మద్దతు ధరలు రైతులకా వ్యాపారులకా ?
రైతు మిత్ర
అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్య రైతుల పరిస్థితి గురించి చూద్దాం. కనీస మద్దతు ధరలు రైతాంగానికి వుపయోగపడుతున్నాయా లేక వ్యాపారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది. వుదాహరణకు 2004-05 నుంచి 2014-15 వరకు పరిశీలిస్తే ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు సగటున రు.979.79లుగా వుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు అందచేసిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అగ్‌మార్క్‌నెట్ పేర్కొన్న సంవత్సరాలలో డిసెంబరు, జనవరి మాసాలలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో ధాన్య రైతులు పొందిన సగటు ధరలు, దేశం మొత్తంగా రైతులు పొందిన ధరల వివరాలను దిగువ పట్టికలో చూడవచ్చు.స్ధలా భావం కారణంగా ప్రతి ఏడు డిసెంబరు, జనవరి మాసాల ధరలను మాత్రమే ఇక్కడ ఇవ్వటమైంది. దాని ప్ర కారం మన రాష్ట్రంలో ఈ కాలంలో ప్రతి ఏటా డిసెంబరులో రైతు పొందిన సగటు ధర రు.953.70, జనవరిలో 997.15 గా నమోదైంది. అదే దేశవ్యాపితంగా రు.1200.76, రు.1157.57 గా వున్నాయి. ఒక ఏడాది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వున్నా, మరొక ఏడాది తక్కువ వున్నా భరించాల్సింది రైతు మాత్రమే. 2005లో వున్న కనీస మద్దతు సగటు ధర 575తో 2015లో వున్న సగటు ధర 1430తో(సూపర్ ఫైన్, ఫైన్ రెండింటి సగటు) పోల్చితే మద్దతు ధర 147శాతం పెరిగింది. ఇదే సమయంలో 2005 జనవరిలో మార్కెట్‌లో రైతుకు లభించిన 634తో 2015లో వున్న 1363 రు.లను పోల్చితే పెరుగుదల 114శాతమే. ఆ విధంగా చూసినపుడు ఏం జరిగిందనేది వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అధికారిక అంకెలే పరిస్ధితిని వివరిస్తున్నాయి.
1990 నుంచి మన దేశం నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు శాంతి భద్రతలు, కరెన్సీ, సరిహద్దుల రక్షణ,సైన్యం వంటి వాటికి మాత్రమే పరిమితమై మిగతా రంగాల నుంచి తప్పుకొని మార్కెట్ శక్తులకు వాటిని వదలి వేయాలి. అప్పుడే జనానికి మెరుగైన సేవలు అందుతాయి.అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయి. వాటి మంచి చెడ్డలు, విమర్శలు, ప్రశంసల గురించి ఇక్కడ చర్చించబోవటం లేదు. కనీస మద్దతు ధరలు ప్రకటించిన మాత్రాన్నే అవి రైతులకు గిట్టుబాటు కలిగిస్తాయా ? నిజానికి అవి వాస్తవ పెట్టుబడులను ప్రతిబింబిస్తున్నాయా ?
ధాన్యానికి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో గత సంవత్సరాలలో లభించిన ధరల వివరాలు ఇలా వున్నాయి. మొదటి కాలంలో ఆ ఏడాది జనవరిలో లభించిన ధర అయితే రెండవ కాలంలో అంతకు ముందు ఏడాది డిసెంబరులో లభించిన ధర, మూడవ కాలంలో అంతకు ముందు సంవత్సరం జనవరి ధర పోలిస్తే మార్పు, నాలుగవ కాలంలో ఏడాదిలో వచ్చిన మార్పుగా గమనించాలి. వుదాహరణకు 2005 జనవరిలో వచ్చిన ధర పక్కనే 2004డిసెంబరులో వచ్చిన ధరగా తరువాత కాలంలో 2004 జనవరి ధర అని గమనించాలి.
జనవరి డిసెంబరు జనవరి నెలలో మార్పు ఏడాదిలో మార్పు
2005 ఆంధ్రప్రదేశ్ 634.24 624.79 581.8 1.51 9
దేశ సగటు 727.07 698.7 668.07
2006ఆంధ్రప్రదేశ్ 1033.38 473.52 634.24 118.23 62.93
దేశ సగటు 697.78 678.85 727.07
2007ఆంధ్రప్రదేశ్ 615.69 640.9 1033.38 -3.94 -40.42
దేశ సగటు 776.74 822.9 697.78
2008ఆంధ్రప్రదేశ్ 699.66 785.92 615.69 -10.98 13.64
దేశ సగటు 1015.81 1013.67 776.74
2009ఆంధ్రప్రదేశ్ 881.19 874.83 699.66 0.73 25.95
దేశ సగటు 1087.59 1155.48 1015.81
2010ఆంధ్రప్రదేశ్ 1036.35 1029.70 881.19 0.65 17.61
దేశ సగటు 1283.17 1303.54 1087.59
2011ఆంధ్రప్రదేశ్ 996.36 1004.60 1036.35 -0.82 -3.86
దేశ సగటు 1296.20 1239.66 1283.17
2012ఆంధ్రప్రదేశ్ 1080.31 1080.48 996.36 -0.02 8.43
దేశ సగటు 1228.22 1117.38 1296.2
2013ఆంధ్రప్రదేశ్ 1271.77 1273.14 1080.31 -0.11 17.72
దేశ సగటు 1704.53 1571.97 1228.22
2014ఆంధ్రప్రదేశ్ 1356.07 1338.66 1271.77 1.3 6.63
దేశ సగటు 2005.4 1970.67 1704.53
2015ఆంధ్రప్రదేశ్ 1363.64 1364.18 1356.07 -0.04 0.56
దేశ సగటు 1630.62 1635.44 2005.4
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల సగటు ధర.997.15
దేశవ్యాపితంగా జనవరి నెల సగటు ధర రు. 1157.57
ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు సగటు ధర రు. 953.70
దేశవ్యాపితంగా డిసెంబరు నెల సగటు ధర రు. 1200.76
కనీస మద్దతు ధరల సగటు : రు.979.79
మన రాష్ట్రంలోని వాణిజ్య పంటలలో పత్తి ఒకటి. దీని పరిస్థితి ఎలా వుందో చూద్దాం. పత్తి విషయంలో కూడా బాగా మార్కెట్‌కు వచ్చే జనవరి నెల గణాంకాలనే తీసుకోవటం జరిగింది.
జనవరి డిసెంబరు జనవరి నెలలో ఏడాదిలో మద్దతు ధర
మార్పు మార్పు
2005 ఆంధ్రప్రదేశ్ 1815.87 1774.81 1960
దేశ సగటు 2096.04 2171.53 2726.41
2006ఆంధ్రప్రదేశ్ 1890.20 1961.44 1815.87 -3.63 4.09 1980
దేశ సగటు 2095.36 2147.27 2096.04
2007ఆంధ్రప్రదేశ్ 1994.58 1958.21 1890.20 1.86 5.52 1990
దేశ సగటు 2174.52 2249.97 2095.36
2008ఆంధ్రప్రదేశ్ 2718.18 1953.31 1994.58 39.16 36.28 2030
దేశ సగటు 2754.93 2733.65 2174.52
2009ఆంధ్రప్రదేశ్ 2561.32 2573.37 2718.18 -0.47 -5.77 3000
దేశ సగటు 2566.02 2700.45 2754.93
2010ఆంధ్రప్రదేశ్ 3092.58 3157.70 2561.32 -2.06 20.74 3000
దేశ సగటు 3447.75 3184.55 2566.02
2011ఆంధ్రప్రదేశ్ 4781.66 4079.47 3092.58 17.21 54.62 3000
దేశ సగటు 4543.68 4282.19 3447.75
2012ఆంధ్రప్రదేశ్ 3954.20 3830.46 4781.66 3.23 -17.3 3300
దేశ సగటు 4128.05 3946.85 4543.68
2013ఆంధ్రప్రదేశ్ 3893.25 3817.79 3954.20 1.98 -1.54 3900
దేశ సగటు 4073.02 4109.67 4128.05
2014ఆంధ్రప్రదేశ్ 4594.92 4137.30 3893.25 11.06 18.02 4000
దేశ సగటు 5128.21 4709.26 4073.02
2015ఆంధ్రప్రదేశ్ 3972.90 4011.39 4594.92 -0.96 -13.54 4050
దేశ సగటు 5479.75 4024.36 5128.21
పత్తి రైతులు గతంలో విచక్షణా రహితంగా సింథటిక్ పైరిత్రాయిడ్స్ వాడిన కారణంగా పర్యావరణ సమతూకం దెబ్బతిని తెల్లదోమ, పచ్చపురుగు ప్రబలి పంట దెబ్బతిని ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తరువాత రైతుల పాలిట కల్పతరువుగా బిటి పత్తి వచ్చిందన్నారు. అయినా దేశంలో అనేక చోట్ల పత్తి రైతులు ముఖ్యంగా మహారాష్ట్ర వంటి చోట్ల ఆత్మహత్యలు ఆగలేదు. ఆ బీటీ పత్తే కారణమని విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు. పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెలలో పత్తి సగటు ధర రు.2,973.48, అదే దేశ సగటు రు3,498.84 వుంది. ఈ కాలంలో పత్తి సగటు కనీస మద్దతు ధర రు.3017.50 వుంది. పొడవు పింజ పత్తి మద్దతు ధర ఈ కాలంలో రు.1960 నుంచి రు.4050కి 106 శాతమే పెరిగింది.ఈ కాలంలో ప్రయివేటు మార్కెట్‌లో 2005జనవరి ధరతో 2015జనవరి ధరతో పోల్చితే పెరుగుదల 118శాతం వుంది. గమనించాల్సిందేమంటే అప్పుడూ ఇప్పుడూ పత్తి కనీస మద్దతు ధరల కంటే తక్కువే రు.1815-3972 మధ్యవుంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ పలికినప్పటికీ దాని వలన రైతులకు పెద్దగా ఒరిగింది లేదు.సగటున ఎంత దక్కిందన్నదే ముఖ్యం.
ముగిసినది
