• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

చైనా ఐదేండ్లు ముందుకు, భారత్‌ వెనక్కు – మోడినోమిక్సు నిర్వాకం !

27 Sunday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

China vs India GDP, modinomics, Modinomics a farce


ఎం కోటేశ్వరరావు


చప్పట్లు కొట్టించి – దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. పోనీ మోడినోమిక్స్‌తో అయినా దేశం ముందుకు పోతోందా ? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించామని కరోనాను అధిగమించి ఆర్ధికంగా ముందుకు పోతామని చెప్పారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్న విజయగానాలు మూగపోయాయి. ఈ మధ్యకాలంలో కొత్తవేమీ దొరక్క వంది మాగధులకు ఉపాధిపోయింది. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. కానీ వారి వెన్ను విరిచే వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో నెల రోజులకు పైగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సరైన సమాధానం లేక ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పిల్లిమొగ్గలు వేస్తూ రైతులను బదనాం చేసేందుకు పూనుకున్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఐదేండ్లు ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనోమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. జిడిపి ముందుకు పోవటానికి తమ గొప్ప అన్నవారు వెనక్కు పోయినందుకు బాధ్యత ఎవరిదో చెబుతారో కరోనా మీద నెడతారో చూద్దాం. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం ? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం ఒక కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది. దీనికి తోడు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌ మధ్య పెద్ద తేడాలు లేకపోవటమే దీనికి కారణం. 2017వ సంవత్సర వివరాల ప్రకారం భారత్‌ జిడిపి విలువ 2.651లక్షల కోట్ల డాలర్లు కాగా బ్రిటన్‌ 2.638, ఫ్రాన్స్‌ 2.583 లక్షల కోట్ల డాలర్లు.


సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని 2025లో పొందనుందని అంచనా వేసింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుందో తెలియదు. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఆరవ స్ధానానికి దిగజారిందని,2025లో తిరిగి ఐదవ స్ధానం, 2030 నాటికి మూడవ స్దానంలోకి రావచ్చని సిఐబిఆర్‌ వార్షిక నివేదికలో జోశ్యం చెప్పింది. ఆ సంస్ధ చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. భారత ఆర్దిక వ్యవస్ధ 2021లో తొమ్మిది, 2022లో ఏడుశాతం చొప్పున విస్తరిస్తుంది. ఆర్ధికంగా పురోగమించే కాలదీ సహజంగానే వేగం తగ్గి 2035నాటికి వృద్ది రేటు 5.8శాతానికి పడిపోతుంది. 2025 నాటికి బ్రిటన్‌, 2027నాటికి జర్మనీ, 2030నాటికి జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్‌ మూడవ స్ధానానికి చేరుతుంది.


గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.జపాన్‌ 2030వరకూ మూడవ స్ధానంలో ఉండి, అప్పటికి నాలుగవ స్దానంలో ఉన్న జర్మనీని దిగువకు నెట్టి నాలుగవ స్ధానంలో ఉంటుంది.కరోనాతో నిమిత్తం లేకుండానే దానికి ముందే భారత ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని కోల్పోతున్నది. 2016లో 8.3శాతం, 2018లో 6.1శాతం కాగా 2019లో పదేండ్ల కనిష్టమైన 4.2శాతం నమోదైంది.


దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జన జీవితాల నాణ్యత ఎంత పెరిగిందన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. అందువలన ఒక దేశాన్ని వెనక్కు నెట్టేశామా, ఏ దేశం మీద ఎన్ని గంతులు వేశామన్నది ముఖ్యం కాదు. వెనకటికి ఎవడో బజార్లో మాది 101 అరకల వ్యవసాయం అని కోతలు కోశాడట. మీది అంటున్నావు, ఎంత మంది ఉన్నారు, నీది ఎంత అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్దాలకు వెళ్లిన వలస కార్మికులను మరోవైపు కరోనా కాలంలో చూశాము. అందువలన అంబానీలుాఅభ్యాగ్యులను కలిపి చెబితే పైన చెప్పిన కోతలరాయుడి మాదిరి గొప్పగానే ఉండవచ్చు. 138 కోట్లు దాటిన మన జనాభా జీవితాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021-25 మధ్య చైనా వార్షిక వృద్దిరేటు 5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022-24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వృద్దిరేటు ఉంటుంది.

చైనా వృద్ధి రేటు పైన చెప్పిన మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వృద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. దీన్నే అంటే అభివృద్దినే తనకు ముప్పుగా అమెరికా ప్రపంచానికి చూపుతోంది. కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్ధలు చెబుతున్నట్లు చైనా నిజానికి అమెరికాను అధిగమించటం అంత తేలిక కాదు. వైఫల్యంతో అమెరికా దిగజారితే అది అసాధ్యమూ కాదు. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు జనజీవితాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరణ ఉంది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.


ఇదే సమయంలో తమ వృద్ది రేట్లను ఎలా పెంచుకోవాలా అన్నదాని కంటే అమెరికా, ఇతర దేశాలు, వాటితో కలసి మన పాలకులు చైనాను ఆర్దికంగా, ఇతర విధాలుగా దెబ్బతీసేందుకు ఏమి చేయాలా అన్నదాని మీద ఎక్కువ కేంద్రీకరించారు. చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివృద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినోమిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివృద్దికి చేసిన కృషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు. బయట పల్లకీ మోతను చూసి మోడీ గొప్ప అని చెప్పిన వారు ఇంట్లో ఈగల మోతకు కారణం ఏమిటో చెప్పరు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటాన్ని ఊహించలేకపోయినట్లుగా మోడీ పాలనలో దేశ ఆర్ధిక వృద్ది దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.

జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015-20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు. లక్ష్యం ఎంత ? సాధించింది ఎంత ? ఈ పరిస్ధితికి కారణం ఏమిటో కనీసం ఏకపక్ష ప్రసంగమైన మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పారు.అదే చేశారు. ఏమైంది ?


తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతులుాదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతం ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేసినా వారి ఎగుమతుల మీద పెద్ద ప్రభావం చూపలేదు. నవంబరు నెలలో ఎగుమతులు 21.1శాతం పెరిగితే దిగుమతులు 4.5శాతం పెరిగాయి.(చైనా చెప్పేది ఎలా నమ్మగలం అనేవారికి సమాధానం లేదు) కరోనా వైరస్‌ తొలుత బయట పడింది చైనాలో అన్నది తెలిసిందే. దాన్ని నిర్ణయాత్మకంగా నిరోధించింది కూడా అక్కడే. నిర్లక్ష్యం చేసి ఇప్పటికి కోటీ 85లక్షల మందికి అంటించిన అమెరికా, కోటి మంది దాటిన మన దేశం, ఇతర ధనిక దేశాలూ వైఫల్యానికి నిదర్శనాలు. మిగిలిన అగ్రశ్రేణి దేశాలన్నీ మాంద్యంలో కూరుకుపోతే రెండుశాతం వృద్దితో చైనా తన ప్రత్యేకతను ప్రదర్శించింది.

మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ విస్మరించింది. పేదలకు డబ్బు ఇవ్వకూడదన్నవారు చెప్పిన తర్కం ఏమిటి ? జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదు. జనం ఇప్పటికీ దేనికి ఖర్చు చేయాలో చేయకూడదో అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఇస్తే రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి డబ్బూపోయి, జనం ఖర్చు చేయక దగ్గర దాచుకుంటే కొనుగోళ్లు పెరగ ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలా సాగింది.


దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు( ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేండ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తయారు చేసింది. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.


అంతా ముగిసిపోయింది, మామూలు పరిస్ధితులు ఏర్పడ్డాయి అని చెబుతున్నవారికి రిజర్వుబ్యాంకు సమాచారం రుచించకపోవచ్చు. నవంబరు ఆర్‌బిఐ సర్వేలో 63శాతం మంది తమ ఆదాయాల్లో ఈ ఏడాది కోతపడిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే తమ ఉపాధి పరిస్ధితి దిగజారిందని 80శాతం చెప్పారు. ఏడాది క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు పెరిగాయని 90శాతం చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందు తాము వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తామని 25ా30శాతం మంది గృహస్తులు చెబితే, మేనెలలో అది 1.25శాతానికి పడిపోతే అక్టోబరులో 7.4శాతానికి పెరిగింది తప్ప కరోనా ముందు స్ధాయికి రాలేదు. ఉన్న పొదుపును తప్పని సరి అవసరాలకే వినియోగిస్తారు. ఆదాయం లేక పోయినా వినిమయ వస్తువుల కొనుగోలు రద్దు లేదా వాయిదా వేసుకుంటారు. ధరలు పెరిగితే అంతకు ముందు పొదుపు చేసుకున్న మొత్తాలు హరించుకుపోతాయి లేదా అప్పులపాలు అవుతారు.

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? అంతసీన్‌ లేదు. పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గృహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు. దీనికి ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలు ఒక కారణం. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాపితంగా వివిధ ముడివస్తువులు, ఇతర పారిశ్రామిక వినియోగ వస్తువుల ధరలు పడిపోయి, ఉత్పాదక ఖర్చు తగ్గటం. ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, ఇతర ఖర్చుల తగ్గుదల అందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించేది లేదని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అలాంటపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్దలు ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిని తగ్గించి లేదా పని భారం పెంచి వేతన బిల్లును తగ్గించుకుంటారు. అది మరొక ఆర్ధిక దిగజారుడుకు నాంది అవుతుంది.


2021-25 మధ్య బ్రిటన్‌ నాలుగుశాతం వృద్ది రేటుతో అభివృద్ది చెందనుందనే అంచనాతో అప్పటికి మన దేశం దాన్ని అధిగమిస్తుందని సిఇబిఆర్‌ విశ్లేషకులు చెప్పారు. అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద చెప్పిన జోస్యం ప్రకారం మన ఆర్ధిక వ్యవస్ధ 2021 నుంచి 2025 మధ్య 8.8 నుంచి 7.2శాతం వృద్ది రేటుతో అభివృద్ధి చెందుతుంది. ఒక వేళ అదే నిజమైతే కోల్పోయిన మన జిడిపి ఇంకా ముందుగానే పెరగవచ్చు. మరి సిఇబిఆర్‌ నిపుణులకు ఐఎంఎఫ్‌ అంచనాలు తెలియవా? వాటిని పరిగణనలోకి తీసుకోలేదా ? అంతకంటే తక్కువ వృద్ధి రేటు అంచనా ఎందుకు వేసినట్లు ? కోల్పోయిన ఐదవ స్దానాన్ని సాధించటానికే ఐదేండ్లు పడుతుందని జోస్యం చెబుతుంటే మరి రెట్టింపుతో 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెప్పిన మాటల సంగతి ఏమిటి ? మోడినోమిక్స్‌ విఫలమైందని అనేక మంది విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు ఎప్పుడో చెప్పారు. కరోనా నుంచి దేశం బతికి బట్ట కట్టగలదని రుజువైంది గానీ మోడినోమిక్స్‌తో కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్ల రద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. కనుక ఏడు సంవత్సరాల క్రితం అచ్చే దిన్‌ గురించి నరేంద్రమోడీ చెప్పిన అంశాలను జనం మరచిపోయారు. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. నిజానికి మన బడా ప్రయివేటు రంగం ఎంత అసమర్ధంగా ఉందో జనానికి తెలియదు. యాభై కోట్ల డాలర్లకు పైబడి ఆదాయం వచ్చే పెద్ద కంపెనీలు తత్సమానమైన చైనా, మలేసియా వంటి దేశాల్లోని కంపెనీలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, దక్షిణ కొరియా వాటితో పోల్చితే మూడున్నర రెట్లు తక్కువగా జిడిపికి జమ చేస్తున్నాయి. అదే విధంగా ఉత్పాదకత స్దాయిలు చూస్తే 10-25శాతం మధ్య ఉన్నాయి. కేవలం 20శాతం కంపెనీలు మాత్రమే 80శాతం లాభాలను సమకూర్చుతున్నాయి.


జిడిపిలో ఐదవ స్ధానాన్ని తిరిగి సంపాదించటం గురించి లండన్‌ సంస్ద చెప్పిన అంశం ఒకటైతే అంతకంటే ముఖ్యమైనవి ఉన్నాయి.2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. వాటిలో ఆరు కోట్ల కొత్త వారికైతే, మూడు కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మారే వారికోసం సృష్టించాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే నిఖర ఉపాధిని కల్పించే అభివృద్ధి రానున్న పది సంవత్సరాలలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరశాతం చొప్పన అభివృద్ధి రేటు ఉండాలి. చైనా జిడిపితో పాటు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నది తిరుగులేని సత్యం. కనుక మోడినోమిక్స్‌ అన్నా మరొకటి అన్నా జిడిపి పెరుగుదల జనానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో వీటి జాడలు లేవు. సంపదల పంపిణీ అసమానత పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎండమావుల వెంట పరుగుపెడుతున్నట్లుగా జనం ఉన్నారు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాకు వ్యతిరేకంగా నాడు కరోనా వైరస్,‌ నేడు వాక్సిన్‌ రాజకీయాలు !

18 Friday Dec 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

China's vaccine diplomacy, COVAX, COVID-19 vaccine, Sinovac vaccines


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో విఫలమైన దేశాలూ, సఫలమైనవీ ఇప్పుడు వ్యాక్సిన్‌ గురించి కేంద్రీకరించాయి. ప్రపంచ వ్యాపితంగా ఇప్పుడు కరోనా వెనక్కు పోయి వాక్సిన్‌ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. దాని ఖర్చు , తయారీ, ఎంత వేగంగా సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అన్నది ప్రధాన అంశం. బీహార్‌లో గెలిపిస్తే ఉచితంగా అందచేస్తామని బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని కొన్ని రాష్ట్రాలూ ప్రకటించాయి. అయితే ఆ ఖర్చును కేంద్రం భరిస్తుందా రాష్ట్రాల మీదనే మోపుతుందా, లేక కొంత వాటా భరిస్తుందా అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు.


ప్రస్తుతం తయారు చేస్తున్న వాక్సిన్‌ ఖర్చు ఒక డోసుకు ఎంత అంటే మూడు డాలర్ల నుంచి 37 డాలర్లవరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ దేశాలకు ఒక రేటు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రేటుకు కొన్ని కంపెనీలు అందచేస్తాయన్నది మరొక వార్త. ఇప్పటికే కొన్ని చోట్ల అత్యవసర ప్రాతిపదికన వాక్సిన్‌ వేయటం ప్రారంభించి జనాల్లో ఆశలు, విశ్వాసం కల్పించారు. ఇదే సమయంలో కరోనా తగ్గిన ప్రాంతాల్లో మనకు అవసరం లేదనే అభిప్రాయం జనాల్లో వస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. జనం చస్తుంటే పట్టించుకోని మతాలు ఇప్పుడు వాక్సిన్‌ విషయంలో రంగ ప్రవేశం చేస్తున్నాయి. ప్రత్యేక పరిస్ధితిగా పరిగణించి మతస్తులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని అమెరికా బిషప్పులు ప్రకటించారు.
ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. కరోనా వైరస్‌ను కృత్రిమంగా రూపొందించి ప్రపంచం మీదకు వదలిందని, ధన సంపాదనకు దాని నివారణకు అవసరమైన వాక్సిన్‌ కూడా సిద్దం చేసుకుందనే నిందలు చైనా మీద వేసిన తీరు, వాటిని ఇప్పటికీ నమ్ముతున్న వారి గురించి తెలిసిందే. వాస్తం ఏమిటి ? ఇప్పుడు మిగతా అనేక దేశాలతో పాటే చైనా వాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తోంది తప్ప ముందుగా రాలేదు, ఆరోపించినట్లు దాన్ని సొమ్ము చేసుకోనూ లేదు. అయినా ఇప్పుడు కూడా చైనా లక్ష్యంగా పశ్చిమ దేశాలు మరో దాడి జరుగుతోంది. దీర్ఘకాలంలో లబ్ది పొందేందుకు చైనా కరోనా దౌత్యం చేస్తోందని చెబుతున్నాయి.


చిత్రం ఏమంటే ప్రపంచ జనాలందరికీ సమంగా వాక్సిన్‌ పంపిణీ చేయాలని ఒప్పందం మీద సంతకాలు చేసిన 189దేశాల కోవాక్స్‌ కూటమిలో చైనా చేరింది తప్ప అమెరికా లేదు. అమెరికా, ఇతర దేశాలలో తయారు చేసే కంపెనీలు సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయి. చైనా వంద కోట్ల డోసుల తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. బ్రెజిల్‌, మొరాకో, ఇండోనేషియా వంటి చోట్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అనేక చోట్ల వాక్సిన్‌ నిల్వ సౌకర్యాల ఏర్పాటుకూ పూనుకుంది. కొన్ని దేశాలు వాక్సిన్‌ కొనుగోలుకు అవసరమైన రుణం కూడా ఇస్తోంది. వీటిని వాక్సిన్‌ సిల్క్‌ రోడ్‌ అని కొందరు వర్ణిస్తున్నారు. ఇదే పని భారత్‌తో సహా ఇతర దేశాలు చేయటాన్ని, నిజంగా లబ్ది ఉంటే పొందటాన్ని ఎవరు అడ్డుకున్నారు ? చైనా రంగంలో లేక ముందు పేద, వర్దమాన దేశాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నది ధనిక దేశాలే కదా ? వాటిని వదలించుకొని అవి ఇప్పుడు చైనా వైపు ఎందుకు చూస్తున్నాయి ? వీటిలో కొన్ని గతంలో చైనా మీద తీవ్ర ఆరోపణలు చేసినవి కూడా ఉన్నాయి.
గతంలో కరోనా సమాచారాన్ని సకాలంలో వెల్లడించలేదని ఆరోపించారు. ఇప్పుడు చైనా తయారు చేస్తున్న వాక్సిన్ల సామర్ధ్యం లేదా రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రానివ్వటం లేదని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. వాటి మీద నమ్మకం లేని వారు దూరంగా ఉండవచ్చు, బలవంతం ఏమీ లేదు కదా ? వివరాలన్నీ బయట పెట్టిన కంపెనీల తయారీనే వినియోగించవచ్చు. గతంలో చైనా వస్తువులు నాణ్యత లేనివి అని ప్రచారం చేశారు. ఆచరణలో వాటినే కొనుగోలు చేశారు, ఇప్పుడు వాక్సిన్‌ కూడా అంతేనా ? అసలు పశ్చిమ దేశాల సమస్య ఏమిటి ? కరోనా సమయంలో ఉద్దీపనల పేరుతో లబ్ది పొందిన కార్పొరేట్లు ఇప్పుడు వాక్సిన్నుంచి లాభాలు పిండుకోవాలని చూస్తున్నాయి. తమ కంపెనీలు తయారు చేసిన వాక్సిన్‌ను తమకు మిత్ర దేశాలా, శత్రుదేశాలా అనేదానితో నిమిత్తం లేకుండా తీసుకొనేందుకు సిద్దపడే అన్ని దేశాలతో లాభాలను ఆశించకుండా పంచుకొనేందుకు చైనా సిద్దపడుతోంది. తద్వారా తమ లాభాలకు అడ్డుపడుతోందన్నదే పశ్చిమ దేశాల అసలు దుగ్ద.

అమెరికా మిత్ర దేశం ఫిలీప్పీన్స్‌, దాని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే మాటల్లో ” ఇతర దేశాల మాదిరి చైనా వాక్సిన్‌ సరఫరాకు ముందుగా కొంత సొమ్ము చెల్లించమని అడగటం లేదు, అదే పశ్చిమ దేశాలు అడ్వాన్సు చెల్లించమని అడుగుతున్నాయి, అలా అయితే మేమంతా చావక తప్పదు.” అన్నాడు. ఐరోపా యూనియన్‌లోని హంగరీ పరిస్ధితి కూడా అదే. కరోనా కారణంగా అనేక వర్ధమాన దేశాలు నిధులకు కటకటలాడుతున్న విషయం తెలిసిందే. చైనా వాక్సిన్‌కు సంబంధించిన సమాచారం విడుదల చేయకపోయినా దాదాపు వంద దేశాలు తమకు కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక దేశాలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అత్యవసర పరిస్ధితిగా పరిగణించి చైనా కంపెనీలు తయారు చేసిన వాక్సిన్ను అక్కడ ఈ ఏడాది జూలై నుంచే వినియోగిస్తున్నారు. పది లక్షల మంది ప్రయోగాత్మకంగా తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా జాతీయ ఔషధ కంపెనీ(సినోఫార్మ) ప్రకటించింది. ఈ కంపెనీ వాక్సిన్‌ కొనుగోలు చేస్తున్నట్లు డిసెంబరు తొమ్మిదిన యుఏయి వెల్లడించింది. అది 86శాతం గుణం చూపినట్లు మూడవ దశ ప్రయోగాల్లో వెల్లడి అయినట్లు పేర్కొన్నది. ఇతర కంపెనీలు 94,95శాతం సామర్ద్యం చూపినట్లు చెప్పాయి. యుఏయి తరువాత బహరెయిన్‌, ఈజిప్టు, ఇండోనేషియా కొనుగోలు చేసింది. బ్రెజిల్‌ కూడా చైనా వాక్సిన్‌ వినియోగానికి నిర్ణయించింది.


చైనా వాక్సిన్‌ గురించి కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పోలియో చుక్కలను ఇచ్చే మాదిరి పరిజ్ఞానాన్నే చైనా వినియోగిస్తున్నది. సినోఫార్మ వాక్సిన్‌ 42వేల మంది మీద ప్రయోగించారు. ఇంత సంఖ్యలో ప్రయోగించినందున ప్రతికూల, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే కనుగొనేందుకు అవకాశం ఉంటుంది అని నాన్‌జింగ్‌ విశ్వవిద్యాలయ ప్రజారోగ్య పరిశోధనా కేంద్ర డైరెక్టర్‌ డాక్టర్‌ ఉ ఝీవెరు చెప్పారు. వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరు అనే దేశభక్తి పూరితమైన అవగాహనతో వ్యాక్సిన్‌ రూపకల్పన, ప్రయోగాలు జరుగుతున్నాయని లండన్‌ విశ్వవిద్యాలయ చైనా సంస్ధ డైరెక్టర్‌ స్టీవ్‌ శాంగ్‌ చెప్పారు. వివిధ సర్వేలలో వెల్లడైన అంశాల మేరకు చైనాలో తమ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు వాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్దపడిన వారు 80శాతం ఉండగా, మిగిలిన దేశాలలో చాలా తక్కువ శాతాలలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కుట్ర సిద్దాంతాల ప్రచారం, ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఈ పరిస్దితి ఉంది.


చైనా మీద విశ్వాసం ఉన్న దేశాలు తగిన సమాచారం లేనప్పటికీ వాక్సిన్‌ కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. మిగతా దేశాల వాటితో పోల్చితే చైనా వాక్సిన్‌ నిల్వ,రవాణా సులభం. ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఫైజర్‌ వాక్సిన్‌ అత్యంత శీతల పరిస్ధితిలో మాత్రమే నిల్వ ఉంటుంది. గత అనుభవాలను చూసినపుడు వ్యాప్తి చెందే వైరస్‌ నివారణ అన్ని దేశాలలో జరిగినపుడే ఉపయోగం ఉంటుంది. అవసరాన్ని బట్టి తప్ప సంపదల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ ఉండకూడదు.


చైనాలో తయారవుతున్న వాక్సిన్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ డైవాక్స్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం కూడా ఉంది. చైనాకు చెందిన ఊహాన్‌ బయెలాజికల్‌ ప్రోడక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి. చైనా వాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగ ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అవి విడుదలైన తరువాత మరికొన్ని దేశాలు కూడా ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా, ఐరోపాలోని కార్పొరేట్‌ కంపెనీల పట్టుకూడా సడలే అవకాశాలు లేకపోలేదు.


కొన్ని వాక్సిన్లు గర్భవిచ్చిత్తి కణాలతో రూపొందించినప్పటికీ అత్యవసరం, అందరి మంచి కోసం నైతిక బాధ్యతగా క్రైస్తవులు వాక్సిన్లు తీసుకోవచ్చని అమెరికా బిషప్పుల సభ పేర్కొన్నది. ఆస్ట్రాజెనికా కంటే మోడెర్నా, ఫైజర్‌ వాక్సిన్లు నైతికంగా ఆమోదకరమైనవని, తప్పనిసరి అయితే దాన్ని కూడా తీసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే తప్పనిసరై వినియోగించినప్పటికీ గర్భవిచ్చిత్తికి వ్యతిరేకతను బలహీనపరచకూడదని కూడా పేర్కొన్నది.1972లో నెదర్లాండ్స్‌లో గర్భవిచ్చిత్తి జరిగిన ఉదంతంలో ఆడశిశువు మూత్రపిండాల నుంచి సేకరించిన కణాలతో ఒక వాక్సిన్ను రూపొందించారు. అప్పటి నుంచి కొన్ని కంపెనీలు అదే పద్దతిని అనుసరిస్తున్నాయి. దానికి భిన్నంగా ఫైజర్‌, మోడెర్నా వాక్సిన్లు తయారవుతున్నట్లు బిషప్పులు పేర్కొన్నారు.


మొత్తం మీద చూస్తే వాక్సిన్‌ గురించి విపరీత ప్రచారం జరుగుతోంది.ఎన్నికల లబ్దికి వాక్సిన్ను వాడుకోవాలని చూసి భంగపడిన డోనాల్డ్‌ ట్రంప్‌ను చూశాము. ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ తానేే స్వయంగా పర్యవేక్షించి తయారు చేయిస్తున్నట్లు జనానికి కనిపించే యత్నం చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలూ, మీడియా వాక్సిన్‌ దౌత్యం, రాజకీయాలలో నిమగమయ్యాయి. వాక్సిన్‌ ప్రజోపయోగ ఔషధంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని చైనా నాయకత్వం తొలి నుంచీ చెబుతోంది. దాన్ని అమెరికా ఇతర దేశాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ధనబలంతో చిన్న దేశాలను ఆకర్షిస్తున్న చైనా ఇప్పుడు వాక్సిన్‌తో తన పలుకుబడి పెంచుకోవాలని చూస్తోందని చెబుతున్నాయి. వందల సంవత్సరాల పాటు అలాంటి చర్యలను అమలు జరిపి ప్రపంచాన్ని ఆక్రమించిన దేశాల వారికి ప్రతిదీ అలాగే కనిపించటం, అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రైతుల ఆందోళన – వెనక్కు తగ్గేది లేదంటున్న బిజెపి !

10 Thursday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, indian farmers


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం – అమెరికాకు భంగపాటు !

17 Tuesday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

#RCEP, RCEP, RCEP China, RCEP INDIA, RCEP Trade Pact, Regional Comprehensive Economic Partnership (RCEP)


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్‌ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న ఏడాది కాలంలో అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రపంచీకరణలో భాగంగా అనేక సంస్కరణలు చేపడతామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు రక్షణాత్మక చర్యలు తీసుకోవటాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తాయి ? అయితే భారత్‌ కోరుకుంటే ఎప్పుడైనా చేరవచ్చని, నిబంధనలను కూడా సడలిస్తామంటూ భాగస్వామ్య దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల రక్షణ చర్యల్లో భాగంగా, ఇతర కారణాలతో మన దేశం ఈ ఒప్పందంలో చేరలేదు. చైనా కారణంగా దూరంగా ఉన్న అమెరికా కూడా దీనిలో చేరవచ్చనే ఆశాభావాన్ని జపాన్‌ వ్యక్తం చేసింది.


ఆస్ట్రేలియా,బ్రూనే, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా,థారులాండ్‌,వియత్నాం సభ్యులుగా ఉన్న ఈ ఒప్పందం ద్వారా ప్రతిదేశమూ లబ్ది పొందటంతో పాటు ప్రపంచ జిడిపి పెరుగుదలకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్‌, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్ధిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించాయంటే ఆర్ధిక అంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం. ఈ ఒప్పందంతో చైనాకు ఎగుమతి అవుతున్న జపాన్‌ పారిశ్రామిక ఎగుమతులలో 86శాతం, దక్షిణ కొరియా నుంచి ఎగుమతి అవుతున్నవాటిలో 92శాతంపై పన్నులు రద్దువుతాయి. జపాన్‌ ఆటోవిడిభాగాల తయారీ పరిశ్రమ ప్రధానంగా లబ్ది పొందుతుంది. ఆస్ట్రేలియా కూడా ఇదే అంచనాతో ఒప్పందానికి సిద్దపడింది. చైనాతో వాణిజ్య సంబంధాలలో ఈ మూడు దేశాలూ మిగులులో ఉన్నాయి.


అనేక ఆసియన్‌ దేశాల వస్తూత్పత్తి చైనానుంచి చేసుకొనే కొన్ని వస్తువుల దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఒప్పందానికి అమెరికా, భారత్‌ దూరంగా ఉన్నాయి. చైనాను పక్కన పెట్టాలన్న అమెరికా ఆదేశాలు లేదా విధానాలకు అనుగుణ్యంగా నడవటానికి తాము సిద్దంగా లేమనే సందేశం ఈ ఒప్పందం పంపినట్లయింది. ఒక వైపు ప్రపంచీకరణ తమకు నష్టదాయకంగా మారిందని బహిరంగంగా చెప్పకపోయినా అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ రాజ్యాలు రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచవాణిజ్య సంస్ధతో నిమిత్తం లేకుండా ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి.ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి.పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను చక్రబంధంలో బిగించాలని చూసిన ట్రంప్‌ యంత్రాంగానికి ఇది పెద్ద వైఫల్యం. అమెరికాకు అగ్రతాంబూలం అన్న వైఖరిని అనుసరిస్తున్న వైఖరితో ఆసియా దేశాల్లో తలెత్తిన అనుమానాల కారణంగా కూడా ఆర్‌సిఇపి ఉనికిలోకి రావటానికి దోహదం చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఇదే సమయంలో చైనా, తూర్పు ఆసియా దేశాలు అమెరికాాఐరోపాలతో పోల్చితే కరోనాను అదుపు చేశాయి. ఆర్దిక రంగంలో పురోగమనంలో ఉన్నాయి. మరోపది సంవత్సరాల వరకు వినిమయం ఎక్కువగా ఉండే మధ్యతరగతి ప్రజానీకం పెరుగుదల చైనా, ఆసియాలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.ఆర్దికంగా పెద్ద రాజ్యాలలో ఒక్క చైనా వృద్ది మాత్రమే పురోగమనంలో ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు కరోనా కట్టడితో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర సమస్యలతో ఉన్నాయి.

ఫసిపిక్‌ ప్రాంత దేశాల భాగస్వామ్యం(టిపిపి) పేరుతో అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిపాదనలో చైనాతో సహా అనేక ఆసియా దేశాలకు అవకాశం లేకుండా చూశారు. ఈ ఒప్పందంపై 2016లో సంతకాలు చేసిన అమెరికా మరుసటి ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి రాగానే ఉపసంహరించుకుంది. దాంతో అది అమల్లోకి రాలేదు. దీనికి ప్రతిగా చైనా, మరికొన్ని దేశాలు ముందుకు తెచ్చిందే ఆర్‌సిఇపి. దీనిలోపి టిపిపిలో ఉన్న ఆసియా దేశాలు భాగస్వాములయ్యాయి. అమెరికాను కూడా తమతో చేరాలని కోరాయి.టిపిపి వెనక్కు పోయిన తరువాత అమెరికా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా సరికొత్త సమీకరణకు పూనుకుంది. ఆర్‌సిఇపి నుంచి మన దేశం వైదొలగటానికి ఒక కారణం మన పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వెల్లడైన తీవ్ర వ్యతిరేకత అన్నది స్పష్టం. ఆ నష్టాల గురించి ప్రారంభం నుంచీ చర్చలలో ఉన్న మన ప్రతినిధులకు తెలియనివేమీ కాదు. అయినా ఆరు సంవత్సరాల పాటు ముందుకు పోయి 2019లో వెనక్కు తగ్గటానికి పైకి వెల్లడించని ఒక ప్రధాన కారణం ఈ కాలంలో అమెరికాతో పెనవేసుకున్న బంధం అన్నది స్పష్టమే. దానికి చక్కటి ఉదాహరణ ఇరాన్‌తో మనకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా అమెరికా వత్తిడి మేరకు అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము.


ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్‌ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్‌ 56శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61శాతం పన్నులు తగ్గుతాయి. కొన్ని వస్తువుల విషయంలో వెంటనే పన్నులు తగ్గినా, మొత్తంగా ఒప్పందంలో అంగీకరించిన మేరకు తగ్గుదలకు పది సంవత్సరాలు పడుతుంది. ప్రాంతీయ సరఫరా వ్యవస్ధ స్దిరపడుతుంది. ఆయా దేశాలకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు ప్రపంచ రాజకీయాల్లో వాటి వైఖరుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఒప్పందంతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ దిశగా మూడు దేశాలు పన్నులను తగ్గించేందుకు పూనుకోవచ్చు. చైనాాఅమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన నష్టాలలో ఈ ఒప్పందం కారణంగా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలకు 150 నుంచి 200 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గవచ్చని అంచనా. ఇది అమెరికా మీద వత్తిడి పెంచుతుంది.


ఒప్పందం కుదిరినంత మాత్రాన అంతా అయిపోయినట్లు భావించరాదు. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.ఈ ఒప్పందం బహుపక్ష వాదానికి చారిత్రక విజయం, ప్రాంతీయ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు పెద్ద సహాయకారి అవుతుందని భావిస్తున్నారు.టిపిపి నుంచి అమెరికా తప్పుకున్న తరువాత దీనిని పసిఫిక్‌ ప్రాంత సమగ్ర మరియు పురోగామి భాగస్వామ్య ఒప్పందంగా(సిపిటిపిపి) సవరించారు.టిపిపి ఒప్పందంలో వాణిజ్యానికి పెద్ద పీట వేస్తే దీనిలో పెట్టుబడుల వంటి వాటిని కూడా చేర్చారు.అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఆర్‌సిఇపి ఒప్పందాన్ని అతిగా చూపి చైనా ముప్పు పేరుతో టిపిపిని మరోసారి ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది అంత తేలిక, వెంటనే జరిగేది కాదు. సిపిటిపిపిలో చేరి దాన్ని ఆర్‌సిఇపికి వ్యతిరేకంగా తయారు చేసేందుకు పూనుకోవచ్చు.

మన దేశం విషయానికి నరేంద్రమోడీ యంత్రాంగం ఆలోచనా ధోరణులు ఇలా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రంప్‌ రెండో సారి కచ్చితంగా అధికారానికి వస్తాడు(ఈ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి హౌడీమోడీ సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని ఎన్నికల ప్రచారం చేశారు). చైనాతో వాణిజ్య యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాడు. అది మేకిన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావటానికి దోహదం చేసే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. చైనా నుంచి ఇతర దేశాల సంస్దలు మన దేశానికి తరలివస్తాయి. తద్వారా త్వరలో ఎగుమతుల్లో చైనాను అధిగమించవచ్చు. ఇలాంటి భ్రమలకు గురైన కారణంగానే అమెరికా కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, ముఖ్యమంత్రులందరూ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్దంగా ఉండాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతో చైనా మీద ఆధారపడిన సరఫరా వ్యవస్దకు ప్రత్యామ్నాయంగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి నూతన వ్యవస్దను ఏర్పాటు చేయాలని మన దేశం ప్రతిపాదించి చర్చలు జరుపుతోంది. అవి ఒక కొలిక్కి రాకముందే ఆ చైనాతోనే వాటితో పాటు మరికొన్ని దేశాలు ఆర్‌సిపి ఒప్పందం చేసుకొని అమలుకు ముందుకు పోతున్నాయి. జపాన్‌ వంటి దేశాలు మనల్ని, రెండవ పెద్ద ఆర్దిక వ్యవస్ద ఉన్న చైనాను కూడా ఉపయోగించుకోవాలని చూస్తాయి తప్ప కేవలం మన మీదనే ఆధారపడే అవకాశాల్లేవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.


ఏ నాయకత్వమైనా తమవైన స్వంత పద్దతులలో దేశాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవచ్చు. అవి విజయవంతమౌతాయా లేదా అన్నది వేరే అంశం. కానీ మరొక దేశం మీద ఆధారపడి అంచనాలు రూపొందించుకోవటం మబ్బులను చూసి ముంతలో నీరు ఒలకపోసుకోవటం, గాలిమేడలు కట్టటం తప్ప మరొకటి కాదు. అనూహ్యంగా కరోనా వైరస్‌ సమస్య వచ్చింది. ట్రంప్‌ ఓడిపోయాడు. బైడెన్‌ చైనాతో వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తాడో, రాజీపడతాడో తెలియదు. ట్రంప్‌ మాదిరి దూకుడు మాత్రం ఉండదు అంటున్నారు. అవి తేలేంతవరకు మేకిన్‌ ఇండియాను మన మోడీగారు ఏమి చేస్తారు ? వాయిదా వేస్తారా ? అనేక ఆసియా దేశాలు గతంలోనూ, ఇప్పుడు ఎగుమతి ఆధారిత విధానాలతోనే వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు ఆర్‌సిఇపి ద్వారా మన పొరుగునే ఒక పెద్ద స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఏర్పడింది. దాన్ని విస్మరించి రక్షణాత్మక చర్యలు తీసుకొంటున్న మన దేశం వైపు పెట్టుబడులు వస్తాయా ? వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా ? అసలు అమెరికా కూడా వాటిని అంగీకరిస్తుందా ? మన పారిశ్రామిక, వ్యవసాయ రంగ రక్షణ చర్యలు తీసుకోకపోతే పాలక పార్టీ పారిశ్రామికవేత్తలు, రైతాంగానికి దూరం అవుతుంది. వీటిని ఫణంగా పెట్టి ప్రపంచ కార్పొరేట్లు, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ద, ప్రపంచ వాణిజ్య సంస్ధలు వత్తిడి తెస్తున్న ప్రపంచీకరణ గొలుసుకు మన దేశాన్ని కట్టకపోతే వాటికి కోపం వస్తాయి ? నరేంద్రమోడీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దొంగ చెవులు, సమాచార తస్కరణ బడా చోర్‌ అమెరికా సంగతేమిటి ?

20 Sunday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

China, Datamining, Eavesdroppers, EDWARD SNOWDEN, US CIA, US NSA


ఎం కోటేశ్వరరావు
నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ తయారు చేయించిన ఓట్‌ జో ఆప్‌ నుంచి కీలకమైన సమాచారం బయటకు పోతున్నట్లు కనుగొన్నారు. ఓటర్ల రాజకీయ అనుబంధాలు ఏమిటి, గతంలో వారు ఎవరికి ఓటు వేశారు అన్న సమాచారం దానిలో ఉంటుందట, ఇప్పుడు అది ఎవరికి అవసరం, ఇంకెవరికి మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్త్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కే.
గూగుల్‌ ఖాతాదారుల 2ఎఫ్‌ఏ ఎస్‌ఎంఎస్‌ కోడ్స్‌ను తస్కరించేందుకు ఇరానియన్‌ హాకర్ల గ్రూప్‌ ఒక ఆండ్రాయిడ్‌ అక్రమ చొరబాటుదారును అభివృద్ది చేసింది.
రాబోయే రోజుల్లో సమాచారాన్ని తస్కరించే అక్రమచొరబాటుదార్ల దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని బ్రిటన్‌లోని ఎన్‌సిఎస్‌సి విద్యా సంస్ధలకు సలహాయిచ్చింది.


జర్మనీలో ఒక ఆసుపత్రి సమాచార వ్యవస్ధపై జరిగిన దాడి కారణంగా కంప్యూటర్‌ వ్యవస్ధలు పని చేయలేదు. దాంతో తక్షణం చికిత్స అందించవలసిన ఒక మహిళా రోగిని మరో పట్టణంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి రావటంతో ఆమె మరణించింది.
తమ సంఘంలోని రెండు లక్షల మంది నర్సుల వ్యక్తిగత సమాచార భద్రతకు తగిన చర్య తీసుకోని కారణంగా చోరీకి గురైనట్లు కెనడాలోని అంటారియో రాష్ట్ర నర్సుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూజెర్సీ యూనివర్సిటీ హాస్పిటల్‌ సమాచార వ్యవస్ధపై జరిగిన దాడిలో 48వేల మందికి సంబంధించిన సమాచారం చోరీకి గురైంది. అమెరికా ఫెడరల్‌ కోర్టుల ఫోన్‌ వ్యవస్ధ గురువారం నాడు పనిచేయలేదు.సైబర్‌దాడుల గురించి 75శాతం మంది ఐటి ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేసినట్లు కనెక్ట్‌వైజ్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది. ఇవన్నీ తాజా వార్తల్లో కొన్ని మాత్రమే.


ఇక కంప్యూటర్‌ అక్రమ చొరబాటుదార్ల మధ్య పరస్పర సహకారం పెరుగుతున్నట్లు పాజిటివ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది.2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో జరిగిన సైబర్‌దాడుల గురించి చేసిన విశ్లేషణలో తొలి మూడు మాసాలతో పోల్చితే తొమ్మిది శాతం, 2019తో పోల్చితే 59శాతం పెరిగినట్లు, కరోనా కారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో రికార్డులను బద్దలు చేస్తూ దాడులు పెరిగినట్లు తెలిపింది. వస్తుతయారీ, పారిశ్రామిక కంపెనీలపై దాడులు పెరిగినట్లు తేలింది. తాము కోరిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో తాము కాపీ చేసుకున్న లేదా తస్కరించిన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని దాడులకు పాల్పడిన వారు బెదిరిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. లాక్‌బిట్‌ మరియు రాగనర్‌ లాకర్‌ వంటి చోరీ ముఠాలు ఈ రంగంలో గాడ్‌ ఫాదర్‌ లేదా డాన్‌గా ఉన్న మేజ్‌తో జతకట్టటం, సహకరించుకోవటానికి ముందుకు వస్తున్నట్లు తేలింది. అందరూ కలసి మేజ్‌ బృందం పేరుతో తస్కరించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేస్తున్నారు. దాన్ని చూపి కంపెనీలను బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసినపుడు ఒకటి స్పష్టం. సమాచార చౌర్యం అన్నది ప్రపంచ వ్యాపిత సమస్య. బడా కంపెనీలు తమ ప్రయోజనాల కోసం తస్కరిస్తే, దాన్ని చోరీ చేసి బెదిరించి సొమ్ము చేసుకొనే వారు కూడా తయారయ్యారు.


చైనా సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులకు, సంస్దలకు ద్వారాలు తెరుస్తున్న సమయంలో వాటికి ఆద్యుడిగా ఉన్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. గాలి కోసం కిటికీలు తెరుస్తున్నపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసుఅన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాల నుంచి, మన దేశం నుంచీ చైనా వెళుతున్నవారిలో గూఢచారులు లేరని ఎవరైనా చెప్పగలరా ? దానికి ప్రతిగా చైనా తన పని తాను చేయకుండా ఉంటుందా ?


ఈ వాస్తవాన్ని విస్మరించి పాఠకులను, వీక్షకులను ఆకర్షించేందుకు మన మీడియా పడుతున్న పాట్లు చెప్పనలవిగావటం లేదు. తాజా విషయానికి వస్తే బెంగళూరు నగరంలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రంలోని వంద కంప్యూటర్లు ఒక నెల రోజుల్లోనే రెండు సార్లు సైబర్‌ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అంటే సమాచార తస్కరణ జరిగింది. జరిగినట్లు కూడా తెలియదు. ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని ఏమీ చేయకుండానే కాపీ చేసుకొనే సౌలభ్యం గురించి తెలియని వారెవరు ? ఈ దాడి పైన చెప్పుకున్న మేజ్‌ బృందం చేసినట్లు చెబుతున్నారు. ఈ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఎలక్ట్రానిక్‌ పాలనకు సంబంధించి అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ రహదారుల సంస్ధ సమాచార వ్యవస్ధమీద కూడా దాడి జరిగింది.ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరిగాయో తెలియదు. ఆ వివరాలను బహిరంగంగా చెబితే ప్రభుత్వ పరువు పోతుంది కనుక అధికార యంత్రాంగం మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు.
చైనాకు చెందిన సంస్ధ ఒకటి మన దేశంలోని వేలాది మంది ప్రముఖులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అక్కడి ప్రభుత్వానికి అంద చేస్తున్నదని ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం అయింది. దానిలో ఉన్న అంశాలు ఏమిటట ? పది వేల మంది ప్రముఖులకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని జెన్‌హువా అనే సంస్ధ సేకరించి విశ్లేషిస్తోందట. ఎప్పటి నుంచి ? 2018లో ప్రారంభం అంటున్నారు ? అంతకు ముందు ఎందుకు చేయలేదు ? చెప్పేవారు లేరు. అప్పటి నుంచే ఆ సమాచారం ఎందుకు అవసరమైంది. మనకు తెలియదు. మరి సమాచార సేకరణ నిజమా కాదా ? నూటికి నూరుపాళ్లు నిజమే. బహిరంగంగా తెలిసిన సమాచారమే కాదు, తెలియని సమాచారాన్ని కూడా చైనా సేకరించుతుంది. ఎందుకని ? ప్రపంచంలో ఆ పని చేయని దేశం ఏది ? ఒక్కటి కూడా లేదు. ఇదంతా బహిరంగ రహస్యమే. సమాచార చోరీ గురించి పభుత్వానికి తెలుసు అని ఐటి శాఖ చెప్పింది. మరి తెలిసిందాన్ని సంచలన విషయంగా మీడియా వారు ఎందుకు చెబుతున్నారు ? అలా చెబితే తప్ప జనాలకు కిక్కు రావటం లేదు మరి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏది చెప్పినా గిట్టుబాటు అవుతుందన్న లాభాపేక్ష. అమెరికా ఇతర దేశాల గురించి రాస్తే ఢిల్లీ ప్రభువులకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయం. కమ్యూనిస్టు వ్యతిరేకత సరే సరి !
కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే 2010లో చేరి అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే కుర్రాడు (37) సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ వంటి సంస్ధలు సేకరించిన వందల కోట్ల ఫైళ్లను ప్రపంచానికి బహిర్గతం చేశాడు. అమెరికా నగరం వాషింగ్టన్‌లోని మన రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని మన ఐరాస కార్యాలయాల కంప్యూటర్‌ వ్యవస్ధలోకి చొరబడిన అమెరికన్‌ ఎన్‌ఎస్‌ఏ ప్రభుత్వ ఆదేశాలు, ఇతర సమాచారాన్ని తస్కరించింది.గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌, యాహూ వంటి బడా ఐటి కంపెనీలు సేకరించిన అమెరికనేతర దేశాలకు చెందిన సమాచారం మొత్తం అమెరికాకు చేరిపోయింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రపంచ వ్యాపితంగా 97 బిలియన్లు అంటే 9,700 కోట్ల సమాచార అంశాలను అమెరికా చోరీ చేసిందని గార్డియన్‌ పత్రిక ఆరేండ్ల క్రితం వెల్లడించింది. దాని దౌత్యవేత్తలు, గూఢచారులు పంపిన నివేదికలు కూడా వాటిలో ఉన్నాయి. అమెరికన్లు తమ శత్రువుల సమాచారాన్ని మాత్రమే సేకరించి మిత్రులను మినహాయించలేదు. శత్రుదేశంగా పరిగణించే ఇరాన్‌ నుంచి 1400 కోట్లు, మిత్ర దేశమైన పాకిస్ధాన్‌ నుంచి 1350 కోట్లు, పశ్చిమాసియాలో అత్యంత సన్నిహిత దేశమైన జోర్డాన్‌ నుంచి 1270 కోట్లు, ఈజిప్టు నుంచి 760, మన దేశం నుంచి 630 కోట్ల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది.


మన దేశం తమకు మిత్ర దేశమని చెబుతూనే రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన సమాచారాన్ని, వాణిజ్య అంశాలు ప్రత్యేకించి అణు, అంతరిక్ష కార్యక్రమాలను అమెరికా సేకరించినట్లు హిందూ పత్రిక వెల్లడించింది. ఇంటర్నెట్‌ నుంచి 630, టెలిఫోన్ల నుంచి 620 కోట్ల వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. ఆరు సంవత్సరాల నాడు ఈ వివరాలు వెల్లడైనపుడు ప్రొఫెసర్‌ గోపాలపురం పార్ధసారధి అనే మాజీ సీనియర్‌ దౌత్యవేత్త మాట్లాడుతూ హిందూ పత్రిక ప్రకటించిన వార్తల గురించి ఎవరూ ఆశ్చర్య పడనవసరం లేదని, ప్రతివారూ ప్రతి ఒక్కరి మీద నిఘావేస్తారు, కొంత మంది మంచి పరికరాలను కలిగి ఉండవచ్చు, వారి సౌకర్యాలు మనకు గనుక ఉంటే మనమూ అదే పని చేస్తామని గట్టిగా చెప్పగలను అని గార్డియన్‌ పత్రికతో చెప్పారు.


అమెరికా తస్కరించిన సమాచారాన్ని బయట పెట్టటానికి మూడు సంవత్సరాల ముందు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికన్‌ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ న్యూ ఢిల్లీ వచ్చి ఆరు రోజులు ఉన్నాడు. కంప్యూటర్ల నుంచి సమాచార నైతిక తస్కరణ, సాఫ్ట్‌వేర్లను తెలుసుకోవటం ఎలా అనే అంశం మీద శిక్షణ పొందాడు. అంటే మన దేశంలో అలాంటి నిపుణులకు కొదవ లేదన్నది స్పష్టం. సమాచారాన్ని నిల్వ చేసే పద్దతులు తెలుసుకోవటం ఎలానో, కంప్యూటర్లలోకి దొంగలు ఎలా ప్రవేశిస్తారో, వారిని ఎలా నిరోధించాలో కూడా విద్యార్ధులకు శిక్షణ అవసరమే మరి. తమ దగ్గరకు వచ్చే వారు ఏ లక్ష్యంతో వస్తున్నారో శిక్షణా సంస్దలు తెలుసుకోలేవు. చాకుతో మామిడి, కూరగాయలను ఎలా కోయవచ్చో చెప్పటంతో పాటు అవసరం అయితే దాన్నే ఆత్మరక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతారు. అది తెలిసిన వారు దారి తప్పినపుడు నేరానికి ఉపయోగించటంలో ఆశ్చర్యం ఏముంది?


ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ తాను భారత్‌ వెళుతున్నట్లు అక్కడ సమాచార నిల్వ, తస్కరణ వంటి అంశాల్లో శిక్షణ పొందబోతున్నట్లు అమెరికా భద్రతా అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడని ఒకవైపు చెబుతారు. తీరా అతను రహస్య సమాచారాన్ని బయట పెట్టిన తరువాత అమెరికా ఎన్‌ఎస్‌ఏ చెప్పిందేమిటి ? తమ కాంట్రాక్టు ఉద్యోగిగా అంటే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్నోడెన్‌ను నియమించే సమయంలో సిఐఏ అధికారులు క్షుణ్ణంగా మంచి చెడ్డల గురించి ప్రశ్నించకుండానే ఎంపిక చేశారట. అతను విదేశాలకు దేనికి వెళ్లాడు, ఏం చేశాడు, అతన్ని కలిసిన, కలుస్తున్న వ్యక్తులెవరు ? వారెలాంటి వారు తదితర అంశాలను పట్టించుకోలేదని, జాగ్రత్త చేయాలంటూ 17లక్షల రహస్య ఫైళ్లను అతనికి అప్పగించారని తెలిపింది. అయితే అతను సిఐఏ కాంట్రాక్టరుగా, సాంకేతిక సహాయకుడిగా భారత్‌ వస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్పష్టంగా తెలుసు. తాను వ్యాపారనిమిత్తం భారత్‌ వచ్చానని స్నోడెన్‌ చెప్పినట్లు అతనికి శిక్షణ ఇచ్చిన కోయింగ్‌ సొల్యూషన్స్‌ సిఇఓ రోహిత్‌ అగర్వాల్‌ చెప్పాడు. తాము సిఐఏ గూఢచారులమనిగానీ, దాని తరఫున వచ్చామని గాని ఎక్కడా వెల్లడించవద్దని సిఐఏ అధికారులు జారీ చేసిన మార్గదర్శక సూత్రాల్లోనే ఉంది కనుక స్నోడెన్‌ తాను వ్యాపారినని చెప్పాడు.అలాంటి వారందరూ ఏ దేశం వెళితే అక్కడి అమెరికా రాయబార కార్యాలయాల్లోనే పని చేస్తారు అన్నదీ బహిరంగ రహస్యమే.
సమాచారాన్ని సేకరించేందుకు, గూఢచర్యం కోసం కొన్ని కంపెనీలనే కొనుగోలు చేయటం అందరికీ తెలిసిందే.1970లో క్రిప్టో ఏజి అనే స్విస్‌ కంపెనీని అమెరికా, జర్మనీ గూఢచార సంస్ధలు కొనుగోలు చేసి వంద దేశాలల్లో వేగుల కార్యకలాపాలకు దాన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే రెండు దేశాల అధికారుల మధ్య పరస్పర అనుమానాలు తలెత్తి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. సిఐఏ సిబ్బందిలో కొంత మందికి జర్మన్‌ భాష రాకపోవటం కూడా దీనికి కారణమైంది.


ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ను కూడా ఉపయోగించుకొని వాటి ద్వారా వివిధ దేశాలకు వెళుతున్న సమాచారాన్ని తెలుసుకున్నట్లు గార్డియన్‌ పత్రిక బ్రిటన్‌ గూఢచార సంస్ధ చేసిన నిర్వాకం గురించి వెల్లడించింది. అది తాను సేకరించిన సమాచారాన్ని అమెరికా ఎన్‌ఎస్‌ఏకు అంద చేసింది. రోజుకు 60 కోట్ల మేర ఫోన్‌ సంభాషణలు, సమాచారానికి సంబంధించిన అంశాలను అందచేసేది. సముద్ర గర్భంలో వేసిన ఇటలీలోని ఆప్టిక్‌ కేబుళ్ల కేంద్రాల నుంచి వీటిని సేకరించారు. ఇదంతా చట్టబద్దమే అని ఈ కుంభకోణం వెల్లడైనపుడు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్నది. సమాచారాన్ని 30 రోజుల పాటు నిల్వచేసి విశ్లేషణ చేసిన తరువాత అవసరమైన వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని పారవేసేవి. అందువలన ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వ సంస్ధలు ఫోన్‌ కంపెనీలు, ప్రయివేటు కంపెనీల ద్వారా సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. అందువలన ఫోన్ల ద్వారా, టిక్‌టాక్‌ వంటి ఆప్‌ల ద్వారా సమాచారాన్ని చైనా లేదా మరొక దేశం సేకరించటం రహస్య వ్యవహారమేమీ కాదు. ప్రతి దేశమూ చేస్తున్నదే.
అమెరికా ప్రపంచ వ్యాపితంగా 61వేల హాకింగ్‌లకు అమెరికన్లు పాల్పడినట్లు ఆరు సంవత్సరాల క్రితం హాంకాంగ్‌ పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు బయటపెట్టింది. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు కొన్ని అంశాల మీద భిన్నంగా మాట్లాడినా అమెరికా చేస్తున్న అన్ని అక్రమాలకు బాసటగా నిలుస్తున్న ఐరోపా యూనియన్‌ దేశాల కూటమితో సహా అమెరికా ఏ దేశాన్నీ వదలలేదు. ఎవరినీ నమ్మకపోవటమే దీనికి కారణం. చివరికి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్లను కూడా దొంగచెవులతో విన్నట్లు పత్రికలు రాయటంతో బెర్లిన్‌లోని అమెరికా రాయబారిని పిలిపించి సంజాయిషీ అడిగారు. ఇదేం మర్యాద అంటూ ఆమె నాటి అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో మాట్లాడారు.

దొంగచెవులు, గూఢచర్యం వంటి పనులకు 2013లో అమెరికా 5,300 కోట్ల డాలర్ల( దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు) కేటాయించింది. రోజుకు 20కోట్ల వర్తమానాలను అమెరికా ప్రపంచవ్యాపితంగా సేకరించినట్లు 2014జనవరిలో గార్డియన్‌ పత్రిక రాసింది. మన ఆధార్‌ కార్డులు, వాటిని మన బ్యాంకు ఖాతాలు, ఇతర పధకాలకు అనుసంధానం చేసినందున వాటిలో ఉన్న సమాచారం మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన బతుకులన్నీ బజార్లో ఉన్నట్లే ! వ్యక్తిగత సమాచార తస్కరణకు ఎవరు పాల్పడినా గర్హనీయమే, ఖండించాల్సిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ చేస్తున్నదే అన్నది పచ్చి నిజం ! ఇక్కడ సమస్య పదివేల మంది మీద నిఘావేసింది అన్న చైనా గురించి గుండెలు బాదుకుంటున్న వారికి ప్రపంచ జనాభా పడక గదుల్లో కూడా ఏం జరుగుతోందో తెలుసుకొనే అమెరికా బడా చోరీలు, చోరుల గురించి పట్టదేం ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భద్రతా మండలిలో అమెరికాకు ఎదురు దెబ్బ-ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలు !

25 Tuesday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Trump Iran Sanctions, UN arms vote, UN Security Council


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న అమెరికాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గత వారం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మండలిలోని 15 మందికి గాను 13 మంది ఇరాన్‌ మీద తిరిగి ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు లేఖలు అందచేశారు.2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించించిదని ప్రకటించేందుకు ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు ఈ లేఖలు శరా ఘాతం మాదిరి తగిలాయి. అయితే తాము ఏకపక్షంగా ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. అయితే ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగినందున ఆంక్షలను అమలు జరపాలని కోరే హక్కును కోల్పోయిందని పదమూడు మంది పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు18తో ఆయుధాల విక్రయంపై ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. భద్రతా మండలి ఆమోదం పొంది ఉంటే మరికొంత కాలం ఆంక్షలు కొనసాగేవి. ఈ పరిస్ధితిపై చర్చించేందుకు సమావేశం కావాలని రష్యా ప్రతిపాదించింది. తాము హాజరు కావటం లేదని ట్రంప్‌ ప్రకటించాడు.


కిందపడినా తనదే పై చేయి అన్నట్లుగా అమెరికా తప్పుడు వాదనకు పూనుకుంది. తాను ఒప్పందం నుంచి వైదొలిగినా 2015లో సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం ఒప్పందం ప్రకారం భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో సాంకేతికంగా తాము కూడా సంతకం దారుగా ఉన్నందున తిరిగి ఆంక్షలను విధించాలని కోరే హక్కు తమకు ఉన్నదని ట్రంప్‌ సర్కార్‌ విఫలవాదన చేసింది. ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు అమెరికా మిత్రరాజ్యాలైన జర్మనీ, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యదేశాలలో రష్యా, చైనా,జర్మనీ, బెల్జియం, వియత్నాం, నైగర్‌, సెయింట్‌ విన్‌సెంట్‌, గ్రెనడైన్స్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఎస్తోనియా, ట్యునీసియా ఉన్నాయి.కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ ఒక్కటే ఈ సమస్యపై లేఖను ఇవ్వాల్సి ఉంది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో ఇరాన్‌ మీద ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను బలపరచిన దేశం అదొక్కటే కావటంతో లేఖను కూడా అదే మాదిరి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
భద్రతా మండలిలో తగిలిన ఎదురు దెబ్బతో దిమ్మతిరిగిన మైక్‌ పాంపియో ఉక్రోషం వెళ్లగక్కుతూ యూరోపియన్లు అయాతుల్లాల వైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారని నోరు పారవేసుకున్నాడు.భద్రతా మండలిలో అమెరికన్లు అపహాస్యం పాలయ్యారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల ఐరాస చరిత్రలో తమ శత్రువు ఇంతగా ఒంటరి పాటు కావటం గతంలో జరగలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.అయినా తాను తగ్గేది లేదని ట్రంప్‌ ప్రకటించాడు. తామేం చేసేది త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
భద్రతా మండలి తీర్మాన తిరస్కరణతో గల్ఫ్‌ ప్రాంతంలో తలెత్తిన పరిస్ధితి గురించి చర్చించేందుకు చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికా, ఇరాన్‌కు రష్యా చేసిన ప్రతిపాదన మేరకు జరిగే వీడియో సమావేశంలో తాను పాల్గొనకపోవచ్చని ట్రంప్‌ చెప్పాడు. సమావేశ ప్రతిపాదనను చైనా స్వాగతించింది. 2018లో సంయుక్త సమగ్రకార్యాచరణ పధకం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత దానిలో అమెరికా భాగస్వామి కాదని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఈ పధకానికి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని అమెరికా చర్యను తాము సమర్ధించలేమని, ఒప్పందానికి మద్దతు యత్నాలకు ఇది పొసగటం లేదని పేర్కొన్నాయి. ఒప్పందానికి అనుగుణంగా లేని చర్యలనుంచి వెనక్కు తగ్గాలని తాము ఇరాన్‌పై వత్తిడి తెస్తామని మూడు దేశాలు స్పష్టం చేశాయి.
తమ మిత్రులుగా ఉన్న ఇ3(బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌) దేశాలు ఇరాన్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వకపోవటం తమకు ఆశాభంగం కలిగించిందని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో మంగళవారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ మంత్రి అషెకెనాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఇరాన్‌ స్పందించిన తీరు ఈ ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేదిగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.
మూడు అణువిద్యుత్‌ కర్మాగారాలలో అణుశుద్ధి కార్యక్రమం నుంచి ఇరాన్‌ వైదొలిగితే దానికి పరిహారంగా ఆంక్షల తొలగింపు, ఇతర సహాయం చేస్తామంటూ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ భాగస్వాములుగా 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.2018లో దీన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అయితే ఇరాన్‌ గనుక ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే దానిలో భాగస్వాములైన ఏ దేశమైనా తనంతటతానుగా 2007నాటి భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్న ఆంక్షల విధింపునకు చర్య తీసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. 2007నాటి తీర్మానంలో తాము భాగస్వాములం కనుక ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చనే వితండవాదానికి అమెరికా దిగింది.అది ఒప్పందానికి కట్టుబడి ఉన్న ఇతర భాగస్వాములకు తప్ప వైదొలగిన అమెరికాకు లేవని మిగిలిన దేశాలు చెబుతున్నాయి. ఎవరూ తమను అనుసరించకపోయినా తాము ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా అంటోంది. నిజానికి 2018 తరువాత అమెరికా అదరగొండితనంతో తన ఆదేశాలను పాటించని దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తోంది. దానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు సైతం మినహాయింపులేదని అమెరికా చెప్పటంతో మన దేశం భయపడి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడి మిగతా దేశాలేవీ ఇరాన్‌తో సంబంధాలను వదులుకోలేదు. అంతర్జాతీయ నిబంధనలు, తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామే తప్ప ఇరాన్‌తో సంబంధాలను వదులుకొనేది లేదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రియబకోవ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిని కొన్ని ముడుల మధ్య బంధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా చర్య అక్రమం అని చైనా పేర్కొన్నది. అంతే కాదు పాతిక సంవత్సరాల వ్యవధిలో ఇరాన్‌లో 400 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్దం అవుతోంది. ఒప్పందం ప్రకారం తమకు చేస్తామన్న సాయం రానపుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇరాన్‌ చెబుతోంది. తాము పూర్తి స్ధాయి అణుశుద్ధి చేస్తున్నపుడు విధించిన వాటి కంటే తీవ్రమైన ఆంక్షలను ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నది. అణురియాక్టర్లలో వినియోగించే అణు ఇంధనాన్ని ఐదుశాతానికి మించి శుద్ది చేయకూడదు. ఒప్పందం ప్రకారం 3.67శాతం మించకూడదు. అయితే ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందున మిగతా సభ్యదేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై వత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ 4.5శాతానికి పెంచింది
2015లో అంగీకరించిన దానికి మించి అదనపు నిబంధనలను తాము అంగీకరించేది లేదని మంగళవారం నాడు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఐరాస అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ ప్రతినిధి(ఐఏఇఏ) బృందం సోమవారం నాడు ఇరాన్‌ పర్యటనకు వచ్చింది. బహిర్గతం చేయకుండా నిల్వ చేసిన లేదా ఉపయోగించిన అణుపదార్ధాల తనిఖీకి అనుమతించాలని ఆ బృందం కోరుతోంది. గత ఏడాది వరకు ఒప్పందానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ వ్యవహరిస్తున్నట్లు ఐరాస బృందం నివేదించింది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత పరిమితికి మించి అణు శుద్ధి చేస్తున్నట్లు బహిరంగంగానే ఇరాన్‌ చెబుతోంది. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామని అణుశక్తి సంస్ద ప్రతినిధి బృంద నేత రాఫెల్‌ గ్రాసీతో కలసి టెహరాన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఇరాన్‌ ప్రతినిధి అలీ అక్బర్‌ సలేహీ స్పష్టంగా చెప్పారు. రెండు అణుకేంద్రాలను తనిఖీ చేయాలని ఐఏఇఏ కోరుతోంది. గత ఏడాది వాటి తనిఖీని ఇరాన్‌ అడ్డుకుందని, వాటిలో ఒక దానిని 2004లో పాక్షికంగా ధ్వంసం చేశారని, మూడవదానిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అణుకేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనే ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది
టెహరాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్‌ అతి పెద్ద నాటంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారంలో గత నెలలో జరిగిన పేలుడు, చెలరేగిన అగ్ని విద్రోహచర్యల్లో భాగమే అని ఇరాన్‌ అణు శక్తి సంస్ధ చెబుతోంది. కేంద్రం పరిసరాలలో చెలరేగిన మంటలకు సైబర్‌ దాడులు కారణం కావచ్చని తొలుత అధికారులు భావించారు. అక్కడ మరింత ఆధునిక పరికరాలను అమర్చుతామని ప్రకటించారు. ఇక్కడ యురేనియం శుద్ధిని మరింతగా పెంచినట్లు, ఇది 2015 ఒప్పంద ఉల్లంఘనే అని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కథనాలను వెల్లడించాయి. ముందే చెప్పుకున్నట్లు తక్కువ శాతం శుద్ధి మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఆయుధ తయారీకి ఉపయోగించే యురేనియం 90శాతం ఉన్నట్లు ఆరోపించాయి. ఒప్పందం ప్రకారం నాంటజ్‌లో 2026వరకు 5,060 సెంట్రిఫ్యూజస్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఫోర్డోలోని భూగర్భ కేంద్రంలో 2031 వరకు ఎలాంటి శుద్ధి చేయకూడదు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత నాంటజ్‌లో ఆధునిక సెంట్రిఫ్యూజస్‌ను రెట్టింపు చేసిందని, ఫోర్డోలో సెంట్రిఫ్యూజస్‌లోకి హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పుడు భద్రతా మండలితో నిమిత్తం లేకుండా అమెరికా ప్రకటించిన ఆంక్షల గురించి రానున్న రోజుల్లో పరిణామాలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాకిస్ధాన్‌ కొత్త మాప్‌ మర్మం, పర్యవసానాలు ఏమిటి ?

07 Friday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

India-Pak relations, Pakistan new political map


ఎం కోటేశ్వరరావు


పాకిస్ధాన్‌ ప్రభుత్వం కొత్త రాజకీయ చిత్ర పటాన్ని రూపొందించి మన దేశంతో సరికొత్త వివాదానికి దిగింది. ఆక్రమిత కాశ్మీరును ఇప్పటికే తనదిగా చూపుతున్న పాక్‌ కొత్తగా జమ్మూకాశ్మీరు, లడఖ్‌ ప్రాంతాలను గుజరాత్‌లోని జునాఘడ్‌, సర్‌ క్రీక్‌ ప్రాంతాలను కూడా తనవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని ప్రచురించింది. లడఖ్‌లో తమవిగా చైనా చెబుతున్న ప్రాంతం, గిల్గిట్‌్‌-బాల్టిస్ధాన్‌లో పాకిస్దాన్‌ 1963లో చైనాకు అప్పగించిన ప్రాంతం వీటిలో లేవు. నిజానికి ఈ మాప్‌లు కొత్తవి కాదు, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రాంతాలు, నాటి తూర్పు పాకిస్దాన్‌(నేటి బంగ్లాదేశ్‌)ను కలిపి నాటి పాక్‌ ప్రభుత్వం ముద్రించింది.తరువాత వాటిని వెనక్కు తీసుకుంది. కాశ్మీర్‌ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలన్న 1972 సిమ్లా ఒప్పందం తరువాత 1999 నాటి లాహౌర్‌ ప్రకటనకు విరుద్దం. పాక్‌ చర్య రాజకీయ మూఢత్వమని మన దేశం వ్యాఖ్యానించింది.
పాక్‌ కొత్త చిత్రపటాన్ని తయారు చేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు దానివి కావు, మన నుంచి పోవు. ప్రతి దేశం తనవి అని భావించే ప్రాంతాలను చూపుతూ రాజకీయ చిత్ర పటాలను తయారు చేస్తుంది, ప్రచారంలో పెడుతుంది. సరిహద్దుల గురించి వివాదం ఉన్నపుడు వాటిని ఇరుగు పొరుగు దేశాలు అంగీకరించవు. ఉదాహరణకు చైనా ముద్రించే చిత్ర పటాల్లో మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను తన టిబెట్‌లో భాగంగా చూపింది. అదే విధంగా మన చిత్ర పటాల్లో మనవిగా చూపుతున్న ఆక్సారుచిన్‌, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మన ఆధీనంలో లేవు.


మన ప్రధాని నరేంద్రమోడీ లేదా బిజెపి నేతలు అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. మనకు ఎంతో కావలసిన దేశం అమెరికా అంటారు, అన్ని అంశాల్లో మనకు మద్దతు ఇస్తూ ముందుకు పొమ్మని చెబుతోంది అని చెబుతారు. చైనాకు వ్యతిరేకంగా మనకు మద్దతు ఇస్తోందని ఇటీవల ఎక్కువగా చెబుతున్నారు. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్న మిత్ర దేశం అని కొనియాడతారు. అయినా సరే కాశ్మీరును మన అంతర్భాగంగా అమెరికా ఇంతవరకు గుర్తించలేదు అనే విషయం ఎంత మందికి తెలుసు. కాశ్మీర్‌ను ప్రస్తావించాల్సి వస్తే గతంలో భారత ఆక్రమిత ప్రాంతం అని పిలిచే అమెరికన్లు ఇటీవలి కాలంలో భారత పాలిత కాశ్మీరు అని సవరించారు తప్ప మరొక మార్పు చేయలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ను నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నారు-దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ బిరుదు ఇచ్చాడు తప్ప కాశ్మీరు మనదే అని గుర్తించలేదు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తనది అని చైనా తన పటాల్లో ముద్రించినా, కాశ్మీరు మనది అని అమెరికా గుర్తించకపోయినా వాటితో విబేధిస్తున్నామని చెబుతూనే రెండు దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించటానికి మనకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. పాకిస్ధాన్‌ తన చిత్ర పటాల్లో తాజాగా మార్పులు చేసినా ఇదే వైఖరి కొనసాగుతుంది.


పాకిస్ధాన్‌ తన చిత్రపటాన్ని ఇప్పుడెందుకు సవరించింది ?
కాశ్మీర్‌ తమదే అని చెబుతున్నప్పటికీ ఆక్రమిత ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీరు అని ప్రత్యేకంగా చూపుతోంది తప్ప మిగతా కాశ్మీరు, జునాఘడ్‌ను తమ అంతర్భాగాలుగా ఇంతవరకు చూపలేదు. ఇప్పుడు సవరించింది అంటే కొత్త వివాదానికి తెరలేపినట్లు అనుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఏడాది గడచిన సందర్భంగా పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. దీని గురించి జాతీయంగా, అంతర్జాతీయంగా వెలువడుతున్న విశ్లేషణలు మీడియా కథనాలను చూస్తే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం ఉంది అన్నది ఒక ఆరోపణ. గతంలో నేపాల్‌ విషయంలోనూ అదే ఆరోపణను చైనా మీద చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు అనుగుణ్యంగా బంగ్లాదేశ్‌ వస్తువుల దిగుమతులపై చైనా పన్ను రాయితీలు ఇచ్చినపుడు కూడా దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనే చర్యగా వర్ణించారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ద విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆల్‌ దఫ్రా వైమానిక కేంద్రంలో ఆగిన సమయంలో ఇరాన్‌ వైపు నుంచి మూడు క్షిపణులు బయలు దేరాయని, అవి ఆల్‌ దఫ్రా వైపే వస్తున్నట్లు సమాచారం అందిందని అమెరికాలోని సిఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌ టీవీ ఛానల్స్‌ వార్తలను ప్రసారం చేశాయి. ఇరాన్‌ క్షిపణులు వచ్చినట్లు అవి సమీపంలోని సముద్రంలో పడినట్లు కూడా అవి చెప్పాయి. ఇవి అమెరికా అల్లిన కట్టుకథలు, ఇరాన్‌తో మన సంబంధాలను చెడగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. మీడియాలో వస్తున్న వర్ణణలు, అధికారయంత్రాంగం అనధికారికంగా వదులుతున్న లీకు వార్తలను బట్టి ఎలాంటి నిర్దారణలకు రాకూడదు. మీడియాలో వచ్చిన వార్తలకు విరుద్దంగా చైనా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ చర్య వెనుక చైనా ఉందని అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

అయితే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం లేదా ?
అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కినపుడు, సంక్లిష్టంగా మారినపుడు ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక దేశ హస్తం ఉన్నట్లు అనుమానాలు తలెత్తటం సహజం. అవి దాయాదులు లేదా శత్రుదేశాల మధ్యనే కాదు మిత్రదేశాల వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని పరిణామాల వెనుక చైనా హస్తం ఉందని అనుకొనే వారికి ఆ స్వేచ్చ ఉంది. అయితే మరికొన్ని పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉందని దాని ప్రభావానికి మన దేశం లొంగిపోతోందనే కోణంలో కూడా వారితో పాటు అందరూ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకు మన దేశంతో కుదుర్చుకున్న ఒక రైల్వే లైన్‌ నిర్మాణం నుంచి ఇరాన్‌ మనలను తప్పించిందని మన మీడియాలో వార్తలు వచ్చాయి. చాబహర్‌ రేవు నుంచి ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దు వరకు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గ నిర్మాణంలో భాగస్వామ్యం గురించి భారత్‌తో చర్చలు జరిగాయి తప్ప ఒప్పందం వరకు రాలేదని ఇరాన్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఇరాన్‌ మీద అమెరికన్లు ఆంక్షలను తీవ్రతరం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయం మన దేశానికి కలిగినందున ఆ ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని ఇరాన్‌ తప్పించిందనే రీతిలో వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోక పోవటానికి, ఆంక్షల గురించి భయపడటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లేనా ? అమెరికా బెదిరింపులకు మన 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ భయపడినట్లా ?


ఇరాన్‌ చాబహార్‌ రేవు అభివృద్ధికి 2016లో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఐదుదశల్లో ఈ రేవు సామర్ద్యాన్ని పెంచాలన్నది పధకం. తొలి దశలో మన దేశం చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయిందని ఇరాన్‌ చెబుతోంది. దానికి అమెరికా వత్తిళ్లే కారణం అని ఇరాన్‌ విమర్శిస్తోంది. అది వాస్తవం కానట్లయితే సకాలంలో పధకాన్ని పూర్తి చేయలేని మన అసమర్ధత అయినా అయ్యుండాలి. తదుపరి చర్యలకు భారత్‌కోసం తాము వేచి చూడలేమని ఇతర దేశాల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. అయితే ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు తీవ్రం అవుతున్న కారణంగా మరొక దేశమేదీ ముందుకు రానపుడు అమెరికాను ఖాతరు చేయని చైనా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే మన విశ్లేషకులు మన దేశం ఇరాన్‌ను తీసుకుపోయి చైనా చేతిలో పెట్టిందని, దీనికి మనల్ని మనమే నిందించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాను ఒంటరిపాటు చేయటం దేవుడెరుగు మనకు మనమే ఒంటరి అవటానికి అమెరికా వలలో మనం చిక్కుకోవటం కారణం కాదా ?
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకో కూడదు అన్నది అందరూ అంగీకరించే సాధారణ సూత్రం. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు సరైన దారిలో లేవు కనుక వివాదాలు తలెత్తినపుడు ప్రతి దేశం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం నిత్యకృత్యంగా మారింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్నట్లు స్వయంగా అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనేక దేశాల ఎన్నికల్లో, ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో అమెరికా నిర్ణయిస్తోందన్న అంశం కూడా బహిరంగ రహస్యమే.


మన దేశంలో ఉగ్రవాదదాడులు, విచ్చిన్న చర్యలు జరిగినపుడు వాటి వెనుక పాకిస్ధాన్‌ హస్తం ఉందని మన ప్రభుత్వం చెప్పటం తెలిసిందే. పాకిస్ధాన్‌లోని బెలూచిస్తాన్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి ఉగ్రవాద చర్యలు, దాడులు జరిగినపుడు పాక్‌ ప్రభుత్వం కూడా వాటి వెనుక మన హస్తం ఉందనే ఆరోపిస్తున్నది. పశ్చిమాసియాలోని అరబ్బు ప్రాంతాల్లో జరిగే దాడులకు ఇజ్రాయెల్‌ కారణమని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు అరబ్బులు కారణమనే వార్తలు కూడా వస్తాయి. అత్యధిక సందర్భాలలో వీటికి ఆధారాలు ఉండవు అందువనల వీటిలో వాస్తవాలు ఏమిటి అన్నపుడు ఒక ఆరోపణ నిజమే అని అంగీకరించినపుడు రెండవదాన్ని కూడా నిజమే అనుకోవాలా లేదా ?


లడఖ్‌ ప్రాంతాన్ని కాశ్మీరు నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా లడఖ్‌ అంతర్భాగమని భారత్‌ చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని భారత చర్య చట్టవిరుద్దమని చైనా ఏడాది క్రితమే భద్రతా మండలిలో అభ్యంతరాన్ని లేవనెత్తింది. మధ్యలో ఒకసారి తాజాగా ఆ చర్యకు ఏడాది నిండిన సందర్భంగా మరోసారి భద్రతా మండలిలో ఇష్టాగోష్టి చర్చకు చైనా లేవనెత్తింది. నిజానికి లడఖ్‌ను పూర్తిగా మనదే అని మనం చెప్పటం లేదా చైనా తన ఆధీనంలో ఉన్నదని చెప్పటం కొత్తగా తలెత్తలేదు. రెండు దేశాల మధ్య సమస్యలు, అనుమానాలు తలెత్తినపుడు మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటారనే కారణంతో లాంఛనంగా అభ్యంతరాలను లేవనెత్తుతారు. ఏడాది క్రితం తొలిసారి చైనా లడఖ్‌ గురించి అదే చేసినపుడు మన అధికారులు చైనా వెళ్లి యథాతధ స్థితి గురించి తాము ఎలాంటి చర్య తీసుకోలేదని, అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఇచ్చిన వివరణతో చైనా తదుపరి పొడిగించలేదు. అయితే తరువాత సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా చైనా మరోసారి భద్రతా మండలిలో దీన్ని చర్చకు పెట్టింది.


చైనా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా ?
మన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసినపుడు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు పాకిస్ధాన్‌ విమర్శలు చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సమయంలో అది మా అంతర్గత వ్యవహారం ఇతర దేశాల జోక్యం తగదని మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మాదిరి మన మీద చైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. అవి అధికార ప్రతినిధులు లేదా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు తైవాన్‌ సమస్య. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. మన దేశం, అమెరికా కూడా అదే వైఖరిని కలిగి ఉంది. అయితే చైనాలో తైవాన్‌ విలీనం అయ్యేందుకు తగిన వాతావరణం లేదనే పేరుతో అమెరికన్లు జోక్యం చేసుకుంటున్నారు. తైవాన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు, చైనా వ్యతిరేక శక్తులకు అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేనందున దొడ్డిదారిన ఆఫీసులను ఏర్పాటు చేసి నిత్యం అక్కడి చైనా వ్యతిరేక శక్తులతో సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావానికి గురై భారత్‌ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని చైనా విమర్శిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తైవాన్‌లో జరిగిన ఎన్నికలలో చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే శక్తులు విజయం సాధించాయి. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపగా బిజెపి తన ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసింది. విమానాల రద్దు కారణంగా వారు భౌతికంగా వెళ్లి అక్కడి పాలకులను అభినందించలేకపోయారు గానీ ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపని చేశారు. ఈ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా చైనా పరిగణిస్తోంది.
కాశ్మీరులో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు కల్పించే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అదే మాదిరి చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో కొన్ని శక్తులు 2047లో చైనాలో పూర్తిగా విలీనం కావాలన్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్య్రం కావాలని ఆందోళన చేస్తున్నాయి. చైనా అధికారాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అలాంటి శక్తుల వలన ముప్పు వచ్చిందని భావించిన చైనా సర్కార్‌ తన అంతర్గత భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌కు వర్తింప చేసింది. ఈ చర్యను వ్యతిరేకించే వారికి పరోక్షంగా మద్దతు తెలియచేస్తూ మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ వేదిక మీద లేవనెత్తారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వైఖరిని తీసుకోలేదు. ఇది కూడా తమ అంతర్గత వ్యహారాల్లో జోక్యమే అని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కొన్ని దీవుల గురించి చైనాతో సహా ఆ ప్రాంత దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటికి మనకూ ఎలాంటి సంబంధమూ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా జోక్యం చేసుకోవటమే కాదు, ఆప్రాంతానికి యుద్ద నౌకలను తరలించి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. దాని ఎత్తుగడకు అనుగుణ్యంగా ఆ వివాదంలో మన దేశం జోక్యం చేసుకోవటాన్ని చైనా తప్పుపడుతున్నది.
ఇక టిబెట్‌ విషయం గురించి తెలిసిందే. చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దలైలామాను అమెరికా రూపొందించిన పధకం ప్రకారం మన దేశానికి రప్పించటం, ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయటం, తిరుగుబాటుదార్లకు మన దేశంలో కొన్ని చోట్ల నివాసాలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదంతా దలైలామా మతాధికారి కనుక మానవతా పూర్వక వైఖరితో చేశాము. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా అభ్యంతర పెడుతున్నది. దానిలో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు దలైలామాను అనుమతించవద్దని గతంలో చైనా అభ్యంతర పెట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటిలో చైనా వ్యవహారాలలో మన జోక్యం ఉన్నట్లా లేనట్లా ? మనం ఏమి చేసినా మనకు సరైనదిగా కనిపిస్తే చైనా ఏమి చేసినా చైనీయులకూ సరైనదిగానే కనిపిస్తుంది. ఏదేశానికైనా వాటి పర్యవసానాలు ఏమిటి అన్నది ముఖ్యం.


పాకిస్ధాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవటం. ప్రపంచ అణు సరఫరా దేశాల బృందంలో మన దేశం చేరటాన్ని చైనా అభ్యంతరం పెట్టటం, లడఖ్‌ విషయంలో భద్రతా మండలికి ఫిర్యాదు చేయటం వంటివి చైనా జోక్యంగా పరిగణించే వాటిలో కొన్ని.
పాకిస్దాన్‌కు గతంలో అమెరికా ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఎఫ్‌16 యుద్ద విమానాలను అందించి మనలను పరోక్షంగా బెదిరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. మన ప్రాంతాలను పాక్‌ తన అంతర్భాగాలుగా చూపుతూ చిత్ర పటాలను రూపొందిస్తే చైనాకు ప్రత్యక్షంగా కలిగే లాభం ఏమీ లేదు. మనకు వ్యతిరేకంగా పాక్‌ను చైనా రెచ్చగొడుతోంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. గత చరిత్రను చూసినపుడు కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్దాన్‌ను పురికొల్పింది బ్రిటన్‌, అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. తరువాత జరిగిన యుద్దాల సమయంలో మనకు వ్యతిరేకంగా ఆయుధాలు అందించింది అమెరికా అన్నదీ తెలిసిందే. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ద సమయంలో మనం బంగ్లా దేశ్‌లో జరుగుతున్న ఊచకోతను నివారించేందుకు జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని నిలువరించాము. స్వల్ప యుద్దం కూడా చేశాము. ఆ సమయంలో మనకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకొనేందుకు అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.అలాంటి అమెరికాతో, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాలతో రాసుకుపూసుకు తిరగటానికి మనకు ఎలాంటి పేచీ అభ్యంతరం కనిపించటం లేదు. పాకిస్ధాన్‌ పాలకులు అమెరికాతో చేతులు కలిపినపుడు అమెరికాను బహిరంగంగా విమర్శించటానికి మన మీడియాకు ధైర్యం చాలలేదు. ఒక వేళ ఇప్పుడు పాకిస్దాన్‌ను మన మీదకు చైనా ఎగదోస్తోంది అనుకుంటే, ఇంతకాలం అలాంటి చర్యలకు పాల్పడని చైనా ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తోందో రెండో కోణం కూడా పాఠకులకు అందించాలి. చైనాతో పాటు మన పాలకుల తప్పిదాలు, విధానాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా ధైర్యంగా విమర్శించాలి. ఇరాక్‌ మీద అమెరికా దాడి, సిరియా మీద ఆల్‌ఖైదా ఉగ్రవాదులతో కలసి దాడులు చేసిన తమ పాలకుల గురించి అక్కడి మీడియాలో అనేక మంది తీవ్రంగా విమర్శించారు. వియత్నాం మీద దురాక్రమణ యుద్దానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర అమెరికా ప్రజలకు ఉంది. మనం ఇతరులను కెలక్కపోతే ఇతరులూ మనలను కెలకరు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో మనం ఒక పక్షం వహించటం ఏమాత్రం క్షేమకరం కాదు అని పాలకులు గ్రహించాలి. అది సరైనదే అనుకుంటే వచ్చే పర్యవసానాలకూ బాధ్యత వారిదే అవుతుంది.


వెలువడుతున్న వ్యాఖ్యానాలు, పర్యవసానాలేమిటి ?
పాకిస్ధాన్‌ రూపొందించిన కొత్త చిత్ర పటంతో తలెత్తే ఇతర పర్యవసానాల గురించి మన దేశంలో చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తమవి అని చెప్పటం ద్వారా కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, లేదా ఆక్రమిత కాశ్మీర్‌లోని స్వతంత్ర కాశ్మీర్‌ వాదులకు ఎదురు దెబ్బ తగిలినట్లే అన్నది ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీలు స్వతంత్ర దేశంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు ఇక ముందు ఆస్కారం ఉండదు. పాక్‌ మాటలు నమ్మి వేర్పాటును కోరుతున్న వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతుంది అని కొన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ,లిపులేక్‌,లిమియాధురా ప్రాంతాలు తనవే అంటూ కొద్ది వారాల క్రితం నేపాల్‌ ప్రకటించటం, ఇప్పుడు అదే పని పాక్‌ చేయటం కాకతాళీయంగా జరిగినవి కాదని వాటి వెనుక రెండు దేశాలకూ పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
” చైనాతో కలుపుతూ పాకిస్ధాన్‌ కాగితాల మీద తన చిత్ర పటాన్ని రూపొందించినందున రెండు దేశాలతో యుద్దం ఉండవచ్చేమో అన్న భారత్‌ భయాన్ని తాజా పరిణామం ఎక్కువ చేస్తున్నది. అయితే ఆచరణలో అది పని చేస్తుందనేందుకు ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నాయి, అయితే దేశీయ రాజకీయాలు ఈ చిత్రపటం వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ” హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత్‌, ప్రపంచానికి ముప్పు ఎవరి నుంచి ?

28 Sunday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Alliance Between United States and India, cut troops in Germany, Diego Garcia, Mauritius, Mike Pompeo, NATO, Threat to India from whom


ఎం కోటేశ్వరరావు
చైనా విస్తరణ వాదం వర్తమానకాల సవాలు అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పాడు, దాన్ని ఎదుర్కొనేందుకు తమ వనరులను సమీకరిస్తామని అన్నాడు.జర్మన్‌ మార్షల్‌ ఫండ్‌ బ్రసెల్స్‌ ఫోరమ్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి భారత్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రాలకు ముప్పు ఉందని పాంపియో వ్యాఖ్యానించాడు. ఈ నేపధ్యంలో భారత్‌కు అమెరికా సైన్యం బాసటగా నిలవనున్నదని మీడియా వ్యాఖ్యానాలు చేసింది. ” చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌, ఆగేయాసియాకు అమెరికా మిలిటరీ తరలింపు: పాంపియో ” ఒక ఆంగ్ల దినపత్రిక శీర్షిక. ఈ వార్తలు వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఇంకేముంది అమెరికా సైన్యం భారత్‌కు మద్దతుగా వస్తున్నట్లు, చైనాను అడ్డుకొనేందుకు సిద్దపడటం, అంతా అయిపోయినట్లు దాని మంచి చెడ్డలను చర్చిస్తున్నారు.
భారత్‌ లేదా ప్రపంచానికి అసలు ముప్పు ఎవరి నుంచి ఉంది? చైనా నుంచా ? అమెరికా నుంచా ? విస్తరణ వాదం అంటే ఏమిటి ? రెండవ ప్రపంచ యుద్దంలో పరాజిత జర్మనీ లేదా విజేత సోవియట్‌ యూనియన్‌ గానీ ఒక వేళ దాడి చేస్తే పరస్పరం సహకరించుకుందామంటూ 1947 మార్చి నాలుగున ఫ్రాన్స్‌-బ్రిటన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తరువాత తమ పరిసర దేశాలతో దాన్ని వెస్టరన్‌ యూనియన్‌గా విస్తరించారు.1949 ఏప్రిల్‌ నాలుగున మరికొన్ని ఐరోపా దేశాలు, అమెరికా, కెనడాలకు విస్తరించి నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో)గా మార్పు చేశారు. ఏ జర్మనీ నుంచి ముప్పు అని ఒప్పందం ప్రారంభమైందో ఆ జర్మనీయే 1955లో నాటోలో చేరింది. ఏ సోవియట్‌ యూనియన్‌ అయితే దాడి చేస్తుందనే ప్రచారం చేశారో అది ఏ ఒక్కదేశం మీద కూడా దాడి చేయలేదు.1991లో సోవియట్‌ సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత దాని రిపబ్లిక్‌లు స్వతంత్రదేశాలుగా ప్రకటించుకున్నాయి. సోవియట్‌తో ప్రచ్చన యుద్దంలో తామే విజేతలమని అమెరికన్లు ప్రకటించుకున్న తరువాత నాటో కూటమిని రద్దు చేయాలి. ముప్పు అనుకున్న సోవియట్‌ అసలు ఉనికిలోనే లేదు. అలాంటపుడు ఐరోపాకు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లు ? రద్దు చేయకపోగా ఇతర దేశాల్లో మిలిటరీ జోక్యానికి పూనుకుంది. అనేక దేశాలకు విస్తరింప చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో చేస్తున్న మిలిటరీ ఖర్చులో 70శాతం ఈ కూటమి ఖర్చే ఉంది. ప్రస్తుతం ప్రపంచానికి అది ముప్పుగా పరిణమించింది అంటే అతిశయోక్తి కాదు.1990దశకం నుంచి అనేక దేశాల మీద అమెరికన్లు, దాని మిత్రదేశాలు ఏదో ఒక వంకతో చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. ఇక విస్తరణ వాదం గురించి చెప్పాల్సి వస్తే 1949 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు విస్తరించారు,పన్నెండు నుంచి 30దేశాలకు సభ్య రాజ్యాలు పెరిగాయి. ఇంకా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా చేరిన దేశం ఉత్తర మాసిడోనియా. అనేక దేశాలు నాటో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి శత్రువు ఎవరో, ఎవరి నుంచి రక్షణ పొందటానికో అగమ్యగోచరం.
ఇప్పుడు జర్మనీలో ఉన్న సైన్యాలను తగ్గించి భారత్‌, ఆగేయాసియాకు తరలిస్తామని పాంపియో చెబుతున్నాడు. అసలు చైనా విస్తరణ వాదం అనేది ఒక ఊహాజనితం, కుట్ర సిద్ధాంతాలలో భాగం. జర్మనీ నుంచి సైన్యాల తగ్గింపు-భారత్‌కు తరలింపు అన్నది లడఖ్‌ ఉదంతాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొంద చూసే అమెరికా యత్నం తప్ప మరొకటి కాదు. భారత్‌-చైనాల మధ్య తాజా సరిహద్దు ఉదంతాలు జరగటానికి ఎంతో ముందే అమెరికా ఆ నిర్ణయానికి వచ్చింది. భారత్‌కు మేలు చేసేందుకే ఇది అన్నట్లు ఇప్పుడు ఫోజు పెడుతోంది.
జర్మనీలో 35వేల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు. వారిని 25వేలకు కుదిస్తామని అమెరికా చెప్పింది. నాటో నుంచి తాము వైదొలుగుతామని గత ఎన్నికల్లో చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.నాటో నిర్వహణకు అయ్యేఖర్చును తామే ఎందుకు భరించాలని ప్రశ్నించి అదే ట్రంప్‌ వివాదపడిన విషయం తెలిసిందే. అదిరించో బెదిరించో ఖర్చును ఐరోపా దేశాల మీద నెట్టి తమ చేతికి మట్టి అంటకుండా నాయకత్వ స్ధానంలో ఉండాలన్నది అమెరికా ఎత్తుగడ. తనకు లాభం లేదనుకున్న అనేక ప్రపంచ సంస్ధలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది.నాటో నుంచి వైదొలుగుతామని బెదిరించటం తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయటం లేదు. అమెరికా గనుక అంత పని చేస్తే నాటో బలహీనపడి రష్యాకు ఉపయోగపడుతుందని నిపుణులు హెచ్చరించటమే దీనికి కారణం.
నాటోకు చెల్లింపులు చేయటాన్ని జర్మనీ ఒక అపరాధంగా భావిస్తోంది, ఐరోపా దేశాలు తమ రక్షణకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టుకోవాలి, జర్మనీ వైఖరిని మార్చుకోనట్లయితే అక్కడి నుంచి సైన్యాలను తగ్గించాలన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ట్రంప్‌ చెప్పాడు. అమెరికా సైన్యాలు ఐరోపాలో అట్లాంటిక్‌ దేశాల భద్రత కోసం ఉన్నాయి తప్ప జర్మనీని రక్షించటానికి కాదని అమెరికాలో జర్మనీ రాయబారి ఎమిలీ హార్బర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిజానికి జర్మనీలో అమెరికన్‌ సైన్యాల మోహరింపు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర చోట్లకు వేగంగా తరలించటానికి అనువుగా ఉండటం తప్ప జర్మనీకో మరో ఐరోపా దేశానికో ముప్పు కారణం కాదు. నాటో సభ్యరాజ్యాలు తమ జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని రక్షణకు ఖర్చు పెట్టాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంటే దాని సైనికులు, ఆయుధాలకు ఐరోపా దేశాలు చెల్లించాలన్నది అసలు విషయం.
జర్మనీతో అమెరికాకు వాణిజ్య పేచీ కూడా ఉంది. వాణిజ్యం విషయంలో అమెరికాను జర్మనీ చాలా చెడ్డగా చూస్తోంది, చర్చలు జరుపుతున్నాం గానీ సంతృప్తికరంగా లేవు. వారి వలన అమెరికాకు కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి, నాటో విషయంలో మా మనసు గాయపడింది. మా సైనికులు చేసే ఖర్చుతో జర్మనీ లబ్ది పొందుతోందని ట్రంప్‌ రుసరుసలాడాడు. తాము రక్షణ కోసం జిడిపిలో 3.42శాతం ఖర్చు చేస్తుంటే జర్మనీ కేవలం 1.8శాతమే కేటాయిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా విమర్శించాడు. నాటో బడ్జెట్‌లో అమెరికా, జర్మనీ 16శాతం చొప్పున భరిస్తున్నాయి. ఈనేపధ్యంలోనే అమెరికన్‌ సైనికుల ఖర్చును భరించే మరో దేశం కోసం ట్రంప్‌ చూస్తున్నాడన్నది స్పష్టం. అది మన దేశం అవుతుందా ? మరొక ఆగేయాసియా దేశం అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే అమెరికాను మన భుజాల మీద ఎక్కించుకొనేందుకు మన పాలకవర్గం సిద్దం కాదు. దానితో చేతులు కలిపి లబ్ది పొందాలని చూస్తున్నదే తప్ప లొంగిపోయి అది విసిరే ఎంగిలి మెతుకులు తినాలని అనుకోవటం లేదు. ఈ వైఖరి నుంచి వైదొలిగే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అమెరికా సైన్యాలు మన గడ్డమీద తిష్టవేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
ప్రపంచంలోని 150దేశాలలో లక్షా 70వేల మంది అమెరికన్‌ సైనికులు విధులలో ఉన్నారు. వారిలో గరిష్టంగా జపాన్‌లో 55వేలు, దక్షిణ కొరియాలో 26, జర్మనీలో 35, ఇటలీలో పన్నెండు, బ్రిటన్‌లో పదివేల మంది ఉన్నారు. మైక్‌ పాంపియో చీకట్లో బాణం వేశాడు. జర్మనీ నుంచి తగ్గించదలచిన తొమ్మిదిన్నరవేల మందిని ఎక్కడకు తరలించాలన్నది ఇంకా తేలాల్సి ఉంది. జర్మనీతో రాజీ కుదిరితే వారిని అక్కడే కొనసాగించవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నేడు ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దాన్నే విస్తరణవాదంగా అమెరికా, దాని అడుగుజాడల్లో నడిచే దేశాలు చిత్రిస్తున్నాయి. ఈ పేరుతోనే గడచిన మూడు సంవత్సరాలలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన బల ప్రదర్శలో భాగంగా మూడు విమాన వాహక, ఇతర యుద్ద నౌకలను అమెరికా మోహరించింది. వాటిని చూపి మనతో సహా అనేక దాని మిత్ర దేశాలకు మీ వెనుక మేమున్నాం చైనా మీదకు మీరు దూకండి అని అమెరికా సందేశాలు పంపుతోంది. దానికి ప్రతిగా చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది. వాణిజ్య పరంగా పెట్టుబడులు, ఒప్పందాలు తప్ప చైనా మిలిటరీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే అది అనేక చోట్ల నిర్మిస్తున్న రేవులు వాణిజ్యంతో పాటు మిలిటరీని ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయని అమెరికా, దాన్ని అనుసరించే వారు చెబుతున్నారు. కానీ వారు 150దేశాల్లో అమెరికా మిలిటరీ లేదా దాని సైనిక కేంద్రాలు ఎందుకు ఉన్నాయో చెప్పరు.
ప్రస్తుతం అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలంటే నావికులు నడిపే 390, నావికులు లేకుండా కంప్యూటర్లద్వారా నడిచే మరో 45 నౌకలు కావాల్సి ఉంటుందని ఒక సంస్ధ అంచనా వేసింది. దీనికి గాను ప్రస్తుతం అమెరికా వద్ద మొత్తం 294 మాత్రమే ఉన్నాయని, 2030 నాటికి వాటిని 355కు పెంచుకొనేందుకు అమెరికన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని 2016లోనే అమెరికా ప్రకటించింది. ఆ తరువాత మన మిలిటరీతో సంబంధాలను గణనీయంగా మెరుగుపరుకుంది, తొలిసారిగా మన త్రివిధ దళాలతో సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. విశాఖ నుంచి కాకినాడ వరకు అమెరికా నావికా దళం ప్రయాణించింది. ఒక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇవన్నీ చైనాను ఎదుర్కొనే అమెరికా వ్యూహంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. గతంలో అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ పేరుతో ఉన్న మిలిటరీకి తాజాగా ఇండో -పసిఫిక్‌ కమాండ్‌ అని మార్చారు. ఇవన్నీ భారత్‌ను తనతో తీసుకుపోయే వ్యూహంలో భాగమే. ప్రపంచ పోలీసుగా అమెరికా తనకు తానే బాధ్యత తీసుకొని పెత్తనం చెలాయించ చూడటం ప్రపంచానికే ముప్పు. దానితో జతకట్టిన దేశాలకూ ముప్పే. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్న సామెత తెలిసిందే.
తాజా విషయాన్ని చూద్దాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి దూరం 2,800 కిలోమీటర్లు అయితే మారిషస్‌కు చెందిన చాగోస్‌ దీవుల నుంచి కన్యాకుమారి దూరం కేవలం 1,722 కిలోమీటర్లు మాత్రమే. హిందూ మహాసముద్రంలోని ఈ దీవుల్లో ఒకటైన డిగోగార్షియాలో అమెరికా నావికా దళ కేంద్రం ఉంది. ఈప్రాంతాన్ని ఆక్రమించిన ఫ్రెంచి వారు తరువాత బ్రిటన్‌కు అప్పగించారు.వారు సంయుక్త భాగస్వామ్యం పేరుతో అమెరికాకు అప్పగిస్తే అక్కడ వారు సైనిక కేంద్రాన్ని నెలకొల్పారు. అది మన రక్షణకు ముప్పు అని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది.యావత్‌ ప్రపంచంలో తమది అత్యంత ప్రజాస్వామిక దేశమని బ్రిటన్‌ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అత్యంత అప్రజాస్వామికంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన వలసగా చేసుకుంది. చాగోస్‌ దీవులను బ్రిటన్‌ 2019 నవంబరులోగా మారిషస్‌కు అప్పగించి అక్కడి నుంచి తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. బ్రిటన్‌ దాన్ని ధిక్కరించింది.
1968లో బ్రిటన్‌ నుంచి మారిషస్‌ స్వాతంత్య్రం పొందింది. అయితే తాము మారిషస్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని గ్రహించిన బ్రిటన్‌ తనకు అధికారం లేకపోయినా చాగోస్‌ దీవుల సముదాయంలో పెద్దదైన డిగోగార్షియా, దానిపక్కనే ఉన్న మరికొన్నిటినీ ఒక మిలిటరీ కేంద్రంగా వినియోగించుకొనేందుకు అనుమతిస్తూ అమెరికాకు కౌలుకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దీవులను తమకు అప్పగించాలని మారిషస్‌ డిమాండ్‌ చేస్తూనే ఉన్నా అపర ప్రజాస్వామిక దేశాలైన బ్రిటన్‌, అమెరికా దాన్ని ఖాతరు చేయలేదు.2019 ఫిబ్రవరి 25న వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. తరువాత మే 22న ఐక్యరాజ్యసమితి 116-6ఓట్ల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి బ్రిటన్‌ ఆ దీవులను ఖాళీ చేయాలని ఆదేశించింది. అమెరికా, బ్రిటన్‌ తిరస్కరించాయి. తమ మధ్య కుదిరిన ద్విపక్ష వ్యవహారాల మీద నిర్ణయం చేసేందుకు అంతర్జాతీయ కోర్టు, ఐరాసకు అధికారం లేదని వాదించాయి.
స్వాతంత్య్ర సమయంలో అధికారానికి రానున్న మారిషస్‌ నేత శివసాగర్‌ రామ్‌గులామ్‌ను బ్రిటన్‌ బ్లాక్‌మెయిల్‌ చేసింది, చాగోస్‌ దీవుల గురించి మాట్లాడవద్దని బెదిరించింది.1965లో తాము చేసుకున్న ఒప్పందం చట్టబద్దమే అని సముద్ర చట్టాల ట్రిబ్యునల్‌ 2015లో నిర్ధారించిందని బ్రిటన్‌ వాదిస్తోంది. అయితే ఆ ట్రిబ్యునల్‌ వాదనను ప్రపంచ కోర్టు కొట్టివేసింది. ఐక్యరాజ్యసమితి 1514 తీర్మానాన్ని ఆ ఒప్పందం ఉల్లంఘించిందని కోర్టు పేర్కొన్నది. ఈ ఒప్పందం 2036వరకు అమల్లో ఉంటుంది. మారిషస్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ దీవుల్లో నివాసం ఉంటున్న దాదాపు 1,500 చాగోసియన్లను బలవంతంగా మారిషస్‌, షెషల్స్‌కు తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము చాగోస్‌ దీవులను సందర్శిస్తామని మారిషస్‌ ప్రకటించింది. అది బ్రిటన్‌ ప్రాంతమని, అక్కడ పర్యటించాలనుకోవటం రెచ్చగొట్టటమే అని, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ అమెరికా బెదిరించింది. దాంతో మారిషస్‌ రాయబారి ఒక ప్రకటన చేస్తూ 2036లో డిగోగార్సియా దీవి ఒప్పందాన్ని బ్రిటన్‌ పునరుద్దరించలేదని, అయితే తాము అమెరికాకు 99 ఏండ్లకు కౌలుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆ దీవుల్లో వారిని మారిషస్‌ మీద రెచ్చగొట్టేందుకు బ్రిటన్‌-అమెరికా డబ్బు ఆశచూపుతూ విభజించి పాలించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి.
చైనా విషయానికి వస్తే అది ఏ మిలిటరీ కూటమిలోనూ సభ్య దేశం కాదు. 1962లో అది మనతో చేసిన యుద్దం తప్ప అంతకు ముందు, తరువాత కమ్యూనిస్టు చైనా సైన్యానికి యుద్దం చేసిన అనుభవం కూడా లేదు. చైనాతో పోలిస్తే మన మిలిటరీ ఖర్చు తక్కువ, మొత్తంగా చూస్తే బలాబలాల రీత్యా చైనాదే పైచేయి అయినప్పటికీ పాకిస్ధాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా అనుభవం రీత్యా మనమే మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు జరగని మన సరిహద్దుల్లో ఒక్క ఉదంతం కారణంగానే రెండు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశాలు లేవు. అటూ లేదా మన వైపు నుంచి గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అనువైన వాతావరణం కూడా లేదు. అయితే కరోనా, అంతకు ముందునుంచి ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం నుంచి బాధ్యతను ఇతరుల మీదకు నెట్టివేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి తోడు నవంబరులో జరిగే ఎన్నికలలో లబ్ది పొందేందుకు ట్రంప్‌ అనేక ఎత్తులు వేస్తున్నాడు. వాటిలో మనం చిక్కుకోరాదు.
చాగోస్‌ దీవులను బ్రిటన్‌ ”త్యాగం ” చేస్తే చైనా ఆక్రమిస్తుందని బ్రిటన్‌లో కొందరు రెచ్చగొడుతున్నారు. ముత్యాల హారం పేరుతో చైనా అమలు చేస్తున్న వ్యూహంలో భాగంగా హిందూ మహా సముద్రంలో అనేక చోట్ల అది వాణిజ్య, మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చిత్రిస్తున్నారు. మరోసారి బ్రిటన్‌ ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలంటే చాగోస్‌ దీవులను కలిగి ఉండాల్సిందేనని చెబుతున్నారు. మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండాల మీద నాటో కూటమి ఆధిపత్యం సాధించాలంటే డిగోగార్షియా, ఇతర దీవులు బ్రిటన్‌ ఆధీనంలోనే ఉండాలని వాదిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి ముప్పు పరిగణిస్తున్నారో వేరే చెప్పాలా ?(చైనా ముత్యాల హారం వ్యూహం గురించి మరోసారి చెప్పుకుందాం) మైక్‌ పాంపియో చెప్పినట్లు జర్మనీ నుంచి లేదా నేరుగా అమెరికా నుంచే సైనికులను తరలించాల్సి వస్తే మారిషస్‌ నోరు మూయించి నావికా దళ కేంద్రంగా ఉన్న డిగోగార్షియాలో అవసరమైన మార్పులు చేసి మిలిటరీని అక్కడ పెట్టేందుకు అవకాశం ఉంది. అది జరగాలన్నా ఏర్పాట్లకు కొంత సమయం పడుతుంది. అది చైనాకే ముప్పు అనుకుంటే పొరపాటు, అమెరికా రెండంచుల పదును ఉన్న కత్తి వంటిది. తన ప్రయోజనాలే దానికి ముఖ్యం. ఎటు నుంచి అయినా ఎవరిని అయినా దెబ్బతీయగలదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: