• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ycp

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇసుక సమస్య జగన్‌ సర్కార్‌ స్వయంకృతం !

01 Friday Nov 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion

≈ 1 Comment

Tags

sand crisis in Andhra Pradesh, tdp, Ycp, ys jagan government

Image result for sand crisis : ys jagan government brought on by one's self

ఎం కోటేశ్వరరావు
ఎవరు అవునన్నా కాదన్నా, అధికార పార్టీ నేతలు ఎంత గింజుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఒక ప్రధాన సమస్యగా మారింది. దీని వలన లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే పనుల్లేని రాజకీయవేత్తలకు చేతి నిండా పని దొరుకుతోంది. దీనికి కారకులు ఎవరు అంటే అధికార పక్షం ప్రకృతి మీద నెడుతోంది. నదులు, వాగులు, వంకలకు వరదలు తగ్గి ఇసుక తీసుకొనే పరిస్ధితి ఎంత త్వరగా రప్పిస్తావో భగవంతుడా అన్నట్లుగా ఉగ్గపట్టుకొని ఉంది. కారణాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద నెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగంగా ఈ సమస్య మీద నోరు విప్పటం లేదు. అధికారులతో సమీక్షల సందర్భంగా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తప్ప ప్రత్యక్షంగా విన్నవారు లేరు.
ప్రస్తుతం రాష్ట్రంలో వివాదంగా మారిన ఇసుక సమస్యకు ప్రధాన కారణం జగన్‌ సర్కార్‌ స్వయం కృతమే అని చెప్పాల్సి ఉంది. అధికారానికి వచ్చిన తరువాత అంతకు ముందున్న విధానాన్ని నిలిపివేసి మూడునెలల తరువాత కొత్త విధానాన్ని నిర్ణయించారు. పోనీ అదేమన్నా విప్లవాత్మకమైనదా అంటే కాదు. అంతకు ముందు ఉచితం పేరుతో ఇచ్చినా అధికార పార్టీ పెద్దలకు కప్పం చెల్లించి ఇసుకను తెచ్చుకోవాల్సి వచ్చింది, రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియాలు తయారయ్యాయన్నది కాదనలేని సత్యం. జగన్‌ సర్కార్‌ విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. టన్నుకు రూ 370 ధర, కిలోమీటర్‌కు రూ 4.90 రవణా చార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. ఆచరణలో దొరుకుతున్న కొద్ది మొత్తం కూడా ఆ ధరలకు రావటం లేదన్నది వాస్తవం.
ముమ్మరంగా నిర్మాణాలు జరిగే సమయంలో దాదాపు మూడు నెలల పాటు ఇసుక క్వారీలను మూసివేయటాన్ని జగన్‌ అనుభవరాహిత్యం అనాలా, సలహాదారులు తప్పుదారి పట్టించారని భావించాలా ? ఏ నిర్ధారణకు వచ్చినా అంతిమంగా ముఖ్యమంత్రిగా జగన్‌దే బాధ్యత అవుతుంది.జూన్‌, జూలై మాసాల్లోనే పనులు పోతున్నాయని కార్మికులు గగ్గోలు పెడుతున్నపుడే మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేది కాదు. ఇసుక విధానం ప్రకటించక ముందు కొన్ని చోట్ల అధికారపార్టీ పెద్దలు అనధికారికంగా ఇసుకను దండుకున్నారనే విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో నిమగం కావటం, సాధారణంగా వర్షాకాలంలో, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోయిన తరువాత తుపాన్ల కారణంగా అత్యవసరం అయితే తప్ప నిర్మాణాలు జరగవు. పట్టణాల్లో కూడా పరిమితమే. ఈ ఏడాది అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు, నదులకు వరదల కారణంగా ఇసుక తీయటంలో కొంత అసౌకర్యం ఏర్పడిందన్నది వాస్తవం. అధికార పార్టీ, ప్రభుత్వం ఈ కారణాలను చెప్పి సమస్య నుంచి తప్పుకోవాలని చూస్తోంది. నిర్మాణాలు ముమ్మరంగా జరిగే సమయంలో కార్మికులు నాలుగు డబ్బులు వెనకేసుకొని పనులు తక్కువగా లేదా లేని సమయంలో వాటితో కుటుంబాలను నెట్టుకొస్తారు. ఈ ఏడాది అటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వమ్ము చేసింది. అదే జగన్‌ ప్రతిపక్షంలో ఉంటే ఈ పాటికి ఓదార్పు యాత్రలను ప్రారంభించి ఉండేవారు కాదా ! ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఓదార్పు అనేందుకు అవకాశం లేదు, సహజంగానే ఇప్పుడు ఆ పాత్రను ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం నానాటికీ పెరుగుతున్న కారణంగా ఆ రంగంలో పని రోజులు తగ్గిపోతున్నాయి. గతంలో వ్యవసాయం తరువాత చేనేత ప్రధాన వృత్తిగా ఉండేది. ఆ రంగంలో యాంత్రీకరణ కారణంగా నేత కార్మికులు వ్యవసాయ కార్మికులుగా, నిర్మాణ కార్మికులుగా, ఇతర రంగాల్లోకి మారిపోయారు. వివిధ కారణాలతో నిర్మాణ రంగం నేడు వ్యవసాయం తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్మిక శాఖ వద్ద నమోదు అయిన నిర్మాణ కార్మికుల సంఖ్య 30 లక్షలు. వీరు గాక నిర్మాణ రంగ అనుబంధ కార్యకలాపాల్లో కనీసం మరో పదిలక్షల మందికి ఉపాధి దొరుకుతున్నట్లు అంచనా. ప్రతి రోజు కనీసం లక్ష టన్నుల ఇసుక అవసరమన్నది నిర్మాణ రంగం వారి అంచనా. దానికి గాను దొరకుతున్నది ఎంత అంటే వర్షాలు పడి నదులు, వాగులు, వంకలు పొంగుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో అసలు లేదంటే అతిశయోక్తి కాదు. దొరికినా అది ఏమాత్రం చాలటం లేదు. అధికారులు రోజుకు 40వేల టన్నుల ఇసుక దొరుకుతోందని, కొన్ని నిమిషాల్లోనే విక్రయాలు అయిపోతున్నాయని చెబుతున్నారు. ఏ రోజు ఎంత విక్రయిస్తున్నారో, పరిస్ధితి ఎలా మెరుగుపడుతోందో అధికారికంగా సమాచారాన్ని వెల్లడించినపుడే ఏం చెప్పినా విశ్వసనీయత ఉంటుంది. తప్పు పట్టిన వారి మీద ఎదురు దాడి చేయటం తప్ప అలాంటిదేమీ లేదు.
ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమస్య మీద అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి పరిస్ధితిని వివరించి, సలహాలు కోరి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి. అదేమీ లేకపోగా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు వత్తిడి పెరిగిన తరువాత అధికారులతో సమీక్ష జరిపారు. నవంబరులో ఇసుక వారాన్ని పాటించి కొరత రాకుండా చూడాలని కోరినట్లు అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు, సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని దాన్ని అరికట్టాలని డిజిపిని ఆదేశించినట్లు చెప్పటం సమస్య తీవ్రతను అంగీకరించటమే. సరిహద్దు ప్రాంతాల ఇసుక సమస్య విషయానికి వస్తే ఇటు నుంచి అటు ఎలా వెళుతోందో అటు నుంచి ఇటు కూడా రావటం కొత్త విషయమేమీ కాదు. కొరతకు అది ప్రధాన కారణం కాదు. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్ధితి కూడా లేదని గ్రహించటం అవసరం.ఈ ఏడాది వరదల కారణంగా ఇసుక లభ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇసుక తవ్వకం కూడా సులభం అవుతుంది.
సమస్యలు ఉన్నపుడు సహజంగానే ప్రతిపక్షాలు దాన్ని పట్టించుకోకపోతే తప్పు అవుతుంది. అధికార పక్షం వాటికి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి తప్ప వారికేమి హక్కు ఉంది అంటే కుదరదు. తెలుగుదేశం పార్టీ, బిజెపి వంటి పార్టీలు రంగంలోకి రాకముందే భవన నిర్మాణ కార్మిక సంఘాలు, వాటికి మద్దతుగా వామపక్షాలు ఈ సమస్యను ముందుగా ప్రభుత్వ దృష్టికి తెచ్చాయి. వారేమీ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాలు కాదు, అక్రమాలకు పాల్పడలేదు. ప్రారంభంలోనే ఈ సమస్యకు తెరదించి కార్మిక సంఘాలు, పార్టీలతో చర్చించి ఉంటే నేడు నిజంగా ఇసుకను రాజకీయం చేస్తున్న వారికి అవకాశాలు వచ్చేవి కాదు.

Image result for sand crisis : ys jagan government brought on by one's self
గత ప్రభుత్వంలో ఆర్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మార్చివేశారనటంలో ఎలాంటి మినహాయింపులు లేవు. ఎన్నికల్లో ఎంఎల్‌ఏలు, ఎంపీలుగా గెలిచిన వారు, వారి ప్రత్యర్ధులుగా పోటీ చేసి ఓడిన వారు ఎన్నేసి కోట్లు ఖర్చు పెట్టారో తెలియంది కాదు. ఆ మొత్తాలను వడ్డీతో అసలే కాదు, రాబోయే ఎన్నికలకు అంతకంటే ఎక్కువ పెట్టుబడులను సమకూర్చుకొనేందుకు సంపాదించాలంటే అడ్డదారులు తప్ప మరొక మార్గం లేదు. అందుకే రాజకీయనేతలు,ప్రజా ప్రతినిధులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు చేరుతున్నారు. వారంతా చేతి వాటం ప్రదర్శించకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటారనే భ్రమల్లో ఎవరూ ఉండనవసరం లేదు. ఎన్నికల్లో భారీ పెట్టుబడులు పెట్టిన వైసిపి ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, ఇతర నేతలు అవకాశాల కోసం ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు. వారిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తే అధికార పార్టీలో అసమ్మతికి, వదలి వేస్తే రాజకీయంగా పతనానికి నాంది అవుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల మీద తీవ్ర విమర్శలు చేసి అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారానికి వచ్చిన నేతలు అనేక మంది ఆచరణలో అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడిన ఉదంతాలు ఎన్నో. నేడు అధికారమే పరమావధిగా భావించే పార్టీలలో నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఎక్కడైనా ఒకరో అరో ఉండొచ్చు తప్ప మిగిలిన వారందరూ సంపాదనకు తెరతీసిన వారే. వైసిపి కూడా అదే కోవకు చెందినదే. తెలుగుదేశం అవినీతిని ఎన్నికలకు ముందూ తరువాత ఉతికిపారేస్తున్న వైసిపి నాయకత్వం సహజంగానే అందుకు భిన్నంగా ప్రవర్తించాలనే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశించవచ్చా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్‌, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు వంద రోజులు !

12 Thursday Sep 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

100 days : ys jagan as cm- chandrababu as opposition leader, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్‌ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.

జగన్‌ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్‌ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్‌ వుత్పత్తి సంస్ధలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్‌ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్‌ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్‌ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.

ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.

తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్‌ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్‌ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్‌. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్‌ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.

Image result for ys jagan vs chandrababu naidu

అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్‌ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.

తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.

గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు చర్చలు – కొన్ని ప్రశ్నలూ !

10 Saturday Aug 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

Abrogation of Article 370 and 35A, Article 370 and 35A, BJP, Kashmir Valley, tdp, Ycp

ఎం కోటేశ్వరరావు

1.గతంలో ఏం జరిగిందనేది వదిలేద్దాం !

గతంలో జరిగిందాన్ని వదిలేద్దాం, ఎందుకు వదలి వేయాలి, ఎలా వదలి వేస్తాం, సరే వాదన కోసం అంగీకరిద్దాం. ఒక్క కాశ్మీర్‌ విషయమేనా లేక భారత చరిత్ర మొత్తాన్ని వదలి వేయాలా ? మనం ఒకదారిలో కొంతదూరం ప్రయాణించాం. ఎటువైపు నుంచి వచ్చామో గుర్తులేకపోతే, మననం చేసుకోకపోతే ఎటుపోవాలో ఎలా తెలుస్తుంది. కాశ్మీర్‌ విషయంలో చారిత్రక తప్పిదం జరిగింది, దానికి నెహ్రూ అసలు కారకుడని బిజెపి, సంఘపరివార్‌ లేదా వారి మద్దతుదారులు, వారు రాసిందాన్ని గుడ్డిగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నవారంతా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారానికి ఆధారం ఏమిటి? గత చరిత్రే కదా. వారు దాన్ని విస్మరించనపుడు మిగతా వారెందుకు వదిలివేయాలి. తమకు ఒక ప్రమాణం, ఇతరులకు మరొకటా ? చరిత్రను, వాస్తవాలను వక్రీకరించే కదా ఇంతవరకు తెచ్చింది. అందువలన చరిత్రలోకి పోవద్దు అనటం అంటే వారి బండారం బయటపడుతుందనే భయమే కారణమా ?

2.వారి బండారం, చరిత్ర అంటున్నారు, అసలు వారెవరు ?

బ్రిటీష్‌ ఇండియాలో అఖిల భారత హిందూ మహాసభను ఏర్పాటు చేస్తే జమ్మూలోని డోగ్రా హిందువులను సమీకరించేందుకు ఆల్‌ జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే జమ్మూలో 1939లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ ఏర్పడింది. తరువాత దాన్ని మరింత విస్తరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ను తొలుత జమ్మూకు, తరువాత కాశ్మీర్‌ లోయకు పంపారు. సదరు హిందూ సభ నేత ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌చాలక్‌ ప్రేమనాధ్‌ డోగ్రా. దేశ విభజన నిర్ణయం జరిగిన తరువాత 1947 మే నెలలో కాశ్మీర్‌ సంస్ధాన భవిష్యత్‌ గురించి రాజు హరి సింగ్‌ ఏ వైఖరి తీసుకుంటే అదే తమ వైఖరి అని హిందూ సభ చెప్పింది. అపర దేశభక్తి అంటే ఇదేనా ? రాజు స్వతంత్ర దేశంగా వుంటామని ప్రకటించాడు. అయితే అదే ఏడాది అక్టోబరులో పాకిస్ధాన్‌ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు పూనుకుంటే రాజు భారత రక్షణ కోరాడు. రాజుగారితో పాటు దేశభక్తులూ మారారు. తరువాత హిందూ సభను ప్రజాపరిషత్‌ పార్టీగా మార్చారు. దీని లక్ష్యం ఏమిటయ్యా అంటే కాశ్మీర్‌ను దేశంతో పూర్తిగా విలీనం గావించటం, కమ్యూనిస్టుల ఆధిపత్యం వున్న డోగ్రా వ్యతిరేక షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం అని బలరాజ్‌ మధోక్‌ ప్రకటించాడు. మరి ఈ చరిత్రను కూడా మరచి పోవాలా ?

2. ఆర్టికల్‌ 370,35ఏ రద్దు దేశానికే మంచిది? అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జరగలేదు. ఈ చర్యతో దేశంలో పూర్తి విలీనం జరిగింది.

సదరు ఆర్టికల్స్‌ కాశ్మీర్‌కే పరిమితం, వాటి రద్దు వలన దేశానికి లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే మంచేమిటి ? ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు రద్దయితే మొత్తం దేశానికి వచ్చేదేమిటి? పూర్తి విలీనం జరగకపోతే గత ఏడు దశాబ్దాలుగా అక్కడ ఏడులక్షల మంది సైనికులు, ఇతర భద్రతా బలగాలు ఎందుకు, ఎలా వున్నట్లు ? ఇప్పుడు పూర్తి విలీనం అయింది కనుక వారంతా వెనక్కు వస్తారా ? జమ్మూకాశ్మీర్‌లో చేసిన ఖర్చు మొత్తం ఆ రాష్ట్ర ప్రజలకు చేసినట్లు ఎలా అవుతుంది. మిలిటరీ, సిఆర్‌పిఎఫ్‌, సరిహద్దు రక్షణ ఖర్చును కూడా కాశ్మీరీల ఖాతాలో వేస్తారా ? అదే అయితే చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కూడా సరిహద్దులు, వాటి రక్షణకు సైనిక బలగాలు వున్నాయి, ఆ ఖర్చు మొత్తాన్ని ఆయా పరిసర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఇచ్చిన నిధులుగా పరిగణిస్తారా ?

3. ఇప్పుడు ఆర్టికల్స్‌ రద్దువద్దని చెప్పే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారు వుగ్రవాదుల దాడుల సమయంలో కాశ్మీర్‌ పండిట్లను తరిమివేసినపుడు ఎ్కడ వున్నారు ?

కాశ్మీరీ పండిట్లపై కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, పాక్‌ మద్దతువున్న మతశక్తులు జరిపిన దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వేర్పాటు, వుగ్రవాద సంస్ధలు తప్ప కమ్యూనిస్టులతో సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సమర్ధించలేదు. ఖండించాయి. పండిట్ల పేరుతో గుండెలు బాదుకుంటున్న బిజెపి ఇతర పార్టీలు అంతకు మించి అదనంగా చేసింది ఏమిటి?

4.పాకిస్తానీ యువకులు కాశ్మీర్‌కు వచ్చి అక్కడి యువతులను వివాహం చేసుకొని పౌరసత్వం పొందుతున్నారు.!

గత ఐదు సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది, మధ్యలో పిడిపితో కలసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ కాలంలో ఎంత మంది పాక్‌ యువకులు వచ్చి కాశ్మీరీ యువతులను వివాహం చేసుకొని భారత పౌరసత్వం పొందారో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి వారు లెక్కలు చెప్పగలరా ? పాకిస్ధాన్‌ నుంచి ఎవరైనా భారత్‌కు రావాలంటే వీసా వుండాలి. లేదా దొంగచాటుగా రావాలి. కేంద్రప్రభుత్వం ఎందరికి వీసా ఇచ్చింది? లేదా దొంగచాటుగా వచ్చే వారిని కేంద్ర ఆధీనంలోని సరహద్దు భద్రతా దళాలు లేదా ఇతర భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ? భద్రతా సిబ్బంది గానీ, లవ్‌ జీహాద్‌ను వ్యతిరేకిస్తున్నామని తిరిగే హిందూత్వ సంస్ధలవారు గాని ఎంత మంది దొంగ పెళ్లికొడుకులను పట్టుకున్నారో చెబుతారా ?

5.కాశ్మీర్‌ హిందువులు, సిక్కులు మైనారిటీలు,దళితులు, గిరిజనులు, బిసిల వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు !

మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీర్‌లో రిజర్వేషన్లు లేవన్నది పచ్చి అబద్దం. దేశంలో అన్ని చోట్లా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వుంటే ఎక్కడా లేని విధంగా కాశ్మీరులో వెనుకబడిన ప్రాంతాల వారికి రిజర్వేషన్లు వున్నాయి.2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి.

6. పాకిస్ధాన్‌ నుంచి వలస వచ్చిన వారికి కాశ్మీర్‌లో పునరావాసం కల్పించే అవకాశం లేదు !

పాకిస్ధాన్‌ లేదా మరొక దేశం ఎక్కడి నుంచి వలస వచ్చినా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వారికి ఎక్కడైనా పునరావాసం కల్పించవచ్చు. కాశ్మీర్‌లోనే అని ఎందుకు పట్టుబడుతున్నారు? గతంలో పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా , శ్రీలంక, టిబెట్‌ నుంచి వచ్చిన వారికి దేశంలో అనేక ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. తెలుగు ప్రాంతాల్లో బర్మా కాలనీల పేరుతో అనేకం వున్నాయి. ఏదో ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయలేదు. ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనటం వెనుక వున్న వుద్ధేశ్యాలేమిటి ?

7. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలిగించినందువలన ప్రయోజనం లేదని తేలిపోయింది !

ఈ అంశంపై బిజెపికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరింది తామే అని ప్రచారం చేసుకున్న అంశం, 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ వాగ్దానాన్ని మరచిపోయారా ? పార్లమెంట్‌లో కాశ్మీర్‌ హోదా రద్దుకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, వైసిపి పార్టీలు 70ఏండ్లుగా కాశ్మీర్‌కు ప్రయోజనం లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఎందుకు అడుగుతున్నట్లు ? ఏమిటీ రెండు నాలుకల వైఖరి ?

8. కాశ్మీర్‌పై ఇంతకంటే ఏమి చర్చించాలి?

అదే ప్రాతిపదిక అయితే రేపు మరొక అంశానికి ఈ మాత్రం కూడా చర్చించాల్సిన పనేమిటి, ఎలాగూ వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు కనుక మేము చేయదలచుకున్నది చేశాం, పార్లమెంట్‌,అసెంబ్లీల్లో మాకు మెజారిటీ వుంది కనుక ఆమోదించుకుంటాం అంటే ఏం చేస్తారు ? ప్రజాస్వామ్యం అంటే ఇదా ? ఒక బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టాలంటే ముందుగా సభానిర్వహణ సలహా కమిటీకి తెలియచేయాలి, సభ్యులకు ముసాయిదా బిల్లులను ముందుగా అందచేయాలి. కాశ్మీర్‌ విషయంలో అదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంట్‌ తలుపులు మూసి చేశారు మేము, తెరిచే చేశాము అంటున్నారు. అప్పుడు తలుపులు మూసినపుడు ఆ చీకట్లోనే బిజెపి, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ కలిసే కదా చేసింది. నాడు చేయని విమర్శ బిజెపి ఇప్పుడెందుకు చేస్తున్నట్లు ? ఏ ఒక్క రాష్ట్ర విభజన సమయంలో అయినా ఆ రాష్ట్రాల్లో కాశ్మీరులో మాదిరి 144సెక్షన్లు, కర్ఫ్యూలు, పోన్లు, ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టలేదు, వ్యతిరేకించినా, అనుకూలించినా అసెంబ్లీల్లో చర్చకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎందుకు జరపలేదు. అసెంబ్లీ లేని సమయంలో బిల్లులు పెట్టాల్సిన తొందరేమొచ్చింది?

9. పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత వ్యతిరేకించటం ఏమిటి ?

పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన ప్రజలకు, పార్టీలకు వ్యతిరేకించే హక్కులేదా ? ప్రపంచంలో ప్రతి నియంత అన్నింటినీ చట్టబద్దంగానే చేశారు. వాటిని ప్రజలెందుకు వ్యతిరేకించినట్లు ? 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితికి అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు కారణాలుగా చూపారు. పార్లమెంట్‌లో పూర్తి ఆమోదం పొందారు. దాన్ని బిజెపి పూర్వరూపం జనసంఘం ఆమోదించిందా వ్యతిరేకించిందా, ఇంకా అనేక పార్టీలు ఎందుకు వ్యతిరేకించినట్లు ? జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ కూడా అంతా పార్లమెంట్‌ ఆమోదం పేరుతోనే ప్రపంచాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నాడు. మరి హిట్లర్‌ను ఎందుకు వ్యతిరేకించినట్లు ?

10. రిజర్వేషన్లు కూడా ఆయా తరగతుల వారిని వుద్దరించింది లేదు !

కాశ్మీర్‌ విషయంలో 370 చేకూర్చిన ప్రయోజనం లేదని వాదిస్తున్న వారిలో అనేక మంది విద్యా, వుద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఆయా తరగతులను వుద్దరించలేదు, గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నిషేధ చట్టాల వలన గిరిజనులు కూడా అభివృద్ధి చెందలేదు, అక్కడ పరిశ్రమలు రావటం లేదు కనుక ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజమే కదా అని వాటిని కూడా రద్దు చేస్తే పరిస్ధితి ఏమిటి ?

వక్రీకరణలు – వాస్తవాలు !

పాకిస్తానీయులు కాశ్మీర్‌ వచ్చి అక్కడి యువతిని వివాహం చేసుకొని స్ధానికులుగా మారి వుగ్రవాదానికి పాల్పడుతున్నారు- ఒక ప్రచారం.

పాకిస్ధానీ యువకులే కాదు, ఏ విదేశీయువకులైనా కాశ్మీరీ యువతినే కాదు, ఇష్టమైతే ఏ రాష్ట్ర యువతిని అయినా వివాహం చేసుకోవచ్చు. భారతీయ పౌరసత్వం తీసుకోవచ్చు. చట్టంలో అటువంటి అవకాశం వుంది. వుగ్రవాదానికి పాల్పడుతున్నారంటారా? వారే కాదు, మన గడ్డమీద పుట్టి పెరిగిన వారు అయినా వుగ్రవాదానికి పాల్పడితే చర్యలు తీసుకోవటానికి కూడా చట్టాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల యువతీ యువకులు అనేక మంది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎందరో వెళుతున్నారు. వారు అక్కడి యువతీ, యువకులను వివాహాలు చేసుకొని పౌరసత్వం పొందుతున్నారా లేదా ? ఏ విదేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్టు, వీసాలు కావాలి.మనం విదేశాలకు వెళుతున్నట్లే పాకిస్ధాన్‌ లేదా మరొక దేశ వాసులు ఎవరైనా అలాంటి చట్టబద్ద పద్దతుల్లో మన దేశం రావటానికీ అవకాశం వుంది.

పాకిస్ధాన్‌ గురించి ముస్లింల గురించీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలూ వారిని అనుసరించే వ్యక్తులూ నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రచారాలను చేస్తున్నారు. వాటిని అనేక మంది నమ్ముతున్నారు. ఆ తప్పుడు ప్రచారం చేసే వారూ వాటిని గుడ్డిగా నమ్ముతున్నవారికి ఒక చేదు నిజం చెప్పకతప్పదు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ చివరి మూడు సంవత్సరాల్లో విదేశీయులకు మంజూరు చేసిన పౌరసత్వం కంటే నరేంద్రమోడీ మొదటి మూడు సంవత్సరాల్లో మంజూరు చేసిన వారి సంఖ్య రెట్టింపుకు పైగా వుంది. రెండు ప్రభుత్వాల ఆరు సంవత్సరాల కాలంలో 5,477 మందికి భారతీయ పౌరసత్వం ఇస్తే మోడీ గారు వచ్చిన తరువాత 3,800 మందికి ఇచ్చారు. మొత్తం ఆరు సంవత్సరాల కాలంలో 2,157 మంది పాకిస్ధానీయులు,1,461 మంది ఏ దేశానికీ చెందని వారు,918 మంది ఆఫ్ఘన్స్‌, 218 బంగ్లా, 145 బ్రిటన్‌, 108 శ్రీలంక, 66 ఇరాన్‌, 61 మంది అమెరికా నుంచి వచ్చిన వారితో సహా మొత్తం 56దేశాల నుంచి వచ్చిన వారు పౌరసత్వం పొందారు. రామన్‌ శర్మ అనే జమ్మూ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు దరఖాస్తుదారుకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ 2017లో ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలున్నట్లు 2017 మార్చి 31న ట్రిబ్యూన్‌ పత్రిక ప్రచురించింది. ‘ 2014 నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 3,801, ఇదే అంతకు ముందు ప్రభుత్వ(కాంగ్రెస్‌ సర్కార్‌) హయాంలో 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 1,676 ‘ అని సమాధానంలో వున్నట్లు ట్రిబ్యూన్‌ రాసింది.

సంవత్సరాల వారీ చూస్తే 2016లో గరిష్టంగా 660 మంది పాకిస్ధానీయులకు పౌరసత్వం ఇచ్చారు.అంతకు ముందు 2014,2015లో 267,263 చొప్పున ఇచ్చారు. మొత్తం 918 మంది ఆఫ్ఘన్‌ జాతీయులకు పౌరసత్వం ఇస్తే 204ా16 మధ్య ఇచ్చిన వారే 700 మంది వున్నారు. పాకిస్తానీయులకు మోడీ సర్కార్‌ పౌరసత్వం ఇచ్చిందంటే దాని అర్ధం వుగ్రవాదులకు ఇచ్చినట్లా ?

మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కానట్లయితే, ఎవరైనా విదేశీయులు భారత పౌరులను వివాహం చేసుకుంటే చట్టబద్దంగా మన దేశంలో ఏడు సంవత్సరాలు నివశించిన తరువాత వారు స్ధానిక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే వారికి మంజూరు చేస్తారు. మన పౌరులు విదేశీయులను వివాహం చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. ఇందాద్‌ షామిల్‌ అనే కేరళ అబ్బాయి, మరయం యూసఫ్‌ అనే పాకిస్ధాన్‌ అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం లాహోర్‌లోనూ, పాలక్కాడ్‌లోనూ వివాహం, వివాహం, విందులు ఇచ్చి ఒక్కటయ్యారు. 2008లో మరయం కేరళకు వచ్చింది. వారికి ఇద్దరు పిల్లులు, ఏడు సంవత్సరాల భారత నివాస నిబంధన పూర్తి అయిన తరువాత 2017లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది జనవరిలో మంజూరైనట్లు మళయాళ మనోరమ పత్రిక తెలిపింది.

ఇలా పాకిస్ధానీయులు కాశ్మీర్‌ యువతులను లేదా భారతీయులు పాక్‌ యువతులనే కాదు, ఏ ప్రాంతం, రాష్ట్రం, మతం, కులం వారైనా ఏదేశం వారినైనా వివాహాలు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఎందరికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసిందో, వారిలో ఎందరు వుగ్రవాదులుగా మారారో, ఎంత మందిని పట్టుకున్నారో తెలుపుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచార పూర్వరంగంలో అధికారయుతంగా ప్రకటించి వక్రీకరణలకు తెరదించాల్సిన అవసరం వుందా లేదా ?

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు మూసుకున్నాను

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారు ఎవరూ మిగల్లేదు

ఇది హిట్లర్‌ నాజీ మూకల గురించి జైల్లో ఒక మతాధికారి రాసిన ప్రఖ్యాత కవిత. కాశ్మీరీల ప్రత్యేక హక్కుల మీద జరిగిన దాడిని వ్యతిరేకించకపోతే రేపు తమదాకా వస్తే ఏమిటో ప్రతివారూ ఆలోచించాలా వద్దా ? అది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోనల్‌ వ్యవస్ధ కావచ్చు,లోకల్‌, నాన్‌ లోకల్‌ కావచ్చు. వుద్యోగుల వేతన సంఘాలు కావచ్చు, కార్మిక చట్టాలు, ఇతర సంక్షేమ చట్టాలు ఏవైనా దాడికి, రద్దుకు గురి అయితే ఏమిటి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 2 – జగన్‌ నవరత్నాలు జిందా తిలిస్మాత్‌ కాదు !

19 Wednesday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AP Agriculture, AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Jaythi Ghosh Committe, Navarthnalu, Ycp, YS jagan, ys jagan vs chandrababu

Image result for YS Jagan Navaratnalu

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో ఎవరికీ పేచీ లేదు. అసలేమీ లేనిదాని కంటే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో జనానికి ప్రభుత్వం నుంచి సంక్షేమం రూపంలో అందటం మంచిదే. సంక్షేమ పధకాల గురించి యండమూరి వీరేంద్రనాధ్‌ వంటి పేరు మోసిన రచయితల మొదలు, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి విమర్శలు చేశారో, ఎంత చులకనగా వ్యాఖ్యానిస్తున్నారో తెలిసిందే. అవన్నీ బడుగు, బలహీన వర్గాల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు. వారు వినియోగిస్తున్న వస్తువులు, సేవలకు మిగతావారితో పాటు జిఎస్‌టి చెల్లిస్తున్నారు. విదేశీ, స్వదేశీ విమానాలకు సరఫరా చేసే ఇంధనానికి ఇచ్చే రాయితీలకు చెల్లిస్తున్న సొమ్ములో సామాన్యుల వాటా వుంది. విదేశాల నుంచి ధనికులు దిగుమతి చేసుకొనే సౌందర్యసాధనాలకు, చివరికి దోసకాయలు, యాపిల్‌ పండ్లకు, బంగారానికి, నగలు, వజ్ర వైఢూర్యాలకు, విదేశీ మద్యం వంటి వాటికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న విలువైన విదేశీ మారకద్రవ్యంలో కూడా పేదల వాటా వుందని తెలుసా? కనుక పేదలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలను అందుకోవటానికి సంకోచించనవసరం లేదు గానీ వారు చేయనితప్పుకు అవమానాలు పడాల్సిన అవసరం వుందా అన్నది సమస్య. వారు సంక్షేమం పేరుతో తీసుకున్న మొత్తాలతో తిరిగి సరకుల కొనుగోలు, సేవలకే కదా వెచ్చిస్తున్నది. అంటే తిరిగి ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు చెల్లిస్తున్నారు. ఆ విధంగా వస్తు, సేవల డిమాండ్‌ను పెంచటానికే తోడ్పడుతున్నారు తప్ప విదేశీ బ్యాంకుల్లో ఆ సొమ్మును దాచుకోవటం లేదు.

ప్రభుత్వ వుద్యోగులు, టీచర్లకు 27శాతం మధ్యంతర భృతి ప్రకటించటం హర్షణీయమే, వారికి ఐదు సంవత్సరాల క్రితం 47శాతం వేతనాలు పెంచారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన పెంపుదల చేస్తున్నందున మరోసారి వేతన పెంపుదల బకాయి వుంది, దాన్ని ఖరారు చేసే లోగా మధ్యంతర భృతి చెల్లించటం హర్షణీయమే. చంద్రబాబు వాగ్దానం చేసినదాని కంటే ఎక్కువే ఇస్తామనటం మంచిదే. వైఎస్‌ జగన్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో జనంలో వున్నారు. యాత్రలు చేశారు, జనం సమస్యలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటిన్నర మంది వరకు అసంఘటిత రంగ కార్మికులు వున్నారని అంచనా. వారిలో ఏ ఒక్కరూ, ఏ గ్రామం లేదా పట్టణంలోగానీ, లేదా వైసిపి కార్మిక నేతలు గానీ వారి వేతనాల పెంపుదల గురించి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదా అన్నది ఒక ముఖ్యాంశం. ఇవ్వలేదు అనేందుకు ఆస్కారం లేదు. గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా వారి సమస్యల ప్రస్తావన లేదు. ఎందుకన్నది ప్రభుత్వంతో పాటు జనం గూడా ఆలోచించాలి. ఎన్నికల మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగిసిన తరువాత 2019ఏప్రిల్‌ 16న రాష్ట్ర కార్మిక శాఖ ఒక గజెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దానిలో అసంఘటితరంగ కార్మికులకు చెల్లించాల్సిన కరువు భత్యం గురించి పేర్కొన్నది. దాని వివరాల్లోకి వెళితే 2014 తరువాత ఎవరికీ వేతనాలను సవరించలేదు. 2006 నుంచి సవరించని వారు వున్నారు. ఎక్కువ తరగతులకు 2006-2009 మధ్య సవరించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయని వైసిపి నాయకులకు, గవర్నర్‌ ప్రసంగం రాసిన సీనియర్‌ అధికారులకు తెలియనిదా ? అంటే చివరి తరగతిని తీసుకుంటే పదమూడు సంవత్సరాలుగా ఒకే వేతనం తీసుకుంటూ, దాని మీద కరువు భత్యం పొందుతున్నారని అనుకోవాలి. నిజంగా ఎన్ని యాజమాన్యాలు కరువు భత్యం చెల్లిస్తున్నాయన్నది పెద్ద బేతాళ సందేహం.

Image result for YS Jagan Navaratnalu

వుదాహరణకు పబ్లిక్‌ మోటార్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు 2006 డిసెంబరు నాలుగవ తేదీన నిర్ణయించిన వేతనాలలో అనాటికి వున్న కరువు భత్యం 502 పాయింట్లను కలిపి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటికి కరువు భత్యం పాయింట్లు 1306కు పెరిగాయి. అంటే మూలవేతనంలో పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి పెరుగుదల లేకుండా 502 పాయింట్లు పోను మిగిలి ఒక్కో పాయింట్‌కు ఆరున్నర రూపాయల చొప్పున 804 పాయింట్లకు, మూలవేతాన్ని కలిపి చెల్లిస్తారు. మన ఇండ్లకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకు వచ్చే వారికి మొదటి జోన్‌లో 3,700, రెండవ జోన్‌లో 3,370 రూపాయల వేతనాన్ని 2007 డిసెంబరు 19న 525పాయింట్ల కరువు భత్యాన్ని విలీనం చేసి నిర్ణయించారు. ఇప్పుడు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు రూ 5,226, గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చే వారికి రూ.5,076 కరువు భత్యం మొత్తాన్ని మూలవేతనానికి కలిపి చెల్లించాలి.అసలు కంటే కరువు భత్యం అధికం. ఇది ఏ విధంగా సమర్ధనీయం. ప్రభుత్వ సిబ్బందికి ఒక న్యాయం అసంఘటిత రంగ కార్మికులకు ఒక న్యాయమా? ప్రభుత్వం అంటే ప్రజల పక్షమా, యజమానుల పక్షమా ? ఈ విషయాలను జగన్‌ పట్టించుకోరా? ప్రభుత్వ వుద్యోగులకు వేతన సవరణ చేసినపుడు డిఏను కలిపి మూలవేతనం మీద కొంతశాతం పెంచి కొత్తవేతనాలను నిర్ణయిస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు పదమూడేండ్లు అంటే ఇప్పటికి రెండుసార్లు మూలవేతనం పెంచాల్సి వుండగా ఒక్కసారి కూడా పెంచలేదు. ఇది సామాజిక న్యాయమా? అన్యాయమా ? ఇంత పెద్ద సంఖ్యలో వున్న వారి సమస్య ప్రభుత్వ విధానాన్ని తెలిపే ప్రసంగంలో చోటు చేసుకోలేదంటే కావాలని విస్మరించినట్లా, నవరత్నాలే జిందా తిలిస్మాత్‌ కాదని గ్రహించాలి.

ఆశావర్కర్లకు నెలవేతనాన్ని మూడు నుంచి ఒక్కసారిగా పదివేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనేక మందికి ఇంత వుదారమా అనిపించింది. ఇది వేతనమా లేక ప్రోత్సాహకాలతో కలిపి ఇచ్చే మొత్తమా ? ప్రస్తుతం వున్న విధానం ప్రకారం మూడువేల రూపాయల వేతనానికి తోడు చేసిన పనిని బట్టి ప్రోత్సాహకాలను జత చేసి రూ.8,600 వరకు చెల్లిస్తామని గత పాలకులు వాగ్దానం చేశారు. ఆచరణలో గరిష్ట ప్రోత్సాహకాన్ని మూడువేల రూపాయలకు పరిమితం చేశారు. అంటే అంతకంటే తక్కువ పని చేస్తే కోత పెడతారు, ఎంత ఎక్కువ చేసినా ఇచ్చేది పెంచరు. దీని వలన అత్యధిక ఆశావర్కర్లకు ఇప్పుడు అన్నీ కలిపి నాలుగున్నర-ఐదున్నరవేల మధ్య వస్తుండగా ఒక పదిశాతం మందికి గరిష్టంగా ఆరువేలు వస్తున్నాయని ఆశా సంఘాలు చెబుతున్నాయి. ఆశావర్కర్లకు చెల్లించే పారితోషికంలో 60శాతం కేంద్రం, నలభైశాతం రాష్ట్రం చెల్లిస్తున్నాయి. ఈ పారితోషికాల మొత్తాన్ని ఇటీవల పెంచింది. అయితే అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న మొత్తం కంటే తక్కువే కనుక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా కొంత సొమ్ము జమ అవుతుంది తప్ప ఆశావర్కర్లకు ఒరిగేది, పెరిగేదేమీ వుండదు. జగన్‌ ప్రకటించినది వేతనమే అనుకుంటే పదివేలు, దానికి ప్రోత్సాహంగా మూడువేలు, సీలింగ్‌ను ఎత్తివేస్తే అంతకంటే ఎక్కువ వస్తాయి, అలా జరిగితే అభినందనీయమే, అలాగాక కిరికిరి చేసి అన్నీ కలిపి పదివేలే అని అన్యాయం చేస్తే పరిస్ధితి ఏమిటి?

వ్యవసాయ రంగం ప్రధానంగా వున్న రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. గతంలో రాజన్న రాజ్యంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం గాకుండా ఆదర్శరైతుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంపిక చేశారు. వారిలో వ్యవసాయం తెలియని వారు, మానుకున్నవారు కూడా వున్నారు. నియమించిన తరువాత వారు కాంగ్రెస్‌ సేవకులుగా మారారు తప్ప రైతులకు అందించిన సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం ఏటా వారికి 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ సేవలను అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని, పొరుగుసేవల ద్వారా వాటిని అందించాలని ప్రపంచబ్యాంకు మన మీద రుద్దిన ఆదేశాల ఫలితమే. రైతు భరోసా పేరుతో ఏటా ప్రతి రైతు కుటుంబానికి రు.12,500 చెల్లించాలని జగన్‌ నిర్ణయించటం హర్షణీయమే. ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన ఆరువేలకు అదనమా అది పోను మరో ఆరున్నరవేలు ఇస్తారా ? స్పష్టత ఇవ్వాలి.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై సబ్సిడీ మొత్తాలను గణనీయంగా తగ్గించిన కారణంగా రైతులు వాటిని కొనలేక సబ్సిడీ వున్న యూరియాను అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.ఎరువుల ధరల పెరుగుదల,సబ్సిడీ గణనీయంగా తగ్గింపు కారణంగా 2010లో 41లక్షల టన్నులుగా వున్న వినియోగం 2017 నాటికి 32లక్షల టన్నులకు పడిపోయింది. సగటు వాడకం కూడా బాగా తగ్గింది. ఎరువుల సబ్సిడీ నామమాత్రం అవుతున్న కారణంగా రైతులపై ఏటా పడుతున్న అదనపు భారాలను రైతు భరోసా పధకం పూడ్చుతుందని అనుకుందాం. మరి గిట్టుబాటు ధరల మాటేమిటి? కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు పడిపోయినపుడు రైతులను ఆదుకొనే మార్గాలేమిటి? ఇలాంటి సమస్యలు అనేక వున్నాయి. వాటి గురించి రైతులు, నిపుణులు, రైతు సంఘాలతో సమగ్ర చర్చలు జరిపితే ప్రయోజనం వుంటుంది. అలాగాక చంద్రబాబు నాయుడి మాదిరి సహజ వ్యవసాయం పేరుతో కాలక్షేపం చేయటం వలన ప్రజాధనం దండగ తప్ప రైతులకు ఒరిగేదేమీ వుండదు. అనేక పంటల దిగుబడులు అంతర్జాతీయ పరిస్ధితితో పోల్చితే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బాగా తక్కువగా వున్నాయి. పప్పుధాన్యాల సగటు దిగుబడులు ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక పోవటానికి ఇది కూడా ఒక కారణం.

2014-17 మథ్య మినుముల దిగుబడి హెక్టారుకు(రెండున్నర ఎకరాలు) 946 కిలోల నుంచి 920కు పడిపోగా నాలుగేండ్ల సగటు 856 కిలోలుగా వుంది.పెసల దిగుబడి ఇదే కాలంలో 825 నుంచి 662కు పడిపోగా సగటు దిగుబడి 656 కిలోలు. కందుల విషయానికి వస్తే 503 నుంచి 430కి పడిపోయింది. నాలుగేండ్ల సగటు 478కిలోలు, శనగల దిగుబడి 1143 నుంచి 1132కు తగ్గిపోగా నాలుగేండ్ల సగటు 1074 కిలోలు. ఇక పత్తి సంగతి చూస్తే 588 నుంచి 549కి తగ్గిపోయింది, నాలుగేండ్ల సగటు 545కిలోలు. వీటి తీరుతెన్నులను చూస్తే ప్రకృతి అనుకూలతలు, ప్రతికూలతల మీద రైతులు ఆధారపడటం తప్ప దిగుబడులను పెంచేందుకు ప్రభుత్వ కృషి కనిపించదు. ప్రధాన ఆహార పంటల విషయానికి వస్తే ధాన్య దిగుబడి 3022 నుంచి 3815కిలోలకు పెరిగింది. నాలుగేండ్ల సగటు 3460కిలోలు. చంద్రబాబు నాయుడు తొలిసారి అధికారంలో వున్నంత కాలం ఇజ్రాయెల్‌ వ్యవసాయమని, గత ఐదేండ్లు పాలేకర్‌ సహజ సాగు అంటూ కాలక్షేపం చేశారు.

Image result for YS Jagan Navaratnalu

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి అధికారంలోకి రాగానే ప్రముఖ ఆర్ధికవేత్త జయతిఘోష్‌తో ఒక కమిషన్‌ వేసి వ్యవసాయ రంగం మీద సిఫార్సులను తీసుకున్నారు. అనేక కమిషన్లకు పట్టిన దుమ్ము మాదిరే దానికీ పట్టింది.ఆ కమిషన్‌ సిఫార్సులలో అనేక మౌలిక అంశాలున్నాయి. వాటిని రాజశేఖరరెడ్డి, తరువాత ఆయనవారసులుగా వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు గానీ, గత ఐదు సంవత్సరాలు అధికారంలో వున్న చంద్రబాబు నాయుడు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌ ఆ కమిషన్‌ సిఫార్సులను తిరిగి పరిశీలిస్తారా ? ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ను రైతాంగ కమిషన్‌లో పనిచేయవలసిందిగా జగన్‌ ఆహ్వానించినట్లు, కమిషన్ల సిఫార్సులను అమలు జరుపుతారనే విశ్వాసం తనకు లేదంటూ శాయినాధ్‌ సున్నితంగా తిరస్కరించినట్లు, కమిషన్‌ కాదు, కార్యక్రమానికి తోడ్పడమని జగన్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వారి సలహాలను తీసుకోవాలని ప్రయత్నించటం మంచిదే. అయితే జయతీ ఘోష్‌ సిఫార్సుల అమలు తీరుతెన్నులను చూసిన తరువాత మరొకరెవరూ అలాంటి వృధా ప్రయాసకు పూనుకోరు. పదిహేను సంవత్సరాల నాటి పరిస్ధితుల మీద జయతీఘోష్‌ చేసిన సిఫార్సులు, వుమ్మడి రాష్ట్రానికి చెందినవి కనుక కొన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్తమానానికి వర్తించకపోవచ్చు. కానీ వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం, వ్యవసాయానికి అవసరమైన వాటన్నింటినీ సరఫరా బాధ్యతను ప్రభుత్వమే చేెపట్టాలనేటువంటి సిఫార్సులు వున్నాయి, వాటికి కాలదోషం పట్టదు. రాజన్న రాజ్యం తిరిగి తీసుకువస్తామని చెబుతున్నవారు, ఆ రాజన్న ప్రభుత్వం నియమించిన కమిషన్‌ సిఫార్సులు, పరిస్ధితులను అధ్యయనం చేసి పనికి వచ్చేవాటిని అమలు జరుపుతారా? చంద్రబాబు మాదిరి మభ్యపెట్టి కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైసిపి ‘అనకొండ’ తెలుగు దేశాన్ని మింగు విధంబెట్టిదనిన !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, Anti defection law, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp, ys jagan vs chandrababu, ysrcp

Image result for jagan chandrababu

ఎం కోటేశ్వరరావు

‘ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’ ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను వుద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి వుంటుందని, వుండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి వుండటం పెద్ద సమస్య కూడా కాదు.

సీన్‌ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసిపి అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. మరీ పాత కథ చెప్పినట్లు వుందా, అయితే వైసిపి అనకొండ తెలుగుదేశాన్ని మింగదలచుకుంది అందాం. అయితే అది ఎలా ఎప్పుడు అన్నదే కిక్కునిచ్చే అంశం. ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినపుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్ధి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా వుంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ వూహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా వుంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.

ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలో వున్న లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ఆమోదించిన రాజ్యాంగాలు, వాటికి అనుగుణ్యంగా చేసిన చట్టాల మీద కమ్యూనిస్టులకు అంతగా విశ్వాసం లేకపోయినా, పార్లమెంటరీ పార్టీ వ్యవస్ధను ఆమోదించి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వాటికి కట్టుబడి వుంటున్నాయి తప్ప మిగతాపార్టీలేవీ అలా లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన గత మూడున్నర దశాబ్దాలు లేదా అంతకు ముందు కూడా కమ్యూనిస్టులు ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. అసలా ఫిరాయింపుల చట్టం గురించి నాలుగు ముక్కలు.

హర్యానా మన దేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఆయారామ్‌ గయారామ్‌ అంటే అతిశయోక్తి కాదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్‌, దానికి వ్యతిరేకంగా రూపొందిన పలు పార్టీల కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌ మధ్య ఫిరాయింపుల పర్వం నడిచింది. పంజాబ్‌ నుంచి విడివడి 1966 నవంబరు ఒకటిన హర్యానా ఏర్పడింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన గయాలాల్‌ అనే ఎంఎల్‌ఏ ఒకే రోజు తొమ్మిది గంటల వ్యవధిలో మూడు సార్లు పార్టీ మారాడు.కాంగ్రెస్‌ నుంచి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మారిన తరువాత తిరిగి కాంగ్రెస్‌కు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్‌ నేత రావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను చండీఘర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లకు చూపుతూ గయారామ్‌ ఇప్పుడు ఆయారామ్‌ అయ్యాడు అని ప్రకటించారు. ఆయారామ్‌ తరువాత వెంటనే తిరిగి గయారామ్‌గా మారి తిరిగి యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఫిరాయించాడు.( తండ్రి గయాలాల్‌ బాటలో నడిచిన కుమారుడు వుదయ్‌ భాను 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించారు.) అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కొనే భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం.

దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నా ,వుద్దేశ్యపూర్వకంగా సభకు గైర్‌హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్‌ లేదా అసెంబ్లీలో వున్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనం అయినా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎంఎల్‌ఏలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి గాని వాటిని ఇంతవరకు ఆమోదించి చట్టసవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్చందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్చందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్‌ నిర్ణయానికి తిరుగులేదు అని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్‌ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణాలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్‌పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన వుదంతాలు వున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌ఏగా వుంటూ ఫిరాయించిన ఒకరు తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత వుంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది తెరాసలో చేరేవరకు స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్‌ తెదే శాసనసభా పక్షం తెరాసలో విలీనమైనట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్‌ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ సభ్యత్వానికి వుత్తమ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్‌ శాసనభా పక్షాన్ని విలీనం చేయటం కూడా ఇదే పద్దతిలో జరిగింది.

ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులు వున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వున్న 23 మంది సభ్యులలో పదకొండు మంది మినహా 13 మంది తమతో సంబంధాలలో వున్నారని వైసిపి ఎంఎల్‌ఏలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసిపిలో చేరాలన్నా 16 మంది కావాల్సి వుంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసిపి వారు చెబుతున్నట్లు 13 మంది టచ్‌లో వుంటే మరో ముగ్గురు ఎంఎల్‌ఏలను ఆకర్షించితే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్‌ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13 మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్‌ఆర్‌సిపి లేదా మరొక పార్టీ దేనిలో అయినా చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు, అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.

దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నైతిక విలువలకు ఏ పార్టీ కూడా కట్టుబడి వుండటం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ చీలికపక్షమైన బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరటం ఫిరాయింపు కాదా అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదని వైసిపి సమర్ధించుకుంది. చట్టం వున్నా లేకున్నా ఫిరాయింపు ఫిరాయింపే, నైతికంగా అక్రమమే. బెదిరించి లేదా ప్రలోభపెట్టి ఆకర్షించిన తెలుగుదేశం చర్య కూడా గర్హనీయమే. ముందే చెప్పుకున్నట్లు చట్టాన్ని పటిష్టపరచటం గాకుండా లోపాలను వుపయోగించుకొని తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మూడు ప్రాంతీయ పార్టీలలో రెండు మిత్రపక్షాలుగా వున్నాయి. రెండూ అధికారంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపిలో ప్రాతినిధ్యం లేకపోవటం బిజెపికి తలకొట్టేసినట్లుగా వుంది. అందుకోసం అది వైసిపికి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బిజెపితో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసిపి చెప్పి వుండవచ్చు, విధిలేని స్ధితిలో బిజెపి సరే అని వుండవచ్చు. అనూహ్యంగా బిజెపి కేంద్రంలో రెండవసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది వుంటుందా అంటే వుండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాము. వాటికీ ఆంధ్రప్రదేశ్‌కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సిబిఐ, ఇడిలను ప్రయోగించాల్సి వుండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు కనుక జగన్‌కు ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక బిజెపి ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే వుంటుంది, జగన్‌కు అది తెలిసిందే కనుక వేటు పడకుండా చూసుకుంటారు. కొంతకాలం రేచుక్క పగటి చుక్క, చిక్కడు-దొరకడు వ్యవహారం నడుస్తుంది.

Image result for jagan chandrababu

రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్‌ ఆకర్ష పధకానికి తెరతీసినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో తెరాసలోకి పోగా మిగిలిన కాంగ్రెస్‌ను తమలో విలీనం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్‌ నాయకులు బిజెపికి ముద్దు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్‌ పెద్దలు బిజెపిలో చేరారు. బిజెపి ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్‌ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నువేసినట్లు చెబుతున్నారు. నిజానికి బిజెపి గతంలోనే తెలుగదేశం పార్టీని మింగివేసేందుకు ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్‌ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్‌ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్‌ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బిజెపిలో చేరితే వైసిపికి మింగా కక్కలేని స్ధితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా వుండదనుకొని వైసిపి సర్దుకు పోతుందా ? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకొన్న నాయకులకు పని ఇవ్వకుండా బిజెపి మాత్రం ఎంతకాలం వుంటుంది? కొద్ది కాలం తరువాత అదే బిజెపి తాను బలపడేందుకు సిబిఐ, ఇడి సంస్ధలను ప్రయోగించి జగన్‌ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసిపి సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి వుంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కెయి వర్గాలే కలసిపోగా లేనిది వైసిపి తన అవసరాల కోసం కనీసం జగన్‌ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటలోనే పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బిజెపికి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనై పోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: