• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: subsidies

ఉచితాలు – అనుచితాల చర్చ : కార్పొరేట్లకు కట్టబెడుతున్నది ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

31 Wednesday Aug 2022

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ 2 Comments

Tags

BJP, Freebies, Narendra Modi Failures, subsidies, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలను అక్రమాలుగా పరిగణించలేమని 2013లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తాజా పిటీషన్‌, దాన్ని సవాలు చేస్తూ మరికొందరు కక్షిదారులుగా చేరటంతో వాటిని సమీక్షించేందుకు ముగ్గురు జడ్జీలతో సుప్రీం కోర్టు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఉచితాల వలన మన దేశం కూడా శ్రీలంక మాదిరి అవుతుందంటూ అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. నిజమే, శ్రీలంక మాదిరి ఏ దేశమూ మారకూడదు. వారు చెప్పనిదీ, శ్రీలంక అసలు కారణం ఏమంటే ధనికులు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించటం.దివాలా కారణంగానే ఎరువులను దిగుమతి చేసుకోలేక ఆ బలహీనతను దాచి పెట్టి సేంద్రియ సాగుపేరుతో చేసిన పిచ్చి పనికి ఆ రంగం కూడా దెబ్బతిన్నది.


గతంలో కాంగ్రెస్‌ పాలకులు అనుసరించిన, వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నేత నరేంద్రమోడీ విధానాలు ఇలాగే కొనసాగితే మన దేశం కూడా శ్రీలంకగా మారేందుకు రోజులు దగ్గరపడుతున్నాయని గ్రహించటం అవసరం. బడ్జెట్‌ అంటే దేశంలో వచ్చే రాబడి, సంపదలను అందరికీ సమంగా పంచటం, కొత్త రాబడిని సృష్టించేందుకు పెట్టుబడులు పెట్టటం.నిజంగా అలా జరుగుతోందా ? జరిగితే జనాలకు ఉచితాలతో పని లేదు, ఎవరూ దేహీ అంటూ చేతులు చాచరు. రైతులు సాగును వదలి సంవత్సరాల తరబడి నిరవధిక ధర్నా చేయనవసరం లేదు. విధాన పరంగా కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే, బిజెపి దేశానికి ఇస్తున్న బోనస్‌ ఏమిటంటే మతోన్మాదాన్ని రేకెత్తించటం. అసలు పేదలకు ఉచితాలను అందిస్తే , నగదు బదిలీ చేస్తే దేశ ఖజానా దివాలా తీస్తుందా, పన్ను చెల్లింపుదార్ల సొమ్ము వృధా అవుతుందా ? కాస్త ఆలోచిద్దాం. పేదలకు నేరుగా ఇచ్చే సొమ్మును వారు మార్కెట్లో ఏదో ఒక వస్తువు లేదా సేవ కొనుగోలుకు వెచ్చిస్తారు సమాజానికి తోడ్పడతారు తప్ప కార్పొరేట్ల మాదిరి పన్ను స్వర్గాల్లో, విదేశాల్లో సంపదలను కూడబెట్టుకోరు.


ఉచితాలతో దేశం కుదేలవుతుందని చెబుతున్న అశ్వనీ ఉపాధ్యాయ(47) పుట్టక ముందే దేశంలో మూడు సార్లు 1957-58, 1965-66, 1972-73 ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం వచ్చింది. తరువాత 1991లో వచ్చింది. అప్పుడేమీ ఉచితాలు లేకున్నా ఇలా ఎందుకు జరిగిందో కొంత మంది తెలిసి కూడా చెప్పరు. మరికొందరు తెలివిగలవారు వారికంటే ఘనులు. చరిత్ర చాట భారతం, సిద్దాంతాలు రాద్దాంతాలు వినే ఓపిక ఎవరికి ఉంది చెప్పొద్దు అంటారు. మొత్తం మీద గతాన్ని గురించి ప్రస్తావించకూడదు.దీన్ని అంగీకరించాలా? రోజూ చర్చలో ఉన్న ఉచితాలు-అనుచితాలు, సంస్కరణలు, నూతన విధానాలు గతంతో నిమిత్తం లేకుండా ఆకాశం నుంచి ఊడిపడితే ఓకే వాటి గతాన్ని చర్చించనవసరం లేదు. అలాకాదే మరి !


దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014-15లో ఐదు లక్షల 54వేల కోట్లకు చేరింది. వీటిలో రాష్ట్రాలు ఇచ్చిన భూమి, విద్యుత్‌, అమ్మకపు పన్ను, ఇతర రాయితీలు లేవు. అవి కూడా వేలు, లక్షల కోట్లలోనే ఉంటాయి. అంటే ఇంతేసి మొత్తాలను ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించింది. లేనట్లైతే ఆ మొత్తం ఖజానాకు చేరి జనాల సంక్షేమానికి లేదా పెట్టుబడుల ద్వారా దేశ సంపదల వృద్ధికి తోడ్పడేది కదా ? మరి ఈ ఉచితాలు-అనుచితాల గురించి వాటిని తమ జేబులోని సొమ్ము మాదిరి ఇచ్చిన ప్రభుత్వాల గురించి ఎవరూ ప్రశ్నించలేదే ! తమ ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహం అని గొప్పలు చెప్పుకొనేందుకు, ఇంతేసి మొత్తాలను ఇస్తున్నాం రండహౌ అని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాల్లో వీటి గురించి కోల్పోయిన రాబడి శీర్షికతో పేజీలకు పేజీలు కేటాయించింది.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా పేర్కొన్నారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. మరుసటి ఏడాది కొంత మేరకు తగ్గించటంతో రు.3,63,365కు తగ్గింది. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు.అశ్వనీ ఉపాధ్యాయ వంటి వారు వీటిని గురించి ఎందుకు పట్టించుకోలేదు ? అసలు జరిగిందేమిటి ?


ఉచితాలు, సంక్షేమ పధకాలను వ్యతిరేకిస్తున్నవారు గానీ సమర్ధిస్తున్నవారు గానీ ఇవెందుకు ఉనికిలోకి వచ్చిందీ తెలుసుకోవాలి.దేశంలో 1991లో ఎగువున ఉన్న పదిశాతం మంది జనాభాకు దేశ రాబడిలో 35శాతం ఉండగా అది 2014నాటికి 57శాతానికి పెరిగింది. సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ ఏలినా, ఆరేండ్లు బిజెపి వాజ్‌పాయి అధికారంలో ఉన్నా జరిగింది ఇది. కొందరికి సంపద పెరిగితే ఏడుపు ఎందుకు, సంపాదించటం చేతకాక అంటారు కొందరు ? నిజమే ఏడవాల్సిన పనిలేదు. దేశ జనాభాలో 50శాతం మందికి ఇదే కాలంలో వస్తున్న రాబడి 20.1 నుంచి 13.1శాతానికి దిగజారింది. మరి దీనికి వారి ఖర్మ అనుకోవాలా ? చేతకాని అసమర్ధులని భావించాలా ? 2022 ప్రపంచ అసమానతల సూచిక ప్రకారం మన దేశంలోని ఎగువ ఒకశాతం చేతిలో 22శాతం సంపద చేరింది. దేశంలో మైనారిటీ తీరిన వారి సగటు సంపాదన ఏడాదికి రు.2,04,200 కాగా దిగువ 50శాతం మంది సగటు రాబడి రు.53,610, ఇక ఎగువ పదిశాతం మందికి రు.11,66,520 ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొన్నది. తొలిసారిగా మన దేశంలో అసమానత నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌) 2019-20 ప్రకారం ఎగువన ఉన్న పదిశాతం మంది కార్మికుల్లో నెలకు ఇరవై ఐదువేలు సంపాదించేవారు ఉన్నారు. వారిలో కూడా ఎగువన ఉన్న ఒక శాతం రాబడి మొత్తంలో 6-7శాతం కాగా, పదిశాతం మంది మూడోవంతు పొందుతున్నారు. మరి దేశంలో కష్టపడనిది ఎవరు ? అందరికీ ఎందుకు పెరగలేదు ? పేదల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది కనుక వారిలో అసంతృప్తి ప్రబలితే తమకు మొదటికే మోసం వస్తుందేమోనని ఉపశమన పరిచేందుకు తెచ్చినవే ఉచితాలు, సంక్షేమ పధకాలు. అధికారం కోసం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఓట్లను కొల్లగొట్టవచ్చు తప్ప సంక్షేమ పధకాలను ఎత్తివేసే పరిస్థితి లేదు.


ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా.అక్కడ కూడా దారిద్య్రంలో లేదా అల్పాదాయం ఉన్న కుటుంబాలు ఫుడ్‌స్టాంప్స్‌ పేరుతో ప్రతి నెలా అర్హతలను బట్టి ప్రతినెలా 250 నుంచి 1,316 వరకు డాలర్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది.దీన్నే రూపాయల్లో చెప్పాలంటే ఇరవై వేల నుంచి లక్షా ఐదువేల వరకు ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమం 1939లో మొదలు పెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అక్కడ 2020లో 33 కోట్ల మంది జనాభా ఉంటే పేదరికంలో ఉన్న వారు.3.72 కోట్లని అధికారికంగానే చెప్పారు. వారందరూ ఫుడ్‌స్టాంప్స్‌కు అర్హులే. మన దగ్గర చౌక దుకాణాల్లో సబ్సిడీ బియ్యం ఇస్తారు, అక్కడ కూపన్లతో ఆహారానికి సంబంధించిన జాబితాలోని వస్తువులను కొనుక్కోవాల్సి ఉంటుంది.కొన కూడని వస్తువుల జాబితా కూడా ఉంటుంది కనుక దుకాణదారు వాటిని విక్రయిస్తే ఆ కూపన్లు వాటికి చెల్లవు. అమెరికాలో పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోయారు, దేన్నీ ఉచితంగా ఇవ్వకూడదని చెప్పే అమెరికా పేదలకు డాలర్లు ఎందుకు ఇస్తున్నట్లు ? వాటిని ఉచితాలుగా పరిగణించాలా అమెరికా పాలకుల అసమర్ధతకు చెల్లిస్తున్న పరిహారంగా చూడాలా ? మన దేశంలో ఉపాధిహమీ పధకం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకం వలన తమ పొలాల్లో పని చేసేందుకు కూలీలను దొరక్కుండా చేస్తున్నారని, సబ్సిడీ బియ్యాన్ని అమ్ముకుంటున్నారంటూ ఏడ్చేవారు ఆ పధకాలను అనుచితమైనవిగానే వర్ణిస్తారు.


జనంలో అసంతృప్తి తలెత్తుతున్నపుడు అధికారం కోసం అర్రులు చాచేవారు ఇతరులను విమర్శిస్తూనే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు అనివార్యంగా సబ్సిడీ, సంక్షేమ పధకాలను అనుసరిస్తారనేందుకు తాజా నిదర్శనం ప్రధాని నరేంద్రమోడీ. సరిగ్గా 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు 2018 డిసెంబరు నుంచి కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించి మూడు విడతలుగా పదకొండు కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరువేలు నేరుగా బాంకుల్లో వేస్తున్నారు. ఇప్పటికి పదకొండు విడతలు అందించారు.ధరల పెరుగుదలకు దారి తీసిన కారణాల్లో ప్రధానమైనదిగా చమురుపై సెస్‌ల పెంపుదల ఒకటి.జనానికి ఉపశమనం కలిగించటం కంటే అదెక్కడ తన ఓటు బాంకుకు గండికొడుతుందో అన్న భయంతో ఎలాంటి ఆందోళనలు తలెత్తక ముందే సెస్‌లను కొంత మేరకు తగ్గించటంతో పాటు తమ పాలిత రాష్ట్రాల్లో వాట్‌ను కొంత మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం చేసిన త్యాగం అని పేరు పెట్టారు. అంతర్జాతీయ ధరలను బట్టి ప్రతి రోజు చమురు ధరల తగ్గింపు లేదా పెంపు అన్నది ఒక విధానంగా చెప్పారు. ఏప్రిల్‌ ఆరు నుంచి వాటి ధరలను స్థంభింప చేశారు. సదరు విధానం నుంచి వైదొలిగినట్లా లేక మరొకటా ? ఉచిత విద్యుత్‌, రైతాంగ రుణాల రద్దు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తాలు కూడా త్యాగాల కిందకు రావా? అవి ఏటేటా పెరుగుతుంటే ఎంతకాలం భరించాలని కొందరు అంటున్నారు. అందుకే విధానాల గురించి చర్చ జరగాలి, కొన్ని రాష్ట్రాలు ఎందుకు అమలు జరుపుతున్నాయి, కొన్ని ఎందుకు అమలు జరపటం లేదు ?


విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఉచితాల గురించి హితవు చెప్పారు.అలాంటి వాటిని పెంపొందించే ధోరణికి అడ్డుకట్ట వేస్తూ ప్రతిన పూనాలని అన్నారు. ఉచితాలు దేశ హితం కోసం కాదు, దేశాన్ని వెనక్కు నెడతాయి. రాజకీయాల్లో స్వార్ధం ఉంటే ఎవరైనా వచ్చి పెట్రోలు, డీజిలు ఉచితంగా ఇస్తామని చెబుతారు. ఇలాంటి స్వార్ధం వలన నిజాయితీగా పన్ను చెల్లించేవారి మీద భారం పడుతుంది. ఇది విధానం కాదు, అనైతికం అంటూ మాట్లాడారు. ఇదే మోడీ గారు తన ఏలుబడిలో చేస్తున్నదేమిటి ? ప్రోత్సాహకాలు, పన్ను ఎక్కువగా ఉంటే ఎగవేత ఎక్కువగా ఉంటుందంటూ కార్పొరేట్లకు పన్ను తగ్గించి ఏటా కొన్నిలక్షల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారు. ఇది ఉచితమా అనుచితమా ? జనానికి రావాల్సిందాన్ని ధనికులకు మళ్లించటమా ? 2014-21 సంవత్సరాలలో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 18శాతానికి తగ్గించారు. పోనీ దీన్ని సదరు కంపెనీలు తిరిగి పెట్టుబడులుగా పెట్టాయా ? అలాంటి దాఖలాల్లేవు. పెట్టి ఉంటే దేశ వృద్ది రేటు 8 నుంచి కరోనా ముందు నాలుగు శాతానికి ఎందుకు దిగజారినట్లు ? కొత్తగా ప్రవేశపెట్టిన పధకం ప్రకారం కొత్తగా పెట్టే సంస్థలకు కార్పొరేట్‌ పన్ను 15శాతానికి పరిమితం చేశారు. ఎవడబ్బ సొమ్మునీ రామచంద్రా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తాత్కాలిక బడ్జెట్‌ -ఓట్లకోసం నరేంద్రమోడీ వేసిన వల !

13 Wednesday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Direct Benefit Transfer (DBT), India Interim budget 2019-20, India's first budget, kisan samman, Narendra Modi, subsidies

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనంపై నరేంద్రమోడీ పెట్రో సర్జికల్‌ దోపిడీ ఎంతో తెలుసా

11 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Mody's sarkar, Narendra Modi, petro surgical looty, petrol price, petrol price build up, petrol price build up in india, subsidies

Image result for  petro  looty

మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి.

ఎం కోటేశ్వరరావు

   చెప్పింది వినటం, గొర్రెల్లా తలూపటం తప్ప ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తే దేశద్రోహులుగా పరిగణించే రోజులివి. అయినా సరే గట్టిగా ఎవరైనా కాదంటే నరేంద్రమోడీ భక్తులు భౌతిక దాడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అంతగా అసహనం పెరిగిపోయింది. అలాంటి స్ధితిలో మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు ఎందుకు తక్కువగా వున్నాయి అని ఎవరైనా ప్రశ్నించి బతక్కగ్గలరా ? నిజంగా అక్కడ తక్కువగా వున్నాయా ? అయినా అడగక తప్పదు. అయితే వారి వద్ద సమాధానం వుండదు. లేదూ ఎవరైనా స్వంతబుర్రలు వున్నవారు వుంటే వారికి తెలిసినా చెప్పరు. సామాజిక మీడియాలో దీనికి సంబంధించిన చర్చ ప్రస్తావనకు వచ్చినపుడు వస్తున్న సమాధానాలు చదివిన తరువాత కలిగిన అభిప్రాయమిది. ఒక పోస్టులో పాకిస్థాన్‌లో పెట్రోలు లీటరు 26 రూపాయలు అని సామాజిక మీడియాలో తిరుగుతున్నది. కొందరు వాస్తవాలు సరిచూసుకోవాలని చెప్పారు. మరికొందరు పెంచిన పన్నులు యుపిఏ హయంలో నిర్ణయించినవి తప్ప మోడీ సర్కార్‌ పెంచలేదు అన్నారు. మరికొందరు జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయి అన్నారు.

    ఏ కారణం చేత అయినా మోడీ భక్తులలో తెలివిగల వారు, నిజాలు తెలిసిన వారు వాస్తవాలు చెప్పటానికి ఎందుకో జంకుతున్నారు. బహుశా వారికి కూడా ఏదో ఒక ముద్ర వేస్తారని భయం కావచ్చు. వారి పట్ల జాలి చూపుదాం. మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని మన చమురు సంస్ధల నుంచే తీసుకోవచ్చు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రపంచంలో చమురు రేట్లు గణనీయంగా తగ్గాయి. కావాలంటే దీన్ని కూడా ఆయన సాధించిన విజయాల ఖాతాలోకే వేద్దాం. మన చమురు సంస్ధల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసింది. ఎందుకంటే సంస్ధల మధ్య పోటీ పెరిగి పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ వంటి పెట్రోలియం వుత్పత్తుల ధరలు తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో జనాన్ని ఆకర్షించేందుకు ప్రపంచంలో ధరలు పెరిగితే ఆమేరకు ఆటోమేటిగ్గా మీకూ పెరుగుతాయి, తగ్గితే అదే మాదిరి తగ్గుతాయంటే జనమంతా నిజమే కదా అనుకున్నారు. ఆ ముసుగులో మన సర్కార్‌ చేసిందేమిటంటే అప్పటివరకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించేందుకు పూనుకుంది. అన్నింటి మీదా ఒకేసారి తొలగిస్తే వచ్చే ప్రతికూల పర్యవసానాలకు భయపడి క్రమంగా తగ్గించటం ప్రారంభించింది. తొలుత పెట్రోలుపై పూర్తిగా ,తరువాత డీజిల్‌పై క్రమంగా మొత్తం ఎత్తేశారు. ఇప్పుడు కిరోసిన్‌పై ప్రతినెలా కొంత మొత్తం తగ్గిస్తూ రబ్బరు సుత్తితో కొడుతున్నారు. సబ్సిడీలు ఎత్తివేసినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో తగ్గిన మేరకు మన వినియోగదారులకు ధరలు తగ్గకపోగా పెరిగాయి అన్న నిజాన్ని మోడీ భక్తులు ఒక పట్టాన అంగీకరించరు.

    పెట్రోలియం రంగం మన ఖజానాకు సంపాదించి పెడుతున్న సొమ్ము కాస్తా కూస్తా కాదు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయం రు. 3,05,360 కోట్లు (అక్షరాలా మూడు లక్షల ఐదువేల మూడు వందల అరవై కోట్లు) ఇది 2014-15లో 3,32,620 కోట్లు, 2015-16లో 4,18,652, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 1,02,711 కోట్లు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం 2010 జూన్‌ 25 నుంచి పెట్రోల్‌పై సబ్సిడీని పూర్తిగా తగ్గించి వేసింది. మోడీ అధికారానికి వచ్చాక 2014 అక్టోబరు 18 నుంచి డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్ద ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై మాత్రమే కొనసాగిస్తున్నారు. యుపిఏ హయాంలో 2013-14లో పెట్రోలియం వుత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ మొత్తం రు.1,43,738కోట్లు కాగా మోడీ వచ్చాక 2014-15లో 76,282 కోట్లకు 2015-16లో రు.27,571 కోట్లకు తగ్గిపోయింది. ఆదా రు. 1,16,167 కోట్లు. కిరోసిన్‌పై కూడా పూర్తిగా పుణ్యం కట్టుకుంటే ఏడాదికి రు.1,43,738కోట్లు మిగిలినట్లే . ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 2013-14లో ఎక్సైజ్‌ పన్ను రూపంలో 77,982 కోట్లు, 2014-15లో 99,184 కోట్లు, 2015-16లో 1,78,591 కోట్లకు పెరిగింది. పెరిగిన ఆదాయం లక్ష కోట్లరూపాయలు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు పెట్రోలియం వాడకం పెరిగింది కదా ఆ మేరకు ఆదాయం పెరిగి వుండవచ్చు అన్న సందేహం వెలిబుచ్చవచ్చు. రెండు సంవత్సరాలలో వినియోగం రెట్టింపు పెరగటం అనేది ఏ దేశ చరిత్రలోనూ లేదు. మన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ మరియు విశ్లేషణ విభాగం (పిపిఏసి  http://ppac.org.in/content/147_1_ConsumptionPetroleum.aspx ) ప్రకారం 2013-14లో అన్ని రకాల పెట్రోలియం వుత్పత్తుల వినియోగం నెలవారీ సగటు 1,32,00,583 టన్నులు 2015-16లో 1,53,87,000 టన్నులు. వర్తమాన సంవత్సరంలో అక్టోబరు వరకు నెల సగటు 1,61,69,428 టన్నులు. మోడీ భక్తులేమో కొత్తగా పన్నులు పెంచలేదంటారు, అయితే ఆదాయం ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది? మోడీ మంత్రం వేసి పెంచారా ? మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి. మన దేశంలోకి వుగ్రవాదులను పంపిన పాక్‌పై మన సైన్యం సర్జికల్‌ దాడులు చేస్తే మనమంతా అభినందించాం. దానికైన ఖర్చు వందల కోట్లు లేదా అంతకంటే తక్కువే కావచ్చు. కానీ మోడీ సర్కార్‌ ప్రతి ఏటా జనంపై పెట్రో రంగంలో జరుపుతున్న సర్జికల్‌ దాడులవలన జనానికి వదులుతున్న చేతి చమురు మాత్రం రెండు లక్షల కోట్లకు పైమాటే.

    పెట్రోలియం రంగం నుంచి ఒక్క ఏడాదిలో లక్ష కోట్ల అదనపు ఆదాయాన్ని ఎలా పిండారు ? 2014 మార్చినెల ఒకటవ తేదీన అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 118 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.62.12 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.47.18, డీలరుకు విక్రయించింది రు.49.50, ఎక్సయిజ్‌ పన్ను రు.9.48, డీలరు కమిషన్‌ రు.2.02, న్యూఢిల్లీలో వాట్‌ 20శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.12.20, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.73.20.

    తాజా పరిస్ధితికి వస్తే నవంబరు ఆరున హెచ్‌పి కంపెనీ వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 61.87 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.66.81 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.26.64, డీలరుకు విక్రయించింది రు.29.39 ఎక్సయిజ్‌ పన్ను రు.21.48, డీలరు కమిషన్‌ రు.2.43, న్యూఢిల్లీలో వాట్‌ 27శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.14.39, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.67.70. ఎక్సయిజ్‌ పన్ను రు.9.48 నుంచి 21.48కి పెంచటమే ఆదాయ పెరుగుదల రహస్యం.

    యుపిఏ హయాంలో రూపాయి విలువ నాటి అర్ధిక మంత్రి వయస్సు పెరిగినట్లు పతనం అవుతోందని స్వయంగా నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు.http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2389308/India-2014-elections-Yes-Yes-Modi-launches-BJPs-poll-campaign-massive-rally-Hyderabad.html మోడీ చెప్పినట్లు 1947లో మన రూపాయి విలువ ఒక డాలరుకు ఒక రూపాయిగా వున్నమాట నిజం. కాంగ్రెస్‌ దిగిపోయే నాటికి అంటే రు.62.12కు దిగజారింది. అంటే 67 సంవత్సరాలకు సగటున ఏడాదికి 93 పైసలు పడిపోయింది. అదే మోడీ హయాంలో 62.12 నుంచి 66.81కి పతనమైంది. ఏడాదికి రు 2.34 తగ్గిపోయింది. ఇది కూడా మోడీ ఘనతే అంటారా ? మన దేశంలో పెట్రోలు ధరలు తగ్గకపోవటానికి ఇదొక కారణం. అన్నింటి కంటే పై వివరాలను బట్టి నరేంద్రమోడీ హయాంలో బాదిన ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు పన్నెండు రూపాయలు. జనం జేబుల లూటీ ఇక్కడ జరుగుతోంది. దీన్ని కాదనే ధైర్యం ఎవరికైనా వుందా ?

   ఇక పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు తక్కువగా వున్నాయని మోడీ భక్తులు అంగీకరిస్తారో లేదో తెలియదు. వారు కూడా మన మాదిరే పెట్రోలు దిగుమతి చేసుకుంటారు. ఈనెల 9వ తేదీన పాకిస్ధాన్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలా వున్నాయి. అక్కడ పెట్రోలు కంటే డీజిల్‌ ధరలు ఎక్కువ.http://www.hamariweb.com/finance/petroleum_prices/ దీనిలో వున్న వివరాల ప్రకారం పెట్రోలు ధర రు. 64.27, డీజిల్‌ ధర రు.72.52 వుంది. వీటిని చూసి మోసపోయే అవకాశం వుంది. రెండు చోట్లా కరెన్సీ రూపాయే అయినప్పటికీ విలువలు వేరు. పై ధరలను మన రూపాయిల్లోకి మారిస్తే డీజిల్‌ ధర రు.46.44, పెట్రోలు ధర రు.41.15 వుంటుంది. దీనికి కారణం అక్కడ పన్నులు తక్కువగా వుండటమే.http://www.globalpetrolprices.com/gasoline_prices/ ఈ లింక్‌లోని సమాచారం ప్రకారం వివిధ దేశాలలో డాలర్లలో పెట్రో వుత్పత్తుల ధరలు ఎలా వున్నాయో ఎవరైనా పోల్చుకోవచ్చు.

   ఇక చాలా మంది పెట్రోలియం వుత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తారని, దాంతో ధరలు తగ్గుతాయనే అభిప్రాయంతో వున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలు, వెల్లడైన అభిప్రాయాల ప్రకారం పెట్రోలియం వుత్పత్తులను వెంటనే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురారు. ప్రస్తుతం పెట్రోలు కొనుగోలు ధర లీటరుకు రు.29.39 అయితే దానిపై విధిస్తున్న పన్నులు రు.35.87 వున్నాయి. జిఎస్‌టి పద్దతిలో పన్ను మీద పన్ను వుండటానికి వీలుండదు. ప్రస్తుతం అన్ని కలుపుకుంటే 122శాతం వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తాన్ని వదులుకొని ఏ ప్రభుత్వమైనా పన్ను తగ్గిస్తుందని ఎవరైనా వూహించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. అలాంటి వారి భ్రమలను త్వరలోనే నరేంద్రమోడీ తొలగిస్తారని వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Subsidies on Commodities

08 Tuesday Mar 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Details of Subsidies, India subsidies, subsidies, Subsidies on Commodities

The subsidy bill of the Central Government has remained in the range of Rs. 2.50 lakh crore to Rs. 2.58 lakh crore during the period, 2014-15 to 2016-17 (Budget Estimates). The fiscal deficit of the Central Government, which is the difference between total expenditure and non-debt receipts, has been in the range of Rs. 5.11 lakh crore to Rs. 5.35 lakh crore in this period. As proportion of GDP, both subsidy bill and fiscal deficit declined during this period.

Details of subsidies given under different heads are in table below:

Details of Subsidies (Rs. in crore)

Subsidy 2012-13 2013-14 2014-15 2015-16 RE
Food 85000 92000 117671 139419
Fertilizer 65613 67339 71076 72438
Petroleum 96880 85378 60269 30000
Other 9586 9915 9242 15944
Total 257079 254632 258258 257801
RE=Revised Estimates

 

Direct Benefit Transfer (DBT) was started in 1.1.2013 and expanded across all Central Sector/Centrally Sponsored Schemes involving cash transfers to individual beneficiaries in February 2015. In cash transfer, the benefit is transferred in the beneficiary’s account, preferably Aadhaar seeded. Presently, LPG subsidy is transferred directly in to the bank accounts of beneficiaries. Food subsidy in cash is disbursed in wo Union Territories viz, Puducherry and Chandigarh, directly in beneficiaries’ bank accounts, in kind, after biometric authentication, in 70000 fair price shops at present. The Union Budget 2016-17 has indicated the introduction of DBT on pilot basis for fertilizer in a few districts across the country. Hence, it is difficult to indicate a timeframe for completing the shift to the system of cash transfer.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఈ సబ్సిడీల మాటేమిటి ?

29 Monday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

India subsidies, indirect subsidies, subsidies

కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. వీటిలో చమురు దిగుమతులపై పన్ను అందరికీ వుపయోగపడుతుందనుకుంటే ఎక్కువ భాగం కార్పొరేట్‌లు, ధనికులకే అన్నది స్పష్టం

ఎం కోటేశ్వరరావు

సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాల దిగుమతిపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే.

ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలలో పేదలకు దక్కాల్సిన దాదాపు లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని ధనికులు కొట్టేస్తున్నారు, కనుక వాటికి కోత పెట్టాలన్నది తాజా ఆర్ధిక సర్వే సందేశం. ప్రతి ఏటా సాధారణ బడ్జెట్‌కు ముందు ఆర్ధిక సర్వే పేరుతో విడుదల చేసే పత్రంలో ప్రభుత్వ ఆలోచనను ముందస్తుగా వెల్లడిస్తారు. మన కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు, ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ తత్వం పూర్తిగా తలకెక్కిన అరవింద సుబ్రమణ్యం దీన్ని రూపొందించారు. సబ్సిడీలు మంచివే కాని వాటిని కానివారు కొట్టేస్తున్నారు కనుక కోత పెట్టాలి. ఎంత తెలివిగా వాదిస్తున్నారో కదా ?పైన పేర్కొన్న వాటిని ఏమంటారు? సబ్సిడీలు కావా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు ?కానీ ఈ పెద్దలే ప్రతి ఏటా పరోక్షంగా ఇస్తున్న లక్షల కోట్ల సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు.

కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13        5,66,234.7

2013-14        5,72,923.3

2014-15        5,54,349.04

2015-16       6,11,128.31

కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. వీటిలో చమురు దిగుమతులపై పన్ను అందరికీ వుపయోగపడుతుందనుకుంటే ఎక్కువ భాగం కార్పొరేట్‌లు, ధనికులకే అన్నది స్పష్టం.మరోవైపున నరేంద్రమోడీ ఈ మధ్య రైతుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.మరోవైపున ఏదో ఒక పేరుతో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలను తగ్గిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రైతాంగానికి తగ్గుతున్న, పారిశ్రామికవేత్తలకు పెరుగుతున్న సబ్సిడీలు

01 Tuesday Dec 2015

Posted by raomk in Economics, Farmers, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Farmers, Fertilizers, subsidies

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో ఏటే రైతాంగానికి సబ్సిడీలు తగ్గుతుండగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఏటేటా సబ్సిడీలు పెరుగుతున్నాయి. రైతాంగానికి సబ్సిడీలను తగ్గించాలని, ఇతరులకు ఇంకా పెంచాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనవంటి దేశాలపై వత్తిడి తెస్తోంది. గత పదమూడు సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న ఎరువుల సబ్సిడీల తీరుతెన్నులు ఇలా వున్నాయి.

ఏడాది వుత్పత్తి సబ్సిడీ (రు.కోట్లలో )

2002-2003దేశీయ యూరియా 7790

2002-2003 దిగుమతి యూరియా 1.16

2002-2003 దేశీయ కాంప్లెక్స్‌ 2487.94

2002-2003 దిగుమతి కాంప్లెక్స్‌ 736.58

11,015.68

2003-2004దేశీయ యూరియా 8521

2003-2004దిగుమతి యూరియా 0.82

2003-2004 దేశీయ కాంప్లెక్స్‌ 2606

2003-2004 దిగుమతి కాంప్లెక్స్‌ 720

11,847.82

2004-2005 దేశీయ యూరియా 10243.15

2004-2005 దిగుమతి యూరియా 742.37

2004-2005 దేశీయ కాంప్లెక్స్‌ 3977

2004-2005 దిగుమతి కాంప్లెక్స్‌ 1165.18

16127.70

2005-2006 దేశీయ యూరియా 10652.57

2005-2006దిగుమతి యూరియా 2140.88

2005-2006దేశీయ కాంప్లెక్స్‌ 4499.2

2005-2006దిగుమతి కాంప్లెక్స్‌ 2096.99

19,389.61

2006-2007దేశీయ యూరియా 12650.37

2006-2007 దిగుమతి యూరియా 5071.06

2006-2007 దేశీయ కాంప్లెక్స్‌ 6648.17

2006-2007 దిగుమతి కాంప్లెక్స్‌ 3649.95

28,019.55

2007-2008 దేశీయ యూరియా 16450.37

2007-2008 దిగుమతి యూరియా 9934.99

2007-2008 దేశీయ కాంప్లెక్స్‌ 10333.8

2007-2008 దిగుమతి కాంప్లెక్స్‌ 6600

43,319.16

2008-2009 దేశీయ యూరియా 20968.74

2008-2009 దిగుమతి యూరియా 12971.18

2008-2009 దేశీయ కాంప్లెక్స్‌ 32957.1

2008-2009దిగుమతి కాంప్లెక్స్‌ 32597.69

99,494.71

2009-2010 దేశీయ యూరియా 17580.25

2009-2010 దిగుమతి యూరియా 6999.98

2009-2010 దేశీయ కాంప్లెక్స్‌ 16000

2009-2010దిగుమతి కాంప్లెక్స్‌ 23452.06

64,032.29

2010-2011 దేశీయ యూరియా 15080.73

2010-2011 దిగుమతి యూరియా 9255.95

2010-2011దేశీయ కాంప్లెక్స్‌ 20650

2010-2011 దిగుమతి కాంప్లెక్స్‌ 20850

65,836.68

2011-2012 దేశీయ యూరియా 20285.46

2011-2012దిగుమతి యూరియా 17475

2011-2012 దేశీయ కాంప్లెక్స్‌ 20237.49

2011-2012దిగుమతి కాంప్లెక్స్‌ 16571.92

74,569.87

2012-2013 దేశీయ యూరియా 20000

2012-2013దిగుమతి యూరియా 20016

2012-2013దేశీయ కాంప్లెక్స్‌ 16000

2012-2013దిగుమతి కాంప్లెక్స్‌ 14576.1

80,592.1

2013-2014 దేశీయ యూరియా 26500

2013-2014 దిగుమతి యూరియా 15324.36

2013-2014 దేశీయ కాంప్లెక్స్‌ 15500

2013-2014 దిగుమతి కాంప్లెక్స్‌ 13926.86

71,251.22

2014-2015దేశీయ యూరియా 38200.01

2014-2015దిగుమతి యూరియా 16200

2014-2015దేశీయ కాంప్లెక్స్‌ 12000

2014-2015దిగుమతి కాంప్లెక్స్‌ 8667.3

75,067.31

ఈ వివరాలను గమనించినపుడు గత 13 సంవత్సరాలలో అన్ని రకాల ఎరువుల సబ్సిడీ కనిష్టంగా 11వేల కోట్ల నుంచి 2008-09 సంవత్సరంలో గరిష్టంగా 99వేల కోట్లకు చేరింది. 2014-15లో 75వేల కోట్లకు పడిపోయింది. మరొక ముఖ్య విషయం ఏమంటే 2002-03లో దేశీయ ఎరువుల సబ్సిడీ 10,277.94 కోట్లు కాగా విదేశీ దిగుమతుల సబ్సిడీ 737.74 కోట్లు మాత్రమే. గరిష్టంగా వున్న ఏడాదిలో స్వదేశీ సబ్సిడీ రు.53.565.84 విదేశీ సబ్సిడీ రు.36,423 కోట్లు. అదే 2014-15 నాటికి దేశీయ సబ్సిడీ 50,200 కోట్లు కాగా విదేశీ సబ్సిడీ 24,867 కోట్లకు తగ్గిపోయింది. పదమూడు సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం 6,60,563.7కోట్లు అంటే సగటున ఏడాదికి 50,812 కోట్లు మాత్రమే. దేశంలో పది నుంచి పన్నెండు కోట్ల మంది రైతులున్నారని అంచనా. ఈ లెక్కన ఒకొక్కరికి ఏడాదికి 4,234 నుంచి 5,081 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పవచ్చు.అదే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు వివిధ పథకాల పేరుతో ఇచ్చిన పన్ను, ఇతర రాయితీల మొత్తం 2013-14లో ఐదులక్షల యాభైవేల కోట్ల రూపాయలు కాగా 2014-15లో 5.89లక్షల కోట్ల వరకు వుండవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో రైతులకు ఇస్తున్న సబ్సిడీ తగ్గిపోతోంది. వ్యవసాయం గిట్టుబాటుగాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తుంటాయి. జనం సొమ్ము, జనానికి దక్కాల్సిన సొమ్ము నుంచి రాయితీలు పొందుతున్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు గిట్టుబాటుగాక వారికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు దివాలా తీస్తున్నాయి లేదా నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ఎక్కడా వినపడదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: