ఆస్ధులను కారుచౌకగా అమ్మినపుడు వాటిని కొనుగోలు చేసి లబ్ది పొందేదీ వారే.

వినియోగదారుల ధరలు మరింతగా పెరుగుతాయా ?
ఉత్పత్తిలో స్థబ్దత ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను సడలించినా ఫ్యాక్టరీలు పూర్తి స్ధాయిలో పని చేయటం లేదు. దీని వలన గిరాకీ మేరకు వస్తువుల సరఫరా లేకపోతే ధరలు పెంచుతారు. మామూలుగానే వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది, కరోనాతో అది పెరిగింది. అయినా జూన్‌ నెలలో వినియోగదారుల ధరల సూచి పాక్షిక సమాచారం మేరకే 6.09శాతం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనాల కంటే వాస్తవంలో ఎక్కువ ఉంటుందన్నది తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి మే నెలలో మైనస్‌ 3.21శాతం అయితే అది జూన్‌ నాటికి 1.81కి చేరింది. అయితే రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 7 నుంచి 7.5శాతానికి పెరగవచ్చని ఆర్ధికవేత్త డాక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక మద్దతు చర్యల వలన గిరాకీ పెరగవచ్చని, దానికి అనుగుణ్యంగా ఉత్పత్తి పెరగకపోతే ద్రవ్యోల్బణం-ధరలు- పెరగవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్బోల్బణం ఎనిమిదిశాతానికి చేరవచ్చని భానుమూర్తి అన్నారు.
ద్రవ్యోల్బణం ఏడుశాతానికంటే తగ్గే అవకాశాలు లేవని అనిల్‌ కుమార్‌ సూద్‌ అనే మరో ఆర్ధికవేత్త చెబుతున్నారు.చమురు ధరలను పెంచారు, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులు పెరుగుతున్నాయి, రూపాయి విలువ తక్కువగా ఉంది. రవాణా, టెలికాం ఖర్చులు పెరిగాయి, సరఫరా గొలుసు పూర్తిగా వెనుకటి స్ధితికి రాలేదు అన్నారు. వ్యవసాయ రంగం వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ ఫ్యాక్టరీలు సామర్ధ్యంలో 50 నుంచి 55శాతమే పని చేస్తున్నాయని ఎస్‌పి శర్మ అనే మరో ఆర్ధికవేత్త చెప్పారు.

జిడిపి ఎంత మేరకు తగ్గవచ్చు ?
మన దేశంలోని రేటింగ్‌ సంస్ధ ‘ ఇక్రా ‘ అంచనా ప్రకారం వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి 9.5శాతం తిరోగమనంలో ఉండవచ్చు. తొలి త్రైమాస కాలంలో 25శాతం, రెండు, మూడులలో 12, 2.5శాతం వరకు లోటు ఉండవచ్చని, దాని అర్ధం సాధారణ కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయని, ఈ కారణంగా ద్రవ్యోల్బణం ఆరుశాతం అని జోశ్యం చెబుతున్నారు.

భారత్‌లో పెట్టుబడులకు ఇదే తరుణమా ?
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రసంగ భావం అదే. ఒక వైపు చైనా సంస్ధల పెట్టుబడులకు దారులు మూసిన సమయంలో అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన మోడీ అమెరికన్‌ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు 30శాతం లబ్ది పొందినట్లు ఒక అంచనా. విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు మన స్టాక్‌మార్కెట్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టేదిగా భావిస్తున్నారు. ఆ మేరకు వారి పెట్టుబడులు పెరుగుతాయి, మన దగ్గర డాలర్ల నిల్వలు గణనీయంగా ఉండవచ్చుగానీ, మన దేశంలో ఉపాధి పెరిగే అవకాశాలు లేవు. మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతుంది. మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావటానికి ఒక ప్రధాన కారణం కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించటమే. కంపెనీల దివాళా నిబంధనలను సరళంగా ఉంచాలని ప్రభుత్వం వత్తిడి తేవటాన్ని అంగీకరించని తాను బాధ్యతల నుంచి వైదొలిగినట్లు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
అంటే కంపెనీలు నిధులను, తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించి దివాలా పేరుతో బిచాణా ఎత్తివేసేందుకు, సులభంగా తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వటం తప్ప మరొకటి కాదు. ఇది కూడా విదేశీ మదుపుదార్లను ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెడతామని ముందుకు రావటానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తమిళనాడులో సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను నడుపుతున్నది. కొత్తగా పెట్టే సంస్ధలకు 15శాతమే పన్ను అన్న రాయితీని ఉపయోగించుకొనేందుకు అది మరో కొత్త పేరుతో విస్తరణకు పూనుకుంది. గూగుల్‌ వంటి కంపెనీలూ అందుకే ముందుకు వస్తున్నాయి. వీటి వలన మనకు కలిగే ప్రయోజనం కంటే వాటికి వచ్చే లాభం ఎక్కువ కనుకనే పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నాయి.

నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి !
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్‌పిఏ పాలకులు దివాలా తీయించారని బిజెపి చేసిన ప్రచారం గురించి తెలిసినదే. రాజకీయనేతలు బ్యాంకులకు ఫోన్లు చేసి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించి కమిషన్లు దండుకున్నారని చెప్పింది. దాన్లో అతిశయోక్తి ఉన్నా వాస్తవ పాలు కూడా ఉంది. కానీ ఆరేండ్ల బిజెపి ఏలుబడి తరువాత బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రికార్డు స్థాయిలో పెరగనున్నట్లు ఆర్‌బిఐ స్వయంగా హెచ్చరించింది. దీనికి కరోనా కారణం అంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. కరోనా కొన్ని సంస్దలను ఇబ్బందుల పాలు చేసిన మాట వాస్తవం. ఈ మాత్రానికే గణనీయంగా, ఆకస్మికంగా ఎలా పెరుగుతాయి ? మొత్తంగా చూసినపుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఆగలేదు. కంపెనీల లాభాల శాతం పెద్దగా పడిపోయిన దాఖలాలు లేవు. మోడీ సర్కార్‌ రుణ నిబంధనలను కఠినతరం గావించినట్లు చెప్పింది. ఇన్ని చేసినా నిరర్దక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నట్లు ? కాంగ్రెస్‌ నేతల మాదిరే బిజెపి పెద్దలు కూడా దందా ప్రారంభించారా ? 2020 మార్చినాటికి 8.5శాతంగా ఉన్న నిరర్దక ఆస్తులు 2021 మార్చినాటికి 12.5 లేదూ పరిస్ధితి మరింత దిగజారి వత్తిడి పెరిగితే 14.7శాతానికి పెరగవచ్చని స్వయంగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది.

కావలసింది నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీయా ? బలమైన దేశమా !
చరిత్రలో ఎందరో రాజుల ఏలుబడిలోని సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారి బలం వాటిని కాపాడలేకపోయింది. వర్తమాన చరిత్రలో నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేండ్లు తిరిగే సరికి దేశం ఆర్ధికంగా దిగజారిపోయింది. నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, ఆయన మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో లాఠీలు పట్టుకొని వీధుల్లోకి వచ్చే ప్రచారకులు, స్వదేశీ జాగరణ మంచ్‌ వారు గానీ ఆర్ధిక దిగజారుడును ఆపలేకపోయారన్నది తిరుగులేని నిజం.
అనేక అంశాలు పరస్పర విరుద్దంగా కనిపిస్తున్నాయి.అది భాష్యం చెప్పేవారి చాతుర్యమా లేక వాస్తవ పరిస్ధితుల నిజాలను ధైర్యంగా నివేదించే సలహాదారులు మోడీ గడీలో లేరా ? దేశ ఆర్ధిక వ్యవస్దలోని అనేక సూచీలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి, వాటి మీద ఆధారపడే జిడిపి మాత్రం పురోగమనం చూపుతున్నది. దేశంలో నేడున్న అసహన పరిస్ధితుల నేపధ్యంలో అనేక మంది ఆర్ధికవేత్తలు బహిరంగంగా, సూటిగా పాలకుల వైఖరిని ప్రస్తుతానికి ప్రశ్నించలేకపోవచ్చు. అయినా కొందరు ధైర్యం చేసి వేస్తున్న ప్రశ్నలు, లేవనెత్తుతున్న సందేహాలను తీర్చేవారు లేరు.

గణాంకాల తిరకాసేమిటో సంతృప్తికరంగా తేల్చేయాలి: సి. రంగరాజన్‌
ఇటీవలి కాలంలో దేశ గణంకాలు, సమాచారానికి సంబంధించిన వివాదాలకు సంతృప్తికరంగా ముగింపు పలకాల్సి ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా జూన్‌ 30వ తేదీన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును అందుకుంటూ ఈ సూచన చేశారు. జాతీయ గణాంకాల కమిషన్‌కు గుర్తింపు ఇవ్వాలని, అలా చేస్తే దాని విధులు, బాధ్యతలేమిటో స్పష్టం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఈశాఖ విడుదల చేసిన గణాంకాలు, వాటికి అనుసరిస్తున్న పద్దతి వివాదాస్పదమై అనేక మందిలో అనుమానాలు తలెత్తాయి. జిడిపి సజావుగా ఉంటే దేశం ఎందుకు దిగజారుతోందనే ప్రశ్నలు వచ్చాయి. మన పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే మన సమాచార, గణాంకాల నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన స్ధితిలో ఉన్నాము. అలాంటి రుణం ఒకటి మంజూరైందని ప్రధాన గణకుడు ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు.

అడుగడుగునా అంకెల గారడీ !
2012-18కాలంలో మన జిడిపి సగటున ఏడుశాతం అభివృద్ధి చెందినట్లు లెక్కలు చూపుతున్నాయి.2011 నుంచి 2018వరకు ప్రతి ఏటా జిడిపి వృద్ధి రేటును వాస్తవమైన దాని కంటే 2.5శాతం అదనంగా చూపుతున్నారని 2014 అక్టోబరు నుంచి 2018 జూన్‌వరకు ప్రధాన మంత్రి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల పేరుతో సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ఏడాది తరువాత సుబ్రమణ్యం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విమర్శను ప్రభుత్వ 2020-21ఆర్ధిక సర్వే తిరస్కరించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో దిగజారిన ఆర్ధిక స్దితి ప్రభుత్వం వెల్లడిస్తున్న అంకెల గారడీని నిర్ధారించింది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికీ నిజాలు చెప్పటం లేదు, ఇదే తీరు కొనసాగితే రేపు నిజం చెప్పినా నమ్మని స్ధితి కనిపిస్తోంది. మన ప్రభుత్వం జిడిపిని లెక్కిస్తున్న తీరు గురించి ఐఎంఎఫ్‌ ఆర్ధికవేత్తలు కూడా సందేహాలను వెలిబుచ్చారు.


నాడూ నేడూ ఒకటే ప్రచారం అదే దేశం వెలిగిపోతోంది !
2004వరకు అధికారంలో ఉన్న వాజ్‌పేయి హయాంలో దేశం వెలిగిపోయిందనే ప్రచారంతో బిజెపి ఆ ఏడాది ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన విషయం తెలిసినదే.2005-11 సంవత్సరాల మధ్యలో బ్యాంకుల రుణాల జారీ రేటు ఏటా 15శాతం చొప్పున అభివృద్ధి చెందిందని, తరువాత కాలంలో అది నాలుగుశాతానికి పడిపోయిందని సిఎంఐయి అధ్యయనం తెలిపింది. అంటే పెట్టుబడి ప్రాజెక్టులు మందగించాయనేందుకు అదొక సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి 2011కు ముందు సగటున తొమ్మిదిశాతం వృద్ధి చెందినట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడిస్తే తరువాత కాలంలో రెండుశాతానికి పడిపోయింది.ఇదే కాలంలో పెట్టుబడుల వార్షిక వృద్ధి రేటు 23.9 నుంచి మైనస్‌ 1.8శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం వృద్ధి రేటు వేగం మూడు నుంచి మైనస్‌ 1.5శాతానికి తగ్గింది, పట్టణ రేటు 3.4 నుంచి 0.3కు తగ్గింది ఇలా అనేక సూచికలు పడిపోగా జిడిపి వృద్ధి రేటును మాత్రం 7.2-7.1శాతంగా చూపారు. వేతనాల బిల్లుల శాతాలు కూడా ఇదే కాలంలో గణనీయంగా పడిపోయాయి, దేశం మొత్తంగా వినియోగం తగ్గటానికి ఇదొక కారణం. వీటన్నింటిని చూసిన తరువాత అంకెలు పొంతన కుదరటం లేదని జిడిపి రేటు గురించి అనేక మంది సందేహాలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధి కల్పన కిందికే వస్తుందని, అలాంటి వాటిని గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా నిరుద్యోగం పెరిగినట్లు చూపారని నరేంద్రమోడీ రుసురుసలాడారు. ఒక వేళ అదే నిజమైతే మోడీ ఏలుబడికి ముందు కూడా పకోడీల తయారీని లెక్కలోకి తీసుకోలేదు.

కరోనా తరువాత పరిస్దితి బాగుపడుతుందా ?
అనేక మంది కరోనా వచ్చింది కనుక తాత్కాలిక ఇబ్బందులు తప్పవని మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనటంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికీ భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అంతా బాగుంది, మరోసారి దేశం వెలిగిపోతోంది, 2024 తరువాత కూడా మోడీయే ప్రధాని అని విపరీత ప్రచారం చేస్తున్నారు. అలాంటి గుడ్డి విశ్వాసం ఉన్న వారి బుర్రలకు ఇప్పటివరకు ఎక్కించింది ఒక పట్టాన దిగదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు రేపు తప్పనిసరై నరేంద్రమోడీ నిజాలు చెప్పినా జనాలు నమ్మని పరిస్ధితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా జరుగుతోందేమిటో చెబుతారా ? బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఫలితం లేదని తేలిపోయింది. వీటన్నింటినీ చూసినపుడు ఇప్పుడు కావలసింది దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అన్న మహాకవి గురజాడ చెప్పిన అలాంటి జనంతో కూడిన బలమైన దేశమా లేక శ్రీశ్రీ చెప్పినట్లుగా చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వందేళ్లలో ఎరగని, అంతుబట్టని ఆర్ధిక సంక్షోభం- పర్యవసానాలు !

12 Sunday Jul 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Indian economy, worst economic crisis


ఎం కోటేశ్వరరావు
భారత ఆర్ధిక వ్యవస్ధ పురోగమనం గురించి ఏ సంస్ధ ఏ రోజు ఏ జోశ్యం చెబుతుందో తెలియని అయోమయంలో దేశ ప్రజలు ఉన్నారు. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమంటే అసలు విషయాలు తెలిసిన పాలకులు వాస్తవాలను మూసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మీద గుడ్డి నమ్మకంతో ఉన్న జనం అది పాచిపోతే ఏమౌతుందో ఆలోచించే స్ధితిలో లేరు. ఏ మంత్రదండమో తమను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందనే భ్రమల్లో ఉన్నారు. ఈ పరిస్దితికి కారణం నయా ఉదారవాద విధానాలు జనంలో కల్పించిన భ్రమలు అని ప్రపంచ పరిణామాలను చూసిన వారు చెబుతున్నారు. భిన్న ఆలోచనలు-అభిప్రాయాల చర్చకు మీడియాలో చోటు దొరకటం లేదు. ఏకపక్ష సమాచారం జనం మెదళ్లలోకి ఎక్కుతోంది. ఎందుకు అనే ప్రశ్న మన మస్థిష్కాల సాప్ట్‌వేర్‌ నుంచి అంతర్దానమైందా ? చెడిపోయిందా ?
కోవిడ్‌-19 మహమ్మారి గత వంద సంవత్సరాలలో సాధారణ సమయాల్లో ఎరగనంత ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని భారత రిజర్వుబ్యాంకు గవర్నరు శక్తికాంత దాసు శనివారం నాడు చెప్పారు. ఎస్‌బిఐ బ్యాంకింగ్‌ మరియు ఆర్ధిక సమావేశంలో గవర్నరు మాట్లాడారు. ఈ సంక్షోభం వలన ఉత్పత్తి, ఉద్యోగాలు, సంక్షేమ రంగాలలో అసాధారణ ప్రతికూలతలు చోటు చేసుకుంటాయని, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని హెచ్చరించారు.
ఆల్ఫా ఇన్వెస్కో అనే వార పత్రిక శనివారం నాడే ఒక విశ్లేషణను వెలువరించింది. ముందే చెప్పుకున్నట్లు ఎప్పుడు ఏ జోశ్యం వెలువడుతుందో తెలియదు. అలాంటి వాటిలో మచ్చుకు ఈ విశ్లేషణలోని ముఖ్యాంశాలను చూద్దాం. ” మదుపుదార్లు రెండు అంశాల మీద అంచనా, ఆశలతో ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమం ప్రారంభమైంది గనుక ఏడాదిలోపు సాధారణ పరిస్ధితిలు నెలకొని 2020 జనవరి స్ధాయికి చేరుకుంటాయి. ఆదాయాల పునర్దురణ జరిగి వినియోగదారులు డబ్బు ఖర్చు పెడతారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన అంచనాలు. ఆర్ధిక స్ధితి అస్తవ్యస్దంగా అదుపు తప్పి ఉంది. అంచనావేస్తున్నదాని కంటే కోలుకోవటం ఆలస్యం కావచ్చు. పూర్వపు స్ధితికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కరోనా వైరస్‌ ప్రారంభ దినాలలో తాత్కాలిక మైన ఎదురు దెబ్బ, పరిణామం అనే అభిప్రాయం ఉండేది. అయితే అందరం అనుకున్నదాని కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. మూడు దృశ్యాలను ఊహించుకోవచ్చు.
1.ఆశావహ దృశ్యం: ఆర్ధిక వ్యవస్ధ రానున్న ఏడాది కాలంలో సాధారణ స్ధితికి చేరుకోవచ్చు.భారత్‌లో నష్టం ప్రస్తుత పరిస్దితిని బట్టి తక్కువగా ఉండవచ్చు.
2.వాస్తవిక దృశ్యం : భారత ఆర్ధిక వ్యవస్ధ భారీ ఆర్ధిక మూల్యాన్ని చెల్లించవచ్చు. అయితే రెండు మూడు సంవత్సరాలలో పునరుద్దరణ అవుతుంది.ఈ మూల్యాన్ని ప్రయివేటు రంగమా, ప్రభుత్వమా, సాధారణ జనమా లేక ద్రవ్య వ్యవస్ధా ఎవరు చెల్లించాలన్నది పెద్ద అనిశ్చితంగా ఉంటుంది.
3.అత్యంత చెడు దృశ్యం : రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాక్సిన్‌ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు వైరస్‌ ఉండవచ్చు. తలసరి ఆదాయం పడిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి భారత్‌ కొన్ని సంవత్సరాలు వెనక్కు పోవచ్చు. కోలుకోవటానికి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ దాదాపు 20బిలియన్‌ డాలర్ల మేరకు నిధులు పెంచుకుంది. అన్ని ప్రధాన ప్రయివేటు బ్యాంకులు మరింత నగదును పెంచుకొనేందుకు చూస్తున్నాయి. జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా నుంచి విద్యుత్‌ ఆస్ధులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను జెఎస్‌డబ్ల్యు రద్దు చేసుకుంది. స్నోమాన్‌ లాజిస్టిక్సును తీసుకోవాలనుకున్న అదానీ కూడా వెనక్కు తగ్గారు. ఇవన్నీ అదనపు జాగ్రత్తలు, ఆర్ధిక వ్యవస్ధకు తాకబోయే దెబ్బలను సూచిస్తున్నాయి. ప్రమోటర్ల కంటే మదుపుదార్లు ఎక్కువ ఆశాభావంతో ఉన్నారు” ఇవి ఆల్ఫా ఇన్వెస్కో విశ్లేషణలోని కొన్ని అంశాలు.
2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభమే ఇంకా పూర్తిగా తొలగకపోగా ప్రభావం చూపుతుండగానే అంతకు ఎన్నో రెట్లు పెద్దదని భావిస్తున్న సంక్షోభం ఇప్పుడు మన ముందున్నది. ఈ నేపధ్యంలో మన నేతలు జనానికి వాస్తవాలు చెబుతున్నారా ? అసలు వాస్తవ పరిస్ధితి ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2020-21)లో తొలి మూడు మాసాలు గడచి పోయాయి. ఆర్ధిక వ్యవస్ద పురోగతికి కొలమానంగా పరిగణించే జిడిపి ఎంతశాతం పడిపోయిందో ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 4.5శాతం తిరోగమనంలో ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వేసిన అంచనాను మన ఆర్ధిక మంత్రిత్వశాఖ జూన్‌ నెలవారీ నివేదికలో ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో ఐఎంఎఫ్‌ వేసిన అంచనాలు అనేకం తప్పాయి. ఈ వార్త వెలువడక ముందే తిరోగమనం 6.4శాతం వరకు ఉండవచ్చని కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ పేర్కొనగా మరికొన్ని అంచానాలు ఐదుశాతానికి ఎక్కువే ఉండవచ్చని జోశ్యం చెప్పాయి.ప్రపంచ సగటు తిరోగమనం 4.9శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.
ఒక ప్రామాణిక సంస్దగా పేరున్న సిఎంఐయి(సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) జూలై ఎనిమిది నాటి వెబ్‌ సైట్‌ సమాచారం ప్రకారం 2019 సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల కాలంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనల విలువ రూ.2.3లక్షల కోట్లు కాగా డిసెంబరునాటికి అవి 5.15, మార్చినాటికి 3.37 లక్షల కోట్లుగా ఉండగా 2020 జూన్‌ నాటికి అది కేవలం 56వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక పూర్తయిన ప్రాజెక్టుల పరిస్ధితిని చూస్తే పైన పేర్కొన్న మాసాలలో వరుసగా 0.85, 1.65, 1.70, 0.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్నింటి కంటే మార్చినెలతో ముగిసిన మూడు మాసాలలో నిలిపివేసిన ప్రాజెక్టుల విలువ రూ.9.24 లక్షల కోట్లంటే కరోనాతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆర్ధిక దిగజారుడు ఎలా ఉందో సూచిస్తోంది. అందువలన ఎవరైనా కరోనాను సాకుగా చూపుతున్నారంటే వాస్తవ పరిస్ధితిని మరుగుపరుస్తున్నట్లే ! మూసిపెడితే పాచి పోతుందన్న సామెత తెలిసిందే. దేశంలో ఇప్పుడు అదే జరుగుతోందా ?
దేశంలో వలస కార్మికుల సంఖ్య ఎంతో మన ప్రభుత్వాల దగ్గర సమాచారం లేదన్నది కరోనా బయట పెట్టిన ఒక చేదు నిజం. అంటే ఎందరికి ఉపాధికల్పించారో కూడా అనుమానమే, కాకి లెక్కలు లేదా అంచనాలు తప్ప వాస్తవ పరిస్ధితిని అవి ప్రతిబింబించవు. సిఎంఐయి సమాచారం ప్రకారం ఏప్రిల్‌, మే నెలలో 23.5శాతానికి చేరిన నిరుద్యోగం జూన్‌ మాసంలో 11శాతం ఉంది. ఇది కరోనాకు ముందు అక్టోబరునెలలో ఉన్న గరిష్ట 8.2శాతానికి ఎక్కువ అన్నది తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు వేతనాలు తగ్గిపోవటం అన్నది సాధారణ సూత్రీకరణ. అసలు సమాచారమే సేకరించే యంత్రాంగమే అస్తవ్యస్తం అయిన స్ధితిలో సరైన గణాంకాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు.ఎలక్ట్రానిక్‌ వే బిల్లుల విలువ మొత్తం జూన్‌ నెలలో రూ.11.4 లక్షల కోట్లని ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకుంటోందని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజంగా కోలుకుంటే సంతోషించని వారెవరు ? అంతకు ముందు పూర్తి లాక్‌డౌన్‌ విధించటం, జూన్‌లో గణనీయంగా సడలించిన కారణంగా ఈ పెరుగుదల ఉండవచ్చు. సాధారణ స్ధితి నెలకొన్న తరువాత గతంతో పోల్చినపుడు వాస్తవాలు వెల్లడి అవుతాయి.
చరిత్రలో తొలిసారిగా ప్రపంచమంతటా 2020లో ఆర్ధిక పురోగతి తిరోగమనంలో ఉండబోతున్నదని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఇదే సమయంలో చైనాలో ఒకశాతం అభివృద్ధి ఉంటుందని చెప్పింది. చైనా ప్రభుత్వం ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న చైనాను విస్మరించటం సాధ్యం కాదు. అందువలన ప్రతి సంస్ద లేదా ప్రధాన దేశాలన్నీ దాని అభివృద్ధి గురించి తమ తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నాయి.చైనా ఆర్ధిక సంవత్సరం జనవరితో ప్రారంభమౌతుంది. తొలి మూడుమాసాల్లో 6.8శాతం తిరోగమనంలో ఉన్నది కాస్తా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 1.1శాతం పురోగమనంలోకి వచ్చినట్లు జపాన్‌ నికీ తెలిపింది. ఏడాది సగటు 3.3శాతం ఉండవచ్చని తొలుత అంచనా వేసినప్పటికీ దాన్ని ఇప్పుడు 1.6శాతానికి తగ్గించారు. మరో ఆరు నెలల్లో ఏమి జరగనుందో చూడాల్సి వుంది. లాక్‌డౌన్‌ తరువాత పూర్తి స్ధాయిలో అక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి గనుకనే తిరోగమనం నుంచి పురోగమనంలోకి వచ్చింది. మన వ్యవస్ద లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత పురోగమనం నుంచి తిరోగమనంలో జారనున్నట్లు జోశ్యాలు వెలువడుతున్నాయి, ఎంత తేడా !
మన ఆర్ధిక వ్యవస్ధ విషయానికి వస్తే కరోనా ఉద్దీపనగా ప్రకటించిన 21లక్షల కోట్ల పాకేజి ఏమైందో తెలియదు. లడఖ్‌ లడాయితో పాలకులు, వారి కనుసన్నలలో మెలిగే ప్రధాన స్రవంతి మీడియా రోజుకో కొత్త కథతో కాలక్షేపం చేస్తోంది. జనంలో ప్రమాదకరమైన జాతీయ భావనలను రెచ్చగొడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోనందున మిగులు ఏమైందో తెలియదు, జనం మీద మోపిన చమురు పన్నులు, ధరల పెంపు రాబడి ఎటుపోయిందో తెలియదు.గత ఏడాదితో పోలిస్తే తొలి మూడునెలల్లో తెచ్చిన అప్పులు 51శాతం పెరిగాయి, రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయి.
నిరుద్యోగ సమస్య విషయానికి వస్తే మూడుపదుల లోపు యువతీ యువకులు పెద్ద ఎత్తున కరోనా కారణంగా తలెత్తే నిరుద్యోగ బాధితులుగా ఉంటారని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అనేక మంది పట్టణాల్లో ఉండే ఖర్చులను భరించలేక, ఉపాధి లేక గ్రామాలకు తరలి పోయారు. మూడు పదుల లోపు యువతీ యువకులు నైపుణ్యం తక్కువగా ఉండే ఉపాధివైపు ముందుగా మొగ్గుచూపుతారు,పనిలో కొంత నైపుణ్యం సాధించిన తరువాత మెరుగైన ఉపాధిని చూసుకుంటారు. అర్ధిక తిరోగమన, కరోనా మహమ్మారుల వంటి సమయాల్లో యజమానులు ఇలాంటి వారితో ప్రయోగాలు చేసేందుకు సిద్ధ పడరు.కరోనా వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపుతుందో ఎందరిని బలిగొంటుందో తెలియదు గానీ దాని సంక్రమిత సమస్యలు దశాబ్దాల పాటు ఉంటాయని అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వంతుకు విరుద్ధంగా ప్రతి ఆరుగురిలో ఒకరు లేదా 17శాతం మంది యువత మహమ్మారికి ప్రభావితులై ఉపాధి కోల్పోయారని తన తాజా నివేదికలో పేర్కొన్నది. మన దేశంలో అది ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అంచనా.2018-19లో 15-29 సంవత్సరాల వయస్సులోని వారు 17.3శాతం మంది నిరుద్యోగులుగా ఉంటే ఈ ఏడాది మేనెలలో వారు 41శాతం ఉన్నట్లు, 2.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు సిఎంఐయి తెలిపింది. యువతరం పొదుపు చేయలేనట్లయితే అది తరువాతి తరం మీద కూడా ప్రభావం చూపుతుందని సంస్ధ అధికారి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రతి నెలా 13లక్షల మంది పని కావాల్సిన వారిలో చేరుతున్నారు. ప్రస్తుతం దేశంలోని జనాభా తీరుతెన్నులను చూసినపుడు 2040 వరకు పని చేసే వయస్సు వారు తమ మీద ఆధారపడే పిల్లలు, వృద్ధుల కంటే ఎక్కువగా ఉంటారని అయితే కరోనా కారణంగా ఈ పరిస్ధితి వలన కలిగే లబ్దిని కోల్పోతారని, వారికి ఉపాధి కల్పించకపోతే లబ్ది కాస్తా నష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనాకు ముందే యువతకు ఉపాధి కష్టంగా మారిన దేశాల్లో ఒకటిగా మన దేశం మారిన విషయం తెలిసిందే. నాలుగుదశాబ్దాల నాటి నిరుద్యోగ రికార్డును బద్దలు కొట్టటం, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టటం, బయటకు వచ్చినా తప్పుడు లెక్కలని బుకాయించి తరువాత అవి సరైనవే అని చెప్పిన విషయం తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు జీతం ఎంతని కాదు ముందు ఏదో ఒక పని చేయాలనే యావతతో తక్కువ వేతనాలకు యువత సిద్దపడే విషయం తెలిసిందే. తమ తలిదండ్రుల కంటే తక్కువ సంపాదించే దుస్ధితికి లోనవుతారు.
ఏదో ఒక డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వారు 2018లో ఆరుశాతం ఉంటే ప్రస్తుతం 12.7శాతం ఉన్నారు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు పారిశ్రామిక ఉత్పాదక, నిర్మాణ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు.2012 నుంచి అటువంటి పెట్టుబడులు తగ్గిపోతున్నాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో తెలిపింది.2016 నుంచి చూసినపుడు మన దేశంలో 40.5 కోట్ల ఉద్యోగాలకు అటూ ఇటూగా ఉండటం తప్ప పెరుగుదల లేదు. పెద్ద నోట్ల రద్దు, నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం, కంపెనీలు కొత్త సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేకపోవటం, దాంతో కొత్త ఉద్యోగాలు లేకపోవటాన్ని చూస్తున్నాము. సులభతర వాణిజ్య సూచికను ఏటేటా మెరుగు పరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం తప్ప 2019 జూన్‌ నాటికే వాణిజ్యం చేయాలన్న సంకల్పం పదేండ్ల నాటి కంటే తక్కువ స్ధాయికి పడిపోయినట్లు ఒక సంస్ధ సర్వే వెల్లడించింది. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, బ్యాంకుల్లో నగదు లభ్యత పెంపు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జనంలో కొనుగోలు శక్తి ఎంతగానో క్షీణించిందన్న అంశం తెలిసిందే. సరైన ఉద్యోగాలు, సరైన వేతనాలు లేకపోతే జనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన జనాభా గణనీయంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం వారి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది.
దేశ ఆర్ధిక విషయాలకు వస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్ధితిని దాచేందుకు ప్రయత్నిస్తోంది.2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 19.6లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేశారు. తరువాత దాన్ని 18.5లక్షల కోట్లకు సవరించారు. కానీ వాస్తవంగా వచ్చింది 16.8లక్షల కోట్లేనని తేలింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకు ముందు సంవత్సరం కంటే వాస్తవ ఆదాయం తగ్గింది. అంటే అసలు జబ్బు కరోనా వైరస్‌ కంటే ముందే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చమురు పన్ను, ధరలను పెంచుతున్నది. ఈ అడ్డగోలు చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పరు. ఏ విధాన ప్రాతిపదికన ధరలను పెంచుతున్నారో చెప్పని ఒక నిరంకుశ వైఖరి తప్ప మరొకటి కాదు. ఎలాంటి కసరత్తు లేదా సరైన అంచనాలు లేకుండా ప్రారంభించిన జిఎస్‌టితో తలెత్తిన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అవి జనం చావుకు తెచ్చాయంటే అతిశయోక్తి కాదు. చమురు ఉత్పత్తుల మీద పెంచిన అదనపు పన్ను లేదా ధర ద్వారా వచ్చిన ఆదాయం దేనికి ఖర్చు చేస్తారో చెప్పరు.
కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పోనీ ఈ మేరకు లబ్ది పొందిన కార్పొరేట్లు తిరిగి ఆ సొమ్మును పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నాయా అంటే అదీ లేదు.2018-19లో వసూలైన రూ.11.36లక్షల కోట్ల పన్ను మొత్తం 2019-20కి రూ.10.49 లక్షల కోట్లకు తగ్గింది. ఉద్దీపన పేరుతో కార్పొరేట్‌ పన్ను, దానికి సెస్‌, సర్‌ఛార్జి 34.61శాతంగా ఉన్నదానిని 25.17కు తగ్గించారు. 2019 అక్టోబరు ఒకటి తరువాత ఉనికిలోకి వచ్చే సంస్ధలకు ఆ పన్నును 17.01శాతంగా నిర్ణయించారు. ఇక పరోక్ష పన్ను అయిన జిఎస్‌టి విషయానికి వస్తే అంచనా వేసిన విధంగా లేదా కోరుకున్న విధంగా ఏటా 14శాతం పెరగటం లేదు. పధకం ప్రారంభంలో ఉన్న ఆదాయాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఏటా 14శాతం వంతున పన్ను ఆదాయం పెరగకపోతే తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ మొత్తం నుంచి చెల్లిస్తామన్నది రాష్ట్రాలకు చేసిన వాగ్దానం. అంటే కనీసం ఏటా 14శాతం పెరుగుతుందనే అంచనాతో దీన్ని ప్రారంభించారని అనుకోవాలి.2019-20లో ఎనిమిది శాతమే పెరిగాయి. జిఎస్‌టిని 2017జూలైలో ప్రారంభించారు. దేనికైనా కొన్ని ప్రారంభ సమస్యలు ఉంటాయని సరిపెట్టుకుందాం.అలాంటివి 2017-18 ఆర్ధిక సంవవత్సరంలోనే బయట పడ్డాయి. తరువాత సంవత్సరాలలో ఆదాయం తగ్గటానికి ఇంకా ప్రారంభ సమస్యలే అని చెప్పటం సమర్ధనీయం ఎలా అవుతుంది. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే వైఫల్యం అనాలి. ఈ విధానం కారణంగా మద్యం, చమురు ఉత్పత్తుల వంటి కొన్నింటి మీద తప్ప మిగతా అంశాల మీద రాష్ట్రాలు పన్నులు విధించే లేదా తగ్గించే అవకాశాలు లేవు.
దీని పర్యవసానాలు ఇంకా పూర్తిగా ప్రభావం చూపటం లేదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు,జిఎస్‌టి వైఫల్యం, దేశంలో తలెత్తిన ఆర్ధిక మాంద్యం కారణంగా బడ్జెట్లలో భారీ లోటు ఏర్పడుతోంది. దాంతో కేటాయింపులకు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక సబ్సిడీలను ఎత్తివేశారు. ఎరువుల సబ్సిడీలను పరిమితం చేశారు. కొన్ని సంక్షేమ పధకాలకు కోతలు పెట్టారు, మిగిలిన వాటికి రానున్న రోజుల్లో కోతలు పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లోటు బడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు భారాలు మోపటం పెట్రోలియం ఉత్పత్తులతో ప్రారంభమైంది. అంతకు ముందే అనేక రాష్ట్రాలు ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మి లోటును పూడ్చుకున్నాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడి పెడితే ఉపాధి పెరుగుతుందని సరిపెట్టుకోవచ్చు దానికి బదులు కేంద్ర ప్రభుత్వం లాభాలు రానివాటినే కాదు వచ్చే వాటిని కూడా వదలించుకొని లోటును పూడ్చుకొనేందుకు నిర్ణయించింది.
కేంద్రం లేదా రాష్ట్రాలు చమురు ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్నాయి. ఇది ఆర్ధిక వ్యవస్దను మరింతగా దెబ్బతీయనుంది. అత్యధికంగా వినియోగమయ్యే డీజిల్‌ మీద గతంలో సబ్సిడీ ఇచ్చిన కారణంగా ధరలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేశారు. ధరలు కూడా పెట్రోలు కంటే డీజిల్‌ మీద ఎక్కువ పెంచారు. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు, ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ వినియోగంలో ఉన్నదాని మీద పిండుకోవాలంతే ! ఆదాయపన్ను రేటు పెంచితే ధనికులకు ఆగ్రహం వస్తుంది కనుక దాని జోలికి పోరు. చమురు ధరలు పెంచితే అధిక భారం మోసేది సామాన్య, మధ్యతరగతి వారే. నిత్యావసర వస్తువుగా ఉన్న చమురు ధర పెరిగితే వినియోగం పెద్దగా తగ్గే అవకాశాలు లేవు. పరోక్షంగా దానికి చెల్లింపుల కారణంగా ఇతర వస్తువినియోగం మీద పడి, డిమాండ్‌ తగ్గుదలకు దోహదం చేస్తుంది. అది ఉత్పాదకత తగ్గేందుకు, ఉపాధి పరిమితం, నిరుద్యోగం అపరిమితం అయ్యేందుకు తోడ్పడుతుంది.ధరలు పెరుగుతాయి. ఈ విషయాలను దాచిపెట్టి జనం దృష్టిని మళ్లించేందుకు పాలకులు రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు, అంతుబట్టని ఉగ్రవాద ఉదంతాలు వాటిలో భాగమే అని అనేక మంది నమ్ముతున్నారు. ఏతా వాతా చెప్పవచ్చేదేమంటే ప్రభుత్వాలు లోటుబడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు ధనికుల మీద, కార్పొరేట్‌ పన్నుల ద్వారా పూడ్చుకోవాలి తప్ప జనం మీద భారాలు మోపితే అది మొత్తం ఆర్ధిక వ్యవస్ధనే దెబ్బతీస్తుంది. దేశంలో ఇప్పుడు జరుగుతోంది అదే. ఈ దివాలా కోరు, ప్రజావ్యతిరేక విధానాలకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. గతంలో విధానాల వైఫల్యం ధరలు, నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుదల వంటి సమస్యలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా జనాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఊహించటం కష్టం !
గమనిక : ఈ విశ్లేషణ తొలుత 2020 జూలై 12వ తేదీ నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైంది. దాని నవీకరణలో భాగంగా తాజా అంశాలు జోడించటమైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ ముందున్న సవాళ్లు, సమస్యలూ !

29 Wednesday May 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Indian economy, Issues and Challenges before Narendra Modi, Narendra Modi, pakoda, pakoda self employment

Image result for Issues and Challenges before Narendra Modi

ఎం కోటేశ్వరరావు

రాజకీయనేతలు, ప్రత్యేకించి ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు క్లిషంగా వున్నపుడు తమ అధికారాన్ని పదిల పరచుకొనేందుకు జాతీయవాదాన్ని ఒక సాధనంగా చేసుకుంటారు అని రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ అనే అమెరికన్‌ దౌత్యవేత్త చెప్పారు. అమెరికన్ల దృష్టిలో జాతీయ వాదం అంటే ఒక దేశం లేదా ప్రపంచ మీద లేదా మార్కెట్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే వాదం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి జాతీయ వాదం. అదే జాతీయ వాదం మరొక దేశం కూడా కలిగి వుంటే జరిగేది ఘర్షణే. అయితే మన దేశంలో జాతీయవాదులుగా చెప్పుకొనే బిజెపి, సంఘపరివార్‌ది అటువంటిది కాదు, హిందూత్వ జాతీయ వాదం. దాని మంచి చెడ్డలను పక్కన పెడితే హాస్‌ చెప్పిన ఆర్ధిక, రాజకీయ క్లిష్ట పరిస్ధితులు ఏ జాతీయవాదులకైనా వర్తిస్తాయి. అధికారం ఒక ముళ్ల కిరీటం, నరేంద్రమోడీ రెండవసారి దాన్ని మరోసారి ధరించబోతున్నారు. ఆయన ఘనతను జాతీయ వాదుల విజయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణించింది. ప్రస్తుతం నరేంద్రమోడీకి రాజకీయ క్లిష్ట పరిస్ధితులు లేవు. ఎందుకంటే ఆ పార్టీకే సంపూర్ణ మెజారిటికీ మించి లోక్‌సభలో సీట్లు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రాజ్యసభలో కూడా మెజారిటీ రానుందనే వార్తలను మనం చూశాము. అందువలన నరేంద్రమోడీ ముందు ఆర్ధిక పరమైన, ఇతర సవాళ్లు ఏమి వున్నాయి, వాటి స్వభావం ఏమిటన్నది చూద్దాం.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు లేదా అధికారం కోసం పాకులాడే పార్టీలు గానీ అర్ధసత్యాలను, అసత్యాలనే చెబుతాయి. నిజం చెప్పే వారిని పరిగణనలోకి తీసుకొనే లేదా వారు చెప్పే అంశాలనైనా చర్చించే స్ధితిలో ప్రస్తుతం మన జనం, మీడియా లేదు. ఎన్నికలు ముగిశాయి కనుక వాస్తవ దృక్పధంతో సమస్యలను చూడటం అటు జనానికి, ఇటు నరేంద్రమోడీ పది కాలాలపాటు వుండాలని కోరుకొనే వారికి కూడా అవసరం.

ఆర్ధిక అంకెలే అసలు సమస్య !

తన పాలనా కాలంలో సూట్‌ కేస్‌ కంపెనీలలో చాలా వాటిని మూసివేయించానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషించాల్సిన అంశమే. అయితే ఆ బోగస్‌ కంపెనీలు ఇచ్చిన సమచారాన్ని కూడా కలిపి అభివృద్ధి అంకెలను తయారు చేశారని, అందుకే అభివృద్ధి జరిగినట్లు కనిపించినా ఆచరణలో వుపాధి పెరుగుదల కనిపించలేదన్న ఒక విమర్శ వుంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టించిదీ, ఎన్ని గ్యాస్‌ పొయ్యిలు ఇచ్చిందీ, ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిందీ, ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందీ ఏ బిజెపి కార్యకర్తను అడిగినా గడగడా చెప్పారు గాని, వాగ్దానం చేసినట్లుగా ఎన్ని వుద్యోగాలు కల్పించారు అంటే తయారు చేసిన అంకెలు సక్రమంగా లేవని, వాస్తవ స్ధితిని ప్రతిబింబించే లెక్కలను తయారు చేస్తున్నామని నరేంద్రమోడీయే స్వయంగా చెప్పారు కనుక వాటిని వెల్లడించాలి. పకోడీల బండి పెట్టుకోవటం కూడా వుపాధి కల్పనలో భాగమే అని చెప్పినందున ఎంత మంది పకోడీలు, బజ్జీలు , టీ అమ్ముతూ వుపాధి పొందుతున్నారు అనే వాటితో సహా అన్ని వివరాలు తెలుసుకోవటం జనానికి సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది.

రెండువేల పదమూడో సంవత్సరం జూన్‌ తరువాత మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరం మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక గతేడాదితో పోల్చినప్పుడు నిరపేక్షంగా 0.1శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వ ద్ధి ఫిబ్రవరిలో కేవలం 0.07మాత్రమే ఉంది. అలాగే జనవరిలో 1.7శాతం, డిసెంబరులో 2.6శాతం, నవంబరులో 0.3శాతంగా నమోదు అయింది. క్లుప్తంగా చెప్పాలంటే కొంతకాలంగా పారిశ్రామిక వ ద్ధి మందగిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పారిశ్రామిక రంగంలో పాతవైనా, కొత్త పరిశ్రమల్లో అయినా ఆధునిక యంత్రాలను, కంప్యూటర్లు, రోబోట్లను ప్రవేశపెడుతున్నారు. గుమస్తాలు చేయాల్సిన పనులను కంప్యూటర్లు చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల లాభాల రేటు తగ్గలేదు, నష్టాలు వచ్చి ఫలానా తరహా పరిశ్రమ మూతపడింది అనే సమాచారాన్ని కూడా పాలకులు మనకు చెప్పలేదు కనుక అంతా బాగుందనే అనుకోవాలి. ఇక్కడే సమస్య వస్తోంది.

రైతు లేనిదే రాజ్యం లేదు !

పదిహేను సంవత్సరాల క్రితం దేశ జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 21శాతంగా వున్నది కాస్తా ఇప్పుడు 13శాతానికి పడిపోయింది. అయితే ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆ దామాషాలో తగ్గలేదు. దేశంలో పనిచేసే వారిలో 55శాతం మంది అంటే 26 కోట్ల మంది వ్యవసాయ రంగంలో వున్నారు. అంటే జనాభాలో సగానికి పైగా దాని మీదే ఆధారపడి వున్నట్లు లెక్క. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగంలో తలెత్తిన సమస్యలు అనేక రాష్ట్రాలలో రైతులను రోడ్ల మీదకు తెచ్చాయి. నరేంద్రమోడీ కంటే తెలంగాణాలో చంద్రశేఖరరావు సర్కార్‌ రైతు బంధుపేరుతో ఎక్కువ మొత్తాలు చెల్లించిన నిజామాబాదులో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరగురించి చేసిన ఆందోళన, ఎన్నికల్లో దాని పర్యవసానాలను ఏ పాలకులైనా గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ మంతటా వ్యవసాయ పంటల ధరలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కాదు. ప్రాణం పోకుండా చేసే ప్రాధమిక చికిత్స వంటివే. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అరుంధతి నక్షత్రంలా వుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ అవసరం అని యంత్రాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. అవి పారిశ్రామికవేత్తల, వాణిజ్యవేత్తల జేబులు నింపుతున్నాయి తప్ప రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది పెద్ద ప్రశ్న. మరోవైపున యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కార్మికులకు వుపాధిపోయి వారంతా నిరుద్యోగసేనలో చేరుతున్నారు. చేతివృత్తుల వారి పరిస్ధితీ అంతే. అందువలన ఈ పెద్ద సమస్యను పరిష్కరించకుండా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్ధితినే నరేంద్రమోడీ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది.

Image result for Narendra Modi, pakoda

నిరుద్యోగ సమస్య తీరు తెన్నులేమి !

నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారనే విమర్శను మోడీ సర్కార్‌ ఎదుర్కొన్నది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధిచిన సమాచారాన్ని ప్రచురించటానికి తిరస్కరించటం సహజంగానే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదైనా మూసి పెడితే పాచిపోతుంది అని తెలిసిందే. ఆ సమస్య మీద సంబంధిత వున్నత అధికారి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వ గణాంక కార్యాలయం నుంచి లీక్‌ అయిన నివేదిక ప్రకారం నిరుద్యోగం 6.1శాతందాకా ఉంది. ఇది గత 45సంవత్సరాలలో అత్యంత గరిష్టం. ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 7.6శాతం ఉందని ద సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. నిరుద్యోగం రేటులో చలనాలు నిరుద్యోగం ఏ దిశగా పయనిస్తుందో సూచిస్తాయని తెలుసుకోవాలి. కేవలం రేటుతో సమస్య తీవ్రత తెలియదు. ఎందుకంటే భారతదేశంలో అనేకమందికి పూర్తి కాలం ఉద్యోగం ఉండటం, పూర్తి కాలం ఉద్యోగం లేకపోవటం కాకుండా ఉద్యోగిత కొంతకాలమే ఉంటుంది.

దేశంలో జనాభా 136 కోట్లు, వారిలో పని చేయగలిగిన వారు 15-64 సంవత్సరాల వయసు వారు అనుకుంటే 91 కోట్ల మంది వుంటారు.అయితే వారంతా వుద్యోగాల కోసం చూస్తారని కాదు గాని మన వంటి దేశానికి, ఏ పాలకులకు అయినా అదొక పెద్ద సమస్య అని చెప్పక తప్పదు. దీన్ని పరిష్కరించకుండా, వాగ్దానం చేసిన మాదిరి ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాలు కల్పించకుండా జనానికి ‘మంచి రోజులు ‘ రావు కదా ! నల్లధనాన్ని వెలికి తీసి బాత్‌రూముల్లో, మంచల మీద దాచిన సొమ్మును చలామణిలోకి తెచ్చి వుత్పాదక, వుపాధి అవసరాలకు అందుబాటులోకి తెస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అలాగే పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎగవేతలను అరికట్టేందుకు అని చెప్పి జిఎస్‌టిని ప్రవేశపెట్టారు. దాని వలన పెద్ద ఎత్తున వుపాధి పోయిందని జనం గగ్గోలు పెడితే ఒక చర్య ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడినా జనం వాటిని మరచిపోయి నరేంద్రమోడీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ రూపంలో జనానికి వుపయోగపడుతున్నాయో చూపించాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌ ముందు వుంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్ధ మోడీ సర్కార్‌ కంటే ముందే ఏర్పడింది. అనేక అంశాలను అది ఎప్పటికపుడు వెల్లడిస్తోంది. అలాంటి సంస్ధ ఇచ్చిన లెక్కల ఆధారంగానే 2014లో నరేంద్రమోడీ రెండు కోట్ల వుద్యోగ కల్పన వాగ్దానం చేసినట్లు మరచి పోరాదు. 2016లో పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి పర్యవసానాల కారణంగా 2018లో కోటీ పదిలక్షల మందికి వుపాధి పోయిందని ఆ సంస్ధ చెప్పింది. ఆ సంస్ధతో పోల్చితే ప్రభుత్వానికి వున్న పెద్ద యంత్రాంగం అసలు వాస్తవాలను బయట పెట్టాలి. లేకపోతే విశ్వసనీయత సమస్యను సర్కార్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భవిష్యత్‌ కోసం నాకు ఓటు వేయండని నరేంద్రమోడీ స్వయంగా కోరిన విషయాన్ని మరచిపోరాదు.

ఇండియా స్పెండ్‌ వెబ్‌ సైట్‌ విశ్లేషణ ప్రకారం అనేక నెలలుగా నిరుద్యోగశాతం ఏడుశాతానికి అటూ ఇటూగా వుంది. ప్రతి ఏటా 1.2కోట్ల మంది వుద్యోగార్ధులు అడ్డామీదకు వస్తున్నారు.వారిలో కేవలం 47.5 లక్షల మందికి మాత్రమే పని దొరుకుతోంది.దేశ జనాభాలో 80శాతం హిందువులే వున్నారు, అంటే నిరుద్యోగుల్లో కూడా వారి వాటా అంతకు తగ్గదు. ఈ సమస్య ఏ క్షణంలో అయినా పేలే టైంబాంబు వంటిది, అది పేలకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. కాబట్టి నిరుద్యోగితను తగ్గించటానికి ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలి.ఏం చేస్తారో ఎన్నికల్లో చెప్పలేదు. ఇప్పుడా పని చేసి యువతకు భరోసా కల్పించాలి.

ధనమేరా అన్నిటికీ మూలం !

నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలు, రేపిన ఆశలు వేటిని నెరవేర్చాలన్నా కావాల్సింది ధనం.సంపదల సృష్టి లేకుండానే నోట్లను ముద్రిస్తే ప్రయోజనం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగా ఎంతకాలం చెప్పుకుంటాం అంటూ ఎన్‌డిఏ కొత్త ఎంపీల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మన దగ్గర మంత్రదండాలేమీ లేవు.

పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.6శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్చిలో ఇది 0.4శాతం తగ్గింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 8.7శాతం, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ 5.1శాతం, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ 2.5శాతం క్షీణించటం, కన్సూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 0.3శాతం పెరగటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వ ద్ధి కేవలం 3.6శాతంగా నమోదైంది. 2017-18 సంవత్సరంలో నమోదైన 4.4శాతంతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే ఆర్థిక సంవత్సరంలోని తరువాతి నెలల్లో మాంద్యం తీవ్రమైంది.

ఎగుమతులు, వినియోగమూ పెరగాలి !

మాంద్య పరిస్ధితులు ఏర్పడినపుడు అభివృద్ది రేటు పెరగకపోగా పతనం అవుతుంది. మనది ఎగుమతి ఆధారిత వ్యవస్ధ కాదు. అనేక దేశాల వ్యవస్ధలతో పోల్చుకుంటే మన ఎగుమతులు పరిమితమే. మేకిన్‌ ఇండియా పేరుతో గత ఐదు సంవత్సరాలలో జరిగిందేమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. మన ద్రవ్యోల్బణం అదుపులో, తక్కువగా వుందని మన పాలకులు, అధికారులు తరచూ చెబుతుంటారు. అంటే ధరల పెరుగుదల కూడా తక్కువగా వుందని అర్ధం.అలాంటపుడు వినియోగం పెరగాలి, వినియోగం పెరిగితే పైన పేర్కొన్న విధంగా తయారీ రంగం వెనుక పట్టు పట్టదు. వివిధ రంగాల సమాచారాన్ని విశ్లేషించినపుడు గత నాలుగు నెలల కాలంలో మన వినియోగం తగ్గుతోందన్నది స్పష్టం. అది విదేశీ దిగుమతులైన బంగారం, రాళ్లు, ఆభరణాల వంటివి అయితే మనకే లాభం కాని మనదేశంలో తయారయ్యే వస్తు వినియోగం తగ్గితే అది ప్రమాదకరం. మారుతీ కంపెనీ మిగిలిపోతున్న కార్లను తగ్గించుకొనేందుకు వుదారంగా కార్మికులకు ఒకరోజు సెలవు ఇచ్చిందని వార్త చదివాము. ఒకవైపు మన మధ్యతరగతి మార్కెట్‌ బ్రహ్మాండంగా వుందని చెప్పుకుంటున్నపుడు మారుతీ కార్లెందుకు అమ్ముడుపోవటం లేదు, లేదా మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశాలకు ఎందుకు ఎగుమతి కావటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

Image result for Challenges before Narendra Modi

పర్యవసానాలు ఎలా వుంటాయి !

కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నా 1991 నుంచి అనుసరిస్తున్నది నయా ఉదారవాద విధానాలే. ఆ విధానం మార్గాంతరం లేని స్థితికి చేరుకోగా, దాని స్థానాన్ని ఆక్రమించటానికి దేశీయ మార్కెట్‌ ఆవిర్భవించనప్పుడు ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలవలెనే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అనిశ్చిత స్థితిలో కూరుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం భారత, చైనా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ఇది ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటం కారణంగా జరుగుతోంది. అయితే తగ్గిన ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటంవల్ల ఏర్పడిన దుస్థితిని పాక్షికంగానైనా సరిదిద్దటానికి దేశీయ మార్కెట్‌ను విస్త తపరచలేదు. అలా జరగకపోగా అదే సమయంలో గ్రామీణ నైరాశ్యంవల్ల, ఎగుమతుల వ ద్ధి మందగించటం వల్ల ఏర్పడే ద్వితీయ శ్రేణి ప్రభావాల కారణంగా, నిరర్ధక ఆస్తుల పరిమాణం పెరగటంవల్ల, ఇతర విషయాలతోపాటుగా దీనివల్ల పారిశ్రామిక వ ద్ధి మందగించటం వల్ల పెద్ద ఎత్తున అవసరమయ్యే వ్యయాలకు అందుబాటులో వుండే రుణ సౌకర్యం బలహీనపడింది. పర్యవసానంగా దేశీయ మార్కెట్‌ కూడా కుదింపునకు గురయింది. వేరేమాటల్లో చెప్పాలంటే ఎగుమతుల వ ద్ధిలో ఏర్పడిన మందగమనానికి విరుగుడుగా తుల్యాన్ని సాధించనందున దేశీయమార్కెట్‌ కుదింపునకు గురయింది. దానితో ఎగుమతుల వ ద్ధి మరింతగా దెబ్బతింది. కన్‌స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగం కుదింపునకు గురికావటం, కన్‌స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్‌ రంగం గత ఏప్రిల్‌తో పోల్చినప్పుడు స్తంభించటమనే వాస్తవాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికే కుదింపునకు గురైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు క్షీణిస్తున్నాయని సూచిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తరువాత తెలుస్తాయని మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అంతకు ముందే పెట్టుబడుల కోసమే తరచూ విదేశీ ప్రయాణాలు చేశానని మోడీ చెప్పారు. మరి వాటి ఫలితాలు, పర్యవసానాలను ఇప్పుడు జనానికి చూపాలి, లేకపోతే వేరే విధంగా అర్ధం చేసుకొనే ప్రమాదం వుంది.

బ్యాంకింగ్‌ రంగం ఎందుకు సమస్యల్లో వుంది?

అంతా బాగుంది అని చెప్పుకుంటున్న ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్ధులు ఎందుకు పెరిగాయి అంటే గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులే కారణం అని చెప్పారు. అదింకేమాత్రం చెల్లదు. నిబంధనల ప్రకారం గడువు మీరి వాయిదాలు చెల్లంచని వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించటం, వాటి ఆస్ధులను స్వాధీనం చేసుకొని సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండులక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు బదలాయించింది. ఎన్నడూ లేని స్ధాయిలో 2018డిసెంబరు నాటికే నిరర్ధక ఆస్తులు ఎనిమిది క్షల కోట్లకు చేరాయి. రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ ఇటీవలి కాలంలో టెలిమార్కెటర్లు జనాన్ని ఫోన్ల మీద చంపుతున్నారు. బ్యాంకులు తమ దగ్గర డబ్బు నిల్వవుంచుకుంటే వాటికి వడ్డీ దండుగ. అందుకే అవి వెంటపడుతున్నాయి. అయినా వాటి ఫలితాలు ఆర్ధిక రంగం మీద పెద్దగా ప్రతిఫలించటం లేదు. ఈ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలు గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమన పథకాలను ప్రవేశపెడతామని మాట ఇచ్చాయి. దానితో తప్పకుండా దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అది పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరింపబడటానికి దారితీస్తుంది. చిన్న రైతు కుటుంబాలకు చెందిన 12కోట్లమందికి వార్షికంగా తలసరి 6000రూపాయలను అందిస్తానని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో మరింత ముందుకుపోయింది. న్యారు పథకం ద్వారా అత్యంత అథమస్థాయిలో గల 5కోట్ల కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి రూ.72,000 సమకూరుస్తానని మాట ఇచ్చింది. ఈ పథకాలవల్ల దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అయితే ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమంటే ఈ పథకాలకు అవసరమైన వనరులను ఎలా సమకూరుస్తారు అనేదే.

సంపన్నుల నుంచి అధికంగా వసూలు చేయాలి !

సంపన్నులపై పన్ను వేయటం ముఖ్యంగా భారతదేశంలో అస్థిత్వంలో కూడా లేని సంపదపై పన్నును విధించటం ద్వారా గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వనరులను సమకూర్చుకోవటానికి ఇది మనముందున్న స్పష్టమైన మార్గం. అయితే దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వనరులను సమకూర్చుకోవటం అంత కష్టం కాదని, అయితే నయా ఉదారవాద వ్యవస్థలో వనరులను అన్వేషించటం కష్టతరమౌతుందని కాంగ్రెస్‌ పార్టీ న్యారు పథకాన్ని ప్రకటించినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ నర్మగర్భంగా అన్నారు. ఆ విధంగా ఒకవేళ ఈ పథకానికి కావలసిన వనరులను విత్తలోటుతో కూడా పాక్షికంగా సమకూర్చుకోవచ్చనుకున్నా అటువంటి విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో అనుమతించబడిన 3.4శాతం పరిమితిని మించుతుంది. అప్పుడు అది భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించటానికి దారితీస్తుంది. దానితో విదేశీ మారకపు చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)కు చెందిన కరెంట్‌ ఖాతా లోటును పూడ్చటం కష్టమవుతుంది. అమెరికా ఆదేశం మేరకు భారతదేశం బహిరంగ మార్కెట్‌ కంటే చౌకగా లభించే ఇరాన్‌ చమురును కొనుగోలు చేయకపోతే ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అమెరికా ఆదేశాన్ని పాటిస్తానని మోడీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలవల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే కరెంటు ఖాతా లోటు మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ దీనికి అదనంగా విత్తలోటులో పెరుగుదల పరిమితిని మించితే భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ పడిపోయి దేశంలోకి వచ్చే ద్రవ్య ప్రవాహాలు ఎండిపోతాయి. ఈ లోటును సాధారణ మార్గాలలో పూడ్చగలుగుతామనే ఆశ నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక విపరీత స్థితిలో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ముంచుకొస్తున్న మాంద్యాన్ని అధిగమించా లంటే కరెంటు ఖాతా లోటును పూడ్చటం దానికి కష్టమౌతుంది. మరోవైపు మాంద్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఇప్పటికే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది.ఈ సమస్యను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా అధిగమిస్తుందన్నది శేష ప్రశ్న !

మైనారిటీలకు భరోసా కల్పించాలి !

ఏ దేశంలో అయినా మైనారిటీలు అభద్రతకు గురౌతారు. ఇది అంతర్జాతీయంగా వున్న పరిస్ధితి. మన దేశంలో అంతకంటే ప్రత్యేక పరిస్ధితులు వున్నాయి. మెజారిటీ జనాన్ని సంతుష్టీకరించేందుకు మైనారిటీల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోలేదనే విమర్శ ప్రభుత్వం మీద ఇప్పటికే వుంది. ఎన్నికలు ముగియటంతోనే మైనారిటీలను వేధించే శక్తులు విజృంభిస్తున్నాయని తాజాగా జరిగిన రెండు వుదంతాలు స్పష్టం చేశాయి. బీహార్‌లో పేరు అడిగి మరీ తుపాకితో దాడి చేసిన వుదంతం, దేశ రాజధాని పక్కనే వున్న గురుగ్రామ్‌లో జై శ్రీరాం అనేందుకు తిరస్కరించినందుకు దాడి, మధ్య ప్రదేశ్‌లో ఆవు మాంసం కలిగి వున్నారంటూ జరిగిన దాడులు పరిమితమే అయినా దేశ వ్యాపిత చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి శక్తులను తక్షణమే అదుపు చేయలేకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో సబ్‌ కా విశ్వాస్‌( అందరి విశ్వాసం) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే అందరి అభివృద్ధికి అందరితో కలసి పనిచేస్తామని చెప్పిన మాటలను ఆచరణలో నిరూపించుకోవాలి.

నోటి తుత్తరను అదుపు చేయాలి !

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మిగతా పార్టీల కంటే బిజెపి వారి మీదనే ఎన్నికల సంఘం ఎక్కువగా చర్యలు తీసుకున్నది. తీసుకోవాల్సినన్ని, తీవ్ర చర్యలు లేవనే విమర్శలు సరేసరి. దేశ నాగరికత, విలువలకు ప్రతీక అని వర్ణించిన సాధ్వి ప్రజ్ఞ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని కీర్తించటం తెలిసిందే. దానిని బిజెపి ఆమోదించకపోవటం కాదు, అసలు అలాంటి శక్తులను భవిష్యత్‌లో ఎలా అదుపు చేస్తారన్నదే సమస్య. ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో అలాంటి వారి గురించి మోడీ చేసిన హెచ్చరికను తు.చ తప్పకుండా అమలు చేయాలి.

Image result for Issues and Challenges before Narendra Modi

ఇరుగు పొరుగుతో సంబంధాలు !

ఇరుగు పొరుగుతో సంబంధాలు సజావుగా వుంటే దేశం అనేక విధాలుగా లబ్ది పొందుతుంది.ముఖ్యంగా ఆయుధాలు, మిలిటరీ ఖర్చును తగ్గించుకోవచ్చు.ఆ సొమ్మును వుపాధి కల్పన, సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. వుగ్రవాద సమస్యను ఎన్నికల ప్రచారానికి, ఓట్ల లబ్దికి వినియోగించుకున్నారన్న విమర్శలు దాస్తే దాగేవి కాదు. నిజానికి అవి నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మేలు చేసేవి కాదు. పాక్‌తో సంబంధాలు నిరంతర సమస్యలు తెచ్చిపెడుతున్నవే. అయితే నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రెచ్చగొట్టటాన్ని జనం కొంత మేరకు అర్ధం చేసుకుంటారు. మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. వుగ్రవాది మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల పట్ల వర్తించే విధంగా వుండాలి. అందుకు సంఘపరివార్‌ నోటి తుత్తర బ్యాచిని అదుపు చేయాల్సి వుంటుంది.

ఇక చివరిగా విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాతో మరింతగా కలసి ముందుకు పోతే మనకు సమస్యలే తప్ప రిగే ప్రయోజనం లేదు. మా దేశానికి వస్తూ మాకేమి తెస్తారు, మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తారనే వైఖరే దానిది. అమెరికాలో వున్న మన వారి కుటుంబీకులు వుద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆందోళన కలిగించేవి. ఒక మిత్ర దేశంగా చేయాల్సినవి కాదు. ఇప్పటికే వాణిజ్యంపై అమెరికా నియంత్రణలను ప్రవేశపెడుతున్నది. భారతదేశం కూడా అమెరికా కార్యశీలత నీడలో అటువంటి నియంత్రణలను ప్రవేశపెట్టి వుండాల్సింది. అయితే నయా ఉదారవాదం మార్గాంతరంలేని స్థితికి చేరుకున్నదనే వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించినట్టు కనపడటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దాని లక్షణం. అంటే సంపన్నులు మరింత సంపన్నులౌతారు, మిగిలినవారు మరింత దిగజారి పోతారు. అటువంటి పరిస్ధితి రానున్న రోజుల్లో మరింత వేగిరం కానున్నది. దీనిని మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది నిజంగా పెద్ద సవాలే. ప్రారంభం అమెరికా దౌత్యవేత్త చెప్పిన అంశంతో ప్రారంభమైంది. ముగింపు కూడా దానితోనే చేద్దాం. జాతీయ వాదం ఇతరులను అణచివేసేందుకు ఒక మార్గం అని అమెరికా సామాజికవేత్త చోమ్‌ నోమ్‌స్కీ చెప్పారు. నరేంద్రమోడీ అందుకు తన జాతీయ వాదాన్ని వినియోగించరని ఆశిద్దాం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూద్దాం !

16 Sunday Oct 2016

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, economic reforms, INDIA, Indian economy, Riding on flying horses

Image result for narendra modi on flying horse

సత్య

   రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూసే బాల్యం నాటి వూహలు, కథలు జీవితాంతం గుర్తుంటాయి. మన పూర్వీకులు పెట్రోలు, పైలట్లతో పని లేకుండా ఒక లోకం నుంచి మరో లోకానికి, పైకీ, కిందికీ, ఎటుబడితే అటు తిప్పుతూ ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు వుండే విమానాలలో తిరిగే వారని వయస్సు వచ్చిన వారికి, అందునా చదువుకున్న వారికి చెప్పటమే కాదు, వారి చేత నమ్మింప చేస్తున్న రోజులి. ఇక ప్రతిదానినీ ముందుగానే వూహించి చెప్పారంటున్న పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనాలను మనకు సరికొత్తగా అందించే మహానుభావుల సంగతి సరే సరి. ఈ కారణంగానే మన నిఘంటువులో అసాధ్యం అనే దానికి ఒక్క వుదాహరణ కూడా దొరకని తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం.దీనికి తోడు సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది సంక్షోభ స్థాయికి చేరింది.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది తెలుగు సామెత. ఒక పేదవాడు పండుగకో, పబ్బానికో అని కొనుక్కున్న దుస్తుల మీద ఏదైనా పడితే మరకగా మారుతుందేమోనని ఎంత కంగారు పడిపోతాడో తెలిసిందే. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాల మీద ఒక మరక పడితే తల్లడిల్లి పోతారని పాత పుస్తకాల్లో చదువుకున్నాం. అంతరించి పోతున్న అలాంటి వారు ఎక్కడన్నా కనపడతారేమోనని పాతాళభైరవి దురి&భిణి వేసి చూసినా కనిపించటం లేదు . ఇక ‘బ్రహ్మం గారు చెప్పినట్లు ‘ అధికారం రుచి మరిగిన మన రాజకీయ నాయకుల గురించి ఇక చెప్పుకోనవసరం లేదు. ఎన్ని మరకలు పడితే అంతగా మార్కెట్లో డిమాండు వుంటుందనే సత్యాన్ని బోధి చెట్టు కింద కూర్చోకుండానే తెలుసుకున్న అపర జ్ఞానులు. ఎదుటి వారి మీద మరకలు వేయటం, తాము వేయించుకోవటంలో ఆరితేరిన వారు. ఒక వ్యాపారి ‘మరకు మంచిదే ‘ అంటూ తన వుత్పత్తులను అమ్ముకోవటానికి ఒక మరక నినాదాన్ని సృష్టించి నిజంగా మరక పడటం మంచిదే అని జనం అనుకునేట్లుగా వాణిజ్య ప్రకటనలను తయారు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యాపారులు కూడా అలాంటి ఎక్కువ మరకలున్నవారి కోసం నిత్యం ఎదురు చూస్తూ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సరకులకు ‘నియోజక వర్గ అభివృద్ధికోసం, కార్యకర్తల అభీష్టం మేరకు, మా నేత అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, స్వగృహ ప్రవేశం ‘ వంటి ఎన్నో ట్యాగులను కూడా రూపొందించిన మేథావులు.

    1848లో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు మానిఫెస్టోను కమ్యూనిస్టు పార్టీలు అనేక ముద్రణలు, ప్రపంచ భాషలన్నింటిలోనూ తర్జుమా చేయటం మామూలు విషయం. ఈ విషయంలో బైబిల్‌తో పోటీ పడేది ఏదైనా గ్రంధం వుందంటే అది ముమ్మాటికీ కమ్యూనిస్టు మానిఫెస్టో ఒక్కటే. కార్మికుల శ్రమ శక్తి నుంచి లాభాలను పిండుకోవటం గురించి తేటతెల్లం చేసిన ఆగ్రంధాన్ని, అది వ్యాపింపచేసిన భావజాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించని పెట్టుబడిదారుడు, బడా వ్యాపారి వుండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ అదే పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోకు మార్కెట్‌లో వున్న గిరాకీని బట్టి దానిని ముద్రించి లాభాలు ఆర్జించటమే అసాధారణం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పుకుంటున్న ఇండోనేషియాలో ఈనెలలోనే ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు మానిఫెస్టో గ్రంధాన్ని చూసిన మిలిటరీ గూఢచారులు ఇంకేముంది ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ పుస్తకాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి గంటల కొద్దీ విచారణ పేరుతో నిర్బంధించారు. దానిని ప్రచురించిన వారు అబ్బే మాకు కమ్యూనిజం ఏమిటి, దాన్ని వ్యాపింప చేయట ఏమిటి, అమ్ముడు పోయే పుస్తకాలన్నీ ప్రచురించటం, అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదని చెప్పిన తరువాత వారిని వదలి వేశారు. తమకు లాభదాయకం అనిపించింది కనుకనే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టు వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించి లాభపడ్డారు. అదే సామ్రాజ్యవాదులు కమ్యూనిజాన్ని కూడా సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించి చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే లాభం వస్తే వ్యాపారి అవసరమైతే తనను తానే అమ్ముకోవటానికి కూడా వెనుతీయని ‘త్యాగశీలి’.

   పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాల కోసమే కదా ఇండియాకు సముద్రమార్గం కనుగొనమని కొలంబస్‌ను పురికొల్పారు. దారి తెలియనపుడే అంతగా తహతహలాడిన వారు ఇప్పుడు ఎక్కడ లాభం వస్తుందో స్పష్టంగా తెలిసిన తరువాత అక్కడ వాలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? లాభానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఎప్పుడూ దేశ భక్తి వుండదు. లాభం వస్తే ప్రాణాలు హరించే వరదల్లో కూడా వెళ్లేందుకు సిద్దపడే వ్యాపారులు మన మార్కెట్లో ప్రవేశించేందుకు సామ,దాన,బేధో పాయాలను ప్రయోగించారు. వివిధ ప్రాంతాలలో వేర్పాటు, వుగ్రవాద శక్తులు వాటిలో భాగమే. కమ్యూనిజం అని మడి కట్టుకు కూర్చుంటే లాభాలు వస్తాయా మీ పిచ్చిగానీ అని అవగతం చేసుకున్న వారు ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతి, దిగుమతి మార్కెట్టు కమ్యూనిస్టు చైనాను వదులుకుంటారా ? అలా వదులు కున్న వారు నిజంగా దేశ భక్తులే ! కుందేటి కొమ్మును సాధించ వచ్చు గాని అలాంటి వారిని ఎవరినైనా ఒక్కరిని చూపగలరా ? అమెరికా వ్యాపారులు పాతాళ భైరవిలోని దుష్ట గురువుల వంటి వారైతే, భారత వ్యాపారులు ఆ గురువు శిష్యుని వంటి వారు. అందుకే కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే దేశ భక్తికి గీటు రాయి అని వూరూ వాడా ప్రచారం చేసిన సంఘపరివారం తీరా తాము అధికారానికి వచ్చిన తరువాత అదే చైనాతో భాయీ భాయీ అన్నట్లుగా వాజపేయి హయాంలో వున్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దగ్గరయ్యారు. గతంలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారేమిటి అని ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో అనధికారికంగా చైనా వ్యతిరేకతను వ్యాపింప చేయటంలో కూడా వారే ముందుంటున్నారు. ముఖ్యంగా సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ఆపని చేస్తున్నారు. వారి ద్వంద్వ ప్రవత్తికి అది పెద్ద తార్కాణం.

   ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మీడియాలో దేశాలు, వ్యాపారం, వస్తువులు, దేశభక్తి గురించి చర్చ పొంగి పొర్లుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం మనుస్మృతి, బైబిల్‌,ఖురాన్‌లో చెప్పిందానికి తిరుగులేదు చర్చ లేకుండా పప్పుసుద్దల్లా పడి వుండటం, తలాడించాలని చెప్పే అపర వ్యాఖ్యాతలు, నిర్ధేశకుల నిరంకుశ భావజాలం కంటే ఏదో ఒక చర్చ జరపటం మంచిదే. మరకలు పడినా, కావాలని సిరాలు చల్లినా చర్చంటూ జరిగితే కదా తెలియని విషయాలు బయటికి వచ్చేది. మూఢ భక్తులు తమ మూఢ గురువు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు, సామాజిక మీడియాలో వారికి ఇష్టం లేకపోయినా భిన్న వాదనలు, ప్రశ్నలు ఎదురవుతాయి. అవి వారిని మార్చకపోయినా ఎదుటి వారి వాదనలను కూడా వినాలనే సహనం గల ఆలోచనా పరులకు వుపయోగం కనుక ఆ చర్చలో ప్రతివారూ పాల్గొనాలి.

    ఈ నేపధ్యంలో కొన్ని అంశాలను చూద్దాం. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లూ అంతే దూరంలో వుంటుంది అన్న సూక్ష్మ విషయం కూడా తెలియని వారు కొద్ది రోజుల పాటు చైనా వస్తువులను కొనకుండా, అమ్మకుండా, వుపయోగించకుండా వుంటే చైనా మన కాళ్ల దగ్గరకు వస్తుందన్నంతగా కొంత మంది సూచనలు చేస్తున్నారు. ఇది నిజానికి కొత్త అయిడియా కాదు, అరువు తెచ్చుకున్నదే. మన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ పేరుతో ఒక పెద్ద అధ్యాయమే వుంది. దాన్నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన ఆ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే విదేశీ వస్తువుల వరదకు తలుపులు తెరిచారు.స్వదేశీ జాగరణ మంచ్‌పేరుతో ఒకవైపు కాస్త హడావుడి చేసినా ఆ విధానాన్ని బిజెపి పెద్దలు పూర్తిగా బలపరిచారు.తమకు అధికారం వచ్చిన తరువాత ఆ స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలియదు. కాంగ్రెస్‌ను తలదన్నేలా మరిన్ని సంస్కరణల పేరుతో విదేశీ వస్తువుల సునామీకి తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for Riding on flying horsesIndia

    భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా  పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలే కనుక ఏ రాజకీయ పార్టీనేతో, అభ్యుదయ భావాలు వున్నవారో చేసి వుంటే ఈ పాటికి దేశ ద్రోహుల, చైనా అనుకూల జాబితా పెరిగి పోయి వుండేది. భిన్నాభి ప్రాయాన్ని వ్యక్తం చేయకుండా వుండటం కోసం అలాంటి ముద్రలు వేయటం ఒక పదునైన ఆయుధం. ‘ చైనాకు మన ఎగుమతులు తక్కువగా వుండటమనేది సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు తగ్గిపోవటమే అసలు సమస్య. ఎగుమతుల నుంచి మనం తక్కువ ఆర్జిస్తున్నాము. వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలెట్స్‌ దిగుమతులకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాము. చైనా వారి పద్దతి పూర్తిగా భిన్నమైనది. చైనా రైతు పొలాలకు నీటిని తీసుకు వచ్చే కాలువలలో నీరు సదా నిండుగా వుంటుంది.ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుర్గతి అతనికి లేదు. మన రైతులతో పోల్చితే చైనా రైతు వుత్పత్తి వ్యయం తక్కువ. అలాగే చైనా మన దేశంలో తన వుత్పత్తులను కుమ్మరించటం కూడా ఈ వాణిజ్యలోటుకు కారణం కానే కాదు. ఆర్జిస్తున్నదాని కంటే ఎక్కువగా వినియోగం చేసేలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నది. వాణిజ్య లోటుకు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి.’ ప్రస్తుత పరిస్థితులలో ఇలా చెప్పటం నిజంగా పెద్ద తెగింపే. ఇష్టంలేని వారు చెప్పింది ఇనుప రింగులతో , ఇష్టం వున్నవారు వుంగరాల చేతో మొట్టినట్లుగా వుంటుంది.

    భరత్‌ ఝన్‌ఝున్‌ వాలా రాసిన పై వ్యాసంతో పాటు ఆంధ్రజ్యోతిలో వి.శ్రీనివాస్‌ అనే రచయిత మరొక వ్యాసం కూడా దీని గురించే రాశారు. ‘ ‘దేైశభక్త రాజకీయాలతో ‘ సంబంధం వున్న ప్రతి నేతా ఇప్పుడు పాకిస్తాన్‌ అంతు చూడటం, చైనాకు బుద్ధి చెప్పటం గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు నిష్టగా ‘చైనా వస్తు బహిష్కరణ వ్రతం ‘ ఒక్క నెల రోజులు పాటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో గణాంకాలు షికార్లు చేస్తున్నాయి. ఈ దీపావళికి చైనా టపాసులను ముట్టుకోబోమని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలన్న ప్రబోధాలు వినవస్తున్నాయి. చైనాను దారిలోకి తెచ్చుకొనేందుకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భారత్‌ వున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చైనా వస్తువుల క్రయ విక్రయాల్లో భారీ లాభాలు మూట కట్టుకుంటున్న దేశీయ వ్యాపార కూటముల మాటేమిటి ? ఎవరి లాబీయింగ్‌ దేశీ మార్కెట్లో చైనా సరకులకు బాట వేసింది ? ఎవరి లాభ కాంక్ష దేశీయ చిన్న పరిశ్రమల వుసురు తీసింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న అసమతౌల్యం ఆర్ధిక రంగానికి విఘాతంగా మారుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు? చైనా ధోరణి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను దెబ్బతీసేట్లుగా వున్నప్పటికీ వాణిజ్య బంధం సడల కుండా ఎందుకు పోషిస్తోంది? మనం కొన్ని వస్తువులను బహిష్కరిస్తే మనకు అత్యవసరమైన కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయట ద్వారా చైనా వుల్టా మనపై వత్తిడి చేయగల పరిస్ధితి ఇప్పుడు వుంది.’ ఇలా సాగింది. దీని అర్ధం ఏమిటో ఎవరికి వారు తీసుకోవచ్చు. ఎందుకంటే సూటిగా చెబితే ఇక్కడా దేశ భక్తి ముద్ర వేయటానికి కొందరు సిద్దంగా వుంటారు.

   దీనంతటికీ కారణం ఏమిటి అంటే పాచిపోయిన రోత పుట్టించే సమాధానం అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ అని కూడా చెబుతారన్నది తెలిసిందే. వసుధైక కుటుంబమనే విశాల భావన మనది అని చెప్పుకుంటూనే ఇరుగు పొరుగు దేశాలపై కాలు దువ్వే వారి సంగతి పక్కన పెడితే కాసేపు చైనా సంగతి వదిలేద్దాం. మన పరిశ్రమలను, మన రైతులను కాపాడు కోవద్దని లేదా దెబ్బతీయమని మన ప్రజాస్వామ్య వ్యవస్ధ చెప్పిందా లేదే ! దీనికంతటికీ కారకులు కాంగ్రెస్‌ నేతలే అని వెంకయ్య తన భాషా చాతుర్యాన్ని వుపయోగించి ప్రాసతో సహా చెప్పగలరు. మన దేశ పరిశ్రమలు, రైతులను దెబ్బతీసే దిగుమతులను నిరోధించటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవ్వాల్సింది నరేంద్రమోడీ సర్కారే కదా ? ఎందుకు నిలిపివేయలేదు ? దేశ భక్తి ఎక్కడికి పోయింది. ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యంతో వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలేట్లు దిగుమతి చేసుకోకపోతే మనకు రోజు గడవదా ? నరేంద్రమోడీకి తెలియదు అనుకుంటే అన్నీ ఎక్కువగా వున్న అపర కౌటిల్యుడు సుబ్రమణ్యస్వామి, ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికి తగిన విధంగా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడి వంటివారి సేవలను ఎందుకు వుపయోగించుకోవటం లేదు ?

   ప్రియమైన పాఠకులారా ఇవేవీ నరేంద్రమోడీతో సహా ఎందరో మహానుభావులు ఎవరికీ తెలియకుండా జరుగుతున్నవి కాదు, అంత అమాయకులెవరూ లేరని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరు వందల సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ మేథావులు తమ యజమానుల లాభాలకు కొత్త మార్కెట్ల కోసం కొలంబస్‌లను పంపించారు. ఆధునిక పెట్టుబడిదారీ మేథావులు అంతకంటే తెలివి గల వారు కనుక లాభాల వేటకు హైటెక్‌ పద్దతులను కనిపెట్టారు. గ్రామాలలో ధనిక రైతులు వ్యవసాయాలు మానేసి తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి ? సూటిగా చెప్పాలంటే పంట పండించకుండానే ఫలితాన్ని పొందటమే కదా ? స్వంతంగా వ్యసాయం చేస్తే ఎంత మిగులుతుంతో తెలియదు, కౌలుకు ఇస్తే వ్యవసాయం ఏమయినా, కైలు రైతు మట్టి కొట్టుకుపోయినా ఆ మొత్తం గ్యారంటీగా భూ యజమానికి వస్తుంది. అలాగే ఇంతకాలం లాభాలు సంపాదించి కవిలె కట్టలు గుట్టలుగా పెట్టుకున్న పెట్టుబడిదారులు ధనిక రైతులు లేదా భూస్వాముల కంటే మరింత మెరుగైన పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టకుండా, వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేయకుండానే కొత్త పద్దతుల్లో ప్రపంచంలో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ లాభాలు పిండుకుంటున్నారు. అందుకు అనేక కొత్త పద్దతులు కనుగొన్నారు. నూతన ప్రపంచాన్ని కనుగొన్న ఆ కొలంబసే కనుక ఇప్పుడు తిరిగి వస్తే పెద్ద షాపింగ్‌ మాల్లో ఏం చేయాలో తెలియని పల్లెటూరి అమాయకుడిలా నోరెళ్ల బెట్టటం తప్ప జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోలేడంటే అతిశయోక్తి కాదు.

    అమెరికాలో ఒక కార్మికుడు ఒక గంట పని చేస్తే కనీస వేతనంగా ఏడు నుంచి పది డాలర్ల వరకు వుంది. ఒక డాలరు విలువ 67,68 రూపాయలు. అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే ఎనభై డాలర్లు సంపాదిస్తారు, దాదాపు ఐదు వేల రూపాయలు. కనీసంగా గంటకు 15 డాలర్లను సాధించుకోవాలని అక్కడి కార్మిక వర్గం పోరాటాలు చేస్తోంది. కొన్ని చోట్ల అంగీకరించారు. ఆ స్ధితిలో అమెరికా పెట్టుబడిదారులు రోజుకు కనీస వేతనంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక కార్మికుడితో పని చేయించుకోవటం కంటే చౌకగా శ్రమశక్తి దొరికే చోట నెల మొత్తానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పనిచేయించుకున్నారనుకున్నా ఒక్కొక్క కార్మికుడి మీదే నెలకు యాభైవేల రూపాయలు మిగులుతాయి. జపాన్‌ వారు మన దేశంలో మారుతీకార్ల తయారీ (కూర్పు) కేంద్రాలు, కొరియా వారు శాంసంగ్‌ టీవీలు, ఫోన్ల తయారు చేసినా లాజిక్‌- మాజిక్‌ ఇదే. యుద్దనపూడి సులోచనా రాణి నవలల్లోని ఆరడుగుల అందగాడు ఒయ్యారాలు ఒలికించే ఇంపాలా కారులో దిగాడని ఒకపుడు మనం చదువు కున్నాం. ఇప్పుడు వాటి తాతలను మన దేశంలోనే తయారు చేయగల పరిస్థితి వుంది. కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి తెల్లవారే సరికి వాటిని బిగించి మన దేశంలో అమ్మటంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము.

   వీళ్లు కాకుండా మరికొందరున్నారు. వారు ఇప్పటికే మన వంటి దేశాలలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్ధల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొంటారు. తెలుగు సినిమాల్లో విలన్లు చివరికి మనకు కనిపిస్తారు. వీరసలు ఎలా వుంటారో కూడా తెలియదు. మన విజయ మాల్య మాదిరి రోజుకు ఒక కిరాయి భామను పక్కనే పెట్టుకొని ఎక్కడో ఒక విహార కేంద్రంలో కూర్చొని కంప్యూటర్ల ద్వారా వుదయం పూట షేర్లు కొని గోలు చేసి లాభం వస్తే సాయంత్రానికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ముంబైలో లాభాలు రాలేదనుకోండి మరుసటి రోజు ఏ దక్షిణాఫ్రికాలోనో లేక ఏ బ్రెజిల్‌లోనో కొని అమ్ముతారు.

   ఇంకా కొందరు వున్నారు. విజయవాడ-హైదరాబాదు మధ్య కార్లు సర్రున దూసుకుపోయే రోడ్లు వేయటానికి మన దేశంలోని జిఎంఆర్‌ వంటి కంపెనీలకు డబ్బు పెట్టుబడిపెడతారు. వాటి చేత మన దగ్గర టో(తో) లు వలిచి పన్ను వసూలు చేయిస్తారు. వాటిలో తమ వాటా తాము పట్టుకుపోతారు. మరి కొందరున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి చేత తక్షణమే విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాలు పెట్టకపోతే అంధకారం అలుముకుంటుందని పెద్ద ఎత్తున వూదరగొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు అలా పెట్టినవే. గ్యాస్‌ లేక అవి పనిచేయకపోయినప్పటికీ, ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వుత్పత్తి చేయకపోయినా స్ధిర ఖర్చు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించిన విషయం తెలిసిందే. అధిక ధరలను చూపి నిర్మాణ ఖర్చును రెట్టింపుగా చూపుతారు. విదేశాలలోని తమ కంపెనీల నుంచే బొగ్గు దిగుమతి చేయించి సముద్రతీరంలోని ఏ నెల్లూరు దగ్గరో శ్రీకాకుళంలోనో విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పెట్టిస్తారు. కాలుష్యాన్ని జనానికి వెదజల్లి లాభాలను మాత్రం పట్టుకుపోతారు. వాటికి అవసరమయ్యే యంత్రాలను కూడా విదేశాలలోని తమ కంపెనీలు లేదా ఏజంట్ల నుంచే తెప్పిస్తారు. మొత్తానికి వుత్పత్తి ప్రారంభించకుండానే తమ ఖర్చును రాబట్టుకుంటారు.వాటంగా వుంటే కొంతకాలం వుంటారు లేకపోతే ఎవరో ఒకరికి విక్రయించి తప్పుకుంటారు.

   1948 నుంచి 1970 దశకం వరకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందకుండా కమ్యూనిస్టు చైనాను అడ్డుకున్నాయి. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీతో విబేధాల కారణంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు తీరిన తరువాత 2000 సంవత్సరం నుంచి ప్రధాన భూభాగం చైనాలో విలీనం అవుతాయని ముందే నిర్ణయం అయింది. అక్కడ వున్న సంస్ధల పెట్టుబడులు, చైనీయుల పెట్టుబడుల గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిన పూర్వరంగంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షణ, ప్రవాస చైనీయుల పెట్టుబడుల ఆకర్షణ, ఇతర పెట్టుబడిదారీ దేశాల నూంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్దిక వ్యవస్ధను పరిమితంగా విదేశీ సంస్థలకు తెరిచేందుకు సంస్కరణలను రూపొందించింది. తద్వారా కలిగే ఫలితాన్ని జనానికి చేరే విధంగా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు, ఇతర వ్యాపారాల నిర్వహణ వంటి విధానాలను రూపొందించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పెట్టుబడులు చెదరకుండా వుండేందుకు 2050 వరకు ఒకే దేశం రెండు ఆర్ధిక వ్యవస్ధల పేరుతో ప్రధాన భూభాగంలో సోషలిస్టు విధానం, హాంకాంగ్‌, మకావుల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించేందుకు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. దాంతో ప్రవాస చైనీయులు పెట్టుబడులతో పాటు, భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం పరిశోధన-అభివృద్ధికి భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇలా బహుముఖ చర్యలతో చైనా అనూహ్య అభివృద్దిని సాధించింది. అది కింది వరకు వూట మాదిరి కింది వరకు దిగే విధానాలు అనుసరించింది. ఈ కారణాలన్నింటితో చైనా నుంచి బుల్లెట్‌ రైళ్ల నుంచి బుల్లి బుల్లి దీపావళి చిచ్చు బుడ్ల వరకు మన వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలోని బడా వ్యాపారులు తెల్లవారేసరికి లాభాలు కావాలంటే వాటిని దిగుమతి చేసుకొని సాయంత్రానికి అమ్మి రాత్రికి లాభాల లెక్కలు వేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు పెట్టి, తయారు చేసి వాటిని అమ్ముకోవటం కంటే ఏది లాభం ? దీనికి మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ వంటి వారు పురచేయి అడ్డుపెడితే ఆగేవారు ఎవరైనా వుంటారా ? కావాలంటే వారిని ఎత్తి గోడవతల పారవేసి నోర్మూసుకొని చూస్తుండేవారిని గద్దెపై కూర్చో పెడతారు.

   అమెరికా,ఐరోపాలోని ధనిక దేశాలలోని వ్యాపారులు కూడా చైనా నుంచి సరకులు దిగుమతి చేసుకోవటం ద్వారా తమ లాభాలకు ఎలాంటి ఢోకా వుండదని గ్రహించి దానికే మొగ్గు చూపటంతో అటు చైనా ఇటు ధనిక దేశాలలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు లాభపడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు చైనాలో పెట్టుబడులు పెట్టటానికి వీలు కలిగింది. ఎగుమతులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలతో తలెత్తే చిక్కులేమిటో లాటిన్‌ అమెరికా అనుభవం నుంచి నేర్చుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం దేశీయంగా వినిమయాన్ని పెంచేందుకు వీలుగా పౌరుల ఆదాయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ కారణంగానే 2008లో ప్రారంభమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల సంక్షోభం పరిమితంగానే చైనాపై ప్రభావం చూపింది. బయటి దేశాల పరిశీలకులు ఈ కోణాన్ని చూడకుండా 2008 కంటే ముందున్న వేగం తగ్గింది కదా అని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఇప్పటికీ చైనాలో సమస్యలు వున్నట్లు చైనా నాయకత్వమే చెబుతోంది.వారేమీ దాచుకోవటం లేదు. ఇంకా తమది వర్ధమాన దేశమే అని చెప్పటంలో అర్ధం అదే. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన సంస్కరణలకు, చైనా సంస్కరణల విధానాలకు ఎంతో తేడా వుంది. భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి, రెక్కల గుర్రం ఎక్కి చుక్కలు లోకం చూడొద్దని అంటే నన్ను దేశ భక్తి లేనివాడిగానో, చైనా అనుకూల వాదిగానో చిత్రీకరించరు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: