• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

నరేంద్రమోడీ గడ్డం పాక్‌ను భయపెడుతోందా !

14 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#PM Modi’s growing beard, Modi’s lockdown beard, Narendra Modi, Narendra Modi’s beard


ఎం కోటేశ్వరరావు


తలచినదే జరిగినదా దైవం ఎందులకు !
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు !
అన్నారు మనసు కవి ఆచార్య ఆత్రేయ. దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ తలచినట్లే జరుగుతున్నాయా ? లేక జరిగినది తలచుకొని శాంతి లేకుండా ఉన్నారా ? ఒక్కటైతే వాస్తవం బిజెపి అజెండాకు అనుగుణ్యంగా పరిణామాలు-పర్యవసానాలు లేవు. సామాన్య జనాన్ని అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు కొట్టాల్సి వస్తుంది-కాంక్రీటు పోసి ఆటంకాలు కల్పించాల్సి వస్తుంది అని ఎవరైనా కలగంటారా ! లేదన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. సంతోషం – దుఖం కలిగినా వచ్చేది కన్నీళ్లే కదా ! నరేంద్రమోడీ గారిలో అలాంటి లక్షణాలేవీ కనిపించటం లేదు. వాటికి అతీతులైన వారి కోవకు చెందిన వారని అనుకుందామా ?


రికార్డు స్ధాయిలో మాంద్యంలో ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రధాని నరేంద్రమోడీ ఏ మంత్ర దండంతో మామూలు స్ధితికి తీసుకు వస్తారు ? రైతు ఉద్యమాన్ని ఏమి చేయబోతున్నారు ? తదుపరి సంస్కరణలు ఎవరి మెడకు బిగుసుకోనున్నాయి ? రైతుల మాదిరి వీధులకు ఎక్కే ఆందోళనా జీవులు ఎవరు ? ప్రధాని ప్రతిపక్షాలను, ఆందోళన చేస్తున్న వారిని ఎకసెక్కాలాడి తనకు తానే కార్పొరేట్‌ జీవిగా లోకానికి ప్రదర్శించుకున్నారని విమర్శిస్తే విమర్శించవచ్చుగాక, ఆందోళనా జీవులకు ఎక్కడో మండితే మండవచ్చు గాక ! తమ నేత ఆ మాట అన్నారు గనుక బిఎంఎస్‌,ఎబివిపి,భారతీయ కిసాన్‌ సంఫ్‌ు వంటి సంఘపరివార్‌ సంస్దలు తమ ఆందోళన కార్యక్రమాలను వదలివేయటం గురించి జనానికి చెప్పాలి. దేశాన్ని మోడీ ఏం చేస్తారో అని ప్రతిపక్షాలు భయపడుతుంటే, తమ ప్రియతమ నేత మోడీ సమస్యల వలయం నుంచి ఎలా బయటపడతారు అనే ఆందోళన బిజెపిలో ప్రారంభమైంది. మోడీని నమ్ముకొని రైతు ఉద్యమానికి దూరంగా, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న తమ భవిష్యత్‌ గురించి మిత్రపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బను ఒప్పుకోలేని స్ధితి ఎలా ఉంటుందో తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ను చూస్తే తెలుస్తోంది కదా !

ఆగస్టు 30న తన 68వ మనసులోని మాట ప్రసంగం సమయంలో దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్దాయిలో ఉంది. జనం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.ఉపాధి లేదు, ఆదాయం లేదు. సరిహద్దులో యుద్ద మేఘాలు కమ్ముకున్నట్లు మీడియా తెలియచేసింది. అంతకు ముందే చప్పట్లు, దీపాల ఆర్పటం- కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఆ స్దితిలో మనసులోని మాటలుగా చెప్పింది ఏమిటి ? పిల్లలు ఆడుకొనే బొమ్మలు, వాటి తయారీ, భారతీయ జాతి కుక్కలను పెంచమని చెప్పారు.దానికి కొద్ది రోజుల ముందు నెమళ్లతో కాలక్షేపం ఎలా చేస్తారో వీడియోలను చూపించిన విషయం తెలిసిందే. వాటిని విన్నవారు,కన్నవారు ఏమనుకుంటారు ? అంతటి నరేంద్రమోడీకి సైతం దిక్కుతోచని క్షణాలు ఉంటాయని తెలియటం లేదూ !


ఈ మధ్య నరేంద్రమోడీని చూస్తే నిరంతరాయగా పెంచుతున్న గడ్డం, జులపాలను కత్తిరిస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రారంభమైంది. మొదటి నుంచి బైరు గడ్డాల యోగులు లేదా యోగి ఆదిత్యనాధ్‌ వంటి వారి పరంపరను పాటిస్తే అదొక తీరు. లాక్‌డౌన్‌ సమయంలో క్షౌరశాలలను మూసివేయటం, క్షురకులు ఇండ్లకు వచ్చినా చేయించుకొనేవారు ముందుకు రాకపోవటంతో పురుషులందరూ లాక్‌డౌన్‌ స్టైయిల్లో దర్శనమిచ్చారు. అందరితో పాటు నరేంద్రమోడీ కూడా అలాగే పెంచి ఉంటారని తొలి నెలల్లో చాలా మంది పెద్దగా ఆసక్తి చూపలేదు. కొందరు ముందుకు వచ్చినా దాని మీద చర్చలు నిర్వహించే ధైర్యం టీవీ ఛానళ్లకు లేదు. ఎవరు ముందు మొదలు పెడితే ఏమౌతుందో అన్న భయం కావచ్చు.
చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ తన ట్విటర్‌ చిరునామాకు చౌకీదారు అని తగిలించుకోగానే ఆయన వీరాభిóమానులు తమ పేర్ల చివర చౌకీదారు అని తగిలించుకోవటం చూశాము. కానీ ఇప్పుడు గడ్డం, మీసాలు, జులపాలు ( ముందు ముందు వాటి ప్రస్తావన వచ్చినపుడు -ఆ మూడింటిని- అందాం) ఎవరూ పెంచటం లేదు. ఏ బిజెపినేతా మోడీ గారిని అనుసరించటం లేదంటే మోజు తీరిందనుకోవాలా గౌరవం పోయిందనుకోవాలా ? నరేంద్రమోడీ నిరంకుశబాటలో ఉన్నారని కొందరు విమర్శిస్తున్నారు, ఎక్కువ మంది దైవదూత అన్నట్లు చూస్తున్నారు గనుక ఏ తరగతిలో చేర్చాలా అన్నది కొంతకాలం పక్కన పెడదాం. చరిత్రలో నియంతలెవరూ ఆలోచనా స్వేచ్చను అణచలేకపోయారు. కనుక ఆ మూడింటి గురించి ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. రోజులు బాగో లేవు గనుక బయటకు చెప్పకండి ! మోడీ ప్రముఖులు, ప్రజాజీవనంలో ఉన్నారు. గతంలో ఆయన వేసుకున్న కోటు, సూటు, బూటు గురించి అనుకూలంగానో ప్రతికూలంగానో చర్చ జరిగింది. అలాంటపుడు ఆ మూడింటి గురించి చర్చించకుండా జనం గానీ మీడియా గానీ ఎంతకాలం ఉంటుంది ? మోడీ గడ్డాన్ని చూసి పాకిస్ధాన్‌ భయపడుతోందనే కథనాలు కూడా ప్రారంభమయ్యాయి !


పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు మాదిరి ఏక్షణంలో అయినా ఆకస్మికంగా తన గడ్డం గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయవచ్చు గుట్టు చప్పుడు కాకుండా తీయించుకోవచ్చు అనుకోవచ్చా ! కర్ణాటకలోని ఉడిపి పెజావర మఠం స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ చెప్పినదాన్ని బట్టి దానికి అవకాశం లేదు. రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు వాటిని తొలగించకూడదనే సంకల్పంలో భాగం ఆ పెంపుదల కావచ్చన్నది విలేకర్ల సమావేశంలో స్వామీజీ మాటల సారాంశం.
ఆ మూడూ పెద్దగా పెరగనపుడే గతేడాది ఆగస్టులో జర్నలిస్టు బర్ఖాదత్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వాటి గురించి చర్చించారు.అయోధ్య తీర్పు వచ్చిన నాటి నుంచీ మోడీ తన గడ్డాన్ని చేసుకోకపోవటాన్ని మీరు గమనించవచ్చు. అది రోజు రోజుకూ పెరుగుతోంది, చూస్తుంటే కాషాయ దుస్తుల్లో ఉండే రాజరుషి మాదిరి తయారవుతున్నారనిపిస్తోందని ఎంపీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే అలా చేస్తున్నట్లుగా మీ మాటలు ధ్వనిస్తున్నాయని బర్ఖాదత్‌ అనగా ఒక్క ముస్లింలు ధరించే టోపీ మినహా అన్ని రకాల తలపాగలను మోడీకి బహుకరించారని ధరూర్‌ చెప్పారు.దేశంలో ఉపాధికి బదులు మోడీ తన గడ్డాన్ని పెంచుతున్నారని అసోం కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా వ్యాఖ్యానించారు. గడ్డం మీద గాక ఆర్ధిక వ్యవస్ద పెంపుదల మీద శ్రద్ద పెట్టండని ట్విటర్లు కొందరు వ్యాఖ్యానించారు.

రైతుల ఉద్యమం గురించి అంతర్జాతీయంగా చర్చించకూడదన్నది బిజెపి అభిమతం. విధి వైపరీత్యం అంటారు కదా ! ఏ సామాజిక మాధ్యమాన్ని అయితే బిజెపి అందరి కంటే ఎక్కువగా ఉపయోగించుకుందో అదే సామాజిక మాధ్యమం ఆ పార్టీని ప్రపంచవ్యాపితంగా జనం నోళ్లలో నానేట్లు చేసింది. రైతు ఉద్యమం గురించి విదేశీ పత్రికల్లో వచ్చింది, కెనడా ప్రధాని దాని గురించి ప్రస్తావించారు. అయినా ఒక పాప్‌ గాయని, విద్యార్ధిని అయిన ఒక పర్యావరణ ఉద్యమ కార్యకర్త చేసిన ట్వీట్లతో రచ్చ రచ్చైంది.


గడ్డం గురించి ఇప్పుడు నరేంద్రమోడీ ప్రస్తావన వస్తోంది గానీ, ఆయనకంటే సీనియర్‌ను అని చెప్పుకొనే చంద్రబాబు నాయుడి గడ్డం గురించి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయో తెలుసు కదా ! ఎన్నడూ ఆయన దాని గురించి స్పందించలేదు. అయినా ఒకరి గడ్డం మరొకరికి అడ్డం కాదు కనుక అంతగా ఆందోళన పడాల్సిన లేదా ఎవరైనా ఏమన్నా స్పందించాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రారంభించిన ఆ మూడింటి గురించి నరేంద్రమోడీ ఇంతవరకు ఏమీ చెప్పకపోయినా జనం పరిపరి విధాలుగా అనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మౌనంగా ఎలా ఉంటారు ? మోడీగారి తీరుతెన్నులను చూస్తే ఒక మహానటుడిలో ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పవచ్చు.బహుశా అందుకే తన పాఠశాల రోజుల్లో నటన ఇష్టమైన అంశమని మోడీ ఒక జర్నలిస్టుకు స్వయంగా చెప్పారు.మోడీగారు ఎప్పుడెలాంటి హావభావాలు ప్రదర్శించారో కార్టూనిస్టులు ఇప్పటికే గీసి చూపించారు. ఒక శైలిని సాధించాలంటే అంత తేలిక కాదు. మనం సామాన్యులం గనుక, జులపాలను చూడలేక చస్తున్నాం అని ఇంట్లో వాళ్లు పోరు పెట్టటం, పిల్లలు గుర్తు పట్టలేకపోవటం వంటి సమస్యల కారణంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే కాస్త ఖర్చు ఎక్కువే అయినా పొలోమంటూ క్షౌరశాలల బాట పట్టాం. మోడీగారు ఆపని చేయలేదు. ప్రధాని పదవిలో ఉన్నందున రాబోయే రోజుల్లో వివిధ దేశాధినేతలతో భేటీ కావాల్సి ఉంటుంది. ఆ మూడింటి పట్ల మరింత శ్రద్ద, సహాయకుల అవసరం ఎక్కువగా ఉంటుంది.


కరోనా సమయంలో సామాజిక దూరం పాటించాలని చెప్పారు గనుక నరేంద్రమోడీ తన క్షురకుడికి దూరంగా దాన్ని పాటించారన్నవారు కొందరు. అయితే కొందరు తుంటరి వారు నిజమే అనుకుందాం మరి అడ్డదిడ్డంగా పెరగకుండా వాటిని ఎవరు కత్తిరించారు అన్న ప్రశ్నలు వేశారు. అనేక అంశాలలో నిష్ణాతుడైన మోడీ గారికి ఆ మాత్రం చేతకాదా అన్న సమాధానం టకీమని వచ్చింది.పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారం సంపాదించాలనుకుంటున్నారు గనుక బెంగాలీల అభిమాన పాత్రుడైన విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ మాదిరి గడ్డం పెంచితే వారు అభిమానిస్తారు అని అలా చేస్తున్నారని చెప్పిన వారు మరికొందరు. ఆ మూడింటిని పెంచటం ప్రారంభమై ఇంకా ఏడాది గడవ లేదు. ఈ లోగా సామాజిక మాధ్యమంలో ఉన్నవారు ఎవరికి ఎలా కనిపిస్తే అలా వర్ణించారు.క్రిస్మస్‌ సమయంలో కొందరికి తాత శాంతా క్లాజ్‌ మాదిరి కనిపించారు.


లాక్‌ డౌన్‌ ప్రకటించిన సమయంలో టీవీల్లో బాగా కత్తిరించుకున్న గడ్డంతో కనిపించారు. తరువాత గడ్డాన్ని చూసి జనాలు క్వారంటైన్‌ గడ్డం అన్నారు. బాబరీ మసీదును కట్టించిన బాబరులా ఉన్నారని కొందరంటే హారీ పోటర్‌ టీవీ సీరియల్స్‌లోని అల్బస్‌ డంబెల్డోర్‌ మాదిరి కొందరికి కనిపించారు. భార్య గర్భంతో ఉన్నపుడు ప్రసవించే వరకు తెలుగు వారిలో కొందరు గడ్డాలూ, మీసాలను తొలగించరన్న అంశం తెలిసిందే.శుభ్రంగా గడ్డం చేసుకొనే వ్యక్తి ఆకస్మికంగా దాన్ని పెంచుతూ కనిపించాడంటే ఏదో సమస్య లేదా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా భావించటం తెలిసిందే. అందుకే గర్భిణీ గడ్డం లేదా గండాల గడ్డం ఇలా సందర్భానికి తగిన విధంగా అనుకుంటాం. కరోనా సమయంలో పెరిగిన వాటిని కరోనా గడ్డం లేదా కరోనా జులపాలు అన్నారు. కొంత మంది రాజకీయనేతలు తాము విజయం సాధించే వరకు లేదా ఎదుటివారిని గద్దె దింపే వరకు లేదా వ్యాపారంలో విజయం సాధించే వరకూ గడ్డాలూ మీసాలూ తీయను అని వీర ప్రతిజ్ఞలు చేసేవారు మనకు దర్శనమిస్తుంటారు. ఐరోపాలో గడ్డాల చరిత్ర గురించి రాసిన ఒక రచయిత సంక్షోభ సమయాల్లో పెంచిన గడ్డాల గురించి కూడా రాశారు. రాజకీయంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్నారు, ఆపని చేశారు.ప్రతిపక్షంలోనూ స్వంత పార్టీలోనూ ప్రత్యర్ధి లేరు . మరి నరేంద్రమోడీ గడ్డం వెనుక ఉన్నది ఏ సంక్షోభం అయి ఉంటుంది ? కరోనా అయితే దాని మీద విజయం సాధించామని ప్రకటించారు గనుక ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్లు ?

ప్రపంచ నేత అంటున్నారు గనుక సహజంగానే మోడీ గారి మూడింటి గురించి ప్రపంచం పట్టించుకోకుండా ఎలా ఉంటుంది. ఆయన దైవదూత అని స్వయంగా వెంకయ్యనాయుడు గారే చెప్పారు. కనుకనే 16వ శతాబ్దంలోనే ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడోమస్‌ మోడీ గురించి చెప్పారని బిజెపి టాంటాం వేసిన విషయం తెలిసిందే.ఒక తెల్లజాతి మహిళను ఓడిస్తారని, ఇంకా ఏవేవో చేస్తారని చెప్పినట్లుగా ప్రచారం చేయటాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. నోస్ట్రోడోమస్‌ నిజంగా చెప్పారా ? అసలేం చెప్పారు అనే అంశాల మీద గతంలోనే చర్చ జరిగింది. ప్రశాంత కిషోర్‌ లాంటి నిపుణుల పధకం ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త వాటిని చెప్పాలి తప్ప పాడిందే పాడి అసలుకే మోసం తేకూడదు. అందుకే చూడండి నరేంద్రమోడీ గారు ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ఎప్పుడైనా చెప్పారా ? గుర్తుకు తెచ్చుకోండి ! ఉదాహరణకు తొలిసారి ఎన్నికలకు ముందు అచ్చే దిన్‌- దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ది అన్నారు. తరువాత ఎప్పుడైనా మోడీ నోట అవి వినిపించాయా ? అ దేవుడికి భక్తుడికీ మధ్య వారధిగా ఉన్న వాట్సాప్‌ చెప్పిందాన్ని పనిగట్టుకొని పంచుతుంటే నిజమే అని జనం నమ్ముతున్నారు.


ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలన్నీ ఒక వైపు, మరో వైపు గురించి కూడా చూద్దాం. పాకిస్దాన్‌ మీడియాలో నరేంద్రమోడీ గడ్డం గురించి చర్చ జరుగుతోంది. ఆ చర్చ అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అక్కడి జ్యోతిష్కులు నరేంద్రమోడీని కల్కి అవతారమంటున్నారు. అఖండ భారత్‌ నిర్మాణం కోసం మోడీ గడ్డం పెంచారంటున్నారు.పాక్‌ జ్యోతిష్కుడు చెప్పిన అంశాలను నియో టీవీ నెట్‌వర్క్‌ డిసెంబరు 31న ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అవుతోందని బిజెపి నిధులతో నడిపే ఓపి ఇండియా వెబ్‌సైట్‌ రాసింది. 2019 నవంబరు నుంచి నరేంద్రమోడీకి చెడుకాలం దాపురించిందని, అఖండభారత్‌ నిర్మాణం కోసం వేసిన పధకాలు నెరవేరలేదని, దాని కోసం కావాలనే ఆయన గడ్డం తీయటం లేదని, హౌమాలు చేస్తున్నారని అతగాడు చెప్పాడు. నరేంద్రమోడీకి జ్యోతిష్కం చెప్పేందుకు మురళీ మనోహర జోషి ఒక బృందాన్ని నిర్వహిస్తున్నారని, జోషి జ్యోతిష్కుడు కాదు, ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ అయినప్పటికీ జోశ్యం చెబుతున్నారని చెప్పాడు. ఆయన చెప్పినదాని మేరకే మోడీ ఆ మూడూ పెంచుతున్నారన్నాడు. ( మార్గదర్శక మండల్‌ పేరుతో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి సీనియర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పటమే తప్ప, అది ఇంతవరకు ఎన్నిసార్లు సమావేశమైందో మార్గదర్శనం ఏమి చేసిందో తెలియదు ) వైరల్‌ అవుతున్న మరొక వీడియోలో పాక్‌ వ్యాఖ్యాత వ్యాఖ్యానంలో మరో అంశం చోటు చేసుకుంది. మరాఠా వీరుడు శివాజీ మాదిరి కనిపించేందుకు నరేంద్రమోడీ గడ్డం పెంచుతున్నారు.ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా పోరాడిన శివాజీని అనుకరించాలని మోడీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అఖండ భారత్‌ను ఏర్పాటు చేయనందుకు శని, గురు లేదా బృహస్పతి గ్రహాలు భారత్‌ మీద ఆగ్రహంతో ఉన్నాయని, అందుకోసం మోడీ గడ్డం పెంచుతున్నారని కూడా చెప్పారు.


పాకిస్ధాన్‌ మీడియాలో మోడీ గడ్డం గురించిన చర్చ మీద మన దేశంలో అనేక మంది గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. మోడీని చూసి ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌, చైనా హడలిపోతున్నాయని బిజెపి నేతలు చెబుతుంటారు. ఇప్పుడు మోడీ చేతలతో గాక తన గడ్డంతో పాక్‌ను భయపెడుతున్నారనే రీతిలో చర్చ జరుగుతోంది. నియో, జియో అనే పాక్‌ టీవీలు గడ్డం మీద జ్యోతిషం గురించి చర్చలు జరపటం వెనుక పాకిస్ధాన్‌ భయమే కనిపిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభాత్‌ ఖబర్‌ అనే హిందీ పత్రిక ఈనెల 13న అదే రాసింది. అంతే కాదు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత గోల్వాల్కర్‌కు పెద్ద గడ్డం ఉంటుందన్న విషయం తెలిసిందే. మోడీ, శివాజీ, గోల్వాల్కర్ల గడ్డాలను పోల్చుతూ, శివాజీ మాదిరి నరేంద్రమోడీని చూపుతూ చిత్రాలను కూడా ప్రచురించింది. గడ్డం బొమ్మలతో భయపెట్టటమే కాదు, ఇంతకు ముందు అధునాతన యుద్ద టాంకు ముందు నిలబడిన మోడీ చిత్రం కూడా భయపెట్టిందని , పాక్‌ పార్లమెంట్‌ సభ్యుల్లో భయం పుడుతోందని ఆ పత్రిక పేర్కొన్నది. తన గడ్డం మీద మరింత చర్చ జరగముందే దాని గురించి ప్రధాని నోరు విప్పటం మంచిదేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రియాంక చోప్రా మీద మౌనం – దియా మీర్జా, రీఆనె ట్వీట్లపై రచ్చ ! బిజెపికి ఎందుకు మండింది ?

11 Thursday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

#Farmers Protest, #Priyanka Chopra, #Rehne, Dia mirza, Narendra Modi, Priyanka Chopra, Rehne, tweets war on farmers agitation


ఎం కోటేశ్వరరావు


” మన రైతులు భారత ఆహార సైనికులు.వారి భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది. వారి ఆశలను నెరవేర్చాల్సి ఉంది.వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్ధగా తరువాత అని కాకుండా త్వరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించేట్లు చూడాలి ” 2020 డిసెంబరు ఆరవ తేదీన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్‌.
” మనం దీన్ని గురించి ఎందుకు మాట్లాడ కూడదు ” అని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎన్‌లో మన రైతు ఉద్యమం గురించి వచ్చిన ఒక వ్యాసాన్ని, దానిలో చిత్రాన్ని ఉటంకిస్తూ హాలీవుడ్‌ నటి, గాయని రీఆనె 2021 ఫిబ్రవరి రెండున చేసిన ట్వీట్‌. రెండింటికీ నాలుగు రోజులు తక్కువగా రెండు నెలల తేడా !


ప్రియాంక ట్వీట్‌ అసలు చర్చనీయాంశమే కాలేదు. రీఆనె వ్యాఖ్య మీద ఇంత రచ్చ ఎందుకో తెలియదు. మొదటి దానిలో లేని అభ్యంతరం రెండవ ట్వీట్‌లో ఏముందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే. ప్రియాంక ట్వీట్‌ మీద వివాదం రేగలేదు. పోనీ ఆమె కోరినట్లుగా సమస్యను పరిష్కరించారా అంటే అదీ లేదు. స్వయం కృతం- మేకులు కొట్టి, కాంక్రీటు పోసి మరింతగా గబ్బు పట్టారు. ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? సుదీర్ఘకాలం ఉద్యమం సాగిన తరువాతనే కదా ప్రపంచ మీడియా కేంద్రీకరించి వార్తలు రాసింది, ఢిల్లీ రోడ్ల మీద మేకుల ఫొటోలు, వీడియోలు చూపింది. విదేశాల్లోని సెలబ్రిటీలు వాటిని చదవరా ? స్పందించరా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు అన్నట్లుగా సిఎన్‌ఎన్‌ రాసిన దాని మీద చేయని రచ్చ దాన్ని ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌ మీదకు మళ్లించటం ఏమిటి ? ఒక మహిళ అన్న చులకనా ? భారత్‌లో ఉన్నారు కనుక, ఇక్కడ జరుగుతోంది ఏమిటో, దాని తీవ్రత ఏమిటో ప్రత్యక్షంగా చూశారు కనుక ప్రియాంక వెంటనే స్పందించారు. సుదూరంగా ఉన్నారు గనుక రీఆనె ఆలస్యంగా ట్వీట్‌ చేశారు. నిజంగా సచిన్‌ టెండూల్కర్‌ వంటి వారికి రైతుల మీద ఆసక్తి ఉంటే ప్రియాంక మాదిరి ఎందుకు స్పందించలేదు? పరిష్కరించమని కోరితే వారి సొమ్మేమైనా పోతుందా ? నోటి ముత్యాలు రాలతాయా ? వారికి సామాజిక బాధ్యత లేదా ?

ట్విటర్‌ కంపెనీ మీద వత్తిడి, బెదిరింపు !


రైతు ఉద్యమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నిర్ధారించుకోకుండా అవాస్తవ సమచారంతో దేశద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక మంది జర్నలిస్టుల మీద బిజెపి ప్రభుత్వాలు, అనుయాయులు కేసులను దాఖలు చేశారు. వాటి మీద సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. మరోవైపు ప్రభుత్వం సామాజిక మాధ్యమ సంస్ద అయిన ట్విటర్‌ కంపెనీకి 1,178 ఖాతాలను ఇచ్చి వాటిని మూసివేస్తారా మీ మీద చర్య తీసుకోమంటారా అని కత్తి పెట్టి కూర్చుంది. ఇవన్నీ పాకిస్దాన్‌, ఖలిస్తాన్‌ మద్దతుదారులకు చెందినవని చెబుతోంది. మా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 500 ఖాతాలను నిలిపివేశాము, ఈ విషయం గురించి మాట్లాడదాము అంటే ససేమిరా కుదరదు, ముందు మేము చెప్పిన ఖాతాలను నిలిపివేయాల్సిందే అని చెబుతోంది. మాట్లాడితే పోయేదేముంది ? ట్విటర్‌ కంపెనీ తీసుకున్న చర్యల ప్రకారం కొన్ని ఖాతాల ట్వీట్లు మన దేశంలో కనిపించవు, ఇతర దేశాల వారికి అందుబాటులో ఉంటాయి. వార్తా సంస్దలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలకు సంబంధించి ఇంతవరకు ఎవరివీ నిలిపివేయలేదని, అలా చేయటం భారత చట్టాల ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చను ఉల్లంఘించటమే అవుతుందని, అందువలన దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని ట్విటర్‌ పేర్కొన్నది. మన చట్టాల గురించి మన పాలకులకే విదేశీ కంపెనీ గుర్తు చేయాల్సిన దుస్ధితి ఎందుకు దాపురించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీన్నే మరో విధంగా చెప్పాలంటే భావ ప్రకటనా స్వేచ్చను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ రోజు రైతు ఉద్యమం సాకు అయితే రేపు మరొక సాకు చూపుతారు. ప్రభుత్వ ప్రసార సాధనాలను ఆదేశాలతో, ప్రయివేటు మీడియాను పాకేజ్‌లు, అదిరింపులు బెదిరింపులతో ఇప్పటికే భజన కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు సామాజిక మాధ్యమం మీద కేంద్రీకరించారు. తమ ఆదేశాలను ధిక్కరించినట్లయితే జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్లను ఉటంకిస్తూ ట్విటర్‌ కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

బేటీల ఉద్యోగాలను పోగొట్టిన బిజెపి !

పాలకపార్టీని సంతృప్తి పరచేందుకు ట్విటర్‌ కంపెనీ భారత విధాన డైరెక్టర్‌గా ఉన్న మహిమా కౌల్‌ను ఇంటికి పంపింది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు తప్ప తాజా వివాదానికి సంబంధం లేదని కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఖాతాల తొలగింపు లేదా ప్రభుత్వ ఆదేశాల విషయంలో ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి ఉండాలి. బిజెపికి లొంగని కారణంగా మహిమా కౌల్‌ ఉద్యోగాన్ని కోల్పోతే ఫేస్‌బుక్‌లో బిజెపికి తోడ్పడిన విషయం బహిర్గతం కావటంతో అంఖీదాస్‌ అనే బిజెపి మద్దతుదారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బిజెపి కార్యకర్తల విద్వేష పూరిత ప్రచారాన్ని నిరోధించాలనే అంశం ముందుకు వచ్చినపుడు మోడీ పార్టీ, హిందూత్వ ముఠాల ఖాతాలపై చర్యలు తీసుకుంటే కంపెనీ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని అంఖీదాస్‌ అడ్డుపడ్డారని వెల్లడైంది. ముస్లింలు, ఇతర మైనారిటీల మీద విద్వేష పూరిత ప్రచారాన్ని అనుమతించారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ పరువు మురికి గంగలో కలిసింది. ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

లతా మంగేష్కర్‌, సచిన్‌ పరువు కంటే తన బండారం గురించే బిజెపి భయం !

వివిధ ట్విటర్‌ ఖాతాలలో ఒకే విధమైన మాటలు, సమాచారంతో ట్వీట్లు వెలువడటం తెలిసిందే. అవి భజన లేదా విద్వేష ప్రచారానికి సంబంధించినవి ఏవైనా కావచ్చు. సరిగ్గా అలాంటి ట్వీట్లే రైతు ఉద్యమానికి సంబంధించి భారత రత్నలు లతా మంగేష్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ మరికొందరు ప్రముఖుల పేరుతో వెలువడ్డాయి. తొంభై ఒక్క సంవత్సరాల వృద్ధాప్యంతో ఉన్న లతా మంగేష్కర్‌ పనిగట్టుకొని ట్వీట్‌ చేశారంటే నమ్మటం కష్టమే. ఒక వేళ ట్వీట్లు చేసిన వారందరూ దాదాపు ఒకే పదజాలాన్ని వారంతా ఎలా వినియోగించారన్నది ఆసక్తి కలిగించే అంశం. వాటిని బలవంతంగా వారి చేత ఇప్పించారనే అభిప్రాయం వెల్లడి కావటంతో దాని గురించి విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేముంది భారత రత్నలనే అవమానిస్తున్నారు కనుక కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి రంగంలోకి వచ్చింది.


విదేశీ తారల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తున్నాయంటూ రుసురుసలాడుతూ బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు బజారుకెక్కారు. కాంగ్రెస్‌ తరఫున తాను భారత రత్నలకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. మన నేల గురించి ఏమాత్రం తెలియని వారు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే ప్రముఖులు ఏకోన్ముఖ వైఖరి తీసుకొనేందుకు ముందుకు వచ్చారన్నారు. ముందే చెప్పుకున్నట్లు నిజానికి దేశానికి మాయని మచ్చ ఢిల్లీ శివార్లలో రోడ్ల మీద పాతిన ఇనుప మేకులు, కాంక్రీటుతో ఏర్పాటు చేసిన ఆటంకాల చిత్రాలు, వీడియోలు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే కదా ! భారత్‌లో ప్రజాందోళనల అణచివేతకు ఇలాంటి అనాగరిక ఏర్పాట్లు చేస్తారా అని సభ్యసమాజం యావత్తూ విస్తుపోతోంది.
కాంగ్రెస్‌ గానీ, మరొకరు గానీ లతా మంగేష్కర్‌ సంగీతం గురించి లేదా సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌, ఇతర రంగాలలో అనేక మంది చేసిన కృషికి గుర్తింపుగా భారత రత్నలుగా ప్రకటించటాన్ని ఎవరూ తప్పుపట్టలేదు, పట్టాల్సిన అవసరమూ లేదు. ప్రముఖులందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రకమైన పదజాలాలను తమ ట్వీట్లలో ఎలా వినియోగించారన్నదే బయటకు రావాల్సిన అంశం.

నరేంద్రమోడీ బ్రాండ్‌ సృష్టికి ఎన్ని వందల కోట్లు వెచ్చించారు ?

ఎవరైనా తమను విమర్శిస్తే వారి వ్యక్తిగత, సంస్దల లోపాలు, తప్పులు వెతికి వాటిని ఆయుధాలుగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. లేకపోతే కల్పిత ఆరోపణలతో అదే పని చేస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులిచ్చి ఉద్యోగులను పెట్టుకొని పేరు, ప్రతిష్టలను తయారు చేయించుకొనే పెద్ద మనుషుల గురించి తెలిసిందే. రైతులకు మద్దతుగా, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేసిన వారందరూ డబ్బు తీసుకొన్నారనే నిందలను మోపారు. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచం నరేంద్రమోడీ నాయకత్వం ఎదురు చూస్తోందన్న ట్వీట్ల వెనుకు ఎంత డబ్బు చేతులు మారి ఉండాలి? అసలు ప్రపంచ నాయకులు ఎవరూ లేరు. లేని గొప్పను ఆపాదిస్తూ ప్రచారం చేసుకోవటమే కదా ! ఆర్ధికవేత్తగా మన్మోహన్‌ సింగ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీగారు ఏమి చదివారో, ఆయన డిగ్రీ ఏమిటో తెలియదు. మా మోడీ ఎంత సాధారణ వ్యక్తో తెలుసుకోండి అంటూ మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేస్తున్న చిత్రాలంటూ సామాజిక మాధ్యమంలో తిప్పిన వారెవరో తెలుసు. చైనాలో కూడా నరేంద్రమోడీకే ఎక్కువ ఆదరణ ఉందని ఆ దేశ పత్రిక సర్వే వెల్లడించిందనే తప్పుడు ప్రచారం చేసింది ఎవరు ? దానికి ఎంత సొమ్ము చెల్లించారు? ఎవరు చెల్లించారు ?
2014లోక్‌ సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి ఒక ప్రతిష్టను సృష్టించేందుకు ఎన్ని సంస్దలను వినియోగించారో, ఎందరు నిపుణులు దానివెనుక ఉన్నారో ? అందుకు మోడీ టీమ్‌ ఎంత ఖర్చు చేసిందో అంచనా వేయలేము. ఇప్పుడు ప్రశాంత కిషోర్‌ వివిధ పార్టీలకు పని చేస్తున్నట్లుగానే మోడీ గారు కూడా అనేక సంస్ధలతో ఆపని చేయించారు. ఆసక్తి ఉన్నవారు దిగువ లింక్‌లోని విశ్లేషణ చదవ వచ్చు.https://www.businesstoday.in/magazine/case-study/case-study-strategy-tactics-behind-creation-of-brand-narendra-modi/story/206321.html


రైతుల ఉద్యమానికి మద్దతుగా పాప్‌ సంగీత గాయని రీఆనె ఇచ్చిన ట్వీట్‌తో దిమ్మ తిరిగింది. దాంతో ఒక సంస్ధ నుంచి ఆమె డబ్బు తీసుకుందనే ప్రచారం చేశారు. దానికి రుజువులు చూపాలంటూ ఆ సంస్ధ సవాలు చేసింది. ఇంతవరకు నోరు మెదపలేదు. బట్టకాల్చి ఎదుటి వారి వేయటమే అసలు లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వినరు జోషీ లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ పేరుతో ఒక స్వచ్చంద సంస్దను ఏర్పాటు చేశారు. కేసులు వేయటమే దాని పని. దాని లక్ష్యం ఏమిటన్నది తెలిసిందే.రీఆనె ట్వీట్‌ చేయగానే ఆ సంస్ధను రంగంలోకి దించారు. ఆమె కంపెనీ ఒకటి 2017 నుంచి తయారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులలో ఝార్కండ్‌లోని గనుల నుంచి సేకరిస్తున్న మైకా(అబ్రకం)కు అవసరమైన నిర్ధారణ పత్రాలు ఉన్నాయా, గనుల్లో బాల కార్మికుల వినియోగం గురించి దర్యాప్తు జరపాలంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు లేఖ రాయించారు. ఒక వేళ నిజంగానే అదే జరుగుతోందని అనుకుందాం ! ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్ధ ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నది ? ఇతర అనేక రంగాలలో బాలకార్మికులను వినియోగిస్తున్న ఉదంతాలపై సదరు సంస్ధ ఎన్ని ఫిర్యాదులు చేసింది? ఇలాంటి వివాదాలను రేపటం వెనుక జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప బాలకార్మికుల మీద ప్రేమ కాదు. మన దేశంలో సరైన తిండి లేక మరణిస్తున్న బాలలు, ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న తల్లులు, ఆకలి, వ్యాధులు, దిగజారుతున్న ప్రజాస్వామ్య సూచికల గురించి ప్రపంచ సంస్ధలు ఇస్తున్న నివేదికల కంటే ఎక్కువగా రైతు ఉద్యమం మీద చేసిన ట్వీట్లు మన దేశ పరువును తీశాయా ? వాటి గురించి భారత రత్నలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ? ట్వీట్లతో దేశ పరువు కంటే కృత్రిమంగా తయారు చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరువు పోతోందన్నదే అసలు దుగ్ద !

యూ ట్యూబ్‌ మీద వత్తిడి, కమలా హారిస్‌ సోదరి కుమార్తె చిత్ర పటాల దగ్దం !

కేంద్ర ప్రభుత్వం ఒక్క ట్విటర్‌ మీదనే కాదు యూ ట్యూబ్‌ మీద కూడా వత్తిడి తెచ్చింది. రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన పాటలను తీసివేయించింది. అసీ వాద్దేంగే అనే గీతాన్ని తొలగించటానికి ముందు కోటీ 30లక్షల మంది చూశారు. అయిలాన్‌ అనే మరో పాటను కోటి మంది చూశారు. యూట్యూబ్‌ నుంచి అయితే తీసివేయించగలిగారు గానీ రైతుల హృదయాల నుంచి ఎలా తొలగిస్తారని రైతు నేతలు ప్రశ్నించారు. ఈ పాటలను ఎందుకు తొలగించారో యూట్యూబ్‌ ఒక్క ముక్క కూడా చెప్పలేదు.


అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌. ఆమె చెల్లెలు మాయ కుమార్తె మీనా హారిస్‌. ఆమె కూడా రైతుల ఉద్యమానికి సానుకూలంగా స్పందించారు. ఆమె మీద కాషాయ మరుగుజ్జులు దాడి చేశారు. బూతులు తిట్టారు, అనేక చోట్ల ఆమె ఫొటోలను తగులబెట్టారు.ఒక వేళ మేము భారత్‌లో ఉండి ఉంటే వారేమి చేసేవారో తగులబెట్టిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అయినా నన్నెవరూ బెదరించలేరు, నోరు మూయించలేరు. ధైర్యవంతులైన భారత పురుషులు రైతులకు మద్దతుగా మాట్లాడిన ఒక మహిళ చిత్రాలను తగులబెట్టారు. అది వారికి సర్వసాధారణం అనుకుంటున్నాను అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్‌ కౌర్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి లైంగికంగా దాడి చేశారు అని కూడా మీనా ట్వీట్లు చేశారు. కమలా హారిస్‌ కుమార్తె వరుస కావటంతో సహజంగానే మీనా ట్వీట్లకు కూడా పెద్ద స్పందన వెల్లడైంది.భారతీయ వారసత్వం ఉండి కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తుందా అన్న ఉక్రోషం తప్ప మరొకటి కాదు. ఎంత మంది నోరు మూయిస్తారు. అలాంటి చర్యల వలన మరింత మంది నోళ్లలో నానుతారనే విషయం పట్టించుకొనే స్ధితిలో లేరు.

వ్యవసాయం గురించి మాట్లాడే నరేంద్రమోడీ ఎప్పుడైనా మేడి పట్టారా -కాడి మోశారా !

సెలబ్రిటీలు నోరు తెరిస్తే మాకు భజన చేయాలి లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి అన్నట్లుగా ఉంది కాషాయ మరుగుజ్జుల తీరు. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది చమోలీ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు తీసింది. నదిపై నిర్మించిన అనేక ఆనకట్టల నిర్మాణం వరదలకు దారి తీసిందని, చమోలీ పౌరుల కోసం ప్రార్ధనలు జరపాలని బాలీవుడ్‌ నటి దియా మీర్జా ట్వీట్‌ చేసింది. దానిలో తప్పేముంది, నిజం అదిగాకపోతే కారణాలు వెల్లడైన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. దేశానికి జరిగిన నష్టం ఏముంది ? అయినా ఎందుకు ఆమె మీద దాడి చేశారు ? నాలుగు పదుల వయస్సున్న దియా మీర్జా తండ్రి జర్మన్‌-తల్లి బెంగాలీ. హైదరాబాదులో పుట్టి పెరిగింది. తలిదండ్రులు విడిపోయిన తరువాత దియా తల్లి హైదరాబాదుకు చెందిన అహమ్మద్‌ మీర్జాను వివాహం చేసుకుంది. దియా తన మారు తండ్రి ఇంటి పేరునే తాను స్వీకరించింది.


దియా నటి, పర్యావరణ రక్షణ ఉద్యమ కార్యకర్త. గత పది సంవత్సరాలుగా దానికి సంబంధించిన అంశాల మీద ఆమె మాట్లాడుతోంది. ఆమె కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నిర్దేశించిన నిరంతర అభివృద్ది లక్ష్యాల రాయబారిగా ఆమెను నియమించారు. ఇంతకంటే ఆమె కృషికి గుర్తింపు ఏమి కావాలి. మియా ఖలీఫా ఒక రైతు అయినట్లుగానే దియా ఒక పర్యావరణ వాది అంటూ హేళన చేశారు. మియా ఖలీఫా గానీ మరొక సినిమా నటిగానీ తాము రైతులమని ఎక్కడా చెప్పలేదు, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు తప్ప మరొకటి కాదు. రైతుల గురించి మాట్లాడిన వారందరూ రైతులే కానవసరం లేదు. ఆమాటకు వస్తే నరేంద్రమోడీ రోజూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా మేడి పట్టారా – కాడి మోశారా ? వేరుశనగ కాయలు ఎక్కడ కాస్తాయో తెలుసా ? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? టీ అమ్మాను అని ఆయన చెప్పుకోవటమే గాక నేను చూశాను అని ఇంతవరకు ఒక్కరూ చెప్పలేదు. మోడీ గారు ఏమి చదువుకున్నారో తెలియదు గానీ, ఆయన మాట్లాడుతున్న ఆర్ధిక విషయాలకు మోడినోమిక్స్‌ అని పేరు పెట్టారు. అలాంటి ఆర్ధిక నిపుణుడి ఏలుబడిలో దేశం ఇంతగా ఎందుకు దిగజారినట్లు ? ఒక అంశం గురించి మాట్లాడాలంటే దాని డిగ్రీ కలిగి ఉండాలా ? పాలకులకు నచ్చని విషయాలను రాస్తే లేదా వ్యతిరేకంగా మాట్లాడిన మహిళల మీద నోరుబట్టని బూతులతో దాడి జరగటం చూస్తున్నాం. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. రేప్‌ చేస్తామని బెదరిస్తారు. అవే నోళ్లు మహిళలను గౌరవించాలని, పూజించాలని మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటోందో !


నాడు ఇందిరే ఇండియా – నేడు బిజెపి ప్రభుత్వమే దేశం !

గతంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసిన డికె బారువా ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అని సెలవిచ్చి వ్యక్తి పూజకు తెరలేపి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వమంటే దేశం- దేశమంటే ప్రభుత్వం అనే పద్దతిలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే రైౖతు ఉద్యమం గురించి ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తే అది దేశ భక్తి- విమర్శిస్తే అది దేశద్రోహం అంటూ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం వేరు-దేశం వేరు అని కాషాయ దళాలకు తెలియకనా ? కానే కాదు. తమను గుడ్డిగా నమ్మే వారి మెదళ్లను తప్పుడు అవగాహనతో నింపే పెద్ద పధకంలో భాగమే అది.


రైతు ఉద్యమం గురించి తెలియని వారికి తెలియ చెప్పటంలో ఆ ఉద్యమాన్ని సమర్ధిస్తున్న పార్టీలు లేదా సంస్ధలు ఎంతవరకు జయప్రదమయ్యాయో తెలియదు గానీ బిజెపి మాత్రం ఇప్పుడు నిరంతరం అదే కార్యక్రమంలో ఉంది. అందుకు గాను ఆ పార్టీని ”అభినందించక ” తప్పదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం మీద ప్రధాని మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం మరింత గట్టిగా సాగేందుకు అవసరమైన పునాది వేశారు. ఆందోళనా జీవి అనే కొత్త పదాన్ని ప్రయోగించారు.సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణాలో ఒక కంపెనీ కొనుగోలు చేసిన భూ వివాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును ఆందోళనా జీవి ఆవహించింది. హైదరాబాద్‌ నగరపాలక సంస్ధ ఎన్నికల సందర్భంగా రోహింగ్యాల మీద మెరుపుదాడులు చేస్తామని ఆ పెద్దమనిషి ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లాలో గిరిజనుల కోసం ” కరసేవ ” చేస్తానంటూ రెచ్చగొడుతూ కంపెనీకి చెందిన ఒక షెడ్డును ధ్వంసం చేయించిన దృశ్యాలను చూశాము. భక్తి శివుడి మీద చిత్త బయట ఉన్న చెప్పుల మీద అన్నట్లుగా గుర్రంపోడు గిరిజనుల మీద కంటే సాగర్‌ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేశారన్నది స్పష్టం. నిజానికి ప్రధాని లేదా బిజెపికి ఆందోళనలతో పనిలేకపోతే లేదా పట్టకపోతే ఆ పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? నిత్యం అవి ఏదో ఒక ముట్టడి పేరుతో ఆందోళనలకు ఎందుకు దిగుతున్నట్లు ? వాటిని రద్దు చేస్తారా ?


పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా అతి చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న గ్రేటా టన్‌బెర్జ్‌ ఇలా చెప్పింది.” సైన్సు మరియు ప్రజాస్వామ్యం ఒకదానితో ఒకటి బలమైన సంబంధం కలిగినవి.అవి భావ ప్రకటనా స్వేచ్చ, స్వాతంత్య్రం, వాస్తవాలు మరియు పారదర్శకత మీద నిర్మితమౌతాయి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే బహుశా మీరు సైన్సుకూ గౌరవం ఇవ్వరు. మీరు సైన్సును గౌరవించపోతే ప్రజాస్వామ్యాన్నీ గౌరవించరు ”.
గ్రేటా టన్‌బర్జ్‌ చెప్పిందే దేశంలో నేడు జరుగుతోం సైన్సును గౌరవిస్తున్నామని ఒక నోటితో చెబుతూ అదే నోటితో మహాభారత కాలంలోనే మన దేశంలో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని పుట్టించే ప్రక్రియ తెలుసనీ, పురాణ కాలంలోనే ఏనుగు తలను మనిషికి అంటించే ప్లాస్టిక్‌ సర్జరీ పరిజ్ఞానం ఉందనీ, ఎలాంటి ఇంధనం లేకుండానే ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలు మన దేశంలో ఉండేవని చెబుతున్న వారెవరో మనకు తెలుసు. అలా చెప్పటం సైన్సును అవమానించటం తప్ప గౌరవించటం కాదు. దాన్ని గౌరవించని అధికారంలో ఉన్న ఆ పెద్దలు ప్రజాస్వామ్య వ్యవస్దను కరిమింగిన వెలగ పండులా మారుస్తున్న తీరూ తెలుసు ? ముసురుతున్న చీకట్లు, వేసుకున్న ముసుగులు తొలుగుతాయి. దేనికైనా తగు సమయం రావాలి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

09 Tuesday Feb 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Vizag steel agitation, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలలో ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశాయి. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని నేతలు ప్రకటించారు. ”వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్‌” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.
అసలు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలననా? లేక ప్రభుత్వ ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లా ఉంటారు అని కొందరు అంటున్నారు. నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్‌ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్‌ ను ప్రారంభించి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడు సంవత్సరాల పాటు నిధులు కేటాయించలేదు. 1978 లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్‌ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌ , టౌన్‌ షిప్‌ శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ ను జాతికి అంకితం చేశారు. తరువాత ్‌ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వ పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆరించింది. ప్లాంట్‌ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్‌ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని సాధించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ”నవరత్న ” గా గుర్తించారు. ఏడాది గడవ కుండానే నవరత్నగా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్‌లో 10 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌ లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గత అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ”పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ 10 కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాం ట్‌ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా? ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.

2 )అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తోంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తున్నది. స్వంత గనులు వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. అసలు కర్మాగారమే లేని బ్రాహ్మణీ స్టీల్స్‌కు గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాగ్దానాలను, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమ తరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమ తరావు అర్దంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది.

విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాత విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను ఇవ్వక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు కేవలం కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలా అన్నారు. ”ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్‌ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్‌ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీగా పేరు పడిన విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేలఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను – పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది. రూ.7977 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీ గా రూ.18,000 కోట్లు చెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది.

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్దంగావున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది..

వ్యాస రచయిత గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేత, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రైతుల చేతుల్లో ముల్లు గర్రలు – ముళ్ల కంచెల ఏర్పాట్లలో మోడీ !

03 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Budget 2021 Agriculture, Farmers agitations, India budget 2021-22, India budget-Farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


రైెతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాశ్వత ఆటంకాలు(బారికేడ్లు), ముళ్ల కంచెలు, గోడలు, రోడ్ల మీద ఇనుప ముళ్ల ఏర్పాట్లను చూస్తుంటే వారితో తాడోపేడో తేల్చుకొనేందుకే నరేంద్రమోడీ సర్కార్‌ సన్నద్దం అవుతున్న భావన కలుగుతోంది. అంతకు తెగిస్తారా ? రాజకీయ వ్యాపార లాభ నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా ? ముందుకు పోతే రాజకీయంగా రోజులు దగ్గర పడతాయి. వెనక్కు తగ్గితే మరిన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. నరేంద్రమోడీ సంస్కరణల పులిని ఎక్కారు, ఏం చేస్తారో, ఏం జరగనుందో చూద్దాం !


గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం అసలు సమయం వచ్చినపుడే బయటపడుతుంది. ఇక్కడ గోవు ప్రస్తావన తెచ్చినందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షంతవ్యుడను. గోముఖ వ్యాఘ్రం అనే పదాన్ని సృష్టించిన వారికి వీరతాళ్లు వేస్తారో లేక మరణానంతరం దేశద్రోహ నేరం కింద శిక్షించమని సిఫార్సు చేస్తారో వారిష్టం. గోముఖ వ్యాఘ్రాల గురించి చెప్పటానికి ఈ పదం తప్ప ఆత్మనిర్భరత లేదా మేకిన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి పదాలను సృష్టించిన వారు ప్రత్యామ్నాయం చూపేంత వరకు దాన్ని ఉపయోగించక తప్పటం లేదు.


ఆవులను మోసం చేసేందుకే వ్యాఘ్రాలు గోముఖాలతో వస్తాయి. ఇప్పుడు రైతులనే ఆమాయకులను మోసం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదే. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగానే అన్నీ రైతుల కోసమే అనేట్లుగా రైతు ఉద్యమ నేపధ్యంలో బడ్జెట్‌ ప్రసంగం, భాష్యాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత పెట్టటం ఒకటైతే పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. మరొకటి వచ్చే ఏడాదిలో రూ.16.5లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. చాలా మంది దీన్ని బడ్జెట్‌ కేటాయింపు అనుకున్నారు. బడ్జెట్‌ మొత్తమే 34.83లక్షల కోట్లయితే దానిలో దాదాపు సగం రైతులకు రుణాలుగా ఇస్తారా ? బ్యాంకుల నుంచి ఇప్పించే అప్పులు మాత్రమే అవి. మాట్లాడే మేక అంటూ ఎలా బురిడీ కొట్టిస్తారో అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ తరువాత వచ్చే నెల ఏదీ-జూన్‌కు ముందు వచ్చే నెల ఏదీ అని అడిగి మేకను గిల్లిలే ” మే ” అని అరుస్తుంది.రైతుల ఆదాయాలు పెంచే యత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి రైతులకు ఇస్తూనే ఉన్నారు, అవేవీ రైతుల ఆదాయాలను పెంచలేదు. గత సంవత్సరం పదిహేను లక్షల కోట్లుగా నిర్ణయించారు, అంతకు ముందు పదమూడున్నర లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కన శాతాల్లో చూస్తే వచ్చే ఏడాది తగ్గినట్లా – పెరిగినట్లా !


ఎంతైనా నిర్మలమ్మ తెలుగింటి ఆడపడుచు కనుక తక్కువే అని చెప్పి ఆమెను తప్పుపట్టదలచ లేదు. అధికారులు రాసి ఇచ్చింది చదువుతారు తప్ప ఆమె రాసి ఉండరు అనుకోవాలి. రైతులకు చేకూర్చిన ప్రయోజనాల గురించి నిర్మలా సీతారామన్‌ చాలా కబుర్లు చెప్పారు. బహుశా రాత్రి ఇంటికి వెళ్లి ఇదేంటబ్బా ఇలా మాట్లాడాను అనుకొని ఉంటారు. ఎందుకంటే గతంలో మాదిరి ప్రసంగం చదువుతుంటే బల్లలు చరచటాలు, ఆహా ఓహౌ అంటూ అధికార పక్ష ప్రశంశలూ లేవు. గతేడాది కంటే మొత్తం బడ్జెట్లో పెంపుదల కేవలం 33వేల కోట్ల రూపాయలు మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బడ్జెట్‌ తగ్గుతుంది అనే ఊహ ఆమెకు నిద్రను దూరం చేసి ఉండాలి.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తే తాము బయటకు తీసి అమలు జరిపామని బిజెపి వారు చెబుతున్నారు. ఎంత మోసం !! ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని అమలు జరపలేమంటూ సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం జనం మరచి పోతారా ? 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 130వేల కోట్లు చూపి ఖర్చు చేసింది రూ.94,251 కోట్లు మాత్రమే. గత ఏడాది 134వేల కోట్లు చూపి దాన్ని 117వేలకోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో 123వేల కోట్లను చూపి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ప్రధాని కిసాన్‌ నిధి పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇస్తున్నదానిని పదివేలకు పెంచుతారనే లీకు వార్తలు వచ్చాయి. దానికి బదులు గత ఏడాది ఉన్న 75వేల కోట్ల బడ్జెట్‌ను 65వేలకు కుదించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పది వేల కోట్లు పెంచారని జబ్బలు చరుచుకున్నారు బానే ఉంది మరి ఈ తగ్గింపు సంగతేమిటి ? కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి 900 కోట్లు కేటాయించామని చెబుతూనే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పధకానికి 1700 కోట్లు, ధరల స్ధిరీకరణ నిధికి 500 కోట్ల కోత పెట్టారు. మొత్తంగా చూసినపుడు వ్యవసాయ సంబంధ బడ్జెట్‌ మొత్తాలను 8.5శాతం తగ్గించినట్లు తేలింది. అయినా రైతులకు ఎంతో మేలు చేశామని ప్రసంగంలో ఊదరగొట్టారు. నిజానికి వ్యవసాయ లేదా గ్రామీణ మౌలిక సదుపాయాల నిధులు కొత్తవేమీ కాదు, గతంలో ఉన్నవే. వాటి ద్వారా రైతులకు కలిగించిన లబ్ది ఏమిటో చెప్పరు.

కనీస మద్దతు ధరల కొనుగోలు ద్వారా రైతులకు 2020-21లో 2.47లక్షల కోట్లు చెల్లించామని ఆర్దిక మంత్రి గొప్పగా చెప్పారు.ఉత్తిపుణ్యానికే చెల్లించారా ? వరి, గోధుమలను తీసుకొని వాటికేగా చెల్లించారు. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా ? ఫసల్‌ బీమా యోజన ఎంత మందికి కల్పించారని కాదు, ఎంత మందికి ఉపయోగపడిందనన్నది ముఖ్యం.2018-19లో 5.76 కోట్ల మందికి కల్పించామని చెప్పారు. మరుసటి ఏడాది లబ్దిదారులు 2.15 కోట్లన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిపొందింది 70లక్షల మంది అని ఆర్ధిక సర్వేలో చెప్పారు. కిసాన్‌ నిధి కింద సన్న, చిన్నకారు రైతులు 9.43కోట్ల మంది ఆరువేల రూపాయల చొప్పున పొందారని చెబుతున్నారు. అంటే బీమా పధకం ఎంత మందికి ఉపయోగపడుతున్నదో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.ధాన్యసేకరణ ద్వారా లబ్ది పొందింది 2.2 కోట్ల మంది అన్నారు. ఇవన్నీ చెబుతున్నదేమిటి ? ప్రచారం ఎక్కువ ప్రయోజనం తక్కువ అనే కదా ! వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి పదిహేను వేల కోట్ల రూపాయలు కరోనా ఉద్దీపన పేరుతో ఇప్పటికే ఉంది. దాన్నుంచి రుణాలుగా సూత్రరీత్యా మంజూరు చేసిన మొత్తం జనవరి నాటికి రూ.2,991 కోట్లు మాత్రమే.


భారత ఆహార సంస్ద(ఎఫ్‌సిఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రుణం తీసుకోవటాన్ని నిలిపివేస్తున్నామని ఆర్దిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇదేమీ విప్లవాత్మక నిర్ణయం కాదు. అసలు ప్రభుత్వ నియంత్రణ, నిధులతో నడిచే సంస్ద మరొక ప్రభుత్వ సంస్ద నుంచి రుణం తీసుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా కార్పొరేట్‌ ప్రతినిధులు వర్ణించారు. నిజమే వారి లెక్కలు వారికి ఉన్నాయి. మనకు అర్ధం కావాల్సింది ఏమిటి ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన షరతుల్లో భాగంగా రుణాలు, ద్రవ్యలోటు వంటి అంశాలకు సంబంధించి పరిమితులు విధించారు. వాటిని తప్పించుకొనేందుకు దొడ్డి దారులు వెతికారు. ప్రభుత్వ రుణాల మొత్తాన్ని తక్కువగా చూపేందుకు గాను ప్రభుత్వ సంస్ధలు తీసుకొనే రుణాలను విడిగా చూపుతున్నారు. రెండవది ఈ రుణం, దానికయ్యే ఖర్చును చూపి ఎఫ్‌సిఐని అసమర్ధమైందిగా చిత్రించి దాన్ని వదిలించుకొనే ఎత్తుగడ దీని వెనుక ఉంది. ఎఫ్‌సిఐలో అవినీతి లేదని కాదు, ఆ మాటకు వస్తే పోలీసు, మిలిటరీ కొనుగోళ్లలోనే అవినీతి జరుగుతోంది.


ఎఫ్‌సిఐ సేకరించే ఆహార ధాన్యాలు, పప్పు, నూనె గింజలను ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ మొత్తాలతో పాటు సంస్ధ నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ పేరుతో ప్రతి ఏటా అందచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తాలను సకాలంలో విడుదల చేయని కారణంగా ఎఫ్‌సిఐకి నిధుల సమస్య ఏర్పడింది. దాంతో అవసరమైన మొత్తాలను తాత్కాలిక సర్దుబాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో, పూర్తిగా సబ్సిడీ మొత్తాలను విడుదల చేయని కారణంగా బకాయిల మొత్తం పెరిగిపోయింది.ఈ మొత్తాలపై 8.8శాతం వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా ఈ భారాన్ని కూడా జనానికి ఇచ్చే ఆహార సబ్సిడీ ఖాతాలో చూపుతున్నారు.2019-20 సంవత్సరానికి ఎఫ్‌సిఐకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.3,17,905 కోట్లకు చేరింది. దీనికి గాను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే.2020మార్చి 31నాటికి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు ఎఫ్‌సిఐ చెల్లించాల్సిన రుణం రు.2,54,600 కోట్లు. ఈ రుణానికి హామీదారు ప్రభుత్వమే అయినా ఈ మొత్తం ప్రభుత్వ రుణఖాతాలో కనిపించదు.2020-21బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు మొత్తం రూ.7.96లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అయితే అప్పటికి ఎఫ్‌సిఐ అప్పు రూ.3,08,680 కోట్లుగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో సబ్సిడీ పేరుతో ప్రతిపాదించింది రూ.1.16లక్షల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణం లేదా ద్రవ్యలోటులోనూ చూపలేదు. ద్రవ్యలోటును ప్రభుత్వం అప్పులు చేయటం లేదా అదనపు కరెన్సీ ముద్రించటం ద్వారా పూడ్చుకొంటుంది. గతేడాది కరోనా కారణంగా ద్రవ్యలోటు పైన పేర్కొన్న రూ.7.96 నుంచి 18.49లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సహాయచర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఉచిత ఆహార ధాన్యాల కారణంగా ఎఫ్‌సిఐ సబ్సిడీ మొత్తం 2020-21లో పాతబకాయిలతో సహా రూ.4,22,618 కోట్లకు పెరిగింది. దీన్ని 281 శాతం పెరపుదలగా గొప్పగా చెప్పుకున్నారు. 2021-22 బడ్జెట్లో ఎఫ్‌సిఐ సబ్సిడీగా రూ.2,06,616 కోట్లను ప్రతిపాదించారు.

ఆర్ధిక మంత్రి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలకు స్వస్ధి చెబుతున్నామని ప్రకటించటం వెనుక అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చివేసి భారాన్ని తగ్గించటం అనుకుంటే తప్పులో కాలేసినట్లే ? రాబోయే రోజుల్లో ఎఫ్‌సిఐ సిబ్బందిని గణనీయంగా తగ్గించి ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించబోతున్నారు. తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు – తెలివిగల వాడు ఆ ఇంట్లో అద్దెకు ఉంటాడన్న లోకోక్తిని ఇక్కడ అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడవున్లను తక్కువ అద్దె రేట్లకు ప్రయివేటు వారికి అప్పగించనున్నారు. ఈ చర్య ద్వారా మిగిలే మొత్తంతో రైతులను ఉద్దరిస్తామని చెబుతారన్నది తెలిసిందే.

ఎఫ్‌సిఐ బకాయిలను తీర్చి దాన్నే పెద్ద సాయంగా చెప్పినట్లుగానే ఎరువుల సబ్సిడీని కూడా గొప్పగా చిత్రించారు. గత బడ్జెట్‌లో చూపిన రూ.71,309 కోట్లను రూ.1,33,947 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. మరి అంతపెంచిన వారు తాజా బడ్జెట్లో రూ.79,530 కోట్లకు ఎందుకు తగ్గించినట్లు ? పాత బకాయిలు తీర్చారు తప్ప బడ్జెట్‌ను పెంచలేదు. గత ఏడు సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ 70-80వేల కోట్ల మధ్యనే ఉంటోంది. భారత ఆహార సంస్ధను వదిలించుకొనే చర్యల్లో భాగంగానే దానికి ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు పెద్ద మొత్తంలో గతేడాది బడ్జెట్లో కేటాయించారు. అదే బాటలో ఎరువుల సబ్సిడీ విధానంలో కూడా పెద్ద మార్పును తలపెట్టారు. అందుకే కంపెనీలకు పాతబకాయిలను పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు రైతులు ఎంత వినియోగిస్తే అంత మేరకు సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో భూయజమానులకు నేరుగా సబ్సిడీ మొత్తాలను భూమిని బట్టి వారి ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది కొన్ని రాష్ట్రాల రైతాంగం మీద పెనుభారం మోపుతుంది. కౌలురైతులకు మొండి చేయి చూపుతుంది. ఎరువుల వాడకం తక్కువగా ఉన్న రైతులకు- ఎక్కువగా ఉన్నవారికీ ఒకే రకంగా పంపిణీ అవుతుంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హెక్టారుకు సగటున 224.5కిలోల ఎరువులు(2018-19) వాడగా ఒడిషాలో 70.6, కాశ్మీరులో 61.9కిలోలు మాత్రమే ఉంది. అందువలన అందరికీ ఒకే పద్దతి అయితే పంజాబ్‌, హర్యానా రైతులు నష్టపోతారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది గనుక మోడీ సర్కార్‌ సమయం కోసం చూస్తోంది తప్ప లేకుంటే నిర్మలమ్మ నోట ఇవి కూడా వెలువడి ఉండేవి. గతంలో బడ్జెట్ల సమయంలో కొత్త పన్నులు, విధాన నిర్ణయాలు ప్రకటించేవారు. ఇప్పుడు ఇతర రోజుల్లో చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా వెలువడవచ్చు.


అన్ని రంగాలలో పరిశోధన-అభివృద్ధికి పెద్ద పీటవేస్తేనే జనానికి, దేశానికి లాభం ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి అనేక దేశాలతో పోల్చుకున్నపుడు మన దిగుబడులు, ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటం ఒక కారణం. చైనా వంటి దేశాలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఆవు మూత్రం-పేడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. పరిశోధనకు కేటాయిస్తున్నదే తక్కువ అయితే దానిలో ఆవు మూత్రంలో ఏముందో కనుగొనేందుకు మళ్లింపు ఒకటి. బేయర్‌ కంపెనీ ఏటా ఇరవైవేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే 2023 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌ గతేడాది రూ.7,762 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8,514 కోట్లు ప్రతిపాదించింది.


చివరిగా ఒక్క మాట. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు, నేల మీద పాతిన ఇనుప ముళ్లు, పోలీసుల చేతుల్లో ఇనుపరాడ్లను చూస్తుంటే రైతాంగాన్ని అణచివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారా అనిపిస్తోంది.సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనేందుకు కూడా బహుశా ఇంత సన్నద్దత లేదేమో ! ఉంటే పాకిస్ధాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి మన సైనిక స్ధావరాల మీద దాడులు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం సాధ్యమై ఉండేది కాదు.


త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాదిన రగిలిపోతున్న రైతన్నలను చూసి గౌరవ ప్రదంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటారా అనే ఆశతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే రైతాంగం నిరాశతో ఉన్న అనేక మందిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తోంది. తమ మెడకు ఉరిగా మారనున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు తదుపరి పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రైతు యువకులకు కూడా ముల్లుగర్రల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎద్దులు, దున్నలతో వ్యవసాయం బాగా తగ్గిపోయింది. వాటితో వ్యవసాయ చేసే సమయంలో దున్నకం వేగంగా సాగేందుకు సన్నటి వెదురు కర్రల చివరన ఇనుప ముల్లు వంటి ఇనుప మేకు గుచ్చి దానితో ఎద్దులు, దున్నల వెనుక భాగాల మీద సున్నితంగా పొడిచి వేగంగా కదిలేట్లు చేసే వారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఇనుప ముళ్లను చూస్తుంటే ఇంకా ఉద్యమాలకు కదలకుండా ఉన్న రైతాంగాన్ని పొడిచి కదిలించేందుకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది. చరిత్రను చూసినపుడు తిరుగుబాట్లకు కారణం పాలకుల చర్యలే తప్ప ఎల్లవేళలా ప్రశాంతతను కోరుకొనే పౌరులు కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

11 Monday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ఏలుబడి : కార్పొరేట్లకు విశ్వాసం – రైతాంగంలో అవిశ్వాసం !

13 Sunday Dec 2020

Posted by raomk in AP NEWS, BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Farmers’ protest, CACP, Indian Farmer Protest 2020, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


మాకు మీరు చెబుతున్నదాని మీద విశ్వాసం లేదు మహా ప్రభో అని రైతాంగం గత 18రోజులుగా (డిసెంబరు 13) తమ రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా భారత్‌ మీద ప్రపంచం చూపుతున్న విశ్వాసం గత కొద్ది నెలలుగా మరింతగా పెరిగింది నా ఏలుబడిని చూడండో అని ప్రధాని నరేంద్రమోడీ తన గొప్ప గురించి చెప్పుకున్నారు. అదీ ఎక్కడా ! వాణిజ్య, పారిశ్రామికవేత్తల ప్రతినిధి ఫిక్కీ సమావేశంలో మోడీ చెప్పారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పిల్లిమొగ్గలను రైతులు పట్టించుకోవటం లేదు. గత ఆరు సంవత్సరాలుగా పలు తరగతులలో భాగంగా నరేంద్రమోడీ మీద రైతులు పెంచుకున్న భ్రమలు తొలగి గత కొద్ది నెలలుగా వేగంగా అవిశ్వాసాన్ని పెంచుకుంటున్నట్లు జరుగుతున్న ఉద్యమం వెల్లడిస్తోంది. మరి నరేంద్రమోడీ గారు చెప్పింది అబద్దమా ? అదియును సూనృతమే ఇదియును సూనృతమే.( రెండూ నిజమే ) తమకు దోచి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు మోడీ గారి మీద దేశీ-విదేశీ కార్పొరేట్లలో విశ్వాసం పెరుగుతుంటే ఆ చర్యలు తమ కొంప ముంచుతాయని రైతాంగం భయపడటం ఎక్కువైంది.


బిజెపి చెప్పినట్లుగా రైతుల ఆదాయాలు రెట్టింపు అవలేదు, కనుచూపు మేరలో అయ్యే అవకాశాలు కనిపించటంలేదు. మాంద్యం లేదా కరోనా మహమ్మారి వచ్చినా మోడీ ఏలుబడిలో కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయే తప్ప తగ్గవని తేలిపోయింది. అందుకే బిజెపి ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది.కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు అందచేసిన వివరాల ప్రకారం 2018లో రూ.1,027.37 కోట్లున్న బిజెపి ఆదాయం 2019 నాటికి రూ.2,410.08(134.59శాతం)కు పెరిగింది. అనధికారికంగా వచ్చే ఆదాయం గురించి చెప్పనవసరం లేదు. కార్పొరేట్‌ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్ధలు ఇచ్చిన ఇంత డబ్బు ఉంది కనుకనే రైతులకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా 700 జిల్లాల్లో సభలు, ప్రచారం, 700 పత్రికా సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చెప్పిన అసత్యాలు, అర్ధసత్యాలను జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నమే ఇది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఎంత ఎక్కువగా చెబితే అంతగా జనం వాస్తవాలు తెలుసుకుంటారు. మీడియాలో బిజెపికి ఇచ్చినంత గాక పోయినా ఎంతో కొంత చోటు ఇవ్వక తప్పదు కదా !


రైతాంగ ఆందోళన అనేక అంశాలను ముందుకు తెస్తోంది. రాజకీయ పార్టీలు, మేథావులు, మీడియా ఎవరి అసలు రంగు ఏమిటో బయటపెడుతోంది. తొలి రోజుల్లో విస్మరించినా ప్రధాన స్రవంతి మీడియా రైతుల ఆందోళన వార్తలను అరకొరగా అయినా ఇవ్వకతప్పటం లేదు. సెప్టెంబరు నెలలో పార్లమెంట్‌లో అప్రజాస్వాకంగా ఆమోదించిన వివాదాస్పద చట్ట సవరణల మీద ముందుకు తెస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులను చూద్దాం. వాటిలో ప్రధానమైనది – వ్యవసాయ చట్టాలకు కనీస మద్దతు ధరలకు సంబంధం లేదు !


దేశంలోని మిగతా రాష్ట్రాలకూ కాశ్మీరుకు ఉన్న ఆర్టికల్‌ 370కి సంబంధం లేదు. అయినా సంబంధం అంటగట్టి దాన్ని రద్దు చేసేంత వరకు నిదురపోలేదు. దేశం మొత్తానికి వర్తించే కనీస మద్దతు ధరలకూ వ్యవసాయ చట్టాలకు ఇప్పటి వరకు సంబంధం లేదు నిజమే ! సంబంధం కలపమని, తమకు భరోసా కల్పించమనే కదా రైతులు కోరుతోంది. ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పమంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు వాదనలు ముందుకు తెస్తున్నారు ? మూడు చట్టసవరణలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. తాజా ఆందోళనతో నిమిత్తం లేకుండానే గత కొన్ని సంవత్సరాలుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిందా లేదా ? ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి ఇప్పుడు బిజెపి మీద అనుమానాలు ఎందుకు బలపడ్డాయి ?
సంస్కరణల పేరుతో అన్ని వ్యవస్దలకు తిలోదకాలు ఇచ్చేందుకు, బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు, లాభాలు వస్తున్న ఎల్‌ఐసి, చమురు సంస్ధలను కూడా ప్రయివేటు పరం చేసేందుకు మోడీ సర్కార్‌ కుంటి సాకులు చెబుతున్నది. కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే మూడు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. గతంలో కూడా రైతు సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. చట్టాలకు ఎంఎస్‌పికి సంబంధం లేదని చెబుతున్న బిజెపి పెద్దలు గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా లేక దొంగ నిద్ర నటిస్తారా ? 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేస్తున్నారు ? బిజెపి నేతలు అసలు ఆ ప్రస్తావనే ఎందుకు తేవటం లేదు. నాడు ఎందుకు సిఫార్సు చేసినట్లు ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? మా దారే వేరు అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇతరులకు తేడా ఏముంది ?


వ్యవసాయ చట్టాలకు-కనీస మద్దతు ధరలకు సంబంధం ఉందా లేదా అన్నది అసలు చర్చే కాదు, సంబంధం కల్పించాలని రైతులు అడుగుతున్నారు. గతంలో కూడా లేదుగా అని బిజెపి అంటోంది. నిజమే, గతంలో లేని వాటిని మోడీ సర్కార్‌ అనేకం తెచ్చిందిగా దీన్నెందుకు తీసుకురాదు. తెస్తే వారికి పోయేదేముంది? రైతులు శాశ్వతంగా మద్దతుదారులుగా మారతారు కదా ! ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! అన్నింటికీ మించి సంబంధం లేదనటం పచ్చి అబద్దం. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేయకూడదు. కొత్త చట్టం ఆ యార్డుల పరిధిని కుదించి దాని వెలుపల వ్యాపారులు ఎలాంటి పన్నులు, సెస్సులు చెల్లించకుండా కొనుగోళ్లు జరపవచ్చని చెప్పింది. ఏ ధరలకు కొనుగోలు చేయాలో చెప్పలేదు. కనీస మద్దతు ధరలు అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించే యంత్రాంగం అక్కడ లేనపుడు ఏమి చేయాలో సవరించిన చట్టాల్లో ఎందుకు చెప్పలేదు?


అంతేనా 2014 మే 26న నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ఏప్రిల్‌ 14న చేసిన ట్వీట్‌లో మన రైతులు సరైన ధర ఎందుకు పొందకూడదు, వారేమీ అడుక్కోవటం లేదు, కష్టపడుతున్నారు, మంచి ధర పొందాలంటూ దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా రైతులు దేన్నీ దేబిరించటం లేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఏమంటున్నారు ? ” నిజమేనయ్యా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షం కోరుతోంది. నేను వారిని అడుగుతున్నా మీరు చాలా సంవత్సరాలు పాలన సాగించారుగా ఎందుకు చేయలేదు ” అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది బిజెపి. గడ్డం లేని సమయంలో స్వయంగా మోడీఏ సిఫార్సు చేశారు. ఇప్పుడు గడ్డం పెంచటాన్ని చూసిన అనేక మంది మోడీలో పరిణితి, పెద్దరికం వచ్చింది అని చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాల్లో చేయని దాన్ని ఇప్పుడెందుకు చేయరు అంటే ఉన్న ఆటంకం ఏమిటో చెప్పకుండా గతంలో ఎందుకు చేయలేదని ఎదురుదాడి చేయటం ఏమిటి ?


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఎంఎస్‌పికి-వ్యవసాయ చట్టాలకు సంబంధం లేదనే పాటనే పాడారు. ఆమె మరొక అడుగు ముందుకు వేశారు.చట్టసవరణలు చేయబోయే ముందు సంప్రదింపులు, చర్చలు ఎందుకు జరపలేదు అని అడిగితే ఈ అంశాల మీద 2000 సంవత్సరంలో వాజ్‌పేయి సర్కార్‌ హయాం నుంచీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి పొమ్మన్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి కూడా చర్చ ఉన్నది దాన్నెందుకు పట్టించుకోవటం లేదు ? కిసాన్‌ ముక్తి బిల్లుల పేరుతో రుణభారం నుంచి విముక్తి కలిగించాలని, మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ 2018 జూలై, ఆగస్టు నెలల్లో పార్లమెంట్‌లో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు. ఆలిండియా కిసాన్‌ సంఘర్ష సమితిలో భాగస్వాములైన స్వాభిమాని షేత్కారి సంఘటన నేత, ఎంపీ అయిన రాజు షెట్టి లోక్‌సభలో, ఆలిండియా కిసాన్‌సభ నేత, సిపిఎం ఎంపీ అయిన కెకె రాగేష్‌ రాజ్యసభలో వాటిని ప్రవేశ పెట్టారు. వాటిని ప్రభుత్వం తిరస్కరించింది.
స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసినట్లు, ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలు అమలు జరుపుతున్నట్లు బిజెపి ప్రచారం చేస్తున్నది. దీన్ని చూసి నేను చచ్చినా నా సిద్దాంతం బతికి ఉన్నందుకు సంతోషంగా ఉందని అబద్దాల జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆత్మ సంతోషపడుతూ ప్రత్యేక అభిమానంతో మన దేశం చుట్టూ తిరుగుతూ ఉండి ఉండాలి ( ఆత్మ గురించి విశ్వాసం ఉన్నవారి మనోభావాల మేరకు ). 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వరంగా స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని బిజెపి చెప్పింది. అమిత్‌ షా భాషలో చెప్పాలంటే ఇదొక జుమ్లా (ఏదో అవసరానికి అనేకం చెబుతుంటాం). 2016 ఏప్రిల్‌ ఆరవ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ హర్యానాలోని పానిపట్‌ జిల్లా సమలఖాకు చెందిన పి.పి కపూర్‌ అనే సమాచార హక్కు కార్యకర్తకు ఇచ్చిన సమాధానం మోడీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నది. ” అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఖర్చులు మరియు ధరల నిర్ణాయక కమిషన్‌ (సిఏసిపి) కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కనుక కనీస మద్దతు ధరలకు సంబంధించి స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది. ఉత్పాదక ఖర్చు మీద 50శాతం కనీసంగా పెంచి నిర్ణయించటం మార్కెట్లో వక్రీకరణకు దారి తీస్తుంది.” అని పేర్కొన్నారు. గతంలో మాదిరే మద్దతు ధరలను కొనసాగిస్తున్నారు తప్ప స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పినదాని ప్రకారం భూమి(విలువ) కౌలు మొత్తాన్ని కూడా ఖర్చులలో కలిపి మద్దతు ధరలను నిర్ణయించాల్సి ఉండగా మోడీ సర్కార్‌ దాన్ని వదలివేసింది.

సిఏసిపి మద్దతు ధరలను సూచించేందుకే పరిమితం తప్ప వాటి అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విధిగా కొనుగోలు చేయాలని ప్రయివేటు రంగ వ్యాపారులను ఆదేశించే అవకాశం లేదు. కొంత మేరకు చెరకు విషయంలోనే ఏ రంగంలో ఉన్నవారైనా ఎఫ్‌ఆర్‌పి ధరలను అమలు జరపాల్సి ఉంది. దీన్నే ఇంతకు ముందు ఎస్‌ఎంపి అని పిలిచారు.2018-19లో సిఏసిపి తన ధరల విధాన నివేదికలో కనీస మద్దతు ధరలకు రైతులు అమ్ముకొనే హక్కును కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించింది. రైతుల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ చర్య అవసరమని పేర్కొన్నది. అయితే దీన్ని కేంద్రం అంగీకరించలేదు. ఇప్పుడు విశ్వాస సమస్య మరింతగా ముందుకు వచ్చింది. రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం మీద, పాలక వ్యవస్ధ మీద విశ్వాసరాహిత్యాన్ని సూచిస్తున్నది. 1966-67లో గోధుమలకు తొలిసారిగా మద్దతు ధర నిర్ణయం అధిక దిగుబడి వంగడాల సాగు, పెరిగిన ఉత్పత్తి మార్కెటింగ్‌పై రైతులకు విశ్వాసం కొల్పేందుకు ఉద్దేశించిందే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ ఘోర పరాజయం – నరేంద్రమోడీకి చెప్పుకోలేని దెబ్బ !

08 Sunday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald Trump defeat, Joe Biden, Narendra Modi, US Election 2020


ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలక్ట్రరల్‌ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు 306 ఓట్లు వస్తాయని మీడియా విశ్లేషణలు తెలిపాయి. ఈ కారణంగానే మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు అభినందనలు పంపుతున్నారు.అమెరికా నగరాలలో డెమోక్రాట్ల విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమెరికా మిత్ర రాజ్యాలు లేదా అది శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలూ బిడెన్‌ ఏలుబడిలో సంబంధాలు, సమస్యలూ ఎలా ఉంటాయా అన్న మధనంలో పడ్డాయి.ప్రపంచీకరణ, అందునా ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతి పరిణామ పర్యవసానాలూ ప్రపంచం మీద ఉంటాయి కనుక ఇది సహజం.
అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి ఓడిపోయిన వారిలో 11వ వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర పుటలకు ఎక్కాడు. ఈ ఎన్నికల గురించి ప్రపంచంలో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది ఎవరికయ్యా అంటే అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ (ఈసారి ట్రంప్‌ సర్కార్‌ ) అని నినాదమిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, దాని మీద ఎలాంటి అభ్యంతరమూ తెలపని సంఘపరివార్‌ లేదా బిజెపికి అన్నది స్పష్టం. గతంలో మన పాలకులు ఎవరూ మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ దేశం ఎలా జోక్యం చేసుకున్నప్పటికీ అదంతా లోగుట్టు వ్యవహారం. బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక పక్షానికి మద్దతు పలికింది నరేంద్రమోడీ మాత్రమే. అందువలన ఇబ్బంది పడేది కూడా మోడీ అండ్‌ కో మాత్రమే. ట్రంప్‌ మీద జోకులేసే వారు మోడీని కూడా కలిపి ఆడుకున్నా చేయగలిగిందేమీ లేదు.
అనేక సార్లు బిజెపి ఐటి విభాగం అభాసుపాలైంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. 2014 సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపిన సందర్భంగా ఇచ్చిన విందులో నాడు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ – మోడీ కలుసుకున్న ఫొటోను ఇప్పుడు విడుదల చేసి బైడెన్‌తో మోడీకి ఎంత సాన్నిహిత్యం ఉందో చూడండి అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు నిరాకరించింది కూడా అదే బిడెన్‌, అదే పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా అన్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రధాని అవగానే బరాక్‌ ఒబామా స్వాగతం పలికారు. దానికి చూశారా మా మోడీ తడాఖా అని బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఎగిరెగిరి పడ్డారు. అక్కడ ఆహ్వానం నరేంద్రమోడీకి కాదు, భారత ప్రధానికి అన్నది అసలు వాస్తవం. ఇప్పుడు ప్రత్యేక పరిస్దితి తలెత్తింది. గుజరాత్‌లో జరిపిన మారణకాండలో మోడీ మీద వచ్చిన విమర్శల కారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒబామా సర్కార్‌ అనుమతి ఇవ్వలేదు. తరువాత పరిస్ధితి మారింది కనుక ఒక దేశాధినేతగా ఆహ్వానం పలికారు. తాజా ఎన్నికలలో బైడెన్‌కు వ్యతిరేకంగా,ట్రంప్‌కు మద్దతుగా ప్రధాని హౌదాలో అమెరికా వెళ్లి మరీ ప్రచారం చేయటాన్ని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన తీరులో మోడీ ప్రవర్తన చౌకబారుగా ఉందా, రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకం, ప్రమాదకరమైన పోకడ. బిజెపి ఐటి విభాగపు నేత అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌ చేస్తూ వామపక్ష శక్తులు ఆశాభంగం చెందుతారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైతే ఆయన ఏది చెబితే అది వినాల్సి రావటం మోడీకి పెద్ద దెబ్బ అవుతుందనే భ్రమల్లో దుష్ట వామపక్ష శక్తులు ఉన్నాయి, వారు చివరికి ఆశాభంగం చెందుతారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బైడెన్‌ అయినా మరొకరు అయినా చక్రం తిప్పేది అమెరికా అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పరిస్ధితిలో మోడీ లేదా మరొక దేశనేత కాదు.
మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. అదే బైడన్‌ కూడా అనుసరిస్తే, ఆలోచన లేకుండా మనం భుజం అప్పగిస్తే ఉపయోగించుకుంటారు. చైనా మార్కెట్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని, ప్రపంచంలో ఎక్కడా చైనా పోటీకి రాకూడదని అమెరికా కోరుకుంటోంది.అందుకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటున్నది. గతంలో మన మార్కెట్‌ కోసం మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ను ఎగదోసి మన మీద వత్తిడి తెచ్చింది. మన పాలకులు లొంగిపోవటంతో ఇప్పుడు పాక్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ లోగా చైనా ఆర్ధికంగా ఎదుగుతుండటంతో దానికి వ్యతిరేకంగా మనలను ప్రయోగించేందుకు చూస్తున్నది. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తారు. అందువలన తమ అవసరం కోసం బిడెన్‌ కూడా మోడీని మరింతగా కౌగలించుకోవచ్చు, ట్రంప్‌ ఇచ్చిన దేశపిత మాదిరి మరొక అపహాస్యపు బిరుదును ఇవ్వవచ్చు. దాన్ని గమనించకుండా మన అవసరం అమెరికాకు ఉంది, ఇదే మన గొప్ప అని మన భుజాలు మనం చరుచుకుంటే నగుబాట్లు పాలుకావటం తప్ప మరొకటి ఉండదు. ట్రంప్‌కు మద్దతు ప్రకటించినపుడు చూపిన హావభావాలనే రేపు బిడెన్‌తో కౌగిలింతలలో కూడా నరేంద్రమోడీ ఎలా ప్రదర్శిస్తారు ? అప్పుడు అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ నినాదం గుర్తుకు రాదా? వారు మానవ మాత్రులు కాదా?
ఈసారి ట్రంప్‌ ప్రభుత్వం అని చెప్పారు తప్ప ట్రంప్‌కు ఓటు వేయమని కోరలేదుగా అని బిజెపి నేతలు వాదించవచ్చు. హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ కార్యక్రమం తరువాత ట్రంప్‌ చేసిన ట్వీట్‌లు ఏమిటి ? అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్రమోడీ సమ్మతి పొందారు.హూస్టన్‌లో 50వేల మందికి పైగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు, ట్రంప్‌తో చేతులు కలిపి నడిచారు అని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి మెకెనీ ట్వీట్‌ చేశారు. తెలివిగా మద్దతు ప్రకటించామని మోడీ మద్దతుదారులు సంతోష పడ్డారు. ట్రంప్‌కు తన సమ్మతి ఉందని భారత అమెరికన్లకు చెప్పిన భారత ప్రధాని అన్న అర్ధం వచ్చే శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. దానికి ఇద్దరూ కౌగలించుకున్న ఫొటోను సాక్ష్యంగా ప్రచురించింది. హూస్టన్‌లో ఇచ్చిన నినాదం మీద విమర్శలు తలెత్తటంతో అహమ్మదాబాద్‌లో మోడీ నోటి వెంట అబ్‌కీ బార్‌ అనే నినాదం వెలువడలేదు గాని అంతకంటే ఎక్కువ పొగడ్తలతో నింపివేశారు.భారతలో ట్రంప్‌ ఎన్నికల సభమాదిరిగా నిర్వహించారు.ఈ సభ వీడియోలను కూడా ట్రంప్‌ అమెరికన్‌-భారతీయులలో ప్రచారానికి వినియోగించుకున్నారు. అన్నింటికీ మించి హూస్టన్‌ సభకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరుకావటాన్ని చూసి ఇంకేముంది అమెరికన్‌-భారతీయుల మీద కూడా మోడీ ప్రభావం ఎలా పడిందో చూడండి అంటూ ఊదరగొట్టారు.
రెండు శిబిరాలుగా చీలిన అమెరికాలో ఒక శాతం ఓట్లు కూడా ఫలితాలను తారు మారు చేస్తాయి. అందువలన తన ఓటమిని ముందుగానే ఊహించిన ట్రంప్‌ భారతీయ ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ పలుకుబడిని ఉపయోగించుకోవాలని చూశాడు కనుకనే పై వ్యవహారాలన్నీ నడిచాయి. ట్రంప్‌ ఎత్తుగడలకు ప్రతిగా భారత-ఆఫ్రికా వారసత్వం కలిగిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష స్ధానానికి నిలిపి డెమోక్రాట్లు దెబ్బతీశారు.ఎన్నికలకు కొద్ది వారాల ముందు జరిపిన ఒక సర్వేలో 72శాతం మంది భారత సంతతి డెమోక్రాట్లకు, 22శాతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని తేలింది. ఎన్నికలు జరిగిన తరువాత వెల్లడైన వార్తలను చూస్తే తటస్ధంగా ఉన్న ఓటర్లు కూడా డెమోక్రాట్ల వైపే మొగ్గినట్లు కనిపిస్తోంది. అమెరికన్‌ భారతీయలలో నరేంద్రమోడీ తన పలుకుబడిని ఎక్కువగా ఊహించుకున్నారన్నది స్పష్టం. అందుకే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మెజారిటీ భారతీయులు ట్రంప్‌కు ఓటు వేయలేదు, మొత్తంగా పరాజయం, అంటే నరేంద్రమోడీకి రెండు దెబ్బలు అని చెప్పవచ్చు.
కాశ్మీరు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి సమస్యల మీద డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీలు మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కాశ్మీరీలు ఒంటరిగా లేరు,మేమందరం చూస్తున్నాము, అవసరం అయితే జోక్యం చేసుకోవాలి అని తాజాగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారిస్‌ గతంలో చెప్పారు.డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ ప్రమీలా జయపాల్‌ గతంలో నరేంద్రమోడీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గతేడాది డిసెంబరుల్లో ఆమె సభ్యురాలిగా ఉన్న పార్లమెంటరీ బృందం భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమెను మినహాయించాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ కోరగా అమెరికా నిరాకరించింది. దాంతో ఆ బృందంతో జరగాల్సిన సమావేశాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి ఆమె పెద్ద మెజారిటీతో గెలిచారు. అలాంటి ఎంపీలు నరేంద్రమోడీ సర్కార్‌ గురించి ఇప్పుడు మౌనంగా ఉంటారా ? అదే ట్రంప్‌ విషయానికి వస్తే అహమ్మదాబాద్‌ పర్యటన సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిఎఎ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం జరుపుతానన్నాడు. నరేంద్రమోడీ విధానాలకు మద్దతు పలికాడు. మన దేశాన్ని బెదిరించటం, కంపు దేశమని నోరు పారవేసుకోవటం గురించి మోడీ మౌనం దాల్చినా దేశ ప్రజలు తీవ్రంగానే స్పందించటాన్ని చూశాము.
బైడెన్‌ గెలుపు మన దేశానికి లాభమా నష్టమా అన్న చర్చ ప్రారంభమైంది. ఒకటి స్పష్టం అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమెరికన్‌ కార్పొరేట్ల ప్రయోజనాలే వారికి ముఖ్యం. మీ ఇంటికొస్తే మాకేం పెడతారు, మా యింటి కొస్తే మాకేం తెస్తారు అన్నట్లుగా ఉంటుంది. డెమోక్రాట్లు అందరికీ ఆరోగ్యం అనే ఎన్నికల వాగ్దానం చేశారు. దాన్ని ఆచరణలో పెడితే మన ఔషధ పరిశ్రమకు మరింత ఉపయోగం అని కొందరు లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా హెచ్‌1బి వీసాలు మరిన్ని ఇవ్వొచ్చని కొందరు ఆశపడుతున్నారు. అమెరికా కార్పొరేట్‌ సంస్ధలకు చౌకగా పని చేసే వారు కావాలి. ఎన్నికల్లో ఓట్ల కోసం ట్రంప్‌ స్ధానిక యువతను ఆకట్టుకొనేందుకు విదేశీయులకు వీసాలు బంద్‌ అన్నట్లు హడావుడి చేశారు. నిజంగా అలాంటి ఆంక్షలను అమలు జరిపితే అక్కడి కార్పొరేట్లు సహించవు.
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ రెండు సంవత్సరాలు దాటినా సాధించిందేమీ లేదు. ఒక వేళ బైడెన్‌ దాన్ని కొనసాగించినా ఒరిగేదేమీ లేదు. ట్రంప్‌ ప్రచారం చేసినట్లు బైడెన్‌ కమ్యూనిస్టు కాదు, పక్కా కార్పొరేట్ల ప్రతినిధి. బరాక్‌ ఒబామా హయాంలో కూడా అమెరికా యుద్దాలు చేసిన విషయం మరచి పోకూడదు. అందువలన ట్రంప్‌ మాదిరి దురహంకారం, నోటి దురుసుతనం ఉండకపోవచ్చు తప్ప అమెరికా మౌలిక విధానాల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. చైనాతో వైరం కంటే రాజీయే లాభం అనుకుంటే దూకుడు తగ్గించి, కొంత ఆలస్యం చేయవచ్చు తప్ప అమెరికా పెత్తందారీ వైఖరిలో మౌలిక మార్పు ఉండే అవకాశాలు లేవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత నావను నరేంద్ర మోడీ ఎటు నడిపిస్తున్నారు ? ఏమి కానుంది ?

02 Monday Nov 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Narendra Modi, Quadrilateral Security Dialogue, R&D China and India


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ అత్యధికంగా అమెరికాను ఆరుసార్లు సందర్శిస్తే ఫ్రాన్స్‌,రష్యా, చైనా ఐదుసార్లు వెళ్లారు. చైనా అధినేత గ్జీ జింపింగ్‌ను పద్దెనిమిది సార్లు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే చైనా తన ప్రధమ శత్రువు అన్నట్లుగా ఇంటా బయటా కనిపించేందుకు తాపత్రయ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తా వ్యాఖ్యలను చూస్తే దేశాన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజకీయంగా భవిష్యత్‌ ఏమిటన్నది మోడీ, బిజెపికి సంబంధించిన అంశాలు. కానీ వాటితో యావత్‌ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టటమే ఆందోళన కలిగించే అంశం. కొందరికి మోడీ, బిజెపి చర్యల్లో ఆకాశమంత దేశభక్తి, వాటిని విమర్శించే వారిలో పాతాళమంత దేశద్రోహం కనిపించవచ్చు. సామాజిక మాధ్యమంలో కాషాయ తాలిబాన్లు, వారి ప్రచారానికి ప్రభావితులైన వారిలో యుద్దోన్మాదం కనిపిస్తోంది. చలి కాలం వచ్చింది గానీ లేకపోతేనా…. అన్నట్లు కబుర్లు చెబుతారు. చైనా, పాకిస్ధాన్‌ మీద ఒకేసారి పోరాడి విజయం సాధించగల సత్తాను నరేంద్రమోడీ దేశానికి సమకూర్చారన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో భావోద్వేగాలకు గురికాకుండా కొన్ని అంశాలను పరిశీలించుదాం.


సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కౌటిల్యుడు లేదా చాణక్యుడు చెప్పాడంటూ కొన్ని అంశాలను చెబుతుంటారు. సన్‌ జు చైనా కౌటిల్యుడిగా పరిగణిస్తారు. ఎవరితో, ఎలా , ఎప్పుడు యుద్దం చేయాలి అన్న ప్రశ్నకు – ఇరు పక్షాలూ సమంగా ఉంటే మనం యుద్దానికి సై అనవచ్చు. మన సంఖ్య తక్కువగా ఉంటే శత్రువుకు దూరంగా ఉండాలి, ఏ విధంగా చూసినా తక్కువే అయితే మనం అతన్నుంచి దూరంగా పోవాలి. శత్రువు గురించి తెలిస్తే నీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, ఒక వంద యుద్దాల ఫలితాల గురించి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీ గురించి నీకు తెలిసినా శత్రువు గురించి తెలియకపోతే నువ్వు సాధించిన ప్రతి విజయం వెనుక ఒక పరాజయం వస్తుంది. నీ గురించి నీకు , శత్రువు గురించి తెలియకపోయినా ప్రతి పోరులోనూ ఓటమే. పోరు సలపకుండానే శత్రువును అదుపులోకి తీసుకోవటం ఉన్నతమైన యుద్ద కళ.నువ్వు అన్ని యుద్దాలలోనూ పోరాడటం, గెలవటం కాదు, ఎలాంటి పోరు లేకుండానే శత్రువు ప్రతిఘటనను దెబ్బతీయటం ఉన్నత మేథాశక్తికి నిదర్శనం.- అన్నది సన్‌ జు నీతి సారాంశం.

కౌటిల్యుడు చెప్పిందేమంటే -శత్రువు బలవంతుడు అయితే అతని సలహాలను అనుసరించవచ్చు, అతను బలహీనుడు అయితే దెబ్బతీయాలి.ఒక వేళ సమానుడు అయితే బలంతో లేదా స్నేహంతో అతన్ని అదుపులో ఉంచాలి. దాడి చేసే వారు తన, శత్రువు బలం,బలహీనతలు, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి, ముందుకు సాగబోయే ముందు నిర్దారించుకోవాలి. తరువాత పూర్తి స్ధాయిలో ముందుకు పోవాలి, లేనట్లయితే మౌనంగా ఉండాలి. ద్వేషం తర్కబద్దమైన ఆలోచననను అంతం చేస్తుంది,కనుక శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతన్ని ప్రేమించేందుకు ప్రయత్నించు. సంధించిన బాణం ఎదుటి వ్యక్తిని సంహరించవచ్చు, లేకపోవచ్చు. తెలివిగల వాడి తంత్రం గర్భంలో ఉన్నవారిని కూడా అంతం చేస్తుంది. నేనయితే సాయుధ పోరును సూచించను, లక్ష్య సాధనకు కుట్ర, తంత్రం, మోసం వంటి సైనికేతర చర్యలన్నింటినీ ప్రయోగించవచ్చు. చైనా ఏం చేస్తోందన్నది ముఖ్యం కాదు, మనం కౌటిల్యుడు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామా ?


చైనా పెట్టుబడులు, అమెరికా మిలిటరీ ఆయుధ సంపత్తి, ప్రాంతీయ శక్తి – మూడింటిని కలిగి ఉండటం మోడీకి సాధ్యమేనా అనే శీర్షికతో యూరేసియా టైమ్స్‌ పత్రిక ఒక విశ్లేషణను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. సరిహద్దులలో చైనాతో ఘర్షణలను ప్రపంచమంతా ఆసక్తితో చూస్తోంది. భారత్‌ గనుక వెనుకా ముందాడుతుంటే చైనా విస్తరణ చర్యల అజెండాను నిలిపివేసేందుకు జరిపే ప్రయత్నాలకు హాని మరియు నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవాలని అమెరికా నేతలు భారత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాతో భారత్‌ వాణిజ్యం కొనసాగుతూనే ఉంది. ఎగుమతులు- దిగుమతులపై లడఖ్‌ వివాదం పరిమితంగా లేదా అసలేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఆ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రసాయనాలు, ఎలక్ట్రికల్‌ మరియు వైద్య పరికరాల దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. మోడీ సర్కార్‌ అనేక చైనా యాప్‌లను నిషేధించినప్పటికీ అవి కేవలం పరువు కాపాడుకొనే చర్యలు మాత్రమే. అనేక రంగాలలో బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. వేలాది అంకుర సంస్ధలు చైనా పెట్టుబడులతో విజయాలు సాధిస్తున్నాయి. సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ ఆయుధాలు తప్ప దాదాపు అన్నింటికీ చైనా మీద ఆధారపడుతున్నది.
నరేంద్రమోడీ చైనా విధానాన్ని చూస్తే ఒక మార్గంలో పయనిస్తున్నట్లు కనిపించటం లేదు, తరువాతేమి చేస్తారో అంచనాకు అందటం లేదు. ఇది నరేంద్రమోడీకి ఒక విచిత్రమైన పరిస్ధితిని తీసుకు వచ్చింది. చైనాతో సంబంధాలను పూర్తిగా బహిష్కరించలేరు లేదా యుద్ధాన్ని ఎంచుకోలేరు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించేందుకు చైనా కరాఖండిగా తిరస్కరించటం భారత ప్రభుత్వానికి విషయాలను కష్టతరంగా మార్చింది. ఈ వివాదాన్ని తొలుత భారతే ప్రారంభించిందని, ఆర్టికల్‌ 370 , కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమే రెండు దేశాల మధ్య వివాదాంశంగా కనిపిస్తున్నది. చైనాతో ఘర్షణ పడటం లేదా సంబంధాలను మెరుగుపరచుకోవటమా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాలి. ఇటు చూస్తే గొయ్యి అటు చూస్తే నుయ్యి అన్నట్లుగా ప్రభుత్వం మధ్యలో ఇరుక్కుపోయింది. చైనా డిమాండ్లకు అంగీకరించితే అంతర్గతంగా పరువు పోతుంది. ఒప్పుకోకపోతే వివాదం మరింత దిగజారే ముప్పు ఉంది. అమెరికా కూటమితో మరింతగా దగ్గరయ్యే క్రీడను నరేంద్రమోడీ ఆడుతున్నందున భారత్‌కు విషయాలు మరింత సంక్లిష్టం కావటం తప్ప మరొకటి జరగదు. ఈ విపత్కర పరిస్ధితి నుంచి మోడీ భారత్‌ను ముందుకు నడిపించగలరా ?


అదే యూరేసియా టైమ్స్‌ మరో విశ్లేషణలో మూడు సంవత్సరాల క్రితం డోక్లాంలో అత్యంత శక్తివంతమైన చైనాకు భారత్‌ చిల్లు పెట్టింది లేదా గాలి తీసింది అన్నది ఒక అవాస్తవం అని అమెరికా గూఢచార నివేదిక నిర్ధారించింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని డోక్లాం ప్రాంతంలో 2017లో రెండు దేశాల సేనలు 75 రోజుల పాటు ముఖాముఖీ తలపడిన విషయం తెలిసిందే. దుందుడుగా వ్యవహరించిన చైనా మిలిటరీకి షాక్‌ తగిలే విధంగా భారత్‌ వ్యవహరించిందని విశ్లేషకులు అప్పుడు పేర్కొన్నారు. అయితే డోక్లాం ఉదంతంలో గట్టి పాఠం నేర్చుకున్న చైనా ఆ ప్రాంతంతో పాటు వాస్తవాధీన రేఖ సమీపంలో అదనపు మిలిటరీ నిర్మాణాలను చేపట్టిందని భూ రాజకీయ గూఢచార వ్యవహారాల మీద అధ్యయనం చేసే అమెరికా సంస్ధ స్ట్రాట్‌ఫర్‌ వెబ్‌ సైట్‌ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. గత మూడు సంవత్సరాలలో భారత సరిహద్దులో చైనా తన వైమానిక స్ధావరాలు, వైమానిక రక్షణ కేంద్రాలు, హెలిపోర్టులను రెట్టింపు చేసింది. కొత్తగా పదమూడు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా మూడు వైమానిక స్ధావరాలు, ఐదుశాశ్వత వైమానిక రక్షణ కేంద్రాలు, ఐదు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభించింది. లడఖ్‌ ఘర్షణ ప్రారంభమైన తరువాతే నాలుగు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు అంతరిక్ష చిత్రాలు, ఇతర సమాచారం తెలుపుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో చైనా శాశ్వత మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా తన స్దానాన్ని పటిష్ట పరచుకుంది. ఇదే వ్యూహాన్ని భారత సరిహద్దులో కూడా అనుసరిస్తున్నదని విశ్లేషకుడు పేర్కొన్నారు.


చైనా, ఇతర ఇరుగు పొరుగుదేశాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు, ఇతర అవసరాల కోసం అమెరికాతో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకున్నది. అదేమీ ఉచితం కాదు. ఆ రంగంలో మనం ఉంటే అమెరికాతో ఒప్పందంతోనే పని లేదు, కనుక మూల్య రూపం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో చైనా అలాంటి సమాచారాన్ని సేకరించేందుకు మూడు స్వంత మిలిటరీ యావోగాన్‌ ఉపగ్రహాలను ప్రారంభించింది. యావోగాన్‌ పేరుతో ఉపగ్రహాల ప్రయోగం 2006 నుంచి జరుగుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాల కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నౌకల నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల వ్యవస్ధలను దెబ్బతీసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని చైనా సమకూర్చుకుంటోంది. సముద్రాలలో ఉన్న యుద్ద నౌకలు విడుదల చేసే రేడియో, ఎలక్ట్రానిక్‌ సంకేతాల(సిగల్స్‌)ను పసిగట్టటంతో పాటు అవి వెలువడుతున్న ప్రాంతాలను స్కాన్‌ చేసి యుద్ద నావల సంచారాన్ని పసిగడతాయి. ఈ ఉపగ్రహాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి శత్రు యుద్ద నావల మీద క్షిపణులతో ఏ లక్ష్యంపై అయినా కేవలం 40 నిమిషాల్లో దాడి చేయవచ్చని చైనా నిపుణులు చెబుతున్నారు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ఒక వేళ అమెరికా అందచేసిన ఆయుధాలతో కవ్వింపులు, దాడులకు తెగబడితే దానికి మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో సంచరించే అమెరికా యుద్ద నౌకలను ముందుగా అడ్డుకోవాలన్నది చైనా ఎత్తుగడ. గత ఏడాది అక్టోబరు నాటికి అంతరిక్షంలో యావోగాన్‌-30 రకం ఉపగ్రహాలు పదిహేను ఉన్నాయి. తాజాగా ప్రయోగించినవి దాదాపు ప్రపంచమంతటినీ చుట్టి సమాచారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి సమాచారాన్ని తాము భారత్‌కు అందచేస్తామని అమెరికా చెబుతోంది. ఇటీవల దానితో సంతకాలు చేసిన బెకా ఒప్పంద సారం అదే.


గాల్వాన్‌ లోయ ఉదంతం తరువాత తూర్పు సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో టిబెట్‌లోని చామడో బంగడా విమానాశ్రయాన్ని చైనా విస్తరిస్తున్నట్లు ఉపగ్రహచిత్రాలు చూపుతున్నాయి. ఈ చిత్రాలను పొరుగు సేవల పద్దతిలో సొమ్ము చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి కాలంలో మన మీడియాలో వస్తున్నవి అవే. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న బంగడా విమానాశ్రయంలో రెండు రన్‌వేలు ఉన్నాయి. ఒకదానిలో రాకపోకలు నడుస్తున్నాయి, విదేశీ పౌరులకు వాటిలో ప్రవేశం లేదు. రన్‌వేకు ఒక వైపు మిలిటరీ తరహా నిర్మాణాలు ఉన్నట్లు , గాల్వాన్‌ ఉదంతం తరువాతే ఇవి ఏర్పాటయినట్లు మీడియా విశ్లేషకులు రాస్తున్నారు. అరుణాచల్‌ సరిహద్దులో కనీసం నాలుగు చోట్ల ఆగస్టు-సెప్టెంబరు నుంచి చైనా మిలిటరీ మోహరింపు కనిపిస్తున్నదని చైనా నిపుణుడు కలపిట్‌ ఏ మనికికార్‌ చెప్పారు. సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చైనా మిలిటరీ ఉందని, భారత్‌ మీద వత్తిడిని పెంచే ఎత్తుగడ కావచ్చని అన్నారు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతున్నది. 1962 యుద్దంలో ఆ ఏడాది అక్టోబరు 20న చైనా మిలిటరీ అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది, వాటిలో తవాంగ్‌ పట్టణం ఉంది, అసోంలోని తేజ్‌పూర్‌ పట్టణం వరకు చైనా సేనలు వచ్చాయి. అయితే నవంబరు 20 తరువాత చైనా తనంతట తానే వెనక్కు తగ్గి వాస్తవాధీన రేఖ వెనక్కు వెళ్లిపోయింది. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గుర్తించటం లేదు. ఈ కారణంగానే దలైలామా తవాంగ్‌ పట్టణాన్ని సందర్శించేందుకు నిర్ణయించుకున్నపుడు అభ్యంతరం తెలిపింది.

ప్రతి దేశం చిన్నదా పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడున్న స్ధితిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. దానికి మన దేశం మినహాయింపు కాదు. దానికి హడావుడి, రాజకీయ ప్రచారం చేసి ఇతర దేశాలను రెచ్చగొట్టాల్సిన, మనలను అనుమానించే స్ధితిని కల్పించాలని కౌటిల్యుడు చెప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దంలో అవసరం లేకపోయినా జపాన్‌పై అణుబాంబులు వేశారు. అమెరికన్లు ప్రపంచాన్ని భయపెట్టి లొంగదీసుకొనేందుకు అమలు జరిపిన యుద్ద తంత్రం తప్ప మరొకటి కాదు. తరువాత మనతో సహా అనేక దేశాలు అణ్వాయుధాలను తయారు చేశాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం అణుబాంబుతయారీకి దగ్గరలో ఉన్నట్లే లెక్క.


చాణుక్యుడు, సన్‌ జు చెప్పినట్లు ఎన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి ? నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు అన్న నీతి తెలిసిందే. ఆ మేరకే చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇతర దేశాలతో మనం చేతులు కలుపుతున్నట్లు సమర్ధించుకోవచ్చు. దానిద్వారా వచ్చే లాభాలతో పాటు నష్టాలు, సమస్యలను కూడా బేరీజు వేసుకోవాలి. చాణుక్యుడు చెప్పింది అదే. కాశ్మీర్‌ను ఆక్రమించిన కారణంగా పాకిస్ధాన్‌ మనకు శత్రువుగా మారింది. అలీన విధానం అనుసరిస్తూ అంతర్జాతీయ పరిణామాల్లో అనేక విషయాల్లో మనం అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నాం. దానికి ప్రతిగా పాకిస్ధాన్‌న్ను ప్రోత్సహించి మన దేశం మీద అమెరికా ఎన్నికుట్రలు చేసిందీ, కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎంత నష్టపరచిందీ చూశాము. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అయ్యామో, విస్తారమైన మన మార్కెట్‌ను ఎప్పుడు తెరిచామో, దాని ఆయుధాలను -ఇటీవలి కాలంలో చమురును సైతం – కొనటం ఎప్పుడైతే ప్రారంభించామో దానికి పాక్‌తో పని లేదు. కానీ జరిగిందేమిటి ? తమను ఉపయోగించుకొని వదలివేసిందన్న దుగ్ద పాక్‌లో తలెత్తి చైనాకు దగ్గర అయింది.

శత్రువులను పెంచుకున్న వారు తెలివైన రాజనీతిజ్ఞులు కాదు. అమెరికా అండ చూసుకొని మన యుద్ద ప్రేలాపనలు ఎంతవరకు పోయాయంటే ఒకేసారి రెండున్నర యుద్దాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సైనికాధికారి బిపిన్‌ రావత్‌ లడఖ్‌ ఉదంతాలకు ఎంతో ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యమే బస్తీమే నిరంతరం ఎక్కడో ఒక చోట యుద్దం చేసింది తప్ప ఒకేసారి అనేక యుద్దాలు చేయలేదు.రెండున్నర యుద్దాలు అంటే చైనా, పాకిస్ధాన్‌, ఉగ్రవాదుల మీద అని అర్ధం.ఉగ్రవాదాన్ని అణచేందుకే కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని, మిలిటరీకి అధికారాలు ఇచ్చామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏడాది కాలంలో ఉగ్రదాడుల్లో 54 మంది పౌరులు మరణించగా కేంద్రపాలనలోకి వచ్చిన ఏడాది కాలంలో 45 మంది మరణించారు. దీన్ని బట్టి ఏం జరుగుతోందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.


రామ-రావణ యుద్దంలో లంకకు వారధి నిర్మాణంలో ఉడుత సాయం కథ తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మన ఇరుగుపొరుగున ఉన్న దేశాలో నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఒక్కటీ మనకు స్నేహంగా లేదు. అమెరికా అండ చూసుకొని ఈ దేశాలను విస్మరించాము. తద్వారా వాటిని చైనాకు దగ్గర చేయటం రాజనీతా, తెలివిగల వ్యవహారమా ? పశ్చిమాసియాలో సైనికంగా బలమైన దేశాల్లో ఇరాన్‌ ఒకటి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది చైనా వైపు మొగ్గింది. దాంతో అమెరికా ఆంక్షలను మరింత పెంచి మనలను కూడా బెదిరించగానే దాన్నుంచి చమురు కొనటం ఆపేశాము. దాంతో వారు చైనాకు మరింత దగ్గరయ్యారు, అసలేమి చేస్తున్నామో, పర్యవసానాలేమిటో అర్ధం అవుతోందా ? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఇరాన్‌, పాకిస్ధాన్‌, శ్రీలంక, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ఏవీ మనకు మిత్రదేశాలుగా లేవు.

మనం ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ యుద్ద విమానాలు తెచ్చుకున్నాం. అవి అధిక ధరలకా, దానిలో ముడుపులున్నాయా లేదా అన్నది- ఉంటే ఏదో ఒక రోజు బయటపడకపోదు- కాసేపు పక్కన పెడదాం. మరోవైపు వాటితో సమంగా లేదా కాస్త ఆధునికమైన విమానాలను స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో చైనా ఉంది. మనం ఆ రంగంలో ఎంతో వెనుకబడి ఉన్నాం కనుకనే మనకు విమానాలు అమ్మే దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా మనలను ఎగదోస్తున్నాయి. భారత్‌ గనుక తాను తయారు చేస్తున్న 114 ఎఫ్‌ 21 రకం విమానాలను కొనేందుకు అంగీకరిస్తే ఇతర దేశాలకు వాటిని విక్రయించబోనని అమెరికా లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చెప్పింది. ఎంతకాలం ఇలా విదేశాల మీద ఆధారపడి ఆయుధాలు కొనగలం? ఇక్కడ సమస్య మనం విమానాలను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అన్నది. పరిశోధన-అభివృద్దికి నిధులు కేటాయిస్తే ఏదీ అసాధ్యం కాదు. మనకేమీ నిపుణులు తక్కువ లేరు. యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో తాను సరి చేశానని నరేంద్రమోడీ దళం చెప్పుకుంటుంది. మరి పరిశోధనా-అభివృద్ధి రంగంలో చేసిందేమిటి ?


యునెస్కో సమాచారం ప్రకారం 1996-2018 మధ్య మన దేశంలో పరిశోధన-అభివృద్ధికి చేసిన ఖర్చు జిడిపిలో 0.639 – 0.65 శాతం మధ్య ఉంది. మధ్యలో 2008లో 0.859 శాతానికి పెరిగి క్రమంగా దిగజారింది. దీనికి కారణం నరేంద్రమోడీ తప్ప నెహ్రూ కాదు కదా ! ఇదే కాలంలో చైనా కేటాయింపు 0.563 శాతం నుంచి 2.186శాతానికి పెరిగింది. 2017-18 ఆర్ధిక సర్వేలో పరిశోధన రంగానికి నిధులు రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. ఆ జాడలు ఎక్కడా లేవు. ప్రపంచంలో పరిశోధన-అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న దేశాలలో అమెరికా తరువాత చైనా ఉంది. 2020 నాటికి తన జిడిపిలో రెండున్నర శాతం ఖర్చు చేయాలన్న లక్ష్యానికి 2.23శాతంతో చైనా దగ్గరలో ఉంది. అమెరికా 2018లో 2.83శాతం ఖర్చుచేసింది. ఓయిసిడి దేశాల సగటు ఖర్చు 2.38, ఇజ్రాయెల్‌ 4.9, దక్షిణ కొరియా 4.5శాతం ఖర్చు చేశాయి.
చైనా గత రెండు ద శాబ్దాలుగా ఖర్చు చేసిన ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నది. అన్ని రంగాలలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో ధీటుగా ఉంది. గతంలో ఆయుధాలను దిగుమతి చేసుకొనేదిగా ఉన్న దేశం నేడు తొలిసారి ఎగుమతులను ప్రారంభించింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది. 2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు.


పరిశోధన-అభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చదివే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. అదేపని మనం ఎందుకు చేయటం లేదు ?


చైనా విజయాల గురించి నమ్మని వారిని ఏమీ చేయలేం. సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు, ఎంతో డబ్బు మిగులుతుంది, ప్రయోజనం కలుగుతుంది కదా ? గోమూత్రం తాగే వారిని తాగనిద్దాం-దేశానికి నష్టం లేదు. గోమూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పే వారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకూడదు ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వొద్దు. దేశాన్ని, సమాజాన్ని మరింతగా వెనక్కు నెట్టే యుద్దం అసలే వద్దు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేవుడి మీద ఒట్టు – నిజంగానే యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోంది !

12 Saturday Sep 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్‌ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్దానంతో 66లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాధమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్రమోడీ గారి విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం.


జనవరిలోనే వైరస్‌ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్‌ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ పెద్దమనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్రమోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్‌ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తనఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు నరేంద్రమోడీ. అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు, అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. అధికారులదేముంది ! రాజుగారికి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోశ్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా ? అదేమీ లేదు.


అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి ? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి ? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారికి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారని తెలిసింది.


పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్‌ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్‌ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే.జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్ధానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి ? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా !
వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య జిడిపి వృద్ది రేటు 24శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది. కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిదినెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి(2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌, 10.5శాతమని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధలు జోశ్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు(ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వతంత్ర భారత చరిత్రలో 1958లో 1.2శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ సంస్ద 5.3శాతంగా పేర్కొన్న లోటును 11.8శాతానికి పెంచింది.ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్‌ నాటికి ఆర్ధిక వ్యవస్ద పురోగమించవచ్చని కూడా ఈ సంస్దలు జోశ్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్‌ సంస్ధ చెప్పింది.
వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్‌ పేర్కొన్నది. జి20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్టంగా ఉందని మూడీస్‌ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపిలోటులోనే ఉంటుందని అంచనా వేసింది.ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సమాచార శాఖ అధికారి గెరీ రైస్‌ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది.


కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గినకారణంగా అదిశాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21లక్షల కోట్ల రూపాయల పధకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.
ఏప్రిల్‌ జూలై మాసాల్లో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 9.4లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆ వ్యవధిలో 10.5లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే తక్కువ.2020-21 బడ్జెట్‌లో అంతకు ముందు సంవత్సరం కంటే మొత్తంగా 12.7శాతం అదనపు ఖర్చు ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు పెరిగింది 11.3శాతం మాత్రమే. కరోనా బాధితులను ఆదుకొనేందుకు మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకొనే చర్యలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు ? బడ్జెట్‌లో కొన్నింటికి తగ్గించి మరికొన్నింటికీ ఖర్చు చేస్తున్నారను కోవాలి. ఇది కూడా రెవెన్యూ ఖర్చు తప్ప దాని మీద వచ్చే రాబడి నామమాత్రం. దాని వలన ఆస్తుల కల్పన జరగదు, ఉపాధి పరిమితం తప్ప పెరగదు. మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే వాటిని వినియోగించుకొనేందుకు ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా కొంత ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అది చాలా పరిమితంగానే చేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్ధ దిగజారటానికి లేదా పక్షవాత రోగి మాదిరి తయారు కావటానికి దారితీస్తుంది.


సిఎంఐయి సంస్ధ సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు 1.5లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చేసిన ఖర్చు రూ.19,200 కోట్లు మాత్రమే. 2018-19 మరియు 2019-20సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు సగటున మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం లేదా ప్రయివేటు రంగం కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అంత మొత్తం ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు ప్రారంభం అయింది. ఇప్పుడు జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో ప్రకటించిన నూతన ప్రాజెక్టుల విలువ ఐదోవంతు కేవలం రూ.70,600 కోట్లు మాత్రమే. గతంలో ప్రకటించిన పధకాల పూర్తి కూడా చాలా తక్కువగా ఉంది. ప్రయివేటు వినియోగం 2014 సెప్టెంబరు తరువాత కనిష్టంగా నమోదైంది.
కేంద్రం, రాష్ట్రాలు కరోనా ఉద్దీపనల పేరుతో చేసిన ఖర్చు ఏప్రిల్‌-జూన్‌ మధ్య 16శాతం పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించటానికి లేదా ప్రయివేటు వినిమయం పెరగటానికి గానీ తోడ్పడదని ఆర్ధిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉంటే పని చేస్తున్న వారికి కూడా వేతనాల కోత గురించి తెలిసిందే. ఇది పారిశ్రామిక, సేవా రంగాలలో మాంద్యానికి దోహదం చేసింది. ఎగుమతులు 19శాతం పడిపోయాయి. ఇది ఒక నష్టం. ఇదే సమయంలో దిగుమతులు 40శాతం తగ్గిపోయాయి. దీని అర్ధం ఏమిటి ? కొనుగోలు డిమాండ్‌ తగ్గిపోవటమే, అది కేంద్రానికి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా గండికొడుతుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు లేదా దాని కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు అదనపు ఖర్చు చేసినందువలన గాక ఆదాయం తగ్గిన కారణంగానే లోటు ఏర్పడుతున్నది. దానిని పూడ్చుకొనేందుకు కేంద్రం అప్పులు చేయటానికి లేదా రిజర్వుబ్యాంకును ఆదేశించి అదనంగా నోట్లను ముద్రించి కేంద్రం కొంత మేరకు బయటపడవచ్చు. రాష్ట్రాలు అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతాయి. రిజర్వుబ్యాంకు నోట్లను ముద్రిస్తే అది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. గతంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన బిజెపికి దాని పర్యవసానాలు తెలుసు కనుక నోట్ల ముద్రణ గురించి గుంజాటన పడుతోంది. అవసరమైన సాకులు వెతుకుతోందని చెప్పవచ్చు. ఏ పేరుతో చేసినా అది సామాన్యుల నెత్తిమీద మోదటమే అవుతుంది. ద్రవ్యలోటు పన్నెండు శాతానికి పెరుగుతుందని, అప్పులు జిడిపిలో 90శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధను పునరుజ్జీవింప చేసేందుకు పెద్ద ఉద్దీపన పధకాన్ని ప్రకటించాలని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా తమ ఆర్డర్లు పెరిగాయని 25శాతం కంపెనీలే జూన్‌లో పేర్కొనగా ఆగస్టునాటికి 44శాతానికి చేరాయని ఆమె పేర్కొన్నారు.


1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్‌ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించి పోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండులక్షల కోట్ల డాలర్ల విలువగల 25వేల టన్నుల బంగారం గృహస్తుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్దం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్‌ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్‌ డాలర్ల విలువగల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్‌ డాలర్ల విలువగలది దొంగబంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీదేశారు జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్‌ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్రమోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీగారికి ఇష్టమైన సలహాలు చెబుతారా ?


నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివద్ధికి కషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.


ఇంతగొప్ప నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి ? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్‌ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక ? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

27 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chinese global times survey, fake news, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: