• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Latin America

అతివలకు అగ్రాసనం వేసిన వామపక్ష నికరాగువా !

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, Latin America, Left politics, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Daniel Ortega, Nicaragua Women, Sandinista Revolution, US imperialism, Women’s Liberation


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్‌ ఓర్టేగా సర్కార్‌ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్‌ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్‌ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.


1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్‌ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్‌ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.

శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్‌ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.


2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్‌ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.


లాటిన్‌ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్‌ సముద్రం ద్వారా అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్‌ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్‌ గార్డ్స్‌ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.


2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్‌ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్‌ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్‌ సాల్వడార్‌ చైనాను గుర్తించాయి.హొండురాస్‌ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్‌ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్‌ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగుబాటుకు బ్రెజిల్‌ బోల్సనారో కుట్ర – మిలిటరీ పాత్రపై ఉత్కంఠ !

18 Tuesday Jan 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

2022 Brazilian Presidential Elections •, 2022 Elections in Latin America, Brazil elections, Brazil’s Military, Jair Bolsonaro, lula da silva


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశం బ్రెజిల్‌. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలన్నీ ఈ ఏడాది అక్టోబరు రెండవ తేదీన జరిగే ఎన్నికల్లో వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా విజయం సాధించనున్నారనే చెబుతున్నాయి. మరోవైపున ఫాసిస్టు శక్తిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు జైర్‌ బోల్సనారో రంగం సిద్దం చేసుకుంటున్నాడు. లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్న తరుణంలో బ్రెజిల్‌ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ తాజాగా ధ్వజమెత్తాడు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటమి పాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన మద్దతుదార్లను అమెరికాపార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పిన దురాగతం గురించి తెలిసినదే. బ్రెజిల్‌లో కూడా అలాంటిదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అవినీతి అక్రమాలను, నేరాలను అరికడతానన్న వాగ్దానాలతో అధికారానికి వచ్చిన తరువాత నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బోల్సనారో కుట్రకు మిలిటరీ సహకరిస్తుందా ? వమ్ము చేస్తుందా అన్నది ఉత్కంఠరేపుతున్న అంశం.


లూలా మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఇద్దరు న్యాయమూర్తులు కోరుకుంటున్నారని బోల్సనారో అన్నాడు. నాకు ఓట్లు వేయద్దనుకుంటున్నారు పోనీయండి, ఎనిమిదేండ్ల పాటు దేశాన్ని దోచుకున్న వ్యక్తి రావాలని కోరుకోవటం ఏమిటంటూ లూలాను ఉద్దేశించి అన్నాడు. 2003 నుంచి 2010వరకు అధికారంలో ఉన్న లూలాపై తప్పుడు అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టిన అంశం తెలిసిందే. కొంత కాలం పాటు జైల్లో ఉంచిన తరువాత కేసును కొట్టివేశారు. తొలి దఫా ఎన్నికల్లోనే లూలాకు 54, బోల్సనారోకు 30శాతం ఓట్లు వస్తాయని ఒకటి, 45-23శాతం వస్తాయని మరో తాజా సర్వే పేర్కొన్నది. ఏ సర్వేను చూసినా ఇద్దరి మధ్య ఇరవైశాతానికి మించి తేడా ఉంటోంది. అక్కడి నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో 50శాతం పైగా వస్తేనే ఎన్నికౌతారు. లేనట్లయితే అక్టోబరు 30న తొలి ఇద్దరి మధ్య తుది పోటీ జరుగుతుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతిలో రిగ్గింగు జరిపి తనను ఓడించేందుకు చూస్తున్నారని, ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకంటూ అనుసరించిన వాక్సిన్లు, లాక్‌డౌన్‌ విధానాల వలన కరోనా కేసులు, మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. స్ధానిక తెగలు, ఆఫ్రో-బ్రెజిలియన్‌ సామాజిక తరగతుల్లో వైరస్‌ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.


దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత వచ్చిన వార్తల మీద పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెబుతున్నారు.పార్లమెంటు మీద దాడికి దిగిన వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్దంగా ఉండాలని చెప్పటమెందుకు అన్నది ఒక ప్రశ్న. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు.ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.


రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.ఐనా ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. ఎన్నికల్లో బాలట్‌ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అమెరికాలో బాలట్‌ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన ట్రంప్‌కు ఇతగాడు ఏడాది క్రితం మద్దతు పలికాడు. గతేడాది మార్చినెలలో దేశ చరిత్రలో అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. దీన్ని చూస్తే 1964నాటి అమెరికా మద్దతు ఉన్న కుట్ర అనంతరం రెండు దశాబ్దాల పాటు సాగినమిలిటరీ పాలన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అంతేకాదు అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణ పేరుతో జరుపుతున్న తతంగం ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు.పౌర విచారణ కమిటీ తమపై విచారణ జరపటం ఏమిటని వారు నిరసన తెలిపారు. విచారణ సమయంలో దానికి మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించటం, అలాంటి ఒక ప్రదర్శనలో మిలిటరీ అధికారి ఒకరు పాల్గొనటం, తన అరెస్టు అక్రమం అని చెప్పటం ప్రమాదకర సూచనలను వెల్లడించాయి. బాలట్‌ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్‌ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తరువాత సెప్టెంబరు ఏడున తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. మిలిటరీ జోక్యం చేసుకోవాలని ఆ ప్రదర్శనల్లో బానర్లను ప్రదర్శించారు. ఇవన్నీ తిరుగుబాటు సన్నాహాలే అని కొందరు భావిస్తున్నారు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇస్తున్నది. బోల్సనారో పిచ్చిపనులు, మిలిటరీ తీరు తెన్నులపై ఇంతవరకు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి )పార్టీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలకు సన్నాహాలతో పాటు కుట్రలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ఆలోచనలతో ఉంది.


ఈ ఏడాది బ్రెజిల్‌తో పాటు కొలంబియా, కోస్టారికాలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. చిలీలో నూతన రాజ్యాంగ ఆమోదం, అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి ఆరున కోస్టారికాలో సాధారణ ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్‌ 3న అధ్యక్షపదవికి తుది ఎన్నిక, మార్చి 13న కొలంబియా పార్లమెంట్‌, మే 29నతొలి విడత అధ్యక్ష ఎన్నికలు, అవసరమైతే తుది విడత జూన్‌ 19, అమెరికా పార్లమెంటు ఎన్నికలు నవంబరు 8న జరుగుతాయి. బ్రెజిల్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, 81 స్ధానాల ఎగువ సభలో 27 స్ధానాలు, దిగువ సభలోని 513 డిప్యూటీలు, 26 రాష్ట్రాల, ఒక ఫెడరల్‌ జిల్లా గవర్నర్‌ పదవులకు ఎన్నికలు అక్టోబరు రెండున జరుగుతాయి. ఎగువ సభ సెనెటర్లు ఎనిమిది సంవత్సరాలు, దిగువసభ డిప్యూటీలు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటారు. అధ్యక్ష పదవికి లూలా, బోల్సనారోతో సహా పన్నెండు మందని, ఐదుగురు పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి.


కొలంబియాలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఇవాన్‌ డూక్‌పై డిసెంబరులో జరిగిన సర్వేలో 80శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి గెలిచే అవకాశాలు లేవు. మాజీ గెరిల్లా , గత ఎన్నికల్లో రెండవ స్ధానంలో వచ్చిన వామపక్షనేత గుస్తావ్‌ పెట్రో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అధ్యక్షపదవిని పొందేవారు 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాలి. తొలి దఫా సాధించలేకపోతే తొలి ఇద్దరి మధ్య రెండవ సారి పోటీ జరుగుతుంది. కోస్టారికాలో తొలి రౌండ్‌లో ఒకరు 40శాతంపైగా ఓట్లు తెచ్చుకొన్నపుడు మరొకరెవరూ దరిదాపుల్లో లేకపోతే అధికారం చేపట్టవచ్చు. ఇద్దరు గనుక 40శాతంపైన తెచ్చుకుంటే వారి మధ్య తుది పోటీ జరుగుతుంది. మితవాద పార్టీలే ప్రధాన పోటీదార్లుగా ఉన్నాయి. అమెరికాలోని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) మొత్తం 435 స్ధానాలకు, సెనెట్‌లోని వందకు గాను 34, 39 రాష్ట్ర గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. పెరూలో అక్టోబరు నెలలో స్ధానిక సంస్ధ ఎన్నికల జరగనున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష తరంగాలను ఆపేందుకు అమెరికా, దానితో చేతులు కలుపుతున్న మితవాద, కార్పొరేట్‌ శక్తులు చేయని ప్రయత్నం లేదు. గతంలో మిలిటరీ నియంతలను ప్రోత్సహించిన అమెరికా లాభ నష్టాలను బేరీజు వేసుకున్నపుడు నష్టమే ఎక్కువగా జరిగినట్లు గ్రహించి పద్దతి మార్చుకుంది. ఎన్నికైన వామపక్ష శక్తులను ఇబ్బందులకు గురించి చేసి దెబ్బతీయటం ద్వారా జనం నుంచి దూరం చేయాలని చూస్తోంది. అలాంటి చోట్ల అధికారానికి వచ్చిన మితవాద శక్తులు తదుపరి ఎన్నికల్లో జనం చేతిలో మట్టి కరుస్తున్నారు. బ్రెజిల్‌లో కూడా అదే పునరావృతం కానుందన్న వార్తల నేపధ్యంలో అమెరికా ఎలాంటి పాత్ర వహిస్తుందో చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

21 Tuesday Dec 2021

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Apruebo Dignidad, Chile Presidential Elections 2021, Gabriel Boric, Latin American left



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హొండురాస్‌లో తొలిసారి వామపక్ష జయకేతనం !

02 Thursday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Honduras elections 2021, Latin American left, Manuel Zelaya, Xiomara Castro


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌లో ఆదివారం నాడు జరిగిన ఎన్నికలలో వామపక్ష లిబరల్‌ రీఫౌండేషన్‌ పార్టీ అభ్యర్ధి గ్జియోమారో కాస్ట్రో ఆధిక్యతలో ఉన్నారు. రెండు రోజుల తరువాత ప్రతిపక్షం తన ఓటమిని అంగీకరించటంతో ఆమె విజయం ఖరారైంది. దేశకాలమానం ప్రకారం సోమవారం నాడు నిలిపివేసిన ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. రాత్రి పన్నెండు గంటల సమయానికి 59.22శాతం ఓట్లు లెక్కించగా గ్జియోమారోకు 52.25శాతం, ప్రత్యర్ధికి 34.95శాతం, మూడో స్దానంలో ఉన్న మరో అభ్యర్ధికి 9.39శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 52లక్షలకు గాను 68.78శాతం మంది ఓటువేశారు. సగం ఓట్ల తరువాత లెక్కింపు నిలిపివేత, గత ఎన్నికల్లో లెక్కింపులో జరిగిన అక్రమాలు, అమెరికా జోక్యనేపధ్యం, లెక్కింపు ప్రారంభం కాగానే తామే గెలిచినట్లు అధికార పార్టీ ప్రకటించటం వంటి పరిణామంతో ఈసారి కూడా గతాన్ని పునరావృతం చేయనున్నారా అన్న అనుమానాలు తలెత్తాయి. లెక్కింపు నిలిపివేసిన ఒక రోజు తరువాత మంగళవారం నాడు పాలకపార్టీ ఒక ప్రకటన చేస్తూ తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామంటూ ప్రకటన చేసింది. దీంతో పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లైంది. గ్జియోమారో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కనున్నారు. మీడియా ఆమె విజయం సాధించినట్లే అంటూ వార్తలిచ్చింది. ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉండటం, ఫలితాలపై సర్వత్రా చర్చ జరగటంతో విధిలేని పరిస్ధితిలో అధికారపార్టీ ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది. పార్లమెంటులోని 128 స్ధానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా పద్దతిలో కేటాయిస్తారు.


పన్నెండు సంవత్సరాల తరువాత హొండురాస్‌లో మరోసారి వామపక్షనేత అధికారంలోకి రావటం లాటిన్‌అమెరికాను తన పెరటితోటగా భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ.2005లో జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ సతీమణే గ్జియోమారో. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నవంబరు చివరి ఆదివారం నాడు అధ్యóక్ష, పార్లమెంట్‌, స్ధానిక సంస్ధల, సెంట్రల్‌ అమెరికన్‌ పార్లమెంట్‌ సభ్యుల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఎన్నికైన వారు మరుసటి ఏడాది జనవరి 27న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు 2006 జనవరిలో అధ్యక్షుడిగా అధికారానికి వచ్చిన జెలయా మిలిటరీ కూలదోసే వరకు (2009 జూన్‌ 28) అధికారంలో ఉన్నాడు. జెలయా పురోగామి విధానాలను అనుసరించినప్పటికీ మితవాద లిబరల్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు గెలిచిన గ్జియోమారో వామపక్ష పార్టీ తరఫున, పురోగామి అజెండాతో పోటీ చేశారు. అందువలన ఒక వామపక్షవాదిగా దేశంలో గెలిచిన తొలినేతగా పరిగణించాలి. ఇది అమెరికా సామ్రాజ్యవాదులకు మరో పెద్ద దెబ్బ-వామపక్ష శక్తులకు ఎంతో ఊపునిచ్చే పరిణామం.


ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన, మితవాద లిబరల్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి జెలయా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొన్నాడు. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. ఇది మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. కత్తిగట్టిన ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత రాజీనామా ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చింది. ఎన్నికలలో జెలయాను పోటీకి అనర్హుడిగా ప్రకటించారు మితవాదశక్తులే అధికారానికి వచ్చాయి.


2011లో లిబరల్‌ పార్టీ నుంచి జెలయా మద్దతుదారులు విడిపోయి లిబరల్‌ రీఫౌండేషన్‌ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ ఏర్పడిన నేషనల్‌ పాపులర్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (జాతీయ ప్రజాప్రతిఘటన కూటమి) దీనిని ఏర్పాటు చేసింది. 2013 ఎన్నికల్లో గ్జియామారో అధ్యక్ష పదవికి పోటీ చేసి చతుర్ముఖ పోటీలో రెండవ స్ధానంలో నిలిచి 29శాతం ఓట్లు తెచ్చుకున్నారు.2017 ఎన్నికల్లో రీఫౌండేషన్‌ పార్టీతో మరోవామపక్షం జతకట్టింది, ఆ పార్టీ నేత సాల్వడోర్‌ నసరల్లా పోటీ చేశారు. అధికారపక్షం అక్రమాలకు పాల్పడి ఓటర్ల తీర్పును తారు మారు చేసింది. ఓట్ల లెక్కింపుపేరుతో రోజుల తరబడి కాలయాపన చేసి చివరకు అధికారపక్షం గెలిచినట్లు ప్రకటించారు.విజేతకు 42.95శాతం నసరల్లాకు 41.42శాతం వచ్చినట్లు చెప్పారు.అక్రమాలకు నిరసన తలెత్తటంతో దేశంలో పది రోజుల పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు అమలు జరిపారు.Û ఎన్నికలు జరిగిన 21 రోజుల తరువాత ఫలితాన్ని ప్రకటించారు.నెల రోజుల పాటు సాగిన నిరసనల్లో 30 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తిరిగి ఓటింగ్‌ నిర్వహించాలని సూచించినా ఖాతరు చేయలేదు. కోటి మంది జనాభా ఉన్న హొండూరాస్‌లో 2021 ఎన్నికల్లో తాము అధికారానికి వస్తే ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలు జరిపేందుకు పని చేస్తామని, నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామని లిబరల్‌ రీఫౌండేషన్‌ ప్రకటించింది.


ఓటింగు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే తామే విజయం సాధించినట్లు అధికార నేషనల్‌ పార్టీ ప్రకటించుకుంది. బహుశా అవసరమైతే గత అక్రమాలనే పునరావృతం గావించే ఎత్తుగడ దానిలో ఉండవచ్చు. మరోవైపు మనం విజయం సాధించామని గ్జియోమారో కాస్ట్రో మద్దతుదార్లతో మాట్లాడుతూ ప్రకటించారు. రాజధాని తెగుసిగల్పాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. త్రిముఖ పోటీలో అధికారపక్షం చాలా వెనుకబడి ఉంది. దాంతో ఎలాంటి ప్రకటన లేకుండానే లెక్కింపు నిలిపివేశారు. నేషనల్‌ పార్టీని అధికారంలో కొనసాగించేందుకు అక్రమాలకు పాల్పడవచ్చని పోలింగుకు ముందే ప్రతిపక్షం హెచ్చరించింది. ఓట్ల లెక్కింపు నిలిపివేసినా జనం సంయమనం పాటించారు.అడ్డదారిలో గెలిచేందుకు అధికారపక్షం పాల్పడని అక్రమాలు లేవు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగాయి. ఓటర్లను బెదిరించారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు అందించారని. అధికార మీడియా పాలక పార్టీ, అధó్యక్ష అభ్యర్ధికి అనుకూలంగా పని చేసిందని ఐరోపా దేశాల కమిషన్‌ చెప్పింది. ప్రయివేటు మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు.


అధికారపక్ష అభ్యర్ధి నసిరీ అస్ఫురా ప్రస్తుతం రాజధాని తెగుసిగల్పా నగర మేయర్‌గా ఉన్నాడు. ఏడులక్షల డాలర్ల మేరకు ప్రజల సొమ్ము మింగేసినట్లు విమర్శలున్నాయి, పండోరా పత్రాల్లో కూడా అతని అవినీతి ప్రస్తావన ఉంది. మూడో అభ్యర్ధి లిబరల్‌ పార్టీకి చెందిన యానీ రోసెంథాల్‌ నిధుల గోల్‌మాల్‌ కేసులో మూడు సంవత్సరాలు అమెరికా జైల్లో ఉండి వచ్చాడు. అబార్షన్‌ నేరం కాదంటూ చట్టసవరణ చేస్తానని, బాంకుల్లో నిధులు జమచేసేందుకు వసూలు చేసే చార్జీలను తగ్గిస్తానని, అవినీతి అక్రమాల విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని గ్జియోమారో ప్రకటించారు. నయా ఉదారవాదం మనల్ని పాతాళంలో పూడ్చిపెట్టిందని దాన్నుంచి బయటకు లాగి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలును తాము గట్టిగా నమ్ముతున్నట్లు ప్రకటించారు.సమస్యలపై సంప్రదింపులు, ప్రజాభిప్రాసేకరణ వంటి భాగస్వామ్య ప్రజాస్వామిక మార్పులను తీసుకువస్తామన్నారు. భర్త జెలయా అధికారంలో ఉన్న రెండున్నర సంవత్సరాలలో పేదల సంక్షేమ చర్యల పధకాలను రూపొందించటంలో గ్జియోమారో కాస్ట్రో కీలక పాత్ర పోషించారు. సైనిక కుట్రకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు కుటుంబ వ్యవసాయ, కలప వ్యాపారాల నిర్వహణ చూశారు. తాజా ఎన్నికల్లో జెలయా పార్టీ సమన్వయకర్తగా ఉన్నారే తప్ప ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు.


గ్జియోమారో అధికారానికి వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటారని, దేశం అమెరికాతో సంబంధాల్లో ఉన్నందున ఒకవేళ తెగతెంపులు చేసుకుంటే నెల రోజులు కూడా గడవదని ఆమె మీద ప్రచారం చేశారు. చైనాతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉంటారన్న ప్రశ్నకు తైవాన్‌తో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో ఏర్పాటు చేసుకుంటామని ఆమె చెప్పారు. అమెరికా వత్తిడి, ప్రభావంతో తైవాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న పదిహేను దేశాల్లో హొండూరాస్‌ ఒకటి. ఆ దేశ వ్యవహారాల్లో తమకు వ్యతిరేకంగా అమెరికా వత్తిడి చేస్తోందని చైనా పేర్కొన్నది. గ్జియోమారో ఎన్నిక అమెరికాకు, అక్కడి మీడియాకు ఏ మాత్రం మింగుడు పడదు. అందువలన అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు పూనుకుంటారని వేరే చెప్పనవసరం లేదు. నిరుద్యోగం, నేరాలు, అవినీతి, అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాల కేంద్రంగా ఉంది. వాటిని ఎదుర్కొనే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

క్యూబా పరిణామాలపై ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిన మీడియా !

27 Tuesday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ 1 Comment

Tags

Anti Cuba, Cuba Communist Party, Fidel Castro, Joe Biden


ఎం కోటేశ్వరరావు


క్యూబాలో ఏం జరుగుతోంది ? మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా ? జూలై రెండవ వారంలో అక్కడ జరిగిన ప్రదర్శనల పర్యవసానాలు ఏమిటి ? చిన్న దేశం పెద్ద సందేశం ఇచ్చిన క్యూబా గురించి వామపక్ష శక్తులకే కాదు, యావత్‌ ప్రపంచానికి ఆసక్తి కలిగించేదే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణ ప్రాంతం నుంచి క్యూబా దీవి మధ్య దూరం కేవలం 140 కిలోమీటర్లు మాత్రమే. అంత దగ్గరలో ఉండి 1959 నుంచి అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఉండటానికి క్యూబన్లకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఆసక్తికరం.


తాజా పరిణామాలను చూసి క్యూబా సోషలిస్టు వ్యవస్ధను కూలదోస్తామని చెబుతున్నవారు కొందరు, కమ్యూనిస్టు పార్టీ అంతానికి ఆరంభం అని వెలువడుతున్న విశ్లేషణలు కొన్ని. తమ వ్యవస్ధ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం అని హెచ్చరిస్తున్న క్యూబన్లు.ఆరుదశాబ్దాలుగా అమెరికా అష్టదిగ్బంధనంలో ఉన్న తమను ఇంతకంటే చేసేదేమీ లేదన్న తెగింపు. ప్రపంచంలో మానవత్వాన్ని అమెరికన్లు ఇంకా పూర్తిగా అంతం చేయలేదు, వారెన్ని ఆంక్షలు పెట్టినా మరేం చేసినా మా శక్తికొద్దీ ఆదుకుంటామని క్యూబన్లకు బాసటగా నిలుస్తున్న దేశాలు మరోవైపు.


జూలై రెండవ వారంలో అక్కడి సోషలిస్టు వ్యవస్ధను ఎలాగైనా సరే కూలదోయాలని చూస్తున్న శక్తుల ప్రేరేపితంతో నిరసన ప్రదర్శన ఒకటి, ఆ కుట్రను వమ్ముచేసి దాన్ని కాపాడాకోవాలనే పట్టుదలతో మరొక ప్రదర్శన జరిగింది.ప్రపంచంలో అత్యంత మానవీయ ముఖం తమదని చెప్పుకొనే అమెరికా ఆరు దశాబ్దాలుగా తీవ్రమైన ఆంక్షలను అమలు జరుపుతున్న కారణంగా క్యూబన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుదశాబ్దాలు కాదు మరో అరవై సంవత్సరాలు అదే పనిచేసినా బాంచను దొరా నీకాల్మొక్తా అనేది లేదంటున్న అదే జనం.


ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన కొందరి ప్రదర్శనలకు వచ్చిన ప్రచారంతో పోలిస్తే ప్రభుత్వ అనుకూల ప్రదర్శల గురించి దాదాపు రాలేదనే చెప్పాలి. విపరీత చర్య ఏమంటే రాజధాని హవానాలో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన చిత్రాన్ని వ్యతిరేకుల ఆందోళనగా పశ్చిమ దేశాల కార్పొరేట్‌ మీడియా, వార్తా సంస్దలు చిత్రించగా దాన్ని గుడ్డిగా ప్రపంచ వ్యాపితంగా మీడియా చిలవలు పలవలుగా వార్తలను ఇచ్చింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటించాడు. అమెరికాలో వర్షం పడితే తమ దేశాలలో గొడుగులు పట్టే మరో ఇరవై దేశాలు యుగళగీతాలాపన చేశాయి. వారంతా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు అన్నది స్పష్టం.మరోవైపున నిరసనకారులకు ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.


ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల తరువాత క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. వాటిలో హవానా ప్రదర్శన చిత్రాన్ని ప్రభుత్వ వ్యతిరేకమైనదిగా పశ్చిమ దేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్దలు పేర్కొన్నాయి. ఏపి వార్తా సంస్ధ ఈ తప్పుడు చర్యకు పాల్పడింది. అయితే ప్రదర్శనలో ఉన్న బ్యానర్లపై ఫెడల్‌ కాస్ట్రో నాయకత్వాన సాగిన జూలై 26 ఉద్యమం, తదితర నినాదాలు ప్రభుత్వ అనుకూలమైనవిగా ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు జర్నలిస్టులు ఆ చిత్ర బండారాన్ని బయట పెట్టారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌, వాషింగ్టన్‌ టైమ్స్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వంటి అగ్రశ్రేణి సంస్దలన్నీ చిత్రాన్ని అదే విధంగా వర్ణించాయి. ప్రపంచ వ్యాపితంగా ఈ చిత్రం వైరల్‌ అయింది. దాని ప్రాతిపదికన అనేక మంది విశ్లేషణలు కూడా రాశారు. వాటిలో వెంటనే ఒక్క గార్డియన్‌ మాత్రమే తప్పు జరిగినట్లు అంగీకరిస్తూ సవరణ వేసింది. తమకు వ్యతిరేకంగా ఒక పధకం ప్రకారమే తప్పుడు వార్తల ప్రచారం జరిగినట్లు క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత రోగెలియో పోలాంకో చెప్పారు. గతంలో అనేక చోట్ల రంగు విప్లవాల మాదిరి సామాజిక మాధ్యమాల్లో తిరుగుబాటు యత్నంగా చిత్రించారన్నారు.


క్యూబాలో ఎవరిని గద్దెమీద కూర్చోబెట్టాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది అక్కడి జనం. అక్కడి జనానికి ఆహారం లేదు,ఔషధాలు లేవు, అన్నింటికీ మించి స్వేచ్చ లేదు, అందువలన వారికి మద్దతు ఇస్తున్నామని అధ్యక్షుడు జోబైడెన్‌ నమ్మబలుకుతున్నాడు. ఇలాంటి ప్రచారం కొత్తది కాదు బైడెన్‌ ఆద్యుడు కాదు. ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన అక్కడి జనం నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి కుట్ర చేయని రోజు లేదు. స్పెయిన్‌ సామ్రాజ్యవాదుల ఏలుబడిలో ఉన్న క్యూబా, ఇతర వలసల మీద ఆధిపత్యం ఎవరిది అనే అంశంపై స్పానిష్‌-అమెరికన్ల యుద్దాలు జరిగాయి. క్యూబన్లు కోరుకున్న స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు పలికింది. అదెందుకు అంటే క్యూబాను ఒక బానిస రాష్ట్రంగా మార్చుకోవాలన్నది వారి కడుపులోని దురాశ. స్పెయిన్‌ నుంచి పాక్షిక స్వాతంత్య్రం పొందిన తరువాత అమెరికన్లు ప్రతి రోజు, ప్రతి విషయంలోనూ క్యూబాలో వేలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు తొలిసారి అధికారానికి వచ్చినపుడు బాటిస్టా తీసుకున్న కొన్ని చర్యలను అక్కడి కమ్యూనిస్టు పార్టీతో సహా పురోగమనవాదులందరూ బలపరిచారు.అతగాడు హిట్లర్‌కు వ్యతిరేకంగా నిలిచాడు. అయితే యుద్దం తరువాత 1952లో అధికారానికి వచ్చిన తరువాత పచ్చి నియంతగా మారి ప్రజాఉద్యమాలను అణచివేశాడు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకిగా, తనను వ్యతిరేకించిన వారందరినీ అణచివేశాడు. దానికి ప్రతిఘటన ఉద్యమంలోనే ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి వచ్చాడు.


బాటిస్టాకు అమెరికా మిలిటరీ, ఆర్ధికంగా పూర్తి మద్దతు ఇచ్చింది.అదే అమెరికా ఫిడెల్‌ కాస్ట్రోను హతమార్చటానికి చేసినన్ని ప్రయత్నాలు మరేదేశనేతమీదా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు వాటిని కొనసాగిస్తూనే ఆర్ధిక దిగ్బంధనానికి పూనుకుంది. అమెరికా గనుక బాటిస్టా అవినీతి, అక్రమాలు, అణచివేతలను వ్యతిరేకించి ఉంటే అసలు కాస్ట్రోకు అవకాశమే ఉండేది కాదని, అనవసరంగా తలనొప్పిని కొని తెచ్చుకున్నారని నిట్టూర్పులు విడిచేవారు కూడా ఉన్నారు. అనేక చిన్నదేశాల మీద అమెరికన్లు పెద్ద ఆయుధాలు ఉపయోగించి చివరికి పరువు పోగొట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది.దానికి క్యూబాయే నాంది పలికింది. కూతవేటు దూరంలో ఉన్న క్యూబా మీద బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కిరాయి మూకలను దింపి అమెరికా చేతులు కాల్పుకుంది. మరింత పరువు పోతుందనే భయం కారణంగానే యుద్దానికి దిగలేదు గానీ అంత కంటే భయంకరమైన ఆర్ధిక దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నారు. బరాక్‌ ఒబామా అయినా డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా కుడి ఎడమల తేడా తప్ప ఎవరూ తక్కువ తినలేదు. ఒబామా హయాంలో ఆంక్షలను పరిమితంగా సడలించారు. అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చూస్తే చరిత్ర పునరావృతం అవుతోందన్నది స్పష్టం. అయినా క్యూబన్లు లొంగలేదు.


ఇప్పుడు క్యూబాలో పరిస్ధితి ఎందుకు దిగజారింది? కరోనా మహమ్మారి చైనా, వియత్నాం వంటి కొన్ని దేశాలను తప్ప యావత్‌ ప్రపంచాన్ని ఆర్ధికంగా కుంగతీసింది. క్యూబా ఆర్ధిక వ్యవస్ధలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉండేది. కరోనా కారణంగా 2020లో 75శాతం తగ్గిపోయారు. అది ఆర్ధిక పరిస్దితిని మరింత దిగజార్చింది. చౌకగా చమురు అందిస్తున్న వెనెజులాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సరఫరాలు తగ్గిపోయాయి. ఇలా అనేక కారణాలు పరిస్ధితిని దిగజార్చాయి.


క్యూబా గురించి తప్పుడు వార్తలతో ఆన్‌లైన్‌ మీడియా సంస్దలు సొమ్ము చేసుకున్నాయని ఆల్‌ జజీరా పత్రిక ఒక విశ్లేషణ రాసింది. మాజీ అధ్యక్షుడు, ఫిడెల్‌ కాస్ట్రో సోదరుడు రావుల్‌ కాస్ట్రో దేశం విడిచి వెనెజులాకు పారిపోయాడని, నిరసనకారులు కమ్యూనిస్టు పార్టీ నేతలను బందీలుగా పట్టుకున్నారని, క్యూబాకు వెనెజులా సైన్యాన్ని పంపుతున్నదనే తప్పుడు వార్తలు వైరల్‌ అయ్యాయి. 2018లో కూబ్యా మే దినోత్సవం, 2011లో ఈజిప్టులో జరిగిన నిరసన ప్రదర్శనల చిత్రాలను కూడా క్యూబా నిరసనలుగా చిత్రించి వైరల్‌ చేశారు. వీటిని చూసి ఏమి కాలమిస్టులు, ఏమి అబద్దాలు, ఇది మీడియా ఉగ్రవాద వ్యక్తీకరణ అని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ వ్యాఖ్యానించాడు. తప్పుడు వార్తల గురించి విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పుకొనే సామాజిక మాధ్యమ సంస్దలు ఎలా రాజకీయాలు చేస్తున్నాయో ఈ పరిణామం వెల్లడించిందని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్‌ వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తల గురించి వివరణ కోరగా ఫేస్‌బుక్‌ వెంటనే స్పందించలేదని ఆల్‌ జజీరా రాసింది.
క్యూబాలో గత కొద్ది సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది.దాంతో సామాజిక మాధ్యమ ప్రచారం పెద్దఎత్తున కూడా జరుగుతోంది. కొన్ని స్వతంత్ర మీడియా సంస్దలను కూడా అనుమతించారు దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికా సంస్దలు పధకం ప్రకారం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, స్వతంత్ర మీడియా సంస్దల ద్వారా సాగించిన ప్రచారానికి అసంతృప్తితో ఉన్న క్యూబన్లు తప్పుదారి పట్టి ప్రదర్శలకు దిగారని కొందరు విశ్లేషించారు.


క్యూబాకు జూలై 26 ఒక స్ఫూర్తి దినం. ప్రతి ఏటా సామ్రాజ్యవాదం గురించి గుర్తు చేస్తూ మాతృభూమి లేదా మరణమే శరణ్యం అంటూ ప్రతిజ్ఞలు చేయిస్తారు. 1953లో బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో నాయకత్వాన తిరుగుబాటును ప్రారంభించిన రోజు. ఆరు సంవత్సరాల తరువాత 1959లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఈ సంవత్సరం కరోనా కారణంగా గతంలో మాదిరి పెద్ద సభలు, ప్రదర్శనల వంటివి జరపలేదు.అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌తో సహా అందరూ పిల్లలతో కలసి దేశవ్యాపితంగా లెట్యూస్‌ అని పిలిచే ఒక ఆకు కూర మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. క్యూబా ఎదుర్కొంటున్న సమస్యల తీరుతెన్నులను తెలుసుకొనేందుకు ఒక్క ఉదాహరణ చాలు. క్యూబా కంటే అనేక పెద్ద దేశాలు, ఆర్ధికంగా బలమైనవి ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ల తయారీకి పూనుకోలేదు. అలాంటిది నిధులకు కటకటగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తాన్ని వెచ్చించి కరోనా వైరస్‌ నివారణకు వారు ఐదు వాక్సిన్లను రూపొందిస్తున్నారు. అయితే తయారు చేసిన వాటిని తరలించేందుకు అవసరమైన వాహనాలు నడిపేందుకు అవసరమైన డీజిలు, పెట్రోలు, వాక్సిన్లు నింపేందుకు అవసరమైన ప్రత్యేక సీసాలు, ఇంజెక్షన్ల తయారీ ఇబ్బందిగా మారింది.అయినా మూడో వంతు మందికి ఒక డోసు వాక్సిన్‌ వేశారు, నాలుగో వంతుకు రెండు డోసులూ ఇచ్చారు.


క్యూబన్లపై విధిస్తున్న ఆంక్షలను మానవహక్కుల ఉల్లంఘనగా వాటి గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా పరిగణించటం లేదు.తాజాగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతు ఇవ్వటం ఐక్యరాజ్యసమితి నిబంధనల ఉల్లంఘన తప్పమరొకటి కాదు. తాజాగా మరికొన్ని ఆంక్షలను ప్రకటిస్తూ బైడెన్‌ సర్కార్‌ ఇవి ఆరంభం మాత్రమే త్వరలో మరిన్ని ప్రకటిస్తామని బెదిరింపులకు దిగింది. అనేక దేశాలు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. క్యూబా తమకు శాశ్వత మిత్రదేశమని చైనా గతంలోనే ప్రకటించింది. పది బిలియన్‌ డాలర్ల అప్పును వివిధ దేశాలకు చైనా రద్దు చేయగా దానిలో సగం క్యూబాదే ఉన్నట్లు ్ల 2019 మే 29వ తేదీన ఫోర్బ్స్‌ డాట్‌కామ్‌ ఒక వార్తను ప్రచురించింది. అదే విధంగా కరోనా వాక్సిన్ల రూపకల్పన, స్మార్ట్‌ ఫోన్ల తయారీ, ఔషధాల వంటి అంశాలలో కూడా తోడ్పాటు ఇస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. వివిధ కారణాలతో పలు దేశాలు చేస్తున్న సాయం గురించి వార్తలు రావటం లేదు.


అమెరికా బెదిరింపులు, ఆంక్షలను తోసి పుచ్చి మెక్సికో ఒక టాంకరులో రెండు కోట్ల లీటర్ల డీజిల్‌ను క్యూబాకు తరలించింది. సోమవారం నాడు హవానా రేవుకు చేరనుందని వార్తలు వచ్చాయి.అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ దీని గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ సౌహార్ద్రత, మానవతా సాయంగా రెండు ఓడల్లో డీజిల్‌, ఆహారం పంపనున్నట్లు చెప్పారు.ఆంక్షలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. తమ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఆదేశాల మేరకు రెండు విమానాల్లో వంద టన్నుల సామగ్రిని తరలించినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. వాటిలో ఆహారంతో పాటు పిపిఇ కిట్లు, మెడికల్‌ మాస్కులు ఉన్నాయి. కొద్ది వారాల క్రితమే ఐరాస సాధారణ అసెంబ్లీలో క్యూబాపై ఆర్ధిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనే తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా 184దేశాలు అనుకూలంగా అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకంగా ఓటు వేశాయి.బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, కొలంబియా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.


అమెరికాకు పారిపోయి వచ్చిన నియంత బాటిస్టా మద్దతుదారులకు 1961లో సిఐఏ ఆయుధాలు ఇచ్చి బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కాస్ట్రో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కిరాయి మూకలను పంపింది. మూడు రోజుల్లోనే వారందరినీ అదుపులోకి తీసుకొని అణచివేశారు.ఇది కమ్యూనిస్టు క్యూబా చేతిలో అమెరికన్లు తిన్న తొలి ఎదురుదెబ్బ. ఆ మరుసటి ఏడాదే సోవియట్‌ యూనియన్‌ అమెరికాను హెచ్చరిస్తూ క్యూబా గడ్డపై క్షిపణులను మోహరించింది. 1962లో అధ్యక్షుడు కెన్నడీ మాట్లాడుతూ ఒక నాటికి అమెరికాకు వచ్చిన క్యూబన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ స్వేచ్చ ఉండే క్యూబాలో అడుగు పెడతారని వారిని ఉద్దేశించి ప్రసంగించాడు. కెనడీ మరణించేంతవరకు అదే భ్రమలో ఉన్నాడు, చేయించదలచిన దుర్మార్గాలన్నింటికీ ఆమోదం తెలిపాడు. అప్పటి నుంచి బాటిస్టా మద్దతుదారులు క్యూబాకు పొరుగున ఉండే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నివాసాలు ఏర్పరుచుకొని విద్రోహాలకు పాల్పడుతూ తరాలు మారినా ఇప్పటికీ అదే కలలు కంటున్నారు. క్యూబన్లు లొంగుతారా ? నియంత బాటిస్టాకే సలాం గొట్టని వారు అమెరికాకు సలాం కొడతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చిలీ అధ్యక్ష పోటీలో ముందున్న కమ్యూనిస్టు అభ్యర్ధి !

03 Saturday Jul 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Chile Presidential Election 2021, Communist Party of Chile(pcch), Daniel Jadue


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది నవంబరు 21న జరగనున్న చిలీ అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్ధిగా అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నేత డేనియల్‌ జాడ్యు ముందుకు దూసుకు వస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. వివిధ పార్టీల అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయనప్పటికీ కాగల అభ్యర్ధులను ఊహించి సర్వేలు చేస్తున్నారు. మే నెలలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో విజయం సాధించిన రెండు వామపక్ష సంఘటనలు, మరొక వామపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి. వారిలో అంతిమంగా జాడ్యు అభ్యర్దిగా నిర్ణయం అవుతారని భావిస్తున్నారు. అదే జరుగుతుందా, మరో వామపక్ష అభ్యర్ధి రంగంలో ఉంటారా అన్నది త్వరలో తేల నుంది. ఈనెల 18న వివిధ పార్టీలు,కూటములు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి.


రాజధాని శాంటియాగో మహానగరంలో ఉన్న రికొలెటా ప్రాంత కార్పొరేషన్‌ మేయర్‌గా ఇటీవల జాడ్యు తిరిగి ఎన్నికయ్యారు. పాలస్తీనా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన జాడ్యు తొలి దశలో పోటీ ఎలా జరిగినప్పటికీ మెజారిటీ రాకపోతే రెండవ దఫా ఎన్నికలో అయినా విజేతగా కాబోయే అధ్యక్షుడంటూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, బొలీవియా, బ్రెజిల్‌, అర్జెంటీనా తదితర దేశాలలో వామపక్ష అధ్యక్షులుగా ఎన్నికైన వారందరూ వామపక్షాలకు చెందిన వారు, మార్క్సిజం-లెనిజం పట్ల విశ్వాసం ప్రకటించిన వారే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. సామ్రాజ్యవాదులు కుట్రలకు పాల్పడి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము గానీ లేనట్లయితే లాటిన్‌ అమెరికాలో మరో ఎర్రమందారం వికసించటం ఖాయంగా కనిపిస్తోంది.తొలి దశలోనే మెజారిటీ సంపాదిస్తారా లేక రెండవ పోటీలోనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నూతన రాజ్యాంగ పరిషత్‌, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలలో అదే పరంపరను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం పచ్చి మితవాది సెబాస్టియన్‌ పినేరా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష శక్తులు, వారిని బలపరిచే వారే మెజారిటీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు జాడ్యుతో పాటు మితవాద పార్టీలైన ఇండిపెండెంట్‌ డెమ్రోక్రటిక్‌ యూనియన్‌ అభ్యర్ధి జాక్విన్‌ లావిన్‌, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన యాసనా ప్రొవోటే మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు.
లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నది. గతనెల ఆరున పెరూలో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో నలభైవేలకు పైగా మెజారిటీతో గెలుపొందినప్పటికీ ఇంతవరకు ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష మితవాద అభ్యర్ధి చేసిన ఫిర్యాదును విచారించే పేరుతో కాలయాపన చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రెజిల్‌లో తిరిగి వామపక్ష నేత లూలా డ సిల్వా తిరిగి ఎన్నిక కానున్నారని, నికరాగువాలో అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా తిరిగి విజయం సాధించనున్నారనే వాతావరణం ఉంది. దానికి అనుగుణ్యంగానే చిలీ పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.


ప్రజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం, వివిధ సేవల ప్రయివేటీకరణ చర్యలతో లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు జరిపిన నూతన ఆర్ధిక లేదా నయా ఉదారవాద విధానాలు సామాన్య జనజీవితాలను దిగజార్చాయి. ధనికుల మీద పన్ను భారం పెంచటం, పెన్షన్‌ వ్యవస్ధను పునర్వ్యస్తీకరించటం, ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ ప్రమేయం పెంపు, పన్నులు ఎగవేసేందుకు కంపెనీలు సరిహద్దులు దాటి పోవటాన్ని నిరోధించటం వంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ప్రపంచంలో అత్యధిక రాగి నిల్వలను కలిగి ఉన్న చిలీ సంపదను బహుళజాతి గుత్త సంస్ధల పాలు చేయకుండా ప్రజల కోసం వినియోగించాలని చెప్పింది. ఖనిజ సంపదకు రాజ్యం యజమాని గనుక అన్ని కార్యకలాపాలలో అది భాగస్వామిగా ఉండాలని కోరింది. సమస్యలపై ఉద్యమించిన ప్రజా సమూహాలపై మాజీ నియంత పినోచెట్‌ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు పినేరా మిలిటరీని ప్రయోగించిన తాజా నిరంకుశుడిగా చరిత్రకెక్కాడు.


కమ్యూనిస్టు నేత జాడ్యు ప్రజాదరణ పొందుతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తుండటంతో మితవాద శక్తులు ఆయన్ను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నాయి. కమ్యూనిస్టును ఎన్నుకుంటే ప్రమాదమని జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అధ్యక్షపదవి అభ్యర్ధిగా ఉన్న జాడ్యు పాఠశాల్లో చదువుకొనే రోజుల్లో యూదు వ్యతిరేకిగా ఉన్నాడని అభిశంసిస్తూ పార్లమెంట్‌లోని మితవాద ఎంపీలు ఒక తీర్మానంలో ధ్వజమెత్తారు. అనుకూలంగా 79 వ్యతిరేకంగా 47 వచ్చాయి. చిలీలో యూదులు ఇరవై వేలకు మించి లేనప్పటికీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని ఆయన కొట్టిపారవేశారు. చిలీలో పాలస్తీనా మూలాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉన్నారు. జాడ్యు క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. ఆయన తాతల కాలంలో పాలస్తీనా నుంచి చిలీకి వలస వచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోలో 1967 జూన్‌ 28జన్మించిన జాడ్యు పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌ యూదుల దురంతాలను వ్యతిరేకించాడు. పాలస్తీనా విముక్తికి మద్దతుగా చిలీ లోని పాలస్తీనియన్‌ విద్యార్ధి సంఘం, తరువాత కమ్యూనిస్టు విద్యార్ధి సంఘ నేతగా, పని చేశారు. నియంత పినోచెట్‌కు మద్దతుదారు అయిన తండ్రిని ఎదిరించి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు.1993లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.2012 నుంచి రికొలెటా కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేస్తున్నారు. పేదలకు అవసరమైన జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపి ప్రశంసలు పొందారు.


జాడ్యు పాఠశాలలోనే ఇజ్రాయెల్‌ దురహంకారం, పాలస్తీనియన్లపై జరుపుతున్న దురాగతాలను వ్యతిరేకించేవాడు. ప్రతి సంవత్సరం ప్రచురించే పాఠశాల ప్రత్యేక సంచికలో జాడ్యు స్నేహితులు సరదాగా అనేక వ్యాఖ్యలు రాస్తుండేవారు.వాటిలో ” అతని వాంఛ యూదుల నగరాన్ని శుద్ధి చేయటం, అతని లక్ష్య సాధన కసరత్తుకు తగిన బహుమానం ఒక యూదును ఇవ్వటమే ” వంటి వ్యాఖ్యలు చేసే వారు. అతని రికార్డులో పాఠశాల తనిఖీ అధికారి జాడ్యు యూదు వ్యతిరేకి అని రాశాడు. చిలీ యూదుల నేత ఒకరు ఈ విషయాలున్న పత్రాల కాపీని ట్వీట్‌ద్వారా ఎంపీలు, ఇతరులకు పంపాడు. దాన్ని పట్టుకొని పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసింది. ఇదంతా అతను ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధిగా ముందుకు వస్తున్న నేపధ్యంలోనే జరిగింది.


పార్లమెంట్‌ తీర్మానాన్ని జాడ్యు కొట్టిపారవేశాడు.” దేశం ఇప్పుడు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా సంక్షోభంతో ఉంది. వందలాది మంది మరణిస్తున్నారు, కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. కానీ మితవాద ఎంపీలు 35 సంవత్సరాల క్రితం ఇతరులు స్కూలు పత్రికలో నా గురించి రాసినదాన్ని వివరించటానికి తీవ్రంగా శ్రమించారు. పాఠశాల తనిఖీ అధికారి రాసిన వాటిని నేను అప్పుడే ఖండించాను ” అని చెప్పాడు. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం జాడ్యుకు 38శాతం మద్దతు ఉండగా అతని సమీప ప్రత్యర్ధికి 33శాతం ఉంది.


చిలీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు భావజాలంతో పని చేసింది) నేత సాల్వెడార్‌ అలెండీ లాటిన్‌ అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్షవాది.1970 నవంబరు మూడు నుంచి 1973 సెప్టెంబరు 11న సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయేంతవరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలెండీ కొనసాగితే లాటిన్‌ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు ఊపందుకుంటాయనే భయంతో అమెరికా సిఐఏ కుట్రలో భాగంగా మిలిటరీ అధికారి పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. మిలిటరీని ఎదుర్కొనే క్రమంలో అలెండీ స్వయంగా, అనుచరులు కూడా ఆయుధాలు చేపట్టారు. అయితే తగిన విధంగా పార్టీ నిర్మాణం, సన్నద్దత లేకపోవటంతో మిలిటరీదే పైచేయి అయింది. తరువాత అమెరికా చికాగో విశ్వవిద్యాలయంలో చదివిన ఆర్ధికవేత్తలను చిలీతో పాటు దాదాపు అన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు అమెరికా పంపటమే గాక ఉదారవాద విధానాల అమలుకు ఆ ఖండాన్ని ప్రయోగశాలగా చేసింది. అందువలనే ఆ విధాన ఆర్ధికవేత్తలందరినీ ” చికాగో బాలురు ” అని పిలిచారు. రాజ్యాంగాల రచనల నుంచి అన్నింటా వారి ముద్ర ఉండేది. తాజా రాజ్యాంగ ఎన్నికలలో వామపక్ష, అభ్యుదయవాదులు విజయం సాధించటంతో చిలీలో వారి శకం అంతరించినట్లే అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అలెండీ నాయకత్వం వహించిన పార్టీలో తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు.


నూటతొమ్మిది సంవత్సరాల క్రితం 1912 జూన్‌ నాలుగున ఏర్పడిన చిలీ కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకొన్నది.. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు 1912లో సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల తరువాత అదే కమ్యూనిస్టు పార్టీగా మారింది.1938లో పాపులర్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తరువాత డెమోక్రటిక్‌ కూటమిలో ఉంది. పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి బలం పుంజుకుంటున్న తరుణంలో 1948 నుంచి 58వరకు పార్టీపై నిషేధం విధించారు.1960 దశకంలో తిరిగి బహిరంగంగా పని చేయటం ప్రారంభించింది. పాబ్లో నెరూడా వంటి నోబెల్‌ బహుమతి గ్రహీత కవి, తదితర ప్రముఖులు పార్టీలో పని చేశారు.1970లో అలెండీ నాయకత్వంలో పాపులర్‌ యూనిటీ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వంలో చేరింది. అలెండీ సర్కార్‌ను కూలదోసిన మిలిటరీ నియంత పినోచెట్‌ 1973 నుంచి 1990 వరకు పార్టీపై నిషేధం అమలు జరిపాడు. మరోసారి కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్లారు.1977లో గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు రికార్డో లాగోస్‌ ఎన్నిక వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. తరువాత 2006లో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు మిచెల్లీ బాచెలెట్‌ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని శాంటియాగోతో సహా అనేక చోట్ల మేయర్లుగా ఎన్నికయ్యారు.1927-31, 1948-1958, 1973-1990 సంవత్సరాల మధ్య నిర్బంధాలకు గురికావటంతో పాటు పినోచెట్‌ పాలనలో పలువురు నేతలతో సహా వేలాది మంది కమ్యూనిస్టులు హత్యలకు గురయ్యారు. తిరుగుబాటు సమయంలో అలెండీని మిగతా వామపక్షాలు వదలి వేసినప్పటికీ కమ్యూనిస్టులు ఆయనతో భుజం కలిపి పినోచెట్‌ను ఎదుర్కొన్నారు. పినోచెట్‌ హయాంలో తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు రహస్యంగా పని చేశారు.


చిలీలో గతంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకత, భయం తగ్గిపోతున్నదని 31 ఏండ్ల యువతి, శాంటియాగో నగరంలోని ముగ్గురు కమ్యూనిస్టు మేయర్లలో ఒకరైన జవీరా రేయాస్‌ చెప్పారు. డేనియల్‌ జాడ్యూ మేయర్‌గా ఒక ఆదర్శం అన్నారు. కార్పొరేషన్‌ తరఫున ఔషధ దుకాణాలు, కండ్లజోళ్ల షాపులు, పుస్తకాల షాపులు, రియలెస్టేట్‌ తదితర సంస్దలను నడుపుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలతో కమ్యూనిస్టు మేయర్లు మున్సిపల్‌ సోషలిజాన్ని (పేదల పక్షపాతం) అమలు జరుపుతారని అన్నారు. 2006లో విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్దుల నాయకురాలిగా ఆమె ప్రస్తానం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు మరో మేయర్‌ హాస్లర్‌తో పాటు అనేక మంది విద్యార్ధి నేతలు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గతంలో 1931, 32, 1999లో కమ్యూనిస్టు పార్టీ తరఫున అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే చిలీ తొలి కమ్యూనిస్టు అధ్యక్షుడిగా డేనియల్‌ జాడ్యు చరిత్రకెక్కుతాడు. ఆయన కూడా విద్యార్ధినేతగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కోవాగ్జిన్‌ కుంభకోణంలో బ్రెజిల్‌ బోల్సనారో – కరోనా వైఫల్యంపై రాజీనామాకు జనం డిమాండ్‌ !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Covaxin, Covid-19 in Brazil, Jair Bolsonaro, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
వాక్సిన్లు, ఆహారం అందించలేని బోల్సనారో గద్దె దిగు అంటూ గత శనివారం నాడు బ్రెజిల్‌లోని నాలుగు వందల పట్టణాలలో ఏడున్నరలక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలకారణంగా ప్రదర్శనలు నిర్వహించలేదు. అంతకు ఇరవై రోజుల ముందు జరిగిన నిరసనలో కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.పదిహేడు దేశాలలో ఉన్న బ్రెజిల్‌ పౌరులు, ఇతరులు కూడా నిరసన తెలిపారు. కరోనా మరణాలు ఐదులక్షలకు చేరిన సందర్భంగా జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరసనతో గుక్కతిప్పుకోలేకపోతున్న అధ్యక్షుడు బోల్సనారో సోమవారం నాడు తన ఆగ్రహాన్ని ఒక టీవీ జర్నలిస్టు మీద చూపాడు.అతగాడి దురుసు ప్రవర్తనను ఖండిస్తూ పదవికి రాజీనామా చేయాలని జర్నలిస్టు యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపున మన దేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కోవాగ్జిన్‌ వాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ఎత్తున వత్తిడి చేసినట్లు వెలువడిన వార్తలు బోల్సనారోను మరింత ఇరకాటంలోకి నెట్టాయని చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో వామపక్ష వర్కర్స్‌ పార్టీకి వ్యతిరేకంగా బోల్సనారోకు ఓటు వేసిన వారు కూడా రెండేళ్లలో దేశానికి చేసిన నష్టం చాలు గద్దె దిగు అంటూ శనివారం నాటి ప్రదర్శనల్లో నినదించారంటే వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో కోటీ 78లక్షల మందికి వైరస్‌ సోకింది, వారిలో ఐదు లక్షల మంది మరణించారు. ఐసియు పడకలు, ఆక్సిజన్‌ సరఫరాలేక అనేక మంది దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ బోల్సనారో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు ఒక మిలిటరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు కూడా ముఖానికి తొడుగు లేకుండా ఉన్నారు. దాంతో గతంలో మీరు ముఖతొడుగు ధరించనందుకు అనేక సార్లు జరిమానా చెల్లించారు కదా అని బ్రెజిల్‌ అతిపెద్ద మీడియా సంస్ద వాన్‌గార్డ్‌ విలేకరి గుర్తు చేయటంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నా ప్రాణం, నా ఇష్టం, తొడుగులేకుండా వస్తాను, నువ్వు నోరు మూసుకో, మిమ్మల్ని చూస్తే అసహ్యం, మీది చెత్త జర్నలిజం, మీదొక పెంట మీడియా, మీరు బ్రెజిల్‌ కుటుంబాలను, మతాన్ని నాశనం చేశారు అంటూ వీరంగం వేశాడు. ఇదిగో ముఖతొడుగు దీన్ని నేను ధరించటం లేదు, ఇప్పుడు మీకు సంతోషమేగా రాత్రి జాతీయ వార్తా కార్యక్రమంలో చూపండి అన్నాడు.మీడియా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సోమవారం నాడు బోల్సనారో విలేకర్ల సమావేశంలో ఆరోపించాడు. సిఎన్‌ఎన్‌ టీవీ శనివారం నాడు ప్రదర్శనలు జరిపిన వారిని ప్రశంసించిందన్నారు. ఆ సందర్భంగానే వాన్‌ గార్డ్‌ టీవి విలేకరి శాంటోస్‌పై విరుచుకుపడ్డారు.
తానుగా ముఖతొడుగును ధరించకపోవటమే గాక కరోనా నిరోధ చర్యలను తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. ముఖతొడుగులు, వాక్సిన్ల వలన ఉపయోగం లేదని పదే పదే చెప్పాడు. తాను అధికారంలో ఉన్నంత వరకు కరోనా మీద పోరాడతా, ముఖతొడుగులు ధరించాల్సిన అవసరం లేదని ప్రతి గురువారం దేశ ప్రజల నుద్దేశించి చేసే ఉపన్యాసంలో కూడా చెప్పాడు. ఫార్మాకార్పొరేట్ల ప్రయోజనం కోసం కరోనాను నిరోధించలేని ఔషధాలను వినియోగించాలని ప్రబోధించాడు. ప్రయోజనం లేదని తేలినప్పటికీ దిగుమతి చేసుకున్న కంపెనీలకు అనుకూలంగా మలేరియా నిరోధానికి వినియోగించే క్లోరోక్విన్‌తో చికిత్స చేయాలని వివిధ సందర్భాలలో 84 సార్లు చెప్పాడు. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా జనంలో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద కూడా తాజా నిరసనల ప్రభావం పడటం అనివార్యం. పదవికి రాజనామా చేయాలని కోరుతూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడవ తరంగం కరోనా రానుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం మీద మరింత వత్తిడి తెచ్చేందుకు మే, జూన్‌లో జరిగిన ప్రదర్శనల కొనసాగింపుగా తదుపరి కార్యాచరణకు ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్దలూ త్వరలో సమావేశం కానున్నాయి.ఇంతకాలం బోల్సనారోకు మద్దతు ఇచ్చిన మీడియా కూడా ప్రజల్లో వెల్లడౌతున్న నిరసన కారణంగా గుడ్డిగా సమర్ధిస్తే పూర్తిగా విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందనే భయం లేదా ఎంత బలపరిచినా తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్న అంచనాకు రావటం వల్లగానీ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా మహమ్మారి సమస్య మీద రాజకీయంగా విబేధించే శక్తులు కూడా ఈ ప్రదర్శనల్లో భాగస్వాములయ్యాయి. బహుశా ఈ కారణంగానే చీటికి మాటికి నియంత బోల్సనారో మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. అయితే ధనిక తరగతులు మాత్రం బోల్సనారోకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బోల్సనారోపై ప్రతిపక్షం 122 అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటి మీద పార్లమెంట్‌ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఏ అధ్యక్షుడూ ఇలాంటి నిరసనను ఎదుర్కోలేదు.
కరోనా పట్ల నిర్లక్ష్యానికి నిరసనలు ఒక్క బ్రెజిల్‌కే పరిమితం కాలేదు, కొలంబియా, పరాగ్వే,పెరూల్లో కూడా జరిగాయి.బ్రెజిల్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఇరుగు పొరుగు దేశాలకు కూడా అక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక కొత్త రకాల వైరస్‌లు బయటపడ్డాయి. జనంలో వ్యతిరేకత పెరుగుతుండటాన్ని గమనించిన బోల్సనారో మే ఒకటవ తేదీన తన మద్దుతుదార్లతో ప్రదర్శనలు చేయించాడు. ఇప్పుడు మిలిటరీ జోక్యం చేసుకోవాలి, నేను అంగీకరిస్తున్నాను అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కరోనా నిబంధనలను జనాలు పాటించటం లేదు కనుక మిలిటరీ జోక్యం చేసుకొని అయినా నియంత్రణలను అమలు జరపాలని జనం కోరుతున్నారనే పేరుతో ఆ ప్రదర్శనలు చేయించారు. మే 29వ తేదీన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు జరిపిన ప్రదర్శనల్లో వాటికి ప్రతిగా నేను అంగీకరించటం లేదు, మిలిటరీ వద్దు అంటూ ప్రదర్శకులు బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. తనకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారు సామాన్య జనం అని వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వారు కిరాయి, అల్లర్లు చేసే వారు, ఉగ్రవాదులు అని బోల్సనారో వర్ణించాడు.
అధికారానికి వచ్చినప్పటి నుంచి బోల్సనారో వివాదాస్పద అధ్యక్షుడిగా తయారయ్యాడు. గతేడాది ఆగస్టులో అతగాడి పాలన బాగుందని చెప్పిన వారు 37శాతం మంది కాగా జనవరిలో 31శాతానికి పడిపోయింది. కరోనా సాయం నిలిపివేసిన తరువాత అదే నెలలో జరిగిన సర్వేలో 24శాతానికి దిగజారింది. దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారింది.కోటీ44లక్షల మంది నిరుద్యోగులున్నారు.వారిలో కేవలం 16శాతం మంది మాత్రమే బోల్సనారోను సమర్ధిస్తున్నారు. బెల్జియన్‌ రియల్స్‌ 2,200(మన కరెన్సీలో 32వేలు) లోపు ఆదాయం వచ్చే వారిలో 55శాతం మంది బోల్సనారోకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారని సర్వే తెలిపింది. ఏడాదిన్నర తరువాత జరిగే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే నిర్ధారణలకు రావటం తొందరపాటు కావచ్చుగానీ అప్పటికి పరిస్ధితి మెరుగుపడే సూచనల్లేవు.
భారత బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ వాక్సిన్లను కొనుగోలుకు హామీ ఇవ్వాలని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నిఘా సంస్ధ మీద తీవ్ర వత్తిడి వచ్చినట్లు పోహా అనే పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుగుతోంది. మారినో అనే ఒక సైనికాధిరిని ఆర్యోగ వస్తు,ఔషధాల సరఫరా నిమిత్తం గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి నియమించాడు. సదరు సైనికాధికారి జాతీయ ఆరోగ్య సంస్ద మీద వత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. వాక్సిన్ల సరఫరా గురించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బ్రెజిల్‌ సంస్ధ ఒప్పంద షరతులను ఉల్లంఘించినట్లు తేలింది. ఇతర కంపెనీలు తక్కువ ధరలకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ భారత బయోటెక్‌ నుంచి ఒక మోతాదు 15 డాలర్ల చొప్పున రెండు కోట్ల మోతాల కొనుగోలుకు అవగాహన కుదిరింది.ఒప్పందం ప్రకారం ఈపాటికే వాక్సిన్‌ బ్రెజిల్‌ చేరి ఉండాలి.ఈ ఒప్పందం చేసుకున్న సంస్ద బోల్సనారోకు సన్నిహితమైంది కావటంతో అధ్యక్ష కార్యాలయం నుంచే వత్తిడి జరిగిందన్నది స్పష్టం.వాక్సిన్‌ గురించి ప్రదాని నరేంద్రమోడీకి బోల్సనారో ఫోన్‌ చేసిన తరువాతే ఒప్పందం ఖరారైనట్లు చెబుతున్నారు. గత సంవత్సరం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు ప్రయివేటు సంస్దల తరఫున బోల్సనారో మన ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. అందువలన క్లోరోక్విన్‌, వాక్సిన్‌ తయారీ కంపెనీలతో నరేంద్రమోడీకి ఆసక్తి ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
బ్రెజిల్‌లో ప్రస్తుతం చైనా వాక్సిన్‌ సినోవాక్‌, అమెరికా ఫైజర్‌, మరో కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను మూడవ దశ ప్రయోగాల తరువాత సాధారణ లేదా అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చారు. వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన మార్పి ఒప్పందాలన్నీ మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రభుత్వ సంస్దలే చేసుకున్నాయి. దానికి భిన్నంగా కోవాగ్జిన్‌కు ఆ నిబంధనలను సడలించారు. ఒప్పందం జరిగిన సమయానికి బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు జరగలేదు, భారత్‌లో జరిగిన ప్రయోగాల సమాచారాన్ని కూడా అందచేయలేదు. ఇతర వాక్సిన్లకంటే ముందే చెప్పుకున్నట్లు మధ్యవర్తి కంపెనీ అధికధరలకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 25న ఒప్పందం చేసుకున్న తరువాత నెల రోజుల్లోపల 80లక్షల మోతాదులను సరఫరా చేయాలి.అయితే ఆ గడువు సెప్టెంబరుకు పెరగవచ్చంటున్నారు. మన దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ప్రభుత్వం మీద తీవ్రవత్తిడి రావటంతో ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందానికి తొమ్మిది రోజుల ముందు బ్రెజిల్‌ మంత్రి కోవాగ్జిన్‌ గురించి బ్రెజిల్‌ రాష్ట్రాల గవర్నర్లకు వివరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 80లక్షల మోతాదుల చొప్పున మే నెలలో నలభై లక్షల మోతాదులు సరఫరా అవుతాయని చెప్పాడు. వాక్సిన్‌కు సంబంధించి వివరాలు లేకపోవటం, తయారీలో ప్రమాణాలు పాటిస్తున్నట్లు తమకు విశ్వాసం లేనందున వాక్సిన్ను తిరస్కరిస్తున్నట్లు మార్చి 31న బ్రెజిల్‌ ప్రభుత్వ సంస్ద ప్రకటించింది. భారత వాక్సిన్లను రానివ్వకుండా బ్రెజిల్‌ నియంత్రణ సంస్ద జాతీయవాదంతో వ్యవహరించిందని భారత బయోటెక్‌ అధిపతి ఎల్లా కృష్ణ ఆరోపించారు. మొత్తం మీద బ్రెజిల్‌ విచారణ ఎవరి పాత్రను ఎలా బయట పెడుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెరూలో వామపక్ష విజయాన్ని వమ్ము చేసే కుట్ర !

18 Friday Jun 2021

Posted by raomk in CHINA, History, imperialism, Latin America, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Coup in Peru, Pedro Castillo, Pedro Castillo claims victory, Peru presidential election 2021, Socialist Castillo


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 3


ఎం కోటేశ్వరరావు


జూన్‌ ఆరవ తేదీన లాటిన్‌ అమెరికాలోని పెరూలో పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. లెక్కింపు పూర్తయినప్పటికీ ఇంకా అధ్యక్ష పదవికి ఎన్నికైన వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలోను ఎన్నికల సంఘం ఇంకా ధృవీకరించలేదు.ప్రజాతీర్పును వమ్ము చేసే కుట్ర దీనివెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలు దామాషా ప్రాతిపదికన జరగ్గా అధ్యక్ష ఎన్నికలు మరోవిధంగా జరిగాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తొలి పోలింగ్‌లోనే సగానికి పైగా ఓట్లు తెచ్చుకుంటే మలి ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా గెలిచిన వారిని అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు. లేనపుడు పోటీ చేసిన అభ్యర్ధులలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య రెండవ సారి ఎన్నిక జరుపుతారు. ఆ విధంగా ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో ఫలితం తేలలేదు. జూన్‌ ఆరున జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో 50.127శాతం ఓట్లు తెచ్చుకోగా ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరీ 49.873శాతం ఓట్లు తెచ్చుకున్నారు. కాస్టిలో మెజారిటీ 44,240 ఓట్లు. పెరూ ఎన్నికల సంఘం అంతిమంగా ప్రకటించిన వివరాల ప్రకారం 2,52,87,954 ఓట్లకు గాను 1,88,56,818 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో ఎవరికీ వేయకుండా ఖాళీ పత్రాలు 1,21,478, చెల్లని ఓట్లు 11,07,640 ఉన్నాయి. చెల్లని ఓట్లన్నీ తనకు పడినవే అని కెయికు ఫుజిమోరీ వాదించటంతో రోజుల తరబడి వాటన్నింటినీ తిరిగి పరిశీలించారు. మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినప్పటికీ అంతకు ముందు వెలువడిన ఫలితంలో మార్పులేమీ లేవు. లెక్కింపు ప్రారంభమై పన్నెండు రోజులు గడిచినా ఇది రాస్తున్న సమయానికి ఎన్నికల సంఘం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ ప్రకటించింది తప్ప అధికారికంగా ఫలితాన్ని ఖరారు చేయలేదు.

ఒకవైపు లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని ప్రకటించారు, అమెరికా కూడా ఫలితాలను అందరూ అమోదించాలని చెప్పింది, అయినప్పటికీ అనూహ్యంగా తాము అనుకున్నదానికి భిన్నంగా ఫలితం రావటంతో కుట్రకు తెరలేపినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి కాస్టిల్లోను అభినందిస్తూ సందేశాలు వస్తున్నాయి.గతేడాది అమెరికాలో జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరిగాయంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించటం, కోర్టులకు ఎక్కటం తెలిసిందే. ఇప్పుడ ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకొని కెయికు ఫుజిమోరీ తన ఓటమిని అంగీకరించేందుకు సిద్దపడటం లేదు. ఫలితాలను సవాలు చేసేందుకు 30 మంది అగ్రశ్రేణి న్యాయవాదులతో ఇప్పటికే 134 కేసులు వేయించగా మరో 811 వేసేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు. చెల్లనివిగా ప్రకటించిన వాటిలో రెండున్నరలక్షల ఓట్ల గురించి తాము సవాలు చేస్తున్నట్లు కెయికు గురువారం నాడు వెల్లడించింది. పోటీ తీవ్రంగా ఉందని పసిగట్టిన కెయికు ఎన్నికలకు ముందుగానే వీరితో మంతనాలు జరిపి చట్టపరంగా ఆటంకాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. కాస్టిలో మద్దతుదారులందరూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని స్ధానిక జాతులు, రైతులు, పట్టణ ప్రాంతాల్లోని పేదలు కాగా ఫుజిమోరి మద్దతుదారులందరూ అత్యంత సంపన్నులు, ఐరోపా దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన శ్వేతజాతీయుల వారసులు.కెయికు ఫుజిమోరి తండ్రి, అవినీతి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆల్బర్ట్‌ ఫుజిమోరి నియంత, మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద రాజకీయవేత్త. జపాన్‌ నుంచి వలస వచ్చిన వారి సంతానం.


ఎన్నికలకు ముందుగా అమెరికా నూతన రాయబారిగా లిసా కెనా నియమితులయ్యారు. ఆమె గతంలో తొమ్మిది సంవత్సరాలు సిఐఏ అధికారిగా విదేశాంగశాఖ ముసుగులో ఇరాక్‌లో పనిచేశారు. ట్రంప్‌ హయాంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన మైక్‌ పాంపియోకు సలహాదారు. పెరూ ఎన్నికలకు ముందు ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అధ్యక్ష ఎన్నిక మొత్తం లాటిన్‌ అమెరికాకే ఒక ఆదర్శ నమూనాగా ఉండాలని పేర్కొన్నారు.కైయికు ఫుజిమోరి విజయం సాధిస్తారనే ధీమాతో ఈ ప్రకటన చేసి ఉండాలి.లేనట్లయితే ప్రతి దేశంలో మాదిరి ముందుగానే పెరూలో కూడా తన కుట్రను అమలు జరిపి ఉండేది.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత తొలి దశలో కైయికు ముందంజలో ఉండగా ఎలాంటి ప్రకటనలు చేయని వారు, గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపులో కాస్టిలో దూసుకుపోవటంతో ఫలితాలు తారుమారైనట్లు గ్రహించి తనకు పడిన ఓట్లను చెల్లనివిగా పక్కన పెట్టారనే ఆరోపణను ఆమె ముందుకు తెచ్చారు. కాస్టిలో ఎన్నికైతే దేశం మరో వెనెజులాగా మారిపోతుందని ఆమె మద్దతుదారుగా ఉన్న నోబెల్‌బహుమతి గ్రహీత వర్గాస్‌ లోసా ప్రకటించి కాస్టిలో వ్యతిరేకులను రెచ్చగొట్టారు. ఎన్నికలకు ముందే అల్బర్ట్‌ ఫుజిమోరిని వ్యతిరేకించిన మితవాదులందరూ కెయికు మద్దతుదారులుగా మారారు. ఫలితాలు అనూహ్యంగా మారటంతో మరింత సంఘటితమై లెక్కింపును గుర్తించబోమంటూ ప్రదర్శనలకు దిగారు.మరోవైపు కాస్టిలో కూడా తీర్పును కాపాడుకొనేందుకు వీధుల్లోకి రావాలని తన మద్దతుదారులకు పిలుపు నిచ్చారు. ఈ నేపధ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తయి వివరాలను అధికారికి వెబ్‌సైట్‌లో వెల్లడించినప్పటికీ రోజులు గడుస్తున్నా ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికల సంఘం జాప్యం చేస్తున్నది.ఈ లోగా కైయికు కేసులు దాఖలు చేసేందుకు తగిన గడువు ఇవ్వటం ద్వారా సరికొత్త కుట్రకు తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో ఒకసాకుతో కోర్టు ద్వారా ఎన్నికలను రద్దు చేసినా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఫిర్యాదులను ఎంతో వేగంగా పరిష్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం 41,027 మాత్రమే.అప్పుడు కూడా రెండవ స్ధానంలో కెయికు ఫుజిమోరియే ఉన్నారు. ఆ సమయంలో కూడా జూన్‌ నెలాఖరుగానీ ఫలితాన్ని ఖరారు చేయలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. అది నిజమే అయినప్పటికీ గత ఎన్నికలలో పోటీ పడిన వారిద్దరూ మితవాద పక్షాలకు చెందిన వారే. ఇప్పుడు అనూహ్యంగా వామపక్ష అభ్యర్ధి రంగంలోకి రావటం, మెజారిటీ సంపాదించిన కారణంగానే అనేక అనుమానాలు తలెత్తాయి.
పెరూలో జరిగిన పరిణామాలలో వామపక్ష అభ్యర్ది విజయం సాధించటం ఆ ఖండమంతటా వామపక్షశక్తులు తిరిగి పుంజకుంటున్నాయనేందుకు సంకేతంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో వామపక్ష తీవ్రవాదిగా రంగంలోకి వచ్చి విజయం సాధించిన మాజీ సైనిక అధికారి ఒలాంటా హమాలా అమెరికా సామ్రాజ్యవాదుల బంటుగా, నయాఉదారవాద విధానాలను అమలు జరిపే వాడిగా తయారై మొత్తంగా వామపక్ష శక్తుల మీదనే అనుమానాలు వ్యక్తం చేసే విధంగా వ్యవహరించాడు. దాన్నుంచి బయటపడి తిరిగి అక్కడి పేదలు కాస్టిలోను ఎన్నుకోవటం చిన్న విషయం కాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న చిలీ, కొలంబియా, బ్రెజిల్‌లో కూడా ఇదే పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం వెనెజులా, అర్జెంటీనా, నికరాగువా,బొలీవియా, మెక్సికోలలో వామపక్ష శక్తులు అధికారంలో ఉన్నాయి. కాస్టిలో నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీ కాకున్నప్పటికీ తమది మార్క్సిస్టు భావజాలం మీద ఆధారపడి పని చేస్తుందని ప్రకటించారు. పెరూ మితవాద శక్తులను వ్యతిరేకించే ఒక విశాల వామపక్ష పార్టీగా అది ఉందని చెప్పవచ్చు.


మౌలికంగా భిన్నమైన లాటిన్‌ అమెరికా గురించి ఆలోచించాల్సి ఉంటుందని అమెరికాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు బ్రియన్‌ వింటర్‌ ఆ ఖండంలో జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానించాడు. ప్రజాభిప్రాయాన్ని చూస్తే అధికారంలో ఉన్న ప్రత్యేకించి మితవాద శక్తులు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ వెబ్‌సైట్‌ సంప్రదించిన పన్నెండు మంది ప్రాంతీయ విశ్లేషకులు చెప్పారు. దిగజారిపోయిన ఆర్ధిక వ్యవస్ధలు, మహమ్మారి కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలను బట్టి జనాలు మితవాదులను బయటకు గెంటేయాలన్నట్లుగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అసంతృప్తికి కరోనా ఒక్కటే కారణం కాదు, అంతకు ముందే చిలీ, కొలంబియా వంటి చోట్ల జనం వీధుల్లోకి వచ్చారు. వాస్తవానికి కరోనా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసింది. మితవాద శక్తులు చేసిన వాగ్దానాలను మరచిపోవటంతో జనం ధనికులతో పాటు ఆర్ధిక విధానాలనే మార్చాలని కోరుతున్నారని పెరూ పరిణామాలు స్పష్టం చేశాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలోకి రావటం వలన పరిణామాలు,పర్యవసానాలు ఆ ఖండానికే పరిమితం కావు. రాజకీయంగా వెనెజులా, బొలీవియా నాయకత్వాల మీద వత్తిడి తగ్గుతుంది.అమెరికాతో సంబంధాలు పరిమితమై చైనాతో పటిష్టమౌతాయి. అన్నింటినీ మించి అమెరికా జోక్యంతో పరిణామాలను ప్రభావితం చేయటం కష్టం అవుతుంది. వామపక్ష శక్తులే కాదు, ప్రజాస్వామిక శక్తులను కూడా అక్కడి మితవాద శక్తులు సహించటం లేదు. ఈ కారణంగానే నిరంతరం ఏదో ఒక దేశంలో కుట్రలు జరగటం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఆరుదశాబ్దాలలో పన్నెండు దేశాలలో 34 కుట్రలు జరిగాయి. వీటన్నింటి వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల కుట్ర, డబ్బు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ ఛేదించి జనం ఎప్పటికప్పుడు పురోగామి శక్తులకు పట్టం గడుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు పార్టీలకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో ఈ పరిణామాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి, విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు పదే పదే తలెత్తుతున్నాయంటే అదేదో గాల్లోంచి జరుగుతున్నది కాదు.అక్కడి మితవాద శక్తులు, వాటి విధానాలు, వాటికి వెన్నుదన్నుగా అమెరికా కుట్రలే అందుకు దోహదం చేస్తున్నాయి. .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెరూలో తీవ్ర ఉత్కంఠ-అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విజయం !

09 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Elecciones en Perú, Latin america left, Pedro Castillo, Peru presidential election 2021, Socialist Castillo


ఎం కోటేశ్వరరావు


నువ్వా నేనా ! ఒక వైపు పచ్చిమితవాద, అవినీతి వారసత్వం మరోవైపు మచ్చలేని వామపక్ష ఘన వారసత్వం. నరాలు తెగే ఉత్కంఠ. ఓటు ఓటుకూ అభ్యర్ధులు, మద్దతుదారుల రక్తపోటులో తేడా. ఆదివారం నాడు పెరూలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మూడు లక్షల ఓట్లను లెక్కించకుండా బయటపడవేశారంటూ ప్రత్యర్ధి మద్దతుదారులు ఎన్నికల కార్యాలయం ముందు ప్రదర్శనలకు దిగగా కాస్టిల్లో మద్దతుదారులు కూడా ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పోటీ ప్రదర్శనలకు దిగారు. ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ మారు మూల గ్రామీణ ప్రాంతాలు, విదేశాల నుంచి ఓట్ల వివరాలు రావటంలో ఆలశ్యం కారణంగా లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. పెరూ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన 99.8 శాతం ఓట్లలెక్కింపులో కాస్టిల్లో 50.20 ప్రత్యర్ధి మితవాద కైయికు ఫుజిమోరి 49.80శాతం ఓట్లు సాధించారు. సంఖ్య రీత్యా కాస్టిల్లోకు 87,35,448, ప్రత్యర్ధికి 86,63,684 వచ్చాయి. కాస్టిలో మెజారిటీ 71,764 ఉంది. మెజారిటీ కంటే లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండటంతో కాస్టిలో విజయం ఖాయమైంది. అక్రమాలకు పాల్పడి అవాంఛనీయ పరిణామాలు జరిగితే తప్ప అదే ఖరారు అవుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో వామపక్ష అభ్యర్ధికి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నట్లు వెల్లడైన కారణంగా మిగిలిన ఓట్లు అక్కడివే కావటంతో తమ అభ్యర్ధి విజయం సాధించినట్లు కాస్టిలో మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు లెక్కింపులో అక్రమాలు జరిగినందున ఫలితాన్ని తాను అంగీకరించేది లేదని కైయికూ ప్రకటించినందున పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు పరిగణిస్తున్నారు. పరిశీలకులుగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాల సంస్ధ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. పది సంవత్సరాల కాలంలో మూడవ సారి కూడా ఓడిపోతుండటంతో కైకు నిరాశతో ఇలాంటి ఆరోపణలకు దిగారని విమర్శలు వచ్చాయి.


వామపక్ష అభ్యర్ధి విజయం తధ్యమనే వాతావరణం ఏర్పడటంతో స్టాక్‌ మార్కెట్‌, వాణిజ్య, పారిశ్రామికవేత్తలలో వెల్లడైన భయం కూడా ఒక సూచిక. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటంతో సోమవారం నాడు కొద్ది సేపు క్రయ విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. వామపక్ష నేత అధికారానికి వస్తే మార్కెట్‌ శక్తుల ఆధిపత్యంలోని వ్యవస్ధను మార్చివేస్తారనే ఆందోళన వ్యక్తమైంది.పట్టణ ప్రాంతాల నుంచి తొలుత లెక్కింపు ప్రారంభమైంది. ఎనభై ఆరుశాతం ఓట్ల లెక్కింపు వరకు మితవాద అభ్యర్ధిని కెయికో ఫుజిమోరీ 52శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు,అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో 93శాతానికి చేరగానే ఇద్దరి ఓట్లు సమం తరువాత కాస్టిల్లో ఓట్లు పెరగటం ప్రారంభమైంది.

పెరూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలోనే 50శాతానికి మించి ఓట్లు తెచ్చుకుంటే రెండవ సారి అవసరం ఉండదు. లేనట్లయితే తొలి దశలో మొదటి రెండు స్దానాలలో ఉన్న అభ్యర్ధుల మధ్య అంతిమ పోటీ జరుగుతుంది. దీని ప్రకారం ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికలలో 18 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీరిలో మార్క్సిస్టు భావజాలంతో పని చేస్తున్న ఫ్రీ పెరు పార్టీ అభ్యర్ది పెడ్రో కాస్టిల్లో 18.92శాతం ఓట్లతో ముందుండగా ద్వితీయ స్ధానంలో పాపులర్‌ ఫోర్స్‌ పార్టీకి చెందిక కెయికు ఫుజిమోరి 13.41శాతంతో రెండవ స్ధానంలో నిలిచారు. పార్లమెంట్‌లోని 130 స్ధానాలకు గాను 27 బహుళనియోజకవర్గాల నుంచి ప్రతినిధులను దామాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. మొత్తంగా ఐదుశాతంపైగా ఓట్లు సాధించటం లేదా ఒక నియోజకవర్గంలో ఏడుగురు ప్రతినిధులు గెలిచినా దేశం మొత్తంలో దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు 20 పార్టీలు పోటీ పడగా పది పార్టీలు ఐదుశాతానికి పైగా ఓట్లు సాధించి పార్లమెంట్‌లో ప్రవేశం పొందాయి.ఫ్రీ (విముక్త )పెరు పేరుతో రంగంలోకి దిగిన కొత్త పార్టీ 13.4శాతం ఓట్లు పొంది 37 స్ధానాలతో పెద్ద పార్టీగా ఎన్నికైంది. .


దేెశంలో జరిగిన అభివృద్ది సామాన్యులకు ఉపయోగపడలేదని, కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకొనేందుకు అవసరమైన లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌కు నోచుకోలేకపోయారని పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకాల మాదిరి తయారయ్యాయని విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికైన పది మంది అధ్యక్షులలో ఏడుగురు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. గత మూడు సంవత్సరాలలో నలుగురు అధ్యక్షులు మారారంటే రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.తీవ్ర మాంద్యం, కరోనా కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. కేవలం మూడు కోట్ల 20లక్షల మంది జనాభాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది మరణించారు. ప్రపంచంలో ఇది అత్యధిక రేటు. ఇదే సమయంలో పదకొండుశాతం మంది అన్నార్తులు పెరిగారు. చిలీ తరువాత ప్రపంచంలో రాగి ఎగుమతి చేసే రెండవ దేశంగా ఉంది. రాగి ఎగుమతులతో జిడిపిలో పదిశాతం ఆదాయం వస్తోంది.

తుది పోరులో పోటీ బడిన కైయికు ఫుజిమోరి జనానికి పరిచయం అవసరంలేని పేరు. కుట్రతో అధికారానికి వచ్చిన తిరుగుబాటుదారుగా, నియంతగా పేరున్న తండ్రి ఆల్బర్ట్‌ ఫుజిమోరి నుంచి రాజకీయవారసత్వం, ధనికులకు అనుకూల వైఖరితో పాటు, గత రెండు ఎన్నికలలో ఆమె అధ్యక్షపదవికి పోటీ పడ్డారు.2016 ఎన్నికలలో విజయం సాధించిన పెడ్రో పాబ్లోకు ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరి మీద కేవలం 42,597 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తాను గెలిస్తే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 2,600 డాలర్ల విలువగల స్ధానిక కరెన్సీ చెల్లిస్తానని, గనుల నుంచి వచ్చే ప్రతిఫలంలో 40శాతం సొమ్ము ఆ ప్రాంత పౌరులకు నేరుగా అందచేస్తానని వాగ్దానం చేశారు. కెయికో ఫుజిమోరీ మాజీ ఎంపీ, అవినీతి కేసులు శిక్ష అనుభవించారు. పాతిక మందిని హత్య చేయించటం, అవినీతి కేసులో పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని విడుదల చేస్తానని చెప్పారు. గత ఎన్నికల తరువాత దేశంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిణామాలకు తనను క్షమించాలని వేడుకున్నారు.ఆల్బర్టో ఫూజిమోరి పాలన అవినీతి అక్రమాలు, సంఘటిత నేరాల మయంగా మారింది, పది సంవత్సరాల పాలనలో పాల్పడిన నేరాలకు గాను పాతికేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్బర్ట్‌ కుమార్తె కెయికు నాయకత్వంలోని పార్టీ గత ఐదు సంవత్సరాలలో రాజకీయ అనిశ్చితికి కారకురాలు కావటంతో పాటు అవినీతి కేసులో కెయికు కూడా జైలు శిక్ష అనువించింది.అయితే ధనికులందరూ ఆమె తమ ప్రయోజనాలను కాపాడే సమర్ధురాలనే అభిప్రాయంతో మద్దతుగా నిలిచారు.


వామపక్ష అభ్యర్ధి కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణ కనిపిస్తోంది.పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.

ఓట్ల లెక్కింపులో తన మెజారిటీ తగ్గటం ప్రారంభం కాగానే కెయికో ఆరోపణల పర్వానికి తెరలేపారు.తనకు పడిన ఓట్లను బయట పడవేశారని, ఫలితాన్ని అంగీకరించేది లేదని ప్రకటించారు. లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని అంతకు ముందు కాస్టిలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికలకు ముందు ఆయన మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన జరిపినదాడిలో నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. దీనికి షైనింగ్‌ పాత్‌ పేరుతో సాయుధ చర్యలకు పాల్పడిన మావోయిస్టు గెరిల్లాల నుంచి విడిపోయిన వారే కారణమని ప్రచారం జరిగింది. ఈ మారణకాండను కాస్టిలో తీవ్రంగా ఖండించారు.
తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిల్లో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు.అంతకు ముందు విముక్త పెరూ పార్టీ నేత కాస్టిలోకు షైనింగ్‌ పాత్‌తో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుదారులు నాయకులుగా ఉన్న టీచర్స్‌ యూనియన్‌ నాయకత్వంలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మెకు నాయకత్వం వహించాడని మీడియా ప్రచారం చేసింది. తన పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలోని తన పాఠశాలలో తిరిగి బోధన చేస్తానని కాస్టిలో చెప్పాడు.


రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికయిన తరువాత వెంటనే జరిగే ఎన్నికలో పాల్గొనేనేందుకు అవకాశం లేదు. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి పోటీ చేయవచ్చు. పెరూ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నిక జరిగిన తరువాత మరణించినా, ఏకారణంతో అయినా పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తదుపరి ఎవరిని ఎన్నుకోవాలో కూడా నిర్ధిష్టంగా ఉంటుంది, ఆమేరకు వారిని ఎన్నుకోవాలి తప్ప కొత్తగా ఎన్నికలు ఉండవు. అధ్యక్షుడిని అభిశంసించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. స్పెయిన్‌ వలస నుంచి విముక్తి పొందిన జూలై 28న ఎన్నికైన ప్రభుత్వం నూతన బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక పెరూలో ఉన్న రాజకీయ అనిశ్చితి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల క్రితం పెడ్రో పాబ్లో కుజిన్‌స్కి ఎన్నికయ్యాడు.2018లో రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మార్టిన్‌ విజికారా బాధ్యతలు స్వీకరించాడు. అతగాడిని 2020లో అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత పార్లమెంట్‌ స్పీకర్‌ మెరినో బాధ్యతలు స్వీకరించిన వారంలోగానే జనం నిరసన కారణంగా రాజీనామా చేశాడు.తరువాత ఫ్రాన్సిస్కో సగస్తీని పార్లమెంట్‌ ఎన్నుకుంది.


తొలి దశ ఎన్నికలో పోటీపడి గణనీయంగా ఓట్లు సంపాదించిన పార్టీలలో వామపక్ష శక్తులతో పాటు ఫుజిమోరిజంగా వర్ణితమైన మితవాదులను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల్లో వారంతా కాస్టిలోకు మద్దతు ప్రకటించారు. రాజధాని లిమా, ధనికులుండే పట్టణ ప్రాంతాలలో కైయికు మెజారిటీ సాధించగా పేదలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాస్టిలోను ఎంచుకున్నారు. రాజకీయాల్లో వామపక్ష శక్తుల పలుకుడి పెరిగినట్లే. రానున్న రోజుల్లో విధానపరమైన మార్పుల కోసం పెరూవియన్లు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో వామపక్షాల విజయాలను చూసి అనేక మంది తాము కూడా వామపక్ష వాదులమే అనే ముసుగు తగిలించుకొని ప్రజాకర్షక నినాదాలతో రంగంలోకి వచ్చారు. ఆ విధంగా గతంలో పెరూలో అధికారానికి వచ్చిన ఇద్దరు అధ్యక్షులు తాము వామపక్ష వాదులమే అని ప్రకటించుకున్నారు. ఆచరణలో పెట్టుబడిదారుల బంట్లుగా మారారు. వారిలో ఒల్లాంటా హుమలా ఒకడు. 2011నుంచి 2016 వరకు అధికారంలో ఉన్నాడు. నయాఉదారవాద విధానాలను అమలు జరిపి అభాసుపాలయ్యాడు. అవినీతి అక్రమాలకు తరువాత అరెస్టయ్యాడు.తాజా ఎన్నికల్లో తొలిదశలో పోటీ చేసి పదమూడవ స్ధానంలో నిలిచి కేవలం 1.5శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడు. అనేక దేశాల అనుభవం చూసినపుడు వామపక్ష శక్తులు అధికారంలో ఉండి పెట్టుబడిదారులు, ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని వ్యతిరేకించే చర్యలు తీసుకుంటే ఆశక్తుల కుట్రలను ఛేదించేందుకు జనం అవసరమైతే వీధుల్లోకి రావాల్సి ఉంటుందని బొలీవియా, వెనెజులా, చిలీ తదితర దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: