అసహనానికి పెరుగుతున్న ప్రతిఘటన – కాషాయ సేన ఎదురు దాడి
రాంచీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశం సందర్బంగా ఆ సంస్ధ నాయకులు దత్తాత్రేయ హోసబలే, మన్మోహన్ వైద్య విలేకర్ల సమావేశంలో మాట్లాడిన అం శాలు మన దేశ మేధావులకు నిజంగా ఒక సవాల్ . తమ అసహన, పర మత ద్వేషాన్ని వ్యతిరేకించే శక్తులతో తలపడేందుకే సంఘపరివార్ పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. నిరసన తెలుపుతున్న మేధావులు ప్రచార గారడీలు చేస్తున్నారని, వారిని కొంత కాలంగా జనం పట్టించుకోవటం లేదని, దేశం వారి అభిప్రాయాలను తీసుకోవటం లేదని, ప్రస్తుత అధికార వ్యవస్ధలో ఇమిడే అవకాశం లేకపోవటంతో నిస్పృహతో ఈ పని చేస్తున్నారని వారు నిందించారు. దేశంలో అసహన పరిస్ధితుల ముప్పు లేనప్పటికీ కుహనా లౌకిక, వుదారవాదులు ఒక ప్రయోజనం కోసమే చర్చను ప్రారంభించారని, సహనాన్ని కాపాడే పేరుతో విమర్శి స్తున్నవారే మేధావులు కాదని వారిని విమర్శించిన విద్యాబాలన్,అ నుపమఖేర్, శ్యాం బెనెగల్ కూడా మేధావులేనని హోసబలే కితాబునిచ్చారు. ఈ తీరును చూస్తుంటే ప్రపంచ ఆర్ధిక విశ్లేష, రేటింగ్ సంస్ధలో ఒకటైన ‘మూడీస్’ను, రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘరాం రాజన్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణ మూర్తిని కూడా కాషాయ తాలిబాన్లు సెక్యుర్ లేదా కమ్యూనిస్టు శ క్తులో చేర్చుతారా?
సంఘపరివార్ తలచింది ఒకటైతే జరుగుతున్నది ఒకటి. అయినా సరే సమాజాన్ని,దేశాన్ని వెనక్కు నడపాలనే దాని అజెండా నుంచి వెనక్కు తగ్గేందుకు సిద్దంగా లేదని, మరింత అసహనాన్ని రెచ్చగొడుతూ రాంచీ సమావేశంలో జనాభా విధానంపై తీర్మానం ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ ముస్లిం జనాభాను నియంత్రించాలని డిమాండ్ చేసింది.
రెచ్చగొడుతున్న అసహన, పరమత వ్యతిరేక ధోరణులకు ఎదురౌతున్న అనూహ్య ప్రతిఘటనతో దిమ్మతిరిగిన వారి మానసిక స్ధితి గురించి ఎవరేం చెప్పగలరు? ఏ రేటింగ్ ఇవ్వగలరు. సమాజంలో పెరిగి పోతున్న అసహన ధోరణుల పర్యవసానాలను దేశం యావత్తూ చూస్తోంది.కాంగ్రెస్ నాయకత్వంలోని పదేళ్ల యుపిఏ పాలనలో అవినీతి అక్రమాలకు పెద్ద పీట వేసి అభివృద్దిని వెనుక పట్టు పట్టించారనే ఆగ్రహంతో అనేక మంది బిజెపి మతోన్మాద ధోరణులను కూడా చూడకుండా ఓటు వేశారు. గుజరాత్‌ను అభివృద్దిలో ముందు పీఠీన వుంచారనే భ్రమతో దేశమంతటినీ అలాగే మార్చే అల్లా వుద్దీన్ అద్బుతదీపం నరేంద్రమోడీ దగ్గర వుందని కలలు కన్నారు. ఏదాది గడిచి రెండో ఏడులో ప్రవేశించగానే అనేక మంది ఇదేమిట ?ి ఇలా జరుగుతోందేమిటి అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిగా వుందేమిటి ? అని విస్తుపోతున్నారు. ఒక దాని గురించి తేరు కోక ముందే మరో కొత్త ఘటన లేదా వివాదం పుట్టుకు వస్తోంది. పోనీ అవి ఏమైనా దేశ పురోగతికి తోడ్పడేవా అంటే కాదని కానే కాదని అందరికీ తెలుసు.
పశుమాంసం, ఇతర అంశాలుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి సభ్యులను నియంత్రించాలని, ఇవి ఎక్కువైతే విశ్వసనీయత కోల్పోయే అవకాశం వుందని మూడీస్ సంస్ధ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇవి పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సంస్కరణల విషయంలో మోడీ సర్కార్ వాగ్దానాలను నిబెట్టుకోక పోవటంతో నమ్మకాలు సన్నగ్లిల్లుతున్నాయని, భారత పురోగతిపై అంతర్జాతీయ మదుపుదార్లలో విశ్వాసం ఏర్పడలేదని కూడా చెప్పింది. నేను రాజకీయవేత్తను కాదు, రాజకీయాలంటే ఆసక్తి కూడా లేదు, కానీ ఈ దేశంలోని మైనారిటీలు, వలస వచ్చిన ఇతరులలో కూడా బాగా భయం వున్నట్లు గ్రహించాను, ఇది దేశాభివృద్దికి మంచిది కాదు, ప్రపంచంలో మతపరమైన అసహనం వున్న ఏదేశం కూడా సరిగా లేదు అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. సంఘపరివార్ తలచింది ఒకటైతే జరుగుతున్నది ఒకటి. అయినా సరే సమాజాన్ని,దేశాన్ని వెనక్కు నడపాలనే దాని అజెండా నుంచి వెనక్కు తగ్గేందుకు సిద్దంగా లేదని, మరింత అసహనాన్ని రెచ్చగొడుతూ రాంచీ సమావేశంలో జనాభా విధానంపై తీర్మానం ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ ముస్లిం జనాభాను నియంత్రించాలని డిమాండ్ చేసింది. ప్రశ్నించటం, చర్చించటం భారత సంప్రదాయంలో విడదీయరాని భాగమని , ఆర్ధికాభివృద్ధికి ఈ సంప్రదాయం ఎంతో అవసరమని అదే సమయంలో న్యూఢిల్లీిలో రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘరాం రాజన్ చెప్పారు. ఏకపక్ష అధికారాన్ని సవాల్ చేసే ధోరణిని ప్రోత్సహించాలని అప్పుడు అధికారం అండతో ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్నో, సిద్ధాంతాన్నో ఇతరుల మీద రుద్దే పరిస్ధితి వుండదని రాజన్ చెప్పారు. మహాత్మా గాంధీ మాటలను వుటంకిస్తూ పరస్పర సహనమే పరమ ఔషధం. మన మందరం ఒకే విధంగా ఆలోచించం సత్యాన్ని వివిధ కోణాల్లో చూస్తాం అని రాజన్ అన్నారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ నుంచి ఈ వ్యాఖ్యలను కలో కూడా వూహించని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి రాజన్ ఆర్‌బిఐలో తన పని చూసుకోవాలి గాని తాతయ్య మాదిరి మాట్లాడవద్దని అపహాస్యం చేశాడు. రాజన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధానికి సలహా ఇచ్చారు. ఆర్ధిక అభివృద్ధి గురించి అరచేతిలో వైకుంఠం చూపిన బిజెపి ఈ విషయంలో అది అంత తేలిక కాదని ఏడాది కాలంలోనే అర్ధం కాగానే దీన్ని పక్కదారి పట్టించేందుకు తమ మతోన్మాద ఎజండాను ముందుకు తెచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.
మేధావుల స్పందన తీరు తెన్నులను చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్దం ముందునాటి జర్మనీ, నాజీ పాలకుల పట్ల అక్కడి మేధావివర్గం అనుసరించిన వుపేక్ష లేదా మద్దతు ఇచ్చిన తీరును గుర్తుకు తెస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ పోలికను చూసి అదిరిపడే వారు, మరీ ఎక్కువగా వుందను కొనే వారు దీనితో ఏకీభవించకపోవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్రమోడీని గుడ్డిగా అభిమానించిన వారిలో కొందరైనా ఇప్పుడు ఎందుకు బహిరంగంగా గళం ఎత్తుతున్నారో వారు ఆలోచించటం ప్రారంభించాలి.
ఈ పరిణామాలు ఎంత ఆందోళన కలిగిస్తున్నాయో వాటిపై స్పందించాల్సిన మేధావి వర్గ మౌనం అంతకంటే ఎక్కువ కలవరం పుట్టిస్తోంది. దీని అర్ధం అందరూ మౌనంగా వున్నారని కాదు. గత కొద్ది వారాలుగా వివిధ రంగాలకు చెందిన మేధావులు వందల మంది బహిరంగంగా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వ్లెల్లడిస్తున్నారు. దాని పర్యవసానమే కులుబుర్గి హత్య జరిగిన నెలా 24 రోజుల తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ ఆ దుర్మార్గాన్ని ఖండిరచక తప్పలేదు. సకాలంలో స్పందించని కారణంగా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లయింది. తన పధకానికి ఇటువంటి ఎదురు దెబ్బ తగులుతుందని కాషాయ పరివార్ వూహించి వుండదు. అందుకే ఒకవైపు ఎదురుదాడులు చేస్తూనే మరోవైపు నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టింది. దానిలో భాగమే ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా అకాడమీ ప్రకటన.
మేధావుల స్పందన తీరు తెన్నులను చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్దం ముందునాటి జర్మనీ, నాజీ పాలకుల పట్ల అక్కడి మేధావివర్గం అనుసరించిన వుపేక్ష లేదా మద్దతు ఇచ్చిన తీరును గుర్తుకు తెస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ పోలికను చూసి అదిరిపడే వారు, మరీ ఎక్కువగా వుందను కొనే వారు దీనితో ఏకీభవించకపోవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్రమోడీని గుడ్డిగా అభిమానించిన వారిలో కొందరైనా ఇప్పుడు ఎందుకు బహిరంగంగా గళం ఎత్తుతున్నారో వారు ఆలోచించటం ప్రారంభించాలి. మరింత మంది మరింత స్పష్టంగా ముందుకు రావాలి. నరేంద్రమోడీ చెప్పిన మేకిన్ ఇండియా , న్లల్లధనం వెలికి తీయటం , చాయ్‌పే చర్చ, ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయో తెలియదు. వాటి మంచీ చెడు గురించి చర్చ జరిగితే అదొక తీరు. దానికి బదులు వేరే అంశాలు అజండాకు వస్తున్నాయి. దేశాన్ని మరింత ముందుకు, అంతర్జాతీయంగా ప్రతిష్టను మరింతగా మూటగడతామని కబుర్లు చెప్పిన వారు వెనక్కు నడిపించేందుకు పూనుకున్నారు, ప్రపంచంలో నగుబాట్ల పాలుచేసే పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ బిజెపి నేతగా వున్న మాజీ కేంద్ర మంత్రి, ఆ పార్టీ మేధావులలో ఒకరైన మాజీ జర్నలిస్టు అరుణ్ శౌరి కాంగ్రెస్ విధానాలకు అదనంగా ఆవును చేర్చటం తప్ప మార్పేమీ లేదని నరేంద్రమోడీ సర్కార్‌ను బహిరంగంగా విమర్శ చేసినా ఆయనపై చర్య తీసుకోలేని స్దితిలో బిజెపి వుంది.
ఒకవైపు డిజిటల్ ఇండియా అంటూ ఆధునిక పరిజ్ఞానం గురించి మాట్లాడుతూ మరోవైపు మూఢనమ్మకంతో ఆవుకు పవిత్రతను ఆపాదించి దాని సంరక్షణ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టిన పర్యవసానమే దాద్రి సంఘటన. వూరూ పేరూ లేని ఒక వ్యక్తి చేసిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా న్యూఢిల్లీిలో నరేంద్రమోడీ పోలీసులు (ఢిల్లీి పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటారు) అవు మాంసం పెడుతున్నారంటూ కేరళ భవన్‌పై దాడి చేయటం, దాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమర్ధించటం దేన్ని సూచిస్తోంది. రేపు మన ఇళ్లపై దాడి చేసి సోదాలు చేసినా ఆశ్చర్యం లేదు. లేకపోతే ఒక ముస్లిం కుటుంబం ఆవు మాంసం తిన్నదనే పుకార్లు, ఆరోపణలతో వున్మాదులైన వారు మూకుమ్మడి దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం ఏమిటి? దాన్ని బిజెపి నేతలు సమర్ధించటం ఏమిటి ?ఈ వుదంతం ఆటవిక, మధ్యయుగాలలో జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ దుర్మార్గాన్ని స్దానిక బిజెపి నాయకులు వెనకేసుకురావటాన్ని గల్లీ కుళ్లు రాజకీయం అనుకోవచ్చు. సాక్షాత్తూ ప్రధాని ఈ ఘోరం గురించి పది హేను రోజుల పాటు మౌనం దాల్చటం, నోరు తెరిచిన తరువాత కూడా నిర్ద్వంద్వంగా ఖండిరచకపోవటం, ఆ వుదంతంతో కేంద్రానికి సంబంధం ఏమిటని అడగటమే గాక , ప్రతిపక్షాలపై ఎదురుదాడికి పూనుకున్నారు. పోనీ ఏదో విధంగా కనీసం నోరు విప్పారు అనుకుంటే ఆయన ఆస్ధానంలోని నోటి దురద బృందం రోజురోజుకూ పెరిగి పోతోంది. ప్రధాని ప్రకటన తరువాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ మాట్లాడుతూ ముస్లి లుఈ దేశంలో వుండాలనుకుంటే బీఫ్ తినటం మానుకోవాలని నోరు పారవేసుకున్నాడు. ఢిల్లీి పక్కనే వున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇలా వ్యాఖ్యానించిన తరువాత దేశంలో అసహనపరిస్దితి లేదని ఆర్‌ఎస్‌ఎస్ నమ్మబలుకుతోంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన గత 18నెలలుగా ఇలాంటి నోటి దురద వ్యాఖ్యలు వివిధ అం శాలపై పుంఖాను పుంఖాలుగా వెలువడుతూనే వున్నాయి. బిజెపి నేతల నోటి గురించి కొంతమేరకు తెలిసినా మోడీ అభివృద్ధి మోజులో చౌకబారు రాజకీయాలు లెమ్మని పెద్దగా జనం పట్టించుకోవటంలేదు. కానీ ఇటీవలి కులుబుర్గి, దాద్రి తదనంతర వుదంతాల తరువాత మేధావివర్గం పరిమితంగా అయినా తొలిసారిగా నోరు విప్పక తప్పలేదు. 2013లో మహారాష్ట్ర హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ను మతోన్మాదులు హత్య చేసినప్పటికీ అది ఒక పధకం ప్రకారం జరిపినదిగా భావించలేదు. తరువాత అదే రాష్ట్రంలో రచయిత, న్యాయవాది అయిన గోవింద పన్సారేను హత్య చేశారు. ఆయన ఒక కమ్యూనిస్టు గనుక హత్య చేశారు లెమ్మని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది కన్నడ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్, రచయిత కులుబుర్గి హత్య, అలాంటి మరి కొందరికి బెదిరింపులు రావటం అసహనం, ఒక పధకం ప్రకారం జరుగుతున్నాయన్న అభిప్రాయం కలగటానికి నాంది పలికింది. కులుబుర్గి రచనలు, భావాలను సహించలేని హిందూ తాలిబాన్లు ఆగస్టు 30వ తేదీ వుదయం ఆయనను ఇంటి వద్ద కాల్చిచంపారు. గతంలో ఆయనకు అవార్డును ప్రదానం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ ఈ హత్యను కనీసం ఖండిరచలేదు.దానికి నిరసనగా తొలి రచయితగా వుదయ ప్రకాష్ సెప్టెంబరు నాలుగున తన సాహిత్య అవార్డును వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించి నిరసన తెలిపాడు. అప్పటి నుంచి అక్టోబరు 19వరకు 40 మంది వరకు రచయితలు, రచయిత్రులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఆరు దశాబ్దాల చరిత్రలో ఇటువంటి నిరసన తెలియచేయటం ఇదే ప్రధమం. కులుబుర్గి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కావటం, హత్యను ఖండిరచటానికి సాహిత్య అకాడమీ ముందుకు రాకపోవటంతో కవులు తమ నిరసన గళాన్ని విప్పారు. అకాడమీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. దీంతో బిజెపి పెద్దలు కవుల నోరు మూయించేందుకు సాహిత్య అకాడమీ చేత ఒక ప్రకటన చేయించారు. అయితే ఈ లోగా మిగతా రంగాలలోని మేధావులు కూడా ముందుకు వచ్చారు.
అనుపమ ఖేర్ తప్ప ఇంత వరకు పేరున్న ఏ ఒక్క ఇతర కళాకారుడు లేదా మేధావిగానీ కాషాయ తాలిబాన్ల చర్యను సమర్దించేందుకు ముందుకు రాకపోవటం విశేషం. మేధావులు తామెటో తేల్చుకోవాల్సిన అవసరాన్ని వర్తమాన పరిణామాలు వేగవంతం చేస్తున్నాయి. ఇందుకు మాత్రం పరివార్‌ను అభినందించక తప్పదు.
అనూహ్యమైన ఈ నిరసనలతో పాలకపార్టీలోని నోటిదురద వ్యక్తులు మరింత రెచ్చిపోతున్నారు.రచయితలను విమర్శించే కర్తవ్యాన్ని పుచ్చుకున్న సినీ నటుడు అనుపమ ఖేర్ ఒక్కడే గతంలో అనేక దారుణాలు జరిగినపుడు తమ అవార్డులను తిరిగి ఇవ్వని వారు ఇప్పుడు ఇలా చేయటం రాజకీయ దురుద్ధేశ్యాలతోనే అని ఆ పెద్దమనిషి డైలాగు వదిలాడు. తన భార్య చండీఘర్ బిజెపి ఎంపీ అయినప్పటికీ తాను స్వంత అభిప్రాయాలు వ్లెల్లడిస్తున్నట్లు ఖేర్ నమ్మబలికాడు. డర్టీ పిక్చర్ విద్యాబాలన్ లేదా శ్యామ్ బెనెగల్ అవార్డు తిరిగి ఇవ్వటాన్ని తప్పు పట్టారు తప్ప నిరసగురించి వాఖ్యానించకుండా మౌనం దాల్చారు. రచయిత చేతన్ భగత్ మరో రూపంలో బిజెపికి మద్దతు పలికాడు. నిరసన తెలిపిన రచయితలను అపహాస్యం చేశాడు. ఓ నేనుకూడా అవార్డును వెనక్కి ఇవ్వాలి కదూ, అయితే నాకింకా రాలేదని వ్యాఖ్యానించాడు. అలా చేయటం అకాడమీని, న్యాయమూర్తులకు అవమానం అన్నాడు. అనుపమ ఖేర్ తప్ప ఇంత వరకు పేరున్న ఏ ఒక్క ఇతర కళాకారుడు లేదా మేధావిగానీ కాషాయ తాలిబాన్ల చర్యను సమర్దించేందుకు ముందుకు రాకపోవటం విశేషం. మేధావులు తామెటో తేల్చుకోవాల్సిన అవసరాన్ని వర్తమాన పరిణామాలు వేగవంతం చేస్తున్నాయి. ఇందుకు మాత్రం పరివార్‌ను అభినందించక తప్పదు. తాము అటూ ఇటూ కాదు మధ్యేవాదులం అని అనేక మంది చెబుతుంటారు. గోడమీది పిల్లివాటం, నిజానికి అదొక మసుగు మాత్రమే. ఒక పరీక్షా సమయంలో కూడా తమ వైఖరిని వ్లెడిరచకపోవటం అంటే వారు పరోక్షంగా మతశక్తులను వుపేక్షించటమే అవుతుంది. జర్మనీలో కూడా అనేక మంది ఇదే విధంగా హిట్లర్ హయాంలో తమ వైఖరిని వ్లెడిరచకుండా మౌనంగా వుండటంతో నాజీ శక్తులు అది తమకు మద్దతుగా భావించి రెచ్చిపోయాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అదే జరగబోతోందా ?
సంఘపరివార్ మద్దతు దారులు తాము ఎంతో తెలివిగా ఎదురుదాడి చేస్తున్నామని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి అది ఎంతో పేలవంగా వుంది. వారిని సమర్ధించేవారిని కూడా ఇబ్బందులలోకి నెడుతోందంటే అతిశయోక్తి కాదు. అసహనం, మైనారిటీ మతాలు, శక్తులపై ద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని తప్పు పట్టేవారిది కృత్రిమ నిరసగా ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ ఆరోపించారు. ఇప్పుడు నిరసన తెలుపుతున్న వారు యుపిఏ హయాంలో జరిగిన పరిణామాలపై ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. అదే పెద్ద మనిషి విదేశాలలో దాద్రి ఘటనపై మరో విధంగా మాట్లాడాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదని అనుకుంటుందన్నట్లుగా పరివార్ నేతలు మాట్లాడుతున్నారు. ఒకవైపు దేశంలో అసహన పరిస్ధితులు లేవు, అంతా సజావుగానే వుందంటారు. మరోవైపు ఇప్పుడు నిరసన తెలుపుతున్నవారు గతంలో జరిగిన పరిణామా పట్ల మౌనం ఎందుకు వహించారని అతి తెలివి అడ్డు సవాళ్లు వదుతున్నారు. గతంలో జరిగిన వాటిపై అనుపమ ఖేర్, శ్యామబెనెగల్, విద్యాబాతెలన్ వంటి పరివార్ మేధావులు ఎందుకు నోరు మెదపలేదో చెప్పగరా ? అత్యవసర పరిస్ధితి, సిక్కుల ఊచకోత, యుపిఏ అవినీతి వంటి కొన్ని ఎంపిక చేసిన ఘటనలను మాత్రమే కాషాయ సేనలు ముందుకు తెస్తున్నాయి. బాబ్రీ విధ్వంసం, గుజరాత్ మారణకాండ వంటి వాటిని ఎందుకు ప్రస్తావించటం లేదు ? నిజమే ఏ దుర్మార్గం జరిగినా దానికి స్పందించాల్సిందేననటంలో పంచాయతీ లేదు. ఈ వాదను ముందుకు తెచ్చిన వారికి గతంలో జరిగిన అన్ని ఘోరాలపై స్పందించిన చరిత్ర లేదు. కనుక ఇప్పుడు నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించే నైతిక హక్కు లేదు.
నిజానికి ఇవన్నీ చరిత్ర చెత్తబుట్టలోని వాదనలు. మీ తాత, తండ్రీ ప్రశ్నించని కుల వివక్షను నువ్వెందుకు ముందుకు తెస్తున్నావని గ్రామాలలో భూస్వాములు ముందుకు తెచ్చిన వాదనలివి. అ మాటకు వస్తే అసలు స్వాతంత్య్ర డిమాండ్లు, భూములు పంచమని, రిజర్వేషన్లు ,స్త్రీ,పురుష సమానత్వం వంటి అంశాలను కూడా ఇప్పుడెవరూ డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే మన ముత్తాతలు, వారి ముందు తరాల వారు అడగలేదు కదా?
చేసిన డిమాండ్ లేదా విమర్శ సరైనదో కాదో చెప్పలేక గతంలో ఎందుకు చేయలేదు, చెందలేదు అంటే కుదరదు. కొందరు రచయితులు, రచయితల నిరసనకే తల దిమ్మెక్కిన కాషాయ సేనకు చెందిన వారు అక్టోబరు 18న యుపిలో అఖిల భారత హిందూ మహాసభ పేరుతో అవార్డులు ఇచ్చివేస్తున్న రచయితల బుద్ధినిశుద్ది చేయాలంటూ ఒక యజ్ఞం నిర్వహించారు. రచయితలు దేశ ద్రోహులని నిర్వాహకులు నిందించారు. ‘అసహనం, హింసాత్మక, నేరస్ధ బుద్దులతో నిండి వున్న తమ ఇళ్లను ముందు శుద్ది చేసుకోవాలని తొలుత అవార్డును వెనక్కు ఇచ్చిన హిందీ రచయిత వుదయ ప్రకాష్ వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీిలో రామలీలా వుత్సవం జరుగుతుండగా లైట్లు ఆరిపోగానే రెండున్నర సంవత్సరాల వయస్సుగల బాలికను అపహరించి అత్యాచారం చేశారని, అందువలన ముందు హిందూశక్తులు తమతో వున్నటు వంటి శక్తుల బుద్దిని శుద్ధి చేసుకోవాని ఆయన సలహా ఇచ్చారు.
ఇక అధికారంలోని పెద్దలు రచయితలకు రాజకీయాల రంగు పూసి బెదిరించేందుకు పూనుకున్నారు. అందుకుగాను తొలుత వారు జవహర్‌లాల్ నెహ్రూ మేనకోడలైన నయనతారా సెహగల్‌పై దాడి చేశారు. కాంగ్రెస్ పాలనా కాలంలో అవార్డులు పొందినవారు వాటిని తిరిగి ఇచ్చివేస్తున్నట్లు కాంగ్రెస్ రంగు పులిమేందుకుపూనుకున్నారు. అది కూడా వెలిసి పోయింది. గతంలో ఏబి వాజ్‌పేయి ప్రధానిగా వుండగా అవార్డులు పొందిన వారితో పాటు స్వయంగా నరేంద్రమోడీ ప్రభుత్వ మొదటి ఏడాదిలో అవార్డు పొందిన పంజాబీ రచయిత్రి కూడా వున్నారు.వారు తెలిపిన నిరసన సరైనదా కాదా అన్నదానిని పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడటం నియంతపాలన తీరుతెన్నులను గుర్తుకు తెస్తోంది. కాషాయ పరివారం చేస్తున్న వాదనలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కవులు, కళాకారులు అవార్డులు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే అవార్డును తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన వారు అసలు అవార్డులకు అర్హులా కాదా అన్నది వేరే విషయం అంటూ వచ్చిన అవార్డులను తిరిగి ఇవ్వకండని శ్యామ్‌బెనెగల్ వ్యాఖ్యానించారు. అంటే బిజెపి సర్కార్ హయాంలో ఇచ్చే అవార్డును తిరస్కరించటమంటే బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు, తీసుకుంటే బిజెపికి భజన చేసినందుకు అవార్డు వచ్చినట్లు జనం అనుకొనే ప్రమాదం వుంది.
దాద్రి గ్రామంలో బక్రీద్ సందర్బంగా ఒక ముస్లిం కుటుంబం ఆవును వధించి తిన్నదని ప్రచారం చేసి కుటుంబ యజమానిని బలిగొన్నారు. తీరా వారు తిన్నది ఆవు మాంసం కాదని తేలింది.ఈ దుర్మార్గాన్ని ఖండిరచాలని అనేక వర్గాల నుంచి వచ్చిన డిమాండ్‌ను ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. వత్తిడి పెరగటంతో విచారకరం అన్నారు. అది కూడా ప్రతిపక్షాల మతతత్వం కారణంగానే జరిగిందని ఎదురుదాడి చేశారు. దాద్రిలో అమాయకులను అరెస్టు చేశారని బిజెపి వారు ఖండిరచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గొడ్డు మాంసం తినాలనుకుంటే ముస్లిరలు ఈ దేశంలో వుండకూడదని వ్యాఖ్యానించిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ తరువాత తన వ్యాఖ్యను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ దానిలో నిజాయితీ లేదు. సాక్షి మహరాజ్ అనే పెద్ద మనిషి ఆవును వధించిన వారికి వురివేయాలన్నాడు. ఇలాంటి వారందరికీ స్ఫూర్తినిచ్చే సంఘపరివార్ పత్రిక పాంచజన్యంలో గోహత్యకు పాల్పడిన వారిని చంపివేయాలని వేదాలు ఆదేశించాయని, ఇది మనకు జీవన్మరణ సమస్యగా వుందని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ధోరణి చూసిన తరువాత తమకు రాజకీయంగా నష్టదాయకం అని భయపడిన పంజాబ్ అకాలీదళ్ దాద్రి వుదంతం జాతికే సిగ్గుచేటని ప్రకటించింది. మోడీని సమర్దించే పత్రికా వ్యాఖ్యాతలు కొందరు ఈ దేశాన్ని పరిపాలిస్తోంది వేదాలా లేక రాజ్యాంగమా అని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన తరువాత బీహార్ ఎన్నికలతో పాటు మోడీ ప్రతిష్టకు ముప్పుతెచ్చేవిగా వున్నట్లు గ్రహించిన బిజెపి పెద్దలు అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పిలిపించి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వారా మందలింప చేయించిందని, నరేంద్రమోడీకి కూడా ఆగ్రహం వచ్చిందని మీడియాలో కధలు రాయించారు. పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికల్లో రాసినదానితో తమకు సంబంధం లేదని అవి తమ అధికారిక వ్యాఖ్యాతలు కావని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. ఇదంతా జరిగిన నష్టాన్ని పరిమితం చేసేందుకు చేస్తున్న యత్నం తప్ప మరొకటి కాదు. గతంలో అనేక వుదంతాలలో ప్రతికూల ప్రతిస్పందనలు రాగానే వాటితో తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించుకుంది.వాటిలో చివరకు ఎంఎస్ గోల్వ్కార్ 1939లో రాసిన ‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్‌డ్ ’ అనే పుస్తకంలోని వ్యాఖ్యలు పరిణితి చెందిన గూరూజీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ ప్రాతినిధ్యం వహించేవి కావని తొలిసారిగా 2006లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. ఇంత జరిగాక ఇప్పుడు రాంచీ సమావేశం సందర్బంగా దాని నాయకులు మాట్లాడిన తీరు చూస్తే ఎదురుదాడికే సిద్దం అవుతున్నారని భావించాలి.
జర్మన్ జాతీయవాదం పేరుతో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ ముందుకు తెచ్చిన ప్రమాదకర భావాలను ఖండిరచటంలో నాటి జర్మనీ మేధావివర్గం తగిన విధంగా స్పందించలేదు. అనేక మంది హిట్లర్‌ను ఏదో ఒకసాకుతో సమర్దించారు.అటు వంటి ధోరణులు మన దేశంలో కనిపిస్తున్నాయి.అయితే గతంలో నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చిన వారంతా ఆయనతో శాశ ్వతంగా ముడివేసుకుతిరుగుతారని చెప్పలేము. అనేక మందిలో ప్రస్తుతానికి అది పరిమితమే అయినప్పటికీ పునరాలోచన ప్రారంభమైంది. అలాంటి ఒక మేధావి నరేంద్రమోడీకి రాసిన ఒక లేఖలోని అంశాలు ఎంతో ఆలోచనాత్మకంగా వున్నాయి.
ఒక మాజీ మద్దతుదారు భవానీ మెహరోత్రా నుంచి నరేంద్రమోడీకి లేఖ
అక్టోబరు 16,2015
ప్రియమైన మోడీ గారికి,
వ్యక్తిగతంగా పశ్చాత్తాపరహితము మరియు పరిమితం అయినప్పటికీ విచారణ లేకుండా వధించిన దాద్రీ ఘటన దురదృష్టకరము, అవాంఛనీయం అని బీహార్ రాష్ట్ర ససారామ్‌లో ఎన్నికల సభ సందర్బంగా మతసామరస్యాన్ని సొమ్ము చేసుకొనేందుకు అయినప్పటికీ మీరు మాట్లాడినందుకు నాకు సంతోషంగా వుంది. రాష్ట్రపతి సుటంకిస్తూ ఇంతకు ముందు ఒకసారి నవడాలో భాష్యం మాత్రమే చెప్పినప్పటికీ (మీరు పరిమితమైన క్లుప్త పదాలు మరియు శుభాకాంక్షలను వుటంకించటం మాకు తెలుసు) కొంత మేరకు సమ్మతించినందుకు ఇప్పటికీ నేను సంతోషిస్తున్నాను. అయినప్పటికీ ఒక విషయాన్ని సంబాళించటలో ఘోరంగా విఫలమయ్యారు.(నత్తనడక నడుస్తున్న ఆర్ధిక వ్యవస్ధ మరియు దాన్నుంచి వుద్భవించే సంబంధ విషయాలను వదిలేద్దాం) అవేమంటే బిజెపి కుటుంబ దళాన్ని అంటి పెట్టుకొని వుండే జలతారు అంచుల వంటి శక్తులు ముందుకు తెచ్చినవి. విచారకరంగా మీ ‘సుపరిపాలన’కింద తామే ప్రధాన స్రవంతిగా అవి స్వయంగా నిర్దారించుకుంటున్నాయి.అంతకంటే విచారకరమైనదేమంటే ‘మీ ఆధ్వర్యంలో’ కూడా అవే ప్రధానంగా వున్నాయి. మీ స్వంత ఎంపీలు, మంత్రులే కేకు మీది ఐస్‌క్రీమ్ మాదిరిగా వున్నారు. తొలుత వారికి నోటి తుత్తర(తీట) వ్యాధి అనుకున్నాను, తీరా చూస్తే ఒక పెద్ద పధకంలో భాగంగానే వారి వంతు వ్యాఖ్యల సందేశాలని రుజువు అవుతోంది. ప్రతి ఒక్క సందేశం ఒక నిర్దిష్ట ప్రేక్షకులకు వుద్దేశించిందని, వారికి తగిన భాష,గ్రామ్యోక్తులు, జాతీయాలు అని అర్ధం అవుతోంది.వారంతా ప్రమాదకరమైన అక్కరకు రాని కాషాయ జబ్బుతో వున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఐఎస్‌ఐస్‌కు జన్మనిచ్చిన తాలిబాన్లు మరియు అలాంటి వారికి పట్టుకున్నది. హిందువులు తమంతట తాము సంఘటితం కావాలని పిలుపునిచ్చిన యోగి అవైధ్యనాధ్ వ్యాఖ్య లేదా సాధ్వి నిరంజన్ జ్యోతి వర్ణించిన రంజాదా(రామ సంతానం) మరియు హరాంజాదా(అక్రమ సంతానం) ఎవరు కావాలో త్చేుకోమన్న అసమాన పోలిక లేదా ప్రభుత్వం ఒక రామభక్తుడిదని నితిన్ గడ్కరీ గుర్తు చేయటంగానీ అన్నింటినీ చూస్తే అత్యంత హాస్యాస్పదమైన వాటి మీద పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.
భారత్ కాదు హిందూత్వ ముందు అని మీ అర్ధమా ? పెద్ద మొత్తం డబ్బుతో మీరు నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో నేనెంతో అబ్బురపడినందుకు నేను విచార పడుతున్నాను( మీరు ఎంతో అద్బుతంగా నిర్వహించిన వాటిలో ఒకటి ఇది) దాని గురించి కొద్దిగా కూడా చదవలేదు. అది నా వైఫల్యం తప్ప మీది కాదు. నేను వివేకంతో ఓటు వేసి వుంటే ఈ రోజు మహమ్మద్ అఖ్లక్ మరణం సంభవించి వుండేది కాదు. మొదటి పద పరికరమే రెండవదని, రెండు పదాలకు తేడా తెలుసు కోకుండా ‘కనిష్ట ప్రభుత్వం మరియు గరిష్ట పాలన’ అని ప్రతి ధ్వనించిన నినాదంతో నేను మోసపోయాను. ఒక పరికరాన్ని ఎలా వుపయోగిస్తారో చెప్పకుండా వుండటంలో మీరు ఎంతో ప్రతిభావంతులని తెలియక నేను పడిపోయాను. ఎన్నికల ప్రణాళికలో మీరు ‘జవాబుదారీ ప్రభుత్వం’ గురించి ప్రస్తావించినపుడు నేను దానిని అర్ధం చేసుకోలేకపోయాను. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకే ప్రభుత్వం జవాబుదారీ అన్నది అసలైన అర్ధమని మీరు భావిస్తున్నారా ? స్వచ్ఛ భారత్ అన్నా కూడా బహిరంగ ప్రకటనలకు స్వేచ్ఛ లేకపోవటమని, నర్మగర్బంగా మీడియా నోరు నొక్కటం, అన్ని రకాల మైనారిటీ గళాన్ని లేకుండా చేయటం అన్న అర్ధం గలదని కూడా నేను ఎన్నడూ ఆలోచించలేదు. అదే వున్నతమైనదని మీ అర్ధం అని కూడా నాకు తెలియదు.
మార్పు కోసమే ఓటు వేశానని నేను ఆలోచించాను. ఆ మార్పు చెడును మరింత దిగజారుస్తుందని నాకు తెలియదు. మీ శాఖలు తప్పుడు సమాచారాన్ని ఆధారం చేసుకొని మత వుద్రిక్తతలను రెచ్చగొట్టగలవని వాటిని నిరోధించేందుకు మీరేమీ చేయలేదని నాకు తెలియదు. మీకు, మీ తైనాతీలకు భారత్‌లో బీఫ్ (గొడ్డు మాంసం) అంటే ఆవు ఒక్కటే కాదు దానితో దున్నలు(గేదెలు కూడా) కూడా వుంటాయని తెలియదు.మీరు ఎన్నడూ దీనిని వెలుగులోకి తేలేదు. గోప్యంగా వుంచారు.అంతే కాదు మీ స్వంత రాష్ట్రం గుజరాత్ మీరు ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న సమయంలో కబేళాలు ఎక్కువగా వున్న అగ్రశ్రేణి పది రాష్ట్రాలలో ఒకటని (ఫిక్కి సమాచారం) తెలిసి కూడా తెలియనట్లుగా వున్నారు.
దురదృష్టం కొద్దీ దీనికి మొత్తంగా మీరే బాధ్యులని నేను విమర్శించలేను. మీ ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర నాకు ఎ్లలవేళలా తెలుసు. నాకు బాబరీ మసీదు, నాకు గోద్రా గురించి కూడా తెలుసు.నేను వాటి గురించి అవసరమైన మేరకు చదివాను.
మీరు అధికారంలోకి వస్తే నవరాత్రి సందర్బంగా ఆవు పంచకం నా మీద చ్లలుతారని వుపజాగ్రదావస్తలో కూడా నాకు తెలుసు. అయితే మిలియన్ల జనం మాదిరి నేను కూడా మీ అభివృద్ది తీరు చూసి అన్ని విధాలుగా మురిసిపోయా మరియు అందుకు చెల్లించిన మూల్యాన్ని విస్మరించాను. మీ మత అంతర్గత గుణాన్ని గుర్తించకుండా నేపాల్‌లోని పశుపతినాధ్ ఆయానికి మీ రెండున్నరవేల కిలోల గంధపు చెక్క, 25కోట్ల రూపాయలు విరాళం, అయోధ్యలో రాముడి మ్యూజియం గురించి నేనూ ఓలలాడాను. దాద్రీ వుదంతం జరిగేంత వరకు అంతా మంచిగానే వుంది. మీరు కపటంతో నన్ను వశం చేసుకున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను.మోడీ గారూ మీ జిత్తులకు మిమ్మల్ని తప్పు పట్టాలి, అయితే వాటి గురించి నమ్మబలికి నందుకు నేను కూడా అపరాధినే.
విధేయతతో
మీ కుహనా వాక్పటిమకు లొంగిపోయి హానిచేసిన ఒక పౌరుడు
భవానీ మెహరోత్రా
(ఈ రచయిత న్యూఢిల్లీిలో రాజకీయ మరియు విధానపర అంశాల పరిశోధకుడు)