• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: lula da silva

బ్రెజిల్‌ అధికార కేంద్రాలపై దాడికి అంతర్గత మద్దతు : లూలా !

11 Wednesday Jan 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Bolsonaro coup, Bolsonaro protesters, Brazilian riot, Donald trump, Jair Bolsonaro, lula da silva


ఎం కోటేశ్వరరావు



చరిత్ర పునరావృతమైంది, అదీ మరింత ఆందోళన కలిగించే రీతిలో జనవరి ఎనిమిదిన బ్రెజిల్లో జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ఎన్నికను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రం ఇవ్వరాదంటూ ఓడిన డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదార్లు 2021 జనవరి ఆరున దాడికి తెగబడ్డారు. అమెరికా అధికార కేంద్రమైన పార్లమెంటు ఉభయ సభలు, సుప్రీం కోర్టు భవనాలున్న వాషింగ్టన్‌లోని కాపిటల్‌ హిల్‌పై దాడి చేశారు. రెండు సంవత్సరాల తరువాత 2023 జనవరి ఎనిమిదిన లాటిన్‌ అమెరికాలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టులపై గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓడిన జైర్‌ బోల్సనారో మద్దతుదార్లు దాదాపు మూడు వేల మంది దాడికి తెగబడ్డారు. ఈ దుండగానికి అంతర్గతంగా మద్దతు లభించినట్లు, దాని గురించి సమీక్ష జరుపుతున్నట్లు అధ్యక్షుడు లూలా ప్రకటించారు. అధ్యక్ష భవనపు ద్వారాలకు ఎలాంటి నష్టం జరగలేదంటే అక్కడ ఉన్నవారు వాటిని తెరిచి సహకరించినట్లు స్పష్టం అవుతున్నదని లూలా చెప్పారు.


లూలా ఎన్నికను నిర్దారించి, పదవీ స్వీకారం కూడా జరిగిన తరువాత ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ దాడి చేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు. బోల్సనారోకు డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద మద్దతుదారన్నది తెలిసిందే. జనవరి ఒకటవ తేదీన మూడవ సారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వామపక్ష నేత లూలా డి సిల్వా డాడి జరిగినపుడు అక్కడ లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అని చెప్పుకొనే అమెరికా ఈ దాడి సూత్రధారైన బోల్సనారోకు ఆశ్రయం కల్పించింది. ఖండిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాడిని అమెరికాలోని మితవాద టీవీ, పత్రికలు సమర్ధించాయి. దాడి జరిగిన వెంటనే పొత్తి కడుపులో నొప్పి అంటూ బోల్సనారో ఆసుపత్రిలో చేరాడు. వెంటనే తగ్గిందంటూ డాక్టర్లు పంపేశారు. బోల్సనారోకు ఆశ్రయమిస్తే అనవసరంగా చెడ్డ పేరు ఎందుకన్న ఆలోచన అమెరికాలో తలెత్తటంతో బోల్సనారో ఇటలీ లేదా మరో దేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు. డాడికి పాల్పడిన వారిని, వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో తన మద్దతుదార్లకు ధైర్యం కల్పించేందుకు తిరిగి బ్రెజిల్‌కే రానున్నట్లు కూడా చెబుతున్నారు. దాడి వెనుక బోల్సనారో హస్తం ఉన్నందున అమెరికా వీసాను రద్దు చేయాలని 41 మంది డెమ్రోక్రటిక్‌ పార్టీ ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కుట్రదారులను గుర్తించి ఏరి వేయాలని, బోల్సనారో, అతగాడి ముఠాను శిక్షించాలన్న డిమాండ్‌ బ్రెజిల్లో పెరుగుతోంది. రానున్న రోజుల్లో వారు మరిన్ని దుండగాలకు పాల్పడవచ్చని భావిస్తున్నారు.


పచ్చి మితవాది, నియంతలకు జేజేలు పలికిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా చేతిలో స్వల్ప తేడాతో ఓడారు. గెలిచిన వామపక్ష లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. అమెరికాలో ట్రంప్‌ మాదిరి ఒక వేళ తాను గనుక ఓడితే ఎన్నికను గుర్తించనని ముందే చెప్పిన అతగాడు ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే తనకు 60లక్షల ఓట్లు అదనంగా వచ్చేవని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపించాడు. లూలా ఎన్నికను గుర్తించినట్లు గానీ తాను ఓడినట్లు గానీ ప్రకటించేందుకు ముందుకు రాలేదు. తానే అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందే ధ్వజమెత్తాడు. డిసెంబరు 30 అర్ధరాత్రి తన నమ్మిన బంట్లను తీసుకొని ఒక విమానంలో అమెరికాలోని ఫోరిడా రాష్ట్రానికి వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. సాంప్రదాయకంగా జరిగే అధికార మార్పిడి కార్యక్రమాన్ని బహిష్కరించటం కూడా లూలా ఎన్నికను తాను గుర్తించటం లేదని మద్దతుదారులకు ఇచ్చిన సందేశంలో భాగమే. బ్రెజిల్లో తాజాగా జరిగిన పరిణామాల తీవ్రతను అర్ధం చేసుకోవాలంటే బోల్సనారో 2018 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి జరిగిన కొన్ని ఉదంతాలను నెమరు వేసుకోవాల్సి ఉంది.


2019జనవరిలో అధికారానికి రాగానే గత మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.గత ఎన్నికల్లోనే అక్రమాలు జరిగినట్లు, వచ్చే ఎన్నికల్లో తాను ఓడితే ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమైందని, 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని, వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. పార్లమెంటు మీద జరిగే దాడి గురించి, వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్దంగా ఉండాలని చెప్పటమెందుకు అన్న అంశం అప్పుడే చర్చకు వచ్చింది. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని కొందరు, ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అన్నారు.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.


రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. బాలట్‌ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అక్కడ బాలట్‌ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని బోల్సనారోకు గట్టి మద్దతుదారైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించి, ఓటమిని అంగీకరించని సంగతి తెలిసిందే. అధికారానికి వచ్చినప్పటి నుంచి దాన్ని సుస్థిరం చేసుకోవటం మీదనే బోల్సనారో కేంద్రీకరించాడు. కరోనాకు జనాన్ని వదలివేశాడు. అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. అధికారులు తనకు అనుకూలంగా లేకపోతే ఏదో ఒక కేసులో ఇరికిస్తానని బెదిరించేందుకు చూశాడు. దానిలో భాగంగానే అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణను ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు.విచారణకు మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించాడు. బాలట్‌ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను కూడా మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్‌ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇచ్చింది. పార్లమెంటు తీర్మానం చేసినా చివరకు ఎన్నికలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లతోనే జరిపారు.


2022 ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి తీవ్రంగా ప్రయత్నించారు. బోల్సనారో వీటిని ఒక్కసారి కూడా తప్పు పట్టలేదు. మౌనంగా ఉంటూ ప్రోత్సహించాడు. బోల్సనారో దేశం విడిచి వెళ్లిన తరువాత రాజధానిలోని కొన్ని కేంద్రాల్లో తిష్టవేసిన మద్దతుదార్లు వెనక్కు వెళ్లినట్లు కనిపించినా తిరిగి సమీకృతం కావటానికే అని ఇప్పుడు స్పష్టమైంది. మరి కొందరు అక్కడే ఉన్నారు. ఆదివారం నాడు దాడికి తెగబడిన వారు తమది దండయాత్ర కాదని, పార్లమెంటును ఆక్రమించిన చారిత్రాత్మక ఉదంతమని చెప్పుకున్నారు.


తనకు మద్దతు ఇచ్చేదిగా మిలిటరీని మార్చుకోవాలని చూసిన బోల్సనారోకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మద్దతుతో 1964 నుంచి 1985వరకు 21 ఏండ్ల పాటు అక్కడ మిలిటరీ పాలన సాగింది.దాని బాధితులు, వ్యతిరేకంగా పోరాడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉక్కుపాదాల కింద నలిగేందుకు సిద్దంగా లేరు. అందుకే లూలాను సైద్దాంతికంగా ఆమోదించని వారు కూడా బోల్సనారోను ఓడించేందుకు ఓటు వేశారు. రెండవది లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలను రుద్దిన అమెరికాకు తీవ్రమైన ఎదురుదెబ్బలే తప్ప తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకోలేపోయింది. అనేక దేశాల్లో సామాజిక, మిలిటరీ వ్యతిరేక, వామపక్ష ఉద్యమాలు పెరగటానికి దాని పోకడలు దోహదం చేశాయి. దానిలో భాగంగానె బ్రెజిల్‌లో లూలా నేతగా ఉన్న వర్కర్స్‌ పార్టీ ఉనికిలోకి వచ్చింది. అందువలన పెరుగుతున్న వామపక్ష శక్తులను అడ్డుకొనేందుకు మరోసారి మిలిటరీ మార్గాన్ని అనుసరించేందుకు అమెరికా సిద్దంగా లేకపోవటం, బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు మిలిటరీ అధికారులు సిద్దంగాకపోవటం వంటి అనేక పరిణామాలు ఉన్నాయి.


అయినప్పటికీ మిలిటరీ, పోలీసు యంత్రాంగంలో ఉన్న మితవాద శక్తుల మద్దతు కారణంగానే తాజా దాడి జరిగిందని చెప్పవచ్చు. అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టు మీద దాడికి వచ్చిన వారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే వరకు నిఘా, భద్రతా దళాలు ఏమి చేసినట్లు అన్నది ప్రశ్న. విధుల్లో ఉన్నవారి నుంచి ఆ భవనాల్లో ప్రవేశించిన దుండగులకు ఎలాంటి ప్రతిఘటన లేకపోగా అనుమతించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దుండగులు మిలిటరీ ప్రధాన కేంద్రం వెలుపలి నుంచే ప్రదర్శనగా వచ్చారని, అప్పుడు ఒక హెలికాప్టర్‌ ఎగిరిన శబ్దం వినిపించినట్లు, అనేక మంది పోలీసులు ప్రతి చోటా ఉన్నారని, అనేక రోడ్లను మూసివేశారని, తాము లూలాను వదిలించుకొనేందుకే వెళుతున్నట్లు, తమకు బోల్సనారో మద్దతు ఉందని దాడికి వెళ్లిన వారిలోని ఒక మహిళ చెప్పినట్లు లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ విలేకరి కథనం.


అంటే పోలీసులు దుండగుల వెనుక నడిచారు తప్ప అడ్డుకొనేందుకు చూడలేదన్నది స్పష్టం. దీని గురించి అధ్యక్షుడు లూలా మాట్లాడుతూ దుండగులను నిరోధించేందుకు భద్రతా దళాలు చేసిందేమీ లేదని, అనుమతించారని అన్నాడు. బోల్సనారోకు మిలిటరీ పోలీసుల మద్దతు గురించి 2021 ఆగస్టులో జరిగిన ఒక సమావేశంలో 25 రాష్ట్రాల గవర్నర్లు ఆందోళన వెల్లడించినట్లు వెల్లడైంది. గతేడాది రెండవ విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు 550 బస్సుల్లో వస్తున్న లూలా మద్దతుదార్లను మిలిటరీ బలగాలు రోడ్లపై అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి.2020లో సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా తన మద్దతుదార్లతో నిర్వహించిన ప్రదర్శనలో మిలిటరీ గుర్రమెక్కి బోల్సనారో పాల్గొన్నాడు. తనకు మద్దతుగా మిలిటరీ నిలవాలని, తుపాకులు కొని సిద్దంగా ఉంచుకోవాలని మద్దతుదార్లను కోరాడు, ఆయుధాలు ఉన్నవారెవరినీ బానిసలుగా చేసుకోలేరని, అవసరమైతే మనం యుద్దానికి వెళ్లాలని అన్నాడు. ఎన్నికల ఫలితాల తరువాత అలాంటి పరిణామాలు జరగలేదు గానీ మద్దతుదార్లలో ఎక్కించిన ఉన్మాదం తాజా పరిణామాలకు పురికొల్పిందన్నది స్పష్టం.అందుకే దాడి జరిగిన ఆరుగంటల తరువాత బోల్సనారో ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ భవనాలపై దాడి, విధ్వంసం సరైంది కాదన్నాడు తప్ప ఖండన మాట లేదు.


అందువలన బోల్సనారో బహిరంగంగా పిలుపు ఇచ్చినా ఇవ్వకున్నా పరోక్షంగా అతనే బాధ్యుడు. తన తండ్రి తదుపరి కార్యాచరణ గురించి మార్గదర్శనం చేయాలంటూ నవంబరు నెలలో బోల్సనారో కుమారుడు, బ్రెజిల్‌ ఎంపీగా ఎడ్వర్డ్‌ బోల్సనారో ఫ్లోరిడాలో డోనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకొని చర్చించాడు. తరువాత ఇప్పుడు దాడి జరిగింది. ఈ కారణంగానే అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కొందరు పురోగామి ఎంపీలు బోల్సనారో పాస్‌పోర్టును రద్దు చేసి వెనక్కు పంపాలని, ఆశ్రయం ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ట్రంపు మీద అతగాడి మద్దతుదార్ల మీద కాపిటల్‌ హిల్‌ దాడి గురించి విచారణ జరుపుతున్న జో బైడెన్‌ సర్కార్‌ అలాంటి దుండగానికి పురికొల్పిన బోల్సనారోకు మద్దతు ఇస్తుందా, వెంటనే బ్రెజిల్‌ వెళ్లాలని ఆదేశిస్తుందా ? అధికార భవనాలపై దాడులను ఖండించి, బ్రెజిల్‌ ప్రజాస్వామిక వ్యవస్థలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, పౌరుల వాంఛలను తక్కువగా చూడరాదని, లూలాతో కలసి పని చేసేందుకే ముందుకు పోతానని పేర్కొన్న జో బైడెన్‌ ప్రకటనలో ఎక్కడా బోల్సనారో తమ దేశంలో ఉన్నాడన్న ప్రస్తావన లేదు. రానున్న రోజుల్లో బ్రెజిల్‌లో ఏం జరగనుందన్నది మరింత ప్రశ్నార్ధకంగా మారింది. అమెరికా,బ్రెజిల్‌ పరిణామాల్లో ఓడిన శక్తులు దాడులకు తెగబడటాన్ని చూసి ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా అదే బాటలో నడిస్తే ప్రజాస్వామ్య భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్న ! బోల్సనారో మద్దతుదార్ల దుండగాలను ఖండిస్తూ లక్షలాది మంది లూలా మద్దతుదార్లు వీధుల్లోకి వచ్చారు. ప్రజా ప్రతిఘటన తప్ప మితవాద శక్తులను అడ్డుకొనేందుకు మార్గం లేదు ?



.



Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తీవ్ర సవాళ్లు, కుట్రల మధ్య బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా ప్రమాణ స్వీకారం !

03 Tuesday Jan 2023

Posted by raomk in Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Brazil, Jair Bolsonaro, Latin American left, lula da silva, US imperialism


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి ఆదివారం నాడు బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఇలా మూడు సార్లు అధికారంలోకి రావటం ఒక రికార్డు. పచ్చిమితవాది, నియంత్వ పోకడలకు తెరలేపిన అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మీద అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. దేశంలో అణగారిన తరగతులు- ధనికులుగా, మితవాదులు – పురోగామి వాదులుగా చీలిన రెండు వర్గాల మధ్య సమీకరణలు ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టం.ఓటమిని అంగీరించేందుకు మొరాయించిన బోల్సనారో చివరి వరకు ఎన్నికలను వమ్ము చేసేందుకు, మిలిటరీ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూశాడు. మొత్తం మీద మిలిటరీ అందుకు సిద్దం గాకపోవటంతో విధిలేక అధికార మార్పిడికి అంగీకరించాడు. ఆ తతంగానికి హాజరు కాకుండా రెండు రోజుల ముందే తన పరివారంతో సహా అమెరికా వెళ్లాడు. జనవరి 30వ తేదీ వరకు అక్కడ ఉంటారని చెబుతున్నప్పటికీ గడువులోగా తిరిగి స్వదేశానికి వస్తాడా రాడా అన్నది చూడాల్సి ఉంది. తనకు జైలు, చావు లేదా తిరిగి అధికారానికి రావటం రాసిపెట్టి ఉందంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టాడు.


ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి రెండు నెలలుగా బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమం జరిగిందని, లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి చేయని కుట్ర, దుండగాలు లేవు. అయినప్పటికీ బోల్సనారో వారిని నివారించలేదు, వెనక్కు వెళ్లిపొమ్మని ఆదేశించలేదు. అనేక మంది నేరగాళ్లకు అధ్యక్ష, ఇతర అధికార భవనాల్లో రక్షణ కల్పించాడు. డిసెంబరు 12వ తేదీన రాజధానిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంపై దాడి చేసేందుకు చూశారు. తమ అనుచరుడిని విడిపించుకొని వెళ్లేందుకు చూసిన వారిని అరెస్టు చేసేందుకు వెళ్లగా తమ ప్రాంగణం వద్ద ఉన్నవారిని అరెస్టు చేయకూడదంటూ మిలిటరీ అడ్డుకున్నది. ఈ ఉదంతం అనేక అనుమానాలకు దారి తీసింది. అదే రోజు విమానాశ్రయంలో దాడికి బాంబులు తీసుకు వెళుతున్న ఒకడిని పట్టుకున్నారు. ఆ ఉదంతాన్ని డిసెంబరు 30న అమెరికా వెళ్లే ముందు మాత్రమే బోల్సనారో సామాజిక మాధ్యమంలో ఖండించాడు. జనవరి ఒకటవ తేదీన లూలా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు దేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఏదో జరగనుందనే వాతావరణం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి విమానమెక్కి అమెరికా వెళ్లేందుకు బోల్సనారో బ్రెజిల్‌ సరిహద్దులు దాటిన తరువాత మాత్రమే మద్దతుదార్లు ద్రోహి, పిరికి పంద, వంచించాడని తిట్టుకుంటూ తిష్టవేసిన ప్రాంతాల నుంచి వెనుదిరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి పరిస్థితి సాఫీగా ఉన్నట్లు కనిపించినా ఎప్పుడేం జరిగేదీ చెప్పలేని స్థితి.


లక్షలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన లూలాకు పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు ఎంత మేరకు సహకరించేదీ చూడాల్సి ఉంది. మరో లాటిన్‌ అమెరికా దేశమైన పెరూ పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు అక్కడి వామపక్ష నేత కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి తొలగించి అరెస్టు చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. అంతెందుకు బ్రెజిల్లో కూడా గతంలో లూలా తరువాత అధికారానికి వచ్చిన వామపక్ష నేత దిల్మా రౌసెఫ్‌ను కూడా తప్పుడు కారణాలు చూసి అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించటం, తప్పుడు కేసులు పెట్టి 2018 ఎన్నికల్లో లూలాను జైలుకు పంపి అడ్డుకున్న సంగతి తెలిసిందే.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు.రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు.మూడవ సారి గెలిచిన లూలా నాలుగేండ్లు అధికారంలో ఉంటారు. ఒక లోహపరిశ్రమ కార్మికుడిగా పని చేసిన లూలా అంతకు ముందు బూట్లకు పాలిష్‌ కూడా చేశారు.


పదవీ స్వీకారం తరువాత లూలా మాట్లాడుతూ తమకు ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవాలని లేదని, అంత మాత్రాన తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.చట్టబద్దమైన పద్దతుల్లోనే తాము చేసిన తప్పిదాలకు సమాధానం చెప్పుకోవాలన్నారు. వైరి పక్షాల సమీకరణలు తీవ్రంగా ఉన్నందున మూడవసారి పాలనా పగ్గాలు చేపట్టిన లూలాకు గతంలో మాదిరి పాలన సజావుగా సాగే అవకాశాలు లేవని అనేక మంది పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారి అధికారం చేపట్టినపుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ప్రపంచమంతటా వస్తువులకు పెరిగిన డిమాండ్‌ కారణంగా గతంలో లూలా అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపి కోట్లాది మంది జీవితాలను మెరుగుపరిచారు. ఆ కారణంగానే లూలా అధికారం నుంచి తప్పుకున్న నాటికి జనంలో 83శాతం మద్దతు ఉంది. ఇప్పుడు అంతలేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు అమలు జరపనున్న విధానాలను బట్టి జనం స్పందిస్తారు. ఇటీవలి కాలంలో బ్రెజిల్‌ రెండుసార్లు తీవ్ర ఆర్థిక వడిదుడుకులను ఎదుర్కొన్నది.ఈ ఏడాది ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర మాంద్యం తలెత్తనుందని అందరూ చెబుతున్నారు. అందువలన ఎగుమతులపై ఆధారపడిన బ్రెజిల్‌ను కూడా అది వదలి పెట్టదు. దిల్మా రౌసెఫ్‌ పాలనా కాలంలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా జనంలో తలెత్తిన అసంతృప్తిని మితవాదులు సొమ్ము చేసుకున్నారు.కరోనా మహమ్మారి పట్ల బోల్సనారో అనుసరించిన బాధ్యతా రహిత వైఖరి కారణంగా జనం మరోసారి ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలతో జనం మరోసారి దారిద్య్రబారిన పడ్డారు. అందుకే తన ప్రాధాన్యతల్లో దారిద్య్ర నిర్మూలన, విద్య,వైద్య రంగాలపై ఖర్చుకు ప్రాధాన్యత ఇస్తానని, అమెజాన్‌ అడవులను అక్రమంగా ధ్వంసం చేస్తున్నవారిని అరికడతానని లూలా ప్రకటించారు. గత ప్రభుత్వం జారీ చేసిన అనేక ఉత్తర్వులు, నిర్ణయాలను రద్దు చేస్తూ తొలి రోజే సంతకాలు చేశారు. నెల రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అనేక అంశాలను తనకు నివేదించాలని కోరారు.స్కూలు పిల్లలకు సరిపడా పుస్తకాలను ముద్రించలేదు. ఉచిత వైద్యానికి, కరోనా వాక్సిన్లకు నిధులు లేవు, ఉన్నత విద్యాసంస్థలు నిధుల్లేక మూతపడే దశలో ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికీ మరోసారి మూల్యం చెల్లించాల్సింది ఎవరు బ్రెజిల్‌ పౌరులే కదా అని లూలా ప్రశ్నించగానే ఎవడినీ క్షమించ వద్దు ఎవరినీ క్షమించవద్దు ఎవరినీ క్షమించవద్దు అంటూ జనం స్పందించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా 37 మందితో కూడిన మంత్రి వర్గంలో పదకొండు మంది మహిళలను లూలా నియమించటం గమనించాల్సిన పరిణామం.


బోల్సనారో ఓడినా బలుపు తగ్గలేదు. అమెరికా వెళ్లే ముందు తన అనుచరులతో మాట్లాడుతూ ఆశాభంగం చెందామంటున్నారు మీరు, ప్రత్యామ్నాయాల గురించి రెండు నెలల పాటు నోరు మూసుకొని ఉండటం ఎంత కష్టం, నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి, ఈ దేశానికి నాజీవితాన్ని ఇచ్చాను అన్నాడు,బాంబుదాడులను ఖండిస్తున్నానని చెబుతూనే దాడులకు ఇది తరుణం కాదు, దాని బదులు వచ్చే సర్కారుకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించండి.ఒక రంగంలో ఓడాం తప్ప మొత్తం యుద్ధంలో ఓడిపోలేదు. జనవరి ఒకటవ తేదీతో ప్రపంచం అంతం కాదు. అన్నాడు. సంక్షోభంలో ఉన్న జనానికి సంక్షేమ చర్యలతో ఉపశమనం కల్పించటం తప్పుకాదు, తప్పని సరి. కానీ అవే వారి విముక్తికి మార్గం కాదు. వాటిని అమలు జరిపిన వామపక్ష దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసిన కుట్రకు నిరసనగా లబ్దిపొందిన జనం అంతా వీధుల్లోకి రాలేదన్నది వాస్తవం. అదే విధంగా జన జీవితాలను దిగజార్చిన విధానాల పునాదులను కూల్చి కొత్త వాటిని నిర్మించకుండా జనానికి సాధికారత కల్పించకుండా కేవలం సంక్షేమ విధానాలతోనే గడిపితే కుదరదనే చర్చ కూడా ప్రస్తుతం బ్రెజిల్‌, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల్లో నడుస్తున్నది. మితవాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా గతంలో మాదిరి మొరటు పద్దతులకు బదులు పార్లమెంట్లలో వామపక్షాలకు బలం తక్కువగా ఉండటాన్ని ఆసరా చేసుకొని ఆటంకాలు కలిగించి జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టేందుకు, ఆ పేరుతో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చూస్తున్నారు. తాజాగా పెరూలో జరిగింది అదే.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు.


బ్రెజిల్‌, రష్యా, భారత్‌, దక్షిణాఫ్రికా, చైనాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి గురించి తెలిసిందే. లూలా గెలుపును అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు కూడా పంపారు. చిత్రం ఏమిటంటే రియో ఒలింపిక్స్‌ కంటే ఎక్కువ మంది దేశాధి నేతలు, దేశాల ప్రతినిధులు లూలా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. భారత్‌ నుంచి ప్రతినిధి లేకపోవటం గమనించాల్సిన అంశం. లూలాను జైలు పాలు చేసిన కుట్ర వెనుక ఉన్న అమెరికా తదితర దేశాల ప్రతినిధులు వచ్చినప్పటికీ మన ప్రభుత్వం ఎందుకు దూరంగా ఉందన్నది ప్రశ్న. ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. గత ఆరు సంవత్సరాల్లో అనేక మంది తిరిగి వెనుకటి స్థితికి వెళ్లారు బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను లూలా ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత బలాన్ని ఇస్తుంది. మితవాదుల సమీకరణలను కూడా తక్కువ అంచనా వేయరాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెజిల్‌ 2022 ఎన్నికలు : మూడవ సారి లూలా చారిత్రాత్మక విజయం ! ఓటమిని అంగీకరించని బోల్సనారో !!

02 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

#Lula is back, Brazil elections, Jair Bolsonaro, lula da silva, Workers’ Party


ఎం కోటేశ్వరరావు


జైల్లో 580 రోజులు గడిపిన వామపక్ష నేత లూలా రాజకీయ జీవితం ముగిసినట్లే అని ఆశించిన మితవాద శక్తులకు, వారిని బలపరిచిన అమెరికా, ఇతర దేశాలకు చెంపపెట్టు. మరోసారి అధికారపీఠాన్ని అధిరోహించేందుకు జనం ఆమోదం తెలిపారు. ఆదివారం నాడు (అక్టోబరు 30వ తేదీ) బ్రెజిల్‌ అధ్యక్షపదవికి జరిగిన తుది విడత పోరులో వర్కర్స్‌ పార్టీకి చెందిన వామపక్ష నేత లూలా డిసిల్వా మూడవ సారి అధికారానికి వచ్చారు. జనవరి ఒకటవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పొరేట్ల అనుకూల మితవాద, ప్రజాస్వామ్య విధ్వంసశక్తులు- ప్రజానుకూల వామపక్ష, ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో నిరంకుశ జైర్‌ బోల్సనారో మట్టి కరిచాడు. పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనేే ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించారు. పోలైన ఓట్లలో లూలాకు 50.9శాతం (6,03,45,499) రాగా, బోల్సనారోకు 49.1శాతం( 5,82,06,356) వచ్చాయి. లూలా మెజారిటీ 21,39,143 కాగా చెల్లని, తిరస్కరించిన ఓట్లు 57,00,443 ఉన్నాయి. బ్రెజిల్‌ నిబంధనల మేరకు అధ్యక్షపదవికి వేసిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించినప్పటికీ మంగళవారం రాత్రి రెండు నిమిషాల పాటు మాట్లాడుతూ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించకుండానే అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలని కోరాడు. తాను ఓడితే తీర్పును అంగీకరించేది లేదని ఎన్నికలకు ముందే చెప్పాడు. బోల్సనారో గట్టి మద్దతుదారైన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం బోల్సనారో కోసం వేచి చూడకుండా వెంటనే లూలాకు అభినందనలు తెలిపాడు.ఫలితాలు తెలిసిన గంటలోపే , ఎన్నికలు ” స్వేచ్చగా, న్యాయంగా, విశ్వసనీయంగా జరిగినట్లు ” బైడెన్‌ తన సందేశంలో పేర్కొన్నాడు. అమెరికాను అనుసరించే అనేక ఐరోపా, ఇతర దేశాల నేతలు కూడా అదే బాట పట్టి అభినందనలు తెలిపారు. దేశంలోని అనేక చోట్ల రోడ్ల మీద బోల్సనారో మద్దతుదార్లు ఏర్పాటు చేసిన ఆటంకాలన్నింటినీ తొలగించాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు ఆదేశించింది. మద్దతుదార్లు తమ నేత ఆదేశాల కోసం ఆదివారం నుంచి ఎదురు చూశారు.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు. రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత లూలాపై తప్పుడు కేసులు పెట్టి 2017లో తొమ్మిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు.ఆ కేసును విచారించిన జడ్జి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. లూలా 580 రోజులు జైల్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చూడగా శిక్ష పడిందనే పేరుతో అనుమతించలేదు. తరువాత జరిగిన పరిణామాల్లో 2019నవంబరులో సుప్రీం కోర్టు లూలాను జైల్లో ఉంచటం అక్రమం అంటూ విడుదలకు ఆదేశించింది.శిక్షపై అప్పీలు చేసినందున జైల్లో ఉంచకూడదని చెప్పింది. తరువాత 2021 మార్చినెలలో కేసును విచారించిస జడ్జి తీర్పు లూలా మీద కేసులను కొట్టివేశారు.అంతకు ముందు శిక్ష విధించిన జడ్జికి తగిన అధికారాలు లేవని, లూలా పౌరహక్కులను పునరుద్దరిస్తూ తీర్పు చెప్పారు. దాంతో ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది.


మిలిటరీ నిరంకుశ పాలన ముగిసిన 1980దశకం తరువాత పదవిలో ఉండి రెండవసారి పోటీ చేసిన వారిలో తొలిసారిగా ఓడిన ఘనత బోల్సనారోకు దక్కింది. తొలి దఫాలోనే ఓడిపోతాడని చెప్పిన సర్వేలు వాస్తవం కాదని తేలింది. రెండు రౌండ్లలోనూ భారీగానే ఓట్లు సంపాదించటాన్ని బట్టి బ్రెజిల్‌ సమాజంలో సమీకరణలు ఎంత బలంగా ఉన్నదీ వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో మితవాద శక్తులదే పైచేయిగా ఉంది.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. లాటిన్‌ అమెరికా వామపక్షాలు గెలిచిన ప్రతి దేశంలోనూ ఇదే విధమైన బలహీనతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నట్లు నిర్దారణ కాగానే లూలా డిసిల్వా మద్దతుదార్లతో మాట్లాడుతూ మెజారిటీ బ్రెజిలియన్లు మరింత ప్రజాస్వామ్యాన్ని, మరింత సమానత్వం, సౌభ్రాత్వత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పాడు. తన పదవీ స్వీకరణ ఉత్సవానికి రానవసరం లేదు గానీ ప్రజలిచ్చిన తీర్పును బోల్సనారో గుర్తించాలని లూలా హితవు చెప్పాడు. ప్రజలే తనకు పదవీ పట్టం గట్టారని అన్నాడు. గత ఆరు సంవత్సరాల్లో ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల బోల్సనారా ఏలుబడిలో ప్రజాస్వామిక వ్యవస్థలను, అమెజాన్‌ అడవులను ధ్వంసం చేసిన తీరు, కరోనాలో జనాన్ని గాలికి వదలివేసిన బాధ్యతా రాహిత్యాన్ని చూసిన వారు, వామపక్షాల వైఖరితో ఏకీభవించని వారు కూడా బోల్సనారో ఓడిపోవాలని కోరుకున్నారు.కరోనా వచ్చినపుడు లాక్‌డౌన్లు వద్దన్నాడు, తరువాత వాక్సిన్లను తిరస్కరించాడు, చివరికి కొనుగోలు చేసిన వాటిలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆరులక్షల 80వేల మంది ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు.


తాను ఓడితే ఫలితాలను అంగీకరించనని, అవసరమైతే వీధులకు ఎక్కుతానని బెదిరించిన బోల్సనారో రెండో విడత పోలింగ్‌ రోజు లూలా మద్దతుదార్లను ఓటింగ్‌కు రాకుండా తన మద్దతుదార్లను ఉసిగొల్పి అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రేడియోలో తన ప్రకటనలను ప్రసారం చేయకుండా అడ్డుకుంటున్నారని, తన ఫిర్యాదులపై విచారణ జరపకపోతే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించాడు. బోల్సనారో కుమారుడు,ఎంపీ ఎడ్వర్డ్‌ బోల్సనారో గురువారం నాడు ఒక టీవీలో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశాడు. మొత్తం నమోదైన ఓటర్లు 15,64,54,011 మంది కాగా తుది విడత పోలింగులో 12,42,52,716 మంది పాల్గన్నారు. ఐదువందలకు పైగా ఉదంతాల్లో బోల్సనారో మద్దతుదార్లు, వారికి మద్దతుగా కేంద్ర పోలీసులు ఓటర్లను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు రాగా వాటిలో సగం లూలాకు గట్టి పట్టున్న ఈశాన్య ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. అధ్యక్ష భవనంలో నెల రోజులకు ముందే బోల్సనారో రూపొందించిన ఒక పధకం ప్రకారమే ఇలా అడ్డుకున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఓటర్లను నిరోధించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ పోలీసులు తప్పుడు సాకులు చూపి తామెవరినీ అడ్డుకోలేదని చెప్పారు. ట్రక్కుల యజమానులు,డ్రైవర్లు బ్రెజిల్‌ రాజకీయాల్లో మితవాద శక్తుల మద్దతుదార్లుగా ఉన్నారు. వారంతా రెండవ విడత పోలింగ్‌ జరుగుతుండగా రోడ్ల మీద ట్రక్కులను అడ్డం పెట్టి లూలా మద్దతుదార్లను కదలకుండా చేశారు. గతంలో వర్కర్స్‌ పార్టీ ప్రభుత్వం మీద తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని వీరంతా వీధుల్లోకి వచ్చి బోల్సనారోకు మద్దతుగా నిలిచారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బోల్సనారో అనేక పధకాలను ప్రకటించాడు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు.

గతంలో ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో లూలా అమలు జరిపిన సంక్షేమ చర్యలతో కోట్లాది మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారు, ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ అంతకు ముందు నుంచి కొనసాగుతున్న నయా ఉదారవాద చట్రం నుంచే అమలు జరిపారు. అందువలన లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజల అసంతృప్తిని దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్నది. గత ఎన్నికలలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. తాను ఆర్ధిక రంగాన్ని చక్కదిద్దుతానని ముందుకు వచ్చిన మితవాది బోల్సనారో ప్రజలను గాలికి వదలివేయటంతో తిరిగి వర్కర్స్‌ పార్టీకి జనం పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో లూలా-బోల్సనారో ఇద్దరూ దేశ ఆర్థికపరిస్థితి గురించి ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావించారు.ఆకలి, దారిద్య్రం పెరగటానికి బోల్సనారో విధానాలే కారణమని లూలా విమర్శించాడు. ఇప్పుడు లూలా ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారనుంది.

స్పెయిన్‌ – పోర్చుగీసు వలస పాలకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 1500సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి పోర్చుగీసు పాలనలోకి బ్రెజిల్‌ వంచ్చింది. ఆ ప్రాంతంలో చెరకు తోటల్లో, ఇతరంగా పని చేసేందుకు అప్పటి నుంచి తెల్లవారి వలసలతో పాటు దాదాపు 30లక్షల మంది బానిసలను ఆఫ్రికా నుంచి రప్పించారు. దీర్ఘకాలం సాగిన పోరు తరువాత 1825 ఆగస్టు 29న స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 47.73 శాతం తెల్లవారు, 43.13శాతం బ్రెజిల్‌ స్థానిక తెగలు – సంకర వర్ణాలకు చెందిన వారు. లూలా ఈ సామాజిక తరగతికి చెందిన వారు. వీరుగాక 7.61శాతం మంది ఆఫ్రో-బ్రెజిలియన్లు ఉన్నారు. బోల్సనారో మూలాలు ఇటాలియన్‌-జర్మన్‌ జాతీయులవి. జనాభాలో ఉన్న ఈ పొందిక అక్కడ జాత్యహంకార, వివక్ష సమస్యలను కూడా ముందుకు తెస్తున్నాయి. మత రీత్యా 89శాతం మంది క్రైస్తవులు కాగా వారిలో నాలుగింట మూడు వంతులు రోమన్‌ కాథలిక్కులు.

అమెరికా, ఐరోపా దేశాలతో సత్సంబంధాలను కోరుతున్నట్లు లూలా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నాడు.ఒక ఎత్తుగడగా లేదా అనివార్యమైగానీ ఈ దేశాలు వెంటనే స్పందించి అభినందన సందేశాలు పంపాయి. చైనాతో సంబంధాల గురించి ప్రత్యేకంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బోల్సనారో పాలనలో చైనా వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగినప్పటికీ పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఇప్పుడు లూలా వాటితో పాటు ఇతర అంశాలల్లో చైనాతో సంబంధాలకు ముందుకు పోతారని చెబుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌, రష్యా,భారత్‌,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ” బ్రిక్స్‌” బృందం సంబంధాలు మరింతగా విస్తరించవచ్చు. బోల్సనారో ఎంతసేపటికీ పశ్చిమ దేశాలతో కూడిన ఓయిసిడి కూటమి వైపు మొగ్గుచూపాడు.చైనా చొరవతో అమలు జరుపుతున్న బిఆర్‌ఐ పధకంలో భాగంగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో తన పాలనా కాలంలో అమలు జరిపిన సంక్షేమ పధకాలను ఎన్నికల ప్రచారంలో లూలా మరోసారి గుర్తుకు తెచ్చారు.
ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత ఊపు,బలాన్ని ఇస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో లూలా ముందంజ -పార్లమెంటులో మితవాదులది పైచేయి !

05 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Brazil election 2022, Jair Bolsonaro, Latin America’s Right, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


” మనకు విశ్రాంతి లేదు, గెలుపుకోసం గట్టిగా పని చేయాలి. ఇంకా 28 రోజులే గడువు ఉంది ” బ్రెజిల్‌ వామపక్ష నేత లూలా డిసిల్వా అక్టోబరు రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఫలితాలు వెల్లడించిన తరువాత ఇచ్చిన పిలుపు, చెప్పిన మాటలవి. లూలా అంతిమ విజేతగా నిలిచేంత వరకు కార్మికులు, కష్టజీవులు రానున్న నాలుగు వారాలూ వీధులను ఆక్రమించాలని(ఎన్నిక కోసం పని చేయాలని) బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు లూసియానా శాంటోస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం తొలి దఫాలోనే 50శాతంపైగా ఓట్లు సంపాదించి లూలా డిసిల్వా ఎన్నికౌతారనే ఎన్నికల పండితులు, సర్వేలకు భిన్నంగా 48.4 శాతం(5,72,59,405ఓట్లు) లూలాకు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చిమితవాది బోల్సనారోకు 43.2 శాతం(5,10,72,234 ఓట్లు) రాగా మరో మితవాద పార్టీ నేత టిబెట్‌కు 4.2శాతం(49,15,420 ఓట్లు) వచ్చాయి. మూడవ పక్షం మొత్తంగా బోల్సనారోకు బదలాయించినప్పటికీ స్వల్ప తేడాతో లూలా విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. సాధారణంగా అలా జరగదు. ఇవిగాక వామపక్ష వాదినని చెప్పుకొనే సిరో గోమ్స్‌ అనే మరోనేతకు(మూడు శాతం) 36లక్షల ఓట్లు వచ్చా ఇవి లూలా వైపే మొగ్గే అవకాశం ఉంది. ఈ ఓట్ల తీరు తెన్నులను చూసినపుడు పురోగామి వాదులా మితవాదులా అన్నదే గీటురాయిగా ఓటర్లు ఆలోచించారు తప్ప మధ్యేవాదులను పట్టించుకోలేదన్నది స్పష్టం. ఇటీవల జరిగిన లాటిన్‌ అమెరికా ఎన్నికల్లో తొలి దఫా మొదటి స్థానంలో ఉన్నవారే విజేతలుగా నిలిచారు. అయినప్పటికీ ఆ ఖండంలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ను వామపక్షాలకు దక్కకుండా తమ శిబిరంలో ఉంచుకొనేందుకు అమెరికా,ఇతర మితవాద శక్తులూ సర్వశక్తులను ఒడ్డుతాయి గనుకనే ఈనెల 30న జరిగే తుది ఎన్నికల వరకు విశ్రమించరాదని, జాగరూకులై ఉండాలన్నదే లూలా(వర్కర్స్‌ పార్టీ), కమ్యూనిస్టు పార్టీ పిలుపుల ఆంతర్యం. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తంగా చూసినపుడు మితవాద శక్తులు రెండు సభల్లోనూ మెజారిటీ తెచ్చుకున్నాయి.


వర్కర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలు కలసి ” బ్రెజిల్‌ విశ్వాసం ” అనే కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి మరో ఆరుపార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వీటిలోని సోషలిస్టు పార్టీనేత గెరాల్డో ఆల్కమిన్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో బ్రెజిల్‌ విశ్వాసం కూటమి ఒకటిగా, మిగతా ఆరు పార్టీలు విడిగా పోటీ చేశాయి. మరోవైపు మితవాది బోల్సనారోకు స్వంత లిబరల్‌ పార్టీతో పాటు మరో రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మరోసారి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. తొలి రౌండ్‌లో విజేత లూలా, తుది దఫాలో కూడా మనమే విజేతలంగా ఉండాలని కమ్యూనిస్టు నేత శాంటోస్‌ చెప్పారు. తామింకేమాత్రం విద్వేషాన్ని,విభజన, హింస, ఆకలి, నిరంకుశత్వాన్ని కోరుకోవటం లేదని జనం వెల్లడించారు. అంతిమ విజయం, ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోనే ఉండి కృషి చేయాలని శాంటోస్‌ పిలుపునిచ్చారు. వీధులను ఆక్రమించండి, ప్రతి మనిషితో మాట్లాడేందుకు కృషి చేయండి, ప్రజాచైతన్యాన్ని పెంచండని శాంటోస్‌ కోరారు.


తాను గనుక గెలవకపోతే ఫలితాన్ని అంగీకరించేది లేదని అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ముందుగానే బోల్సనారో ప్రకటించాడు. రెండవ దఫా పోటీకి అవకాశం కల్పించటంతో ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఎన్నికలు స్వేచ్చగా జరిగిందీ లేనిదీ తెలుసుకొనేందుకు రక్షణ శాఖ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచమంతటా ఆసక్తి కలిగించిన ఎన్నికల్లో తనకు అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రావటం లేదని స్పష్టం కాగానే తుది దఫా పోరుకు సిద్దం కావాలని ఆదివారం రాత్రే లూలా తన మద్దతుదార్లకు పిలుపినిచ్చాడు. గత ఎన్నికల్లో బోల్సనారో తొలిదఫా మొదటి స్థానంలో 46.03 శాతం ఓట్లు తెచ్చుకోగా రెండో స్థానంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ నేత ఫెర్నాండో హదాద్‌కు 29.28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది దఫా ఎన్నికల్లో వారికి 55.13-44.87 శాతాల చొప్పున వచ్చి బోల్సనారో గెలిచాడు. తొలి దఫా పోలింగ్‌లోనే అతగాడు ఈ సారి దౌర్జన్యకాండకు తన మద్దతుదార్లను పురికొల్పే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానున్న నాలుగు వారాల్లో హింసాకాండ చెలరేగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బోల్సనారో మరింతగా రెచ్చగొట్టటంతో పాటు మిలిటరీ కుట్రకు తెరలేచే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.


అన్నీ సజావుగా ఉంటే ఈ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ బోల్సనారో, ఇతర మితవాద పార్టీల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీలో ఉన్నందున లూలా పధకాలన్నింటినీ ఆమోదించే అవకాశాలు లేవు.లూలాపై మోపిన తప్పుడు కేసులో శిక్ష వేసి జైలుకు పంపి గత ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చేసి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ జడ్జి సెర్జీయో ఇతర అనేక మంది పేరు మోసిన మితవాదులందరూ తిరిగి పార్లమెంటుకు వచ్చారు. తొలి దఫా, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బోల్సనారో ముప్పు గురించి అనేక మంది హెచ్చరిస్తున్నారు. మేథావి, జర్నలిస్టు తియాగో ఆంపారో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా బోల్సనారో అనుసరించిన విధానాలకు గాను అతన్ని శిక్షించేందుకు ఈ ఎన్నిక తోడ్పడాలని కోరుకున్నారు. అది జరిగేది కాదు, ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత మనం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకూడదు, వీధుల్లోకి వెళ్లాల్సిన తరుణమంటూ, లేనట్లైతే మరోసారి అంధకార భవిష్యత్‌లోకి వెళతామని అన్నాడు.


తొలి దఫా ఓటింగ్‌లోనే లూలా గెలుస్తాడని వేసిన అంచనాలు ఎందుకు తప్పినట్లు అనే మధనం కొందరిలో ఇప్పుడు ప్రారంభమైంది. సర్వే సంస్థలు పేదలను ఎక్కువగా కలవటం, మితవాద శక్తుల మద్దతుదార్లు స్పందించకపోవటం వలన అంచనాలు తప్పినట్లు ఒక అభిప్రాయం. బోల్సనారోకు 36 లేదా 37శాతం ఓట్లు, లూలాకు 50శాతం పైన ఓట్లు వస్తాయని ప్రముఖ ఎన్నికల పండితులు చెప్పిన లెక్క తప్పింది. ప్రపంచంలో ఇలాంటి లెక్కలు తప్పటం ఇదే మొదటిది కాదు గానీ, బ్రెజిల్‌లో మితవాదులు-పురోగామి వాదుల సమీకరణలు ఇంత తీవ్రంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. ఇటలీలో పచ్చి ఫాసిస్టు శక్తి అధికారానికి రావటం అనేక దేశాల్లో మితవాదులు బలం పుంజుకోవటం శుభ సూచికలు కాదు.2015లో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రావటం ఖాయమన్న సర్వేలు తప్పి మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ వచ్చింది. తరువాత ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరు పడటం గురించి వెలువడిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి.


పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. మొత్తం 27 రాష్ట్రాలలో, ముఖ్యంగా ధనికులు ఎక్కువగా ఉన్న ఎనిమిది చోట్ల మితవాదులే గెలిచారు.మరో ఆరుచోట్ల ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో రెండవ సారి ఎన్నికలు జరగాల్సి ఉంది.


ప్రస్తుతం వామపక్ష కూటమి తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అల్కమిన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. గతంలో లూలా పాలన, నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అరెస్టును కూడా సమర్ధించాడు. గతంలో తాను చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకొని వామపక్ష కూటమితో జతకట్టాడు. బోల్సనారో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారితో పాటు మరికొన్ని శక్తులతో కూడా లూలా ఈసారి రాజీపడినట్లు కొన్ని విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఇంత జరిగినా, విముఖత వెల్లడైనా ఊహించినదాని కంటే తొలిదఫా ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నందున బోల్సనారో దేనికైనా తెగించే అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించాడని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆరోపణలు వెలువడనప్పటికీ సాకు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అతగాడి తీరుతెన్నులను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. బహుశా అందుకే 30వ తేదీన రెండవ దఫా ఎన్నికల వరకు వామపక్షాలు వీధులను ఆక్రమించి కుట్రలను ఎదిరించాలని పిలుపు ఇవ్వటం అనుకోవాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగుబాటుకు బ్రెజిల్‌ బోల్సనారో కుట్ర – మిలిటరీ పాత్రపై ఉత్కంఠ !

18 Tuesday Jan 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

2022 Brazilian Presidential Elections •, 2022 Elections in Latin America, Brazil elections, Brazil’s Military, Jair Bolsonaro, lula da silva


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశం బ్రెజిల్‌. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలన్నీ ఈ ఏడాది అక్టోబరు రెండవ తేదీన జరిగే ఎన్నికల్లో వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా విజయం సాధించనున్నారనే చెబుతున్నాయి. మరోవైపున ఫాసిస్టు శక్తిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు జైర్‌ బోల్సనారో రంగం సిద్దం చేసుకుంటున్నాడు. లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్న తరుణంలో బ్రెజిల్‌ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ తాజాగా ధ్వజమెత్తాడు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటమి పాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన మద్దతుదార్లను అమెరికాపార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పిన దురాగతం గురించి తెలిసినదే. బ్రెజిల్‌లో కూడా అలాంటిదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అవినీతి అక్రమాలను, నేరాలను అరికడతానన్న వాగ్దానాలతో అధికారానికి వచ్చిన తరువాత నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బోల్సనారో కుట్రకు మిలిటరీ సహకరిస్తుందా ? వమ్ము చేస్తుందా అన్నది ఉత్కంఠరేపుతున్న అంశం.


లూలా మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఇద్దరు న్యాయమూర్తులు కోరుకుంటున్నారని బోల్సనారో అన్నాడు. నాకు ఓట్లు వేయద్దనుకుంటున్నారు పోనీయండి, ఎనిమిదేండ్ల పాటు దేశాన్ని దోచుకున్న వ్యక్తి రావాలని కోరుకోవటం ఏమిటంటూ లూలాను ఉద్దేశించి అన్నాడు. 2003 నుంచి 2010వరకు అధికారంలో ఉన్న లూలాపై తప్పుడు అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టిన అంశం తెలిసిందే. కొంత కాలం పాటు జైల్లో ఉంచిన తరువాత కేసును కొట్టివేశారు. తొలి దఫా ఎన్నికల్లోనే లూలాకు 54, బోల్సనారోకు 30శాతం ఓట్లు వస్తాయని ఒకటి, 45-23శాతం వస్తాయని మరో తాజా సర్వే పేర్కొన్నది. ఏ సర్వేను చూసినా ఇద్దరి మధ్య ఇరవైశాతానికి మించి తేడా ఉంటోంది. అక్కడి నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో 50శాతం పైగా వస్తేనే ఎన్నికౌతారు. లేనట్లయితే అక్టోబరు 30న తొలి ఇద్దరి మధ్య తుది పోటీ జరుగుతుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతిలో రిగ్గింగు జరిపి తనను ఓడించేందుకు చూస్తున్నారని, ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకంటూ అనుసరించిన వాక్సిన్లు, లాక్‌డౌన్‌ విధానాల వలన కరోనా కేసులు, మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. స్ధానిక తెగలు, ఆఫ్రో-బ్రెజిలియన్‌ సామాజిక తరగతుల్లో వైరస్‌ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.


దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత వచ్చిన వార్తల మీద పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెబుతున్నారు.పార్లమెంటు మీద దాడికి దిగిన వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్దంగా ఉండాలని చెప్పటమెందుకు అన్నది ఒక ప్రశ్న. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు.ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.


రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.ఐనా ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. ఎన్నికల్లో బాలట్‌ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అమెరికాలో బాలట్‌ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన ట్రంప్‌కు ఇతగాడు ఏడాది క్రితం మద్దతు పలికాడు. గతేడాది మార్చినెలలో దేశ చరిత్రలో అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. దీన్ని చూస్తే 1964నాటి అమెరికా మద్దతు ఉన్న కుట్ర అనంతరం రెండు దశాబ్దాల పాటు సాగినమిలిటరీ పాలన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అంతేకాదు అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణ పేరుతో జరుపుతున్న తతంగం ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు.పౌర విచారణ కమిటీ తమపై విచారణ జరపటం ఏమిటని వారు నిరసన తెలిపారు. విచారణ సమయంలో దానికి మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించటం, అలాంటి ఒక ప్రదర్శనలో మిలిటరీ అధికారి ఒకరు పాల్గొనటం, తన అరెస్టు అక్రమం అని చెప్పటం ప్రమాదకర సూచనలను వెల్లడించాయి. బాలట్‌ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్‌ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తరువాత సెప్టెంబరు ఏడున తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. మిలిటరీ జోక్యం చేసుకోవాలని ఆ ప్రదర్శనల్లో బానర్లను ప్రదర్శించారు. ఇవన్నీ తిరుగుబాటు సన్నాహాలే అని కొందరు భావిస్తున్నారు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇస్తున్నది. బోల్సనారో పిచ్చిపనులు, మిలిటరీ తీరు తెన్నులపై ఇంతవరకు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి )పార్టీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలకు సన్నాహాలతో పాటు కుట్రలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ఆలోచనలతో ఉంది.


ఈ ఏడాది బ్రెజిల్‌తో పాటు కొలంబియా, కోస్టారికాలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. చిలీలో నూతన రాజ్యాంగ ఆమోదం, అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి ఆరున కోస్టారికాలో సాధారణ ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్‌ 3న అధ్యక్షపదవికి తుది ఎన్నిక, మార్చి 13న కొలంబియా పార్లమెంట్‌, మే 29నతొలి విడత అధ్యక్ష ఎన్నికలు, అవసరమైతే తుది విడత జూన్‌ 19, అమెరికా పార్లమెంటు ఎన్నికలు నవంబరు 8న జరుగుతాయి. బ్రెజిల్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, 81 స్ధానాల ఎగువ సభలో 27 స్ధానాలు, దిగువ సభలోని 513 డిప్యూటీలు, 26 రాష్ట్రాల, ఒక ఫెడరల్‌ జిల్లా గవర్నర్‌ పదవులకు ఎన్నికలు అక్టోబరు రెండున జరుగుతాయి. ఎగువ సభ సెనెటర్లు ఎనిమిది సంవత్సరాలు, దిగువసభ డిప్యూటీలు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటారు. అధ్యక్ష పదవికి లూలా, బోల్సనారోతో సహా పన్నెండు మందని, ఐదుగురు పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి.


కొలంబియాలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఇవాన్‌ డూక్‌పై డిసెంబరులో జరిగిన సర్వేలో 80శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి గెలిచే అవకాశాలు లేవు. మాజీ గెరిల్లా , గత ఎన్నికల్లో రెండవ స్ధానంలో వచ్చిన వామపక్షనేత గుస్తావ్‌ పెట్రో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అధ్యక్షపదవిని పొందేవారు 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాలి. తొలి దఫా సాధించలేకపోతే తొలి ఇద్దరి మధ్య రెండవ సారి పోటీ జరుగుతుంది. కోస్టారికాలో తొలి రౌండ్‌లో ఒకరు 40శాతంపైగా ఓట్లు తెచ్చుకొన్నపుడు మరొకరెవరూ దరిదాపుల్లో లేకపోతే అధికారం చేపట్టవచ్చు. ఇద్దరు గనుక 40శాతంపైన తెచ్చుకుంటే వారి మధ్య తుది పోటీ జరుగుతుంది. మితవాద పార్టీలే ప్రధాన పోటీదార్లుగా ఉన్నాయి. అమెరికాలోని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) మొత్తం 435 స్ధానాలకు, సెనెట్‌లోని వందకు గాను 34, 39 రాష్ట్ర గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. పెరూలో అక్టోబరు నెలలో స్ధానిక సంస్ధ ఎన్నికల జరగనున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష తరంగాలను ఆపేందుకు అమెరికా, దానితో చేతులు కలుపుతున్న మితవాద, కార్పొరేట్‌ శక్తులు చేయని ప్రయత్నం లేదు. గతంలో మిలిటరీ నియంతలను ప్రోత్సహించిన అమెరికా లాభ నష్టాలను బేరీజు వేసుకున్నపుడు నష్టమే ఎక్కువగా జరిగినట్లు గ్రహించి పద్దతి మార్చుకుంది. ఎన్నికైన వామపక్ష శక్తులను ఇబ్బందులకు గురించి చేసి దెబ్బతీయటం ద్వారా జనం నుంచి దూరం చేయాలని చూస్తోంది. అలాంటి చోట్ల అధికారానికి వచ్చిన మితవాద శక్తులు తదుపరి ఎన్నికల్లో జనం చేతిలో మట్టి కరుస్తున్నారు. బ్రెజిల్‌లో కూడా అదే పునరావృతం కానుందన్న వార్తల నేపధ్యంలో అమెరికా ఎలాంటి పాత్ర వహిస్తుందో చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెజిల్‌ రాజకీయ వేదికపై తిరిగి వామపక్ష నేత లూలా !

16 Tuesday Mar 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Lula is back, Brazilian politics, Jair Bolsonaro, Latin America, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


లూయిస్‌ ఇనాసియో లూలా డ సిల్వా ! ప్రపంచానికి సుపరిచితమైన పేరు లూలా !! వామపక్ష బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు !!! న్యాయవ్యవస్ద,మీడియా, కార్పొరేట్‌శక్తులు కుమ్మక్కై ”ఆపరేషన్‌ కార్‌వాష్‌ ” పేరుతో చేసిన కుట్రలో జైలు పాలయ్యాడు. వేళ్లేటపుడు లక్షలాది ప్రజల మధ్య జైలుకు వెళ్లాడు. ఆయనకు శిక్ష విధించిన కోర్టుకు మోపిన ఆరోపణలను విచారించే అధికారమే లేదని, రాజధానిలోని మరో కోర్టుకు కేసులను బదలాయిస్తున్నామని, అక్కడ కేసులు తేలేంతవరకు లూలా దోషి కాదని తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో విధించిన 26 సంవత్సరాల శిక్ష రద్దు, కోల్పోయిన రాజకీయ హక్కులు తిరిగి వచ్చాయి. ఈ తీర్పు పచ్చిమితవాది, నియంతగా ఉన్న అధ్యక్షుడు జైర్‌ బోల్సనారోను కుదిపివేసిందనే చెప్పాలి. తిరిగి ప్రభుత్వం కేసును తిరగదోడుతుందా, అది తేలేవరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేవి శేష ప్రశ్నలు. వచ్చే ఏడాది మధ్యనాటికి శిక్ష పడితే తప్ప ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తిరిగి లూలా పోటీ చేయవచ్చు. తప్పుడు కేసులు మోపి జైలు పాలు చేసినపుడు ఒక వీరుడి మాదిరి వీడ్కోలు ఇచ్చిన జనం ఇప్పుడు కేసుల నుంచి బయటపడటంతో తమ ప్రియతమ నేత తిరిగి వచ్చాడంటూ నీరాజనం పట్టారు. లూలా తిరిగి వచ్చాడు అంటూ బ్రెజిల్‌ పాలకవర్గాలకు దడపుట్టించారు.


అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా తప్పుడు కేసులు పెట్టారు. ఇరవైఆరు సంవత్సరాల జైలు శిక్ష, రాజకీయ హక్కులను తొలగిస్తూ 2018లో కోర్టు తీర్పు చెప్పింది. దాని మీద పునర్విచారణ కోరగా అప్పీళ్లు తేలకుండా జైలులో ఉంచటం చట్టవిరుద్దం అని కోర్టు తీర్పు ఇవ్వటంతో 580 రోజుల తరువాత 2019 నవంబరులో లూలా విడుదల అయ్యాడు.శిక్ష విధించిన న్యాయమూర్తి మోరో పక్షపాత రహితంగా వ్యవహరించారో లేదో చెప్పాలని లూలా న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు అవునని ఇద్దరు కాదని పేర్కొన్నారు. తాను కొత్తగా నియమితుడైనందున, కేసు గురించి తగినంత అవగాహన లేనందున తన అభిప్రాయాన్ని చెప్పజాలనని ఐదవ న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులలో ఒకరైన ఎడ్సన్‌ ఫాచిన్‌ మార్చి ఎనిమిదవ తేదీన తీర్పు చెబుతూ లూలాకు వ్యతిరేకంగా నమోదు చేసిన నేరాలు వాటిని విచారించిన కోర్టు పరిధిలోనివి జరిగినవి కానందున విచారించే హక్కే లేదని కేసులను రాజధాని కోర్టుకు బదిలీచేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఉన్నట్లుగా పరిగణించి అర్హతలేని కోర్టు విధించిన శిక్షలు, రాజకీయ హక్కుల ఉపసంహరణ చెల్లదని తీర్పునిచ్చారు. లూలా నిర్దోషి అనిగానీ లేదా దోషి అని న్యాయమూర్తి నిర్దారించలేదు.అయినప్పటికీ రాజధాని కోర్టులో కేసు తేలేంతవరకు లూలా నిర్దోషిగానే ఉంటారు. అక్కడి నియమ నిబంధనల ప్రకారం 2022వ సంవత్సరం జూన్‌కు ముందుగా కేసుల్లో శిక్షపడితేనే పోటీ చేసేందుకు వీలు కాదని, అయితే అలా జరిగే అవకాశం లేదని తిరిగి కేసులు నమోదు చేసి విచారించేందుకు సంవత్సరాలు పడుతుంది కనుక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ తీర్పుతో 75 సంవత్సరాల లూలా తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే లూలా పోటీ చేస్తారా లేక పార్టీ తరఫున మరొకరిని నిలుపుతారా అన్నది వచ్చే రోజుల్లో మాత్రమే స్పష్టం అవుతుంది.


పులిట్జర్‌ బహుమతి పొందిన జర్నలిస్టు గ్లీన్‌ గ్రీన్‌వాల్డ్‌ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్ట్‌ బ్రెజిల్‌ అనే ఆన్‌లైన్‌ పత్రికలో న్యాయమూర్తి మోరో ఆపరేషన్‌ కార్‌వాష్‌ కుట్రదారులతో జరిపిన సంప్రదింపులు, సూచనలు, సలహాలు తదితర అంశాలన్నీ ప్రచురితమయ్యాయి.దాంతో మోరో 2020ఏప్రిల్లో రాజీనామా చేసి వెంటనే న్యాయశాఖ మంత్రి అవతారమెత్తాడు.తీర్పునకు ప్రతిఫలంగా ఈ బహుమతి పొందారు. నిజానికి పత్రికలో ఈ విషయాలు వెల్లడిగాక ముందే చార్జిషీటులోని పరస్పర విరుద్ద అంశాలు వెల్లడయ్యాయి. లూలాను విడుదల చేయాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పత్రికలో అనేక పత్రాలు వెల్లడి కావటంతో లూలా మీద కేసులు నిలిచేవి కాదని, విడుదల తధ్యమని అభిమానులు, ఇతరులు కూడా భావించారు.


సైన్సును నమ్మని బోల్సనారో మూర్ఖంగా వ్యవహరించి జనాన్ని కరోనా పాలు చేశాడు. దేశాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాననే ఆకర్షణీయ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ఆ పెద్దమనిషి ఏలుబడిలో కరోనా సమయంలో 4.1శాతం తిరోగమనంలో ఉంది.1996 తరువాత ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. అమెజాన్‌ అడవులను నాశనం చేసే విధంగా పర్యావరణ విధానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అడవులు అంతరిస్తున్నాయి. చివరికి జోబైడెన్‌, ఐరోపా ధనిక దేశాలు కూడా బ్రెజిల్‌ ఉత్పత్తులను బహిష్కరిస్తామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది.2019లో అధికారానికి వచ్చిన పచ్చి మితవాది బోల్సనారో ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కరోనాను అరికట్టటంలో వైఫల్యం ఎంత దారుణంగా ఉందో ఏడాది కాలంలో నలుగురు ఆరోగ్యశాఖ మంత్రులను మార్చటమే పెద్ద నిదర్శనం. అమెరికా తరువాత కోటీ పదిహేనులక్షల కేసులు 2.8లక్షల మంది మరణాలతో రెండవ స్ధానంలో బ్రెజిల్‌ ఉంది ఉంది. ఆర్ధికంగా దిగజారటమే కాకుండా ఉద్యమాలను అణచివేయటంలో బోల్సనారో పేరుమోశాడు. గతేడాది అక్టోబరులో 41.2శాతం మంది మద్దతు ఇవ్వగా ఫిబ్రవరి 22న వెల్లడైన సిఎన్‌టి సర్వే ప్రకారం అది 32.9శాతానికి పడిపోయింది. మరింతగా దిగజారుతున్న ధోరణే తప్ప మరొకటి కాదు.


లాటిన్‌ అమెరికాలో రెండు దశాబ్దాల వామపక్ష పురోగమనంలో ఎదురు దెబ్బలు తగిలిన వాటిలో బ్రెజిల్‌ కూడా ఒకటి. వామపక్ష ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌ ప్రజాస్వామ్య ఉద్యమం(ఎండిబి) పార్టీ 2016లో ఆ ప్రభుత్వానికి ద్రోహం చేసింది. పాలకవర్గంతో చేతులు కలిపి అధ్యక్షురాలిగా ఉన్న దిల్మా రౌసెఫ్‌ మీద తప్పుడు ఆరోపణలు మోపి అభిశంసన ద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎండిబి నేత మిచెల్‌ టెమర్‌ అధ్యక్ష పీఠమెక్కి 2019 జనవరి ఒకటవ తేదీ వరకు పదవిలో కొనసాగాడు. అంతకు ముందు సంవత్సరం జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు.2017లో జరిగిన ఒక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఏడు శాతం మంది మాత్రమే టెమర్‌కు మద్దతు ఇవ్వగా 76శాతం మంది రాజీనామా చేయాలన్నారు. 2018 ఎన్నికలలో అతగాడు పోటీ చేయలేదు. వర్కర్స్‌ పార్టీ ప్రతినిధిగా రంగంలోకి దిగిన లూలాను తప్పుడు కేసులతో శిక్షించటంతో పోటీకి అనర్హుడయ్యారు. చివరి నిమిషంలో సావో పాలో మాజీ మేయర్‌ అయిన ఫెర్నాండో హదాద్‌ను పోటీకి నిలిపారు, ఓటర్లకు పెద్దగా పరిచయం లేకపోవటం, అంతకు ముందు దిగజారిన పరిస్ధితులను చక్కదిద్ది మంచి రోజులను తెస్తానన్న బోల్సనారో ప్రజాకర్షక వాగ్దానాల వరదలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. బోల్సరారో గద్దెనెక్కాడు.


వామపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయి లేదా కుట్రతో మితవాద శక్తులు అధికారానికి వచ్చిన చోట అవి ఎన్నికల్లో పరాజయం పాలుకావటం తిరిగి వామపక్ష శక్తులు గద్దెనెక్కటం చూస్తున్నాము. అర్జెంటీనా, బొలీవియాలో అదే జరిగింది. ఈక్వెడోర్‌లో తొలి దఫా జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ది మొదటి స్దానంలో ఉన్నాడు. ఏప్రిల్‌ 11న జరిగే మలిదఫా ఎన్నికల్లో ఎలాంటి కుట్రలూ చోటు చేసుకోకపోతే విజయం సాధిస్తారనే వాతావరణం ఉంది.వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి పోటీ చేస్తాడని, అతగాడికి తగిన ప్రత్యర్ధి లూలా అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.బోల్సనారోను సమర్ధించేందుకు అవకాశం లేని వారు లూలాను కూడా అతగాడితో జమకట్టి ఆ ప్రమాదం పోతే ఈ ప్రమాదం వస్తుందనే పేరుతో ఇప్పటికే కధనాలను అల్లుతున్నారు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు మీద పునర్విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. గత పాలకులు చార్జిషీట్లను సరిగా రూపొందించని కారణంగా బోల్సనారో సర్కార్‌ తిరిగి లూలాపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిజంగా జరిగితే అదేమీ ఆశ్చర్యం కలిగించదు. అలాంటి పరిస్ధితి లాలూను తిరిగి జైలుకు పంపితే మరొకరు అభ్యర్ధి అవుతారు.


తప్పుడు కేసులో తనను శిక్షించిన జడ్జి సెర్జియో మోరో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడని తరువాత బోల్సనారో సర్కార్‌లో మంత్రి అయ్యాడని లూలా చెప్పారు.ఐదు వందల సంవత్సరాల చరిత్రలో న్యాయవ్యవస్దకు బలైన అతి పెద్ద బాధితుడనని చెప్పారు. మార్చి పదవ తేదీన వేలాది మంది తన మద్దతుదార్లతో ఎక్కడైతే ఒక లోహకార్మికుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించాడో అదే లోహకార్మిక సంఘకార్యాలయం వద్ద జరిగిన సభలో లూలా ప్రసంగించారు. కరోనా మహమ్మారితోపాటు దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. గతంలో లూలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామి అయిన అతిపెద్ద మీడియా సంస్ద గ్లోబో గ్రూప్‌తో పాటు కొందరు రాజకీయనేతలు కూడా తమ వైఖరిని మార్చుకోవటం అనేక మంది ఆశ్చర్యం కలిగిస్తున్నది. దానికి కారణం వామపక్షాల స్దానంలో అధికారానికి వచ్చిన మితవాద పక్షాలు ఎన్నికల్లో పరాజయం పాలై తిరిగి వామపక్షాలు అధికారానికి వస్తున్న ధోరణి ఒకటని చెప్పవచ్చు. గ్లోబో గ్రూపు మీడియా సంస్దలు లూలాకు శిక్ష వేసిన మోరోను హీరోగా చిత్రిస్తూ గతంలో ఆకాశానికి ఎత్తాయి. అలాంటిది ఇటీవల దేశ ప్రజాస్వామిక వ్యవస్దలో లూలా నిర్మాణాత్మక పాత్ర పోషించారంటూ సానుకూలంగా స్పందించాయి. దీని అర్ధం ఈ సంస్ధలతో సహా మొత్తంగా మీడియా మారు మనసు పుచ్చుకొని మారిపోయింది అని కాదు, విశ్వసనీయత మరింతగా దిగజారకుండా చూసుకొనే యత్నంలో భాగమే అని గుర్తించాలి. చివరకు పార్లమెంట్‌ స్పీకర్‌ ఆర్ధర్‌ లీరా కూడా న్యాయమూర్తి ఫాచీ ఇచ్చిన తీర్పును రాజకీయ వ్యవస్ద ఆమోదించాలని పేర్కొన్నారు. అంతే కాదు కార్‌వాష్‌ పేరుతో మోపిన కేసుకు దోహదం చేసిన వారిని శిక్షించకుండా వదల కూడదని కూడా చెప్పటం విశేషం. ఈ కేసును కుట్రపూరితంగా నమోదు చేశారనేందుకు అనేక ప్రభుత్వ అంతర్గత పత్రాలు బహిర్గతం కావటంతో లూలాపై మోపిన నేరారోపణలను ఎవరూ బహిరంగంగా సమర్దించలేని స్ధితి ఏర్పడింది.


లూలాపై కేసులు కొట్టివేసిన తీర్పు వెలువడిన తరువాత స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. డాలరుతో స్ధానిక కరెన్సీ రియల్‌ మారకపు విలువ పడిపోయింది. లూలా తిరిగి దేశ రాజకీయాల్లో ముందుకు రావటం కార్పొరేట్లకు ఇష్టం లేదనేందుకు ఇదొక సూచిక. గతంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ అధినేత లూలా, తరువాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉన్న అదే పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్‌ హయాంలో సంక్షేమ పధకాలు అమలు జరిగాయి. తరువాత 2016లో అభిశంసన పేరుతో జరిపిన పార్లమెంటరీ కుట్రతో అధికారానికి వచ్చిన మిచెల్‌ టెమర్‌, నయా ఫాసిస్టు బోల్సనారో కార్మిక హక్కుల మీద దాడి చేశారు. ఆరోగ్యం, విద్య వంటి అనేక సంక్షేమ పధకాలకు కోతపెట్టారు. అనేక అక్రమాలకు తెరలేపారు, చట్టవిరుద్దమైన చర్యలను అనుమతించారు.అన్నింటికీ మించి కరోనా వైరస్‌ను అదుపుచేసే విషయంలో వ్యవహరించిన తీరును నేరపూరితమైనదిగా జనం భావిస్తున్నారు.అమెరికాలో ట్రంపు మాదిరే బోల్సనారో కూడా జనాన్ని పట్టించుకోలేదు.


లూలా సామాజిక, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికగా ఆవిర్భవించిన నిజమైన నేత. అదే బోల్సనారో దానికి భిన్నమైన వ్యక్తి.పచ్చిమితవాది, ప్రభుత్వ పదవుల్లో గతంలో నియంతలను బలపరిచిన మాజీ సైన్యాధికారులను అనేక మందికి స్ధానం కల్పించాడు.దేశ ప్రజాస్వామిక వ్యవస్ధలను దిగజార్చిన ఆచరణ ఉన్న వ్యక్తి.అమెరికా సామ్రాజ్యవాదుల నమ్మిన బంటుగా ఉన్నాడు.లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్న తరుణంలో లూలా రాజకీయ హక్కుల పునరుద్దరణ బ్రెజిల్‌ వామపక్ష శక్తులకు పెద్ద ఊరట,మరోసారి అక్కడ జయకేతనం ఎగరవేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెజిల్లో లూలా అభ్యర్ధిత్వాన్ని అడ్డుకొనే రాజ్యాంగబద్ద కుట్ర !

11 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Brazil, Brazil elections, judiciary conspiracy, lula da silva, Presidential Candidacy

ఎం కోటేశ్వరరావు

లూలాగా ప్రపంచానికి సుపరిచితమైన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రస్తుతం జైలులో ఖైదీ. ఒక కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు అనేకంటే ఒక పెద్ద కుట్రలో భాగంగా జైలు పాలు చేశారనటం సముచితంగా వుంటుంది. ఆయనేమీ పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్లను వెనకేసుకోలేదు. విదేశీబ్యాంకుల్లో దాచుకోలేదు, వాటినే తిరిగి బినామీ పెట్టుబడులుగా పెట్టలేదు. లూలాపై మోపిన నేరం ఏమిటి? గతంలో అంటే 2003-11 మధ్య అధ్యక్షుడిగా వున్న సమయంలో ఆయన అప్పుడపుడు వచ్చిపోయారని చెబుతున్న ఇంటికి ఒక కంపెనీతో మరమ్మతులు చేయించాడట. అందుకుగాను దానికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలో లాభదాయకమైన కాంట్రాక్టులు ఇప్పించాడట. ఇంటి మరమ్మతుల విలువ పన్నెండులక్షల డాలర్లని, దాన్ని వుచితంగా చేయించాడు గనక అంత మొత్తం లంచం తీసుకోవటంతో సమానమే అని గతేడాది జూలై 12న కోర్టు తీర్పు చెప్పింది. ఇదంతా తనపై మోపిన రాజకీయ కుట్ర అంటూ ఆ తీర్పును సవాలు చేస్తూ మరో కోర్టుకు వెళ్లిన లూలాకు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షను పన్నెండుకు పెంచి ఖరారు చేశారు. దాంతో శనివారం నాడు ఆయన  జైలుకు వెళ్లారు.

లాటిన్‌ అమెరికా దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా అక్కడి వామపక్ష, ప్రజాతంత్రశక్తులను దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతోందని వేరే చెప్పనవసరం లేదు. ఏ వంకా దొరకని వారు డొంకను చూపి ఏడ్చారన్నది ఒక సామెత.(గ్రామాలను కలిపే కాలి, బండ్లబాటను డొంకలని పిలుస్తారు) లూలాను బదనాం చేసేందుకు చీకట్లో బాణాలు వేసినట్లుగా అమెరికా సిఐఏ, ఇతర సంస్ధల మద్దతు వున్న రాజకీయ ప్రత్యర్ధులు అనేక ఆరోపణలు చేశారు. ఆయన పాలనా కాలంలో కొందరు అధికారులు లేదా అధికార పార్టీకి చెందిన వారు అవినీతికి పాల్పడలేదనీ చెప్పలేము. లూలా వాటిని వుపేక్షించారని చేస్తున్న ఆరోపణలో ఒకటో అరశాతమో నిజం వుంటే వుండవచ్చు. కానీ లూలాపై చేసిన ఇంటి మరమ్మతు ఆరోపణలో పసలేనప్పటికీ ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్షపదవికి పోటీ చేయకుండా అనర్హుని గావించేందుకు చేసిన కుట్రలో భాగమే శిక్ష అన్నది స్పష్టం.

లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న వామపక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ఇటీవలి కాలంలో సరికొత్త కుట్రలకు తెరతీసింది.గతంలో మిలిటరీ నియంతలు, వారికి మద్దతుగా మితవాదశక్తులను రంగంలోకి తెచ్చింది. ఇప్పుడు వారి కాలంలో నియమితులైన న్యాయాధికారులతో రాజ్యాంగబద్ద కుట్రలను అమలు జరుపుతోంది. పార్లమెంట్లలో వామపక్ష శక్తులకు మెజారిటీ లేకపోవటం వాటిని అమలు జరపటం సులభమౌతోంది. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలలో లూలాను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడటంతో పాతకేసులను రంగంలోకి తెచ్చారన్నది స్పష్టం.లాటిన్‌ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన 72సంవత్సరాల లూలా పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలనకు తీసుకున్న చర్యలు నాలుగు కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచాయి. పార్లమెంటులో మెజారిటీ వున్న మితవాదశక్తులు కుట్ర చేసి 2016లో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీకి చెందిన అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను పదవి నుంచి తొలగించారు.

తోడేలుామేకపిల్ల కథలో మాదిరి దిల్మా రౌసెఫ్‌ను పదవీచ్యుతురాలిని చేసేందుకు చూపిన కారణం కూడా ఎంతో హాస్యాస్పదమైనదే. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఎన్నికైన వారి మీద అభియోగం మోపి పదవి నుంచి దించేయవచ్చు. 2014 ఎన్నికలలో దిల్మా రౌసెఫ్‌ను గెలిపించేందుకు బడ్జెట్‌ అంకెలను తారుమారు చేశారని, దిగజారిపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ పరిస్ధితిని మరుగుపరచేందుకు ప్రభుత్వబ్యాంకుల నుంచి నిధులను వుపయోగించారంటూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంతో ఆమెను తొలగించారు. ప్రస్తుత అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌పై అనేక అవినీతి విమర్శలు రావటమే కాదు, 50లక్షల డాలర్లు లంచం తీసుకున్నట్లు గతేడాది ఒక కేసు దాఖలైంది. అయితే సుప్రీం కోర్టు దానిపై విచారణ జరపకుండా, అభిశంసన తీర్మానం పెట్టకుండా పార్లమెంటులోని టెమర్‌ అనుయాయులు అడ్డుపడటాన్ని చూస్తే లూలాపై ఎలాంటి నిర్ధిష్ట ఆరోపణ లేనప్పటికీ విచారణ తతంగం జరిపి శిక్ష విధించటం రాజకీయ ప్రేరేపితంగాక మరేమిటి?లూలా ఎలాంటి నేరానికి పాల్పడని రాజకీయ ఖైదీ మాత్రమేనని ఆయన లాయర్‌ జానిమ్‌ వ్యాఖ్యానించారు. అయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అందుబాటులో వున్న అన్ని చట్టబద్దమైన అవకాశాలను వుపయోగిస్తామన్నారు. లూలా నివశించారని చెబుతున్న అపార్ట్‌మెంట్‌కు ఆయనేనాడూ యజమాని కాదని, దాన్ని అద్దెకు తీసుకోవటంలో అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి రుజువు లేదని అన్నారు.రాజకీయ కారణాలతో లూలాను జైలు పాలు చేయటంలో కుట్రదారులు సఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఆయనకు నోబెల్‌ శాంతి బహమతి అవార్డుకు నామినేట్‌ చేసేందుకు మద్దతు తెలపాలన్న నోబెల్‌ బహుమతి గ్రహీత ఆడాల్ఫో పెరెజ్‌ ఎస్కివిల్‌ పిటీషన్‌పై పెద్ద ఎత్తున స్పందన వెల్లడైంది. లక్షన్నర సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా సోమవారం నాటికి లక్షా ఎనభైవేలు దాటాయి. తమ నేతను జైలు పాలు చేసినప్పటికీ అక్టోబరులో జరిగే ఎన్నికలలో ఆయనే తమ అభ్యర్ధి అని వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెస్సీ హాఫ్‌మన్‌ ప్రకటించారు. వర్కర్స్‌ పార్టీ కేంద్ర నాయకత్వం తమ నేత జైలులో వున్న కర్టీబా నుంచే పని చేస్తుందని, ఆయనను విడుదల చేయించేందుకు వున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని హాఫ్‌మన్‌ చెప్పారు.

బ్రిక్స్‌ కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా)లో ఒక ముఖ్యపాత్రపోషించటమేగాక లాటిన్‌ అమెరికాలో అధికార కేంద్రంగా వున్న బ్రెజిల్‌ వామపక్ష వుద్యమాలకు సైతం పట్టుగొమ్మగా వుంది. అందుకే అమెరికా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ దేశంలో మితవాదులు,క్రైస్తవమతవాదులు, అవినీతి శక్తులతో చేతులు కలిపి లూలా నాయకత్వంలోని వర్కర్స్‌పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. గతంలో నియంతపాలన రుద్దిన మిలిటరీని తిరిగి రంగంలోకి తెచ్చేందుకు సైతం వెనకాడటం లేదని జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి. దిల్మా రౌసెఫ్‌ను గద్దె దింపటంలో పార్లమెంట్‌ సభ్యులుగా వున్న మాజీ సైనికాధికారులున్నారు. నగరాల్లోని మురికి వాడల్లో తిష్టవేసిన మాఫియా, గూండా గ్యాంగులను ఏరివేసే పేరుతో మిలిటరీని కూడా దించి తమ ప్రత్యర్ధులుగా వున్న వారిని హతమారుస్తున్నారు. లూలాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడక ముందు సైనిక కమాండర్‌ ఒకడు బహిరంగ ప్రకటన చేస్తూ శిక్షల నుంచి మినహాయించటానికి స్వస్తి పలకాలని కోరటం ద్వారా లూలాను జైల్లో చూడాలన్న తన కోరికను బయటపెట్టాడు. శనివారం రాత్రి పోలీసులకు లంగిపోయిన లూలాను కర్టిబా జైలుకు తరలించేందుకు పోలీసులు విమానాన్ని సిద్ధం చేశారు. చెత్తను కిటికీ నుంచి అవతలకు పడవేయండి అంటూ పైలట్లతో మిలిటరీ రేడియోలో చేసిన వ్యాఖ్యలు రికార్డయ్యాయి. అవి లూలాను వుద్ధేశించి చేసినవే అన్నది వేరే చెప్పనవసరం లేదు. యాభైలక్షల డాలర్లు లంచం తీసుకున్న టెమర్‌ అధ్య క్ష స్ధానంలో కొనసాగుతుంటే ఇంటి మరమ్మతుల పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆధారంలేని ఆరోపణలకు గురైన వామపక్ష మాజీ అధ్యక్షుడు జైలు పాలయ్యారు. ఇదీ నేడు బ్రెజిల్‌లో వున్న పరిస్ధితి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: