• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: May 2018

అమెరికన్‌ ధృతరాష్ట్ర కౌగిలి దిశగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ !

30 Wednesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

american dhritarashtra embrace, dhritarashtra embrace, India Foreign Policy, India foreign policy under narendra modi, modi foreign policy

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా రాస్తున్న రైతాంగ తల రాత- మోడీ సర్కార్‌ అమలు చేస్తున్న సబ్సిడీ కోత !

28 Monday May 2018

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

Farm prices, farm subsidies, farmers fate, indian farmers, US writing the farmers fate, WTO

Image result for US writing the indian farmers fate

ఎం కోటేశ్వరరావు

అమెరికా ! ఎందరో యువతీ యువకులకు కలల ప్రపంచం. అమెరికా !! అక్కడి కార్పొరేట్లతో చేతులు కలిపి తెల్లవారే సరికి ధనవంతులై పోవాలని చూసే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు. వారి ప్రయోజనాల కోసం చొంగకార్చుకుంటూ అమెరికా పాలకుల అడుగులకు మడుగులత్తే పాలకులు. నిజానికది అమెరికా కష్ట జీవులతో ప్రపంచ శ్రామికుల మూలుగులు పీల్చి తన కార్పొరేట్ల కడుపులు నింపేందుకు ఎంతకైనా తెగించే ఒక దుర్మార్గ వ్యవస్ధ వున్న దేశం. మన దేశం రైతాంగానికి అధిక మొత్తంలో మద్దతు ధరలు కల్పిస్తున్నారని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆమోదించిన నియమావళికి విరుద్దమని ఈ అక్రమంపై విచారణ జరపాలని 2018 మే నెల మొదటి వారంలో అమెరికా ఫిర్యాదు చేసింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న మాటలు కోటలు దాటి వూరంతటికీ వినిపించే విధంగా వాగ్దానాలు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ కాలు ఆచరణలో గడపదాట లేదు. ఇంతవరకు కనీసం ఆ చర్యను ఖండిస్తూ గట్టిగా ఒక ప్రకటన కూడా చేయలేదు.

మన దేశంలో ప్రతి ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. రైతాంగంలో వున్న ఈ అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచుకొనేందుకు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి గత లోక్‌సభ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ దిశగా ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు, గత నాలుగు సంవత్సరాలలో పరిస్ధితి మరింత దిగజారిందని అనేక రాష్ట్రాలలో ప్రారంభమైన రైతాంగ వుద్యమాలే అందుకు నిదర్శనం. మన దేశంలో అమలు జరుగుతున్న విధానాల గురించి పశ్చిమ దేశాలు ఏవిధంగా ఆలోచిస్తున్నాయి? ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసేంతగా అమెరికాను ప్రేరేపించేందుకు మన ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేమన్నా వున్నాయా?

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చిన గత పద్దెనిమిది సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు మన దేశ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో ఎప్పుడు చొరబడదామా, లాభాలను ఎంత త్వరగా తరలించుకుపోదామా అని ఆతృతపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణల గురించి కబుర్లు చెప్పటమే తప్ప సమూలంగా మార్చేందుకు అది ముందుకు రావటం లేదు, మేమొస్తే తెల్లవారేసరికల్లా చేయాల్సింది పూర్తి చేస్తామని దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు బిజెపి అరచేతిలో వైకుంఠం చూపింది. ముద్దు చేసినపుడే చంకనెక్కేందుకు సరైన సమయం అన్నట్లుగా మోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే పశ్చిమ దేశాలు మరోసారి పెద్ద ఎత్తున తమ వాదనలను ముందుకు తెచ్చి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి. కొంత మేరకు జయప్రదం అయ్యాయి. అనేక మంది మంది మంత్రులు, ఇతరులు పశ్చిమ దేశాలు చేసిన వాదనలనే చిలుక పలుకుల్లా వల్లెవేశారు.

2014 ఆగస్టు చివరి వారంలో డిప్లొమాట్‌ అనే పత్రికలో డాన్‌ పియర్సన్‌ అనే రచయిత పశ్చిమ దేశాల ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తూ ఒక పెద్ద విశ్లేషణ రాశారు.’ ప్రమాదకరమైన భారత ఆహార రాయితీలు’ అని దానికి పేరు పెట్టారు. దాని సారాంశం, అందుకు అనుగుణ్యంగా మోడీ సర్కార్‌ తీరు తెన్నులు ఎలా వున్నాయో చూద్దాం.

‘భారత వ్యవసాయ సబ్సిడీలు(రాయితీలు) ప్రపంచ రైతాంగానికి హాని కలిగించటంతో పాటు స్వంత ఆహార భద్రతకే ముప్పు తెస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధతో భారత్‌ ఇచ్చిన అంగీకారం మేరకు ఇప్పటికే వ్యవసాయ సబ్సిడీలు ఎంతో ఎక్కువగా వున్నాయి. ప్రపంచవ్యాపితంగా వ్యవసాయ వస్తువుల రేట్లు పడిపోతున్నాయి, ఆ రాయితీలు ఇతర దేశాల్లోని రైతులను నష్టపరుస్తాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే విధంగా వారి ప్రభుత్వాలపై వుద్యుక్తులౌతారు. వ్యవసాయ వాణిజ్యం చేసే దేశాలు ఈ విషయాన్ని ప్రపంచవాణిజ్య సంస్ధ వివాదాల పరిష్కారానికి నివేదించాలి. భారత దుర్వినియోగానికి స్వస్తి పలకాలి. భారత్‌లో కృత్రిమంగా ఎక్కువ ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. తరువాత కొంత భాగాన్ని ఐదులక్షల చౌకదుకాణాల ద్వారా 80కోట్ల మంది పేదలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వుద్దేశించిన వినియోగదారులకు 40శాతం ఆహారం చేరటం లేదని అంచనా. అనేక మంది ఇంకా ఆకలితో వుండగా ఆహార నష్టం జరగటం దుర్మార్గం. ఏటా 30లక్షల టన్నుల ఆహారాన్ని నేల మీద ప్లాస్టిక్‌ సంచులు కప్పినిలవ చేస్తున్నారు.భారత్‌ ఈ విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నది.

భారత వ్యవసాయ సబ్సిడీలు దాని స్వంత ఆర్ధిక వ్యవస్ధకే హాని కలిగిస్తున్నాయి. గోధుమ, వరి, చెరకు వంటి పంటల సాగుకు మరింత భూమి, నీటిని వినియోగించే విధంగా రైతాంగానికి రాయితీలు ఇస్తున్నారు. దీని వలన వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరుకొనే ఇతర పంటలైన పండ్లు, కూరగాయలు తదితరాల వుత్పత్తి తగ్గుదలకు, అధికధరలకు దారితీస్తోంది. మౌలిక పంటల సాగును ప్రోత్సహించి ఆహార భద్రతను సాధించేందుకే ఇవన్నీ చేస్తున్నామని ముసుగులో భారత్‌ వీటిని సమర్ధించుకుంటోంది. ఇదే సాకుతో పంటలకు అధిక ధరలు ఇవ్వటాన్ని, దిగుమతులపై ఎక్కువ పన్నుల విధింపు, తదితర ఆటంకాలు కలిగించటాన్ని సమర్ధించుకుంటోంది. దిగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా సాయపడటం కంటే ఆహార భద్రత సరఫరాకు హాని ఎక్కువని అత్యధిక ఆర్ధికవేత్తలు అంగీకరిస్తారు. భారత్‌లో వార్షిక రుతుపవనాలు విఫలమైతే అది కరవుకు దారి తీసి పంటల వుత్పత్తి తగ్గుతుంది. కాబట్టి పూర్తిగా స్వంత వుత్పత్తి మీదే పూర్తిగా ఆధారపడితే సరఫరా షాక్‌లు తగిలే అవకాశం వుంది. అలాగాక పెద్దదైన, విస్తరించే గుణం వున్న ప్రపంచ మార్కెట్‌తో తన వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా ముడివేయాలి.

కాబట్టి అమెరికా వంటి ధనిక దేశాలు ఏం కోరుకుంటున్నాయో రైతు సోదరులు, సమాజంలోని ఇతరులకు చెప్పనవసరం లేదు. 2011లో డిటిబి అసోసియేట్స్‌ అనే ఒక సంస్ధ చేసిన సర్వే ప్రకారం భారత్‌కు అనుమతించిన 37బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగానే రాయితీలిస్తున్నట్లు తేలిందని, ఇది ప్రపంచ వస్తు మార్కెట్లను, వాటిపై ఆధారపడిన రైతాంగాన్ని దెబ్బతీస్తుందని సదరు విశ్లేషకుడు పేర్కొన్నాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను భారత్‌ పాటించకపోతే ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయని బెదిరించిన ఈ పెద్దమనిషి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌లో పది సంవత్సరాలు పని చేశాడంటే ఎవరి అభిప్రాయాలను ప్రతిబింబించాడో చెప్పనవసరం లేదు.

రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నది పాత లోకరీతి, బహుళజాతి గుత్త సంస్ధలు కోరుకుంటున్నవాటినే మన పాలకులు తీరుస్తున్నారన్నది నేటి రీతి. అది కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా ఒకటే. నరేంద్రమోడీ సర్కార్‌ బిజెపి సీనియర్‌ నాయకుడు శాంతకుమార్‌ అధ్యక్షతన ఒక వున్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది చేసిన సిఫార్సులను దేశీయ, విదేశీ కార్పొరేట్లన్నీ హర్షించాయంటే అవెలాంటివో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా వున్నాయి. రైతులందరికీ కనీస మద్దతు ధరల లబ్ది చేకూరటం లేదు, మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరణను పరిమితం చేస్తారు. రాష్ట్రాల అవసరాలకు పోను మిగులు వున్న ధాన్యాన్నే అదీ ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేస్తారు. అసలే రాష్ట్ర ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా వున్న స్ధితిలో ఇది రాష్ట్రాలపై భారం మోపటం, కేంద్రం తన బాధ్యతల నుంచి వైదొలగటం తప్ప వేరు కాదు. అన్ని రాష్ట్రాల నుంచి, రైతులందరి నుంచి కొనుగోలు చేసి లోటు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన ఎఫ్‌సిఐ పాత్రను చిన్న కమతాలున్న రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఏ రాష్ట్రమైనా తన రైతాంగానికి బోనస్‌ ఇచ్చేట్లయితే అలాంటి రాష్ట్రాల నుంచి మిగులు ధాన్యాన్ని కూడా ఎఫ్‌సిఐ కొనుగోలు చేయరాదని పేర్కొన్నది. ఇది రైతాంగానికి అన్యాయం చేయటమే.

రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణలో రైతాంగాన్ని ప్రయివేటు వ్యాపారులకు అప్పగించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. కనీస మద్దతు ధరలే తక్కువని రైతాంగం గగ్గోలు పెడుతుంటే వాటి కంటే మార్కెట్లో ధరలు తగ్గినపుడే ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అంటే అంతకు మించి కొనుగోలు చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ముందుకు రారన్నది పత్తి విషయంలో చూశాము. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోళ్లు ఎంఎస్‌పికే పరిమితం కావటం, రైతాంగం నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి మద్దతు ధరలకు కొనుగోలు చేసి వారికి లబ్ది చేకూర్చటం అందిరికీ తెలిసిందే. ఆహార భద్రతను జనాభాలో ఇప్పటి వరకు వున్న 67శాతం మందిని 40శాతానికి పరిమితం చేసేందుకు శాంతకుమార్‌ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్ధానం గత నాలుగు సంవత్సరాలలో ఒకటో అరా పాయింటు దిగజారింది తప్ప మెరుగుపడలేదు, అయినప్పటికీ లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఈ కమిటీ సిఫార్సు చేయటం గమనించాల్సిన అంశం. ఆహార భద్రతలో రెండు అంశాలున్నాయి. రైతులకు అధిక ధరలు కావాలి, వినియోగదారులకు తక్కువకు ఇవ్వాలి అంటే ఎలా అన్న వాదనను ముందుకు తేవటం తెలిసిందే.గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వుదంతాలు చూశాము గానీ, తమ వుత్పత్తులకు గిట్టుబాటు ధరరాక దివాలాతీసిన పారిశ్రామికవేత్తలను ఎక్కడా చూడలేదు. అలాగే ఆత్మహత్యల కారణాలలో నమోదైన వాటిలో ధరల పెరుగుదల అంశం ఎక్కడా కనపడదు. రైతులు పండించిన వాటికి గిట్టుబాటు ధర రాక, వినియోగదారుడిగా అధిక ధరలు చెల్లించి రెండు విధాలుగా నష్టపోతున్నాడు. వినియోగదారుడికి వస్తున్న నష్టం ఒక్కటే. అందువలన ప్రభుత్వాలు ఇరువురి ప్రయోజనాలను కాపాడాల్సిందే. అది దాని బాధ్యత.

Image result for US writing the indian farmers fate

ప్రభుత్వాల ద్రవ్యలోటు తగ్గాలంటే సమాజంలోని బలహీనవర్గాలకు ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టాలని ఎక్కువ మంది చెబుతారు. అదే సమయంలో వుపాధి కల్పించాలంటే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆ వాదన చేసే వారే చెబుతారు. జరుగుతున్నదేమిటి? దేశంలో ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టారు. పెట్రోలు,డీజిల్‌ రాయితీ ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై క్రమంగా ఎత్తివేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులపై ధర నియంత్రణ ఎత్తివేశారు. వాటి మీద ఇచ్చే రాయితీలను తగ్గించటం లేదా ఒక పరిమితిదాట కుండా చూస్తున్నారు. ఎరువుల విషయం చూద్దాం. పౌష్టికాధార ప్రాతిపదికన రాయితీ విధానం(ఎన్‌బిఎస్‌) కింద నైట్రోజన్‌(ఎన్‌) కిలోకు 2011-12లో రు.27.15 ఇస్తే 2016-17కు రు.15.85కు తగ్గింది. ఇదే విధంగా ఫాస్ఫేట్‌ (పి)కు రు.32.34 నుంచి 13.24కు, పొటాష్‌(కె)కు రు.26.75 నుంచి 15.47కు తగ్గింది. ఇదే సమయంలో సల్ఫర్‌(ఎస్‌)కు రు.1.78 నుంచి 2.04కు పెరిగింది.(కేంద్ర ఎరువుల శాఖ 2016-17వార్షిక నివేదిక, పేజీ 41) యూరియా మీద రాయితీ కొనసాగుతున్నది, పెరుగుతున్నది. అన్నింటికీ ద్రవ్యోల్బణం ప్రాతిపదికన రేట్లు పెరుగుతున్నపుడు ఎరువుల రాయితీ మొత్తం కూడా ఆమేరకు పెరగాలి, కానీ అలా జరగటం లేదు. భారత ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ సమాచారం మేరకు 2011-12 నుంచి 2014-15 మధ్య యూరియా మీద ఇస్తున్న రాయితీ 20,208 కోట్ల నుంచి 36వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో ధరల నియంత్రణ ఎత్తివేసిన కాంప్లెక్‌ ఎరువులపై ఇస్తున్న రాయితీ రు.36,089 కోట్ల నుంచి 24,670 కోట్లకు పడిపోయింది. దిగుమతులతో సహా అన్ని రకాల ఎరువులకు ఇచ్చిన రాయితీలు వరుసగా నాలుగు సంవత్సరాలలో 70013,65613, 67971, 72970 కోట్ల వంతున వున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో ప్రకటించిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2017-18 సంవత్సరంలో ఇచ్చిన రాయితీల సవరించిన మొత్తం రు.64,973 కోట్లు కాగా దీనిలో 42,721 కోట్లు యూరియా వాటా, వర్తమాన సంవత్సరం అంటే 2018-19లో మొత్తం సబ్సిడీ రు.70,079 కోట్లకు పెంచగా దానిలో యూరియా నిమిత్తం 44,989 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే మొత్తంగా ఎరువుల రాయితీ తగ్గుతున్నట్లా పెరుగుతున్నట్లా ?

ఒకటి రెండు సంవత్సరాలలో తప్ప జనానికి ఇచ్చే ఆహార, పెట్రోలియం వుత్పత్తుల, ఎరువుల సబ్సిడీ మొత్తం జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా వుంటున్నాయి. ఇదే సమయంలో కార్పొరేట్‌లకు ఇస్తున్న రాయితీలు ఐదు నుంచి ఎనిమిదిశాతం మధ్యన వుంటున్నాయి. ఐదుశాతం రాయితీలు ఇస్తున్నామని, వాటిని ఎత్తివేస్తే జిడిపిలో పన్ను 22శాతానికి పెరుగుతుందని ప్రధాని ఆర్ధిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దేవరాయ్‌ 2017 డిసెంబరులో చెప్పారు. మన దేశంలో జిడిపిలో పన్ను 15శాతమే, అదే ఇతర బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌లో 25.4, రష్యాలో 23,చైనాలో 18.9, దక్షిణాఫ్రికాలో 26శాతం కాగా అమెరికాలో 28, స్కాండినేవియన్‌ దేశాలలో 45-50శాతం మధ్య వున్నాయి. అందువలన రకరకాల ముసుగుల్లో విదేశాలకు, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలకు తరలిపోతున్న లాభాలపై పన్ను రేటు పెంచి ఆ వచ్చిన మొత్తాన్ని అటు రైతాంగం, ఇటు వినియోగదారులకు రాయితీలు ఇస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా వుంటారు. అలాంటి సంస్కరణలకు ఈ పాలకులు పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫిట్‌నెస్‌ కాదు మోడీజీ, మౌనముద్ర సవాల్‌ స్వీకరించండి !

26 Saturday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anushka sarma, fitness challenge, Kohil's challenge, Narendra Modi, narendra modi fitness challenge, petrol price, Rahul gandhi

Image result for narendra modi fitness challenge

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు, వడ్డీ రేటు పెంచితే మన రూపాయి విలువ మరింత దిగజారుతుందా ? అవును, ఇదేమి లంకె అనుకుంటున్నారా ? చమురు ధరలు పెరిగితే దానిని వుత్పత్తి దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం, ఆనందం. మనకు విషాదం, తారాజువ్వల్లా ధరల పెరుగుదల ! ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదేనా ! ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మన రూపాయి విలువ పతన కారణాలలో ఒకటని అనేక మంది చెబుతుంటే మన చమురు, సహజవాయు శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారు మాత్రం దానికి రూపాయి విలువ పతనం అని మరొకదాన్ని జోడించి మన దేశంలో పెట్రోలియం, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని సెలవిచ్చారు. చమురు ధరలు మన చేతుల్లో లేవు సరే మన రూపాయి విలువ కూడా మన అదుపులో లేదా ? పాపాయి వంటి రూపాయికి రక్షణ లేకుండా పోతోందని ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుండెలు బాదుకున్న విషయం మరచిపోయారా ?

పెట్రోలు ధరల గురించి ఈ రోజు రాసింది రేపటికి చద్దివార్త అవుతోంది. ధరలు మారిపోతున్నాయి. అందువలన ఈ రోజు ఎంత అన్నది వదిలేద్దాం. కొద్ది నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాచస్‌ అనే సంస్ధ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతున్న కారణంగా(ఎలాంటిది, ఎంతనేది వేరే విషయం) నిరుద్యోగరేటు తగ్గుతోంది, పర్యవసానంగా 2018లో అక్కడ వడ్డీ రేట్లు నాలుగు సార్లు పెరిగే అవకాశం వుందన్నది ఒక అంశం. ఇదే జరిగితే బలహీనమైన ఆర్ధిక వ్యవస్ధలతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి(డాలర్ల రూపంలో) అమెరికన్‌ మార్కెట్లకు తరలిపోతుంది. అటువంటి పరిస్ధితులలో మనది బలహీన ఆర్ధిక వ్యవస్ధ కానప్పటికీ దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎఫ్‌పిఐలు షేర్‌ మార్కెట్లో, అప్పు మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ మోసం చేయటానికి జనం దొరుకుతారో అక్కడికి నవారు ఆట మోసగాండ్లు ఎప్పటికప్పుడు మకాంలు ఎలా మారుస్తారో అలాగే విదేశీ మదుపుదార్లు మన దేశంలో కంటే వాటిమీద ఎక్కడ ఎక్కువ రాబడి వస్తే అక్కడకు ఇక్కడ అమ్మేసి తరలిస్తారు. వారికేమీ దేశభక్తి, మన దేశం ఏమి అవుతుంది అనేదేమీ వుండదు. అలా పెట్టుబడులు తరలిపోయినపుడు వాటి మీద ఆధారపడి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ఆగిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. అమెరికాలో పరిస్ధితులు మెరుగుపడితే మన రూపాయి విలువ పతనం అవుతుంది, దిగజారితే డాలరు విలువ తగ్గి మన రూపాయి విలువ పెరుగుతుంది. అప్పుడు మనం కొనే చమురుకు చెల్లించాల్సిన డాలర్ల మొత్తం తగ్గుతుంది. అసలు చమురు రేట్లే పెరిగితే ఆ భారం ఇంకా పెరుగుతుందని చెప్పనవసరం లేదు.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ వున్న ప్రవాస భారతీయులు అక్కడే పెట్టుబడులు పెడతారు తప్ప మన దేశానికి డాలర్లను తరలించరు. మన వారికే దేశభక్తి లేనపుడు మిగతావారి గురించి చెప్పేదేముంది. అమెరికా ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అక్కడ వాటి వడ్డీ రేట్లు పెరిగితే మన దేశం కంటే అక్కడ ఎక్కువ వచ్చేట్లయితే ఇక్కడి అప్పును అయినకాడికి అమ్మేసి డాలర్లను తీసుకుపోతారు. దీని ప్రభావం మన స్టాక్‌ మార్కెట్‌ మీద కూడా పడుతుంది. మన దేశంలో పెట్టుబడులు కావాల్సిన వారు విదేశాల నుంచి తీసుకోవాలంటే ఎక్కువ రేటు చెల్లించాలి. గతంలో మన రూపాయి విలువ ఎక్కువగా వుండి డాలరు విలువ తక్కువగా వున్నపుడు అందిన కాడికి మన కంపెనీలు అప్పులు తీసుకువచ్చాయి. తరువాత డాలరు రేటు పెరగటం, మన రూపాయి పతనంతో ఆ కంపెనీలు తలకు మించిన రుణభారంతో దెబ్బతిన్నాయి.

తిరుగుతున్న చక్రం మీద కూర్చున్న ఈగ చక్రాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తుందట. నరేంద్రమోడీ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు విజయగీతాలాపన చేశారు. నాలుగోఏడాది పూర్తయ్యే సరికి గొంతు బొంగురు పోతోంది.యుపిఏ హయాంలో 2012-13 సంవత్సరాలలో చమురు పీపాధర 150 డాలర్ల వరకు పోయింది. సరే అప్పుడు పెట్రోలు లీటరు రు.70కి అటూ ఇటూగా వున్నపుడు ఇంత ఘోరమా అంటూ బిజెపి పెద్దలందరూ వీధులలో నిరసనలతో హోరెత్తించారు. అలాంటి ధరలు కాస్తా నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక ఒక దశలో కనిష్టంగా 33 డాలర్లకు పడిపోయాయి. అయినా పెట్రోలు రు.60కి మించి తగ్గలేదు. చమురు ఆదాయం మీద ఆధారపడిన అనేక దేశాలు అల్లాడుతుంటే మన దేశం ఎంతో లబ్ది పొందింది. అది సామాన్య జనానికి కాకుండా కార్పొరేట్లకు అన్నది తిరుగులేని నిజం. తగ్గిన చమురు భారాన్ని జనానికి బదలాయించకుండా వచ్చిన లాభాన్ని ద్రవ్యలోటు పూడ్చేందుకు వినియోగించి లోటును తగ్గించిన ఘనత మాదే అని గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు పెరిగాయి తప్ప రాయితీలు ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయు శాఖ వార్షిక నివేదికల ప్రకారం ముడి చమురు దిగుమతులు, పీపా సగటు ధరలు ఇలా వున్నాయి.

సంవత్సరం    మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు    ధర డాలర్లలో        దిగుమతి ఖర్చు రు.కోట్లు

2011-12         171.729               111.89                ======

2012-13         184.795              107.97           7,84,562

2013-14         189.238            105.52            8,64,875

2014-15         189.43                84.16            6,87,416

2015-16         202.85                46.17             4,16,579

2016-17        213.93                47.56              4,70,159

2017-18        217.08                53.59             3,42,673

2017-18 సంవత్సరంలో 217 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు దిగుమతి అంచనా కాగా మూడు లక్షల 42వేల 673 కోట్లు ఏప్రిల్‌-నవంబరు మాసాలలో దిగుమతి చేసుకున్న మొత్తానికి చెల్లించిన సొమ్ము. ఈ అంకెలు నరేంద్రమోడీ సర్కార్‌పై చమురు దిగుమతుల బిల్లు భారాన్ని ఎంతగా తగ్గించాయో చెబుతున్నాయి. ఇంత భారం తగ్గినప్పటికీ దాన్ని వినియోగదారులకు బదలాయించకపోగా మోడీ ప్రభుత్వం వినియోగదారులపై అదనంగా ఎంత భారం మోపిందో చూద్దాం.

2013-14లో(నరేంద్రమోడీ 2014 మే 26న పదవిలోకి వచ్చారు) యుపిఏ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌, ఇతర పెట్రోలియం వుత్పత్తుల మీద విధించిన పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 88,600 కోట్ల రూపాయలు. ఈ మొత్తం మోడీ హయాంలో వరుసగా నాలుగు సంవత్సరాలలో 1,05,653, 1,85,598, 2,53,254, 2,01,592, 2,57,850లకు పెరిగింది. ఈ అంకెలలో 2017-18 సంవత్సరానికి చూపిన 2,01,592 కోట్ల రూపాయలు ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు మాత్రమే. అంటే మిగిలిన మూడు నెలలకు సగటున మరో 67వేల కోట్ల రూపాయలను వేసుకుంటే 2,68,790 కోట్లుగా వుంటుంది.ఈ లెక్కన నాలుగేండ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని వుపసంహరించిందో, ఎన్నిలక్షల కోట్ల భారం మోపిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిఎంఓ రిపోర్డు కార్డు పేరుతో అచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ అనే భ్రమ కలిగించే ఒక బిజెపి ప్రచార వెబ్‌సైట్‌ వుంది. దాని మీద ప్రధాని బొమ్మ, మూడు సింహాలు, జాతీయ జెండా కూడా వుంటాయి. దాని మీద సామాన్యులకు అర్ధం కాకుండా అనధికారికం అనే ఒక పదం వుంటుంది. అయితే దాని ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే కాని అది అనధికారికం, వలంటీర్లు నిర్వహిస్తున్నది అని తెలుస్తుంది. వలంటీర్లంటే కిరాయి బాపతు అని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌కు పెట్రోలు మంటల సెగ తగులుతుండటంతో ఆ గ్యాంగు ఒక పట్టికను తయారు చేసి జనం మీదకు వదిలింది.

2009-13 సంవత్సరాల మధ్య, తరువాత 2018వరకు ముంబైలో పెట్రోలు ధరలంటూ ఒక పట్టిక ఇచ్చింది. వాటిని ఎలా నిర్ధారించారో తెలియదు, వదలివేద్దాం. యుపిఏ ఐదేండ్ల కాలంలో పెట్రోలియం వుత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ దాని పట్టిక ప్రకారం 5,67,449 కోట్లు, తరువాత మోడీ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తం 1,33,663 కోట్లుగా తెలిపింది. యుపిఏ హయాంలో ఇచ్చిన సబ్సిడీ నుంచి మోడీ ఏలుబడి సబ్సిడీ మొత్తాన్ని తీసి వేసి యుపిఏ కాంగ్రెస్‌ లూటీ చేసిన 4,43,308 కోట్ల రూపాయల మొత్తం ఏమైందో ఆశ్చర్యంగా వుందంటూ ఒక వ్యాఖ్యను జోడించారు. లూటీ మొత్తమంటూ పేర్కొన్నది కూడికలు తీసివేతలు కూడా సరిగా రాని వారు వేసిన అంకె. ఆ మొత్తం వినియోగదారులకు దక్కింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ మోడీగారిని అడగాల్సింది, జనానికి తెలియాల్సిందేమంటే ఆ పట్టిక ప్రకారం సబ్సిడీలో విధించిన కోత 4,33,786 కోట్లు, పెంచిన పన్నులతో వసూలు చేసిన మొత్తం 8లక్షల 20వేల కోట్లకు అటూగా వుంది. అంతకు ముందు మాదిరి పన్ను రేటు అలాగే వుందనుకుంటే అది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలనుకుంటే మోడీ సర్కార్‌ జనం మీద మరో నాలుగు లక్షల కోట్ల భారం మోపినట్లే ? దీనికి కోతపెట్టిన సబ్సిడీని కూడా కలుపుకుంటే ఏడాదికి రెండులక్షల కోట్ల మేరకు జనం మీద భారం మోపినట్లే . జనం ఆశ్చర్యపోవాల్సిందీ, నిలదీయాల్సిందీ ఇంత భారం మోపి సాధించిన ప్రగతి ఏమిటీ అని?

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక వ్యాధి మీద పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణకు కొంత మంది ఒక బకెట్‌లో నీళ్లు, మంచు ముక్కలు కలుపుకొని తల మీద పోసుకొని ఇతరులు కూడా అలాగే చేయాలని సవాలు విసిరారు. జనం వేలం వెర్రిగా ఆపని చేశారు. సరే తరువాత అది ఎంత అపహాస్యమైందో ఎన్ని జోకులు పేలాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ గారిని జనం చమురు గురించి, ఇతర వాగ్దానాల గురించి నిలదీస్తుంటే వాటికి ఎక్కడా సమాధానాలు చెప్పటం లేదు. ఇప్పుడు మరోవేలం వెర్రిగా మారుతున్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను పట్టుకొని జనాలు తామేం చేస్తున్నదీ ఫొటోలు పెడుతున్నారు.దాన్లో భాగంగా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఫిట్‌నెస్‌ సవాలు విసిరాడు. వయసులో వున్న కోహ్లీ నాలుగు కాలాలపాటు క్రికెట్‌ ఆడి, నాలుగు వాణిజ్య ప్రకటనలు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే ఫిట్‌నెస్‌ అవసరం. ఆయన భార్య అనుష్కశర్మ సినిమా హీరోయిన్‌, ఆమెదీ అదే పరిస్ధితి, అందులోనూ వారిద్దరికీ ఈ మధ్యే వివాహం కూడా అయింది.ఫిట్‌నెస్‌ గురించి వారిద్దరూ ఒకరికొకరు సవాలు విసురుకున్నారంటే అందం, అర్ధం వుంది. మరి ఈ వయస్సులో నరేంద్రమోడీకి ఎందుకు ! ఒకవైపు దేశంలో మీరు ప్రధాని పదవికి అన్‌ఫిట్‌ (తగరు) అనే అభిప్రాయం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటువంటి స్ధితిలో ప్రతిపక్షాలు విసురుతున్న అనేక సవాళ్ల గురించి పట్టించుకోకుండా దేశం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి మాదిరి నేను కూడా శారీరక ఫిట్‌నెస్‌ సవాలును స్వీకరిస్తా అంటూ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సై అనటం నరేంద్రమోడీకి తగని పని. నీరోకూ ఆయనకు పెద్ద తేడా కనపడటం లేదు. దేశమంతటా చమురు ధరల గురించి చర్చ చేస్తుంటే చమురు సవాలును స్వీకరించాలని రాహుల్‌ గాంధీ విసిరిన సవాలు గురించి మౌన ముద్రదాల్చారు. సామాజిక మీడియాలో దాని మీద పేలుతున్న జోకులెన్నో సరేసరి. నిజానికి ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్నది మరోసారి ప్రధాని పదవికి అర్హత వుందా అన్నది పెద్ద సవాల్‌. ఏ ప్రధాన సమస్య గురించి నోరు విప్పని మోడీ వాటి గురించి మాట్లాడాలి.

మన దేశంలో కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా ఒకే చెప్పుల్లో కాళ్లు దూర్చుతున్నారు, ఒకే బాటలో నడుస్తున్నారు. అది పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలన కావచ్చు, నాలుగేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి కావచ్చు. ప్రపంచీకరణ యుగంలో మనం ఒంటరిగా వుండలేమన్నది నిజం. కిటికీ మూసుకుంటే గాలి ఆడక వుక్కిరి అవుతాం. తెరిస్తే ఈగలు, దోమలతో పాటు ఇప్పుడు కొత్తగా గబ్బిలాల వైరస్‌ కూడా ప్రవేశించే ప్రమాదం వుంది. ఇప్పటికే దేశంలో అంతకు మించి ముప్పు తెచ్చే మతోన్మాద వైరస్‌ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. దీనికి దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక దిగజారుడు తోడైంది. వీటిని జంటగా ఎదుర్కోవటం పెద్ద సవాల్‌. దేశం ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరోమారు విజయం సాధించిన వెనెజులా సోషలిస్టు నికొలస్‌ మదురో !

21 Monday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Venezuela elections, Venezuela votes 2018, venezuelan chavista

ఎం కోటేశ్వరరావు

‘మేం ఇంతవరకు 92 ఎన్నికలను పర్యవేక్షించాం, వెనెజులా ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే వుత్తమమైనది అని నేను చెబుతా’ ఈ మాటలన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌. ఆదివారం నాడు జరిగిన ఆ దేశ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తిగాక ముందే ఈ ఎన్నికలను తాము గుర్తించటం లేదని, అక్టోబరులో తిరిగి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధులు ప్రకటించారు. పోలైన ఓట్ల 86లక్షల ఓట్లలో 92.6శాతం లెక్కింపు జరిగిన సమయానికి మదురోకు 58, సమీప అభ్యర్ధి హెన్రీ ఫాల్కన్‌కు 18లక్షలు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు, ప్రచారదాడి, వత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల మధ్య జరిగిన ఈ ఎన్నికలలో పాలక సోషలిస్టు పార్టీ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించుతున్న తరుణంలో వెనెజులాలో వాటి ఆటలు సాగనివ్వలేదు. దాంతో తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఒకవైపు ప్రకటించిన ప్రతిపక్షాలు మరోవైపు స్వతంతత్రుల ముసుగులో అభ్యర్దులను నిలిపాయి. వారు ఓటమి తధ్యమని తేలగానే ఫలితాల ప్ర కటనకు ముందే ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే జరపటం అక్రమాలలో ఒకటని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే దేశ కరెన్సీని అమెరికా డాలరుగా మార్చివేస్తానని ప్రకటించిన ప్రధాన ప్రత్యర్ధి హెన్రీ ఫాల్కన్‌ ఫలితాలను తాను గుర్తించనని పేర్కొంటూ చేసిన ప్రకటనలో ప్రతిపక్షంలోని కొంత మంది ఓటింగ్‌కు రాకపోవటం తన ఓటమికి కారణమని పేర్కొన్నాడు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎర్ర కేంద్రాలను ఏర్పరచి ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించాడు. నమోదైన ఓటర్లలో 46శాతం పోలింగ్‌కు వచ్చారు.

నికొలస్‌ మదురోపై పోటీ చేసిన వారిలో ప్రధాన ప్రత్యర్ధి న్యాయవాది అయిన హెన్రీ ఫాల్కన్‌ గతంలో ఛావెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీలో లారా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఛావెజ్‌ బ్రతికి వుండగానే 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. 2013 ఎన్నికలలో మదురో ప్రత్యర్ధి హెన్రిక్‌ కాప్రిల్స్‌ ప్రచార సారధిగా పని చేశాడు.ఈ ఎన్నికలలో ప్రతిపక్షం నుంచి విడిపోయి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఎన్నికల బహిష్కరణ పనిచేయలేదు, అందుకే ఆ ప్రక్రియకు దూరంగా వుండదలచుకున్నాను. ఒక దేశం తరువాత మరొక దేశంలో బహిష్కరణ పిలుపులతో ప్రతిపక్షాలు ఎన్నికల రంగానికి దూరమై పాలకులు పటిష్టం కావటానికి అవకాశమిచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంతో ఫాల్కన్‌ పేర్కొన్నాడు. దేశ కరెన్సీ బలివర్‌ స్ధానంలో అమెరికా డాలర్‌ను ప్రవేశ పెట్టి దేశ ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించేందుకు పని చేస్తానని, ఐఎంఎఫ్‌ నుంచి సాయం పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మరొక ప్రత్యర్ధి క్రైస్తవ మత పాస్టర్‌ అయిన జేవియర్‌ బెర్టూసీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కరెన్సీ మార్పిడిపై నియంత్రణలను ఎత్తివేస్తానని, విదేశీ పెట్టుబడులను పెంచుతానని, ఛావెజ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మరో అభ్యర్ధి రెనాల్డో క్విజాడా తను ఛావిస్టా(ఛావెజ్‌) వుద్యమాన్ని కొనసాగిస్తానని, అయితే మదురో ప్రభుత్వానికి వ్యతిరేకినని ప్రకటించుకున్నాడు. వీరికి వరుసగా 21.1, 10.8,0.4శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మదురో 67.7శాతం పొందారు.

హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా 2013లో అధికారానికి వచ్చిన నికొలస్‌ మదురో గత ఆరు సంవత్సరాలుగా ఇంటా బయటా అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ప్రధాన ఆదాయ వనరైన చమురు రేట్లు గణనీయంగా పడిపోవటంతో దేశం ఆర్ధికంగా అనేక ఇబ్బందులపాలైంది. చమురు ధరల పతనం కారణంగా జిడిపి 45శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ప్రకటించింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకులైన వాణిజ్యవేత్తలు బ్లాక్‌మార్కెటింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అనేక వస్తువుల కొరత ఏర్పడింది. బ్యాలట్లు కావాలా బుల్లెట్లు కావాలా, మాతృభూమిగా వుండాలా వలస దేశంగా మారాలా, శాంతా లేక హింసా కాండా, స్వాతంత్య్రమా, పారతంత్య్రమా నిర్ణయించేది ఈ ఓటు అన్నట్లుగా తాము పరిగణించామని కార్మిక సంఘనేత అయిన ఒక బస్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించాడు. ఓటింగ్‌ ప్రారంభం కాగానే వెనెజులా ఎన్నికలు ఒక బూటకం అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. ముఫ్పై దేశాల నుంచి 150 మంది పరిశీలకులు వెనెజులా ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు. వారిలో ఒకరైన స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ లూయిస్‌ రోడ్రిగజ్‌ జపాటెరో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మీద నాకెలాంటి సందేహాలు లేవు, ఆధునిక ఆటోమాటాక్‌ ఓటింగ్‌ పద్దతిని అనుసరిస్తున్నారు. జనం తమంతట తాము ఓటింగ్‌కు వస్తున్నారా లేదా తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారా లేదా అని పరిశీలించటానికి వచ్చాం. మేం ఇప్పుడంతా చూశాం అని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని ఇతర ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు.

అనేక మంది ముందుగా వూహించినట్లుగానే వెనెజులా ఎన్నికల ఫలితాలను తాము గుర్తించటం లేదని ప్రకటించటం ద్వారా లాటిన్‌ అమెరికాలో తన కుట్రలను కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నదని స్పష్టమైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి20విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గనేందుకు వచ్చిన అమెరికా డిప్యూటీ మంత్రి జాన్‌ సులివాన్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను గుర్తించేది లేదని చెబుతూనే చమురుపై ఆంక్షలు విధించటం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఛావెజ్‌ హయాంలో, తరువాత మదురోకు వ్యతిరేకంగా పని చేసిన ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ పేరుతో ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలలో పాల్గనాలా వద్దా అనే విషయంలో దానిలో రెండు అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పోటీ చేస్తే మదురో పాలన చట్టబద్దమైనదే అని అంగీకరించినట్లు అవుతుందని కొందరు, మార్పుకోసం వచ్చిన అవకాశాన్ని పోటీ చేసి వినియోగించుకోవాలని కొందరు వాదించినా అంతిమంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అది ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హెన్రిక్‌ కాప్రిల్స్‌ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా పదిహేను సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయటానికి అనర్హుడయ్యాడు. మరోనేత లియోపాల్డో లోపెజ్‌ పలుకేసులలో నిందితుడిగా వుండటంతో గృహనిర్బంధంలో వున్నాడు. ఈ పూర్వరంగంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని హెన్రీ ఫాల్కన్‌ వ్యతిరేకించి బయటకు వచ్చి స్వతంత్రుడిగా పోటీ చేశాడు. బహిష్కరణ పిలుపు తన విజయాన్ని దెబ్బతీసిందని చెప్పుకున్నాడు.

తమ దేశంలో వున్న చమురు సంపదలను కొల్లగొట్టేందుకు, తమ సంక్షేమ చర్యలకు స్వస్తి పలికేందుకు అమెరికా ఒక అంతర్జాతీయ కుట్ర చేస్తోందని అధ్యక్షుడు మదురో ప్రచారం చేశారు. ఛావెజ్‌ నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయిందని అంతర్జాతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చమురు సంపదలతో వున్న ఆదేశం 1998లో ఛావెజ్‌ అధికారానికి రాకముందు తీవ్ర అసమానతలు, పట్టణాలలో దారిద్య్రం తాండవించిందని, దానికి ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలే కారణమనే వాస్తవాలను దాచిపెడుతోంది. ఛావెజ్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ చమురు సంస్ధను పటిష్టపరచి చమురు సంపదను దేశ అంటే ప్రజాప్రయోజనాల కోసం వినియోగించటం ప్రారంభించటంతో అప్పటి వరకు ఆ రంగాన్ని పీల్చిపిప్పి చేసి లాభపడిన అమెరికా, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలు వ్యతిరేకతను పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే వున్నాయి.2002లో ఛావెజ్‌పై విఫల కుట్ర చేశారు. ఆయనకు అనుకూలంగా వున్న మిలిటరీ, కార్మికుల మద్దతుతో తిరిగి అధికారానికి వచ్చారు.

అమెరికా విధించిన ఆంక్షలు, సరకులు బ్లాక్‌మార్కెట్లోకి పోవటం, చట్టవిరుద్ధమైన కరెన్సీ చలామణిలోకి రావటం, చమురు ధరలు పతనం కావటంతో అక్కడి ప్రభుత్వానికి కొన్ని తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ప్రజలలో కొంత అసంతృప్తి కూడా తలెత్తింది. గత పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెజారిటీ సీట్లు వచ్చాయి. తరువాత మదురో తన స్ధానాన్ని పటిష్ట పరుచుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో గతేడాది దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, అంతర్జాతీయ ఏజన్సీలు పెద్ద కుట్ర చేశాయి. ప్రభుత్వ ఆస్ధులను విధ్వంసం చేయటం, అధికారపార్టీ మద్దతుదారులను సజీవ దహనం చేయటం, ఆయుధాలతో జనం మీద, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డాయి. వాటిని సాకుగా చూపి వెంటనే ఎన్నికలు జరపాలని అమెరికా, తదితర దేశాలు పిలుపుల నిచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వంతో చర్చించి కుదుర్చుకున్న అవగాహన ప్రకారం డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌లోనే జరపాల్సి వుంది. ఆమేరకు అనూహ్యంగా వెనెజులా ఎన్నికల సంఘం మధ్యంతర ఎన్నికల ప్రకటన చేయటంతో అది అక్రమం అంటూ అమెరికా, ప్రతిపక్షాలు మాట మార్చాయి. మదురో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ను తాము గుర్తించటం లేదని ప్రకటించాయి. ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు రౌండ్‌ టేబుల్‌ ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత వెనెజులా మిలిటరీ తిరుగుబాటు చేసి నియంత మదురోను అధికారం నుంచి కూలదోస్తే తాము మద్దతు ఇస్తామని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రుబియో ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. అదే వారంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాలకులు ఏమాత్రం ప్రజలకు సేవచేయలేనపుడు, పరిస్ధితులు దిగజారినపుడు లాటిన్‌ అమెరికాలో తరచుగా మార్పులను తెచ్చింది మిలిటరీయే అని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించాడు. అంతెందుకు స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా విషయంలో అవసరం అయితే మిలిటరీని వుపయోగించుకుంటా అని విలేకర్లతో చెప్పాడు. అంటే మిలిటరీ కుట్రలను నిస్సిగ్గుగా సమర్ధించటం తప్ప మరొకటికాదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు నిత్యం అమెరికా కుట్రలు, కూహకాల ముప్పు వెన్నాడుతూనే వుంటుంది. దోపిడీ వ్యవస్ధలను విధ్వంసం చేయకుండా వాటిని అలాగే కొనసాగనిస్తూ తమకున్న వెసులు బాటు మేరకు అమలు జరుపుతున్న సంక్షేమ చర్యలకు ప రిమితులు వచ్చినపుడు జనాలలో అసంతృప్తి తలెత్తటం, దానిని మితవాద శక్తులు వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో చూశాము. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సంస్కరణబాటను వదలి విప్లవాత్మక చర్యలు తీసుకొనేందుకు పూనుకుంటేనే లాటిన్‌ అమెరికా వామపక్షాలకు భవిష్యత్‌ వుంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటకలో బిజెపి రాజ్యాంగ బద్ద కుట్రను భగ్నం చేసిన సుప్రీం కోర్టు !

20 Sunday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, bjp constitutional coup in karnataka, karnataka developments, karnataka votes 2018, Supreme Court

ఎం.కోటేశ్వరరావు

ఒక కట్టడాన్ని కొన్ని క్షణాల్లో కూల్చివేయగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మాయాబజార్‌ వంటి సినిమాలలో తప్ప నిజజీవితంలో కొన్ని క్షణాలలో ఒక కట్టడనిర్మాణానికి అవసరమైన పరిజ్ఞానం మనకు ఇంకా రాలేదు. ప్రజాస్వామ్య కట్టడం పరిస్ధితి కూడా అలాగే వుంది. ఒక వేళ తమకు తగినన్ని సీట్లు రాని పక్షంలో ప్రలోభాలతో ఫిరాయించిన వారికి నష్టం జరగకుండా ఒక రాజ్యాంగ బద్ద కుట్రద్వారా అధికారానికి రావాలని కర్ణాటకలో కమలనాధులు ముందే కుట్రపన్నారా ? జరిగిన పరిణామాలను అవలోకనం చేసుకుంటే అవుననే తేలుతున్నది. మే పదిహేడవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి నేత ఎడ్డియూరప్ప ముందే చెప్పటానికి ఆ కుట్రే కారణం అన్నది మరింత తేటతెల్లమైంది.

Image result for bjp constitutional coup in karnataka

మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని , ప్రజాతీర్పును అపహాస్యం, ఖూనీ చేయటంలో కాంగ్రెస్‌ పేరు మోసిన నేరస్ధురాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం దానిని తీవ్రంగా విమర్శించి, వ్యతిరేకించిన బిజెపి తన దాకా వచ్చే సరికి అంతకంటే తక్కువ కాదని స్వయంగా వెల్లడించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రలోభాలు, బెదిరింపులతో పాటు తన తెలివి తేటలన్నీంటినీ వినియోగించింది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఒక అడుగు ముందుకు వేసింది. మాయాబజార్‌ సినిమాలో మాకు తల్పం కాదు గిల్పం కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి చావుదెబ్బలు తిన్నవారి మాదిరి కర్ణాటకలో బిజెపి అతి తెలివి తేటలను వుపయోగించి భంగపడింది.

కోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు పురోగామి లేదా ప్రజాస్వామ్య బద్దం అని చెప్పలేము గానీ కర్ణాటక వుదంతంలో మాత్రం జస్టిస్‌ ఎకె సిక్రి, అశోక్‌ భూషన్‌, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచ్‌  చేసిన తాత్కాలిక నిర్ణయాన్ని మాత్రం అభినందించాల్సిందే. అదే కమలనాధుల కలలను కల్లలయ్యేట్లు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ వినిపించిన వాదన నాటి కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని గుర్తుకు తెచ్చింది. అత్యవసర పరిస్ధితి విధించి అనేక మంది సిపిఐ(ఎం) నేతలతో పాటు నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా వున్న జనసంఘం, ఇతర కాంగ్రెసేతర పార్టీల నేతలను అనేక మందిని అరెస్టు చేసి జైలుపాలు చేశారు.( సిపిఐ అత్యవసర పరిస్ధితిని సమర్ధించింది కనుక ఆ పార్టీ వారిని మినహాయించారు) అలా జైలుపాలైన ఒక నిర్బంధితుని అరెస్టు అక్రమం అంటూ ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఆ సమయంలో అటార్నీ జనరల్‌గా వున్న నిరేన్‌ డే చేసిన వాదనల సారాంశం ఇలా వుంది.

అత్యవసర పరిస్ధితి విధించిన కారణంగా పౌరులు కోర్టుకు వెళ్లే హక్కును నిలిపివేశారు. ఒక వేళ నిర్భంధం అక్రమం అయినప్పటికీ దాన్ని కోర్టులో ప్రశ్నించటానికి లేదు. అత్యవసర పరిస్ధితి నిబంధల లక్ష్యం, వుద్దేశ్యమూ కార్యనిర్వాహణ వ్యవస్ధకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం, రాష్ట్రపతి ఆదేశాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రాధమికహక్కులను నిరాకరిస్తూ కార్యనిర్వాహకవ్యవస్ధ ఏదైనా ఒక చర్య తీసుకుంటే దాన్ని కోర్టులో సవాలు చేయటానికి లేదు. ఆ వాదన మీద జస్టిస్‌ హెఆర్‌ ఖన్నా స్పందిస్తూ ఆర్టికల్‌ 21లో ప్రాణం గురించి ప్రస్తావించారు, దానికి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించగా చట్టవిరుద్దంగా ప్రాణాలు తీసినప్పటికీ కోర్టులేమీ చేయలేవని నిరేన్‌ డే వాదించారు. ఆ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో మిగతా నలుగురూ అటార్నీ జనరల్‌ వాదనను సమర్ధిస్తూ తీర్పు చెప్పగా జస్టిస్‌ ఖన్నా వ్యతిరేకించారు.

Image result for bjp constitutional coup in karnataka

కర్ణాటక వుదంతంలో ఒక వ్యక్తి ప్రాణాల కంటే ఎక్కువ విలువ నిచ్చి ప్రాణాలు అర్పించటానికి సిద్దపడే ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసినా కోర్టులకు ప్రశ్నించే హక్కు లేదని మోడీ సర్కార్‌ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదించారు. రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కానీ ఆయన అంతకంటే బిజెపి న్యాయవాది మాదిరి కోర్టులో వ్యవహరించారు. ఆ పార్టీ నేతలు చేసిన వాదననే కోర్టుకు వినిపించటమే అందుకు పక్కా నిదర్శనం. న్యాయమూర్తుల బెంచ్‌కు పూర్తి అంకెలు తెలియవు, నిన్న ప్రకటించిన మేరకు తప్ప మొత్తం తెలియదు అని వేణుగోపాల్‌ చెప్పగా మేము అంతకు మించి చూడలేము, మీకు మెజారిటీ వున్నదని అంకెలు చెప్పటం లేదు అని జస్టిస్‌ ఎకె సిక్రీ చెప్పారు. అసలు వాదన ఆ తరువాతే బయటకు వచ్చింది. కోర్టు స్పెక్యులేషన్‌లోకి పోకూడదు, ఎడ్డియూరప్పకు ఎంత మంది మద్దతు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ ఏర్పాటునకు ఎవరికి ఆహ్వానం వచ్చింది, బలనిరూపణ సమయంలో ఏ శాసనసభ్యుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అని తెలుసుకొనేందుకు సుప్రీం కోర్టు రాజకీయ పొదలోకి తొంగి చూడటానికి లేదు, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిని ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకొనేందుకు అవకాశం వుందని ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎక్కడా చెప్పలేదు. శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది.ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం సభలో బలనిరూపణ అంశానికి సంబంధించింది. అవన్నీ సభలోనే పరిష్కారం కావలసి వుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అసలు పిటీషన్‌ దాఖలు చేయటానికే లేదు. సభలో బలనిరూపణ వరకు పిటీషన్‌ దారులు వేచి చూడాలి. ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవటానికి లేదు. దాన్ని తరువాత సుప్రీం కోర్టు సమీక్షించవచ్చు. అని వేణుగోపాల్‌ వాదించారు. దీంతో అవాక్కయిన బెంచ్‌ ఇది అసంగత వాదన(మూర్ఖ అనే అర్ధం కూడా వుంది) దాని అర్ధం వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే సూట్‌కేసుల మార్పిడి అంతా పూర్తవుతుందన్నది అర్ధమా అంటూ దాన్నే మాత్రం అనుమతించటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధి ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఏ ఎంఎల్‌ఏ లేదా ఎంపీ అయినా ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించినా, పార్టీ నిర్ణయాన్ని ఖాతరు చేయకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్త్తుందని పేర్కొన్నారు. అయితే ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రమాణ స్వీకారం చేయకుండా సభకు గైర్హాజరైనా సభలో ఆ సమయానికి వున్న సంఖ్యను బట్టి బలనిరూపణ జరుగుతుంది తప్ప ఆగదు, తరువాత అలాంటి సభ్యులపై చర్యతీసుకోవటం వేరే విషయం అని కొంత మంది భాష్యం చెబుతున్నారు. దీన్నే అటార్నీ జనరల్‌ కూడా వాదించారు. బిజెపి నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే పధకంతోనే కొంత మంది సభ్యులను సభకు హాజరు కాకుండా చూసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి వీలుగాక భంగపడ్డారన్నది స్పష్టం అవుతోంది.

1967లో కాంగ్రెస్‌ అనేక వుత్తరాది రాష్ట్రాలలో ఓడిపోయినపుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కింది. హర్యానాలో గయా లాల్‌ అనే స్వతంత్ర సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారగా ఒక రోజు తొమ్మిది గంటల వ్యవధిలోనే ఒక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడు. నాటి కాంగ్రెస్‌ నేతరావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను ఛండీఘర్‌లో మీడియా ముందు ప్రదర్శిస్తూ గయారామ్‌ నౌ ఆయారామ్‌ ( పోయిన రాముడు ఇప్పుడు తిరిగి వచ్చాడు) అని చమత్కరించాడు.అప్పటి నుంచి పార్టీ ఫిరాయింపుదార్లను ఆయారామ్‌ గయారామ్‌ అని ఎద్దేవా చేస్తున్నారు. 1985లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటంతో వారిని నిలబెట్టుకొనేందుకు, ముఠారాజకీయాలు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని తీసుకు వచ్చింది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు. ఇప్పుడు బిజెపి ఆ చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకుంది. తాత్కాలిక స్పీకర్‌గా సభలోని సీనియర్‌ సభ్యుడిని నియమించటం ఒక సాంప్రదాయంగా వచ్చింది తప్ప నిబంధనలేమీ లేవు. గతంలో అలాంటి సాంప్రదాయాన్ని కొన్ని పార్టీలు వుల్లంఘించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బిజెపి కూడా చోటు దక్కించుకుంది. అయితే తాత్కాలిక స్పీకర్‌ అయినప్పటికీ సభలో బలనిరూపణ సమయంలో స్పీకర్‌కు వుండే అధికారాలు వుంటాయి. అందువలన అవసరమైతే అందుకు వుపయోగించుకొనేందుకు బిజెపి తన సభ్యుడినే గవర్నర్‌ ద్వారా నియమింపచేసుకుంది.

కర్ణాటక వుదంతం గవర్నర్ల విచక్షణ అధికార అంశంతో పాటు స్పీకర్ల అధికారాల గురించి కూడా చర్చ, సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బిజెపి ఎంపీలు ఎడ్డియూరప్ప, బిశ్రీరాములు బెంగళూరు నుంచి పంపిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ వెంటనే ఆమోదించి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. స్వయంగా నెలన్నర క్రితం అందచేసిన వైఎస్‌ఆర్‌సి సభ్యుల రాజీనామాలను మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్ర శాసనసభలలో పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యుల విషయాన్ని తేల్చకుండా స్పీకర్లు నానబెడుతున్నారు. ఫిరాయింపుదారులు మంత్రులు కూడా అయ్యారు. అదే విధంగా తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డి రాజీనామా సమర్పించి కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీ స్పీకర్‌ ఆ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పూర్వరంగంలో కర్ణాటక వుదంతాన్ని విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వటం అవసరం. గత ఏడు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద కబుర్లు చెప్పిన పార్టీలే దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పాలకవర్గ ప్రజాస్వామిక వ్యవస్ధల మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు దానికి కట్టుబడి వుండటం కనిపిస్తుంది. వున్నత న్యాయస్ధానాలు ప్రజాసామ్యాన్ని బలపరిచేందుకు వీలుగా రాజ్యాంగానికి భాష్యం చెప్పటం, లోపాలను ఎత్తి చూపి సవరించేవిధంగా మార్గదర్శనం చేయాల్సి వుంది. దీనికి ఎన్నో పరిమితులు,ఆటంకాలు వున్నాయి. ఇది ఒక ఎత్తయితే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ఓటర్లు ఫిరాయింపుదారులు, అవకాశవాదుల పట్ల ఎప్పుడైతే సరైన తీర్పు ఇచ్చేందుకు పూనుకుంటారో అప్పుడే స్వచ్చ రాజకీయాలవైపు పరిణామాలు మలుపు తిరుగుతాయి.ప్రజలకు ఎలాంటి ఆటంకాలు వుండవు, వున్నా వాటిని త్రోసి రాజని ముందుకు పోయే హక్కు, అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక వుదంతం !

17 Thursday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, Congress, jds, karnataka developments, karnataka politics, karnataka votes 2018, unexpected twist in karnataka developments

Image result for Karnataka government formation

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఒక తీవ్రమైన అంశాన్ని దేశ అత్యున్నత న్యాయ స్ధానం అర్ధరాత్రి విచారణకు స్వీకరించి తెల్లవారు ఝామున ఒక తాత్కాలిక నిర్ణయాన్ని ప్రకటించి, తదుపరి విచారణ కొనసాగింపునకు నిర్ణయించటం బహుశా ఇదే ప్రధమం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని స్ధితిలో 117 మంది బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌-జెడిఎస్‌ను కాదని 104 స్ధానాలున్న బిజెపిని ఆహ్వానించటం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ఇది అనూహ్యమైన మలుపు. గతంలో కొన్ని కేసులలో వచ్చిన తీర్పులు, సంప్రదాయాల మార్గదర్శనం వున్నప్పటికీ గవర్నర్లు తమ విచక్షణ, వివేచనను వినియోగించిన తీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఎవరెలా వినియోగిస్తారో తెలియని స్ధితిని ముందుకు తెచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారాలకు కూడా నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందువలన ఈ కేసు తీర్పు లేదా నిర్ణయం పర్యవసానాలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ ప్రతినిధులుగా పరిరక్షకులుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్ధ మీద, రాజ్యాంగానికి, గవర్నర్ల విచక్షణకు వున్న పరిమితుల మీద భాష్యం చెప్పి దానిని కాపాడాల్సిన న్యాయవ్యవస్ధ మీద ఎలా పడతాయో చూడాల్సి వుంది. ఏ వ్యవస్ధకూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు గాని అవి పని చేస్తున్న తీరును విమర్శించే అవకాశం వుండటం ప్రజాస్వామ్య వ్యవస్ధ లక్షణం. అందుకు కోర్టు తీర్పులు కూడా మినహాయింపు కాకూడదు.

రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన వుదంతంలో ఈ కేసులో సీనియర్‌ న్యాయమూర్తులను వదలి జూనియర్లతో బెంచ్‌ ఏర్పాటు చేయటం కూడా ఇదే ప్రధమం. గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారికంగా వర్తమానం రాకముందే ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం గురించి బిజెపి సామాజిక మాధ్యమంలో ప్రకటించటం కూడా ఇదే ప్రధమం. ప్రత్యర్ధులు కోర్టుకు వెళుతున్నారని తెలిసి దానికి అవకాశం లేకుండా చేసేందుకు సాధారణంగా కోర్టు సమయం ముగిసిన తరువాత గవర్నరు లేఖ రాయటం, మరుసటి రోజు కోర్టును తెరవక ముందే ప్రమాణ స్వీకారానికి పూనుకోవటం కూడా ఇదే ప్రధమం. ఇదంతా తెరవెనుక ఒక పధకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది.

గవర్నర్‌ నిష్పాక్షితను ఎవరూ ప్రశ్నించకుండా వుండాలంటే రెండు పక్షాలు తమకే బలం వుందని చెబుతున్నపుడు, ఒక పక్షంలోని పేర్లు మరొక పక్షం జాబితాలో కనిపిస్తున్నపుడు గవర్నరు తన ముందు హాజరై సంఖ్యానిరూపణ చేసుకోమని ఎందుకు కోరలేదు. కర్ణాటక వుదంతం దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

తమకు మెజారిటీ మద్దతు వుందని చెప్పుకుంటున్న పార్టీ నేతను బుధవారం మధ్యాహ్నం లోగా జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. బిజెపి నేతగా ఎన్నికైన ఎడ్డియూరప్ప గవర్నర్‌కు ముందు ఇచ్చిన జాబితాలో ఎన్నిపేర్లున్నాయి, బిజెపిగాకుండా ఇతర పార్టీలవి, ఇండిపెండెంట్లవి ఎన్ని వున్నాయన్నది ఆసక్తికర అంశం. ఒక లేఖ కాకుండా రెండు ఇచ్చారా అన్నది కొందరి సందేహం. మరోవైపు కాంగ్రెస్‌ -జెడిఎస్‌ అందచేసిన జాబితాలో 117 పేర్లు వున్నట్లు ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.

ఇరు పక్షాలు ఇచ్చిన లేఖలు, జాబితాలను చూసిన గవర్నర్‌ తన ‘విచక్షణ ‘ అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోంది తప్ప జాబితాల్లో పేర్ల తకరారును నిర్ధారించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తమ మద్దతుదార్లందరినీ స్యయంగా గవర్నరు ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌-జెడిఎస్‌ చెప్పినప్పటికీ గవర్నర్‌ అంగీకరించలేదంటే, ముందే ఒక నిర్ణయానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. ఎడ్డి యూరప్ప తన బల నిరూపణకు వారం రోజులు గడువు ఇమ్మని కోరినట్లు వార్తలు రాగా గవర్నరు పదిహేను రోజులు ఇచ్చారు. బల నిరూపణకు ఎడ్డి యూరప్ప గడువును కోరటం అంటే అధికారాన్ని అప్పగించమని కోరే సమయంలో తమకు పూర్తి మెజారిటీ లేదని అంగీకరిస్తూ, కొందరు మద్దతు ఇస్తామని చెప్పినందున గడువు ఇమ్మని కోరటం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ తరువాత ఏ రాజకీయ పార్టీలోనూ నిబంధనలకు అనుగుణ్యంగా ఎలాంటి చీలికలు లేవు. అలాంటపుడు ఇతర పార్టీల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెబితే గవర్నర్‌ నమ్మటం ఏమిటి? ఎడ్డి యూరప్ప చెప్పారు, ఈ గవర్నర్‌ నమ్మారు అది అంతే అంటారా ?

గవర్నర్‌లు పాలకపార్టీల వారే గనుక వారు ఎక్కడ స్టాంపు వేయమంటే అక్కడ స్టాంపు వేస్తారని గతంలో కాంగ్రెసు, ఇపుడు బిజెపి నియమిత గవర్నర్లు నిరూపించారు. అనూహ్యంగా ఇప్పుడు బంతి కోర్టుకు వచ్చింది. గవర్నరు విచక్షణ అధికారాన్ని తాము ప్రశ్నించలేం, అందువలన దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోం అని కేసును అంతటితో ముగిస్తే కధ వేరుగా వుండేది. గవర్నరు చర్యమీద, ఎడ్డి యూరప్ప ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వకుండా ఫిర్యాదును విచారించేందుకు పూనుకోవటం బహుశా బిజెపి వూహించి వుండదు.

అధికారాన్ని కోరిన రెండు పక్షాలు ఇచ్చిన జాబితాలను తమకు సమర్పించాలని కోర్టు కోరటం అంటే వాటిలోని నిజానిజాలను తేల్చేందుకు పూనుకోవటమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక మిశ్రా తీరుతెన్నులపై సుప్రీం కోర్టు సీనియరు న్యాయమూర్తులే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి ఈ కేసులో జూనియర్లతో బెంచిని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.

గతంలో ఇదే ఎడ్డి యూరప్ప తనకు 110 సీట్లు వచ్చినపడు, కొంత మంది ఇండిపెండెంట్లను తన వైపుకు తిప్పుకోవటం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట వేటు పడకుండా ఇతర పార్టీల సభ్యులను సభకు హాజరు కాకుండా చేసి తన మెజారిటీని నిరూపించుకొని తరువాత వారిచేత రాజీనామా చేయించి తన సర్కారును కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఫిరాయింపుదార్లను ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ వారి మీద పిరాయింపు నిరోధక చట్టవేటు పడలేదు, వారి గురించి స్పీకర్లు ఎటూ తేల్చలేదు. అదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అనుసరించేందుకు బిజెపి పూనుకుందా ? అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి పరిస్ధితికి తేడా వుంది. అక్కడ మెజారిటీ పక్షాలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తమకు అదనపు బలం అవసరం లేకపోయినా ఏదో ఒకసాకుతో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. కర్ణాటకలో పరిస్ధితి భిన్నం. గతంలో మాదిరే ఇతర పార్టీల సభ్యులను కొందరిని లోపాయకారీగా కూడగట్టుకొని గట్టెక్కాలన్నది బిజెపి ఎత్తుగడ. గత అనుభవాల రీత్యా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ముందు చూపుతో తమ జాగ్రత్తలు తాము తీసుకున్నాయి. అయితే సభలో బలనిరూపణ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వ్య తిరేకంగా ఓటు వేసే లేదా వేయకుండా వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందే, బలపరీక్ష జరగక ముందే వివాదం కోర్టుకు వెళ్లింది. సభ ఇంకా ఏర్పడ లేదు, సభ్యులు ప్రమాణ స్వీకారమే చేయలేదు. కోర్టు విచారణ సమయానికి ఏ సభ్యుడూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వకుండా కేసు విచారణ చేస్తామని కోర్టు చెప్పటం అంటే సదరు ప్రమాణ స్వీకారం తమ తీర్పుకు లోబడి వుండాలనటం తప్ప వేరు కాదు.

కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటి? గత తీర్పుల ప్రకారం మెజారిటీ వున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గనుక తీర్పు వస్తే మన కోర్టుల మీద జనంలో మిగిలి వున్న కొద్దో గొప్పో నమ్మకం బలపడుతుంది. ఒక వేళ గవర్నర్‌ విచక్షణ అధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ప్రకటిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్ధను గబ్బు పట్టించటాన్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని వాటి మీద వున్న విశ్వాసాన్ని జనం కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌, విజిలెన్స్‌, సిబిఐ, ఇతర అనేక సంస్ధలు పాలకుల చేతుల్లో సాధనాలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ కేసు న్యాయవ్యవస్ధకు ఒక అగ్నిపరీక్ష వంటిదే ! ఎలాగైనా అధికారానికి అంటి పెట్టుకొని వుండేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులను ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటు వేయమని కోరతానని ఎడ్డియూరప్ప ప్రకటించారు. గతంలో తమ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి పదవి అభ్యర్ధిని ఓడించేందుకు ఇందిరా గాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని పిలుపు నిచ్చి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరతీశారు. ఇప్పుడు అది చెల్లదు, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అలాంటి ఓటింగ్‌ చెల్లదని తెలిసినా ఎడ్డి యూరప్ప ఆ పిలుపు ఇవ్వటం తమకు బలం లేదని అంగీకరించటమే. ఆవు ఎక్కడ కట్టినా తమ దొడ్లో ఈనితే చాలు అనుకున్నట్లుగా ఏ పార్టీ తరఫున గెలిచినా తమకు మద్దతు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న బిజెపి డబ్బు, ఇతర ప్రలోభాలను ఎరచూపి, బెదిరింపులకు పాల్పడి రాజకీయంగా మరింతగా విమర్శల పాలు కావటం ఖాయం. అటు కేంద్రంలో నరేంద్రమోడీపై ఇప్పటికే వున్న మచ్చలకు తోడు ఇది మరొకటి తోడు కావటం తప్ప అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ వుదంతం చివరికి ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఒక వేళ కోర్టు తీర్పు ఎడ్డికి అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్ధను కూడా బిజెపి ప్రభావితం చేసిందని జనం భావించే అవకాశం వుంది. అనూహ్యంగా ఎడ్డికి అవకాశం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇస్తే బిజెపికి అది పెద్ద భంగపాటు. ఏది జరిగినా మరికొద్ది నెలల్లో జరిగే రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇజ్రాయెల్‌, అమెరికా బరితెగింపు.. పాలస్తీనియన్లపై మారణకాండ!

16 Wednesday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel, israel massacre, Nakba day, Palestinians, US embassy moves to Jerusalem

Image result for israel and us is responsible for gaza massacre
మాతృభూమి, దాస్య విముక్తి కంటే మరొకటి అవసరం లేదని పసితనం నుంచే ఎత్తిన జెండా దించబోమంటున్న పాలస్తీనా బాలలు

ఎం. కోటేశ్వరరావు

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, దాని దుండగాలకు వెన్నుదన్నుగా అమెరికా మరోసారి పాలస్తీనియన్లపై దమనకాండకు పాల్పడ్డాయి. వాటి దుష్ట చరిత్రలో సోమవారం మరో చీకటి దినం. మధ్యవర్తి నంటూ ఒకవైపు ఫోజు పెడుతూనే నిస్సిగ్గుగా ఇజ్రాయెల్‌ వైపు నిలవటమే గాక దమనకాండపై దర్యాప్తు జరపాలన్న కనీస ప్రజాస్వామిక డిమాండ్‌ కూడా భద్రతామండలిలో ప్రవేశపెట్టేందుకు అమెరికా తిరస్కరించింది. పాలస్తీనియన్ల భూభాగమైన జెరూసలెంను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ రూపొందించిన పధకాన్ని అమలు జరిపేందుకు పూనుకుంది. దానికి నిరసన తెలిపిన నిరాయుధులైన సామాన్య ప్రజానీకంపై ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన మారణకాండలో ఎనిమిదినెలల పసిపాప సహా 60మంది మరణించగా 2,700మందికిపైగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. తూర్పు జెరూసలెం పట్టణానికి తమ ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయాన్ని తరలిస్తామని రక్తపిపాసి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పుడే ఈ మారణకాండకు బీజం పడింది. కాగా ఈ మారణకాండపై దర్యాప్తు జరపాలని కోరేందుకు మంగళవారం నాడు సమావేశమైన భద్రతా మండలిని అమెరికా అడ్డుకుంది. కువాయిట్‌ రూపొందించిన ఈ తీర్మానంలో సోమవారంనాటి దారుణంపై విచారణ జరపాలని కోరింది. జెరూసలెంలో రాయబార కార్యాలయాల ఏర్పాటు వద్దంటూ గతంలో చేసిన భద్రతా మండలి తీర్మానానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న విజ్ఞాపన కూడా దానిలో ఉంది. సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదని అమెరికా అభ్యంతరం తెలిపింది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఆరాధనా కేంద్రమైన జెరూసలెం పట్టణంపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఎలాంటి వివాదాస్పద చర్యలకూ పాల్పడవద్దన్నది ప్రపంచ రాజ్యాల ఏకాభిప్రాయం. దానికి అమెరికా తూట్లు పొడిచింది. సోమవారంనాడు మరణించిన తమ సహచరుల అంత్యక్రియలకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు హాజరై మరోమారు తమ నిరసన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఏర్పాటు కావాల్సిన స్వతంత్ర పాలస్తీనాకు తూర్పు జెరూసలెం పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకోవాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. సరిగ్గా 70ఏండ్ల క్రితం పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేయాలన్నది ఐరాస తీర్మానం. ఇజ్రాయెల్‌ అయితే ఏర్పడింది. అంతవరకు ఉనికిలో ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. లక్షలాది మంది అరబ్బులు తమ నివాసాల నుంచి గెంటివేతకు గురై ఇప్పటికీ చుట్టుపక్కల దేశాలలో తలదాచుకుంటున్న అన్యాయం కొనసాగుతోంది. 1948కి ముందే ఒక పధకం ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యూదులు, సామ్రాజ్యవాద దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయెలీ సాయుధమూకలు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. వ్యతిరేకించిన లక్షలాదిమంది అరబ్బును వారి నివాస ప్రాంతాల నుంచి తరిమివేశాయి. పాలస్తీనా ప్రభుత్వం, పాలనకు తిలోదకాలిచ్చి మొత్తం ప్రాంతాన్ని ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ జనాభారీత్యా వాటి రూపురేఖలనే మార్చి వేసి అవికూడా యూదు ప్రాంతాలేనంటూ వాటిని కూడా తమకు అప్పగించాల్సిందే అని చెబుతోంది. తమ పౌరులకు రక్షణ పేరుతో ఆక్రమిత ప్రాంతాలలో యూదుల శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసింది.
ఈ ఆక్రమణలో భాగంగానే 1948లో అరబ్బులు మెజారిటీ ఉన్న జెరూసలెం పట్టణ ఆక్రమణకు పూనుకుంది. ఆ క్రమంలో దాని రక్షణకు వచ్చిన జోర్డాన్‌ తూర్పు జెరూసలెం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పశ్చిమ జెరూసలెంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ 1967లో ఇరుగుపొరుగు అరబ్బు దేశాలతో యుద్ధానికి తలపడి తూర్పు జెరూసలెంను కూడా ఆక్రమించుకుంది. 1980లో ఏకపక్షంగా తనకు తానే జెరూసలెం చట్టాన్ని చేసినట్టు ప్రకటించుకొని అధ్యక్ష, ప్రధాని నివాసం, పార్లమెంట్‌, సుప్రీం కోర్టు అనేక ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించి కబ్జాకు చట్టబద్దత కల్పించేందుకు పూనుకుంది. ఆ పట్టణం అవిభక్తమని మొత్తం తమదే అని ప్రకటించుకుంది. అయితే జెరూసలెం పాలస్తీనియులదే అని అంతర్జాతీయ సమాజం అనేక రూపాలలో ఇజ్రాయెల్‌ చర్యను ఖండించింది. దాని స్ధాయి నిర్ణయించేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని గుర్తించిన దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను రాజధాని టెల్‌ అవీవ్‌లో ఏర్పాటు చేశాయి.

Image result for gaza massacre 2018

ఇజ్రాయెల్‌ దాడులలో పుట్టి దాడుల మధ్య పెరిగిన పాలస్తీనా బిడ్డలందరికీ బాష్పవాయువు ప్రయోగాన్ని అధిగమించేందుకు వుల్లిపాయ ముక్కుల వద్ద పెట్టుకోవాలని పాలతో పాటు తల్లి పసితనం నుంచే నేర్పిస్తుంది

      జెరూసలెం వివాదం కొనసాగుతుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ రాయబార కార్యాలయాన్ని ఆ నగరానికి తరలిస్తున్నట్టు ప్రకటించి సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆ ప్రకటన వెలువడినప్పుడే పాలస్తీనియన్లతో అనేకమంది నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేశారు. మార్చి నెల నుంచి ప్రతి శుక్రవారం పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అప్పటి నుంచి ఆదివారంనాటి వరకు వివిధ సందర్భాలలో ఇజ్రాయెలీ భద్రతా సిబ్బంది జరిపిన దాడులలో కనీసం 84మంది పాలస్తీనియన్లు మరణించారు. అందువలన రాయబార కార్యాలయం ప్రారంభించే రోజు మరింత తీవ్రంగా, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యతీసుకోకుండా సాగించిన ఈ మారణకాండను యావత్‌ ప్రపంచం ఖండించింది. ఆ రోజు మరో 60మంది మరణించారు. వ్యతిరేకతను ఖాతరు చేయకుండా సరిగ్గా 70ఏండ్ల క్రితం ఇజ్రాయెల్‌ ఏర్పడిన రోజునే జెరూసలెం కబ్జాను ఖరారు చేస్తూ అక్కడ సోమవారంనాడు రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ట్రంప్‌ తన కుమార్తె, సలహాదారుగా వేసుకున్న ఆమె భర్త తదితరులను పంపించాడు. ఆ చర్యను నిరసిస్తూ పాలస్తీనా గాజా ప్రాంతంలోని అరబ్బు జాతీయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అక్కడి సరిహద్దు కంచెను దాటి తమ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని, హింసాకాండకు పాల్పడ్డారనే పేరుతో విచక్షణారహితంగా తొలిసారిగా డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం, కాల్పులకు తెగబడటంతో 60మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు 2700 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Image result for gaza massacre 2018

కలేజా, కాంక్ష వుండాలే గాని కాళ్లు లేకపోతేనేం మాతృభూమి కోసం నేను సైతం అంటూ వడిశలతో ప్రతిఘటిస్తున్న పాలస్తీనా యువకుడు

     పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ భద్రత, పోలీసు బలగాలు, యూదు దురహంకారులు దాడులు చేయటం, అవమానించటం, ఆర్థికంగా దెబ్బతీయటం నిత్యకృత్యం. ఇటీవలి కాలంలో ఒకే రోజు ఇంతమంది అరబ్బులు మరణించటం, గాయపడటం ఎప్పుడూ జరగలేదు. సోమవారం నాటి మారణకాండకు నిరసనగా మంగళవారం నాడు పలుచోట్ల నిరసన వ్యక్తమైంది. దక్షిణాఫ్రికా, టర్కీ నిరసనగా ఇజ్రాయెల్‌ నుంచి తమ రాయబారులను వెనక్కు రప్పించాయి. ఇజ్రాయెల్‌ రాయబారిని పిలిపించి ఐర్లండ్‌ తన నిరసన తెలిపింది. అనేక దేశాలు అభ్యంతరం తెలిపాయి. దీని గురించి భద్రతామండలి సమావేశం కానుంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో కుదిరిన అణుఒప్పందాన్నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అది జరిగిన వెంటనే సిరియాలోని ఇరాన్‌ మిలిటరీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా ప్రతిదాడులు చేసింది. రాయబార కార్యాలయ ఏర్పాటు చర్య కూడా ఇరాన్‌, సిరియా, తదితర పశ్చిమాసియా అరబ్బు, ముస్లిం దేశాలను రెచ్చగొట్టటం, అక్కడ మండుతున్న ఆరని అగ్నిని మరింత ఎగదొయ్యటం తప్ప మరొకటి కాదు. ఇజ్రాయల్‌లో జరిగిన అనేక అవినీతి అక్రమాల గురించి జనాన్ని పక్కదారి పట్టించేందుకు పాలకపార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గాజా నది పశ్చిమ గట్టు, తూర్పు జెరూసలెం, సిరియా నుంచి ఆక్రమించుకున్న గోలన్‌ గుట్టలలో గత ఐదు దశాబ్దాలలో యూదుల నివాసాలను లక్షా 60వేల నుంచి ఆరులక్షలకు పెంచింది. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఉపసంహరించి నామమాత్ర పాలస్తీనా స్వయంపాలిత ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ దాన్నొక బహిరంగ జైలుగా మార్చివేసింది. దాన్నుంచి బయటకు పోవాలన్నా, ఎవరైనా లోపలికి రావాలన్నా ఇజ్రాయెల్‌ అనుమతి తీసుకోవాల్సిందే. పాలస్తీనా విముక్తి ఉద్యమంలో గాజాకు ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రకాల ఉద్యమాలు, పీఎల్‌ఓ అధినేత యాసర్‌ అరాఫత్‌ ఇక్కడ పుట్టిన వ్యక్తే. తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రతిఘటించటం ఆ గడ్డలోనే ఉంది. తాజా పరిస్థితికి వస్తే అనేక పార్టీలు, సంస్థలు వాటి అనుబంధాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా గత కొద్ది వారాలుగా జెరూసలెం పాలస్తీనియన్లదే అని ఎలుగెత్తి చాటుతూ ప్రదర్శనలు చేస్తున్నారు.
తన దురాక్రమణకు ఆమోద ముద్రవేయించుకొనేందుకు తమతో దౌత్య సంబంధాలున్న దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను జెరూసలెంకు తరలించాలని ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చాడు. జెరూసలెం మాత్రమే యూదులకు రాజధాని అని ప్రకటించాడు. ఆ దురహంకారికి తాన తందాన అంటూ ట్రంప్‌ అక్కడ రాయబార కార్యాలయ ప్రారంభం సందర్భంగా ముస్లిం వ్యతిరేక మతాధికారి రాబర్ట్‌ జఫ్‌రెస్‌తో ప్రార్ధనలు చేయించి అరబ్బులను మరింతగా రెచ్చగొట్టారు. పశ్చిమాసియాలో తన ఆర్థిక, రాజకీయ వ్యూహాన్ని అమలు జరిపేందుకు ఇజ్రాయెల్‌ను ఒక గూండాగా అమెరికా వినియోగించుకొంటోంది. దానికి అవసరమైన అధునాతన ఆయుధాలను అందించటంతో పాటు భద్రతా మండలిలో అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అనేక వందల తీర్మానాలను ఇప్పటి వరకు వీటో చేసింది. ఏటా నాలుగు బిలియన్‌ డాలర్ల వంతున ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు సాయం పేరుతో యూదు దురహంకారులకు అందచేసింది. రెండు అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే అయితే దానికి రెండు దేశాల ఆమోదమూ లభిస్తేనే అనే షరతు విధిస్తోంది. పాలస్తీనియన్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని, అందుకు అవసరమైన భూభాగాలను అదనంగా అప్పగించటంతో పాటు ఇరుగు పొరుగు దేశాల నుంచి రక్షణ హామీలు కావాలంటూ ఆచరణ సాధ్యంగాని డిమాండ్లను ముందుకు తెస్తూ ఇజ్రాయెల్‌ పాలకులు పాలస్తీనా ఏర్పాటు అడ్డుకుంటున్నారు. చాలా కాలం పాటు తటస్ధంగా వున్నట్టు నాటకమాడిన అమెరికా ట్రంప్‌ హయాంలో దానికి స్వస్తి పలికి బహిరంగంగా తాము యూదు దురహంకారులవైపే ఉన్నట్టు తాజా చర్యతో లోకానికి చాటింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటక అంకెలు చెబుతున్న నిజాలు- అబద్దాలు చెబుతున్న బిజెపి నేతలు !

15 Tuesday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP leaders lies, Karnataka Legislative Assembly election 2018, karnataka votes 2018, karnataka votes facts

ఎం కోటేశ్వరరావు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం ఎవరికి అన్న బంతి గవర్నరు కోర్టులో వుంది. ఆ కోర్టును నియంత్రించేది బిజెపి కేంద్ర నాయకత్వం అన్నది అనధికార నిజం. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోవా గవర్నరు చేసిందాని ప్రకారం కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి మెజారిటీని గుర్తించి ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానిస్తారా లేక అతి పెద్ద పార్టీకి ముందు అవకాశం ఇవ్వటం సబబు అంటూ బిజెపిని గద్దెనెక్కిస్తారా అన్నది చూడాల్సి వుంది. గోవా సాంప్రదాయాన్ని అనుసరిస్తే బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవాలి. లేదూ బిజెపిని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి బేరసారాలకు, ఇతర ప్రలోభాలకు తెరలేపుతారా ? అదే జరిగితే మరోసారి బిజెపి రాజకీయంగా గబ్బుపట్టటం ఖాయం.

ఇక బిజెపికి వచ్చిన సీట్ల గురించి ఎవరేమన్నారు? ఇది బిజెపికి చారిత్రాత్మక విజయం: చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి చరిత్రను సృష్టించారు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇది ఎంతవరకు నిజం ? 2004,08,13,18లో జరిగిన ఎన్నికల అంకెలేమి చెబుతున్నాయో ముందు చూద్దాం.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం      బిజెపి        కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)  ఇతరులు

2004     28.33(79)   35.27(65)   20.77(58)   15.3(22)

2008    33.86(110)   35.13(80)   19.44(28)  11.57(6)

2013    19.90(40)    36.60(122)   20.20(40) 24.40(22)

2018    36.20(104)  38.00(78)     18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009    41.63(19)     37.5(6)       13.57(3) 5.20(0)

2014    43.00(17)    40.80(9)      11.00(2) 5.20(0)

పై అంకెలను చూసినపుడు కర్ణాటకలో తాజా ఎన్నికలలో బిజెపి బలం, పెరిగిందో తగ్గిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓటింగ్‌లో పెద్ద మార్పులేమీ లేకుండా కొనసాగటాన్ని చూడవచ్చు.జెడిఎస్‌ బలం కూడా, అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఒకే విధంగానూ, పార్లమెంట్‌ ఎన్నికలలోనూ ఒకే విధంగా వుండటాన్ని చూడవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గిందన్నది రాజకీయాల్లో ఓనమాలు వచ్చిన వారికి కూడా తెలిసిందే.తొలిసారిగా దక్షిణాదికి ముఖద్వారంగా వున్న కర్ణాటక పాగా వేశామన్నట్లుగా బిజెపి నేతలు చిత్రిస్తున్నారు. దానికి గతంలోనే గరిష్టంగా 110 స్ధానాలు వచ్చి అధికారం వెలగబెట్టి గబ్బుపట్టిన విషయాన్ని మరుగుపరుస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !
  • నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !
  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !
  • నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !
  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !
  • నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !
  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 925 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: