• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2018

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శూద్ర కులాలను రామాయణం ఎందుకు అవమానించింది ?

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, Literature., Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Ramayana epic, shudras, why ramayana epic insults shudras

Image result for why ramayana epic insults shudras

డాక్టర్‌ కదిరె కృష్ణ

ఈనెల 7వ తేదీన ప్రముఖ రచయిత వనం జ్వాలా నరసింహారావు ”వాల్మీకి బోయవాడేనా?” అన్న శీర్షికతో నవ తెలంగాణలో అచ్చయిన నా వ్యాసానికి స్పందిస్తూ ”వాల్మీకి రామాయణంలో ఏముంది?” శీర్షికన మరో వ్యాసం రాశారు. వాల్మీకిని బోయవాడుగా ఎందుకు చేశారు? అనే నా ప్రశ్నకి సమాధానం అన్నట్టు రామాయణం రాసినవాడు బోయవాడా? బ్రాహ్మణుడా అనే కంటే ఆయన రామాయణంలో ఏముంది? అది ఎందుకు అవశ్యపఠనీయం? అనే దృష్టితో పటిస్తేకానీ దానిలోని తత్వం బోధపడదు అంటూ సెలవిచ్చారు. దరిమిలా రామాయణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను. నా అజ్ఞానాన్ని మరోసారి రామాయణ పారాయణంతో కడిగేసుకుందామనీ కృషిచేసాను. లాభంలేకపోయింది! తిరిగేసి మర్రేసి చదివినా నరసింహరావుగారు అన్న మంత్ర పూతం, ఉపనిషత్‌ సారం, అంత:కరణ శుద్ది మహత్వం ఏమీ కనిపించలేదు. పైగా రామాయణం చదివినంతసేపు మనోవేదనకు గురియ్యాను. ఈ కావ్యం శూద్రాతి శూద్ర కులాలను/జాతులను ఘోరంగా అవమానించింది. బాలకాండ మొదలుకొని యుద్దకాండ వరకు (పూర్వ ఉత్తరాకాండ సహా) బ్రాహ్మణాధిక్యత, ఆర్య రాజ్య విస్తరణ తప్ప మరో శాస్త్ర మర్మం నాకు ఇందులో కనిపించలేదు.
రామాయణం, వర్ణ ధర్మాన్ని కాపాడటానికి వ్రాయబడ్డదని ఇప్పటికే మహాత్మాపూలే, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి సవివరణాత్మకంగా నిరూపించారు. అయినా వీరి వాధనలతో తృప్తి చెందకనే రామాయణం సభక్తితో పఠిస్తుంటే భక్తిరసం భగమై జాతి వివక్ష, అకారణ హింస నా జాతి కడగండ్లు కండ్లముందు సాక్షాత్కారమై కన్నీటి పర్యంతమయ్యాను. నా నోట ”మానిషాద…” శ్లోకం రాలేదు, నా శోకమూ ఆరలేదు. రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలో వాల్మీకి ఫలశ్రుతిని ఇలా చెప్పారు ”పఠన్‌ ద్విజో వాగృష భత్వమీయాత్‌/ స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్‌/వణిగ్జన: పణ్యఫలత్వ మీయాత్‌/ జనశ్చశూద్రో2పి మహత్వమీయాత్‌” అనగా ”రామాయణం పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములలోనూ పండితులగుదురు. క్షత్రియులు, రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభము కలుగును.
శూద్రులు పై వారికి సేవ చేసిన మహత్వమును పొందుదురు”. వివిక్ష ఎంత స్పష్టంగా ఉందో పై శ్లోకమే రూఢి చేస్తుంది. రామాయణం పఠించినా శూద్రుడు పండితుడు కాలేడు. రాజ్యాధికార ప్రసక్తి లేనేలేదని పై వాక్యాలు స్పష్టంగానే ప్రవచిస్తున్నాయి. అందరికీ రామాయణం ఒకే ఫలాన్ని ఎందుకు ఇవ్వడంలేదు? ఆ కావ్యానికి ఆ వాల్మీకికి ఎందుకింత వివిక్ష శూద్రులమీద ఈ విషయాలేమీ తెలుసుకోలేక ప్రస్తుతం శూద్రులే (బి.సి.లు) ఈ రామాయణాన్ని, ఆ దేవుడ్ని భుజాలు కాయలు కాసేలా మోస్తున్నారు. వాస్తవాన్ని జాతికి తెలియజేయాల్సిన అవసరం
ఉన్నదనేదే నా వ్యాస ఫలశృతి. జ్వాలా నరసింహారావుకి చివరికి ఇందులో గాయత్రి మంత్ర మహత్వం గోచరించింది. ఆయన ఈ విషయాన్ని తన వ్యాసంలో వివరించారు. వనం వారిది ఆర్య బ్రాహ్మణ దృష్టి. మసి పూసి మారేడుకాయలు చేసే జంతర్‌మంతర వాదన. శూద్రునికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అని ఆలోచించే బదులు గాయత్రి చివరి అక్షరంతో ముగించాడని పై శ్లోకానికి పవిత్రత, ఆధ్యాత్మికత జోడించే ప్రయత్నం చేశాడు. ఇదే మనువాదం, మయావాదం. ఇంకా వనం వారికి జ్ఞానోదయం కలిగించే శ్లోకం అదే సర్గ నుండి ”చాతుర్వర్ణ్యం చ లోకే 2 అస్మిన్‌ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి” అంటే చాతుర్వర్ణ్యాలను సధర్మంగా నడపడమే రామాయణపు అంతిమ లక్ష్యం. రాముడు, బ్రాహ్మణులకు ఎందుకింత ప్రీతిపాత్రుడయ్యాడు? అతనికి ఎందుకంతగా దైవకత్వాన్ని ఆపాదించారు. ఈ ప్రశ్నకు బాలకాండలోనే మళ్ళీ సమాధానం దొరుకుతుంది. ”గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకమ్‌/ అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశా:” దీనిర్ధం కోట్లాది గోవులను అపరిమితమైన ధనధాన్యములను రాముడు, బ్రాహ్మణులకు దానిమిచ్చును. కేవలం ఆర్యుడైనందుకేకాదు బ్రాహ్మణులకు సంతర్పణలు సజావుగా సాగించినందుకు ఆయన దైవత్వాన్ని పొందాడు.
అసలు బ్రాహ్మణ రక్షణార్దమే జన్మించానని శ్రీరాముడు ప్రకటించినందుకు ఆయన్ని దేవుణ్ణి ఆ కావ్యాన్ని మహత్వం గల రచనగా వృద్ది చేసి ప్రచారం చేసి కట్టుకథలకు రంగులు పూసిన ఘటికులు ఈ ఆర్య బ్రాహ్మణులు. రాముడు పితృవాక్య పాలకుడు అంటారు. అంటే బ్రాహ్మణులను నెత్తికెత్తుకొనేవాడని అసలు రహస్యం. బయటకు చెప్పేది అంతగా సరిపోయేలాలేదనడానికి ఈ కావ్యంలోనే సాక్ష్యాలున్నాయి. కోసలను పరిపాలించిన దశరధుడు అతని రాజధాని అయోద్య, ఆయన పాలనలోని ప్రజా వర్ణన మనకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అయోధ్యను ఎవరు నిర్మించారు? ”అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా/ మనునా మానవేంద్రేణయాపురీ నిర్మితా స్వయమ్‌” మనువు నిర్మించాడని రామాయణం చెబుతుంది. మనువు నిర్మించిన నగరంలో మూలవాసి బహుజనులకు ఏ స్థానం ఉంటుందో గ్రహించడం పెద్ద కష్టమేమీకాదు. ఇంతటి కుల వివక్షకు భారతీయ సమాజ విధ్వంసానికి కారకుడైన మనవు నిర్మించిన పట్టణంలో శూద్రుల పరిస్థితిని సులభంగానే పసిగట్టగలం. ఆ నగరంలోని బ్రాహ్మణులు మహా పండితులట. క్షత్రియులు, బ్రాహ్మణుల యెడల గౌరవము కలిగి ఉండేవారట. వర్ణ సంకరులు లేనేలేరట (కశ్చిదాసీ దయోధ్యాయాం న చ నిర్వృత్త సంకర:) అంటే వర్ణ వ్యవస్థను చాలా భద్రంగా కాపాడుకున్నరాజు దశరధుడు. వర్ణ సంకరం తప్పా? తప్పనే చెబుతుంది రామాయణం. అంతటి మహాపట్టణంలో నా ప్రజలు ఎంతటి గౌరవాన్ని పొందారోనని మరింత కుతూహలంతో ఇంకా శ్రద్దగా చదివాను. అయ్యో! గుండె లక్షముక్కలయ్యింది. ఇప్పుడు కన్నీళ్ళ బదులు నెత్తురు కారే వాతావరణం నెలకొన్నది. ”శూద్రా: స్వధర్మనిరతా: త్రీన్‌ వర్ణానుపచారిణ:” అంటూ శ్లోకం తగలనే తగిలింది. ప్రొ|| కంచె ఐలయ్య చెప్పినట్టు ”స్వయం గౌరవంలేని జీవితాలనే మాకు తగిలించారు తప్ప వృత్తి గౌరవంగానీ సామాజిక గౌరవంగానీ ఈ జాతులకు కల్పించే ఔదార్యం ఈ బ్రాహ్మణ గ్రంధాలకు గానీ, బ్రాహ్మణ రచయితలకుగానీ లేదు”. ఇంతకీ పై పద్యానికి అర్ధం ఏమిటంటే అయోధ్యనగరంలోని శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచూ, పై మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని సేవించిచుండెడివారు. ఈ శ్లోకార్ధం బోధపడ్డాక మనస్సు కకలావికలంకాక మరేమవుతుంది. నెత్తురు సలసలకాగింది. కడలి కల్లోలం అయ్యింది.
వనం వారు ఈ ఆక్రోశాన్ని, ఆవేదనను, తీవ్రవాదమో, నాస్తికవాదమో, చాదస్తమోనని కొట్టిపారేస్తారేమో!? విషయానికొస్తే దశరధుడు ఏ విధంగానైతే వర్ణ ధర్మాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ప్రశ్నేలేని శిక్షలు విధిస్తూ రాజ్య పాలన చేశాడో, రాముడు కూడా అలాగే నూటికి నూరు పాలు ఆచరించి చూపాడు. అందుకే ఆయన పితృవాక్య పాలకుడయ్యాడు. నా వాదానికి బలమైన సాక్ష్యాన్ని రామాయణంలో బాలకాండ నుండే గ్రహించాను. రాముడు, తాటకను సంహరించే సందర్భంలో ”గో బ్రాహ్మణ హితార్ధాయ దేశస్యాస్య సుఖాయచ / తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముద్యత:” అంటాడు. ఈ శ్లోక భావము ఏమంటే గో రక్షణము, బ్రాహ్మణుల హితము… కొరకు మీ వచనమును (మాటలను) పాటించుచూ ఈ తాటకను చంపుటకు పూనుకొనుచున్నాను అని రాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఇదే పితృవాక్య పాలన అంటే. (పితుర్వచన నిర్దేశాత్‌, పితుర్వచన గౌరవాత్‌). ఇంకా స్పష్టత కావాలంటారా వనం నరసింహారావు పండితోత్తమా!? ఈ దేశ మూలవాసి మహారాణి, నేటి శూద్రాతిశూద్ర కులాల ప్రతినిధి అయిన తాటకిని చంపడం పితృవాక్య పాలనేనా? అంటే స్త్రీలను చంపటం, మాతృస్వామ్య రాజ్యాలను ద్వంసం చేయడం పితృవాక్యపాలనన్నమాట. అలాగే మాతృస్వామ్య వ్యవస్థ నిర్మాతలైన మూలవాసీ భారతీయ తత్త్వ విరోధి, విద్వంశకుడు, పితృస్వామ్య పాలకుడు ఈ దేశ స్త్రీలకు ఎలా దైవంగా మారాడే నేటి మహిళా మేధావులకు ఇంకా బోధపడకపోవడానికి కారణం? అలాగే ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి రామాయణ పఠనమే అవశ్యకర్తవ్యమని ప్రబోధించాడు మహానుభావుడు వనం జ్వాలా నర్సింహారావు. ఈలోకంలోనే ఇలా వెట్టి చాకిరీతో సుఖపెట్టిన శూద్రాతి శూద్ర జాతులను పరలోకంలో ఎంత సుఖపెడతారో చాలానే అర్దమవుతుంది. దశరధుని రాజ్యంలో బ్రాహ్మణుల భోగలాలసత్వానికి, ధనధాన్యాలకు, గోదానాలకు, కొదవేలేదు. బ్రాహ్మణుల ఆదిక్యతను తెలిపే కథను ఒకదాన్ని రామాయణ బాలకాండ వివరిస్తుంది. అది ”రుష్యశృంగుని కథ” పూర్వం అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలించే క్రమంలో అతడు ధర్మం తప్పాడట. ధర్మం తప్పడం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచకపోవడం, వర్ణ ధర్మాన్ని పాటించకపోవడం. బహుశా రోమపాదుడు సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి చూపెట్టి ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలు లేక కరువు వచ్చిందట. దానికి కారణం వర్ణ ధర్మాన్ని విస్మరించడమేనని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. రోమపాదుడు బుద్దిష్ట్‌ లేదా జైనమతస్తుడై ఉంటాడు. ఆ ప్రచారంతో రాజ్యంలో కలకలం రేగేలా చేశారు. దానికి పరిష్కారం బ్రాహ్మణుడు, యజ్ఞకర్మల్లో నిష్ణాతుడైన రుష్యశృంగున్ని ఆహ్వానించి యజ్ఞం చేయించడమేనని నమ్మబలికారు.
చివరికి రోమపాదుడు బ్రాహ్మణ తంత్రానికి తలొగ్గక తప్పలేదు. రుష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షం భీకరంగా కురిసిందట. దానికి రాజు తృప్తిపడి విపరీత దానాలతో పాటు కూతురునిచ్చి వివాహం చేశాడట. ఈ మోసపూరిత కథ ద్వారా వారిచ్చే సందేశం ఏమంటే బ్రాహ్మణులు పరమ పవిత్రులని. వారు రాజ్యంలో ఉంటే రాజ్యంలో వర్షాలు కురవడం, సుభిక్షంగా ఉండటం. ఇక్కడ రెండు ప్రశ్నలు 1) వర్ణ సంకరాన్ని వ్యతిరేకించే రామాయణం, బ్రాహ్మణుడైన రుష్య శృంగునికి క్షత్రియుడైన రోమపాదుడు కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఎలా సమర్ధించింది? 2) వర్ణ సంకరమే రుచించని దశరధుడు, వర్ణ సంకరానికి పాల్పడిన రుష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం ఎలా చేశాడు? అప్పుడు దశరధుని గురించి రామాయణం చెప్పింది శుద్ద తప్పు కదా? ఈ కథను ప్రచారం చేసి మొత్తం రాజ్యంలోని బ్రాహ్మణులు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఉన్నత స్థానం బ్రాహ్మణులకిచ్చి నీచస్థానం శూద్రులకిచ్చిన రామాయణం నరసింహారావుగారు అన్నట్టు నా చాలా సందేహాలను నివృత్తి చేసింది. రామాయణం ద్వారా ఆర్యులు సాధించదలచుకున్న ప్రయోజనాలు చాల ానే
ఉన్నాయి. మాతృస్వామ్యాన్ని నాశనం చేయడం, క్షత్రియులపైన స్థానాన్ని ఆక్రమించుకోవడం (క్షత్రియుల స్థానాన్ని దిగువకు నెట్టివేయడం రామాయణంలో చాలా చోట్ల కన్పిస్తుంది)” మరో ముఖ్యమైన ప్రయోజనం మూలవాసి చక్రవర్తులను హతమార్చి ధర్మ పరిరక్షకులుగా కీర్తించబడటం. డా|| ఎస్‌.వి. రారు ”సింధూ నాగరికతకు ప్రధానమైన మొహెంజోదారోను జయించడానికి ఆర్యులు చేసిన యుద్దం చుట్టూ రామకథను అల్లారు” అంటాడు. అంతేగాక దక్షిణ భారతదేశంలోకి ఆర్య సంస్కృతిని, ఆర్యుల దురాక్రమణను పరోక్ష రూపంలో వనవాసం పేరుతో దండయాత్రగా సాగించాడు రాముడు. అందుకు వాల్మీకి రామాయణంలోని బాలకాండనే ప్రత్యక్షసాక్ష్యం. రాముడు తనసహచరి సీతతో, లక్ష్మణుని కలుపుకుని దండకారణ్యంలోకి ప్రవేశించాడు. నేటి దండకారణ్యమే ఆనాటిది కూడా. ఆ దండకారణ్యంలోకి రాముడు ఎందుకు ప్రవేశిస్తాడు. ఆరాజ్యం రాముడిది కాదు.
పరాయి రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించే అర్హత మరో రాజుకు ఉంటుందా? ఇది రాజనీతి అవుతుందా? మూల వాసీ చక్రవర్తి రావణుడు ఆ రాజ్యాధిపతి. అందుకు ఈ శ్లోకమే నిర్ధారణ. ”తేన తత్రైవ వసతా జనస్థాన వాసినీ” (బాలకాండ 1వ సర్గ 46వ శ్లోకం) దండకారణ్యంలో జనస్థానమనే ప్రాంతం ఉంది. అది రావణుని రాజ్యంలో భాగం.
ఆ రాజ్యానికి శూర్పణఖ రక్షకాధిపతి. ఆ ప్రాంతంలో ఆర్యులు అక్రమంగా ఆశ్రమాల నెపంతో దురాక్రమణ చేస్తుంటే సహజంగానే శూర్పణఖ వారిని తరిమి కొడుతుంది. ఇది ఏరాజైనా, రాణైనా చేసే రాజనీతి. ఆర్యులు వెంటనే దండకారణ్య సమీపంలోని రామున్ని దర్శించారు. రెచ్చగొట్టారు. రాముడు దండకార్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతం నుండి రక్షసులను (రాక్షసులనేది వారి భాష) ఆ ప్రాంతం నుండి తరిమి వేస్తానని ప్రతినబూనాడు. దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే సహజంగా రక్షసులు వీరి ప్రవేశాన్ని ఎదిరించారు. వరుసగా అడ్డుకున్నవారందరిని హతమార్చాడు రాముడు. క్రూరాతిక్రూరంగా రాజనీతికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఈ హింసాకాండ జరుగుతున్న తీరుకు సీత చలించిపోయింది. ఎంతైనా తల్లి హృదయం కదా! ఆమె, రాముణ్ణి నివారించే ప్రయత్నం చేసింది. అకారణంగా ఈ అటవీ రక్షకులను సంహరించడం అన్యాయం అని అర్దించింది. ఈ సందర్భంలో సీతామాత పలికిన దయార్ద్ర వచనములు రామునికి చెవికెక్కలేదు. ”ప్రతిజ్ఞా తస్త్వయా, వీర! దండకారణ్య వాసినామ్‌/ ఋషీణాం రక్షణార్ధాయా వధస్సంయతి రక్షసామ్‌” ఇది దండకారణ్యమ్‌ ఇది వారి నివాస స్థలం (రాక్షసులు). వారు ఇక్కడ నివసించడమే ధర్మం. వారి ప్రాంతంలోనికి అనధికారికంగా ప్రవేశించి వారినే సంహరించడం అధర్మం. ఏ వైర భావం లేకున్నను వీరిని హతమార్చుట తగునా? అని ప్రశ్నించడమే పై శ్లోకం. సీత మరింత లోతుగా న్యాయాన్యాయ వివేచన, ధర్మాధర్మ ఆచరణ నిబద్దతను స్పృశించింది. ”క్వచ శస్త్రం క్వచ వనం క్వచక్షాత్రం తప: క్వచ/ వ్యావిద్దమిదమ స్మాభి: దేశ ధర్మస్తు పూజ్యతామ్‌” (అరణ్యకాండ తొమ్మిదో సర్గ 27వ శ్లోకం). అంటే మనమిప్పుడు వనవాసంలో ఉన్నాం. వన జీవన ధర్మమగు తప: వృత్తిని ఆచరించాలి. అలా కాక అస్త్రము ధరించి ఇలా హత్యా కాండకు పూనుకొనడం సరికాదు. శస్త్రదారణమెక్కడీ వనవాసమెక్కడీ క్షత్రియ ధర్మమెక్కడీ తపో వృత్తి యెక్కడీ ఇవి పరస్పర విరుద్దములు. కావాలంటే అయోధ్య చేరిన తరువాత వనవాసం ముగిసిన వెంటనే మీ క్షత్రియ ధర్మమైన యుద్దాన్ని కొనసాగించండి అంటూ మరోసారి ధర్మ పరిశీలన చేసింది.
ఈ మాటలు రాముడికి వంటబట్టలేదు. బ్రాహ్మణులకు మాట యిచ్చాను. ఏదిఏమైనా ఈ రాక్షసులను హతమార్చి తీరుతాను అంటూ ఆమె నోరు మూయించాడు. దండకారణ్య ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకే రాముడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోయించాడు. కామరూపత అనేది వట్టి శాకు. పిచ్చికుక్కను చేసి చంపే కుట్ర ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఆ దండకారణ్య సైనాన్ని శ్రీరాముడు ఊచకోత కోశాడు.
(బాలకాండ 1వ సర్గ శ్లోకం 48) ”వనే తస్మిన్‌ నివసతా జనస్థాన నివాసినామ్‌ / రక్షసాం నిహతాన్యాసన్‌ సహస్రాణి చతుర్ధశ”. అనగా ఖరుడు, ధూషణుడు, త్రిశరుడు మొ|| వీర యోధులను దాదాపు 14 వేల మంది సైనాన్ని హతమార్చారు రామ లక్ష్మణులు. అక్రమంగా తమ రాజ్యంలోనికి ప్రవేశించి తమ సోదరి ముక్కు చెవులు కోసి 14 వేల మంది తమ సైన్యాన్ని నెత్తుటి యేరులో ముంచి నరమేదం సృష్టించినా రావణుడికి కోపం రాకూడదా? ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న కవ్వింపు చర్యలే ఆనాటి ఆర్యులు చేసిన ఉదంతం ఇది. కాదంటారా నరసింహారావు తత్వ వివేచకా?! దీన్ని మాబోటి శూద్రులు ఏ దృష్టితో పారాయణం చేయమంటారు? ఈ నరమేధాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారు? తప్పొప్పులను ఏ మర్మాలతో అంచనా కట్టమంటారు.
దీనికి కారణం ఏ వాల్మీక దృక్ఫధం నిర్వచిస్తుంది. చివరగా వాల్మీకి బోయవాడా? కాదా? తేల్చేందుకు నరసింహారావు ఒక కథను ఉటంకించారు. అందులో ఋషులకు ఎదురైన వాల్మీకిని నీచ బ్రాహ్మణుడా? అంటూ సంభోదిస్తారు. బోయవాని వేషంలో ఉన్న వాల్మీకిని బోయవాడా అని సంబోధించక బ్రాహ్మణుడా అని సంబోధించడంలోని మర్మమేమంటారు జ్వాలాగారు? ఇకనైనా చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని శూద్రాతి శూద్రులకు ఈ ఆర్య గ్రంధాలు చేసిన అపరాదాన్ని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రంధాల్లోని కుట్రలను గ్రహించి బహుజనులు ఏకమై రాజ్యాధికారం దిశగా సాగాలి. ఇదే పరిష్కారం.

డాక్టర్‌ కదిరె కృష్ణ పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

370 ఆర్టికల్‌పై కాషాయ సేన అబద్ద ప్రచారాలు- వాస్తవాలు !

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

370 article, Article 370, BJP, Indian constitution, saffron trolls lies- facts

Image result for 370 article,saffron trolls

-కె ఎల్‌ కాంతారావు

ఈ మధ్యన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధిం చిన వాస్తవాలను తెలుసుకుందాం.

మొదటి అబద్ధం : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం.
వాస్తవం : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.

రెండవ అబద్ధం : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.
వాస్తవం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయా లు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్‌ లోని కచ్‌ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్‌ కు, 371-ఎఫ్‌ సిక్కింకు, 371-హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్‌ 370 జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్‌ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్‌ 371ఎ, ఆర్టికల్‌ 371-జి ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు? ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి. అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు. వాస్తవం ఇది కాగా, ఆర్టికల్‌ 370 ఒకటే ప్రమాదకరమనీ, దానిని ఎత్తివేయాలనీ ప్రచారం చేయడం వాస్తవాన్ని వక్రీకరించడమే.

అబద్ధం 3 : ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్‌ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమర యోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!

అబద్ధం 4 : సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో ‘జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం’ అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

అబద్ధం 5 : జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్‌ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్‌ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్‌ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.

అబద్ధం 6 : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించ బడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, లెహ్ ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంకూర్‌ శర్మ అనే న్యాయవాది జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, ‘జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?’ అని. దానికి ఆ రాష్ట్రంలోని పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ‘హిందువులను మైనారిటీ లుగా గుర్తించం’ అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం గానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం ఎంత మోసపూరితం?

ఇలా ఆర్టికల్‌-370 ద్వారా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ అబద్ధ ప్రచారాలు చేసి, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోన్న వారి పట్ల దేశ భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, వారి విద్వేష ప్రచారాన్ని, విద్రోహ చర్యలను అరికట్టడమే నేటి తక్షణ కర్తవ్యం.

కెఎల్‌ కాంతారావు పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విదేశీ అప్పు- నరేంద్రమోడీ భక్తుల తిప్పలు !

08 Sunday Jul 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India’s External Debt, RBI, Rupee Fall, value of the rupee

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ముందస్తు ఎన్నికల కోసం కనీస మద్దతు ధరల పెంపు ఆలస్యం చేశారా ?

06 Friday Jul 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Prices

≈ 1 Comment

Tags

Farm prices, loksabha midterm elections, MSP, msp announcement, NAENDRAMODI

Image result for why narendra modi delayed msp announcement

ఎం కోటేశ్వరరావు

ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాశారు. ఇది ముందస్తు ఎన్నికల తరుణమని అందుకే నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు.వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలోనే సమర్పించింది. రేపేమవుతుందో తెలియని స్ధితిలో వున్నంతలో ఏ పంటకు ధర ఆకర్షణీయంగా వుంటే రైతాంగం వాటిని ఎంచుకొనేందుకు వీలుగా సాగుకు ముందే ప్రకటించాల్సిన వాటిని సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత కేంద్రం ప్రకటించింది. ఎన్నికల కోసం ఆలస్యం చేశారని విమర్శకులు తప్పుపడితే ఆశ్చర్యం ఏముంది, తప్పేముంది?

వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసింది, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు. అంటే స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరిగినట్లే రైతాంగం భావించాలి. సగటు వుత్పత్తి ధరపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) నిర్ణయించాలన్నది 2004-06 మధ్య కాలంలో ఆయన సమర్పించిన నివేదికలలో చేసిన సిఫార్సులలో ఒకటి. దానిని ఇప్పుడు అమలు చేశామని మోడీ, బిజెపి నేతలు చెబుతున్నారు. దీన్ని అమలు జరిపేందుకు ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్రహోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇంత స్వల్ప భారం మాత్రమే పడేదానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న.

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారం, వాదన, ధరల నిర్ణయానికి తీసుకున్న ప్రాతిపదికలు మోసపూరితమైనవని ఆలిండియా కిసాన్‌సభ వంటి సంస్ధలు పేర్కొన్నాయి. ఎన్నికల తాయిలం అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. క్వింటాలు ధాన్యం వుత్పత్తికి రైతుకు రు.1166 ఖర్చు అవుతుందని లెక్కగట్టి దాని మీద యాభైశాతం కలిపితే రు. 1750 వచ్చేందుకు గాను గత ఏడాది వున్న ధరమీద 200 రూపాయలు పెంచారు. ఇలాగే మిగతా పంటల ధరలను నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలలో ఒకే పంటల వాస్తవ సాగు వ్యయం భిన్నంగా వుంటుంది. అందువలన కేంద్రం ప్రాతిపదికగా తీసుకున్న ధర శాస్త్రీయమైనది కాదన్నది స్పష్టం. తెలంగాణాలో వాస్తవ వ్యయం క్వింటాలుకు రు2,158 అని వ్యవసాయశాఖ లెక్క కడితే కేంద్రం తీసుకున్న సగటు ప్రాతిపదిక రు. 1166, నిర్ణయించిన ధర రు. 1745. ఇలాగే అన్ని పంటల విషయంలోనూ జరిగింది. పత్తి (పొట్టి, మధ్య రకం పింజ) సాగు ఖర్చు రు.3433 గా లెక్కించి మద్దతు ధరను రు.5150గానూ పొడవు పింజ( తెలుగు రాష్ట్రాలలో పండించే రకాలు)కు రు.5450గా నిర్ణయించారు. ఇవి వాస్తవ ఖర్చును ప్రతిబింబించేవి కాదన్నది వేరే చెప్పనవసరం లేదు.

ధరల నిర్ణయ ప్రాతిపదికలోపాల తీరుతెన్నులను చూద్దాం.వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును లెక్కించేందుకు ఎంచుకున్న పద్దతిలోనే లోపం వుంది. అది మూడు రకాలగా ఖర్చులను చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తికి అది రు.865 వాస్తవ ఖర్చు ఎ2, రు.1166 వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, రు 1560 సి2( దీనిలో వాస్తవఖర్చు ఎ2, రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు సి2, అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బడుదు ఎ2ప్లస్‌ ఎఫ్‌ల్‌ 1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని కేంద్రం నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.కేరళ ధాన్యానికి క్వింటాలుకు రు.780 బోనస్‌గా ఇస్తోంది.1016-17లో కేరళలో రోజు వారీ వ్యవసాయ కార్మికుల సగటు వేతనం రు. 673 కాగా దేశ సగటు 270, అంతకంటే ఎక్కువగా తమిళనాడు 411, హిమచలప్రదేశ్‌ 394, హర్యానా 365, పంజాబ్‌ 314, కర్ణాటక 318, రాజస్ధాన్‌ 281, ఆంధ్రప్రదేశ్‌ 276లు దేశ సగటు కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్‌ 259, మహారాష్ట్ర 258, అసోం 256, యుపి 249, బీహార్‌ 230, గుజరాత్‌ 223, ఒడిసా 217 ఎంపీ 202 ఇస్తున్నాయి. ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతటికీ రూళ్ల కర్ర సిద్ధాంతాన్ని అమలు జరపటం శాస్త్రీయం అవుతుందా?

కనీస మద్దతు ధరలను నిర్ణయించటం ఒక ఎత్తు. దానిలో లోపాల సంగతి చూశాము. వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. కొన్ని పంటల ధరలు కనీస మద్దతు కంటే ఎక్కువ వుంటున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. కనీస మద్దతు కంటే ధరపడిపోయినపుడు సిసిఐ రంగంలోకి వచ్చి మద్దతు ధరకే పరిమితం అవుతోంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. కొన్ని త్రైమాసిక సగటు ధరలను చూసినపుడు కొన్ని సార్లు దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువగానూ, కొన్నిసార్లు తక్కువగానూ వున్నాయి. ఐదేండ్ల సగటు స్వల్పంగా ఎక్కువగా వున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సార్లు రైతాంగాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రభుత్వ నియంత్రణల విధానానికి స్వస్తిపలికినట్లు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన వుదంతాలు వున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది. అదే ఏడాది ఆగస్టు నెలలో ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతులను అనుమతించింది. ఒక వైపు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. కొన్ని సంవత్సరాలు ఐదు, పదిశాతం దిగుమతి విధిస్తే కొన్నేండ్లు ఎలాంటి పన్ను లేకుండా అనుమతించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా దిగుమతులను గణనీయంగా తగ్గించిందని చెబుతున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ నరేంద్రమోడీ సర్కార్‌, సంఘపరివార్‌ నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పత్తి దిగుమతులపై ప్రభావం చూపిందా అన్న కోణంలో కూడా ఆలోచించటం అవసరం. వ్యవసాయ మన రైతాంగానికి గిట్టుబాటు గాకపోవటానికి ప్రభుత్వాలు పెట్టుబడిని తగ్గించటమే. దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుంది. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట             ప్రపంచ సగటు     గరిష్టం               భారత్‌                రాష్ట్రాలు

ధాన్యం           4,636.6      చైనా6,932.4      2,400.2      పంజాబ్‌ 3974.1

మొక్కజన్న     5,640.1      అమెరికా10960.4  2,567.7      తమిళనాడు 7010

పప్పులు         731.2       ఆస్ట్రేలియా 5540.3    656.2       గుజరాత్‌ 931

కందిపప్పు       829.9      కెన్యా 1612.3         646.1       గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌      2,755.6    అమెరికా 3,500.6     738.4         ఎంపి 831

వేరుశనగ      1,5,90.1      అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు మొక్క జన్నల ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు ఎగుమతి చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. వాటిని అమలు జరిపిన దిక్కులేదు. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

చివరిగా మోడీ సర్కార్‌ ప్రకటన ఎన్నికలకోసం చేసినదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి జిమ్మిక్కులు గత యుపిఏ ప్రభుత్వం చేసింది. అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,33300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంక్షలతో భారత్‌కు వుచ్చు బిగిస్తున్న అమెరికా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

direct and indirect sanctions, Donald trump, Donald trump trade war, NATO, TRADE WAR, us encircling india, US SANCTIONS, US-CHINA TRADE WAR

Image result for nikki haley,modi meet

ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే, ప్రధాని నరేంద్రమోడీ

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరు, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ! చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూరించిన వాణిజ్య సమర భేరి దాడులకు నాంది పలికే గడువు అది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానట్లయితే ఆ దినం నుంచి చైనా వస్తువులపై ప్రకటించిన పన్ను పెంపుదల అమలులోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు నిజంగా వాణిజ్య యుద్ధం జరుగుతుందా? సర్దుబాటు చేసుకుంటారా అన్న పద్దతిలో సాగిన విశ్లేషణలు ఇప్పుడు నిజంగానే జరుగుతుందని, జరిగితే ఎంత విలువ వుంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద చూపే ప్రభావాలు ఎలా వుంటాయనే వైపు మళ్లాయి. ఒక లక్ష బిలియన్‌ డాలర్ల వరకు వుంటుందని ఒక అంచనా. వాణిజ్య యుద్ధం వ్యాపారలావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు. అనేక రంగాలను అది ప్రభావితం చేస్తుంది.

గత కొద్ది రోజులుగా ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు, చర్యలు కేవలం వాణిజ్య యుద్ధానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ దేశాల సమీకరణలను వేగవంతం చేస్తున్నాయా ? వాటి స్వభావమేమిటి ? పర్యవసానాలు ఎలా వుంటాయన్నది ప్రపంచమంతా వుగ్గపట్టుకొని ఆసక్తితో చూస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మా మిత్ర దేశాలు కూడా పాటించాల్సిందే, లేకుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరికీ మినహాయింపులు లేవు అని ట్రంప్‌ చేసిన ప్రకటనతో నరేంద్రమోడీ సర్కార్‌ ఏం చేయాలో తోచక కాళ్లు తొక్కుకుంటున్నది. చిన్నది కావచ్చుగానీ ఐరోపా యూనియన్‌ కూడా చైనా మాదిరి చెడ్డదే. చూడు మక్రాన్‌ మనిద్దరికీ చైనా సమస్య వుంది కనుక కలసి పని చేద్దాం, చైనా కంటే ఐరోపా యూనియన్‌ అధ్వాన్నంగా వుంది, నాఫ్టా ఎంత చెడ్డదో నాటో కూడా అలాంటిదే, అది అమెరికాకు భరించరాని ప్రియంగా వుంది. ఇవన్నీ ట్రంప్‌ బహిరంగంగా చేసినవీ, అంతర్గత సంభాషణల్లో వెల్లడించిన అభిప్రాయాలుగా మీడియాలో తిరుగుతున్నవి. ప్రపంచ దేశాల మీద అమెరికా ఒక్క వాణిజ్యయుద్ధానికే పరిమితం కాలేదు, ఇతర రంగాలలో కూడా తన పెత్తనాన్ని, భారాలను రుద్దేందుకు పూనుకుంది అన్నది స్పష్టం. నాటో కూటమికి అయ్యే ఖర్చును సభ్య దేశాలన్నీ భరిస్తాయో లేదో చెప్పాలంటూ ఐరోపా దేశాలకు జూన్‌ నెలలో ట్రంప్‌ లేఖలు రాశాడు.

కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మన విదేశాంగ విధానాన్ని నిర్దేశించేది మన ప్రభుత్వమా లేక డోనాల్డ్‌ ట్రంపా అన్న అనుమానం తలెత్తక మానదు. నరేంద్రమోడీ సర్కార్‌ పులిలా గాండ్రించి చివరికి పిల్లిలా మ్యావ్‌ మ్యావ్‌ మంటూ తోకముడుస్తోంది. ఇరాన్‌తో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. ఆంక్షలను అమలు జరుపుతామని ప్రకటించింది. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ ఏకపక్షంగా అమెరికా ప్రకటించిన ఆంక్షలను భారత్‌ పరిగణనలోకి తీసుకోదని ఐక్యరాజ్య సమితి వాటినే గుర్తిస్తుందని ప్రకటించారు. అలాంటిది నెల రోజులు కూడా గడవక ముందే నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చింది, అదీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారీ నికీహాలే ఢిల్లీ పర్యటన మరుసటి రోజే కావటం గమనించాల్సిన అంశం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీని అమలులోకి వస్తాయి. అప్పటికి ఇరాన్‌ నుంచి గణనీయంగా దిగుమతులను తగ్గించుకోవటం లేదా పూర్తిగా మానుకోవాలని చమురుశుద్ధి కర్మాగారాలకు మన చమురు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయన్నది చమురు రంగ విశ్లేషకుల అభిప్రాయం.ఇరాన్‌తో చమురులావాదేవీలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇరాన్‌ చమురుతో ప్రయాణించే నౌకలు లేదా దానిని శుద్ధి చేసే కర్మాగారాలకు బీమా వర్తింప చేయబోమని ఆ కంపెనీలు ప్రకటించేఆలోచనలో వున్నాయి. ఇరాన్‌ మనకు కొన్ని రాయితీలు ఇస్తున్నది. వాటిని వదులుకొని ఇతర దేశాల దగ్గర కొనటం అంటే అమెరికాను సంతృప్తిపరచటమే కాదు, అందుకోసం మన జనం మీద భారాలు మోపేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది. ఇరాన్‌కు రూపాయిల చెల్లింపులతో మోడీ పెద్ద విజయం సాధించినట్లు ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే రూపాయల బదులు ఇతర దేశాలకు చెల్లించేందుకు మనం డాలర్లను మరింతగా సమకూర్చుకోవటం అంటే మన కరెన్సీ విలువ మరింత పతనం కావటమే. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశానికి ఆంక్షలను మినహాయించాడు. అలాంటివేమీ కుదరవని ట్రంప్‌ ప్రకటించాడు. మన దేశాన్ని తన ఆదేశాలను పాటించే పాలేరు అనుకుంటున్నాడా ? జవాబుదారీతనంతో వ్యవహరించే ఏ దేశమైనా ఇతరుల బెదిరింపులను అనుమతించని బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది. అమెరికా వత్తిడికి మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యతో పాటు దీర్ఘకాలంగా ఇరాన్‌తో వున్న సంబంధాలు ప్రమాదంలో పడటమేగాక అంతర్జాతీయంగా మన పరువు ఎక్కడ కలుస్తుందో తెలియదు. మన బలహీన దౌత్యానికి ఇది సూచిక. ఇరాన్‌ ఎగుమతి చేసే చమురులో సగాన్ని చైనా, భారత్‌, టర్కీ దిగుమతి చేసుకుంటున్నాయి.అమెరికా ఏకపక్ష ఆంక్షలను తాము ఆమోదించేది లేదని మిగిలిన రెండు దేశాలు ప్రకటించాయి.

అనేక దేశాల మధ్య తంపులు పెట్టి, రెచ్చగొట్టి అటూ ఇటూ ఆయుధాలు అమ్ముకొని లబ్దిపొందే ఎత్తుగడను అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. మన దేశం-పాకిస్ధాన్‌ విషయంలో అదే చేసి పాకిస్ధాన్‌కు పెద్ద ఆయుధ అమ్మకందారుగా మారింది. సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత తరువాత మన పాలకులు అమెరికాకు దగ్గర కావటంతో ఇప్పుడు పాక్‌ కంటే పెద్ద బడ్జెట్‌ వున్న మనం ఆత్మీయులుగా కనపడటం గురించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల తరబడి సోవియట్‌ ఆయుధాల మీద ఆధారపడిన మనం వెనువెంటనే అమెరికా ఆయుధాలతో మన మిలిటరీని సాయుధం చేసే అవకాశం లేదు కనుక ఇప్పటికీ ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులు కొనుగోలు చేసినట్లయితే భారత్‌ మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. మన వాయుసేన దాదాపు ఐదింటిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు దశలో వుంది. ఈనెల ఆరున భారత్‌-అమెరికా మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు విదేశాంగ, రక్షణశాఖల మంత్రుల తొలి సమావేశం జరగాల్సి వుండగా కొద్ది రోజుల ముందు అనివార్య కారణాల వలన దానిని రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పోంపియో ఏకపక్షంగా మన మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియ చేశారు. ఇరాన్‌తో సంబంధాల గురించి భారత్‌ పునరాలోచించుకోవాలని జూన్‌ 27న ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే మన ప్రధాని నరేంద్రమోడీని కలసి కోరిన సమయంలోనే ఈ సమావేశ రద్దును తెలిపారు.

దీనికి ముందుగా జూన్‌ 19న అమెరికా అంతర్గతంగా తన చట్టాలకు ఆమోదించిన సవరణల ప్రకారం రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే గతంలో వున్న అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు అవుతుంది. మన అవసరాలకు అమెరికాలో తయారైన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణి 70కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేరుతుంది. అదే రష్యా ఎస్‌ 400 క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యం కలిగినదిగా వుండటంలో నలభైవేల కోట్ల రూపాయలతో ఐదు క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ నిర్ణయించింది. దీన్ని దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించేందుకు అమెరికా బెదిరింపులకు పూనుకోవటంతో పాటు సమావేశాన్ని రద్దు చేసింది. ఇవేగాదు రష్యా నుంచి మరొక 12బిలియన్‌ డాలర్ల విలువగల ఇతర ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం వుండటంతో అమెరికా ఇలాంటి బెదిరింపులకు పూనుకున్నట్లుగా భావిస్తున్నారు.

అమెరికాకే అగ్రతాంబూలం అన్న పద్దతిలో వ్యవహరిస్తున్న ట్రంప్‌ వైఖరి నుంచి తమను కాచుకొనేందుకు గాను ఐక్యంగా వ్యవహరించాలని, ప్రపంచ వ్యవస్ధను నిలబెట్టాలని చైనా, ఐరోపా యూనియన్‌ నిర్ణయించాయి. ప్రపంచ స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధ ఏర్పాటుకు తాము సహకరించామని దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా యూనియన్‌ నేతలు చెబుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ ప్రారంభంలో రష్యన్‌ కమ్యూనిస్టులకు వాల్‌స్ట్రీట్‌ పెట్టుబడిదారులు రహస్యంగా సాయం చేశారని, 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా ప్ర వేశానికి అమెరికా సెనేట్‌ అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తన వైఖరి మార్చుకుంటే తామెందుకు అనుసరించాలని పరోక్షంగా పశ్నిస్తున్నారు. అదే కమ్యూనిస్టు చైనాతో కలసి తమ ప్రయోజనాలను రక్షించుకోవాలని వుద్బోధిస్తున్నారు. ఈ నెలలో బీజింగ్‌లో చైనా-ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఒక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి.

ఒకవైపు ఐరోపా యూనియన్‌ దేశాలపై వాణిజ్య ఆంక్షలను ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు నాటో కూటమి ఖర్చులో సింహభాగాన్ని మీరు భరిస్తారో లేదో చెప్పాలని వత్తిడి తెస్తున్నాడు.త్వరలో బ్రసెల్స్‌ సమావేశంలోగా ఏదో ఒకటి తేల్చాలంటున్నాడు. ఏప్రిల్‌లో మీ పర్యటన సందర్బంగా మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని దేశాలు వాగ్దానం చేసిన మాదిరి నిధులు కేటాయించటం లేదని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నాడు. ఐరోపా రక్షణకు మేము పెద్ద మొత్తంలో వనరులను కేటాయించటం ఇంకేమాత్రం సాధ్యం కాదని, మా దేశంలో అసంతృప్తి పెరుగుతున్నదని కూడా పేర్కొన్నాడు. నాలుగు సంవత్సరాల నాడు వేల్స్‌ సమావేశంలో ప్రతి దేశం జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని దేశభద్రతకు ఖర్చు చేయాలని అంగీకరించిన మేరకు అమలు జరపటం లేదన్నది అమెరికా ఫిర్యాదు. మిగతా దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటిది మీరు కూడా చేయాల్సిన మేరకు ఖర్చు చేయటం లేదని జర్మనీని కూడా విమర్శించాడు. విదేశాలలో అమెరికన్‌ సైనికులు ప్రాణాలు అర్పించటం లేదా తీవ్రంగా గాయపడే త్యాగాలు చేస్తున్నపుూ వుమ్మడి రక్షణ భారాన్ని కొన్ని దేశాలు ఎందుకు పంచుకోవటం లేదు అని అమెరికా పౌరులు అడుగుతుంటే సమర్ధించుకోవటం ఇంకేమాత్రం సాధ్యం కావటం లేదని కూడా ట్రంప్‌ పేర్కొన్నాడు. దక్షిణ కొరియాలో సైన్యం గురించి కూడా ఇదే వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ లేఖలపై ఐరోపాలో విమర్శలు వచ్చాయి.’ నాటో అంటే ఒక క్లబ్‌ అని, దానికి మీరు బకాయి చెల్లించకపోతే పర్యవసానాలు అనుభవిస్తారు లేదా సోమరులైన ఈ ఐరోపా వారందరూ సెలవులు గడపటానికి వచ్చి కూర్చున్నారని, వారందరినీ అమెరికా రక్షిస్తోందనే భావనలోనే ఇంకా ట్రంప్‌ వున్నట్లుగా కనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డెరెక్‌ చోలెట్‌ వ్యాఖ్యానించారు. ‘ వాణిజ్యం మీద దూకుడుగా వున్న ట్రంప్‌ వ్యాఖ్యలను ఎలా అమలు చేస్తారు, భద్రతా విషయాలలో కూడా అలాగే చేస్తారా అని ఐరోపావారు చూస్తున్నారు అని కూడా అన్నారు.

అమెరికా మొరటుగా వాణిజ్య యుద్ధానికి పూనుకుంటే అనేక దేశాలతో ఇదే విధంగా ఇతర రంగాలలో కూడా తన పెత్తందారీ, బలప్రయోగానికి పాల్పడే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య యుద్ధం జరిగితే తమకు సంభవించే లాభనష్టాల గురించి అమెరికాలో తర్జన భర్జన జరుగుతోంది. లాభం అనుకుంటే ట్రంప్‌ ముందుకు పోతాడు. వాణిజ్య యుద్ధంలో గెలిచే అవకా శాలు లేవని బలంగా వినిపిస్తున్న పూర్వరంగంలో ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభం, సమస్యలు ముదిరితే పర్యవసానాలను అంచనా వేయటం కష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మెక్సికో ఎన్నికల విజేత వామపక్షమా, సోషల్‌ డెమోక్రసీయా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

AMLO, Andres Manuel Lopez Obrad, Lopez Obrador, Mexican Lopez Obrador, MORENA, The 2018 Mexican election

Image result for 2018 mexico election, amlo

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మెక్సికోలో జరిగిన ఎన్నికలలో వామపక్షవాది ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ (ఆమ్లో) ఘన విజయం సాధించినట్లు మీడియా ప్రకటించింది. తొంభై మూడు శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అధ్యక్ష ఎన్నికలలో లోపెజ్‌కు 53శాతం, సమీప ప్రత్యర్ధులకు వరుసగా 22.5,16.4,5.1,0.1 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదుగురు అభ్యర్ధులలో ముగ్గురు మూడు కూటముల తరఫున పోటీ చేయగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు. ఓట్ల లెక్కింపు పూర్తయితే దాదాపు ఇదే శాతాలు ఖరారు కావచ్చు లేదా స్వల్పతేడాలుండవచ్చు. పార్లమెంట్‌ వుభయ సభలలో కూడా లోపెజ్‌ నాయకత్వంలోని ‘కలసి కట్టుగా మేము చరిత్రను సృష్టిస్తాం’ అనే పేరుతో ఏర్పడిన కూటమి ఐదువందల స్ధానాలున్న ఛాంబర్‌ డిప్యూటీస్‌(మన లోక్‌సభ మాదిరి)లో 312, 128 సీట్లున్న సెనెట్‌(రాజ్యసభ మాదిరి)లో 69 స్ధానాలతో సంపూర్ణమెజారిటీ సాధించవచ్చునని విశ్లేషణలు వెలువడ్డాయి. లోపెజ్‌ను ‘మెక్సికో బెర్నీశాండర్స్‌’ అని కొందరు వర్ణించారు, అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో ‘సంస్కరణవాది’ అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంట్‌, మున్సిపల్‌ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగాయి. అన్నింటా ఈ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పది నెలలు, పార్లమెంటు దిగువ సభ మూడు సంవత్సరాలు, ఎగువ సభ ఆరు సంవత్సరాల పాటు వుంటుంది.

ఈ కూటమిలో జాతీయ పునరుజ్జీవన పార్టీ,మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ, క్రైస్తవ మత మితవాదులతో నిండిన సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ వున్నాయి. పార్లమెంటులో వీటికి వరుసగా 193,54,58 వస్తాయని ఓటింగ్‌ సరళి తెలిపింది. మున్సిపల్‌ ఎన్నికలలో 80శాతంపైగా స్ధానాలు తెచ్చుకుంది. జాతీయ పునరుజ్జీవన పార్టీ నేత లోపెజ్‌ మన దేశంలో సోషలిస్టులుగా జీవితం ప్రారంభించి వివిధ పార్టీలు మారిన జార్జిఫెర్నాండెజ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి పాలకవర్గాలకు చెందిన వారితో పోల్చదగిన రాజకీయ నేపధ్యం వుంది. మెక్సికోలో 1929 నుంచి 2000 వరకు ఎలాంటి విరామం లేకుండా అధికారంలో వున్న పిఆర్‌ఐ పార్టీ కార్యకర్తగా 1976లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీపోకడలు నచ్చక దాన్నుంచి విడివడిన వారు 1986లో డెమోక్రటిక్‌ రివల్యూషన్‌ పార్టీ(పిఆర్‌డి)గా ఏర్పడ్డారు. లోపెజ్‌ 1989లో దానిలో చేరి 1994లో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేశారు.2000 సంవత్సరంలో మెక్సికో నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2005లో మేయర్‌ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ తరఫున పిఆర్‌డి, పౌర వుద్యమం, లేబర్‌ పార్టీ కూటమి తరఫున 2006 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు.స్వల్పతేడాతో ఓడిపోయారు. పిఆర్‌ఐ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అందువలన తాను ఓటమిని అంగీకరించనంటూ కొన్ని నెలలపాటు ఆందోళన నిర్వహించారు. తరువాత 2012 ఎన్నికలలో కూడా అదే కూటమి తరఫున పోటీచేసి రెండవ స్ధానం తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా తనకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ పునరుజ్జీవన వుద్యమం(మొరెనా) పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. ఓటమి తరువాత పిఆర్‌డి నుంచి విడిపోయి, అంతకు ముందు ఏర్పాటు చేసిన సంస్ధను 2014లో రాజకీయ పార్టీగా నమోదు చేశారు. ఇప్పుడు దాని నాయకత్వాన ఏర్పడిన కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.

విద్యార్ధులు, వృద్ధులకు ఆర్ధిక సాయాన్ని పెంచాలని, కొంత మంది మాదక ద్రవ్య నేరగాండ్లకు క్షమాభిక్ష ప్రసాదించాలని, ప్రభుత్వ కాలేజీలలో అందరికీ ప్రవేశం కల్పించాలని, నూతన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఇంధన సంస్కరణలు చేపట్టాలని, ప్ర భుత్వ రంగ చమురు సంస్ధ గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, వ్యవసాయానికి వుద్దీపన కలిగించాలని, ఎన్నికలు ముగిసే వారకు నాఫ్టా గురించి చర్చలు నిలిపివేయాలని, కొత్తగా చమురుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయటం, సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెంచటం, ప్రజాప్రతినిధుల వేతనాల తగ్గింపు లేదా పన్నుల పెంపుదల, అధికారాల వికేంద్రీకరణ, రాష్ట్రాలకు బదలాయింపు వంటి అంశాలను లోపెజ్‌ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు ప్రచారం, వాగ్దానాలు చేశారు.

ఈ ఎన్నికలలో మొరెనా, పిఆర్‌డి,పిటి, సిటిజన్స్‌ వుద్యమం(ఎంసి) కలసి పోటీ చేయటం గురించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది మెక్సికో రాష్ట్ర ఎన్నికల సమయంలో తలెత్తిన విబేధాల కారణంగా ఆ కూటమిని లోపెజ్‌ వ్యతిరేకించారు. తాము ఎన్నికలలో కలసి పోటీ చేసే అవకాశం వుందని గతేడాది చివరిలో క్రైస్తవ మతవాద సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ(పిఇఎస్‌), మొరేనా ప్రకటించాయి. చివరకు ఈ రెండు పార్టీలతో పాటు మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ కలసి ఐక్యంగా మేము చరిత్రను సృష్టిస్తాం అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వర్కర్స్‌, పిఇఎస్‌ పార్టీలు దిగువ సభలో 75, ఎగువ సభలో 16స్ధానాల చొప్పున పోటీ చేసేందుకు మిగిలిన వాటిలో మొరేనా బరిలో నిలిచేందుకు ఒప్పందం కుదిరింది. పిఇఎస్‌తో కూటమి కట్టడంపై విమర్శలు వచ్చాయి.

వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ఎన్నికలకు ముందు చేసిన విశ్లేషణ సారాంశం ఇలా వుంది.ట్రంప్‌కు వ్యతిరేకంగా ధృడ వైఖరి అనుసరించాలనే ప్రజాకర్షక వామపక్ష వాది అధ్యక్ష ఎన్నికల రంగంలో ముందున్నాడు. ఆయన విజయం సాధిస్తే మెక్సికో త్వరలో ఒక వామపక్ష, ప్రజాకర్షక, జాతీయవాది అధికారంలో వుంటారు. విజయం తధ్యమని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో వున్న పిఆర్‌ఐ అధ్యక్షుడు అవినీతి పట్ల మెతక వైఖరిని తీసుకున్నకారణంగా ఓటర్లు పెను మార్పులకు సిద్ధంగా వున్నారు. మెక్సికోలో ఇవి అతి పెద్ద ఎన్నికలు. అన్ని స్ధాయిలలో 3,400 మందిని ఎన్నుకుంటారు.భవిష్యత్‌లో పెద్ద మార్పులు తీసుకు వస్తానని లోపెజ్‌ వాగ్దానం చేసినందున సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతున్నది.మెక్సికో గురించి మీరు(అమెరికన్లు) తెలుసు కోవాల్సిందేమంటే అతను ఒక జాతీయ వాద వామపక్ష అభ్యర్ధి.ఏమైనా సరే సంస్కరణలు కావాలనే ధోరణిలో ఓటర్లు వున్నందున ముగ్గురు ప్రత్యర్ధుల కంటే ఎంతో ముందంజలో వున్నారు. అతను ఇంతకు ముందు రెండుసార్లు పోటీ చేసినప్పటి కంటే ఓటర్లు ఇప్పుడు ఓటర్లు ప్రభుత్వంతో విసిగిపోయి వున్నారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం మీదే ఆశాభంగం కనిపిస్తున్నదని కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాబ్లా పికాటో అన్నారు.అసమానతలు, అవినీతి మీద పోరు సలుపుతానని లోపెజ్‌ వాగ్దానం చేశాడు. విప్లవాత్మక చర్యలని నేనంటున్నానంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవినీతి, అన్యాయాల వేళ్లను పెకలిస్తాను అని ఆయన ఒక సభలో చెప్పాడు.నలుగురు అభ్యర్ధులు ఒక విషయంలో ఒకే విధంగా వున్నారు. వారు నిజంగా, నిజంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఇష్టపడటం లేదు. ఆర్ధిక ప్రగతికి అమెరికాతో కలసి పని చేస్తూనే ట్రంప్‌ జగడాల మారి విధానాల పట్ట ధృడ వైఖరి తీసుకుంటామని వాగ్దానం చేశారు. వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)పై సమీక్ష జరపాలని ట్రంప్‌ చెప్పారు.లోపెజ్‌ వైఖరి ఇప్పుడు అనుకూలంగానే వున్నప్పటికీ అతని జాతీయవాదభావాలు భవిష్యత్‌లో కీడును సూచిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే బలమైన అధ్య క్షుడు కావాలని మెక్సికో ఓటర్లు కోరుకుంటున్నారు.

Image result for The 2018 Mexican election,amlo

ఎన్నికల ఫలితాల గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది.’ దశాబ్దాల కాలంలో తొలిసారిగా లోపెజ్‌ ఒబ్రడోర్‌ విజయం లాటిన్‌ అమెరికాలోని రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఆధికార కేంద్రంలో ఒక వామపక్ష వాదిని కూర్చోబెట్టింది. దేశంలోని వున్నత వర్గ భీతి, కోట్లాది మంది మెక్సికన్ల ఆశాభావం కారణంగా ఇది జరిగింది. గత పాతిక సంవత్సరాలుగా మధ్యేవాద హద్దులలో నడక మరియు ప్రపంచీకరణ అమలు తమకేమీ ఒరగబెట్టలేదనే భావానికి గురైన మెక్సికన్లు దేశంలోని యధాతధ స్ధితిని స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ఫలితం సూచిస్తున్నది.’ ఆర్ధిక విధానాలు దేశంలో అసమానతలను తీవ్రంగా పెంచాయి.శాంతి భద్రతలు దిగజారాయి. ఈ ఎన్నికలు మెక్సికో చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా మారాయి. నలభై ఎనిమిది మంది అభ్యర్ధులతో సహా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక రోజే ముగ్గురు మహిళా అభ్యర్ధులను కాల్చి చంపారు.మున్సిపల్‌ స్ధాయిలో నేరస్ధ గుంపులు రెచ్చిపోయాయి.బెదిరింపుల కారణంగా ఆరువందల మంది పోటీ నుంచి వెనక్కు తగ్గారు. వీటికి తోడు తమ దేశంలో ప్రవేశించిన మెక్సికన్ల గురించి యూదుల గురించి హిట్లర్‌, నాజీల మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌, అమెరికన్లు చులకనగా మాట్లాడటం, వాణిజ్య యుద్ధం ప్రకటించటం, లోపెజ్‌ ట్రంప్‌ వ్యతిరేకి అనే భావం బలంగా వ్యాపించటం కూడా ఈ ఎన్నికలలో బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మీద ఆధారపడకుండా మెక్సికో ఆర్ధిక స్వాతంత్య్ర సాధనకు తద్వారా వుపాధి కల్పనకు కృషి చేస్తాననే జాతీయవాద భావాన్ని కూడా లోపెజ్‌ ప్రచారం చేశారు. ఒక ఏడాదిలోపే తనను గద్దెదించటం ఎలా అనే కర్తవ్యాన్ని అమెరికా గూఢచార సంస్ధలకు లక్ష్య నిర్దేశం చేస్తారని లోపెజ్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పేర్కొన్నారు.మెక్సికో నగర మేయర్‌గా లోపెజ్‌ పని చేసిన కాలంలో వృద్దాప్య పెన్షన్లు పెంచటం, రోడ్ల విస్తరణతో రద్దీ తగ్గించటం, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో పాతనగర అభివృద్ధి వంటి చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనటం అమెరికాలో సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ను గుర్తుకు తెచ్చిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు. లాటిన్‌ అమెరికాలో వెనుక పట్టు పట్టిన గులాబి అలలను ఆమ్లో విజయం పునరుద్ధరిస్తుందని గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెసిస్‌ హాఫ్‌మన్‌ ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ లాటిన్‌ అమెరికాలో పురోగామి గాలుల పునరాగమనానికి ఇది చిహ్నమని పేర్కొన్నారు. ఇది ఒక్క మెక్సికో విజయం మాత్రమే కాదు మొత్తం లాటిన్‌ అమెరికాదని బ్రెజిల్‌ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ వ్యాఖ్యానించారు. మొత్తం ఈ ప్రాంత ఆశలకు ఆమ్లో ప్రతినిధి అని అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా కిర్చినర్‌ పేర్కొన్నారు.

అమెరికాతో సంబంధాల కారణంగా దెబ్బతిని ప్రధాన పార్టీలకు దూరమైన చిన్న తరహా వాణిజ్యవేత్తలు, ఒక తరగతి మేథావులు, కొందరు బడా వాణిజ్యవేత్తల మద్దతును కూడగట్టటం కూడా లోపెజ్‌ విజయానికి దోహద పడింది. దేశ జనాభాలో 46శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన వుండటం, అనేక ప్రాంతాలను మాదకద్రవ్యమాఫియా ముఠాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం, వాటికి అధికారగణం, పాలక పిఆర్‌ఐ, మితవాద పాన్‌ పార్టీల మద్దతు కారణంగా గత పది సంవత్సరాలలో మాదక ద్రవ్య మాఫియా చేతుల్లో రెండులక్షల మంది హతులు కావటం మరో 30వేల మంది అదృశ్యమయ్యారు.2014లో 43 మంది విద్యా ర్ధుల అదృశ్యం, హత్యకు ఎవరు కారకులో ఇప్పటికీ అధికారికంగా నిర్ధారించలేదు. స్కాలర్‌షిప్పులు పొందే విద్యార్ధులు కావాలి తప్ప కాంట్రాక్టు హంతకులు మనకు వద్దని ఇచ్చిన లోపెజ్‌ నినాదం బహుళ ఆదరణ పొందింది.

మెక్సికో ఎన్నికలలో ఎవరు గెలిచినప్పటికీ నష్టపోయేది కార్మికులే అని ఎన్నికలకు ముందే మెక్సికో కమ్యూ నిస్టుపార్టీ వ్యాఖ్యానించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిధిలో బూర్జువా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలు తప్ప ఆ వ్యవస్ధ కొనసాగింపునకే లోపెజ్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ మొరేనా, మావోయిస్టులు ఏర్పాటు చేసిన వర్కర్స్‌ పార్టీకూడా తోడ్పడుతున్నాయని పేర్కొన్నది. ప్రగతి వాదులమని చెప్పుకొనే పిఆర్‌డి, మొరేనా, పిటి పార్టీలు మితవాదులతో కలవటానికి సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ అవి నిజమైన వామపక్షాలు కాదని స్పష్టం చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న సంక్షోభ పరిష్కారం గురించి కొన్ని తేడాలు వుండవచ్చు తప్ప అవి ముందుకు తెచ్చే నయా వుదారవాదం లేదా నయా కీనీసియనిజం(పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభం లేదా మాంద్యానికి గురైనపుడు ప్రభుత్వ పెట్టుబడులు పెంచటం, వస్తువినిమయ డిమాండ్‌ పెంచేందుకు అవసరమైన చర్యల గురించి కీన్స్‌ సూచించిన పరిష్కార మార్గం) కార్మికవర్గ జీవన పరిస్ధితులను మెరుగుపరచదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. సోషల్‌ డెమోక్రసీ తురుపు ముక్కలను ప్రయోగిస్తామని చెప్పటమే తప్ప ఆట అడదని గ్రీసులోని సిరిజా, స్పెయిన్‌లోని పొడెమాస్‌ లక్షణాలు మొరేనాలో వున్నాయని వ్యాఖ్యానించింది. 2000సంవత్సరాలో మెక్సికో నగర మేయర్‌ ఎన్నికల్లో లోపెజ్‌ పోటీ చేసినపుడు కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వుందని, ఎన్నిక తరువాత కూటమి పట్ల విశ్వాసాన్ని కనపరచలేదని, తన వర్గ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని గుర్తు చేసింది. గుత్తాధిపతులకు ఇష్టమైనవారిలో ఒకరిగా లోపెజ్‌ వున్నారని, ఇదే సమయంలో ఆకలి, దారిద్య్రాలతో అలమటించుతూ విసిగిపోయిన వారిలో ఆశను కూడా కలిగిస్తున్నాడని, తరువాత అసంతృప్తికి గురవుతారని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మెక్సికో కార్మికవర్గ సమస్య పెట్టుబడిదారీ విధానం, దానిని మార్చేందుకు లోపెజ్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోగా దానిని బలపరచాలని కోరుకుంటున్నారని, అందువలన ఓటు వేసినా వేయకపోయినా ఒరిగేదేమీ లేదని, అయితే జరుగుతున్న పరిణామాలలో కార్మికవర్గం జోక్యం చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.

Image result for The 2018 Mexican election

సోషల్‌ డెమోక్రాట్లు తమను వామపక్షవాదులుగా పిలుచుకోవటం, మీడియా కూడా అదే ప్రచారం చేస్తున్నది. ఫ్రాన్స్‌లో సోషలిస్టు పార్టీ, బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ, అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ వంటి వన్నీ ఈకోవకే వస్తాయి. వాటిలో కొంత మంది సంస్కరణవాదులు,కొందరు వామపక్ష వాదులు వుండవచ్చు తప్ప మౌలికంగా అవి పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడేవే తప్ప వ్యతిరేకించేవి కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. బూర్జువావర్గంలో అధికారంకోసం జరిగే పెనుగులాటలో ఇలాంటి పార్టీలు అనేకం పుట్టుకు వస్తాయి, అంతరించి, కొత్త రూపాలలో రావటం తప్ప మౌలిక స్వభావంలో మార్పు వుండదు. మెక్సికో మొరేనా పార్టీ నాయకత్వంలోని కూటమి కూడా అలాంటిదే. దాని మీద భ్రమలు పెట్టుకోనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాలో రైతాంగానికి సబ్సిడీల తీరు తెన్నులు !

02 Monday Jul 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

american farmers, Farm bill 2018, Farmers, subsidies to american farmers, subsidies to farmers

Image result for agriculture mechanisation

ఎం కోటేశ్వరరావు

అనుచిత వాణిజ్య లావాదేవీలకు పాల్పడుతున్నదనే సాకుతో చైనానుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 50బిలియన్‌ డాలర్ల సుంకాలను ప్ర కటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇది రాస్తున్న సమయానికి మరొక 200 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించేందుకు సరకుల జాబితాను తయారు చేయాలంటూ అధికార గణానికి ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆందోళనతో వున్న అమెరికా రైతాంగం ఈ వార్తతో మరింత వత్తిడికి లోనైనట్లు వార్తలు వచ్చాయి. అమెరికా వ్యవసాయం అంటే పెద్ద రైతులతో పాటు కార్పొరేట్‌ల ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. అందుకే వాణిజ్య యుద్దమంటే అవి గజగజలాడతాయి. అమెరికాలోని ప్రతి రైతుకు వచ్చే ఆదాయంలో వందకు ఇరవై రూపాయలు ఇతర దేశాలతో జరిపే అమెరికా వాణిజ్యంపై ఆధారపడి వుంటాయని అంచనా. అందువలన సహజంగానే వారి భయం వారికి వుంటుంది. ఇతర దేశాలతో ట్రంప్‌ సామరస్యంగా వున్నంత వరకు వారికి ఢోకాలేదు, తగాదా పెట్టుకుంటే తమ స్ధితి ఏమవుతుందో తెలియని అయోమయంలోకి వారు పోతారు.

అమెరికాలో ఏటా 6కోట్ల టన్నుల గోధుమలు పండుతాయి. వాటిలో సగాన్ని ఎగుమతి చేయాల్సిందే. నిజంగా వాణిజ్య యుద్ధం వాస్తవ రూపందాల్చితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలన్నది ప్రశ్న. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు అనేక దేశాల మీద తొడగొడుతున్నాడు. కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ కూడా ప్రతి చర్యలు తీసుకొనేందుకు సిద్దమౌతున్నాయి. అమెరికా ఏటా 140 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ వుత్పత్తులను ఎగుమతి చేస్తోంది.కెనడా, మెక్సికోలు 39, చైనా 20, ఐరోపా యూనియన్‌ 12 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నాయి. నిజంగా వాణిజ్య యుద్దమే జరిగితే సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. పర్యవసానాలు ఎలా వుంటాయో తెలియదు కనుక ఆచి తూచి వ్యవహరించాలని అనేక మంది సూచిస్తున్నా ట్రంప్‌ దూకుడు తగ్గటం లేదు. ఇది ప్రపంచీకరణ యుగం, ఎక్కడ ఏ వస్తువు లేదా విడి భాగం తయారైతే అక్కడి నుంచి మరికొన్ని చోట్ల కూర్చి వస్తువులను తయారు చేస్తున్నారు. అందువలన చైనా నుంచి అటువంటి వాటి మీద అమెరికా లేదా మరొక దేశం పన్నులు విధిస్తే దాని పర్యవసానం ఒక్క చైనాకే అనేక దేశాలమీద పడుతుంది. చైనాగనుక ప్రతికూల చర్యల్లో భాగంగా సోయా, పందిమాంస వంటి వాటిపై పన్నులు విధిస్తే మొత్తంగా అమెరికాకు పెద్దగా దెబ్బతగలకపోవచ్చుగానీ రైతాంగానికి పెద్ద దెబ్బ. గత ఏడాది చైనా దిగుమతి చేసుకున్న 95మిలియన్‌ టన్నుల సోయాను ఈ ఏడాది వంద టన్నులకు పెంచనుంది. వాటిలో ఒక్క అమెరికా ఎగుమతులే 33 మిలియన్‌ టన్నులు. వాటి మీద 25శాతం అదనంగా దిగుమతి పన్ను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అందువలన అంత పన్ను చెల్లించి దిగుమతి చేసుకోవటమా ప్రత్యామ్నాయం చూసుకోవటమా అన్నది చైనా ముందు వుంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో గతేడాది 119 మిలియన్‌ టన్నుల సోయా వుత్పత్తి కాగా దానిలో 51మిలియన్‌ టన్నులు చైనాకు ఎగుమతి చేశారు. ఇది 2016కంటే 33శాతం ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా వుండేందుకు చైనా తన ప్రయత్నాలలో తాను వున్నట్లు ఈ పరిణామం తెలియ చేస్తోంది.బ్రెజిల్‌ కరెన్సీ విలువ తక్కువ వుండటంతో అమెరికా కంటే తక్కువ ధరలకు అది ఎగుమతి చేయగలుగుతోంది. దీంతో ఇటు చైనా వినియోగదారులు, అటు బ్రెజిల్‌ రైతులు లబ్దిపొందుతున్నారు.

మూడు దశాబ్దాల నాటి అంటే 1986ా88 సంవత్సరాలలో వున్న ప్రపంచ ధరల సగటు ప్రాతిపదికన ప్రపంచ వాణిజ్య సంస్ధ సబ్సిడీలను లెక్కిస్తోంది. అందువలన అప్పటి మన కనీస మద్దతు ధరలను ఇప్పటితో పోల్చితే చాలా ఎక్కువగా వున్నట్లు కనిపించటం సహజం, దాన్ని చూపే అమెరికా మన మీద డబ్ల్యుటివోలో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ సంస్ధలో వున్న నిబంధనల లసుగు లేదా ధనిక దేశాలకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములాలకు అనుగుణంగా అనేక రూపాలలో తన రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ మనవంటి వర్ధమాన దేశాల రైతాంగాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. నిబంధనావళి ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో పదిశాతం మేరకు సబ్సిడీలు ఇవ్వటానికి అవకాశం వుంది. ఆ మొత్తంలో ఏ పంటకు ఎంత ఇవ్వాలన్నది తమ ఇష్టమని ధనిక దేశాలు వాదిస్తున్నాయి. వుదాహరణకు వంద రకాల పంటలకు అనుమతించిన సబ్సిడీ మొత్తం వంద రూపాయనుకుందాం. ఒక్కొక్క పంటకు రూపాయి బదులు పది పంటలకు పది రూపాయల చొప్పున ఇస్తే అభ్యంతర పెట్టకూడదని అమెరికా వాదిస్తోంది. ఆ పద్దతిలో అమెరికా, ఐరోపా యూనియన్‌లో అనేక పంటలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాలు 50శాతానికి మించాయి. వుదాహరణకు అమెరికాలో వరికి 59శాతం సబ్సిడీ ఇస్తున్నారు. 2015 నవంబరులో మింట్‌ పత్రికలో డాక్టర్‌ రవికాంత్‌ రాసినదాని ప్రకారం అమెరికాలో ప్రతి రైతుకు 50వేల డాలర్ల మేర సబ్సిడీ ఇవ్వగా మన దేశంలో ఇచ్చినది కేవలం 200డాలర్లే. అక్కడి వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ జనానికి వూబకాయం పెరిగేందుకు తోడ్పడుతోందని సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక రాసింది. ఐరోపాయూనియన్‌ వుమ్మడి బడ్జెట్‌లో 40శాతం వ్యవసాయ సబ్సిడీలకే కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అమెరికాాఐరోపా యూనియన్‌ మధ్య కూడా విబేధాలు వున్న కారణంగానే వ్యవసాయంపై గత పదిహేను సంవత్సరాలుగా ఒప్పందం కుదరటం లేదు. మన దేశం నుంచి ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సామర్ధ్యనిర్మాణం, ఎగుమతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రైతుల ఖాతాలో జమచేసి అమెరికా అభ్యంతర పెడుతోంది.

అమెరికా లేదా ఇతర ఐరోపా ధనిక దేశాలు మన వ్యవసాయం మీద దాడిని ప్రధానంగా కేంద్రీకరించాయి. భారీ సబ్సిడీలతో వారి వుత్పత్తులను మన దేశంలో కుమ్మరించాలని చూడటం ఒకటైతే మన వుత్పత్తులు ప్రపంచమార్కెట్లో వాటికి పోటీ రాకుండా చూడటం మరొకటి. మన దేశంలో ఏదో ఒక ఏడాదో, రెండుసార్లో తప్ప మొత్తం సబ్సిడీలు జిడిపిలో ఒకశాతానికి మించటం లేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్యాలకు ఏటా ఇస్తున్న పన్ను రాయితీల మొత్తం నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల వరకు వుంటోంది. ఇది జిడిపిలో 5-8శాతం. ఈ రంగాలలో అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి వస్తున్న ప్రత్యక్ష పెట్టుబడులు లేదా సంస్ధల వాటాల కొనుగోలు చేస్తున్నవారికి ఈ మొత్తంలో లాభాల రూపంలో వాటా ముడుతోంది కనుక ఆ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించటం లేదు.

Image result for subsidies to us farmers 2018

ఇక అమెరికాలో ఇస్తున్న సబ్సిడీల తీరుతెన్నుల గురించి చూద్దాం. ఒక తాజా నివేదిక ప్రకారం సబ్సిడీ లేదా ప్రకృతి వైపరీత్యాల నష్ట పరిహారంగాని 1985-2016 మధ్య 27,930 వ్యవసాయ క్షేత్రాల యజమానులకు చెల్లించిన మొత్తం 19బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం వున్న రూపాయి మారకపు విలువలో ఏడాదికి సగటున ఒక్కొక్క యజమాని పొందిన మొత్తం నాలుగు కోట్ల 67లక్షలకు పై మాటే. గరిష్టంగా ఒక యజమాని పొందిన మొత్తం 76కోట్ల రూపాయలకు పైగా వుంది. రానున్న పది సంవత్సరాలలో వ్యవసాయ సబ్సిడీల నిమిత్తం 868 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఎవరికి ఎంత ఎలా చెల్లించాలనే అంశంపై వివాదం తలెత్తటంతో మే నెలలో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించలేదు. సవరణలతో మరోమారు ఓటింగ్‌కు రానున్నది. పెద్ద యజమానులకు మరింత ఎక్కువ, చిన్న వారికి తగ్గించే ప్రతిపాదనలు వున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వున్న చట్ట ప్రకారం వ్యవసాయ నష్టభయం కింద నమోదు చేసుకున్న రైతులకు ఒక వ్యక్తికి ఏడాదికి లక్షా 25వేల డాలర్లకు మించి చెల్లించే అవకాశం లేదు. ఏడాదికి తొమ్మిది లక్షల ఆదాయపరిమితిని విధించారు. ఈ పరిమితిని తగ్గించి పరిహార మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. రైతుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం 62శాతం మొత్తం చెల్లిస్తోంది. అక్కడ కూడా చిన్న రైతులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. బీమా కంపెనీలకు ప్రభుత్వం 14శాతం లాభానికి గ్యారంటీ ఇస్తున్నది. ఆ మేరకు ఎంత లాభం తగ్గితే అంత ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతిదానికీ నిర్ణీత ధర నిర్ణయించే అమెరికాలో రైతులకు సరఫరా చేసే నీటిని మార్కెట్‌ ధరలో కొన్ని సందర్భాలలో పదిశాతం మొత్తానికే అందచేస్తున్నారు. అక్కడి వ్యవసాయదారులలో పదిశాతం బడా యజమానులకు 90శాతం సబ్సిడీ అందుతున్నది. 2015లో దేశంలోని 21లక్షల మంది రైతులలో రెండులక్షల పదివేల మందికి ప్రభుత్వ చెల్లింపులలో 70, పంటల బీమా సొమ్ములో 78శాతం దక్కింది. మిగిలిన వారిలో 80శాతం మందికి నామమాత్రం లేదా అసలు అందని పరిస్ధితి వుంది.చెరకు సాగులో రసాయన ఎరువుల వాడకం వలన ఎవర్‌గ్లాడ్స్‌ ప్రాంతంలో వాగులు, వంకలలో చేరిన కాలుష్యాన్ని తొలగించేందుకు 2035నాటికి 10.5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే లాభాలు యజమానులకు, కాలుష్య పరిహారం ప్రజలు చెల్లించాలన్నమాట. వ్యవసాయ వస్తువులతో వ్యాపారం చేసే వారికి కూడా ఏటా 20బిలియన్‌ డాలర్ల మేర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది.

అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా 60కిపైగా పద్దతులలో రైతులకు సాయం చేస్తున్నారు. 2014లో వ్యవసాయ పరిశ్రమలో పని చేసిన వారు 8.27లక్షలు, మొత్తం వ్యవసాయ క్షేత్రాలు 20,48,000, సగటున ఒక వ్యవసాయ క్షేత్రం 440 ఎకరాలుంటుంది. పదహారు బీమా కంపెనీలు పంటల బీమా చేస్తున్నాయి. ప్రీమియం సబ్సిడీగా గత ఐదు సంవత్సరాలలో సగటున 6.7బిలియన్‌ డాలర్ల సబ్సిడీ చెల్లించారు.బీమా కంపెనీలకు ఇచ్చిన సబ్సిడీ 1.5బిలియన్‌ డాలర్లు, వాటికి వచ్చిన నష్టానికి పరిహారం 30కోట్ల డాలర్లు, ప్రభుత్వ యంత్రాంగ ఖర్చు 20కోట్ల డాలర్లు. వందరకాల పంటలకు బీమా వర్తిస్తుంది. బీమా కంపెనీలు అక్రమాలకు పాల్పడటం షరా మామూలు. ప్రభుత్వం సగటున 62శాతం బీమా సొమ్ము చెల్లిస్తోంది.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రైతులు చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 65బిలియన్‌ డాలర్లు పొందారు. బీమాకు అందరూ అర్హులే కావటంతో బిలియనీర్లు కూడా సబ్సిడీలను పొందుతున్నారు.

వ్యవసాయ నష్టభయం కింద ఒక రైతు ఎకరా ఆదాయం లేదా ఆ ప్రాంతంలో ఎకరాకు గ్యారంటీ ఆదాయం కంటే తక్కువ పొందితే వారికి గ్యారంటీ ఇచ్చిన మేరకు పరిహారం చెల్లిస్తారు. ఇరవై పంటలకు దీనిని వర్తింప చేస్తున్నారు.గతేడాది 3.7బిలియన్‌ డాలర్లు చెల్లించారు. పార్లమెంట్‌ సూచించిన పంట జాతీయ సగటు ఆదాయం కంటే తక్కువ వచ్చిన రైతులకు ఆ మేరకు చెల్లిస్తారు. గతేడాది ఆ మొత్తం 3.2బిలియన్‌ డాలర్లుంది.పై రెండు పధకాలలో రైతులు దేనినో ఒకదానిని ఎంచుకోవాలి. ఇదే సమయంలో వారికి పంటల బీమా పరిహారం అదనం. కొన్ని ప్రాంతాలలో భూమిని అభివృద్ధి చేసినందుకు, మరికొన్ని చోట్ల సాగు నిలిపివేసి భూమిని కాపాడినందుకు కూడా ఇస్తున్న సొమ్ము మొత్తం ఏడాదికి ఐదు బిలియన్‌ డాలర్లుంది. పంట సమయంలో తక్కువ ధరలకు అమ్ముకోకుండా రైతాంగానికి రుణాలు ఇస్తే మంచి ధర వచ్చే వరకు పంటలను నిలువ చేసుకొనే పధకం వుంది. ఆ మేరకు ధరలు తగ్గితే దానికి కూడా పరిహారం ఇస్తారు. ఇక్కడ కూడా వ్యవసాయ సబ్సిడీలకోత లేదా ఎత్తివేయాలనే ప్రతిపాదనలు లేకపోలేదు. ఏడాదికి ఐదులక్షల డాలర్లకు మించి ఆదాయం వచ్చే రైతులకు సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా 6బిలియన్‌ డాలర్లు, పంటల బీమా సబ్సిడీ ఒక క్షేత్రానికి 40వేల డాలర్లకు పరిమితం చేస్తే రెండుబిలియన్‌ డాలర్లు ఆదాఅవుతాయని అంచనా.

అమెరికాలో 2016 సగటున ఏడాది కుటుంబాదాయం 83,143డాలర్లు కాగా వ్యవసాయ కుటుంబాలకు 1,17,918 వుంది. మొత్తంగా దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలు 14శాతం కాగా వ్యవసాయ రంగంలో అది రెండుశాతం వుంది. వ్యవసాయ సబ్సిడీలు అధిక వుత్పత్తికి దారితీస్తున్నాయని,భూమి దెబ్బతినటానికి, పర్యావరణానికి, ఇతరత్రా హానికరమని,అవినీతికి దారితీస్తున్నాయని, ఇతర వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని, జనమీంద అదనపు భారం మోపుతున్నాయని బలంగా వాదిస్తున్నవారు వున్నారు. వ్యవసాయంలో వచ్చే లాభాలను వ్యవసాయేతర రంగాలలో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకొనేందుకు, పన్నుల ఎగవేతకు వుపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. మన దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కానందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను చూస్తున్నాం తప్ప ఇతర రంగాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో వున్న గణాంకాల ప్రకారం వ్యాపారాలలో ప్రతి పదివేల సంస్ధలకు ఎనిమిది చొప్పున దివాలా ప్రకటిస్తుండగా వ్యవసాయంలో ఆ రేటు రెండు నుంచి మూడు వరకు మాత్రమే వుంది. గతేడాది 2.4గా నమోదైంది. మన దేశంలో ధనిక రైతులు ఏదో విధంగా నెట్టుకు వస్తుండగా పేద, మధ్యతరగతి, కౌలు రైతులు వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పులపాలై చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: