కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్ నుంచి
ఆ పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.
కొంత మంది కమ్యూనిజం భారత దేశానికి సంబంధించింది కాదు, విదేశీ సిద్దాంతం, ఇక్కడి అసలు సమస్యలను అది పట్టించుకోదు, కమ్యూనిజం మంచిదే కానీ, భారత కమ్యూనిస్టులు మంచి వారు కాదు ఇలాంటి ఆరోపణలతో ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. ఏకకణ జీవి నుంచి వానరుడు నరుడుగా మారిన పరిణామ క్రమంలో అనేక జీవులు వివిధ దశలలో స్ధిరపడిపోయాయి. ఇక అంతకు మించి ఎదగవు. వాటికి భిన్నంగా మానవుడిలోనే మెదడు అభివృద్ది చెంది వున్నత జీవిగా పరిణామం చెందాడని, ఆమెదడు నిరంతరం మరింత పదును తేలుతుందోని తెలిసిందే. కమ్యూనిస్టు వ్యతిరేకులు బుర్రలు కూడా కొన్ని జీవుల మాదిరి ఒకే దగ్గర ఆగిపోయినట్లుగా వుంది.
వుష్ట్ర పక్షి తనకు ముప్పు వచ్చిందనుకున్నపుడు తలను వాల్చి ఇతర జంతువులను మభ్యపెట్టి తప్పించుకుంటుంది(భూమిలో తలదూరుస్తుంది అని కొంత మంది చెప్పారు). అంటే ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోదు. అలాగే కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్ నుంచి ఆ పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.
బ్రిటీష్, ఫ్రెంచి, పోర్చుగీస్, డచ్ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్ు, టెలిఫోన్ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్లెస్ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.
యూరోపియన్లకు బట్టలు కట్టుకోవటం కూడా తెలియని రోజుల్లో మన ఎంతో నాగరికులుం అని చెప్పుకుంటాం. పోలిక ఎందుకు ? అలాగే మన నుంచి మిగతా ప్రపంచం నాగరికత, విజ్ఞానం నేర్చుకుంది అని గర్వం ప్రదర్శిస్తాం. అంటే మన దాన్ని ఇతర దేశీయులు కాపీ కొట్టటం లేదా అనుకరించినట్లే కదా ! ఎందుకంటే మనది అంత గొప్ప అని రొమ్ము విరుచుకుంటాం.అలాంటపుడు మనం ఇతరుల నుంచి స్వీకరిస్తే తప్పేముంది? ప్రపంచ చరిత్రలో ఎన్ని అలా జరగలేదు ?
భావప్రకటనా స్వేచ్ఛ వుంది కాబట్టి కొంత మంది అన్నీ వేదాల్లోనే వున్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకుంటారు. అలా చెప్పి మా మనోభావాలను దెబ్బతీశారని హేతువాదులు దాడులు చేయనవసరం లేదు. వేద విజ్ఞానవేత్తలుగా చెప్పుకుంటున్నవారు చెప్పే దానిని వాదన కోసం అంగీకరించినా ఐరోపాలో పారిశ్రామిక విప్లవం సంభవిస్తున్నా మన వారు వేదాల గుట్టు విప్పి ఇక్కడ ఆధునిక టెక్నాలజీని ప్రవేశ పెట్ట లేదు. సముద్రగుప్తుడు, మౌర్యుల కాలంలోనే మన వారు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి వ్యాపారం చేశారని చంకలు చరుచుకుంటాం. అదే సమయంలో సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లిన వారు ప్రాయచిత్తం లేకుండా గుంపులో కలవటానికి వీల్లేదని ఆంక్షలు విధించుకుంటాం. ఇప్పటికీ ఆంక్షలు అలానే వున్నాయి. అవకాశవాదం, ఆత్మవంచనతో అవసరాల కొద్దీ వాటికి మినహాయింపు ఇస్తున్నారు తప్ప వారు నమ్మినదానిని కూడా వారు పాటించటం లేదు. వాటి పర్యవసానంగానే కొంబస్లు, మార్కోపోలోలు వునికిలోకి వచ్చారు. బ్రిటీష్, ఫ్రెంచి, పోర్చుగీస్, డచ్ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్ు, టెలిఫోన్ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్లెస్ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.
ఆర్ధిక రంగంలో విదేశీ పెట్టుబడులు, పరిజ్ఞానం కావాలి, విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకొమ్మంటూ ప్రత్యేక విమానాలు వేసుకు తిరిగే ముఖ్యమంత్రు, ప్రధాని గురించి తెలిసిందే. చివరకు నిత్యం స్వదేశీ గురించి జపం చేసే నరేంద్ర మోడీ స్వదేశంలో తక్కువ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారనే విమర్శ గురించి చెప్పనవసరం లేదు. మన ఆర్బిఐ గవర్నర్ రాజన్, సలహదారులందరూ విదేశాలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్లలో శిక్షణ పొంది వచ్చేవారే. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు ఆత్మవంచన తప్ప వాటికి లేని విదేశీ , పరాయి అభ్యంతరం ఒక్క కమ్యూనిస్టు సిద్ధాంతానికే ఎందుకు ? మనం పెట్టుబడిదారీ విధానాన్ని విదేశాల నుంచి కాపీ చేయవచ్చు, దాని దోపిడీని వ్యతిరేకిస్తూ ముందుకు వచ్చిన కమ్యూనిస్టు సిద్దాంతం మాత్రం వద్దని చెప్పటం ఎవరి ప్రయోజనాల కోసం ? సామాన్యుల కోసమైతే కాదు కదా !
కమ్యూనిస్టు సిద్దాంతం మంచిదే కాని ఇక్కడి కమ్యూనిస్టులే సరైన వారు కాదు అని ఒక ముక్తాయింపు.అలా చెప్పేవారు ముందుకు వచ్చి మంచిగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎందుకు అమలు జరపరు ? కమ్యూనిస్టులలో వున్న మంచి, చెడులను చర్చించండి, చెడు వుంటే సరిదిద్దేందుకు, కాకపోతే తప్పని సరి అయితే బయటకు పంపేందుకు ప్రయత్నించండి.
కమ్యూనిస్టుపార్టీలో తప్పులు, పొరపాట్లు, పార్టీని వుపయోగించుకొని తప్పుడు పనులు చేయని వారు లేరు అని ఎవరూ చెప్పరు. వివిధ ప్రభావాలతో వచ్చిన వారిలో బలహీనతలు చోటుచేసుకోవచ్చు. వాటిని కమ్యూనిస్టు పార్టీ బలపరిస్తే తప్పు. వుద్యమంలో వుండి అలాంటి వారిని పక్కన పెట్టేందుకు ప్రయత్నించకుండా బయట వుండి ఎక్కడో ఒకరో అరా తప్పు చేసిన కమ్యూనిస్టులను చూపి అందరూ ఇంతే అని రాళ్లు వేయటం కమ్యూనిజాన్ని కోరుకుంటున్న వారు చేయాల్సిన పని కాదు. కమ్యూనిస్టులు కులాలను వదిలించుకోలేదు అని అడ్డు సవాళ్లు విసురుతారు. పోనీ వదిలించుకున్నవారిని గుర్తించి వారి మార్గాన నడుస్తున్నారా అంటే అలాంటి వాళ్లంతా సవాళ్లకే పరిమితం. ఇది చివరకు పిచ్చి కుదిరితేనే పెళ్లి కాదు పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది అనే స్ధాయికి పోయి ఆగిపోతుంది. అసలు అలా ప్రశ్నించేవారు ఎంత మంది ముందు కులం నుంచి బయటపడ్డారు? పోగొట్టుకోవాల్సిన అంశాలు ఒక్క కమ్యూనిస్టులకేనా, ఇతర జనాలకు లేవా ? చాలా వున్నాయి. అవన్నీ త్లెలువారేసరికి వచ్చినవి కాదు. త్లెవారేసరికి పోయేవి కాదు. క్రమంగా అంతరించాల్సినవి. ఈ మాట అంటే కొందరు ఎంతకాలం అని ప్రశ్నిస్తారు.కుల నిర్మూలన అజెండాకే పరిమితమై పని చేస్తున్న అనేక సంఘాలు వున్నాయి. వారు సరైంది అనుకున్నది వారు చేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి.అలాగాక ఎంత కాలంలో మీరు కుల నిర్మూలన చేస్తారో చెప్పండి, ఎంత మందిని కులం లేని వారుగా మార్చారో రుజువు చూపండి అంటే ఎలా వుంటుంది.వివక్ష, దోపిడీలను వ్యతిరేకించేవారి దాయి వేరు కావచ్చు. ఏది ముందు ఏది వెనుక అని దెబ్బలాడుకోనవసరం లేదు.ఎవరి ఎజండాను వారు వుంచుకొని పరస్పరం సహకరించుకొని పని చేయవచ్చు. పిల్లి న్లల్లదా త్లెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ప్రధానం.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

ఇవన్నీ చరిత్ర అని గానీ ‘History’ అని గానీ categorize చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. Thanks.
LikeLike
Thanks , I have just been looking for information about this subject for ages and yours
is the best I have discovered so far. However, what about the bottom line?
Are you positive in regards to the supply?
LikeLike
Right here is the right web site for anyone who wants to find out about this topic.
You understand a whole lot its almost hard to argue with you (not that I personally will need to…HaHa).
You certainly put a fresh spin on a topic which has been written about for many years.
Great stuff, just wonderful!
LikeLike