• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: journalists

వినాశకాలే విపరీత బుద్ధి : విద్వేష, పుకార్ల బిజెపి వారు దేశభక్తులు – జర్నలిస్టులు దేశద్రోహులా ?

09 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Rajdeep Sardesai, Cases against journalists, journalists, Sedition Case Against Tharoor, Tweets on Farmers' Rally


ఎం కోటేశ్వరరావు
నిర్ధారించుకోకుండా వార్తలు రాశారు, ప్రసారం చేశారు లేదా ట్వీట్‌ చేశారు అని కొంత మంది జర్నలిస్టుల మీద క్రిమినల్‌ కేసులు పెట్టారు. నిజమే అలా చేయకూడదు. ఎవరూ అలాంటి ధోరణులు, పని తీరును సమర్ధించరు. మీడియా ప్రభుత్వ గెజెట్‌ కాదు. కొన్ని సందర్భాలలో నిర్ధారణ కాని వార్తలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ వాస్తవం కానట్లయితే ఆయా మీడియా సంస్దల విశ్వసనీయత దెబ్బతింటుంది, నష్టపోయేది వారే. అందువలన ఎవరూ తమ కొమ్మలను తామే నరుక్కోరు. లేదూ చేస్తే ఏమౌతుంది ?


ప్రభుత్వం లేదా ప్రభుత్వ శాఖలు ఆయా ఉదంతాలకు సంబంధించి వివరణ ఇచ్చి తాము చెప్పిందాన్ని కూడా ప్రచురణ లేదా ప్రసారం చేయమంటాయి. చేయలేదనుకోండి,వివరణ కోరవచ్చు, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతర చర్యలకు ఉపక్రమించవచ్చు.అదేమీ లేకుండానే ఏకపక్షంగా దేశద్రోహం కేసులా ? ఇది ప్రజాస్వామ్య పాలనా, నిరంకుశ ఏలుబడా ? జనవరి 26 ఉదంతాల విషయంలో జరిగిందేమిటి ? జర్నలిస్టులు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ మీద దేశద్రోహం వంటి తీవ్ర నేరపూరితమైన కేసుల దాఖలు చేశారు. వారంతా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. రెండు వారాల తరువాత కేసులను విచారణకు తీసుకుంటామని ఇప్పటికైతే అరెస్టు చేయవద్దని మంగళవారం నాడు ఉన్నత న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే జర్నలిస్టుల మీద కత్తి వేలాడుతూనే ఉంది? రెండు వారాల తరువాతేం జరగనుందో తెలియదు.
నిర్దారణ కాని వార్తల ఆధారంగా అంటే ఒక జనవరి 26న ఒక యువకుడి మృతి వార్త గురించి తెలుసుకోకుండా ఆరుగురు జర్నలిస్టులు, ఎంపీ శశిధరూర్‌ ట్వీట్లు చేశారన్నది అభియోగం. పోలీసు కాల్పుల్లో గాయపడి అతను మరణించాడన్నది ఆ సమయంలో అక్కడున్నవారి నివేదన, కాదు ట్రాక్టరు తిరుగబడి మరణించాడన్నది పోలీసుల కధనం. మొదటి కథనాన్ని ట్వీట్‌ చేశారు. కానీ పోలీసులు ఏం చెబుతారో తెలుసుకోకుండా వారి మీద నిందలు మోపే విధంగా, జనాన్ని రెచ్చగొట్టే రీతిలో ట్వీట్‌ చేశారు లేదా తమకు వచ్చిన దాన్ని ఇతరులకు పంచారు(షేర్‌), అది నేరం అని మోడీ సర్కార్‌ అంటోంది. ఈ కేసుపై దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నాయకత్వంలోని బెంచ్‌ విచారిస్తున్నది.


కోర్టుకు ఎక్కిన వారిలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఇండియా టుడే సంపాదకుడు రాజదీప్‌ సర్దేశారు,కాంగ్రెస్‌ దినపత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ సీనియర్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ మృణాల్‌ పాండే, క్వామీ అవాజ్‌ సంపాదకుడు జాఫర్‌ ఆఘా, కారవాన్‌ స్దాపకుడు పరేష్‌ నాధ్‌, సంపాదకులు అనంత నాధ్‌, వినోకే కె జోస్‌ ఉన్నారు. వారి మీద దేశద్రోహం, మత సామరస్యతను దెబ్బతీసే సమాచార వ్యాప్తి, రైతుల నిరసన గురించి తప్పుడు వార్తలు తదితర నేరాలు మోపారు. జర్నలిస్టుల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ నిరంకుశ చర్యల నుంచి పిటీషనర్లకు తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. వివిధ రాష్ట్రాల పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వస్తారని పేర్కొన్నారు. కోర్టు తొలుత విముఖత చూపింది. మీరు వారిని అరెస్టు చేయబోతున్నారా అని ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం నాడు దీని గురించి వినాలని మెహతా చెప్పారు. బుధవారం నాడు కాదు, రెండు వారాల తరువాత వింటాం, అప్పటి వరకు వారి అరెస్టు నిలిపివేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.


కారవాన్‌ సంపాదకుడు వినోద్‌ కె జోస్‌ తరఫున వాదించిన సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహతగీ ఆధారాల్లేకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని, రిపోర్టింగ్‌లో నేరం ఎక్కడుంది, మత మనోభావాలు గాయపడేదెక్కడ అని ప్రశ్నించారు. దాని మీద స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ వారి ట్వీట్లను అనుసరించే లక్షలాది మంది మీద భయంకరమైన ప్రభావం పడుతుందని నేను మీకు చూపగలను అన్నారు. ఢిల్లీలో కేంద్రప్రపభుత్వానికి చెందిన న్యాయవాది ఒకరు, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు, గురుగ్రామ్‌, బెంగళూరు, నోయిడాలలో కూడా కేసులు దాఖలు చేశారు. నిందితులు కుట్రపూరితంగా ఒక పధకం ప్రకారం తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ కేసులను డియుజె, ఎన్‌ఏజె,మహిళా జర్నలిస్టు సంఘం, ఎడిటర్స్‌ గిల్డు తదితర సంఘాలు ఖండించాయి.


ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రకారం ఎర్రకోట దగ్గర మరో చోట జరిగిన ఉదంతాలను మీడియా ఎలా నివేదించాలి. పోలీసులు జెండా ఆవిష్కరించిన నిందితులను పారిపోనిచ్చేంతవరకు, కొన్ని గంటల తరువాత తాపీగా వచ్చి జెండాలను తొలగించే వరకు ఎలాంటి వార్తలు మీడియా ఇవ్వకూడదు. ఎందుకంటే నిర్ధారించుకోవాలి కదా ! ఆ ఉదంతానికి బాధ్యుడు దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడైన బిజెపి కార్యకర్త అని అందరికీ తెలిసినా పోలీసులకు మాత్రం తెలియదు. అతగాడు తాపీగా వెళ్లిపోతుంటే కనీసం ఆపి ఎవరు ఏమిటి అని ప్రశ్నించటం కూడా పోలీసులకు తెలియదు. ఈ తీరు మీద నిర్ధారించుకోకుండా ట్వీట్‌ చేయకూడదు, వార్త రాయకూడు ! తాపీగా వెళ్లిపోయిన అతని మీద అనివార్యమై కేసు పెట్టి 14రోజుల పాటు స్వేచ్చగా తిరగనిచ్చి అరెస్టు చేసేంత వరకు, దాన్ని అధికారికంగా పోలీసులు నిర్దారించి మీడియాకు చెప్పేంత వరకు వార్తలు రాయకూడదు. ట్వీట్‌ చేయకూడదు. దీన్నీ కూడా అంగీకరిద్దాం !


ఇక్కడే మరో దృశ్యాన్ని మనం చూడాలి. తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే అనే దేశం కదా మనది. దాన్ని నాలుగు పాదాలతో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా ! అలాంటపుడు దేశద్రోహం, మతసామరస్యతను దెబ్బతీసినందుకు కేసులూ గట్రా అందరి మీదా పెట్టాలా లేక కేవలం ఎంపిక చేసుకున్న జర్నలిస్టులు, ఇతరులకేనా ? అదీ రైతు ఉద్యమం పట్ల విమర్శనాత్మకంగా లేదా రైతుల పట్ల సానుకూలంగా రాస్తున్న వారిమీదేనా ! ఇదే అసలు సమస్య. జనవరి 26న ఢిల్లీ ఎర్రకోట దగ్గర వందలాది మంది అమిత్‌ షా పోలీసులు కళ్లప్పగించి చూస్తుండగా ఒక యువకుడు అనుమతి లేకుండా సిక్కు మత జెండాను ఎగురవేశాడు. వెంటనే జరిగిందేమిటి ?

రైతులు ఎర్రకోట మీద ఉన్న జాతీయ జెండాను తొలగించి ఖలిస్తానీ పతాకాన్ని ఎగురవేశారు. అని వార్తలు గుప్పుమన్నాయి. టౌమ్స్‌ నౌ ప్రధాన సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ జాతీయ జెండాను తొలగించారని చెబుతూ ఒక మత లేదా రైతు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారని ముక్తాయింపు ఇచ్చారు. ఇది చిన్న నేరమా ? కాదు. ఆ ఛానల్‌ ఏదో గల్లీకి పరిమితం కాదు,సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పినట్లు సంపాదకుడి ట్వీట్లు, ఇచ్చిన వార్తలతో భయంకరమైన ప్రభావం మీద వేసుకొనే జనం కోట్లాది మంది ఉంటారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించి ఉద్యమిస్తున్న రైతుల మీద, సిక్కుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య ! కాదా ? అయినా అతగాడి మీద ఎలాంటి కేసూ లేదు. ఎందుకని ?


ఒపిఇండియా అనే ఒక వెబ్‌సైట్‌ ఉంది.నిరసనకారులు ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని ఒక వార్తను రాసింది. దాని సంపాదకుడు లేదా రాసిన జర్నలిస్టు మీద కూడా కేసు లేదు. ఇది తప్పుడు వార్తలు, విద్వేష పూరిత ప్రచారానికి పెట్టింది పేరు. కాషాయ తాలిబాన్లు నడుపుతున్న ఒక అబద్దాల, వక్రీకరణల ఫ్యాక్టరీ. ఢిల్లీ బిజెపి ప్రతినిధి హరీష్‌ ఖురానా, పార్లమెంటరీ కార్యదర్శి వరుణ్‌ గాంధీ ఇంకా కొంత మంది బిజెపి నేతలు, కార్యకర్తలు జాతీయ జెండాను అవమానించారని, ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని సామాజిక, సాంప్రదాయ మాధ్యమాల్లో ప్రచారం చేశారు. సిక్కుల మీద విద్వేషం రెచ్చగొట్టారు. నిర్దారించుకోకుండా వారు చేసిన దానిలో ఎలాంటి నేరం కనిపించలేదా ? కేసులు ఎందుకు పెట్టరు ? దున్న ఈనిందంటే గాటన కట్టేయండి అన్నట్లుగా ఈ తప్పుడు వార్తను తెలుగు మీడియాతో సహా దేశమంతటా ప్రచారం, ప్రసారం చేశారు. నిర్దారించుకోకుండా ఆపని చేసినందుకు వీరిలో ఎందరి మీద కేసులు పెట్టారు ?


ఎర్రకోట దగ్గర సిక్కు మత జెండాను ఎగురవేసిన యువకుడి పేరు జుగరాజ్‌ సింగ్‌, పంజాబ్‌ నివాసి. అతను రైతుల ఉద్యమంలో పాల్గనేందుకు వచ్చాడు. అనేక మందితో పాటు ఎర్రకోట వద్దకు వెళ్లాడు. ఒకరు ఒక జెండాను ఇచ్చి అక్కడున్న జెండా దిమ్మ మీద ఎగురవేయమని చెప్పారు. ఎవరూ ఎక్కలేకపోయారు, జగరాజ్‌ సింగ్‌ ఎక్కాడు, ఎగురవేశాడు. దిగి వచ్చాడు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. వారెందుకు నివారించలేదు ? తన మనవడు అమాయకుడని, ఎవరో ఇచ్చిన జెండాను ఎగురవేశాడు తప్ప అతనికి ఇంకేమీ తెలియదని జగరాజ్‌ తాత చెబుతున్నాడు. అ జెండా ఇచ్చిన లేదా ఇప్పించిన వ్యక్తి దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడని, ధర్మేంద్ర తీసిన సినిమాల్లో నటించాడని, ధర్మేంద్ర కొడుకు సన్నీ డియోల్‌ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ప్రచారం చేశాడని, బిజెపి అగ్రనేతలతో ఫొటోలు దిగే సాన్నిహిత్యం కలవాడని తరువాత వెల్లడైంది. అతగాడు అనేక మందికి తెలిసిన వాడు, అక్కడ అందరికీ కనిపించచాడు గనుక పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. అదే కుట్రలో భాగంగా మరొకరి చేత జండాను తెచ్చి ఇచ్చి ఉంటే మొత్తం రైతుల మీదుగా పోయేదికాదా ?

నవరీత్‌ సింగ్‌ అనే 25 ఏండ్ల యువకుడు జనవరి 26 సంఘటనల్లో మరణించాడు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆటంకాలను ట్రాక్టరుతో తొలగించేందుకు ప్రయత్నించిన నవరీత్‌ అదే ట్రాక్టరు తిరగబడి ప్రమాదవశాత్తూ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాన్ని చిత్రించిన వీడియోలో, పోస్టు మార్గం నివేదికలో అతని తల మీద ఒక తుపాకీ తూటా గాయం ఉందని తేలింది. ఆ ఉదంతాన్ని చిత్రించిన వారు చెబుతున్నదాని ప్రకారం పోలీసులు కాల్పులు జరిపిన తరువాత మాత్రమే ట్రాక్టర్‌ బోల్తాపడింది, కాల్పుల కారణంగానే అతను చనిపోయాడని అంటున్నారు. వైద్యులు తమతో ఆ విషయం మౌఖికంగా చెప్పారని, నివేదికలో ఆ విషయాన్ని రాయలేమమని ఒక వైద్యుడు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని నిర్దారించుకోకుండా వార్తలు ఇచ్చి పోలీసుల మీద నిందమోపారంటూ కేసు దాఖలు చేశారు. పోస్టు మార్టం నివేదికలో తూటా ప్రస్తావనే లేదని, ట్రాక్టర్‌ తిరగబడే మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు కాల్పులు జరపటం అసాధారణమేమీ కాదు. కాల్పుల్లోనే మరణించాడని ట్వీట్‌ చేశారు లేదా వార్త ఇచ్చారు. దాన్ని వార్తగా ఇవ్వకపోతే కదా సమస్య ? కాశ్మీరులోయలో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెబుతారు. అనేక ఉదంతాల్లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదు సామాన్య యువకులు, ఉట్టి పుణ్యానికే చంపారని బంధువులు చెబుతారు. ఆ వార్తలను ఇవ్వాలా లేదా ? అలాంటి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల గురించి మిలిటరీ కోర్టులు విచారణ జరిపిన ఉదంతాలు లేవా ? వార్తలు సరైనవా తప్పుడువా అన్నది తప్ప దేశద్రోహ అంశం ఏముంది అక్కడ ?


మీడియాలో వచ్చిన వార్తలకు భిన్నంగా జరిగితే పోలీసులైనా మరొకరైనా ఖండనలు లేదా వివరణలు ఇచ్చినపుడు వాటిని ప్రచురించకపోయినా, ప్రసారం చేయకపోయినా ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరపూరితమైన సెక్షన్లతో కేసులు బనాయించటం రైతుల ఆందోళనల వార్తలను ఇస్తున్నందుకు తీర్చుకుంటున్న కక్ష తప్ప మరొకటి కాదు. కానట్లయితే నిర్దారించుకోకుండా వార్తలు రాసిన ఇతరులు, తప్పుడు ప్రచారం చేసిన బిజెపి పెద్దల మీద కూడా అలాంటి కేసులే ఎందుకు బనాయించలేదు ? తప్పుడు వార్తలను తయారు చేసేందుకు బిజెపి, దాని అనుయాయులు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక సంస్దలను ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా ఉత్పత్తి చేస్తున్న విషయం అందరికీ విదితమే. అవి సమాజంలో ఎంత విద్వేషం రగిలిస్తున్నాయో అందరికీ తెలిసిందే ! రైతుల ఉద్యమంలో ఖలిస్తానీలున్నారని కొందరు, నక్సల్స్‌ ఉన్నారని మరి కొందరు, విదేశీ నిధులతో ఆందోళన చేస్తున్నారని, కమిషన్‌ ఏజంట్లు డబ్బు ఇస్తున్నారని, సిక్కుల వేషాల్లో ముస్లింలు చేరారని ఇలా చేయని తప్పుడు ఆరోపణలు, నకిలీ వార్తలను ఎవరు సృష్టించారు.ఉద్యమాన్ని వ్యతిరేకించే బిజెపి, దాని మిత్రపక్షాలు, వాటి నేతలు, కార్యకర్తలే కదా ? పర్యవసానంగా సిక్కులను, ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను ఎలా నిందిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆ ప్రచారం సమాజంలో ఐక్యతకు తోడ్పడుతుందా విద్వేషాలకు ఆజ్యం పోస్తుందా ? ఇలాంటి అంశాలన్నీ ట్విటర్లలో, ఫేస్‌బుక్‌లో వస్తున్నపుడు వాటిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరలేదు. అనేక ఉదంతాలలో న్యాయమూర్తులు స్వయంగా పత్రికా వార్తలను తీసుకొని విచారించిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి వార్తల మీద ఎవరూ స్పందించటం లేదు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారని వేలాది ట్విటర్‌ ఖాతాలను స్ధంభింప చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది ? ధర్మం ఒంటి కాలు మీదనా నాలుగు పాదాల నడుస్తోందా ? ఒకే పనిని తమ వారు చేస్తే దేశభక్తి, వ్యతిరేకులు చేస్తే ద్రోహమా ? ఏమిటీ విపరీతం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిఎం చంద్రబాబుకు జర్నలిస్టుల సమస్యలు వినేతీరిక లేదా ?

30 Thursday Mar 2017

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, APWJF, chandrababu naidu, journalists, journalists problems

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెలుగు దేశం నాయకులకు నిత్యం జర్నలిస్టులు లేనిదే గడవదన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య(ఎపిడబ్ల్యుజెఎఫ్‌) తాజాగా ముఖ్యమంత్రికి రాసిన ఒక బహిరంగలేఖలోని అంశాలను చూస్తే గత మూడు సంవత్సరాలలో జర్నలిస్టులతో మాట్లాడటం తప్ప జర్నలిస్టుల సమస్యల గురించి వారివైపు నుంచి వినలేదన్నది స్పష్టం అవుతోంది. జర్నలిస్టులు కూడా రాష్ట్ర ప్రజానీకంలో భాగమే. అయినపుడు వారి గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు ? మీడియా సంస్ధల యజమానుల సంక్షేమం చూస్తే తనకు కావాల్సిన, రావాల్సిన రీతిలో ప్రచారం దొరుకుతుందనే ధీమానా? ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అందుకే వారి లేఖ పూర్తి పాఠం ఇస్తున్నాం.

సామాజిక మీడియాలో పని చేస్తున్న నేను, మీరు అందరం జీతం భత్యం, వేళాపాళా లేకుండా మనకు తెలియని యజమానులకు విపరీత లాభాలు తెస్తూ స్వచ్చందంగా పని చేస్తున్నాం. రాష్ట్రం, దేశంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా యజమానులు కూడా తమ సంస్ధలలో పని చేస్తున్న వారికి చట్టప్రకారం ఇవ్వాల్సిందిఇవ్వకుండా, అసలు చట్టాలతోనే పని లేకుండా ఇష్టా రాజ్యంగా వుంటున్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అందుకే వారి సమస్యలేమిటో చూడండి, స్పందించండి.

శ్రీ నారా చంద్రబాబునాయుడు,                                                    ది: 30-03-2017

గౌరవనీయ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్‌) తరఫున ముందుగా మీకు తెలుగు సంవత్సరాది హేవళంబి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. త్వరితగతిన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం వ్యక్తిగతంగా మీరు, ప్రభుత్వం చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర కార్యకలాపాలన్నింటినీ ఈ నేల నుంచి కొనసాగించేందుకు చేస్తున్న మీ ప్రయత్నానికి ఫెడరేషన్‌ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ఫెడరేషన్‌ మా వంతు కృషిని నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం.

నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా మీడియా రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం కృషి చేయాలని అభిలషిస్తున్నాం. ఇప్పటివరకు అన్ని దినపత్రికలకు సంబంధించిన ప్రచురణ కేంద్రాలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ క్రమంగా ఇక్కడ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించి అన్నీ హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఛానల్‌ చర్చా కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తున్నాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో అతి త్వరలోనే అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగే కాలం మరెంతో దూరంలో లేదు.

ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవి అమలవుతున్న తీరుతో పాటు జర్నలిస్టుల ముందున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలచి ఈ బహిరంగలేఖ రాస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్‌) మహాసభలో, కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చకు వచ్చిన అనేక అంశాలివి.

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా

కొత్త రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజల్లో భాగంగా జర్నలిస్టులు కూడా నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు అనంతరం జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని మీ చేతుల మీదుగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు 1250 రూపాయలు వాటాధనంగా చెల్లిస్తే వైద్య సదుపాయం కల్పిస్తూంది. ఈ పథకం అమలు సమీక్షించేందుకు ఒక కమిటీ వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. లివర్‌, డెంటల్‌, సాధారణ జ్వరం తదతర అనేక రుగ్మతలు ఈ జాబితాలో లేవు. దీనివల్ల ఈ పథకం పట్ల జర్నలిస్టుల్లో సానుకూల స్పందన లేదు. పథకం అమలు తీరు పర్యవేక్షించేందుకు కమిటీ వేయాల్సి ఉన్నా ఇప్పటివరకు కమిటీ నియమించలేదు.

సమగ్ర బీమా పథకం

జర్నలిస్టులకు తమ వాటాగా 250 రూపాయలు చెల్లిస్తే 10 లక్షల రూపాయల సమగ్ర బీమా పథకం అమలవుతోంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం వల్ల లభించే ప్రయోజనాల గురించిన సమాచారం గ్రామీణ స్థాయి వరకు జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో తెలుస్తున్న పరిస్థితి లేదు. ఈ పథకం అమలు తీరును సమీక్షించేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు.

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు

ప్రభుత్వం రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీలు నియమించింది. అందులో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించింది. అందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర అక్రిడిటేషన్‌ కమిటీ సిఫారసు చేసిన యేడాదికి గాని సబ్‌ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు కొన్ని పరిమితులతో ఇచ్చారు. కానీ వారికి ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వలేదు. అలాగే పలక్ట్రానిక్‌, కేబుల్‌ మీడియాలో జర్నలిస్టు పనిచేసే వారందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. ఇవి చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. అయినా ఇప్పటివరకు వారి విషయం తేలలేదు. అన్నింటినీ మించి అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి జారీ చేసిన జీవో పాతది. దానికి జతగా అనేక మార్పులు, చేర్పులు చేస్తూ రూపాంతరం చెందిన ఆ జీవోను సమూలంగా మార్చి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణమైన సమగ్ర జీవోను తీసుకురావడం తక్షణ అవసరం.

దాడుల నివారణకు హైపవర్‌ కమిటీ

జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి హైపవర& కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇటీవలకాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. ఇసుక మాఫియా చేతుల్లో కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆంధ్రప్రభ విలేకరి శంకర్‌ను హత్యచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టివి 99 విలేకరిపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు తన అనుచరులతో బాస అనే పత్రిక విలేకరి నాగార్జునరెడ్డిపై పట్టపగలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పాశవికంగా దాడి చేశారు. దానికి తోడు అతనిపై అక్రమంగా ఎస్‌.సి, ఎస్‌.టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇవికాక అనేక జిల్లాల్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు అనేకం. వీటన్నింటిపై చర్యలు తీసుకుని జర్నలిఅ్టల మనోస్థైర్యాన్ని పెంపొందించేందుకు వీలుగా హైపవర్‌ కమిటీ పనిచేయాలి. జిల్లాస్ణాయి కమిటీలు ఏర్పాటు కావాలి. ఆయా కమిటీలు నామమాత్రపు కమిటీలుగా కాక సమస్య పరిష్కారానికి వేదిక కావాలి. అందుకు వీలుగా ఆ కమిటీలను పరిపుష్టం చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయిం తీసుకోవాలి. దాడులలో నష్టపోయిన, సర్వం కోల్పోయిన జర్నలిస్టులను ఆదుకునేందుకు వీలుగా శాశ్వత సహాయం అందజేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి. జర్నలిస్టులు పొరపాట్లు, తప్పులు చేసిన సందర్భంలో వారిపై చట్టపరంగా చర్యతీసుకునేందుకు అవకాశాలున్నప్పటికీ అందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం మొత్తంగా మీడియాను భయభ్రాంతం చేయాలని చూడడంగానే భావించి అటువంటి చర్యలను నివారించేందుకు ప్రయత్నించాలి.

జర్నలిస్టుల సంక్షేమ నిధి

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథగం ద్వారా జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. మూడేళ్లుగా ఈ నిధి పర్యవేక్షణకు కమిటీని నియమించలేదు. దీనివల్ల సహాయం పొందాలనుకునే జర్నలిస్టులకు ఆ సదుపాయ, లేకుండా పోయింది. ఈ కమిటీ నిబంధనలను కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిబంధలను మార్పుచేయాల్సి ఉంది. అలాగే సంక్షేమ నిధి మొత్తాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నిధి నిర్వహణకు విధి విధానాల రూపకల్పనతో పాటుగా సంక్షేమ నిధి కమిటీని కూడా తక్షణమే నియమించాలి.

పెన్షన్‌ పథకం

జర్నలిస్టులకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెన్షన్‌ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో చాలా యేళ్లుగా కోరుతున్నప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు పెన్షన్‌ పథకం అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దేశంలోని పరిస్థితిని అద్యయనం చేసి పెన్షన్‌ పథకాన్న రూపొందించడం అవసరం.

ఇళ్లస్థలాల కేటాయింపు

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సంబంధించి అనేక జిల్లాల్లో చాలా యేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల కేటాయింపునకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వు లేకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు బలహీనవర్గాలకు కేటాయించే కోటాలో ఇస్తున్నప్పటికీ సొసైటీల ద్వారా స్థలం పొందాలనుకునే జర్నలిస్టులు ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి వివాదాలకు ఆస్కారం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్తలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి సొసైటీల ద్వారా స్థలాలు పొందే ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల చివరిదాకా వచ్చిన సొసైటీలు కేటాయింపు దశలో ఆగినవి ఉన్నాయి. వాటిని కేటాయించాల్సి ఉంది. అలాంటి సొసైటీ విజయవాడలో ఉంది. విశాఖపట్నంలో సొసైటీకి స్థలం కేటాయించినప్పటికీ పొజిషన్‌ ఇవ్వని పరిస్థితి ఉంది. విజయవాడలో ప్రైవేట్‌గా జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని అభివృద్ది పరుచుకునేందుకు వీలుగా నిధులు కేటాయించాల్సి ఉంది.

ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు భరోసా

ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి సంబంధించి వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం అమలుకు నోచుకోవడం లేదు . ఆ చట్ట పరిధిలోకి ఎలక్ట్రానిక్‌ మీడియాను తీసుకువచ్చేందుకు వీలుగా ప్రభుత్వ చొరవ చూపాల్సి ఉంది. వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాన్ని అందుకు అనుగుణంగా సవరించేందుకు తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అదేవిధంగా అనేక ఛానళ్లలో ఉద్యోగ భద్రత పంతమాత్రం లేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగ భద్రతకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

మీడియా అకాడెమీ ఏర్పాటు

ప్రభుత్వం ప్రెస్‌ అకాడెమీని ఏర్పాటు చేయడంలోనే జాప్యం చేసింది. చైర్మన్‌ను మాత్రం నియమించి గవర్నింగ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌ అకాడెమీని మీడియా అకాడెమీగా ఏర్పాటుచేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల మీడియాను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావాలి. ఆ సంస్థ మీడియాలో పనిచేస్తున్నవారికి, మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపయోగపడే సంస్థగా రూపుదిద్దాలి. వృత్తినైపుణ్యాన్ని మెరుగుపెట్టేందుకు వేదికగా ఉండాలి. పరిశోధనా కేంద్రంగా ఎదిగేందుకు వీలయిన రీతిలో ఆ సంస్థ కార్యకలాపాలు సాగాలి.

పత్తాలేని జర్నలిస్టు అవార్డులు

జర్నలిస్టుల పేరిట ప్రతియేటా అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క యేడాది కూడా అవార్డులు ఇవ్వలేదు. ఇప్పటికైనా అవార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. హైకోర్టు అవార్డుల విషయంలో ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించి ఇవ్వని అవార్డుల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది వారాల్లో అవార్డులు అందజేయాలని కోరింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ప్రకటించిన అవార్డులను వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలి.

వేతన సిఫారసుల అమలు

పత్రికా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు జస్టిస్‌ గురుభక్ష్‌ మజీతియా వేతన సిఫారసులను అన్ని యాజమాన్యాలు అమలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు జర్నలిస్టులు, సిబ్బంది పక్షాన తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ స్థాయి వరకు పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతన సిఫారసుల అమలు చేయాల్సిన యాజమాన్యాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు తక్కువ మంది సిబ్బంది ఉన్నట్టు చూపిస్తే మరికొన్ని యాజమాన్యాలు గ్రామీణ ప్రాంత విలేకరుల నుంచి ప్రకటనల సేకరణ పేరిట, సర్క్యులేషన్‌ పేరిట ఎదురు వసూలు చేస్తున్న పరిస్థితి. వేతన సిఫారసుల అమలు కోసం ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని నియమించింది. అందులో యాజమాన్యాల ప్రతినిధులు మాత్రం సమావేశాలకు హాజరుకారు. కార్మిక శాఖ మౌనముద్ర వీడదు.

మీడియా కమిషన్‌ అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాలో నెలకొన్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. పనిచేస్తున్నవారు ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే యాజమాన్యాలు తాము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మరోపక్క పుట్టగొడుగుల్లా పత్రికలు, ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియాలోని వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు భయంలేకుండా ఈ రంగంలో పనిచేస్తున్నవారు కొనసాగేందుకు వీలైన వాతావరణాన్ని కల్పించాలి. అందుకోసం కాలపరిమితితో కూడిన మీడియా కమిషన్‌ను నియమించి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోని వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయి. అందుకు ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మీరు జోక్యం చేసుకుని పై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుకుంటున్నాం. మీడియా యాజమాన్యాల పట్ల మీకున్న సానుకూల వైఖరికి సంతోషం. మీడియాలో పనిచేసే జర్నలిస్టుల కష్టనష్టాలను తొలగించే బాద్యత స్వీకరించాల్సింది ప్రభుత్వమే. వేతన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మొత్తం మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు రాష్ట్రంలో 20 వేల మందికి మించి ఉండరు. సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి.

మీడియాలో పనిచేస్తున్నవారి సమస్యలను తెలుసుకునేందుకు గతంలో సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరై నేరుగా తెలుసుకునేవారనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో మీడియాలోని సంఘాలతో ఉన్నతస్థాయి అధికారులతో కూడిన సమావేశాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో నిర్వహించడం ద్వారా పలు సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ విషయమై ఫెడరేషన్‌ తరఫున గతంలో రాసిన లేఖల్లో మేము కోరాం. ఇప్పటికైనా అటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వీలవుతుంది.

ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వందల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలకు తెరతీస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో పెడుతున్న ఖర్చుకు లెక్కేలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి జర్నలిస్టు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మిగిలినవారి కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. అటువంటి జర్నలిస్టు మరింత భద్రతడో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తే రాష్ట్రాభివృద్ది మరింత త్వరితగతిన సాగుతుంది. అందుకు మీ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ పైన పేర్కొన్న సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారని ఆశిస్తున్నాం.

అభివందనాలతో

భవదీయుడు

(జి.ఆంజనేయులు)

ప్రధానకార్యదర్శి

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శిక్షలేని నేరం జర్నలిస్టుల హత్యలు

13 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

attacks on journalists, Journalist Murders, Journalist Murders in India, journalists

Image result for stop attacks on journalists in india

ఎం కోటేశ్వరరావు

     మీరు ఎవరినైనా మట్టు పెట్టదలచుకున్నారా ? మన దేశంలో చాలా సులభం ! ఎలాంటి శిక్షలు వుండవు !! వాణిజ్య ప్రకటనలలో షరతులు వర్తిసాయని నక్షత్ర గుర్తులు వేసినట్లే దీనికి కూడా ఒక షరతు వుంది. అదేమంటే అలాంటి వారు మీడియా వ్యక్తులై వుండాలి. ఈ రోజుల్లో వారు దొరకటం చాలా సులభం. పత్రికలు, టీవీలు, రేడియో, అంతర్జాతల మీడియాలో చాలీ చాలని లేదా అసలు వేతనం లేకుండా పని చేసే వారే కాదు, ఎలాంటి జీతం, భత్యాలు, పగలనకా, రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ , యజమానులకు విపరీత లాభాలు సమకూర్చి పెడుతున్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. అనుమానమా ? అక్కర లేదు మీ పోస్టులను సాక్ష్యంగా చూపి ఎవరైనా నా మనోభావాన్ని దెబ్బతీశారు అని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు. సాంప్రదాయ మీడియాలో పని చేసే వారి మీద కూడా అలాంటి కేసులే పెట్ట వచ్చు. కానీ అలా చేయటం లేదే, భౌతికంగా మట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితి రేపు సామాజిక మీడియా జర్నలిస్టులకు ఎదురు కాదని ఎవరైనా చెప్పగలరా ?

     చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నది అధికారంలో వున్న పెద్దల వువాచలలో ఒకటి. వంద మంది నేరగాళ్లు తప్పించుకుపోవచ్చుగాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ సూక్తి. అంతర్జాతీయ సంస్ధ జర్నలిస్టుల రక్షణ కమిటి( కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌-సిపిజె) తాజా నివేదిక ప్రకారం 1992 నుంచి 2016 జూలై వరకు 27 మంది జర్నలిస్టుల హత్య కేసులలో ఒక్కటంటే ఒక్క దానిలో కూడా నేరగాళ్లకు శిక్ష పడలేదు. నిజంగా చట్టం తనపని తాను చేస్తే ఇలాగే జరుగుతుందా ? ఒక్క కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే నిందితులందరూ నిరపరాధులేనా ?అనేక మంది చెబుతున్నట్లు, వాటిని అనేక మంది నమ్ముతున్నట్లు మనది ప్రపంచంలో ఎంతో బాగా పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామిక సంస్ధ, దర్యాప్తు చేయాల్సిన పోలీసులూ సమర్ధులే, విచారించాల్సిన న్యాయమూర్తులనూ తప్పు పట్టలేము. తిమ్మినిబమ్మిని చేసే న్యాయవాదులూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వరిస్తున్నట్లే. మనది బూటపు ప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యాన్ని బూటకంగా మార్చివేశారా ? లేక వ్యవస్ధలోనే లోపమున్నదా ? ఎవరు దీనికి బాధ్యులు ? ఎందుకిలా జరుగుతోంది? ఏం జరిగినా అన్నీ మన మంచికే అన్నట్లుగా అన్నింటినీ గుడ్లప్పగించి చూస్తున్న సమాజం ? ఏమిటీ వైపరీత్యం, ఎంతకాలమిలా ? వీటన్నింటిని చూసి అరుదుగా వున్న సున్నిత మనస్కులలో ఏ ఒక్కరైనా ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్ధ మీద నమ్మకం కోల్పోయినట్లు ప్రకటిస్తే ఆ ఘోరానికి బాధ్యులెవరు ?

    భారత రాజ్యాంగం ఆర్టికల్‌ పందొమ్మిది ప్రకారం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి జర్నలిస్టులను కాపాడేందుకు జాతీయ స్ధాయిలో అవసరమైన ఒక యంత్రాంగాన్ని, పద్దతిని రూపొందించేందుకు అవసరమైన ముసాయితా ప్రతిపాదనలను తయారు చేసేందుకు అనుభవమున్న న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పండితులు, భావ ప్రకటనా స్వేచ్చ విషయాలలో నిపుణులైన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిజె తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ నివేదికను సిపిజె ఆసియా కార్యక్రమ సీనియర్‌ పరిశోధకులు సుమిత్‌ గల్‌హోత్రా,స్వతంత్ర పాత్రికేయులు రక్షా కుమార్‌ సిపిజె తరఫున ఈ నివేదికను తయారు చేశారు. మీడియా తీరుతెన్నులను వీక్షించే వెబ్‌సైట్‌ ది హూట్‌ సలహా సంపాదకురాలు ముంబైకి చెందిన గీతా శేషు కేసుల వివరాలను అందచేయగా దేశంలోని పరిస్థితుల గురించి స్వతంత్ర జర్నలిస్టు ఆయుష్‌ సోనీ రాశారు.(గీతా శేషు సేకరించిన కొన్ని వివరాలను వర్కింగ్‌ జర్నలిస్టు జూన్‌ సంచికలో ఇచ్చాము). ఈ నివేదిక ముందు మాటను ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ రాశారు. నివేదిక పూర్తి పాఠం కావాల్సిన వారు దిగువ లింక్‌లో పొంద వచ్చు.https://cpj.org/reports/2016/08/dangerous-pursuit-india-corruption-journalists-killed-impunity.php పెద్ద పట్టణాలలో వున్నవారి కంటే గ్రామీణ, చిన్న పట్టణాలలో వున్న జర్నలిస్టులకు తాము రాసిన రాతలపై దాడులు జరిగే ముప్పు ఎక్కువగా వుందని అయితే ఈ నివేదికను పరిశీలించిన తరువాత దానికి తోడు జర్నలిస్టు పని చేస్తున్న స్థలం, సంస్ధ, వృత్తిలో స్థాయి, సామాజిక పూర్వరంగం కూడా ఆ ముప్పుకు అదనంగా తోడవుతున్నట్లు వెల్లడైందని శాయినాధ్‌ చెప్పారు. ప్రాంతీయ భాషలలో వార్తలు రాసే వారికి ముఖ్యంగా ఆ రాసింది శక్తివంతులైన వారిని సవాలు చేసేదిగా వుంటే విలేకర్లకు ముప్పు ఇంకా ఎక్కువగా వుంటుందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో పని చేసేవారు ఇలాంటి ఘోరమైన దాడుల నుంచి తప్పించుకుంటున్నారని కారణం జాతీయ మీడియాలోని వున్నత తరగతులు, ప్రత్యేకించి ఆంగ్ల మీడియా సంస్ధలలో వున్నవారికి మెరుగైన రక్షణ కలిగి వున్నారని, పలుకబడి కలిగిన జాతీయ మీడియా సంస్ధలు ప్రభుత్వానికి అందుబాటులో వుండటంతో వాటిలో పనిచేసే వారికి అంతర్గతంగానే వ్యవస్ధా పరరక్షణ వుంటుందని శాయినాధ్‌ పేర్కొన్నారు.

     అవినీతి గురించి రాసిన కారణంగానే జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదికలోని 27 వుదంతాలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్షలు పడలేదు. ఈ పరిస్థితి మీడియాకు ఒక సవాలు వంటి పరిస్థితిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా చిన్న పట్టణాలలోని జర్నలిస్టులు అవినీతిని గురించి నివేదించినపుడు వారు ఎక్కువగా బెదిరింపులు, హత్యలకు గురవుతున్నారని సిపిజె నివేదిక తెలిపింది. జర్నలిస్టులు ఏమాత్రం రక్షణలేని స్ధితిలో పని చేస్తున్నారని, మీడియా సౌహార్ద్రతలేమి, న్యాయ వ్యవస్ధలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి వుందని, మరణించిన తరువాత బాధితులను అప్రతిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నది. 2015లో తీవ్ర కాలిన గాయాలతో మరణవాగ్ఞూలం ఇచ్చిన స్వతంత్ర జర్నలిస్టు జోగేంద్ర సింగ్‌ ఒక పోలీసు అధికారే తనను సజీవ దహనం చేసేందుకు మంటల్లోకి నెట్టారని చెప్పాడు. అతను చెప్పిన దానిని తిరస్కరించిన స్దానిక పోలీసులు అసలు అతను జర్నలిస్టే కాదని బుకాయించారు. ఒక ఏడాది గడిచినప్పటికీ రాష్ట్ర స్ధాయిలో ఇంకా దర్యాప్తు సాగుతూనే వుంది, అరెస్టులు లేవు. 2011 జనవరిలో తన ఇంటి ముందే కాల్పుల్లో హత్యకు గురైన నయా దునియా హిందీ పత్రిక జర్నలిస్టు రాజపుట్‌ కేసులో దర్యాప్తును సాగదీసి కీలక సాక్ష్యాలను కనుమరుగు చేసే యత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించారు. భారత్‌లోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకదానిపై పరిశోధనలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సమయంలో అనుమానాస్పద స్ధితిలో మరణించి ఇండియా టుడే గ్రూప్‌ పత్రికలకు చెందిన అక్షయ్‌ సింగ్‌ కేసు మిగతా కేసులతో పోల్చితే త్వరగా సిబిఐకి అప్పగించారంటే దానికి కారణం ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ వుండటమే అని నివేదిక పేర్కొన్నది.

     పైన పేర్కొన్న మూడు వుదంతాల గురించి ఈ ఏడాది మార్చినెలలో సిపిజె బృందం పరిశోధనలో భాగంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు, జర్నలిస్టులను కలసి వారి అభిప్రాయాలను సేకరించింది. స్వతంత్ర జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ పోలీసుల చేతిలో కాలిన గాయాలతో మరణించాడని విమర్శలు వచ్చాయి. వుత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి భూ కబ్జా, అత్యాచారాల గురించి వార్తలు రాయటమే అతను చేసిన నేరం.ఒక రాజకీయనేత కుమారుడు అక్రమంగా జూదం నిర్వహణలో వున్నట్లు రాసిన వుమేష్‌ రాజపుట్‌ను ఇంటి ముందే కాల్చి చంపారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంగా ప్రసిద్ధి చెందిన అవినీతి అక్రమాలపై శోధన చేస్తుండగా అక్షయ సింగ్‌ ఆకస్మికంగా మరణించాడు. ఇలాంటి పరిశోధనలను అధికార యంత్రాంగం సహించటం లేదు.దాడులు, హత్యలు జరిగిన వుదంతాలలో పోలీసులు సరిగా దర్యాప్తు జరిపి దోషులను గుర్తించటం,అరెస్టు చేయటం జరగటంలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి స్కామ్‌ వంటి వాటిలో జరిగిన అక్రమాల గురించి సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తేవటంలో కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంతో ముందున్నారు.గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవినీతిని ఒక కేంద్రీయ అంశంగా చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. భారత్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పత్రికా స్వేచ్చ గురించి తీవ్రంగా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలుగానీ ఎవరున్నా మౌనం వహిస్తున్నారు. శిక్షలు లేని సంస్కృతిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

    సిపిజె ఇంతవరకు విధులలో భాగంగా హత్యలు జరిగిన 27 కేసులను పరిశీలించగా ఒక్కదానిలో కూడా శిక్షలు పడలేదని తేలింది. మరో 25 అనుమానిత మరణాలను కూడా ఏ కారణంతో జరిగాయనే విషయమై దర్యాప్తు జరుపుతోంది.

    ఒక జర్నలిస్టుపై దాడి లేదా హత్య జరిగిందనే ఫిర్యాదు చేయగానే పోలీసులు ముందుగా అతను జర్నలిస్టు కాదు, ఆ ఘటనకు జర్నలిజానికి సంబంధం లేదంటున్నారని గీతా శేషు పేర్కొన్నారు.దర్యాప్తులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. ‘ దేశంలో గట్టి ప్రజాస్వామిక సంస్ధలు, చురుకుగా వుండే స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్నప్పటికీ జర్నలిస్టులను హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది, అది దేశంలోని ప్రజాస్వామిక సంస్ధల పనితీరుపై ప్రభావం చూపుతుందని’ 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ పేర్కొన్న అంశాన్ని సిపిజె నివేదిక వుటంకించింది.

     నాణానికి ఒకవైపు బొమ్మ ఇదైతే రెండోవైపు బొరుసు గురించి కూడా సిపిజె నివేదిక పేర్కొన్నది. భౌతికంగా అదే విధంగా సామాజిక మాధ్యమాలలో మొత్తం జర్నలిస్టు సమాజం దాడులకు గురవుతుంటే దాడులు, హత్యలకు గురైనా మీడియాలోని తోటి జర్నలిస్టులలో, మొత్తం మీద సమాజంలో నిరసన వ్యక్తం కావటం లేదని కూడా సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి గురైన జర్నలిస్టు ఎవరా అన్నదానితో నిమిత్తం లేకుండా మీడియాపై దాడులకు సంబంధించిన అంశాలపై మెరుగ్గా శోధించి వెలుగులోకి తీసుకురావాలని భారత మీడియా సంస్ధలను సిపిజె కోరింది. జర్నలిస్టులు ప్రతికూల పరిస్ధితులలో వున్న వెలుగులో సిపిజె నివేదిక అనేక సిఫార్సులు చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ఇతర దేశాలలో వున్న వుత్తమ ఆచరణలను అధ్యయనం చేసి జాతీయ స్ధాయిలో ఒక యంగ్రాంగాన్ని ఏర్పాటు చేయటం అందులో ఒకటి.మీడియాపై దాడులు చేసి శిక్షలు పడకుండా తప్పించుకున్న వుదంతాలపై పార్లమెంటరీ కమిటీ విచారణ నిర్వహించి న్యాయం చేసేందుకు, శిక్షలు వేయటానికి ఎదురువుతున్న సవాళ్లను గుర్తించాలి. దాడులు, హత్యలు జరిగినపుడల్లా నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటనలు చేసి కేంద్రం వాటిని ఖండించి గట్టి సందేశం పంపాలి. సిబిఐ తన దర్యాప్తులో వున్న కేసులను త్వరగా పూర్తి చేయాలని, చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను ఆపాలని, ఇతర సంస్ధలను కూడా నిరోధించాలని, జైళ్లలో వున్నవారిని విడుదల చేయాలని కోరింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: