• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: panama

2024 ఎన్నికలు : పనామాలో కూడా ఎర్రజెండా ఎగురుతుందా ?

30 Saturday Jul 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Latin America’s Right, Latin American left, panama, panama canal, protests in Panama


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్‌ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు.2010దశకం నుంచి పెరుగుతున్న ఎర్ర మంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదానిమీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్‌ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది. ఇప్పుడు గుస్తావ్‌ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్దరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది.


జో బైడెన్‌ శ్రద్దలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, తూర్పు ఐరోపాలనే కాదు, మూర్ఖత్వం, అచేతనం, పట్టించుకోని కారణంగా పెరటి తోటగా ఉన్న లాటిన్‌ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు.రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్‌ ఏలుబడిలో కోల్పోయాము. బ్రెజిల్‌ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాలను చైతన్యవంతులను గావించేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవటాన్ని ప్రపంచంలోని మన స్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేఠీ వేసిన వారందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి. దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్‌ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సదరు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించుకోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేకురాలు రాసినదానికి వాల్‌స్ట్రీట్‌ జనరల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధగోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి.లాటిన్‌ అమెరికాలో రష్యా,ఇరాన్‌, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాటవేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు.


అసలు పనామాలో ఏం జరుగుతోంది ? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలిపే 81కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తర- దక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా. జూలై ఆరవ తేదీన శాంటియాగో డి వెరాగువాస్‌ అనే చిన్న పట్ణణంలో ( ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు,జనం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది. బిల్లు- బెల్లు తప్ప మిగతావాటితో మనకేం పని అని వారు అనుకోలేదు. తరువాత దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరసన పాకింది.బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరువాత రైతులు, విద్యార్ధులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సివచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు, పదిహేడవ తేదీన గాలన్‌(3.78లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. మన ప్రధాని నరేంద్రమోడీ కొంత మేర సెస్‌లను తగ్గించారు.ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్థంభింప చేశారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు. ఇరవయ్యవ తేదీన పనామా కాథలిక్‌ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం-నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు.ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్‌ సబ్సిడీల వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్‌ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు.అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్దం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజకీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా తదుపరి ఏం జరగనుందో చెప్పలేము.


రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపీలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి.ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతుల వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జన ఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ఆపరేషన్‌ చేయాల్సిన చోట బాండ్‌ ఎయిడ్‌ వేసినట్లుగా అరకొర చర్యలు జనాన్ని సంతృప్తి పరచలేదు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది. జనవరి తరువాత చమురు ధరలు 50శాతం పెరిగాయి, నిరుద్యోగం పదిశాతానికి చేరింది.ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకో చూశాడు. దేశం ఆరున్నరశాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేకపోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.


లాటిన్‌ అమెరికాలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జన జీవితాలు మరింతగా దిగజారాయి. అంతకు ముందు 2018లోనే ఇరవై శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉండగా పదిశాతం మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. కరోనాకు ముందు ప్రయివేటు రంగంలో 8,73,750 మంది వేతన జీవులుండగా కరోనాలో 37శాతం మందిని తొలగించారు, 30శాతం మందినే కొనసాగించారు, 33శాతం మంది కాంట్రాక్టు ఒప్పందాలను సస్పెండ్‌ చేశారు, అంటే వారికి కూడా ఉపాధి లేదు.2021లో వారిని తిరిగి తీసుకున్నారు. ప్రభుత్వం పొదుపు పేరుతో పదిశాతం ఖర్చు కోతపెట్టి 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఆర్ధిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019వరకు 46బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్‌ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరువాత జరిగిన అవినీతి.


ఒకవైపు జనజీవితాలు దిగజారుతుంటే ఎంపీల వేతనాలు పెద్ద మొత్తంలో పెంచటమే కాదు, అనేక మందికి లాభాలు పొందే కాంట్రాక్టులను అప్పగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయానికి ఇటీవలి వెలపలి కారణంగా తోడై కార్మికుల్లో అసంతృప్తిని మరింత పెంచినట్లు వామపక్ష నేత, గత ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేసిన సాల్‌ మెండెజ్‌ చెప్పాడు. పాలకులు అవినీతిని సంస్థాగతం గావించారని ప్రముఖ గాయకుడు, రచయిత రేబెన్‌ బేడ్స్‌ విమర్శించారు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నాడు. అవినీతిని అరికట్టాలన్న జనం డిమాండ్‌ను పట్టించుకోకుండా ఎంపీలకు కాంట్రాక్టులు అప్పగించినట్లు పౌరశక్తి సంస్థ నేత చెప్పాడు. సంస్కరణలకు ఒక ప్రణాళికను ప్రకటించాలని ఐదు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. గత మూడు సంవత్సరాలలో సంక్షేమ చర్యలకు చేసిన ఖర్చుతో 16.5బి. డాలర్లు అప్పు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది.


పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ జనవరిలో చెప్పినదాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణ భారం జిడిపిలో 68.5 నుంచి 2021లో 64.2శాతానికి తగ్గింది. సామాజిక భద్రతా పధకాల రుణాలను పక్కన పెడితే అది 57.7శాతానికి తగ్గుతుంది.2020లో 17.9 ప్రతికూల వృద్ది రేటు నుంచి కోలుకొని 2021లో అంచనా వేసిన 12ను అధిగమించి 15శాతం వృద్ది నమోదైంది.2022, 2023లో వరుసగా 7,5శాతాల చొప్పును పెరుగుతుంది. దీర్ఘకాల మందగమనం నుంచి బయటపడుతుంది. పనామా కాలువ టోల్‌ ద్వారా, రాగి ఎగుమతులు ఆర్ధిక వృద్దికి చోదకాలుగా ఉన్నాయి.2021 నవంబరు వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 0.9 బి.డాలర్లుగా ఉన్న రాగి ఎగుమతులు 2.5బి డాలర్లకు పెరిగాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. ఏటా 13-14వేల ఓడలు ప్రయాణించే పనామా కాలువ ద్వారా కూడా గణనీయంగా రాబడి వస్తున్నది.


లాటిన్‌ అమెరికాలో తనకు తైనాతీలుగా ఉన్న వారిని అధికారంలో కూర్చోపెట్టిన గతం, వర్తమానం అమెరికాకు ఉంది. పనామా కూడా అలాంటిదే. పనామా కాలువను తన ఆధీనంలో ఉంచుకున్న అమెరికా అన్ని విధాలుగా లబ్దిపొందింది. కాలువ ప్రాంతంలో తన సైనిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన కొలంబియాలో నేటి పనామా ఒక ప్రాంతం. స్వచ్చందంగానే కొలంబియాలో చేరినప్పటికీ అక్కడ వేర్పాటు భావనలు తలెత్తాయి.పనామా కాలువ ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని అమెరికా తలపెట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. వేర్పాటువాదులను పాలకులుగా గుర్తించి 1903లో వారితో ఒప్పందం చేసుకుంది.2000 నాటికి కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించేందుకు 1979లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత 1984 కుట్రచేసి మిలిటరీ జనరల్‌ నోరిగానూ గద్దెపై కూర్చోపెట్టింది. అదే నోరిగా అటు అమెరికా సిఐఏ నుంచి ఇటు మాదకద్రవ్యాల మాఫియా నుంచి నిధులు పొందుతూ ఏకు మేకై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. దాంతో 1989లో అమెరికా మిలిటరీ దాడి చేసి నోరిగాను గద్దె దించి తనకు అనుకూలమైన శక్తులకు మద్దతు ఇచ్చింది.
పనామా చరిత్రను చూసినపుడు మితవాద, అమెరికా అనుకూల శక్తులదే అక్కడ పెత్తనం.2013లో బ్రాడ్‌ఫ్రంట్‌ పేరుతో నిర్మాణరంగ కార్మికనేత సాల్‌మెండెజ్‌ వామపక్ష పార్టీని ఏర్పాటు చేశాడు.2019 ఎన్నికల్లో అతనికి కేవలం 0.69శాతం, పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రంట్‌కు 1.26శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. వామపక్ష శక్తుల బలం పరిమితంగా ఉన్న పనామాలో 1930దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. బలం పెద్దగా లేకున్నా పనామా కాలువను జాతీయం చేయాలన్న ఆందోళనలో చురుకుగా ఉండటమే గాక తరువాత అధికారానికి వచ్చిన ఉదారవాదులకు మద్దతు ఇచ్చింది. వారు ప్రజానుకూల విధానాలకు తిలోదకాలివ్వటంతో 1984లో వెలుపలికి వచ్చింది, 1991లో పార్టీ గుర్తింపును రద్దు చేశారు.


వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ జూలై నెలలో జరిగిన ప్రజా ఉద్యమాలు ఆశక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందుగానే వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Panama Papers source breaks silence, denies being a spy – Sueddeutsche Zeitung

07 Saturday May 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers, whistleblowers

A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo. REUTERS/Carlos Jasso/Files
A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo.
REUTERS/CARLOS JASSO/FILES

Sueddeutsche Zeitung said on Friday that the source of millions of documents leaked to the German newspaper from Panamanian law firm Mossack Fonseca had sent them a manifesto, saying his motivation was the “scale of injustices” the papers revealed.

The source had never before publicly stated why he leaked the documents, now known as the Panama Papers, said Sueddeutsche Zeitung (SZ), one of Germany’s most reputable newspapers.

In an 1,800 word manifesto published on the SZ website on Friday, the source, calling himself “John Doe”, praised others who have leaked secret and sensitive documents, such as Edward Snowden, who revealed details of the U.S. government’s mass surveillance programme.

“For his revelations about the National Security Agency (NSA), he deserves a hero’s welcome and a substantial prize, not banishment,” the source wrote.

He also said he would be willing to co-operate with law enforcement agencies.

He called on the European Commission, Britain, the United States and other nations to take steps to protect people who reveal private information about such sensitive issues rather than punishing them.

“Legitimate whistleblowers who expose unquestionable wrongdoing, whether insiders or outsiders, deserve immunity from government retribution, full stop,” he said.

The source, who contacted the paper a year ago with an offer of encrypted internal documents from Mossack Fonseca, denied being a spy but said he had recognised the “scale of injustices” described in their contents.

The documents cover a period over almost 40 years, from 1977 until last December, and purport to show that some companies domiciled in tax havens were being used for suspected money laundering, arms and drug deals and tax evasion.

Reuters could not independently verify whether the source was the same person who leaked the original documents. The source’s identity and gender is not known.

Sueddeutsche Zeitung spent more than a year, along with other media outlets and the International Consortium of Investigative Journalists, analysing the huge cache of documents.

On Friday, Sueddeutsche Zeitung introduced the manifesto by saying: “Now ‘John Doe’, the anonymous source, has sent the SZ a manifesto, which can be read as an explanation of his actions – and as a call to action.”

The source welcomed the fact that the leak had triggered a debate on “wrongdoing by the elite” but said not enough action had been taken.

“For the record, I do not work for any government or intelligence agency, directly or as a contractor, and I never have,” he said.

The source was critical of banks, financial regulators, tax authorities, the courts, and the legal profession, as well as the media, saying he had offered the documents to several major media outlets that had chosen not to cover them.

“The collective impact of these failures has been a complete erosion of ethical standards, ultimately leading to a novel system we still call Capitalism, but which is tantamount to economic slavery.”

The source ended the manifesto by saying “inexpensive, limitless digital storage and fast internet connections” should help digitise the revolution against income inequality.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers

ఎం కోటేశ్వరరావు

      ప్రపంచ నేతలు, పేరు మోసిన ప్రముఖులను గడ గడలాడిస్తున్న  పత్రాలను కలిగి వున్న కంపెనీ మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు ఏమిటి ? అనగా అనగా ఒక భూ ప్రపంచం, దానిలో ఒక ఖండం పేరు దక్షిణ అమెరికా, దానికి ఇంకొక పేరు లాటిన్‌ అమెరికా.దీనిని వుత్తర అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు వున్న ఖండం) ఖండాన్ని కలుపుతూ మధ్యలో వున్న చిన్న దేశాలలో ఇదొకటి. అందుకని దీనిని మధ్య అమెరికా దేశం అని కూడా అంటారు గానీ ఖండాల వారీ చూస్తే దక్షిణ అమెరికాకే చెందుతుంది. పసిఫిక్‌-అట్లాంటిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువను తవ్వారు అదే పనామా కాలువ.అంతకు ముందు ఐరోపా, ఆఫ్రికా ఖండాల నుంచి దూరప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని చిలీలో వున్న కేప్‌ హారన్‌ను చుట్టి రావాల్సి వుండేది. అది ఖర్చు, సమయం వృధాతో పాటు ప్రమాదకర మార్గంగా వుండేది. దాంతో ఆఫ్రికా ఖండంపై ఆధిపత్యం సంపాదించిన ఫ్రెంచి పాలకులు పనామా కాలువకు రూప కల్పన చేశారు. ఈ కధ వేరే. అలాంటి పనామా తమ దేశంలో తవ్విన కాలువను జాతీయ చేసిన తరువాత ఆ కాలువ గుండా ప్రయాణించే ఓడల నుంచి టోలు వసూలు చేసుకోవటంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు తమ దేశంలో కంపెనీలను ఏర్పాటు చేస్తే ఎలాంటి పన్నులు విధించబోమని ప్రకటించింది. పరిశ్రమలు పెడితే, వ్యాపారాలు నిర్వహించి తమ జనానికి వుపాధి కల్పిస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించే దేశాల గురించి చాలా మందికి తెలుసు గానీ ఇలా కేవలం కంపెనీలను రిజిస్టర్‌ చేస్తే రాయితీలిచ్చే దేశాలు, ప్రాంతాలు ప్రపంచంలో చాలా తక్కువగా వున్నాయి.

    ఇంతకీ పనామా జనాభా ఎంత అనుకుంటున్నారు. నలభై లక్షల లోపు, వారిలో సగం మంది రాజధాని పనామా సిటీలోనే వుంటారు.కార్పొరేట్‌ కంపెనీలకు సేవలు అందించేందుకు 1977లో జర్మన్‌ లాయర్‌ జర్గన్‌ మొసాక్‌ తన పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. పది సంవత్సరాల తరువాత పనామాకు చెందిన లాయర్‌ రామొన్‌ ఫొన్సేకా దానిలో చేరటంతో అది మొసాక్‌ ఫొన్సేకా కంపెనీగా మారింది. తరువాత స్విడ్జర్లాండ్‌కు చెందిన మరో లాయర్‌ క్రిస్టోఫ్‌ జోలింగర్‌ వారితో భాగస్వామిగా చేరాడు. ఇంకేముంది ముగ్గురు లాయర్లు అరవై కక్షిదారులుగా వారి వ్యాపారం విస్తరించింది. వాణిజ్య , ట్రస్ట్‌ చట్టాలు, కంపెనీ రిజిస్ట్రేషన్లు,మదుపు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్ధల గురించి సలహాలు అందించటంలో అది పేరు తెచ్చుకుంది.దానికి ప్రపంచంలో 40 కార్యాలయాలు వాటిలో 500 మంది సిబ్బంది వున్నారు. గుట్టుగా లావాదేవీలు నిర్వహించే ఈ సంస్ధలో 1977-2015 మధ్యకాలంలో దాని సేవలు పొందిన, పొందుతున్న ఖాతాదారుల వివరాల పత్రాలు వెల్లడి కావటంతో ప్రపంచ వ్యాపితంగా దాని పేరు తెలిసిపోయింది. పనామాలో ఇంకా ఇలాంటి సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి.పనామాలో నమోదైన మొత్తం కంపెనీలలో సగం ఇలాంటి ఏడు పెద్ద సంస్ధల సేవలు పొందుతున్నాయి.

    ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్నట్లుగా అబ్బే మా కంపెనీ చాలా చిన్నదండీ ప్రపంచ ఆర్ధిక సేవల సలహాలలో కేవలం ఐదుశాతమే మా వాటా అని మొసాక్‌ ఫొన్సేకా చెప్పుకుంటుంది. కానీ పదిశాతం వరకు వుంటుందని ఒక అంచనా.కరీబియన్‌ ప్రాంతంలో బ్రిటీష్‌ వారి ఏలుబడిలో వున్న వర్జిన్‌ ఐలాండ్స్‌ అనే దీవిలో కూడా మొసాక్‌ ఫొన్సెకా కార్యకలాపాలు వున్నాయి. ఇక్కడ అది లక్షకు పైగా కంపెనీలను నమోదు చేసింది. ఇవి అక్కడి జనాభాకు నాలుగు రెట్లు ఎక్కువంటే ఆశ్చర్యపోవద్దు. వీటిని సూట్‌ కేస్‌ కంపెనీలని కూడా అంటారు. వాటికి కార్యాలయాలు వుండవు, సిబ్బంది వుండరు.పేరుకు అక్కడ ఆఫీసులు, ఇతర చోట్ల కార్యకలాపాలు, పన్నుల చెల్లింపు విషయానికి వస్తే అక్కడి చిరునామాను చూపి తప్పించుకుంటాయి. బినామీ, సూట్‌ కేసు కంపెనీల ఏర్పాటుకు సలహాలు ఇచ్చే మొసాక్‌ ఫోన్సెకా వంటి కంపెనీలు కూడా నకిలీలను ఏర్పాటు చేసుకుంటాయి. అర్జెంటీనా అక్రమాల విచారణలో ఇది ఎంఎఫ్‌ అనే మరో సూట్‌ కేసు కంపెనీ ఏర్పాటు చేసినట్లు బయటపడింది. బ్రెజిల్‌లో జరిగిన అక్రమాలలో కూడా ఇలాంటిదే బయట పడింది. అయితే అక్కడి కార్యాలయం తమ ఏజంట్‌ తప్ప తమ ప్రధాన కార్యాలయంనుంచి పనిచేయదని తప్పించుకుంది. ఈ కంపెనీ యజమానులలో ఒకరు పనామా సలహాదారుగా వుండి, ఈ కుంభకోణం బయటపడటంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

   మనదేశ చరిత్రలో అనేక కుంభకోణాలు జరిగాయి. వాటన్నింటినీ ఇక్కడ పేర్కొనటం సాధ్యం కాదు. వాటిలో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించి అవినీతి మైలు రాళ్లుగా (ఇప్పుడు కిలోమీటర్‌ రాళ్లు అనుకోవాలి) చెప్పుకొనే కొన్నింటిని రేఖా మాత్రంగా ఇక్కడ చూద్దాం. నయా వుదారవాద విధానం లేదా నూతన ఆర్ధిక విధానాల పేరుతో 99శాతం ప్రజలకు చెందాల్సిన వనరులను ఒక శాతం కార్పొరేట్లకు కట్టపెట్టటం జరుగుతోంది.

    రాజ్యాంగ సంస్ధ అయిన కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ (కాగ్‌) నివేదికల ప్రకారం మన దేశంలో అపారంగంగా వున్న బొగ్గు నిల్వలను వేలం పాట లేకుండా అడ్డదారుల్లో, అవినీతి మార్గాలలో ప్రయివేటు సంస్ధలకు కట్టపెట్టటం పెద్ద కుంభకోణం.దీనికి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రూపకల్పన చేస్తే మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం అమలు జరిపింది. పనిలో పనిగా విమర్శలను తప్పించుకొనేందుకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్ధలకు కూడా ఇచ్చారు. దాని వలన నష్టం లేదు. వచ్చే లాభాలు తిరిగి ప్రభుత్వానికే చేరతాయి.ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టమని కాగ్‌పేర్కొనగా మీడియా అంచనా పదిలక్షల కోట్లకు పైగానే వుంది. ఇదంతా 2004-09 మఢ్యనే జరిగింది. అదీ స్వయంగా ప్రధాని ఆధ్వర్యంలోనే అని తెలుసుకోవాలి.

    బాగా చర్చజరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కారణంగా ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పెరిగిన 2008 రేట్లు వున్నప్పటికీ నిబంధనలను పక్కదారి పట్టించి 2001 రేట్ల ప్రకారం కేటాయింపులు జరిపి ఈ అక్రమానికి తెరతీశారు.

   హవాలా కుంభకోణం. పన్ను ఎగవేసేందుకు, విదేశాల్లో డబ్బు దాచుకొనేందుకు అనుసరించిన విధానాన్ని హవాలా అంటారు. ఒక వ్యక్తి మన దేశం నుంచి అమెరికాకు డబ్బు పంపాలి. మరొకరు అక్కడి నుంచి మన దేశానికి పంపాలి. చట్ట బద్దమైన పద్దతులలో పంపితే లెక్కలు చూపాలి, పన్ను కట్టాలి.ఇవేమీ లేకుండానే కొంత కమిషన్‌ తీసుకొని అక్కడా ఇక్కడా డబ్బు సర్దుబాటు చేసే ఏజంట్లు వుంటారు.ఇందుకు గాను మన దేశంలో రాజకీయ నాయకులకు కోటీ ఎనభైలక్షల డాలర్ల మేర ముడుపులు ఇచ్చారని 1996లో వెల్లడయింది. దీనిలో అద్వానీ పేరు కూడా చోటు చేసుకుంది. తరువాత కాదని తేల్చారు. ఈ కుంభకోణం ఇప్పుడు కూడా నడుస్తున్నది.

    పెద్ద గీతను చిన్నదానిగా చేయాలంటే దాని పక్కనే మరింత పెద్దగీత గీయాలి. ఒకప్పుడు హర్షద్‌ మెహతా పెద్ద గీత ఇప్పుడు అంతకంటే ఎన్నో పెద్ద గీతలు.బ్యాంకులు, బోంబే స్టాక్‌ మార్కెట్‌ను మోసం చేసి దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన హర్షద్‌ మెహతా బీమా కంపెనీలో ఒక చిన్న వుద్యోగి. ఆర్ధిక లావాదేవీలలో లొసుగులను కనిపెట్టి వాటిని వుపయోగించుకున్నాడు.మొత్తం 28 కేసులు నమోదు చేయగా నాలుగింటిలోనే శిక్ష పడింది. 47ఏళ్ల వయసులో జైల్లో మరణించాడు. ఆ కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే వున్నాయి.

  రక్షణ రంగంలో ముడుపులు లేని లావాదేవీ వుండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిని బహిర్గతం చేసింది బోఫోర్స్‌ కుంభకోణం. పెద్ద తుపాకుల కొనుగోలు కాంట్రాక్టులో 80 కోట్ల రూపాయల కమిషన్లు పొందిన వారిలో రాజీవ్‌ గాంధీ వున్నట్లు వెల్లడైంది. దీంతో పెద్ద సంచలనం. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలతో పోలిస్తే ఇది మరీ చిన్నగీత.

   కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా చివరికి గడ్డిలో కూడా కోట్లు సంపాదించవచ్చుని బీహార్‌లో జరిగిన 900 కోట్ల రూపాయల ఈ కుంభకోణం నిరూపించింది. దీని పేరు చెబితే వెంటనే లాలూ ప్రసాద్‌ యూదవ్‌ గుర్తుకు రాక మానరు.. బ్యాంకింగ్‌ రంగంలో వున్న లొసుగులను వుపయోగించుకొని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను కేతన్‌ పరేఖ్‌ అనే పెద్ద ఒక విధంగా వందల కోట్ల రూపాయలకు ముంచాడు.

    దాదాపు పది సంవత్సరాల పాటు విదేశీ, స్వదేశీ జనాలు, కంపెనీలను దాదాపు 14వేల కోట్ల రూపాయలకు ముంచిన సత్యం కంప్యూటర్స్‌ గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేద. బిల్‌గేట్స్‌,చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ మోసగాడిని తమ పక్కన కూర్చో పెట్టుకొని అందలమెక్కించారు. నకిలీ స్టాంపుల ముద్రణతో 20వేల కోట్లకు పైగా ముంచిన తెల్గి, దాదాపు పదివేల కోట్ల రూపాయలను స్వాహా చేసిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం వంటివి మన కళ్ల ముందే జరిగాయి. వీటిలో భాగస్వాములైన వారిని శిక్షిస్తారా ? పోయిన ప్రజల సొమ్మును తిరిగి రాబడతారా ? అప్పనంగా సొమ్మును అప్పగించటమే అవినీతి కాదు, అలా తేలిన సొమ్మును రాబట్టకపోవటం కూడా అవినీతిలో భాగమే అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పనామా కంపెనీ పత్రాలు – పెద్దల అవినీతి చిత్రాలు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

big shots corruption, CORRUPTION, panama, panama papers

ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

ఎం కోటేశ్వరరావు

   లైసన్సులు, పర్మిట్లు ఇప్పించినందుకు లంచాలు తీసుకోవటం, బల్లకింద చెయ్యి పెట్టటం నాటి పద్దతి ! ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు, భూములు, రుణాలు ఇప్పించి నీకది-నాకిది, నీకింత -నాకింత అని పంచుకోవటం నేటి పద్దతి !! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకుంటుంటే అవినీతి నిరోధకశాఖ సిబ్బంది నాటకీయంగా వలపన్నటం లెక్కలేనన్ని సినిమాల్లో అందరూ చూసింది మోటు పద్దతి. ఇప్పుడు అంతా చట్టబద్దమే, బల్లమీది వ్యవహారమే.

    రాజకీయ నేత, పారిశ్రామికవేత్త, వ్యాపారి, సినిమా యాక్టర్‌ ఇలా ఎందరో మహాను భావులు , చిదిమితే దేశ భక్తి కారిపోతుంటుంది. ప్రతిదానినీ వ్యాపారం-లాభం లెక్కలలో చూసుకొనేవారు ఎవరైనా ఇదే పద్దతి. గజం పాతికవేల రూపాయల స్ధలాన్ని కంపెనీ పేరుతో పాతిక రూపాయలకే అప్పనంగా పొందవచ్చు. దీన్ని కేటాయించిన సదరు మంత్రి కుమారుడు, కుమార్తెల పేరుతో (ఎందుకంటే ఇప్పుడు బావమరుదులను కూడా నమ్మటం లేదు మరి) ముందుగానే ఏర్పాటు చేసిన సూట్‌ కేసు కంపెనీలలో పది రూపాయల వాటాను వెయ్యి రూపాయలకు కొనటం లేదా సదరు కంపెనీకి ఎలాంటి వడ్డీ లేకుండా వందల కోట్ల రుణం పేరుతో డబ్బు బదలాయించి చట్టబద్దంగానే లంచం చెల్లించటం నేటి పద్దతి.

     ఇక అలా సంపాదించిన దానిని స్నేహితులు, బంధువుల పేరుతోనో మరొక పేరుతోనో దాస్తే, ఎవరినీ నమ్మే రోజులు కావివి, తీరా గడ్డితిని సంపాదించిన దానిని వారు నొక్కేస్తే ? డబ్బూపోయె శనీ పట్టె అన్నట్లు ఎందుకొచ్చిన తిప్పలు ! విదేశాల్లో దాచుకుంటే ఏ గొడవా వుండదు. అందుకే ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

     మనకు బాగా తెలిసి పన్నుల స్వర్గం స్విడ్జర్లాండ్‌. అక్కడి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు. అది ఎక్కడిది, అక్రమమా, సక్రమమా అని ఎవరూ అడగటానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు.అందుకని ఎవరైనా స్విడ్జర్లాండ్‌ వెళ్లారంటే అక్కడ లావాదేవీలు చూసుకొని రావటానికే అని అనుమానించటం సహజం. ఇపుడు స్విడ్జర్లాండ్‌ నిబంధనలు మార్చారు.ఎవరైనాఅడిగితే సమాచారాన్ని తెలియచేయాల్సి వుంటుంది. ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేని పనామా వంటి దేశాలు, దీవులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. డబ్బుంటే చాలు, దానిని ఎలా దాచుకోవాలో, ఎలా పన్నులు ఎగ్గొట్టాలో సలహాల సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి. అదిగో అలాంటి వాటిలో పనామాలోని ఒక పెద్ద సంస్ధ మోసాక్‌ ఫొన్సెకా. దాని దగ్గర వున్న లక్షలాది లావాదేవీల పత్రాలు బయటికి వచ్చాయి. ఆ కంపెనీ పనామాలో వుంది కనుక వాటిని పనామా పత్రాలని పిలుస్తున్నారు.రెండులక్షలకు పైగా కంపెనీల వివరాలు ఇపుడు బయటకు వచ్చాయి. తమ కంప్యూటర్లను హాక్‌ చేశారని మొసాక్‌ ఫొన్సేకా ప్రకటించింది.

    ఏప్రిల్‌ మొదటివారంలో ఈ పత్రాలు వెలువడగానే దాదాపు అన్ని పత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలతో పెట్టాయి. తరువాత వాటి గురించి దాదాపు మరిచి పోయాయి ? పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు కొనసాగింపు వార్తలను ఇస్తాయని ఎవరైనా ఆశిస్తే అది దురాశే.మన దేశానికి చెందిన పెద్దల పేర్లు కూడా పనామా పత్రాలలో వుండటంతో మన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. వాటి వెనుక కారణాలు ఏవున్నప్పటికీ ఆ మేరకు స్పందించినందుకు కొంత మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు పంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని రెండేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదనే విమర్శలను తప్పించుకోవటానికే మొక్కుబడిగా ఆ ప్రకటన చేశారని ఎందరో భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం చాలా పరిమితమే. రానున్న రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.అందువలన ఇది అంతంకాదు ఆరంభం మాత్రమే. వస్తున్న విశ్లేషణలు, నిబంధనలను పరిశీలిస్తే ఎవరెంత మన దేశంలో దోచుకున్నారో విదేశాల్లో దాచుకున్నారో వివరాలు కొంతమేరకు తెలుసుకోవచ్చేమో తప్ప సరిహద్దులు దాటిపోయిన ధనం ఏమేరకు తిరిగి వస్తుందన్నది అనుమానమే.

     పనామా పత్రాలు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐస్లాండ్‌ ప్రధాని రాజీనామా చేశాడు.నలభై లక్షల డాలర్ల అక్రమ బాండ్ల వివరాలు బయటకు రావటంతో తోకముడిచాడు. బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చినట్లు బయటకు రావటంతో ఇబ్బందులలో పడ్డాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.ఇలాంటి వారు 45 దేశాధినేతల పేర్లు ఈ పత్రాలలో ప్రస్తావనకు వచ్చాయి.న్యూస్‌ వీక్‌ పత్రిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని పన్నుల స్వర్గాలలో 21నుంచి 32లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ సంపన్నులు, కార్పొరేట్లు అక్రమంగా దాచుకున్నారు. స్విడ్జర్లాండ్‌, హాంకాంగ్‌, అమెరికా, సింగపూర్‌, కేమాన్‌ దీవులు ప్రధమ స్ధానాలలో వుండగా పనామా 13,బ్రిటన్‌ 15వ స్ధానంలో వుంది.బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో పన్ను చెల్లించనవసరం లేకపోవటంతో ఎఫ్‌డిఐలు అక్కడికి లక్షా ఇరవైవేల కోట్ల పౌండ్ల మేరకు వచ్చాయి. అక్కడ 6,72,500 కంపెనీలు లేదా ఖాతాలు వున్నాయి. దారి జనాభా 30వేలకు లోపు. ఇలాంటి అక్రమలావాదేవీలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్‌ వుంది. పనామా పత్రాల తీవ్రత ‘పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేదిగా వుందని’ టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది.’21వ శతాబ్దపు పెట్టుబడిదారీ విధాన వాహనం అడ్డుగోడను ఢీకొట్టేందుకు శబ్దం చేస్తూ వెళ్లే దారిలో మొసాక్‌ ఫొన్సెకా వ్యవహారం ఒక మైలు రాయి అని ‘ జీన్‌ పెరీ లేమాన్‌ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించాడు.

     ఆర్ధిక అసమానతలను పరిష్కరించని పక్షంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్ధకే ముప్పు వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసిన ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పన్నుల స్వర్గాలను అదుపు చేయని పక్షంలో మొత్తం ప్రపంచ వ్యవస్తే కుప్పకూలి పోతుందని అది జరగక ముందే వాటిని తక్షణమే అదుపు చేయాలని,నిబంధనలు పాటించని దేశాలపై అవసరమైతే ఆర్ధిక ఆంక్షలు విధించాలని పనామా పత్రాల వెల్లడి గురించి వ్యాఖ్యానించారు. పన్నుల స్వర్గాలలో జరుగుతున్న అక్రమాల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు, ఆచరణకు నక్కకూ నాగలోకానికి వున్నంత దూరం వుందని పికెటీ పేర్కొన్నారు. 2014లో లక్సెంబర్గ్‌ లీక్స్‌ లేదా లక్స్‌లీక్స్‌ దర్యాప్తులో ఐరోపాలోని కార్పారేట్‌ కంపెనీలేవీ పన్నులు కట్టటం లేదని తేలింది. పనామా పత్రాల ప్రకారం ధనిక, పేద దేశాల ఆర్ధిక, రాజకీయ పెద్దలు తమ ఆస్థులను ఎలా దాచుకుంటున్నారో వెల్లడి అయింది. జర్నలిస్టులు తమ విధి నిర్వహిస్తున్నందుకు మనం సంతోషించాలి.సమస్య ఎక్కడంటే ప్రభుత్వాలే తమపని తాము చేయటం లేదు. వాస్తవం ఏమంటే 2008లో ప్రారంభమైన సంక్షోభం తరువాత అసలు చేసిందేమీ లేదు.మరో విధంగా చెప్పాలంటే పరిణామాలు మరింతగా దిగజారాయి.తమ ఆధీనంలోని వర్జిన్‌ దీవులు, ఇతర ప్రాంతాలలో కొల్లగొట్టే పనులు చేస్తూనే బ్రిటన్‌ తన పన్ను రేటును 17శాతానికి తగ్గించబోతున్నది. ఒక పెద్ద దేశం ఇలా చేయటాన్ని ఎక్కడా వినలేదు. దీని గురించి ఏమీ చేయకపోతే మనమందరం ఐర్లండ్‌ మాదిరి 12శాతం లేదా సున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టిన వారికి గ్రాంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అని కూడా పికెటీ వ్యాఖ్యానించారు.

      పన్నుల స్వర్గాలలో ప్రయివేటు ఆస్ధులను దాచుకోవటంపై ఇప్పటికీ పూర్తి పారదర్శకత లేదు, 2008 నుంచి ఆర్ధిక వ్యవస్ధల కంటే ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇతరుల కంటే తక్కువ పన్ను చెల్లించటం ఒక కారణం.ప్రభుత్వం ఎలాగూ దర్యాప్తు చేయదనే భయంతో ప్రాన్స్‌లో ఒక జూనియర్‌ మంత్రి తనకు స్విడ్జర్లాండ్స్‌లో ఖాతాలు లేవని 2013లో మంత్రి తాపీగా చెప్పాడు. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించారు. తమ దగ్గర వున్న సమాచారాన్ని వున్నది వున్నట్లు అధికారికంగా తెలియచేసేందుకు స్విడ్జర్లాండ్‌ అంగీకరించింది. పనామా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. సమాచారాన్ని వెల్లడి చేయటమంటే అదొక ప్రభావ వంతమైన సామాజిక నిరసన అనే సిద్ధాంతం గతంలో లేని విధంగా నేడు పరీక్షకు గురి అవుతోంది. అది పెట్టుబడిదారీ విధానం రానున్న రోజుల్లో మరింత తీవ్ర సంక్షోభంలో పడవేయటానికి తోడ్పడుతుందని పికెటీ హెచ్చరించారు.

మన జర్నలిస్టులూ భాగస్వాములే

      ఈ శతాబ్ది జర్నలిజం ప్రాజెక్టుగా పేరుతెచ్చుకున్న పనామా పత్రాలను బయట పెట్టిన జర్నలిస్టులలో మన దేశానికి చెందిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వారు ముగ్గురు వున్నారు. పి వైద్యనాధన్‌, రితు శరీన్‌, జయ్‌ మజుందార్‌ దాదాపు ఎనిమిది నెలల పాటు పనామా పత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.యాజమాన్యం వారిని అందుకు అనుమతించింది. విలేకర్లు తెచ్చిన సమాచారాన్ని తీసుకొని డబ్బున్న, అక్రమాలకు పాల్పడిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే మీడియా సంస్ధల యజమానులు విచ్చల విడిగా వున్న ఈ రోజుల్లో విశ్వసనీయత ముఖ్యమైనది. అందుకు గాను గతంలో వారి పరిశోధనలు, వెల్లడించిన సమాచారం, వ్యక్తిగత నిజాయితీల రికార్డు ఆధారంగా ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసిఐజె) తన బృందాన్ని ఎంపిక చేసుకుంటుంది. దీనిలో అలా రాటు దేలిన వారు 25 భాషలు, 70 దేశాలకు చెందిన 250 మంది జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వీరికి అందుబాటులోకి వచ్చిన సమాచారం గురించి వింటే పడిపోవాల్సిందే. 1977 నుంచి 2015 డిసెంబరు వరకు వున్న నలభై ఎనిమిది లక్షల ఇమెయిల్స్‌, 21లక్షల పిడిఎఫ్‌ పైల్స్‌ను వారు వడపోశారు.ఒక జర్మన్‌ పత్రిక సమాచారం ప్రకారం కోటీ 15లక్షల రహస్య పత్రాలు జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. తామేం చేస్తున్నామో, తాము పరిశీలిస్తున్న మొసాక్‌ ఫోన్సెకా పేరు కూడా తమ స్వంత సంస్ధలోని వారికి కూడా పత్రాలను బహిర్గతం చేసేవారికి కూడా తెలియదని రీతు శరీన్‌ చెప్పారు. ఆమె గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి వార్తలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.ఆమె అంతకు ముందు బ్రిటన్‌లోని పెద్ద బ్యాంకు అయిన హెచ్‌ఎస్‌బిసి-స్విస్‌ బ్యాంకు, వర్జిన్‌ ఐలాండ్‌లోని భారతీయుల ఖాతాల లోగుట్టును బయటపెట్టారు.ఇది ఐసిఐజెతో ఆమెకు మూడవ ప్రాజెక్టు. నీరారాడియా టేపులను బహిర్గతంలో చేయటంలో చేయితిరిగిన రీతు తన బృందంలో బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగాలలో సమగ్రపరిజ్ఞానం వున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి మరో 22 మంది వివిధ రాష్ట్రాల రిపోర్టర్లు తోడ్పడ్డారు. అయితే వారంతా ఈ ముగ్గురు బృందం అడిగిన సమాచారం అంటే పనామా పత్రాలలో వున్న భారతీయుల చిరునామాలు, ఇతర సమాచారాన్ని ఇవ్వటం తప్ప తామెందుకు ఆ సమాచారం ఇస్తున్నారో కూడా వారికి తెలియదు. మన దేశానికి సంబంధించిన 36వేల పత్రాలను ఎక్స్‌ప్రెస్‌ బృందం పరిశీలించింది.ఎప్పటి కప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రీతు రెండు అంతర్జాతీయ రహస్యసమావేశాలకు వెళ్లి పత్రాల పరిశీలనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

      నరేంద్రమోడీ సర్కార్‌ విదేశాల్లో వున్న నల్లధనం తెస్తానని రంకెలు వేయటం, అక్రమార్కులను సర్దుకోమని చెప్పటం తప్ప మరొకటి కాదని తేలిపోయింది. పనామా పత్రాల ప్రకారం గతేడాది కూడా అనేక మంది నల్లధన కుబేరులు పనామాలో ఖాతాలు తెరిచినట్లు బయట పడింది. మన చట్టాలు ఎంత లోప భూయిష్టంగా వున్నాయంటే పనామా వంటి పన్ను స్వర్గాలలో కంపెనీలు తెరవటానికి అనుమతించవు గానీ వాటిలో వాటాలు, ఏకంగా కంపెనీలనే కొనుగోలు చేయవచ్చు. అంటే చట్టబద్దంగానే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం సులభమైంది కనుకనే అనేక మంది తాపీగా తమ లావాదేవీలన్నీ చట్టబద్దమే అని చెబుతున్నారు. దాదాపు ఐదు వందల మంది భారతీయులకు పనామాలో ఖాతాలున్నట్లు అంచనా. వారిలో పద్మభూషన్‌ కౌశల్‌ పాల్‌ సింగ్‌ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, కాంగ్రెస్‌కు సన్నిహితుడైన సమీర్‌ గెహ్లట్‌, బిగ్‌బి అమితాబ్‌,ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఈ జాబితాలో వున్నారు. వాణిజ్య వేత్తలు తాము అధికారులకు అన్నింటినీ వెల్లడించామని, అంతా చట్టబద్దంగానే జరిగిందని చెబుతుండగా అమితాబ్‌ మాత్రం అస్సలు తమకేమీ తెలియదని ప్రకటించారు.మరికొందరు ప్రవాస భారతీయులు తమకు భారత చట్టాలు వర్తించవని తమ దేశభక్తిని ప్రకటించుకున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: