• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: RSS game

శబరిమల తీర్పు 3 : ప్రజాకర్షక నినాదాలతో భారతీయ మితవాదం !

10 Wednesday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Far right populism in India, RSS, RSS game, sabarimala verdict

Image result for Far right  in india cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో పచ్చి మితవాద శక్తులు చెలరేగిపోవటం ఒకవైపు వాటి భావాజాలానికి విరుద్దంగా కొన్ని పురోగామి తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించటం ఒక చిత్రమైన స్ధితి. అధికారంలో వున్న బిజెపి కొన్ని తీర్పుల మీద ఎలాంటి వైఖరులను వెల్లడించటం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి శబరిమల వివాదంలో మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళలపై ఆంక్షలను కొనసాగించాలన్న న్యాయమూర్తి తీర్పును సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. దానికి వ్యక్తిగత అభిప్రాయమనే షరతు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగాó నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు అడిగారు? బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ఒకవైపు సదరు న్యాయమూర్తి తీర్పుతో ఏకీభవిస్తూ, మెజారిటీ బెంచ్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన తరువాత ఆమెనుంచి అంతకు మించి ఎవరైనా ఎలా ఆశించగలరు?

ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. వామపక్షాలు మాత్రమే తమ సూత్రబద్దమైన వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు పురోగామి శక్తుల కంటే ప్రజాకర్షక నినాదాలతో తిరోగామి భావజాలానిదే పైచేయిగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దానికి గురయ్యేవారిలో పురుషులతో పాటు మహిళలూ వుంటారు. ఐరోపాలోని అనేక దేశాలలో నయా నాజీలు, ఫాసిస్టులు పెరుగుతున్నారు. మన దేశంలో ఈ భావజాలంతో పనిచేస్తున్న శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేశాయి. మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి. నాజీలు యూదువ్యతిరేకతను రెచ్చగొట్టి ఐరోపాలో మారణహోమం సృష్టిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారు. మన దేశంలో ముస్లింలతో పాటు క్రైస్తవ వ్యతిరేకతను కూడా జోడించారు. ఎందుకిలా జరుగుతోంది. సమగ్రంగా చర్చ, పరిశోధన జరగాల్సి వుంది. ప్రజాకర్షక నినాదాలంటే సంక్షేమ కార్యక్రమాలే కానవసరం లేదు.అసోం, త్రిపురల నుంచి బంగ్లాదేశీయులను ఒకవైపు వెళ్లగొట్టాలంటున్న బిజెపి మరో వైపు గుజరాత్‌లో వుత్తరాది రాష్ట్రాల వారిని వెళ్లగొడుతుంటే అచేతనంగా వుంది.

వస్తు వ్యాపారం చేసే ఒక సాధారణ వ్యాపారి కంటే డబ్బుతో వ్యాపారం చేసే ఒక వడ్డీ వ్యాపారిని చూస్తే సామాన్యులు ఎక్కువగా భయపడతారు. పెట్టుబడిదారీ వ్యవస్దలో సంభవిస్తున్న సంక్షోభాలను అధిగమించటానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే రెండోవైపు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదం తీవ్రంగా నిమగ్నమైంది. మొదటి అంశంలో భాగంగా నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చింది, రెండవ అంశంలో సోషలిస్టు వ్యవస్ద నిర్మాణంలో జరిగిన లోపాలను ఆసరా చేసుకొని, కుట్రలు చేసి ప్రధమ సోషలిస్టు రాజ్యాన్ని, దాని సాయంతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలను కూల్చివేయటంలో జయప్రదమయ్యారు. సాధారణ వడ్డీ వ్యాపారి స్ధానంలో పట్టణాలలో గూండా వడ్డీవ్యాపారుల మాదిరి నయావుదారవాదం కార్మికవర్గం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. దాని దెబ్బకు వుదారవాద ముసుగులు వేసుకున్న సోషలిస్టు, లేబర్‌ పార్టీల వంటివి జనం మీద భారాలు మోపటంలో మితవాదుల కంటే తక్కువేమీ కాదని ఈ కాలంలో రుజువు చేసుకున్నాయి. సాంప్రదాయ పార్టీల మీద జనానికి విశ్వాసం పోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధలో అంతరాలు పెరగటంతో పాటు నయావుదారవాద విధానాలు ఎంత వేగంగా పెట్టుబడిదారుల సంపదలను పెంచుతాయో సంక్షోభాలను కూడా అంతేవేగంగా ముందుకు తెస్తాయని తేలిపోయింది. సోషలిస్టు వ్యవస్ధలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ విధానమే అంటూ చూపిన రంగుల కలలు పాతికేండ్లలో కల్లలయ్యాయి. సోషలిజం, కమ్యూనిజాల మీద చేసిన తప్పుడు ప్రచారం, వాటికి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలను చూసిన తరువాత జనానికి తాత్కాలికంగా అయినా ఎటుపోవాలో తెలియని స్ధితి మితవాద శక్తుల పెరుగుదలకు అనువుగా తయారైందని చెప్పవచ్చు. అవి అనేక చోట్ల జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి.అసంతృప్తి, ప్రత్యామ్నాయం గురించి అవగాహనలేని, విశ్వాసంలేని యువత ఇటువంటి శక్తుల వెనుక చేరటం గతంలో కూడా జరిగింది. ఈ స్ధితి ఎంతోకాలం వుండదని గత చరిత్ర రుజువు చేసింది.

పచ్చి మిత, తీవ్రవాద భావాలను రాజీకీయాలు, సమాజంలో మరింతగా వ్యాప్తి, అమలు చేసే క్రమంలో వాటిని అందంగా, మహిళీకరణ(ఫెమినైజ్‌కు ఈ పదం దగ్గరగా వుంటుందని ప్రయోగించాను, అంతకంటే మెరుగు, అర్ధవంతమైన పదాన్ని సూచిస్తే స్వీకరిస్తాను) చేయటం కనిపిస్తోంది. మరోసారి యూదులను చూపి ద్వేషం రెచ్చగొట్టే పరిస్ధితులు పునరావృతం అవుతాయా ? ఇప్పటికైతే అలాంటి సూచనలు లేవు. దాని స్ధానంలో ముస్లింలపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టటం, కొంత మేరకు జనాన్ని తప్పుదారి పట్టించగలిగినట్లు చెప్పవచ్చు. ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోవచ్చుగాని వుగ్రవాదులందరూ ముస్లింలే అనే ఒక ప్రమాదకరవాదన రూపంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫ్రెంచి మితవాద రాజకీయ వారసత్వ క్రమంలో మూడవతరానికి చెందిన యువతి మరియం మార్చల్‌ లీపెన్‌. ఆమె తన తాత మారీ లీపెన్‌, పిన్ని మారినే లీపెన్‌ బాటలో ముందుకు వచ్చింది.తాత కంటే పిన్ని ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించింది. ఇరవై మూడు సంవత్సరాలకే పార్లమెంట్‌కు ఎన్నికైన మరియం లీపెన్‌ పుట్టినప్పటి నుంచి మితవాద భావాల వుగ్గుపాలతో పెరిగా నంటూ తన భావాలను మరింత స్పష్టంగా చెబుతోంది. జాతీయవాదం కూడా నాజీజమే. మీరు కనుక జాతీయ ప్రయోజనాలను సమర్ధిస్తే వేదనామయ క్రమాన్ని ప్రారంభించినట్లే, అది యుద్దము, ప్రళయానికి దారి తీస్తుందని అంటోందా అమ్మడు.28ఏండ్ల మార్చెల్‌ లీపెన్‌ పచ్చి ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను మనం అంతమొందించాలి లేదా అదే మనల్ని పదే పదే చంపుతుంది అని విద్వేషాన్ని వెళ్లగక్కారు. నేషనల్‌ పార్టీలో వున్న వారికి ఈమె ప్రతిరూపం. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రస్తుతం నేషనల్‌ ర్యాలీ పార్టీ నేతగా మారీ లీపెన్‌ పని చేస్తున్నారు. తండ్రి నాయకత్వస్ధానాన్ని ఆమె అందుకున్నారు. ఐరోపా రాజకీయాలలో ఇలాంటి వారసత్వ ధోరణులు ఇటీవలి వరకు లేవు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈమె తొలి రౌండులో 21.3శాతం ఓట్లు తెచ్చుకొని అంతిమపోటీలో 33.9శాతం తెచ్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Image result for Far right  in india cartoons

బ్రిటన్‌లో రంగంలోకి వచ్చిన మరొక ముస్లిం వ్యతిరేక సంస్ధ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ(యుకెఐపి). ఇది ఐరోపాయూనియన్‌లో బ్రిటన్‌ చేరటాన్ని, వలస కార్మికుల, ముస్లిం వ్యతిరేకపార్టీ. పురుటి సమయంలో ఇచ్చే వేతనాలకు, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించేందుకు ఇది వ్యతిరేకం. దీని వత్తిడి కారణంగానే 2016లో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా లేదా అన్న ప్రజాభిప్రాయ సేకరణ జరపటం, వైదొలగాలని తీర్పు రావటం తెలిసిందే. వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తున్న కారణంగా బ్రిటన్‌ కార్మికవర్గం గణనీయ భాగానికి దీనిపట్ల సానుకూల అభిప్రాయం వుందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఇదే మూడవ పెద్ద పార్టీ. స్ధానికంగా వున్నవారి కంటే వలస వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే అభిప్రాయం యువతలో పెరుగుతున్నది.

అబార్షన్లను వ్యతిరేకించటంతో సహా మహిళపట్ల అనేక తిరోగమన ధోరణులు కలిగిన జిమ్‌ డౌసన్‌ బ్రిటన్‌లో కంటికి కనిపించని పెద్ద మితవాది అని టైమ్స్‌ పత్రిక వర్ణించింది. ఇలాంటి నీచులైన మగవారందరూ ఇస్లాం నుంచి మహిళలను రక్షించేవారుగా తమకు తామే ముందుకు వస్తున్నారని డేనియల్‌ ట్రిల్లింగ్‌ అనే రచయిత ‘క్రూరమైన నీచులు: బ్రిటన్‌లో పచ్చి మితవాదుల పెరుగుదల’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా వుండే భావజాలాల పట్ల ఆసక్తిని రేకెత్తించటంలో ఇంటర్నెట్‌ కూడా కూడా దోహదం చేస్తోందని, పచ్చి మిత వాద వైఖరులకు యువతగురి అవుతోందని కూడా పేర్కొన్నారు. కుహనా వార్తల యుగంలో అసంఖ్యాక వనరులు ఈ భావాలకు ఆసరా అవుతున్నాయి ప్రత్యేకించి ఈ మితవాదులలో అనేక మంది ప్రధాన స్రవంతి మీడియాను నమ్మటం లేదని ట్రిల్లంగ్‌ పేర్కొన్నారు.

జర్మనీలో ఇటీవల వునికిలోకి వచ్చి గత ఏడాది ఎన్నికలలో 709 స్ధానాలున్న పార్లమెంటులో 94సీట్లతో మూడవ పెద్ద పార్టీగా ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఎఎఫ్‌డి) అవతరించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత 39 సంవత్సరాల ఎలిస్‌ ఎలిజబెత్‌. ఈ పార్టీ ముస్లిం, వలస కార్మికులకు వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలని చెబుతుంది.దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకొనేందుకు అవసరమైతే మారణాయుధాలను వుపయోగించమని అంటోంది. నాజీల అత్యాచారాలను గుర్తు చేసుకోవటం ఆపివేయాలని, వాటి గురించి తక్కువ మాట్లాడాలని కోరుతోంది.

నార్వేలో అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలోని ప్రోగ్రెస్‌ పార్టీ మితవాది. దేశాన్నీ ముస్లిమీకరణ చేస్తున్నారని, పోలీసు యూనిఫాంలో హిజబ్‌ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ఈమె ఇజ్రాయెల్‌ను పచ్చిగా సమర్ధిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇలా అనేక దేశాలలో వున్న ఇలాంటి మహిళల ద్వేషపూరిత వైఖరి, మాటలకు మన దేశంలో సాధ్వుల మని చెప్పుకుంటూ నోరుపారవేసుకొనే వారికి పెద్ద తేడా లేదు. మచ్చుకు ఢిల్లీని పాలించేందుకు రాముడి అంశలో పుట్టిన వారు కావాలో లంజలకు పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని సాధ్వి నిరంజన జ్యోతి గత ఎన్నికలలో ప్రసంగాలు చేసిన విషయం తెలిసినదే.ఈమె నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యోగులుగా చెప్పుకొనేవారి గురించి చెప్పనే అవసరం లేదు. చిత్రం ఏమిటంటే వీరందరూ బిజెపి మద్దతుదారులు, నేతలే కావటం విశేషం. ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి మరి.

మన దేశంలో పచ్చి మితవాద శక్తులతో నిండిన ఆర్‌ఎస్‌ఎస్‌, అది ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు అనేక సందర్భాలలో తమ తిరోగామి భావాలను ఎలాంటి శషభిషలు లేకుండా వెల్లడిస్తూనే వున్నారు. అయినా అనేక మంది విద్యావంతులైన మహిళలు ఇలాంటి శక్తులను అనుసరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు ప్రవేశం లేదనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు లేదో చెప్పరు. 2013 జనవరి ఆరున పిటిఐ ఒక వార్తను అందించింది.ఇండోర్‌ పట్టణంలో జరిగిన ఒక సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన వుపన్యాసంలోని అంశాలు ఇలా వున్నాయి.’ భర్త మరియు భార్య మధ్య ఒక ఒప్పందం వుంటుంది. దాని ప్రకారం నువ్వు నా ఇంటిని జాగ్రత్తగా చూడు, నేను నీ అవసరాలన్నింటినీ తీరుస్తాను, నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త చెబుతాడు. కాబట్టి భార్య ఒప్పందానికి అనుగుణ్యంగా వున్నంత వరకు భర్త కాంట్రాక్టు నిబంధనలను అనుసరిస్తాడు, భార్యతో వుంటాడు. భార్య ఒప్పందాన్ని వుల్లంఘిస్తే అతను ఆమెను వదిలించుకోవచ్చు ‘. ఈ వుపన్యాసం గురించి సిపిఎం నాయకురాలు బృందాకరత్‌ స్పందిస్తూ ‘ఇలా మాట్లాడటం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు అంతిమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఇదే. అందుకే దీనిని రాష్ట్రీయ తిరోగమన సంఘ్‌ అని నేనంటాను. అధికారంలో వున్న బిజెపి పెద్దలు మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆయనిలాంటి భాషలో మాట్లాడారంటే తన భావజాలాన్ని ప్రతిబింబించినట్లే ‘ అన్నారు.

అంతకు ముందు అసోంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ పశ్చిమ దేశాల ప్రభావం కారణంగా ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే మానభంగాలు జరుగుతున్నాయి, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరగవు అని ఇదే భగవత్‌ గారు సెలవిచ్చారని కూడా పిటిఐ వార్తలో పేర్కొన్నది.’దేశ పట్టణ ప్రాంతాలలో మహిళలపై నేరాలు జరగటం సిగ్గు చేటు, ఇది ప్రమాదకర ధోరణి. అయిటే అటువంటి నేరాలు ‘భారత్‌ లేదా దేశ గ్రామీణ ప్రాంతాలలో జరగవు. మీరు గ్రామీణ ప్రాంతాలు లేదా అడవులకు వెళ్లండి అక్కడ సామూహిక మానభంగాలు లేదా లైంగిక పరమైన నేరాలు వుండవు. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో భారత్‌ ఎప్పుడు ఇండియాగా మారిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారు. సమాజంలోని ప్రతి దొంతరలో నిజమైన భారతీయ విలువలు మరియు సంస్కృతిని చొప్పించాలి, అక్కడ మహిళను తల్లిగా చూస్తారు’ అన్నారు. భగవత్‌కు భారత్‌ గురించిగానీ ఇండియా గురించీ తెలియదు, ప్రభుత్వ లెక్కల ప్ర కారం గరిష్టంగా జరుగుతున్న అత్యాచారాలు పేదలు, దళితులు, గిరిజనుల మీదే అని బృందాకరత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాపితంగా సామాజిక మీడియాలో మితవాద శక్తులు పెరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా వంటి చోట్ల మితవాదానికి శ్వేతజాతి జాతీయవాదం తోడవుతున్నది. మన దేశంలో హిందూత్వ జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీనికి కులదురహంకారం, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాల పట్ల ద్వేషం తోడవుతున్నదని ఇటీవల జరిగిన ప్రణయ్‌ హత్యతో సహా అనేక వుదంతాలు వెల్లడించాయి. అనేక మంది యువతులు ఫేస్‌బుక్‌లో వీడియోలను పెట్టి తిరోగమన భావాలను వెల్లడించటం కొత్త పరిణామం. సమాజంలోని వున్నత తరగతులకు చెందిన మహిళలు పచ్చి మితవాద శక్తులు, వారు జరిపే ఆందోళనలవైపు మొగ్గటం గతంలో కూడా వున్నది ఇటీవలి కాలంలో పెరగటం గమనించాల్సిన అంశం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు పచ్చిమితవాదులను మహిళా రక్షకులుగా అంగీకరించటం తప్ప ఇది వేరు కాదు. తమను యాజమాన్యాలకు అమ్మివేసే తొత్తులను కార్మికులు నమ్మినాయకత్వ స్ధానాలలో కూర్చో పెట్టటాన్ని చూస్తున్నాం. అలాంటిదే ఇది, గుండెలు బాదుకొని ఆందోళన చెందినందువలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇప్తార్‌ విందు: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మవంచన

01 Friday Jul 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

BJP, iftar party, mrm, Narendra Modi, RMM, RSS, RSS Double game, RSS Duplicity, RSS game, RSS-BJP

సత్య

     పాపం ఆర్‌ఎస్‌ఎస్‌ ! తన కార్యక్రమాన్ని తానే బహిరంగంగా సమర్ధించుకోలేక భయపడుతోంది. ఒకనాడు తాము చేసిన విమర్శలు లేదా ఆరోపణలే మరోరోజు తమను రచ్చకీడుస్తాయని బహుశా ఆలోచించి వుండదు. పక్షం రోజుల క్రితం తన మైనారిటీ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్‌(ఆర్‌ఎంఎం) ద్వారా జూలై రెండున మన దేశంలోని ఇస్లామిక్‌ దేశాల రాయబారులతో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులను, ఇతరప్రముఖులను ఆహ్వానించి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రధాన స్రవంతి మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ స్వభావం, మైనారిటీ సంతుష్టీకరణ గురించి పెద్దగా చర్చ జరగలేదుగానీ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలే నడుములు విరిగి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని అనుకున్నదో ఏమో తొలిసారిగా ఇప్తార్‌ విందు ఇవ్వకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్‌ వదలి వేసిన ఇప్తార్‌ విందులను ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి ప్రారంభించిందనే రీతిలో వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా మెజారిటీ హిందువులలో పలుచనవుతామని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, యుపి తదితర రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో హిందువులలో దాని ప్రభావం ఎలా వుంటుందో అన్న గుంజాటన, జూన్‌ 25న కాశ్మీర్‌లో పాక్‌ వుగ్రవాదుల దాడి వంటి వుదంతాలతో పాక్‌ రాయబారిని ఆహ్వానించి ఇప్తార్‌ విందు ఇవ్వటం నష్టదాయకమని పునరాలోచించి అబ్బే అసలు మేము అలాంటి కార్యక్రమమే తలపెట్టలేదంటూ పక్షం రోజుల తరువాత జూన్‌ 30న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. వేరే సంస్ధ పెట్టుకున్న కార్యక్రమాన్ని తాము ఎందుకు వ్యతిరేకించాలని ఎదురు ప్రశ్నించింది.

     మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకొనేందుకు మైనారిటీ వ్యతిరేకతను పురికొల్పటం దాని పధకాలలో ఒకటి. బిజెపి , దాని పూర్వ రూపమైన జనసంఘం తప్ప కాంగ్రెస్‌, వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్నాయని పదేపదే ప్రచారం చేసి కొంత మేరకు విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో జయప్రదమైంది. ఇప్తార్‌ విందులు ఇవ్వటం, పర్యటనల సందర్భంగా మతపరమైన కేంద్రాలను సందర్శించటం వంటి చర్యలను అది తప్పుపట్టింది. ఓట్ల కోసం వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తాను రాజకీయంగా బలహీనపడినట్లు పసిగట్టిన ఇందిరా గాంధీ ఇలాంటి కార్యక్రమాలకు తొలిసారిగా పెద్ద ఎత్తున తెరతీశారు. తరువాత కాలంలో ఇతర పార్టీలు కూడా ఒక్క మైనారిటీలే కాదు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు పోటీగా మెజారిటీ ఓట్లను పోగొట్టుకోకుండా వుండేందుకు కూడా ప్రయత్నించాయన్నదానిలో రెండవ మాట లేదు. దేవాలయాల భూములను ఇతర మతాల పేదలైన కౌలుదార్లు సాగు చేయకూడదని, ఎవరైనా వుంటే వైదొలగాలని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, హాజ్‌ యాత్రలకు ఇచ్చే రాయితీలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వంటి క్షేత్రాల సందర్శనకు రాయితీలు ఇస్తామని ప్రకటించటాన్ని ఏమనాలి ? కాంగ్రెస్‌ బాబరీ మసీదు తాళాలను తీయటం, షాబానో కేసులో సవరణలు, బాబరీ మసీదును కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోవటం వంటి వన్నీ వాటిలో భాగమే. అందుకే కుహనా లౌకికవాదులంటూ సైద్దాంతిక దాడి చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి అవకాశాలు దొరికాయి.

  అంతర్జాతీయంగా నరేంద్రమోడీపై వున్న మైనారిటీ వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలని సంఘపరివార్‌ ఆలోచిస్తున్నది. మిగతా పార్టీలు ఓట్లకోసమే మైనారిటీ పధకాలను ప్రకటిస్తే తాము ఓట్ల దృష్టితో గాక మైనారిటీల సంక్షేమం కోసమే పధకాలను ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నామని, అందుకోసం గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశాం చూడమంటూ ప్రచారానికి దిగింది. అసోం వంటి చోట్ల మైనారిటీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎల్లకాలం సాగదు కనుక గణనీయ సంఖ్యలో వున్న మైనారిటీలను ‘సంతృప్తి పరచటం లేదా సంతుష్టీకరణ’ చేయటం ద్వారా వారిని పక్కా వ్యతిరేకులుగా మారకుండా చూసుకొనేందుకు పూనుకుంది. అనేక మంది ప్రముఖులు ఇప్తార్‌ విందులకు హజరు అవుతున్నారు. కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ పాల్గొన్న ఒక చిత్రం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

    మన దేశంలో ముస్లిం పాలనకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర వుంది. వారి ప్రవేశం నుంచి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందులు ప్రారంభమయ్యాయి. మహమ్మద్‌ ప్రవక్త తన వుపవాసాన్ని మూడు ఖర్జూరాలు తిని ముగించేవారట. అయితే ప్రస్తుతం ఇప్తార్‌ విందులు ఖర్జూరాలకే పరిమితం కాలేదు, ఆయా దేశాలలో వున్న ఆహార అలవాట్లతో పాటు ఎన్నిరకాలు వడ్డిస్తే అంత గొప్పగా పరిగణించే రోజులు వచ్చాయి. సామూహికంగా జరిగే ఈ క్రతువుకు హాజరు కావటం కాకపోవటం అనేది మత విశ్వాసాలకు సంబంధం లేదు. హిందువుల పండగలను ముస్లింలు జరుపుకోవటం ఎలా జరుగుతోందో ఇప్తార్‌ విందులకు వుపవాసం పాటించని హిందువులు, ఇతర మతాల వారు కూడా హాజరుకావటం అన్నది ఒక సామాజిక మర్యాద, అంశంగా మారిపోయింది. వాటిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదాస్పదం కావించింది. ఒక పార్టీ ఇచ్చిన విందుకారణంగా ముస్లింలందరూ అదే పార్టీకి ఓటు వేస్తారనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి వుండదు. అదే అయితే వినాయకచవితి, దసరా వంటి హిందువుల పండుగల సందర్బంగా బిజెపి నేతలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంత మాత్రాన హిందువులందరూ వారికి ఓటు వేయటం లేదు. జర్మనీలో హిట్లర్‌ యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే లాభం వుంటుందని భావించినట్లే మన దేశంలో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు భావిస్తున్నాయి. అందుకే ఈ రచ్చ.

 అధికారంలో వున్నపుడు మతం, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటంలో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించిందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి అంతకంటే ఎక్కువగా చేస్తోందనటంలో అతిశయోక్తి కాదు. వారణాసిలో ఒక హిందూమత కార్యక్రమానికి ప్రధాని హాజరుకావటం, దానిని ప్రత్యక్ష ప్రసారం చేయటం రాజకీయ లబ్ది పొందటంలో భాగం కాదా ? ఇరుగు పొరుగు దేశాలను సందర్శించినపుడు ప్రధాని మతపరమైన పూజలు నిర్వహించటం కూడా ప్రచారంలో ఒక భాగంగా మార్చివేశారు. సినీ హీరో షారూఖ్‌ ఖాన్‌ను పాక్‌ వుగ్రవాది హఫీజ్‌తో పోల్చిన హిందూమత పూజారి లేదా యోగి, పచ్చి ముస్లిం వ్యతిరేకి అయిన ఆదిత్యనాధ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

    ఇలాంటివి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. వివిధ కారణాలతో అనేక దేశాలలో జరిగాయి, జరుగుతున్నాయి. ముస్లిం దండయాత్రలకు గురైన సోమనాధ దేవాలయాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించారు.దేవాలయ నిర్మాణం జరపండిగాని దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించండి తప్ప ప్రభుత్వ నిధులు వద్దని చెప్పిన మహాత్మాగాంధీ సూచనను నాటి పాలకులు పట్టించుకోలేదు. 1971లో అంతర్యుద్ధం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పట్టణంలో పాక్‌ సైన్యం ధ్వంసం చేసిన రమణ కాళీ మందిరం స్ధానంలో జాతీయ దేవాలయం(ప్రభుత్వ) కట్టించాలని అక్కడి మైనారిటీ హిందువులు చేసిన వినతి లేదా డిమాండ్‌కు తలొగ్గిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఢాకేశ్వరీ పేరుతో ఆలయ నిర్మాణం చేయటమే గాక దానిని జాతీయ ఆలయంగా కూడా ప్రకటించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి మైనారిటీ హిందువుల కోరిక మేరకు హోలీ, దీపావళిని జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది. కెనడాలో పెద్ద సంఖ్యలో వున్న సిక్కు మైనారిటీల కారణంగా వైశాఖీ పూర్ణిమను జరుపుకోవాలని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

    ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ద ఆర్‌ఎంఎం పార్లమెంట్‌ భవనంలో జరప తలపెట్టిన ఇప్తార్‌ పార్టీకి మొత్తం 140 దేశాల ప్రతినిధులతో పాటు మోడీ మంత్రివర్గ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కూడా హాజరౌతారని గొప్పగా ప్రకటించారు.దీని గురించి ఆర్‌ఎంఎంకు మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ ఇంద్రేష్‌ కుమార్‌ మీడియాతో స్వయంగా మాట్లాడారు. దీనిని ఒక రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఏర్పాటు చేసినదిగా చూడవద్దని కూడా చెప్పారు. భారత్‌లో అన్ని మతాల వారు సహజీవనం చేస్తున్నారని ప్రపంచానికి తెలిపేందుకు వుద్ధేశించినట్లు తెలిపారు.ఈ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని చెప్పటం ఎలా వుందంటే బిజెపి వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో వుండవచ్చు, దానికీ తమకూ సంబంధం లేదని బుకాయించటం వంటిదే.

     ఆర్‌ఎంఎం అధిపతి మహమ్మద్‌ అఫ్జల్‌ ఈ విందు గురించి చెబుతూ భారత్‌లో ముస్లింలు శాంతి లేదా సంతోషంగా లేరని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, ముస్లింలకు మోడీ ప్రభుత్వం మంచి చేస్తున్నదని చెప్పటానికే ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైన ప్రపంచ సౌహార్ద్ర నూతన అధ్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, దీనిని రాజకీయమైందని చిత్రిస్తారు, సరిగ్గా ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే దీనిని నిర్వహిస్తున్నాం అని అరటి పండు వలచి చెప్పినట్లు వివరించారు.http://indiatoday.intoday.in/story/rss-tries-to-shed-pro-hindu-image-invites-140-countries-to-iftar-party/1/695911.html

   ముస్లింలను సంతృప్తిపరుస్తున్నారని కాంగ్రెస్‌, ఇతర పార్టీలను ఇప్పటి వరకు విమర్శిస్తూ, ఖండిస్తూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నదని బిజెపి మిత్రపక్షమైన శివసేన నాయకుడు మనీషా క్యాండే ధ్వజమెత్తారు.’ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ చెబుతుంటుంది,ఇప్తార్‌ విందుల వంటి వాటిని కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఖండిస్తుంది,అలాంటిది ఇప్పుడు అదే ఆపని చేస్తోంది. దాని అసలు భావజాలం నుంచి పూర్తిగా వైదొలిగింది, ఒకవైపు ఘర్‌ వాపసీ గురించి చెబుతారు మరోవైపు ఇప్తార్‌ విందులు ఇస్తారు, దీని ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ గందరగోళంలో వున్నదని వారే వెల్లడించుకుంటున్నారు అని క్యాండే పేర్కొన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడి తరువాత దానిని కాదని చెప్పిన విషయం తెలిసిందే. చరిత్రలో దాని ఆత్మవంచన, పరవంచన ఖాతాలో ఇప్పుడు ఇప్తార్‌ విందు మరొకటి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీత్వ-మనువాదుల మనోగతం ఏమిటి ?

22 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game

ఎం కోటేశ్వరరావు

    రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్‌ మోడల్‌ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్‌ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?

   ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్‌ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.

    అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్‌, ప్రకాష్‌ జవదేకర్‌, పియూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.

    నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.

    మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.

  యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.

    కేవలం విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.

   మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్‌లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.

   మోడీ హిందూ హృదయ సామ్రాట్‌గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.

   హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.

   సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్‌లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.

    వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్‌ఘర్‌ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.

    ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.

   ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.

    బిజెపి వారు (ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.

1. ఘర్‌ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.

2.జెఎన్‌యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.

3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్‌లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.

4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.

5.అనుపమ ఖేర్‌ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్‌లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.

6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?

7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?

8. పాకిస్ధాన్‌పై విధానం: పాకిస్థాన్‌ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్‌ కోట్‌ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్‌ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్‌ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!

(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్‌ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్‌ను చూడవచ్చు)

http://swarajyamag.com/politics/to-retain-power-in-2019-the-bjp-must-eschew-its-fascination-for-micawberism

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మాండ్యలో మతశక్తులకు శృంగ భంగం

17 Sunday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, karnataka, love jihad, Mandya, RSS, RSS game, VHP

లవ్‌జీహాద్‌ ముసుగులో రాజకీయం చేస్తున్న బిజెపి, సంఘపరివార్‌

ఎం కోటేశ్వరరావు

    లవ్‌ జీహాద్‌ పేరుతో సంఘపరివార్‌ శక్తులు సమాజంలో మతపరమైన చీలికలు తెచ్చేందుకు, మెజారిటీ మత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. లవ్‌ జీహాద్‌ అంటే హిందూ మతానికి చెందిన బాలికలను వివాహం పేరుతో ముస్లిం యువకులు ఆకర్షించి వారిని మతమార్పిడి చేస్తున్నారనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మాండ్యకు చెందిన రెండు కుటుంబాలు తమ బిడ్డలకు మతాంతర వివాహం చేయటాన్ని సహించలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులు, వక్కలిగ కులశక్తులు శనివారం నాడు జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. మాండ్య పట్టణానికి చెందిన అషిత(28), ఆమె చిన్ననాటి నుంచి స్నేహితుడు, పొరుగున వున్న షకీల్‌ (28) వివాహం సందర్బంగా ఆదివారం సాయంత్రం ఏడున్నరకు మైసూరులో విందు ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన సంఘపరివార్‌ శక్తులు మాండ్యలో అషిత నివాసం ముందు వివాహ వ్యతిరేక ప్రదర్శన చేశారు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించటంతో శనివారం నాడు లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకం అనే పేరుతో మాండ్య జిల్లా బంద్‌కు పిలుపునిచ్చి అభాసు పాలయ్యారు.ఈ వివాహానికి వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తూ మత, కుల శక్తుల వైఖరిని ఖండించాయి. వధూవరుల, తలిదండ్రులు రక్షణ కల్పించమని ఎలాంటి వినతి చేయనప్పటికీ తామే ముందు జాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భజరంగదళ్‌, బిజెపి కార్యకర్తలు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు.వారి గురించి పట్టించుకోని ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు కొనసాగించారు. శుక్రవారం నాడు పసుపు, శనివారం నాడు మెహందీ క్రతువులను నిర్వహించారు. వధువు తండ్రి, పిల్లల డాక్టర్‌ నరేంద్రబాబు పత్రికలవారితో మాట్లాడుతూ ‘నేను పూర్తిగా లౌకిక వాదిని. దేవుడు అంటే ఒక శక్తి(బలం) అని నమ్మేవాడిని, ఆచారాల పట్ల నాకు విశ్వాసం లేదు. వివాహంలో హిందూ లేదా ముస్లిం సంప్రదాయాలను పాటించటం లేదు. దేవుడి ముందు ఒక కార్యక్రమం వుంటుంది. తరువాత మైసూరులో విందు ఏర్పాటు చేశాము ‘ అని చెప్పారు. ‘వరుడు షకీల్‌ తండ్రి ముక్తార్‌ అహ్మద్‌, నేను 50 సంవత్సరాలుగా స్నేహితులం. మా ఇంటి సమీపంలోనే ముక్తార్‌ వ్యాపారం చేస్తాడు. నా కంటే ముక్తార్‌ రెండు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ మేం ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్లాము. నా కుమార్తె అషిత, ముక్తార్‌ రెండవ కుమారుడు షకీల్‌ చిన్నతనం నుంచి స్నేహితులు, పియుసి నుంచి ఎంబియే వరకు కలిసే చదువుకున్నారు. హెచ్‌ ఆర్‌లో ఎంబిఏ చదివిన తరువాత అషిత ఎంఎస్‌ చేయటం కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. షకీల్‌ కూడా మార్కెటింగ్‌లో ఎంబియే చదివాడు. మాండ్యలోనే వుంటూ తన తండ్రి చేస్తున్న బియ్యం, బెల్లం వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు, డక్కన్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధకు యజమానిగా వున్నాడు. తనకు వివాహం చేసుకోవాలని లేదని మా కుమార్తె చాలా కాలంగా చెబుతోంది. అయితే తరువాత తాను షకీల్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేమందరం సంతోషంగా అంగీకరించాం. మా వైపు మరియు షకీల్‌ తరఫు బంధువులు కూడా సంతోషంగా వున్నారు. ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వివాహం ఆగదు. వివాహం అంటే రెండు హృదయాల కలయిక దానిని నెవరూ వేరు చేయలేరు.’అని కూడా అషిత తండ్రి చెప్పారు.

   ఈ వివాహాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భజరంగ దళ్‌ నేత సిటి మంజునాధ మాట్లాడుతూ ఈ వివాహం పట్ల తమకు అభ్యంతరం లేదని అయితే తాము లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని, అషిత మతం మార్చేందుకుగాను ఆమెకు ఖురాన్‌ నేర్పుతున్నారని ఆరోపించాడు. తాము మత మార్పిడులకు వ్యతిరేకం తప్ప వివాహానికి కాదన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మంది వక్కలిగ కులపు అమ్మాయిలు లవ్‌జీహాద్‌కు గురయ్యారని ఆరోపించాడు. అషిత ఇప్పటికే మతంతో పాటు పేరు కూడా మార్చుకుందని తమకు తెలిసిందని, అబ్బాయే ఎందుకు మతం మార్చుకోకూడదు లేదా వివాహం తరువాత ఎవరి మతాన్ని వారు ఎందుకు అనుసరించకూడదని మాత్రమే తాము చెబుతున్నామన్నారు.

    ఇది వ్యక్తిగత వ్యవహారాలను మతపరంగా నియంత్రించేందుకు పూనుకోవటం తప్ప మరొకటి కాదు. మేజర్లయిన స్త్రీ,పురుషులు తమ వివాహం, మతం కలిగి వుండటం లేదా లేకుండా వుండటం అన్నది వారి వ్యక్తిగత వ్యహారం తప్ప బిజెపి, సంఘపరివార్‌ చెప్పినట్లు నడవాలనటం నిరంకుశ ధోరణులకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. దీన్ని సహిస్తే ఇలాంటి శక్తులు మరింతగా పేట్రేగి పోతాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో హిందూ మతానికే చెందినప్పటికీ దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులను అగ్రవర్ణాలవారని చెప్పుకొనే కుటుంబాల యువతులను వివాహం చేసుకుంటే వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడని వుదంతాలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అందువలన భజరంగదళ వంటి కాషాయతాలిబాన్లు ముస్లిం లేదా క్రైస్తవ మతాల వారినే కాదు, హిందూ మతంలో కులాంతర వివాహాలను కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మనువాద వ్యవస్ధను సజీవంగా వుంచాలని ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు.జనాన్ని మతపరంగా చీల్చి తమ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించే ఇలాంటి శక్తులను వ్యతిరేకించి ధైర్యంగా తమ బిడ్డలకు మతాంతర వివాహం చేస్తున్న అషిత,షకీల్‌ తలిదండ్రులు ఎంతైనా అభినందనీయులు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సావర్కర్‌ గురించి గాంధీ మాటలు కూడా నకిలీవేనా ?

25 Friday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, fake, Gandhi, RSS, RSS game, Savarkar

bhagat-singh-martyr-vs-vd-savarkar-traitor

ఎం కోటేశ్వరరావు

నువ్వొకందుకు పోస్తే నే ఒకందుకు తాగా అన్నట్లుగా సంఘపరివార్‌ ఎందుకు ప్రారంభించినప్పటికీ దేశానికి ఒక విధంగా మంచే జరుగుతోంది. దాని నాయకుల నిజరూపాలు దేశం ముందుంచటానికి మరొక అవకాశం ఇచ్చారు. కొలిమిలో ఇనుము బాగా కాగినపుడే దెబ్బ వేయాలన్నట్లుగా దేశంలో దేశ భక్తి, దేశద్రోహుల గురించి జరుగుతున్న చర్చ అనేక మందికి కొత్త విషయాలు తెలియచేస్తోంది. వీడియోలను ఎలా మార్చివేస్తారో అవగతం అయింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ఎంతటి సాదాసీదా మనిషో అని జనంలో సానుభూతి పెంచటానికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న నరేంద్రమోడీ అంటూ ఒక ఫొటోను సామాజిక మీడియాలో పెట్టారు. 1988లో ఆయనొక సాధారణ వ్యక్తిగా వున్నపుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్నంత సేపు అమ్మి, మిగిలిన సమయాలలో చీవుర్లు పట్టి ఇళ్లను కూడా శుభ్రం చేసిన కష్టజీవి అని బిజెపి మద్దతుదార్లు ఆ చిత్రాన్ని దేశం మీదకు వదిలారు. అసలు వాస్తవం ఏమంటే అదే ఏడాది ఆయన గుజరాత్‌ రాష్ట్ర బిజెపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నరేంద్రమోడీ మీద వున్న మోజులో ఆభిమానులు వుబ్బితబ్బుయ్యారు. భక్తులు పులకరించి పోయారు. అప్పుడే అనేక మంది ఆ చిత్రం గురించి ప్రశ్నించినా మోడీ గాలిలో ఎవరూ ఖాతరు చేయలేదు. అహమ్మదాబాదుకు చెందిన ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఆ ఫొటో నకిలీ అని దానిలో వున్న వ్యక్తి నరేంద్రమోడీ కాదని, ఫొటోను మార్చి అలా తయారు చేశారని తేలింది.

Selection_24_03_2016_003

ఇప్పుడు మరొక అంశం బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ భగత్‌ సింగ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ చిత్రాలను పక్కపక్కనే పెట్టి అమరజీవులు- విద్రోహులు అనే శీర్షికతో సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. బ్రిటన్‌-భారత్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండవది మేం దానిలో పాల్గొన్నాం అందువలన మేము యుద్ధ ఖైదీలం అని బ్రిటీష్‌ ప్రభుత్వానికి భగత్‌ సింగ్‌ రాసిన చివరిలో పేర్కొన్న అంశాన్ని భగత్‌ సింగ్‌ పొటో కింద పెట్టారు. బ్రిటీష్‌ ప్రభుత్వం తనకు క్షమాభిక్ష పెట్టాలని, దాను ఆంగ్లేయులకు విధేయతతో వుంటానని సావర్కర్‌ రాసిన లేఖాంశాలను ఆయన ఫొటో కింద పెట్టారు. దాని మీద నిక్కర్ల బదులు పాంట్లు తొడుక్కోవాలని కొత్తగా నిర్ణయించుకున్న ‘స్వదేశీ’ (పాంట్లు భారతీయ దుస్తులా,ఏ చక్రవర్తీ వేసుకున్నట్లు మనకు కనిపించదు) సంఘపరివార్‌ యంత్రాంగం మా నేతను ఇంత మాట అంటారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక వున్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరివార్‌ ప్రొడక్షన్స్‌ తాజా చిత్రం ‘డర్టీ పిక్చర్‌’

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

dirty picture, JNU, JNU ROW, JNUSU, kanniah kumar, parivar, RSS, RSS game

సత్య

   జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను దేశద్రోహిగా చిత్రించేందుకు అతని బహిరంగ కార్యక్రమాలను తప్పుపట్టటంలో ఘోరంగా విఫలమైన పరివార్‌ యంత్రాంగం ఇప్పుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ప్రచారంతో అతని ప్రయివేట్‌ పార్టుల(మర్మావయాల)ను వెతికే పనిలో పడింది. జెఎన్‌యులో రోజుకు మూడువేల కండోమ్‌లను వుపయోగిస్తారంటూ కచ్చితంగా లెక్క పెట్టి చెప్పిన పార్టీ త్వరలో కన్నయ్య ప్రయివేట్‌ పార్టుల గురించి ఒక వీడియోను రూపొందించి విడుదల చేసి తమతో చేతులు కలిపిన టీవీఛానల్స్‌, సామాజిక మీడియాలో ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలను ఎంత నీచ స్థాయికి దిగజార్చుతున్నారు !

    గత సంవత్సరం ఒక రోజు కన్నయ్య జెఎన్‌యు ప్రాంగణంలో ఒక చోట బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో సమీపంలో వున్న ఒక మాజీ విద్యార్ధిని అభ్యంతర పెట్టింది. అతని ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు విచారణ జరిపి మూడువేల రూపాయల జరిమానా విధించారు. దానిని అతను చెల్లించాడు. దాంతో ఆ వుదంతం ముగిసింది. తరువాత జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో అతను పోటీ చేశాడు, గెలిచాడు. మూత్ర విసర్జన వుదంతాన్ని ఇప్పుడు బయటకు తీసి దాన్ని అందమైన భాషతో వర్ణించి విప్లవం గురించి కబుర్లు చెప్పే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జన చేయటం ఏమిటి, దాన్ని అభ్యంతర పెట్టిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించటం విప్లవ కార్యక్రమమా అంటూ ఆ యువతి పేరుతో తయారు చేసిన ఒక లేఖను తీసుకొని ప్రతివారినీ తట్టి మరీ చదివిస్తున్నారు. హద్దులు మీరనంత వరకు, నేరం కానంత ఎవరికైనా ఏం చేయటానికైనా అభ్యంతరం లేదు. దీనిపై ఎఐఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటన చేస్తూ కన్నయ్య జరిమానా చెల్లించిన మాట వాస్తవమేనని, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

   ఇక్కడ సమస్య ఏమిటంటే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జనను ఎవరూ సమర్ధించరు అది ముగిసిపోయిన అంశం. మన దేశంలో బహిరంగ మల, మూత్ర విసర్జన ఒక పెద్ద సామాజిక సమస్య.పట్టణాలలో వుండేవారికి ఇది నిత్యం కనిపించే దృశ్యం.దాని మంచి చెడ్డల గురించి వేరే సందర్బంలో చర్చించుకోవచ్చు. గతేడాది జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఎబివిపి కూడా పోటీ చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్ధుల గురించి విద్యార్దినీ, విద్యార్ధులు ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ప్రత్యర్ధులు సందు దొరికితే ప్రతి లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎబివిపి ఆ ఎన్నికలలో ఈ డర్టీ పిక్చర్‌ను ముందుకు తేలేదు. నిజంగా కన్నయ్య మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే కీచకుడే అయితే అతను అరెస్టయినపుడు వందల మంది విద్యార్ధినులు ప్రదర్శనలు, సభల్లో పాల్గొని వుండేవారా ?

    కన్నయ్యపై దేశద్రోహ నేరం కట్టుకధ అని తేలటంతో పరివార్‌ రెండో డర్టీ సీన్‌కు తెరతీసింది. ఇలాంటి ఎత్తుగడలు పశ్చిమ దేశాలనుంచి అరువు తెచ్చుకున్న బాపతు తప్ప భారతీయ సంస్కృతి కాదు. నరేంద్రమోడీతో సహా అనేక మంది ఆరాధించే అమెరికాలో అక్రమ సంబంధాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కోపం వస్తే విడాకులిచ్చి మరొకర్ని చూసుకుంటారు. వారు అంతకు ముందు ఎలా తిరిగినా ఫరవాలేదు, పట్టించుకోరు. అందుకే అక్కడ ఏ తల్లికి జన్మించారు అనేది ముఖ్యం. ఎవరైనా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రత్యర్ధులు వారి రంకు, గొంకులు, అవినీతి అక్రమాలను ముందు పెట్టి వుతుకుతారు. అంతకు ముందు మనకు తెలియని అనేక విషయాలను ప్రచారంలో పెడతారు, అవి వాస్తవమా కాదా అని తేలే లోపల ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు దేశద్రోహం అనే తప్పుడు కేసులో బెయిలుపై బయటకు వచ్చాడు. దాన్ని గురించి ఇంక ఎన్నికధలు చెప్పినా జనం నమ్మే స్ధితిలేదు. అందుకని ఈ డర్టీ ప్రచారానికి తెరలేపారు.

   గురివింద గింజ తన కింది నలుపెరగదట. గుజరాత్‌లో ఒక యువతి ఎక్కడికి వెళుతోంది, ఎవరితో తిరుగుతోందో తెలుసుకొని తనకు నివేదించమని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ ఆదేశించిన విషయాన్ని పరివార్‌ దాచి పెట్టినా దాగేది కాదు. కుమార్తె ప్రవర్తన గురించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే అలా ఏర్పాటు చేసినట్లు ఆ చర్యను సమర్ధించుకున్నారు. ఇది భారతీయ యువతుల గౌరవాన్ని పెంచే, మాన మర్యాదలను కాపాడే చర్యగా కన్నయ్యపై లేఖ రాసిన యువతికి గాని దాన్ని పట్టుకుతిరుగుతున్న పరివారానికి గానీ కనిపిస్తోందా ?

   ఆశారాంబాపు ఒక బాలికపై అత్యాచార కేసులో జైలులో వున్న పెద్దమనిషి. అతగాడి అనుగ్రహం కోసం తపించినవారిలో నరేంద్రమోడీ ఒకరు. ఆశారాం నిజస్వరూపం తెలిసిన తరువాత కూడా వుమాభారతి వంటి నేతలు అతనికి మద్దతుగా మాట్లాడటాన్ని చూసి రాజకీయంగా నష్టదాయకం కను ఎవరూ నోరు విప్పవద్దని 2013లో మోడీ కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సుబ్రమణ్యస్వామి జైలులోవున్న బాపును కలసి నువ్వు నిరపరాధివి బెయిలు పిటీషన్‌పై నీ తరఫున నేను వాదిస్తా అని చెప్పి జోద్‌పూర్‌ కోర్టులో వాదించాడు. అప్పటికే దిగువ, గుజరాత్‌ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా బెయిల్‌ పిటీషన్‌ను ఐదుసార్లు తిరస్కరించిన ఈ కేసును వాదించకపోతే సుబ్రమణ్యస్వామికి రోజు గడవదా ? ఆ స్ధాయిలో వున్నవారు ఇలాంటి చర్యల ద్వారా ఏ సందేశం పంపారు. వీరు జెఎన్‌యు విద్యార్ధుల గురించి గుండెలు బాదుకుంటున్నారు? సమాజానికి నీతులు చెబుతున్నారు.

   ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది బిజెపి నేతలు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. వీరు రెచ్చగొట్టే మతోన్మాదం, అసహనం, కుహనా దేశభక్తి వంటి ముప్పు తెచ్చే అంశాలను వదలి వారి డర్టీ పిక్చర్స్‌పై కేంద్రీకరించటం అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించటమే.

   కన్నయ్య ఇతర జెఎన్‌యు విద్యార్ధుల విషయంలో బిజెపి ఇప్పుడు ఇరకాటంలో పడింది. పులినెక్కిన మాదిరి వారి పరిస్థితి వుంది. దాన్ని అదుపులోకి అయినా తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి. దానిలో భాగంగానే గోబెల్స్‌ మాదిరి వారి తప్పుడు ప్రచారాన్ని కొనసాగించటం, వాటికి తోడు ఫలానా వాడు ఫలానా విధంగా జిప్‌ విప్పాడు, ఫలానాచోట మూత్రం పోశాడు వంటి అంశాలను ముందుకు తీసుకు వచ్చి తమపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకు చూసే ఎత్తుగడమాత్రమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: