కమ్యూనిస్టు వ్యతిరేకుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఏ అవకాశం దొరుకుతుందా నా లుగు రాళ్లు వేద్దాం అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక చెత్తనంతా పోగేసి చూడమంటారు.
ఎటిఎంలో ఇలా కార్డు పెట్టి అలా డబ్బు తీసుకున్నంత సుల భంగా కమ్యూనిస్టుల ప్రస్ధానం గురించి తెలుసుకోలేము.
భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ గురించి, అది సాధించిందేమిటి? అది ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్నది ఓపికగా లోతైన అధ్యయనం ద్వారా మాత్రమే ఒక అవగాహనకు ఎవరైనా రాగలరు. మన వంటి కొన్ని దేశా లలో కమ్యూనిస్టు పార్టీ లు ఏర్పడి సోషలిస్టు వ్యవస్ధలను ఏర్పరుచుకున్నాయి, భారత కమ్యూనిస్టులు ఎందుకు విఫమయ్యారు అని అనేక మంది ఆవేదనవ్యక్తం చేస్తుంటారు. కొందరు మన దేశానికి కమ్యూనిజం పనికిరాదు కనుకనే ఇన్ని సంవత్సరాలైనా అధికారానికి రాలేదు, వచ్చిన కొన్ని చోట్ల కూడా విఫలమైంది కనుక ఇంక ఇక్కడ రాదు అని అని నిరాశకు లోనవుతున్నవారు కూడా లేకపోలేదు.సరే కమ్యూనిస్టు వ్యతిరేకుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఏ అవకాశం దొరుకుతుందా నా లుగు రాళ్లు వేద్దాం అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక చెత్తనంతా పోగేసి చూడమంటారు.
ఎటిఎంలో ఇలా కార్డు పెట్టి అలా డబ్బు తీసుకున్నంత సుల భంగా కమ్యూనిస్టుల ప్రస్ధానం గురించి తెలుసుకోలేము. ప్రపంచం, ఆసియాలో పురాతనమైన వాటిలో ఒకటి మన సమాజం. మిగతావాటితో పోల్చితే ఎంతో భిన్నమైన వ్యవస్ధ ఇక్కడ అభివృద్ది చెందింది. దాని మూలాలను తెలుసుకోకుండా,అధ్యయనం చేయకుండా ఇక్కడి పరిణామాలను అవగతం చేసుకోవటం అంత తేలికకాదు.ఈ దేశంలో వున్న ఆర్ధిక, సామాజిక అసమానత, వివక్ష, దారిద్య్రం, నిరుద్యోగం వంటి రుగ్మతలు రూపు మాపాలంటే కమ్యూనిస్టులు చెప్పే సోషలిస్టు సమాజ వ్యవస్ధ నిర్మాణమే మార్గం అన్నది అనేక మంది నమ్ముతున్నారు. ఆ నిర్మాణాన్ని ఎక్కడ, ఎటువైపు నుంచి, ఎలా మొదలు పెట్టాలనటంలో కమ్యూనిస్టుల మధ్య కొన్ని సమస్యులు తలెత్తాయి.ఇవేవో మన దేశానికి మాత్రమే పరిమితమైనవి లేదా కొందరు వక్రీకరిస్తున్నట్లు వ్యక్తుల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు లేదా ఆధిపత్య అంశాలు కావు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ముందుకు వచ్చిన సమస్యలు అని గమనించాలి. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి అన్నదానికి అనుగుణంగా ఎవరి వైఖరి సరైనదో చరిత్ర త్చేుతుంది.
ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో మాదిరి బానిస వ్యవస్ధ మన సమాజంలో కనిపించదు. అయితే దానికి సమానమైన దోపిడీ జరిపిన కుల వ్యవస్ధ ఏర్పాటు మన ప్రత్యేకత. ఇది కష్ట జీవులను ఐక్యం చేయటంలో అనేక ఆటంకాలను కలిగిస్తున్నది. ఎప్పటి కప్పుడు దీన్నుంచి సరైన గుణపాఠాలను తీసుకొని ముందుకు పోవాలి.అంతకు మించి మరొక మార్గం లేదు. ఈ విషయంలో ఎవరికి వారు తమ వైఖరే సరి అయినదని చెప్పుకోవచ్చు. వాటికి కట్టుబడి వుంటూనే ఐక్యతా పోరాటాలలో కలసి పనిచేయాల్సి వుంటుంది. ఆ క్రమంలో వైఖరులను సవరించుకోవచ్చు.
వుదాహరణకు మనువాద(బ్రాహ్మణవాద), పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా బిఆర్ ఆంబేద్కర్ 1936లో స్వతంత్ర కార్మిక పార్టీ(ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆఫ్ ఇ ండియా(ఐఎల్‌పి)ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వరంగంలో పారిశ్రామికీకరణకు వున్నత ప్రాధాన్యత ఇవ్వటం దాని లక్ష్యంగా ప్రకటించారు. ఫ్యాక్టరీ కార్మికులకు పటిష్టమైన కార్మిక చట్టాలు, గిట్టుబాటు వేతనాలు, గరిష్టపనిగంటల నిర్ణయం, సెలవుతో కూడిన వేతనాలు, సరసమైన ధరకు గృహవసతి కల్పించాలని అది డిమాండ్ చేసింది. జాగీర్దారీ వ్యవస్దను రద్దు చేయాలని, విస్తృతంగా విద్యా సౌకర్యాులు, సాంకేతిక సంస్ధలను ఏర్పాటు చేయాని కోరింది. పరిశ్రమలోని వున్నత వుద్యోగాలలో దళితులను మినహాయించటాన్ని వ్యతిరేకించింది.
ఇప్పుడు ఆ విమర్శకు కూడా తావులేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో కమ్యూనిస్టుల నాయకత్వాన కులవివక్ష వ్యతిరేక సంఘాలు పనిచేస్తున్నాయి. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు వాటి ఆందోళన ఫలితమే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలనే జాతీయ స్ధాయిలో కూడా అలాంటి సంస్ద ఏర్పడిరది. వివిధ రాష్ట్రాలలో కూడా పని చేస్తున్నాయి.
ఈ సందర్భంగా వచ్చిన విమర్శకు అంబేద్కర్ సమాధానమిస్తూ కమ్యూనిస్టులు కార్మికుల హక్కుల కోసమే పోరాడతారని, దళితకార్మికుల మానవ హక్కులకోసం పని చేయరని కులం కేవలం పని విభనకే పరిమితం కాలేదని, దిగువ నుంచి ఎగువకు మెట్ల మాదిరి కార్మికులలో అసమానతలను కూడా సృష్టించిందని చెప్పారు. నిజానికి ఈ విమర్శ కారణంగా కార్మికులు చీలిపోనవసరం లేదు. కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యను గుర్తించకుండా లేరు. అయితే కుల నిర్మూన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోలేదు. ఆర్ధిక సమస్యలు పరిష్కారమైన తరువాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని వారు భావించారు. దీనిపై ఎవరైనా విమర్శలు చేయవచ్చు. అంతేకాని దీన్ని చూపి కమ్యూనిస్టులను వ్యతిరేకించటం, శతృవులుగా చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విమర్శకు కూడా తావులేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో కమ్యూనిస్టుల నాయకత్వాన కువివక్ష వ్యతిరేక సంఘాలు పనిచేస్తున్నాయి. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు వాటి ఆందోళన ఫలితమే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలనే జాతీయ స్ధాయిలో కూడా అలాంటి సంస్ద ఏర్పడిరది. వివిధ రాష్ట్రాలలో కూడా పని చేస్తున్నాయి.
అంబేద్కర్ ఏర్పాటు చేసిన స్వతంత్ర కార్మిక పార్టీని రద్దు చేసి తరువాత షెడ్యూులు కాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. తరువాత దాని స్ధానంలో రిపబ్లికన్ పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఆ పార్టీ అనేక ంగా చీలిపోయింది. అందువలన చెప్పేదేమంటే చరిత్ర అనేక అనుభవాలతో పాటు పాఠాలు కూడా నేర్పుతుంది. అంబేద్కర్ కమ్యూనిస్టు,అభ్యుదయవాదులతో ఐక్యతకు వ్యతిరేకం కాదు. 1938లో కార్మిక పార్టీ నాయకత్వాన కొంకణ్ ప్రాంతం నుంచి ముంబైకి 20వేల మంది కౌలు రైతులతో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ మద్దతుతో అంబేద్కర్ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్రానికి ముందు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద వుద్యమంగా అది చరిత్రకెక్కింది.అదే ఏడాది కార్మిక సమ్మెలను అదుపు చేసేందుకు వుద్దేశించిన ఒక బ్లిల్లు కు వ్యతిరేకంగా గా జరిగిన ముంబై వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళన సందర్బంగా కమ్యూనిస్టులతో కలసి పనిచేశారు. ఆ బ్లిల్లు లోని కార్మిక వ్యతిరేక స్వభావాన్ని అంబేద్కర్ ఎండగట్టారు. కార్మికుల సమ్మె హక్కును సమర్ధించారు. బొంబాయి శాసన సభలో స్వతంత్ర కార్మిక పార్టీ బ్లిల్లును వ్యతిరేకించింది.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)
